Jio users
-
జియోకి షాక్.. కోటి మంది టాటా!
కొన్ని రోజుల క్రితం రిలయన్స్ జియో తన రీఛార్జ్ ప్లాన్ల టారిఫ్‌ను పెంచిన తర్వాత యూజర్లు షాక్ ఇచ్చారు. నివేదికల ప్రకారం పెరిగిన టారిఫ్‌ల ప్రభావం దాని వినియోగదారు బేస్‌పై ప్రతిబింబించింది. రెండవ త్రైమాసికంలో దాదాపు 1.09 కోట్ల మంది వినియోగదారులు జియో నుండి వెళ్లిపోయారు.అదే సమయంలో జియో 5G సబ్‌స్క్రైబర్ బేస్ మాత్రం 17 మిలియన్లు పెరిగినట్లు మొత్తం గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతంలో యూజర్ బేస్ 130 మిలియన్లు ఉండగా ఇప్పుడు 147 మిలియన్లకు చేరుకుంది. ఇక ఒక్కో యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) రూ. 181.7 నుండి రూ.195.1కి పెరిగింది. అయితే మొత్తంగా జియో సబ్‌స్క్రైబర్ బేస్ క్షీణించింది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త అడుగు.. దేశంలో తొలి D2Dతన యూజర్ బేస్‌కు సంబంధించిన పరిస్థితి గురించి తమకు తెలుసునని, లాభాలపై ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపదని జియో తెలిపింది. తమ కస్టమర్లకు అత్యుత్తమ 5జీ నెట్‌వర్క్‌ను అందించడంపైనే తమ దృష్టి ఉందని కంపెనీ పేర్కొంది. వినియోగదారులను కోల్పోవడం తమ వ్యాపారాన్ని ప్రభావితం చేయదని, అయితే ఇతర టెలికాం ఆపరేటర్లకు ఇది అవకాశం కల్పిస్తుందని జియో అంగీకరించింది. -
ఇది ఊహించలేదు.. యూజర్లకు భారీ షాకిచ్చిన జియో!
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో(Reliance Jio) తన యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు జియో యూజర్లు రీచార్జ్ చేసుకుంటే కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌తో పాటు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా వచ్చేది. కానీ తాజాగా కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లలో డిస్నీ+ హాట్ స్టార్‌ని తొలగించినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల నుంచి జియో అధికారిక వెబ్సైట్లో కొన్ని ప్లాన్‌లో ఉన్న ఓటీటీ ఆఫర్‌ను చూపించడం లేదు. కస్టమర్లు ఇప్పుడిక డిస్నీ+హాట్‌స్టార్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ యాక్సెస్ పొందాలంటే కేవలం రెండు ప్లాన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అనగా రూ.1499, రూ.4199 రీచార్జ్‌తో మాత్రమే ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. జియో యూజర్లు ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను(T20 World Cup) డిస్నీ+ హాట్‌స్టార్‌లో చూడాలంటే ప్రత్యేక రీచార్జ్ చేసుకోవాల్సిందే మరి. ఇందులో గమనించవలసిన విషయం ఏమిటంటే.. ఓటీటీని తొలగించిన ప్లాన్లలో యూజర్లు ఇది వరకే కొనుగోలు చేసి ఉంటే దాని దాని వ్యాలిడిటీ తేదీ వరకు డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ Hotstar) యాక్సెస్ ఉంటుంది. ఆ రెండు ప్లాన్లు ఇవే.. రూ. 1,499 ప్లాన్‌లో.. ఇందులో ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్, 2GB రోజువారీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లతో పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్ ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు ఉంటుంది. రూ.4,199 ప్లాన్‌లో.. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చే ఇతర ప్లాన్ రూ. 4,199 రీఛార్జ్ ప్యాక్. ఇది అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్లతో పాటు రోజువారీగా 3GB డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ 365 రోజులు వ్యాలిడిటీతో వస్తుంది. రెండు ప్లాన్లు ఒక సంవత్సరం డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో అందిస్తుంది. చదవండి: ఏముంది భయ్యా ఆ జీన్స్ ప్యాంట్లో.. 60 లక్షలు పెట్టి మరీ కొన్నావ్! -
జియో అద్భుత ఆఫర్ : 3.2 టీబీ 4జీ డేటా
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారులు విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా మరో కొత్త ఆఫర్ - జియో ఒప్పో మాన్సూన్ ఆఫర్‌ను తన ప్రీపెయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త స్కీమ్ కింద యూజర్లు 3.2 టీబీ జియో 4జీ డేటాను పొందనున్నారు. 4900 రూపాయల వరకు ప్రయోజనాలను జియో తన ప్రీపెయిడ్ యూజర్లకు ఆఫర్ చేస్తుంది. ఈ ఆఫర్ పాత లేదా కొత్త జియో సిమ్‌ను కలిగి ఉన్న ఒప్పో ఫోన్ యూజర్లందరికీ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ పొందడానికి కొత్త ఒప్పో ఫోనే కొనుగోలు చేయాల్సినవసరం లేదు. జూన్ 28 నుంచి ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. అయితే ఈ ఆఫర్‌ను పొందడానికి మాత్రం సబ్స్క్రైబర్లు 198 రూపాయలు, 299 రూపాయల జియో ప్రీపెయిడ్ ప్లాన్లతో తమ ఫోన్లకు రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. జియో ఒప్పో మాన్సూన్ ఆఫర్.. ఇన్స్టాంట్ క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు... 1800 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను యూజర్లు 50 రూపాయల విలువైన 36 క్యాష్‌బ్యాక్ ఓచర్ల రూపంలో పొందనున్నారు. జియో మనీ క్రెడిట్.... 13వ, 26వ, 39వ రీఛార్జ్‌ల అనంతరం 600 రూపాయల చొప్పున మూడు సార్లు యూజర్లకు 1800 రూపాయలు క్రెడిట్ కానున్నాయి. పార్టనర్ కూపన్ బెనిఫిట్స్... మేక్మైట్రిప్ నుంచి 1300 రూపాయల విలువైన డిస్కౌంట్ కూపన్లు అందుబాటులో ఉండనునఆనయి. ఆఫర్ ప్రారంభ తేదీ.. 2018 జూన్ 28 మైజియో యాప్‌లో ఉన్న ఫోన్ పే ద్వారా రీఛార్జ్ చేసుకున్న వారికి రూ.50 క్యాష్ బ్యాక్ ఓచర్లు వెంటనే పొందవచ్చు. రూ.299 రీఛార్జ్‌పై ప్రస్తుతం జియో 126 జీబీ డేటాను అందిస్తోంది. -
జియో ప్రైమ్ ముగుస్తోంది.. తర్వాత ఏంటి?
ముంబై : దేశీయ టెలికం రంగంలో కాలు మోపినప్పటి నుంచి సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన రిలయన్స్ జియో, ఆరంభం నుంచి అదిరిపోయే ఆఫర్లను ప్రకటిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గతేడాది జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను రూ.99కి వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. 2017 మార్చి 31 వరకు ఈ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ఎన్రోల్ చేసుకునే అవకాశం ఇచ్చిన జియో, సరిగ్గా ఏడాది పాటు దీనిపై పలు ప్రయోజనాలు అందించనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం జియో ప్రకటించిన ఆ ఏడాది గడువు పూర్తి కావొస్తోంది. మరికొన్ని రోజుల్లో అంటే ఈ నెల చివరికి ప్రైమ్ మెంబర్షిప్ గడువు తీరిపోతుంది. అయితే తరువాత పరిస్థితి ఏమిటోనని యూజర్లు సందిగ్ధలో పడ్డారు. తరువాత కూడా ఈ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను పొడిగిస్తారా లేదా మరేదైనా ప్లాన్ తీసుకొస్తారా అని జియో యూజర్లందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు జియో ప్రైమ్ మెంబర్షిప్ ఉన్నవారికి అదనపు మొబైల్ డేటాతోపాటు రూ.10వేల విలువైన జియో యాప్స్ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను ఏడాది పాటు ఉచితంగా అందిస్తూ వచ్చింది రిలయన్స్ జియో. ప్రస్తుతం జియో కంపెనీకి 160 మిలియన్‌కు పైగా కస్టమర్లున్నారు. వారిలో 80 శాతం మంది జియో ప్రైమ్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న వారే. మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవడానికి ముఖేష్ అంబానీ మరేదైనా మ్యాజిక్ చేయనున్నారా? అని కూడా టెలికాం వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే జియో కంపెనీ, పార్టనర్ల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం జియో ప్రైమ్ మెంబర్షిప్ గడువును రూ.99కే మరో ఏడాదిపాటు పొడిగించే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటి వరకు జియో ప్రైమ్ కింద అందిస్తున్న ప్రయోజనాలను మరో ఏడాది పాటు అందిస్తుందని చెబుతున్నారు. ఇంకా దీనిపై ఎలాంటి సమాచారం లేనప్పటికీ, మార్చి చివరి వారంలో బిగ్ సర్ప్రైజే ఉండొచ్చని జియో వర్గాలంటున్నాయి. జియో ట్రాక్ రికార్డును పరిశీలిస్తే, తన ప్రైమ్ మెంబర్లకు ఎప్పడికప్పుడు కంపెనీ సర్ప్రైజింగ్ ఆఫర్లనే ప్రవేశపెట్టిందని, కస్టమర్లను కాపాడుకోవడానికి ఈ సారి అలానే సర్ప్రైజ్ చేయొచ్చని జియో పార్టనర్లు, స్టోర్లు అభిప్రాయ వ్యక్తంచేస్తున్నాయి. మరికొందరు జియో ప్రైమ్ మెంబర్షిప్ గడువు పెంపు ఏమీ ఉండదని, కానీ జియో యాప్స్‌ను వాడితే చార్జి వసూలు చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ప్రైమ్ మెంబర్‌షిప్‌పై జియో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
జియో రూ.49 ఆఫర్‌పై గుడ్‌న్యూస్
అపరిమిత వాయిస్ కాల్స్, ఉచితంగా 4జీ డేటా ప్రకటనతో రెండేళ్ల క్రితం రిలయన్స్ జియో టెలికాం మార్కెట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ చౌకైన టారిఫ్ ప్లాన్లతో టెల్కోలను ముప్పు తిప్పలు పెడుతోంది. అచ్చం అలాంటి సంచలన ప్రకటన మాదిరిగానే జియో ఇటీవల టెల్కోలకు మరో షాకిచ్చింది. అదే రూ.49 ప్లాన్. ఈ ప్లాన్‌తో 28 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్‌ను, 1జీబీ డేటాను వాడుకోవచ్చని పేర్కొంది. ఇంత చౌకైన రెంటల్ ప్లాన్‌ను మరే ఇతర కంపెనీ కూడా ఆఫర్ చేయడం లేదు. కానీ ఇది కేవలం జియోఫోన్ యూజర్లకేనని అధికారికంగా ప్రకటించడంతో, జియో వినియోగదారుల్లో కాస్త నిరాశవ్యక్తమైంది. ఆ నిరాశను పారదోలుతూ.. మరో గుడ్‌న్యూస్ వెలువడింది. ఈ ప్లాన్‌ను జియోసిమ్ వాడే ప్రతి ఒక్కరూ తమ ఫోన్లలో ఈ ప్లాన్‌ను వినియోగించుకోవచ్చని తెలిసింది. అయితే అదెలా అంటే...? జియోఫోన్ యూజర్లకు ఎక్స్‌క్లూజివ్‌గా రిలయన్స్ రెండు ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అవి రూ.153 ప్లాన్, రూ.49 ప్లాన్. ఈ ప్లాన్లను ఇతర ఫోన్లలో కూడా వాడుకోవడానికి తొలుత మీ జియోసిమ్‌ను జియోఫోన్‌లో వేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం జియోఫోన్ ద్వారా ఈ ప్లాన్లను కొనుగోలు చేసి, యాక్టివేట్ చేసుకోవాలి. జియోఫోన్‌పై ఈ ఆఫర్లను యాక్టివేట్ చేసుకున్న అనంతరం, సిమ్‌ను బయటికి తీసి, మీకు ఇష్టమైన స్మార్ట్‌ఫోన్‌లో వేసుకోవాలి. కేవలం జియోఫోన్‌లో మాత్రమే ఈ ప్లాన్లను వాడుకోవాలనే నిబంధననేమీ లేదు. దీంతో ఈ రెండు ప్లాన్లకు ఇది వాలిడ్‌లో ఉంటుంది. అంటే జియో తీసుకొచ్చిన సంచలన ఆఫర్ రూ.49ను ప్రతి ఒక్క జియో సిమ్ వినియోగదారులు వాడుకోవచ్చన మాట. కానీ ముందుగా ఈ ప్లాన్‌ను జియోఫోన్‌లో యాక్టివేట్ చేసుకోవడం మాత్రమే చేయాలి. అనంతరం ఏ ఫోన్లోనైనా దీన్ని ఉపయోగించుకోవచ్చు. -
గడువు ముగిసినా జియోనే వాడతాం!
ఉచిత ఆఫర్లతో వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకున్న ముఖేష్ అంబానీ రిలయన్స్ జియోకు, ఆ ఆఫర్ల గడువు ముగిసిన తర్వాత కూడా వినియోగదారులుంటారట. ఏప్రిల్ 1 నుంచి రిలయన్స్ జియో డేటా సర్వీసులపై ఛార్జ్ చేసినా భరించేందుకే తాము సిద్ధమేనని అంటున్నారు. దాదాపు 85 శాతం కస్టమర్లు ఫ్రీ ఆఫర్ గడువు ముగిసినప్పటికీ జియో వాడేందుకే సిద్ధమని పేర్కొంటున్నారు. బ్యాంకు ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అయితే వారిలో 67 శాతం మంది జియోను రెండో సిమ్గానే వాడతారని తేలింది. అదేవిధంగా 18 శాతం మొదటి సిమ్గా దీన్ని ఉపయోగిస్తారని సర్వే పేర్కొంది. అయితే అత్యంత సంతృప్తికరమైన కస్టమర్లు 97.7 శాతం మంది టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కే ఉన్నారని సర్వే తెలిపింది. కేవలం 17 శాతం భారతీ ఎయిర్టెల్ కస్టమర్లే జియోపై ఆసక్తి చూపుతున్నారని, అది కూడా క్వాలిటీ బాగుంటేనే దీన్ని మొదటిసిమ్గా వాడతామని చెబుతున్నట్టు తెలిసింది. రిలయన్స్ కమ్యూనికేషన్ లాంటి చిన్న టెల్కోలు పరిస్థితి అద్వానంగా ఉందని, జియోకు మరలిన ఈ కస్టమర్లు వాటిని సెకండరీ సిమ్గా వాడేందుకే మొగ్గుచూపుతున్నారని బ్యాంకు అమెరికా మెర్రిల్ లించ్ సర్వే పేర్కొంది. ఆశ్కర్యకరంగా 26 శాతం యూజర్లు జియోను మొదటి సిమ్గానే వాడుతున్నారు. ఇన్నిరోజులు జియో నెట్ స్పీడ్‌పై అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో ఇతర టెల్కోలతో పోలిస్తే దీనికే 55 శాతం స్పీడ్ అధికమని తేలింది. జియో స్పీడ్ వేగంగా ఉన్నప్పటికీ, అస్థిరంగా ఉందని తేలింది. కేవలం 44 శాతం మందే జియో స్పీడ్ తక్కువగా ఉందని అభిప్రాయ పడ్డారు.