![Aurobindo Pharma Q3 net profit drops 10pc to Rs 846 crore](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/aurobindo-.jpg.webp?itok=QsZYrqY2)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా నికర లాభం రూ. 846 కోట్లుగా నమోదైంది. గత క్యూ3లో ఇది రూ. 940కోట్లు. మరోవైపు తాజాగా ఆదాయం రూ. 7,352 కోట్ల నుంచి రూ. 7,979 కోట్లకు చేరింది. త్రైమాసికాలవారీగా చూస్తే అత్యధిక ఆదాయాన్ని నమోదు చేసినట్లు కంపెనీ ఎండీ కె. నిత్యానంద రెడ్డి తెలిపారు.
కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ఇందుకు దోహదపడినట్లు ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తయారీ సామర్థ్యాలను మరింతగా మెరుగుపర్చుకోనున్నామని, స్పెషాలిటీ.. ఇంజెక్టబుల్స్ వ్యాపారాన్ని విస్తరించనున్నామని నిత్యానంద రెడ్డి వివరించారు. దీనితో లాభదాయకత చెప్పుకోతగ్గ స్థాయిలో మెరుగుపడుతుందని చెప్పారు.
సమీక్షాకాలంలో అమెరికా ఫార్ములేషన్ విభాగం సుమారు రెండు శాతం క్షీణించి రూ. 3,671 కోట్లుగా, యూరప్ ఫార్ములేషన్స్ 23 శాతం పెరిగి ఆదాయం రూ. 2,121 కోట్లుగా, గ్రోత్ మార్కెట్స్ విభాగం 39 శాతం వృద్ధితో రూ. 873 కోట్లుగా నమోదైంది. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై కంపెనీ రూ. 450 కోట్లు వెచ్చించింది. బీఎస్‌ఈలో కంపెనీ షేరు స్వల్పంగా క్షీణించి రూ. 1,184.50 వద్ద క్లోజయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment