jumps
-
సచివాలయంపై నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్
ముంబై: మహారాష్ట్ర సచివాలయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్.. సచివాలయంలోని మూడో అంతస్తుపై నుంచి కిందకు దూకేశారు. అయితే ఆయన దూకిన సమయంలో భవనానికి సేఫ్టీ నెట్ ఏర్పాటు చేసి ఉండటంతో వారు అందులో పడిపోయారు. పోలీసులు వెంటనే వారిని రక్షించారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదు.పెసా చట్టం ప్రకారం ఉద్యోగ నియామకాలను వ్యతిరేకిస్తూ గత 15 రోజులుగా మహారాష్ట్రలో గిరిజన విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు. ఎస్టీ కేటగిరీలో ఉన్న ధంగర్ కమ్యూనిటీకి రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ మహారాష్ట్రలో గిరిజన ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు. అయినప్పటికీ ప్రభుత్వం వీరి గోడు పట్టించుకోకపోవడంతో గిరిజన ఎమ్మెల్యేలు, గిరిజన సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ స్పీకర్ విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్, మరికొందరు గిరిజన ఎమ్మెల్యేలు నేరుగా నేడు మంత్రాలయ భవనం వద్దకు చేరుకుని మూడో అంతస్తు నుంచి కొన్ని డాక్యుమెంట్లను గాల్లోకి విసిరేస్తూ దూకేశారు. అయితే భవనానికి నెట్ కట్టి ఉండటంతో ఎవరికీ ఏం కాలేదు.#WATCH | NCP leader Ajit Pawar faction MLA and deputy speaker Narhari Jhirwal jumped from the third floor of Maharashtra's Mantralaya and got stuck on the safety net. Police present at the spot. Details awaited pic.twitter.com/nYoN0E8F16— ANI (@ANI) October 4, 2024 ఈ వ్యవహారంపై డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్తో ఇప్పటికే ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చర్చలు జరిపారు. ఈ సమస్య పరిష్కారానికి సానుకూలంగానే ఉన్నామని సీఎం చెప్పినప్పటికీ అందుకు తగ్గట్టుగా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో గిరిజన ప్రజాప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నారు. -
ఐసీఐసీఐ లాభం జూమ్
ముంబై: ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 26 శాతం జంప్‌చేసి రూ. 11,053 కోట్లకు చేరింది. ప్రొవిజన్లు తగ్గడం ఇందుకు సహకరించింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 24 శాతం ఎగసి రూ. 10,272 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం 13 శాతం పుంజుకుని రూ. 18,678 కోట్లకు చేరగా.. నికర వడ్డీ మార్జిన్లు 4.65 శాతం నుంచి 4.43 శాతానికి స్వల్ప వెనకడుగు వేశాయి. ఇతర ఆదాయం 20 శాతం పురోగమించి రూ. 5,975 కోట్లయ్యింది. ఏఐఎఫ్‌ల ఎఫెక్ట్ ఆర్బీఐ ఆదేశాల ప్రకారం మదింపుచేస్తే ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్స్(ఏఐఎఫ్‌లు)లో పెట్టుబడులకు రూ. 627 కోట్లమేర దెబ్బతగిలినప్పటికీ ప్రొవిజన్లు రూ. 2,257 కోట్ల నుంచి రూ. 1,049 కోట్లకు తగ్గినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ బాత్రా పేర్కొన్నారు. మొత్తం ఏఐఎఫ్‌లకు కేటాయింపులు చేపట్టినట్లు తెలియజేశారు. నిజానికి గతేడాది చేపట్టిన కంటింజెన్సీ ప్రొవిజన్లు, అవలంబించిన ప్రొవిజన్ విధానాలు కేటాయింపుల తగ్గింపునకు దోహదపడినట్లు తెలియజేశారు. కాగా.. ఐసీఐసీఐ బ్యాంక్ అనుబంధ సంస్థలలో లైఫ్ ఇన్సూరెన్స్ విభాగం నికర లాభం రూ. 227 కోట్లకు స్వల్పంగా పుంజుకుంది. సాధారణ బీమా నికర లాభం 22 శాతం జంప్‌చేసి రూ. 431 కోట్లను తాకగా.. అసెట్ మేనేజ్మెంట్ విభాగం నుంచి 30 శాతం అధికంగా రూ. 546 కోట్లు ఆర్జించింది. బ్రోకరేజీ బిజినెస్ నికర లాభం 66 శాతం దూసుకెళ్లి రూ. 466 కోట్లయ్యింది. వారాంతాన బీఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు 1 శాతం బలపడి రూ. 1,008 వద్ద ముగిసింది. -
రేణుశ్రీ ఆత్మహత్యకు ముందు ఎవరితో ఫోన్లో మాట్లాడింది..
సంగారెడ్డి: రుద్రారంలోని గీతం వర్సిటీలో బీటెక్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. శుక్రవారం సాయంత్రం వర్సిటీ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడటం విద్యార్థిలోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నగరంలోని కూకట్పల్లి– శంషీగూడలోని శిల్పా బృందావన్ కాలనీకి చెందిన రాహుల్, లక్ష్మీసరస్వతీల కూతురు రేణుశ్రీ గీతం విశ్వవిద్యాలయంలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో వర్సిటీ ఐదో అంతస్తుపైకి వెళ్లి ఫోన్లో మాట్లాడి అనంతరం ఆత్మహత్యకు పాల్పడింది. మూడు నెలల క్రితమే ఇంజనీరింగ్ కళాశాలలో చేరిన ఆమె గురించి వివరాలు ఎవరికీ సరిగ్గా తెలియవు. కళాశాలకు సక్రమంగా వెళ్లేదికాదని తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఇటీవల రేణుశ్రీని తండ్రి రాహుల్ కలిశారని, క్లాస్‌లకు రెగ్యులర్‌గా వెళ్లాలని మందలించినట్లు సమాచారం. విద్యార్థి ఆత్మహత్యకు తండ్రి మందలింపా.. ప్రేమ వ్యవహారం కారణమా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. ఆమె బలవన్మరణానికి గల కారణాలను పోలీసులు అనేక కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారు. తన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఎవరితో ఫోన్లో మాట్లాడిందోనని ఆరా తీస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ పురుషోత్తం రెడ్డి చెప్పారు. కాగా, రేణుశ్రీ ఆత్మహత్యపై తల్లిదండ్రులు కాకుండా ఆమె బంధువు పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. కేసు దర్యాప్తులోఉంది. -
రూ. 2.18 లక్షల కోట్లు: విదేశీ ఇన్వెస్టర్లు తెగ కొనేస్తున్నారు
