subscribers
-
వీరి వీడియోలు క్షణాల్లో వైరల్.. టాప్-10 భారత యూట్యూబర్లు
యూట్యూబ్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలువురికి ఉపాధి మార్గంగా మారింది. కెమెరాలు, మైకులు పట్టుకుని తిరుగుతూ, అందమైన ప్రకృతిని లేదా జనం తిరుగాడే ప్రాంతాలను చిత్రీకరిస్తూ, యూ ట్యూబ్‌లో వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. తద్వారా వారు ఆనందాన్ని అందుకోవడమే కాకుండా, మనకు వినోదాన్ని కూడా పంచుతున్నారు. అలాగే యూట్యూబ్ నుంచి ఆదాయాన్ని కూడా అందుకుంటున్నారు. ఇదేకోవలో మన దేశానికి చెందిన 10 మంది యూట్యూబర్లు ఇంటర్నెట్ను శాసిస్తున్నారు. వారి జాబితా ఇలా..అజయ్ నాగర్అజయ్ నాగర్.. దేశంలో ప్రముఖ యూట్యూబర్‌గా పేరొందారు. 2000 జూన్ 12న హర్యానాలోని ఫరీదాబాద్‌లో జన్మించారు. అజయ్నాగర్ ‘CarryMinati’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా రోస్ట్ వీడియోలు, కామెడీ, గేమింగ్ వీడియోలతో అందరికీ వినోదాన్ని పంచుతుంటారు. ఇతని యూట్యూబ్ ఛానల్ నాలుగు కోట్ల పైగా సబ్స్క్రైబర్లున్నారు. "YouTube vs TikTok" వంటి వీడియోలు అజయ్ నాగర్‌కు మరింత ఆదరణను తెచ్చిపెట్టాయి.ఆశిష్ చంచలానీఆశిష్ చంచలానీ (Ashish Chanchlani) ప్రముఖ కామెడీ క్రియేటర్. ఆయన "Ashchanchlani Vines" అనే యూట్యూబ్ ఛానల్‌తో విపరీతమైన ఆదరణను అందుకున్నారు. 1993 డిసెంబర్ 7న ముంబైలో జన్మించిన ఆశిష్ తన వినోదాత్మక వీడియోలు, స్కిట్స్, హాస్యంతో కూడిన కంటెంట్‌తో యువతలో పాపులర్ అయ్యారు. ఆశిష్ చంచలానీ ఛానల్ మూడు కోట్లకు పైగా సబ్స్క్రైబర్లను అందుకుంది. ఆశిష్ తన వీడియోలలో సాధారణ పరిస్థితులను కూడా వినోదాత్మకంగా చూపించి, జనాలకు నవ్వు తెప్పించే ప్రయత్నం చేస్తుంటారు.భువన్ బామ్భువన్ బామ్.. ఇతనొక కామెడీ కంటెంట్ క్రియేటర్. ఆయన "BB Ki Vines" అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆదరణ పొందారు. 1994 సెప్టెంబర్ 22న న్యూఢిల్లీలో జన్మించిన భువన్, తన వినోదాత్మక వీడియోలు, స్కిట్స్‌తో యువత అభినందనలు అందుకుంటున్నారు. ఈ ఛానల్ రెండు కోట్లకు పైగా సబ్స్క్రైబర్లను సొంతం చేసుకుంది. భువన్ తన వీడియోల్లో స్నేహితులు, కుటుంబ సభ్యులతపై సరదా కామెడీ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు.అమిత్ భదానాఅమిత్ భదానా (Amit Bhadana).. ప్రముఖ కంటెంట్ క్రియేటర్. కామెడీ వీడియోలను చేయడంలో ముందుంటారు. ‘Amit Bhadana’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా పాపులర్ అయ్యారు. 1999 జూలై 7న న్యూఢిల్లీ లో జన్మించిన అమిత్, తన వీడియోలలో హాస్యంతోపాటు రోజువారీ జీవితం, సామాన్య పరిస్థితులు, కుటుంబ సంబంధాలు తదితర విషయాలపై వినోదాత్మక కంటెంట్ అందిస్తుంటారు.సందీప్ మహేశ్వరిసందీప్ మహేశ్వరి.. ఈమె భారతీయ పారిశ్రామిక దిగ్గజం. మోటివేషనల్ స్పీకర్, ఎంట్రప్రెన్యూర్. 1975 సెప్టెంబరు 28న న్యూఢిల్లీ లో జన్మించిన సందీప్, "Sandeep Maheshwari" అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు పలు అంశాలలో స్ఫూర్తి అందిస్తుంటారు. మహేశ్వరి తన వీడియోలలో జీవితంలో సానుకూలత, మనోభావాల నియంత్రణ మొదలైన అంశాల గురించి చెబుతూ యువతకు సన్మార్గాన్ని చూపిస్తుంటారు.గౌరవ్ చౌధరిగౌరవ్ చౌధరి (Gaurav Chaudhary) టెక్నికల్ క్రియేటర్. "Technical Guruji" అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా టెక్నాలజీ, గాడ్జెట్లు, నూతన ఆవిష్కరణలు, రివ్యూ, టిప్స్ , ట్రిక్స్ తెలియజేస్తుంటారు. 1995 అప్రిల్ 7న రాజస్థాన్‌లో జన్మించిన గౌరవ్ టెక్నికల్ విషయాలను శరళమైన భాషలో అందిస్తుంటారు. టెక్నికల్ గురూజీ ఛానల్ రెండు కోట్లకు పైగా సబ్స్క్రైబర్లను పొందింది.నిశ్చయ్ మల్హన్ నిశ్చయ్ మల్హన్ (Nischay Malhan), Triggered Insaan పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. 1995 నవంబర్ 3న న్యూఢిల్లీలో జన్మించిన నిశ్చయ్, తన వీడియోల్లో రోస్టింగ్, కామెడీ, మీమ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈయన ఇతర క్రియేటర్లపై చేసిన పంచ్‌లు పాపులర్ అయ్యాయి.హరిష్ బెనివాల్హరిష్ బెనివాల్ ప్రముఖ కామెడీ క్రియేటర్. ఆయన "Harish Beniwal" అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆదరణ పొందారు. హరిష్ తన వీడియోల్లో ప్రధానంగా కామెడీ స్కిట్స్, హాస్యభరిత కంటెంట్‌ను చూపిస్తుంటారు. 1996లో జన్మించిన హరిష్, తన వినోదాత్మక వ్యవహారశైలితో యువతను ఆకట్టుకుంటున్నారు.సమయ్ రైనాసమయ్ రైనా.. కామెడీ క్రియేటర్, స్ట్రీమర్. ఆయన "Samay Raina" అనే ఛానల్ పాపులర్ అయ్యారు. సమయ్ పలు రోస్ట్ వీడియోలు, కామెడీ స్కిట్స్, లైవ్ స్ట్రీమింగ్‌తో యువతను అలరిస్తుంటారు. 1996లో జమ్ము కశ్మీర్లో జన్మించిన సమయ్, తన ఇన్స్పిరేషనల్, సరదా వీడియోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నెటిజన్లకు మంచి వినోదం అందించేందుకు ప్రయత్నిస్తుంటారు.నిషా మధులికనిషా మధులిక.. ప్రముఖ భారతీయ ఫుడ్ కంటెంట్ క్రియేటర్. ‘Nisha Madhulika’ అనే ఛానల్ ద్వారా పాపులర్ అయ్యారు. ఇందులో ఆమె ఇండియన్ వంటకాల తయారీని వివరంగా చూపిస్తుంటారు. 1963లో జన్మించిన నిషా తన వీడియోలలో సులభంగా వంటలు చేసుకునే విధానాన్ని చెబుతుంటారు. నిషా మధులిక ఛానల్ కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆహార ప్రియులు నిషా మధులిక ఛానల్‌ను ఫాలో చేస్తుంటారు. ఇది కూడా చదవండి: ‘ఆప్’ ఓటమితో పంజాబ్‌లో వణుకు.. సీఎంకు ముచ్చెమటలు -
ఈపీఎఫ్ఓ ఏటీఎం కార్డులు ఎప్పటి నుంచో తెలుసా..
కోట్లాది మంది ఈపీఎఫ్ఓ(EPFO) చందాదారులు తమ పీఫ్ డబ్బును ఏటీఎం(ATM) ద్వారా విత్‌డ్రా చేసుకునేందుకు తేదీ ఖరారైంది. ఇందుకోసం ప్రభుత్వం కొత్తగా సాఫ్ట్వేర్ వ్యవస్థను ప్రారంభిస్తుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ ఏడాదే ఈపీఎఫ్ఓ 3.0ను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఈ కొత్త విధానం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) సభ్యుల సమస్యలను పరిష్కరించి, వారికి మెరుగైన సర్వీస్‌ను అందిస్తుందన్నారు. ఈపీఎఫ్ఓ ఏటీఎం కార్డులను జూన్ 2025 వరకు అందుబాటులోకి తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందించినట్లు మంత్రి పేర్కొన్నారు.ఈపీఎఫ్ఓ ఏటీఎం కార్డుఈపీఎఫ్ఓ 3.0 వెర్షన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పీఎఫ్ చందాదారులకు ఏటీఎం కార్డులను జారీ చేస్తామని కేంద్ర మంత్రి మాండవీయ ధ్రువీకరించారు. ఉద్యోగులు ఈ ఏటీఎం కార్డు ద్వారా తమ ఈపీఎఫ్ పొదుపును సులభంగా పొందవచ్చన్నారు. తద్వారా అత్యవసర పరిస్థితుల్లో డబ్బు వెంటనే అందుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించి వెబ్సైట్, సిస్టమ్ అప్డేట్ల(Updates) ప్రారంభ దశను ఈ నెలాఖరులోగా ఖరారు చేస్తామని మాండవీయ పేర్కొన్నారు.ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ఈపీఎఫ్వో సభ్యులను ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETF) పరిధికి మించి ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడానికి అనుమతించే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదిత మార్పు పీఎఫ్ ఖాతాదారులకు వారి ఫండ్లను మెరుగ్గా నిర్వహించడానికి, అధిక రాబడిని అందుకునేందుకు, పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌కు వీలు కల్పిస్తుంది. ఇది ఆమోదం పొందితే డైరెక్ట్ ఈక్విటీ పెట్టుబడి సభ్యులకు తమ పెట్టుబడి వ్యూహాలను, ఆర్థిక వృద్ధిని పెంచుకోవడానికి కొత్త మార్గాన్ని అందిస్తుంది.ఇదీ చదవండి: ప్రపంచంలో అధిక వేతనం ఈయనకే..!ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ఈపీఎఫ్వో పెన్షనర్ల కోసం గణనీయమైన మార్పులను అమలు చేస్తోంది. ఇటీవలి ఆదేశాల ప్రకారం.. పింఛనుదారులు అదనపు ధ్రువీకరణ లేకుండా తమ పెన్షన్‌ను దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు నుంచి అయినా ఉపసంహరించుకునే వెసులుబాటు రానుంది. -
జియోకి షాక్.. కోటి మంది టాటా!
కొన్ని రోజుల క్రితం రిలయన్స్ జియో తన రీఛార్జ్ ప్లాన్ల టారిఫ్‌ను పెంచిన తర్వాత యూజర్లు షాక్ ఇచ్చారు. నివేదికల ప్రకారం పెరిగిన టారిఫ్‌ల ప్రభావం దాని వినియోగదారు బేస్‌పై ప్రతిబింబించింది. రెండవ త్రైమాసికంలో దాదాపు 1.09 కోట్ల మంది వినియోగదారులు జియో నుండి వెళ్లిపోయారు.అదే సమయంలో జియో 5G సబ్‌స్క్రైబర్ బేస్ మాత్రం 17 మిలియన్లు పెరిగినట్లు మొత్తం గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతంలో యూజర్ బేస్ 130 మిలియన్లు ఉండగా ఇప్పుడు 147 మిలియన్లకు చేరుకుంది. ఇక ఒక్కో యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) రూ. 181.7 నుండి రూ.195.1కి పెరిగింది. అయితే మొత్తంగా జియో సబ్‌స్క్రైబర్ బేస్ క్షీణించింది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త అడుగు.. దేశంలో తొలి D2Dతన యూజర్ బేస్‌కు సంబంధించిన పరిస్థితి గురించి తమకు తెలుసునని, లాభాలపై ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపదని జియో తెలిపింది. తమ కస్టమర్లకు అత్యుత్తమ 5జీ నెట్‌వర్క్‌ను అందించడంపైనే తమ దృష్టి ఉందని కంపెనీ పేర్కొంది. వినియోగదారులను కోల్పోవడం తమ వ్యాపారాన్ని ప్రభావితం చేయదని, అయితే ఇతర టెలికాం ఆపరేటర్లకు ఇది అవకాశం కల్పిస్తుందని జియో అంగీకరించింది. -
ఆ ఖర్చంతా మార్గదర్శి భరించాల్సిందే: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ‘మార్గదర్శి’ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. నోటీసులు యాడ్స్‌కు అయ్యే ఖర్చును మార్గదర్శి భరించాలని తెలంగాణ హైకోర్టు తేల్చిచెప్పింది. యాడ్స్ ఖర్చు వివరాలు ఇచ్చిన వారంలోపు మార్గదర్శి డిపాజిట్ చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ‘‘చందాదారుల వివరాల కోసం పత్రికల్లో నోటీసులివ్వండి. మొత్తం ఎంత ఖర్చవుతుందో రిజిస్ట్రీ మార్గదర్శికి చెబుతుంది. అప్పటి నుంచి వారంలోగా ఆ డబ్బు డిపాజిట్ చేయాలి. వెంటనే పత్రికల్లో విస్తృతంగా నోటీసులిస్తూ ప్రచారం చేయండి’’ అని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 30కి కోర్టు వాయిదా వేసింది.మార్గదర్శి ఫైనాన్షియర్స్ యాజమాన్యం చందాదారులందరికీ డిపాజిట్ల తాలూకు నగదును తిరిగి చెల్లించిందా? లేక ఎవరికైనా ఎగవేసిందా..? అనే వివరాలు తెలుసుకునేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ హైకోర్టు గత విచారణలో రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు తెలుగు, హిందీ, ఆంగ్ల పత్రికల్లో విస్తృత ప్రచారం జరిగేలా నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేసింది.అలాగే చందాదారుల వివరాలు కోరుతూ ఓ అఫిడవిట్ దాఖలు చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు సూచించింది. అఫిడవిట్ ఆధారంగా తాము మార్గదర్శికి ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది. దీనిపై రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం ఆదేశించిన సంగతి తెలిసిందే. -
చందాదారులెవరు?.. తెలంగాణ హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి ఫైనాన్షియర్స్ యాజమాన్యం చందాదారులందరికీ డిపాజిట్ల తాలూకు నగదును తిరిగి చెల్లించిందా? లేక ఎవరికైనా ఎగవేసిందా..? అనే వివరాలు తెలుసుకునేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ హైకోర్టు తాజాగా రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు తెలుగు, హిందీ, ఆంగ్ల పత్రికల్లో విస్తృత ప్రచారం జరిగేలా నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేసింది. అలాగే చందాదారుల వివరాలు కోరుతూ ఓ అఫిడవిట్ దాఖలు చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు సూచించింది. అఫిడవిట్ ఆధారంగా తాము మార్గదర్శికి ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది. దీనిపై రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం మంగళవారం ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను సెప్టెంబర్ 11వతేదీకి వాయిదా వేసింది. డిపాజిట్ల నిగ్గు తేలాలన్న ‘సుప్రీం’ ఆర్బీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు మార్గదర్శి, దాని కర్త రామోజీరావు (ఇటీవల మృతి చెందారు)పై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అ«దీకృత నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబర్ 31న తీర్పునిచ్చింది. అయితే అనంతరం ఈ తీర్పును సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (వైఎస్సార్ సీపీ హయాంలో) సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశాయి. తీర్పులో కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లు అన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన తీర్పును 2024 ఏప్రిల్ 9న కొట్టివేసింది. హైకోర్టు తీర్పును తప్పుబడుతూ మార్గదర్శి డిపాజిట్ల సేకరణకు సంబంధించి వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని పేర్కొంది. మార్గదర్శి అక్రమాలను ఆర్బీఐ కౌంటర్లో తేల్చింది... సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో తెలంగాణ హైకోర్టు తాజాగా మరోసారి విచారణ ప్రారంభించింది. సీనియర్ జడ్జి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టాలన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వాన్ని, ఆర్బీఐని ప్రతివాదుల జాబితాలో చేర్చింది. గత విచారణ (ఈనెల 6వ తేదీన) సందర్భంగా కౌంటర్ దాఖలుకు చివరి అవకాశం ఇవ్వాలన్న ఆర్బీఐ వినతికి అంగీకరిస్తూ ఇకపై ఈ పిటిషన్లను మోషన్ లిస్ట్‌లో పేర్కొనాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ క్రమంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ వసూలు చేసిన డిపాజిట్లన్నీ చట్టవిరుద్ధం, అక్రమమేనని, అందుకు బాధ్యులను ప్రాసిక్యూట్ చేయాలని నివేదిస్తూ ఈ నెల 13న ఆర్బీఐ తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఈ క్రమంలో మంగళవారం జస్టిస్ సుజోయ్‌పాల్ నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా, కోర్టు సహాయకులుగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆన్లైన్లో హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వ న్యాయవాదితోపాటు తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది పల్లె నాగేశ్వర్రావు, ఆర్బీఐ న్యాయవాది కె.రతంగపాణిరెడ్డి హాజరయ్యారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారిస్తూ చట్టం 45 (ఎస్)ను ఉల్లంఘించినట్లు ఆర్బీఐ కౌంటర్లో తేల్చిందని ఈ సందర్భంగా ఉండవల్లి హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీని ఆధారంగా మార్గదర్శిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని నివేదించారు. దాదాపు 70 వేల మంది చందాదారుల వివరాలను 1,500కిపైగా పేజీల్లో మార్గదర్శి సుప్రీం కోర్టుకు సమర్పించిందని, ఆ వివరాలను హైకోర్టుకు కూడా పెన్‌డ్రైవ్‌లో అందజేసేలా ఆదేశించాలని కోరారు. దీనిపై జస్టిస్ సుజోయ్‌పాల్ స్పందిస్తూ.. వివరాలు కోరుతూ ఓ అఫిడవిట్ దాఖలు చేయాలని, ఆ మేరకు ఆర్బీఐ, మార్గదర్శికి ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంటూ తదుపరి విచారణను వాయిదా వేశారు. -
30 కోట్ల సబ్బర్లను సాధించిన తొలి యూట్యూబర్ ఇతడే..!
-
టెలికం యూజర్లు @120 కోట్లు
న్యూఢిల్లీ: దేశీయంగా టెలి కం యూజర్ల సంఖ్య ఏప్రిల్‌లో 120 కోట్లు దాటింది. ట్రాయ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్‌లో మొత్తం సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 120.12 కోట్లుగా నమోదైంది.ఈ ఏడాది మార్చిలో ఇది 119.92 కోట్లుగా ఉంది. చివరిసారిగా 2017 జూలైలో 121 కోట్ల రికార్డు స్థాయిని తాకింది. తాజాగా, వైర్లెస్ విభాగంలో రిలయన్స్ జియోకి ఏప్రిల్‌లో 26.8 లక్షల మంది కొత్త యూజర్లు జత వడంతో మొత్తం యూజర్ల సంఖ్య 47.24 కోట్లకు చేరింది.7.52 లక్షల కొత్త కస్టమర్లు, మొత్తం 26.75 కోట్ల యూజర్లతో ఎయిర్టెల్ తర్వాత స్థానంలో ఉంది. బీఎస్ఎన్ఎల్ యూజర్ల సంఖ్య 12.3 లక్షలు, వొడాఫోన్ ఐడియా యూజర్లు 7.35 లక్షల మేర తగ్గారు. -
Gaurav Chaudhary: కోట్ల యూట్యూబ్ సబ్‌స్క్రైబర్స్‌ని సొంతం చేసుకున్నాడు.. ఎలా అంటే?
యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్‌చేసి ఎందరో ముందుకు వెళ్లినవారు, మధ్యలోనే నిలపివేసినవారు, మళ్ళీ కొనసాగించినవారున్నారు. కానీ కోట్ల సబ్‌స్క్రైబర్స్‌ని పొందినవారు ఎందరున్నారు? ఎవరున్నారు? అనే సందేహానికి ఈ యూట్యూబరే.. నిదర్శనం. మరి అతని గురించి తెలుసుకుందామా..'గౌరవ్ చౌధరీ' రిచెస్ట్ ఇండియన్ టెక్ యూట్యూబర్. ‘టెక్నికల్ గురూజీ’ అనే యూట్యూబ్ చానెల్‌తో పాపులర్. దీన్ని 2015లో స్టార్ట్ చేశాడు. కష్టమైన టెక్నికల్ అంశాలను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఇతను ఎక్స్పర్ట్.ఈ స్కిల్‌తోనే 2017 కల్లా కోటి మంది సబ్‌స్క్రైబర్స్‌ని సంపాదించుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత వ్యూస్ గెయిన్ చేస్తోంది అతని చానెల్. 2024, మార్చి నాటికి రెండు కోట్ల 35 లక్షల మంది సబ్స్క్రైబర్స్తో టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌లో ఒకడిగా ఉన్నాడు. టెక్ కేటగరీలో తొలి నేషనల్ క్రియేటర్స్ అవార్డ్‌ను అందుకున్నాడు.అతని నెట్ వర్త్ 360 కోట్లకు పైమాటే! రాజస్థాన్‌లోని అజ్మేర్ అతని సొంతూరు. 16 ఏళ్లకే కోడింగ్‌లో ఆరితేరాడు. బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో మైక్రోఎలక్ట్రానిక్స్లో గ్రాడ్యుయేషన్ చేశాడు. కోడింగ్‌లో తనకున్న నైపుణ్యంతో దుబాయ్‌లోనే డిజిటల్ సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు.సోషల్ మీడియా అనగానే ఎంటర్టైన్మెంటే కాదు సీరియస్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. వాటితోనూ వ్యూస్ అండ్ క్యాష్‌ని రాబట్టుకోవచ్చని నిరూపించాడు!ఇవి చదవండి: కలే నిజమైంది.. ప్రాణాలు కాపాడింది! -
ఫ్లిప్‌కార్ట్ గుడ్‌న్యూస్.. ఇక హైదరాబాద్‌లోనూ కొత్త ఆఫర్!
హైదరాబాద్: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇటీవల బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, ముంబైలలో ప్రారంభించిన వీఐపీ సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌ను ఇప్పుడు హైదరాబాద్‌కు విస్తరించింది. ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్న కస్టమర్లు ఉచిత డెలివరీ, తగ్గింపు వంటి ఆఫర్లను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ వీఐపీ (Flipkart VIP) సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌ను కొత్తగా హైదరాబాద్‌తోపాటు అహ్మదాబాద్, భువనేశ్వర్, కోయంబత్తూర్, గౌహతి, పాట్నా, పూణే, రాంచీలలో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. కస్టమర్లు సంవత్సరానికి రూ. 499 చెల్లించి ఫ్లిప్‌కార్ట్ వీఐపీ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ వీఐపీ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలు ఈ సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్ లక్షలాది ఉత్పత్తులపై 48-గంటల ఉచిత డెలివరీ, అన్ని ఉత్పత్తులపైనా చెల్లింపుల కోసం సూపర్ కాయిన్స్‌ను ఉపయోగించి 5 శాతం అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. క్లియర్‌ట్రిప్‌లో ఒక్క రూపాయికే ఫ్లైట్ క్యాన్సిల్ లేదా రీషెడ్యూల్ చేసుకోవచ్చు. క్లియర్‌ట్రిప్ హోటల్ బుకింగ్‌లపై అదనపు ఆఫర్లు, 48 గంటలలోపు రిటన్ పికప్. షాపింగ్ ఫెస్టివల్స్‌కు ముందస్తు యాక్సెస్ వంటి ప్రయోజనాలు ఉంటాయి. ఇలా ఎలా నమోదు చేసుకోండి.. ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్ లేదా యాప్‌ని సందర్శించండి మీ వివరాలతో లాగిన్ చేయండి. ఒకవేళ మీరు ప్లాట్‌ఫామ్‌కు కొత్త అయితే, మీ వివరాలను అందించి అకౌంట్‌ను క్రియేట్ చేసుకోండి. వీఐపీ ల్యాండింగ్ పేజీకి స్క్రోల్ చేసి, 'గెట్ వీఐపీ బెనిఫిట్స్' బటన్‌పై నొక్కండి చెల్లింపు, తుది ప్రక్రియ కోసం 'కంనిన్వ్యూ' క్లిక్ చేయండి మీకు అనువైన మోడ్ ద్వారా చెల్లింపు వివరాలను నమోదు చేసి ఆర్డర్‌ను కన్ఫర్మ్ చేఏయండి విజయవంతంగా నమోదు చేసుకున్న తర్వాత, వెబ్సైట్ లేదా యాప్‌లో కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. -
యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న డ్రైవర్: ఆనంద్ మహీంద్ర ఫిదా!
ప్రస్తుతకాలంలో ఏ వృత్తిలో ఉన్నా, ఆధునిక టెక్నాలజీని, ట్రెండ్‌ని పట్టుకోవడంలోనే ఉంది సక్సెస్. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు, యూ ట్యూబ్ ప్రపంచానికి తన టాలెంట్ ఏంటో చూపించి సత్తా చాటుకున్నారు చాలామంది. ఇంటి వంట,ఇంటి పంట, గాత్రం,వ్యవసాయ క్షేత్రం ఇలా ఏదైనా చివరికి తమ రోజువారీ జీవితాల్లోని మామూలు అంశాలతో వైరల్ అయి పోతున్నారు. మట్టిలో మాణిక్యాల్లా యూట్యూబ్‌లో సంచలనం క్రియేట్ చేస్తున్నారు అలాంటి వారిలో ఒక ట్రక్ డ్రైవర్ విశేషంగా నిలుస్తున్నాడు. 1.47 మిలియన్ల యూట్యూబ్ సబ్స్క్రైబర్లతో నెటిజన్లుల చేత 'మాస్టర్‌చెఫ్' గా ప్రశంసలు పొందుతున్న కార్గో ట్రక్ డ్రైవర్ రాజేష్ రావాని గురించి తెలుసు కుందాం రండి. రాజేష్ రావాని ఒక ట్రక్ డ్రైవర్. వృత్తిపరంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ట్రక్ డ్రైవర్ నా జీవితంలో ఏముంది స్పెషల్ అనుకోలేదు. తన జీవితం నుంచే ఏదో సాధించాలనుకున్నాడు. ఇదే అతని జీవితాన్ని మార్చింది. సాధారణంగా సుదూర ప్రాంతాలకు వస్తువులను రవాణా చేసే వెళ్లే లారీ, ట్రక్ డ్రైవర్లు రోజుల తరబడి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అందుకే వారుమధ్యలో ఎక్కడో ఒక చోట ఆగి వండుకొని తినేలా ఏర్పాటు చేసుకుంటారు. కానీ రాజేష్ రావాని ఇంకొంచెం స్పెషల్. తనకొక స్పెషల్ కిచెన్ క్రియేట్ చేసుకుని నచ్చిన వంటల్ని, రుచికరంగా వండుకుని ఆస్వాదిస్తూ ఉంటాడు. దీన్నే స్మార్ట్‌ఫోన్ ద్వారా వీడియో తీసి పోస్ట్ చేయడం షురూ చేశాడు. దీనికి కొడుకుల సాయం తీసుకున్నాడు. రాజేష్‌కు ఇద్దరు కుమారులు సాగర్, శుభం. వీరే యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడానికి ప్రోత్సహించారని ఒకసారి నెటిజన్లుతో పంచుకున్నాడు. ముఖ్యంగా సాగర్ వీలైనప్పుడు ట్రక్కుపై అతనితో పాటు వీడియోలు చిత్రీకరిస్తూ, ఎడిట్ చేస్తూ ఉంటాడని చెప్పాడు. "యూట్యూబ్ అంటే ఏమిటో కూడా తెలియదు, అబ్బాయిలే ఛానెల్‌ని ప్రారంభించారని వెల్లడించాడు. వివిధ రాష్ట్రాలకు చెందిన పదార్థాలతో ప్రయోగాలు చేస్తూండటంతో స్పందన బాగా వచ్చింది. 2021 ఏప్రిల్‌లో తన సొంత YouTube ఛానెల్, Instagram పేజీని ప్రారంభించాడు. ఇక అక్కడినుంచి వెనుదిరిగి చూడలేదు. తన వెళ్లే ప్రదేశాలు, వండుకునే సూపర్ వంటకాలు, మటన్ కర్రీ, ఫిష్ కర్రీ, మఠర్ పనీర్ ఫ్రైడ్ రైస్ ఇలా ఒకటీ రెండూకాదు రోడ్డు పక్కన జరిగిన సంఘటనలు,ఎన్నోఅద్భుతాలు వీడియోల ద్వారా నెటిజనులకు పరిచయం చేశాడు. ప్రతీ వీడియోకు లక్షలకు పైగా వ్యూస్. సబ్స్క్రైబర్లు కూడా క్రమంగా పెరుగుతూ వచ్చారు. 786 వీడియోలు చేశాడు. 50, 60 లక్షల వ్యూస్ వచ్చిన వీడియోలున్నాయటే రాజేష వీడియోల క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. View this post on Instagram A post shared by R_ Rajesh (@r_rajesh_07) ఆర్ రాజేష్ వ్లాగ్స్ ఛానెల్‌తో సెలబ్రిటీగా మారిపోయాడు. అంతేకాదు ఆయన భాష కూడా నిజంగా సూపర్ చెఫ్లాగా ఉండటంతో ఫాలోయింగ్ బాగా పెరిగింది. దీంతో "మాస్టర్‌చెఫ్" , బెస్ట్ ఫుడ్ వ్లాగర్" గా పాపులర్ అయ్యాడు. అంతేకాదు నెటిజన్లు అతని ట్రక్కును "ఫైవ్ స్టార్ రెస్టారెంట్" లేదా "చల్తా ఫిర్తా దాభా" అని పిలవడం విశేషం. ఇంకో విశేషం ఏమిటంటే డ్రైవర్లు నిర్జన ప్రదేశంలో ట్రక్ చెడిపోయినప్పుడు, చెత్త రోడ్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏదైనా సమస్య వస్తే మరమ్మత్తు ఎలా చేసుకోవాలి లాంటివాటితో పాటు తన ట్రక్కు నుండి డ్రోన్ షాట్‌ను పోస్ట్ చేశాడు. హైదరాబాద్ నుండి పాట్నాకు వెళ్లే మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్‌ను చూపించింది. ఈ క్లిప్‌కి ఐదు లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి.ఇన్‌స్టాగ్రామ్‌లో అతని వంటకాలు, వీడియోలు బాగా ఆకట్టుకుంటాయి. ఎనిమిది లక్షలకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లున్నారు. దీంతో సంపాదన కూడా బాగానే ఉంది. రాజేష్ కుమారుడు కూడా తోడయ్యాడు. ఈ క్రమంలోనే ఇపుడొక కొత్త ఇంటిని కొనుగోలు చేశారు ఇద్దరూ. కొత్త ఇంటిపార్టీ వీడియోను కూడా అప్లోడ్ చేశాడు. రాజేష్ సక్సెస్ జర్నీని పారిశ్రామికవేత్త ఆనంద్మహీంద్రను బాగా ఆకట్టుకుంది. మండే మోటివేషన్ను అంటూ రాజేష్ స్టోరీని ట్విటర్లో షేర్ చేశారు. 25 సంవత్సరాలకు పైగా ట్రక్ డ్రైవర్‌గా ఉన్న రాజేష్ రావాని, తన వృత్తికి ఫుడ్ & ట్రావెల్ వ్లాగింగ్ యాడ్ చేసి ఇపుడొక ఇంటి వాడయ్యాడు అంటూ ట్వీట్ చేశారు. -
మోదీ యూట్యూబ్ సబ్స్రైబర్లు 2 కోట్లు
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఛానల్ సబ్స్రైబర్లు రెండు కోట్లు దాటారు. ప్రపంచంలో ఈ ఘనత దక్కిన నేత నరేంద్ర మోదీనే కావడం గమనార్హం. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో మోదీ ఈ ఛానల్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నేటి వరకు దీనిని వినియోగిస్తూనే ఉన్నారు. ఇందులో పోస్టు చేసిన వీడియోలకు 450 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఛానల్ సబ్‌స్రైబర్ల సంఖ్యలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సొనారో 64 లక్షలతో రెండో స్థానంలో ఉన్నారు. వ్యూస్ అంశంలో మోదీ తర్వాత ఉక్సెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఉన్నారు. జెలెన్ స్కీ పోస్టు చేసిన వీడియోలకు 22.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత స్థానాల్లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ 7.89 లక్షల మంది, తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌కు 3.16 లక్షల మంది సబ్స్రైబర్లు ఉన్నారు. రాహుల్ గాంధీ ఛానల్‌కు 35 లక్షల మంది ఉన్నారు. ఇదీ చదవండి: అఫీషియల్: మణిపూర్ నుంచి ముంబై దాకా రాహుల్ గాంధీ ‘భారత్ న్యాయయాత్ర’ -
10 కోట్ల మంది 5జీ యూజర్లు..
దేశవ్యాప్తంగా 738 జిల్లాల్లో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచి్చన నేపథ్యంలో సుమారు 10 కోట్ల మంది సబ్‌్రస్కయిబర్స్ ఈ సరీ్వసులను వినియోగించుకుంటున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ తెలిపారు. టెలికం సంస్థలు 2022లో వేలంలో కొనుక్కున్న స్పెక్ట్రం కోసం రూ. 1.5 లక్షల కోట్లు వెచి్చంచడంతో పాటు మొత్తం మీద రూ. 2 లక్షల కోట్ల మేర ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వివరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా భారత్‌లోనే 5జీ సేవలు విస్తరించాయని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించేందుకు, లిక్విడిటీని మెరుగుపర్చేందుకు, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం గత కొన్నాళ్లుగా చేపట్టిన సంస్కరణలు టెలికం రంగ వృద్ధికి తోడ్పడ్డాయని చౌహాన్ చెప్పారు. -
ఎన్పీఎస్ ఉపసంహరణకు ‘పెన్నీ డ్రాప్’ ధ్రువీకరణ
న్యూఢిల్లీ: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) నుంచి చందాదారులు తమ నిధులను ఉపసంహరించుకునే సమయంలో ‘పెన్నీ డ్రాప్’ ధ్రువీకరణను పింఛను నిధి అభివృద్ధి, నియంత్రణ మండలి (పీఎఫ్ఆర్డీఏ) ప్రవేశపెట్టింది. పెన్నీడ్రాప్ విధానంలో చందాదారు బ్యాంక్ ఖాతాలో ఉన్న పేరు, ఎన్పీఎస్లోని పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్లోని పేరు ఏక రూపంలో ఉందా అన్నది సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (సీఆర్ఏ) తనిఖీ చేస్తుంది. ఎన్‌పీఎస్‌తోపాటు ఎన్పీఎస్ లైట్, అటల్ పెన్షన్ యోజన (ఏపీవై)కు సంబంధించి అన్ని రకాల ఉపసంహరణలు, వైదొలగడాలు, చందాదారు బ్యాంకు ఖాతా వివరాల్లో మార్పులకు నూతన విధానం అమలు కానుంది. దీన్ని ఎలా చేస్తారంటే.. చందాదారు బ్యాంక్ ఖాతాలోకి చాలా స్వల్ప మొత్తాన్ని (రూపాయి) బదిలీ చేస్తారు. తద్వారా బ్యాంక్ ఖాతాలో ఉన్న పేరును ధ్రువీకరించుకుంటారు. నిధుల ఉపసంహరణకే కాకుండా, చందాదారులు తమ బ్యాంక్ ఖాతా వివరాల అప్డేట్కు దరఖాస్తు చేసుకున్న సందర్భాల్లోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తారు. ఈ పెన్నీడ్రాప్ విధానంలో ధ్రువీకరణ విజయవంతం కాకపోతే, నోడల్ ఆఫీస్ సహకారాన్ని సీఆర్ఏ తీసుకుంటుంది. పెన్నీడ్రాప్ విఫలమైందని, సమీప నోడల్ ఆఫీస్ లేదా పీవోపీని సంప్రందించాలంటూ చందాదారులకు ఈ మెయిల్, మొబైల్ ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. చందాదారు నుంచి సరైన వివరాలు అందేంత వరకు నిధుల బదిలీని నిలిపివేస్తారు. -
ఎయిర్‌టెల్‌కి షాకిచ్చిన జియో.. పాపం వొడాఫోన్ ఐడియా!
న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం యూజర్ల సంఖ్య జూన్‌లో స్వల్పంగా పెరిగి 117.38 కోట్లకు చేరింది. రిలయన్స్ జియోకి 22.7 లక్షల మంది, భారతీ ఎయిర్‌టెల్‌కు 14 లక్షల మంది యూజర్లు కొత్తగా జతయ్యారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం మే ఆఖరు నాటికి టెలిఫోన్ సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 117.25 కోట్లుగా ఉంది. మరోవైపు, వొడాఫోన్ ఐడియా (వీఐఎల్), ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ యూజర్లు తగ్గారు. బీఎస్ఎన్ఎల్ సబ్‌స్క్రయిబర్స్ 18.7 లక్షల మంది, వీఐఎల్ 12.8 లక్షల మంది, ఎంటీఎన్ఎల్ 1.52 లక్షల మంది యూజర్లను కోల్పోయాయి. జియో 2.08 లక్షలు, భారతీ ఎయిర్టెల్ 1.34 లక్షలు, వీ–కాన్ మొబైల్ అండ్ ఇన్ఫ్రా 13,100 కలెక్షన్లు నమోదు చేసుకున్నాయి. -
Shradha Khapra: సలహాల అక్క
శ్రద్ధా కాప్రాను అందరూ ‘మైక్రోసాఫ్ట్ వాలీ దీదీ’ అని పిలుస్తారు. శ్రద్ధ బంగారంలాంటి మైక్రోసాఫ్ట్ ఉద్యోగాన్ని వదిలేసింది. ‘యువత కెరీర్ కోసం గైడెన్స్ అవసరం’ అని ‘అప్నా కాలేజ్’ పేరుతో ఓ యూట్యూబ్ చానల్ మొదలుపెట్టింది. రెండేళ్లలో 40 లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్ అయ్యారు. మైక్రోసాఫ్ట్ జీతం కన్నా ఎన్నో రెట్ల ఆదాయం శ్రద్ధకు వస్తోంది. ఏ కోర్సు చదవాలి, ఏ ఉద్యోగం చేయాలి లాంటి సలహాలు ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు తగినట్టు ఇవ్వడమే శ్రద్ధ సక్సెస్‌కు కారణం. ‘హరియాణలోని చిన్న పల్లెటూరు మాది. మా నాన్న గవర్నమెంట్ ఉద్యోగైనా నేను ఏం చదవాలో గైడ్ చేయడం ఆయనకు తెలియదు. టీచర్లు కూడా గైడ్ చేస్తారనుకోవడం అంత కరెక్ట్ కాదు. ఇప్పటికీ కాలేజీ స్థాయి నుంచి యువతకు తమ కెరీర్ పట్ల ఎన్నో డౌట్లు ఉంటాయి. వారికి గైడెన్స్ అవసరం. ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుని గైడ్ చేయాలి. నేను కొద్దోగొప్పో చేయగలుగుతున్నాను కాబట్టే ఈ ఆదరణ’ అంటుంది శ్రద్ధా కాప్రా. ఈమెకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు ఈనాటి కాలేజీ విద్యార్థుల్లో. ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌లో. వీరంతా శ్రద్ధను ‘శద్ధ్రా దీదీ’ అని,‘మైక్రోసాఫ్ట్ వాలీ దీదీ’ అని పిలుస్తారు. ఆమె చేసే వీడియోలను వారు విపరీతంగా ఫాలో అవుతారు. ఆ వీడియోల్లో ఆమె చెప్పే సలహాలను వింటారు. డాక్టర్ కాబోయి... శ్రద్ధ తన బాల్యంలో టీవీలో ఒక షో చూసేది. అందులో డాక్టర్లు తాము ఎలా క్లిష్టమైన కేసులు పరిష్కరించారో చెప్పేవారు. ఆ షో చూసి తాను డాక్టర్ కావాలనుకుని ఇంటర్లో ‘పిసిఎంబి’ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథ్స్, బయాలజీ) తీసుకుంది. కాని జూనియర్ ఇంటర్ పూర్తయ్యే సరికి డాక్టర్ కావడం చాలా కష్టమని అర్థమైంది. అందుకే మేథ్స్వైపు దృష్టి సారించింది. ‘చిన్నప్పటి నుంచి రకరకాల పోటీ పరీక్షలు ఎక్కడ జరిగినా రాసేదాన్ని. ఇంటర్ అయ్యాక ఎంట్రన్స్‌లు రాస్తే ర్యాంక్ వచ్చింది. కాని ఏ బ్రాంచ్ ఎన్నుకోవాలో తెలియలేదు. వరంగల్ ఎన్.ఐ.ఐ.టి.లో సివిల్‌కు అప్లై చేస్తే సీట్ వచ్చింది. సివిల్ ఎందుకు అప్లై చేశానో నాకే తెలియదు. అయితే దాంతో పాటు ఎన్.ఎస్.ఐ.టి. (నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, ద్వారకా)లో కంప్యూటర్ సైన్స్ అప్లై చేస్తే ఆ సీటు కూడా వచ్చింది. దీనికంటే అదే మెరుగనిపించి కంప్యూటర్ సైన్స్ చదివాను’ అని తెలిపింది శ్రద్ధ. ఉద్యోగం, టీచింగ్ చదువు చివరలో ఉండగానే హైదరాబాద్ మైక్రోసాఫ్ట్‌లో ఇన్టెర్న్ వచ్చింది శ్రద్ధకు. అది పూర్తయ్యాక ఉద్యోగమూ వచ్చింది. అయితే శ్రద్ధ ఇన్టెర్న్ చేస్తున్నప్పటి నుంచే గచ్చిబౌలిలో కంప్యూటర్ కోర్సులను బోధించసాగింది. ఉద్యోగం వచ్చాక కూడా కంప్యూటర్ కోర్సులకు ఫ్యాకల్టీగా పని చేసింది. ‘ఉద్యోగంలో కంటే ఎవరి జీవితాన్నయినా తీర్చిదిద్దే బోధనే నాకు సరైందనిపించింది. అదే సమయంలో యూట్యూబ్ ద్వారా ఎక్కడెక్కడో ఉన్న విద్యార్థులకు పాఠాలు చెప్పడం, కోర్సులు తెలియచేయడం, వారి స్కిల్స్ పెరిగేలా గైడ్ చేయడం అవసరం అనుకున్నాను. మైక్రోసాఫ్ట్‌లో నాది మంచి ఉద్యోగం. కాని ఏదైనా కొత్తగా చేయాలనుకోవడం కూడా మంచిదే అని జాబ్‌కు రిజైన్ చేశాను’ అంది శ్రద్ధ. అప్నా కాలేజ్ శ్రద్ధ ‘అప్నా కాలేజ్’ పేరుతో యూట్యూబ్ చానల్ తెరిచింది. ఇంటర్ స్థాయి నుంచి విద్యార్థులకు ఏయే కోర్సులు చదివితే ఏం ఉపయోగమో, ఏ ఉద్యోగాలకు ఇప్పుడు మార్కెట్ ఉందో, ఆ ఉద్యోగాలు రావాలంటే ఏ కోర్సులు చదవాలో తెలిపే వీడియోలు చేసి విడుదల చేయసాగింది. 2020లో ఈ చానల్ మొదలుపెడితే ఇప్పుడు 40 లక్షల మంది సబ్స్క్రయిబర్లు తయారయ్యారు. కోట్లాది వ్యూస్ ఉంటాయి. అందుకు తగ్గట్టుగా లక్షల్లో శ్రద్ధ ఆదాయం ఉంది. ‘ముప్పై ఏళ్ల క్రితం డిగ్రీల ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చేవారు. ఎందుకంటే డిగ్రీలు తక్కువ ఉండేవి. ఇవాళ డిగ్రీలు అందరి దగ్గరా ఉన్నాయి. కావాల్సింది స్కిల్స్. ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నారో ఆ ఉద్యోగానికి సంబంధించిన స్కిల్స్ అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడు ముందుకు దూసుకెళ్లవచ్చు. నా వీడియోలు ఆ మార్గంలో ఉంటాయి’ అని తెలిపింది శ్రద్ధ అలియాస్ సలహాల అక్క. -
బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు పెరిగారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా టెలికం చందాదార్ల సంఖ్య 2023 మే నెల చివరినాటికి 117.257 కోట్లకు చేరింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ సంఖ్య 117.252 కోట్లు ఉంది. ఏప్రిల్‌తో పోలిస్తే మే నెల వృద్ధి కేవలం 0.004 శాతం మాత్రమేనని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తాజా గణాంకాల్లో వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో టెలికం సబ్‌స్రై్కబర్ల సంఖ్య ఏప్రిల్‌తో పోలిస్తే 51.864 కోట్ల నుంచి 51.914 కోట్లకు ఎగసింది. పట్టణ ప్రాంతాల్లో వినియోగదార్ల సంఖ్య 65.388 కోట్ల నుంచి 65.343 కోట్లకు చేరింది. ఇక బ్రాడ్‌బ్యాండ్ మొత్తం చందాదార్ల సంఖ్య 85.094 కోట్ల నుంచి 85.681 కోట్లకు పెరిగింది. వైర్లెస్ చందాదార్లు..: మొబైల్ సబ్‌స్రై్కబర్ల సంఖ్య ఈ ఏడాది ఏప్రిల్‌లో 114.313 కోట్లు ఉంటే, మే నెలలో ఈ సంఖ్య 114.321 కోట్లకు చేరింది. రిలయన్స్ జియో కొత్తగా 30 లక్షల మందిని చేర్చుకోవడంతో సంస్థ మొత్తం మొబైల్ చందాదార్ల సంఖ్య 43.63 కోట్లను తాకింది. భారతీ ఎయిర్టెల్ నూతనంగా 13.2 లక్షల మందిని సొంతం చేసుకుంది. దీంతో ఈ కంపెనీ వైర్లెస్ సబ్‌స్రై్కబర్ల సంఖ్య 37.23 కోట్లకు చేరుకుంది. వొడాఫోన్ ఐడియాను మే నెలలో 28 లక్షల మంది కస్టమర్లు వీడారు. -
అదరగొట్టిన రిలయన్స్ జియో
Reliance Jio net profit grew 12 percent: బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టెలికాం విభాగం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అదరగొట్టింది.నికర లాభాల్లో 12.2శాతం పెరుగుదలను నమోదు చేసింది. అంతేకాదు చందాదారులకు సంబంధించి దేశీయంగా ఇప్పటికే టాప్ లో ఉన్న జియో ప్రస్తుత చందాదారులు కూడా భారీగా పెరిగారు. ( 22 ఏళ్లకే కంపెనీ పగ్గాలు, వేల కోట్ల సామ్రాజ్యం, 30వేలమందికి ఉపాధి) శుక్రవారం ప్రకటించిన క్యూ1 (ఏప్రిల్-జూన్) ఫలితాలలో జియో నికర లాభం రూ. 4,863 కోట్లకు పెరిగింది. ఇది ఏడాది క్రితం రూ. 4,335 కోట్లుగా ఉంది. జియో ఆదాయం 9.9శాతం పెరిగి రూ.24,042 కోట్లకు చేరుకుంది. గత ఏడాది క్రితం రూ.21,995 కోట్ల నుంచి రూ.24,127 కోట్లకు పెరిగింది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన ఆదాయం, EBITDA, నికర లాభంలో 3శాతం పెరుగుదదల సాధించామని జియో ట నివేదించింది. కొత్తగా 30.4 లక్షల మంది సబ్స్క్రైబర్లు భారతీయ టెలికాం మార్కెట్‌పై రిలయన్స్ జియో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 2023, ఏప్రిల్ తాజా టెలికాం డేటా ప్రకారం, కంపెనీ 37.9 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది. ఏప్రిల్ 2023లో, రిలయన్స్ జియో 30.4 లక్షల మంది సబ్స్క్రైబర్లను సాధించింది. కాగా జియో ఇటీవల Jio Bharat ఫోన్లను రూ. 999కి ప్రారంభించింది. ఇందులో అపరిమిత వాయిస్ కాల్లు , 14 GB డేటా కోసం చౌకైన రూ. 123 నెలవారీ ప్లాన్‌ను కూడా జోడించింది. '2G ముక్త్ భారత్' పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్లో ఫీచర్ ఫోన్లతో ఇంకా 2 జీలో ఉన్న 250 మిలియన్ల మొబైల్ సబ్స్క్రైబర్లను కొత్త టెక్నాలజీకి మార్చడమే లక్ష్యమని జియో ప్రకటించిన సంగతి తెలిసిందే. (నేను అప్పుడే వార్నింగ్ ఇచ్చా.. ఏఐపై ప్రముఖ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు) -
ట్విట్టర్‌కు కొత్త సవాల్
లండన్: మైక్రోబ్లాగింగ్ యాప్ ట్విట్టర్‌కు కొత్త సవాల్ ఎదురైంది. దాదాపు ట్విట్టర్ లాంటి ఫీచర్లతోనే ప్రత్యర్థి మెటా సంస్థ థ్రెడ్స్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. బుధవారం రాత్రి యాపిల్, గూగుల్ ఆండ్రాయిడ్ యాప్ స్టోర్స్‌లో థ్రెడ్స్ ఉంచారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్ సహా 100 దేశాల వారికి ఇది అందుబాటులోకి వచ్చింది. ప్రారంభించిన మొదటి ఏడు గంటల్లోనే సుమారు కోటి మంది థ్రెడ్స్‌లో చేరారని మెటా సీఈవో జుకర్‌బర్గ్ ప్రకటించడం గమనార్హం. థ్రెడ్స్‌లో లైక్, రిప్లై వంటి వాటికి ప్రత్యేకంగా బటన్లున్నాయి. ఏ పోస్ట్‌కు ఎన్ని లైక్‌లు, రిప్లైలు వచ్చాయో యూజర్లు తెలుసుకోవచ్చు. ఒక పోస్ట్ 500 క్యారెక్టర్స్‌కు మించి ఉండరాదు. ఇదే ట్విట్టర్లో అయితే 280 క్యారెక్టర్లే. ఇన్స్టాగ్రామ్ యూజర్లు తమ అకౌంట్లు, అదే పేర్లతో కొత్త యాప్‌లోనూ కొనసాగవచ్చునని మెటా తెలిపింది. లేకుంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను కొత్తగా ప్రారంభించాల్సి ఉంటుందని పేర్కొంది. కాంట్రాక్ట్స్, బ్రౌజింగ్ అండ్ సెర్చ్ హిస్టరీ వంటి సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని థ్రెడ్స్ సేకరిస్తుందని యాప్‌స్టోర్‌లోని సమాచారం చెబుతోంది. థ్రెడ్స్ రాకపై ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ స్పందించారు. దాదాపు అన్ని ఫీచర్లు ట్విట్టర్‌ను కాపీ కొట్టినట్లుగానే ఉన్నాయని వ్యాఖ్యానించారు. -
జియో దెబ్బకు నష్టాల్లోకి వోడాఫోన్! ఏకంగా..
Reliance Jio: ఏప్రిల్ 2023లో టెలికమ్యూనికేషన్స్ పరిశ్రమలో తన ఆధిపత్య స్థానాన్ని నిలుపుకోవడంలో 'రిలయన్స్ జియో' (Reliance Jio) ముందు వరుసలో నిలిచినట్లు 'టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా' (TRAI) తెలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, రిలయన్స్ జియో 2023 ఏప్రిల్ నెలలో కొత్తగా 3.04 మిలియన్ల సబ్స్క్రైబర్లను పొందగలిగింది. ఇదే సమయంలో భారతి ఎయిర్టెల్ (Bharti Airtel) 76,328 మంది వినియోగదారులను పొందినట్లు తెలిసింది. వోడాఫోన్ ఏకంగా 2.99 మిలియన్ల సబ్స్క్రైబర్లను కోల్పోయింది. కాగా మొత్తం వైర్లెస్ చందాదారుల సంఖ్య మార్చి 2023లో 1,143.93 మిలియన్ల నుంచి ఏప్రిల్ 2023లో 1,143.13 మిలియన్లకు తగ్గింది. దీని ప్రకారం నెలవారీ క్షీణత రేటు 0.07 శాతం. ఈ విషయంలో పట్టణ ప్రాంతాల వారి కంటే గ్రామీణ ప్రాంతాల్లో సంఖ్య పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. (ఇదీ చదవండి: హైలక్స్ కొనుగోలుపై బంపర్ ఆఫర్.. మిస్ చేసుకుంటే మళ్ళీ రాదేమో!) టెలికామ్ రంగంలో ప్రైవేట్ హవా కొనసాగుతోందని స్పష్టంగా తెలుస్తోంది. దాదాపు 90 శాతం వాటా వీరిదే ఉందని తెలుస్తోంది. ఒక్క రిలయన్స్ జియో వాటా 37.9 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఎయిర్టెల్ 32.4 శాతం, వోడాఫోన్ 20.4 శాతంలో వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలు బీఎస్ఎన్ఎల్ (BSNL), ఎమ్టీఎన్ఎల్ (MTNL) వాటా కేవలం 9.2 శాతం కావడం గమనార్హం. రానున్న రోజుల్లో ప్రభుత్వ రంగంలో మరింత తగ్గిపోయే అవకాశాలున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. -
దేశంలో 5జీ హవా.. వేగంగా అభివృద్ధి చెందుతున్న 5జీ మార్కెట్‌గా భారత్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో 2028 చివరి నాటికి మొబైల్ చందాదార్లలో దాదాపు 57 శాతం వాటా 5జీ కైవసం చేసుకోనుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న 5జీ మార్కెట్‌గా భారత్ అవతరిస్తుందని ఎరిక్సన్ మొబిలిటీ నివేదిక వెల్లడించింది. ‘2022 డిసెంబర్ చివరినాటికి దేశంలో 5జీ చందాదార్లు ఒక కోటి ఉన్నట్టు అంచనా. భారత్‌లో 2022 అక్టోబరులో 5జీ సేవలు ప్రారంభం అయ్యాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద భారీ నెట్వర్క్ విస్తరణ జరుగుతోంది’ అని ఎరిక్సన్ నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయంగా 150 కోట్లు.. కొన్ని మార్కెట్లలో భౌగోళిక రాజకీయ సవాళ్లు, స్థూల ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్లు 5జీలో పెట్టుబడులు కొనసాగిస్తున్నారు. 2023 చివరినాటికి ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మొబైల్ చందాదార్లు 5జీ వేదికపైకి రానున్నారు. ఉత్తర అమెరికాలో 5జీ చందాదార్ల వృద్ధి గత అంచనాల కంటే బలంగా ఉంది. ఈ ప్రాంతంలో 2022 చివరి నాటికి 5జీ విస్తృతి 41 శాతం ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ప్రతి స్మార్ట్‌ఫోన్‌కు నెలవారీ అంతర్జాతీయ సగటు డేటా వినియోగం 20 జీబీ కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా’ అని నివేదిక వివరించింది. -
పేటీఎం రీ‘సౌండ్’! భారీగా పెరిగిన సౌండ్ బాక్స్ సబ్స్క్రైబర్లు
డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల కంపెనీ పేటీఎం (Paytm) మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ పేమెంట్ పరికరాల (సౌండ్ బాక్స్‌లు) ఆదాయంలో అదరగొట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మే నెల చివరి నాటికి సౌండ్‌బాక్స్ సబ్స్క్రైబర్ల సంఖ్యను ఏకంగా 118 శాతం పెంచుకుంది. సౌండ్‌బాక్స్, పాయింట్-ఆఫ్-సేల్ (పీవోఎస్) మెషీన్ల వంటి పరికరాల కోసం చందా చెల్లించే వ్యాపారుల సంఖ్య ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలలలో 75 లక్షలకు పెరిగినట్లు ఓ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వన్97 సంస్థ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే ఏప్రిల్, మే నెలల్లో సబ్స్క్రైబర్ల సంఖ్య 34 లక్షలు ఉండేది. ఈ సంవత్సరం మే నెలలోనే 4 లక్షల మంది సబ్స్క్రైబర్లు కొత్తగా చేరడం గమనార్హం. మార్చి త్రైమాసికంతో ముగిసిన 2023 ఆర్థిక సంవత్సరంలో 68 లక్షల మంది సబ్స్క్రైబర్లను సాధించిన పేటీఎం అంతకుముందు ఆర్థక సంవత్సరంలో 29 లక్షల మంది సబ్స్క్రైబర్లను కలిగి ఉండేది. అంటే 134 శాతం వృద్ధిని సాధించింది. మర్చంట్ డిస్కౌంట్ రేటు కాకుండా అదనపు చెల్లింపు మానిటైజేషన్ ఛానెల్‌ని ప్రారంభించడంపై దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో పేటీఎం ఈ వృద్ధిని సాధించింది. మర్చంట్ డిస్కౌంట్ రేటు అంటే వివిధ చెల్లింపు పద్ధతుల ద్వారా డిజిటల్ చెల్లింపులను అంగీకరించినందుకు వ్యాపారుల నుంచి వసూలు చేసే రేటు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పేటీఎం మర్చంట్ చెల్లింపులు 35 శాతం వృద్ధితో రూ. 2.65 లక్షల కోట్లకు పెరిగాయి. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఇవి రూ. 1.96 లక్షల కోట్లుగా ఉన్నాయి. కాగా ఈ సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో పేటీఎం అందించిన రుణాలు రూ. 9,618 కోట్లకు పెరిగాయి. క్రితం ఏడాది ఇవే నెలల్లో రూ. 3,576 కోట్లు ఉండగా 169 శాతం పెరిగాయి. ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలకు షాక్! కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చిన జొమాటో.. -
జియో సినిమా దెబ్బకు హాట్‌స్టార్ విలవిల.. టాటా చెప్పేస్తున్న లక్షల సబ్స్క్రైబర్లు
కొత్తగా వచ్చిన స్ట్రీమింగ్ యాప్ జియోసినిమా (JioCinema) దెబ్బకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney+ Hotstar) విలవిలాడుతోంది. మిలియన్ల కొద్దీ సబ్స్క్రైబర్లను కోల్పోతోంది. జియోసినిమా మార్కెట్లో ప్రజాదరణ పెరుగుతున్న స్ట్రీమింగ్ యాప్‌గా మారింది. 2023 మొదటి త్రైమాసికంలో 10 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లను సంపాదించుకుంది. ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల ఆశలపై నీళ్లు.. బ్యాడ్ న్యూస్ చెప్పిన సత్య నాదెళ్ల వీక్షకుల నుంచి ఈ స్థాయిలో ఆదరణ పెరగడానికి ప్రధాన కారణం ఐపీఎల్ ప్రసారాలను ఉచితంగా అందించడం. ఇదే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఆసియాలో దాని సబ్‌స్క్రైబర్ బేస్ వేగంగా క్షీణించింది. కేవలం మూడు నెలల్లో 4 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లను కోల్పోయింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఏకంగా 8.4 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు హాట్‌స్టార్‌కు బై బై చెప్పేశారు. సబ్స్క్రైబర్లు బై..బై కంపెనీ ఆదాయ నివేదిక ప్రకారం.. 2023 మొదటి త్రైమాసికంలో డిస్నీ ప్లస్ పెయిడ్ సబ్స్క్రైబర్ల సంఖ్య 3.8 మిలియన్లు తగ్గి 57.5 మిలియన్లకు పడిపోయింది. అంతకుముందు త్రైమాసికంలోనూ 4 మిలియన్లకుపైగా సబ్స్క్రైబర్లను కోల్పోయింది. 2023 ఏప్రిల్ 1 నాటికి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 52.9 మిలియన్ల పెయిడ్ సబ్స్క్రైబర్లను కలిగి ఉంది. క్యూ2లో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు ఒక్కో పెయిడ్ సబ్‌స్క్రైబర్ నుంచి సగటు నెలవారీ ఆదాయం 0.74 నుంచి 0.59 డాలర్లు తగ్గింది. జియోసినిమాకు కలిసొచ్చిన ఐపీఎల్ జియో సినిమా విజయానికి అనేక కారణాలున్నాయి. అందులో మొదటిది, ముఖ్యమైనది జియో సినిమా ప్రతిఒక్కరికీ ఉచితం. ఎటువంటి సబ్స్క్రిప్షన్ ఛార్జ్ లేదు. అదే డిస్నీ హాట్‌స్టార్ ను వీక్షించాలంటే సబ్స్క్రిప్షన్ ఛార్జ్ చెల్లించాలి. జియో సినిమా విజయానికి అసలు కారణం ఐపీఎల్ ను ఉచితంగా చూసే అవకాశం. ఏదైనా ఉచితంగా వస్తున్నప్పుడు ఎవరైనా దాని కోసం ఎందుకు చెల్లించాలనుకుంటున్నారు? ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్.. నెలకు రూ. 41 కోట్ల సంపాదన! -
ఫిబ్రవరిలో భారీ ఉపాధి కల్పన!
న్యూఢిల్లీ: రిటైర్మెంట్ ఫండ్ బాడీ– ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) 2023 ఫిబ్రవరి 13.96 లక్షల మంది నికర చందాదారులను నమోదు చేసుకుంది. వీరిలో దాదాపు 7.38 లక్షల మంది మొట్టమొదటిసారి కొత్తగా ఈపీఎఫ్ఓ పరిధిలోనికి వచ్చినవారని కార్మిక మంత్రిత్వశాఖ ప్రకటన ఒకటి తెలిపింది. ప్రకటనలో ముఖ్యాంశాలు.. ► కొత్తగా చేరిన సభ్యుల్లో అత్యధికంగా 2.17 లక్షల మంది సభ్యులు 18–21 ఏళ్ల మధ్య వయస్సు గలవారు. 1.91 లక్షల మంది సభ్యులు 22–25 ఏళ్ల మధ్య వయస్సు గలవారు. ► మొత్తం కొత్త సభ్యులలో 18–25 సంవత్సరాల మధ్య వయస్కులు 55.37 శాతం మంది. దేశంలోని సంఘటిత రంగంలో భారీగా ఉపాధి అవ కాశాలు కలిగినట్లు ఈ సంఖ్య తెలియజేస్తోంది. ► నికర మహిళా సభ్యుల నమోదు 2.78 లక్షలు. ఈ నెలలో నికర సభ్యుల చేరికలో ఇది దాదాపు 19.93%. నికర మహిళా సభ్యుల సంఖ్యలో 1. 89 లక్షల మంది మహిళా సభ్యులు కొత్తగా చేరారు. ► నికర సభ్యుల చేరికలో నెలవారీగా పెరుగుతున్న ధోరణిని చూస్తే, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మొదలైన రాష్ట్రాలు తొలి వరుసలో ఉన్నాయి. ► పరిశ్రమల వారీగా చూస్తే.. నిపుణుల సేవల విభాగం (మానవ వనురుల సరఫరాదారులు, సాధారణ కాంట్రాక్టర్లు, సెక్యూరిటీ సర్వీసెస్, ఇతర కార్యకలాపాలు మొదలైనవి) మొత్తం సభ్యుల చేరికలో 41.17 శాతంగా ఉంది. ► తోలు ఉత్పత్తులు, వస్త్రాల తయారీ, కొరియర్ సేవలను అందించడంలో నిమగ్నమైన సంస్థలు, చేపల ప్రాసెసింగ్, నాన్–వెజ్ ఫుడ్ ప్రిజర్వేషన్ మొదలైన పరిశ్రమలకు సంబంధించి ఈపీఎఫ్ఓలో అధిక నమోదులు ఉన్నాయి. నిరంతర ప్రక్రియ... ఉద్యోగి రికార్డుల నవీకరణ నిరంతర ప్రక్రియ. ఈ ప్రాతిపదికన పేరోల్ డేటాను తాత్కాలికమైనదిగా పరిగణించాలి. మునుపటి డేటా ప్రతి నెలా మారుతుంది. ఏప్రిల్ 2018 నుండి (సెప్టెంబర్ 2017 తరువాత కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటూ) పేరోల్ డేటా విడుదలవుతోంది. ఈపీఎఫ్ఓ తన సభ్యులకు సభ్యులకు ఈపీఎఫ్, ఎంపీ చట్టం, 1952 చట్టం కింద లభించే పలు ప్రయోజనాలను అందించడానికి బాధ్యత వహించే సామాజిక భద్ర తా సంస్థ. ఇది సభ్యులకు వారి పదవీ విరమణపై భవిష్య నిధి, పెన్షన్ ప్రయోజనాలు అలాగే సభ్యు డు అకాల మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు కుటుంబ పెన్షన్, బీమా ప్రయోజనాలను అందిస్తుంది. ఈపీఎఫ్ఓ దాదాపు 7 కోట్ల మందికి పైగా చందాదారులతో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులను కలిగి ఉంది. పటిష్టమైన స్థాయిలో రూ.300 కోట్లకు పైగా మిగులునూ నిర్వహిస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.15 శాతం వడ్డీ రేటు చెల్లించడానికి ఈపీఎఫ్ఓ ఇటీవలే ఆమోదముద్ర వేసింది. డెట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి పొందిన వడ్డీ అలాగే ఈక్విటీ పెట్టుబడుల నుంచి వచ్చిన ఆదాయ అంశాలను పరిగణనలోకి తీసు కుని ఈపీఎఫ్ఓ అత్యున్నత స్థాయి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) వడ్డీరేటును నిర్ణయిస్తుంది. 2015–16లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఈపీ ఎఫ్ఓ ప్రారంభించింది. ఈక్విటీల్లో తన మొత్తం నిధుల్లో 5 శాతంతో ప్రారంభమైన ఈపీఎఫ్ఓ పెట్టుబడులు, ప్రస్తుతం 15 శాతానికి చేరాయి. -
నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు గుడ్ న్యూస్! భారీగా తగ్గిన సబ్స్క్రిప్షన్ చార్జీలు
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ చార్జీలను భారీగా తగ్గించింది. భారత్‌తో పాటు మరో 115 దేశాలలో సబ్స్క్రిప్షన్ చార్జీలను తగ్గిస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. నెట్‌ఫ్లిక్స్ 2021లో భారతదేశంలో తక్కువ-ధర సబ్స్క్రిప్షన్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఇక్కడ కస్టమర్ ఎంగేజ్మెంట్లో 30 శాతం పెరుగుదలను, వార్షిక ఆదాయంలో 24 శాతం పెరుగుదలను నమోదు చేసింది. భారతీయ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన నెట్‌ఫ్లిక్స్ మొదటిసారిగా సబ్స్క్రిప్షన్ చార్జీలను 20 నుంచి 60 శాతం తగ్గించింది. ఇదీ చదవండి: కాగ్నిజెంట్ ఉద్యోగులకు తీపి కబురు.. ఆరు నెలల ముందే జీతాల పెంపు గతంలో నెలకు రూ.199 ఉన్న నెట్‌ఫ్లిక్స్ మొబైల్-ఓన్లీ ప్లాన్ ఇప్పుడు రూ.149లకు తగ్గింది. అలాగే టీవీలు, కంప్యూటర్లు, మొబైల్స్ ఇలా ఎందులో అయినా యాక్సెస్ చేసుకోగలిగే బేస్ సబ్స్క్రిప్షన్ చార్జ్ గతంలో రూ.499 ఉండగా ప్రస్తుతం రూ.199 మాత్రమే. ఆసియా, యూరప్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలోని కొన్ని దేశాల్లో సబ్స్క్రిప్షన్ చార్జీలు తగ్గాయి. పెరుగుతున్న జీవన వ్యయం కారణంగా కుటుంబాలు వినోదాలకు చేసే ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. దీంతోపాటు ప్రత్యర్థి కంపెనీ నుంచి గట్టి పోటీని నెట్‌ఫ్లిక్స్ ఎదుర్కొంటోంది. ప్రస్తుతం చార్జీలు తగ్గించిన దేశాల నుంచి 2022 ఆర్థిక సంవత్సరంలో నెట్‌ఫ్లిక్స్ వచ్చిన ఆదాయం కేవలం 5 శాతం మాత్రమే. ఇదీ చదవండి: Mukesh Ambani Birthday: వ్యాపారంలోకి రాకముందు ముఖేష్ అంబానీ ఏమవ్వాలనుకున్నారో తెలుసా? -
యూట్యూబర్ అదితి అగర్వాల్ సక్సెస్ జర్నీ..మీరు ఫిదా!
సాక్షి, ముంబై: ఇటీవలి కాలంలో దాదాపు ప్రతీ ఇంటికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉందిఅనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఔత్సాహిక టీనేజర్లు,యువభారతం తమ టాలెంట్‌ను నిరూపించుకునేందుకు యూట్యూబ్‌ను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు వంటలు, చిట్కాలు, యోగాలు, కిచెన్ గార్డెనింగ్ దగ్గర్నించి, బిజినెస్, రాజకీయాలు ఇలా పలు కేటగిరీల్లో సక్సెస్ఫుల్ యూటూబర్లుగా లక్షలు, కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఢిల్లీకి చెందిన భువన్ బామ్ నుండి ముంబైకి చెందిన ప్రజక్తా కోలి వరకు అంతర్జాతీయ ఖ్యాతిని పొందారు. అలాంటి వారిలో ఒకరు యూట్యూబర్ అదితి అగర్వాల్. అద్దె ఇంట్లో మొదలు పెట్టిన ప్రయాణంలో ఇపుడు సొంత ఫ్లాట్‌తో పాటు దాదాపు 70 లక్షల మంది మద్దతుతో ఈ స్థాయికి చేరడం వెనుక ఏళ్ల కష్టం ఉంది. యూట్యూబ్‌లో క్రాఫ్టర్ అదితిగా దూసుకుపోతోందిఅదితి అగర్వాల్. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అదితి ప్రయాగ్‌రాజ్‌లోని బాలికల ఉన్నత పాఠశాలలో తన విద్యను పూర్తి చేశాక అలహాబాద్ యూనివర్శిటీ నుండి డిగ్రీని చేసింది. (చిన్న రుణాలనుంచి..వరల్డ్ టాప్ బ్యాంకర్స్‌లో స్థానం దాకా! కిక్ అంటే ఇది!) అదితి ప్రయాణం ఎలా మొదలైంది? ఒక విధంగా చెప్పాలంటే అదితి ప్రయాణం ఎనిమిదో తరగతిలో మొదలైంది. ఊహాత్మకంగా, ఆకర్షణీయంగా కార్డులు తయారు చేయడం అదితికి చాలా ఇష్టం. అలా ఎనిమిదో తరగతిలో ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఆమె ఓ కార్డును రూపొందించింది. అది చూసిన టీచర్లంతా ఫిదా అయిపోయారు. అక్కడనుంచి ప్రేరణకు తోడు 11వ తరగతిలో, అదితికి కార్డ్ ఆర్డర్ వచ్చింది. దానికి ప్రతిఫలంగా తొలి సంపాదనగా 300 రూపా యలుఆర్జించింది. ఇది ఇలా ఉండగా, అదితి తన 12వ తరగతిలో NIFT పరీక్షకు హాజరై 205 మార్కులు సాధించింది, కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా కళాశాలలో చేరలేదు. (ఫోర్బ్స్ బిలియనీర్ కేషుబ్ మహీంద్రా గురించి తెలుసా? ఆనంద్ మహీంద్రకి ఏమవుతారు?) దీంతో తన స్పెషల్ ఇంట్రస్ట్ గిప్ట్స్, కార్డుల మేకింగ్‌లో ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో సోషల్ మీడియాను ఉపయోగించుకుంది. 2015లో ఫేస్బుక్లో అదితి కార్డ్ జోన్ పేజీని ప్రారంభించింది. ఆ మరుసటి రోజే ఆమెకు 800 రూపాయల ఆర్డర్ వచ్చింది. తానే స్వయంగా కార్డులను డెలివరీ చేసింది. ఈ ప్రయాణం అంతఈజీగా ఏమీ సాగలేదు. కానీ పట్టువదలకుండా తన వంతు ప్రయత్నం చేస్తూ పోయింది అదితి. 2017లో తన యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించింది. గ్రాడ్యుయేషన్ చేస్తూనే ప్రతిరోజూ ఆమె ఒక వీడియోను అప్లోడ్ చేసేది. సోదరి సాయంతో వీడియోలను రికార్డ్ చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. మదర్స్ డే , ఫాదర్స్ డే ఇలా ఏ అకేషన్‌ను వదులుకోలేదు. రకారకాల గిఫ్ట్స్, కార్డ్‌లను ఆన్లైన్లో విక్రయించడంతో అదితి వీడియోలను అప్లోడ్ చేసేది. అలా కార్డ్ మేకింగ్ వీడియోను వైరల్ అయింది. దాదాపు 2 లక్షల మందికి పైగా దీన్ని వీక్షించారు. దీంతో మరింత పాపులారీటి పెరిగింది. ఫలితంగా 2018లో లక్షమార్క్‌ను దాటిన అదితి ఛానెల్ సబ్స్క్రైబర్లు 2020 నాటికి 2.60 లక్షలకు చేరుకుంది. ఈ సక్సెస్‌తో 30 ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉన్న తన ఫ్యామిలీకి అదితి 2020లో లక్నోలో రెండు పడకగదుల ఫ్లాట్‌ని కొనుగోలు చేసింది. ఆమె తండ్రి ఒక ప్రైవేట్ ఉద్యోగి. ఈలోపు కరోనా రావడంతో 2021లో లక్నోకి మకాం మార్చింది. అదితి ఛానెల్‌పై కోవిడ్-19 ప్రభావం కరోనా సమయంలో, అదితి ఛానెల్ కంటెంట్‌కు ఆదరణ కాస్త తగ్గింది. దీంతో 2.60 లక్షల మంది సభ్యులు 2.54 లక్షలకు పడిపోయారు. ఈ సమయంలో కాస్త నిరాశ పడినా, ఆ తర్వాత అదితి తన తల్లి సపోర్ట్‌తో ప్రతిరోజూ వీడియోలు అప్లోడ్ చేయాలని నిర్ణయించుకుంది. చివరికి వీడియో ఒకటి వైరల్ కావడంతో కేవలం 15 రోజుల్లో సబ్స్క్రైబర్లు 10 లక్షల మంది చేరారు. ప్రస్తుతం అదితి యూట్యూబ్ ఛానెల్లో దాదాపు 7 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లుండటం విశేషం. ఈ రోజు సంపాదన 6 అంకెలలో. అదితికి ఇన్‌స్టాగ్రామ్‌లో 5.9 లక్షల మంది, ఫేస్బుక్లో 2.90 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. రేసు గుర్రంలా పరిగెట్టాల్సిందే యూట్యూబర్ కావాలనుకునే వారికి టిప్స్ ఇస్తూ..సక్సెస్ రావాలంటే లాంగ్ రేసు తప్పదని, చాలామందికి సడెన్‌గా సక్సెస్ వచ్చినా మాయమైపోతుందని, దాన్ని నిలుపు కోవడం ముఖ్యమని సూచిస్తుంది. అందుకే రేసు గుర్రంలా మారితే గొప్ప విజయాన్ని అందుకోలేమని చెబుతుంది అదితి. తనకు కూడా సక్సెస్ రావడానికి ఆరేళ్లు పట్టిందంటూ తన జర్నీని గుర్తు చేసుకుంది. (సర్కార్ కొలువుకు గుడ్‌బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?) YouTube ప్రశంసలు అనేక ఈవెంట్లకు ఆహ్వానం అదితి విజయాన్ని యూట్యూబ్ కూడా ప్రశంసించింది. DIY ఈవెంట్‌కి ఆహ్వానాన్ని అందుకుంది. ఇంకా మెటా అనేక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం వచ్చింది. -
నీ బ్యాడ్జ్ బంగారం గానూ! ట్విటర్ గోల్డ్ టిక్ కావాలంటే అంతా?
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సంస్థ ట్విటర్.. వ్యాపార సంస్థల ఖాతాలకు ఇచ్చే వెరిఫైడ్ గోల్డ్ బ్యాడ్జ్ ద్వారా ఒక్కో దానిపై నెలకు 1,000 డాలర్లు (రూ.83,000) వసూలు చేయబోతోంది. దీనికి మరో 50 డాలర్లు (రూ.4,000) అదనం. ఇదీ చదవండి: Physics Wallah Viral Video: బోరుమన్న ఫిజిక్స్ వాలా మాజీ టీచర్లు! నాటకం బాగుందన్న నెటిజన్లు! ఏప్రిల్ 1 నుంచి ట్విటర్ కొత్త వెరిఫికేషన్ స్కీమును అమలు చేయబోతోంది. ఈ మేరకు తాజాగా కొత్త వెరిఫికేషన్ స్కీమును కంపెనీ ఆవిష్కరించింది. వ్యాపార సంస్థలకు ఇచ్చే గోల్డ్ బ్యాడ్జ్‌లకు సంబంధించిన ప్రణాళికను గత డిసెంబర్లోనే ట్విటర్ ప్రకటించింది. ఇదీ చదవండి: Get 1 Electric Scooter: రూ.38 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. భారీ డిస్కౌంట్! వెరిఫైడ్ సంస్థల ఉద్యోగులకు చెందిన వెరిఫైడ్ వ్యక్తిగత ఖాతాలు కొనసాగుతాయని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. సంస్థలకు సంబంధించిన ఖాతాల వెరిఫికేషన్ (గతంలో బ్లూ ఫర్ బిజినెస్ అనే పిలిచేవారు) ప్రక్రియను త్వరలో వెల్లడిస్తామన్నారు. ఇదీ చదవండి: ఇంట్లో ఎక్కువ డబ్బు పెట్టుకుంటున్నారా.. ఏమవుతుందో తెలుసా? -
117 కోట్లకు టెలికం చందాదారులు
న్యూఢిల్లీ: దేశంలో టెలికం చందారుల సంఖ్య గతేడాది ముగింపునకు 117 కోట్లు దాటింది. కొత్త చందాదారులను ఆకర్షించడంలో ఎప్పటి మాదిరే 2022 డిసెంబర్ నెలలోనూ రిలయన్స్ జియో, ఎయిర్టెల్ మంచి పనితీరును చూపించాయి. రిలయన్స్ జియో 17 లక్షల కొత్త కస్టమర్లను సంపాదించగా, భారతీ ఎయిర్టెల్ 15.2 లక్షల కొత్త కస్టమర్లను చేర్చుకున్నట్టు ట్రాయ్ నివేదిక వెల్లడించింది. ఇక మరో ప్రైవేటు టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ) 24.7 లక్షల కస్టమర్లను డిసెంబర్ నెలలో నష్టపోయింది. మొబైల్ చందాదారుల సంఖ్య 2022 నవంబర్ నాటికి 1,143.04 మిలియన్లుగా ఉంటే, డిసెంబర్ చివరికి 1,142.93 మిలియన్లకు తగ్గింది. వైర్‌లైన్ సబ్‌్రస్కయిబర్లు డిసెంబర్ చివరికి 2.74 కోట్లకు పెరిగారు. వైర్‌లైన్ విభాగంలో రిలయన్స్ జియో 2,92,411 మంది కొత్త కస్టమర్లు సంపాదించింది. భారతీ ఎయిర్టెల్ 1,46,643 మంది కస్టమర్లను సొంతం చేసుకుంది. ప్రభుత్వరంగ ఎంటీఎన్ఎల్ 1.10 లక్షల మంది వైర్‌లైన్ సబ్ర్‌స్కయిబర్లను కోల్పోయింది. టెలికం సేవల్లో ఇప్పటికీ సమస్యలే.. లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడి దేశంలో టెలికం వినియోగదారులు నేటికీ సేవలు పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కాల్స్డ్రాప్, కాల్ కనెక్టింగ్ సమస్యలు వారిని వేధిస్తున్నాయి. లోకల్‌సర్కిల్స్ ఇందుకు సంబంధించి చేసిన ఆన్లైన్ సర్వేలో ఈ వివరాలు తెలిశాయి. 28 శాతం మంది కస్టమర్లు తాము ఎలాంటి అవాంతరాల్లేని 4జీ, 5జీ సేవలు ఆనందిస్తున్నట్టు చెప్పగా.. 32 శాతం మంది తాము డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ అన్ని వేళల్లోనూ అంతరాయాల్లేని సేవలను పొందలేకపోతున్నట్టు తెలిపారు. 69 శాతం మంది తాము కాల్ కనెక్షన్/కాల్ డ్రాప్ సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా 42,000 మంది నుంచి ఈ అభిప్రాయాలను లోకల్‌సర్కిల్స్ తెలుసుకుంది. కాల్ కనెక్షన్, కాల్ డ్రాప్‌పై సంధించిన ప్రశ్నకు 10,927 మంది స్పందించారు. వీరిలో 26 శాతం మంది తాము నివసించే ప్రాంతంలో ఎయిర్టెల్, జియో, వొడాఐడియా సేవలు మంచి కవరేజీతో ఉన్నట్టు చెప్పగా.. 51 శాతం మంది కవరేజీ సమస్యలను ఎదుర్కొంటున్నట్టు పేర్కొన్నారు. -
Disney layoffs: 7వేల మందిని తొలగించిన డిస్నీ.. కారణం ఇదే..
ప్రపంచవ్యాప్తంగా అన్ని కంపెనీలను ఆర్థిక మాంద్య భయాలు పడీస్తున్నాయి. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు చాలా కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగించుకుంటున్నాయి. లేఆఫ్స్ బాట పట్టిన యూఎస్ టెక్ కంపెనీల సరసన ప్రముఖ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ డిస్నీ నిలిచింది. 7 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తాజాగా తెలిపింది. గతేడాది సీఈఓ బాబ్ ఇగర్ తిరిగి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన తీసుకున్న సంచలన నిర్ణయం ఇది. ‘‘ఇది తేలిగ్గా తీసుకున్న నిర్ణయం కాదు.. ప్రపంచవ్యాప్తంగా అంకిత భావంతో పనిచేస్తున్నప్రతిభావంతులైన మా ఉద్యోగులపై నాకు గౌరవం, అభిమానం ఉన్నాయి’’ అని త్రైమాసిక ఫలితాల వెల్లడి అనంతరం తనతో మాట్లాడిన విశ్లేషకులతో సీఈఓ బాబ్ ఇగర్ ఇలా వ్యాఖ్యానించారు. 2021 వార్షిక నివేదిక ప్రకారం.. ఆ ఏడాది నవంబర్ 2 నాటికి డిస్నీ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 1.90 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 80 శాతం మంది శాశ్వత ఉద్యోగులు. తగ్గిపోయిన సబ్స్క్రైబర్లు డిస్నీ ప్లస్‌కు సబ్స్క్రైబర్ల సంఖ్య ఇటీవల గణనీయంగా తగ్గిపోయింది. అంతకు ముందు త్రైమాసికంతో పోల్చుకుంటే గతేడాది డిసెంబర్ 31 నాటికి చందాదారుల సంఖ్య 1 శాతం తగ్గి 168.1 మిలియన్లకు పడిపోయింది. దీంతో కాస్ట్ కటింగ్‌పై దృష్టి పెట్టిన యాజమాన్యం 7వేల మందిని తొలగించేందుకు సిద్ధమైంది. అయితే గడిచిన త్రైమాసికంలో విశ్లేషకులు ఊహించినదాని కంటే మెరుగ్గా డిస్నీ గ్రూప్ 23.5 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదు చేసింది. (ఇదీ చదవండి: మేనేజర్లు అయితే ఏంటీ.. పనిచేయకపోతే రాజీనామా చేయండి: జుకర్‌బర్గ్) -
అమెజాన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే కొత్త ప్లాన్, ప్రైమ్ కంటే చవక!
కరోనా తర్వాత ఓటీటీ చూసేవారి సంఖ్య భారీగానే పెరిగింది. దీంతో ప్రముఖ సంస్థలన్నీ కంటెంట్‌తో కస్టమర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో పలు కంపెనీలు తమ నెల, వార్షిక, ప్లాన్ల ధరలను పెంచిన సంగతి తెలిసిందే. అయితే ఓటీటీ వాసులు మాత్రం క్వాలిటీ కంటెంట్‌తో పాటు కాస్త కాస్ట్ తక్కువ ఉండే వాటి వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఓటీటీ సంస్థలు కాస్త తక్కువ ధరలో ప్లాన్లను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ కస్టమర్ల కోసం అమెజాన్ ప్రైమ్ లైట్ (Amazon prime Lite) పేరిట ఓ కొత్త ప్లాన్‌ని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. చవకైన ప్లాన్.... అమెజాన్ ఐడియా అదిరింది అమెజాన్ ప్రైమ్.... షాపింగ్, ప్రైమ్ వీడియో, మ్యూజిక్, ఇ-బుక్స్ ఇలా అన్నింటికీ కలిపి ప్రైమ్ సబ్స్క్రిప్షన్ (Amazon prime) అందిస్తున్న తెలిసిందే. గతంలో తన వార్షిక ప్లాన్ ధరను రూ. 999 నుంచి రూ. 1499కి పెంచేసింది. ఇప్పటికే మార్కెట్లో ప్రత్యర్థి కంపెనీలతో పోటీ తీవ్రంగా ఉండడంతో పాటు తమ ధరల పెంపు కూడా అమెజాన్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. దీంతో తమ వినియోగదారుల కోసం అమెజాన్ ప్రైమ్ లైట్ (Amazon prime Lite) పేరిట వార్షిక ప్లాన్‌ను రూ.999కే తీసుకురానుంది. అంటే నెట్‌ఫ్లిక్స్ తర్వాత, అమెజాన్ ప్రైమ్ చౌకైన, యాడ్-సపోర్టెడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అమెజాన్ ప్రైమ్ తరహాలోనే లైట్‌లోనూ కొన్ని మినహాయింపులతో దాదాపు అవే సదుపాయాలను అందించబోతున్నారు. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉన్న ఈ వెర్షన్‌ను, ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంచింది. అనంతరం దశలవారీగా భారత్‌లో యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మ్యూజిక్, బుక్స్, గేమ్స్ అవసరం లేదనుకునేవారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. ఈ రెండూ కాకుండా అమెజాన్ ఏడాదికి రూ.599కే ప్రైమ్ వీడియో మొబైల్ ప్లాన్ అందిస్తోంది. ఇందులో ఎస్డీ క్వాలిటీలో వీడియోలు చూసేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇతర సదుపాయాలేవీ ఉండవు. అమెజాన్ ప్రైమ్ యూజర్లకు సేమ్ డే డెలివరీ, వన్ డే డెలివరీ సదుపాయం ఉంది. అయితే త్వరలో రాబోతున్న లైట్ యూజర్లకు మాత్రం ఈ సదుపాయం ఉండదు. ఫ్రీ డెలివరీ, రెండ్రోజుల స్టాండర్డ్ డెలివరీ సదుపాయం మాత్రమే ఉంటుంది. చదవండి: కొత్త ఏడాదిలో కస్టమర్లకు షాక్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వ రంగ బ్యాంక్! -
కొత్త ఏడాదిలో యూజర్లకు షాక్.. ఆ ఓటీటీ పాస్వర్డ్ షేర్ చేస్తే పైసలు కట్టాలి!
కరోనా లాక్డౌన్ కారణంగా ఓటీటీ చూసే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఇది వందల కోట్ల నుంచి వేల కోట్ల మార్కెట్‌గా అవతరించింది. ఇందులో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ అత్యంత జనాదరణ పొందడంతో పాటు కాస్త ఖరీదైన ఓటీటీగా పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. కొత్త సంవత్సరంలో నెట్‌ఫ్లిక్స్ తన కస్టమర్లకు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. యూజర్లకు షాక్.. నో షేరింగ్ సంవత్సరాలుగా, నెట్‌ఫ్లిక్స్ తన చందాదారులను కోల్పోవడానికి పాస్వర్డ్ షేరింగ్ ప్రధాన కారణాలలో ఒకటిగా పేర్కొంది. ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ ఒక ఇంటిని దాటి పాస్వర్డ్ షేరింగ్‌ను నిలిపివేయడం ద్వారా ఈ సమస్యకు ముగింపు పలకాలని యోచిస్తోందట. ఓటీటీ సంస్థలు ఇప్పటి వరకు పాస్ వర్డ్ షేరింగ్ అవకాశాన్ని కల్పించాయి. ఒకరికి అకౌంట్ ఉంటే సుమారు నలుగురు పాస్ వర్డ్ షేర్ చేసుకునే అవకాశం ఉండేది. ఒక్కరు రీఛార్జ్ చేసుకుంటే మిగతా వారంతా ఉచితంగా కంటెంట్ ను చూసే అవకాశం ఉంటుంది. అయితే, ఇకపై పాస్ వర్డ్ షేరింగ్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ పాస్వర్డ్ షేరింగ్‌పై నిషేధానికి సంబంధించిన కొత్త విధానాన్ని 2023 లోపు యునైటెడ్ స్టేట్స్లో అమలు చేయనుంది. ఆ తర్వాత ఈ రూల్‌ని మిగిలిన దేశాలకు అమల్లోకి తీసుకురావాలిని నెట్‌ఫ్లిక్స్ భావిస్తోంది. ఇదిలా ఉండగా.. పాస్వర్డ్ షేరింగ్ బ్యాన్ కాకుండా, నెట్‌ఫ్లిక్స్ కొత్త నియమాన్ని కూడా అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యూజర్లు వారి సబ్‌స్క్రిప్షన్‌ను ఉపయోగించి పే-పర్-వ్యూ కంటెంట్‌ను అద్దెకు తీసుకునేలా వీలు కల్పిస్తుంది. వీటితో పాటు నెట్‌ఫ్లిక్స్ అతి త్వరలోనే ప్రకటన-ఆధారిత సబ్స్క్రిప్షన్ ప్యాకేజీని ప్రారంభించే ప్లాన్‌లో ఉంది. దీని ట్రయల్స్ 2023లో మొదలుపెట్టేందుకు యోచిస్తోంది. నెట్‌ఫ్లిక్స్( Netflix ), అమెజాన్ ప్రైమ్ (Amazon Prime), హెచ్‌బీఓ (HBO) వంటి ఓటీటీ ప్లాట్‌ఫాంలు ఇప్పటికే యునైటెడ్ కింగ్డమ్లో పాస్వర్డ్ షేరింగ్ చట్టవిరుద్ధం అని, ఇది తమ కాపీరైట్ చట్టానికి విరుద్ధమని పేర్కొన్నాయి. మరో వైపు నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ రేటు కూడా గణనీయంగా పడిపోయింది. దీంతో నెట్‌ఫ్లిక్స్ యూజర్లుకు తమ పాస్‌వర్డ్‌లను ఇతరులతో షేరింగ్ చేసుకునే వెసలుబాటును నిలిపేవేయనుంది. చదవండి: అవును.. కొత్త ఏడాది కలిసొచ్చే కాలమే, ఎందుకో తెలుసా? -
మీడియా@65 బిలియన్ డాలర్లు!
న్యూఢిల్లీ: దేశీ మీడియా, వినోద (ఎంఅండ్‌ఈ) పరిశ్రమ 2030 నాటికి 55–65 బిలియన్ డాలర్లకు చేరనుంది. ఓటీటీ, గేమింగ్ విభాగాలు ఇందుకు ఊతంగా ఉండనున్నాయి. పరిశ్రమల సమాఖ్య సీఐఐ, కన్సల్టెన్సీ సంస్థ బీసీజీ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం ఎంఅండ్‌ఈ రంగం 2022లో 27–29 బిలియన్ డాలర్లుగా ఉండనుంది. ‘పటిష్టమైన వృద్ధి చోదకాలు ఉన్నందున 2030 నాటికి పరిశ్రమ 55–65 బిలియన్ డాలర్లకు చేరవచ్చు. 65–70 బిలియన్ డాలర్లకు కూడా చేరే సామర్థ్యాలు ఉన్నాయి. ఓటీటీ, గేమింగ్ విభాగాల వృద్ధి ఇందుకు తోడ్పడనుంది‘ అని నివేదిక పేర్కొంది. టెక్నాలజీ పురోగతి, వినియోగదారుల ధోరణుల్లో మార్పులతో మీడియాలోని కొన్ని విభాగాల్లో వేగంగా మార్పులు చోటు చేసుకున్నాయని.. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇది ఎక్కువగా ఉందని తెలిపింది. పరిశ్రమ ‘బూమ్‘కు డిజిటల్ వీడియో, గేమింగ్ సెగ్మెంట్లు దోహదపడుతున్నాయని నివేదిక వివరించింది. దీని ప్రకారం ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల జోరుతో 2022లో మొత్తం మీడియా వినియోగంలో వీటి వాటా 40%గా ఉంది. డిజిటల్.. డిజిటల్.. మిగతా సెగ్మెంట్ల కన్నా ఎక్కువగా డిజిటల్ వినియోగం వృద్ధి చెందుతోంది. 2020–2022 మధ్య కాలంలో భారత ఎంఅండ్‌ఈ పరిశ్రమ దాదాపు 6 బిలియన్ డాలర్ల మేర వృద్ధి చెందగా, ఇందులో మూడింట రెండొంతుల వాటా డిజిటల్‌దే కావడం గమనార్హం. నివేదిక ప్రకారం సబ్స్క్రిప్షన్ వీడియో ఆన్ డిమాండ్ (ఎస్‌వీవోడీ) చందాలు 2022లో 8–9 కోట్ల మేర పెరగవచ్చు. ప్రస్తుతం ప్రీమియం, ప్రత్యేకమైన కంటెంట్ కోసం చెల్లించడానికి యూజర్లలో మరింత సుముఖత పెరుగుతోంది. 2030 నాటికి మొత్తం ఓటీటీ ఆదాయంలో ఎస్‌వీవోడీ వాటా 55–60%గా ఉండనుంది. పరిశ్రమపై కొత్త ధోరణులు దీర్ఘకాలిక ప్రభావాలు చూపనున్నాయి. మెటావర్స్ మొదలైన టెక్నాలజీల వినియోగం .. గేమింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా మిగతా రంగాల్లోకి గణనీయంగా విస్తరించనుంది. చదవండి: ‘గూగుల్ పే.. ఈ యాప్ పనికి రాదు’ మండిపడుతున్న యూజర్లు, అసలేం జరిగింది! -
జొమాటో యూజర్లకు గుడ్ న్యూస్!
ప్రముఖ ఫుడ్ ఆగ్రిగేటర్ జొమాటో కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఇటీవల జొమాటో ప్రో అండ్ ప్రో ప్లస్ స్కీమ్‌ను నిలిపివేసింది. తాజాగా ఆఫర్ స్కీమ్ స్థానంలో ‘లాయల్టీ ప్రోగ్రామ్’ను అందించనున్నట్లు జొమాటో సీఎఫ్‌వో అక్షాంత్ గోయల్ తెలిపారు. ఇటీవల జొమాటో జులై - సెప్టెంబర్ వార్షిక ఫలితాల్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా..యాప్‌లో ఆర్డర్ ఫీచర్‌పై యూజర్ల నుంచి ఫిర్యాదులు అందాయని అక్షాంత్ గోయల్ చెప్పారు.అందుకే కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా యాప్‌ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకోసం జొమాటో ప్రో అండ్ ప్రో ప్లస్ స్కీమ్‌ను నిలిపివేసి.. ఆ స్థానంలో కస్టమర్లకు డిస్కౌంట్ ఇచ్చేలా లాయల్టీ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. మరి ఆ లాయల్టీ ప్రోగ్రాం వల్ల కస్టమర్లు ఎలాంటి లబ్ధి పొందనున్నారు? ఆ స్కీమ్ ఎలా ఉంటుందనే అంశంపై జొమాటో ప్రతినిధులు స్పష్టత ఇవ్వలేదు. స్విగ్గీలో మరో ఫుడ్ ఆగ్రిగేటర్ స్విగ్గీ లాయల్టీలో స్కీమ్ కింద స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్ ఆర్డర్లపై కస్టమర్లకు సంస్థ నిర్దేశించిన దూరం వరకు అన్ లిమిటెడ్ ఫ్రీ డెలివరీలు అందించనుంది. దీంతో పాటు పెయిడ్ సబ్స్క్రిప్షన్ కోసం అదనపు సౌకర్యాలు అందించేందుకు 3నెలల సబ్స్క్రిప్షన్ కింద రూ.399, 12నెలల సబ్ స్క్రిప్షన్ కింద రూ. 899 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే సబ్ స్క్రిప్షన్ మోడల్‌ను ( జొమాటో ప్రో అండ్ ప్రో ప్లస్ స్కీమ్) జొమాటో తొలగించిన విషయం తెలిసిందే. -
బిగ్ షాక్: ఈ ఓటీటీ అకౌంట్ పాస్వర్డ్ షేర్ చేయాలంటే, పైసలు కట్టాల్సిందే!
గత సంవత్సర కాలంగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ గడ్డు కాలాన్ని చవి చూస్తోంది. కరోనా కారణంగా ఓటీటీ మార్కెట్ పుంజుకున్న, నెట్‌ఫ్లిక్స్ మాత్రం సబ్స్క్రైబర్లను పోగొట్టుకుంటూ డీలా పడింది. కొనసాగుతున్న ప్రతికూల ఆర్థిక పరిస్థితులు, OTTలో పెరుగుతున్న పోటీ, నెట్‌ఫ్లిక్స్‌లో ప్లాన్ల చార్జీలు అధికంగా ఉండడం కారణంగా ఇప్పటికే లక్షల్లో సబ్‌స్క్రైబర్లును కోల్పోయింది. అయితే దీని వెనుక ప్రధాన కారణాన్ని కనుగోంది. అదే యూజర్ అకౌంట్ పాస్వర్డ్ షేరింగ్. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు సరికొత్త ప్లాన్‌ని తీసుకురాబోతోంది. అదనపు చార్జ్ కట్టాల్సిందే! గతంలో నెట్‌ఫ్లిక్స్ యూజర్లు ఒక అకౌంట్‌కి నగదు చెల్లించి ఆ పాస్వర్డ్ ఇతరులకు షేర్ చేసేవాళ్లు. ఇకపై అలా కుదరదు. కస్టమర్లు తమ అకౌంట్లను ఇతర యూజర్లతో పంచుకోవాలంటే అదనపు ఛార్జీని చెల్లించాల్సి ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ నిర్ణయం 2023 నాటికి అమలులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే సబ్స్క్రైబర్లు తమ అకౌంట్ పాస్‌వర్డ్‌లను ఇతర వినియోగదారులతో షేరింగ్ కోసం ఎంత ఛార్జీ చెల్లించాలనే విషయాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. సమాచారం ప్రకారం నెట్‌ఫ్లిక్స్ వసూలు చేసే అదనపు రుసుము $3 నుంచి $4 మధ్య ఉండబోతుంది. కాస్త ఊపిరి పీల్చుకున్న నెట్‌ఫ్లిక్స్ నెట్‌ఫ్లిక్స్ మార్చి త్రైమాసికంలో దాదాపు 200,000 మంది, జూన్ త్రైమాసికంలో దాదాపు 970,000 మంది సబ్‌స్క్రైబర్ కోల్పోయినట్లు తెలిపింది. అయితే, మూడవ త్రైమాసిక ఆదాయ నివేదికలో, 2.41 మిలియన్ల సబ్స్క్రైబర్లను పొందినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో కస్టమర్ల సంఖ్యను పెంపుతో పాటు ఆదాయాన్ని మరింత పెంచుకోవడానికి, ఇటీవలే చౌకైన యాడ్-సపోర్టెడ్ ప్లాన్లను కూడా ప్రకటించింది. తాజాగా 2022 మూడో త్రైమాసికంలో 2.4 మిలియన్ల కొత్త సబ్స్క్రైబర్లు రావడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది. చదవండి: బ్యాంక్ కస్టమర్లకు ఊహించని షాక్.. ఈ లావాదేవీలపై.. -
యూజర్లకు బంపరాఫర్.. రూ.10కే మూడు నెలల సబ్స్క్రిప్షన్!
యూట్యూబ్(Youtube).. అటు ఆన్లైన్ ఇటు ఆఫ్‌లైన్ ఎక్కడ విన్నా ఈ పేరే వినపడుతోంది. విభిన్నమైన కంటెంట్లతో పాటు తమలోని టాలెంట్‌ని ప్రదర్శించేందుకు అనువైన వేదికగా మారింది యూట్యూబ్. అందుకే పిల్లలు, టీనేజర్లు అనే తేడాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలను తన వైపు తిప్పుకున్న అతిపెద్ద వీడియో ప్లాట్‌ఫాంగా అవతరించింది. ప్రస్తుతం ఈ ప్రముఖ సంస్థ తన యూజర్ల కోసం వెల్కమ్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. అది కూడా కేవలం పది రూపాయలకే యూట్యూబ్ ప్రీమియం మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌ను ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ ఎంతకాలం అందుబాటులో ఉంటుందో కంపెనీ వెల్లడించలేదు. దీంతో ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. రూ.10కే మూడు నెలల సబ్స్క్రిప్షన్ యూట్యూబ్‌లో మనకి కావాల్సిన వీడియోలను వీటితో పాటు పలు సర్వీస్‌లు కూడా ఉచితంగా చూసే వెసలుబాటు కల్పిస్తోంది. కానీ యూట్యూబ్ ప్రీమియం (YouTube Premium) అనేది సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే నగదు చెల్లిస్తేనే ఈ సేవలను పొందగలం. ఇందులో యాడ్-ఫ్రీ వీడియో ఎక్స్ ఫీరియన్స్, వీడియోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియోలను ఆఫ్‌లైన్‌లో ప్లే చేయడం, బ్యాక్‌గ్రౌండ్‌లో వీడియోలను ప్లే చేయడం, YouTube Musicకు మెంబర్షిప్ వంటి అనేక ఇతర ఫీచర్లను YouTube Kids యాప్‌పై అందిస్తుంది. ప్రస్తుతం యూట్యూబ్ ప్రకటించిన ఆఫర్ ప్రకారం ఈ సేవలన్నీ కేవలం పది రూపాయలకే మూడు నెలల పాటు పొందచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏమిటంటే, YouTube తీసుకొచ్చిన ఈ ఆఫర్ మొదటిసారిగా యూట్యూబ్ రెడ్ (YouTube Red), మ్యూజిక్ ప్రీమియం (Music Premium), యూట్యూబ్ ప్రీమియం (YouTube Premium), గూగుల్ ప్లే (Google Play) సబ్స్క్రైబర్లకు మాత్రమే చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. ఈ ఆఫర్ కాలం పూర్తయిన తర్వాత యూట్యూబ్ ప్రీమియం ఫీచర్లను పొందాలంటే నెలకు రూ.129 చెల్లించాలి. మరో విషయం ఏమిటంటే రూ.10 ఆఫర్ ముగియడానికి 7 రోజుల ముందు సబ్‌స్క్రైబర్‌కు YouTube గుర్తుచేస్తుంది, తద్వారా వారు సభ్యత్వాన్ని కొనసాగిస్తారా లేదా నిలిపివేస్తారా అనేది వారే నిర్ణయించుకోవచ్చు. చదవండి: భారత్‌లో తొలిసారి, కొత్త వాషింగ్ మెషీన్ వచ్చిందోచ్.. నోటితో చెప్తే ఉతికేస్తుంది! -
జూలైలో 18 లక్షల మందికి ఉపాధి
న్యూఢిల్లీ: సంఘటిత రంగంలో కొత్తగా 18.23 లక్షల మందికి జూలైలో ఉపాధి లభించింది. ఇంత మంది సభ్యులు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పేరోల్‌లో సభ్యులుగా చేరారు. ఈ మేరకు గణాంకాలను కేంద్ర కార్మిక శాఖ మంగళవారం విడుదల చేసింది. 2021 జూలై నెలకు సంబంధించి కొత్త సభ్యుల సంఖ్యతో పోలిస్తే 25 శాతం వృద్ధి ఉన్నట్టు తెలిపింది. ఇక జూలైలో కొత్త సభ్యులు 18.23 లక్షల మందిలో నికరంగా మొదటిసారి ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చిన వారు 10.58 లక్షలుగా ఉన్నారు. మిగిలిన వారు ఒక సంస్థలో ఉద్యోగం మానేసి, మరో సంస్థలో చేరిన వారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈపీఎఫ్‌వో సభ్యుల చేరికలో వృద్ధి కనిపిస్తూనే ఉంది. కొత్త సభ్యుల్లో 57.69 శాతం మంది 18–25 వయసులోని వారున్నారు. మహిళా సభ్యుల సంఖ్య 4.06 లక్షలుగా ఉంది. 2021 జూలైలో మహిళా సభ్యుల చేరికతో పోలిస్తే 35 శాతం పెరిగింది. జూలైలో మొత్తం కొత్త సభ్యుల్లో మహిళల శాతం 27.54 శాతంగా ఉంది. గడిచిన 12 నెలల్లోనే ఇది అత్యధికం. సంఘటిత రంగంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నికర సభ్యుల చేరిక పెరిగింది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల నుంచే 12.46 లక్షల మంది సభ్యులు చేరడం గమనార్హం. మొత్తం సభ్యుల చేరికలో ఈ రాష్ట్రాల వాటా 68 శాతంగా ఉంది. చదవండి: India WinZo: ఇది కేవలం కొందరి కోసం.. గూగుల్ పాలసీ సరికాదు -
పాపం నెట్‌ఫ్లిక్స్..లక్షల మంది సబ్ స్క్రయిబర్స్ గుడ్‌బై
నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో తన ఉనికిని కోల్పోతుందా? అనాలోచితమైన నిర్ణయాల కారణంగా లక్షల సంఖ్యలో సబ్ స్క్రైబర్లు ప్రత్యామ్నాయ ఓటీటీల వైపు మొగ్గు చూపుతున్నారా? నెట్ ఫ్లిక్స్ చరిత్రలోనే తొలిసారి భారీ ఎత్తున యూజర్లు తగ్గిపోయారా? అంటే అవుననే అంటున్నాయి తాజాగా ఆ సంస్థ విడుదల చేసిన క్యూ2 ఫలితాలు. నెట్‌ఫ్లిక్స్ వరుసగా రెండు త్రైమాసికాల ఫలితాలు నిరాశ పరుస్తున్నాయి. కంపెనీ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా క్యూ2లో సుమారు 10లక్షల మంది (970,000) మంది కోల్పోయారు. క్యూ1లో 20లక్షల మంది సబ్ స్క్రైబర్లను చేజార్చుకోవగా..క్యూ2 లో 9,70,000మంది సబ్ స్క్రైబర్లు ప్రత్యామ్నాయ ఓటీటీలను వీక్షించేందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. నెట్‌ఫ్లిక్స్ కు సుమారు 220.67మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. అయితే స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 వ్యాల్యూమ్ 1,2, బెటర్ కాల్ సియో, పీకీ బ్లైండర్స్ వంటి పాపులర్ షోస్‌తో క్యూ3 ఫలితాల సమయానికి ఆ సంఖ్య మరో మిలియన్‌కు పెరుగుతుందని నెట్‌ఫ్లిక్స్ భావిస్తుంది. కారణం అదేనా నెట్‌ఫ్లిక్స్ తన త్రైమాసిక నివేదికలో, "ఏప్రిల్ ఫలితాల్లో అమెరికన్ డాలర్లతో పోటీ పడుతూ ఇతర దేశాలకు చెందిన కరెన్సీ విలువలు పెరగడం కారణంగా మాకొచ్చే ఆదాయాల్లో వ్యత్యాసం కనిపిస్తుందని నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. అయితే సబ్స్క్రైబర్ల సంఖ్యను కోల్పోవడంపై ఆ సంస్థ ప్రతినిధులు స్పందించలేదు. కానీ నెట్‌ఫ్లిక్స్ 'యాడ్ ఎక్స్ట్రా మెంబర్',ఫ్రీ పాస్వర్డ్ షేరింగ్ పేరుతో కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులో తీసుకొస్తుంది. ఆ ఫీచర్ల సాయంతో యూజర్ల నుంచి అదనపు ఛార్జీలను వసూలు చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాలపై యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లను వినియోగిస్తున్నారంటూ వెలుగులోకి వచ్చిన పలు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు భారీ షాక్..ఈ సారి మరో కొత్త దందా!
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ తీరు మార్చుకోవడం లేదు. ఫ్రీ పాస్వర్డ్ షేరింగ్ పేరుతో కొత్త దందా తెరతీయడంతో స్క్రైబర్లను కోల్పోయింది. భారీ నష్టాల్ని కొని తెచ్చిపెట్టుకుంది. అయినా ఆ సంస్థ తీరు మార్చుకోవడం లేదు. ఈ సారి సబ్ స్క్రైబర్ల నుంచి అదనపు ఛార్జీలు వసూలు వేసేందుకు మరో కొత్త ఎత్తుగడ వేసింది. నెట్‌ఫ్లిక్స్ ఇటీవల 'యాడ్ ఎక్స్ట్రా మెంబర్' అనే కాన్సెప్ట్ పేరుతో కొత్త ఆప్షన్‌ను అందుబాబులోకి తెచ్చింది. నెట్‌ఫ్లిక్స్ యూజర్లు వారి అకౌంట్‌ను ఇంటి కుటుంబ సభ్యులు కాకుండా బయటి వ్యక్తులు ఓపెన్ చేసి చూడాలంటే అందుకు అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ చీలి, కోస్టారికా, పేరు దేశాల్లో ట్రయల్స్ నిర్వహిస్తుంది. ఆ ట్రయల్స్ కొనసాగుతుండగా.. మరో ఆప్షన్‌ను ఎనేబుల్ చేసినట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. అదనపు వసూళ్లు షురూ! నెట్‌ఫ్లిక్స్ అర్జెంటీనా, డొమినికన్ రిపబ్లిక్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాల,హోండురాస్‌తో సహా పలు దేశాల్లో 'యాడ్ ఏ హోం' పేరుతో మరో ఫీచర్‌ను డెవలప్ చేసింది. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రారంభ దశలో ఉన్నా.. భవిష్యత్‌లో యాడ్ ఏ హోం పేరుతో అదనంగా డబ్బులు వసూలు చేయనున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే గతంలో ఈఏడాది చివరి నాటికి నెట్‌ఫ్లిక్స్ సబ్ స్క్రైబర్లు పాస్వర్డ్ షేరింగ్ చేస్తే అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని సూచించింది.కాబట్టి, కంపెనీ మరికొన్నినెలల్లో భారత్‌లో సైతం యాడ్ ఏ హోం ఫీచర్ సాయంతో అదనంగా డబ్బులు వసూలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యాడ్ ఏ హోంపై అదనపు ఛార్జీలు ఎంతంటే? వచ్చే నెల నుంచి 'యాడ్ ఏ హోం' ఆప్షన్‌ను పైన పేర్కొన్న ప్రాంతాల్లో వినియోగంలోకి రానుంది. ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఈ ప్రాంతాల్లో నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌ను ఇంట్లో ఒకరు మాత్రమే వీక్షించే సౌలభ్యం ఉంది. అదే అకౌంట్‌ను మరో వ్యక్తి లాగిన్ అవ్వాలంటే అదనపు రుసుము చెల్లించాలి. ఉదాహరణకు అర్జెంటీనాలో అదనంగా 219 పెసోలు, ఇతర ట్రయల్ రన్ నిర్వహిస్తున్న ప్రాంతాలలో 2.99 డాలర్లు (అంచనా) చెల్లిస్తే ఆ అకౌంట్‌ను యాక్సెస్ చేయోచ్చు. ప్రస్తుతానికి, నెట్‌ఫ్లిక్స్ మనదేశంలో వినియోగదారులు తమ పాస్‌వర్డ్‌లను వారి కుటుంబేతర వ్యక్తులు వీక్షిస్తే ఎంత వసూలు చేస్తుందనే విషయంపై నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులు స్పష్టత ఇవ్వలేదు. నెట్‌ఫ్లిక్స్ ప్లాన్లలో నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్‌లో ఉన్న వినియోగదారులు అదనంగా ఒక ఇంట్లో వీక్షించే అవకాశం ఉంది. స్టాండర్డ్, ప్రీమియం వినియోగదారులు వరుసగా రెండు, మూడు ఇళ్లకు చెందిన సభ్యులు వీక్షించొచ్చు. ఇలా ప్లాన్ల వారీగా నెట్‌ఫ్లిక్స్‌ను వినియోగించుకోవాలంటే అదనపు చెల్లింపులు తప్పని సరి. నెట్‌ఫ్లిక్స్‌ను ఆదరిస్తున్నారు.. తప్పులేదు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌ను వీక్షకులు ఆదరిస్తున్నారు.ఇతర కుటుంబ సభ్యులకు,స్నేహితులతో పంచుకోవాలని అనుకుంటున్నారు. యూజర్లు చూడడం వేరు. వారి అకౌంట్లను ఇతరులకు షేర్ చేయడం వేరు. అకౌంట్లను షేర్ చేయడం వల్ల తలెత్తే ఇబ్బందులతో దీర్ఘకాలిక లక్ష్యాల్ని చేరుకోలేమని నెట్‌ఫ్లిక్స్ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ డైరెక్టర్ చెంగీ లాంగ్ చెప్పారు. చదవండి: తగ్గేదేలే: నెట్ ఫ్లిక్స్ షాకింగ్ నిర్ణయం, లక్షల అకౌంట్లు బ్యాన్! -
గుడ్ న్యూస్: తక్కువ ధరకే నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్.. కొత్త ప్లాన్ అదిరిందబ్బా!
Netflix Partners With Microsoft: పిండి కొద్ది రొట్టే అనే సామెత వినే ఉంటారు. కానీ కొన్ని సార్లు ఈ సామెత కూడా మారాల్సి వస్తుంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ పరిస్థితి కూడా అలానే ఉంది మరి. ఎందుకంటే ఓటీటీలో కంటెంట్ పరంగా నెట్‌ఫ్లిక్స్‌లో కొదవ లేదు, అంతేనా క్వాలిటీ మూవీస్, వెబ్ సిరీస్ విషయంలో ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్లు ఉంటాయి. అయితే సబ్స్క్రిప్షన్ రేట్లు కూడా ఎక్కువగా ఉండటంతో అంత ఖర్చు ఎందుకులే అనుకున్న యూజర్లు నెట్‌ఫ్లిక్స్‌ని పక్కన పెడుతున్నారు. దీంతో తక్కవ ధరకే కస్టమర్లకి సబ్స్క్రిప్షన్ అందించాలని నెట్‌ఫ్లిక్స్ నిర్ణయించుకుంది. తాజాగా ఆ దిశగా మరో అడుగు వేస్తూ తక్కవ ధర సబ్‌స్క్రిప్షన్‌లో యాడ్స్ జతచేయనుంది. అందుకోసం నెట్‌ఫ్లిక్స్ మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపింది. ఈ సంస్థను తన గ్లోబల్ అడ్వర్టైజింగ్, సేల్స్ పార్ట్నర్గా ప్రకటించింది. ఈ ఏడాది చివరికల్లా ఈ ప్లాన్ తీసుకొచ్చే అవకాశం ఉంది. 2 లక్షల మంది సబ్స్క్రైబర్లు.. ఈ ఏడాది తొలి క్వార్టర్‌లోనే నెట్‌ఫ్లిక్స్ 2 లక్షల మంది సబ్స్క్రైబర్లను కోల్పోయింది. దీంతో ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి నెట్‌ఫ్లిక్స్ ఈ యాడ్స్‌తో కూడిన సబ్స్క్రిప్షన్ ఆలోచన చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్స్టార్ల గరిష్ఠ ప్లాన్ ఏడాదికి రూ.1500 ఉండగా, నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రం ఇదే ఏడాది ప్లాన్ రూ.7700 వరకూ ఉంది. ఇంకేముంది ఎంత కంటెంట్ ఉన్నా పైసలు కూడా దృష్టిలో ఉంచుకున్న కస్టమర్లు నెట్‌ఫ్లిక్స్‌ని పక్కన పెట్టడంతో ఈ ప్లాన్ తీసుకొచ్చేందకు సన్నాహాలు చేస్తోంది. చదవండి: Provident Fund Tax Rules: ఈపీఎఫ్ చందాదారులకు షాక్.. కొత్త రూల్స్ ఇవే! -
వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్ బంపరాఫర్!
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ కాస్ట్ ఎక్కువగా ఉండడం, పాస్వర్డ్ షేరింగ్ అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని ప్రకటించడంతో జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో 2లక్షమంది వినియోగదారుల్ని కోల్పోయింది. 30శాతం షేర్లు నష్టపోయాయి. క్యూ2లో మరో 20లక్షల వినియోగారుల్ని కోల్పోవచ్చని నెట్‌ఫ్లిక్స్ అంచానా వేసింది. ఈ తరుణంలో వినియోగారుల్ని తిరిగి రప్పించుకునేందుకు సరికొత్త బిజినెస్ స్ట్రాటజీతో నెట్‌ఫ్లిక్స్ ముందుకు రానుంది. వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్ బంపరాఫర్ ప్రకటించింది. త్వరలో తక్కువ ధరకే సబ్స్క్రిప్షన్ ప్లాన్లను అందించేందుకు సిద్ధమైనట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. అన్న చందాన..సబ్ స్క్రిప్షన్ ధరల్ని తగ్గించి..యాడ్ టైర్ ప్లాన్‌ను యాడ్ చేస్తున్నట్లు నెట్ఫ్లిక్ కో- సీఈవో టెడ్ సారండోస్ తెలిపారు. తద్వారా నెట్‌ఫ్లిక్స్ వీడియోలు చూసే సమయంలో యాడ్స్ ప్రసారం అవుతాయి. యాడ్స్ ప్రసారంతో సంస్థకు లాభాలు..సబ్స్క్రిప్షన్ ధరల తగ్గింపుతో చేజారిపోయిన సబ్స్క్రైబర్లను పెంచుకోవచ్చని నెట్‌ఫ్లిక్స్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో టెడ్ సారండోస్ మాట్లాడుతూ.." నాకెందుకో నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ధరలు ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తోంది. ఓటీటీ వీడియోల్లో యాడ్స్ ప్లే అయితే పెద్దగా పట్టించుకోను. కానీ సబ్స్క్రిప్షన్ ధర తక్కువగా ఉండాలి" అని అనుకునే యూజర్ల కోసం కొత్త యాడ్ టైర్ ప్లాన్‌ను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. -
మరో 300మందికి ఉద్వాసన పలికిన నెట్‌ఫ్లిక్స్
సాక్షి, ముంబై: మార్కెట్లో ప్రత్యర్థుల పోటీ, విపరీతంగా సబ్స్క్రైబర్లను కోల్పోతున్న స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. కాస్ట్ కటింగ్‌లో భాగంగా రెండో విడత ఉద్యోగాల్లో కోత విధించింది నెట్‌ఫ్లిక్స్. ఉద్యోగుల్లో 4శాతం లేదా దాదాపు 300 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. గత నెలలో చేసిన కట్ కంటే రెండు రెట్లు ఎక్కువ. వ్యాపారంలో గణనీయంగా పెట్టుబడులను కొనసాగిస్తున్న నేపథ్యంలో కొన్ని సర్దుబాట్లు, ఆదాయ వృద్ధికి అనుగుణంగా పెరుగుతున్న ఖర్చులను తగ్గించుకునేందుకే ఈ నిర్ణయమని నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. నెట్‌ఫ్లిక్స్ వృద్ధికి వారు చేసిన కృషికి కృతజ్ఞులం, ఈ కష్టకాలలో వారికి మద్దతివ్వడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. మార్కెటింగ్ బడ్జెట్‌ను తగ్గించడంలో భాగంగా మేలో కొంత మంది ఉద్యోగులను నెట్‌ఫ్లిక్స్ తొలగించింది. దీంతోపాటు, ఏప్రిల్‌లో కొంతమంది కాంట్రాక్ట్ కార్మికులు, ఇతర కీలక సిబ్బందిని కూడా తొలగించింది. కాగా 2022 తొలి త్రైమాసికంలో 2 లక్షల సబ్స్క్రైబర్లు నెట్‌ఫ్లిక్స్‌కు గుడ్‌బై చెప్పారు. తదుపరి త్రైమాసికంలోనూ ఇదే కొనసాగు తుందని అంచనా వేసింది. అందుకు తగ్గట్టుగానే సబ్స్క్రిప్షన్ ఆధారిత రాబడి మోడల్‌ను పెంచి, సంస్థ కార్యకలాపాలను రీటూల్ చేస్తోంది. జనవరిలో ధరల పెంపు కారణంగా నెట్‌ఫ్లిక్స్ కష్టాలు కొద్దిగా తగ్గాయి. అయితే అమెజాన్, వాల్డిస్నీ, హులూ స్ట్రీమింగ్ కంటెంట్‌తో అధిక పోటీసంస్థ ఆదాయాన్ని దెబ్బ తీస్తోంది. మరోవైపు వరుస తొలగింపులు, ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం భయాలు ఉద్యోగులను ఆందోళనలోకి నెడుతున్నాయి. -
ఈ యూట్యూబర్ల నెలవారీ సంపాదన తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది!
మీరెప్పుడైనా నిద్రపోతున్నా.. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగితే ఎలా ఉంటుందో ఊహించుకున్నారా? కానీ వీళ్లు మాత్రం అలాగే అనుకున్నారు. అలా అని ఊహల్లో తేలిపోలేదు. రేయిం భవళ్లు శ్రమించారు. గంటల నిడివి గల వీడియోల్ని తీశారు. ఇష్టా ఇష్టాల్ని వదులుకున్నారు. మేం యూట్యూబర్లం అని చెబితే తేలిగ్గా తీసి పారేసిన వాళ్ల ముందు.. శ్రీ శ్రీ చెప్పినట్లు కన్నీళ్ళు కారుస్తూ కూర్చోలేదు. చెమట చుక్కని చిందించారు. మనదేశ యూట్యూబ్ చరిత్రలో నిలిచిపోయేలా ఎంతో మందికి రోల్ మోడల్‌గా నిలిచారు. ఇప్పుడు అలాంటి వారిలో ప్రముఖులైన దేశీయ యూట్యూబర్ల గురించి, వారి ఆదాయం గురించి తెలుసుకుందాం. గౌరవ్ చౌదరి రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన 30 ఏళ్ల గౌరవ్ చౌదరి వరల్డ్ లార్జెస్ట్ యూట్యూబర్‌గా చెలామణి అవుతున్నాడు. దుబాయ్ బిట్స్ ఫిలానీ క్యాంపస్‌లో ఎంటెక్ (మైక్రో ఎలక్ట్రానిక్) చదివాడు. దుబాయ్‌లో ఉంటూ ఆ దేశ పోలీస్ విభాగంలో సేవలందిస్తున్నాడు. మరో పక్క 'టెక్నికల్ గూరూజీ' యూట్యూబ్ ఛానల్ పేరుతో టెక్నాలజీపై వీడియోలు చేస్తున్నాడు. ప్రస్తుతం అతని యూట్యూబ్ ఛానెల్‌కు 22.1 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఫోర్బ్స్ ఇండియా అండర్-30 జాబితాలో గౌరవ్ చోటు సంపాదించుకున్న అతని నెలవారీ సంపాదన కోటి రూపాయిలకు పైగా ఉంటుంది. అతని ఆస్తుల విలువ అక్షరాల 50 మిలియన్ డాలర్లు . మన దేశ కరెన్సీలో (రూ.300కోట్లుకు పై మాటే) క్యారీ మినాటీ పిట్ట కొంచెం..కూత ఘనం అన్నట్లు హర్యానాలోని ఫరిదాబాద్‌కు చెందిన 23ఏళ్ల క్యారీ మినాటీ రెండు ఛానెళ్లను నిర్వహిస్తున్నాడు. క్యారీ మినాటీ పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానెల్లో అదిరిపోయే కామెడీ స్కిట్లు చేస్తుంటే..క్యారీస్ లైవ్ పేరుతో గేమింగ్ ఛానెల్ నడుపుతున్నాడు.10ఏళ్ల వయస్సు నుంచే యూట్యూబ్ ఛానెల్లో వీడియోలు అప్లోడ్ చేయడం మొదలు పెట్టాడు. బాలీవుడ్ యాక్టర్ సన్నిడియోల్‌ను ఇమిటేట్ చేయడంలో దిట్ట. అందుకే చదువు మధ్యలోనే వదిలేశాడు. చదివింది 10వ తరగతే అయినా (ఇంటర్ ఎగ్జామ్స్ భయంతో మధ్యలోనే చదువు వదిలేశాడు) 2014 నుంచి వీడియోలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. అతని ఆదాయం నెలకు రూ.16లక్షలకు పై మాటే. ప్రస్తుతం క్యారీ మినాటీ యూట్యూబ్ ఛానెల్‌కు 35.9 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. క్యారీస్లైవ్కు 11.1మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లతో రాణిస్తున్నాడు. ఇక ప్రస్తుతం అతని ఆస్తుల విలువ అక్షరాల 3.5 మిలియన్లు. అంతే కాదండోయ్ ఏప్రిల్ 2020 ఫోర్బ్స్ అండర్ 30 జాబితాలో ఆసియా నుంచి క్యారీ చోటు దక్కించుకున్నాడు. భువన్ బామ్ భువన్ బామ్. గుజరాత్‌లోని వడోదరాకు చెందిన 28 ఏళ్ల భువన్ బామ్ బీవీ కి వినీష్ పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ను రన్ చేస్తున్నాడు. ఢిల్లీలో హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశాడు. తనదైన స్టైల్లో కామెడీ పండిస్తూ అభిమానుల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఓవైపు వీడియోలు చేస్తూనే మరోవైపు మింత్రాతో పాటు ఇతర సంస్థలకు బ్రాండ్ అంబాసీడర్‌గా పనిచేస్తున్నాడు. బిజినెస్ కనెక్ట్ ఇండియా-2021 ప్రకారం..అతని ఆస్తుల విలువ అక్షరాల 3మిలియన్లు. భారత్ కరెన్సీలో రూ.25 కోట్లుగా ఉంది. ఇక నెలవారీ సంపాదన రూ.కోటి పై మాటే. ఆశిష్ చంచలాని ఆశిష్ చంచలాని. ప్రముఖ సోషల్ మీడియా ఇన్ల్ఫుయన్సర్. నేవి ముంబై దత్తా మేఘే కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్ ఛానెల్‌ను సక్సెస్ ఫుల్‌గా రన్ చేస్తున్నాడు. అశిష్ చంచలానికి వినిస్ పేరుతో నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానెల్‌కు 28.3 మిలియన్ మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. నెలకు 115,000 డాలర్ల నుంచి 180,000 డాలర్ల వరకు సంపాదిస్తున్నాడు. అమిత్ భదానా అమిత్ భదానా 27ఏళ్ల యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్. సౌత్ ఢిల్లీకి చెందిన జోహ్రీపూర్ నివాసి.ప్రస్తుతం అమిత్ 'అమిత్ భదానా' అనే యూట్యూబ్ ఛానెల్లో ఎంటర్టైన్మెంట్ వీడియోస్‌ను అప్లోడ్ చేస్తున్నాడు. ప్రస్తుతం అతని యూట్యూబ్ ఛానెల్‌కు 24 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లు ఉండగా..అలా అప్లోడ్ చేసిన వీడియోలకు కోట్లలో వ్యూస్ వస్తున్నాయి. వాటికి వచ్చే వ్యూస్, డిస్ప్లే అయ్యే యాడ్స్ కారణంగా ప్రతి వీడియోకి రూ.10 లక్షలు సంపాదిస్తాడని యూట్యూబ్ లెక్కలు చెబుతున్నాయి. ఇక అతని ఆస్తులు అక్షరాల రూ.44కోట్లు. Amit Bhadana: నిద్రపోతున్నా సరే అతడి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూనే ఉంది -
5.23 కోట్లకు పీఎఫ్ఆర్డీఏ పింఛను చందాదారులు
న్యూఢిల్లీ: పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) నిర్వహణలోని పింఛను పథకాల్లో సభ్యుల సంఖ్య ఏప్రిల్ చివరికి 5.23 కోట్లకు చేరింది. 2021 ఏప్రిల్ నాటికి ఉన్న సభ్యులు 4.26 కోట్ల మందితో పోల్చి చూస్తే ఏడాది కాలంలో 23 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్), అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకాలను పీఎఫ్ఆర్డీఏ చూస్తోంది. ఎన్పీఎస్, ఏపీవై కింద సభ్యులకు చెందిన పింఛను ఆస్తుల విలువ రూ.7,38,765 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి ఉన్న విలువ నుంచి 25 శాతం పెరిగింది. -
ఫస్ట్ ఎయిర్టెల్.. సెకండ్ జియో..
న్యూఢిల్లీ: మార్చి నెలలో జియో, ఎయిర్టెల్ కొత్త చందాదారులను సొంతం చేసుకున్నాయి. ఎయిర్టెల్ నికరంగా 22.55 లక్షల మంది కస్టమర్లను చేర్చుకుంది. జియో కొత్త కస్టమర్లు 12.6 లక్షలుగా ఉన్నారు. వొడాఫోన్ ఐడియా 28.18 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. బీఎస్ఎన్ఎల్ 1.27 లక్షల మంది చందాదారులను నష్టపోయింది. మార్చి చివరికి టెలికం చందాదారుల సంఖ్య 116.69 కోట్లకు చేరింది. ఇందులో వైర్లెస్ (మొబైల్) చందాదారులు 114.2 కోట్లుగా ఉన్నారు. ఈ గణాంకాలను టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్) విడుదల చేసింది. వైర్‌లైన్ టెలిఫోన్ చందాదారులు ఫిబ్రవరి చివరికి 2.45 కోట్లుగా ఉంటే, మార్చి చివరికి 2.48 కోట్లకు పెరిగారు. వైర్‌లైన్ విభాగంలో జియో 2.87 లక్షల కొత్త కస్టమర్లను రాబట్టుకుంది. చదవండి: ప్యూర్‌గా కాలిపోతున్నాయ్.. హైదరాబాద్‌లో దగ్ధమైన ఎలక్ట్రిక్ స్కూటర్ -
వావ్.. సినీ ప్రియులకు ఇక పండగే.. ఓటీటీలో ఏకంగా 40
Amazon Prime Video Upcoming Web Series And Movies Over 40: కరోనా, లాక్డౌన్ తర్వాత ఓటీటీ వినియోగం బాగా పెరిగిపోయింది. థియేటర్లకు ప్రత్యమ్నాయంగా మారాయి ఓటీటీలు. పెద్ద సినిమాల నుంచి చిన్న చిత్రాల వరకు విడుదల చేసేందుకు చిరునామా అయ్యాయి. సినిమాలతోపాటు వాటిని తలదన్నేలా వెబ్ సిరీస్‌లు కూడా తెరకెక్కాయి. ఇంకా తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో తన సబ్స్క్రైబర్లకు సూపర్ గుడ్ న్యూస్ తెలిపింది. ఇక ఈ వినియోగదారులకు వెబ్ సిరీస్‌లు, సినిమాలతో పండగే పండగ. అమెజాన్ ప్రైమ్ వీడియో రానున్న రెండేళ్లలో సుమారు 40 ఒరిజినల్ వెబ్ సిరీస్/సినిమాలను ప్రేక్షకులకు అందించనున్నట్లు ప్రకటించింది. తెలుగు, తమిళ, హిందీతోపాటు వివిధ భాషల్లో వీటిని నిర్మించనున్నట్లు పేర్కొంది. వాటి వివరాలను ఓ వీడియో ద్వారా వెల్లడించింది. ఈ వెబ్ సిరీస్‌లు/సినిమాలను కరణ్ జోహార్ ధర్మ ఎంటర్టైన్మెంట్, రితేశ్ సిద్వానీ-పర్హాన్ అక్తర్‌లకు చెందిన ఎక్సెల్ మీడియా, నిఖిల్ అడ్వానీ ఎమ్మీ ఎంటర్టైన్మెంట్, రాజ్ అండ్ డీకే ఫిల్మ్స్ ఇలా తదితర నిర్మాణ సంస్థలతో కలిసి తెరకెక్కిస్తున్నట్లు తెలిపింది. మొత్తం 22 ఒరిజినల్ స్క్రిప్టెడ్ సిరీస్, 9 రిటర్నింగ్ సిరీస్, 3 అమెజాన్ ఒరిజినల్ ఫిల్మ్స్, 2 కో-ప్రొడక్షన్స్ వాటిలో ఉన్నాయి. ఇందులో నాగ చైతన్య హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో దూత వెబ్ సిరీస్, ఆది పినిషెట్టి, నిత్యా మీనన్, రీతు వర్మ, సుహాసిని, అభిజిత్ (బిగ్‌బాస్ ఫేం) తదితరులు నటించిన మోడర్న్ లవ్ వెబ్ సీరీస్, అమ్ము అనే సినిమా త్వరలో స్ట్రీమింగ్ కానున్నట్లు పేర్కొంది. ఫర్జీ, సజల్, ది విలేజ్, హష్ హష్, ఫోన్ భూత్, యుద్రా, జీ లే జరా, ఫక్రీ 4, కో గయే హై హమ్ కహాన్, అక్షయ్ కుమార్, సత్యదేవ్ 'రామసేతు'తోపాటు సూపర్ హిట్ సిరీస్‌లు మీర్జాపూర్ 3, ది ఫ్యామిలీ మ్యాన్ 3, ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ 3, ముంబై డైరీస్ 2, మేడ్ ఇన్ హెవెన్ 2, పాతాళ్ లోక్ 2, కామిక్‌స్తాన్ 3, బ్రీత్: ఇన్టు ది షాడోస్ సీజన్ 2, పంచాయతీ ఎస్2 కూడా నిర్మాణంలో ఉన్నాయి. అలాగే రోహిత్ శెట్టి దర్శకత్వంలో సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టి, వెవేక్ ఒబేరాయ్, ఇషా తల్వార్ కీలక పాత్రల్లో నటించిన 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' అనె వెబ్ సిరీస్ కూడా రానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో 'ట్రాన్సక్షనల్ వీడియో ఆన్ డిమాండ్' (టీవీఓడీ) పేరుతో సినిమాలను అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకురానుంది. ప్రైమ్ మెంబర్స్ కానీ వారికి టీవీఓడీ సేవలను వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం పలు స్ట్రీమింగ్ యాప్‌లు పేపర్ వ్యూ పద్ధతి ద్వారా మూవీస్‌ను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జీ5 టీవీఓడీని 'జీప్లెక్స్' పేరుతో అందుబాటులోకి తెచ్చింది. చదవండి: ఐఎమ్‌డీబీ రేటింగ్ ఇచ్చిన 10 బెస్ట్ తెలుగు వెబ్ సిరీస్‌లు.. ఈ 3 సినిమాల కోసం ఓటీటీల్లో ఫ్యాన్స్ వెయిటింగ్.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నెట్‌ఫ్లిక్స్‌పై ఎలన్‌మస్క్ పంచులు!
నిన్నామొన్నటి వరకు ట్విటర్‌పై వరుసగా పంచులు వేస్తూ పోయిన ఎలన్‌మస్క్ ఇప్పుడు తన దృష్టి నెట్‌ఫ్లిక్స్ మీదకు మరల్చాడు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ వరుసగా చందాదారులను కోల్పోతోంది. గతేడాది నుంచి ఈ ట్రెండ్ మొదలవగా ప్రస్తుత త్రైమాసికంలోనూ కొనసాగింది. దీంతో చందాదారులను ఎలా కాపాడుకోవాలనే అంశంపై నెట్‌ఫ్లిక్స్ తర్జనభర్జనలు పడుతోంది. మరోవైపు చందాదారులను భారీగా కోల్పోతుండటంతో షేర్ ధర కూడా భారీగా పడిపోతుంది. ఈ అంశాలపై శ్లాష్డాట్ సంస్థ ఓ కథనం ప్రచురించి ట్వీట్ చేసింది. దీనిపై ఎలన్‌మస్క్ స్పందిస్తూ జ్ఞానం అనే వైరస్ సోకవడంతో నెట్‌ఫ్లిక్స్ చందాదారుల సంఖ్య పడిపోతుంది ( ది వోక్ మైండ్ వైరస్ ఈజ్ మేకింగ్ నెట్‌ఫ్లిక్స్ అన్వాచబుల్) పంచ్ విసిరారు. మస్క్ విసిరిన పంచ్‌కు నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది. Netflix Shares Crater 20% After Company Reports it Lost Subscribers For the First Time in More Than 10 Years https://t.co/rH2AklZJsl — Slashdot (@slashdot) April 19, 2022 చదవండి: Elon Musk: ఇప్పటికీ నాకు సొంత ఇల్లు లేదు.. ఫ్రెండ్స్ ఇళ్లలోనే ఉంటా -
ఉక్కిరిబిక్కిరి అవుతున్న నెట్‌ఫ్లిక్స్.. ఇష్టం లేకున్నా వాటి వైపు చూపు!
వెండితెరకు, బుల్లితెరకు ప్రత్యామ్నాయంగా వచ్చిన ఓవర్ ది టాప్ (ఓటీటీ) కంటెంట్ రోజురోజుకి మార్కెట్లో దూసుకుపోతుంది. దీంతో రోజుకో కంపెనీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఫలితంగా ఒకప్పుడు ఓటీటీ మార్కెట్లో రారాజుగా వెలిగిన నెట్‌ఫ్లిక్స్‌కి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో నెట్‌ఫ్లిక్స్ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది చందాదారులు ఉన్నారు. కొత్త సినిమాలు రిలీజ్ చేయడంతో పాటు సినిమాలనే తలదన్నెలా ఒరిజినల్స్‌ని ప్రేక్షకులను అందిస్తూ మెజారిటీ దేశాల్లో పాగా వేసింది నెట్‌ఫ్లిక్స్. అయితే గత కొంత కాలంగా నెట్‌ఫ్లిక్స్‌కి గడ్డు రోజులు ఎదురవుతున్నాయి. కొత్తగా వచ్చిన ఓటీటీ యాప్‌లతో నెట్‌ఫ్లిక్స్‌కి తీవ్ర పోటీ ఎదురువుతోంది. ఫలితంగా చందాదారుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు గతేడాది నెట్‌ఫ్లిక్స్ తన చందా ధరలను తగ్గించింది. ఇండియాలో అయితే రూ.199కే బేసిక్ ప్లాన్‌ను అమల్లోకి తేగా అప్పటి వరకు రూ.199గా ఉన్న మొబైల్ ప్లాన్ ధరని రూ. 149కి తగ్గించింది. ఐనప్పటికీ పరిస్థితితో పెద్దగా మార్పు రాలేదు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఇప్పటికే రెండు లక్షల మంది చందాదారులను కోల్పోయింది. దశాబ్ద కాలం తర్వాత భారీ స్థాయిలో చందాదారులను కోల్పోయింది. అంతేకాదు ఈ ఏడాది చివరి నాటికి ఇరవై లక్షల మంది చందాదారులను కోల్పోవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. దీంతో సరికొత్త స్ట్రాటజీ అమలు చేసే యోచనలో ఉంది నెట్‌ఫ్లిక్స్,. ఇప్పటి వరకు అడ్వర్టైజ్మెంట్ లేకుండా కంటెంట్ ప్రసారం చేయడం నెట్‌ఫ్లిక్స్ ప్రత్యేకతగా ఉంది. కానీ ఆదాయం పడిపోకుండా చందాదారులను కోల్పోకుండా ఉండేందుకు కంటెంట్ మధ్యలో యాడ్స్‌కు చోటివ్వాలనే ప్లాన్‌ను పరిశీలిస్తున్నట్టు నెట్‌ఫ్లిక్స్ సీఈవో రీడ్ హ్యాస్టింగ్స్ తాజాగా ప్రకటించారు. యాడ్స్ ప్రసారానికి మేము వ్యతిరేకమైనప్పటికీ కస్టమర్ల ఛాయిస్‌ను కూడా గౌరవించాలని భావిస్తున్నాం. కాబట్టి రాబోయే ఒకటి రెండేళ్లలో యాడ్స్‌ను ప్రవేశపెడతామంటూ తెలిపారు. ఈ విధానాన్ని ఇప్పటికే డిస్నీ హాట్‌స్టార్, హులు, జీ 5 వంటి సంస్థలు పాటిస్తున్నాయి. చదవండి: Netflix: యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ భారీ షాక్! అది ఏంటంటే? -
జియో అదిరిపోయే బంపరాఫర్, రూ.200కే '14 ఓటీటీ' యాప్స్ సబ్స్క్రిప్షన్!
దేశీయ టెలికాం దిగ్గజం జియో తన కస్టమర్లు బంపరాఫర్ ప్రకటించింది. జియో ఫైబర్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం "ఎంటర్టైన్మెంట్ బొనాంజా" కేటగిరీ కింద కొత్త ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌లోని జియో ఫైబర్ పోస్ట్‌పెయిడ్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్లతో వినియోగదారులు నెలకు రూ.100, రూ.200 అదనంగా చెల్లించడం ద్వారా 14 ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. ఈ కొత్త ప్లాన్లు ఏప్రిల్ 22 నుండి అందుబాటులోకి వస్తాయని జియో ఒక ప్రకటనలో తెలిపింది. జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు, కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల వివరాలు: ►కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్ వినియోగదారులకు జీరో ఇన్స్టలేషన్ ఛార్జీతో జియో ఫైబర్ పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌ను అందిస్తుంది. ఇన్స్టలేషన్ చేయించుకున్న యూజర్లకు ఇంటర్నెట్ బాక్స్ (గేట్‌వే రూటర్), సెట్ టాప్ బాక్స్ పొందవచ్చు. ► జియో ఫైబర్ పోస్ట్ పెయిడ్ వినియోగదారులు నెలకు 30ఎంబీపీఎస్ స్పీడ్‌తో రూ. 399తో అపరిమిత హై స్పీడ్ ఇంటర్నెట్ను యాక్సెస్ చేసుకోవచ్చు. అదనంగా, ఎంటర్టైన్మెంట్ పొందాలంటే నెలకు రూ.100 చెల్లిస్తే 6 ఓటీటీ సబ్ స్క్రిప్షన్, రూ.200 చెల్లిస్తే 14 ఓటీటీ యాప్స్ సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు. (ఒక్క ఇంటర్నెట్కు రూ.399, 6 ఓటీటీ యాప్స్ సబ్ స్క్రిప్న్ కు 100తో కలిపి రూ.499, 14 ఓటీటీ యాప్స్ సబ్ స్క్రిప్షన్ రూ.200 చెల్లింపుతో కలిపి రూ.599 చెల్లించాల్సి ఉంటుంది. ►ఒక్క ఇంటర్నెట్ అయితే రూ.699 చెల్లిస్తే 100ఎంబీపీఎస్ పొందవచ్చు. ఇక 6 ఓటీటీ యాప్స్ సబ్ స్క్రిప్షన్కు 100తో కలిపి రూ.799, 14 ఓటీటీ యాప్స్ సబ్ స్క్రిప్షన్ రూ.200 చెల్లింపుతో కలిపి రూ.899 చెల్లించాల్సి ఉంటుంది. ►ఒక్క ఇంటర్నెట్ అయితే రూ.999 చెల్లించి 150ఎంబీపీఎస్ పొందవచ్చు. ఉచితంగా 6 ఓటీటీ, 14 ఓటీటీ యాప్స్ సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు. అదనంగా అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ వినియోగించుకోవచ్చు. ►ఒక్క ఇంటర్నెట్ అయితే 300ఎంబీపీఎస్ స్పీడ్ కోసం రూ.1499 చెల్లించాల్సి ఉంటుంది. ఉచితంగా 6 ఓటీటీ, 14 ఓటీటీ యాప్స్ సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు. అదనంగా అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్ స్క్రిప్షన్ వినియోగించుకోవచ్చు. ►500ఎంబీపీఎస్ వినియోగించుకోవాలంటే రూ.2499 చెల్లించాల్సి ఉంటుంది. ఉచితంగా 6 ఓటీటీ, 14 ఓటీటీ యాప్స్ సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు. అదనంగా అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్ స్క్రిప్షన్ వినియోగించుకోవచ్చు. ►1000ఎంబీపీఎస్ కావాలంటే రూ.3999 చెల్లించాల్సి ఉంటుంది. ఉచితంగా 6 ఓటీటీ, 14 ఓటీటీ యాప్స్ సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు. అదనంగా అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్ స్క్రిప్షన్ వినియోగించుకోవచ్చు. చదవండి: గ్లాన్స్‌లో జియో భారీ పెట్టబడులు, ఎత్తుకు పై ఎత్తు వేస్తున్న ముఖేష్ అంబానీ! -
నరేంద్ర మోదీ.. తగ్గేదేలే!
One Crore Subscription Completed For Modi Youtube: సోషల్ మీడియాలో తగ్గేదేలే అంటున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తాజాగా అరుదైన రికార్డు ఆయన సొంతం అయ్యింది. ప్రపంచంలోని టాప్ లీడర్స్‌కు సాధ్యం కానీ మైలురాయిని చేరుకున్న మోదీ. ఆయన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య కోటి దాటేసింది. యూట్యూబ్‌లో అత్యధిక సబ్స్క్రైబర్లతో దూసుకుపోతోంది నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానెల్. తాజాగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య కోటి దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన నాయకుల యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబర్ల సంఖ్యలో మోదీనే టాప్. ఆయన దరిదాపుల్లో ఏ ప్రపంచ నేత కూడా లేకపోవడం విశేషం. రెండో ప్లేస్‌లో 36 లక్షల యూట్యూబ్ సబ్స్క్రైబర్లతో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఉన్నారు. 30.7 లక్షల సబ్స్క్రైబర్లతో మెక్సికో అధినేత ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ మూడో స్థానంలో ఉండగా.. 28.8 లక్షల సబ్స్క్రైబర్లతో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో మూడో స్థానంలో ఉన్నారు. అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య కేవలం 7.03 లక్షలు మాత్రమే. ఇటు.. దేశంలో మోదీ తర్వాత అత్యధిక సబ్స్క్రైబర్లు కలిగిన నేతలను గమనిస్తే.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి 5.25 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్‌కి 4.39 లక్షలు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి 3.73 లక్షలు, తమిళనాడు సీఎం స్టాలిన్‌కి 2.12 లక్షలు, ఢిల్లీ మంత్రి మనీష్ సిసోడియాకు 1.37 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. 2007 అక్టోబరు 26న నరేంద్ర మోదీ పేరిట యూట్యూబ్ ఛానెల్ పప్రారంభమైంది. ఆ సమయంలో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో మోదీకి సంబంధించిన చాలా అంశాల వీడియోలతో పాటు, బాలీవుడ్ ప్రముఖలతో పాల్గొన్న పలు వీడియోలు, కరోనా విజృంభణ సమయంలో వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి. మిగతా వాటిల్లోనూ.. యూట్యూబ్‌తో పాటు ఇతర సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్‌ఫామ్‌ల్లోనూ ప్రధాని మోదీకి ఫాలోవర్లు ఎక్కువే. మోదీ ట్విట్టర్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య 7.53 కోట్లు కాగా, ఆయన ఫేస్‌బుక్‌ను 4.68 కోట్ల మంది అనుసరిస్తున్నారు. -
ఫ్రస్టేటింగ్ ఇండియా.. నెట్‌ఫ్లిక్స్ సీఈవో సంచలన వ్యాఖ్యలు
వీడియో ఆన్ డిమాండ్, ఓవర్ ది టాప్ లేదా ఓటీటీ పేరుతో సినిమా థియేటర్ మన మొబైల్‌లోకి వచ్చింది. ఓటీటీ మార్కెట్‌కి విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చింది నెట్‌ఫ్లిక్స్. ప్రస్తుతం ఆ సంస్థకు ఇండియన్ మార్కెట్ ఎంతకీ కొరుకుడు పడటం లేదు. ఇండియా, ఇక్కడి ప్రజల అభిరుచులు నెట్‌ఫ్లిక్స్ వ్యవస్థాపకులను ఫ్రస్టేషన్‌కి గురి చేస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ సంస్థ 2021 ఏడాదికి సంబంధించి చివరి త్రైమాసిక ఫలితాలును ప్రకటించింది. ఈ సందర్భంగా ఆ సంస్థ ఫౌండర్, కో సీఈవో రీడ్ హ్యాస్టింగ్స్ మాట్లాడుతూ.. ఇండియా మార్కెట్ ఫ్రస్టేటింగ్గా ఉంది. కానీ మా కంపెనీ ఇక్కడే మరికొన్ని విషయాలు నేర్చుకునేది ఉందంటూ చేసిన ప్రకటన నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. తగ్గిపోయిన చందాదారులు నెట్‌ఫ్లిక్స్ ఇండియన్ మార్కెట్లోకి భారీ ఎత్తున 2015లో ప్రవేశించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతి తక్కువ చందాదారులు చేరిన ఏడాదిగా 2021 నిలిచింది. ఒక్కసారిగా కొత్త చందాదారుల సంఖ్య భారీగా పడిపోయింది. దీంతో 2022 ఏడాదికి సంబంధించి జనవరి నుంచి మార్చి వరకు ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని నెట్‌ఫ్లిక్స్ కుదించింది. ప్రస్తుత త్రైమాసికంలో 4 మిలియన్ల కొత్త చందాదారులను లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పుడది 2.5 మిలియన్లకు పడిపోయింది. పోటీ పడలేక ఇండియాలో ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ 206 మిలియన్ డాలర్లుగా ఉంది. 2026 నాటికి ఇది ఏకంగా 226 మిలియన్ డాలర్లకు చేరుకుంటుదని అంచనా. దీంతో మిగిలిన ఓటీటీ కంపెనీలు ఇండియన్ మార్కెట్‌పై ఫోకస్ చేశాయి. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఇప్పటికే డిస్నీ హాట్‌స్టార్ 36 మిలియన్ చందాదారులతో అగ్రస్థానంలో ఉండగా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ 17 మిలియన్ చందాదారులతో రెండో స్థానంలో ఉంది. వీటికి భిన్నంగా నెట్‌ఫ్లిక్స్ 4.5 నుంచి 5 మిలియన్లకే పరిమితమైంది. ఈ తరుణంలో కొత్త చందాదారుల సంఖ్య గణనీయంగా పడిపోవడం నెట్‌ఫ్లిక్స్‌కి మింగుడు పడటం లేదు. భారీగా పెట్టుబడులు ఇండియన్ల అభిరుచులకు తగ్గట్టుగా కంటెంట్ రూపొందించేందుకు నెట్‌ఫ్లిక్స్ రూ.3000 కోట్లు పెట్టుబడికి సిద్ధంగా ఉంది. ఐనప్పటికీ వినియోగదారులను ఆకట్టుకోవడంలో వెనకబడింది. దీనికి ప్రధాన కారణం నెట్‌ఫ్లిక్స్ నెలవారీ చందా ధర ఎక్కువగా ఉండటమే అని మార్కెట్ నిపుణులు అంటున్నారు. నెట్‌ఫ్లిక్స్ నెలవారీ బడ్జెట్ ప్లాన్స్‌కే మిగిలిన ఓటీటీలు ఏడాది చందా లభిస్తుందని వారు చెబుతున్నారు. మరోవైపు యూఎస్, యూరప్‌లో ఇటీవల ధరలు పెంచినా.. స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగానే ఇండియాలో రేట్లు పెంచలేదని, పైగా మొబైల్ వెర్షన్‌ని తక్కువ ధరకే అందిస్తున్నామని చెబుతోంది. చదవండి: భారీగా పెరిగిన నెట్‌ప్లిక్స్ సబ్స్క్రిప్షన్ ధరలు! ఎక్కడంటే! -
ఈపీఎఫ్‌వో కిందకు కొత్తగా 12.73 లక్షల మంది
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ కిందకు అక్టోబర్‌లో కొత్తగా 12.73 లక్షల మంది వచ్చి చేరారు. 2020లో ఇదే నెలలో గణాంకాలతో పోలిస్తే సభ్యుల చేరికలో 10.22 శాతం వృద్ధి నమోదైంది. 2020 అక్టోబర్‌లో కొత్త సభ్యుల సంఖ్య 11.55 లక్షలుగా ఉంది. కార్మిక శాఖ ఈ మేరకు సోమవారం వివరాలను వెల్లడించింది. ‘‘అక్టోబర్‌లో కొత్త సభ్యులు 12.73 లక్షల మందిలో.. 7.57 లక్షల మంది ఈపీఎఫ్ అండ్ ఎంపీ యాక్ట్ 1952 కింద మొదటి సారి చేరారు. సుమారు 5.16 లక్షల మంది చేస్తున్న సంస్థల నుంచి బయటకు వెళ్లిపోయి, కొత్త సంస్థల్లో చేరిన వారు. వీరు తమ ఈపీఎఫ్ ఖాతాలను బదిలీ చేసుకున్నారు. కొత్త సభ్యుల్లో 22–25 వయసులోని వారు 3.37 లక్షల మంది కాగా.. 18–21 సంవత్సరాల వయసులోని వారు 2.50 లక్షల మంది ఉన్నారు. అంటే కొత్త సభ్యుల్లో వీరే 46 శాతంగా ఉన్నారు. అదే విధంగా మొత్తం కొత్త సభ్యుల్లో 60.64 శాతం అంటే సుమారు 7.72 లక్షల మంది మహారాష్ట్ర, హర్యానా, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి నమోదయ్యారు’’ అని తెలిపింది. చదవండి:ఈ-నామినేషన్ ఫైల్ చేయకపోతే.. ఈపీఎఫ్ ప్రయోజనాలు బంద్? -
మీ దృష్టిలో విలువైంది ఏదో చెప్పండి
ఈరోజుల్లో మనిషి కంటే మనీకే విలువ ఎక్కువ. రిలేషన్స్ కంటే అవసరాలకే ప్రాధాన్యం ఉంటోంది. మనిషి వాస్తవంలో బతుకుతోంది తక్కువ!. స్మార్ట్ ఫోన్లో.. సోషల్ మీడియాలోనే సగం కంటే ఎక్కువ జీవితం గడిచిపోతోంది. అఫ్కోర్స్.. ఇవన్నీ చర్చించుకోవడానికి బాగానే అనిపించొచ్చు. కానీ, వాస్తవ ప్రపంచం వేరు. ఒక అంశంపై ఎవరి ఒపీనియన్ వాళ్లది. వాళ్లకు అనిపించిందే కరెక్ట్!. జనరేషన్లు ముందుకెళ్తున్నా కొద్దీ.. ఈ తీరు మరింత మొండిగా మారుతోంది. మనీ ఆల్వేస్ మ్యాటర్. లాభం వచ్చే పని ఏదైనా సరే!.. చేసుకుంటూ ముందుకెళ్లడమే!. ఇంతకీ విషయం ఏంటంటే.. ఇండియా ఇన్ ఫ్లెక్స్ అనే ట్విటర్ పేజీ రెండు ఆప్షన్స్‌తో ఈమధ్య ఓ పోల్ నిర్వహించింది. ‘1 మిలియన్(పది లక్షల) యూట్యూబ్ సబ్ స్క్రయిబర్స్, పీహెచ్డీ పట్టా.. ఈ రెండింటిలో దేనికి ఎక్కువ విలువ ఉంటుంది?’ అని ట్విటర్ పోల్ నిర్వహించింది. దేనికి ఎక్కువ ఓట్లు వచ్చి ఉంటాయనుకుంటున్నారు. యస్.. మీరు ఊహించిందే కరెక్ట్. కింద పోల్ ఫలితం చూస్తున్నారుగా.. విద్య కంటే.. ఎంటర్టైన్మెంట్కే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఇంకా పడుతున్నాయి కూడా!. ఇందుకు ఫేమ్, డబ్బు కారణాలు కావొచ్చు. వాళ్ల అభిప్రాయాలు వాళ్లకు ఉంటాయి. ఇంతకీ మీ దృష్టిలో విలువైంది ఏంటి?.. ఎందుకో కారణంతో సహా చెబితే మరీ మంచిది!. which of these do you think has more value today? — India in Pixels (@indiainpixels) December 11, 2021 -
నెలకు కోటి రూపాయల జీతం వదిలేసి మరీ..
Korea Man Quits Crores Salary Job And Became Youtuber Because Of Mother: కంపెనీలో చేరిన ఏడాదికే ఇంక్రిమెంట్. అది అలాంటి ఇలాంటిది కాదు. నెలకు కోటికి పైగా(మన కరెన్సీలో) జీతం. ప్రొఫెషనల్ కెరీర్‌ను పీక్స్‌కు చేర్చే టైం అది. కానీ, ఆ సమయంలో ఉద్యోగం వదిలేయాలనే ఆలోచన ఎవరికైనా వస్తుందా?.. దక్షిణ కొరియాకు చెందిన బెన్ చోన్(28) ఆ నిర్ణయం తీసేసుకున్నాడు మరి!. అయితేనేం తనకు తెలిసిన విద్యతో లక్షలు(మన కరెన్సీలోనే) సంపాదిస్తూ.. సొంతంగా బాస్‌గా ఉండడంలో కిక్కును వెతుక్కుంటున్నాడు. జేపీ మోర్గాన్.. అమెరికన్ బ్యాంకింగ్ దిగ్గజం. ప్రపంచవ్యాప్తంగా పేరుంది. అలాంటి కంపెనీలో 2017లో చేరాడు బెన్ చోన్. పుట్టి, పెరిగింది దక్షిణ కొరియాలోనే అయినా. స్కాలర్షిప్ మీద అమెరికాలో మంచి యూనివర్సిటీలో చదివి.. జాబ్ తెచ్చుకున్నాడు. ఏడాది తిరగకుండానే అతని టాలెంట్‌కి భారీ ప్యాకేజీ ఆఫర్ చేసింది జేపీ మోర్గాన్. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనలిస్ట్‌గా ప్రమోషన్‌తో పాటు నెలకు లక్షా యాభై వేల డాలర్ల జీతం(అదనంగా బోనస్) ఇవ్వాలని నిర్ణయించుకుంది. అయితే రెండు నెలల జీతం అందుకున్నాడో లేదో.. పిడుగులాంటి వార్త అతని చెవిన పడింది. తల్లి ప్రమాదకరమైన వ్యాధి బారినపడిందన్న విషయం అతన్ని స్థిమితంగా ఉంచలేదు. ఆ సమయంలో అతనికి తల్లే ప్రపంచంగా కనిపించింది. ఆమె పక్కనే ఉండి.. ఎలాగైనా రక్షించుకోవాలనుకున్నాడు. క్షణం ఆలస్యం చేయకుండా ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి.. సొంతూరికి బయలుదేరాడు. అక్కడ ఓ చిన్న బట్టల దుకాణంలో కొంతకాలం పని చేశాడు. బట్టల షాపులో.. దాచుకున్న సొమ్మంతా కేవలం మూడు నెలల్లోనే తల్లి ట్రీట్మెంట్కి ఖర్చైంది. బ్యాంకింగ్ సలహాలిచ్చే బెన్ చోన్.. సొంతూరులోనే ఓ బట్టల షాపులో పని చేశాడు. ఆపై ఇంట్లో బట్టల దుకాణం తెరిచాడు. కొన్నాళ్లు పోయాక తల్లి మందులకు ఖర్చులు పెరిగాయి. ఆ టైంలోనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆదాయం సంపాదించొచ్చనే విషయం అతనికి గుర్తొచ్చింది. యూట్యూబ్‌లో రోజూ రకరకాల వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. వాటిలో చాలావరకు వీడియోలను చూసి తిట్టుకుంటాం.. నవ్వుకుంటాం. కొన్నింటిని చూడకుండానే స్కిప్ చేస్తుంటాం. కానీ, వాటి వ్యూస్ ద్వారా యూట్యూబర్లకు ఆదాయం వస్తుంది. అంటే.. ఏదో ఒకరకంగా తమ శ్రమను పెట్టుబడిగా పెట్టి సంపాదిస్తున్నారు వాళ్లు. అలా బెన్ చోన్ మాత్రం తనకు తెలిసిన విద్యతోనే యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టాడు. తెలిసిన విద్యతోనే.. 2019లో రేర్లిక్విడ్ rareliquid పేరుతో యూట్యూబ్ఛానెల్ మొదలుపెట్టాడు బెన్. ఇన్వెస్ట్మెంట్, కెరీర్ గైడెన్స్ వీడియోలతో నెమ్మదిగా ఫేమ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న క్రిప్టోకరెన్సీ గురించి, బ్లాక్ చెయిన్ మార్కెట్ తీరు తెన్నులు, టిప్స్‌తో పాటు టెక్, మార్కెటింగ్ సలహాలు అందిస్తాడు. ‘‘ జేపీ మోర్గాన్‌లో చేరిన తొలినాళ్లలో వారానికి 70 నుంచి 110 గంటల పని. ఒక్కోసారి ఏకధాటిగా 28 గంటలు పని చేయాల్సి వచ్చేది. ఇప్పుడు నాకు నేనే బాస్. నాకు తెలిసిన విద్య. కోట్ల జీతం పోతేనేం.. నాకు ఉన్న వనరులతో, తక్కువ శ్రమతో సంతోషం, మనశ్శాంతిని సంపాదించుకుంటున్నా. నాలాగే ప్రతీ ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. మనసు పెడితే డిజిటల్ ప్రపంచంతో సంపాదించుకోవచ్చు.. ఒక అడుగు ముందుకేసి అద్భుతాలూ చేయొచ్చు. సిగ్గు-మొహమాటం పడాల్సిన అవసరం అస్సలు లేదు. నా వరకు నేను బాగానే సంపాదిస్తున్నా. అన్నింటికి మించి మా అమ్మ పక్కనే ఉంటున్నా. ఇది చాలాదా నాకు’’ అంటున్నాడు బెన్ చోన్. ప్రస్తుతం rareliquid ఛానెల్లో టెక్, మార్కెట్, క్రిప్టోకరెన్సీ తీరు తెన్నులపైనా అతని సలహాలు, డెమో వీడియోలు ఉంటాయి. రెజ్యూమ్(సీవీ) సలహాలు, రకరకాల కోర్సుల గురించి వివరిస్తాడు. ఇదంతా చిన్న చిన్న వ్యాపారాల కలయికగా చెప్తాడు బెన్ చోన్. క్రియేటివ్ వేలో మరికొందరికి పాఠాలు, సలహాలు ఇవ్వడం సంతోషాన్ని ఇస్తుందని అంటున్నాడు ఈ యూట్యూబర్. యూట్యూబ్ వ్యూస్ ప్రకారం.. జులైలో బెన్ జీతం 19, 161 డాలర్లుకాగా, నవంబర్‌లో 26,000 డాలర్లు సంపాదించాడు. మన కరెన్సీలో ఇది 17 లక్షల రూపాయలు. -సాక్షి, వెబ్‌స్పెషల్ -
ఈపీఎఫ్‌వో కిందకు కొత్తగా 15.41 లక్షల సభ్యులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) కిందకు సెప్టెంబర్ నెలలో కొత్తగా 15.41 లక్షల మంది వచ్చి చేరారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో కొత్త సభ్యులు 13.60 లక్షల మందితో పోలిస్తే 13 శాతం పెరిగినట్టు ఈపీఎఫ్‌వో ప్రకటించింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక్క మే నెల మినహా మిగిలిన అన్ని నెలల్లోనూ నికరంగా సభ్యుల చేరిక పెరగడం గమనార్హం. నికర కొత్త సభ్యుల చేరిక ఏప్రిల్‌లో రూ.8,06,765 కాగా, మేలో 5,62,216కు తగ్గింది. తర్వాత జూన్‌లో 9,71,244 మంది చేరగా, జూలైలో 12,30,696 మంది ఈపీఎఫ్‌వోలో భాగమయ్యారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) నికర సభ్యుల చేరిక రూ.64.72 లక్షలుగా ఉంది. 2020–21 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్‌వో కిందకు కొత్తగా వచ్చిన వారి సంఖ్య 77.08 లక్షలుగా ఉండడం గమనార్హం -
Hotstar: డిస్నీ ఫ్లస్కు భారత్‌లో భారీ దెబ్బ
Disney Plus Hotstar lost subscribers: స్ట్రీమింగ్ సర్వీస్ కంపెనీ ‘డిస్నీ ఫ్లస్’ (Disney+) సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఏడాది కాలంలో ఏకంగా 60 శాతం సబ్ స్క్రయిబింగ్ రేట్‌తో సంచలనం సృష్టించింది. అక్టోబర్ 2నాటికి మొత్తం 118.1 మిలియన్ల సబ్స్క్రయిబర్ల మార్క్‌ను చేరుకున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే.. మూడు నెలల వ్యవధిలో 2.1 మిలియన్ సబ్స్క్రయిబర్లను మాత్రమే చేర్చుకుని స్వల్ఫ తగ్గుదలతోనే 118.1 మిలియన్ ఫీట్ సాధించడం విశేషం. ఇక ఈ వ్యవధిలోనే భారత్‌లో మాత్రం డిస్నీ ఫ్లస్కు భారీ దెబ్బ పడింది. ఇండియన్ వెర్షన్ సర్వీస్ ‘డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్’ సబ్ స్క్రయిబర్స్ను భారీగా కోల్పోయింది. ఏకంగా 20 లక్షల మంది సబ్స్క్రయిబర్లు దూరమైనట్లు గణాంకాలు చెప్తున్నాయి. కానీ, అమెరికా, ఇతర ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం డిస్నీ ఫ్లస్కు భారీగా సబ్ స్క్రయిబర్లు పెరగడం విశేషం. కొత్తగా ప్రారంభించిన ‘స్ట్రీమింగ్ వార్స్’కు విపరీతమైన ఆదరణ లభిస్తోంది ఇప్పుడు. గత మూడు నెలల వ్యవధిలో యూఎస్, యూరప్‌లలో డిస్నీ ఫ్లస్కు 40 లక్షల కొత్త సబ్ స్క్రయిబర్లు చేరడం గమనార్హం. వివిధ రకాల సర్వీసులతో ‘డిస్నీ ఫ్లస్’ను రెండేళ్ల క్రితం ప్రారంభించిన విషయం తెలిసిందే. చదవండి: ప్లాస్టిక్ నుంచి పెట్రోల్..అందుబాటులో ఎప్పుడంటే ? -
నెట్‌ఫ్లిక్స్ దశనే మార్చేసిన దక్షిణకొరియన్ డ్రామా..!
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన స్క్విడ్‌గేమ్ ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణను నోచుకుంది. స్క్విడ్‌గేమ్‌ను చూసేందుకు ఓటీటీ ప్రియులు ఎగబడుతున్నారు. గత నెల 17న రిలీజైన స్క్విడ్‌గేమ్ ప్రపంచవ్యాప్తంగా నెంబర్ వన్ డ్రామా సిరీస్‌గా నిలిచింది. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన 28 రోజుల్లో ఈ సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల మంది వీక్షించారు. చదవండి: రెండు రోజుల్లో రూ. 1100 కోట్లు భారీగా పెరిగిన సబ్స్క్రిప్షన్స్...! దక్షిణకొరియన్ వెబ్‌సిరీస్ స్క్విడ్‌గేమ్ రాకతో నెట్‌ఫ్లిక్స్ దశనే మార్చేసింది. కంపెనీ ఊహించని రీతిలో కొత్త కస్టమర్లు నెట్‌ఫ్లిక్స్ తలుపును తట్టారు. జూలై నుంచి సెప్టెంబర్‌లో సుమారు 4. 38 మిలియన్ల కొత్త కస్టమర్లు నెట్‌ఫ్లిక్స్‌ను సబ్‌స్రైబ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. స్క్విడ్‌గేమ్ సిరీస్‌తోనే భారీగా కొత్త సబ్స్క్రిప్షన్స్ పెరిగినట్లు నెట్‌ఫ్లిక్స్ ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ రాకతో ఓటీటీ ఇండస్ట్రీలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఒక్కసారిగా ఓటీటీ సబ్స్క్రిప్షన్ల సంఖ్య భారీగా పెరిగింది. 2020 ప్రథమార్థంలో ఓటీటీ సబ్స్క్రిప్షన్ల సంఖ్య దూసుకుపోయింది. ఈ సమయంలో ప్రముఖ ఓటీటీ సంస్థలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ప్రైమ్, హట్‌స్టార్ డిస్నీ, హెచ్‌బీవో మ్యాక్స్ మొదలైన వాటికి కాసుల వర్షం కురిసింది. అదే 2021తో పోలీస్తే ఓటీటీ యూజర్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. దక్షిణ కొరియన్ డ్రామా సిరీస్ రాకతో నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ల సంఖ్య ఇతర ఒటీటీ సంస్థలతో పోలిస్తే అనూహ్యంగా పెరిగింది. సెప్టెంబర్ నాటికి నెట్‌ఫ్లిక్స్‌కు ప్రపంచవ్యాప్తంగా 213.6 మిలియన్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. కలెక్షన్ కింగ్‌గా స్క్విడ్‌గేమ్..! సెప్టెంబర్ 17న "స్క్విడ్ గేమ్" విడుదలైనప్పటి నుంచి కంపెనీలో షేర్ల విలువ దాదాపు 7 శాతం పెరిగింది. ఇలా సంస్థ విలువ $278.1 బిలియన్లకు చేరుకుంది. ఇటు కొత్త చందాదారులు చేరడం, షేర్లు విలువ భారీగా పెరగడంతో సంస్థ విలువ కూడా భారీగా పెరిగింది. చదవండి: Ola Electric :ఓలా బైక్, నవంబర్ 10 నుంచి టెస్ట్ రైడ్స్ ప్రారంభం -
పరస్ డిఫెన్స్‌కు ఇన్వెస్టర్ల క్యూ
న్యూఢిల్లీ: పరస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకి ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. దరఖాస్తులు వెల్లువెత్తడంతో ఇష్యూ ఏకంగా 304 రెట్లు అధికంగా సబ్ర్‌స్కయిబ్ అయ్యింది. మంగళవారం(21న) ప్రారం భమైన ఇష్యూ గురువారం(23)తో ముగిసింది. వెరసి షేరుకి రూ. 165–175 ధరలో చేపట్టిన ఇష్యూలో భాగంగా కంపెనీ 71.4 లక్షలకుపైగా షేర్లను విక్రయానికి ఉంచింది. అయితే చివరి రోజుకల్లా 217 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 170 రెట్లు, నాన్‌ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కేటగిరీలో 928 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. ఇక రిటైల్ ఇన్వెస్టర్లు సైతం 112 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. ఇష్యూలో భాగంగా కంపెనీ 17,24,490 షేర్లను విక్రయించడంతోపాటు.. రూ. 141 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ఇష్యూ ముందురోజు(20న) యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు ద్వారా రూ. 51 కోట్లు సమకూర్చుకుంది. ఓయో ఐపీవో సన్నాహాలు రూ. 8,000 కోట్ల సమీకరణ లక్ష్యం న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ కంపెనీ ఓయో పబ్లిక్ ఇష్యూ ప్రణాళికల్లో ఉంది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి వచ్చే వారంలో దరఖాస్తు చేయనుంది. ఐపీవో ద్వారా 120 కోట్ల డాలర్లు(రూ. 8,000 కోట్లు) సమీకరించాలని ఆశిస్తోంది. ఇందుకు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు జేపీ మోర్గాన్, సిటీ, కోటక్ మహీంద్రా క్యాపిటల్‌ను ఎంపిక చేసుకుంది. -
నెట్‌ఫ్లిక్స్ మరో ఆప్షన్.. పేమెంట్స్ ఇప్పుడు మరింత ఈజీ
Netflix UPI Payment: కస్టమర్లకు మరింత సుళువుగా మెరుగైన సేవలు అందివ్వడంలో భాగంగా నెట్‌ఫ్లిక్స్ పేమెంట్ ఆప్షన్స్‌ని సరళతరం చేసింది. తేలికగా, వేగంగా అకౌంట్ రెన్యువల్ చేసుకునేలా కొత్త ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. 50 లక్షల మంది చందాదారులు ఓవర్ ది టాప్ ఆధారంగా వీడియో కంటెంట్ అందించే నెట్‌ఫ్లిక్స్‌కి ఇండియాలో యాభై లక్షల మందికి పైగా చందాదారులు ఉన్నారు. వివిధ వర్గాల అవసరాలకు తగ్గట్టుగా పలు రకాల ప్లాన్స్‌ని నెట్‌ఫ్లిక్స్ అమలు చేస్తోంది. కనిష్టంగా నెలకు రూ. 200ల నుంచి గరిష్టంగా రూ. 799 వరకు వివిధ రకాల ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి,. అయితే కొత్త చందాదారులతో పాటు పాత సబ్స్క్రైబర్లు తమ ఖాతాను రెన్యువల్ చేసుకోవాలంటే క్రెడిట్, డెబిట్ కార్డుల ఆధారంగానే చేసుకోవాల్సి వచ్చేది. ఇటీవలే ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఐడియా పేమెంట్ ఆప్షన్స్‌ని కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) పేమెంట్స్‌ని కూడా అందుబాటులోకి తెచ్చింది. యూపీఐ పేమెంట్స్ పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్థిక లావాదేవీలకు సంబంధించి యూపీఐ పేమెంట్స్ పెరిగిపోయాయి. గూగుల్‌పే, ఫోన్ పే, పేటీఎం తదితర యాప్‌లను ఉపయోగించి రోజువారి లావాదేవీలు నిర్వహిస్తున్న వారి సంఖ్య పెరిగింది. టీ కొట్టు, పాన్ షాప్‌ల నుంచి బడా మాల్స్ వరకు యూపీఐ పేమెంట్స్ సాధారణ విషయంగా మారింది. అయితే నెట్‌ఫ్లిక్స్ మాత్రం యూపీఐ పేమెంట్స్‌కి ఇంతకాలం అవకాశం లేదు. తాజాగా యూపీఐ పేమెంట్స్‌ని నెట్‌ఫ్లిక్స్ అందుబాటులోకి తెచ్చింది. యాక్టివేట్ చేసుకోండిలా నెట్‌ఫ్లిక్స్ పేమెంట్స్‌ని యూపీఐ ద్వారా చేయాలంటే నెట్‌ఫ్లిక్స్ సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకుంటే సరిపోతుంది. - నెట్‌ఫ్లిక్స్ ఇండియా వెబ్‌పోర్టల్ లేదా యాప్‌ని ఓపెన్ చేసి అకౌంట్ సెక్షన్లోకి వెళ్లాలి - మేనేజ్ పేమెంట్ ఆప్షన్ని క్లిక్ చేయాలి - చేంజ్ ది పేమెంట్ మెథడ్‌ని ఎంచుకోవాలి - అక్కడ యూపీఐ ఆటోపే అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోవాలి. చదవండి : ఈ మొబైల్ రీఛార్జ్‌తో ఏడాదిపాటు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, డిస్నీ హట్‌స్టార్ ఉచితం..! -
బీఎస్ఎన్ఎల్: ఆశ్చర్యకరమైన పరిణామాలు!
ప్రభుత్వ రంగ మొబైల్ నెట్వర్క్ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) ఆశ్చర్యకర ఫలితాల్ని చవిచూస్తోంది. 4జీ సర్వీసులు లేకున్నా.. ఆదాయంపై తీవ్ర ప్రతికూల ప్రభావం కొనసాగుతున్నప్పటికీ.. సబ్ స్క్రయిబర్ షేర్ మీద మాత్రం ఎలాంటి ప్రభావం పడకపోవడం విశేషం. బీఎస్ఎన్ఎల్ స్క్రయిబర్ షేర్ గత కొన్నేళ్లుగా నిలకడగా పెరుగుతూ వస్తోంది. 2016-2017 మధ్య బీఎస్ఎన్ఎల్ స్క్రయిబర్ షేర్ 8.6 శాతంగా ఉండగా, 2017-18కి 9.4 శాతం, 2018-19కి 9.9 శాతం, 2019-2020 నాటికి 10 శాతానికి చేరింది. ఇక 2020-2021కి(మార్చి 21, 2021) స్వల్పంగా పెరిగి.. 10.3 శాతానికి చేరుకుందని కేంద్ర మంత్రిత్వ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. డాటా వినియోగం, టెలికామ్ సెక్టార్లో పోటీ వల్ల టారిఫ్‌లలో మార్పులు కనిపిస్తున్నప్పటికీ.. 4జీ సర్వీసులు లేకపోవడం బీఎస్ఎన్ఎల్కు ప్రతికూలంగా మారాయని టెలికాం నిపుణులు చెప్తున్నారు. ఇది ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ARPU)పై మాత్రం ప్రభావం పడేలా చేస్తోంది. 4జీ ఎందుకు లేట్ అంటే.. లోకల్ ఎక్విప్మెంట్లు, తగిన సాంకేతికత లేకపోవడం బీఎస్ఎన్ఎల్ 4జీ ప్రయత్నాలకు ప్రతికూలంగా మారుతూ వస్తోంది. నిజానికి 2019 నాటి కేంద్ర కేబినెట్ నిర్ణయం ప్రకారం.. 4జీ స్పెక్ట్రమ్‌ను బీఎస్ఎన్ఎల్కు కేటాయించారు. ఆత్మనిర్భర్ భారత్ పథకం ప్రకారం, బీఎస్ఎన్ఎల్కు దాన్ని భారతీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూనే ఇవ్వాలని ఫిర్యాదులు రావడం, చైనా కంపెనీలు పాల్గొనకూడదన్న నిర్ణయంవల్ల గత రెండేళ్లుగా బీఎస్ ఎన్ఎల్ 4జీ సేవలను అమలు చేయడం ఆలస్యం అవుతోంది. హాట్ న్యూస్: మీ ఫోన్లో ఈ యాప్స్.. వెంటనే డిలీట్ చేయండి నష్టాల్ని ఇలా తగ్గించుకుంది పీఎస్‌యూ దిగ్గజం బీఎస్ఎన్ఎల్ గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నష్టాలు తగ్గించుకుంది. రూ. 7,441 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది(2019–20)లో దాదాపు రూ. 15,500 కోట్ల నికర నష్టం నమోదైంది. ప్రధానంగా ఉద్యోగుల వేతన వ్యయాలు క్షీణించడం ప్రభావం చూపినట్లు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. 78,569 మంది ఉద్యోగులు స్వచ్చంద పదవీ విరమణ చేపట్టిన నేపథ్యంలో వేతన వ్యయాలు తగ్గినట్లు తెలియజేశారు. మరోపక్క ఆర్థిక నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న వోడాఫోన్ ఐడియా-బీఎస్ఎన్ఎల్ను విలీనం చేయాలనే ప్రతిపాదనను కొందరు తెర మీదకు తెస్తున్నప్పటికీ.. ప్రభుత్వ పరిధిలో మాత్రం అలాంటి ఆలోచనేం కనిపించడం లేదు. -
ఈపీఎఫ్‌వో పరిధిలోకి 12.83 లక్షల కొత్త సభ్యులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పరిధిలోకి జూన్‌లో 12.83 లక్షల మంది కొత్తగా చేరారు. ఈ వివరాలను కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసింది. జూన్‌లో కరోనా వైరస్ నెమ్మదించడం ఉద్యోగ కల్పనకు దారితీసినట్టు పేర్కొంది. ఈ ఏడాది మే నెలలో నికర సభ్యుల నమోదుతో పోలిస్తే జూన్‌లో 5.09 లక్షల మంది కొత్తగా ఉపాధి పొందినట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జూన్‌లో 12.83 లక్షల మంది కొత్త సభ్యుల్లో 8.11 లక్షల మంది మొదటిసారిగా ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చినవారే. అంటే మొదటిసారి ఉపాధి పొందినట్టు తెలుస్తోంది. చదవండి : వాట్సాప్‌లో మరో ఫీచర్, ఇకపై ఐపాడ్లో కూడా -
జెఫ్ బెజోస్ కొంపముంచిన అంతరిక్ష యాత్ర...!
వాషింగ్టన్: అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ బ్లూఆరిజిన్ రాకెట్ ద్వారా అంతరిక్షయాత్రను విజయవంతంగా ముగించిన సంగతి తెలిసిందే. రోదసి యాత్ర విజయవంతమైనందుకు గాను జెఫ్ బెజోస్ అమెజాన్ ఉద్యోగులకు, కస్టమర్లకు కృతజ్క్షతలను తెలిపారు. కాగా రోదసీయాత్ర పూర్తి చేసుకున్న జెఫ్బెజోస్పై కొంత మంది మండిపడుతున్నారు. జెఫ్ బెజోస్ అంతరిక్షయాత్రను పన్నులు కట్టకుండా డబ్బులను సంపాదించారని సోషల్‌మీడియాలో నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర కొంపముంచుతుంది. తాజాగా బెజోస్ అంతరిక్షయాత్రకు వ్యతిరేకంగా పలువురు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను రద్దు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జెఫ్ బెజోస్ తన అంతరిక్షయాత్ర కోసం అమెజాన్ కస్టమర్ల, ఉద్యోగుల డబ్బులను వాడి వెళ్లి వచ్చారనే అభిప్రాయాన్ని నెటిజన్లు సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్చేస్తున్నారు. అమెజాన్ తన మార్కెట్ శక్తిని దుర్వినియోగం చేస్తూ, చిన్న వ్యాపారాలను దెబ్బతీసేందుకే ఉద్యోగులు చెల్లిస్తున్నారన్నారు. పన్నులు కట్టకుండా అమెరికన్లు చెమటోడ్చి సంపాదించి కట్టిన పన్నులతోనే స్పేస్ టూర్ చేసి వచ్చారని నెటిజన్లు ఎద్దెవా చేస్తున్నారు. జెఫ్ బెజోస్ గత నెలలో జూలై 20 న 11 నిమిషాల్లో చారిత్రాత్మక అంతరిక్ష యాత్రను విజయవంతంగా చేపట్టారు. ఈ పదకొండు నిమిషాల అంతరిక్ష యాత్ర కోసం 16 లక్షల డాలర్లు ఖర్చు చేశారని నెటిజన్లు దుయ్యబట్టారు. అంతరిక్షయాత్రను పూర్తి చేసిన కొద్ది రోజులకే జెఫ్ బెజోస్ ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానం నుంచి జెఫ్ బెజోస్ వైదొలిగాడు. బెజోస్ స్థానాన్ని ప్రముఖ లగ్జరీ గూడ్స్ లూయిస్ విట్టన్ మోయెట్ హెన్నెస్సీ(ఎల్వీఎమ్హెచ్) అధినేత బెర్నాల్డ్ ఆర్నాల్డ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం బెర్నాల్డ్ ఆర్నాల్డ్ 200.5 బిలియన్ డాలర్లతో ముందున్నారు. జెఫ్ బెజోస్ 190.7 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. Tone deaf doesn’t begin to describe this @JeffBezos quote. I’m sure your workers who get blocked from unionizing at every turn are just giddy with excitement about your neato field trip to outer space that they subsidized. https://t.co/pmgCUIp7kp — Nick Knudsen 🇺🇸 (@NickKnudsenUS) July 21, 2021 I'm about to cancel my Amazon prime membership quite literally just bc bezos said "thanks, you guys are the ones who paid for this" upon return from space. — ɴᴀᴅɪᴀ 💉💉 (@VainArab) July 24, 2021 @JeffBezos how about you give every Amazon prime subscriber a freebie considering we paid for you to go to space! I’d like you to pay me to stay at home and rent some films, not much to ask👍 #amazon #BlueOrigin #space #givemeabreak #amazonprime #freerental — FromTheShadows (@FTShadows) July 23, 2021 -
కొనసాగుతున్న 'జియో' జోరు, భారీగా పెరిగిన యూజర్లు
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద టెలికం ఆపరేటర్ రిలయన్స్ జియో చందాదారులు చేరికలోనూ ముందు వరుసలో నిలిచింది. ఏప్రిల్‌లో కొత్తగా 47 లక్షల మంది వినియోగదారుల సంపాదించింది. ఇదే సమయంలో భారతీ ఎయిర్టెల్ 5.1 లక్షల మంది కస్టమర్లను చేరుకోగా.. వొడాఫోన్ ఐడియా (వీఐ) 18 లక్షల మంది, బీఎస్ఎన్ఎల్ 13.05 లక్షల మంది కస్టమర్లను కోల్పోయాయని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తెలిపింది. తాజా వినియోగదారులతో కలిపి జియో మొత్తం చందాదారుల సంఖ్య 42.76 కోట్లకు.. భారతీ ఎయిర్టెల్ కస్టమర్ల సంఖ్య 35.29 కోట్లకు పెరిగాయి. తాజా క్షీణతతో బీఎస్ఎన్ఎల్ యూజర్ల సంఖ్య 11.72 కోట్లకు, వీఐ వినియోగదారుల సంఖ్య 28.19 కోట్లకు తగ్గాయి. అయితే ఈ ఏడాది మార్చిలో మాత్రం వీఐ 10 లక్షల మంది కస్టమర్లను సంపాదించింది. మొత్తంగా ఏప్రిల్ చివరి నాటికి దేశంలో టెలికం చందాదారుల సంఖ్య 120.34 కోట్లకు చేరింది. మార్చి నెలతో పోలిస్తే 0.19 శాతం వృద్ధి. కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏప్రిల్ నెలలో కొత్తగా 1.28 లక్షల మంది జియో కస్టమర్లుగా చేరారు. దీంతో కలిపి ఏపీ, టీఎస్ సర్కిల్లో జియో కస్టమర్ల సంఖ్య 3.21 కోట్లకు చేరింది. -
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు గుడ్ న్యూస్
సాక్షి, ముంబై: కరోనావైరస్ మహమ్మారి కాలంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) తన ఖాతాదారులకు ఊరటనిస్తోంది. కరోనా చికిత్స లేదా ఏదైనా ఇతర వైద్య అత్యవసర పరిస్థితుల్లో అకస్మాత్తుగా డబ్బు అవసరమైతే సాయం చేసేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఆకస్మిక వైద్య అత్యవసరాల నిమిత్తం ఈపీఎఫ్‌వో సభ్యులు తమ పీఎఫ్ ఖాతానుంచి లక్ష రూపాయలను అడ్వాన్స్ సదుపాయాన్ని అందిస్తోంది. ఇందుకు ఎటువంటి బిల్లు లేదా అంచనా వ్యయం వివరాలను చూపించాల్సిన అవసరం లేదు, ఈ మేరకు ఈపీఎఫ్‌వో జూన్ 1న ఒక సర్క్యులర్ జారీ చేసింది. కరోనావైరస్ సహా ఏదైనా ప్రాణాంతక వ్యాధి చికిత్సకు అకస్మాత్తుగా ఆసుపత్రిలో చేరినట్లయితే ఒక లక్ష మెడికల్ అడ్వాన్స్ ఇవ్వనున్నామని తెలిపింది. ఇందుకు ఇపిఎఫ్ సభ్యుడు ఎటువంటి బిల్లు లేదా అంచనా వ్యయాన్ని చూపించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు చేసుకున్న గంటలోనే ఆ మొత్తం ఖాతాకు జమ చేస్తామని వెల్లడించింది. అత్యవసర పరిస్థితుల్లో ఈపీఎఫ్ సభ్యులు ఈ అడ్వాన్స్ ఎలా తీసుకోవచ్చో కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ♦ రోగిని చికిత్స కోసం ప్రభుత్వ / ప్రభుత్వ రంగ యూనిట్ / సీజీజహెచ్ఎస్ ప్యానెల్ ఆసుపత్రిలో చేర్చాలి. ఒక వేళ అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరితే, అపుడు ఒక అధికారి వివరాలను పరిశీలించిన అనంతరం దీన్ని మంజూరు చేస్తారు. ♦ ఉద్యోగి లేదా కుటుంబ సభ్యులెవరైనా ఆసుపత్రి , రోగి వివరాలను తెలియజేస్తూ ఒక దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. ♦ అతడు, లేదా కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసిన ఒక గంటలోపే లక్ష రూపాయల మొత్తాన్ని జమచేస్తారు. ♦ ఈపీఎఫ్‌వో బోర్డు మే నెలలో జారీ చేసిన కోవిడ్ -19 అడ్వాన్స్‌కు ఇది పూర్తిగా భిన్నం.. ఇందులో మొత్తం ఫండ్‌లో నాన్ రిఫండబుల్ గా 75శాతం పొందే అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. -
కోటి మంది సబ్స్క్రైబర్లతో రికార్డు సృష్టించిన కుకింగ్ చానెల్
యూట్యూబ్.. వినోదానికే కాక ఉపాధికి నయా అడ్డాగా నిలుస్తుంది. పేరుతో పాటు డబ్బులు సంపాదించుకోవాలనుకునే వారి మొదటి ప్రాధాన్యం యూట్యూబ్‌గా మారింది. ఒక్కసారి క్లిక్ అయితే చాలు.. సబ్స్క్రైబర్లు.. వ్యూస్.. ఆదాయం వాటంతట అవే వస్తాయి. ఇక యూట్యూబ్‌లో చానెల్ ప్రారంభించడానికి గొప్ప గొప్ప డిగ్రీలు అక్కర్లేదు.. మనలో టాలెంట్ చాలు. ఈ వ్యాఖ్యలను నిజం చేశారు తమిళనాడుకు చెందిన రైతులు. వారు ప్రారంభించిన కుకింగ్ వీడియో చానెల్ నేడు కోటి మంది సబ్స్క్రైబర్లతో రికార్డు సృష్టించింది. ఆ వివరాలు.. చెన్నై: తమిళనాడుకు చెందిన విలేజ్ కుకింగ్ చానెల్ గత మూడేళ్లుగా తెగ ఫేమస్ అవుతుంది. ఈ క్రమంలో తాజాగా సదరు చానెల్ ఓ రికార్డు సృష్టించింది. తమిళనాడులో మొదటి సారి కోటి మంది సబ్స్క్రైబర్లను సంపాదించిన చానెల్‌గా గుర్తింపు పొందింది. ఆ వివరాలు.. తమిళనాడు పుడుక్కొట్టై జిల్లా చిన్న వీరమంగళం గ్రామానికి చెందిన ఎం పెరియతంబి అనే వృద్ధుడు గతంలో వంట మాస్టర్‌గా పని చేసేవారు. ఈ క్రమంలో పెరియతంబి, ఆయన మనవలు కలిసి కొన్నెళ్ల క్రితం యూట్యూబ్‌లో ‘‘విలేజ్ కుకింగ్’’ పేరిట ఓ చానెల్ ప్రారంభించారు. పెరియతంబి చేత సంప్రదాయ వంటలు చేయించి.. ఆ వీడియోలని యూట్యూబ్‌లో అప్లోడ్ చేసేవారు. ఇక వీరు చేసే వంట కూడా మాములగా ఉండదు. 200-300 వందల మందికి సరిపడేలా భారీ వంట చేస్తారు. వీడియో పోస్ట్ చేసిన తర్వాత తాము వండిన పదార్థాలను సమీపంలోని అనాథాశ్రమాలు, వృద్ధాశ్రామల్లో వారికి పెడతారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ వీరిని కలిశారు. వీరితో పాటు వంట చేసి.. అక్కడే కూర్చోని భోజనం కూడా చేశారు. దాంతో ఈ చానెల్ పేరు దేశవ్యాప్తంగా అందరికి తెలిసింది. అప్పటివరకు వారానికి 10 వేలుగా ఉన్న సబ్స్క్రైబర్ల సంఖ్య రాహుల్ గాంధీ వీరి వీడియోలో కనిపించిన తర్వాత 40-50 వేలకు పెరిగింది. ఇక రాహుల్ గాంధీ కనిపించిన వీడియో ఏకంగా 26 మిలియన్ల వ్యూస్ సంపాదించింది. తాజాగా సబ్స్క్రైబర్ల సంఖ్య కోటికి చేరడంతో యూట్యూబ్ నుంచి వీరికి డైమండ్ ప్లే బటన్ లభించింది. దీని అన్బాక్సింగ్ సందర్భంగా ఈ యూట్యూబర్స్ మాట్లాడుతూ.. ‘‘మాకు కేవలం ఆరు నెలలు మాత్రమే వ్యవసాయ పని ఉండేది. మిగతా ఆరు నెలలు ఖాళీగా ఉండే వాళ్లం. దాంతో ఇలా కుకింగ్ యూట్యూబ్ చానెల్ ప్రారంభించాలని భావించాం. కానీ మా చానెల్ ఇంత పాపులర్ అవుతుందని మేం కలలో కూడా అనుకోలేదు’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇక వీరు యూట్యూబ్ వ్యూస్ ద్వారా నెలకు 7 లక్షల రూపాయల యాడ్ రెవిన్యూ సంపాదిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వీరు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ని సీఎంపీఆర్ఎఫ్ నిధికి 10 లక్షల రూపాయల చెక్ అందచేశారు. -
నెట్‌ఫ్లిక్స్‌లో ఇకపై అలా నడవదు...!
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సరికొత్త ఆప్డేట్ను తీసుకురాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌కు 200 మిలియన్ల పైగా సబ్‌స్ర్కైబర్ ఉన్నారు. భవిష్యత్తు కాలంలో నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ డిటెల్స్‌ను ఇతరులతో పంచుకోలేరు. ఒకవేళ అకౌంట్ డిటెల్స్‌ను ఇతరులతో పంచుకున్న , వారికి అకౌంట్ ఉన్న వారు కచ్చితంగా అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ప్రసుత్తం కొంతమంది వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్ నుంచి తమ అకౌంట్‌ను వాడేవారు తమవారేనా..! అనే సందేశం యాప్ ఓపెన్ చేయగానే కనిపించింది. ప్రస్తుతం ఈ వెరిఫికేషన్‌ను వదిలేసిన, తిరిగి యాప్ ఓపెన్ చేయగానే ఈ సందేశం కనిపిస్తోంది. చివరికి అకౌంట్ లేనివారు కచ్చితంగా కొత్త అకౌంట్‌ను తీసుకోవాల్సిందే. ఈ ఆప్డేట్ను కంపెనీ ప్రస్తుతం టెస్ట్ చేస్తోంది. వాణిజ్యపరంగా, భద్రత కారణాల దృష్ట్యా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధి వెల్లడించారు. ఇదిలా ఉండగా నెటిజన్టు ఇకపై అకౌంట్ డిటైల్స్‌ను పంచుకోలేముని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: కోహ్లి ట్వీట్‌పై నెట్‌ఫ్లిక్స్ సంబరం) -
బీఎస్ఎన్ఎల్తో యప్ టీవీ భాగస్వామ్యం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్తో ప్రముఖ గ్లోబల్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యప్ టీవీ కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ అవగాహనా ఒప్పందం ప్రకారం కొత్త సర్వీసును తన యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ చందాదారులకు తన ఓటీటీ సేవలను మరింత విస్తరించేందుకు ‘యప్‌టీవీ స్కోప్ ప్లాట్‌ఫాం’ను లాంచ్ చేసింది. ఇందులో వినియోగదారులకు అన్ని ప్రీమియం ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు ఒకే ప్యాకేజీలో అందించనుంది. సోనీలివ్, జీ5, వూట్ సెలెక్ట్ అండ్ లైవ్ టీవీ లాంటి ప్రీమియం ఓటీటీ సర్వీసులను ఒకే ప్లాన్ ద్వారా పొందవచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్, ఆండ్రాయిడ్ టీవీ, అమెజాన్ ఫైర్ టీవీ ప్లాట్ ఫాంల్లో ఇది అందుబాటులో ఉండనుంది. దీంతో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ డివైస్‌లు, స్మార్ట్ టీవీల్లో ఓటీటీ సర్వీసులు ఎంజాయ్ చేయవచ్చు. ఏఐ, ఎంఎల్ సామర్థ్యాల వినియోగంతో యప్ టీవీ స్కోప్ అత్యంత క్యూరేటెడ్ అనుభవాన్ని అందిస్తుందనీ, మునుపెన్నడూ లేని విధంగా కంటెంట్ ఆవిష్కరణను సులభతరం చేస్తుంది. యప్‌టీవీ వెల్లడించింది. కంటెంట్కోసం పలు యాప్‌ల అవసరం లేకుండానే తమ క్రాస్-ప్లాట్‌ఫాం ద్వారా, స్మార్ట్ టీవీ, పీసీ, మొబైల్, టాబ్లెట్.. వివిధ పరికరాలకు యాక్సెస్ పొందవచ్చు. అలాగే వినియోగదారులు లైవ్ టీవీని చూస్తూనే ప్రత్యక్ష చాట్లను నిర్వహించవచ్చు, ప్రత్యక్ష పోల్స్‌లో పాల్గొనవచ్చు. నచ్చిన కంటెంట్‌ను కూడా కోరుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ భాగస్వామ్యంతో సింగిల్ సబ్స్క్రిప్షన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ యుప్ టీవీ స్కోప్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని యప్‌టీవీ వ్యవస్థాపకుడు ,సీఈఓ ఉదయ్ రెడ్డి వెల్లడించారు. అటు బీఎస్ఎనల్ఎల్ సీఎండీ సిఎండి శ్రీ పి.కె.పూర్వర్ కూడా ఈ సేవలపై సంతోషం వెలిబుచ్చారు. -
మరో అద్భుతమైన ఫీచర్‌తో స్నాప్‌చాట్!
స్నాప్‌చాట్‌లో ఇకపై సబ్‌స్రైబర్స్ సంఖ్య కనబడనుంది. క్రియేటర్లకు ఆ అవకాశాన్ని కల్పిస్తూ ప్రముఖ యాప్ అనుమతినిచ్చింది. ఇది స్నాప్‌చాట్ సాధించిన గొప్ప విజయంగా చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు స్నాప్‌చాట్‌లో సబ్స్రైబర్స్ను చూసే అవకాశం లేదు. ప్రసుత్తం యాప్‌ను అప్డేట్ చేసి క్రియేటర్స్‌కు తమకు ఉన్న సబ్స్రైబర్స్ను బహిర్గతం చేసే అవకాశాన్ని కల్పించింది. ఎలాంటి సోషల్‌మీడియా నిషేధాలు లేకుండా సన్నిహితులు ఉపయోగించుకోవడానికి ఇది ఒక మంచి యాప్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం స్నాప్‌చాట్‌లో ఈ అప్డేట్ కనిపిస్తోంది. ఈ యాప్‌లో క్రియేటర్స్‌ను స్నాప్ స్టార్స్ అని కంపెనీ సంబోధిస్తుంది. క్రియేటర్స్ కంటెంట్ డిస్కవరీ అనే విభాగంలో కనిపిస్తోంది. అదేవిధంగా సెర్చ్ అప్షన్ ద్వారా కూడా మీరు కావలసిన క్రియేటర్స్ కోసం వెతకవచ్చు. సెర్చ్ బార్ దగ్గర స్నాప్‌చాట్ ప్రసిద్ధ స్నాప్స్టార్స్ను కూడా చూపెడుతోంది. ఇక క్రియేటర్‌కు ఎంత మంది సబ్‌స్రైబర్స్ ఉన్నారో తెలుసుకోవాలంటే వారి ప్రొఫైల్ మీద ప్రెస్ చేయాలి. చదవండి: క్షమాపణలు చెప్పిన స్నాప్‌చాట్, కారణం? స్నాప్‌చాట్‌లో కొత్తగా వచ్చిన ఈ అప్డేట్ వలన వివిధ రకాల సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫాంలలో ప్రముఖులకు ఉన్న ఫాలోవర్స్‌ను స్నాప్‌చాట్‌లో ఉన్న ఫాలోవర్స్‌తో పోల్చి చూసుకోవచ్చు. అయితే చాలా మంది క్రియేటర్స్ తమ ఫాలోవర్స్ సంఖ్యను తెలిపే అవకాశం ఇవ్వాలని కోరడంతో ఈ అప్డేట్ను తీసుకువచ్చినట్లు స్నాప్‌చాట్ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం స్నాప్‌చాట్ వినియోగం పెరుగుతోంది. భారతదేశంలో దీని వినియోగం రెట్టింపు అయ్యింది. చదవండి: ‘మానసిక సమస్యలకు స్నాప్‌చాట్ ఫీచర్’ -
రెండు దఫాలుగా ఈపీఎఫ్ వడ్డీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కీలక నిర్ణయం తీసుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను వడ్డీని రెండు దఫాలుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనుంది ఎంప్లాయూస్ ప్రావిడెంట్ ఫండ్ పై ప్రస్తుతానికి కొంత భాగాన్ని..8.5 శాతం వడ్డీ మాత్రమే చెల్లించాలని నిర్ణయించింది. మిగిలిన దాన్ని డిసెంబరులో చెల్లించనుంది. దీనిపై ఈపీఎఫ్ఓ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ), డిసెంబరులో మరోసారి సమావేశం కానుంది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈపీఎఫ్ ఖాతాల్లోని ఫండ్‌పై 8.15 శాతం వడ్డీని ప్రస్తుతం జమ చేస్తారు. మిగిలిన 0.35 శాతం వడ్డీని ఈ ఏడాది డిసెంబరులో జమ చేయనుంది. ఈక్విటీ పెట్టుబడుల డైల్యూషన్ ద్వారా 0.35 శాతం బకాయి వడ్డీని డిసెంబర్లో చెల్లించేలా బుధవారం జరిగిన ఈపీఎఫ్ఓ ట్రస్టీల సమావేశం నిర్ణయించింది. కోవిడ్-19 అసాధారణమైన పరిస్థితుల దృష్ట్యా, వడ్డీ రేటుకు సంబంధించిన ఎజెండాను కేంద్ర బోర్డు సమీక్షించింది. అలాగే కరోనావైరస్ మహమ్మారి కాలంలో ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఇడిఎల్ఐ) పథకం కింద ఉన్న గరిష్ట హామీ ప్రయోజనాన్ని ప్రస్తుతమున్న రూ .6 లక్షల నుండి రూ .7 లక్షలకు పెంచింది. దీంతో ఆరు కోట్ల మంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది. కాగా లక్ష కోట్ల రూపాయల విలువైన ఈటీఎఫ్ పెట్టుబడులపై నష్టాలు రావడం చందాదారుల చెల్లింపును దెబ్బతీసినట్టు సమాచారం. వార్షిక డిపాజిట్లలో, ఇపిఎఫ్ఓ 85 శాతం రుణ సాధనాలలో, 15 శాతం ఈటీఎఫ్ లలో పెట్టుబడి పెడుతుంది. మరోవైపు కరోనా సంక్షోభ కాలంలో క్లెయిమ్‌ల సంఖ్యం మొత్తం 13 శాతం పెరిగింది. ఏప్రిల్-ఆగస్టు కాలంలో మొత్తం 35,445 కోట్ల విలువైన 94.41 లక్షల క్లెయిమ్‌లను చెల్లించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 32 శాతం ఎక్కువ. -
ఎయిర్టెల్ వినియోగదారులకు శుభవార్త..!
న్యూఢిల్లీ: బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు ఎయిర్టెల్ శుభవార్త ప్రకటించనుంది. ప్రస్తుతం ఎయిర్టెల్ తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు అయిన బేసిక్, ఎంటర్టైన్మెంట్, ప్రీమియం, తదితర వాటికి డేటా పరిమితిని తొలగించనుంది. ప్రస్తుతం అన్ని ప్లాన్ల వినియోగదారులకు అపరిమిత డేటా ఆఫర్ ఇవ్వనుంది. అయితే తమ ఖాతాదారులు జియోకు మారకుండా ఉండే ప్రణాళికలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రూ. 299 అన్లిమిటెడ్ డేటా యాడ్ ఆన్ ప్యాక్‌ను తొలగించింది. అయితే అపరిమిత డేటా ప్రయోజనం 3300 జీబీ ఎఫ్‌యూపీ క్యాప్‌తో అందుబాటులోకి రానుంది. ఎయిర్టెల్ తాజా ఆఫర్‌కు సంబంధించిన వివరాలు ఎయిర్టెల్ వెబ్సైట్, మై ఎయిర్టెల్ యాప్‌లో పెట్టనున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. కాగా రిలయన్స్ జియోతో పోటీని తట్టుకోవడానికి ఈ ఆఫర్ ప్రకటించిందని మొబైల్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎయిర్టెల్ తాజా నిర్ణయంతో తమ వినియోగదారులు జియోకు మారకుండా ఉండేందుకు దోహదం చేస్తుందని ఎయిర్టెల్ భావిస్తుంది. ఇదివరకే ఆంధ్రప్రదేశ్, గుజరాత్ సర్కిళ్లలో ఎయిర్టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లపై అపరిమిత డేటాను అందిస్తున్న విషయం తెలిసిందే. (చదవండి: చిప్స్ కొంటే..ఉచిత డేటా : ఎయిర్టెల్) -
మిలియనీర్లుగా యూట్యూబ్ స్టార్లు!
ఇప్పుడంతా డిజిటల్ హవా నడుస్తోంది. మరీ ముఖ్యంగా లాక్‌డౌన్‌తో చాలామంది యూట్యూబ్‌లో సత్తా చాటుతున్నారు. ఓ నివేదిక ప్రకారం యువత రోజుకు సగటున 25% సమయాన్ని ఆన్లైన్లో కంటెంట్ కోసం వెచ్చిస్తున్నారట. ఇది వరకు అయితే యూట్యూబ్‌లో పాపులారిటీ తెచ్చుకొని స్టార్లు అయ్యేవారు. ఇప్పుడు స్టార్లు సైతం యూట్యూబ్ బాట పట్టారు. లక్షల్లో వ్యూస్, వేలల్లో సబ్స్రైబర్లతో కంటెంట్ క్రియేటర్స్‌గా మారి యూట్యూబ్‌లోనూ హవా చాటుతున్నారు. కాలానికి తగ్గట్లు మనమూ మారాలి. టెక్నాలజిని అందిపుచ్చుకొని ప్రస్తుత పరిస్థితుల్లో ఏది అవసరమో ఆ కంటెంట్‌ను రెడీ చేసుకోవాలి. లేదంటే అవుట్‌డేట్ అయిపోతాం. సరిగ్గా ఈ సూత్రాలనే పాటిస్తూ ప్రముఖులను సైతం సబ్‌స్రైబర్లుగా మలుచుకుంటున్నారు కొందరు యూట్యూబ్ స్టార్స్. అంతేకాకుండా క్రియేవిటీతో లక్షల్లో సంపాదిస్తూ మిలియనీర్లుగానూ చలామణి అవుతున్న ఇండియన్ టాప్ యూట్యూబ్ స్టార్ల గురించి సాక్షి ప్రత్యేక కథనం అజే నాగర్ అనే 21 ఏళ్ల కంటెంట్ క్రియేటర్ టిక్‌టాక్ వర్సస్ యూట్యూబ్ అనే ఒక్క వీడియో రూపొందించి అప్పటివరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేశాడు. క్యారీమినాటి పేరుతో ఛానెల్ నడుపుతూ అత్యధికంగా 24 మిలియన్ సబ్స్రైబర్లను సొంతం చేసుకొని యూట్యూబ్‌లో అగ్రగామిగా నిలిచాడు. పాఠశాల విద్యను మధ్యలో వదిలేసినా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక యూట్యూబ్ సబ్స్రైబర్లు ఉన్న స్వీడిష్ యూట్యూబర్ ప్యూడీపీతో సరిసమానంగా సత్తా చాటుతున్నాడు. 5 ఏళ్ల క్రితమే ఛానల్‌ను ప్రారంభించి అతి తక్కువ టైంలోనే వరల్డ్ రికార్డులతో పోటీపడుతున్నాడు. View this post on Instagram 🙋🏼♂️ A post shared by 𝑨𝒋𝒆𝒚 𝑵𝒂𝒈𝒂𝒓 (@carryminati) on Feb 3, 2020 at 10:58pm PST 2018 గ్లోబల్ టాప్ 10 వీడియో లిస్ట్‌లో అమిత్ భదానా క్రియేట్ చేసిన కంటెంట్ కూడా ఒకటి. 20 మిలియన్ సబ్స్రైబర్లతో యూట్యూబ్‌లో ప్రస్తుతం రెండో స్థానంలో చెలామణి అవుతున్నాడు ఈ 21 సంవత్సరాల కుర్రాడు. మూడేళ్ల క్రితం కామెడీ స్కెచ్ వీడియోలతో ప్రస్తానం మొదలుపెట్టి ఇప్పడు స్టార్స్‌తోనూ వీడియోలు చేస్తూ బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పోగేసుకున్నాడు. వీళ్లతో పాటు ఆశిష్ చంచలాని, భువన్ బామ్ లాంటి కంటెంట్ క్రియేటర్లు కూడా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. వెబ్‌సిరీస్‌లోనూ ఆశిష్ నటించాడు. టెక్నాలజీ గురూజీ పేరుతో ఛానల్ ప్రారంభించిన గౌరవ్ చౌదరి ఫోర్బ్స్అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకొని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. View this post on Instagram Kaise ho dosto? Waise gaming ka alag hi maja hai🔥... #Binod ko bhi #ROGPhone3 ki gaming pasand hai🤣... Guess karo main kaunsa game khel raha hu??? A post shared by Gaurav Chaudhary (@technicalguruji) on Aug 19, 2020 at 8:57pm PDT -
‘వీడియో గేమ్ ఆడితే 83 ఏళ్లు ఫ్రీ’
ముంబై: గ్లోబల్ ఎంటర్టైన్మెంట్స్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. వినియోగదారులను ఆకర్శించే ప్రణాళికను నెట్‌ఫ్లిక్స్ రచించింది. అయితే వినియోగదారులు ఉచిత సేవలను పొందాలంటే ‘ద ఓల్డ్ గార్డ్’ అనే వీడియా గేమ్‌లో అత్యధిక స్కోర్ తెచ్చుకోవాలని షరతు పెట్టింది. వీడియో గేమ్‌లో అత్యధిక స్కోర్ సాధించిన వినియోగదారులకు 83 సంవత్సరాలు లేదా 1,000 నెలల నెట్‌ఫ్లిక్స్ ఉచిత సేవలను పొందవచ్చని సంస్థ పేర్కొంది. అయితే ఈ వీడియో గేమ్‌ను జులై 17 8గంటల నుంచి జులై 19వరకు ఆడే వినియోగదారులను ఉచిత సేవల ఆఫర్ వర్తిస్తుందని సంస్థ పేర్కొంది. అయితే నెట్‌ఫ్లిక్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2020) ఎన్నో ప్రతికూలతలున్న రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అయితే కోవిడ్-19 కట్టడికి అమలు చేసిన లాక్డౌన్, ప్రత్యర్ధి సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీ తట్టుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ బహుముఖ వ్యూహాలను అమలు చేస్తోంది. మరోవైపు కరోనా నేపథ్యంలో కుటుంబ సమేతంగా సినిమాలు వీక్షించే వారికి నెట్‌ఫ్లిక్స్ మంచి క్వాలిటీ అందిస్తు వినియోగదారుల నమ్మకాన్ని చూరగొన్న విషయం తెలిసిందే. (చదవండి: శాంసంగ్ టీవీల్లో ‘నెట్‌ఫ్లిక్స్’ కట్) -
నెట్ఫ్లిక్స్కూ కోవిడ్-19 షాక్
గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2020) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అయితే మూడో త్రైమాసికానికి(జులై- సెప్టెంబర్) అంచనాలను కుదించింది. కోవిడ్-19 కట్టడికి అమలు చేసిన లాక్‌డవున్, ప్రత్యర్ధి సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీ.. ఇందుకు కారణమయ్యాయి. గురువారం మార్కెట్లు ముగిశాక ఫలితాలు వెల్లడించడంతో ఫ్యూచర్స్‌లో నెట్‌ఫ్లిక్స్ కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. వెరసి నాస్డాక్ ఫ్యూచర్స్‌లో నెట్‌ఫ్లిక్స్ షేరు 9.5 శాతం కుప్పకూలింది. 477 డాలర్లకు చేరింది. దీంతో నేటి(శుక్రవారం) ట్రేడింగ్‌లో ఈ ప్రభావం కనిపించే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. గురువారం ట్రేడింగ్‌లో నెట్‌ఫ్లిక్స్ షేరు 0.8 శాతం బలపడి 527 డాలర్లకు ఎగువన ముగిసింది. క్యూ2 రికార్డ్ లాక్‌డవున్‌ల కారణంగా ఈ ఏడాది క్యూ2(ఏప్రిల్- జూన్)లో నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 10 మిలియన్ కొత్త కస్టమర్లను పొందింది. దీంతో కొత్త కస్టమర్ల సంఖ్య 26 మిలియన్లకు చేరింది. అయితే క్యూ3లో కొత్త పెయిడ్ కస్టమర్ల సంఖ్య 2.5 మిలియన్లకు తగ్గనున్నట్లు అంచనా వేసింది. స్ట్రీమింగ్ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా 5.3 మిలియన్ కొత్త కస్టమర్లు జతకాగలరని విశ్లేషకులు అంచనా వేశారు. అమెజాన్ ప్రైమ్‌తోపాటు ఇటీవల డిస్నీప్లస్ రేసులోకి రావడంతో పోటీ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ ఏడాది తొలి అర్ధభాగంతో పోలిస్తే ద్వితీయార్ధంలో పనితీరు మందగించనున్నట్లు నెట్‌ప్లిక్స్ అభిప్రాయపడింది. ఆదాయం అప్ క్యూ2లో నెట్‌ఫ్లిక్స్ ఆదాయం 25 శాతం పెరిగి 6.15 బిలియన్ డాలర్లను తాకగా.. నికర లాభం రెండు రెట్లు ఎగసి 72 కోట్ల డాలర్లకు చేరింది. క్యూ3లో 6.33 బిలియన్ డాలర్ల ఆదాయం, 95.4 కోట్ల డాలర్ల నికర లాభాన్ని నెట్‌ఫ్లిక్స్ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కంటెంట్ చీఫ్‌గా వ్యవహరిస్తున్న టెడ్ శరండోస్ను కో-సీఈవోగా ప్రమోట్ చేస్తున్నట్లు నెట్‌ప్లిక్స్ తాజాగా పేర్కొంది. తద్వారా కంపెనీ సహవ్యవస్థాపకుడు, సీఈవో రీడ్ హ్యాస్టింగ్కు కార్యకలాపాల నిర్వహణలో మరింత సహకారాన్ని అందించనున్నట్లు తెలియజేసింది. -
పీఎఫ్ ఖాతాదారులకు మరో షాక్ ?
సాక్షి, న్యూఢిల్లీ : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్. ఖాతాదారుల నగదుపై వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ తగ్గించనుందని సమాచారం. 2019-20 ఏడాదికిగానూ 8.65 శాతం నుంచి 8.5 శాతానికి తగ్గించిన సంస్థ తాజాగా వడ్డీరేట్లను 8.1శాతానికి కోత పెట్టనుంది. మార్కెట్ అస్థిరత, ఆదాయం భారీగా క్షీణించిన కారణంగా సంస్థ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ ఈపీఎఫ్ఓ ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆడిట్ కమిటీతో త్వరలోనే సమావేశం కానున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఉద్యోగులు, యజమానుల భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ప్రకటించిన చర్యలు, ఖాతాదారులు ఎక్కువ నిధులను విత్‌డ్రా చేయడం, ద్రవ్య లభ్యతపై ప్రభావం చూపిందని భావిస్తున్నారు. ఈ వడ్డీ రేట్ల కోత దాదాపు 6 కోట్ల మంది ఖాతాదారులను ప్రభావితం చేయనుంది. కాగా పీఎఫ్ ఖాతాలపై వడ్డీరేటును 8.65 శాతం నుంచి 8.5 శాతానికి కుదించినట్లు కేంద్ర మంత్రి సంతోష్ గాంగ్వర్ మార్చి మొదటి వారంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇంకా ఆమోదించలేదు. అటు కరోనా కాలంలో ఏప్రిల్ , మే నెలల్లో 11,540 కోట్ల రూపాయల మేర, 3.61 మిలియన్ల క్లెయిమ్‌లను పరిష్కరించినట్టు ఈపీఎఫ్ఓ ప్రకటించింది. -
రీచార్జ్ చేయకుంటే కనెక్షన్ కట్: నెట్‌ఫ్లిక్స్
లాక్డౌన్ వేళ స్మార్ట్‌ఫోన్ లేదా ఇంటర్నెట్ ఉంటే చాలు కావాల్సిన సినిమాలను వీక్షించవచ్చు. అయితే సినిమాలు చూడటానికి చాలా సైట్లు అందుబాటులో ఉన్నా.. నెట్‌ఫ్లిక్స్ సైట్ ప్రాచుర్యం పొందింది. థియేటర్లకు వెళ్లలేని వినియోగదారులకు ఈ సైట్ అత్యుత్తమ ప్రమాణాలతో సేవలను అందిస్తుంది. తాజాగా నెట్‌ఫ్లిక్స్ సైట్ కీలక ప్రకటన చేసింది. ఈ సైట్‌ను నెల లేదా సంవత్సర కాలానికి రీచార్జ్ చేసి.. వ్యాలిడిటీ అయిపోయాగానే వినియోగదారులు స్పందించడం లేదని సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. అధిక సంఖ్యలో వినియోగదారులు రీచార్జ్ చేయడం లేదని.. సైట్‌ను రీచార్జ్ చేయని వినియోగదారులు స్పందించకుంటే కనెక్షన్లను తీసివేస్తామని సంస్థ ప్రతినిథి యెడ్డీ వూ హెచ్చరించ్చారు. రెండు సంవత్సరాలకు మించి సైట్‌ను వీక్షించని వినియోగదారుల కనెక్షన్లకు ఇదే నిబంధన వర్తిస్తుందని సంస్థ పేర్కొంది. సంస్థ నియమాల వల్ల కేవలం ఒక శాతం వినియోగదారులు దూరం కావచ్చని యెడ్డీ వూ అభిప్రాయపడ్డారు. తాజా చర్యల వల్ల వినియోగదారలకు నెట్‌ఫ్లిక్స్‌పై మరింత నమ్మకం కలుగుతుందని సంస్థ ప్రతినిథులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సైట్లో కేవలం సినిమాలు మాత్రమే కాకుండా క్రికెట్, టెన్నిస్, ఫుట్‌బాల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు వినియోగదారులు ఇష్టపడుతున్నారు. యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లు ఉండడం వల్ల వినియోగదారులు ఎక్కువగా ఈ సైట్‌కు మొగ్గు చూపుతున్నారు. చదవండి: శాంసంగ్ టీవీల్లో ‘నెట్‌ఫ్లిక్స్’ కట్ -
పీఎఫ్ ఖాతాదారులకు షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) డిపాజిట్లపై వడ్డీ రేట్లపై కోత పెట్టింది. 2019 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2020 ఆర్థిక సంవత్సరంలో 8.50 శాతానికి (15 బేసిస్ పాయింట్లు) తగ్గిస్తూ నిర్ణయించింది. పీఎఫ్ వడ్డీరేటు కుదింపుపై నేడు (మార్చి 5, గురువారం) సమావేశమైన కేంద్ర ట్రస్టీల బోర్డు (సీబీటీ) ఈ తుది నిర్ణయం తీసుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ వడ్డీరేటును 8.5 శాతంగా ఉంచినట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ వెల్లడించారు. పీఎఫ్ వడ్డీ రేటు కోతపై కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ఈపీఎఫ్‌వోలోని 60 మిలియన్ల ఖాతాదారులను ప్రభావితం చేయనుంది. -
జియోకు షాక్ : దూసుకుపోతున్న ఎయిర్టెల్
సాక్షి, ముంబై: టెలికాం దిగ్గజం సంస్థ భారతి ఎయిర్టెల్ ఇటీవల ప్రారంభించిన వైఫై కాలింగ్ ఫీచర్ దూసుకుపోతోంది. ఇప్పటికే ఒక మిలియన్‌కు పైగా వినియోగదారులను నమోదు చేసింది. ఈ మేరకు ఎయిర్టెల్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా వైఫై కాలింగ్ ఫీచర్ తీసుకొచ్చింది తామేనని ఎయిర్టెల్ వినియోగదారులు ఏ వైఫైలో అయినా ఈ సేవను ఉపయోగించుకోవచ్చని భారతి ఎయిర్టెల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రణదీప్ సెఖోన్ తెలిపారు. ముఖ్యంగా ప్రధాన ప్రత్యర్థి, రిలయన్స్ జియో తమ మొబైల్ వినియోగదారులకోసం వైఫై సేవలను ప్రారంభించిన రెండు రోజుల తరువాత ఈ గణాంకాలను విడుదల చేయడం గమనార్హం. కాగా గత ఏడాది డిసెంబరులో ఎయిర్టెల్ తన ‘వాయిస్ ఓవర్ వైఫై (వీఓవైఫై)’ సేవలను మొట్టమొదటి సారిగా ప్రారంభించింది. ఈ సేవలు తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలతోపాటు ఢిల్లీ, ముంబై, తమిళనాడు, కోల్‌కతాలో అందుబాటులో ఉన్నాయి. 16 బ్రాండ్లలో 100కి పైగా స్మార్ట్‌ఫోన్ మోడళ్లు, ప్రస్తుతం ఎయిర్టెల్ వైఫై కాలింగ్ ఫీచర్‌కు మద్దుతునిస్తున్నాయి. ఈ సేవలకు అదనంగా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. వీఓ వైఫై టెక్నాలజీతో పబ్లిక్ హాట్‌స్పాట్ లేదా ప్రైవేట్ హోం వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసుకొని ఏ మొబైల్‌ఫోన్‌కైనా, ల్యాండ్‌లైన్‌కైనా కాల్స్ చేసుకోవచ్చు. -
ఫేక్ న్యూస్ : ఈపీఎఫ్ఓ రూ. 80వేలు ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: ఉద్యోగులకు తాజాగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ)ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేసింది. ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ సంస్థ రూ.80,000లు బహుమతి ఇస్తుందంటూ సోషల్ మీడియాలో ఒక సందేశం విపరీతంగా షేర్ అవుతోందని.. ఇది ఫేక్ అని తేల్చి చెప్పింది. ఇలాంటి సత్యదూరమైన మెసేజ్‌ల పట్ల అప్రతమత్తంగా ఉండాలని సూచించింది. తామెలాంటి ఆఫర్లను అందించడం లేదని స్పష్టం చేసింది. ఈపీఎఫ్ఓ చందాదారులకు బంపర్ అఫర్‌అంటూ ఒక ఫేక్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది కేవలం 1990 నుంచి 2019 మధ్య కాలంలో పని చేసిన వారికే వర్తిస్తుందని..ఇక దాన్ని పొందాలంటే కింద ఇచ్చిన వెబ్ సైట్ లింక్‌లో వివరాలు తెలియజేయాలంటూ ఓ వాట్సాప్ మెసేజ్ వైరల్ అవుతోంది. దీంతో ఖాతాదారులు ఈపీఎఫ్ఓకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సంస్థ ఇది ఫేస్ న్యూస్ అని, ఇలాంటి పుకార్లను నమ్మవద్దవని స్పష్టం చేసింది. అలాగే ఈపీఎఫ్ఓ పేరుతో వచ్చే నకిలీ కాల్స్, మెసేజ్స్ వచ్చినా కూడా స్పందించరాదని ఖాతాదారులను హెచ్చరించింది. ఈ మేరకు అధికారిక ట్విటర్ ద్వారా ఇటువంటి వాటితో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించింది. Beware of FAKE OFFERS by Websites/Telecalls/SMS/email/Social Media, ASKING TO DEPOSIT MONEY into any Bank Account towards Claim Settlement/Advance/Higher Pension/ or any other service provided by #EPFO.#Fraud #FakeCalls #Lottery pic.twitter.com/ekuvhcyJsq — EPFO (@socialepfo) October 29, 2019 -
వొడాఫోన్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్
సాక్షి, ముంబై: టెలికాం సంస్థ వొడాఫోన్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ.69 ల ఒక కొత్త ప్రీ పెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. 28 రోజల వాలిడిటీ ఉన్న ఈ ప్లాన్‌లో 150 నిమిషాల వాయిస్ కాల్స్, 250 ఎంబీ డేటా ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తోంది. అలాగే పలు సర్కిల్స్‌లో ఈ ప్లాన్‌లో ఎస్ఎంఎస్లు కూడా ఉచితం. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ, అస్సాం, బీహార్, జార్ఖండ్, ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో మాత్రమే ఈ ప్లాన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. తన ఆల్ రౌండర్ ప్రీ పెయిడ్ ప్లాన్లలో ఈ కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. తన పోర్ట్ఫోలియోలోఇప్పటికే లాంచ్ చేసిన రూ .45 , 35, 65, 95, రూ .145 ప్లాన్లకు కొనసాగింపుగా దీన్ని తీసుకొచ్చింది. -
వోడాఫోన్ ఐడియానా, జియోనా కింగ్ ఎవరు?
సాక్షి, ముంబై : భారతీయ టెలికాం పరిశ్రమలో వోడాఫోన్ ఐడియా అతిపెద్ద కంపెనీగా అవతరించింది. 380కి పైగా చందాదారులతో వోడాపోన్ ఐడియా ఈ ఘనతను సాధించింది. జులై మాసానికి సంబంధించి గణాంకాలను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)తాజాగా విడుదల చేసింది. 38 కోట్ల మంది సభ్యులతో వొడాఫోన్ ఐడియా దిగ్గజం కంపెనీగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. కాగా రిలయన్స్ జియో 33.98 కోట్ల వినియోగదారులతో రెండవ స్థానంలోనూ, 32.85 కోట్ల మంది వినియోగదారులతో ఎయిర్టెల్ తొలి మూడవ స్థానంలోనూ నిలిచాయి. దీంతో ఇవాల్టి బేర్ మార్కెట్లో కూడా వోడాఫోన్ ఇండియా కౌంటర్ ఏకంగా 16శాతం ఎగియడం విశేషం. జూలై చివరి నాటికి మొత్తం వైర్లెస్ చందాదారుల సంఖ్య 1,168.3 మిలియన్లకు పెరిగిందని ట్రాయ్ తెలిపింది. జూలై 31, 2019 నాటికి, ప్రైవేట్ యాక్సెస్సర్వీస్ ప్రొవైడర్లు వైర్లెస్ చందాదారుల మార్కెట్ వాటాను 89.73 శాతం కలిగి ఉండగా, ప్రభుత్వ రంగ సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎమ్టిఎన్ఎల్ మార్కెట్ వాటాను కేవలం 10.27 శాతం మాత్రమే కలిగి ఉన్నాయని ట్రాయ్ తన నివేదికలో రాసింది. అలాగే జూన్ చివరి నుంచి జూలై చివరి నాటికి అన్ని కంపెనీలు చందారులను కోల్పోతుండగా, వోడాఫోన్ ఐడియాలో ఈ సంఖ్య ఎక్కువగా ఉంది. గత కొన్ని నెలలుగా ఇదే ధోరణి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మొత్తం క్రియాశీల చందాదారుల విషయానికొస్తే ఎయిర్టెల్ టాప్‌లో ఉంది. 94.95 శాతం చందాదారులు యాక్టివ్‌గా ఉన్నారు. ఆ తరువాత జియో 83.07 శాతం, వోడాఫోన్ ఐడియా 81.9 శాతంతో ఉన్నాయి. -
పీఎఫ్ చందాదారులకు శుభవార్త
సాక్షి, న్యూఢిల్లీ: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఖాతాదారులకు శుభవార్త అందించింది. 2018-19 సంవత్సరానికి 6 కోట్ల మంది సభ్యుల ఖాతాల్లోకి త్వరలోనే వడ్డీని చెల్లించనున్నారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే కొత్త వడ్డీ రేటు అమలులోకి వస్తుందని, తద్వారా ఆరు కోట్ల మంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. 2018-19 సంవత్సరానికి గాను 8.65శాతం వడ్డీని చెల్లించనున్నామన్నారు. పండుగ సీజన్ కన్నా ముందుగానే పీఎఫ్ ఖాతాదారులకు 8.65 శాతం వడ్డీ రేటు లభిస్తుందని సంతోష్ గంగ్వార్ పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇది 8.55 శాతం మాత్రమే. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గానూ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) చందాదారులకు వారి పీఎఫ్ ఖాతాల్లో త్వరలోనే 8.65 శాతం వడ్డీ రేటు లభిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. 2017-18 ఆర్థిక సంవత్సరపు వడ్డీ రేటుతో (8.55 శాతం) పోలిస్తే 2018-19 ఆర్థిక సంవత్సరం పీఎఫ్ వడ్డీ 10 బేసిస్ పాయింట్లు (8.65 శాతం) ఎక్కువగా ఉంది. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి గత మూడేళ్లలో ఈపీఎఫ్ వడ్డీ రేటు పెరగడం ఇదే తొలిసారి. 2015–16 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీరేట్లు 8.8 శాతం ఉండగా అప్పటి పరిస్థితుల రీత్యా వాటిని క్రమంగా ఐదేళ్ల కనిష్టమైన 8.55 శాతానికి తగ్గించారు. 2018-19 సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ రేటును అందించిన తరువాత 151.67 కోట్ల మిగులు ఉంటుందని ఈపీఎఫ్‌వో అంచనా. మునుపటి ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌పై 8.7 శాతం వడ్డీ రేటును అందించడంపై 158 కోట్ల లోటు ఉండేది. అందుకే 2018-19 సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ రేటును అందించాలని నిర్ణయించింది. -
ఎయిర్టెల్ కస్టమర్లకు షాక్
న్యూఢిల్లీ : సబ్‌స్ర్కైబర్లకు మొబైల్ దిగ్గజం ఎయిర్టెల్ షాక్ ఇచ్చింది. వ్యాలిడిటీ ముగిసిన తర్వాత 15 రోజుల వరకూ సబ్‌స్ర్కైబర్ ఇన్కమింగ్ కాల్స్ రిసీవ్ చేసుకునే వెసులుబాటు ఉండగా, ఇప్పుడు దాన్ని వారం రోజులకు కుదించింది. కనీస రీచార్జ్ స్కీమ్‌లో ఎయిర్టెల్ ఈ మార్పులు చేసింది. దీంతో ఎయిర్టెల్ కస్టమర్ తాను ఎంచుకున్న ప్లాన్ ముగిసిన తర్వాత వారం రోజుల వరకే ఇన్కమింగ్ కాల్స్‌ను రిసీవ్ చేసుకుంటారు. మరోవైపు అకౌంట్ బ్యాలెన్స్ ఉన్నా సబ్‌స్ర్ర్కైబర్లు వ్యాలిడిటీ ముగిసిన తర్వాత రీచార్జ్ చేయకపోతే వాయిస్ కాల్స్ చేసుకోలేరు. యూజర్ నుంచి సగటు రాబడి (ఏఆర్పీయూ) పెంచుకునేందుకే ఎయిర్టెల్ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు తమ ప్రీపెయిడ్ సబ్‌స్ర్కైబర్ల కోసం వొడాఫోన్, ఐడియా కూడా ఈ దిశగా యోచిస్తున్నట్టు సమాచారం. ఎయిర్టెల్ నిర్ణయంతో సబ్‌స్ర్కైబర్లు ఇతర నెట్‌వర్క్‌లకు మళ్లవచ్చని భావిస్తున్నారు.