తెలుగు భాష పరిరక్షణకి ఏపీ ప్రభుత్వం ఆలస్యంగానైనా మేల్కొని చర్యలు ప్రారంభించింది.
తెలుగు భాష పరిరక్షణ, అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ఆలస్యంగానైనా మేల్కొని చర్యలు ప్రారంభించింది. రాష్ట్రంలోని దుకాణాల పేర్లు తప్పనిసరిగా తెలుగులోనే ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతోపాటు అన్ని శిలాఫలకాలను తెలుగులోనే ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా తెలుగు భాష అభివృద్ధికి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.