అమరావతిలో మలేషియా తెలుగుసంఘ సభ్యులు
అమరావతి(గుంటూరు): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, పర్యాటకకేంద్రం అయిన అమరావతిని శుక్రవారం 14 మంది మలేషియా తెలుగుసంఘం సభ్యులు సందర్శించారు.
అమరావతి(గుంటూరు): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, పర్యాటకకేంద్రం అయిన అమరావతిని శుక్రవారం 14 మంది మలేషియా తెలుగుసంఘం సభ్యులు సందర్శించారు. మలేషియా తెలుగు సంఘ అధ్యక్షుడు డాక్టర్ అచ్యుతకుమారరావు, ఉపాధ్యక్షుడు వి.గణేశన్, సభ్యులు వి.కృష్ణారావు, డాక్టర్ వెంకటప్రతాప్, ఉపాధ్యాయురాలు దుర్గాప్రియతదితరులు తొలుత అమరేశ్వరస్వామి దేవస్థానాన్ని సందర్శించారు. అమరేశ్వరునికి, బాలచాముండేశ్వరికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పురావస్తుమ్యూజియం, ధ్యానబుద్ధ విగ్రహాన్ని తిలకించారు. అమరావతి డెవలప్‌మెంట్ అథారిటి చైర్మన్ జాప్తి వీరాంజనేయులు, ధాన్యకటక బుద్ధ విహార ట్రష్టు చైర్మన్ డాక్టర్ వాలిలాల సుబ్బారావు, కొండవీటి శ్రీనివాసరావులు మలేషియా తెలుగు సంఘ సభ్యులను శాలువాలతో సత్కరించారు. అనంతరం మండల పరిధిలోని వైకుంఠపురం భవఘ్ని అశ్రమాన్ని సందర్శించారు.