హైదరాబాద్: అంతర్జాతీయ పెట్టుబడిదారులకు స్థిరాస్తి రంగం హాట్‌కేక్‌లా మారింది. దీంతో దేశీయ స్థిరాస్తి రంగంలోకి విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తు తున్నాయి. పెట్టుబడి లావాదేవీలలో పారదర్శకత, విధానపరమైన సంస్కరణలు, వ్యాపారాలకు ప్రోత్సాహం, పారిశ్రామిక రంగంలో సాంకేతికత వంటివి ఇన్వెస్టర్ల ఆకర్షణకు ప్రధాన కారణాలని కొలియర్స్ నివేదిక వెల్లడించింది. 2017-22 మధ్య కాలంలో దేశీయ స్థిరాస్తి రంగంలోకి 32.9 బిలియన్ డాలర్ల సంస్థాగత పెట్టుబడులు వచ్చాయి. అదే 2011-16 మధ్య కాలంలో అయితే 25.8 బిలియన్ డాలర్లు వచ్చాయి. అయితే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో విదేశీ సంస్థాగత పెట్టుబడుల (ఎఫ్ఐఐ) వాటా 2017-22 మధ్య కాలంలో రూ.2.18 లక్షల కోట్లు (26.6 బిలియన్ డాలర్లు), కాగా.. 2011-16లో కేవలం 8.2 బిలియన్ డాలర్లు మాత్రమే. గత ఆరేళ్ల కాలంతో పోలిస్తే 2017-22లో విదేశీ సంస్థాగత పెట్టుబడులు మూడు రెట్లు అధికంగా వచ్చాయని కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఈ విదేశీ సంస్థాగత పెట్టుబడులలో 70 శాతం అమెరికా, కెనడా దేశాల నుంచే వచ్చా యి. యూఎస్ నుంచి 11.1 బిలియన్ డాల ర్లు, కెనడా నుంచి 7.5 బిలియన్ డాలర్లు, సింగపూర్ నుంచి 6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. మన దేశంలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన తదితర కారణాలతో అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. -
అదరగొట్టిన రిలయన్స్ జియో
Reliance Jio net profit grew 12 percent: బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టెలికాం విభాగం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అదరగొట్టింది.నికర లాభాల్లో 12.2శాతం పెరుగుదలను నమోదు చేసింది. అంతేకాదు చందాదారులకు సంబంధించి దేశీయంగా ఇప్పటికే టాప్ లో ఉన్న జియో ప్రస్తుత చందాదారులు కూడా భారీగా పెరిగారు. ( 22 ఏళ్లకే కంపెనీ పగ్గాలు, వేల కోట్ల సామ్రాజ్యం, 30వేలమందికి ఉపాధి) శుక్రవారం ప్రకటించిన క్యూ1 (ఏప్రిల్-జూన్) ఫలితాలలో జియో నికర లాభం రూ. 4,863 కోట్లకు పెరిగింది. ఇది ఏడాది క్రితం రూ. 4,335 కోట్లుగా ఉంది. జియో ఆదాయం 9.9శాతం పెరిగి రూ.24,042 కోట్లకు చేరుకుంది. గత ఏడాది క్రితం రూ.21,995 కోట్ల నుంచి రూ.24,127 కోట్లకు పెరిగింది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన ఆదాయం, EBITDA, నికర లాభంలో 3శాతం పెరుగుదదల సాధించామని జియో ట నివేదించింది. కొత్తగా 30.4 లక్షల మంది సబ్స్క్రైబర్లు భారతీయ టెలికాం మార్కెట్‌పై రిలయన్స్ జియో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 2023, ఏప్రిల్ తాజా టెలికాం డేటా ప్రకారం, కంపెనీ 37.9 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది. ఏప్రిల్ 2023లో, రిలయన్స్ జియో 30.4 లక్షల మంది సబ్స్క్రైబర్లను సాధించింది. కాగా జియో ఇటీవల Jio Bharat ఫోన్లను రూ. 999కి ప్రారంభించింది. ఇందులో అపరిమిత వాయిస్ కాల్లు , 14 GB డేటా కోసం చౌకైన రూ. 123 నెలవారీ ప్లాన్‌ను కూడా జోడించింది. '2G ముక్త్ భారత్' పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్లో ఫీచర్ ఫోన్లతో ఇంకా 2 జీలో ఉన్న 250 మిలియన్ల మొబైల్ సబ్స్క్రైబర్లను కొత్త టెక్నాలజీకి మార్చడమే లక్ష్యమని జియో ప్రకటించిన సంగతి తెలిసిందే. (నేను అప్పుడే వార్నింగ్ ఇచ్చా.. ఏఐపై ప్రముఖ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు) -
ఇండస్ఇండ్ బ్యాంక్ లాభం జూమ్.. భారీగా పెరిగిన ఆదాయం
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికం(క్యూ1)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం వార్షికంగా 30 శాతం జంప్‌చేసి రూ. 2,124 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,631 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇందుకు మొండి రుణాలు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం సహకరించాయి. మొత్తం ఆదాయం రూ. 10,113 కోట్ల నుంచి రూ. 12,939 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 18 శాతం పుంజుకుని రూ. 4,867 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు నామమాత్రంగా మెరుగుపడి 4.29 శాతానికి చేరాయి. ఇతర ఆదాయం 14 శాతం వృద్ధితో రూ. 2,210 కోట్లుగా నమోదైంది. ప్రొవిజన్లు రూ. 1,251 కోట్ల నుంచి రూ. 991 కోట్లకు తగ్గాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.35 శాతం నుంచి 1.94 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు 0.67 శాతం నుంచి 0.58 శాతానికి తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో ఇండస్ఇండ్ షేరు నామ మాత్రంగా తగ్గి రూ. 1,390 వద్ద క్లోజైంది. -
అమ్మ దెబ్బలు తప్పించుకోవడానికి.. ఐదో ఫ్లోర్ నుంచి దూకి..
చైనాలో దారుణం జరిగింది. అమ్మ దెబ్బలను తప్పించుకోవడానికి ఓ బాలుడు(6) ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ నుంచి దూకేశాడు. బయటకు వెళ్లకూడదని కర్ర పట్టుకుని చివాట్లు పెడుతూ వస్తున్న తల్లిని చూసి పిల్లాడు ఆందోళన చెంది భవనంపై నుంచి దూకాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తూర్పు చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్‌లో తల్లి తన కుమారునితో జీవిస్తోంది. ఆమె భర్త ఉద్యోగ రీత్యా వేరే నగరంలో ఉంటున్నారు. అయితే.. పిల్లాడు అల్లరితో విసుగు తెప్పిస్తున్న క్రమంలో తల్లి తరచుగా చివాట్లు పెడుతుండేది. జూన్ 25న బాలుడు భవనంపై భాగానికి చేరాడు. ఇంటి నుంచి నిరంతరం బయటకు వస్తున్న క్రమంలో తల్లి బాలున్ని మందలించి లోపలికి తీసుకువెళ్లాలని భావించింది. ఓ కర్ర పట్టుకుని చివాట్లు పెడుతూ బాలుని వైపు వచ్చింది. అమ్మ తిడుతుందనే భయంతో బాలుడు ఐదు ఫ్లోర్ల భవనంపై భాగం నుంచి దూకేశాడు. అక్కడే ఉన్నవారు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అయితే.. ఈ ఘటనలో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ కాళ్లు, చేతులు విరిగిపోయాయని చైనా మీడియా వెల్లడించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా.. కొందరు నెటిజన్లు ఫైరయ్యారు. పిల్లల రక్షణకు మరిన్ని చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఏమైందో తెలియదు.. యువకుని చెంప చెల్లుమనిపించింది.. వీడియో వైరల్ -
సొంత కొడుక్కే షాకిచ్చిన తండ్రి.. ఇంటికొచ్చిన ప్రియురాలితో కలిసి..
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ విచిత్రమైన ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడి ప్రియురాలు అతని తండ్రితో జంప్ అయ్యింది. ఏడాది క్రితం యువతిని ప్రియుడు తన ఇంటికి తీసుకెళ్లాడు. తండ్రి కమలేష్‌తో పరిచయం కాగా, తర్వాత అతనితో ఆ యువతి పారిపోయింది. కమలేష్ కుమారుడికి 20 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ యువతి తరచుగా ప్రియుడి ఇంటికి వచ్చేది. ప్రియుడు ఇంట్లో లేని సమయంలో ప్రియుడి తండ్రి కమలేష్‌తో ఆమెకు చనువు ఏర్పడింది. ఆ బంధం ప్రేమగా మారింది. వారు ఇద్దరూ పారిపోవాలని నిర్ణయించుకున్నారు. 2022 మార్చిలో ఇంటి నుండి పరారీ అయ్యారు. చదవండి: బెట్టింగ్‌లో భారీ నష్టం.. అయ్యో మధు! యువతి కుటుంబ సభ్యులు చకేరి పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు పెట్టారు. కమలేష్ కుమారుడిని పోలీసులు విచారించగా.. ఆ యువతి కమలేష్‌ను కలిసేందుకు వచ్చేదని కుమారుడు చెప్పడంతో నిజం వెలుగు చూసింది. ఏడాదిపాటు వేట సాగించిన పోలీసులు కమలేష్, ఆ యువతిని ఢిల్లీలో గుర్తించారు. కమలేష్, యువతి సహజీవనం సాగిస్తున్నారు. ఇష్టపూర్వకంగానే కమలేష్‌తో వెళ్లినట్లు యువతి చెప్పడంతో షాక్ అయిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: చిట్టీ.. నాకు ఎప్పుడో తెలుసు.. నేను లేకుండా నువ్వు బిందాస్‌గా ఉండగలవని.. -
రైలు వంతెనపై మంటలు...నదిలోకి దూకేసిన ప్రయాణికులు
న్యూయార్క్: అమెరికాలోని బోస్టన్ శివార్లలోని రైలు వంతెనపై మంటులు చెలరేగాయని అధికారులు తెలిపారు. దీంతో దాదాపు 200 మంది ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు. ఐతే కొంతమంది భయంతో కిటికీల గుండా తప్పించుకోగా, మరికొంత మంది వంతెన కింద ఉన్న నదిలోకి దూకేసినట్లు తెలిపారు. ఈ ఘటన పై దర్యాప్తు చేసిన మసాచుసెట్స్ బే ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ కీలక విషయాలు వెల్లడించింది. వెల్లింగ్టన్, అసెంబ్లీ స్టేషన్ల మధ్య ఉన్న వంతెన మీదుగా ప్రయాణిస్తున్న ఆరెంజ్ లైన్ రైలు దాని హెడ్ కార్ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడినట్లు పేర్కొంది. ఐతే ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిపింది. ఈ సంఘటనను చూసి భయపడి నదిలోకి దూకేసిన మహిళ మాత్రం వైద్య సహాయానికి నిరాకరించినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. This was my morning. pic.twitter.com/shKkLYE6kT — Glen Grondin (@odievk) July 21, 2022 New video shows a person in the water after an Orange Line train broke down and started smoking over the Mystic River. Riders had to climb off the train on to the tracks and walk back to the station. Witnesses say one person even jumped into the water. pic.twitter.com/Gvimj7krf9 — Rob Way (@RobWayTV) July 21, 2022 (చదవండి: గులాబీ వర్ణంలోకి ఆకాశం.. సినిమాను తలపించిన దృశ్యం.. ఏలియన్స్ పనేనా?) -
రేసుగుర్రంలా స్టాక్‌మార్కెట్ల దూకుడు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకుపోతున్నాయి. ఆరంభంనుంచీ దూకుడుమీద ఉన్న సూచీలు ప్రస్తుతం మరింత ఎగిసి కీలక మద్దతు స్థాయిలను సునాయాసంగా అధిగమించి ఉత్సాహంగా కదులుతున్నాయి. అన్నిరంగాల షేర్లలోనూ కొనుగోళ్ల సందడి నెలకొంది. ఫలితంగా సెన్సెక్స్ 1114 పాయింట్లు జంప్ చేసి 52712 వద్ద, నిఫ్టీ 332 పాయింట్లు ఎగిసి 15682 వద్ద కొనసాగుతుండటం విశేషం. ఫలితంగా సెన్సెక్స్ 52600 స్థాయికి ఎగువన, అలాగే నిఫ్టీ 15600 స్థాయికి ఎగువన కొనసాగుతున్నాయి. ఐటీ, బ్యాంకింగ్, మెటల్ తదితర రంగాల షేర్లు లాభాలతో కళకళలాడుతున్నాయి. టైటన్, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, డా.రెడ్డీస్, హిందాల్కో, హీరోమోటో, ఐటీసీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్ర, ఎస్బీఐ, యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకు తదితర షేర్లు లాభపడుతుండగా, అపోలో హాస్పిటల్స్, నెస్లే మాత్రమే నష్టపోతున్నాయి. -
విషాదం: తన ఇద్దరి బిడ్డలను బైకుపై తీసుకువచ్చి.. పానీపూరి తినిపించి..
బల్లికురవ(ప్రకాశం జిల్లా): శివరాత్రి సందర్భంగా కోటప్పకొండ తిరునాళ్లకని చెప్పి వెళ్లిన ఓ తండ్రి తన ఇద్దరు బిడ్డలతో సాగర్ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన బల్లికురవ మండలం గుంటుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. తండ్రి మృతదేహం లభించగా, అతని వెంట వెళ్లిన చిన్నారుల కోసం గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బల్లికురవ మండలంలోని గుంటుపల్లి గ్రామానికి చెందిన గుర్రం చిరంజీవి (36)కి 11 ఏళ్ల క్రితం మార్టూరు మండలం వలపర్ల గ్రామానికి చెందిన కల్యాణితో వివాహమైంది. వీరికి కుమారుడు శాయి చైతన్య కృష్ణ (10), శాయి సౌమ్య (8) ఉన్నారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చైతన్య కృష్ణ నాల్గవ తరగతి, సౌమ్య 3వ తరగతి చదువుతున్నారు. మంగళవారం మహా శివరాత్రి సందర్భంగా పానీపూరి కావాలని పిల్లలు తండ్రి చిరంజీవిని కోరారు. చదవండి: అనూస్ పేరుతో బ్యూటీ పార్లర్.. స్థానికులతో పరిచయం పెంచుకుని.. చివరికి బల్లికురవ తీసుకెళ్లి పానీపూరి తినిపించి అక్కడ నుంచి కోటప్పకొండ తిరునాళ్లకు తీసుకెళ్తానని భార్యకు చెప్పాడు. బైకుపై తీసుకువచ్చి పానీపూరి తినిపించి అక్కడ నుంచి అద్దంకి బయలుదేరాడు. దారిలో సాగర్ అద్దంకి బ్రాంచ్ కాలువ వల్లాపల్లి లాకుల వద్ద బైకును నిలిపాడు. చిరంజీవి ఇద్దరు బిడ్డలతో సాగర్ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయానికి తిరునాళ్లకని వెళ్లిన భర్త, పిల్లలు తిరిగి రాకపోవడంతో కోటప్పకొండలోని బంధువుల ఇళ్ల వద్ద కల్యాణి విచారించింది. ఆచూకీ లభించలేదు. సాగర్ కాలువ వల్లాపల్లి లాకుల వద్ద చిరంజీవి బైకు, చెప్పులు, కుమారుడు చైతన్య కృష్ణ చెప్పులు ఉన్నాయన్న సమాచారం అందడంతో బల్లికురవ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై వి.వేమన మిస్సింగ్ కేసు నమోదుతో దర్యాప్తు చేపట్టారు. గజ ఈతగాళ్లతో సాగర్ కాలువలో గాలింపు చేపట్టారు. బొల్లాపల్లి లాకుల వద్ద చిరంజీవి మృతదేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మార్టూరు సీహెచ్‌సీకి తరలించారు. చిన్నారుల కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. చిరంజీవికి రూ.20 లక్షలకుపైగా అప్పులు ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై అతను మదనపడుతుండేవాడని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
‘రూ.15లక్షలు ఇస్తే పార్టీలోకి వస్తా..’
సాక్షి, నస్పూర్(ఆదిలాబాద్): పట్టణంలోని ఓ పార్టీకి చెందిన వార్డు కౌన్సిలర్ పార్టీ మారడానికి బేరసారాలు సాగించిన ఆడియో శనివారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నికల సమయంలో రూ.15లక్షలు ఖర్చు చేశానని, మీ సార్‌తో మాట్లాడి ఇప్పిస్తే పార్టీలోకి వస్తానంటూ చెప్పగా.. సార్‌ను అడిగి చెబుతానంటూ ఫోన్లో ఇద్దరు మాట్లాడుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఫోన్లో మాట్లాడుకున్నది ఏ పార్టీకి చెందిన కౌన్సిలర్.. ఏ పార్టీకి చెందిన ఫ్లోర్ లీడర్‌తో మాట్లాడాడు అనే విషయమై పట్టణ ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. వ్యాక్సిన్ వేయకుండానే...వేసినట్లు మంచిర్యాలటౌన్: జిల్లాలో పలువురికి కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు వేయకుండానే వేసినట్లు సెల్‌కు మెస్సేజ్‌లు వస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. బెల్లంపల్లికి చెందిన మునిమంద తిరుమల అనే మహిళ గత ఏడాది సెప్టెంబర్ 19వ తేదీన కోవిషీల్డ్ మొదటిడోసును బెల్లంపల్లిలోని శంషీర్‌నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో వేసుకుంది. గత నెల 12వ తేదీ నుంచి ఈ నెల 9వ తేదీ మధ్య రెండో డోసు వ్యాక్సిన్ వేసుకోవాలని సెల్‌కు మెస్సేజ్ వచ్చింది. అనారోగ్యంగా ఉండడంతో గడువులోగా వేసుకుందామని అనుకోగా గత నెల 29వ తేదీ వ్యాక్సిన్ వేసుకున్నట్లుగా సెల్‌కు మెసేజ్ 30వ తేదీన వచ్చింది. దీంతో ఆన్లైన్లో పరిశీలిస్తే వ్యాక్సిన్ రెండో డోసు పూర్తయినట్లు వ్యాక్సినేషన్ సర్టిపికేట్ రావడంతో ఖంగుతింది. ఇదే విషయమై జిల్లా వ్యాక్సినేషన్ ఇన్చార్జి డాక్టర్ ఫయాజ్‌ఖాన్‌ను వివరణ కోరగా ఒకే సెల్ నంబరుతో నలుగురు వరకు వ్యాక్సిన్‌ను వేసుకుంటున్నారని, సాంకేతిక కారణాలతో అలా వచ్చి ఉంటుందని, లబ్ధిదారులకు రెండో డోసు తప్పనిసరిగా వేస్తామని తెలిపారు. -
పెళ్లికి వెళ్లిన అతిథులు.. ఊహించని పని చేసి వచ్చారు
భోఫాల్: లాక్డౌన్ నిబంధనలను పక్కన పెట్టి ఓ వివాహ వేడుకకు హాజరైన అతిథులకు పోలీసులు వింత శిక్ష విధించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ భింద్ జిల్లాలోని జరిగింది. వివరాల ప్రకారం.. ఉమరి గ్రామంలో ఓ పెళ్లి వేడుకకు సుమారు 300 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులను రావడాన్ని గమనించి చాలామంది పారిపోయారు గానీ అందులో 17 మంది మాత్రం దొరికిపోయారు. ఇక పోలీసులకు దొరికిన వారికి శిక్షగా నడిరోడ్డుపై కప్ప గంతులు వేయించారు. అనంతరం లాక్డౌన్ ఆంక్షలు పూర్తి అయ్యే వరకు ఇటువంటి ఉల్లంఘన చేయకూడదని వాళ్లని హెచ్చరించి వదిలేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌వీడియోలో వైరల్‌గా మారి హల్చల్ చేస్తోంది. చదవండి: కోడి గుడ్ల కోసం.. ఛీ ఇదేం పాడు పని పోలీసు In Bhind "Baaratis" were made to do ‘Frog Jump’ for violating #CovidIndia-19 restrictions. The wedding was being organized, in violation of the lockdown restriction enforced in Bhind @ndtv @ndtvindia @GargiRawat @manishndtv pic.twitter.com/QftxjTsFvL— Anurag Dwary (@Anurag_Dwary) May 20, 2021 -
దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు
సాక్షి, ముంబై : స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ సంకేతాలతో ఆరంభంలోనే 1300పాయింట్లకు పైగా లాభపడింది. అనంతరం మరింత ఎగిసిన కీలక సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలను అధిగమించి జోష్ గా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 2 వేల పాయింట్లకు పైగా ఎగిసింది. నిఫ్టీ 584 పాయింట్లు లాభపడింది. తద్వారా సెన్సెక్స్ మళ్లీ 29 వేల స్థాయిని, నిఫ్టీ 8600 స్థాయిని సునాయాసంగా అధిగమించాయి. నిఫ్టీ బ్యాంకు, నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు కూడా లాభాలతో కళ కళలాడుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 2045 పాయింట్లు ఎగిసి 29637 వద్ద, నిఫ్టీ 588 పాయింట్ల లాభంతో 8672 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్, ఫార్మ, ఐటీ, ఎఫ్ఎంసీజీ, టెక్నాలజీ షేర్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, ఎం అండ్ ఎం టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. ఇంకా మారుతి 13 శాతం. అల్ట్రాటెక్ సిమెంట్ పది శాతం ఎగిసింది. బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్ మాత్రమే నష్టపోతున్నాయి. -
దూకుడుగా మార్కెట్లు 400 పాయింట్లు జంప్
సాక్షి, ముంబై: గతరెండు సెషన్లుగా తీవ్ర ఊగిసలాటల మధ్య కదలాడిన దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. ప్రారంభంలోనే లాభాల సెంచరీ చేసిన సెన్సెక్స్ ఏకంగా నాలుగు వందల పాయింట్లకు పైగా ఎగిసింది. నిఫ్టీ సైతం సెంచరీ లాభాలతో 10400 స్థాయిని దాటింది. ప్రస్తుతం సెన్సెక్స్ 420 పాయింట్లు ఎగిసి 34,724వద్ద నిఫ్టీ సైతం 140 పాయింట్లు జంప్‌చేసి 10,441 వద్ద ట్రేడవుతోంది. ఐటీ, ఎఫ్ఎంసీజీ తప్ప దాదాపు అన్ని రంగాల్లోనూ లాభాలే. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, టైటన్, మారుతీ, ఐషర్, వేదాంతా, జీ, యాక్సిస్, బజాజ్ ఆటో, యూపీఎల్ భారీగా లాభపడుతుండగా హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఎంఅండ్ఎం, విప్రో, హెచ్‌యూఎల్ నష్టపోతున్నాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి పాజిటివ్‌గా ఉంది. -
భారీ లాభాలతో ఉత్సాహంగా దలాల్ స్ట్రీట్
సాక్షి, ముంబై: అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఆరంభంలోనే డబుల్ సెంచరీ లాభాలను సాధించిన సెన్సెక్స్ 33వేలకు పైన పటిష్టంగా కదులుతోంది. అటు నిఫ్టీ 68 పాయింట్లు ఎగిసి 10,192 వద్ద ట్రేడవుతోంది. కొత్త చైర్మన్ పావెల్ అధ్యక్షతన ఫెడ్ కమిటీ కనీసం పావు శాతం వడ్డీ రేటును పెంచే అవకాశంఉందని భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు అన్ని రంగాలూ లాభాల్లోనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రియల్టీ షేర్లలో ఒబెరాయ్, యూనిటెక్, ఇండియాబుల్స్, హెచ్‌డీఐఎల్, శోభా, డీఎల్ఎఫ్ భారీగా లాభపడుతున్నాయి. వీటితోపాటు బ్యాంక్స్, మెటల్, ఫార్మా లాభపడుతున్నాయి. ఐబీ హౌసింగ్, ఎస్బీఐ, వేదాంతా, ఓఎన్జీసీ, యాక్సిస్, యస్‌బ్యాంక్, సన్ ఫార్మా, బీపీసీఎల్, టాటా స్టీల్, ఆర్ఐఎల్ లాభాల్లోనూ, హెచ్‌యూఎల్, ఐషర్, జీ, టెక్ మహీంద్రా, హీరోమోటో స్వల్ప నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి. అలాగే డీమార్ట్ లాంటి రీటైల్ షేర్లు జోరుగా ట్రేడ్ అవుతున్నాయి. -
టాటా మోటార్స్ మాజీ ఎండీ ఆత్మహత్య
ముంబై: టాటా మోటార్స్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ ఆత్మహత్య కలకలం రేపింది. ప్రశాంత్ సిబ్బల్ (43) ముంబై, పరేల్‌లోని ఆయన నివాస భవనం 15 వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కలాచౌకీ పోలీసులు అధికారి దిలీప్ ఉగాలే అందించిన ప్రకారం ఈ సంఘటన తరువాత కల్పతరు హా బిటెంట్ భవన సొసైటీ సభ్యుడినుంచి కాల్ వచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సిబాల్నున ఆసుపత్రికి తీసుకెళ్లారు, అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు. అలాగే మృతిని బెడ్ రూమ్ లో ఆత్మహత్య నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు మొదలుపెట్టారు. ఏప్రిల్ 2017 లో సిబాల్‌ను టాటా మోటార్స్ తొలగించింది. అప్పటినుంచి ఆయన తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారని పోలీసుల కథనం. ఈ నేపథ్యంలో ఆయన చికిత్స కూడా తీసుకుంటున్నారని సిబాల్ భార్య ధృవీకరించారని పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన కేసు నమోదు చేశామని తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎన్.ఆర్కికా చెప్పారు. అలాగే మరింత తెలుసుకోవడానికి టాటా మోటార్స్ ఉద్యోగులు కూడా ప్రశ్నించనున్నామని చెప్పారు. అయితే ప్రశాంత్ ఆత్మహత్యపై టాటా మోటార్స్ స్పందించింది. ఆయన మృతిపట్ల సంతాపం తెలిపిన సంస్థ, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించింది. ఏప్రిల్ లో ఆయన స్వచ్ఛంద విరమణ పథకం ఎంచుకున్నారని వివరించింది. ఈ విషయంలో దర్యాప్తు అధికారులతో పూర్తిగా సహకరిస్తున్నామని టాటా మోటార్స్ అధికార ప్రతినిధి తెలిపారు. -
అరబిందోకు యుఎస్ఎఫ్డీఏ బూస్ట్
న్యూఢిల్లీ: అమెరికాకు ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) అందించిన కిక్‌తో పార్మా కంపెనీ అరబిందో ఫార్మాకు స్టాక్మార్కెట్లో మంచి బూస్ట్ లభించింది. అమెరికా మార్కెట్లలో సవెల్మర్ కార్బొనేట్ మాత్రలను విడుదల చేసేందుకు తుది ఆమోదం లభించింది. కీలకమైన జనరిక్ డ్రగ్‌కు అనుమతి లభించడంతో బుధివారంనాటి మార్కెట్లో 8 శాతం ఎగిసి భారీ లాభాలను సాధించింది. మార్కెట్ ఆరంభంలోనే అరబిందో ఫార్మా కంపెనీ షేర్లు 8 శాతం పెరిగాయి. ఈ జంప్‌తో షేరు ఎనిమిది నెలల గరిష్టాన్ని తాకింది. ఎన్ఎస్ఇలో కంపెనీ షేర్లు 8.22 శాతం పెరిగి 794.70 కి చేరుకున్నాయి. వాల్యూమ్ విషయంలో, కంపెనీలో 4.63 లక్షల షేర్లను బిఎస్ఇలో వర్తకం చేశాయి, ఉదయం ట్రేడింగ్ సెషన్లో ఎన్ఎస్ఈ వద్ద 81 లక్షల షేర్లు చేతులుమారాయి. కిడ్నీల పనితీరును దెబ్బతీసే తీవ్ర వ్యాధుల చికిత్సకు సెవిలామిర్ ట్యాబ్లెట్ల విక్రయానికి తుది ఆమోదం లభించిందని కంపెనీ తెలిపింది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యుఎస్ఎఫ్డిఎ) నుంచి సవెల్మర్ కార్బొనేట్ టాబ్లెట్లను 800 మి.గ్రా. తయారీకి తుది ఆమోదం లభించిందని బీఎస్ఈ ఫైలింగ్‌లో అరబిందో ఫార్మా పేర్కొంది. డయాలిసిస్‌పై దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి రోగులలో సీరం ఫాస్ఫరస్ నియంత్రణ కోసం ఈ మాత్రలు ఉపయోపడనున్నాయి. కాగా ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో హైదరాబాద్ ఫార్మా సంస్థ అరబిందో కౌంటర్ జోరందుకోవడంతో పాటు ఇతర లుపిన్, క్యాడిల్లా హెల్త్‌కేర్, దివీస్‌లాంటి ఫార్మా షేర్లు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. -
దూసుకెళ్లిన రియాల్టీ: భారీ లాభాల్లో మార్కెట్లు
ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో గృహరంగానికి ఊతమిచ్చేలా ప్రకటనలు వెలువడంతో రియాల్టీ ఇండెక్స్ ఒక్కసారిగా దూసుకెళ్లింది. బీఎస్ఈలో 4.2 శాతం ఎగిసిన రియాల్టీ సూచీ, ప్రస్తుతం 3.38 శాతం వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. రియాల్టీ ఇండెక్స్‌లో మేజర్ షేర్లుగా ఉన్న డీఎల్ఎఫ్(5.74 శాతం), గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్(4.04 శాతం), ఒబేరాయ్ రియాల్టీ లిమిటెడ్(4.24 శాతం), ప్రెస్టేజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్(3.19 శాతం), సోబా(2.64 శాతం), యూనిటెక్(3.31 శాతం), హెచ్‌డీఐఎల్(3.36 శాతం), ఇండియా బుల్ రియల్ ఎస్టేట్ లిమిటెడ్(0.80 శాతం) శాతం పెరిగాయి. హౌసింగ్ పరిశ్రమకు మేలు చేకూరేలా ఇండస్ట్రి వర్గాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న సరసమైన గృహాలకు మౌలిక సదుపాయాల స్టేటస్‌ను జైట్లీ ఈ బడ్జెట్లో కల్పించారు. దీన్ని ద్వారా డెవలపర్లకు ధరలు తగ్గనున్నాయి. అంతేకాక, ప్రధాని ఆవాస్ యోజన పథకానికి రూ.23వేల కోట్లు కేటాయించనున్నట్టు జైట్లీ తెలిపారు. నేషనల్ హౌసింగ్ బ్యాంకు ద్వారా రూ.20వేల కోట్ల గృహరుణాలను అందించనున్నట్టు హామీ ఇచ్చారు. ఈ ప్రకటనలన్నీ రియాల్టీకి మంచి బూమ్ ఇచ్చాయి. పెద్ద నోట్ల రద్దు అనంతరం డిమాండ్ కుదేలై పడిపోయిన రియాల్టీ ఇండెక్స్, జైట్లీ ప్రసంగం తర్వాత పుంజుకుంది. రియాల్టీకి ఊతమిచ్చేలా జైట్లీ పలు ప్రకటనలు చేస్తారని ముందునుంచి మార్కెట్ వర్గాలు అంచనావేశాయి. అంచనాలకు అనుగుణంగా రియాల్టీకి ఆయన గుడ్ న్యూస్ అందించారు. బడ్జెట్ స్పీచ్ అనంతరం 300 పాయింట్లకు పైగా దూసుకెళ్లిన మార్కెట్లు, ప్రస్తుతం మరింత లాభాల్లోకి దూసుకెళ్లాయి. 406.86 పాయింట్ల లాభంలో 28,062 వద్ద సెన్సెక్స్ ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 125.35 పాయింట్ల లాభంలో 8,686 వద్ద కొనసాగుతోంది. బ్యాంకింగ్, పీఎస్‌యూ, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్‌లు సైతం లాభాల్లో నడుస్తున్నాయి. గృహరంగానికి అందించిన ప్రోత్సహకాలు : ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం ఇళ్ల నిర్మాణంలో ఉద్యోగవకాశాలు కల్పించడం 2016 జూన్, 2019 మార్చి మధ్యలో అనుమతిచ్చే ఫ్లాట్స్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో నాలుగు మెట్రోసిటీల్లో 30 చదరపు మీటర్లు, ఇతర మెట్రో సిటీల్లో 60 చదరపు మీటర్ల వరకు కనీస ప్రత్యామ్నాయ పన్ను. మొదటిసారి గృహ కొనుగోలుదారులు తీసుకునే రూ.35 లక్షల వరకు రుణాల్లో అదనంగా రూ.50వేలపై వేసే వడ్డీరేట్ల నుంచి మినహాయింపు. వచ్చే ఏడాది నుంచి ఇది అమలు. పీపీపీ స్కీమ్ లాంటి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఆఫర్ చేసే స్కీమ్‌ల కింద 60 చదరపు మీటర్లలో ఇళ్ల నిర్మాణాలకు సర్వీసు పన్ను తొలగింపు ఎక్స్చేంజ్ డ్యూటీ నుంచి కూడా మినహాయింపు -
నాలుగు రెట్లు పెరిగిన హిందాల్కో నికర లాభం
న్యూఢిల్లీ: అల్యూమినియం ఉత్పత్తి సంస్థ హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆకర్షణీయ ఫలితాలను వెల్లడించింది. స్వతంత్ర నికర లాభాల్లో నాలుగు రెట్లకు పైగా ఎగబాకింది. జూన్ 30 తో ముగిసిన త్రైమాసికంలో మంచి కార్యనిర్వాహక పనితీరుతో మెరుగైన ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ 294 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత ఏడాది ఇది 61 కోట్లు. అయితే నికర లాభం నాలుగు రెట్లు పెరిగినా ఆదాయం మాత్రం క్షీణించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మొత్తం ఆదాయం 11 శాతం పడిపోయి రూ 7,716,53 కోట్లు ఆర్జించినట్టు బిఎస్ఇకి తెలిపింది. గత ఏడాది ఇదే కాలంలో రూ 8,667 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కంపెనీ మొత్తం ఖర్చులు రూ 7,993.05 కోట్ల నుంచి రూ 6,703.82 కోట్లకు తగ్గాయి. అల్యూమినియం ఆదాయంలో తరుగుదల ఉన్నప్పటికీ, ఇయర్ ఆన్ ఇయర్ అల్యూమినియం ఆదాయం 8 శాతం వాల్యూమ్ గ్రోత్ ను సాధించింది. అయితే కాపర్ రెవెన్యూ 28 శాతం క్షీణించింది. ఈ ఫలితాలతో మార్కెట్లో షేరు బాగా పుంజుకుంది. దాదాపు 3 శాతం ఎగిసింది. కంపెనీ ప్రతికూల స్థూల ఆర్థిక పరిస్థితుల్లో ఒక బలమైన కార్యాచరణ ప్రదర్శించిందనీ, ద్రవ్యోల్బణం, ఎనర్జీ ధరలు మద్దతిచ్చాయని హిందాల్కో ఒక ప్రకనటలో తెలిపింది. స్థానిక మార్కెట్ లో అల్యూమినియం డిమాండ్ తగ్గడం ప్రభావితం చేసిందని పేర్కొంది. అలాగే భారీ దిగుమతులు కూడా ఫలితాలను దెబ్బతీసిందని తెలిపింది. అయితే రూపాయి బలపడడం, తగ్గిన ముడిసరుకు ధరలు, ప్రధానంగా ఎనర్జీ ఇన్ పుట్స్ భారీ ఊరటనిచ్చాయని చెప్పింది. -
వీడియోకోసం గంగలో దూకాడు..
సెల్ఫీలు, వీడియోల పిచ్చి మరోప్రాణాన్ని బలిగొంది. ప్రతి విషయాన్నీ తమ స్మార్ట్ ఫోన్, కెమెరాల్లో బంధించాలన్న వేలం వెర్రితో తాజాగా గంగానదిలో దూకుతూ స్నేహితులతో వీడియో తీయించుకున్నఓ వ్యక్తి.. ఏకంగా కనిపించకుండానే పోవడం ఆందోళన కలిగించింది. ప్రతి విషయాన్ని రికార్డు చేసి, సోషల్ మీడియాలో షేర్ చేయాలనుకుంటున్న నేపథ్యంలో జరిగిన ఘటన వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. హరిద్వార్ కు దగ్గరలోని గంగానదిలో దూకిన వ్యక్తి కనిపించకుండా పోవడం కలకలం రేపింది. స్నేహితుడి వీడియోను తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేయాలన్న తపనే తప్పించి, అతడేమయ్యాడో పట్టించుకునే పరిస్థితి వారిలో కనిపించకపోవడం ఆందోళన నింపుతోంది. బాగా మద్యం సేవించిన 27 ఏళ్ళ వ్యక్తి గంగా నదిలో దూకుతూ వీడియో తీయించుకోడానికి ముందుగా కాస్త ఆలోచించినా.. తర్వాత స్నేహితుల ప్రోత్సాహంతో అనుకున్నంతపనీ చేశాడు. ఈతకొట్టుకుంటూ తిరిగి బయటకు వద్దామనుకొని గంగానదిలో దూకిన వ్యక్తి , నీటిలో మునిగి కనిపించకుండా పోయాడు. స్నేహితులు తీసిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భద్రాబాద్ గాంధ్ మిర్పూర్ కు చెందిన 27 ఏళ్ళ ఆశిష్ చౌహాన్ గంగ్ నహర్ లోని గంగా నదిలో మునిగిపోయి 48 గంటలు దాటినా బాడీ దొరకలేదు. తన స్నేహితులు అశ్విని చౌహాన్, బాలరాజ్ కుమార్ లతో కలసి ఎప్పట్లాగే గంగా నది ప్రాంతానికి వెళ్ళిన ముగ్గురూ అక్కడి గట్టుపై కూర్చున్నారు. ముందు బాగానే ఉన్నా ఆ స్నేహితులంతా కలసి మద్యం సేవించిన అనంతరం చౌహాన్ నదిలో దూకి ఈత కొట్టాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు ఆ దృశ్యాన్ని రికార్డు చేయాలని ఆదేశించాడు. ముందు కొంత ఆలోచించినా.. చౌహాన్ చివరికి నదిలో దూకడానికి సిద్ధమయ్యాడు. స్నేహితులు వీడియో తీస్తూ ఉండిపోయారు. అయితే దూకిన వ్యక్తి ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో ఆందోళనలో పడ్డారు. అతడి జాడ తెలుసుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వారిద్దరూ దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు, సహాయక సిబ్బందితో సహా నదిలో గాలించినా ఫలితం కనిపించకపోవడంతో చౌహాన్ స్నేహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తామంతా కలసి ఎన్నోసార్లు గంగానదిలో ఈత కొడుతుంటామని, చౌహాన్ మంచి ఈతగాడని చెప్తున్నారు. చౌహాన్ నదిలో దూకే సమయంలో స్నేహితులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా... కొన్ని టీవీ ఛానెల్స్ కూడ ప్రసారం చేశాయి. నీటి ప్రవాహంలో చౌహాన్ శరీరం కొట్టుకుపోయి ఉండొచ్చని అది ఎక్కడో ఓచోట బయటకు వస్తుందని భద్రాబాద్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ అమర్ చంద్ర శర్మ తెలిపారు. చౌహాన్ కుటుంబ సభ్యులు ఈ ఘటనపై ఎటువంటి కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదని, విషయంపై చౌహాన్ కుటుంబానికి సమాచారం అందించగా.. ఎవ్వరిపైనా అనుమానం వ్యక్తం చేయడం గాని, ఆరోపించడం గాని చేయలేదని తెలిపారు. ఇది ప్రమాద వశాత్తు జరిగిన ఘటనగానే కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లు పోలీస్ అధికారులు వివరించారు. -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై : మంగళవారం నాటి దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలను మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 154.47 పాయింట్ల లాభంతో 25,807దగ్గర, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ 46.45 పాయింట్ల లాభంతో 7,900 మార్కును దాటి 7904 ట్రేడవుతోంది. ఆయిల్, ఆటో, ఇన్ ఫ్రా టెక్నాలజీ, ఎఫ్ఎమ్ సీజీ షేర్లలో కొనసాగుతున్న కొనుగోలు మద్దతుతో స్టాక్ సూచీలు లాభాల్లో నడుస్తున్నాయి. యాక్సిస్ బ్యాంకు, ఓఎన్జీసీ షేర్లలో కొనుగోల ర్యాలీతో ఆ షేర్లు 2శాతం మేర పెరిగాయి. హెచ్ డీఎఫ్ సీ, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంకు, మారుతీ సుజుకీలు మార్కెట్లను లీడ్ చేస్తుండగా.. టాటా మోటార్స్, బజాజ్ ఆటో, ఏషియన్ పేయింట్స్ నష్టాల బాట పట్టాయి. మరోవైపు ఆయిల్ ధరలు పెరిగాయనే వార్తను వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించిన అనంతరం ఆసియన్ మార్కెట్లు లాభాల్లో నడుస్తున్నాయి. నిన్న విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా కొన్ని కంపెనీ షేర్లను లాభాల్లో నడిపిస్తున్నాయి. తమిళనాడులో ప్రతిపక్షంలో ఉన్న డీఎమ్ కేకు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు వరించబోతుందని సన్ టీవీ ప్రకటించిన నేపథ్యంలో ఆ కంపెనీ షేర్లు 9.5శాతం మేర పెరిగాయి. చెన్నైకు చెందిన ఈ సన్ టీవీ, కళానిధి మారన్ కు చెందినది. డీఎమ్ కే ప్రెసిడెంట్ ఎమ్. కరుణానిధికి కళానిధి మనువడు. మరోవైపు పసిడి, వెండి ధరలు కూడా లాభాల్లో నడుస్తున్నాయి. పసిడి రూ.76 లాభంతో రూ.30,053గా కొనసాగుతుండగా.... వెండి రూ.182 లాభంతో రూ.41,169గా నమోదవుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 66.69గా ఉంది. -
