Reliance Jio net profit grew 12 percent: బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టెలికాం విభాగం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అదరగొట్టింది.నికర లాభాల్లో 12.2శాతం పెరుగుదలను నమోదు చేసింది. అంతేకాదు చందాదారులకు సంబంధించి దేశీయంగా ఇప్పటికే టాప్ లో ఉన్న జియో ప్రస్తుత చందాదారులు కూడా భారీగా పెరిగారు. ( 22 ఏళ్లకే కంపెనీ పగ్గాలు, వేల కోట్ల సామ్రాజ్యం, 30వేలమందికి ఉపాధి)
శుక్రవారం ప్రకటించిన క్యూ1 (ఏప్రిల్-జూన్) ఫలితాలలో జియో నికర లాభం రూ. 4,863 కోట్లకు పెరిగింది. ఇది ఏడాది క్రితం రూ. 4,335 కోట్లుగా ఉంది. జియో ఆదాయం 9.9శాతం పెరిగి రూ.24,042 కోట్లకు చేరుకుంది. గత ఏడాది క్రితం రూ.21,995 కోట్ల నుంచి రూ.24,127 కోట్లకు పెరిగింది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన ఆదాయం, EBITDA, నికర లాభంలో 3శాతం పెరుగుదదల సాధించామని జియో ట నివేదించింది.
కొత్తగా 30.4 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు
భారతీయ టెలికాం మార్కెట్‌పై రిలయన్స్ జియో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 2023, ఏప్రిల్ తాజా టెలికాం డేటా ప్రకారం, కంపెనీ 37.9 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది. ఏప్రిల్ 2023లో, రిలయన్స్ జియో 30.4 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లను సాధించింది.
కాగా జియో ఇటీవల Jio Bharat ఫోన్‌లను రూ. 999కి ప్రారంభించింది. ఇందులో అపరిమిత వాయిస్ కాల్‌లు , 14 GB డేటా కోసం చౌకైన రూ. 123 నెలవారీ ప్లాన్‌ను కూడా జోడించింది. '2G ముక్త్ భారత్' పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్‌లో ఫీచర్ ఫోన్‌లతో ఇంకా 2 జీలో ఉన్న 250 మిలియన్ల మొబైల్ సబ్‌స్క్రైబర్లను కొత్త టెక్నాలజీకి మార్చడమే లక్ష్యమని జియో ప్రకటించిన సంగతి తెలిసిందే. (నేను అప్పుడే వార్నింగ్ ఇచ్చా.. ఏఐపై ప్రముఖ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు)
Comments
Please login to add a commentAdd a comment