టంపాలో చరిత్ర సృష్టించిన తెలుగు కుటుంబం దాతృత్వం! | St Josephs Childrens Hospital Foundation Receives Historic 400 Crores Gift Fom Te Pagidipati Family OfTampa | Sakshi
Sakshi News home page

టంపాలో చరిత్ర సృష్టించిన తెలుగు కుటుంబం దాతృత్వం!

Published Fri, May 3 2024 5:04 PM | Last Updated on Fri, May 3 2024 5:24 PM

St Josephs Childrens Hospital Foundation Receives Historic 400 Crores Gift Fom Te Pagidipati Family OfTampa

ప్లోరిడాలోని టంపాలో ఓ తెలుగుకుటుంబం దాతృత్వం  చరిత్ర సృష్టించింది. టంపాలో సెయింట్ జోసఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పౌండేషన్‌కు తెలుగువారైన పగిడిపాటి కుటుంబం 50 మిలియన్ డాలర్లను(ఏకంగా రూ. 400 కోట్లు) విరాళంగా అందించింది. ఇంత పెద్ద మొత్తం విరాళంగా ప్రకటించి అమెరికాలో ఉండే యావత్ తెలుగువారంతా గర్వపడేలా చేసినందుకు నాట్స్ ప్రత్యేకంగా పగిడిపాటి కుటుంబాన్ని అభినందించింది. 

ఏకంగా 50 మిలియన్ల విరాళం
అమెరికాలో ప్రముఖ వైద్యులు డాక్టర్ పగిడిపాటి దేవయ్య, రుద్రమ్మల 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా పగిడిపాటి కుటుంబం 50 మిలియన్ డాలర్లను విరాళంగా ఇవ్వడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. పగిడిపాటి కుటుంబంలోని సిద్ధార్థ, అమీ, రాహుల్, నేహా, సృజని, అర్జున్, ఇషాన్, ఆరియా, అరెన్ వీరందరూ కలిసి ఇచ్చిన ఈ విరాళం ప్లోరిడాలోని టంపాలో ఆరోగ్య సంరక్షణకు ఇప్పటివరకు ఇచ్చిన అతి పెద్ద విరాళాల్లో ఇది ఒక్కటిగా నిలిచి చరిత్ర సృష్టించింది.  

నాట్స్ ప్రశంసల వర్షం..
ఈ విరాళం ద్వారా సెయింట్ జోసెఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో కొత్త పీడియాట్రిక్ సదుపాయం అభివృద్ధికి దోహదపడుతుంది. పిల్లల కోసం అత్యాధునిక ఆరోగ్య సంరక్షణను మరింత పెంచే వ్యూహంలో భాగంగా ఈ విరాళాన్ని ఇవ్వడం హర్షించదగ్గ విషయం. పగిడిపాటి కుటుంబ దాతృత్వానికి గుర్తింపుగా, కొత్త పిల్లల ఆసుపత్రికి పగిడిపాటి చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎట్ సెయింట్ జోసెఫ్ అని పేరు పెట్టనున్నారు. 

డాక్టర్ రుద్రమ, దేవయ్యలు నాట్స్‌తో పాటు అనేక ఇతర సేవా సంస్థలకు తమ మద్దతు అందిస్తున్నారు. ఇదే స్ఫూర్తితో మన అమెరికాలో తెలుగువారు అద్భుత విజయాలు సాధించి సేవా రంగంలో కూడా ముందుండాలని నాట్స్ అకాంక్షిస్తోంది. పగిడిపాటి రుద్రమ్మ, దేవయ్య మరిన్ని విజయాలు సాధించి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని నాట్స్ కోరుకుంటుంది.

(చదవండి: అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement