అరబిందోకు యుఎస్ఎఫ్‌డీఏ బూస్ట్‌ | Aurobindo Pharma jumps over 8% on USFDA nod | Sakshi
Sakshi News home page

అరబిందోకు యుఎస్ఎఫ్‌డీఏ బూస్ట్‌

Published Wed, Jul 19 2017 12:54 PM | Last Updated on Tue, Sep 5 2017 4:24 PM

Aurobindo Pharma jumps over 8% on USFDA nod

న్యూఢిల్లీ:  అమెరికాకు ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) అందించిన కిక్‌తో పార్మా  కంపెనీ అరబిందో ఫార్మాకు స్టాక్‌మార్కెట్లో మంచి బూస్ట్‌ లభించింది.  అమెరికా మార్కెట్లలో సవెల్మర్ కార్బొనేట్ మాత్రలను  విడుదల చేసేందుకు తుది ఆమోదం లభించింది. కీలకమైన జనరిక్‌ డ్రగ్‌కు అనుమతి లభించడంతో బుధివారంనాటి మార్కెట్లో  8 శాతం ఎగిసి భారీ లాభాలను  సాధించింది.

మార‍్కెట్‌ ఆరంభంలోనే అరబిందో ఫార్మా కంపెనీ షేర్లు 8 శాతం పెరిగాయి.  ఈ జంప్‌తో  షేరు ఎనిమిది నెలల గరిష్టాన్ని తాకింది. ఎన్ఎస్ఇలో కంపెనీ షేర్లు 8.22 శాతం పెరిగి 794.70 కి చేరుకున్నాయి. వాల్యూమ్ విషయంలో, కంపెనీలో 4.63 లక్షల షేర్లను బిఎస్ఇలో వర్తకం చేశాయి, ఉదయం ట్రేడింగ్ సెషన్లో ఎన్ఎస్ఈ వద్ద 81 లక్షల షేర్లు చేతులుమారాయి.
కిడ్నీల పనితీరును  దెబ్బతీసే తీవ్ర వ్యాధుల చికిత్సకు సెవిలామిర్‌ ట్యాబ్లెట్ల విక్రయానికి  తుది ఆమోదం లభించిందని కంపెనీ తెలిపింది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యుఎస్ఎఫ్డిఎ) నుంచి సవెల్మర్ కార్బొనేట్ టాబ్లెట్లను 800 మి.గ్రా. తయారీకి తుది ఆమోదం లభించిందని బీఎస్‌ఈ ఫైలింగ్లో అరబిందో ఫార్మా పేర్కొంది.  డయాలిసిస్‌పై దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి రోగులలో సీరం ఫాస్ఫరస్ నియంత్రణ కోసం ఈ మాత్రలు ఉపయోపడనున్నాయి.
కాగా ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో హైదరాబాద్‌ ఫార్మా సంస్థ అరబిందో కౌంటర్‌ జోరందుకోవడంతో పాటు ఇతర  లుపిన్‌, క్యాడిల్లా హెల‍్త్‌కేర్‌, దివీస్‌లాంటి ఫార్మా  షేర్లు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. 


 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement