tentative
-
అరబిందో హెచ్ఐవీ-1 డ్రగ్ కు తాత్కాలిక అనుమతి
ముంబై: డ్రగ్ మేజర్ అరబిందో ఫార్మాకు హెచ్ఐవీ చికిత్స లో ఉపయోగించే మందుకు తాత్కాలిక అనుమతి లభించింది. 'డొల్యూట్గ్రేవిర్ 50 ఎంజీ' పేరుతో ఉత్పత్తి అవుతున్న తమ ఔషధానికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ ఎడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) టెంటేవివ్ అప్రూవల్ లభించి నట్లు అరబిందో ఫార్మా బీఎస్ ఈ ఫైలింగ్ లో పేర్కొంది. అనుమతి పొందిన ఈ ఏఎన్డీఏ... హెచ్ఐవీ-1 చికిత్సకు వినియోగించే టివికే ఔషధానికి సమానస్థాయిదని కంపెనీ పేర్కొంది. ఇతర వైరల్ ఏజెంట్లతో దీన్ని వాడతారని తెలిపింది. వివ్ హెల్త్కేర్తో 92 లైసెన్స్ డ్ దేశాల్లో ఈ డ్రగ్ ను సరఫరా చేసేందుకు గాను 2014 లో లైసెన్సింగ్ ఒప్పందంపై సంతకాలు చేసినట్టు అరబిందో తెలిపింది. దీనికి స్థానిక రెగ్యులేటరీ అనుమతి అవసరం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో అరబిందో షేర్లు దాదాపు 5 శాతం లాభపడ్డాయి. -
లుపిన్ మరో ముందడుగు
న్యూఢిల్లీ: ఫార్మా మేజర్ లూపిన్ మరో ముందడుగు వేసింది. జనరిక్ వెర్షన్ కు చెందిన యాంటి డి ప్రెసెంట్ డ్రగ్ పారోక్సిటైన్ అదనపు విడుదలకు అమెరికాలో తాత్కాలిక అనుమతి లభించిందని తెలిపింది. ఈ మేరకు అమెరికా హెల్త్ రెగ్యులేటరీనుంచి తమకు అనుమతి లభించిందని శుక్రవారం తెలిపింది. యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిబంధనల ప్రకారం వివిధ పరిమాణాల్లో ఈ మందు అమ్మకాలకు అనుమతి పొందినట్టు వెల్లడించింది. 12.5ఎంజీ, 25 ఎంజీ, 37.5 ఎంజీల అపోటెక్స్ టెక్నాలజీస్ కి చెందిన పాక్సిల్ సీఆర్ మాత్రల జెనెరిక్ వెర్షన్ కు తాత్కాలిక అనుమతి లభించిందనీ లూపిన్ బీఎస్ఇ పైలింగ్ లో తెలిపింది. డిప్రెసివ్ డిజార్డర్, తీవ్ర భయాందోళన రుగ్మత ,సోషల్ యాంగ్జైటీ డిజార్డర్, ప్రీ మెనస్ట్రుయల్ తదితర సమస్యల్లో చికిత్సకు ఈ మందు ఉపయోగపడుతుందని పేర్కొంది. దీంతో మార్కెట్లో లుపిన్ కౌంటర్ లాభాల్లో నడుస్తోంది.