telugu
-
ఆడవారి కష్టానికి అద్దం ఈ సినిమా..
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం మిసెస్(Mrs) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఈ సమాజంలో ఏ ప్రతిఫలం ఆశించకుండా ప్రతి రోజూ బాధ్యతతో కష్టపడుతున్న వారెవరైనా ఉన్నారు అంటే వారు మన ఇంటి ఆడవారు. 365 రోజులు ఏ సెలవు లేకుండా ఇంట్లో ఉన్న ఆరు నుండి అరవై ఏళ్ల వాళ్ల బాగోగులు ప్రతి నిత్యం అలుపెరగకుండా చూసుకునేవారే ఆడవారు. మరి ఇంతలా కష్టపడుతున్న వారికి కొన్ని బాధలు ఉంటాయి కదా. వాటి గురించి విచారించేదెవరు... ఆ కోణంలో ఆలోచింపజేసేదే ఈ ‘మిసెస్’ చిత్రం.2021లో విడుదలైన మలయాళ సినిమా ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’కి హిందీ రీమేక్‌గా ‘మిసెస్’ రూపొందింది. ఆరతి కడావ్ దీనికి దర్శకురాలు. బాలీవుడ్లో విలక్షణ నటిగా పేరొందిన సాన్యా మల్హోత్రా(Sanya Malhotra) ఈ సినిమాలోని ప్రధాన పాత్ర పొషించారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కనీసం ఓ క్షణమైనా తమ ఇంటి ఆడవారి కష్టం గురించి ఆలోచిస్తారు. అలా ఆలోచింపజేయడమే లక్ష్యంగా దర్శకురాలు ఈ సినిమాని రూపొందించారు. అంతలా ఏముందీ సినిమాలో ఓసారి చూద్దాం... రీచా ఓ చదువుకున్న ఆధునిక భావాలు కలిగిన అమ్మాయి. మంచి డ్యాన్స్ టీచర్ కూడా.తనకు సొంతంగా డ్యాన్స్ టీమ్ ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనలో ఉంటుంది. ఈ లోపల తల్లిదండ్రులు నిశ్చయించిన సంబంధంతో పెద్దల సమక్షంలో సంప్రదాయబద్ధంగా దివాకర్‌తో పెళ్లవుతుంది. దివాకర్ ఓ డాక్టర్. దివాకర్ది మరీ ఛాందస భావాలు కలిగిన కుటుంబం. ఇంటికి వచ్చిన కోడలితో ఇంటెడు చాకిరీ చేయించుకోవడమే కాక ఓ బానిస కన్నా చాలా హీనంగా చూస్తుంటారు. ప్రతి రోజూ అలారం పెట్టుకొని లేచి ఇంట్లో ఉన్న వాళ్లందరికీ వండి రాత్రి మళ్లీ నిద్రపొయేంతవరకు కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకురాలు. ఇంట్లో కనీసం వాసన కూడా భరించలేని ఓ ప్రదేశాన్ని తాను ఎంత నరకయాతన అనుభవిస్తూ శుభ్రం చేసిందో చూస్తే చూసిన ప్రేక్షకులకు గుండె బరువెక్కుతుంది.ఇంటి పెద్ద అయిన దివాకర్ తండ్రి బయటకు వెళ్లాలంటే ఆయన చెప్పులు కూడా చేత్తో తీసి, ముందు పెడితే తాపీగా వేసుకుని వెళతాడు. అటువంటి ఘోరమైన భావజాలమున్న ఈ కుటుంబంలోకి వచ్చిన రీచా ఎలా మనగలుగుతుంది? అలాగే తన డ్యాన్స్ డ్రీమ్ నెరవేర్చుకుంటుందా? లేదా అన్నది సినిమాలోనే చూడాలి. ఈ సినిమాలోని కథాంశం సమాజంలో ఉన్న ప్రతి గృహిణిది. ప్రతి రోజూ మీ కోసం కష్టపడుతున్న మీ వారి కోసం ఈ సినిమా చూడండి. ఆమె కష్టమేంటో మీ మనస్సుతో పాటు కళ్లకు కూడా తెలుస్తుంది. వర్త్‌ఫుల్ వాచ్. – ఇంటూరు హరికృష్ణ -
ఛత్రపతి శివాజీగా తెలుగు హీరోలు, AI ఫోటోలు చూశారా?
-
‘తెలుగు వికీపీడియా పండగ-2025’ విజయవంతం
సాక్షి,తిరుపతి: తిరుపతిలో ఫిబ్రవరి 14, 15, 16 తేదీల్లో నిర్వహించిన "తెలుగు వికీపీడియా పండగ 2025" ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 50 మందికి పైగా తెలుగు వికీపీడియా సభ్యులు పాల్గొన్నారు. నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం, 2003లో ప్రారంభమైన తెలుగు వికీపీడియా ఇప్పటివరకు లక్షకుపైగా వ్యాసాలను కలిగి ఉండడం విశేషం.సదస్సు సందర్భంగా "తెలుగు వికీపీడియాను విస్తరించే మార్గాలు", "సభ్యుల వ్యాస రచనా నైపుణ్యాల మెరుగుదల", "వ్యాసాలను ప్రజలకు మరింత ఆసక్తికరంగా రూపొందించే పద్ధతులు" వంటి కీలక అంశాలపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. అదనంగా, "తెలుగు వికీపీడియాలో చేరండి.. అందరికీ విజ్ఞానం పంచండి" అనే నినాదంతో తిరుపతి నగర వీధుల్లో వికీపీడియా సభ్యులు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కరపత్రాలను పంచి ప్రజలకు వికీపీడియాపై అవగాహన కల్పించారు."తెలుగు వికీపీడియా బడి" పేరుతో త్వరలో ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించనున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. కొత్త సభ్యులు వీటి ద్వారా వికీపీడియాలో భాగస్వాములు కావచ్చని తెలియజేశారు. గత దశాబ్ద కాలంలో తెలుగు వికీపీడియాకు విశేష సేవలు అందించిన వారిని ఈ వేడుకల్లో సత్కరించారు. ఉత్తమ నిర్వాహకుడిగా యర్రా రామారావు సత్కారం పొందారు. వికీ పునస్కార గ్రహీతల్లో ఎన్.ఆర్. గుళ్ళపల్లి, శ్రీరామమూర్తి, బత్తిని వినయ్ కుమార్ గౌడ్, స్వరలాసిక, టి. సుజాత, రవిచంద్ర, రామేశం, ఐ. మహేష్, బి.కె. విశ్వనాధ్ తదితరులున్నారు. -
ప్రపంచ క్రికెట్ క్రీడాభిమానులకు కనువిందైన కానుక
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్తాన్(The Greatest Rivalry: India vs Pakistan) సిరీస్ ఒకటి. ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం.భారతదేశంలో సినిమా తరువాత ఏది ఇష్టం అంటే సగటు భారతీయుడు ఠక్కున చెప్పేది క్రికెట్ అనే. నాటి రేడియో రోజుల నుండి నేటి డిజిటల్ ప్రొజెక్షన్ రోజుల వరకు ఎదుగుతున్న సాంకేతికత కన్నా మెరుపు వేగంలో ఎదుగుతోంది ఈ క్రికెట్ అభిమానం. మరీ ముఖ్యంగా ఇండియా– పాకిస్తాన్ మ్యాచ్ అంటే దేశం మొత్తానికి ఆ రోజు అప్రకటిత సెలవు లాంటిది. దాయాదుల పోరు అని చాలామంది ముద్దుగా పిలుచుకునే ఈ మ్యాచ్ ఎప్పుడు ఎక్కడ జరిగినా ప్రపంచం నలుమూలల నుండి ఆకాశమంత ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలోనే నెట్‌ఫ్లిక్స్ ఇరు దేశాల క్రికెట్ ఆటపై ‘ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్తాన్’ అనే సిరీస్ రూపొందించింది. నాలుగు భాగాలతో ఉన్న ఈ సిరీస్‌లో భారతదేశం సాధించిన నాటి ప్రపంచ కప్ నుండి నేటి ప్రపంచ కప్ వరకు ప్రతిదీ విశ్లేషించిన ప్రయత్నం అత్యంత ప్రశంసనీయం. సిరీస్‌లో పత్రికా విలేకరుల నుండి పరోక్ష, ప్రత్యక్ష ఆటగాళ్లతో వివరించిన విధానం ఓ అద్భుతమనే చెప్పాలి. ఈ సిరీస్ ద్వారా ప్రపంచ క్రికెట్ క్రీడాభిమానులకు ఎన్నో వివరణలు, విశ్లేషణలు, రహస్యాలు దృశ్య రూపంలో అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం ఇండియా– పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే ఎంత ఉత్కంఠగా ఉంటుందో అంతకు వేయి రెట్లు ఉత్కంఠ, ఉత్సాహం ఈ సిరీస్ చూస్తున్నంతసేపు ప్రేక్షకులకు కలుగుతుందనడంలో సందేహమే లేదు.క్రికెట్ మ్యాచ్ టీవీలలో ప్రసారమనేది మామూలే కానీ, అదే క్రికెట్ వెనుక జరిగిన తతంగం చూపడమనేది వంద క్రికెట్ మ్యాచులు ఒకేసారి చూడడం లాంటిది. ఓటీటీ వేదికైన నెట్‌ఫ్లిక్స్ ఈ విషయంలో మాత్రం ప్రేక్షకుల నాడి సరిగ్గా పట్టుకుంది. ఈ సిరీస్ మొత్తం తెలుగులోనూ లభ్యం. కాబట్టి కాసేపు ఈ క్రికెట్ రైవల్రీ ఏంటో చూసేయండి. – ఇంటూరు హరికృష్ణ -
కూతుర్ని ఎలా చూసుకోవాలో తెలుసుండాలి!
కన్నడ హీరో ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ నటించిన తాజా చిత్రం ‘రాక్షస’. లోహిత్ .హెచ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అరుణ్ రాథోడ్, శ్రీధర్, గౌతమ్, సోమశేఖర్, విహాన్ కృష్ణ ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 26న కన్నడతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. తెలుగు విడుదల హక్కులను కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్ అధినేత ఎంవీఆర్ కృష్ణ దక్కించుకున్నారు. ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.‘నాన్న అని పిలిపించుకుంటే సరిపోదు... కూతుర్ని ఎలా చూసుకోవాలో కూడా తెలుసుండాలి’, ‘నువ్వు పుట్టిన తిధి, వారం, నక్షత్రాలను బట్టి చూస్తే నీ గ్రహాలకి దోషం ఏర్పడినట్టుంది’ వంటి డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. ‘‘రాక్షస’ ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. మా సినిమాకి కూడా ఆదరణ దక్కుతుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. -
టాలీవుడ్ సెలబ్రిటీల ఇంట మహాలక్ష్ములు
-
తెలుగు సినిమాల కొత్త అప్డేట్స్ ఇవే
-
సీఎం రేవంత్ రెడ్డిని మరిచిపోయిన మరో తెలుగు హీరో
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పేరు చెప్పడంలో మరో తెలుగు హీరో మరిచిపోయాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పటికే పుష్ప2 సినిమా విడుదల సమయంలో అల్లు అర్జున్ (Allu Arjun ) మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి పేరు చెప్పే క్రమంలో కాస్త తడపడటం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు మరోసారి అదే తప్పు జరగడంతో నెటిజన్లతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి అభిమానులు భగ్గుమంటున్నారు.హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక సమావేశాలు జనవరి 5న ముగింపు కార్యక్రమం జరిగింది. ఆ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అతిథిగా పాల్గొన్నారు. ఇదే కార్యక్రమానికి హోస్ట్‌గా సినీ నటుడు బాలాదిత్య (Baladitya) వ్యవహరిస్తున్నారు. సభ జరుగుతుండగా సీఎం రేవంత్ అక్కడకు చేరుకున్నారు. హోస్ట్‌గా ఉన్న బాలాదిత్య ఆయనకు ఆహ్వానం పలికే క్రమంలో ఇలా తప్పుగా సంబోధించారు. 'మన ప్రియతమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవనీయులు, శ్రీ కిరణ్ కుమార్ గారు' అని ఉచ్చరించారు. ఇంతలో అక్కడ ఉన్న వారందరూ కేకలు వేయడంతో తన తప్పును ఆయన వెంటనే గ్రహించారు. ఒక క్షణంలో తన తప్పును సరిచేసుకుని మళ్లీ మైక్‌లో ఇలా చెప్పారు. 'క్షమించాలి.. మన ప్రియతమ నాయకులు, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు' అని సరిచేసుకున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న కార్యక్రమంలో ఎదురుగానే ఒక సీఎం ఉంటే ఆయన పేరును తప్పుగా పిలువడం ఏంటి అంటూ సామాన్యులు కూడా విరుచుకుపడుతున్నారు. హౌస్ట్‌గా వ్యవహిరిస్తున్నప్పుడు ఇంతటి పెద్ద తప్పులు ఎలా చేస్తారని కామెంట్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: త్రివిక్రమ్ వివాదంపై శివ బాలాజీకి కౌంటర్ ఇచ్చిన పూనమ్ కౌర్)ఇదే సమయంలో బాలాదిత్య పరిస్థితిని అర్థం చేసుకుంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. గతంలో అల్లు అర్జున్ ఒక వేదికపై మాట్లాడుతూ సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు చెప్పే క్రమంలో కాస్త తడపడటం జరిగింది. ఆ ఘటన తర్వాత సంధ్య థియేటర్ కేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఇప్పుడు బాలాదిత్య కూడా బహుశా.. ఆ ఘటన తాలూకు భయంతో అతి జాగ్రత్తపడి ఉంటాడని కొందరు చెప్పుకొస్తున్నారు. వాస్తవంగా ఇలాంటి కార్యక్రమాలకు హోస్ట్‌గా బాలాదిత్య చాలా చక్కగా నిర్వహించారు. గతంలో ఒక టీవీ ఛానల్ కోసం జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా కూడా ఆయన వ్యవహరించారు. కానీ, ఇప్పుడు ఆయన పెద్ద తప్పే చేశారని ఎక్కువ శాతం అభిప్రాయ పడుతున్నారు.మళ్ళీ ఘోర అవమానానికి గురైన తెలంగాణ ముఖ్యమంత్రితెలుగు ప్రపంచ సమాఖ్య కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి సీఎం కిరణ్ కుమార్ అంటూ పలికిన వైనంత్వరలో జైలుకి వెళ్లనున్న మరో యాంకర్ అంటూ సెటైర్లు వేస్తున్న నెటిజన్లు https://t.co/vY2w4RJZ2O pic.twitter.com/GEaoPEjYZi— Telugu Scribe (@TeluguScribe) January 5, 2025 -
దేశ రాజకీయాల్లో తెలుగు వారి ప్రాభవం తగ్గింది: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: దేశ రాజకీయాల్లో తెలుగు వారి ప్రాభవం తగ్గిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కోవిడ్ సమయంలో తెలుగు వారి సత్తా ప్రపంచానికి తెలిసిందని.. కోవిడ్ వ్యాక్సిన్‌ను మన తెలుగువాళ్లే తయారు చేశారన్నారు. ప్రపంచ తెలుగు సమాఖ్య 12 వ మహాసభ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్.. తెలుగు సినీ పరిశ్రమ అంతర్జాతీయస్థాయికి ఎదిగిందన్నారు. ఏ దేశానికి వెళ్లిన మన తెలుగు వారు కనిపిస్తారన్నారు.మూడు దశాబ్దాల క్రితం దివంగత ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రపంచ తెలంగాణ సమాఖ్య ప్రారంభమైంది. ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. దేశంలోనే హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు. దేశ రాజకీయాల్లో ఎంతోమంది తెలుగువారు క్రియాశీలకంగా వ్యవహరించారు. నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్, కాకా, జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు లాంటి వారు ఆనాడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర వహించారు. కానీ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తెలుగువారి ప్రాభవం తగ్గింది. రాజకీయం, సినీ,వాణిజ్య రంగాల్లో రాణించినా మన భాషను మరిచిపోవద్దు’’ అని రేవంత్ సూచించారు.పరభాషా జ్ఞానం సంపాదించాలి… కానీ మన భాషను గౌరవించాలి. తెలుగు భాషను గౌరవిస్తూ ఈ మధ్య కాలంలో మా ప్రభుత్వ జీవోలను తెలుగులో ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. నేను విదేశాలకు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లిన సందర్భంలో ఎంతోమంది తెలుగువారు నన్ను కలిశారు. వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగు వారు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి. తెలంగాణ అభివృద్ధికి సహకరించండి. తెలంగాణ రైజింగ్ నినాదంతో 2050 అభివృద్ధి ప్రణాళికలతో మేం ముందుకు వెళుతున్నాం. ప్రపంచంలో అత్యున్నత నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం. తెలంగాణ, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడేలా ముందుకు వెళ్లాలి’’ అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: గుడ్‌న్యూస్.. సంక్రాంతికి మరో 52 అదనపు రైళ్లు -
ఖతార్‌లో తెలుగు ప్రవాసికి ప్రతిష్ఠాత్మక 'సౌత్ ఐకాన్ (ఆంధ్రప్రదేశ్)' పురస్కారం
ఖతార్‌లో జరిగిన ప్రతిష్టాత్మక "సౌత్ ఇండియన్ గ్లోబల్ టాలెంట్ అచీవర్స్ (SIGTA) అవార్డ్స్ 2024" వేడుకలో ప్రపంచవ్యాప్తంగా సుపరిచితులైన తెలుగు ప్రవాసి వెంకప్ప భాగవతుల "సౌత్ ఐకాన్ (ఆంధ్రప్రదేశ్)" అవార్డును గెలిచారు. ఖతార్‌లోని తెలుగు, భారత సమాజానికి ఆయన అందించిన అసాధారణ కృషి, ప్రేరణాత్మక నాయకత్వం, వివిధ రంగాల్లో కనబరచిన విశిష్ట ప్రతిభా పాటవాలు, , సేవలకు గౌరవంగా ఈ అవార్డు ఆయనను వరించింది."సౌత్ ఐకాన్ అవార్డు" అనేది SIGTA కార్యక్రమంలో అందించబడే అత్యున్నత గౌరవం. విదేశాల్లో నివసిస్తూ తమ మాతృభూమి సాంస్కృతిక వారసత్వం మరియు నైతిక విలువలను పరిరక్షించడంలో, వాటిని ప్రోత్సహించడంలో విప్లవాత్మకమైన కృషి చేసిన ప్రవాసులకు ఈ అవార్డు ప్రకటించబడుతుంది. ఖతార్‌లోని ప్రపంచ ప్రఖ్యాత AL MAYASA థియేటర్ (QNCC) లో జరిగిన ఈ ఘనమైన వేడుకకు 2,500 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు చిత్ర పరిశ్రమల ప్రముఖులు, వ్యాపార, వినోద, సాంస్కృతిక, సేవా, సామాజిక రంగాల నుండి ప్రతిష్టాత్మక వ్యక్తులు పాల్గొని తమ అభినందనలు తెలిపి, ఈ కృషికి ఎంతో గౌరవం అర్పించారు.ఖతార్ మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలుగు భాష, కళలు, సాంస్కృతిక వారసత్వం , సామాజిక సేవలలో చేసిన అసాధారణ కృషికి గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యి, అందరి మన్ననలు పొందారు వెంకప్ప భాగవతుల.మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! "సౌత్ ఐకాన్ (ఆంధ్రప్రదేశ్)" అవార్డు పొందడం గర్వకారణంగా , గౌరవంగా భావిస్తున్నాను అని, ఇది తన బాధ్యతను మరింత పెంచింది" అని పేర్కొన్నారు అన్నారు వెంకప్ప భాగవతుల. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు సంబంధించి, SIGTA కార్యవర్గం, జ్యూరీ సభ్యులకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. "ఈ గుర్తింపు నా ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ చెందుతుంది. ఈ అవార్డును నా కుటుంబసభ్యులకు, ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ సభ్యులకు, నాకు ప్రేరణగా నిలిచే నా మిత్రులకు, అలాగే ఖతార్‌లోని తెలుగు సమాజానికి అంకితం చేస్తున్నాను." అని ఆయన అన్నారు. -
ప్రెగ్నెన్సీ రూమర్స్.. గుండె కొట్టుకోవట్లేదని తెలిసినా కడుపులో మోశా! (ఫోటోలు)
-
ఈ తెలుగాయన ఆఫ్రికాని జయించాడు!
విజయం ఏ ఒక్కరి సొత్తు కాదు. సమాజంలోని ప్రతి ఒక్కరూ దాన్ని అందుకోవాలి అనే అనుకుంటారు. కాకపోతే ఇక్కడ అనుకోవటం వేరు.. విజయాన్ని అందుకోవడం వేరు!. ఆటంకాలకు అవకాశాలుగా మార్చుకుని.. పట్టుదలతో శ్రమిస్తే విజయం సొంతం అవుతుందని నిరూపించిన గాథల్లో మోటపర్తి శివరామ వర ప్రసాద్(MSRV Prasad) సక్సెస్‌కు చోటు ఉంటుంది. ఆయన ఎదుగుదలా క్రమమే ‘అమీబా’గా ఇప్పుడు పాఠకుల ముందుకు వచ్చింది.చీకటి ఖండంగా పేరున్న ఆఫ్రికాలో.. అదీ అననుకూల పరిస్థితుల నడుమ వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న ఓ తెలుగోడి ఆత్మకథే అమీబా. ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ (Yandamuri Veerendranath) దీనిని రచించడం ఇక్కడ ఒక విశేషం కాగా.. తెలుగులో ఇది తొలిక్రైసిస్ మేనేజ్మెంట్ బుక్ కావడం మరో ప్రత్యేకత. నవ సాహితి బుక్ హౌజ్ పబ్లికేషన్స్ అచ్చేసిన ఈ బయోగ్రఫీ బుక్.. ఈ మధ్యే జయప్రకాశ్ నారాయణ లాంటి మేధావులు పాల్గొన్న ఓ ఈవెంట్లో లాంఛ్ అయ్యింది.పశ్చిమ గోదావరిలో కొవ్వలి అనే కుగ్రామంలో ఓ సామాన్య రైతు కుటుంబం నుంచి మోరపాటి జన్మించారు. ఆటంకాలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ సాగిన ఆయన ప్రయాణం.. ప్రస్తుతం సంపద విలువను రూ. 12 వేల కోట్లకు చేర్చింది. Warangal NIT లో మెటలర్జి చదివారు. గుజరాత్ లో పని చేసి, హైదరాబాద్‌లో ఫౌండ్రి పెట్టారు. తర్వాత ఆ వ్యాపారాన్ని ఘనాలో విస్తరించాడు. భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ స్టీల్, సిమెంట్, కెమికల్స్, ఆటోమొబైల్స్, రియల్ ఎస్టేట్, గార్మెంట్స్ పరిశ్రమలను స్థాపించారాయన. వాటి ద్వారా 20 వేల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నారు. శ్రమ, ముందు చూపు, జ్ఞానం.. తన విజయానికి కారణాలని చెప్తున్నారు. అన్నట్లు.. సారధి స్టూడియోకు ప్రస్తుతం చైర్మన్ ఈయనే. మోటపర్తి శివరామ వర ప్రసాద్ విజయ ప్రయాణం.. దృఢ నిశ్చయం, దృఢ సంకల్పం, చాతుర్యం వంటి వాటికి నిదర్శనం. ఉద్యోగి సంక్షేమం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఒక బెంచ్‌మార్క్‌గా నిలుస్తుంది.:::డాక్టర్ జయప్రకాష్ నారాయణAMOEBA.. అడ్డంకులను అవకాశాలుగా మార్చుకుని.. నిర్దేశించని ప్రాంతాలను జయించిన వ్యక్తికి సంబంధించిన స్ఫూర్తిదాయకమైన కథనం. గొప్ప విజయాల్ని అందుకోవాలనుకునేవాళ్లెందరికో ఆయన జీవితం ఓ ఆశాజ్యోతి. :::రచయిత యండమూరి వీరేంద్రనాథ్రూ.400 జీతగాడిగా(మెటాలర్జిస్ట్గా) మొదలైన ఓ తెలుగు ఎంట్రప్రెన్యూర్ ప్రయాణం.. ఇప్పుడు సాధన సంపత్తి, అపారమైన సంపద, ఓ వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించడం ఎంతైనా స్ఫూర్తిదాయకం కాదంటారా?. -
ఉత్సాహంగా ఎఫ్–టామ్ ట్రెడిషనల్ ఫ్యాషన్ షో..
ముంబై సెంట్రల్: ఎఫ్–టామ్ ఆధ్వర్యంలో బుధవారం థాణేలో తెలుగువారి కోసం ఫ్యాషన్ షోను నిర్వహించారు. ఎఫ్–టామ్ ఫ్యాషన్ విభాగం బాధ్యురాలు మచ్చ అంజలి నేతృత్వంలో ఠాణేలోని కాశీనాథ్ ఘాణేకర్ సభాప్రాంగణంలో నిర్వహించిన తెలుగువారి ‘సాంప్రదాయ దుస్తుల ఫ్యాషన్ షో, అవార్డు ప్రదానోత్సవ’కార్యక్రమంలో సాంప్రదాయ దుస్తులు ధరించిన యువతులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా నటి మీనాక్షీ గడేకర్, నగల వ్యాపారి సుహాస్ మాలవీయ, టీవీ నటీమణి సష్టి సింగ్, నటుడు సిద్ధాంత్ దాండే, సెలబ్రిటీ ఆర్గనైజర్ ప్రమోద్ సింగ్, మోడల్ వల్లకాటి జ్యోతి, మేకప్ ఆర్టిస్ట్ మానసి తదితరులు హాజరయ్యారు. ఫ్యాషన్ దివా, ‘బెస్ట్’విజేతల ఎంపిక ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోడి సునీత, వేముల వాణికి బెస్ట్ స్మైల్, ఇవటూరి కిరణ్మయికి బెస్ట్ వాక్, మామిడాల హరిత రావుకు బెస్ట్ కాని్ఫడెన్స్, నారయ్య నీరజకు బెస్ట్ ఆటిట్యూడ్, జోషి ప్రియాంకకు బెస్ట్ బ్యూటిఫుల్, అనుపమకు బెస్ట్ గ్రేస్‌ఫుల్, కూన లక్ష్మీప్రసన్నకు బెస్ట్ అటైర్, పారసు నివేదితకు బెస్ట్ ఫోజ్, పోలు నూతన్‌కు బెస్ట్ ఐస్, సూర భాగ్యశ్రీకి బెస్ట్ డ్యాన్స్ స్టెప్స్ అవార్డులు లభించాయి. ఉత్తమ ఫ్యాషన్ దివా అవార్డుల ప్రథమ విజేతగా ఉబాలే సరోజ్, రెండవ విజేతగా జోషి ప్రియాంక, మూడవ విజేతగా కూన లక్ష్మీప్రసన్న ఎన్నికయ్యారు. అన్నిరంగాల్లో ‘తెలుగు’ముద్ర అవసరం: గంజి జగన్‌బాబు ‘‘వేగంగా మారుతున్న ప్రపంచంలో తెలుగు యువత కూడా అన్ని రంగాల్లో ముందంజ వేయాలనీ, సాహిత్య, సాంస్కృతిక రంగాలతో పాటు ఫ్యాషన్ రంగంలో కూడా తమదైన ముద్రను ఏర్పాటు చేసుకోవాలనీ, అప్పుడే తెలుగు అనే భావన, గర్వం అందరిలో కలుగుతుందని’ఎఫ్–టామ్ అధ్యక్షుడు గంజి జగన్‌బాబు అభిప్రాయపడ్డారు. ముంబైలో తెలుగువారి కోసం ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఫ్యాషన్ రంగానికి చెందిన పూర్తిస్థాయి కార్యక్రమంగా ఫ్యాషన్ షో నిలిచిందని అన్నారు -
శోభితతో ప్రేమ గురించి తొలిసారి నోరు విప్పిన నాగ చైతన్య
అక్కినేని అందగాడు హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ మూడుముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లయి పక్షం రోజులు గడుస్తున్నా ఇంకా పెళ్లి ముచ్చట్టుసోషల్మీడియాలో సందడి చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ లవ్బర్డ్స్ని ఇంటర్వ్యూ చేసి, వారి ప్రేమ ప్రయాణం గురించి ఆంగ్ల పత్రిక న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. దీన్ని నాగచైతన్య రెండో భార్య శోభిత తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అలాగే తెలుగు భాష ఔన్నత్యాన్ని గురించి కూడా కమెంట్ చేసింది. దీంతో న్యూయార్క్ టైమ్స్ కథనం వైరల్‌గా మారింది.ఈ ఇంటర్వ్యూలో నాగ చైతన్య చాలా విషయాలను పంచుకున్నాడు. ముఖ్యంగా శోభితతో తన ప్రేమ, ఆమెపై అభిమానాన్ని పెంచుకోవడానికి గల కారణాలను షేర్ చేశాడు. శోభిత నిజాయితీ తనకు బాగా నచ్చిందని కామెంట్ చేశాడు. తాను పుట్టింది హైదరాబాదులోనే అయినా పెరిగింది మొత్తం చెన్నైలోనే అనీ, అందుకే తనకు తెలుగు సరిగ్గా రాదని చెప్పుకొచ్చాడు. శోభిత తెలుగు, తనను ఆమెకు మరింత దగ్గరి చేసిందని వెల్లడించాడు. ఆమె స్వచ్ఛమైన తెలుగు, తనను మూలాల్లోకి తీసుకెళ్లిందని అదే ఆమెకు దగ్గరి చేసిందని తెలిపాడు. మాతృభాషలోని వెచ్చదనం తమ ఇద్దరి మధ్యా ప్రేమను చిగురింప చేసిందన్నాడు నాగ చైతన్య. View this post on Instagram A post shared by Sobhita (@sobhitad)శోభితా ప్రేమలో ఎలా పడ్డాడో వివరిస్తూ ఆమె‘మేడ్ ఇన్ హెవెన్ స్టార్' ఆమె మాటలు చాలా లోతుగా ఉంటాయి అంటూ భార్యను పొగడ్తల్లో ముంచెత్తాడు. ఆమె నిజాయితీతో తాను ప్రేమలో పడిపోయానని వెల్లడించాడు. శోభిత సోషల్‌మీడియా పోస్ట్‌లు ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి అని పేర్కొన్నాడు. అంతేకాదు ఆమె పోస్ట్ చేసే బ్లర్ ఫోటోలే తనకిష్టం, అంతేకానీ, గ్లామర్ కోసం, ప్రచారం కోసం పీఆర్ టీం చేసే ఫోటోలు కాదంటూ వ్యాఖ్యానించాడు. సినిమా షూటింగ్లో ఉండగానే రెండు నెలల్లో తన పెళ్లిని ప్లాన్ చేసుకున్నట్లు శోభితా ధూళిపాళ వెల్లడించింది. ఇద్దరమూ మాట్లాడుకుని, ప్రధానంగా చైతన్య కోరికమేరకు సన్నిహితుల సమక్షంలో చాలా సింపుల్‌గా, సంప్రదాయ బద్ధంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పింది. తమ వివాహం ఆధ్మాత్మికంగా, దేవాలయం అంత పవిత్ర భావన కలిగిందంటూ తన పెళ్లి ముచ్చట్లను పంచుకుంది. దీంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కాగా డిసెంబర్ 4 న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ వివాహం వైభంగా జరిగింది. అంతకుముందు ఆగష్టు 8న నిశ్చితార్థం వేడుకతో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. శోభితతో పెళ్లికిముందు టాలీవుడ్ హీరోయిన్ సమంతాను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య , ఆ తర్వాత ఆమెకు విడాకులిచ్చిన సంగతి తెలిసిందే. -
దిగ్విజయంగా ముగిసిన '9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు'
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & ఆంధ్ర కళా వేదిక సంయుక్త నిర్వహణలో ఖతార్ దేశ రాజధాని దోహాలో నవంబర్ 22-23, 2024 తేదీలలో జరిగిన 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుఘనంగా ముగిసాయి. మధ్య ప్రాచ్య దేశాలలో జరిగిన తొలి తెలుగు సాహితీ సదస్సుగా 'తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్' లో స్థానం సంపాదించుకుంది. 9 తెలుగు సంస్థల సహకారంతో నిర్వహింపబడిన ఈ చారిత్రాత్మక సదస్సుకు ప్రధాన అతిధిగా భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు విచ్చేశారు. ఖతార్ లో భారతదేశ రాయబారిశ్రీ విపుల్ కూడా సదస్సుకు హాజరై నిర్వాహకులను అభినందించారు. అమెరికా, భారత దేశం, ఉగాండా, స్థానిక ఆరబ్ దేశాలతో సహా 10 దేశాల నుంచి రెండు రోజుల పాటు సుమారు 200 మంది తెలుగు భాషా, సాహిత్యాభిమానులు ఈ సదస్సులో పాల్గొన్నారు. సుమారు 18 గంటల సేపు 60 కి పైగా సాహిత్య ప్రసంగాలు, 30 మంది స్వీయ కవిత, కథా పఠనం, 34 నూతన తెలుగు గ్రంధాల ఆవిష్కరణ, మధ్యప్రాచ్య దేశాలలో తెలుగు ఉపాధ్యాయులకు సత్కారం, సినీ సంగీత విభావరి, స్థానిక దోహా కళాకారులు, చిన్నారుల నృత్య ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖా మంత్రి కందుల దుర్గేష్, MSME, SERP & NRI సాధికారత శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ సదస్సుకు ప్రత్యేక అభినందనలు వీడియో సందేశం రూపంలో తెలియజేశారు. రాధిక మంగిపూడి (ముంబై), విక్రమ్ సుఖవాసి (దోహా) ప్రధాన నిర్వాహకులుగా, శాయి రాచకొండ (హ్యూస్టన్), వంశీ రామరాజు (హైదరాబాద్) దోహా ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ సభ్యులైన సాయి రమేశ్ నాగుల, దాసరి రమేశ్, శేఖరం.ఎస్. రావు, గోవర్ధన్ అమూరు, ఆరోస్ మనీష్ మొదలైనవారు, శ్రీ సుధ బాసంగి, శిరీష్ రామ్ బవిరెడ్డి, రజని తుమ్మల, చూడామణి ఫణిహారం మొదలైన వ్యాఖ్యాతలు 14 ప్రసంగ వేదికలను సమర్ధవంతంగా నిర్వహించారు. ప్రముఖ సాహితీవేత్తలు డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, కవి జొన్నవిత్తుల, వామరాజు సత్యమూర్తి, అద్దంకి శ్రీనివాస్, కవి మౌనశ్రీ మల్లిక్, రాజ్యశ్రీ కేతవరపు, అత్తలూరి విజయలక్ష్మి, చెరుకూరి రమాదేవి, కలశపూడి శ్రీనివాస రావు, గంటి భానుమతి, గరికిపాటి వెంకట ప్రభాకర్, బి.వి. రమణ, ప్రభల జానకి, విశ్వవిద్యాలయ ఆచార్యులు అయ్యగారి సీతారత్నం, శరత్ జ్యోత్స్నా రాణి, త్రివేణి వంగారి, దేవీ ప్రసాద్ జువ్వాడి, కట్టా నరసింహా రెడ్డి, సినీ నిర్మాతలు వై.వి. ఎస్. చౌదరి, మీర్ అబ్దుల్లా, నాట్య గురువు ఎస్.పి. భారతి మొదలైన వక్తలు, కవులు వైవిధ్యమైన అంశాల మీద తమ సాహిత్య ప్రసంగాలను, స్వీయ రచనలను వినిపించారు. వరంగల్ కి చెందిన ప్రొ. రామా చంద్రమౌళి గారికి వంగూరి ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది, సదస్సులో భాగంగా శ్రీమతి బులుసు అపర్ణ చేసిన అష్టావధానం అందరినీ ప్రత్యేకంగా అలరించడమే కాకుండా, మధ్య ప్రాచ్య దేశాలలోనే జరిగిన తొలి అష్టావధానంగా రికార్డ్ ను సృష్టించింది. రెండవ రోజు సాయంత్రం జరిగిన ముగింపు సభలో నిర్వాహకుల తరఫున వందన సమర్పణ కార్యక్రమంలో వదాన్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. దుబై, అబుదాబి, బెహ్రైన్, ఒమాన్, ఖతార్ తదితర ప్రాంతాల తెలుగు సంఘాల అధ్యక్షులు తెలుగు భాషా, సాహిత్యాల పెంపుదలకి తమ వంతు కృషి చేస్తామని వివరించారు. -
షిర్డీలో రాష్ట్రేతర తెలుగు సమాఖ్య తొమ్మిదో సర్వసభ్య సమావేశాలు
సాక్షి, ముంబై: రాష్ట్రేతర తెలుగు సమాఖ్య తొమ్మిదో సర్వసభ్య సమావేశాలు ఈసారి షిర్డీలో జరగనున్నాయి. షిర్డీలోని శాంతికమల్ హోటల్లో ఈ నెల 30, డిసెంబర్ 1వ తేదీల్లో రెండు రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమాల్లో సర్వసభ్య సమావేశాలతోపాటు వివిధ సాంస్కతిక, సాహిత్య కార్యక్రమాలు, మహారాష్ట్రతోపాటు ఇరత రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న తెలుగు శిక్షణా కార్యక్రమాల గురించి చర్చించనున్నారు. ఈ కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మంత్రి సత్యయాదవ్, తెలంగాణ సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యఅతిథులుగా, మండలి బుద్ద ప్రసాద్, తెలంగాణ సాంస్కృతిక విభాగం సంచాలకులు మామిడి హరికృష్ణ, సినీ నటుడు సాయికుమార్ గౌరవఅతిథులుగా హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దేశంలోని 12 రాష్ట్రాల నుంచి 350 మంది సభ్యులు, 100 మంది కళాకారులు, రచయితలతోపాటు మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమి సభ్యులు కూడా పాల్గొననున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు స్థానిక తెలుగు సంఘాలతోపాటు షిర్డీ తెలుగు సంఘం అధ్యక్షుడు మాండవరాజా ఎంతగానో సహకరిస్తున్నారని వెల్లడించారు. ఊరేగింపుతో ప్రారంభం... రాష్ట్రేతర తెలుగు సమాఖ్య కార్యక్రమాలను రెండు కిలోమీటర్ల ఊరేగింపుతో ప్రారంభించనున్నారు. నవంబరు 30వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు శ్రీ సాయినివాస్ హోటల్ మెగా రెసిడెన్సీ నుంచి సభా ప్రాంగణం వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర తెలుగు ఫ్లకార్డులతో ఊరేగింపు జరగనుంది. వివిధ సాహిత్య, సామాజిక కార్యక్రమాల నిర్వహణ రాష్ట్రేతర తెలుగు సమాఖ్య 2015లో ఏర్పాటైంది. ఈ సమాఖ్య వివిధ రాష్ట్రాలలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకూ 18 జాతీయ సదస్సులు, వివిధ నగరాలలో స్థానిక సంస్థల సహకారంతో ప్రతి ఏటా అనేక సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలు, విద్యా సంబంధిత కార్యక్రమాలను చేపడుతోంది. అలాగే ఆంగ్ల భాషా ప్రభావంతో మాతృభాషకు దూరమవుతున్న పిల్లలకు తెలుగు భాష నేర్పేందుకు కూడా కృషిచేస్తోంది. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో స్థిరపడ్డ తెలుగు కవులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలకు ఆయా రాష్ట్రాలతోపాటు వారి స్వరాష్ట్రాలలో గుర్తింపు తీసుకువచ్చే ప్రయత్నం చేయడం, తెలుగు రాష్ట్రాల్లో అందించే పురస్కారాలు వీరికి కూడా అందించేందుకు కృషి చేయడం, రాష్ట్రేతర ప్రాంతాలలో మాతృభాష పరిరక్షణ, తెలుగేతర రాష్ట్రాలలో ప్రభుత్వాలు తెలుగువారికోసం స్థలాలు కేటాయించేలా కృషిచేయడం వంటి ఆశయాలతో ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలో షిర్డీతోపాటు మహారాష్ట్రలోని తెలుగు సంఘాల ప్రతినిధులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షుడు ఆర్ సందుర్ రావు, ప్రధాన కార్యదర్శి పివిపిసి ప్రసాద్‌లు ఓ ప్రకటనలో తెలిపారు. -
శతకాలు : చూడచూడ రుచుల జాడ వేరు
పద్యం తెలుగువారి ఆస్తి. మరో భాషలో లేని ఈ సాహితీశిల్పాన్ని తెలుగువారు తరాలుగా కాపాడుకుంటూ వచ్చారు. పండితుల కోసం, శిష్ట పాఠకుల కోసం ఛందోబద్ధ పద్యాలు ఉంటే పిల్లలూ పామరులూ చెప్పుకోవడానికి శతకాలు ఉపయోగపడ్డాయి. సులభంగా, సరళంగా ఉండే శతక పద్యాలు కాలక్రమంలో ఇంటింటి పద్యాలుగా మారి జీవన మార్గదర్శకాలు అయ్యాయి. వేమన పద్యం రాని తెలుగువాడు లేడన్నది నిన్నటి వరకూ నిత్యసత్యం.‘శతకం’ అంటే వంద అనే అర్థం. అలాగని శతకంలో కచ్చితంగా వంద పద్యాలే ఉండాలని లేదు. అంతకు మించి కూడా రాశారు. పద్యం చివర్లో ‘మకుటం’ ఉండడమే శతకాల విశిష్టత. ‘మకుటం’ అంటే కిరీటం. శతక పద్యంలో దీని స్థానం శిఖరాయమానం. పూర్వ మహాకవులే కాదు, ఇప్పటికీ ఎందరెందరో శతకాలు రాస్తూనే వున్నారు. తమ జీవితంలోని అనుభవాల నుంచి, అనుభూతుల నుంచి, ఇష్టదైవాల గురించి, ప్రియమైన వ్యక్తుల గురించి, భావోద్వేగాల నుంచి వందల కొద్దీ శతకాలు పుట్టిస్తున్నారు.శతక పద్యాలకు నన్నయ ఆద్యుడంటారు. ‘బహువన పాదపాబ్ది... అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడున్’ అనే పద్యాలు నన్నయగారి భారతంలోని ‘ఉదంకోపాఖ్యానం’లో ఉంటాయి. ‘అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడున్’ అనే మకుటంతో నాలుగు పద్యాలు ముగుస్తాయి. ఈ పద్యాలన్నీ వరుసగా ఉంటాయి. అలా పద్యంలో ‘మకుటం’ పురుడు పోసుకుందని చెబుతారు. శతక పద్యాలకు ఎవరు ఆద్యులు అనేది పక్కనపెడితే నన్నయ నుంచి నేటి వరకూ వందల సంవత్సరాల నుంచి శతకాలు బతుకుతూనే ఉన్నాయి, బతికిస్తూనే ఉన్నాయి.తెలుగు నేలపై ఎన్నో శతక పద్యాలు వ్యాప్తిలో ఉన్నప్పటికీ వేమన పద్యాలే మకుటాయమానంగా నిలుస్తున్నాయి. బద్దెన కూడా అంతే ప్రసిద్ధుడు. ఆయన రాసిన సుమతీ శతకం తెలుగువారికి సుపరిచయం. అలాగే భర్తృహరి సుభాషితాలు సుప్రసిద్ధం. ‘సుభాషితాలు’ అంటే మంచి వాక్కులు అని అర్థం. ఇవన్నీ సంస్కృతంలో ఉంటాయి. వీటిని తెనిగించి మనకు అందించిన మహనీయులు ముగ్గురు. వారు ఏనుగు లక్ష్మణకవి, ఏలకూచి బాల సరస్వతి, పుష్పగిరి తిమ్మన. ఇక భక్త రామదాసు రాసిన దాశరథీ శతకం, మారన కవి రాసిన భాస్కర శతకం, ధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకం, నృసింహకవి కలం నుంచి జాలువారిన శ్రీకృష్ణ శతకం, శేషప్పకవి రాసిన నరసింహ శతకం, కుమార శతకం, కాసుల పురుషోత్తమకవి విరచితమైన ఆంధ్ర నాయక శతకం... ఇలా ఎన్నెన్నో శతకాలను, శతకకారులను చెప్పుకోవచ్చు. అన్నీ మణిమాణిక్యాలే, జీవితాలను చక్కదిద్దే రసగుళికలే.శతకాలు ఎందుకు నిలబడ్డాయి? అలతి అలతి పదాలతో లోకహితమైన సాహిత్య సృష్టి వాటిలో జరిగింది కనుక. సమాజంలోని దురాచారాలను, చాదస్తాలను, మూఢవిశ్వాసాలను మూకుమ్మడిగా ఖండిస్తూ జనానికి వాటిలో జ్ఞానబోధ జరిగింది కనుక. మానవ నైజంలోని విభిన్న రూపాల ఆవిష్కరణ జరిగి తద్వారా మేలుకొల్పు కలిగింది కనుక. ఫలితంగా సద్భక్తి భావనలు కలిగి, తల్లిదండ్రులు, గురువులు, పెద్దల యెడ మనుషులకు గౌరవ మర్యాదలు పెరిగాయి కనుక. నీతులు, లోకరీతులు తెలిశాయి కనుక. అందువల్లే జనులు వాటిని చేరదీశారు. తోడు చేసుకున్నారు. ఇలాంటి పద్యాలు మానసికంగా, శారీరకంగా వికసించే బాల్యంలో పిల్లలకు ఎంతో అవసరమని పెద్దలు భావించారు కాబట్టి శతకాలు నాటి కాలంలో బట్టీ వేయించేవారు. ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు చూడ చూడ రుచుల జాడ వేరుపురుషులందు పుణ్య వేరయావిశ్వదాభిరామ వినుర వేమ – (వేమన )తాత్పర్యం : చూడడానికి ఉప్పు, కర్పూరం ఒకేలా కనిపిస్తాయి. కానీ వాటి రుచులు వేరు. అట్లే, మనుషులంతా ఒకేరకంగా వున్నా, అందులో పుణ్యపురుషులు అంటే గొప్పవారు వేరు.అడిగిన జీతం బియ్యనిమిడిమేలపు దొరను కొల్చి మిడుగుట కంటెన్వడి గల యెద్దుల కట్టుక మడి దున్నుక బ్రతకవచ్చు మహిలో సుమతీ– (బద్దెన)తాత్పర్యం: మంచి జీతం ఇవ్వని యజమానిని నమ్ముకొని కష్టాలు పడేకంటే మంచి ఎద్దులను నమ్ముకొని పొలం దున్నుకుంటూ, సొంతంగా వ్యవసాయం చేసుకుంటూ హాయిగా బతుకవచ్చు.ఇలా ఎన్నో పద్యాలను తలచుకోవచ్చు. వ్యక్తిత్వ వికాసం జరగాలంటే శతక పద్యాలు చదువుకోవాలి. శతకాలను బతికించుకుంటే అవి మనల్ని బతికిస్తాయి.– మా శర్మ, సీనియర్ జర్నలిస్ట్ -
టాంపలో నాట్స్ బోర్డ్ సమావేశం సంబరాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తెలుగు వారికి మరింత చేరువయ్యేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై దృష్టిపెట్టింది. టాంపాలో జరిగిన నాట్స్ బోర్డు సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించింది. ముఖ్యంగా ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే అమెరికా తెలుగు సంబరాలను వచ్చే ఏడాది జులైలో టాంపాలో నిర్వహించనుంది.దీనికి సంబంధించిన కార్యచరణ, ప్రణాళికకు సంబంధించి నాట్స్ బోర్డ్ సభ్యులు, నాట్స్ చాప్టర్ విభాగ నాయకులు తమ అమూల్యమైన సలహాలు, సూచనలు అందించారు.. నిధుల సేకరణ, కార్యక్రమాల నిర్వహణ, స్థానిక తెలుగు సంస్థల సహకారం వంటి అంశాలపై ఈ సమావేశంలో సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అలాగే నాట్స్ కొత్త చాప్టర్లలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, నాట్స్ సభ్యత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పటిష్టమైన కార్యాచరణను ఈ సమావేశంలో రూపొందించారు. నాట్స్ జీవిత కాల సభ్యత్వాన్ని ప్రోత్సహించేలా నాట్స్ నాయకులు కృషి చేయాలని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని కోరారు. కొత్త చాప్టర్లు నాట్స్ జాతీయ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫుడ్ డ్రైవ్, కాపీ విత్ కాప్, హైవే దత్తతలాంటి కార్యక్రమాలను నిర్వహించాలని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి అన్నారు. టాంపలో జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయం చేసేందుకు నాట్స్ చాప్టర్ నాయకులు తమ వంతు కృషి చేయాలని కోరారు. అమెరికాలో జరిగే ఈ అతి పెద్ద తెలుగు పండుగకు చాప్టర్ల నాయకులు తమ ప్రాంతాల్లో తెలుగు కుటుంబాలను ఆహ్వానించి సంబరాల సంతోషాన్ని పంచుకునే అవకాశాన్ని అందరికి కల్పించాలన్నారు. ఇంకా నాట్స్ బోర్డు సమావేశంలో నాట్స్ బోర్డ్ మాజీ చైర్ పర్సన్ అరుణ గంటి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్లు గంగాధర్ దేసు, మోహనకృష్ణ మన్నవ, బాపు నూతి, శ్రీనివాస్ మంచికలపూడి, రాజేంద్ర మాదల, నాట్స్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు శ్రీహరి మందాడితో పాటు నాట్స్ కార్యవర్గ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.టాంప కన్వన్షన్ సెంటర్‌ను పరిశీలించిన నాట్స్ బృందంఔరా అనిపించేలా అమెరికా తెలుగు సంబరాల వేదిక. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నిర్వహించే అమెరికా తెలుగు సంబరాలు ఈసారి టాంప వేదికగా జులై 4, 5, 6 తేదీల్లో జరగగున్నాయి. ఈ సంబరాలకు సంబంధించిన వేదికను నాట్స్ జాతీయ నాయకులు, టంపా నాట్స్ విభాగం బృంద సభ్యులు పరిశీలించారు. సంబరాలకు వేదిక అద్భుతంగా ఉండాలనే సంకల్పంతో నాట్స్ టంపా విభాగం 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన టంపా కన్వెన్షన్ సెంటర్‌ను ఎంచుకుంది. హిల్స్‌బరో నది ఒడ్డున అద్భుతమైన ప్రకృతి రమణీయతల మధ్య ఈ కన్వెన్షన్ సెంటర్ ఉండటం పై నాట్స్ జాతీయ నాయకత్వం హర్షం వ్యక్తం చేసింది. ఈ సెంటర్ పక్కన అతిధ్యానికి తిరుగులేదనిపించేలా ఉన్న హోటల్స్, దగ్గరల్లోనే టూరిజం స్పాట్లు ఉన్నాయని నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు 2025 కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ తెలిపారు. అమెరికాలో ఉండే ప్రతి తెలుగు కుటుంబం సంబరాల్లో పాలుపంచుకోవాలని ఈ సందర్భంగా గుత్తికొండ పిలుపునిచ్చారు. సంబరాలను దిగ్విజయం చేసేందుకు నాట్స్ సభ్యులందరం కలిసి కృషి చేద్దామని ఆయన కోరారు. హద్దులు లేని ఆనందాల కోసం ఆత్మీయ, అనుబంధాలను పంచుకునేందుకు అమెరికా తెలుగు సంబరాలకు తెలుగువారు తరలిరావాలని శ్రీనివాస్ గుత్తికొండ ఆహ్వానించారు.నాట్స్ అమెరికా తెలుగు సంబరాల బృందం ఇదే..!నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణలో శ్రీనివాస్ మల్లాది, సుధీర్ మిక్కిలినేని, భాను ధూళిపాళ్ల, రాజేష్ కాండ్రు, జగదీష్ చాపరాల, మాలినీ రెడ్డి, అచ్చిరెడ్డి, ప్రసాద్ ఆరికట్ల, విజయ్ కట్టా, సుధాకర్ మున్నంగి లు సంబరాల వివిధ కమిటీల బాధ్యతలు తీసుకుని సంబరాలను దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నారు. బిందు బండా, సుమంత్ రామినేని, సురేష్ బుజ్జా, శ్రీనివాస్ బైరెడ్డి, మాధురి గుడ్ల, రవి కానూరి, ప్రసాద్ కొసరాజు, భరత్ ముద్దన, సతీష్ పాలకుర్తి, రవి కలిదిండి, కృష్ణ భగవరెడ్డి, శ్యామ్ తంగిరాల, మాలినీ రెడ్డి తంగిరాల, మధు తాతినేని, మాధవి యార్లగడ్డ, రామ కామిశెట్టి, అనిల్ అరమండ, భాస్కర్ సోమంచి, శివ తాళ్లూరి, ప్రసన్న కోట, ప్రహ్లాదుడు మధుసూదుని, శిరీషా దొడ్డపనేని, రవి కానూరు, కిరణ్ పొన్నం, వీర జంపాని, సుధీర్(నాని) వాలంటీర్లు ఈ సంబరాల విజయం కోసం తమ వంతు కృషి చేయనున్నారు.(చదవండి: టాంపలో ఘనంగా సంబరాల గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్) -
టాంపలో ఘనంగా సంబరాల గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్రతి రెండేళ్లకు ఒక్కసారి ఘనంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు టాంప లో శంఖారావం పూరించింది. గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్ ఏవీ ద్వారా సంబరాలు ఎలా జరగనున్నాయనేది చాటిచెప్పింది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలు, స్థానిక తెలుగు కళాకారులతో నృత్య ప్రదర్శనలు.. మ్యూజిక్ షోలతో టంపాలో తెలుగువారికి గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్ మంచి కిక్ ఇచ్చింది. వచ్చే జులై 4, 5, 6 తేదీల్లో జరగనున్న అమెరికా తెలుగు సంబరాలకు ట్రైలర్‌లా కిక్ ఆఫ్ ఈవెంట్ జరిగింది. దాదాపు 1500 మంది తెలుగువారు ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. టాంప లో జరగనున్న అతి పెద్ద తెలుగు సంబరానికి అమెరికాలో ఉండే ప్రతి కుటుంబం తరలిరావాలని నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ పిలుపు నిచ్చారు. తెలుగువారందరిని కలిపే వేదిక.. తెలుగువారికి సంతోషాలు పంచే వేదిక అమెరికా తెలుగు సంబరాలు అని ఈ అవకాశాన్ని ప్రతి తెలుగు కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని కోరారు. తెలుగు రాష్ట్రాల నుంచి అతిరథ మహారథులు, సినీ స్టార్లు, సంగీత, సాహిత్య ఉద్దండులు, కళాకారులు పాల్గొనే సంబరాల్లో అమెరికాలో ఉండే తెలుగువారంతా పాల్గొనాలని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి పిలుపునిచ్చారు. టాంప సంబరాల గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్‌కు నాట్స్ జాతీయ నాయకులు కూడా తరలివచ్చారు.స్థానిక డ్యాన్స్ స్కూల్స్ సబ్రిన (గణేశస్తోత్రం, కౌత్వం) , సరయు, లీలా టాలీవుడ్ లేడీస్ డాన్స్, మాధురి (తిల్లానా), శివం గర్ల్స్, సరయు(తమన్ మెడ్లీ), సబ్రిన(అన్నమయ్య కీర్తన),శివం(మస్తీ) చేసిన డ్యాన్స్ అందరిలో ఉత్సాహం నింపింది. సాకేత్ కొమాండూరి, మనీషా ఈరబత్తిని, శృతి రంజనీలు తమ గాన మాధుర్యంతో చక్కటి తెలుగుపాటలు పాడి ప్రేక్షకులను అలరించారు. సాహిత్య వింజమూరి తన యాంకరింగ్ తో ఈ ఈవెంట్లో మెప్పించారు. ఈ సారి టాంపాలో జరిగే సంబరాల ప్రత్యేకత ఏమిటీ అనే దానిపై రూపొందించిన ట్రైలర్ ని ముఖ్యఅతిథిగా విచ్చేసిన తమన్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ అందరిని ఆకట్టుకుని సంబరాలపై అంచనాలను పెంచింది. చక్కటి తెలుగు ఇంటి భోజనం కూడా గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్‌కు వచ్చిన తెలుగువారి చేత ఆహా అనిపించింది. అనంతరం, నాట్స్ బోర్డ్ సెక్రటరీ మధు బోడపాటి, నాట్స్ గౌరవ సభ్యులను, గత అధ్యక్షులను, డైరెక్టర్స్ ను వేదికపైకి ఆహ్వానించారు.టాంప నాట్స్ నాయకులు రాజేశ్ కాండ్రు నాట్స్ చాప్టర్ల నాయకులను, కార్యవర్గ సభ్యులను వేదిక మీదకు ఆహ్వానించారు. అలాగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో పాలుపంచుకునే టాంప స్థానిక తెలుగు సంఘలైన టీఏఎఫ్, మాటా, టీజీఎల్ఎఫ్, టీటీఏ, ఎఫ్ఐఏ, హెచ్టీఎఫ్ఎల్, సస్త, ఐటీ సర్వ్ సంస్థల ప్రతినిధులను గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్ వేదికపై పరిచయం చేశారు. గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్లో ముఖ్యగా టాంప లో స్థానిక కళాకారుల డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది. గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్ వేదికపై థమన్‌తో పాటు ఈవెంట్‌కు వచ్చిన ప్రముఖులను నాట్స్ సత్కరించింది. నాట్స్ సభ్యులు, దాతల నుంచి అమెరికా తెలుగు సంబరాలకు 2.5 మిలియన్ డాలర్ల విరాళాలు ఇచ్చేందుకు హామీ లభించింది.(చదవండి: మానసిక ఆరోగ్యం పై నాట్స్ అవగాహన సదస్సు) -
తెలుగు వారి గురించి నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు: నటి కస్తూరి
హిందూ పీపుల్స్ పార్టీ ఆఫ్ తమిళనాడు తరపున బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ నటి కస్తూరి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇదే వేదికపై ఆమె తెలుగు వారి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో నివశిస్తున్న తెలుగు ప్రజలను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో క్లారిటి ఇస్తూ ఒక పోస్ట్ చేశారు.'నేను తెలుగు వారికి వ్యతిరేకంగా మాట్లాడాను అంటూ డీఎంకే పార్టీకి చెందిన వారు ఫేక్ ప్రచారాలకు తెరలేపారు. తెలుగు గడ్డ నా మెట్టినిల్లుతో సమానం. తెలుగు ప్రజలందరూ నా కుంటుంబం అనే భావిస్తాను. ఈ విషయం తెలియని కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారు. నిన్నటిరోజున నేను చేసిన వ్యాఖ్యలను తమిళ మీడియాలో తప్పుగా వక్రీకరిస్తూ చెబుతున్నారు. ఈ ట్రాప్‌లో తెలుగు మీడియా పడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆంధ్ర,తెలంగాణ ప్రజలు ఎంతోమంది నాపై ప్రేమ చూపుతున్నారు. దాని నుంచి నన్ను వేరు చేసేందుకే ఈ కుట్రను అమలు చేస్తున్నారు. ఇలా నాపై నెగెటివిటీ తీసుకొచ్చి నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు.' అని తెలిపింది.సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తమిళనాడుకు తెలుగు వారు వచ్చారని కస్తూరు వ్యాఖ్యలు చేసింది. అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆమె కామెంట్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అలా అయితే, ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి తెలుగువారు ఎవరు..? అని ఆమె ప్రశ్నించారంటూ తమిళనాట వార్తలు వస్తున్నాయి. -
మా వైపే బెదిరింపు వస్తుంది సార్!
-
'ఓవర్ యాక్టింగ్ ఆపమన్న నిఖిల్'.. వార్‌ను తలపించిన బిగ్‌బాస్ హౌస్!
వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత బిగ్‌బాస్ షో కాస్తా రసవత్తరంగానే సాగుతోంది. కొత్త, పాత నీరు కలవడంతో పోటాపోటీగా హౌస్‌లో హల్చల్ చేస్తున్నారు. ఇక నామినేషన్స్ టైమ్‌లో అయితే కంటెస్టెంట్స్ ఓ రేంజ్లో ఫైరవుతున్నారు. గతవారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ మెహబూబ్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక సోమవారం వచ్చిందంటే చాలు నామినేషన్స్ గొడవ మొదలైనట్లే. అలా ఈ వారంలో గౌతమ్, నయని, హరితేజ, యష్మి, తేజ నామినేషన్స్‌లో ఉన్నారు.ఇక నామినేషన్స్ గోల ముగియడంతో ఈ రోజు టాస్క్‌ల గోల మొదలైంది. తాజాగా విడుదలైన ప్రోమోలో పానిపట్టు యుద్ధం అంటూ హౌస్‌మేట్స్‌కు సరికొత్త పోటీ పెట్టాడు బిగ్‌బాస్. నీళ్ల ట్యాంకుల టాస్క్ ఇవ్వడంతో హౌస్మేట్స్ పోటాపోటీగా పాల్గొన్నారు. ఇక టాస్క్‌లో భాగంగా నిఖిల్ రెచ్చిపోయాడు. యష్మితోపాటు ఇద్దరి చేతులను పట్టుకుని లాగాడు. దీంతో గౌతమ్ నీకసలు బుద్ది ఉందా? అంటూ నిఖిల్‌ను హెచ్చరించాడు. సంచాలక్‌కు రెస్పెక్ట్ ఇవ్వరా? అంటూ యష్మి మండిపడింది.టాస్క్ కాస్తా దారి మళ్లీ గౌతమ్, నిఖిల్ మధ్య తీవ్ర గొడవకు దారితీసింది. నీకసలు సెన్స్ ఉందా? అంటూ గౌతమ్ అనడంతో నిఖిల్ మరింత ఫైరయ్యాడు. ఆపు నీ ఓవర్ యాక్టింగ్ అని నిఖిల్ చెప్పడంతో.. నీది ఓవర్ యాక్టింగ్ గౌతమ్ మీదికి దూసుకెళ్లాడు. ఈ గొడవ ఇద్దరు చివరికీ కొట్టుకునే దాకా వెళ్లడంతో అవినాశ్, పృథ్వీ వారిని నిలువరించారు. ఈ టాస్క్ గోల పూర్తిగా తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూసేయండి. -
సామాన్యుల భాషలో... సన్నిహితమైన న్యాయం
మన దేశంలోని అన్ని హైకోర్టుల్లో అధికారికంగా వాడేది ఇంగ్లీషు భాష. కానీ కేసులో గెలిచినవాడు, ఓడిన సామాన్యుడు కూడా తమ గెలుపోటములకు కారణాలు అర్థం చేసుకోలేని పరిస్థితి. అందుకే తీర్పుల్లోని కారణాలు అర్థమయ్యే భాషలో తెలియ జేసి, సామాన్యుడికి న్యాయ వ్యవస్థ చేరువ కావాలనే సదుద్దేశ్యంతో సుప్రీంకోర్టు, దేశంలోని అన్ని హైకోర్టులు వారి తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించి, ఉచితంగా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తాము ఇంగ్లీషులో వెలువరించే ముఖ్యమైన తీర్పులను తెలుగులోకి అనువాదం చేయించే ప్రక్రియను యుద్ధ ప్రాతి పదికన చేపట్టింది. తదనుగుణంగా ఇంగ్లీషు నుండి తెలుగులోకి తర్జుమా చేయటానికి విశ్రాంత ఉద్యోగులు, విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయవాదుల సేవలు వినియోగించుకుంటోంది. అనువాదకుల కొరత మూలాన ప్రస్తుతానికి ముఖ్యమైన తీర్పులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అనువాదకుల సేవలు ఉచితంగా స్వీకరించటం లేదు. వారి సేవలకు గాను, హైకోర్టు ప్రతి పేజీకి మూడు వందల రూపాయలు చెల్లిస్తుంది. ఇంగ్లీషులో వెలువరించిన తీర్పుల కాపీలను వారి ఇంటి దగ్గరే అనువాదం చేసి, సహేతుకమైన సమయంలో అను వాదాన్ని హైకోర్టులోని సంబంధిత అధికారులకు స్వయంగా అందజేయడం లేదా ఆన్లైన్లో పంపించటం అనువాదకుల పని. ఈ కార్యక్రమ సక్రమ నిర్వహణ కోసం హైకోర్టు తన పరిపాలనా భవనంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ విభాగంలో తెలుగు భాషపై పట్టున్న ఇద్దరు విశ్రాంత జిల్లా న్యాయమూర్తులను ఎడిటర్, డిప్యూటీ ఎడిటర్‌గా; ఒక విశ్రాంత సీనియర్ సివిల్ జడ్జిని రిపోర్టర్‌గా నియామకం చేసింది. ఇంగ్లీషు నుండి తెలుగులోకి ప్రైవేటు అనువాదకులు తర్జుమా చేసిన∙ముఖ్యమైన తీర్పులను జాగ్రత్తగా పరిశీలించి, ప్రతి తీర్పుకు అందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలను జోడించి, వాటిని తెలంగాణ హైకోర్టు వెబ్సైట్లో నెల వారీగా పెట్టవలసిన బాధ్యత వీరికి అప్పగించింది. వెబ్‌సైట్‌ను 2024 ఆగస్టు 15న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ముఖ్య మైన తీర్పుల తెలుగు ప్రతులను ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని చదువుకునే అవకాశం కల్పించారు. అనువాదకులను శాశ్వత ప్రాతిపదికన నియమించుకోడానికి, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు అనుమతి ఇచ్చింది. 25 తెలుగు అనువాదకులు, 10 డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 5 తెలుగు టైపిస్ట్ పోస్టులను కూడా మంజూరు చేసింది. త్వరలో హైకోర్టు ఈ పోస్టులను భర్తీ చేసే అవకాశం లేకపోలేదు. తెలుగు అనువాదకులు దొరకటం అంత సులభమేమీ కాదు. ఎందుకంటే తెలంగాణ సచివాలయంలో కూడా ఈ కొరత ఉందని తెలుస్తోంది.మరో విషయమేమంటే ప్రతి పౌరుడికీ హైకోర్టు వెబ్సైట్ ద్వారా ముఖ్యమైన తెలుగు తీర్పులను డౌన్ లోడ్ చేసుకునే సౌలభ్యం ఉందనే విషయం తెలియ జేయాలనే ఆశయంతో... జిల్లా న్యాయమూర్తులు, జిల్లా, మండల న్యాయ సేవాధికార సంస్థలు; సంబంధిత జిల్లా ప్రభుత్వ అధికారులు న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా ప్రచారం కల్పించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతగా ప్రచారం కల్పించినా తెలుగులో తీర్పులు చదువుకోవాలనుకునే విషయం, అది ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉందనే విషయం అంత సులువుగా సామాన్యుడికి తెలియక పోవచ్చు. అవగాహన కల్పించటానికి సకల ప్రయత్నాలు చేయటానికి న్యాయ వ్యవస్థ గట్టిగానే కృషి చేయాలి. దీనికి న్యాయవాదుల పాత్ర పరిమితమని అనుకోవద్దు. ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కక్షిదారులు తాము దాఖలు చేసిన కేసుల్లో న్యాయ మూర్తులు ఇంగ్లీషులో వెలువరించిన తీర్పులను తమ భాషలో చదివి అర్థం చేసుకొని సంతృప్తి పడాలనే దృక్పథం. అనువాదం అంటే ప్రస్తుత కాలంలో ఎవరికీ అర్థం కాని పూర్తి గ్రాంథిక భాషా ప్రయోగం చేయకుండా, వ్యవహారిక భాషను వాడాలనీ, అవసరమైతే దైనందిన ఇంగ్లీషు పదాలను అదే విధంగా వాడాలనీ హైకోర్టు సూచన చేసింది. టెక్నాలజీ అతి వేగంగా దూసుకుపోతున్న ప్రస్తుత కాలంలో, ఇప్పటికే హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్లలో రికార్డ్ చేసిన సాక్ష్యాల నకళ్ళను అప్పటికప్పుడు ఇరు పక్షాలకు ఉచితంగా అందజేసే ఏర్పాటు ఉంది. అదే విధంగా హైకోర్టు రిజిస్ట్రీ జోక్యం లేకుండా, తీర్పు చెప్పిన రోజే తీర్పు ప్రతిని ఇరుపక్షాలకు కోర్టులోనే ఉచితంగా అందజేయాలి. దిగువ కోర్టుల్లో కూడా సివిల్, క్రిమినల్ తీర్పు అనే భేదం లేకుండా, ఇదే పద్ధతి పాటించడానికి ఎటువంటి ఆటంకం ఉండకపోవచ్చు. అయితే నూటికి నూరు శాతం తీర్పుల తెలుగు అనువాదం సరైనది లేదా తప్పులు లేనిదని చెప్పలేం. ఈ తెలుగు తీర్పుల అనువాదం కేవలం చదువుకొని అర్థం చేసుకోవడానికి మాత్రమే పరిమితం. తెలుగు అనువాదం ఆధారంగా ఎవరు కూడా తప్పొప్పులు ఎంచి దానిపై అప్పీళ్ళు వేసే అవకాశం లేదు. ఇందు కోసం హైకోర్టు వెబ్సైట్లో డిస్ క్లెయిమర్ కూడా చొప్పించారు.తడకమళ్ళ మురళీధర్ వ్యాసకర్త విశ్రాంత జిల్లా జడ్జిమొబైల్: 98485 45970 -
కన్నీళ్లు ఆపుకోలేకపోయిన టేస్టీ తేజ.. అమ్మలా ఓదార్చిన గంగవ్వ!
తెలుగు బుల్లితెర రియారిటీ షో బిగ్‌బాస్ సినీ ప్రియులను అలరిస్తోంది. ఈ సారి దీపావళి ఫెస్టివల్ కావడంతో సన్డే ఎపిసోడ్‌ను కాస్తా ఫన్డే మార్చేశారు. ఇంటి సభ్యులతో సరదా పంచులు, డైలాగ్స్‌తో సందడి చేశారు. ఇవాల్టి ఎపిసోడ్లో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గెస్ట్‌గా వచ్చాడు. హౌస్‌మేట్స్‌పై తనదైన స్టైల్లో పంచులు వేస్తూ అలరించాడు. విష్ణు ప్రియ, టేస్టీతేజ, ముక్కు అవినాశ్, రోహిణితో సహా పలువురిపై పంచ్ డైలాగ్స్ వేశాడు.తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే హౌస్‌మేట్స్‌కు ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. హౌస్‌ను ఫుల్ ఎమోషనల్‌గా మార్చేశాడు. ఇద్దరు హౌస్‌మేట్స్‌ను పిలిచి వారి కుటుంబ సభ్యుల ఫోటోలను చూపించాడు. వారిలో ఒక్కరికి మాత్రమే తన ఫ్యామిలీ సభ్యులు పంపిన మేసేజ్ చూసే అవకాశముందని నాగార్జున చెప్పాడు. దీంతో గంగవ్వ, టేస్టీ తేజకు మీలో ఎవరో ఒకరే తేల్చుకోవాలంటూ ఆదేశించాడు.దీంతో గంగవ్వ, టేస్టీ తేజ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. గంగవ్వను పట్టుకుని ఏడ్చేశాడు. టేస్టీ తేజను సైతం గంగవ్వ ఓదారుస్తూ కనిపించింది. ఫుల్ ఫన్ ఎపిసోడ్ అంటూ చివరికీ వచ్చేసరికి హౌస్‌మేట్స్‌ను ఏడ్పించేశాడు బిగ్‌బాస్. చివరికీ ఏ హౌస్‌మేట్ తన కుటుంబ సభ్యులు పంపిన సందేశం చదివారో తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూడాల్సిందే. ఇప్పుడైతే ఈ ప్రోమో చూసి ఎంజాయ్ చేయండి. -
హౌస్‌లో గొడవపడ్డ కంటెస్టెంట్స్.. కొట్టుకునేలా ఉన్నారుగా!
ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను బిగ్‌బాస్ సీజన్-8 అలరిస్తోంది. తెలుగులో బిగ్‌బాస్- 8 ఏడో వారం కొనసాగుతోంది. వెల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత ఈ రియాలిటీ షో మరింత రసవత్తరంగా మారింది. పాత, కొత్త కంటెస్టెంట్స్ అంతా కలిసి హౌస్‌ను హాట్‌హాట్‌గా మార్చేశారు. ఇప్పటికే రెండు టీమ్‌లుగా రాయల్, ఓజీగా విడిపోయిన కంటెస్టెంట్స్ టాస్కుల్లో ఒకరిని మించి ఒకరు పోటీపడుతున్నారు. అయితే హౌస్‌లో మెగా చీఫ్ కంటెండర్‌గా గంగవ్వ ఛాన్స్ కొట్టేసింది.బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న రాయల్ టీమ్‌ను ఓవర్ స్మార్ట్ఫోన్లుగా, ఓజీ టీమ్‌ను ఓవర్ స్మార్ట్ చార్జర్లుగా విభజించారు. హౌస్ అంతా రాయల్ టీమ్ ఆధీనంలో, గార్డెన్ ఏరియా ఓజీ టీమ్ ఆధీనంలో ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు. కిచెన్, బెడ్రూమ్, వాష్‌రూమ్ వంటి వసతులు అందిస్తూ ఛార్జింగ్ పొందవచ్చని తెలిపాడు. ఆ సంగతి అలా ఉంచితే ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన తాజా ప్రోమో విడుదలైంది. ఇందులో హౌస్మేట్స్ అంతా సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. అయితే ఓవర్ స్మార్ట్ చార్జర్స్ టీమ్‌లో ఉన్న మణికంఠ, పృథ్వీ ఓ విషయంలో గొడవపడ్డారు. మాటమాట పెరిగి ఒకరి మీదికి ఒకరు దూసుకెళ్లారు. నీ యాటిట్యూడ్ తగ్గించుకో అని మణికంఠ అనడంతో పృథ్వీకి మరింత కోపమొచ్చింది. ఆ గొడవ మరింత ముదరడంతో చివరికీ హౌస్మేట్స్ అంతా కలిసి వారిద్దరిని నిలువరించారు. ఈ ప్రోమో ఫుల్ ఎపిసోడ్ ఇవాళ రాత్రి ప్రసారం కానుంది. -
ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష తనదైన ముద్ర
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు భాష గొప్పదని.. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేసిన భాష అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. గురువారం తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగును మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్న వారందరినీ అభినందిస్తున్నానని పేర్కొన్నారు. అలాగే తెలుగు ప్రజలందరికీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు అనేది కేవలం భావవ్యక్తీకరణ కోసం ఉపయోగించే ఒక భాష మాత్రమే కాదని.. యుగయుగాలుగా కవుల ఊహలకు రెక్కలు కట్టి, మన పండితుల జ్ఞానానికి పదును పెట్టిన మన జాతి ప్రాచీన వారసత్వానికి ప్రాణం అని పేర్కొన్నారు. తెలుగు ప్రాముఖ్యతను, విశిష్టతను మరింతగా ఇనుమడింపజేయడానికి తమ ప్రభుత్వం అంకితభావంతో పని చేస్తోందని చెప్పడానికి గర్వపడుతున్నానని అమిత్ షా స్పష్టం చేశారు. అలాగే తెలుగు వారందరికీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. -
తెలుగు రాష్ట్రాల్లో భక్తులతో పోటెత్తిన ఆలయాలు ... భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాలు (ఫోటోలు)
-
వరలక్ష్మి పూజలో తెలుగు సీరియల్ బ్యూటీస్ (ఫొటోలు)
-
చీరలో కుందనపు బొమ్మలా బిగ్ బాస్ ప్రియాంక సింగ్ (ఫొటోలు)
-
Monal Gajjar: వర్షంలో బిగ్‌బాస్ బ్యూటీ ఆటలు (ఫోటోలు)
-
దాశరథి స్మృతి
పూపరిమళాన్ని వెదజల్లే అగ్నిశిఖలాంటివాడు దాశరథి. చైత్రరథాలను తోలుతూనే, అభ్యుధయ పంథా సాగాడు. ఋతురాగాలను వర్ణిస్తూనే, ‘నిరుపేదవాని నెత్తురు చుక్కలో’ విప్లవాలను కాంచాడు. ‘అంగారమూ శృంగారమూ’ సమపాళ్లలో మేళవించివున్న సుకుమారుడు. ఆకాశమంత ఎదిగిన వామనుడు. స్నానం చేసి మడి కట్టుకున్నాక, సంస్కృతంలో తప్ప తెలుగులో మాట్లాడని సనాతన సంప్రదాయ కుటుంబంలో జన్మించిన దాశరథి– పన్నీటివంటి తెలుగునూ, పసందైన ఉర్దూ గజళ్లనూ ప్రేమించాడు. ‘ఏది కాకతి? ఎవతి రుద్రమ?/ ఎవడు రాయలు? ఎవడు సింగన?/ అన్ని నేనే, అంత నేనే/ వెలుగు నేనే, తెలుగు నేనే’ అని సగర్వంగా ప్రకటించాడు. ఒకప్పటి వరంగల్ జిల్లాలో భాగమైన ఖమ్మంలోని చిన గూడూరులో 1925 జూలై 22న జన్మించిన దాశరథి కృష్ణమాచార్య శతజయంతి సంవత్సరం నేటి నుంచి మొదలవుతుంది.దొరలు, దేశ్ముఖులు, జమీందారులు, జాగీర్దార్ల గుప్పిట సాగుభూములన్నీ ఉన్న రోజుల్లో; ఎర్రకోటపై నిజాం పతాకం ఎగురవేస్తాననీ, బంగాళాఖాతంలో నిజాం కాళ్లు కడుగుతాననీ కాశిం రజ్వీ బీరాలు పలుకుతున్న కాలంలో; హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్ లో కలపడం కోసం తొలుత కమ్యూనిస్టుగానూ, అటుపై స్టేట్ కాంగ్రెస్వాడిగానూ పోరాట పిడికిలి బిగించిన యోధుడు దాశరథి. ‘మధ్యయుగాల రాచరికపు బలా’న్నే తన కవితకు ప్రేరణగా మలుచుకుని సింహగర్జన చేసిన మహాకవి దాశరథి. ‘ఓ నిజాము పిశాచమా! కానరాడు/ నిన్ను బోలినరాజు మాకెన్నడేని/ తీగెలను తెంపి అగ్నిలో దింపినావు/ నా తెలంగాణ కోటిరత్నాల వీణ’ అని నినదించిన ‘అగ్నిధార’ దాశరథి. 1947 ప్రాంతంలో నిజాం పోలీసులు బంధించి తొలుత వరంగల్ సెంట్రల్ జైలుకూ, అనంతరం నిజామాబాద్ జైలుకూ ఆయన్ని తరలించారు. ముక్కిన బియ్యం, ఉడకని అన్నం వల్ల అనారోగ్యానికి గురైనా కవితా కన్యకను విడిచిపెట్టలేదు. కలం కాగితాలు దొరక్కపోయినా జైలు గోడల మీద బొగ్గుతో కవిత్వం రాయడం మానలేదు. తోటి ఖైదీలు పదే పదే చదువుతూ వాటిని కంఠస్థం చేసేవాళ్లు. ‘దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు/ ఊళ్లకూళ్లు అగ్గిపెట్టి ఇళ్లన్నీ కొల్లగొట్టి... పెద్దరికం చేస్తావా మూడు కోట్ల చేతులు నీ/ మేడను పడదోస్తాయి...’ అంటూ ‘ఇదేమాట పదేపదే’ హెచ్చరించాడు.తెలంగాణను కలవరించిన ‘కవిసింహం’ దాశరథి. తెలంగాణ అనే మాటతో మరింకే కవీ ముడిపడనంతగా ముడిపడిన ‘అభ్యుదయ కవిసమ్రాట్’ దాశరథి. ‘కలిపి వేయుము నా తెలంగాణ తల్లి/ మూడు కోటుల నొక్కటే ముడి బిగించి’ అని కోరాడు. ‘తెలంగాణము రైతుదే/ ముసలి నక్కకు రాచరికమ్ము దక్కునే’ అని ప్రశ్నించాడు. ‘నేనురా తెలంగాణ నిగళాలు తెగగొట్టి ఆకాశమంత ఎత్తర్చినానూ’ అని ఘోషించాడు. ‘తెలంగాణమున గడ్డిపోచయును సంధించెను కృపాణమ్ము’ అని కీర్తించాడు. ‘మూగవోయిన కోటి తమ్ముల గళాల/ పాట పలికించి కవిరాజసమ్ము కూర్చి/ నా కలానకు బలమిచ్చి నడపినట్టి/ నా తెలంగాణ కోటిరత్నాల వీణ’ అని పలికాడు. ‘నాడు నేడును తెలగాణ మోడలేదు’ అని ఎలుగెత్తాడు. 1952లో స్థాపించిన ‘తెలంగాణ రచయితల సంఘం’కు మొదటి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. అయినప్పటికీ ‘మహాంధ్ర సౌభాగ్య గీతి’ని చివరిదాకా ఆలపించాడు. ‘సమగ్రాంధ్ర దీపావళి సమైక్యాంధ్ర దీపావళి’ని జరుపుకొన్నాడు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆస్థాన కవిగా వ్యవహరించాడు.ఆంధ్ర నటుల నోట తెలంగాణ మాట ఇప్పుడు కమ్మగా వినిపిస్తున్నదంటే, ఆంధ్ర దర్శకులు తెలంగాణ పలుకుబడిని తమది కానిదని భావించడం లేదంటే– దాశరథి, ఇంకా అలాంటి ఎందరో తెలంగాణ రచయితలు, అటుపై జరిగిన తెలంగాణ ప్రత్యేక ఉద్యమాలు కారణం. దాశరథి లాంటివాళ్లు రెండు రకాల యుద్ధాలు చేశారు. ఉర్దూమయమైన హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడటం కోసం ఒకటి, అది ‘తౌరక్యాంధ్రము’ అని ఈసడించే ఆంధ్రులతో మరొకటి! అయినా దాశరథి తాను రాసిన సినిమా పాటల్లో తెలంగాణ ‘తహజీబ్’ను ‘ఖుషీ ఖుషీగా’ చాటాడు. నిషాలనూ, హుషారులనూ మజామజాగా పాడాడు. అంతేనా? ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో’; ‘నా కంటిపాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలవనీరా’ అంటూ సాటి తెలుగు సినీ గేయరచయితలకు దీటుగా నిలిచాడు.భద్రాద్రి శ్రీరామచంద్రుని సేవలో తరించి దాశరథి అనే ఇంటిపేరును స్థిరం చేసుకున్నదని చెప్పే వంశం వాళ్లది. తమ్ముడు దాశరథి రంగాచార్య కూడా అంతే గట్టివాడైనప్పటికీ మనకు దాశరథి అంటే దాశరథి కృష్ణమాచార్యే. ‘మహాంధ్రోదయం’, ‘పునర్నవం’, ‘కవితాపుష్పకం’, ‘అమృతాభిషేకం’, ‘రుద్రవీణ’, ‘తిమిరంతో సమరం’ వంటి కవితా సంపుటాలు; ‘మహాశిల్పి జక్కన్న’ అనే చారిత్రక నవల;‘యాత్రాస్మృతి’ పేరిట వచన సొగసును తెలిపే ఆత్మకథ వెలువరించాడు. రేడియోలో పనిచేస్తూ లలిత గీతాలు, రేడియో నాటకాలు వినిపించాడు. భక్త రామదాసు మాదిరిగానే ‘దాశరథీ కరుణాపయోనిధీ’ మకుటంతో ‘అభినవ దాశరథీ శతకం’ రచించాడు. చక్కటి గాలిబ్ గీతాలను సరళ సుందరమైన తెలుగులోకి అనువదించాడు. ‘నాదు గుండె గాయము కుట్టు సూదికంట/ అశ్రుజలధార దారమై అవతరించె’ అంటూ గాలిబ్ ఉర్దూ ఆత్మను తెలుగు శరీరంలోకి ప్రవేశపెట్టాడు. ‘రోజూ కనబడే నక్షత్రాల్లోనే/ రోజూ కనబడని కొత్తదనం చూసి/ రోజూ పొందని ఆనందానుభూతి/ పొందడం అంటేనే కవిత్వం’ అని చెప్పిన సౌందర్యారాధకుడు దాశరథి 1987 నవంబర్ 5న అరవై రెండేళ్లకు గురుపూర్ణిమ నాడు పరమపదించాడు. -
బాయ్ ఫ్రెండ్ బర్త్ డే.. హగ్గులతో 'బిగ్‌బాస్' కీర్తి సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఆ తమిళ ఎంపీకి తెలుగుపై ఎందుకంత ప్రేమ?
తమిళనాడుకు చెందిన ఒక ఎంపీ తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం ఆసక్తికరంగా మారింది. పార్లమెంట్ సమావేశాల రెండో రోజు లోక్‌సభలో ఇది చోటు చేసుకుంది. ఇంతకీ ఆయన తెలుగులో ఎందు ప్రమాణం చేశారు? ఆయనకు తెలుగుతో ఉన్న అనుబంధం ఏమిటి?పార్లమెంట్ సమావేశాల రెండవ రోజున కొత్తగా ఎంపీకైన ఎంపీలలోని పలువులు తమ ప్రాంతీయ భాషలలో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తమిళనాడులోని కృష్ణగిరి లోక్‌సభ నుంచి కాంగ్రెస్ తరపున గెలుపొందిన ఎంపీ కే గోపినాథ్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో ఒక రాష్ట్రానికి చెందిన ఎంపీ మరొక రాష్ట్రపు మాతృ భాషలో ప్రమాణ స్వీకారం చేయడం ఏమిటా? అని అందరూ అతనిని ఆసక్తిగా గమనించారు. ఎంపీ గోపినాథ్ ఓ చేతితో రాజ్యాంగ ప్రతిని పట్టుకొని ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రమాణ స్వీకారం చివరిలో జై తమిళనాడు అని తమిళంలో నినదిస్తూ మరో ట్విస్ట్ ఇచ్చారు. ఆయన ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ గోపీనాథ్ తెలుగు కుటుంబానికి చెందిన వారు. కృష్ణగిరి జిల్లా హోసూరు ఆయన స్వస్థలం. గోపీనాథ్ విద్యాభ్యాసం తెలుగులో కొనసాగింది. 2001, 2006, 2011లలో హోసూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వచ్చారు. తమిళనాడులో ఏర్పడిన తెలుగు భాషా సమస్యలతో పాటు, అక్కడి తెలుగు వారి కోసం ఎంపీ గోపీనాథ్ పోరాడారు. తమిళనాడు అసెంబ్లీలోనూ ఆయన పలుమార్లు తెలుగులో ప్రసంగించారు. మాతృభాషపై ఎనలేని మమకారమున్న గోపీనాథ్ మరోమారు పార్లమెంటులోనూ తెలుగులోనే ప్రమాణస్వీకారం చేశారు.కృష్ణగిరి జిల్లా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతుంది. ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్‌కు అతి సమీపంలో ఉంది. దీంతో ఇక్కడి ప్రజలు తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషలను కూడా మాట్లాడుతారు. కాగా గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత కూడా అసెంబ్లీలో తెలుగులో ప్రసంగించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో వివిధ సందర్భాల్లో వైరల్ అవుతుంటుంది. .@INCTamilNadu MP K. Gopinath from the Krishnagiri constituency surprised everyone by taking his oath in #Telugu. pic.twitter.com/ooGgVDg4VH— South First (@TheSouthfirst) June 25, 2024 -
Sreemukhi: రెక్కలు తొడిగిన ముద్దబంతిలా శ్రీముఖి స్టయిల్ (ఫోటోలు)
-
అత్యున్నత ఐదువేలు
దాదాపు నూట నలభై కోట్ల మంది భారతీయుల్లో ఒక పదకొండు వేల మంది తలా వంద రూపాయలు ఇస్తే ఎంతవుతుంది? పోనీ నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల నుంచి, ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజల నుంచి కలిపి వేయిమంది తలా వంద రూపాయలు ఇస్తే ఎంతవుతుంది? లెక్క తరువాత మాట్లాడుదాం.‘సినిమా రంగంలో రచయితకు అత్యంత తక్కువగా డబ్బు ఇవ్వాలని నిర్మాతకు ఎందుకనిపిస్తుందంటే అతను ఖాళీ చేతులతో వస్తాడు కనుక’ అని రచయిత సౌదా అంటాడు. నిజమే. మేకప్ వేసేవాడు పెద్ద కిట్ తెస్తాడు. విగ్గులకు డబ్బు అడుగుతాడు. కాస్ట్యూమ్ డిజైనర్ బోలెడన్ని బట్టలు కొనాలి కనుక బిల్లు ఎక్కువ. సినిమాటోగ్రాఫర్ కెమెరాలు, లెన్సులు, క్రేన్లు, భారీ పరికరాలు... ఇన్ని వాడుతున్నాడంటే అతనికి ఎంతిచ్చినా తక్కువే. కళా దర్శకుడు వేసే సెట్ కనిపిస్తుంది.మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వాద్యాల బృందం కనిపిస్తుంది. మరి రచయిత దగ్గరో? ఒక తెల్లకాగితం, పెన్ను. ఐదు రూపాయల పెన్ను జేబులో పెట్టుకుని వచ్చేవాడికి, కాగితం మీద అప్పటికప్పుడు రాసిచ్చి వెళ్లేవాడికి డబ్బు ఇవ్వడం అవసరమా అని నిర్మాతకేం ఖర్మ, ఎవరికైనా అనిపిస్తుంది. చిత్రమేమిటంటే సినిమా ‘సీన్ పేపర్’ నుంచే మొదలవుతుంది. దానిని రచయితే రాయాలి.తన దగ్గరకు వచ్చిన ఆసామీకి టీ ఇచ్చి, అతను తాగి కప్పు దించే లోపలే పాట రాసి ఇచ్చాడట ఆత్రేయ. ‘ఐదు నిమిషాల్లో రాశారు. దీనికింత డబ్బు ఇవ్వడం అవసరమా’ అన్నాడట ఆసామీ లాల్చీ జేబులో చేయి పెట్టి నసుగుతూ. ఆత్రేయ మొహమాటపడక డబ్బు అందుకుని ‘ఈ ఐదు నిమిషాల వెనుక ముప్పై ఏళ్ల తపస్సు ఉంది నాయనా’ అన్నాడట. రచయిత చేతికి పని చెప్పే మెదడు ఉందే, అది రాతకు తయారుగా ఉందే, ఆ మెదడు అలా తయారు కావడానికి రచయిత ఏమేమి చేసి ఉంటాడు? ఎన్ని రాత్రులను పుస్తకాలు చదువుతూ తగలెట్టి ఉంటాడు? ఎన్ని తావుల్లో తిరుగుతూ మనుషుల్లో పాత్రలను వెతుకుతూ వారి చెమట, కన్నీరు, రక్తపు చారికలు పూసుకుని ఉంటాడు? వారి సద్బుద్ధుల చందనంలో, దుర్బుద్ధుల దుర్గంధంలో వారే తానై బతికి ఉంటాడు? ఆ రాత్రి ఉదయించిన సంపూర్ణ చంద్రుడి రంగును సరైన మాటల్లో వర్ణించడానికి ఎన్ని గుప్పుల పొగను తాగి ఊపిరిని నలుపు చేసుకుని ఉంటాడు? ఒక గొప్ప వాక్యం కోసం ఎన్ని వందల కాగితాలను చించి ఉంటాడు? ఒక కావ్యజన్మ కోసం ఎన్ని ఊహా పరిష్వంగాలలో పదేపదే సొమ్మసిల్లి ఉంటాడు?లాల్చీ, పైజామా, జేబులో పెన్నుతో అతడు ఎదురు పడినప్పుడు– అవశ్యం– అతని మేధాశ్రమ ఏదీ కనిపించదు. కనుక కలం పట్టి అతను రాసే రాతకు అత్యల్ప రుసుము ఇవ్వవచ్చనే ఆనవాయితీ ఎవరైనా పాటించవచ్చు. కథకు, కవితకు 500 రూపాయల పారితోషికం ఇవ్వొచ్చు. ఇవ్వక ఎగ్గొట్ట వచ్చు. పదుగురిని అడిగో, పి.ఎఫ్ బద్దలు కొట్టో పుస్తకం వేస్తే అమ్మిన ప్రతుల సొమ్ము అమ్మకందారు ఇవ్వొచ్చు. ఇవ్వక పోవచ్చు. పబ్లిషర్లు ఎవరైనా ఉంటే వారు రాయల్టీ ఇవ్వొచ్చు. ఇవ్వకపోనూవచ్చు. ఒకసారి రచయిత పుస్తకం వేశాక వాట్సప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ తదితరాలలో ఉండే సాహితీ సూక్ష్మక్రిములు అది తమ సొంతంగా భావించి వందలాది పి.డి.ఎఫ్‌లు పంచొచ్చు... పుస్తకం కొనకనే చదువుకోవచ్చు.ఇవన్నీ ఇలాగుంటే తెలుగునాట సాహితీకారులను ప్రోత్సహించడానికి ‘ఐదు వేలు’ అనే అచ్చొచ్చిన నంబర్ ఒకటి ఉంది. పాతిక, ముప్పై ఏళ్ల క్రితం మొదలైన ‘ఐదు వేల రూపాయల’ అవార్డు/బహుమతి తెలుగు సాహితీజాతికి లక్ష్మణరేఖ. నేటికీ, 2024లో కూడా, ‘చార్జీలతో కలిపి 5000 రూపాయల’ అవార్డు ప్రకటిస్తే అదే పదివేలనుకుని భార్యాపిల్లలను వెంటబెట్టుకువెళ్లే దుఃస్థితి తెలుగు రచయితది. తెలుగు నేలన ఎక్కడ పట్టినా నేటికీ ‘మొదటి బహుమతి 5 వేలు, రెండవ బహుమతి 3 వేలు, మూడవ బహుమతి వేయి రూపాయల’ దిక్కుమాలిన కథాపోటీలు. వాటికి రాసే సీనియర్ రచయితలు! సాహితీ అకాడెమీ పురస్కార గ్రహీతలు! వెయ్యి రూపాయల లిస్ట్‌లో వీరి పేర్లు! రూపాయి ఊసెత్తక తలపాగా, ముఖం తుడవను పనికిరాని శాలువాతో ఇచ్చే అవార్డులు కొల్ల. వీటికి తోడు 116 డాలర్లు మొహానకొట్టే ఎన్ .ఆర్.ఐ వితరణశీలత ఏమని చెప్పుట? ఇంటికి చెద పట్టిందని ఫోన్ చేస్తే ఐదు వేలకు తక్కువగా ఎవరూ రావడం లేదు. గంట కార్పెంటర్ పని చేస్తే రెండు వేలు నిలబెట్టి వసూలు చేస్తాడు. ప్లంబర్ వచ్చి వాష్‌బేసిన్ వైపు చూడాలంటే కనీస వెల వెయ్యి. కాని తెలుగు రచయిత మాత్రం తన దశాబ్దాల తపస్సుకు ‘బాబూ... ఒక్క ఐదు వేలు’ అంటున్నాడు. తెలుగు సాహితీవరణంలో నిషేధించాల్సిన ఒకే ఒక నంబర్– ఐదు వేలు!140 కోట్ల భారతీయులలో పదకొండు వేల మంది వంద రూపాయలు ఇస్తే పదకొండు లక్షలు అవుతాయి. అది మన జ్ఞానపీట్అ వార్డు నగదు బహుమతి! 9 కోట్ల తెలుగువారిలో వెయ్యి మంది వంద రూపాయలు ఇస్తే లక్ష అవుతుంది. అది సాహిత్య అకాడెమీ నగదు బహుమతి. జీవితంలో ఒకసారి పొందే వీటి నగదులే ఇలా ఉంటే ఐదు వేల అవార్డుకు వంకలేల అంటారా? ఆ అత్యున్నత అంకెతో అత్యల్పంగా బతికేద్దాం! -
చరిత్ర సృష్టించిన సిలికానాంధ్ర స్నాతకోత్సవం..ఏకంగా 16 మంది..
కాలిఫోర్నియాలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ఆరవ స్నాతకోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ స్నాతకోత్సవం అత్యంత చరిత్రాత్మకమైనది. ఎందుకంటే రెండువేల ఏళ్ళనాటి చరిత్రలో తొలి సారిగా ఒక విదేశం..అంటే అమెరికాలో 16 మంది తెలుగులో మాస్టర్స్ డిగ్రీ పట్టాలు అందుకున్నారు. ఆ 16 మందిలో ఒకరు వంగెన్ చిట్టెన్ రాజు చెప్పారు. "సరిగ్గా 50 ఏళ్ళ క్రితం, 1974 లో బొంబాయి ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్న నేను ఈ ఏడాది 2024లో తెలుగులో ఎంఏ పట్టా అందుకోవడం భలే ఆనందంగా అనిపించిందంన్నారు" చిట్టెన్ రాజు . అందుకోసమే వంగెన్ చిట్టెన్ రాజు గారి కుటుంబం అంతా కలిసి ఈ స్నాతకోత్సవంలో పాల్గొనడానికి సిద్ధమయ్యింది. అయితే తెలుగులో పట్టభద్రులైన ఆ 16 మందిలో వంగెన్ చిట్టెన్ రాజుగారి వయసులో అందరికంటే పెద్ద వ్యక్తి. ఆయన 76 ఏళ్ల వయసులో సిలికానాంధ్ర విశ్వ విద్యాలయం లో ఈ ఎంఏ తెలుగు కోర్స్‌లో చేరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం వారు వేలిడిక్టోరియన్ స్థాయిలో ఆయన్ను మాట్లాడమని తగిన ఏర్పాట్లు కూడా చేశారు. వృధాప్య రీత్యా వచ్చే శారీరక సమస్యలు కారణంగా కాలిఫోర్నియాలో జరుగుతున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి వెళ్లలేకపోయారు. దీంతో సహాధ్యాయులు రావడం కుదరకపోతే కనీసం వీడియోలో సందేశం పంపిస్తే దాన్ని ఈ కార్యక్రమం రోజున ప్రశారం చేస్తామని చెప్పారు. ఇదేదో బాగానే ఉందని వంగెన్ చిట్టెన్ రాజు గారు..తాను సిద్ధం చేసుకున్న గ్రాడ్యయేషణ గౌనూ, టోపీ పెట్టుకుని తన ఇంట్లోనే కూర్చొని ప్రసంగం రికార్డు చేసి పంపించడం జరిగింది. ఆ ప్రసంగంలో ఆయన తెలుగు శాఖని పటిష్టం చేయడానికి, వంగూరి సంస్థ ఆశయాలు, భాష, సాహిత్యాల అభివృద్ధికి తన వంతుగా లక్ష డాలర్ల విరాశంతో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఎండోమెంట్ ఫండ్ ఫర్ తెలుగు స్టడీస్ పేరిట ధార్మిక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దానికి అందరూ చప్పట్లు కొడుతూ స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం జరిగింది. అంతేగాదు మన సనాతన భారతీయ భాషా, సాహిత్య, సాంస్కృతిక, సంగీత, నాట్య సంపదలని, కళారూపాలని స్నాతకోత్తర స్థాయిలో అధ్యయన అవకాశాలని కల్పిస్తున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం, ఇతర వ్యవస్థలని మనం అందరం బలోపేతం చేయ్యాలి అని చెప్పారు. ఇలా అందరం కలిసి తలో చెయ్యీ వేసి ప్రోత్సహిస్తేనే కదా బావితరాలకి మన సాంస్కృతిక అస్తిత్వాన్ని అందజేయగలం అని చెప్పారు చిట్టెన్ రాజు. ఇక వంగెన్ చిట్టెన్ రాజు గారి తోపాటు ఎంఏ పట్టాలు తీసుకుంటున్న 15 మంది ఎవరంటే.. ప్రముఖ రచయిత్రి కొమరవోలు సరోజ (కెనడా), అమెరికాలో పలు నగరాల నుంచి అమృతవల్లి కవి, భాస్కర్ రాయవరం, వేణు ఓరుగంటి, కిరణ్ సింహాద్రి, మధు కిరణ్ ఇవటూరి, పావని తణికెళ్ళ, ప్రసాద్ జోస్యుల, రామారావు పాలూరి, శ్రీ గౌరి బానావత్తుల, శ్రీని రామనాధం, సుమలిని సోమ, సువర్ణ ఆదెపు, వేణుగోపాల నారాయణ భట్ల, విద్యాధర్ తాతినేని తదితరులు. అలాగే మాకు అసమానమైన పాండిత్యమూ, బోధనా పటిమలతో రెండేళ్ళు పాఠాలు చెప్పి, పరీక్షలు పెట్టి, పరిశోధనలు చేయించి, థీసిస్ లు రాయించి పట్టాలు ఇప్పించిన ఆచార్యులు సి. మృణాళిని, పాలెపు వారిజా రాణి, అద్దంకి శ్రీనివాస్, లక్ష్మణ చక్రవర్తి, గురజాడ శ్రీశ్రీ, గంగిశెట్టి లక్ష్మీనారాయణ గార్లు. వీరిలో మృణాళిని గారు, వారిజా రాణి గారు తదితరులు ఈ స్నాతకోత్సవంలో పాలుపంచుకున్నారు. ఈ స్నాతకోత్సవం లో తెలుగు పట్టభద్రులతో పాటు కూచిపూడి నృత్యం, భరత నానాట్యం, హిందూస్తానీ సంగీతం, కర్నాటక సంగీతం, భరత నాట్యం విభాగాలలో సుమారు 40 మంది మాస్టర్స్, డిప్లమా లు అందుకున్నారు. అది కూడా చరిత్రలో ఒక మైలు రాయి. కాగా, ఈ స్నాతకోత్సవంలో ప్రత్యేక అతిధిగా పాల్గొన్న ఆనంద్ కూచిభొట్ల, వైద్యులు డా. ముక్కామల అప్పారావు (డిట్రాయిట్) గారు, డా. కేశవ రావు గారు అనుకోని పనిమీద హ్యూస్టన్ వచ్చి వంగూరి చిట్టెన్ రాజుగారిని పరామర్శించడం విశేషం. ఇక చిట్టెన్ రాజు గారు ఎంఏ తెలుగు పట్టాలో పరిశోధానంశం “అమెరికా తెలుగు డయస్పోరా కథలు-చారిత్రక, వస్తు విశ్లేషణ.వంగూరీ చిట్టెన్ రాజు(చదవండి: 18వ ఆటా కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ సర్వం సన్నద్ధం!) -
Vishnu Priya Photos: టీవీ స్టార్లు కూడా ఎక్కడా తగ్గట్లేదుగా! (ఫొటోలు)
-
వేసవి అభ్యాసం
‘జాగ్రత్తమ్మా సుభద్ర... అక్కడకు వెళ్లాక ఆ వైభోగంలో మమ్మల్ని మర్చిపోతావేమో’ అంటుంది రేవతి పాత్రధారి ఛాయాదేవి సుభద్ర పాత్రధారైన ఋష్యేంద్రమణితో ‘మాయాబజార్’లో. అప్పటికి పాండవుల స్థితి చెడలేదు. ఇంద్రప్రస్థం నుంచి పుట్టిల్లైన ద్వారకకు సుభద్ర రాకపోకలు సాగుతున్నాయి. సోదరులైన బలరాముడు, కృష్ణుడు ఆదరిస్తున్నారు. మేనకోడలైన శశిరేఖను తన కుమారుడైన అభిమన్యుడికి చేసుకోవాలని సుభద్ర తలపోస్తోంది. రేవతి ఉబలాటపడుతోంది. పిల్లలు ముచ్చటపడి ఆశ కూడా పెట్టుకున్నారు. కాని ఒక్కసారిగా పరిస్థితి మారి జూదంలో పాండవుల రాజ్యం పోయింది. అడవుల పాలు కావాల్సి వచ్చింది. ఒకనాడు సుభద్ర రాకకోసం వేయికళ్లతో ఎదురు చూసిన రేవతి ఇప్పుడామె చెడి పుట్టింటికి చేరితే ఏం చేసింది? దొంగ శిరోభారంతో పడకేసింది. పొడ గిట్టనట్టుగా చూసింది. మనుషులు అలా ఉంటారు.పాండవులకు అన్యాయం జరిగిందని తెలిసి బలరామ పాత్రధారి గుమ్మడి వీరావేశంతో కౌరవుల భరతం పట్టడానికి బయలుదేరినప్పుడు భయంతో దుర్యోధన పాత్రధారి ముక్కామల కంపిస్తే, శకుని పాత్రధారి సి.ఎస్.ఆర్. ‘భయమెందుకు? ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉంది’ అని ఊరుకోబెడతాడు. వేంచేసిన బలరాముడిపై పూలవర్షం కురిపించి, కన్యకామణుల చేత పన్నీరు చిలకరింపచేసి ప్రసన్నం చేసుకుంటాడు. భరతం పడతానన్న బలరాముడే ‘ధర్మజూదంలో జయించడం ధర్మయుద్ధంలో జయించినంత పుణ్యమే’ అని రాజ్యం లాక్కున్న కౌరవులను ప్రశంసిస్తాడు. అంతేనా? దుర్యోధనుడి కుమారుడైన లక్ష్మణ కుమారుడికి తన కుమార్తె శశిరేఖను కట్టబెట్టే వరం ఇస్తాడు– చెల్లెలు సుభద్రకు ఇచ్చిన మాట మరిచి. మనుషులు అలా కూడా ఉంటారు.ధర్మరాజు రాజసూయం చేయడం, మయసభ కట్టడం దుర్యోధనుడికి కంటగింపు అయ్యింది. కయ్యానికి అసలు కారణం అదే. ద్రౌపది నవ్వు మిష. అది గమనించిన శకుని ‘తలలో ఆలోచనలు చేతిలో పాచికలు... వీటితో పాండవులను సర్వనాశనం చేస్తాను’ అన్నప్పుడు ప్రకృతి కలవరపడి వెర్రిగాలితో వద్దు వద్దు అని సంకేతం ఇస్తుంది. కాని దుర్యోధనుడు వినడు. శకుని విననివ్వడు. సిరిని ప్రదర్శనకు పెట్టి ధర్మరాజు చెడ్డాడు. అది చూసి అసూయతో దుర్యోధనుడు మునిగాడు. ‘రాజ్యాలు పోయినా పరాక్రమాలు ఎక్కడికి పోతాయి’ అని సుభద్ర అంటుంది కాని పరాక్రమం లేకపోయినా అందలం ఎక్కాలనుకునేవారు ఉంటారు. వారికి భజన చేసి పబ్బం గడుపుకునేవారూ ఉంటారు. లక్ష్మణ కుమారుడు రేలంగి ఎప్పుడూ అద్దం ముందే ఉంటాడు. అలంకరణప్రియుడు వీరుడే కాదు. మరి ఇతని గొప్పతనమో? ‘అటు ఇద్దరె ఇటు ఇద్దరె అభిమన్యుని బాబాయిలు. నూటికి ఒక్కరు తక్కువ బాబాయిల సేన తమకు’. ఇతనికి స్తోత్రాలు వల్లించే శర్మ, శాస్త్రులు ఉద్దండ పండితులేగాని ‘ప్రభువుల ముందు పరాయి వారిని పొగడకూడదనే’ ఇంగితం లేని వారు. అందుకే శకుని ‘మీకు పాండిత్యం ఉంది కాని బుద్ధి లేదయ్యా’ అని చివాట్లు పెడతాడు. బుద్ధి లేని మనుషులు బుద్ధి ఉన్న మనుషుల్ని పితలాటకంలో పెట్టడమే లోకమంటే.స్వభావరీత్యా చెడ్డవాళ్లు, పరిస్థితుల రీత్యా చెడ్డతనం ప్రదర్శించేవాళ్లు... వీళ్లు మాత్రమే కిటకిటలాడితే జనులు నిండిన ఈ భూమి భ్రమణాలు చేయకపోవును. కష్టంలో ఉన్నప్పుడు సాయానికి వచ్చే మనుషులు తప్పక ఉంటారు. అడవులు పట్టిన సుభద్ర, అభిమన్యుల కోసం హిడింబి, ఘటోత్కచుడు, చిన్నమయ్య, లంబు, జంబు వీరితోపాటు దుందుభి, దుందుభ, ఉగ్ర, భగ్ర, గందరగోళక, గగ్గోలక తదితర అసుర సేన పరిగెత్తుకొని రాలేదూ? వీరందరి కంటే అందరి మొర వినే మురారి ఉండనే ఉన్నాడాయె. చివరకు కౌరవుల ఆటకట్టి సుభద్ర పౌరుషం నిలిచి శశిరేఖ ఆమె కోడలు కావడంతో ‘మాయాబజార్’ ముగుస్తుంది.తెలుగు వారికి మాత్రమే దొరికిన అమూల్యమైన వ్యక్తిత్వ వికాస సంగ్రహం ‘మాయాబజార్’ చిత్రం. అస్మదీయులను కలుపుకు వెళ్లి, తస్మదీయులతో జాగ్రత్తగా మెసలి, పైకి ఒకలాగా ఆంతర్యాలు వేరొకలాగా ఉండేవారిని కనిపెట్టుకుంటూ, ప్రగల్భాలరాయుళ్లను గమనించుకుంటూ, ఉబ్బేసే వాళ్ల ఊబిలో పడకుండా, దుష్ట పన్నాగాలతో బతికే వారితో దూరంగా ఉంటూ, అనూహ్యంగా మారిపోతూ ఉండే మనుషుల చిత్తాలను అర్థం చేసుకుంటూ, చిన మాయల పెను మాయల నడుమ ముందుకు సాగడం ఎలాగో ఈ సినిమా చెబుతుంది. అది కూడా ఏదో శాస్త్రం చెప్పినట్టుగా ‘నిష్కర్షగానూ కర్కశంగానూ’ కాదు. ‘సౌమ్యంగా సారాంశం’ అందేలాగానే. వేసవి వచ్చింది. నెల సెలవులున్నాయి. పిల్లలకు అందాల్సిన చాలా వాటిని నాశనం చేశాం. దుంప తెంచి ధూపం వేశాం. కనీసం ఈ సినిమా చూపించండి. వారు ఘటోత్కచుణ్ణి చూసి ‘హై హై నాయకా’ అంటారు. భక్ష్యాలకూ చిత్రాన్నాలకు తేడా తెలుసుకుంటారు. శాకాంబరీ దేవి ప్రసాదాన్ని నాలుక మీద వేసి ‘ఠ’ అంటూ లొట్టలు వేస్తారు. తల్పం గిల్పం కంబళి గింబళి చూసి కిలకిలా నవ్వుతారు. ఆ రోజుల్లోనే వీడియో కాల్ చేయగలిగిన ‘ప్రియదర్శిని’ పెట్టెకు నోళ్లు తెరుస్తారు. ‘సత్యపీఠం’ అను ‘లైడిటెక్టర్’తో సైన్స్ ఊహలు చేస్తారు. ‘ముక్కుకు తగలకుండా నత్తును కొట్టే’ ప్రావీణ్యం విద్యలో కలిగి ఉండాలని తెలుసుకుంటారు. తియ్యటి తెలుగుల ధారలలో లాహిరీ విహారం చేస్తారు. తెలుగు నేల మీద ఎప్పుడు వేసవి వచ్చినా పిల్లలకు ప్రిస్క్రయిబ్ చేయాల్సిన తొలి అభ్యాసం ‘మాయాబజార్’. అది చూసిన పిల్లలకు ఒక వీరతాడు, చూపించిన తల్లిదండ్రులకు రెండు వీరతాళ్లు. మాయాబజార్... నమో నమః -
టంపాలో చరిత్ర సృష్టించిన తెలుగు కుటుంబం దాతృత్వం!
ప్లోరిడాలోని టంపాలో ఓ తెలుగుకుటుంబం దాతృత్వం చరిత్ర సృష్టించింది. టంపాలో సెయింట్ జోసఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పౌండేషన్‌కు తెలుగువారైన పగిడిపాటి కుటుంబం 50 మిలియన్ డాలర్లను(ఏకంగా రూ. 400 కోట్లు) విరాళంగా అందించింది. ఇంత పెద్ద మొత్తం విరాళంగా ప్రకటించి అమెరికాలో ఉండే యావత్ తెలుగువారంతా గర్వపడేలా చేసినందుకు నాట్స్ ప్రత్యేకంగా పగిడిపాటి కుటుంబాన్ని అభినందించింది. ఏకంగా 50 మిలియన్ల విరాళంఅమెరికాలో ప్రముఖ వైద్యులు డాక్టర్ పగిడిపాటి దేవయ్య, రుద్రమ్మల 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా పగిడిపాటి కుటుంబం 50 మిలియన్ డాలర్లను విరాళంగా ఇవ్వడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. పగిడిపాటి కుటుంబంలోని సిద్ధార్థ, అమీ, రాహుల్, నేహా, సృజని, అర్జున్, ఇషాన్, ఆరియా, అరెన్ వీరందరూ కలిసి ఇచ్చిన ఈ విరాళం ప్లోరిడాలోని టంపాలో ఆరోగ్య సంరక్షణకు ఇప్పటివరకు ఇచ్చిన అతి పెద్ద విరాళాల్లో ఇది ఒక్కటిగా నిలిచి చరిత్ర సృష్టించింది. నాట్స్ ప్రశంసల వర్షం..ఈ విరాళం ద్వారా సెయింట్ జోసెఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో కొత్త పీడియాట్రిక్ సదుపాయం అభివృద్ధికి దోహదపడుతుంది. పిల్లల కోసం అత్యాధునిక ఆరోగ్య సంరక్షణను మరింత పెంచే వ్యూహంలో భాగంగా ఈ విరాళాన్ని ఇవ్వడం హర్షించదగ్గ విషయం. పగిడిపాటి కుటుంబ దాతృత్వానికి గుర్తింపుగా, కొత్త పిల్లల ఆసుపత్రికి పగిడిపాటి చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎట్ సెయింట్ జోసెఫ్ అని పేరు పెట్టనున్నారు. డాక్టర్ రుద్రమ, దేవయ్యలు నాట్స్‌తో పాటు అనేక ఇతర సేవా సంస్థలకు తమ మద్దతు అందిస్తున్నారు. ఇదే స్ఫూర్తితో మన అమెరికాలో తెలుగువారు అద్భుత విజయాలు సాధించి సేవా రంగంలో కూడా ముందుండాలని నాట్స్ అకాంక్షిస్తోంది. పగిడిపాటి రుద్రమ్మ, దేవయ్య మరిన్ని విజయాలు సాధించి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని నాట్స్ కోరుకుంటుంది.(చదవండి: అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం) -
అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
అమెరిలో ఏప్రిల్ 27 వ తారీకు సాయంత్రం (భారత దేశ కాలమానము ఏప్రెల్ 28 ఉదయము) తొలి ప్రపంచ తెలుగు సమితి, "వరల్డ్ తెలుగు కన్సార్టియం" అంతర్జాల సమావేశం అద్భుతంగా జరిగింది.ఎనిమిది దేశాలకు చెందిన 27మంది వక్తలు, సంధానకర్తలతో సభ కళ కళ లాడింది. ఈ సభలో వంగూరి చిట్టెన్ రాజు, లలిత రామ్, వంశీ రామ రాజు, సింగపూర్ శ్రీ సాంస్కృతిక కళా సారధి అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు, రాధిక మంగిపూడి, షామీర్ జానకీ దేవి, శ్రీహవిష దాస్ , తెలుగు సాహిత్య ప్రపంచం లోని అతిరధ, మహారధులు పాల్గొన్నారు. మహాకవులు, రచయితలు, వాగ్గేయకారులు, వారి రచనల పై ఉత్తేజమైన ప్రసంగాలు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి.ఈ సమావేశాన్ని యూట్యూబ్ లో వీక్షించవచ్చు. -
రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
కోలీవుడ్‌లో తెరకెక్కించిన సినిమాలు హిట్ అయితే ఇతర భాషల్లోనూ డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మరో కోలీవుడ్ మూవీ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. అయితే ఈ సినిమా హిట్ కాకపోయినప్పటికీ టాలీవుడ్ సిద్ధమయ్యారు. తమిళ మూవీ యతిసై తెలుగు డబ్బింగ్ వర్షన్ మే 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ హిస్టారికల్ గతేడాదిలోనే ఓటీటీలో రిలీజైంది. ఇప్పటికే తమిళంలో అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. తాజాగా యతిసై తెలుగు, హిందీ రిలీజ్ డేట్స్‌ను సినిమా యూనిట్ ప్రకటించింది.ఈ సందర్భంగా తెలుగు, హిందీ భాషలకు సంబంధించి టీజర్స్ రిలీజ్ చేశారు. యుద్ధ సన్నివేశాలు, పాండ్య రాజులను ఎదురించి అసమాన పోరాటం చేసిన ఓ తెగ జీవితాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. గతేడాది ఏప్రిల్‌లో థియేటర్లలో విడుదలై రూ.20 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఓటీటీలో రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో థియేటర్లలో విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది. తెలుగుతో పాటు హిందీలో ఒకే రోజు థియేటర్లలో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. ఈ సినిమాకు ధరణి రాసేంద్రన్ దర్శకత్వం వహించారుమొదట టీజర్స్, ట్రైలర్స్ రిలీజైన తర్వాత కోలీవుడ్ వర్గాల యాతిసై మూవీని బాహుబలితో పోల్చారు. కానీ ఈ సినిమా బాహుబలికి ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఏడు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ 20 కోట్లు మాత్రమే రాబట్టింది -
శాంతి స్వరూప్ కన్నుమూత
రామంతాపూర్, సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ప్రచార సాధనమైన దూర దర్శన్ చానల్లో తొలి తెలుగు యాంకర్‌గా ప్రసి ద్ధులు, తెలుగు ప్రజలకు తన కంచు కంఠంతో వార్తలు చెప్పిన జయంత్ శాంతి స్వరూప్ (74) కన్నుమూశారు. శుక్రవా రం ఉదయం ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతిచెందారు. హైదరాబాద్ చిక్కడపల్లిలో పుట్టి పెరిగిన శాంతి స్వరూప్ దూరదర్శన్ సీనియర్ యాంకర్ రోజా రాణిని వివాహమాడారు. ఆమె కొన్ని సంవత్స రాల క్రితమే చనిపోయారు. శాంతి స్వరూప్‌కు ఇద్దరు కుమారులు మేగాన్‡్ష, అగ్నేయ. 1978లో దూరదర్శన్ కేంద్రంలో యాంకర్‌గా చేరిన ఆయన 1983 నుంచి తెలుగులో వార్తలు చదవ డం మొదలుపెట్టారు. 2011లో పదవీ విరమణ చేశారు. టెలిప్రాంప్టర్ర్ లేని రోజుల్లోనే వార్తలను ముందుగానే మననం చేసుకుని తెర ముందు పొల్లు పోకుండా తప్పులు లేకుండా అనర్గళంగా చదివి తెలుగు ప్రజలకు వార్తలు అందించారు. శాంతి స్వరూప్‌కు లైఫ్ టైం అచీవ్మెంట్ అవా ర్డుతో పాటు పలు సంస్థలు ఎన్నో అవార్డులతో సత్కరించాయి. భూపాల్ గ్యాస్ దుర్ఘటన కవ రేజ్‌ను వీక్షకులకు కళ్ళకు కట్టినట్లుగా అందించిన ఆయన రాతి మేఘం, క్రికెట్ మీద క్రేజ్, అర్ధాగ్ని అనే నవలలు కూడా రాశారు. ఆయన పార్ధివ దేహాన్ని రామంతాపూర్ టీవీ కాలనీలోని స్వగృహానికి తరలించి అక్కడి నుంచి అంబర్పేట్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కంచుకంఠం మూగబోయిందనీ, తొలితరం న్యూస్ రీడర్‌గా అందరికీ సుపరిచితులైన శాంతి స్వరూప్ మృతి బాధాకరమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంతాపాన్ని ప్రకటించారు. శాంతి స్వరూప్ సేవలు చిరస్మరణీయం తెలుగులో వార్తలు చదివిన తొలి తరం న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మరణం పట్ల ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సంతాపం ప్రకటించా రు. ఆయన అందించిన సేవలు తెలుగు మీడి యా రంగంలో చిరస్మరణీయమని సీఎం గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరా లని ప్రార్థించారు. శాంతి స్వరూప్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. న్యూస్‌రీడర్‌గా తనదైన ముద్ర శాంతి స్వరూప్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. టీవీలో వార్త లను చదివే తొలితరం న్యూస్ రీడర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందిన శాంతి స్వరూప్ మీడియా రంగంలో తనదైన ముద్ర వేశారని గుర్తు చేసుకున్నారు. శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
మన దేశంలో బెస్ట్ ఇంగ్లీషు ఎవరు మాట్లాడతారు? ఈ వీడియో చూడండి!
భిన్న భాషలు, విభిన్న సంస్కృతుల మేళవింపు భారత దేశం. అయితే 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలనలో ఉన్న ఇండియా 1947లో స్వాతంత్ర్యాన్ని సాధించింది. అప్పటినుంచి మన దేశంలో ఇంగ్లీషు భాష ప్రభావం, ఆంగ్లం మాట్లాడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. భారతీయుల ఇంగ్లీషుపై హింగ్లీష్,టింగ్లీషులాంటి సెటైర్లు ఉన్నప్పటికీ, 2021 నాటి లెక్కల ప్రకారం అమెరికా తరువాత అత్యధిక సంఖ్యలో ఇంగ్లీష్ మాట్లాడే వారిలో భారతదేశం రెండో స్థానంలో ఉంది. దాదాపు 10శాతం మంది భారతీయులు ఇంగ్లీషులో మాట్లాడతారు. రెండు లేదా మూడో భాషగా ఇంగ్లీషు మాట్లాడేవారు కూడా ఎక్కువే ఉన్నారు. గ్రామీణులతో పోలిస్తే పట్టణ, విద్యావంతులు, సంపన్నులు ఎక్కువగా ఇంగ్లీషు భాష మాట్లాడతారు. అయితే తాజాగా చక్కటి ఇంగ్లీషు భాష ఏ భాష ప్రజలు మాట్లాడతారు అనే అంశానికి సంబంధించి ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. దీని ప్రకారం కన్నడిగులు మంచి ఇంగ్లీషు మాట్లాడతారట. మాతృభాష కన్నడగా ఉన్న ప్రజల యావరేజ్ ఇంగ్లీషు స్పీకింగ్ టెస్ట్ స్కోరు 74 శాతంగా నిలిచింది. వావ్.. ఆసక్తికరమైన పరిశోధన.. ఇంగ్లీషు నేర్చుకోవాలంటే కన్నడ నేర్చుకోవాలన్నమాట, లేదంటే కన్నడ ఫ్రెండ్ అయినా ఉండాలి అంటూ చాలామంది హర్షం వ్యక్తం చేశారు. ఇంగ్లీషు మాత్రమే కాదు బహుశా కన్నడ మాట్లాడేవారు ఇతర భాషలను కూడా తేలికగా నేర్చుకుంటారు. నా దృష్టిలో కన్నడ ఇటాలియిన్ ఆఫ్ ది ఈస్ట్. అంతేకాదు కన్నడిగులు దేశంలోని ఇతర రాష్ట్ర భాషలను సులభంగా నేర్చుకుంటారు అంటూ ఒకరు కమెంట్ చేయడం విశేషం. Guess who speaks the best English in India by mother tongue? 😊👏 pic.twitter.com/MfSlNAiGjR — Aparajite | ಅಪರಾಜಿತೆ (@amshilparaghu) March 11, 2024 మిగిలిన భాషల ర్యాంకులు పంజాబీ - 63 శాతం గుజరాతీ - 65 శాతం బెంగాల్ - 68 శాతం హిందీ,మళయాళం, తెలుగు - 70శాతం తమిళం - 71 శాతం మరాఠా- 73శాతం -
మాస్టర్స్.. NRI విద్యార్థుల్లో మార్పు కోసం
-
తెరమరుగవుతున్న తెలుగు లిపి!
దక్షిణాది భాషలైన తమిళ, మలయాల, కన్నడ, తెలుగు భాషలలో మన తెలుగు భాష తెరమగయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇక రాను రాను ఇంగ్లీష్ భాష ప్రభావంతో పిచ్చి తెలుగుగా మారుతుందో లేక అర్థరహితమైన భాషగా మారిపోతుందో తెలియదు. ఏదో చేయాలనుకున్నా ప్రకటనలకే పరిమితవుతుందే తప్ప కార్యరూపం దాల్చే అవకాశమే లేదు. ఇంకా చెప్పాలంటే అది సాధ్యం కాదే కూడా. కనీసం ఇవాళ ఫిబ్రవరి 21 మాతృభాషా దినోత్సవం సందర్భంగా మన తెలుగు భాష గురించి దానికి పొంచి ఉన్న ప్రమాదం గురించి తెలుసుకుందాం. ఈ విధంగానైన మన తెలుగు భాష, లిపి ఒక్కప్పుడూ ఉండేదని గుర్తించగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. నిజానికి ఒక లిపి ఏర్పడటానికి వేల ఏళ్ల సమయం పడుతుంది. ఒక రాయి నీటిలో ఒరుసుకుని మొనదేలి గుండ్రంగా అయినట్లు మన తెలుగు లిపి కూడా గుండ్రంగా అందంగా ఉంటుంది. అసలు మన వర్ణమాలలోని అక్షరాలను గమనిస్తే..'అ' అక్షరం నవ్వుతున్నట్లుగానూ, 'ఖ' అంక్షరం నెమలి పురివిప్పినట్లు, 'ఠ' అక్షరం బుగ్గన సొట్టలా ఎంత అందంగా ఉంటాయి. అలాగే వర్ణమాలలో అచ్చులు, హల్లులు ఏర్పడ్డ పద్దతి భాషను శాశ్వతంగా నిలిపేలా ఉంటుంది తెలుగు లిపి. మాట్లాడే భాష మొత్తం లిపి కాకపోవచ్చు కానీ దాదాపుగా మాట్లేడ భాషకు దగ్గర దగ్గరగానే వర్ణమాలలానే ఉంటుంది. అంతలా ఇమిడిపోయి ముత్యాల్లా ఉండే మన తెలుగు లిపి ఇప్పుడెందుకనో చాలామందికి వెగటుపుడుతోంది. అసహస్యించుకోవాల్సినవిగా ఉన్నాయి. ఎందుకంటున్నానంటే మన తెలుగుని తెలుగు లిపిలో రాస్తే బావుండు దాన్ని ఇంగ్లీష్‌లో రాసి తెగులు పట్టించేస్తున్నారు. ఇలా రాసి.. రాసి.. అసలు తెలుగు లిపి కాస్త ఇంగ్లీష్ మిక్స్డ్ తెలుగు లిపిగా మార్చేసి అర్థరహిత భాషగా తయారవ్వుతుందేమో! అని భాషావేత్తలు బాధపడుతున్నారు. శ్రీకృష్ణ దేవరాయులంతటి వారే "తేనేలూరు తెలుగు భాష దేశా భాషలందు లెస్సా" అన్న మాట విలువలేనిదిగా అయ్యిపోతుందని ఆందోళన చెందుతున్నారు. మన మనుగడ కోసం, జీవనోపాధి రీత్యా, తప్పక ఇతర భాషలను నేర్చుకోవాలి. అలానే మన దేశాన్ని ప్రపంచ దేశాల్లో నిలబెట్టాలంటే అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లీష్ నేర్చుకోవడం అత్యంత ముఖ్యం. అవసరం కూడా. అదే సమయంలో మన మాతృభాషకు తిలోదకాలు ఇవ్వడం ఎంత వరకు న్యాయం. మన తల్లి లాంటి భాషని మనమే చంపేసుకోవడం సమంజసమా?. ఇలా తెలుగును ఇంగ్లీష్ లిపిలో రాసే సమస్య సినిమా పాటలకు కూడా అంటుకుంది. పక్క రాష్ట్రాల నుంచి సింగర్ల నుంచి తెప్పించుకుని పాటలు పాడిస్తారు. ఇక్కడే అసలైన సమస్య వస్తుంది. వారికి పాటా అర్థమయ్యేలా తెలుగులోని పాటనే ఇంగ్లీష్‌లో లిప్యంతరీకరణ చేసి కూనీ చేసేస్తారు. ఇక వారు దాన్ని చదివి ఉచ్ఛారణనే మార్చేసి కొత్త అర్థాలు తీసుకొస్తున్నారు. అంతేగాదు ఆ మహానుభావుల పాడిన పాటను నేర్చుకుంటూ మన వాళ్లు కూడా ఇలానే పలకాలేమో లేక సంగీతంలో ఇలా పలకాలేమో అన్నట్లుఫాలో అయిపోతున్నారు. ఇలా తెలుగు భాషను కూనీ చేయడం ఎంతవరకు వెళ్లిపోయిందంటే..రాబోయే తరాలను కన్ఫ్యూజ్ చేసి వద్దురా బాబాయో! అనేంతకు వచ్చేసింది. ఇలా మనలా మాతృ భాషను ఇంత దారుణంగా కూనీ చేస్తున్నావారెవ్వరూ ఉండరేమో!. ఇదంతా చూస్తుంటే ఇంకో రెండొందల ఏళ్లలోనే తెలుగు లిపి అదృశ్యమయ్యిపోతుందేమో!. మహా అయితే మాట్లాడే భాషగా ఇంకొంత కాలం బతకవచ్చేమో!. అది కూడా తెలుగు మాట్లాడే వాళ్లు బతికి ఉంటేనే. ఆ తర్వాత మన తెలుగు భాష తర్వాతితరాలకు శ్రీనాథుడి పద్యం వలే గందరగోళంగా ఉండొచ్చు. ఎవరో విడమరిచి చెబితే గానీ అర్థం కాకపోవచ్చు. ఇంకా బాగా చెప్పాలంటే ఇంగ్లీష్ మాట్లాడటం రాక తెలుగు మాట్లాడొచ్చేమో గానీ ప్రత్యేకంగా తెలుగు భాష మాట్లాడే వారు ఉండరేమో!. అంతేగాదు భవిష్యత్తులో తెలుగు మాట్లాడేవారిని అనాగరికులుగా చూడరనే భరోసా కూడా లేదు. కనీసం ఇలాంటి దినోత్సవం పేరుతో అయినా ఈ తెలుగు భాష వైభవం గురించి భావితరాలు తెలుసుకునేలా చేద్దాం!. ఎలాగో మనభాషను మనమే చేజేతులారా అంతం చేసుకుని నిరక్షరులుగా మిగిలిపోయే గొప్పోళ్లం కదా! మనం. కనీసం ఈ సందర్భంగానైనా మన తెలుగుని స్మరించుకుందాం. అలాగే తెలుగును తెలుగులో రాస్తే అమ్మభాష అని, ఇంగ్లీష్ లిపిలో రాస్తే అది అర్థరహితమైన చెత్త భాష అవుతుందని చెబుదాం!. తెలుగు తెరమరుగవ్వకుండా ఈ విధంగానైనా కాపాడుకుందాం. బావితరాలు కనీసం మన పూర్వీకులు ఈ తెలుగు భాషలో మాట్లాడేవారని, ఇది తెలుగు లిపి అని గుర్తించేలా చేద్దాం!. --పమిడికాల్వ మధుసూదన్ మొబైల్ నెం: 9989090018 (చదవండి: ఈ షర్ట్ చాలా కాస్ట్లీ గురూ!) -
Vyuham fever @ US : అమెరికాలో వైఎస్సార్సిపి సిద్ధం
సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అద్దం పట్టేలా తీసిన ఆర్జీవీ తీసిన వ్యూహం-శపథం సినిమాల సందర్భంగా అమెరికాలో సందడి నెలకొంది. వ్యూహం, శపథం సినిమాలను చూసిన అమెరికాలోని వైఎస్సార్సిపి నాయకులు, అభిమానులు రాంగోపాల్‌వర్మకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఏపీ సీఎం జగన్ కోసం తాము కూడా "సిద్ధం" అని ప్రకటించిన ఎన్నారైలు.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సిపి ఘన విజయం సాధించడమే మా "వ్యూహం" అని చాటి చెప్పారు. అమెరికాలోని పలు నగరాల్లో ప్రవాసాంధ్రులు వ్యూహం సినిమా సందర్భంగా సంబరాలు నిర్వహించారు. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన ‘వ్యూహం’ సినిమాను అడ్డుకునేందుకు తెలుగుదేశం, జనసేన పార్టీలు చివరిదాకా ప్రయత్నించాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటివరకు ప్రజలకు తెలియని ఎన్నో విషయాలను యథాతధంగా సినిమా రూపంలో తాను ప్రజల ముందుకు తెచ్చానని రాంగోపాల్‌వర్మ ప్రకటిస్తే.. ఆ విషయాలన్నీ బయటకు వస్తే.. తమకు ఇబ్బందులొస్తాయని టిడిపి, జనసేన నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఇందులో భాగంగా ఆ పార్టీల నాయకులు కోర్టును ఆశ్రయించారు. (అమెరికాలో వ్యూహం-శపథం సంబరాలు : ఫోటోగ్యాలరీ) ఈ సినిమాకు రెండు నెలల క్రితమే సెన్సార్ పూర్తి కాగా.. విడుదలను ఆపాలని లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తొలుత వ్యూహం సినిమా సెన్సార్‌ను తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ నిలిపివేయగా.. డివిజన్ బెంచ్‌లో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. హైకోర్టు ఆదేశాలతో వ్యూహం-శపథం చిత్రాలను సమీక్షించిన సెన్సార్ బోర్డు.. యూ సర్టిఫికేషన్ ఇచ్చింది. ఫిబ్రవరి 23న పార్ట్-1 సినిమాగా "వ్యూహం2 విడుదలవుతుంటే.. ఒక వారం గ్యాప్‌లోనే సీక్వెల్‌ను "శపథం" పేరుతో మార్చ్ 1న విడుదల చేస్తున్నారు. యథార్థ ఘటనల ఆధారంగా చిత్రాన్ని రూపొందించామే తప్ప.. ఎవరినీ కించపరిచేలా తీయలేదన్నారు ఆర్జీవీ. వ్యూహం, శపథం సినిమాలను ప్రతీ ఒక్కరు చూసుకుంటారనేదే తన ఉద్దేశమని రామ్‌గోపాల్ వర్మ అన్నారు. “ఏ పార్టీ వాళ్లు కాకుండా తటస్థంగా ఉన్న వారికి ఆ అవసరం లేదు. మీరు పబ్లిక్‌గా అందరితో చూడొచ్చు. వ్యూహం ఫిబ్రవరి 23, శపథం మార్చి 1న వస్తుంది. మీకు ఇష్టం ఉంటే చూడండి. లేకపోతే మానేయండి” అని అన్నారు ఆర్జీవీ. వారం రోజుల్లో రెండు సినిమాలతో వస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయిన RGV తన సినిమాలు కొందరికి నచ్చుతాయి, కొందరికి కోపం వస్తాయి.. కానీ చూడడం మాత్రం అందరూ చూస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. అమెరికాలోని వేర్వేరు నగరాల్లో వ్యూహం, శపథం సినిమాలను వీక్షించిన వైఎస్సార్సిపి నాయకులు.. ఆర్జీవీ ప్రయత్నాన్ని ప్రశంసించారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ మరోసారి ఘనవిజయం సాధిస్తారని, వైనాట్ 175 అన్న నినాదాన్ని నిజం చేయడానికి తమ వంతుగా ప్రయత్నిస్తామన్నారు వైఎస్సార్సిపి నాయకులు. (అమెరికాలో వ్యూహం-శపథం సంబరాలు : ఫోటోగ్యాలరీ) -
'గూఢచారి-2'లో ఇమ్రాన్ హష్మీ
బాలీవుడ్లో రొమాంటిక్ హీరోగా పేరొందిన ఇమ్రాన్ హష్మీ తాజాగా తెలుగులో ‘జీ 2’లో నటించడానికి పచ్చజెండా ఊపారు. అడివి శేష్ నటించిన హిట్ మూవీ ‘గూఢచారి’ (2018)కి సీక్వెల్‌గా ‘జీ 2 ’(గూఢచారి 2) రూపొందుతోంది. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇమ్రాన్ హష్మీ పోస్టర్ని ‘ఎక్స్’లో షేర్ చేసిన అడివి శేష్.. ‘జీ 2’ యూనివర్స్‌లోకి బ్రిలియంట్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ సార్‌కి స్వాగతం’’ అని పోస్ట్ చేశారు. దీనికి ఇమ్రాన్ హష్మీ రిప్లయ్ ఇస్తూ.. ‘సార్ అని ఫార్మాలిటీస్ అవసరం లేదు.. ఇమ్రాన్ అని పిలువు. మీ సినిమాలో భాగం అయినందుకు హ్యాపీగా ఉంది’’ అని పోస్ట్ చేసారు. -
పాటకు పట్టం
‘పాట’ అనే మాటలో ఎన్ని ఉద్వేగాల ఊటలో! ఎన్ని ఉద్రేకాల తంత్రులో! ఎగిసిపడి ఎదను రసప్లావితం చేసే ఎన్నెన్ని పారవశ్యాల జలయంత్రాలో! ప్రతి రాత్రీ వసంతరాత్రిగా, ప్రతి గాలీ పైరగాలిగా, బతుకంతా పాటలా సాగాలంటాడు ఒక కవి. ఏదో ఒక పాట వింటూనే జీవితం గడుపుతాం. చెవులను, మనసును తాకి హాయి గొలిపే పాటల తుంపరలలో తడుస్తూనే జీవన రహదారిలో సాగుతాం. మరి, బతుకే పాటైన మేటి పాటగాళ్ళ సంగతేమిటి! కాలికి గజ్జె కట్టి బుజాన కంబళి వేసుకుని జీవితమే ఆటగా, పాటగా గడిపిన గద్దర్లు; పాటల వియద్గంగలో జీవితాంతం మునకలేసిన వంగపండులు, పలుకే పాటై జీవనదిలా ప్రవహించే అందెశ్రీలు, పాటను పుక్కిటపట్టి రాగమే జీవనరాగంగా బతుకును పండించుకుంటున్న గోరటి వెంకన్నలు... చెప్పుకుంటూ వెడితే ఒకరా ఇద్దరా! ఆపైన, సినీగీతాన్ని వినీలాకాశానికెత్తిన కృష్ణశాస్త్రులు, శ్రీశ్రీలు, ఆత్రేయలు, సినారేలు, ఆరుద్రలు, వేటూరులు..! పేరుకు పాటైనా తీరులు ఎన్నో! కొన్ని పాటలు జాతి మొత్తంలో ఉత్తేజపు విద్యుత్తును నింపి ఉద్వేగాల అంచుల వైపు నడిపిస్తాయి. జనగణమన లాంటి అలాంటివి జనరంజకమై జాతి గళమెత్తి పాడుకునే గీతాలు అవుతాయి. తెలంగాణ ఉద్యమంతోపాటు ఉవ్వెత్తున ఎగసిన ఉద్రేకపు పొంగు పాటగా మారి అందెశ్రీ ఆలపించిన ‘జయజయహే తెలంగాణ’ గీతానికి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రగీతం ప్రతిపత్తిని ఇచ్చి తనను తాను గౌరవించుకుంది. పాటలో పలికించలేని రసమే లేదు. ప్రజోద్యమాల అగ్నిశిఖలలోంచి నిప్పురవ్వల్లా పుట్టుకొచ్చిన పాటే ప్రేయసీప్రియుల యుగళగీతంగా మారి మోహరాగాలతో విరితావులనీనగలదు. ‘నీవే నేనుగా ఒకటైన చోట’ ‘వలపుల పూదోట’ పూయించగలదు. మనిషైతే మనసుంటే కనులు కరగాలని, కరుణ కురియా లని, జగతి నిండాలని ప్రబోధిస్తూ; ప్రకృతి సమస్తంలో ఇమిడి ఉన్న కారుణ్యాన్ని జాలిజాలిగా కరిగే నీలిమేఘం మీదుగా రూపుగట్టి మనల్ని నిలువునా కదిలించి కరిగించగలదు. తూరుపు సిందూరపు మందారపు వన్నెలలోని ఉదయరాగానికి చూపుల్ని, హృదయగానానికి చెవుల్ని అప్ప జెబుతూనే కాలగర్భం లోలోతులకు వెళ్లి వేనవేల వత్సరాల కేళిలో మానవుడుదయించిన శుభ వేళను – మలయ మారుతాలతో, పుడమి పలుకు స్వాగతాలతో, తారకలే మాలికలై మలచిన కాంతితోరణాలతో ఉత్సవీకరించి మన కళ్ళముందు నిలపగలదు. ‘చిరునవ్వు వెన్నెల్లు చిలికేటి వాడా, అరుదైన చిరుముద్దు అరువియ్య రారా’ అంటూ; ‘అల్లారు ముద్దుకదే, అపరంజి ముద్ద కదే... ఒంటరి బతుకైనా ఓపగలుగు తీపికదే’ అంటూ పాట లాలిగా జోలగా మారి వాత్సల్య రసంలో ఓలలాడించగలదు. పాటను కైకట్టిన ఆదికవి ‘అమ్మ’ అంటారు అందెశ్రీ. నేల పొరలను చీల్చుకుని విత్తనం రెండు ముక్కలుగా పగిలి మొలకెత్తినట్లుగా ప్రకృతిమాత పొత్తిళ్ళల్లో కవలశిశువులుగా ప్రాణి పుట్టుక, పాట పుట్టుక అంటూ పాటను సృష్ట్యాదిన ప్రతిష్ఠిస్తారు. గగనాంతరసీమ గానసమూహమై పాటందుకుంటే, నేల రంగస్థలమై ఆటందుకుందంటారు. ప్రకృతి పురుషులు కేళీవిలాసాల్లో తేలుతున్న వేళ జంతుధ్వనుల నుంచి పుట్టిన సప్తస్వరాల అన్వయింపే ఏ పాట అయినా అంటూ పాటల భిన్నత్వంలోనే ఏకత్వాన్ని రూపిస్తారు. పురామానవ పరిణామ కోణం నుంచి గ్రీకు సాహిత్యాన్ని, ఇతర యూరోపియన్ భాషల సాహిత్యంతో బేరీజు వేస్తూ చర్చించిన జార్జి థామ్సన్ అనే పండి తుడు కూడా విచిత్రంగా ఇలాగే పాటను సాహిత్యపు ఆదిమదశలో నిలుపుతాడు. ఆధునిక ఇంగ్లీష్ కవిత్వానికి భిన్నంగా గ్రీకు కవిత్వం పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. గ్రీకు మహాకవి హోమర్ కవిత్వం మన వాల్మీకి రామాయణంలానే తంత్రీలయ సమన్వితంగా ఉంటుంది. వ్యాసభారతం కూడా వాగ్రూపంలో విస్తరించి చివరికి లిఖితరూపం పొందినదే. అలా చూసినప్పుడు నేటి మన పాటకవులందరూ వ్యాసవాల్మీకి పరంపరలోకే వస్తారు. లిఖితరూపంలోకి వచ్చాక కవిత్వం కాళి దాసాదులతో భిన్నమైన మలుపు తిరిగింది. తెలుగులో ఆధునిక కవిత్వం ఆదిలో పాటకు ప్రతిరూపంగా ఎలా వెలువడిందో వివరిస్తూ, అనంతరకాలంలో తెలుగునాట పాటకు ప్రచురణార్హత, కవితకు శ్రవ్యార్హత లేకుండా చేశారని అంబటి సురేంద్రరాజు ఆవేదన వ్యక్తం చేస్తారు. కంటితో చదవడం కన్నా, చెవితో వినడమే కవితకు స్వాభావికమంటాడు. నిన్నమొన్నటి వరకు ఐరిష్ కవిత్వం ప్రధానంగా ఆశుసంప్రదాయాన్నే అనుసరించిందని జార్జి థామ్సన్ కూడా చెబుతూ; మొదట అచ్చులో చదివిన కొన్ని ఐరిష్ కవితలను ఆ తర్వాత ఒక రైతుగాయకుని నోట వినడం తనకు అపూర్వమైన అనుభవంగా వర్ణిస్తాడు. నిరక్షరాస్యులైన ఐరిష్ గ్రామీణుల పెదాలపై కవిత్వం నర్తిస్తూ ఉంటుందని, వారు మాట్లాడే మామూలు మాటలు కూడా కవితాత్మకంగా మారిపోతాయని అంటాడు. సామూహిక శ్రమలో భాగంగా పుట్టిన వాక్కు కవితాత్మకంగా మారి శ్రమకు చోదకంగా మారిందనీ, ఆదిమ కాలంలో పనిలో భాగంగా పాట పుట్టింది తప్ప కేవలం తీరిక సమయాల్లో పాడుకునేందుకు కాదంటాడు. పూర్తిగా లిఖిత సంప్రదాయంలో పెరిగిన కవిత్వం ఆలోచనామృతం కావచ్చు కానీ, సద్యస్పందన కలిగించే పాట ఆలోచనామృతమే కాక ఆపాతమధురం కూడా. ప్రజాక్షేత్రంలో, ప్రజలే ప్రభువులుగా ఉన్న ప్రజాస్వామ్యంలో సామాన్యజనం సహా అందరినీ ఉర్రూతలూగించే పాటకు పట్టం కట్టడం ఎంతైనా సముచితమూ, స్వాగతార్హమూ. పాట కవులందరికీ కోటిదండాలు. -
World Cup Final: తెలుగులో మాట్లాడుకున్న క్రికెటర్లు.. వైరల్ వీడియో
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న అండర్ 19 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్న తెలంగాణ ప్రాంత ఆటగాళ్లు అవనీశ్ రావు, అభిషేక్ మురుగన్ తెలుగులో మాట్లాడుకున్నారు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ సమయంలో వికెట్‌కీపర్ అవనీశ్ రావు, స్పిన్ బౌలర్ అభిషేక్ మురుగన్‌తో హైదరాబాద్ యాసలో సంభాషించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. విదేశీ గడ్డపై వరల్డ్‌కప్ లాంటి మెగా ఈవెంట్ ఫైనల్లో ఇద్దరు తెలుగు వాళ్లు మాట్లాడుకుంటుంటే వినసొంపుగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరు క్రికెటర్లు గ్రౌండ్ లో తెలుగులో మాట్లాడుతుంటే వినడానికి హాయిగా ఉంటుంది కదూ.!! 🤩 మరి ఈరోజు U19 ఫైనల్స్ లో అదే జరిగింది 😃 మరి మీరు కూడా చూసేయండి.!! చూడండి ICC U19 World Cup Final#INDU19vAUSU19 లైవ్ మీ #StarSportsTelugu & Disney + Hotstar లో#U19WorldCupOnStar pic.twitter.com/UPX0xz7zCd — StarSportsTelugu (@StarSportsTel) February 11, 2024 ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి దిశగా పయనిస్తుంది. ఆసీస్ నిర్ధేశించిన 254 పరుగుల లక్ష్య ఛేదనలో యువ భారత్ చేతులెత్తేసింది. 36 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 136/8గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే ఇంకా 118 పరుగులు చేయాలి చేతిలో కేవలం మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఏదైన మహాద్బుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో టీమిండియా గట్టెక్కలేదు. మురుగన్ అభిషేక్ (23), నమన్ తివారి (2) క్రీజ్‌లో ఉన్నారు. భారత స్టార్ త్రయం ముషీర్ ఖాన్ (22), ఉదయ్ సహారన్ (8), సచిన్ దాస్ (9) డు ఆర్ డై మ్యాచ్‌లో చేతులెత్తేశారు. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (47) కొద్దో గొప్పో ఆడేందుకు ప్రయత్నించాడు. ఆర్శిన్ కులకర్ణి 3, ప్రియాన్షు మోలియా 9, అవనీశ్ 0, రాజ్ లింబాని 0 పరుగులకు ఔటయ్యారు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో హర్జస్ సింగ్ (55) అర్దసెంచరీతో రాణించగా.. హ్యారీ డిక్సన్ (42), హగ్ వెబ్జెన్ (48), ఒలివర్ పీక్ (46 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో రాజ్ లింబాని 3, నమన్ తివారి 2, సౌమీ పాండే, ముషీర్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. -
ఎక్కువ పన్నులు కట్టాలంటున్న బిల్ గేట్స్! ఎందుకు..?
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఈయన ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నారు. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం బిల్‌గేట్స్ సంపద 141 బిలియన్ డాలర్లు. ప్రపంచంలోని సంపన్నులు ఎక్కువ పన్నులు చెల్లించాలని తాను కోరుకుంటున్నట్లు బిల్ గేట్స్ చెప్పారు. తాజాగా దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో బిల్‌గేట్స్ మాట్లాడుతూ సంపన్న దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎక్కువ డబ్బును విరాళంగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఆర్థిక అసమానతలను సరిదిద్దడంలో ఈ చర్య సహాయపడుతుందన్నారు. కాగా ఏడాది క్రితమే ఆయన రెడ్డిట్‌లో తన 'ఆస్క్ మీ ఎనీథింగ్' ఫోరమ్‌లో చేసిన వ్యాఖ్యలో సంపన్నులకు పన్నులు ఎక్కువగా పెంచకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సంపద పన్ను విధించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిస్తూ 250 మందికి పైగా అల్ట్రా-రిచ్ వ్యక్తులు బహిరంగ లేఖ విడుదల చేసినట్లు బిజినెస్ ఇన్సైడర్ నివేదించింది. బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్ ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో అత్యంత సంపన్నడైన బిల్‌గేట్స్.. అత్యధిక సంపదను కలిగి ఉన్న దేశాలు, కంపెనీలు, వ్యక్తులు మరింత ఉదారంగా ముందుకు రావాలన్నారు. అబిగైల్ డిస్నీ, 'సక్సెషన్' నటుడు బ్రియాన్ కాక్స్ వంటి వారు సంతకం చేసిన ఈ బహిరంగ లేఖలో సంపన్నులకు మరింత పన్ను విధించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. అత్యంత సంపన్నులపై అధిక పన్నులు విధించడం వల్ల వారి జీవన ప్రమాణాలపై ఎటువంటి ప్రభావం ఉండదన్నారు. -
Heroines New Year 2024 Party Celebrations: తెలుగు హీరోయిన్స్ న్యూ ఇయర్ పార్టీ (ఫొటోలు)
-
‘అనువాదం’ బొమ్మ అదిరింది
కథ బాగుందా? బొమ్మ (సినిమా) అనువాదం అయినా తెలుగు ప్రేక్షకులు అదిరిపోయే వసూళ్లు ఇస్తారు. అలా ఈ ఏడాది డబ్బింగ్ బొమ్మల వసూళ్లు బాగానే ఉన్నాయి. కొన్ని భారీ వసూళ్లు సాధిస్తే.. కొన్ని ఫర్వాలేదనిపించుకున్నాయి. కొన్ని చిత్రాలు నిరాశపరిచాయి. ఏది ఏమైనా ఈ ఏడాది అనువాదం బొమ్మ అదిరిందనే చెప్పాలి. ఆ విశేషాల్లోకి... మాతృక హిట్.. అనువాదం ఫట్ తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో హిట్‌గా నిలిచిన పలు చిత్రాలు తెలుగులో ఫర్వాలేదనిపించుకున్నాయి. కొన్ని మాతృకలో హిట్టయినా, ఇక్కడ ఆశించిన ఫలితం సాధించలేకపోయాయి. విశాల్ ‘మార్క్ ఆంటోనీ’, అదా శర్మ ‘ది కేరళ స్టోరీ’, ఎస్.జె. సూర్య, రాఘవా లారెన్స్‌ల ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’, రక్షిత్‌శెట్టి ‘సప్తసాగరాలు దాటి’ రెండు భాగాలు, దుల్కర్ సల్మాన్ ‘కింగ్ ఆఫ్ కోత, కార్తీ ‘జపాన్’, రాఘవా లారెన్స్ ‘చంద్రముఖి 2’, శివ రాజ్‌కుమార్ ‘ది ఘోస్ట్’, రిషబ్ శెట్టి ‘బాయ్స్ హాస్టల్’, పూ రాము, కాళీ వెంకట్ కీలక పాత్రల్లో నటించిన ‘దీపావళి’ వంటి చిత్రాలు మాతృకలో ఫర్వాలేదనిపించినా తెలుగులో ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణపోందలేకపోయాయి. సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’, టైగర్ ష్రాఫ్ ‘గణపథ్’, వంటి హిందీ చిత్రాలు తెలుగులో హిట్ టాక్ని సొంతం చేసుకోలేక పోయాయి. జైలర్ రజనీకాంత్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఇటీవల ఆశించిన విజయాలు ఇవ్వకుండా ఫ్యాన్స్‌ను నిరుత్సాహపరిచిన ఆయన ‘జైలర్’తో మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వచ్చేశారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్, రమ్యకృష్ణ జోడీగా నటించారు. ఈ మూవీలో జైలర్ ముత్తువేల్ పాండ్యన్‌గా రజనీ నటించారు. కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రంలో మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివరాజ్‌కుమార్ వంటి స్టార్స్ అతిథి పాత్రల్లో అలరించారు. తెలుగు, తమిళ భాషల్లో ‘జైలర్’ సూపర్ హిట్. వారసుడు.. లియో విజయ్ హీరోగా నటించిన తమిళ చిత్రం ‘వారిసు’. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్, పరమ్ వి.పోట్లూరి, పెరల్ వి.పోట్లూరి నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి రేస్‌లో జనవరి 11న తమిళంలో రిలీజైంది. ‘వారసుడు’ పేరుతో తెలుగులోకి అనువదించి, సంక్రాంతి పోటీలోనే జనవరి 14న రిలీజ్ చేశారు. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ తెలుగులోనూ హిట్‌గా నిలిచింది. ఇక విజయ్ నటించిన మరో చిత్రం ‘లియో’. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ తెలుగులో డబ్ చేసి, అక్టోబర్ 19నే రిలీజ్ చేశారు. తెలుగులో ‘లియో’ టైటిల్‌పై వివాదం చెలరేగినా, ఆ తర్వాత సద్దుమణిగింది. తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘లియో’ తెలుగులోనూ మంచి వసూళ్లు రాబట్టింది. పొన్నియిన్ సెల్వన్–2 కల్కి కృష్ణమూర్తి నవలపోన్ని యిన్ సెల్వన్ ఆధారంగా దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన చిత్రం పొన్నియిన్ సెల్వన్ 1’. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే కథ ఇది. విక్రమ్, ఐశ్వర్యా రాయ్, త్రిష, కార్తీ, ‘జయం’ రవి, శోభిత ధూళిపాళ్ల, ప్రకాశ్‌రాజ్, శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు. మణిరత్నం, సుభాస్కరన్ నిర్మాతలు. రెండు భాగాలుగా రూపొందిన ఈ సినిమా తొలి భాగం గత ఏడాది విడుదలై, తమిళ్, తెలుగు భాషల్లో హిట్ అయింది. పొన్నియిన్ సెల్వన్ 2’ ఈ ఏడాది ఏప్రిల్ 28న రిలీజైంది. తెలుగులో నిర్మాత ‘దిల్’ రాజు రిలీజ్ చేయగా మంచి వసూళ్లు రాబట్టింది. పఠాన్.. జవాన్ ‘జీరో’ (2018) సినిమా తర్వాత దాదాపు నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని షారుఖ్ ఖాన్ నటించిన చిత్రం ‘పఠాన్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో స్పై యాక్షన్ నేపథ్యంలో ఆదిత్యా చో్రపా నిర్మించిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన తొలి హిందీ సినిమాగా ‘పఠాన్’ రికార్డులు సృష్టించింది. తెలుగులోనూ ఈ సినిమా హిట్‌గా నిలిచింది. ఇక షారుక్ నటించిన మరో చిత్రం ‘జవాన్’ కూడా తెలుగులో ఓకే అనిపించుకుంది. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 1200 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. షారుక్ నటించిన తాజా చిత్రం ‘డంకీ’ ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఈ సినిమా కూడా హిట్ అయితే మూడు విజయాలతో షారుక్ ఈ ఏడాది హ్యాట్రిక్ సాధించినట్లే. యానిమల్ ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ‘యానిమల్’. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించారు. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 1న రిలీజైంది. తెలుగులో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు రిలీజ్ చేశారు. ఈ చిత్రంలోని అడల్ట్ కంటెంట్‌పై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ అవేవీ వసూళ్లను ఆపలేకపోయాయి. విడుదలైన రోజు నుంచి ఇప్పటికీ భారీ వసూళ్లతో దూసుకెళుతోంది. బిచ్చగాడు 2 విజయ్ ఆంటోని కెరీర్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘బిచ్చగాడు’ (‘పిచ్చైకారన్’). శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2016లో విడుదలై ఘనవిజయం సాధించింది. తెలుగులో ‘బిచ్చగాడు’గా విడుదలై, బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ‘బిచ్చగాడు’ విడుదలైన ఏడేళ్లకు ఈ ఏడాది ‘బిచ్చగాడు 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ ఆంటోని హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాలతో తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. రిలీజ్ రోజున మిక్డ్స్ టాక్ వచ్చినా, మంచి వసూళ్లు రాబట్టింది. 2018 కేరళప్రాంతంలో 2018లో వచ్చిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘2018’. టోవినో థామస్, కుంచకో బోబన్, అపర్ణా బాలమురళి, లాల్, ఆసిఫ్ అలీ నటించారు. జూడ్ ఆంటోని జోసెఫ్ దర్శకత్వం వహించారు. వేణు కున్నప్పిళ్లై, సీకే పద్మ కుమార్, ఆంటోని జోసెఫ్ నిర్మించిన ఈ సినిమా మే 5న ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది. రూ. వంద కోట్లు వసూలు చేసిన తొలి మలయాళ చిత్రంగా రికార్డు సృష్టించింది. మలయాళంలో విడుదలైన 20 రోజులకే ఈ చిత్రం తెలుగులోనూ ‘2018’ పేరుతోనే అనువాదం అయింది. నిర్మాత ‘బన్నీ’ వాసు తెలుగులో విడుదల చేయగా, ఇక్కడ కూడా హిట్‌గా నిలిచింది. 2018లో కేరళలో వచ్చిన వరదలు, అప్పుడు ప్రజలు పడ్డ ఇబ్బందులు, భావోద్వేగాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. -
డల్లాస్‌లో తెలుగు గ్రంథాలయం ప్రారంభం
అమెరికాలో తెలుగువారు అధికంగా నివసించే నగరాల్లో ఒకటైన డల్లాస్‌లో శుక్రవారం సాయంత్రం తెలుగు గ్రంథాలయాన్ని ప్రారంభించారు. డల్లాస్ శివారు లూయిస్విల్లో ప్రవాసాంధ్రుడు మల్లవరపు అనంత్ R2 Realty కార్యాలయంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ గ్రంథాలయాన్ని గాయని ఎస్పీ శైలజ, గాయకుడు ఎస్పీ చరణ్, తానా మాజీ అధ్యక్షుడు డా. తోటకూర ప్రసాద్‌లు ప్రారంభించారు. ఎస్పీ శైలజ మాట్లాడుతూ అమెరికాలో తెలుగు గ్రంథాలయం ఏర్పాటు చేయడాన్ని హర్షించారు. రోజుకు ఒక పేజీ తెలుగు చదవాలని, తద్వారా మాతృభాషకు దూరం కాకుండా ఉండగలమని అన్నారు. ఎస్పీ చరణ్ మాట్లాడుతూ ఒకప్పుడు అమెరికాలో తెలుగువారంటే డాక్టర్లు గుర్తుకు వచ్చేవారని, కానీ ఇప్పుడు అనంత్ వంటి రియల్టర్లతో పాటు సమాజంలోని విభిన్న కోణాలకు చెందిన ఎందరో అమెరికా వస్తున్నారని తెలుగు భాష పట్ల ఆయనకున్న మక్కువతో ఏర్పాటు చేసిన గ్రంథాలయం అమెరికాలో వెలుగులు పంచాలని ఆకాంక్షించారు. తానా మాజీ అధ్యక్షుడు డా. తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ ఆస్టిన్లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్‌లో తెలుగు కోర్సుల నిర్వహణ నిమిత్తం తానా నిధుల సేకరణ చేపట్టినప్పుడు ఎస్పీ బాలు విభావరితో అలరించాలని ఆయన ఆశ ధ్యాస శ్వాస తెలుగు భాష అని కొనియాడారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆరు సంపుటాలుగా వెలువరించిన సిరివెన్నెల సమగ్ర సాహిత్యాన్ని శైలజ-చరణ్‌ల చేతుల మీదుగా ఈ గ్రంథాలయానికి బహుకరించారు. త్వరలోనే తానా ఆధ్వర్యంలో కవిరత్న కొసరాజు రాఘవయ్య చౌదరి సమగ్ర సాహిత్యాన్ని వెలువరిస్తామని ప్రసాద్ తెలిపారు. “ట్యాంక్‌బండ్‌పై తెలుగు విగ్రహాల ప్రశస్తి” పేరిట చెన్నపూరి తెలుగు అకాడమీ ప్రచురించిన పుస్తకాన్ని కూడా ఈ సభలో ఆవిష్కరించారు. వేముల లెనిన్, మద్దుకూరి చంద్రహాస్, అనంత్ మల్లవరుపులు కొండేపూడి లక్ష్మీనారాయణ రచించిన “పాడరా ఓ తెలుగువాడా” గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభించారు. అతిథులకు అనంత్ ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి పేరిట స్వదేశంలో పాఠశాల కట్టించానని, అమెరికాలో తన తల్లి పేరిట గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శారద సింగిరెడ్డి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, పరమేష్ దేవినేని, రాజేష్ అడుసుమిల్లి, బీరం సుందరరావు, సురేష్ మండువ, లక్ష్మీ పాలేటి తదితరులు పాల్గొన్నారు. -
యాక్షన్ ఘోస్ట్
కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ హీరోగా శ్రీని దర్శకత్వంలో రూపొందిన కన్నడ యాక్షన్ చిత్రం ‘ఘోస్ట్’. అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అర్చనా జాయిస్, సత్య ప్రకాశ్ కీలక పాత్రల్లో నటించారు. ఎన్ . సందేశ్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 19న విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభించిందని, దీంతో ఈ సినిమాను నవంబరు 4న తెలుగులోనూ విడుదల చేయనున్నట్లుగా చిత్రం యూనిట్ వెల్లడించింది. ఈ చిత్రానికి సంగీతం: అర్జున్ జన్య. -
వర్జీనియాలో కొలకలూరి ఇనాక్‌తో ఆత్మీయ సమ్మేళనం!
అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో ప్రముఖ కవి, కథా-నవలా రచయిత, వ్యాసకర్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. అక్టోబరు 7న లోటస్ టెంపుల్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ అవధానులు శ్రీ నరాల రామిరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని కథా-నవలా రచయిత, ఫిలిం మేకర్, ఇనాక్ అమెరికా పర్యటన పర్యవేక్షకులు వేణు నక్షత్రం ఆధ్వర్యంలో, సాహిత్యాభిమానులు వాషింగ్టన్ సాహితీ సంస్థ నిర్వాహకులు రవి వేలూరి, సాహిత్యాభిమానులు ప్రసాద్ చెరసాల, కవి చంద్ర కాటుబోయిన, పవన్ గిర్లా, ప్రవీణ్ దొడ్డల సంయుక్త నిర్వాహణలో జరిగింది. ఈ సందర్భంగా ఇనాక్ మాట్లాడుతూ ఈ ప్రపంచంలో దేన్ని అయినా, ఎంతటి కఠినాత్ములని అయినా ప్రేమతో మాత్రమే జయించవచ్చని, శత్రువుని ఎదిరించడానికి సాహిత్యాన్నే ఆయుధంగా ఉపయోగించానని తెలిపారు. బలహీనులని పీడిస్తే , ఏదో ఒకరోజు వారు తిరగబడతారని బలవంతులు గ్రహించాలని అన్నారు. తన రచనలన్నీ సమాజంలోజరిగిన సంఘటనలే అని వాటి ద్వారా కొంత నయినా అవగాహన కల్పించడమే తన ఉద్దేశ్యం అని పేర్కొన్నారు. సభాధ్యక్షులు నరాల రామిరెడ్డి మాట్లాడుతూ, ఇనాక్ సభలో అధ్యక్షత వహించడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ఇనాక్ రచనలు చాలా చదివానని, సాహిత్యంలో కథ, నవల, పద్యం, వ్యాసం ఇలా ప్రతి అంశాన్ని సృజించి ప్రతి ప్రక్రియలో అవార్డులు పొందిన ఘనత ఇనాక్ గారిదే అని అన్నారు. సభా నిర్వాహకులు వేణు నక్షత్రం మాట్లాడుతూ.. ఇనాక్‌కి ఇప్పటికే వచ్చిన ఎన్నో అవార్డులతో పాటు ఉత్తమ తండ్రి అనే అవార్డు కూడా ఇవ్వాలని అన్నారు. ఎందుకంటే ఇనాక్ తన ముగ్గురు పిల్లలు ఎలాంటి రిజర్వేషన్లు ఉపయోగించకుండా కేవలం ప్రతిభతో అత్యుత్తమ చదువులు చదివి సమాజంలో అధ్యాపకులుగా, క్లాస్ వన్ ఉద్యోగులుగా తీర్చిదిద్దడంలో ఇనాక్ గారి సాహిత్యం ఎంతో ఉపయోగపడిందని వేణు నక్షత్రం అన్నారు. ఇనాక్ రాసిన మునివాహనుడు కల్పిత నవల అంశం ఇప్పుడు సమాజంలో మునివాహన సేవగా ప్రాచుర్యం పొందడం లాంటి ఘనత ఇనాక్ రచనలకే చెందిందని కొనియాడారు. రవి వేలూరి , రమేష్ రావెళ్ల గారు ఇనాక్ని, నరాల రామిరెడ్డి ని శాలువాతో సత్కరించారు. కాపిటల్ ఏరియా తెలుగు అధ్యక్షులు సతీష్ వడ్డీ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ప్రతీ సంవత్సరం ఒకసారి ప్రత్యేక సాహిత్య సమావేశాలు నిర్వహించడానికి ప్రయత్నిసానని అన్నారు. అమెరికాలో తెలుగు సంస్థలు ప్రతి రెండేళ్ళకోసారి కోట్ల ఖర్చుతో సదస్సు నిర్వహిస్తారని, అందులో సాహిత్యానికి తగిన ప్రాముఖ్యత లభించడం లేదని, అందుకే ప్రతి సంవత్సరం ఒక సారి ప్రత్యేక సాహితీ సమావేశాలు నిర్వహిస్తే, తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించిన వారవుతారని వేణు నక్షత్రం తెలుగు సంఘాలని కోరారు. వాషింగ్టన్, మేరీలాండ్, వర్జీనియా ప్రాంతంలోని సాహిత్యాభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. (చదవండి: సింగపూరులో ఘనంగా తెలుగుతోరణం వేడుకలు) -
సింగపూరులో ఘనంగా తెలుగుతోరణం వేడుకలు
సింగపూరు తెలుగు టీవీ వారు నిర్వహించిన తెలుగుతోరణం తెలుగు నీతిపద్యాల పోటీ చివరి వృత్తం దాదాపు మూడు వందల ప్రేక్షకుల నడుమ, ప్రత్యక్ష ప్రసారంగా ఘనంగా నిర్వహించారు. సింగపూరు తెలుగు ప్రముఖులు డా. బి. వీ. ఆర్. చౌదరి, రాజ్యలక్ష్మి దంపతులతో పాటుగా సింగపూరు నందు ఉన్న తెలుగు సంస్థలు సింగపూరు తెలుగు సమాజం, తెలంగాణా కల్చరల్ సొసైటీ సింగపూరు, కాకతీయ సాంస్కృతిక పరివారము, శ్రీ సాంస్కృతిక కళా సారధి, పోతన భాగవత ప్రచార సమితి సంస్థల ప్రతినిధులతో పాటుగా తెలుగు సమూహాలు అయిన మనం తెలుగు, అమ్ములు, తెలుగు వనితలు, ప్రాడ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు హాజరయ్యి ఈ కార్యక్రమం ఆసాంతం వీక్షించి తమ అభినందలను తెలియచేసారు. కార్యక్రమ తదనంతరం నిర్వహకులు వారిని కృతజ్ఞతా జ్ఞాపికలతో సత్కరించారు. అదే విధంగా కార్యక్రమం అనుకున్నది మొదలు ఎందరో తమంత తాముగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమ నిర్వహణకుగా తమ వంతు సహాయ సహకారాలు అందించారు. వారిని కూడా ఈ వేదిక మీద సత్కరించడం జరిగింది. సుమారు 20 మంది చిన్నారులతో పది వారాల పాటు జరిగిన ఈ పద్యాల పోటీ సింగపూరులోనే మొట్టమొదటి తెలుగు రియాలిటీ షోగా నిలిచి ఇక్కడ ఉన్న చిన్నారులలోని తెలుగు ప్రతిభా పాటవాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఎన్నెన్నో పద్యాలు నేర్చుకుని, పద్యం చెప్పడమే కాకుండా దాని భావాన్ని, అర్ధాన్ని ఉదాహరణలతో, చిన్ని చిన్ని నీతి కథలతో సహా వివరించడం ఈ పోటీపై వారికున్న ఇష్టాన్ని, శ్రద్దను తెలియ చేసింది, ప్రేక్షకులను అలరించింది. చిన్నారుల తల్లి తండ్రులు మాట్లాడుతూ ఈ పోటీ వల్ల తమకు కూడా మరొక్కసారి ఈ నీతి పద్యాలను చదువుకునే అవకాశం కలిగిందన్నారు. దాని అర్ధాలు ఇప్పటి సమాజానికి ఎలా వర్తిస్తాయో కూడా అన్వయించుకోవడం వల్ల ఈ పోటీ తమకు కూడా జీవితానికి ఒక రివిజన్ లా అనిపించిందని చెబుతున్నారు. అలాగే ఈ కార్యక్రమం చూసిన స్పూర్తితో ఇంటి వద్ద తమ చిన్నారులు కూడా తెలుగు నీతి పద్యాలను నేర్చుకుంటున్నారు అని కార్యక్రమానికి హాజరైన తెలుగు వారు తెలియచేయడం జరిగింది. ఈ పోటీలో మొదటి స్థానంలో ఓరుగంటి రాధా శ్రీనిధి, రెండవ స్థానంలో సూదలగుంట ఆరాధ్య మూడవ స్థానంలో సింగిరెడ్డి శ్రీనిత విజేతలుగా ఎన్నికయ్యారు. విజేతలతో పాటుగా కార్యక్రమంలో పాల్గొన్న పోటీదారులందరికీ తెలుగు ప్రముఖులలు జ్ఞాపికలు అందించడంతో పాటుగా దాదాపు 3 వేల డాలర్ల వరకూ నగదు బహుమతులు కూడా అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వారికీ అలాగే సాంస్కృతికి కార్యమాలు ప్రదర్శించిన వారు అందరికీ తెలుగు ప్రముఖుల చేతుల మీదుగా జ్ఞాపికలు ప్రధానం చేయడం జరిగింది. అదే విధంగా కార్యక్రమాన్ని, పోటీలో పాల్గొన్న చిన్నారులనూ దీవిస్తూ శసాయి కుమార్, తనికెళ్ళ భరణి, రారాధికా, భువన చంద్ర వంటి సినీ ప్రముఖులు పంపిన వీడియో సందేశాలను కూడా వేదిక మీద ప్రదర్శించడం జరిగింది. కార్యక్రమ నిర్వాహకులు రాధా కృష్ణ గణేశ్న, కాత్యాయని గణేశ్న మాట్లాడుతూ సింగపూరు నందు ఉన్న అన్ని తెలుగు సంస్థలూ అలాగే అందరు తెలుగు ప్రముఖులూ ఒకే సారి ఈ వేదిక మీదకు వచ్చి తమకు ఆశీర్వాదాలు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అన్ని తెలుగు సంస్థల ఆశీస్సులతో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం తమ కల అని అది ఈ రోజు నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే తమ తమ చదువులతో బిజీగా ఉన్నా తెలుగు భాష మీద మక్కువతో పద్యాలు నేర్చుకుని కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు, వారికి శిక్షణ ఇచ్చిన తల్లి తండ్రులకు కృతజ్ఞతలు తెలియచేసారు నిర్వాహకులు. ఇది తెలుగు భాషకు తమ వంతుగా చేసుకున్న ఒక చిన్న సేవ అని సగర్వంగా చెప్పారు. ఇంత పెద్ద వేదిక మీద ఇంతటి పెద్ద కార్యక్రమం పది భాగాలుగా నిర్వహించగలగడం అందరి తెలుగు వారి సహకారంతో మాత్రమే సాధ్యమైందన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం స్పూర్తితో ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు సింగపూరు నుంచి వస్తాయని ఆశిస్తున్నామని వాటికి తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. ఈ నీతి పద్యాల పోటీకి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన రాంబాబు పాతూరి, అపర్ణ గాడేపల్లి మరియు సౌభాగ్యలక్ష్మి తంగిరాల వారికి ధన్యవాదాలు తెలిపారు. ఆ న్యాయ నిర్ణేతలు ఈ కార్యక్రమ ప్రణాళికలో పాలుపంచుకుని పిల్లలకు అనువైన పద్యాలను ఎంపిక చేసి అందించడమే కాకుండా పిల్లలు చెప్పిన ప్రతి పద్యానికీ వివరణాత్మకమైన విశ్లేషణ చేయడమే గాక మరింత కొత్తదనంతో ఎలా నేర్చుకోవచ్చో సలహాలు అందించి వారిని ప్రోత్సహించారు. అలాగే వ్యాఖ్యాతలుగా కవిత కుందుర్తి, సుబ్బు పాలకుర్తి చిన్నారులు వేదిక మీద భయం లేకుండా పద్యాలు చెప్పేలా వారిని ఉత్సాహ పరిచి సరదా సరదా సంభాషణలతో కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయప్రదం చేశారన్నారు నిర్వాహకులు రాధ కృష్ణ గణేశ్న, కాత్యాయని గణేశ్నలు. (చదవండి: యూకేలో గాన గంధర్వునికి ఘనంగా సంగీత నివాళి!) -
ప్రపంచాన్ని చుట్టిన తెలుగు వీరుడు..
-
ప్రతి రైతు మనుసును కదిలిస్తున్న 'నాగలి' చిత్రం.. యూట్యూబ్‌లో విడుదల
నిజ జీవిత విలువల నేపథ్యంలో వస్తున్న సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా రైతు నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ నీరాజనం పలుకుతుంటారు. రైతన్న కష్టసుఖాలను తెరపై ఆవిష్కరించే సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఇదే బాటలో ఇప్పుడు 'నాగలి' అనే ఒక లఘు చిత్రాన్ని డాక్టర్ విశ్వామిత్ర రెడ్డి, మానస (USA) సమర్పణలో సుంకర.నీలిమా- దేవేందర్ రెడ్డి నిర్మించారు. తాజాగా యూట్యూబ్‌లో విడుదలైన 'నాగలి' అనే 24 నిమిషాల లఘు చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో బలగం ఫేమ్ అరుసం మధుసుదన్ కీలక పాత్రలో నటించారు. (ఇదీ చదవండి: ఫ్యాన్స్‌కు కోటి విరాళం.. అవసరం ఉన్న వాళ్లు ఇలా ధరఖాస్తు చేసుకోండి: విజయ్) నేషనల్ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేస్తున్న నివేదికల ప్రకారం ప్రతి ఏడాది భారత్‌లో సుమారు 15 వేలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతుల ఆత్మహత్యలు దేశానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదని సాక్షాత్తు సుప్రీం కోర్టు కూడూ పలు మార్లు వ్యాఖ్యానించింది. రైతుల ఆత్మహత్యలపై ప్రతీ రోజూ పత్రికల్లో వార్తా కథనాలు వస్తుంటాయి.. వారి పరిస్థితి హృదయ విదారకంగా ఉంటుంది. ఎందుకంటే మన అందరిదీ కూడా రైతు నేపథ్యం కాబట్టి. అలాంటి రైతుల ఘోషను గుర్తించిన సుంకర.నీలిమా- దేవేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. తమ వంతుగా ఇలాగైనా రైతుల ఆత్మహత్యలు ఆగాలనే ఆకాంక్షతో 24 నిమిషాల నిడివితో 'నాగలి' అనే లఘు చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో మొదట తన ప్రేమను ప్రియురాలు కాదని చెప్పడంతో ఒక యువకుడు పొలం గట్టుపైనే పురుగుల మందు తాగే ప్రయత్నం చేస్తాడు. ఈలోపు నటుడు మధు అక్కడ ప్రత్యక్షం అయి అతన్ని ఆపే ప్రయత్నం చేస్తాడు.. ఈ సీన్ రెగ్యూలర్ సినిమాల్లో మాదిరి కాకుండా కొంచెం ప్రత్యేకంగా క్రియేట్ చేశారు. నీతో పాటు పురుగుల మందు తాగి చనిపోయేందుకు ఒక పెద్దాయన కూడా ఇక్కడికి వస్తున్నాడని ఆ యువకుడితో చెప్తాడు. అది నీకు ఎలా తెలుసని ఆ యువకుడు ప్రశ్నిస్తాడు. ఈలోపు ఆ పెద్దాయన నిజంగానే వస్తాడు. వారిద్దరూ చనిపోబోతున్నట్లు ముందే అతను ఎలా గ్రహించాడు...? ఒకరైతు ఎందుకు చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు..? ఆ యువకుడిని కాదన్న యువతి ఎవరు..? వారితో పాటు ఉన్న తీరని కష్టాలు ఏంటి..? తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే. ప్రతి గ్రామంలో ఉండే యువకుల్లో కొందరైనా ఇలా ఆలోచిస్తే తమ చుట్టూ ఉన్న రైతులను కాపాడుకోవచ్చని దర్శకుడు జానా రాజ్‌కుమార్ చెప్పిన విధానం మెప్పిస్తుంది. ఎంతో ఆసక్తిగా సాగే ఈ చిత్రాన్ని మీరూ చూసేయండి. -
తికమక తెలుగుతో ప్రయాణికుల తకరారు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకల సమాచారం తెలిపే ఎల్రక్టానిక్ డిస్ప్లే బోర్డుల్లో వినియోగిస్తున్న సరికొత్త భాష ప్రయాణికులను గందరగోళం, అయోమయానికి గురి చేస్తోంది. సహజంగా ఊరి పేరు డిస్ప్లే చేస్తారు. కానీ ఘనత వహించిన దక్షిణ మధ్య రైల్వేలో మాత్రం ఊళ్ల పేర్లకు అర్ధాలు వెదికీ మరీ ప్రయాణికుల ముందుంచుతున్నారు. అది కూడా గూగుల్‌తో అనుసంధానించి మరీ తర్జుమా చేస్తున్నారు. దాంతో ప్రయాణికులకు సమాచారం ఇవ్వటం అటుంచి.. వారిని మరింత తికమకపెట్టి అయోమయానికి గురి చేస్తున్నారు. ♦ దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ స్టేషన్లో ఈ తికమక తంతు ఎలా ఉందో కళ్లకు కట్టే ఉదాహరణ ఇది. దక్షి ణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రంగా ఉన్న రైల్ నిలయానికి అతి సమీపంలో ఉన్న ఈ స్టేషన్లో నిత్యం లక్షల మంది ప్రయాణికులు కళ్లప్పగించి చూసే రైళ్ల వివరాలను తెలిపే ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డు ఇది. ♦ తమిళనాడులోని ఎరోడ్ పట్టణానికి వెళ్లే స్పెషల్ రైలుకు సంబంధించి వివరాలు డిస్ప్లే బోర్డు మీద కనిపిస్తున్నప్పుడు ఇంగ్లీష్, హిందీలో సరిగానే ఉంది. కానీ తెలుగులో ప్రత్యక్షమైనప్పుడు విస్తుపోవటం ప్రయా ణికుల వంతవుతోంది. ‘‘ఎరో డ్ స్పెషల్’’అన్న రెండు పదాలకు తెలుగులో ‘‘క్షీణించు ప్రత్యేక’’అని కనిపిస్తోంది. ఎరోడ్ అన్నది ఊరు పేరు అన్న విషయం కూడా మరిచి, దాన్ని ఆంగ్ల పదంగానే భావిస్తూ తె లుగులోకి తర్జుమా చేసేశారు. ఎరోడ్ అన్న పదానికి క్షీణించటం, చెరిగిపోవటం అన్న అర్ధాలుండటంతో తెలుగులో క్షీణించు అన్న పదాన్ని డిస్ప్లే బోర్డులో పెట్టేశారు. స్పెషల్ అంటే ప్రత్యేక అన్న పదాన్ని జోడించారు. తెలుగులోకి బెంగాలీ పదాలు.. ♦ ఇది స్టేషన్‌లోనికి వెళ్లే ప్లాట్‌ఫామ్ నెం.10 వైపు ప్రధాన మార్గం. ఎదురుగా భారీ ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేసి రైళ్ల వివరాలు ప్రద ర్శిస్తారు. అందులో నాగర్సోల్–నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు రావటంలో ఆలస్యం జరుగుతోందని పేర్కొంటూ దాని వేళలను మార్చారు. ఆ విష యం ప్రయాణికులకు తెలిపేందుకు డిస్ప్లే బోర్డు లో ఆ వివరాలు ఉంచారు. ఇంగ్లీష్‌లో ఆ రైలు పేరు ఎదురుగా రీషెడ్యూల్ అని రాసి తర్వాత కొత్త సమయాన్ని ఉంచారు. హిందీలో పరివర్తిత్ సమయ్ అని పేర్కొన్నారు. కానీ తెలుగులో ఆ ఎక్స్‌ప్రెస్ పేరు ఎదురుగా బెంగాలీ భాష పదాన్ని ఉంచారు. తెలుగుకు, బెంగాలీకి తేడా తెలియని సిబ్బంది నిర్వాకమిది. ఇంగ్లీష్, హిందీ తెలియని తెలుగు ప్రయాణికులకు ఈ వ్యవహారం మతిపోగొడుతోంది. అర్ధం కాని తికమక వ్యవహారంతో వారికి రైళ్ల సమాచారం సరిగా చేరటం లేదు. ప్రైవేటు సిబ్బంది నిర్వాకం రైళ్ల వివరాలను వాయిస్ అనౌన్స్మెంట్ ద్వారా తెలపటం, ఎల్రక్టానిక్ డిస్ప్లే బోర్డుల ద్వారా తెలిపే పనిని రైల్లే టెండర్ల ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది. ఆ బాధ్యత చూసే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఈ గందరగోళం నెలకొంది. సాంకేతికంగా ఏదైనా తప్పు జరిగితే వెంటనే గుర్తించాల్సిన రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ తికమక తెలుగు సమస్య ఇప్పటివరకు పరిష్కారమవ్వలేదు. -
వేడుకగా హంస పురస్కారాల ప్రదానం
రాజానగరం: రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ ఆధ్వర్యంలో హంస పురస్కారాల ప్రదాన కార్యక్రమం మంగళవారం వేడుకగా జరిగింది. తెలుగు భాషాభివృద్ది కి విశిష్ట సేవలందిస్తున్న తొమ్మిది మంది ప్రముఖులను ఘనంగా సన్మానించి, పురస్కారాలను అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఆదికవి నన్నయ యూనివర్సిటీలోని తెలుగు విభాగం, రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు జయంతి, తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తొమ్మిది మందికి హంస పురస్కారాలు ప్రదానం చేశారు.వీరిలో సాహిత్యంలో ఎస్.అబ్దుల్ అజీజ్ (రచయిత, కర్నూలు), మెడుగుల రవికృష్ణ (ఉపాధ్యాయుడు, గుంటూరు), డాక్టర్ జడా సుబ్బారావు (అసిస్టెంట్ ప్రొఫెసర్, నూజివీడు), వైహెచ్‌కే మోహనరావు (విలేకరి, పిడుగురాళ్ల), సామాజిక రచనలో ఎండపల్లి భారతి (రచయిత్రి, చిత్తూరు), కవిత్వంలో మాడభూషి సంపత్‌కుమార్ ఆచార్యులు (నెల్లూరు), అవధానంలో సూరం శ్రీనివాసులు (రిటైర్డ్ హెచ్ఎం, నెల్లూరు), సాంకేతిక రచనలు డాక్టర్ కేవీఎన్డీ వరప్రసాద్ (అసిస్టెంట్ ప్రొఫెసర్, రాజమహేంద్రవరం) ఉన్నారు. వ్యాసరచన పోటీల్లో గండికోట హిమశ్రీ (బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు), జస్మితరెడ్డి (మంగళగిరి)లకు ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్, రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి,‘నన్నయ’ వీసీ ఆచార్య పద్మరాజు, సాహితీవేత్త, సంఘ సేవకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ప్రముఖ సాహితీవేత్త శలాక రఘునాధశర్మ, రిజిస్ట్రార్ ఆచార్య కె. సుధాకర్ ప్రసంగించారు. -
భాషోద్యమంలో పిడుగు గిడుగు!
"దేహబలమున కోడి రామమూర్తి- బుధ్ధిబలమున గిడుగు రామమూర్తి" అంటూ అభివర్ణించిన ఓ కవి మాటలు ఈ సందర్భంగా గుర్తుకువస్తున్నాయి. నేడే (ఆగష్టు 29) గిడుగు వెంకటరామమూర్తి జయంతి. ఆ మహనీయుని యశఃకాయానికి 160 ఏళ్ళు నిండుతున్న పండుగ వేళలో మనమున్నాం.ఇప్పటికే వారోత్సవాలు కూడా ప్రారంభమయ్యాయి.ప్రతి ఆగస్టు 29వ తేదీ గిడుగు స్మృతికి నివాళిగా 'తెలుగు భాషా దినోత్సవం' జరుపుకోవడం ఎప్పటి నుంచో సాగుతోంది. సరే! కొందరు మొక్కుబడిగా చేస్తారు. మరికొందరు భాషానురక్తితో మొక్కుగా భక్తితో చేస్తారు. ఈరోజు మనం రాసే భాష వెనకాల ఆయన స్వేదం ఉంది. నిత్యం తలచుకోవాల్సిన మాననీయుడు గిడుగు. తెలుగు వెలుగు గిడుగు ఆధునిక తెలుగు మానవుడు ఎలా చదవాలి, ఎలా రాయాలి,ఎలా అర్ధం చేసుకోవాలి,భాషామయమైన ప్రయాణం ఎలా చెయ్యాలో దారి చూపిన తెలుగు వెలుగు గిడుగు. ఈరోజు మనం రాసే భాష,చదివే భాష,పుస్తకాల్లో,పత్రికల్లో, ఉపన్యాసాల్లో కనిపిస్తున్న, వినిపిస్తున్న భాష,మనల్ని కదిలిస్తున్న భాష గిడుగు చేసిన త్యాగాలు,వేసిన మూలాల ఫలమేనని విశ్వసించాలి. గిడుగు వెంకటరామమూర్తి ఎప్పుడో 160ఏళ్ళ నాటి వాడు. ఎటు చూసినా పండితులు, కవులు, వారికి మాత్రమే అర్ధమయ్యే గ్రాంథిక భాషామయమైన తెలుగు వాతావరణంలో పుట్టి పెరిగినవాడు. ఈ విధానం ఇదే రీతిలో సాగితే, సామాన్యుడికి ఆ జ్ఞాన ఫలాలు ఎప్పుడు అందాలి,భాష ఎప్పుడు వికాసం చెందాలి, జనబాహుళ్యం ఆ భాషకు ఎన్నడు దగ్గరవ్వాలని మదనపడి మనకోసం అలోచించిన మనమనీషి. Warm wishes on #TeluguLanguage Day! The KMC team pays homage to Gidugu Venkata Ramamurthy, whose ideas and literary work for social reform endure, leaving an indelible mark on generations. pic.twitter.com/bnErRj3wmV — Commissioner Kadapa (@KadapaComsr) August 29, 2023 ఆధునిక భాషా మహోద్యమంలో తొలి అడుగు వేసినవాడు గిడుగు. భాషాసాహిత్యాలు,చరిత్ర పుష్కలంగా,క్షుణ్ణంగా చదువుకొని,ముందుగా తను జ్ఞాన స్వరూపుడిగా తయారై, సామాన్యుడి చెంతకు భాషను చేర్చాలని రంగంలోకి దిగిన చిచ్చరపిడుగు గిడుగు. ఇటు వ్యావహారిక భాష - అటు సవర భాష కోసం జీవితమంతా అంకితమయ్యాడు. ఆరోగ్యం కోల్పోయాడు. సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు. గిరిజనులను ఇంట్లోనే ఉంచుకొని భోజనం పెట్టి పాఠాలు చెప్పాడు. కొండలు కోనలు తిరిగి భాషను సామాన్యుడికి చేర్చిన అసామాన్యుడు గిడుగు. అందరికీ అర్ధమవ్వాలానే తపన తప్ప,గ్రాంథిక భాషను ఎన్నడూ వ్యతిరేకించలేదు. పద్యాలను, కావ్యాలను, వ్యాకరణాలను,ఛందస్సును పండితులను,కవులను ఎప్పుడూ తూలనాడలేదు.సంప్రదాయమైన సర్వ వ్యవస్థలనూ గౌరవించి, అధ్యయనం చేసి, భవ్య మార్గాన్ని పట్టిన నవ్య ప్రయోగశీలి గిడుగు వెంకటరామమూర్తి. అడవుల్లో జీవించేవారు మాట్లాడుకునే 'సవర' భాషకు వ్యాకరణం రూపకల్పన చేసి, శాస్త్రీయత తీసుకువచ్చిన ఘనుడు. అధ్యాపకుడిగా, జ్ఞాన సముపార్జన కోసం విద్యార్థులు పడే కష్టాన్ని అర్ధం చేసుకున్నాడు. తమ భావాలకు అక్షరరూపం ఇవ్వడానికి సామాన్యులు పడే తపనను తెలుసుకున్నాడు. గ్రాంథిక భాషా బంధనాల నుంచి విద్యా విధానాన్ని తెంచి, ప్రజలభాషలోకి తెచ్చాడు.దాని వల్ల చదివేవారి సంఖ్య,చదువరుల సంఖ్య పెరిగింది.తద్వారా, తెలుగునేలపై అక్షరాస్యత పెరిగింది. ఆలోచన పెరిగింది. ఆలోచనను వ్యక్తీకరించే శక్తి పెరిగింది.వాడుకభాష అవసరాన్ని చెబుతూ వీధివీధులా తిరిగాడు. The Governor said the Telugu Language Day marks the birth anniversary of eminent Telugu linguist, poet and visionary Sri Gidugu Venkata Ramamurthy.#Telugulanguageday #giduguvenkataramamurthy — governorap (@governorap) August 29, 2023 పండితులతో గొడవలు పడ్డాడు. ఇంటినే బడిగా మార్చాడు. సొంతంగా 'తెలుగు' అనే పేరుతో ఒక పత్రికను నడిపాడు. గురజాడ,కందుకూరి వీరేశిలింగం, చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి,తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి,పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, వజ్ఝల చినసీతారామశాస్త్రి మొదలైనవారు గిడుగుకు అండగా నిలిచారు.ఆయనతోకలిసి, వాడుకభాషా ఉద్యమంలో నడిచారు. బావా ఎప్పుడు వచ్చితీవు, చెల్లియొ చెల్లకో, జండాపై కపిరాజు, అలుగుటయే ఎరుంగని మొదలైన వాడుక భాషా పదాలతో తిరుపతి వేంకటకవులు 'పాండవ ఉద్యోగ విజయాలు' పేరుతో పద్యనాటకాలు రాయడానికి ప్రేరకుడు గిడుగు. దానికి కారకుడు,పోషకుడు పోలవరం జమీందారు రాజా కొచ్చెర్లకోట వెంకటకృష్ణారావు. వాడుకభాష కోసం ఉద్యమించే గిడుగు వ్యాకరణానికి,ఛందస్సుకు ఎవరైనా గౌరవం ఇవ్వకపోయినా, వ్యాకరణపరమైన తప్పులు జరిగినా ఊరుకునేవాడు కాడు. ఎంతటి పండితుడినైనా చీల్చి చెండాడేవాడు. మీసాలపై తిరుపతి వేంకటకవులు చెప్పిన పద్యం తెలుగులోకంలో సుప్రసిద్ధం. మీసం పెంచడం సంగతి తర్వాత... ముందు..ఆ పద్యంలో ఉన్న దోషం సంగతి చూడు...అని చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రికి గిడుగు మొట్టికాయలు వేశాడు. గెల్చితిరేని అని ఉండాలి.నువ్వు గెల్చిరేని అని రాశావు,ఇది తప్పు,సరిదిద్దుకో... అంటూ తిరుపతి వేంకటకవులను నిలదీశాడు. ఆమ్మో! గిడుగు పిడుగే అంటూ చెళ్ళపిళ్ళ సర్దుకున్నాడు. #TeluguLanguageDay Gidugu Venkata Ramamurthy, born on 29 August 1863, was a Telugu writer and one of the earliest modern #Telugu linguists and social visionaries during the British rule. He championed the cause of using a #language comprehensible to the common man #philately pic.twitter.com/15sG2jw4Q1 — South India Philatelists' Association, Chennai (@SIPA_chennai) August 29, 2023 అంతటితో ఆగక 'గిడుగు పిడుగే' అని ప్రత్యేక వ్యాసం కూడా రాశాడు. 'పాండవ ఉద్యోగవిజయాలు' వంటి పద్యకృతులతో పాటు,చెళ్ళపిళ్ళ ఎన్నో వచన రచనలు చేశారు. ఇవన్నీ వ్యావహారిక భాషలోనే రాశారు. ఇలా,తిరుపతి వేంకటకవుల వంటి సంప్రదాయ పద్యకవులను కూడా వాడుక భాషవైపు మళ్లించిన ఘటికుడు గిడుగు. ముఖ్యంగా చెళ్ళపిళ్ల వెంకటశాస్త్రి ఆ బాటలో నడిచారు. స్వయంకృషితో శాసనాల భాషను అర్ధం చేసుకోవడం నేర్చుకున్న పట్టుదల గిడుగు సొంతం.ఒరిస్సా రాష్ట్రం ఏర్పడినప్పుడు పర్లాకిమిడి వంటి తెలుగుప్రాంతాలు కూడా ఒరిస్సా రాష్ట్రంలోకి వెళ్లిపోయాయి. ఈ విధానాన్ని గిడుగు తీవ్రంగా వ్యతిరేకించడమేకాక, తెలుగునేలపైనే జీవించాలనే సంకల్పంతో,తన సొంతవూరు పర్లాకిమిడిని వదిలి రాజమండ్రికి తరలి వచ్చేశాడు. గిడుగుకు తెలుగుభాష,గాలి,నేలపై ఉండే భక్తికి,ప్రేమకు అది గొప్ప ఉదాహరణ.1937లో తాపీ ధర్మారావు సంపాదకుడిగా 'జనవాణి'అనే పత్రికను స్థాపించారు.కేవలం ఆధునిక ప్రమాణభాషలోనే వార్తలు, సంపాదకీయాలు రాయడం మొదలుపెట్టారు.అదంతా కూడా గిడుగు ప్రభావమే.గిడుగు,గురజాడ ఇద్దరూ విజయనగరంలో సహాధ్యాయులు. ఇద్దరూ వాడుకభాషకోసం ఉద్యమించినవారే కావడం విశేషం. సంస్కృతం, ఇంగ్లిష్,చరిత్ర ముఖ్య విషయాలుగా గిడుగు బి.ఏ పూర్తి చేశారు. సంస్కృతం,ఇంగ్లిష్,తెలుగు బాగా చదువుకున్నారు. సామాన్యులకు అర్ధం కావడం కోసం తన భాషాపాండిత్యాన్ని కుదించుకొని,వాడుకభాషలో రచనలు చేశారు, ఉపన్యాసాలు ఇచ్చారు. ప్రజలను చైతన్య పరిచారు,జ్ఞానాన్ని సామాన్యుడి చెంతకు చేర్చారు. కావ్యాలను, ప్రబంధాలను,గ్రాంథికభాషను, అలంకారశాస్త్రాలను గౌరవిస్తూనే, ఆధునిక భాషాయానం చేసిన అత్యాధునికుడు,దార్శనికుడు, ఆదర్శప్రాయుడు గిడుగు. భాషను సామాన్యుడికి చేర్చమని చెప్పాడు కానీ,భాషాపాండిత్యాలు, అధ్యయనాల స్థాయిని దిగజార్చమని ఎప్పుడూ చెప్పలేదు. ఛందస్సు,వ్యాకరణం,పద్యాలు, ప్రబంధాలను వదిలివెయ్యమని గిడుగు ఏనాడూ అనలేదు. భాషకోసమే శ్రమించి,సామాన్యుడి కోసమే తపించి జీవించిన పుణ్యమూర్తి గిడుగు రామమూర్తి. విద్యార్థికి ప్రతి దశలో తెలుగు భాషను అందించాలి. కనీసం 10ఏళ్ళ వయస్సు వరకూ మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి. ఆధునిక తెలుగుభాషా వేత్తలలో అగ్రగణ్యుడు గిడుగు వెంకట రామమూర్తి గారు. తన ఉద్యమం ద్వారా తెలుగుభాషను సామాన్యుల దగ్గరకు చేర్చి, వ్యవహారిక భాషను మాధ్యమంగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి. భాషా నైపుణ్యాలను వృద్ధిచేయడం ద్వారా అక్షరాస్యత పెంపు, తద్వారా మానవాభివృద్ధికి విశేషంగా కృషిచేశారు.… pic.twitter.com/Ie0WoIsL0z — YS Jagan Mohan Reddy (@ysjagan) August 29, 2023 తెలుగుభాషా,సాహిత్యాలు చదువుకున్నవారికి ప్రోత్సాహంలో, ఉపాధిలో, ఉద్యోగాలలలో పెద్దపీట వెయ్యాలి. తెలుగు చదువుకున్నవారు ఆత్మన్యూనతకు గురయ్యే పరిస్థితులు కల్పించరాదు. 'పద్యం' మన ఆస్తి, 'అవధానం' మన సంతకం. ఆధునికత పేరుతో వ్యాకరణం, ఛందస్సులను దూరం చేస్తే? కొన్నాళ్ళకు మనవైన పద్యాలు, అవధానాలు కానరాకుండా పోతాయి. మన భాషా భవనాల పునాదులు కదిలిపోతాయి.మెల్లగా మనదైన సంస్కృతి మృగ్యమైపోతుంది. తెలుగును వెలిగించడం, ఆ వెలుగులో జీవించడమే గిడుగు వంటి తెలుగు వెలుగులకు మనమిచ్చే అచ్చమైన నివాళి. భాష,సంస్కృతి, సంప్రదాయాలను నిలబెట్టడమే నిజమైన వేడుక. మా శర్మ, సీనియర్ జర్నలిస్ట్ (చదవండి: గిడుగు సాక్షిగా మరొక భాషోద్యమం రావాలి! నేడు గిడుగు రామమూర్తి పంతులు జయంతి) -
Telugu Language Day: గిడుగు సాక్షిగా మరొక భాషోద్యమం రావాలి!
గిడుగు సాక్షిగా మరొక భాషోద్యమం రావాలి వ్యవహారిక భాష అనగానే మన మదిలో మెదిలేది గిడుగు వేంకట రామమూర్తి పంతులు. నాలుగు దశాబ్దాలకు పైగా వ్యవహారిక భాషో ద్యమం కోసం గ్రాంథిక వాదులతో అలు పెరగని పోరాటం చేశారు. వారు సలిపిన భాషోద్యమం అచ్చంగా అభ్యుదయ సమాజం కోసమే అని చెప్పాలి. నోటి మాటకు, చేతిరాతకు సంధానం కుదిరినప్పుడే భాష పోషకంగా ఉంటుందని భావించారు. పండితులకే పరిమితమైన భాషను, కొద్దిమంది మాత్రమే చదువుకునే వెసులుబాటు ఉన్న విద్యను సామాన్య ప్రజలందరికీ అందుబాటు లోకి తేవాలని ఆయన పరితపించారు. శిష్ట వ్యవహారిక భాషకు పట్టం కట్టినప్పుడే ఇది సాధ్యమవుతుందని ఆయన సంప్రదాయ భాషా వాదులపై సుదీర్ఘ పోరాటం చేశారు. అయితే సంప్రదాయ భాషా వాదులు ఆయన వాదనను బలంగా తిరస్కరించారు, అయినా గిడుగు వారు ఉద్యమించారు. ప్రజల భావాలకు అనుగుణంగా భాష ఉండాలనీ, వాళ్ళ భావాలను అందరికీ అర్థ మయ్యే రీతిలో రాయగలగాలనీ, అందుకే వాడుక భాష చాలా అవసరం అని గిడుగు వారు వాదించారు. సంప్రదాయ సాహిత్య వాదులు, కవులు అయిన తిరుపతి వేంకట కవులు కూడా భాషలో మార్పుల్ని సమర్థించారు. ప్రారంభంలో కందు కూరి వారు సంప్రదాయ సాహిత్య పక్షాన నిలి చినా తదనంతరం గిడుగు వారి ఉద్యమ దీక్షలో సత్యాన్ని గ్రహించి ఆయన కూడా వ్యవహారిక భాషోద్యమానికి బాసటగా నిలిచారు. ఫలితంగా గిడుగు వారి ఉద్యమం మరింత బలపడింది. గురజాడ, గిడుగు ఇద్దరూ అభ్యుదయవాదులు మాత్రమే కాదు, అద్భుతమైన భావజాలాలను కలబోసుకున్న మిత్రులు. విజయనగరంలో ఇద్దరూ కలిసే చదువుకున్నారు. ఎంతో కష్టపడి సవరభాష నేర్చుకొని అదే భాషలో పుస్తకాలు రాసి, సొంతడబ్బుతో బడులు ఏర్పాటు చేసి, సవరలకు చదువు చెప్పే ఏర్పాట్లు చేశారు గిడుగు. మద్రాసు ప్రభుత్వం వారు ఈ కృషికి మెచ్చి 1913లో ‘రావు బహదూర్‘ బిరుదు ఇచ్చారు. ముప్ఫై అయిదేళ్ళ కృషితో 1931లో ఇంగ్లీషులో సవరభాషా వ్యాకరణాన్నీ, 1936లో ‘సవర–ఇంగ్లీషు కోశా’న్నీ తయారు చేశారు. ప్రభుత్వం ఆయనకు ‘కైజర్–ఇ–హింద్’ అనే స్వర్ణ పతకాన్ని ఇచ్చి గౌరవించింది. 1919–20ల మధ్య వ్యావహారిక భాషోద్యమ ప్రచారం కొరకు ‘తెలుగు’ అనే మాస పత్రిక నడిపారు. వ్యావహారిక భాషను ప్రతిఘటించిన ‘ఆంధ్ర సాహిత్య పరిషత్తు’ సభలో నాలుగు గంటలపాటు ప్రసంగించి గ్రంథాల్లోని ప్రయోగాల్ని ఎత్తి చూపి తన వాదానికి అనుకూలంగా సమితిని తీర్మానింపజేశారు గిడుగు. ‘సాహితీ సమితి’, ‘నవ్య సాహిత్య పరిషత్తు’ వంటి సంస్థలు కూడా గిడుగు వాదాన్ని బలపరచాయి. గిడుగు రామ మూర్తి ఊరూరా ఉపన్యాసాలిస్తూ గ్రాంథికంలో ఏ రచయితా నిర్దుష్టంగా రాయలేడని నిరూపించారు. ఆ క్రమంలో విశ్వవిద్యాలయాలన్నీ వ్యవ హారిక భాషకు పట్టం కట్టడం ప్రారంభించాయి. కాగా మరోవైపు గిడుగు వారి అనుంగు శిష్యుడైన తాపీ ధర్మారావు సంపాదకీయాలతో ప్రారంభ మైన వ్యవహారిక భాష... పత్రికల్లోనూ క్రమంగా విస్తరిస్తూ వచ్చింది. 1863 ఆగస్టు 29న శ్రీకాకుళానికి ఇరవై మైళ్ళ దూరంలో ముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్న పర్వ తాల పేట గ్రామంలో జన్మించిన గిడుగు అలు పెరుగని వ్యవహారిక భాషోద్యమం చేస్తూ జనవరి 1940 జనవరి 22న కన్ను మూశారు. భాషను పరిపుష్టం చేయడం అనేది కేవలం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు. భాషాభి మానులందరూ కూడా ఇందులో మమేకం కావాలి. తెలుగువారు తెలుగుతో పాటుగా ఇంగ్లీషు వంటి అంతర్జాతీయ భాషలలో పట్టు సాధించగలిగితే మన సాహిత్య అనువాదాలు ప్రపంచవ్యాప్తమవుతాయి తెలుగు వారు ఉన్నత స్థితిలో నిలిచినప్పుడు మన భాష, సంస్కృతి, సంప్రదాయాలను కూడా అదే స్థాయిలో నిలబెట్ట గలుగుతారన్నదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలోచన. అందుకే మనకోసం, మన పాలనావసరాల కోసం, ‘మన సంస్కృతి–సంప్రదాయాల కోసం, తెలుగు భాష... భవిష్యత్తు అవసరాల కోసం ఇంగ్లీష్ భాష’ అనే లక్ష్యంతో సాగుతున్నారు. ఈ నేపథ్యంలో భాషావాదులు కువిమర్శలు పట్టించు కోకుండా వాస్తవాలను గ్రహించగలిగితే, తెలుగు భాష అజంతం, అజరామరం అనేదానికి సార్థకత ఉంటుంది. ప్రపంచ పటంలో తెలుగు కీర్తి రెపరెప లాడుతుంది. వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు (చదవండి: ''ఇయ్యాల బిచ్చమడుగుడొస్తే రేపు ఓట్లు కూడా..'') -
వైభవంగా ద్విసహస్ర గళ పద్యార్చన
వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ): ప్రతి వ్యక్తి జీవితంలో మాతృభాష భాగమైనప్పుడే ఆ సమాజ భాషా సంస్కృతులు కలకాలం శోభిల్లుతాయని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఆంధ్ర మహాభారత సహస్రాబ్ది మహోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ వన్‌టౌన్‌లోని కేబీఎన్ కళాశాలలో మంగళవారం ద్విసహస్ర గళ పద్యార్చన వైభవంగా నిర్వహించారు. రెండు వేల మంది విద్యార్థులు సామూహికంగా 108 పద్యాలను ఆలపించి నన్నయకు నీరాజనాలు పలికారు. ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రపంచంలో ఏ భాషకు లేని మనదైన గొప్ప సంపద తెలుగు పద్యం అని అన్నారు. ఇటీవల తెలుగు అధికార భాషా సంఘం ఆధ్వర్యాన పరవస్తు చిన్నయసూరి విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మాట్లాడుతూ ఆదికవి నన్నయ కామధేనువు వంటివారని, ఆయన అందించిన కావ్యం అనేక గ్రంథాలకు స్ఫూర్తిని చ్చిందని తెలిపారు. తొలుత సాహితీవేత్త వాడ్రేవు సుందరరావు నన్నయ్య ఏకపాత్రాభినయంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, కృష్ణా విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య జ్ఞానమణి, సబ్ కలెక్టర్ అదితిసింగ్ ప్రసంగించారు. కేబీఎన్ కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు టి.శేషయ్య, టి.శ్రీనివాసు, కోశాధికారి ఎ.రామకృష్ణారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ వి.నారాయణరావు, డాక్టర్ కె.రామకృష్ణ, డాక్టర్ నాగరాజు, డాక్టర్ జేవీ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
Independence Day Song : తరం, తరం, నిరంతరం
దేశ స్వాతంత్య్రంలో సాహిత్యం పాత్ర మరువలేనిది. నిజానికి ఏ ఉద్యమం అయినా.. సాహిత్యంతో ప్రజలను జాగృతం చేస్తుంది. ఒక్కతాటిపైకి తెస్తుంది. అలాగే భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాటలు, నినాదాలు, కవిత్వాలు, ప్రసంగాలు.. ఒకటేమిటి.. ఉద్యమ స్పూర్తిని పెల్లుబికెలా చేశారు మహానుభావులు. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా యువతను మరింత బలోపేతం చేస్తూ, జాతి నిర్మాణ బాధ్యతను చక్కగా గుర్తు చేసే ప్రేరణ గీతాన్ని ప్రజల ముందుకు తెచ్చారు డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి. పాటకు సంగీతం, కూర్పు, గానం అందించారు సినీ గాయకులు రవివర్మ పోతేదార్. (సినీ గాయకులు రవివర్మ పోతేదార్) || పల్లవి || తరం, తరం, నిరంతరం, నిర్భయ నవతరం మీరు అనంతరం, అనవరతం, అపూర్వ యువతరం మీరు తరం, తరం, నిరంతరం, నిర్భయ నవతరం మీరు అనంతరం, అనవరతం, అపూర్వ యువతరం మీరు జాగరూకత జారిపోతే తరిగిపోయే తురగ మీరు జాగరూకత జారిపోతే తరిగిపోయే తురగ మీరు జగతి కొరకు..., జాతి కొరకు..., జాగృతమవ్వాలి మీరు వందేమాతరం...భారతీవందనం! వందేమాతరం...భారతీవందనం!! || చరణం 1 || ఎగిసి పడే రక్తం మీరు ఎవరెస్టునైనా ఓడించే అగ్ని శిఖలు మీరు ఎగిసి పడే రక్తం మీరు ఎవరెస్టునైనా ఓడించే అగ్ని శిఖలు మీరు సునామీ కెరటం మీరు అరుణ సింధూర విజయ సౌరభం మీరు సునామీ కెరటం మీరు అరుణ సింధూర విజయ సౌరభం మీరు పాల సంద్రాన ఆదిశేషుని వేయిపడగల హోరు మీరు వందేమాతరం...భారతీవందనం! వందేమాతరం...భారతీవందనం!! || చరణం 2 || భయం తెలియని ధైర్యం మీరు భరత భూమిని బాగుచేసే బాధ్యతే మీరు భయం తెలియని ధైర్యం మీరు భరత భూమిని బాగుచేసే బాధ్యతే మీరు శంఖనాదం మీరు చిత్త శుద్ధికి, లక్ష్యసిద్ధికి అర్థమే మీరు శంఖనాదం మీరు చిత్త శుద్ధికి, లక్ష్యసిద్ధికి అర్థమే మీరు శిలయు మీరు, శిల్పి మీరు, చరితకెక్కే స్థపతి మీరు వందేమాతరం...భారతీవందనం! వందేమాతరం...భారతీవందనం!! ||తరం, తరం, నిరంతరం… || (రచన:డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి; 9848023090) -
చంద్రయాన్-3పై ఇస్రో చైర్మన్ కీలక ప్రకటన.. మళ్లీ అదే జరిగితే..
బెంగుళూరు: చంద్రయాన్-2 ప్రయోగం దాదాపుగా విజయవంతంగా జరిగిందనుకుంటున్న తరుణంలో విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టడంతో చివరి నిముషంలో ల్యాండర్ నుండి సంకేతాలు అందడం ఆగిపోయాయి. ఈ సారి చంద్రయాన్-3లో అలా కాకుండా విక్రమ్ ల్యాండర్ తన వైఫల్యాలను తానే సరిచేసుకునే విధంగా రూపొందించామని అన్నారు ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు. చంద్రయాన్-2 వైఫల్యాన్ని ఇస్రో సవాలుగా స్వీకరించి చంద్రయాన్-3 ప్రాజెక్టుని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. అనుకున్నట్టుగానే చంద్రయాన్-3 జులై 14, 2023న విజయవంతంగా ప్రయోగించారు ఇస్రో శాస్త్రవేత్తలు. నిర్ణీత సమయం ప్రకారం ఇది ఆగస్టు 23న చంద్రుడిపై అడుగుపెట్టాల్సి ఉండగా ఒకరోజు అటు ఇటుగా చంద్రయాన్-3 చంద్రుడిపై ల్యాండ్ అవ్వనుంది. ఇదిలా ఉండగా ఈ ప్రయోగం జరిగిన నాటి నుండి చంద్రయాన్-2 లా ఇందులో కూడా చివరి నిముషంలో ఏవైనా సమస్యలు తలెత్తితే పరిస్థితి ఏమిటనే అనుమానాలు కలుగుతూనే ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చారు ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్. దిశా భారత్ అనే సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చంద్రయాన్-3లో విక్రమ్ ల్యాండర్ తన వైఫల్యాలను తానే సరిచేసుకోగలదని, సెన్సార్లతో సహా అందులోని అన్నీ ఫెయిల్ అయినా కూడా విక్రమ్ ల్యాండర్ చంద్రుడి మీద సాఫ్ట్ ల్యాండింగ్ కావడం ఖాయమని అన్నారు. ప్రపల్షన్ వ్యవస్థను ఆ విధంగా సిద్ధం చేశామని తెలిపారు. ఆగస్టు 9,14,16 తేదీల్లో చంద్రయాన్-3 చంద్రుడిని సమీపిస్తుండగా ఒక్కో కక్ష్య మారుతూ వెళుతుందని అనంతరం ల్యాండర్ ప్రపల్షన్ ప్రక్రియ మొదలవుతుందని ఆ సమయంలోనే క్రాఫ్ట్ వేగం తగ్గించుకుని చివరిగా ఆగష్టు 23న క్షేమంగా ల్యాండ్ అవుతుందని అన్నారు. అందులోని రెండు ఇంజిన్లు పనిచేయకపోయినా కూడా సాఫ్ట్ ల్యాండింగ్ జరుగుతుందని, ఆర్బిటర్ నుండి ల్యాండర్ వేరు కాగానే అడ్డంగా తిరిగే ప్రక్రియను క్రమపద్ధతిలో నిలువుగా కిందకు దిగేలా ల్యాండర్ డిజైన్ చేశామని, గతంలో ఇక్కడే పొరపాటు జరిగిందని ఈసారి ఆ పొరపాటు పునరావృతం కాదని ఆయన అన్నారు. చంద్రయాన్-3 ల్యాండర్లో నాలుగు పేలోడ్లు ఉన్నాయి.. మొదటిది చంద్ర సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్పెరిమెంట్ (ChaSTE) చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతను కొలుస్తుంది. రాంబా-LP చంద్రుడి ఉపరితల ప్లాస్మా సాంద్రత, మార్పులను కొలుస్తుంది. భవిష్యత్తులో ల్యాండర్ల ల్యాండింగ్ స్థానాన్ని గుర్తించి నాసాకు నిర్దేశించడానికి రెట్రోరిఫ్లక్ట్రర్, చంద్రుడి కంపించే కోలాటాన్కు లెక్కించడానికి ఒక పరికరం ఉంటాయి. ఇది కాకుండా ప్రగ్యాన్ రోవర్ లో మరో మూడు పేలోడ్లు ఉంటాయని ఇస్రో చైర్మన్ తెలిపారు. ఇది కూడా చదవండి: త్రివిధ దళాల్లో ఖాళీలను భర్తీ చేయండి -
NATA : డాలస్ నాటా కన్వెన్షన్‌లో ట్రాన్స్పోర్ట్ కీ రోల్
అటు తమన్ నుండి తమన్నా వరకు, ఇటు దేవిశ్రీ నుండి దిల్ రాజు వరకు, మరెందరో పెద్దలు మరియు ప్రముఖులతో డాలస్ మహానగరం దద్దరిల్లిన వేళావిశేషాలను అంగరంగ వైభవంగా నిర్వహించడంలో నాటా ట్రాన్స్పోర్ట్ పాత్ర కీలకమని అసొసియేషన్ తెలిపింది. ఈ మేరకు ట్రాన్స్పోర్ట్ బృందాన్ని ప్రశంసించింది. ఘనంగా నాటా వేడుకలు భారీ జన పరివారం, భారతీయ సంస్కృతి, సంప్రదాయం, సంగీతం.. ఇలా చెప్పుకుంటూ పోతో నాటా వేడుకల్లో ఎన్నో విశేషాలు. ఈ వేడుకలు అత్యంత ఘనంగా జరగడానికి తెర వెనక ఎందరో అసామాన్యుల కష్టం ఉంది. వారిలో ఒకటి ట్రాన్స్పోర్ట్ బృందం. డాక్టర్ రాజేంద్ర కుమార్ రెడ్డి పోలు చైర్ పర్సన్‌గా ఏర్పాటయిన నాటా రవాణా బృందం తక్కువ వ్యవధిలో అద్బుతమైన సేవలందించింది. నాటా రవాణా బృందంలో కీలకం ప్రణాళికా బృందం. దీన్ని కార్తిక్ రెడ్డి మేడపాటి, నవీన్ కుమార్ రాజు అడ్లూరి, మరియు ప్రసాద్ రెడ్డి నాగారపు పక్కగా నిర్వహించారు. అందరికి అనుసంధానం వీరే నాలుగు వేల మందికి విమాన టిక్కెట్లు, ఐటినరీలు, ఎయిర్‌పోర్టులకు వచ్చిన అతిధులకు ఆహ్వానం, ఇలా ఎన్నో పనులను ఒక ప్లాన్‌తో ట్రాన్స్పోర్ట్ బృందం నిర్వహించింది. అతిధులను దగ్గరుండి వ్యాన్లలో, కార్లలో తీసుకొని హోటళ్ళకి, కన్వెన్షన్ హాలుకి తరలించి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చేశారు. ఒక్క బస్సు రోడ్డుపై వెళ్తే మామూలే కానీ 16 పెద్ద పెద్ద బస్సులు, మెర్సిడీస్ స్ప్రింటర్ వ్యాన్లు, సబ్-అర్బన్ కార్లు, లగ్జరీ లిమోసిన్లు ఇలా డాలస్ హైవే రోడ్లపై సందడి చేశాయి. "డాలస్ ఫోర్ట్వర్థ్ ఎయిర్పోర్ట్" వద్ద ఐదు టెర్మినళ్లకి మరియు లవ్-ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వద్ద ఉన్న ఒక్క టెర్మినల్ కి వెళ్లి అందరిని నాటా కన్వెన్షన్ హాలుకి తీసుకొచ్చారు. పేరుపేరునా ధన్యవాదాలు ఈ మొత్తం యజ్ఞంలో సహకరించిన ప్రతీ సభ్యులకు నాటా ధన్యవాదాలు తెలిపింది. కార్తిక్ రెడ్డి మేడపాటి, నాగరాజ్ గోపిరెడ్డి, సురేష్ రెడ్డి మోపూరు, సుధాకర్ రెడ్డి మేనకూరు, వరదరాజులు రెడ్డి కంచం, అనిల్ కుమార్ రెడ్డి కుండా, హరినాథ్ రెడ్డి పొగాకు, ప్రసాద్ రెడ్డి నాగారపు, నవీన్ కుమార్ రాజు అడ్లూరి, పవన్ రెడ్డి మిట్ట, ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎద్దుల, పురుషోత్తం రెడ్డి బోరెడ్డి, శ్రీనివాస రెడ్డి ముక్క, శ్రీనివాసుల రెడ్డి కొత్త, ఎల్లారెడ్డి చలమల, మరియు గౌతమ్ రెడ్డి కత్తెరగండ్ల ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. తిరుమల తిరుపతి దేవస్థానం బృందానికి ప్రత్యేక సౌకర్యాలతో ఎల్లారెడ్డి చలమల జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన నాటా అధ్యక్షులు డాక్టర్ కొర్సపాటి శ్రీధర్ రెడ్డి, కో-ఆర్డినేటర్ డాక్టర్ బూచిపూడి రామిరెడ్డి, నేషనల్ కన్వెన్షన్ అడ్వైజర్ శ్రీనివాసుల రెడ్డి కొట్లూరు, కన్వీనర్ ఎన్.యమ్.ఎస్ రెడ్డి , మాజీ అధ్యక్షుడు డాక్టర్ రాఘవ రెడ్డి గోసాల, ప్రెసిడెంట్ ఎలెక్ట్ హరినాధ రెడ్డి వెల్కూరు , ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆళ్ల రామి రెడ్డి , సెక్రటరీ గండ్ర నారాయణ రెడ్డి , ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ దర్గా నాగి రెడ్డిలకు ట్రాన్స్పోర్ట్ టీం ప్రత్యేక ధన్యవాదములు తెలిపింది. -
డబుల్ ఇస్మార్ట్‌లో..
తెలుగులో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట బాలీవుడ్ నటుడు సంజయ్ దత్. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాజా డీలక్స్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రంలో సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రంలోని ఓ కీలక పాత్రకు సంజయ్ దత్‌ను సంప్రదించిందట చిత్ర యూనిట్. ఈ చిత్రంలో భాగం కావడానికి సంజయ్ దత్ సుముఖంగా ఉన్నారని టాక్. -
మంచి చేయడానికే పోటీ చేస్తున్నా
‘‘చలనచిత్ర వాణిజ్య మండలి (తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్) ఎన్నికల్లో అధ్యక్షునిగా, ప్యానల్ సభ్యులుగా నిజాయతీగా సేవ చేసేవాళ్లను ఎన్నుకోండి’’ అని నిర్మాత సి. కల్యాణ్ అన్నారు. ఈ నెల 30న చలనచిత్ర వాణిజ్య మండలి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షునిగా పోటీ చేస్తున్న సి. కల్యాణ్ తన ప్యానల్ సభ్యులతో కలిసి మాట్లాడుతూ– ‘‘గతంలో నేను పో టీ చేయాలనుకున్నప్పుడు కొందరు నిర్మాతలు ‘యూఎఫ్ఓ, క్యూబ్’ వంటి డిజిటల్ ఛార్జీల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెబితే విరమించుకున్నాను. కానీ, వాళ్లు సభ్యుల శ్రేయస్సు కోసం కృషి చేయలేదు. అందుకే.. అందరికీ మంచి చేయాలనే ఆశయంతో పో టీ చేస్తున్నాను’’ అన్నారు. -
అసలు గాంధారి వాన ఏమిటి?..ఎందుకలా పిలుస్తారు?..
నేచురల్ స్టార్ నాని చేసిన 'కృష్ణార్జున యుద్ధం' సినిమాలో ఓ ఊపూ ఊపేసిని జానపద పాటలో వస్తుంది ఈ గాంధరి వాన గురించి. అందులో కురస కురస అడివిలోన పిలగా..కురిసినీ గాంధారి వాన అంటూ.. మంచి బీట్తో సాగిపోతుంది. అసలు ఇంతకీ గాంధారి వాన అంటే ఏమిటి? ఎప్పుడైనా దాని గురించి విన్నారా? అయినా మహాభారతంలోని దృతరాష్ట్రుని భార్య గాంధారికి, ఈ వానకి సంబంధం ఏమిటి? ఎందకని అలా వానను ఆమె పేరుతో పిలుస్తున్నారు?.. గాంధారి వాన అంటే..అవసరం లేనప్పుడు అదును లేనప్పుడూ కురిసే పెద్ద వానను గాంధారి వాన అంటారు. గాంధారి వాన గురించి చెప్పాలంటే ముందు గాంధారి గురించి తెలియాలి. గాంధారి మహాభారతంలో ధృతరాష్ట్రుని భార్య. ఆమె గాంధార దేశ రాకుమారి. దుర్యోధనుని తల్లి. ఆమెకు నూరుగురు సంతానం అని మనందరికి తెలిసిందే. దుస్సల అనే కూతురుతో కలిపి మొత్తం నూటొక్కమంది పిల్లలు ఆమెకు. ఇక ఆమె పేరు మీదగానే వానను పిలవడానికి కారణం ఏంటంటే..ముందుగా ఆమె గురించి తెలుసుకోవాలి. ఆమె తన భర్తకు కళ్లు లేవని, తన భర్త చూడని లోకం తాను చూడనంటూ కళ్లకు గంతలు కట్టుకున్న మహాసాధ్వీమణి గాంధారి. కాని దానివల్ల ఎలాంటి నష్టం జరిగిందో మహాభారతంలో చూశాం. ఇక్కడ ఒక కుటుంబానికి రెండు చక్రాలాంటి వాళ్లు తల్లిదండ్రలు. అందులో ఒక చక్రం పరిస్థితి బాగోనప్పుడూ ఇంకో చక్రం పూర్తిస్థాయిలో ఆధారభూతమై నిలబడి సంసారాన్ని లాగాలి. ఇక్కడ ఆమె భర్తపై ఉన్న అమితమైన ప్రేమతో చేసిన పని కాస్తా తన పిలల్లను చెడు మార్గంలో పయనించేలా చేసింది. గాంధారి తన కళ్లకు గంతలు కట్టుకోవడంతో పిల్లలను తడిమి చూసుకునేదేగానే..వాళ్లు ఎలా పెరుగుతున్నారు, వారి బుద్ధే ఏ మార్గంలో పయనిస్తుందో చూసే అవకాశం లేకుండా పోయింది. దీంతో కౌరవులు పాండవులపై చేయరాని అకృత్యాలకు పాల్పడ్డారు. ఇక్కడ గాంధారి, దృతరాష్ట్రుడు ఇద్దరు కూడా వారిని సరైన మార్గంలో పెట్టకుండా అవ్యాజమైన ప్రేమను మాత్రమే చూపించారు. అలాగే సయమం కాని సమయంలో..అకాలంగా అవసరం లేకుండా ధారగా కురిసిన వాన వల్ల ఏం ప్రయోజనం ఉండదు. కేవలం నష్టమే తప్ప. పంట అదునుతో సంబంధం లేకుండా వర్షం అచ్చం గాంధారిలా.. పిల్లల ఎదుగుతున్న విదానంపై దృష్టి పెట్టకుండా చూపిన అవ్యాజ ప్రేమ మాదిరిగా వర్షం కురిస్తే..అచ్చం కౌరవులు నాశనం అయినట్లే..పంటలు పాడవుతాయి. దీనివల్ల అంతమంచి వర్షమైనా.. నిరుపయోగమే అవుతుందే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి దీన్ని గాంధారి వాన అని పిలిచారు. ఈ మాట రాయలసీమ, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎక్కువగా ఆపాదించవచ్చు. (చదవండి: ఈ తల్లులు ప్రకృతి మురిసేలా ..పిల్లల పెళ్లి ఘనంగా చేశారు) -
తెలుగు వారు ఎంతో ప్రేమను చూపించారు: రెబ్బా మోనికాజాన్
‘‘సామజవర గమన’ సినిమా సక్సెస్ టూర్‌కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు వెళ్లాం. నాకు తెలుగు భాష రాకపోయినా అక్కడి ప్రజలు నా పట్ల ఎంతో ప్రేమ,ఆప్యాయతను చూపించారు.అలాంటి ఆదరణ ఎక్కడా దొరకదు. అందుకే నేను తెలుగు ప్రజలకు దగ్గరగా ఉండాలనుకుంటున్నాను’’ అని రెబ్బా మోనికాజాన్ అన్నారు. శ్రీవిష్ణు, రెబ్బా మోనికాజాన్ జంటగా రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘సామజవరగమన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ మూవీ జూన్ 29న విడుదలైంది. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైన రెబ్బా మోనికాజాన్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ–‘‘నేను మలయాళీ అయినా బెంగళూరులో పెరిగాను. చదువు పూర్తయ్యాక కొన్ని యాడ్స్ చేశాను. మలయాళంలో కొన్ని సినిమాలు చేశాను. దక్షిణాదిలో నేను ఇతర చిత్రాల్లో నటించినా ‘సామజవరగమన’ నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.అందుకే నేను చాలా లక్కీ అనుకుంటున్నాను. తెలుగులో కొన్ని కథలు వింటున్నాను. నా తర్వాతి సినిమాకి తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెబుతాను’’ అన్నారు. -
యాక్షన్ హెబ్బులి.. ఆగస్టు 4న తెలుగులో రిలీజ్
సుదీప్, అమలా పాల్ జంటగా ఎస్. కృష్ణ దర్శకత్వంలో రూపొందిన కన్నడ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘హెబ్బులి’. ఈ సినిమాను అదే టైటిల్‌తో సి. సుబ్రహ్మణ్యం ఆగస్టు 4న తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, రొమాంటిక్ సీన్స్ మిళితమై ఉన్న పక్కా కమర్షియల్ ఫిల్మ్ ‘హెబ్బులి’. కన్నడంలో రూ. 100 కోట్లు సాధించింది. తెలుగులోనూ హిట్ అవు తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
నీలో ఇంత టాలెంట్ ఉందా?.. వైరలవుతున్న రష్మిక వీడియో!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి పరిచయం అక్కర్లేదు. పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియాస్థాయిలో ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న కన్నడ భామ.. పుష్ప-2లోనూ నటిస్తోంది. శ్రీవల్లిగా అభిమానుల గుండెల్లో చోటు దక్కించుకున్న భామకు టాలీవుడ్లో ఫ్యాన్స్ భారీగానే ఉన్నారు. అంతే కాకుండా రష్మికలో ఓ అధ్భుతమైన టాలెంట్ కూడా ఉంది. ఏకంగా ఆరుభాషల్లో మాట్లాడతానంటూ చెబుతోంది శ్రీవల్లి. (ఇది చదవండి: ఆ విషయంలో నా కుమార్తెకు ధన్యవాదాలు: ఎస్ఎస్ రాజమౌళి ) అయితే తాజాగా రష్మిక తెలుగులో మాట్లాడిన ఓ వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటోన్న భామ.. తెలుగులో కొన్ని పదాలు చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ వీడియోలో రష్మిక మాట్లాడుతూ.. 'నమస్తే.. ఎట్లా ఉన్నారు?, వచ్చేసేయ్, మస్తుంది, నీ-మ్మా, ఏందే, కొడదాం'. అంటూ అసలు అసలైన తెలంగాణ యాసలో అదరగొట్టింది. ఇది చూసిన నెటిజన్స్ తెలుగు భాష బాగానే నేర్చుకుందంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరేమో అన్న విజయ్ దేవరకొండ నేర్పించాడా? అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అంతే కాకుండా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీలో మాట్లాడతానని చెబుతోంది. కాగా.. ప్రస్తుతం పుష్ప-2తో పాటు రణ్‌బీర్ కపూర్ సరసన యానిమల్ చిత్రంలో నటిస్తోంది. సందీప్ వంగా రూపొందిస్తోన్న ఈ పాన్ ఇండియా మూవీ డిసెంబర్ 1న విడుదల కానుంది. (ఇది చదవండి: అలాంటి సీన్స్ చేయాలంటే నా డ్రెస్ మాత్రం తీయను: హీరోయిన్ ) View this post on Instagram A post shared by Chill Mamaa (@chill.mamaa) -
US : ఇదెక్కడి ప్రకోపం, అమెరికాలో ఎందుకీ తెలుగు ప్రతాపం?
ఒకప్పుడు అమెరికాకు వచ్చే ప్రవాసాంధ్రులంటే ఎంతో గౌరవం. అక్కడి సమాజం హర్షించేలా హుందాగా ఉండేవారు. తెలివితేటల్లో మిన్నగా ఉంటూ ప్రతిభను చాటేవారు. అమెరికాలోని ఏ నగరానికి వెళ్లినా .. తెలుగు వాళ్లంటే ఓ బ్రాండ్ ఉండేది. ఇప్పుడు పరిస్థితి తరచుగా దిగజారుతోంది. చదువు, ఉద్యోగాల కోసం అమెరికాకు వెల్లువెత్తుతోన్న ప్రవాసాంధ్రుల్లో.. చాలా మంది కొన్నాళ్ల పాటు బాగానే ఉంటున్నారు. ఆ తర్వాతే అసలు రంగు బయటపెట్టుకుంటున్నారు. ఎందుకీ జాడ్యం తొలుత వృత్తి నైపుణ్యాలు, ఉద్యోగాలకు పరిమితమయిన ప్రవాసాంధ్రులు.. ఇప్పుడు కంపెనీలు నెలకొల్పారు, విజయవంతంగా నడిపిస్తున్నారు. అదే సమయంలో పేరాశ వీపరీతంగా పెరిగింది. డబ్బు సంపాదనతో ఆగిపోకుండా.. దాన్ని ఎగ్జిబిట్.. అంటే ప్రదర్శనకు తహతహలాడుతున్నారు. అమెరికన్ల తరహాలో హుందాగా వీక్ డేస్ లో కనిపించే ప్రవాసాంధ్రులు.. వీకెండ్ లో పార్టీ కల్చర్ వీపరీతంగా పెంచుకుని.. అక్కడ తమ స్థాయి, దర్పాన్ని ప్రదర్శించేందుకు ఉవ్విళ్లుతున్నారు. కనీసం కేజీ బంగారం శరీరంపై వేసుకుంటే తప్ప కన్వెన్షన్ కు హాజరు కాలేని పరిస్థితి చాలా మంది తెలుగు కుటుంబాల్లో ఉంది. ఆరంభంలో తమ కెరియర్ పై దృష్టి పెట్టిన చాలా మంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వైపు తొంగి చూస్తున్నారు. టిడిపి ఎంట్రీతో మారిన సీన్ అక్కడ బాగా సంపాదించిన వారు హఠాత్తుగా ఇక్కడికి వచ్చి అసెంబ్లీకి, పార్లమెంటుకు పోటీ చేయడం పరిపాటి అయింది. దీన్నే అక్కడ హెలికాప్టర్ క్యాండిడేట్స్ అని సరదాగా చెప్పుకుంటారు. ఇలాంటి అభ్యర్థులంటే తెలుగుదేశం పార్టీకి పండగే. టికెట్ల కోసం ఎంతయినా ఖర్చు పెట్టడం, ఓటుకు కోట్లు గుప్పించడం ఇలాంటి వారి వల్ల చాలా సులభమని చంద్రబాబు నమ్ముతారు. చాలా మంది ప్రవాసాంధ్రులు వ్యాపారాల వైపు మళ్లారు. అయితే వీరేమి గొప్ప వ్యాపారాలు చేయడం లేదు. పేరాశ బాగా పెరిగి రియల్ ఎస్టేట్ బిజినెస్, హోటల్ బిజినెస్ చేస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ తో పాటు టెక్సాస్ లాంటి చాలా రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ అంతా మన వాళ్ల చేతిలోనే ఉంది. తనకు అనుకూలమైన కొందరిని విదేశాల నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంచడం చంద్రబాబుకు బాగా అబ్బిన కళ. అక్కడి నుంచి రకరకాల ఫేక్ స్టోరీలను వండి తెలుగు రాజకీయాలపై వదలడం బాబు కోటరీకి వెన్నతో పెట్టిన విద్య. పేరులో కులాలను మార్చి.. ప్రత్యర్థులపై దాడి చేయడం బాగా అలవాటుగా మారింది. ఇందులో కొందరు ఎన్నారైలు పావులైపోతున్నారు. డబ్బు కోసం విలువలు మరిచి.. ఇదే సమయంలో మరికొందరు ఓ అడుగు ముందుకేసి ఈవెంట్ మేనేజ్ మెంట్ పేరుతో ఇండియా నుంచి ప్రముఖ అమ్మాయిలను తెప్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 'గంటకు ఇంత అంటూ' అనైతిక కార్యక్రమాలకు దిగి అక్కడి పోలీసులకు దొరికిపోయి మొత్తం తెలుగు ప్రజలకే చెడ్డ పేరు తెస్తున్నారు. షికాగో వేదికగా ఐదారేళ్ల కింద కొందరు పట్టుబడడం వల్ల చాలా మంది తెలుగు వాళ్లు ఇబ్బంది పడ్డారు. అసలు మాది తెలుగు అని చెప్పుకోవడానికి సిగ్గు పడ్డారు. వీసా ఇంటర్వ్యూలకు సినీ తారలు వెళ్తే అనుమానించే పరిస్థితి ఎదురయిందని కొందరు ప్రవాసాంధ్రులు తెలిపారు గ్రూపులు.. వర్గాలు ఇక ఏ ఈవెంట్ జరిగినా.. రెండుగా చీలడం పరిపాటయింది. ఇటీవల టెక్సాస్ లో బాలకృష్ణ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు బాహటంగానే తన్నుకున్న విషయం ప్రవాసాంధ్రుల మదిలోంచి ఇంకా పోలేదు. ఒక్క తెలుగుదేశంలోనే చాలా వర్గాలున్నాయి. అమెరికాకు 40, 50 ఏళ్ల కిందనే రావడంతో టిడిపి ఎన్నారైలలో ప్రాంతీయ అభిమానం బాగా పెరిగిపోయింది కులాల పేరుతో సంఘాలు, సినీ నటుల పేర్లతో అభిమాన సంఘాలు బాగా పెరిగిపోయాయి. ఇక ప్రాంతాల వారీగా ఇది మరింత ముదిరింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాస్తా.. జిల్లాల పేరుతో మీటింగ్ లు, భేటీలు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఘన చరిత్ర ఉన్న ప్రవాసాంధ్రులు కాస్తా.. ఇలాంటి పరిస్థితి కొని తెచ్చుకోవడం కాస్తా ఇబ్బందికరమేనని వాపోతున్నారు. చదవండి: తానా సభల్లో తన్నుకున్న 'తెలుగు' తమ్ముళ్లు మీకు జీవితంలో బుద్ధి రాదు మీ బతుకులు చెడ.. బండ్ల గణేష్ ఫుల్ ఫైర్ అమెరికాలో బాలయ్య ఫ్యాన్స్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్.. -
తెలుగు కాఫీ కంపెనీ కొత్త రికార్డు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టంట్ కాఫీ తయారీలో ప్రపంచ దిగ్గజం సీసీఎల్ ప్రొడక్ట్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా బిలియన్ డాలర్ (రూ.8,200 కోట్లు) కంపెనీగా అవతరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా దుగ్గిరాల కేంద్రంగా 1995లో ప్రారంభమైన ఈ కంపెనీ 100కుపైగా దేశాల్లో కస్టమర్లను సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో రెండు, వియత్నాం, స్విట్జర్లాండ్‌లో ఒక్కొక్క ప్లాంటు ఉంది. ఏటా 55,000 టన్నుల కాఫీని తయారు చేయగలిగే సామర్థ్యం ఉంది. ప్రపంచవ్యాప్తంగా సెకనుకు 1,000కిపైగా కప్పుల సీసీఎల్ కాఫీని కస్టమర్లు ఆస్వాదిస్తున్నారు. అనతికాలంలోనే కాఫీ రిటైల్‌లో భారత్‌లో టాప్–3 స్థానానికి ఎగబాకినట్టు సీసీఎల్ ప్రొడక్ట్స్ ఫౌండర్, చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. అయిదేళ్లలో 2 బిలియన్ డాలర్ కంపెనీగా అవతరిస్తామన్నారు. కాఫీ రుచులు 1,000కిపైగా.. సీసీఎల్ ప్రొడక్ట్స్ 1,000కిపైగా రుచుల్లో కాఫీని తయారు చేస్తోంది. వీటిలో ఫంక్షనల్ కాఫీ, కోల్డ్ బ్రూ ఇన్స్టంట్, మైక్రోగ్రౌండ్ ఇన్ఫ్యూజ్డ్, స్పెషాలిటీ ఇన్స్టంట్ కాఫీ ఉన్నాయని కంపెనీ ఎండీ చల్లా శ్రీశాంత్ తెలిపారు. ‘ఈ స్థాయి ఉత్పత్తులతో దేశీయ మార్కెట్లో కాంటినెంటల్ పేరుతో సొంత బ్రాండ్స్‌ను పరిచయం చేయడానికి, స్థిరమైన బిజినెస్ టు కన్సూమర్ కంపెనీగా రూపొందించడానికి విశ్వాసాన్ని ఇచ్చింది. బీటూసీని పటిష్టం చేయడానికి లాఫ్బెర్గ్స్ గ్రూప్ నుంచి ఆరు బ్రాండ్లను దక్కించుకున్నాం. ఎఫ్ఎంసీజీ కంపెనీగా నిలవాలన్నది మా కల. ఇందులో భాగంగా గ్రీన్‌బర్డ్ పేరుతో మొక్కల ఆధారిత ఉత్పత్తుల తయారీలోకి ప్రవేశించాం’ అని వివరించారు. ఏపీలో మరో ప్లాంటు.. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో ఉన్న కాంటినెంటల్ కాఫీ పార్కులో సీసీఎల్ కొత్తగా ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. 22 ఎకరాల విస్తీర్ణంలో రానున్న ఈ కేంద్రానికి ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి ఇటీవలే శంకుస్థాపన చేశారు. ఈ యూనిట్ కోసం రూ.400 కోట్ల పెట్టుబడి చేస్తున్నట్టు కంపెనీ ఈడీ మోహన్‌కృష్ణ వెల్లడించారు. వార్షిక తయారీ సామర్థ్యం 16,000 మెట్రిక్ టన్నులు. 2024 మార్చిలోగా ఉత్పత్తి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. -
ఒటీటీ నుంచి వస్తున్న మొదటి స్పై థ్రిల్లర్ మూవీ ఇదే..
వైవిధ్యమైన కంటెంట్‌ను అందిస్తూ ఆడియెన్స్ హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకుని దూసుకెళ్తోన్న ఓటీటీ ప్లాట్‌ఫాం జీ 5. ఇప్పుడు సరికొత్త యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘మిషన్ తషాఫి’ ఒరిజినల్‌తో ఆకట్టుకోవటానికి సిద్ధమవుతోంది. ఎంగేజింగ్, థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలతో సినిమాలను తెరకెక్కిస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. సిమ్రాన్ చౌదరి, శ్రీకాంత్ అయ్యంగార్, అనీష్ కురువిల్లా, ఛత్రపతి శేఖర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రధాన తారాగణంగా నటించబోయే నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. హై ఇంటెన్స్ స్పై థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ‘మిషన్ తషాఫి’ ఒరిజినల్ రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైందని మేకర్స్ తెలిపారు. (ఇదీ చదవండి: నేను చనిపోతే శేఖర్,జానీ చేసేది ఇదే.. ముందే చెప్పిన రాకేష్ మాస్టర్) 8 ఎపిసోడ్స్ ఉన్న ‘మిషన్ తషాఫి’ వెబ్ సిరీస్‌ను ఫిల్మ్ రిపబ్లిక్ బ్యానర్‌పై ప్రణతి రెడ్డి నిర్మిస్తున్నారు. తెలుగు ఓటీటీ చరిత్రలో ఇప్పటి వరకు రూపొందని విధంగా ఈ హై ఇన్టెన్స్ యాక్షన్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‌ను జీ 5 భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది. ప్రముఖ అంతర్జాతీయ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు చిత్రీకరించని సరికొత్త లొకేషన్స్‌లో ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. (ఇదీ చదవండి: వైరల్ అవుతున్న హీరోయిన్ లిప్‌లాక్ వీడియో) -
హీరోయిన్ గా తెలుగు అమ్మాయిలను ఎందుకు తీసుకోను అంటే..!
-
రాజకీయాల్లో సినిమావాళ్ల విలువ ఎంతంటే..
రాజకీయాలలో సినిమా వాళ్ల పాత్ర ఏమిటి?.. వాళ్లు ప్రచారం చేసినంత మాత్రాన గెలిచిపోతారా? ప్రతిసారి ఎన్నికల సమయంలో ఇలాంటి చర్చలు సహజంగానే జరుగుతుంటాయి. తెలుగు సినీ ప్రముఖుడు బ్రహ్మానందం కర్నాటకలోని చిక్ బళ్లాపూర్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయనను చూడడానికి జనం కూడా బాగానే వచ్చారు. కానీ, ఆయన మద్దతు ఇచ్చిన బిజెపి అభ్యర్ధి డాక్టర్ సుధాకర్ మాత్రం పరాజయం చెందారు!. అయితే.. డాక్టర్ సుధాకర్.. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగానే ఇక్కడ గెలిచారు. కాని.. ఆ తర్వాత పరిణామాలలో పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఉప ఎన్నికలో పోటీచేసి సుమారు 35 వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. అంత మెజార్టీ వచ్చింది కదా అనే ధీమాతో.. తాజా అసెంబ్లీ ఎన్నికలో కూడా గెలుస్తాననే భావనలో కూరుకుపోయిన సుధాకర్‌కు చిక్ బళ్లాపూర్ ఓటర్లు షాక్ ఇచ్చారు. సుమారు 10,500 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారాయన. తెలుగువారు కూడా గణనీయంగా ఉండే ఆ నియోజకవర్గంలో బ్రహ్మానందం ప్రచారం కూడా ఉపయోగపడుతుందని ఆశించారు. దాని వల్ల ఏమనా కాంగ్రెస్ అభ్యర్ధి అయ్యర్ మెజార్టీ కాస్త తగ్గిందేమో తెలియదు కాని, బిజెపి ఓటమి మాత్రం తప్పలేదు. నిజానికి బ్రహ్మానందం రాజకీయ మిషన్ తో అక్కడ ప్రచారం చేయలేదు. తనకు వ్యక్తిగత సంబంధాలు ఉండడంతో ఆ నియోజకవర్గంలో ప్రచారం చేసి వచ్చారట. ఇలా కొన్నిసార్లు యాక్టర్ లు సిద్దాంతాలు,పార్టీలతో నిమిత్తం లేకుండా తమకు ఉన్న సంబంధ, బాంధవ్యాల రీత్యా ప్రచారం చేస్తుంటారు. అన్నిసార్లు వాటి వల్ల ఉపయోగం ఉంటుందని చెప్పలేం కాని, కొన్నిసార్లు కొంత ప్రయోజనం ఉండవచ్చు. అంతమాత్రాన వారే రాజకీయాలు శాసించే పరిస్తితి లేదనే చెప్పాలి. ఇందుకు కొన్ని మినహాయింపులు ఉండవచ్చు. 👉 తమిళనాడులో అన్నాదురై, కరుణానిది, ఎమ్.జి.ఆర్, జయలలిత వంటివారు ఆ రాష్ట్ర రాజకీయాలను శాసించారు. తమకు ఉన్న సినిమా పాపులారిటీతో పాటు పార్టీ సిద్దాంతం కూడా వారికి కలిసి వచ్చింది. ప్రజలలో మమేకం అయ్యే వారి లక్షణం ఉపయోగపడింది. కానీ, అక్కడే మరో నటుడు విజయకాంత్ రాణించలేకపోయారు. కమల్ హసన్‌ది అయితే మరీ దయనీయం. రజినీకాంత్ రాజకీయాలలోకి రావాలో ,వద్దో తేల్చుకోలేక చివరికి ఆ వైపు వెళ్లరాదని నిర్ణయించుకున్నారు. 👉 ఏపీలో ఎన్టీఆర్(దివంగత) వచ్చేవరకు సినిమావారికి విశేష ప్రాధాన్యం లేదనే చెప్పాలి. కళావాచస్పతి కొంగర జగ్గయ్య ఒకసారి లోక్ సభకు మాత్రం కాంగ్రెస్ పక్షాన ఎన్నికయ్యారు. అది 1971 లో ఇందిరాగాంధీ వేవ్ లో అని గుర్తించాలి. ఆ తర్వాత ఆయన ఒకసారి అసెంబ్లీకి పోటీచేసి ఘోరంగా ఓటమి చెందారు. ఆయన ఒక్కరే కాదు. ప్రముఖ నటుడు కృష్ణ, జమున,కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, శారద, మురళీమోహన్, రామానాయుడు ఇలా పలువురు సినిమావారు ఎన్నికల రాజకీయాలలో ఒకసారికే పరిమితం అయ్యారు. విజయనిర్మల ఆ ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయారు. మరో నటుడు నరేష్ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కాని సఫలం కాలేదు. 👉 తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్.టి.రామారావు 1983లో రెండు చోట్ల, 1985లో మూడు చోట్ల పోటీచేసి విజయం సాధించి రికార్డు సృష్టించారు. కాని 1989 లో ఆయన రెండు చోట్ల పోటీచేసి ఆశ్చర్యంగా ఒకచోట ఓటమి చెందారు. మళ్లీ 1994లో రెండు చోట్ల పోటీచేసి గెలిచారు. తొమ్మిది చోట్ల పోటీచేసి ఎనిమిదింట గెలవడం ఒక రికార్డే అయినా, ఒకసారి ఓటమి మాత్రం ఆయన ప్రతిష్టను దెబ్బతీసింది. ఆయన ఒక సిద్దాంతంతో ప్రజల ముందుకు రావడం, అప్పట్లో రాజకీయ శూన్యత ఉండడం కలిసి వచ్చింది. అయితే ఎన్.టి.ఆర్.ను 1989లో ఓడించడంలో కొంతమంది సినిమావారి ప్రచార ప్రభావం కూడా కొంత ఉపయోగపడింది. అంటే జనంలో ప్రభుత్వంపై, లేదా ఒక రాజకీయ పార్టీపై వ్యతిరేకత ఏర్పడినప్పుడు సినిమావారి ప్రచారాలు అదనంగా కలిసి వస్తాయని అనుకోవచ్చు. అదే ప్రభుత్వంపై లేదా రాజకీయ పార్టీ పై వ్యతిరేకత లేనప్పుడు ఎంత పెద్ద సినీ నటుడు ప్రచారం చేసినా ప్రయోజనం ఉండదని అనుభవం చెబుతుంది. 👉 ప్రముఖ నటుడు చిరంజీవి సొంతంగా పార్టీ పెట్టి రెండు చోట్ల పోటీచేసి ఒకచోట మాత్రమే గెలవగలిగారు. ఆ తర్వాత ఎక్కువకాలం ఆయన పార్టీని నడపలేకపోయారు. చిరంజీవి సభలకు జనం పోటెత్తినా ఆశించిన ఓట్లు రాలేదు. ఆయనకు రాజకీయ వ్యూహం కొరవడడమే కారణం అని చెప్పాలి. ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించి కేవలం ప్రచారానికి పరిమితం అయ్యారు. టీడీపీ గెలుపునకు ఆయనే కారణమని అభిమానులు భావించేవారు. అదే పవన్ కళ్యాణ్ 2019లో మరో రాజకీయ కూటమి ఏర్పాటు చేసి పోటీలో దిగి రెండు చోట్ల పోటీచేస్తే , ఆ రెండిట ఓడిపోవడం విశేషం. ఆయన ఫెయిర్ రాజకీయాలు చేయకపోవడం, తెలుగుదేశంతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అంటకాగడం, ఆయనను నమ్ముకున్న అబిమానులు, కాపు సామాజికవర్గ నేతల అబిప్రాయాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి కారణాల వల్ల ఆయన రాజకీయంగా సఫలం కాలేకపోయారు. తిరిగి 2024లో కూడా టిడిపికి తోక పార్టీగానే ఉండాలని ఆయన నిర్ణయించుకోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతకాలం ఆయనను సి.ఎమ్.,సి.ఎమ్.అంటూ నినదించిన అభిమానులకు ఆశాభంగం కలిగిస్తూ చంద్రబాబుకు ఆయన ఆ విషయంలో సరెండర్ అయిపోయి తనకు బలం లేదని చెప్పేసుకుని దెబ్బతిన్నారు. ఒక్క ఎమ్మెల్యేగా గెలిస్తే చాలన్న ఆయన కోరిక 2024లో నెరవేరుతుందా?లేదా? అన్నది చూడాల్సి ఉంది. 👉 వైఎస్సార్సీపీ పక్షాన పోటీచేసి మరో ప్రముఖ నటి రోజా మంత్రి కాగలిగారు. ఆమె ఇప్పటికి రెండుసార్లు విజయం సాధించారు. ఒక ప్రముఖ పార్టీలో కొనసాగి,నాయకుడి పట్ల విధేయతతో ఉండడం , ఒక సిద్దాంతానికి కట్టుబడి ఉండడం వంటి కారణాలు ఆమె రాజకీయ సాఫల్యానికి కారణాలుగా కనిపిస్తాయి. మరో ప్రముఖ నటి జయప్రద ఏపీ నుంచి తొలుత రాజ్యసభ సభ్యురాలైనా, ఆ తర్వాతకాలంలో ఆమె యూపీ నుంచి రెండుసార్లు లోక్ సభ కు ఎన్నికై సంచలనం సృష్టించారు. యుపిలో మాజీ ముఖ్యమంత్రి మూలాయం సింగ్ యాదవ్ తో పాటు , ఆయన పార్టీలోని కొందరి అండ ఉండడంతోనే అది సాద్యమైంది. 👉👉జాతీయ రాజకీయాలలోకాని, ఆయా రాష్ట్రాలలో కాని సినీ ప్రముఖులు పూర్తి స్థాయిలో రాణించిన సందర్భాలు తక్కువేనని చెప్పాలి. కాకపోతే యాక్టర్ లకు ఉండే అడ్వాంటేజ్ ఏమిటంటే వారు తమ సినిమాల ద్వారా ప్రజలను కొంత ప్రభావితం చేస్తారు. జనంలోకి వస్తే వారిని తేలికగా గుర్తు పడతారు. వారి గ్లామర్ ఆ రకంగా ఉపయోగపడుతుంది. అందుకే ఏదైనా వ్యాపార సంస్థ ప్రారంభోత్సవానికి కూడా సినీ నటులను అతిధులుగా ఆహ్వానిస్తుంటారు. అంతమాత్రాన ఆ వ్యాపారాలు సక్సెస్ అయిపోతాయని కాదు. వారి వ్యూహంతో పాటు, ప్రజలలో తేలికగా బ్రాండ్ ఇమేజీ తెచ్చుకోవడానికి సినీ నటులు ఉపయోగపడతారని భావించడమే. అలాగే రాజకీయాలలో కూడా వీరు కొంత బ్రాండ్ ఇమేజీకి పనికి వస్తారు కాని, సిద్దాంత పునాది, పెద్ద రాజకీయ పార్టీ మద్దతు లేకుండా వీరు రాణిస్తారని, వీరి ప్రచారంతోనే అభ్యర్ధులు గెలిచిపోతారని అనుకుంటే అది భ్రమేనని పలు అనుభవాలు తెలియచేస్తున్నాయి. ::: కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
వీడియో: హైదరాబాద్‌కు తిరుగులేదన్న శ్రేయా ఘోషల్, ఆమె తెలుగుకు ఆడియన్స్ ఫిదా!
-
టెక్సాస్ కాల్పుల ఘటనపై ఏపీ ప్రభుత్వం ఆందోళన: రత్నాకర్
అమెరికా టెక్సాస్ రాష్ట్రం డల్లాస్‌లో జరిగిన కాల్పుల్లో తెలుగు యువతి ఐశ్వర్య మరణించడంపై ఏపీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా దక్షిణాది రాష్ట్రమైన టెక్సాస్‌లో చాలా మంది భారతీయులు, అందులోనూ తెలుగు వారు నివసిస్తున్నారు. డల్లాస్ లో కాల్పుల ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని, తెలుగు యువతి తాటికొండ ఐశ్వర్య కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నామని నార్త్ అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ అన్నారు. డల్లాస్ అల్లెన్ ప్రీమియం మాల్ ఘటనలో ఎనిమిది మంది మరణించినట్టుగా తెలిసిందని, ఐశ్వర్య ఇందులో ఉన్నారని, గాయపడ్డ వారిలో మరో ఇద్దరు కూడా తెలుగు వారున్నారని, వారు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు రత్నాకర్ తెలిపారు. అమెరికాలో ఉంటోన్న ప్రవాసాంధ్రులు నిత్యం జాగ్రత్తలు, నిబంధనలు పాటించాలని కోరారు. ఈ జాగ్రత్తలు పాటించండి ఇటీవల చోటు చేసుకుంటోన్న కాల్పుల ఘటనలు, ఇతర దాడుల నేపథ్యంలో అక్కడ ఉంటున్న తెలుగువారికి, భారతీయులకు తగినన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ► కాల్పుల తరహలో ఏవైనా ఘటనలు లాంటివి జరిగినపుడు వీలైనంత వరకు బయటకు రావొద్దు ► ఎదుటి వారికి కనిపించేలా పరుగులు తీయొద్దు, మన ఆచూకీ తెలియనివ్వకుండా నక్కి ఉండండి ► కాల్పుల శబ్దం విన్నప్పుడు, అది మరీ దగ్గరగా ఉంటే పూర్తిగా నేలపైనే పడుకుని ఉండండి. పైకి కనిపించొద్దు. ► ఆందోళనకు గురి కావొద్దు, హడావిడిగా అటు, ఇటు పరుగులు తీయొద్దు ► బయట సమూహాల్లో కలుసుకునే సందర్భాల్లో వీలైనంత వరకు ఇంగ్లీషులోనే మాట్లాడాలి, మాతృభాషను తక్కువగా వాడాలి ► చుట్టుపక్కల అనుమానస్పద కదలికలపై, వ్యక్తులపై ఓ కన్నేసి ఉంచండి ► ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని అనుమానం వస్తే, ఎక్కడైనా ట్రాప్ అయ్యామని అనిపిస్తే వెంటనే అలర్ట్ కండి. 911కు కాల్ చేసి సమాచారం ఇవ్వండి ► ఎవరితోనూ ఎలాంటి పరిస్థితుల్లోనూ వాదనలకు దిగొద్దు ► బహిరంగ ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవపడొద్దు ► చాలామంది రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు, ఆ సమయంలో సాధ్యమైనంతవరకు ఆంగ్ల భాషలోనే మాట్లాడండి, సున్నితంగా అక్కడి నుంచి తప్పుకోండి. ► మనుషుల కదలిక తక్కువగా ఉండే నిర్మానుష్య ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లకూడదు ► 911 నంబర్‌కు ఫోన్ చేసేందుకు అస్సలు సంకోచించవద్దు, పైగా పోలీసులతో పాటు వైద్యంతో పాటు ఏ రకమైన సాయమైనా క్షణాల్లో దొరుకుతుంది ► అమెరికాలో పరిస్థితులు చాలా వరకు సురక్షితమే. అయితే ఒకటో, రెండో నేర ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. ► ఎవరికి వారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండటం మంచిది. చదవండి: టెక్సాస్ కాల్పుల ఘటన.. హైదరాబాద్ యువతి మృతి -
తెలుగులోనూ రైల్వే టికెట్ బుకింగ్
సాక్షి, విశాఖపట్నం: జనరల్ టికెట్ కోసం ఆదరాబాదరాగా రైల్వేస్టేషన్‌కు చేరుకుని.. చాంతాడంత పొడవు ఉండే క్యూలైన్లలో నిలబడి.. ఈలోపు తాము ఎక్కాల్సిన రైలు వెళ్లిపోతుందేమోనని ఆదుర్దా పడేవారే ఎక్కువ. ఇలా ఇబ్బందులు పడే ప్రయాణికుల కోసం రైల్వే శాఖ నాలుగేళ్ల క్రితం అన్ రిజర్వుడ్ టికెటింగ్ సిస్టమ్ (యూటీఎస్)ను తీసుకొచ్చి న సంగతి తెలిసిందే. యూటీఎస్ విధానంలో యాప్, వెబ్సైట్ ద్వారా రైలు టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఇంగ్లిష్‌లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దీన్ని ప్రాంతీయ భాషలకు కూడా రైల్వే శాఖ విస్తరించింది. దీంతో తెలుగు సహా వివిధ ప్రాంతీయ భాషల్లోనూ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. సాధారణ (జనరల్) రైలు టికెట్లను దిగువ శ్రేణి ప్రయాణికులు ఎక్కువగా తీసుకుంటారని.. వీరి కోసం ప్రాంతీయ భాషల్లో యాప్‌ని తీసుకొస్తే వినియోగం మరింత పెరుగుతుందనే ఉద్దేశంతో రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఎలాంటి శ్రమ లేకుండా యాప్ నుంచే.. యూటీఎస్ యాప్ ద్వారా ఎలాంటి శ్రమ లేకుండా మొబైల్ ఫోన్ నుంచే జనరల్ టికెట్ పొందొచ్చు. అయితే టికెట్ బుక్ చేసుకోవడానికి ఇంగ్లిష్ మాత్రమే అందుబాటులో ఉండటంతో గ్రామీణులు, పెద్దగా చదువుకోనివారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సులభంగా యాప్ వినియోగించేలా ప్రాంతీయ భాషల్లోనూ టికెట్ బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. దీంతో ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, హిందీ, కన్నడం, మళయాలం, మరాఠీ, ఒడియా, తమిళ భాషల్లోనూ టికెట్ బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీనిద్వారా జనరల్ టికెట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ టికెట్ కూడా కొనుగోలు చేయొచ్చు. అలాగే సీజన్ టికెట్ బుకింగ్, రెన్యువల్ సైతం చేసుకోవచ్చు. యూటీఎస్ యాప్‌లో ప్రాంతీయ భాషల అప్డేట్ వెర్షన్‌ను ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండింటిలోనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. హార్డ్ కాపీ, పేపర్‌లెస్ టికెట్.. రెండు ఆప్షన్లు ఉన్నాయి. యూటీఎస్ యాప్ ఎన్ని భాషల్లో: తెలుగు, ఇంగ్లిష్, కన్నడం, మలయాళం, హిందీ, తమిళం, ఒడియా, మరాఠీ దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న రైల్వేస్టేషన్లు: 9,120 డౌన్లోడ్ చేసుకున్నవారు: 10 మిలియన్లకు పైగా యాప్ ద్వారా రోజుకు బుక్ అవుతున్న టికెట్లు: 2.34 లక్షలు రోజూ వినియోగిస్తున్న ప్రయాణికులు: 14.21 లక్షల మంది స్టేషన్‌కు 5 కి.మీ. పరిధిలో.. మొబైల్లోని జీపీఎస్ ఆధారంగా యూటీఎస్ యాప్ పనిచేస్తోంది. టికెట్ బుక్ చేసుకునే సమయంలో మొబైల్ జీపీఎస్ లొకేషన్ ఆన్‌లో ఉండాలి. రైల్వేస్టేషన్ ఆవరణకు 30 మీటర్ల నుంచి 5 కి.మీ. పరిధిలో ఉన్న ప్రయాణికులు మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా యాప్ ద్వారా 3 నెలలు, 6 నెలలు లేదా సంవత్సరానికి సీజన్ టికెట్లను తీసుకోవచ్చు. ఎక్స్‌ప్రెస్, మెయిల్, ప్యాసింజర్, సూపర్‌ఫాస్ట్ రైళ్లకు యూటీఎస్ టికెట్ బుకింగ్ చెల్లుబాటు అవుతుంది. – అనూప్‌కుమార్ సత్పతి, డీఆర్ఎం, వాల్తేరు