ముంబై: డ్రగ్ మేజర్ అరబిందో ఫార్మాకు హెచ్‌ఐవీ చికిత్స లో ఉపయోగించే మందుకు తాత్కాలిక అనుమతి లభించింది. 'డొల్యూట్‌గ్రేవిర్ 50 ఎంజీ' పేరుతో ఉత్పత్తి అవుతున్న తమ ఔషధానికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ ఎడ్మినిస్ట్రేషన్ (యూఎస్‌ఎఫ్‌డీఏ) టెంటేవివ్ అప్రూవల్ లభించి నట్లు అరబిందో ఫార్మా బీఎస్ ఈ ఫైలింగ్ లో పేర్కొంది.
అనుమతి పొందిన ఈ ఏఎన్‌డీఏ... హెచ్‌ఐవీ-1 చికిత్సకు వినియోగించే టివికే ఔషధానికి సమానస్థాయిదని కంపెనీ పేర్కొంది. ఇతర వైరల్ ఏజెంట్లతో దీన్ని వాడతారని తెలిపింది. వివ్ హెల్త్‌కేర్‌తో 92 లైసెన్స్ డ్ దేశాల్లో ఈ డ్రగ్ ను సరఫరా చేసేందుకు గాను 2014 లో లైసెన్సింగ్ ఒప్పందంపై సంతకాలు చేసినట్టు అరబిందో తెలిపింది. దీనికి స్థానిక రెగ్యులేటరీ అనుమతి అవసరం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో అరబిందో షేర్లు దాదాపు 5 శాతం లాభపడ్డాయి.
అరబిందో హెచ్‌ఐవీ-1 డ్రగ్ కు తాత్కాలిక అనుమతి
Published Thu, Sep 22 2016 5:22 PM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM
Advertisement
Advertisement