USFDA
-
మెరుగుపడిన ‘ఫార్మా’ ప్రమాణాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్ ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) అమలు చేస్తున్న కఠిన నిబంధనలను పాటించడంలో 2024లో భారతీయ ఫార్మా కంపెనీలు పెద్ద ఎత్తున పురోగతి సాధించాయి. బయోలాజిక్స్, డ్రగ్స్, వైద్య పరికరాలు.. ఇలా విభాగం ఏదైనా యూఎస్ఎఫ్డీఏ తనిఖీల ప్రతికూల వర్గీకరణ (క్లాసిఫికేషన్) సంఖ్య ప్రస్తుత సంవత్సరంలో తగ్గడం విశేషం. 2023లో యూఎస్ఎఫ్డీఏ దేశవ్యాప్తంగా 225 తనిఖీలను నిర్వహించింది. ఇందులో 18 అధికారిక చర్య (అఫీషియల్ యాక్షన్), 117 స్వచ్ఛంద చర్య (వాలంటరీ యాక్షన్) కేసులకు దారితీసింది. నియంత్రణ సంస్థ 2024 నాటికి ప్రమాణాలను కఠినతరం చేసినప్పటికీ తనిఖీల సంఖ్య 206కి పడిపోయింది. అయితే అఫీషియల్ యాక్షన్ కేసులు 14, వాలంటరీ యాక్షన్ కేసులు 115కి తగ్గాయి. భారతీయ ఔషధ రంగం సంస్థలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అధిక నాణ్యత, తయారీ పద్ధతులను పాటిస్తున్నాయనడానికి తగ్గిన ఈ కేసులే నిదర్శనం అని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ చెబుతోంది. మహమ్మారికి ముందు 2018తో పోలిస్తే 2019లో అఫీషియల్ యాక్షన్ కేసుల్లో 100 శాతం పెరుగుదల నమోదు కావడం గమనార్హం. తనిఖీల ఆధారంగా.. తయారీ కేంద్రాలను యూఎస్ఎఫ్డీఏ తనిఖీ చేసినప్పుడు.. తనిఖీల ఆధారంగా ఫలితాలను వర్గీకరిస్తుంది. అభ్యంతకర పరిస్థితులు, కార్యకలాపాల్లో ఏదైనా లోపం ఉన్నట్లయితే అట్టి ఫెసిలిటీ వాలంటరీ యాక్షన్ వర్గీకరణను అందుకుంటుంది. తక్షణ నియంత్రణ చర్యలు తీసుకోకుండా లోపాలను స్వచ్ఛందంగా సరిదిద్దడానికి అవకాశం ఇస్తారు. ఎఫ్‌డీఏ నియంత్రణ సమావేశం ద్వారా ఈ ప్రక్రియను సులభతరం చేయవచ్చు. భద్రత, సంక్షేమం లేదా డేటా విశ్వసనీయతను గణనీయంగా ప్రభావితం చేసే తీవ్ర నియంత్రణ ఉల్లంఘనలకు పాల్పడినట్టు గుర్తిస్తే అఫీషియల్ యాక్షన్ కేసు నమోదు చేస్తారు. ఇటువంటి సందర్భాలలో అడ్మినిస్ట్రేటివ్, రెగ్యులేటరీ చర్యలకు ఎఫ్‌డీఏ సిఫార్సు చేస్తుంది. ఇందులో వార్నింగ్ లెటర్స్, దిగుమతి హెచ్చరికలు, ఆదేశాలు వంటి చట్టపర చర్యలు కూడా ఉండవచ్చు. తనిఖీ సమయంలో ఎటువంటి ఉల్లంఘనలు కనుగొనకపోతే నో యాక్షన్ ఇండికేట్గా వర్గీకరిస్తారు. తనిఖీ పూర్తయిన 45 నుండి 90 రోజులలోపు కంపెనీకి తుది తనిఖీ వర్గీకరణను యూఎస్ఎఫ్డీఏ తెలియజేస్తుంది.క్వాలిటీయే తొలి ప్రాధాన్యత..నాణ్యత ప్రమాణాలు, మెరుగైన కార్యాచరణ, నిబంధనలను చురుకుగా అమలు చేయడం వల్లే ఇది సాధ్యపడిందని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ) పేర్కొంది. ‘నాణ్యతకు ప్రాధాన్యతనిచ్చే సంస్కృతిని పెంపొందించడంలో భారతీయ ఫార్మా కంపెనీలు గణనీయ కార్యాచరణను చేపట్టాయి. సీనియర్ నాయకత్వ బృందాలు ఆటోమేషన్, బలమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, కొనసాగుతున్న ఉద్యోగుల శిక్షణ ద్వారా నిరంతరంగా ప్రమాణాలను మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నాయి. కంపెనీలు నాణ్యతకు తొలి ప్రాధాన్యత ఇచ్చాయి.కచ్చితత్వం, సామర్థ్యాన్ని పెంపొందించడానికి తయారీ కేంద్రాల్లో అధునాతన ఆటోమేషన్ సాంకేతికతలను అమలు చేశాయి’ అని ఐపీఏ సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ తెలిపారు. నాణ్యతా ప్రమాణాలను మరింత మెరుగ్గా చేయడానికి కట్టుబడి ఉన్నామని ఐపీఏ వెల్లడించింది. ‘ఈ పురోగతి భారత్‌లో నాణ్యతా ప్రమాణాలను ముందుకు తీసుకెళ్లాలనే మా నిబద్ధతను నొక్కి చెబుతోంది. నాణ్యమైన సంస్కృతిని బలోపేతం చేయడానికి, గ్లోబల్ బెంచ్‌మార్క్‌లతో సమం చేయడానికి నిరంతర ప్రయత్నంలో భాగంగా మేము దీనిని చూస్తాము’ అని వివరించింది.ప్రస్తుత సంవత్సరంలో దేశవ్యాప్తంగా యూఎస్ఎఫ్డీఏ తనిఖీలు, కేసులు తగ్గిన నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన లిస్టెడ్ కంపెనీల 2024–25 ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, 2024 జనవరి 1తో పోలిస్తే బీఎస్ఈలో మంగళవారం (డిసెంబర్ 31) నాటికి షేరు వృద్ధి, ధరను ఒకసారి పరిశీలిస్తే..డాక్టర్ రెడ్డీస్ ల్యాబో రేటరీస్ రూ.1,342 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ2లో నమోదైన రూ.1,480 కోట్ల నికరలాభంతో పోలిస్తే ఇది 9 శాతం తక్కువ. గ్లోబల్ జనరిక్స్ జోరుతో టర్నోవర్ సుమారు 17 శాతం వృద్ధి చెంది రూ.8,016 కోట్లకు చేరింది. షేరు ధర 19.28 శాతం దూసుకెళ్లి రూ.1,388.25 వద్ద స్థిరపడింది. అరబిందో ఫార్మా నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8.6 శాతం అధికమై రూ.817 కోట్లు నమోదు చేసింది. ఎబిటా 11.6 శాతం దూసుకెళ్లి రూ.1,566 కోట్లుగా ఉంది. టర్నోవర్ 8 శాతం పెరిగి రూ.7,796 కోట్లకు చేరింది. షేరు ధర 23.61 శాతం ఎగసి రూ.1,335.20 వద్ద ముగిసింది.గ్లాండ్ ఫార్మానికరలాభం 16 శాతం క్షీణించి రూ.163 కోట్లకు వచ్చి చేరింది. ఆదాయం రూ.1,373 కోట్ల నుంచి రూ.1,405 కోట్లకు పెరిగింది. షేరు ధర 6.21 శాతం క్షీణించి రూ.1,788.60లు తాకింది.నాట్కో ఫార్మానికరలాభం అంత క్రితం త్రైమాసికంతో పోలిస్తే 83 శాతం ఎగసి రూ.676 కోట్లు సాధించింది. టర్నోవర్ రూ.1,031 కోట్ల నుంచి రూ.1,371 కోట్లకు చేరింది. షేరు ధర 69.73 శాతం వృద్ధి చెంది రూ.1,387 వద్ద స్థిరపడింది.గ్రాన్యూల్స్ ఇండియా నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 4.79 శాతం తగ్గి రూ.97 కోట్లు నమోదు చేసింది. టర్నోవర్ 19.49 శాతం క్షీణించి రూ.956 కోట్లకు వచ్చి చేరింది. షేరు ధర 43.76 శాతం అధికమై రూ.591.80 వద్ద ముగిసింది. దివీస్ ల్యాబొరేటరీస్ నికరలాభం రూ.510 కోట్లు సాధించింది. 2023–24లో ఇదే త్రైమాసిక లాభం రూ.348 కోట్లతో పోలిస్తే ఇది 46 శాతం అధికం. మొత్తం ఆదాయం రూ.1,909 కోట్ల నుంచి 22.5 శాతం పెరిగి రూ.2,338 కోట్లకు చేరింది. పన్నుకు ముందు లాభం 54 శాతం వృద్ధి చెంది రూ.722 కోట్లను తాకింది. షేరు ధర 55.89 శాతం పెరిగి రూ.6,099.75లకు చేరింది. -
అమెరికా మార్కెట్ నుంచి సన్ ఫార్మా ఉత్పత్తుల రీకాల్
న్యూఢిల్లీ: పలు కారణాలతో అమెరికా మార్కెట్ నుంచి సన్ ఫార్మా, అరబిందో ఫార్మా, జూబిలెంట్ సంస్థలు వివిధ ఉత్పత్తులను రీకాల్ చేస్తున్నట్లు అమెరికా ఆహార, ఔషధ రంగ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ ఒక నివేదికలో పేర్కొంది. విటమిన్ బీ12 లోపం చికిత్సలో ఉపయోగించే సైనాకోబాలమిన్ ఇంజెక్షన్‌కు సంబంధించి 4.33 లక్షల వయాల్స్‌ను అరబిందో ఫార్మా రీకాల్ చేస్తోంది. ఏప్రిల్ 5న ఈ ప్రక్రియ ప్రారంభించింది. మరోవైపు, కళ్లలో సహజసిద్ధంగా నీటి ఉత్పత్తిని చేసేందుకు తోడ్పడే ’సెక్వా’ ఔషధాన్ని సన్ ఫార్మా వెనక్కి రప్పిస్తోంది. ఏప్రిల్ 1న ఈ ప్రక్రియ ప్రారంభించింది. అటు జూబిలెంట్ క్యాడిస్టా ఫార్మా .. మిథైల్ప్రెడ్నిసొలోన్ ట్యాబ్లెట్లకు సంబంధించి 19,222 బాటిల్స్‌ను రీకాల్ చేస్తోంది. -
ఇక యూఎస్‌లోనూ ఫైజర్ వ్యాక్సిన్!
న్యూఢిల్లీ, సాక్షి: ఫార్మా దిగ్గజం ఫైజర్ ఇంక్ రూపొందించిన వ్యాక్సిన్‌కు యూఎస్ ప్రభుత్వ సలహా మండలి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎమెర్జెన్సీ ప్రాతిపదికన వ్యాక్సిన్‌ను వినియోగించవచ్చంటూ సూచించింది. వ్యాక్సిన్ వినియోగంలో రిస్కులతో పోలిస్తే రోగులకు ఉపశమన అవకాశాలే అధికంగా ఉన్నట్లు అభిప్రాయపడింది. యూకేలో అలెర్జీలున్న వ్యక్తులకు వ్యాక్సిన్‌ను ఇవ్వవద్దంటూ ఆదేశాలు జారీ అయిన నేపథ్యంలో ప్రభుత్వ ప్యానల్ సలహాలకు ప్రాధాన్యత ఏర్పడింది. 20 మందితో ఏర్పాటైన వ్యాక్సిన్లు, సంబంధిత బయోలాజికల్ ప్రొడక్టుల సలహా కమిటీ(వీఆర్‌బీపీఏసీ) ఫైజర్ వ్యాక్సిన్‌కు 17-4 ఓట్లతో ఆమోదముద్ర వేసింది. దీంతో యూఎస్ ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) ఫైజర్ వ్యాక్సిన్‌కు నేటి(11) నుంచి అనుమతి మంజూరు చేసే అవకాశమున్నట్లు ఫార్మా వర్గాలు అంచనా వేస్తున్నాయి. సెకండ్‌వేవ్‌లో భాగంగా యూఎస్‌లో కేసులు, మరణాల సంఖ్య పెరగుతున్న కారణంగా యూఎస్ఎఫ్డీఏ త్వరితగతిన అత్యవసర వినియోగానికి అనుమతించవచ్చని అభిప్రాయడ్డారు. యూఎస్‌లో కరోనా వైరస్ బారినపడినవారి సంఖ్య 1.5 కోట్లకు చేరగా.. మరణాల సంఖ్య 2.8 లక్షలకు చేరినట్లు తెలియజేశారు. .(తొలి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్- పరీక్షలకు రెడీ) తప్పనిసరికాదు నిపుణులు కమిటీ సూచనలను యూఎస్ఎఫ్డీఏ తప్పనిసరిగా పాటించవలసిన అవసరంలేదని సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. జర్మన్ కంపెనీ బయోఎన్‌టెక్‌తో భాగస్వామ్యంలో ఫైజర్ రూపొందించిన వ్యాక్సిన్ వినియోగానికి ఇటీవల యూకే, కెనడా, బెహ్రయిన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ సలహా మండలి ఇచ్చిన నివేదిక సూచనలు మాత్రమేనని.. యూఎస్ఎఫ్డీఏ వీటికి కట్టుబడవలసిన అవసరంలేదని నిపుణులు తెలియజేశారు. కాగా.. యూఎస్‌లో పరిస్థితుల ఆధారంగా ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి యూఎస్ఎఫ్డీఏ వెనువెంటనే అనుమతించే వీలున్నట్లు అంచనా వేశారు.(అలర్జీలు ఉన్న వారికి వ్యాక్సిన్లు వాడొద్దు) రాజీ పడబోము రానున్న వారాల్లో దేశీయంగానూ కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశమున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తాజాగా పేర్కొన్నారు. అయితే సైంటిఫిక్, ఔషధ నియంత్రణ సంస్థల నిబంధనల విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. కోవిడ్-19 కట్టడికి యూఎస్ హెల్త్‌కేర్ దిగ్గజం ఫైజర్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు తాజాగా యూఎస్ సలహా మండలి సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో హర్షవర్ధన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు ఫార్మా వర్గాలు పేర్కొన్నాయి. ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఇటీవల యూకే, కెనడా, బెహ్రయిన్ అనుమతించిన విషయం విదితమే. దేశీయంగా ప్రపంచస్థాయి సంస్థలున్నాయని, తద్వారా కోవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునేందుకు కృషి చేస్తున్నాయని హర్ష వర్ధన్ తెలియజేశారు. ప్రస్తుతం పలు సంస్థలు వ్యాక్సిన్ తయారీ, పంపిణీ తదితర కార్యక్రమాలపై దృష్టిపెట్టినట్లు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడికి సుమారు 260 వ్యాక్సిన్లపై ప్రయోగాలు జరుగుతున్నట్లు తెలియజేశారు. ఇవి వివిధ దశల్లో ఉన్నాయని, దేశీయంగా వీటిలో 8 వ్యాక్సిన్లను తయారు చేయనున్నట్లు వెల్లడించారు.() -
కోవిడ్-19కు తొలి వ్యాక్సిన్ రెడీ: ఫైజర్
న్యూయార్క్: కోవిడ్-19 చికిత్సకు తొలి వ్యాక్సిన్ సిద్ధమైంది. మెసెంజర్ ఆర్ఎన్ఏ ఆధారంగా రూపొందించిన తమ వ్యాక్సిన్ ను అత్యవసర వినియోగానికి అనుమతించమంటూ గ్లోబల్ ఫార్మా దిగ్గజం ఫైజర్ ఇంక్ శుక్రవారం దరఖాస్తు చేసుకుంది. ఈ దరఖాస్తును వచ్చే నెలలో యూఎస్ఎఫ్డీఏ సలహా కమిటీ సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 8-10 మధ్య కాలంలో సమీక్ష ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. తద్వారా కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ ను రూపొందించిన తొలి కంపెనీగా ఫైజర్ రికార్డ్ సాధించనున్నట్లు ఫార్మా నిపుణులు పేర్కొన్నారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి పలు గ్లోబల్ ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్లను రూపొందిస్తున్న విషయం విదితమే. జర్మన్ కంపెనీ బయోఎన్‌టెక్ తో భాగస్వామ్యంలో రూపొందిస్తున్న వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ పరీక్షలలోనూ 95 శాతం ఫలితాలను సాధించినట్లు ఫైజర్ ఇటీవల వెల్లడించింది. మూడో దశ పరీక్షల తొలి ఫలితాల ఆధారంగా తమ వ్యాక్సిన్ సత్ఫలితాలు సాధిస్తున్నట్లు ఫైజర్ తెలియజేసింది. 5 కోట్ల డోసులు యూఎస్, బెల్జియంలలో వినియోగానికి ఈ ఏడాది చివరికల్లా 5 కోట్ల డోసేజీలను అందించగలమని ఫైజర్, బయోఎన్‌టెక్ తాజాగా తెలియజేశాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సురక్షితమైన, సత్ఫలితాలు ఇవ్వగల వ్యాక్సిన్లను అందించేందుకు చూస్తున్నట్లు ఫైజర్ ఇంక్ చైర్మన్ ఆల్బర్ట్ బోర్ల పేర్కొన్నారు. తమ వ్యాక్సిన్ భద్రత, ప్రభావాలపై తమకు పూర్తి అవగాహన ఉన్నట్లు తెలియజేశారు. వ్యాక్సిన్ వినియోగానికి అనుమతించమంటూ యూరోపియన్, యూకే ఔషధ నియంత్రణ సంస్థలకు సైతం తాము దరఖాస్తు చేయనున్నట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పలు ఇతర దేశాలలో నియంత్రణ సంస్థలకూ దరఖాస్తు చేయనున్నట్లు వివరించారు. అయితే ఫైజర్ తయారీ వ్యాక్సిన్ ను -80-94 సెల్షియస్ లో నిల్వ చేయవలసి ఉన్నందున కంపెనీ ఇందుకు అవసరమైన కూలింగ్ సిస్టమ్స్ ను సైతం సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్లను పంపిణీ చేసేందుకు వీలుగా డ్రై ఐస్ తో కూడిన సూపర్ కూల్ స్టోరేజీ యూనిట్లను రూపొందించింది. కాగా.. ఇటీవల తమ వ్యాక్సిన్ 94 శాతంపైగా ఫలితాలను సాధించినట్లు వెల్లడించిన ఫార్మా దిగ్గజం మోడర్నా ఇంక్ సైతం ఫైజర్ బాటలో త్వరలోనే యూఎస్ఎఫ్డీఏకు దరఖాస్తు చేయనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. -
అరబిందో ఫార్మా- హెమిస్ఫియర్.. బోర్లా
నాలుగు రోజుల వరుస లాభాలకు చెక్ చెబుతూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 152 పాయింట్లు క్షీణించి 40,555కు చేరగా.. నిఫ్టీ 51 పాయింట్లు కోల్పోయి 11,883 వద్ద ట్రేడవుతోంది. కాగా.. న్యూజెర్సీ ప్లాంటుపై యూఎస్ఎఫ్డీఏ హెచ్చరికలు జారీ చేయడంతో హైదరాబాద్ కంపెనీ అరబిందో ఫార్మా కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. మరోపక్క పీఎస్‌యూ వీఎస్ఎన్ఎల్ నుంచి ప్రత్యేక కంపెనీగా విడివడి స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన తొలి రోజే హెమిస్ఫియర్ ప్రాపర్టీస్ కౌంటర్లోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూ కట్టారు. వివరాలు చూద్దాం.. అరబిందో ఫార్మా న్యూజెర్సీ, డేటన్లోని ఓరల్ సాలిడ్ తయారీ కేంద్రంపై యూఎస్ఎఫ్డీఏ హెచ్చరికలు జారీ చేయడంతో అరబిందో ఫార్మా కౌంటర్ డీలా పడింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో అరబిందో షేరు 5.5 శాతం పతనమై రూ. 762 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 6.5 శాతం నీరసించి రూ. 754 దిగువకు చేరింది. డేటన్ ప్లాంటులో యూఎస్ఎఫ్డీఏ ఈ ఏడాది జనవరి 13- ఫిబ్రవరి 12న తనఖీలు చేపట్టింది. 9 లోపాలను గుర్తిస్తూ జూన్ 4న ఓఏఐతో కూడిన ఫామ్ 483ను జారీ చేసింది. కాగా.. అరబిందో ఫార్మా మొత్తం టర్నోవర్‌లో ఈ ప్లాంటు వాటా 2 శాతమేనని.. కంపెనీ కార్యకలాపాలపై ప్రస్తావించదగ్గ స్థాయిలో ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చని ఫార్మా వర్గాలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాయి. హెమిస్ఫియర్ ప్రాపర్టీస్ పీఎస్‌యూ వీఎస్ఎన్ఎల్(ప్రస్తుతం టాటా కమ్యూనికేషన్స్) నుంచి ప్రత్యేక కంపెనీగా విడదీసిన హెమిస్ఫియర్ ప్రాపర్టీస్ ఇండియా లిమిటెడ్(హెచ్‌పీఐఎల్) నేడు స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యింది. అయితే అటు బీఎస్ఈ, ఇటు ఎన్‌ఎస్‌ఈలలలో అమ్మకాలు ఊపందుకోవడంతో 5 శాతం లోయర్ సర్క్యూట్లను తాకింది. బీఎస్ఈలో రూ. 106 వద్ద లిస్టయిన షేరు రూ. 5.3 కోల్పయి రూ. 101 దిగువన ఫ్రీజయ్యింది. ఇక ఎన్ఎస్ఈలో రూ. 97 వద్ద ప్రారంభమై దాదాపు రూ. 5 నష్టంతో రూ. 92 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం హెచ్‌పీఐఎల్ చేతిలో దాదాపు 740 ఎకరాల భూమిని కలిగి ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. కంపెనీలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి 26 శాతానికిపైగా వాటా ఉంది. ఇదే విధంగా టాటా గ్రూప్ కంపెనీలకు దాదాపు 49 శాతం వాటా ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. -
అరబిందో లాభం 45% జంప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మార్చి త్రైమాసికంలో అరబిందో ఫార్మా ఉత్తమ పనితీరు కనబరిచింది. కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 45.2% వృద్ధితో రూ.850 కోట్లకు చేరింది. టర్నోవర్ 16.4% వృద్ధితో రూ.5,292 కోట్ల నుంచి రూ.6,158 కోట్లకు ఎగసింది. యూఎస్ ఫార్ములేషన్ అమ్మకాలు 20.5% పెరిగి రూ.2,990 కోట్లు, యూరప్ ఫార్ములేషన్ విక్రయాలు 26% హెచ్చి రూ.1,652 కోట్లు, వృద్ధి మార్కెట్లు 30% పెరిగి రూ.376 కోట్లు సాధించాయి. ఏపీఐల అమ్మకాలు రూ.917 కోట్ల నుంచి రూ.755 కోట్లకు దిగొ చ్చాయి. పరిశోధన, అభివృద్ధికి రూ.239 కోట్లు వ్యయం చేశారు. ఏఎన్‌డీఏల విషయంలో యూఎస్ఎఫ్డీఏ నుంచి ఈ త్రైమాసికంలో ఆరు తుది, రెండు తాత్కాలిక అనుమతులను కంపెనీ దక్కించుకుంది. టర్నోవర్ రూ.23 వేల కోట్లు.. 2019–20 ఆర్థిక సంవత్సరంలో అరబిందో ఫార్మా నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 19.7% పెరిగి రూ.2,831 కోట్లు సాధించింది. టర్నోవర్ 18 శాతం అధికమై రూ.23,098 కోట్లకు ఎగసింది. ఈపీఎస్ రూ.48.32 నమోదైంది. యూఎస్ ఫార్ములేషన్ అమ్మకాలు 27% హెచ్చి రూ.11,483 కోట్లు, యూరప్ ఫార్ములేషన్ విక్రయాలు 19.4% పెరిగి రూ.5,922 కోట్లు, వృద్ధి మార్కెట్లు 13.5% అధికమై రూ.1,355 కోట్లు నమోదయ్యాయి. పరిశోధన, అభివృద్ధికి ఆదాయంలో 4.1% (రూ.958 కోట్లు) వెచ్చించారు. విభిన్న ఉత్పత్తుల కారణంగా యూఎస్ఏ, యూరప్ మార్కెట్లలో వృద్ధిని కొనసాగించామని అరబిందో ఫార్మా ఎండీ ఎన్.గోవిందరాజన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుత వ్యాపారాలను పటిష్టం చేయడం, వినూత్న, ప్రత్యేక ఉత్పత్తుల అభివృద్ధి, నిబంధనలకు లోబడి పనిచేయడంపై దృష్టిసారించామని చెప్పారు. -
నష్టాల మార్కెట్లో బయోకాన్ జోరు
సాక్షి, ముంబై: దేశీయ ఫార్మా దిగ్గజం బయోకాన్ షేరు లాభాలతో కొనసాగుతోంది. మలేషియా ప్లాంట్‌కు సంబంధించి అమెరికా హెల్త్ రెగ్యులేటర్ యుఎస్ఎఫ్డిఎ నుంచి కీలక క్లియరెన్స్ రావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో 1300 పాయింట్లకుపైగా కుదేలైన దలాల్ స్ట్రీట్ లో బయోకాన్ 5 శాతానికి పైగా ఎగిసింది. మలేషియా ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ (ఈఐఆర్) అందుకున్నట్టు బయోకాన్ బుధవారం వెల్లడించింది. ఇన్సులిన్ గ్లార్జిన్ (సెమిగ్లీ) తయారీకి మలేషియాలోని కంపెనీ అనుబంధ సంస్థ బయోకాన్ ఎస్డీఎన్ బీహెచ్ డీ ఈఐఆర్ లభించిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 10-21 మధ్య మలేషియా ప్లాంట్‌లో యూఎస్ఎఫ్డీఏ తనిఖీలు నిర్వహించినట్టు ప్రకటించింది. ఇన్సులిన్ గ్లార్జైన్ తయారీలో తమకు ఒదొకముఖ్యమైన మైలురాయి అని కంపెనీ పేర్కొంది. నాణ్యత, సేవల్లో ప్రపంచ ప్రమాణాలకు సంబంధించి బయోకాన్ నిబద్ధతకు ఇది నిదర్శమని వ్యాఖ్యానించింది. తాజా లాభాలతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.33,462 కోట్లకు చేరింది. -
ఎన్ఎంఆర్ కేంద్రానికి ఎఫ్‌డీఏ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ)లోని న్యూక్లియర్ మాగ్నెటిక్ రెజొనెన్స్ (ఎన్ఎంఆర్) కేంద్రం... అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) తనిఖీలను విజయవంతంగా అధిగమించింది. ఈ మేరకు ఐఐసీటీ మంగళవారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేసింది. ఫార్మా మందులతోపాటు రసాయనాల నిర్మాణాన్ని పరిశీలించేందుకు ఈ న్యూక్లియర్ మాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కొపీని ఉపయోగిస్తారన్నది తెలిసిందే. యూఎస్ ఎఫ్‌డీఏ ఈ కేంద్రాన్ని ఆగస్టు 21, 22 తేదీల్లో తనిఖీ చేసిందని, అన్ని ప్రమాణాలను పాటిస్తున్నట్లు గుర్తించిందని ఆ ప్రకటనలో తెలిపారు. ఇందుకు అనుగుణంగా ఈ కేంద్రానికి నో యాక్షన్ ఇనిషియేటెడ్ (ఎన్ఏఐ) వర్గీకరణను కేటాయించింది. ‘‘దేశంలో ఎన్ఏబీఎల్ అక్రిడిటేషన్ ఉన్న అతిపెద్ద ఎన్ఎంఆర్ వ్యవస్థల్లో ఐఐసీటీ ఒకటి. ఇందులో అత్యాధునిక హైఫీల్డ్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోమీటర్లను ఏర్పాటు చేశాం. యూఎస్ఎఫ్డీఏ ఆమోదం లభించడంతో ఇక్కడ నాణ్యమైన క్వాలిటీ అనలిటికల్స్, ఏపీఐ సేవలు అందుబాటులోకి వస్తాయి’’ అని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ తెలిపారు. -
ఫార్మాపై యూఎస్ఎఫ్డీఏ ప్రభావం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఫార్మా కంపెనీల ప్లాంట్లలో యూఎస్ఎఫ్డీఏ తరచూ తనిఖీలు చేయడం, లోపాలను లేవనెత్తడంతో ఔషధ ఎగుమతుల వృద్ధి తగ్గుతోందని సీఐఐ ఫార్మాస్యూటికల్స్ నేషనల్ కమిటీ చైర్మన్, డాక్టర్ రెడ్డీస్ కో–చైర్మన్ జి.వి.ప్రసాద్ అన్నారు. సీఐఐ–ఐఎంటీహెచ్ సంయుక్తంగా సోమవారం నిర్వహించిన హెల్త్, ఫార్మా సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వార్నింగ్ లెటర్ల కారణంగా చాలా కంపెనీల అనుమతులు నిలిచిపోయాయి. దీంతో కొత్త ఉత్పత్తుల విడుదల ఆగిపోయింది. వీటి నుంచి బయటపడాలంటే యూఎస్ఎఫ్డీఏ ప్రమాణాలకు తగ్గట్టుగా ఇక్కడి కంపెనీలు నాణ్యత, వ్యవస్థ, క్రమశిక్షణ, సమాచార సమగ్రత పాటించాల్సిందే. ఇంకా పాత ప్లాంట్లను కొనసాగిస్తున్న కంపెనీలూ ఉన్నాయి. యాంత్రికీకరణ జరగాలి’ అని వివరించారు. కొత్త అవకాశాలు ఉన్నా.. యూఎస్–చైనా ట్రేడ్ వార్ నేపథ్యంలో భారత ఔషధ కంపెనీలకు పెద్ద ఎత్తున అవకాశాలను తెచ్చిపెడుతోందని ప్రసాద్ వ్యాఖ్యానించారు. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్, కెమికల్ ఇంటర్మీడియరీస్ సరఫరాలో అంతర్జాతీయంగా చైనా అగ్రస్థానంలో ఉందన్నారు. వీటిని భారత్‌తోపాటు ప్రపంచదేశాలు చైనా నుంచే కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. అతి తక్కువ ధరకు ముడి సరుకును చైనా సరఫరా చేస్తోందన్నారు. ట్రేడ్ వార్ నేపథ్యంలో పశి్చమ దేశాలు చైనాపై ఆధారపడటం తగ్గించాలని భావిస్తున్నాయని గుర్తుచేశారు. ‘ఇప్పుడు చైనా నూతన ఆవిష్కరణలవైపు దృష్టిసారిస్తోంది. చవక ముడిపదార్థాల సరఫరాదారు అన్న ముద్ర నుంచి బయటపడాలని చూస్తోంది. ఈ అంశమే భారత్‌కు నూతన వ్యాపార అవకాశాలను సృష్టిస్తోంది. చైనా ఒక్కటే భారత్‌కు అతి పెద్ద మార్కెట్. భారత కంపెనీలు ముడిపదార్థాల తయారీ పెంచాలి. ఇందుకు తగ్గట్టుగా పెట్టుబడి చేయాలి’ అని వెల్లడించారు. డిజిటల్ మార్కెటింగ్.. ఫార్మా కంపెనీలు డిజిటల్ మార్కెటింగ్ విషయంలో ఇంకా వెనుకంజలో ఉన్నాయని ప్రసాద్ తెలిపారు. పాత పద్ధతిలోనే మెడికల్ రిప్రజెంటేటివ్స్‌తో ఔషధాలను మార్కెట్ చేస్తున్నాయని అన్నారు. డిజిటల్ మార్కెటింగ్ పెరిగితే మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉద్యోగాలు తగ్గినా... కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయ న్నారు. కాగా, ఐఎంటీ రూపొందించిన హెల్త్, ఫార్మా రిపోర్ట్‌ను తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ విడుదల చేశారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ ఈవీ నర్సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డా.రెడ్డీస్‌కు యూఎస్ఎఫ్డీఏ షాక్
సాక్షి, ముంబై : దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్‌కు మరోసారి అమెరికా ప్రాతిపాధిక ఆహార నియంత్రణ సంస్థ(యూఎస్ఎఫ్డీఏ) షాక్ తగిలింది. ఇటీవల హైదరాబాద్ బాచుపల్లి యూనిట్-3లో తనిఖీలు నిర్వహించిన సంస్థ యూనిట్లో 11 ( అబ్జర్వేషన్లను) లోపాలను గుర్తించింది. ఈ మేరకు 483-ఫామ్‌ను జారీ చేసినట్లు డా. రెడ్డీస్ యాజమాన్యం శుక్రవారం స్టాక్ ఎక్చ్చేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. దీంతో సోమవారం ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీశారు. ఒక దశలో షేరు 8శాతానికిపైగా కుప్పకూలింది. అనంతరం కోలుకుని 3శాతం నష్టాలకు పరిమితమైనా...మిడ్ సెషనన్ తరువాత మళ్లీ 6శాతం పతనమైంది. కాగా.. నియమిత కాలంలోగా ఎఫ్‌డీఏ గుర్తించిన లోపాలను సవరించనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ఒక ప్రకటనలో తెలిపింది. -
డా.రెడ్డీస్‌కు మరో షాక్
సాక్షి, ముంబై: దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌కి మరోసారి షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్, విశాఖ దగ్గర్లోని దువ్వాడ ప్లాంటుకి సంబంధించి యూఎస్ఎఫ్డీఏ ఓఏఐతో కూడిన ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్(ఈఐఆర్)ను జారీ చేసింది. దీంతో బుధవారం నాటి ట్రేడింగ్‌లో డా.రెడ్డీస్ టాప్ లూజర్‌గా నిలిచింది. ట్రేడర్ల అమ్మకాలతో 4.5 శాతం పతనమైంది. ఫార్మా సెక్టార్లో ఓఏఐ అంటే నియంత్రణా సంబంధిత చర్యలకు ఉపక్రమించినట్టేనని ఎనలిస్టులు చెబుతున్నారు.. 2017 ఫిబ్రవరి-మార్చి తనిఖీలలో యూఎస్ఎఫ్డీఏ దువ్వాడ ప్లాంటుపై 13 అబ్జర్వేషన్స్‌ను నమోదు చేసింది. ఈ ప్లాంటు నుంచి రెడ్డీస్ ఇంజక్టబుల్స్‌ను రూపొందిస్తోంది. దాదాపు 2015 నుంచి వెలిబుచ్చుతున్న అభ్యంతరాల నివారణకు కంపెనీ తగిన చర్యలు చేపట్టలేదంటూ యూఎస్ఎఫ్డీఏ పేర్కొన్నట్లు సమాచారం. దీనిపై డా.రెడ్డీస్‌ను వివరణకోరామని మార్కెట్ రెగ్యులేటరీ తెలిపింది. తాజా రిపోర్ట్‌పై కంపెనీ ఇంకా స్పందించాల్సి ఉంది. అయితే నవంబర్ 21, 2017న విశాఖపట్నంలోని దువ్వాడలోని ఉత్పాదక కేంద్రానికి సంబంధించి యూఎస్ఎఫ్డీఏ నుంచి ఈఐఆర్ అందినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో రెడ్డీస్ తెలిపింది. కానీ సంస్థ తనిఖీ ప్రక్రియ ఇంకా లేదని చెప్పింది. కాగా అమెరికా డ్రగ్ రెగ్యులేటరీ కంపెనీకి మూడు హెచ్చరిక లేఖను జారీ చేసింది. దువ్వాడ ప్లాంట్ సహా దాని తనిఖీ బృందాలు ఆమోదయోగ్యమైన సమస్యలను ఉన్నట్టు గుర్తించిన సంగతి తెలిసిందే. మరోవైపు జనవరి 25న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం నిర్వహిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. గత నెలగా రెడ్డీస్ కౌంటర్ 8శాతానికిపైగా లాభపడింది. -
లుపిన్కు మరోసారి యూఎస్ఎఫ్డీఏ షాక్
సాక్షి, ముంబై: దేశీయ ఫార్మ దిగ్గజం లుపిన్ లిమిటెడ్‌కు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) జారీ చేసిన హెచ్చరికలో మంగళవారం నాటి మార్కెట్లో భారీ నష్టాలను నమోదు చేసింది. లుపిన్ 17 శాతం పైగా క్షీణించి 52 వారాల కనిష్టాన్ని తాకింది. గోవా, పితంపూర్‌లలో గల రెండు ప్లాంట్లకూ సంబంధించి యూఎస్ఎఫ్డీఏ ఈ హెచ్చరికలు జారీ చేయడంతో హెల్త్‌కేర్ దిగ్గజం లుపిన్కు బారీ షాక్ గిలింది. ఇక్కడి ఉత్పాదక సదుపాయాలకు సంబంధించి ప్లాంట్లలో తయారీ లోపాలపై యూఎస్ఎఫ్డీఏ ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో మూడు ఫామ్ 483లను జారీ చేసింది. అయితే తాజాగా దిగుమతుల హెచ్చరికలను సైతం జారీ చేసింది. దీంతో అమ్మకాలు క్షీణించే అవకాశముందన్న అంచనాలతో భారీగా అమ్మకాలకు తెర లేచింది. అయితే ఉత్పత్తి, సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని లుపిన్ ప్రకటించింది. ఉత్పాదక నాణ్యతా ప్రమాణాలకు తాము కట్టుబడి ఉన్నామని,యూఎస్ఎఫ్డీఏ ఆందోళనలను పరిష్కరించడానికి చర్చలు జరుపుతామని హామీఇచ్చింది. -
దివీస్ షేర్‌కు మరోసారి నష్టాలు
సాక్షి, ముంబై: దేశీయ ఫార్మ దిగ్గజం దివీస్ లాబ్స్‌కు మరోసారి చిక్కులు తప్పలేదు. యూఎస్ఎఫ్డీఏ తాజా అబ్జరేషన్స్ నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో దివీస్ లేబ్స్ కౌంటర్లో అమ్మకాలకు తెరలేచింది. ఈ నెలలో తనిఖీలు నిర్వహించిన తనిఖీల్లో ఆరు లోపాలను(అబ్జర్వేషన్స్) నమోదు చేసినట్లు వెల్లడికావడంతో దివీస్ షేర్ 9 శాతానికిపైగా నష్టపోయింది. మార్చి 21 తరువాత ఇదే అతిపెద్ద ఇంట్రా డే పతనాన్నినమోదు చేసింది. మంగళవారం నాటి ముగింపుతో గత 12నెలల్లో 28 శాతం పడిపోయింది. వైజాగ్‌లోని యూనిట్-2లో యూఎస్ఎఫ్డీఏ నిర్వహించిన తుది ఏపీఐల ఇండివిడ్యుయల్ పరీక్షలలో దివీస్ విఫలమైనట్లు తెలుస్తోంది. తయారీ, పరికరాల పరిశుభ్రత వంటి అంశాలలోనూ లోపాలు గుర్తించినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే తాజా నివేదికలపై దివీస్ ఇంకా స్పందించలేదు. కాగా అమెరికా రెగ్యులేటరీ నుంచి ఆరు అబ్జర్వేషన్స్ తమకు అందాయని దివీస్ గతవారం తెలిపింది. ఇది సాధారణమేనని పేర్కొంది. -
అరబిందోకు యుఎస్ఎఫ్డీఏ బూస్ట్
న్యూఢిల్లీ: అమెరికాకు ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) అందించిన కిక్‌తో పార్మా కంపెనీ అరబిందో ఫార్మాకు స్టాక్మార్కెట్లో మంచి బూస్ట్ లభించింది. అమెరికా మార్కెట్లలో సవెల్మర్ కార్బొనేట్ మాత్రలను విడుదల చేసేందుకు తుది ఆమోదం లభించింది. కీలకమైన జనరిక్ డ్రగ్‌కు అనుమతి లభించడంతో బుధివారంనాటి మార్కెట్లో 8 శాతం ఎగిసి భారీ లాభాలను సాధించింది. మార్కెట్ ఆరంభంలోనే అరబిందో ఫార్మా కంపెనీ షేర్లు 8 శాతం పెరిగాయి. ఈ జంప్‌తో షేరు ఎనిమిది నెలల గరిష్టాన్ని తాకింది. ఎన్ఎస్ఇలో కంపెనీ షేర్లు 8.22 శాతం పెరిగి 794.70 కి చేరుకున్నాయి. వాల్యూమ్ విషయంలో, కంపెనీలో 4.63 లక్షల షేర్లను బిఎస్ఇలో వర్తకం చేశాయి, ఉదయం ట్రేడింగ్ సెషన్లో ఎన్ఎస్ఈ వద్ద 81 లక్షల షేర్లు చేతులుమారాయి. కిడ్నీల పనితీరును దెబ్బతీసే తీవ్ర వ్యాధుల చికిత్సకు సెవిలామిర్ ట్యాబ్లెట్ల విక్రయానికి తుది ఆమోదం లభించిందని కంపెనీ తెలిపింది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యుఎస్ఎఫ్డిఎ) నుంచి సవెల్మర్ కార్బొనేట్ టాబ్లెట్లను 800 మి.గ్రా. తయారీకి తుది ఆమోదం లభించిందని బీఎస్ఈ ఫైలింగ్‌లో అరబిందో ఫార్మా పేర్కొంది. డయాలిసిస్‌పై దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి రోగులలో సీరం ఫాస్ఫరస్ నియంత్రణ కోసం ఈ మాత్రలు ఉపయోపడనున్నాయి. కాగా ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో హైదరాబాద్ ఫార్మా సంస్థ అరబిందో కౌంటర్ జోరందుకోవడంతో పాటు ఇతర లుపిన్, క్యాడిల్లా హెల్త్‌కేర్, దివీస్‌లాంటి ఫార్మా షేర్లు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. -
ఇప్కా లాబ్స్‌కు యూఎస్ఎఫ్డీఏ షాక్
ముంబై: దేశీయ ఫార్మా సంస్థ ఇప్కా లేబ్స్ తయరు చేసిన మందును అమెరికా డ్రగ్ రెగ్యులేటరీ షాక్ తగిలింది. రత్లాం, సిల్వస్సా, పీతంబూర్ మూడు యూనిట్లలో తయారయ్యే అన్ని రకాల ఔషధాల దిగుమతులపై యూఎస్ఎఫ్డీఏ బ్యాన్ విధించడంతో ఇప్కా లేబ్స్ షేర్ భారీ పతనాన్ని నమోదు చేసింది. బీఎస్ఈలో ఈ షేరు 15 శాతం కుప్పకూలింది. మధ్యప్రదేశ్‌లోని పీతంపూర్, రత్లాం, సిల్వస్సా (దాద్రా నగర్ హవేలి) లో తయరుచేసిన అన్ని ఔషధాలపై నిషేధం కొనసాగుతుందని ఇప్కా లాబొరేటరీస్ ఒక ప్రకటనలో తెలిపింది . ఈ తయారీ కేంద్రాల నుండి తయారైన ఔషధ ఉత్పత్తులు , అమెరికా మార్కెట్ కోసం ఉద్దేశించిన మందులు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని ప్రకటించేదాకా బ్యాన్ కొనసాగుతుందని పేర్కొంది. కాగా రత్లాం యూనిట్లో క్లోరోక్విన్ ఏపీఐ తయారీకి మాత్రం యూఎస్ఎఫ్డీఏ వెసులుబాటు కల్పించినట్లు కంపెనీ పేర్కొంది. అమెరికా మార్కెట్లో ఈ ఏపీఐకు కరవు ఏర్పడినా లేదా అవసరం ఏర్పడినా వీటి విక్రయాలను అనుమతించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దేశీయ మార్కెట్లో పార్మా బలహీనత కొనసాగుతోంది. దీంతో ఫార్మాసెక్టార్కు దూరంగా ఉండాలని కూడా ఎనలిస్టులు సూచిస్తున్నారు. -
దివిస్ ల్యాబ్స్‌కు అమెరికా వార్నింగ్
► లోపాలను సవరించకుంటే తీవ్ర పరిణామాలు: యూఎస్ఎఫ్డీఏ ► కొత్త ఉత్పత్తుల నమోదు నిలిపివేస్తాం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ కంపెనీ దివీస్ ల్యాబొరేటరీస్‌ను యూఎస్ఎఫ్డీఏ హెచ్చరించింది. విశాఖపట్నం యూనిట్–2 ల్యాబ్‌లో ఎలక్ట్రానిక్ రూపంలో నిక్షిప్తమై ఉన్న సమాచారం మార్పు, తొలగింపును అడ్డుకునే కనీస నియంత్రణలు లేవన్న విషయం తమ తనిఖీల్లో తేలినట్లు కంపెనీకి పంపిన వార్నింగ్ లెటర్లో ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది. భద్రమైన, ప్రభావవంతమైన, నాణ్యతకు మద్ధతు తెలిపే ఖచ్చితమైన, సమగ్రమైన సమాచార వ్యవస్థ కంపెనీ వద్ద లేదని వెల్లడించింది. కంపెనీ అనుసరించిన తీరు అత్యుత్తమ తయారీ విధానానికి అనుగుణంగా లేదని, ప్లాంటులో యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్లలో కల్తీకి ఆస్కారం ఉందని ఆక్షేపించింది. పరీక్షా విధానం నిర్దేశిత నాణ్యత ప్రమాణాలకు తగ్గట్టుగా సాంకేతికంగా పటిష్టంగా ఉందనడానికి ఆస్కారం లేదని తెలిపింది. తనిఖీల సమయంలో ఎఫ్‌డీఏ అధికారులకు కంపెనీ పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదని, ఇది నిబంధనలను అతిక్రమించడమేనని తన లేఖలో వివరించింది. అడ్డుకట్ట వేస్తాం... సమగ్ర నివేదిక ఇవ్వాలని ఈ మేరకు కంపెనీని యూఎస్ఎఫ్డీఏ ఆదేశించింది. ఔషధాల నాణ్యతపై లోపాల ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలపాలని సూచించింది. సమాచార సమగ్రత లోపించిన ఔషధాలతో రోగులపై ఎటువంటి ముప్పు ఉంటుందో కూడా తెలపాలని ఆదేశించింది. లోపాల సవరణకు కంపెనీ యాజమాన్యం చేపట్టబోయే వ్యూహం ఏమిటో వెల్లడించాలని తెలిపింది. లోపాల సవరణ పూర్తి అయి, నాణ్యత ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయని నిర్ధారించేంత వరకు కొత్త దరఖాస్తులు, సప్లిమెంట్ నమోదును ఎఫ్‌డీఏ నిలిపివేస్తుందని స్పష్టం చేసింది. లోపాలను సవరించుకోనట్టయితే యూనిట్–2లో తయారైన ఉత్పత్తుల నమోదును అడ్డుకుంటామని హెచ్చరించింది. యూనిట్–2లో 2016 నవంబరు 29–డిసెంబరు 6 మధ్య యూఎస్ఎఫ్డీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. -
దివీస్‌కు మరోసారి అమెరికా షాక్
⇒ వైజాగ్ యూనిట్‌పై యూఎస్ఎఫ్డీఏ ఇంపోర్ట్ అలర్ట్ ⇒ ఒకేరోజు 20 శాతం పడిన షేరు ధర హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ కంపెనీ దివీస్ ల్యాబొరేటరీస్‌కు యునైటెడ్ స్టేట్స్ ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) షాకిచ్చింది. విశాఖపట్నంలోని తయారీ యూనిట్‌పై ఇంపోర్ట్ అలర్ట్ విధించింది. దీని ప్రకారం ఈ ప్లాంటులో తయారైన ఉత్పత్తులను యూఎస్ విపణికి ఎగుమతి చేయడానికి వీల్లేదు. కొన్ని ఔషధాలకు యూఎస్ఎఫ్డీఏ మినహాయింపు ఇచ్చినట్టు కంపెనీ బీఎస్ఈకి వెల్లడించింది. వీటిలో లెవెటిరాసెటమ్, గాబాపెంటిన్, లామోట్రిజిన్, కాపెసిటబిన్, నాప్రోక్సెన్, రాల్టెగ్రావిర్, అటోవాక్వోన్ తదితర 10 రకాల యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. నిషేధం ఉన్న ఉత్పత్తులకు అమెరికా మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని ఫార్మా రంగ నిపుణుడొకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. యూనిట్‌పైనే ఇంపోర్ట్ అలర్ట్ విధించడం కంపెనీకి ఊహించని పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. వైజాగ్ యూనిట్ కీలకం.. కంపెనీకి హైదరాబాద్‌తోపాటు విశాఖపట్నంలో యూనిట్ ఉంది. దివీస్ విక్రయాల్లో ఈ యూనిట్ 60–65 శాతం సమకూరుస్తోందని తెలుస్తోంది. అలాగే యూఎస్ అమ్మకాల్లో 20 శాతం అందిస్తోంది. 2016 నవంబర్ 29–డిసెంబర్ 6 మధ్య వైజాగ్ యూనిట్లో యూఎస్ఎఫ్డీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా ఎఫ్‌డీఏ పలు లోపాలను ఎత్తిచూపింది. ఎఫ్‌డీఏ లేవనెత్తిన లోపాలను సరిదిద్దేందుకు స్వతంత్ర నిపుణులతో కలసి పనిచేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. కాగా, ఇంపోర్ట్ అలర్ట్ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో దివీస్ షేరు ధర మంగళవారం 20 శాతం పడింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఒక్కో షేరు రూ.156 నష్టపోయి రూ.634.35 వద్ద ముగిసింది. -
డా.రెడ్డీస్‌కు యూఎస్ఎఫ్డీఏ షాక్
హైదరాబాద్: దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ రెగ్యులేటరీ భారీ షాకిచ్చింది. దీంతో గురువారం నాటి మార్కెట్లో ఈ షేరు భారీగా నష్టపోతోంది. సంస్థకు చెందిన విశాఖపట్టణం స్పెషల్ ఎకనామిక్ జోన్ లోని దువ్వాడ అంకాలజీ ప్లాంటులో యూఎస్ఎఫ్డీఏ 13 లోపాలను(అబ్జర్వేషన్స్) గుర్తించారన్న వార్తలతో మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో ఈ కౌంటర్లో్ అమ్మకాలకు తెరలేచింది. దాదాపు 4.2 శాతానికిపై నష్టపోయి 52 వారాల కనిష్టాన్ని నమోదు చేసింది. వైజాగ్‌కు సమీపంలోని దువ్వాడ ఫార్ములేషన్ల తయారీ ప్లాంటులో తనిఖీలు నిర్వహించిన అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ 13 అబ్జర్వేషన్స్‌తో కూడిన ఫామ్ 483ని జారీ చేసింది. ఈ సమాచారాన్ని డాక్టర్ రెడ్డీస్ బీఎస్ఈ ఫైలింగ్‌లో తెలిపింది. అలాగే వీటిని సరిదిద్దే చర్యలు చేపట్టినట్లు తెలియజేసింది. దిద్దుబాటు చర్య ప్రణాళిక తో వ్రాతపూర్వకంగా స్పందించనున్నామని, త్వరలోనే దీన్ని అమలు చేయనున్నామని చెప్పింది. మరోవైపు రాష్ట్రంలోని మరో ముఖ్యమైన శ్రీకాకుళంప్లాంట్‌లో ఏప్రిల్ రెండవ వారంలో యూఎస్ఎఫ్డీఏ తనిఖీలు చేపట్టనుంది. కాగా ఈ స్టాక్ గత నెలలో 8 శాతం పైగా క్షీణించింది. -
లుపిన్కు యూఎస్ఎఫ్డీఏ క్లియరెన్స్
ముంబై: దేశీయ ఫార్మా దిగ్గంజ లుపిన్ లిమిటెడ్ సోమవారం నాటి మార్కెట్లో భారీగా లాభపడుతోంది. గోవా ప్లాంటు తనిఖీల్లో సంస్థకు అమెరికా యూఎస్ఎఫ్డీఏ నుంచి క్లీన్ చిట్ లభించడంతో మదుపర్లు ఈ కౌంటర్లో కొనుగోళ్లకు దిగారు. దీంతో ఈ షేరు ఇంట్రాడేలో రికార్డ్ స్థాయిని నమోదు చేసింది. గతజులై 7 తరువాత భారీగా లాభపడి గరిష్టాన్ని తాకింది. ఈ ఏడాది ఫార్మా కౌంటర్ 6 శాతం బలహీనపడగా లుపిన్ మాత్రం 23 శాతం ఎగిసింది. మరోవైపు ఈఐఆర్ నుంచి తమకు ఆమోదం లభించిందన్న సంస్థ ప్రకనటతో గత శుక్రవారం11 శాతం క్షీణించిన లుపిన్ కు నేడు సెంటిమెంట్ బలంగా ఉంది. ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన తనిఖీల్లో గోవా యూనిట్ కు (ఈఐఆర్) యూఎస్ఎఫ్డీఏ క్లియరెన్స్ ల భించడంతో కౌంటర్‌కు భారీ డిమాండ్ పుట్టింది. ప్రస్తుతం 8 శాతానికిపైగా లాభాలతో మార్కెట్లో టాప్ విన్నర్ గా ట్రేడవుతోంది. కాగా లుపిన్.. గుండెజబ్బులు, డయాబెటిస్, ఆస్త్మా వంటి పలువ్యాధుల చికిత్సలో జనరిక్ ఫార్ములేషన్లు, బయోటెక్నాలజీ ఔషధాలను తయారీలో పేరుగడించిన సంగతి తెలిసిందే. -
సన్ ఫార్మా మందుల భారీ రీకాల్
ఫార్మా దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కి అమెరికాలో ఎదురు దెబ్బ తగిలింది. డిప్రెసివ్ డిజార్డర్ చికిత్స లో వాడే బుప్రోపియాన్ హైడ్రోక్లోరైడ్ మాత్రలను భారీ ఎత్తునరీ కాల్ చేస్తోంది. బుప్రోపియాన్ హైడ్రోక్లోరైడ్ ఎక్స్టెండెడ్ 50 మి.గ్రా మాత్రలున్న 31, 762 సీసాలను ఉపసంహరించుకోనుంది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తన తాజా ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో ఈ విషయాన్ని తెలిపింది. డిజల్యూషన్ స్పెసికేషన్స్ సమర్పించడంలో పెయిలైన కారణంగా అమెరికా దేశవ్యాప్తంగా ఈ రీకాల్ చేస్తున్నట్టు తెలిపింది. ఇది క్లాస్ 3రీకాల్ అని నివేదించింది. వీటిని సన్ ఫార్మా కు చెందిన హలోల్ కర్మాగారంలో ఉత్పత్తి చేసినట్టు మాచారం. -
సిప్లాకు యూఎస్ఎఫ్డీఏ షాక్.. షేర్ ఢమాల్
హైదరాబాద్: దేశీయ డ్రగ్ మేకర్ సిప్లా లిమిటెడ్ గోవాలోని ప్లాంట్లలో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ భారీ ఎత్తున లోపాలను గుర్తించినట్టు వచ్చిన వార్తలతో స్టాక్ మార్కెల్లో సిప్లా షేర్లు పతనమయ్యాయి. ఐదు ప్లాంట్లలో అబ్జర్వేషన్స్(483) నమోదు చేసినట్లు వార్తలు మదుపర్లు ఆందోళన లోకి నెట్టాయి దీంతో సిప్లా కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దాదాపు 7 శాతానికి పైగా పతనమైంది. అయితే గోవాలో ఉన్న మూడు తయారీ ప్లాంట్లలో యూఎస్ఎఫ్డీఏ నిర్వహించిన ఆడిట్ ముగిసిందనీ సిప్లా స్టాక్ ఎక్సేంజ్ వివరణలో తెలిపింది. ఈ తనిఖీల్లో భాగంగా నాలుగు లోపాలను గుర్తించినట్లు(అబ్జర్వేషన్స్) సిప్లా తెలియజేసింది. ఈ పరిశీలనలు స్వభావాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. కానీ ఇది సాధారణ విధానపరమైన పరిశీలన మాత్రమేనని వివరణ ఇచ్చింది. దీనిపై తమ స్పందనను తెలియ చేసినట్టు పేర్కొంది. ప్రమాణాలను పాటించడంలో విఫలమైన పక్షంలో వార్నింగ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించిందని సిప్లా వివరించింది. కేవలం మూడు ప్లాంట్లలో 483లు మాత్రమే జారీ అయినట్లు వివరణ ఇవ్వడంతో సిప్లా షేర్ నష్టాల నుంచి కొద్దిగా తెప్పరిల్లింది. -
అరబిందో ఇంజెక్షన్‌కి అనుమతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శస్త్రచికిత్స సమయంలో ఇచ్చే ఎనస్థీషియాగా ఉపయోగించే బుపివాక్సేన్ హైడ్రోక్లోరైడ్ ఇంజెక్షన్ తయారు చేసి విక్రయించడానికి యూఎస్ఎఫ్డీఏ నుంచి తుది అనుమతులు వచ్చినట్లు అరబిందో ఫార్మా ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఈ ఉత్పత్తిని మార్కెట్లోకి విడుదల చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. -
అరబిందో ‘బీపీ’ ఔషధానికి ఎఫ్‌డీఏ అనుమతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమ్లోడిపైన్, వల్సార్టన్ ఔషధ జనరిక్ వెర్షన్ల తయారీ, విక్రయాలకు అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ నుంచి అనుమతులు లభించినట్లు అరబిందో ఫార్మా తెలిపింది. రక్తపోటు చికిత్సలో దీన్ని ఉపయోగిస్తారు. నొవార్టిస్ ఫార్మాకు చెందిన ఎక్స్ఫోర్జ్ ఔషధానికి ఇది జనరిక్ వెర్షన్. 2016-17 తొలి త్రైమాసికంలోనే ఈ ఔషధాన్ని ప్రవేశపెట్టనున్నట్లు అరబిందో ఫార్మా వివరించింది. ఈ ఏడాది ఫిబ్రవరి ఆఖరు దాకా 12 నెలల కాలం లో దీని మార్కెట్ పరిమాణం 123 మిలియన్ డాలర్లుగా ఉంటుందని పేర్కొంది. -
ఎఫ్‌డీఏ చర్యలతో ఎగుమతులకు దెబ్బ
డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ చైర్మన్ న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ ఫార్మా కంపెనీలపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) నియంత్రణ చర్యల కారణంగా దేశీ ఎగుమతులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ చైర్మన్ సతీశ్ రెడ్డి తెలిపారు. ఈ అంశమై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఆయన ఇక్కడ జరిగిన బోర్డు ఆఫ్ ట్రేడ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఫార్మా ఎగుమతులు 9.7 శాతం మేర పెరిగినా కూడా గతంతో పోలిస్తే తక్కువ వృద్ధినే న మోదు చేశాయని తెలిపారు. తమ వృద్ధి సామర్థ్యానికి తగిన విధంగా లేదని చెప్పారు. అమెరికాకు జరిగే ఫార్మా ఎగుమతులను పలు అంశాలు ప్రభావితం చేస్తున్నాయని, వాటిల్లో ఎఫ్‌డీఏ చర్యలు ప్రధానంగా ఉన్నాయని తెలిపారు. వెనిజులాలో 350 మిలియన్ డాలర్ల వ్యాపార అవకాశాలు ఉన్నాయని, కానీ అక్కడ మన ఫార్మా ఎగుమతులపై నిషేధం ఉండటంతో ఆశలు వదులుకున్నామని చెప్పారు. ఇటీవల సన్ ఫార్మా, లుపిన్, వోకార్డ్ వంటి దిగ్గజ ఫార్మా కంపెనీలన్నీ తయారీ నిబంధనలు సరిగా లేకపోవడం వల్ల ఎఫ్‌డీఏ తనిఖీలను ఎదుర్కోవలసి వచ్చింది. ఇది గతేడాది నవంబర్‌లో ఏపీ, తెలంగాణాలోని ప్లాంట్లకు సంబంధించి డాక్టర్ రెడ్డీస్‌కి కూడా హెచ్చరికలు జారీ చేసింది. -
అరబిందో ట్రమడాల్కు యూఎస్ఎఫ్డీఏ ఓకే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అరబిందో ఫార్మాకు చెందిన ట్రమడాల్ టాబ్లెట్స్‌ను అమెరికాలో విక్రయించడానికి యూఎస్ఎఫ్డీఏ అనుమతి లభించింది. 2015-16 ఆర్థిక ఏడాది నాల్గవ త్రైమాసికంలో ఈ ట్యాబ్లెట్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. నొప్పి నివారణకు వినియోగించే ట్రమడాల్ను 100, 200, 300 ఎంజీలలో విక్రయించనుంది. హైదరాబాద్ యూనిట్ నుంచి యూఎస్ఎఫ్డీఏ అనుమతి పొందిన 50వ ఔషధంగా ట్రమడాల్ రికార్డులకు ఎక్కింది. అమెరికాలో ఈ ఔషధం మార్కెట్ పరిమాణం ఏడాదికి రూ. 360 కోట్లుగా ఉంది.