రికార్డు స్థాయిలో టాక్స్ రిటర్న్స్ ఈ-ఫైలింగ్
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో టాక్స్ రిటర్న్స్ 68.5శాతం పెరిగి, రికార్డు సృష్టించాయి. 8.32 లక్షల మంది వినియోగదారులు, ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్(ఐటీఆర్స్) ను ఎలక్ట్రానిక్ గా ఫైల్ చేశారని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) గణాంకాలు తెలిపాయి. అయితే 2015-16లో ఈ-ఫైలింగ్ రిటర్న్స్ 4.94 లక్షలుగా మాత్రమే రికార్డు అయినట్టు పేర్కొంది. ఈ-ఫైలింగ్ ప్రక్రియను సులభతరం చేయడం ద్వారా యూజర్లు ఇంట్లోనే ఉండి తేలికగా ఈ సదుపాయాన్ని వాడుకుంటున్నారని తెలిపింది. 2016 ఏప్రిల్ 30వరకు మొత్తం 5.25 కోట్ల యూజర్లు రిజిస్టర్ చేసుకున్నారని, 49.54 శాతం రిటర్న్స్ ఆఫీసు పనివేళల్లో కాకుండా ఇతర సమయాల్లో.. అంటే ఇళ్లలో ఉన్నప్పుడే నమోదయ్యాయని సీబీడీటీ పేర్కొంది. అమెరికాలో కంటే భారత్ లోనే టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం సులభతరంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపిన సంగతి తెలిసిందే. ప్రారంభ సమయంలో ఈ-ఫైలింగ్ చాలా భారమైన పని అని, తర్వాతి కాలంలో ఇది సులభతరంగా మారిందని డెలాయిట్ హస్కిన్స్ అండ్ సెల్స్ ఎల్ఎల్ పీ పార్టనర్ దివ్య బవేజా తెలిపారు. మార్చి 30న కొత్త ఫారాలను సీబీడీటీ నోటిఫై చేసింది. వాటిని జూలై 31లోగా ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ రిటర్న్స్ ఫైల్ చేయడం మహారాష్ట్ర నుంచి జరిగాయని, గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లు తర్వాతి స్థానాల్లో నిలిచాయని డేటా నివేదించింది. -
ప్రముఖ కంపెనీ సీవోవో ఆత్మహత్య
గూర్గావ్ : అంతర్జాతీయ కంపెనీ బ్రిటానికా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) వినీత్ వింగ్(49) తన సొసైటీ బిల్డింగ్ నుంచి దూకి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎన్ సైక్లోపేడియా బ్రిటానికా కంపెనీకి దక్షిణ ఆసియా డివిజన్ సీవోవోగా వినీత్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. సైబర్ సిటీలోని తన అపార్ట్ మెంట్ 19వ అంతస్తు నుంచి దూకి, వినీత్ ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. అతని జేబులో సూసైడ్ నోట్ ను పోలీసులు గుర్తించారు. తనకి జీవితంపై విసుగు పొందడం వల్లే, ఈ జీవితానికి ఇంతటితో ముగించాలను కుంటున్నానని సూసైడ్ నోట్ లో వినీత్ పేర్కొన్నాడు. అపార్ట్ మెంట్ లోని డి-బ్లాక్ లో ఉండే వినీత్ , సీ-బ్లాక్ లోని 19వ అంతస్తు నుంచి అతను దూకినట్టు పోలీసులు చెప్పారు. అతని మృతదేహాన్నిఆదివారం ఉదయం 9గంటల ప్రాంతంలో చెత్త ఊడ్చే వారు గుర్తించారన్నారు. 19వ అంతస్తులో అతని చెప్పులు లభ్యం కావడంతో అక్కడినుంచే వినీత్ దూకి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన అనంతరం ఈ ఘటనపై పూర్తివివరాలు తెలియజేస్తామన్నారు మార్నింగ్ వాక్ కోసం వెళ్లారని, అప్పటినుంచి ఇంటికి తిరిగిరాలేదని కుటుంబసభ్యులు చెప్పినట్టు ఏసీపీ హవా సింగ్ తెలిపారు. డీఎల్ఎఫ్ బెల్వెడెరే పార్క్ లో అతని తండ్రి, భార్య, ఇద్దరు కొడుకులు, కూతురితో వినీత్ నివాసం ఉంటున్నాడు. వినీత్ మృతితో అతని తండ్రి గుండెపోటుకు గురై ఆసుపత్రి పాలయ్యాడు. కాగా వినీత్ కు ఫోటో గ్రాఫింగ్ అంటే చాలా మక్కువ. వన్యప్రాణులు, సంగీతంపై ఫోటోలు తీయడానికి వినీత్ ఎక్కువ ఆసక్తి కనబరిచేవారు. జపాన్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా దేశాలకు ఆయన ట్రావెల్ చేశారు. అతని ఫోటో గ్రాఫ్ లు నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెల్ లో కూడా వచ్చాయి. "నేను వచ్చాను. నేను చూశాను. కొంచెం సేపు ఏడ్చిన అనంతరం కొంత సమయం నిద్రకు ఉపక్రమించాను" అని వినీత్ అన్ ఎర్త్ అనే అతని బ్లాగ్ లో ఇటీవల ఒక పోస్టు పెట్టాడు. -
దొంగను పట్టుకుందామని..
భోపాల్: దొంగను ఎలాగైనా పట్టుకోవాలనే ఆవేశంతో ఓ తల్లీ కూతుళ్లు కదులుతున్న రైలు నుంచి దూకేసిన వైనం కలకలం రేపింది. భోపాల్, భైరాంఘర్ రైల్వే స్టేషన్ల పరిధిలో శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు అందించిన సమాచారం ప్రకారం చత్తీస్‌గఢ్ కుచెందిన అశ్వా తివారి, అంజన బిలాస్ పూర్ నుంచి ఇండోర్ వెళ్లేందుకు నర్మద ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కారు. అదనుకోసం కాపు కాసిన దొంగ సమయం చూసి తల్లి ఆశా పర్సు లాక్కుపోయాడు. దీంతో తల్లీ కూతుళ్లిద్దరూ వాడిని దొరకబుచ్చుకునేందుకు ప్రయత్నించారు. ఇంతలో ఆ దొంగ రైల్లోంచి దూకేశాడు. ఈ క్రమంలో వీరిద్దరూ కూడా రైల్లోంచి కిందకు దూకేయడంతో తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఇంత చేసినా పర్సు దొంగ మాత్రం తప్పించుకు పారిపోయాడు. కాగా బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితునికోసం గాలిస్తున్నారు.