
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకుపోతున్నాయి. ఆరంభంనుంచీ దూకుడుమీద ఉన్న సూచీలు ప్రస్తుతం మరింత ఎగిసి కీలక మద్దతు స్థాయిలను సునాయాసంగా అధిగమించి ఉత్సాహంగా కదులుతున్నాయి. అన్నిరంగాల షేర్లలోనూ కొనుగోళ్ల సందడి నెలకొంది. ఫలితంగా సెన్సెక్స్ 1114 పాయింట్లు జంప్ చేసి 52712 వద్ద, నిఫ్టీ 332 పాయింట్లు ఎగిసి 15682 వద్ద కొనసాగుతుండటం విశేషం. ఫలితంగా సెన్సెక్స్ 52600 స్థాయికి ఎగువన, అలాగే నిఫ్టీ 15600 స్థాయికి ఎగువన కొనసాగుతున్నాయి.
ఐటీ, బ్యాంకింగ్, మెటల్ తదితర రంగాల షేర్లు లాభాలతో కళకళలాడుతున్నాయి. టైటన్, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, డా.రెడ్డీస్, హిందాల్కో, హీరోమోటో, ఐటీసీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్ర, ఎస్‌బీఐ, యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకు తదితర షేర్లు లాభపడుతుండగా, అపోలో హాస్పిటల్స్, నెస్లే మాత్రమే నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment