అరబిందో ‘బీపీ’ ఔషధానికి ఎఫ్డీఏ అనుమతి | Aurobindo Pharma gains on USFDA nod for hypertension drug | Sakshi
Sakshi News home page

అరబిందో ‘బీపీ’ ఔషధానికి ఎఫ్డీఏ అనుమతి

Published Wed, Apr 27 2016 1:31 AM | Last Updated on Sun, Sep 3 2017 10:49 PM

Aurobindo Pharma gains on USFDA nod for hypertension drug

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమ్లోడిపైన్, వల్సార్టన్ ఔషధ జనరిక్ వెర్షన్ల తయారీ, విక్రయాలకు అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు లభించినట్లు అరబిందో ఫార్మా తెలిపింది. రక్తపోటు చికిత్సలో దీన్ని ఉపయోగిస్తారు. నొవార్టిస్ ఫార్మాకు చెందిన ఎక్స్‌ఫోర్జ్ ఔషధానికి ఇది జనరిక్ వెర్షన్. 2016-17 తొలి త్రైమాసికంలోనే ఈ ఔషధాన్ని ప్రవేశపెట్టనున్నట్లు అరబిందో ఫార్మా వివరించింది. ఈ ఏడాది ఫిబ్రవరి ఆఖరు దాకా 12 నెలల కాలం లో దీని మార్కెట్ పరిమాణం 123 మిలియన్ డాలర్లుగా ఉంటుందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement