malesia
-
మా కోసం మలేసియాలో ఉత్సవం
‘‘ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో స్వర్ణయుగం నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవిగారికి పద్మవిభూషణ్ రావడం గొప్ప విషయం. దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడు ప్రభాస్.. నా బ్రదర్ అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వచ్చింది. కీరవాణిగారికి ఆస్కార్ అవార్డు వచ్చింది. దేశంలోనే అత్యధిక బడ్జెట్‌తో మహేశ్‌బాబు–రాజమౌళి సినిమా రాబోతోంది. ఇలా ఎన్నో సాధిస్తున్నాం. తెలుగు సినిమా 90 సంవత్స రాలు పూర్తి చేసుకుంటోంది. ఇలాంటి తరుణంలో ‘మా’ నిధుల సేకరణ కోసం మలే సియాలో ‘నవతిహి ఉత్సవం’కు ఏర్పాట్లు జరుగుతుండటం సంతోషంగా ఉంది’’ అని ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు అన్నారు. తెలుగు సినిమా 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తెలుగు సినిమా చరిత్రను తెలియజేసేలా మలేసియాలో ‘నవతహి ఉత్సవం’ పేరిట ఓ ఫండ్ రైజింగ్ ఈవెంట్‌ను జూలైలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో విష్ణు మంచు మాట్లాడారు. -
300 కార్లు, ప్రైవేట్ ఆర్మీ, సొంత జెట్స్ ఇంకా...కళ్లు చెదిరే మలేషియా కింగ్ సంపద
మలేషియా కొత్త రాజుగా బిలియనీర్ సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ (65) సింహాసనాన్ని అధిష్టించారు. దక్షిణ జోహోర్ రాష్ట్రానికి చెందిన సుల్తాన్ మలేసిమా 17వ రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ సందర్బంగా ఆయనకు సంబంధించిన ఆస్తులు, ఇతర సంపదపై ఆసక్తి నెలకొంది. మలేషియాలో ఇప్పటికీ ప్రత్యేకమైన రాచరిక వ్యవస్థ అమల్లో ఉంది. తొమ్మిది రాజకుటుంబాల అధిపతులు ప్రతీ ఐదు సంవత్సరాలకు ఒక సారి రాజుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వీరిని ‘‘యాంగ్ డి-పెర్టువాన్ అగోంగ్’’ అని పిలుస్తారు. దేశ రాజధాని కౌలాలంపూర్ లోని నేషనల్ ప్యాలెస్‌లో సుల్తాన్ ఇబ్రహీం.. ఇతర రాజకుటుంబాలు, ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం , క్యాబినెట్ సభ్యుల సాక్షిగా జరిగిన వేడుకలో పదవీ బాధ్యతలు చేపట్టారు. దేశంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన సుల్తాన్ ఇబ్రహీం రియల్ ఎస్టేట్ నుండి టెలికాం , పవర్ ప్లాంట్ల దాకా విస్తృతమైన వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి 5.7 బిలియన్ల డాలర్ల సంపద అతని సొంతం. బ్లూమ్‌బెర్గ్ అంచనా వేసిన కుటుంబ సంపద 5.7 బిలియన్లు డాలర్లుగా అంచనా వేసినప్పటికీ, సుల్తాన్ నిజమైన సంపద అంతకు మించి ఉంటుందని భావిస్తారు. రియల్ ఎస్టేట్ , మైనింగ్ నుండి టెలికమ్యూనికేషన్స్ , పామాయిల్ వరకు అనేక వ్యాపారాల ద్వారా అపార సంపద అతని సొంతం. ముఖ్యంగా మలేషియా ప్రధాన సెల్ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన ‘యూ’ మొబైల్లో 24శాతం వాటాతో పాటు, ఇతర అదనపు పెట్టుబడులూ ఉన్నాయి. అతని అధికారిక నివాసం ఇస్తానా బుకిట్ సెరీన్, సుల్తాన్ న కుటుంబ సంపదకు నిదర్శనం. అడాల్ఫ్ హిట్లర్ బహుమతిగా అందించినదానితో సహా ఇతనికి 300కు పైగా లగ్జరీ కార్లున్నాయి. గోల్డెన్, బ్లూ కలర్బోయింగ్ 737తో సహా, ఇతర ప్రైవేట్ జెట్లున్నాయి. వీటిన్నిటితోపాటు అతని ప్రైవేట్ సైన్యం కూడా విశేషంగా నిలుస్తోంది. సింగపూర్‌లో 4 బిలియన్ల డాలర్ల విలువైన భూమి ఉంది. ఇంకా షేర్లు, రియల్ ఎస్టేట్ లావాదేవీలు కూడా పెద్ద ఎత్తునే ఉన్నాయి. సుల్తాన్ పెట్టుబడి పోర్ట్‌ఫోలియో మొత్తం 1.1 బిలియన్ డాలర్లు ఉంటుందట. సుల్తాన్ సింహాసనాన్ని అధిష్టించిన క్రమంలో దేశాభివృద్ధి, ఇతర దేశాలతో సంబంధాలు ఎలా ఉంటాయనేది పుడు ప్రాముఖ్యతను సంతరించుకుంది. ముఖ్యంగా మలయ్ కమ్యూనిటీకి గేట్ కీపర్, అతను చైనీస్ వ్యాపారవేత్తలతో జాయింట్ వెంచర్ల ద్వారా ప్రధాన ప్రాజెక్టులలో కీలక పాత్ర పోషించిన సుల్తాన్ రియల్ ఎస్టేట్ రంగాన్ని పరుగులు పెట్టించాడనీ, తన పూర్వీకుల మాదిరిగా కాకుండా, సుల్తాన్ ఇబ్రహీం విభిన్నంగా ఉంటాడని అంచనా. సింగపూర్ బిజినెస్ టూకూన్స్తో సన్నిహిత సంబంధాలు, ప్రముఖ చైనీస్ డెవలపర్లతో వ్యాపార అనుబంధం లాంటివి దేశీయ, విదేశాంగ విధానంతోపాటు, దేశ ఆర్థికరంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయంటున్నారు విశ్లేషకులు. -
మలేసియాలో ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి గ్రామానికి: రారాజులా లాభాల పంట
విదేశంలో ఉద్యోగం.. ఐదెంకల ఐటీ ఉద్యోగం. అయినా ఇవేవీ సంతోషాన్ని ఇవ్వలేదు. అందుకే లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి తనకెంతో ఇష్టమైన రైతుగా మారి పోయాడు. మలేషియాలో ఉద్యోగానికి బైబై చెప్పేసి ఆర్గానిక్ ఫామింగ్ (సేంద్రీయ వ్యవసాయం) ద్వారా లక్షలు సంపాదిస్తున్నాడు. ఒడిశాలోని రాయగడ జిల్లాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సత్య ప్రబిన్ వినూత్న వ్యవసాయ పద్ధతులతో విజయం సాధించి సమాజానికి ప్రేరణగా నిలుస్తున్నాడు. బీటెక్ పూర్తి చేసిన సత్య, మలేషియా ఐటీ కంపెనీలో టెకీగా 11 ఏళ్లు పని చేశాడు. నెలకు రూ.2 లక్షల వేతనం సౌకర్య వంతమైన జీవితం. అయినా అతనికి వ్యవసాయం మీద ఉన్న మక్కువ పోలేదు. ముఖ్యంగా తన చిన్నతనంలో తండ్రి జీవనోపాధి కోసం కూరగాయలు పండించేవారు. అది అతని మనసులో ఎపుడూ మెదులుతూ ఉండేది. వన్ ఫైన్ మార్నింగ్ ఇక ఉద్యోగాన్ని వదిలేసి గ్రామానికి వెళ్లి వ్యవసాయాన్ని మొదలు పెట్టాలనుకున్నాడు. క్షణం ఆలస్యం చేయ కుండా చకచకా పనులన్నీ చక్క బెట్టుకుని తనకున్న అభిరుచుని నెరవేర్చుకునేందుకు రంగంలోకి దిగిపోయాడు. 2020లో సొంత గ్రామానికి వచ్చేసి 34 ఎకరాల భూమిలో డ్రిప్ సిస్టమ్, సేంద్రీయ ఎరువులు వంటి ఆధునిక పద్ధతులను ఉపయోగించి వ్యవసాయం ప్రారంభించాడు. అంతే నమ్ముకున్న భూమి అతనికి గొప్ప విజయాన్ని అందించింది. సేంద్రీయ పద్ధతుల్లో భూమి సారాన్ని కాపాడుకుంటూ, వ్యవసాయంలో చక్కటి ఫలాలను అందుకుంటూ మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలిచాడు. సంకల్పం, పట్టుదల, వ్యవసాయంపై మక్కువతో కష్టపడి పనిచేస్తే విజయం తప్పక వరిస్తుందని ఆయన చేసి చూపించాడు. రైతుగా సత్య సాధించిన విజయాలు సమాజంలోని ఇతరులకు ఆదర్శంగా నిలవడమే కాదు ఆయన వ్యవసాయ విధానం అద్వితీయంగా, వినూత్నంగా ఉండడంతో స్థానికుల అభిమానాన్ని, అధికారుల దృష్టిని ఆకర్షించాడు. అంతేకాదు తన గ్రామం, చుట్టుపక్కల గ్రామాల్లో సుమారు 60 మందిని ఎంచుకుని వ్యవసాయాన్ని ముందుకు నడిపించాడు. తద్వారా అనేక కుటుంబాలకు అండగా నిలబడటమే కాదు, స్థానిక ఆర్థికవ్యవస్థకుగణనీయమైన ఎనలేని సహకారాన్ని అందించాడు. కలెక్టర్లు, ఇతర స్థానిక ఉ ఉన్నతాధికారులు పలువురి ప్రశంసలందుకున్నాడు. చుట్టుపక్కల సన్నకారు రైతులంతా సత్యను ఆదర్శంగా తీసుకుని సేంద్రియ ఎరువులతో తమ భూమిలో కూరగాయలు పండించి స్వయం సమృద్ధి సాధించి ఆర్థికస్థితిని మెరుగు పరుచుకోవాలని పిలుపునిచ్చారు. సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలతో అందరి ఆరోగ్యానికి తోడ్పటమే కాదు, స్థానికి ఆర్థిక పరిపుష్టికి తన వంతు సాయం అందించడం విశేషంగా నిలిచింది. వ్యవసాయంలో రారాజుగా నిలవాలన్న ఆత్మవిశ్వాసమే ఆయనను ఈరోజు విజయ వంతమైన రైతుగా నిలబెట్టి, ఎందరికో స్ఫూర్తి దాయకంగా నిలిచింది. -
మలేషియాలో బతుకమ్మ సంబరాలు
మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యములో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. కోవిడ్ నేపథ్యంలో వర్చువల్‌గా ఈ వేడుకలు జరిపారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధులుగా రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్, పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఏటా బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న మలేషియా తెలంగాణ అసోసియేషన్ ను ఆయన అభినందించారు. తెలంగాణ తెలుగు మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్న బతుకమ్మ పండుగ విశిష్టతను వివరించారు. వీరితో ఆపటు ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్, మలేషియా తెలుగు పునాది ప్రెసిడెంట్ కాంతారావు, తెరాస మలేషియా ప్రెసిడెంట్ చిట్టిలతో పాటు పలువురు తెలంగాణ ప్రముఖులు ఈ బతుకమ్మ వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమములో ప్రెసిడెంట్ సైదం తిరుపతి, డిప్యూటీ ప్రెసిడెంట్ చొప్పరి సత్య , వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి, నరేంద్రనాథ్ , జనరల్ సెక్రటరీ రవి చంద్ర, జాయింట్ సెక్రటరీ సందీప్, ట్రేజరర్ మారుతీలతో పాటు ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ కిరణ్మయి, వైస్ ప్రెసిడెంట్ స్వప్న, అశ్విత, యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ గౌడ్, రవితేజ, కల్చరల్ వింగ్ మెంబర్స్ విజయ్ కుమార్, చందు, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు . -
గుడ్‌న్యూస్: తగ్గనున్న వంట నూనె ధరలు .. కొత్తగా మిషన్ ఆయిల్ ఫామ్
న్యూఢిల్లీ: వంట నూనెల దిగుమతి తగ్గించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి బదులుగా దేశీయంగా నూనె గింజన ఉత్పత్తి పెంచాలని డిసైడ్ అయ్యింది. అందుకు తగ్గట్టుగా మిషన్ ఆఫ్ ఆయిల్‌పామ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మిషన్ ఆయిల్‌పామ్ పథకానికి రూ.11,040 కోట్లు కేటాయించింది. దిగుమతుల భారం వంట నూనెల ధరలు ఇటీవల అనూహ్యంగా పెరిగాయి. ఇండియా వంట నూనెల్లో సగానికి పైగా ఇండోనేషియా, మలేషియా, బ్రెజిల్, అమెరికాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇటీవల బ్రెజిల్, అమెరికాలలో ఆయిల్ ముడి సరుకుల ఉత్పత్తి తగ్గిపోవడంతో ధరలు పెరిగాయి. మరోవైపు ఇండోనేషియా, మలేషియాలు ఎగుమతి సుంకాలు పెంచాయి. వెరసి ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు వంట నూనెల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కేంద్రం వంట నూనెలపై న్నులు తగ్గించింది. అయినా ధరలు అదుపులోకి రాలేదు. ఉత్పత్తి పెంపుకు ఇండియా ఎక్కువగా పామ్‌ఆయిల్‌ని దిగుమతి చేసుకుంటోంది. వేరు శనగ, పొద్దు తిరుడుతో పోల్చితే మన దగ్గర పామ్ ఆయిల్ సాగు తక్కువగా ఉంది. దీంతో వంట నూనెల తయారీలో కీలకమైన ఫామాయిల్ సాగును ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు మిషన్ ఆఫ్ ఆయిల్ ఫామ్‌ను ప్రకటించింది. -
నష్టాల మార్కెట్లో బయోకాన్ జోరు
సాక్షి, ముంబై: దేశీయ ఫార్మా దిగ్గజం బయోకాన్ షేరు లాభాలతో కొనసాగుతోంది. మలేషియా ప్లాంట్‌కు సంబంధించి అమెరికా హెల్త్ రెగ్యులేటర్ యుఎస్ఎఫ్డిఎ నుంచి కీలక క్లియరెన్స్ రావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో 1300 పాయింట్లకుపైగా కుదేలైన దలాల్ స్ట్రీట్ లో బయోకాన్ 5 శాతానికి పైగా ఎగిసింది. మలేషియా ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ (ఈఐఆర్) అందుకున్నట్టు బయోకాన్ బుధవారం వెల్లడించింది. ఇన్సులిన్ గ్లార్జిన్ (సెమిగ్లీ) తయారీకి మలేషియాలోని కంపెనీ అనుబంధ సంస్థ బయోకాన్ ఎస్డీఎన్ బీహెచ్ డీ ఈఐఆర్ లభించిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 10-21 మధ్య మలేషియా ప్లాంట్‌లో యూఎస్ఎఫ్డీఏ తనిఖీలు నిర్వహించినట్టు ప్రకటించింది. ఇన్సులిన్ గ్లార్జైన్ తయారీలో తమకు ఒదొకముఖ్యమైన మైలురాయి అని కంపెనీ పేర్కొంది. నాణ్యత, సేవల్లో ప్రపంచ ప్రమాణాలకు సంబంధించి బయోకాన్ నిబద్ధతకు ఇది నిదర్శమని వ్యాఖ్యానించింది. తాజా లాభాలతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.33,462 కోట్లకు చేరింది. -
హనీమూన్‌కు కొత్తజంట: కరోనా ఎఫెక్ట్‌తో..
భువనేశ్వర్ : కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో ఒడిశాకు చెందిన నవదంపతులు మలేషియాలో చిక్కుకున్నారు. వైరస్ కారణంగా ఆ దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లే విమానాలు రద్దు చేయడంతో వారికి ఈ దుస్థితి ఎదురైంది. అయితే ఈ నెల 17వ తేదీ నుంచి వారు మలేషియా విమానాశ్రయంలోనే ఉండిపోవడం గమనార్హం. వివరాలిలా ఉన్నాయి.. నవరంగపూర్‌కు చెందిన శంకర హల్దార్(28), పల్లవి మిశ్రా(27)లకు ఫిబ్రవరి 27వ తేదీన వివాహం జరిగింది. హనీమూన్ నిమిత్తం మలేషియాకు బయలుదేరిన ఆ జంట తిరిగి ఇంటికి వస్తుండగా ఈ నెల 17వ తేదీన మలేషియా ఎయిర్‌లైన్స్ సిబ్బంది వారిని అడ్డుకుంది. ఈ నేపథ్యంలో వారు ఇంటికి రాలేకపోయారు. ఈ క్రమంలో వారంతా తమ అవసరాలు తీర్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ మలేషియా విమానాశ్రయంలో కేవలం ఈ నూతన దంపతులే కాకుండా మరో 200 మంది భారతీయులు చిక్కుకున్నట్లు సమాచారం. (ట్రంప్ గుడ్‌న్యూస్.. కరోనాకు విరుగుడు..!) -
మలేసియాలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు
-
గెలిస్తే నాకౌట్ దశకు
నానింగ్ (చైనా): క్వార్టర్ ఫైనల్ బెర్త్ తొలి లక్ష్యంగా సుదిర్మన్ కప్‌లో భారత జట్టు తమ పోరాటాన్ని ప్రారంభించనుంది. ప్రపంచ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్ అయిన సుదిర్మన్ కప్‌లో భారత్ రెండుసార్లు (2011, 2017లలో) క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. అయితే ఆ రెండుసార్లు క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయింది. మంగళవారం జరిగే గ్రూప్–డి మ్యాచ్‌లో మలేసియాతో భారత్ ఆడనుంది. ఇదే గ్రూప్ తొలి మ్యాచ్‌లో చైనా చేతిలో మలేసియా ఓడిపోయింది. ఫలితంగా నేడు మలేసియాపై భారత్ గెలిస్తే నేరుగా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ ఓడితే మాత్రం తదుపరి మ్యాచ్‌లో పటిష్టమైన చైనాపై భారత్ గెలవాల్సి ఉంటుంది. దిగ్గజ ఆటగాడు లీ చోంగ్ వీ లేకపోవడంతో మలేసియా జట్టు బలహీనంగా కనిపిస్తోంది. ఈ అవకాశాన్ని భారత్ సద్వినియోగం చేసుకోవాలి. అయితే భారత విజయావకాశాలు డబుల్స్ జోడీల ప్రదర్శనపై ఆధారపడి ఉంది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ లేదా సమీర్ వర్మ, మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు లేదా సైనా నెహ్వాల్ బరిలోకి దిగి విజయం సాధిస్తే భారత్ 2–0తో ఆధిక్యంలోకి వెళ్తుంది. ఆ తర్వాత పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌ల్లో భారత్ ఒక్కటి నెగ్గినా విజయం ఖాయమవుతుంది. 13 మంది సభ్యులుగల భారత బృందానికి ఈసారి ఎనిమిదో సీడింగ్ లభించింది. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో మలేసియా జట్టుపై నెగ్గి భారత్ స్వర్ణ పతకాన్ని సాధించింది. అదే స్ఫూర్తితో ఈసారి కూడా భారత్ చెలరేగితే ముందంజ వేయడం ఖాయం. మలేసియాతో మ్యాచ్ అనంతరం బుధవారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో పదిసార్లు చాంపియన్ చైనాతో భారత్ ఆడుతుంది. భారత జట్టు: కిడాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ (పురుషుల సింగిల్స్), పీవీ సింధు, సైనా నెహ్వాల్ (మహిళల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, సుమీత్ రెడ్డి, మను అత్రి, ప్రణవ్ చోప్రా (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి, మేఘన, పూర్వీషా రామ్ (మహిళల డబుల్స్). -
మలేషియాలో క్షమాభిక్ష
మోర్తాడ్(బాల్కొండ) : పర్యాటక ప్రాంతాలకు ప్రసిద్ధిగాంచిన మలేషియాలో చట్ట విరుద్ధంగా ఉంటున్న విదేశీ కార్మికులు సొంత గడ్డకు వెళ్లిపోవడానికి అక్కడి ప్రభుత్వం ఆమ్నెస్టీ(క్షమాభిక్ష)ను అమలు చేస్తోంది. పది నెలల క్రితం ఆమ్నెస్టీని అమలులోకి తీసుకురాగా ఈనెలాఖరుతో ముగిసిపోనుంది. మలేషియా ప్రభుత్వం ప్రకటించిన ఆమ్నెస్టీ గత మే 31తోనే ముగిసింది. అయితే మలేషియా ప్రభుత్వం మరో మూడు నెలల పాటు పొడగించడంతో ఈనెలాఖరు వరకు క్షమాభిక్ష కొనసాగనుంది. పర్యాటకుల పాలిట స్వర్గధామమైన మలేషియాలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు ఏజెంట్లు తెలంగాణ జిల్లాలకు చెందిన నిరుద్యోగులను తరలిస్తున్నారు. మలేషియాలో వర్క్ వీసాలకు బదులు విజిట్ వీసాలనే ఏజెంట్లు చేతిలో పెట్టి పంపిస్తున్నారు. మలేషియాలో పోలీసులు నిరంతరం తనిఖీలు చేస్తుండటంతో చట్ట విరుద్ధంగా ఉంటున్న వారు భయంతో దాక్కునాల్సి వస్తోంది. విజిట్ వీసాలపై మలేషియాలో అడుగు పెట్టిన వారికి హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, సూపర్మార్కెట్లు, ఇతర వాణిజ్య సంస్థలలో పని కల్పించడం లేదు. దీంతో వారు పామోలిన్ తోటలలోనే రహస్యంగా పని చేయాల్సి వస్తోంది. పామోలిన్ తోటలలో పని చేసే వారికి పాములు, తేళ్ల బెడద తీవ్రంగా ఉంటుంది. మలేషియాలో చట్ట విరుద్ధంగా ఉంటున్న తెలంగాణ కార్మికుల సంఖ్య దాదాపు రెండువేల వరకు ఉంటుందని భారత హైకమిషన్ అధికారులు అంచనా వేసి వెల్లడించారు. క్షమాభిక్షను వినియోగించుకుని సొంత గడ్డకు వచ్చేవారు రూ.8 వేల జరిమానా చెల్లించి, సొంతంగా టిక్కెట్‌ను కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. క్షమాభిక్ష అమలు లేని సమయంలో చట్ట విరుద్ధంగా ఉంటున్న వారు ఇంటికి రావాలంటే భారీ మొత్తంలో జరిమానా చెల్లించడమే కాకుండా జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. అందువల్ల క్షమాభిక్ష సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్వచ్ఛంద సంఘాల నాయకులు కోరుతున్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం.. మలేషియాలో ఆమ్నెస్టీ అమలు నేపథ్యంలో టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం మలేషియాలో పర్యటిస్తుంది. టీపీసీసీ గల్ఫ్ కో ఆర్డినేటర్ నంగి దేవెందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు సభ్యులు మూడు రోజుల నుంచి మలేషి యాలో తెలంగాణ కార్మికులు ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నంగి దేవెందర్‌రెడ్డి ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. మలేషియాలో క్షమాభిక్ష అమలు విషయంపై ఎవరికీ అవగాహన లేక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి కార్మికుల పట్ల చిత్త శుద్ది లేదని ఆరోపించారు. మలేషియాలో ప్రధానంగా నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన కార్మికులే ఎక్కువ మంది ఉన్నారని వీరంతా విజిట్ వీసాలపై వచ్చి కష్టాలు పడుతున్నవారే అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి కార్మి కులను సొంతూర్లకు రప్పించే చర్యలను చేపట్టా లని డిమాండ్ చేశారు. చేతిలో డబ్బు లేక జరిమానా చెల్లించి, టిక్కెట్ కొనుక్కొనే పరిస్థితి కార్మికులకు లేదని తెలిపారు. ప్రభుత్వమే టిక్కెట్లను ఇప్పించి జరిమానాకు సంబంధించిన సొమ్మును జమ చేయాల్సిన అవసరం ఉందన్నారు. క్షమాభిక్షకు ఎక్కువ సమయం లేదని అందువల్ల ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని పంపించి తెలంగాణ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
మలేషియా ముసుగులో టోకరా
కాశీబుగ్గ : మలేషియాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల పేరిట నిరుద్యోగులు నిలువునా మోసపోయారు. 17 మంది యువకులకు నకిలీ వీసాలు, టిక్కెట్లు పంపించి రూ.13.60 లక్షలు వసూలు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌కు గురువారం బాధితులు చేరుకుని బోరుమన్నారు. ఈ సంఘట న పలాస–కాశీబుగ్గ పట్టణాల్లో కలకలం రేపింది. పలాస–కాశీబుగ్గ పట్టణానికి చెందిన రాజ్‌కుమార్ మలేషియాలో ఓ ప్రైవేటు కంపెనీలో హెచ్ఆర్గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అక్కడే వెల్డర్‌గా పని చేస్తున్న కార్తీక్‌తో కలిసి నిరుద్యోగులకు గాలం వేశా రు. ఇందులో భాగంగా పలాసలో ఉంటున్న రాజ్‌కుమార్ తమ్ముడు గజపతి సహకారంతో మలేషి యాలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని నమ్మబలి కారు. ఇతడు మెడికల్, ఇతర దొంగ సర్టిఫికెట్ల తయారీలో దిట్ట. ఈ మేరకు గత నెల 15న టిక్కెట్లు ఇస్తున్నామని నకిలీ వీసా, విమాన టిక్కెట్లు వాట్సాప్, మెయిల్లో పంపించి ఒక్కొక్క రి నుంచి రూ. 80 వేల చొప్పున వసూలు చేశారు. అదే తేదీన తీరా టిక్కెట్లు పనిచేయడంలేదని నచ్చచెప్పి చెన్నై విమానాశ్రయం నుంచి వెనక్కి రప్పిం చేశారు. అనంతరం ఈ నెల 3వ తేదీన టిక్కెట్లు ఇస్తామని నమ్మబలికి మరలా డూప్లికేట్ వీసాలు, టిక్కెట్లు పంపారు. దీంతో కోపోద్రిక్తులైన బాధితులు పలాసలో రాజ్‌కుమార్, కార్తీక్ ఇళ్లకు గురువారం చేరుకున్నారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు ఈ మేరకు కాకినాడకు చెందిన 11 మంది నిరుద్యోగులు, స్థానికంగా ఉన్న ఆరుగురు మోసపోయిన సంగతి తెలుసుకుని సదరు వ్యక్తుల ఇళ్ల వద్ద వారి తల్లిదండ్రులను నిలదీశారు. ఈ మేరకు కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎస్ఐ ప్రసాదరావు మాట్లాడుతూ రాతపూర్వకంగా ఫిర్యాదు రాలేదని, వస్తే చర్యలు చేపడతామన్నారు. -
మంచు విష్ణు బైక్ యాక్సిడెంట్ వీడియో
-
టీమిండియా ఘన విజయం
-
భారత్ జైత్రయాత్ర
ఢాకా: ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో భారత్ ఎదురులేకుండా దూసుకెళుతోంది. సూపర్–4 మ్యాచ్‌లో భాగంగా మలేసియా జట్టుతో గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా 6–2 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ టోర్నీలో మలేసియాకిదే తొలి ఓటమి కావడం గమనార్హం. అంతేకాకుండా ఈ విజయంతో అజ్లాన్ షా కప్, హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీలో మలేసియా చేతిలో ఎదురైన పరాజయాలకు భారత్ ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. అటు కొరియా, పాక్‌ల మ్యాచ్ 1–1తో డ్రా కావడంతో సూపర్–4 దశలో భారత్ టాప్‌లో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు కచ్చితమైన అటాకింగ్‌తో విరుచుకుపడి ఏకంగా ఐదు ఫీల్డ్ గోల్స్ చేయడం విశేషం. ఆకాశ్‌దీప్ (15వ నిమిషంలో), ఉతప్ప (24వ ని.లో), గుర్జంత్ సింగ్ (33వ ని.లో), సునీల్ (40వ ని.లో), సర్దార్ సింగ్ (60వ ని.లో)ల నుంచి ఫీల్డ్ గోల్స్ రాగా 19వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. మలేసియా నుంచి రహీమ్ (50వ ని.లో), రోసిల్ (59వ ని.లో) గోల్స్ చేశారు. చివరి మ్యాచ్ పాక్‌తో... అజేయంగా దూసుకెళుతున్న భారత జట్టు సూపర్–4లో తమ చివరి మ్యాచ్‌ను దాయాది పాకిస్తాన్‌తో ఆడనుంది. ఇప్పటికే వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో పాక్‌ను చిత్తు చేసి జోరులో ఉన్న భారత్ మరోసారి వారికి చేదు ఫలితాన్ని ఇవ్వాలని భావిస్తోంది. కొరియాపై 1–1తో డ్రా చేసుకున్న భారత్‌కు ఈ టోర్నీలో ఇప్పటిదాకా ఓటమి లేదు. ఆ మ్యాచ్‌లో లోపాలను సరిచేసుకున్న అనంతరం భారత జట్టు మలేసియాను దారుణంగా ఓడించింది. ఇప్పటికే సూపర్–4లో నాలుగు పాయింట్లతో ఉన్న భారత్‌కు ఈ మ్యాచ్‌లో మరో ‘డ్రా’ ఎదురైనా ఆదివారం జరిగే ఫైనల్ బరిలో నిలుస్తుంది. మొత్తం గోల్స్ విషయంలో మన్‌ప్రీత్ సింగ్ సేన మిగిలిన జట్లకన్నా ముందుంది. అటు పాక్ జట్టు ఫైనల్‌పై ఆశలు పెట్టుకోవాలంటే భారత్‌పై భారీ తేడాతో నెగ్గి ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. సాయంత్రం గం. 5.00 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం. -
టీమిండియా ఘన విజయం.. పాక్ కాచుకో!
ఢాకా : ఆసియా కప్ హాకీలో భారత్ జట్టు విజయాల పరంపర కొనసాగుతోంది. మలేషియాతో గురువారం(19న)ఢాకాలో జరిగిన మ్యాచ్‌లో 6-2 తో ఇండియా జట్టు విజయం సాధించింది. మొదటి నుంచి టీం ఇండియా ఆటగాళ్లు అసాధారణ ప్రదర్శన కనబరిచారు. కొత్త కోచ్ జోయెర్డ్ మరిన్ మార్గదర్శకంలో కుర్రాళ్లు బాగా రాణిస్తున్నారు.ఆరంభం నుంచి మన ఆటగాళ్లు అందివచ్చిన అవకాశాలను గోల్స్ గా మలుచుకుని విజయానికి బాటలు వేశారు. మలేషియాపై ఘనవిజయంతో భారత్ సూపర్ ఫోర్కు చేరుకుంది. రెండు మ్యాచ్‌లతో నాలుగు పాయింట్లు సాధించింది. టీమిండియా అద్భుత ప్రదర్శనతో మలేషియాను కంగు తినిపించింది. సూపర్ ఫోర్ దశ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా జట్టు శనివారం(21వ తేదీన) పాకిస్తాన్‌తో తలపడనుంది. ఆకాశ్‌దీప్ సింగ్, ఎస్కె ఉతప్ప, గుజరాత్ సింగ్, ఎస్వీ సునీల్, సర్దార్ సింగ్‌లు తమ ప్రదర్శనతో గోల్స్ సాధించారు. మలేషియా జట్టులో రజి రహీమ్, రమ్దాన్ రోస్లీలు గోల్స్ కొట్టారు. గత బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా- దక్షిణ కొరియా జట్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. చివరకు ఆ మ్యాచ్‌లో రెండు జట్లు 1-1 గోల్స్ సాధించిన విషయం తెలిసిందే. -
మలేషియాలో నాట్యకారిణి ప్రవల్లిక ప్రదర్శనలు
చెరుకుపల్లి: మలేసియాలో తెలుగుసంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలో గుంటూరు జిల్లా చెరుకుపల్లికి చెందిన పెదపూడి నాగశ్రీ ప్రవల్లిక ప్రతిభ కనపరించింది. ఈ నెల 7వతేదీన మలేసియాలోని కౌలాలంపూర్, 8న భగవాన్దత్లో, 9న కెనాంగ్ దీవిలో, 13వ తేదీన తుంగైపఠానీలో, 15న కౌలలంపూర్ సిటీలలో ప్రదర్శనలిచ్చి ఆ దేశప్రజల మన్ననలు పొందింది. ఈ సందర్భంగా నాగశ్రీ ప్రవల్లికను ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ఎంపీపీ మొఖమాటం పార్వతి, ఎంఈవో లాజరస్, వనజా చంద్ర పబ్లిక్ స్కూలు అధ్యాపక సిబ్బంది గురువారం అభినందించారు. -
అమరావతిలో మలేషియా తెలుగుసంఘ సభ్యులు
అమరావతి(గుంటూరు): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, పర్యాటకకేంద్రం అయిన అమరావతిని శుక్రవారం 14 మంది మలేషియా తెలుగుసంఘం సభ్యులు సందర్శించారు. మలేషియా తెలుగు సంఘ అధ్యక్షుడు డాక్టర్ అచ్యుతకుమారరావు, ఉపాధ్యక్షుడు వి.గణేశన్, సభ్యులు వి.కృష్ణారావు, డాక్టర్ వెంకటప్రతాప్, ఉపాధ్యాయురాలు దుర్గాప్రియతదితరులు తొలుత అమరేశ్వరస్వామి దేవస్థానాన్ని సందర్శించారు. అమరేశ్వరునికి, బాలచాముండేశ్వరికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పురావస్తుమ్యూజియం, ధ్యానబుద్ధ విగ్రహాన్ని తిలకించారు. అమరావతి డెవలప్మెంట్ అథారిటి చైర్మన్ జాప్తి వీరాంజనేయులు, ధాన్యకటక బుద్ధ విహార ట్రష్టు చైర్మన్ డాక్టర్ వాలిలాల సుబ్బారావు, కొండవీటి శ్రీనివాసరావులు మలేషియా తెలుగు సంఘ సభ్యులను శాలువాలతో సత్కరించారు. అనంతరం మండల పరిధిలోని వైకుంఠపురం భవఘ్ని అశ్రమాన్ని సందర్శించారు. -
నైపుణ్యతతోనే ఉన్నత స్థాయి
ఎచ్చెర్ల: నైపుణ్యాలు ఉన్న విద్యార్థులు మాత్రమే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుంటారని మలేషియాకు చెందిన యూఎస్ఎం వర్సిటీ ప్రొఫెసర్ ఎం.బాలరాజు అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో సోషల్ వర్కు, రూరల్ డెవలప్మెంట్, ఎంఎడ్, ఎకనామిక్స్ విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలపై సోమవారం ఒక్క రోజు వర్కుషాపు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సంపూర్ణ విషయ పరిజ్ఞానంతో ముందుకు సాగాలన్నారు. ఎంటర్ ప్రన్యూర్ షిప్, సోషల్ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం ఎంతగానో అవసరమని చెప్పారు. కష్టపడే విద్యార్థులకు భవిష్యత్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు యు.కావ్యజ్యోత్స, డాక్టర్ జే ఎల్ సంధ్యారాణి, డి.వనజ, మల్లికార్జున రావు తదితరులు పాల్గొన్నారు. -
కళనే వలగా..
అలల జోలపాటకు బజ్జున్న పాపాయిలా ఉంటుంది ససరన్!మలేసియా దేశపు పడమటి సముద్రతీరపు గ్రామం. ఇక్కడివారికి చేపల వే టే ఆధారం. ముత్తాతల కాలం నుంచీ ఇదే జీవనవిధానం. కడలి కెరటాల్లో కళను చూసిన ఓ వ్యక్తి సంప్రదాయ వృత్తిని కాదన్నాడు. తనలోని కళల అలజడికి విలువిచ్చి వలను పట్టేది లేదని తేల్చిపారేశాడు. కళనే వలగా మార్చి తన గ్రామాన్ని ఆర్ట్ విలేజ్‌గా ప్రపంచం ముందు నిలిపాడు. ఇంగ్‌బీ, ససరన్ గ్రామవాసి. ఆ గ్రామంలో ‘నేను చేపలు పట్టను’ అన్న ఒకే ఒక్కడు. ‘మరెట్టా బతుకుతావురా..?’ అని పెద్దలు నిలదీస్తే.. ఆర్టిస్ట్‌ను అవుతానన్నాడు. ఇంట్లో వాళ్లే కాదు, ఆ గ్రామస్తులంతా ముక్కున వేలేసుకున్నారు. అస్తమానం బొమ్మలేయడం ఇంగ్‌బీ వ్యాపకమైంది. గ్రామీణుల పడవలను, వలలను తనకు వచ్చిన కళతో తీర్చిదిద్ది వినూత్నంగా వాళ్ల కళ్లముందుంచాడు. వెదురు బుట్టల్లో మెరిసిపోయే మార్పులు చూపాడు. మోటార్ సైకిళ్లు, కార్లపై వాటి యజమానులు ఆనందించే రంగులు వేశాడు. ఒకరకంగా చెప్పాలంటే మొత్తం ఊరికే ఆర్ట్ వైరస్ అంటించాడు. వెల్డింగ్ చేసేవారు, గోడలు కట్టేవారు, బురదనేలపై చెక్కల రోడ్డు వేసేవారు, పడవలు నడిపేవారు.. ఇలా ఎందరో ఇంగ్‌బీ ఫ్యాన్స్‌గా మారిపోయారు. ఆర్టిస్టులూ అయిపోయారు. ససరన్లో ఆర్ట్ సైరన్.. దేశవిదేశాల్లో ఎక్కడ ఆర్ట్ ఫెస్టివల్ జరిగినా ఇంగ్‌బీ రెక్కలు కట్టుకుని వాలిపోయేవాడు. అలాంటి పండుగలు తన గ్రామంలో ఎందుకు చేయకూడదు అనుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా తనకు పరిచయం ఉన్న ఆర్టిస్టులందరికీ తన ఊరిలో మార్పులను పరిచయం చేశాడు. మిత్రుల ద్వారా పర్యాటక సంస్థలను సంప్రదించాడు. అన్నీ అనుకూలించిన తర్వాత ససరన్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్-2008కి శ్రీకారం చుట్టాడు. స్థానికంగా ఉన్న చైనా పాఠశాల నిర్వాహకులను సంప్రదించాడు. ఇంగ్‌బీ తొలిసారి నిర్వహిస్తున్న వేడుకకు ప్రోత్సాహం ఇచ్చేందుకు వారు ముందుకొచ్చారు. ఫెస్టివల్‌కు వచ్చిన ఆర్టిస్టులు సిగరెట్లు తాగడం, మందుకొట్టడం ఆ స్కూల్ హెడ్మాస్టర్కు రుచించలేదు. కానీ, తాగిపారేసిన సీసాలతో, ఫెస్టివల్ తర్వాత ఊళ్లో పేరుకుపోయిన చెత్తాచెదారంతో ఇంగ్‌బీ కళ్లు చెదిరే కళారూపాలను ఆవిష్కరించి వహ్వా అనిపించాడు. 2011లో రెండో ఫెస్టివల్‌ను విజయవంతంగా నిర్వహించాడు. ముచ్చటగా మూడోది.. ఈ ఏడాది మూడో ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. గతనెల 27న ప్రారంభమైన ససరన్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్-2014 ఈ నెల 8వ తేదీ వరకూ జరగనుంది. ప్రపంచదేశాలు, ముఖ్యంగా ఆసియా దేశాల ఆర్ట్ మార్కెట్‌కు ససరన్ కనెక్ట్ అయ్యింది. ‘అన్నిచోట్లా ఆర్ట్’ (ఆర్ట్ ఇన్ ద ఎయిర్) అనే అంశంపై జరుగుతోన్న ఈ ఏడాది ఫెస్టివల్లో ఊరిలోని అణువణువూ ఆర్ట్పీస్గా మారిపోతోంది. ఈ సంబరానికి తెలంగాణ నుంచి ప్రముఖ ఆర్టిస్ట్ ఏలె లక్ష్మణ్ ఆహ్వానితునిగా వెళ్లారు. ఆర్ట్ ఎట్ తెలంగాణను అక్కడి ప్రతినిధులకు పరిచయం చేస్తున్నారు. ససరన్లో ఆర్ట్ సృష్టించిన సంపదను, గ్రామస్తుల ఆహ్లాదకరమైన జీవితాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఇంగ్‌బీ ద్వారా కిటుకులు తెలుసుకుంటున్నారు! తెలంగాణ ఒక ససరన్ను స్వప్నిస్తుందా?!