సాక్షి, ముంబై: దేశీయ ఫార్మా దిగ్గజం బయోకాన్ షేరు లాభాలతో కొనసాగుతోంది. మలేషియా ప్లాంట్‌కు సంబంధించి అమెరికా హెల్త్ రెగ్యులేటర్ యుఎస్‌ఎఫ్‌డిఎ నుంచి కీలక క్లియరెన్స్ రావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో 1300 పాయింట్లకుపైగా కుదేలైన దలాల్ స్ట్రీట్ లో బయోకాన్ 5 శాతానికి పైగా ఎగిసింది. మలేషియా ప్లాంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఇన్‌స్పెక్షన్ రిపోర్ట్ (ఈఐఆర్) అందుకున్నట్టు బయోకాన్ బుధవారం వెల్లడించింది. ఇన్సులిన్ గ్లార్జిన్ (సెమిగ్లీ) తయారీకి మలేషియాలోని కంపెనీ అనుబంధ సంస్థ బయోకాన్ ఎస్డీఎన్ బీహెచ్ డీ ఈఐఆర్ లభించిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 10-21 మధ్య మలేషియా ప్లాంట్‌లో యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీలు నిర్వహించినట్టు ప్రకటించింది. ఇన్సులిన్ గ్లార్జైన్ తయారీలో తమకు ఒదొకముఖ్యమైన మైలురాయి అని కంపెనీ పేర్కొంది. నాణ్యత, సేవల్లో ప్రపంచ ప్రమాణాలకు సంబంధించి బయోకాన్ నిబద్ధతకు ఇది నిదర్శమని వ్యాఖ్యానించింది. తాజా లాభాలతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.33,462 కోట్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment