Reliance Jio To Discontinue Disney Plus Hotstar From Selected Prepaid Plans, Details Inside - Sakshi
Sakshi News home page

ఇది ఊహించలేదు.. యూజర్లకు భారీ షాకిచ్చిన జియో!

Published Fri, Oct 14 2022 4:14 PM | Last Updated on Fri, Oct 14 2022 5:45 PM

Reliance Jio Discontinue Disney Plus Hotstar Ott From Select Prepaid Plans - Sakshi

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో(Reliance Jio) తన యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు జియో యూజర్లు రీచార్జ్‌ చేసుకుంటే కొన్ని ప్రీపెయిడ్‌ ప్లాన్‌తో పాటు డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా వచ్చేది. కానీ తాజాగా కొన్ని ప్రీపెయిడ్‌ ప్లాన్‌లలో డిస్నీ+ హాట్‌ స్టార్‌ని తొలగించినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల నుంచి జియో అధికారిక వెబ్‌సైట్‌లో కొన్ని ప్లాన్‌లో ఉన్న ఓటీటీ ఆఫర్‌ను చూపించడం లేదు.


కస్టమర్లు ఇప్పుడిక డిస్నీ+హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ యాక్సెస్‌ పొందాలంటే కేవలం రెండు ప్లాన్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అనగా రూ.1499, రూ.4199 రీచార్జ్‌తో మాత్రమే ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. జియో యూజర్లు ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను(T20 World Cup) డిస్నీ+ హాట్‌స్టార్‌లో చూడాలంటే ప్రత్యేక రీచార్జ్‌ చేసుకోవాల్సిందే మరి. ఇందులో గమనించవలసిన విషయం ఏమిటంటే.. ఓటీటీని తొలగించిన ప్లాన్‌లలో యూజర్లు ఇది వరకే కొనుగోలు చేసి ఉంటే దాని దాని వ్యాలిడిటీ తేదీ వరకు డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney+ Hotstar) యాక్సెస్‌ ఉంటుంది.

ఆ రెండు ప్లాన్‌లు ఇవే..
రూ. 1,499 ప్లాన్‌లో.. ఇందులో ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, 2GB రోజువారీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్ ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులు ఉంటుంది.

రూ.4,199 ప్లాన్‌లో.. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చే ఇతర ప్లాన్ రూ. 4,199 రీఛార్జ్ ప్యాక్. ఇది అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాల్స్‌, రోజూ 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు రోజువారీగా 3GB డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ 365 రోజులు వ్యాలిడిటీతో వస్తుంది. రెండు ప్లాన్‌లు ఒక సంవత్సరం డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో అందిస్తుంది.

చదవండి: ఏముంది భయ్యా ఆ జీన్స్‌ ప్యాంట్‌లో.. 60 లక్షలు పెట్టి మరీ కొన్నావ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement