
కొన్ని రోజుల క్రితం రిలయన్స్ జియో తన రీఛార్జ్ ప్లాన్‌ల టారిఫ్‌ను పెంచిన తర్వాత యూజర్లు షాక్ ఇచ్చారు. నివేదికల ప్రకారం పెరిగిన టారిఫ్‌ల ప్రభావం దాని వినియోగదారు బేస్‌పై ప్రతిబింబించింది. రెండవ త్రైమాసికంలో దాదాపు 1.09 కోట్ల మంది వినియోగదారులు జియో నుండి వెళ్లిపోయారు.
అదే సమయంలో జియో 5G సబ్‌స్క్రైబర్ బేస్ మాత్రం 17 మిలియన్లు పెరిగినట్లు మొత్తం గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతంలో యూజర్ బేస్ 130 మిలియన్లు ఉండగా ఇప్పుడు 147 మిలియన్లకు చేరుకుంది. ఇక ఒక్కో యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) రూ. 181.7 నుండి రూ.195.1కి పెరిగింది. అయితే మొత్తంగా జియో సబ్‌స్క్రైబర్ బేస్ క్షీణించింది.
ఇదీ చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త అడుగు.. దేశంలో తొలి D2D
తన యూజర్ బేస్‌కు సంబంధించిన పరిస్థితి గురించి తమకు తెలుసునని, లాభాలపై ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపదని జియో తెలిపింది. తమ కస్టమర్లకు అత్యుత్తమ 5జీ నెట్‌వర్క్‌ను అందించడంపైనే తమ దృష్టి ఉందని కంపెనీ పేర్కొంది. వినియోగదారులను కోల్పోవడం తమ వ్యాపారాన్ని ప్రభావితం చేయదని, అయితే ఇతర టెలికాం ఆపరేటర్లకు ఇది అవకాశం కల్పిస్తుందని జియో అంగీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment