Joseph
-
WI Vs ENG: కెప్టెన్‌తో గొడవ.. మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయిన విండీస్ స్టార్ ప్లేయర్
బ్రిడ్జ్‌టౌన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ విజయ భేరి మ్రోగించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో విండీస్ సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. విండీస్ స్టార్ పేసర్ అల్జారీ జోషఫ్ కెప్టెన్ షాయ్ హోప్‌తో విభేదాల కారణంగా మ్యాచ్ మధ్యలోనే మైదానం నుంచి డగౌట్‌కు వెళ్లిపోయాడు. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు.అసలేం జరిగిందంటే?ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ హోప్ తొలుత ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్హనించాడు. బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు మంచి ఆరంభం దక్కలేదు. 3 ఓవర్లోనే విల్ జాక్స్ రూపంలో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. దీంతో ఫస్ట్‌డౌన్‌లో యువ ఆటగాడు జోర్డాన్ కాక్స్ క్రీజులోకి వచ్చాడు. కాక్స్‌కు ఇద్దర్ స్లిప్ ఫీల్డర్లను విండీస్ కెప్టెన్ సెట్ చేశాడు. అయితే ఈ ఫీల్డ్ ప్లేస్మెంట్ నాలుగో ఓవర్ వేసేందుకు వచ్చిన జోషఫ్‌కు నచ్చలేదు. దీంతో హోప్‌తో జోషఫ్ వాగ్వాదానికి దిగాడు. అతడితో గొడవ పడుతూనే ఓవర్‌ను జోషఫ్ కొనసాగించాడు.ఆ ఓవర్లో నాలుగో బంతికి కాక్స్‌ను జోషఫ్ ఔట్ చేశాడు. జోషఫ్ వికెట్ సాధించినప్పటకి కనీసం సెలబ్రేట్ కూడా చేసుకోలేదు. సహచర ఆటగాళ్లు తన దగ్గరకి వచ్చినప్పటకి జోషఫ్ మాత్రం సీరియస్‌గా హోప్‌తో తన వాగ్వాదాన్ని కొనసాగించాడు.అంతటితో ఆగని జోషఫ్ తన ఓవర్ పూర్తి కాగానే మైదానం విడిచిపెట్టి డగౌట్‌కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత కోచ్ సామీతో సంప్రదింపులు జరిపిన తర్వాత జోషఫ్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: IND vs AUS: రాహుల్ నీవు మారవా? ఎక్కడకి వెళ్లినా అంతేనా?Gets angry! 😡Bowls a wicket maiden 👊Leaves 🤯An eventful start to the game for Alzarri Joseph! 😬#WIvENGonFanCode pic.twitter.com/2OXbk0VxWt— FanCode (@FanCode) November 6, 2024 -
టంపాలో చరిత్ర సృష్టించిన తెలుగు కుటుంబం దాతృత్వం!
ప్లోరిడాలోని టంపాలో ఓ తెలుగుకుటుంబం దాతృత్వం చరిత్ర సృష్టించింది. టంపాలో సెయింట్ జోసఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పౌండేషన్‌కు తెలుగువారైన పగిడిపాటి కుటుంబం 50 మిలియన్ డాలర్లను(ఏకంగా రూ. 400 కోట్లు) విరాళంగా అందించింది. ఇంత పెద్ద మొత్తం విరాళంగా ప్రకటించి అమెరికాలో ఉండే యావత్ తెలుగువారంతా గర్వపడేలా చేసినందుకు నాట్స్ ప్రత్యేకంగా పగిడిపాటి కుటుంబాన్ని అభినందించింది. ఏకంగా 50 మిలియన్ల విరాళంఅమెరికాలో ప్రముఖ వైద్యులు డాక్టర్ పగిడిపాటి దేవయ్య, రుద్రమ్మల 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా పగిడిపాటి కుటుంబం 50 మిలియన్ డాలర్లను విరాళంగా ఇవ్వడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. పగిడిపాటి కుటుంబంలోని సిద్ధార్థ, అమీ, రాహుల్, నేహా, సృజని, అర్జున్, ఇషాన్, ఆరియా, అరెన్ వీరందరూ కలిసి ఇచ్చిన ఈ విరాళం ప్లోరిడాలోని టంపాలో ఆరోగ్య సంరక్షణకు ఇప్పటివరకు ఇచ్చిన అతి పెద్ద విరాళాల్లో ఇది ఒక్కటిగా నిలిచి చరిత్ర సృష్టించింది. నాట్స్ ప్రశంసల వర్షం..ఈ విరాళం ద్వారా సెయింట్ జోసెఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో కొత్త పీడియాట్రిక్ సదుపాయం అభివృద్ధికి దోహదపడుతుంది. పిల్లల కోసం అత్యాధునిక ఆరోగ్య సంరక్షణను మరింత పెంచే వ్యూహంలో భాగంగా ఈ విరాళాన్ని ఇవ్వడం హర్షించదగ్గ విషయం. పగిడిపాటి కుటుంబ దాతృత్వానికి గుర్తింపుగా, కొత్త పిల్లల ఆసుపత్రికి పగిడిపాటి చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎట్ సెయింట్ జోసెఫ్ అని పేరు పెట్టనున్నారు. డాక్టర్ రుద్రమ, దేవయ్యలు నాట్స్‌తో పాటు అనేక ఇతర సేవా సంస్థలకు తమ మద్దతు అందిస్తున్నారు. ఇదే స్ఫూర్తితో మన అమెరికాలో తెలుగువారు అద్భుత విజయాలు సాధించి సేవా రంగంలో కూడా ముందుండాలని నాట్స్ అకాంక్షిస్తోంది. పగిడిపాటి రుద్రమ్మ, దేవయ్య మరిన్ని విజయాలు సాధించి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని నాట్స్ కోరుకుంటుంది.(చదవండి: అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం) -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ నటుడి భార్య
ప్రముఖ నటుడు, డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ తండ్రి అయ్యాడు. నేడు(బుధవారం) ఆయన భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తండ్రయిన ఆనంద క్షణాలను సోషల్ మీడియా వేదికగా ఆయన స్వయంగా పంచుకున్నాడు. ఈ సందర్భంగా కూతురికి హోప్ ఎలిజబెత్ బాసిల్ అనే పేరు పెట్టినట్లు తెలిపాడు. బిడ్డను ఎత్తుకున్న ఫొటోను షేర్ చేస్తూ తాను తండ్రి అయినట్లు ట్విటర్ ద్వారా పంచుకున్నాడు. చదవండి: వాలంటైన్స్ డే: తమన్నా-విజయ్ వర్మ రిలేషన్‌పై క్లారిటీ వచ్చేసింది? దీంతో ఆయనకు మలయాళ సినీ ప్రముఖులు, నటీనటుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. దుల్కర్ సల్మన్, నజ్రియా ఫాహద్, టోనివో థామస్, ఐశ్వర్యా లక్ష్మీ, సంయుక్త, రాజీషా విజయన్ లాంటి స్టార్లు జోసెఫ్ దంపతులకు విషెష్ తెలిపారు. కాగా బాసిల్ జోసెఫ్ తెలుగు సినీ ప్రియులకు సైతం సుపరిచితమే. ఇటీవల ఆయన నటించిన జయ జయ జయ హే చిత్రం తెలుగులోనూ డబ్ అయ్యింది. ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. చదవండి: వరుస ఫ్లాప్‌లు.. అలా చేస్తేనే పూజాకు ఆఫర్స్ ఇస్తామంటున్నారట? ఇందులో ఆయన భార్యను వేధించే భర్తగా కనిపించాడు. అంతేకాదు మలయాళంలో ఆయన వినూత్న కథా చిత్రాలతో మంచి గుర్తింపు పొందాడు. కుంజీరమాయనమ్, గోధా వంటి చిత్రాలతో ఆయన మాలీవుడ్‌లో పాపులర్ అయ్యాడు. మిన్నల్ మెరళి చిత్రం ద్వారా డైరెక్టర్‌గా మారి తొలి చిత్రానికే దర్శకుడిగా పలు ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపికయ్యాడు. దీంతో ఆయన పేరు జాతీయ వ్యాప్తంగా మారుమోగింది. ఈ చిత్రం తెలుగులోనూ డబ్ అయిన సంగతి తెలిసిందే. Thrilled to announce the arrival of our little bundle of joy, HOPE ELIZABETH BASIL ! She has already stolen our hearts and we are over the moon with love for our precious daughter.We can't wait to watch her grow and learn from her every day pic.twitter.com/RpQoLaCdm0 — basil joseph (@basiljoseph25) February 15, 2023 -
‘100 రకాల’ డ్రాగన్ రైతు! ఒక్కో మొక్క రూ. 100 నుంచి 4,000 వరకు అమ్మకం!
డ్రాగన్ ఫ్రూట్ పుష్కలంగా పోషకాలు కలిగి ఉండే పండు. అంతేకాదు, ఖరీదైనది కూడా. ఈ రెండు లక్షణాలూ 72 ఏళ్ల వృద్ధుడు జోసెఫ్‌ను రైతుగా మార్చేశాయి. కేరళకు చెందిన ఆయన అమెరికా వెళ్లినప్పుడు తియ్యని డ్రాగన్ ఫ్రూట్ రుచి చూసి పరవశుడయ్యారు. ఏడేళ్ల క్రితం ఆ పండును ఏడు డాలర్లకు కొన్నారాయన. ఆ రుచి, కళ్లు చెదిరే ధర ఆయనను డ్రాగన్ రైతుగా మార్చేసింది. హైదరాబాద్‌లో మెషిన్ టూల్ ఇండస్ట్రీ నిర్వహించి విరామ జీవనం గడుపుతున్న జోసెఫ్.. తన స్వస్థలం కొట్టాయం దగ్గర్లోని చెంగనస్సెరీకి తిరిగి వెళ్లి స్థిరపడ్డారు. అమెరికా నుంచి తిరిగి వచ్చాక దేశ విదేశాల నుంచి డ్రాగన్ మొక్కల్ని సేకరించటం మొదలు పెట్టారు. ఈక్వడార్, తైవాన్, బ్రెజిల్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల నుంచి డ్రాగన్ మొక్కల్ని తెప్పించి ఇంటి పెరట్లోని 65 సెంట్ల స్థలంలో నాటారు. 100 రకాలు ఇప్పటికి దాదాపు 100 రకాలు సేకరించారు. అందులో కొన్ని మాత్రమే రుచిగా ఉంటాయంటారు జోసెఫ్. కొన్ని రకాల పండు లోపలి గుజ్జు తెల్లగా ఉంటే, మరికొన్నిటికి ఎర్రగా, పసుపు పచ్చగానూ ఉంటాయి. డ్రాగన్ జీవవైవిధ్యంతో ఆయన పెరటి తోట కళకళలాడుతూ ఉంటుంది. తనకు నచ్చిన రకాలను సంకరం చేసి 10 కొత్త డ్రాగన్ వంగడాలను రూపొందించే పనిలో ఆయన బిజీగా ఉన్నారు. 65 రోజులకు పండు కోతకు వీటిల్లో జేకే1 పలోరా 2, రెడ్ చిల్లీ, వండర్ బాయ్ జేకే 2 అనే రకాల మొక్కలు నర్సరీలో సిద్ధంగా ఉన్నాయి. జేకే1 పలోరా 2 రకం పసుపు రంగు పండు అన్నిటికన్నా తియ్యనిది (బ్రిక్స్ 23.6). పూత వచ్చాక 65 రోజులకు పండు కోతకు వస్తుందని ఆయన ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. తన డ్రాగన్ పండ్ల రంగు, రుచిని బట్టి.. ఒక్కో మొక్కను రూ. వంద నుంచి 4,000 వరకు విక్రయిస్తుండటం విశేషం. వండర్ బాయ్ జేకే 2 రకం (క్రాస్ పాలినేషన్ రకం) పండు తియ్యదనం బ్రిక్స్ 21.5. ఈ మొక్క ధర రూ. 1,500. రెడ్ చిల్లీ పండు తియ్యదనం బ్రిక్స్ 17.5. దీని కటింగ్‌ను రూ. వెయ్యికి అమ్ముతున్నారాయన. అన్నట్టు.. మొక్కలతో పాటు పండ్లను కూడా అమ్ముతున్నారు జోసెఫ్(94472 94236). అనేక రాష్ట్రాల్లో తన కస్టమర్లున్నారని ఆయన అంటున్నారు కించిత్ గర్వంగా! చదవండి: Cocoponics: మట్టి లేని సేద్యం.. కూరగాయలు పుష్కలం! రూపాయి పెట్టుబడికి 11 వరకు ఆదాయం! -
ఏడాది కావొస్తున్న చై-సామ్ విడాకులు, సమంత తండ్రి ఎమోషనల్ పోస్ట్..
టాలీవుడ్ మాజీ కపుల్ సమంత, నాగ చైతన్య విడిపోయి ఏడాది కావోస్తోంది. గతేడాది అక్టోబర్ 2న ఈ జంట విడాకులు ప్రకటించి అందరికి షాకిచ్చింది. అప్పటి నుంచి వీరి విడాకుల వార్తలు ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉన్నాయి. క్యూటెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట విడిపోవడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ వీరద్దరు మళ్లీ కలిస్తే బాగుంటుందని ఆశించే వారు ఎంతోమంది ఉన్నారు. చదవండి: లలిత్ మోదీకి కూడా సుస్మితా బ్రేకప్ చెప్పిందా? అసలేం జరిగింది! అయితే వీరి విడాకులు వార్తలపై ఇంతకు ఎలాంటి క్లారిటీ లేదు. ఇటూ అక్కినేని ఫ్యామిలీ కానీ, అటూ సమంత కుటుంబ సభ్యులు కానీ దీనిపై పెద్ద స్పందించలేదు. ఈ క్రమంలో చై-సామ్ విడిపోయి ఏడాది దగ్గరపడుతున్న క్రమంలో సమంత తండ్రి జోసెఫ్ ప్రభు ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు. దీంతో మరోసారి చై-సామ్ విడాకుల అంశం వార్తల్లో నిలిచింది. తాజాగా సమంత తండ్రి జోసెఫ్ ప్రభు తన ఫేస్బుక్ ఒక పోస్ట్ షేర్ చేశాడు. అయిదేళ్ల క్రితం షేర్ చేసిన సమంత-నాగ చైతన్య రిసెప్షన్ ఫొటోలను రిపోస్ట్ చేస్తూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: తిరుమల కొండపై నటి అర్చన రచ్చ.. స్పందించిన టీటీడీ ‘చాలా కాలం క్రితం నాటి జ్ఞాపకాలు. ఇప్పుడు అవి లేవు. ఇకపై ఉండవు కూడా. కాబట్టి కొత్త కథ, కొత్త జీవితం మొదలు పెడదాం’ అని అని ఆయన రాసుకొచ్చారు. కాగా చై-సామ్ విడాకుల ప్రకటన అనంతరం ఆయన స్పందిస్తూ ఈ విషయం వినగానే తన మైండ్ బ్లాక్ అయ్యందంటూ భావోద్వేగానికి గురయ్యారు. చై-సామ్ విడాకుల విషయం వినగానే మొదట తనకు ఏం అర్థం కాలేదని, ఒక్కసారిగా కళ్ల ముందు అంతా చీకటి కమ్ముకుందన్నారు. విడాకుల విషయంలో మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోమని సమంతకు చెప్పినట్లు ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే. -
పాపం లిగాన్.. 68 ఏళ్లు జైల్లో.. అందర్నీ కోల్పోయి..
రోజు రోజుకు ప్రపంచం మారిపోతోంది. దాంతో పాటే మన పరిసరాలు కూడా ఎంతో మారిపోతున్నాయి. ఒక రోజు చూసినట్లుగా మరో రోజు ఉండటం లేదు. మనకు బాగా తెలిసిన ప్రాంతం అయినా.. ఓ ఏడాదో, రెండోళ్ల తర్వాతో మనం అక్కడకి వెళితే గుర్తుపట్టలేనంతగా మార్పులు వస్తున్నాయి. విశాలమైన రోడ్లు, ఎత్తైన భవంతులు కనబడుతున్నాయి. కొత్త రకం రవాణా వాహనాలు, మెట్రో రైళ్లు, పడవల్లాంటి కార్లు.. ఇలా ఒకటేమిటి ఎన్నో మార్పులు తక్కువ సమయంలోనే రావడం చూసి మనమే ఆశ్చర్యపోతున్నాం. అలాంటిది ఓ వ్యక్తి 68 ఏళ్ల పాటు జైల్లో ఉండి బయటకు వస్తే ఎలా ఉంటుంది. తన చిన్నప్పటి పరిస్థితులు, ఇప్పటి పరిసరాలు చూసి ఆశ్చర్యపోకుండా ఉండగలడా? ఇలాగే అమెరికాకు చెందిన జోసఫ్ లిగాన్ కూడా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. ఆకాశ హార్మ్యాలను చూసి.. లిగాన్ జైలుకెళ్లినప్పుడు తాను చూసిన సాధారణ నగరం ఫిలడెల్ఫియాను.. ఆకాశ హార్మ్యాలతో విరాజిల్లుతున్న ఇప్పటి ఫిలడెల్ఫియాను చూసి ఆశ్చర్యపోయాడు. జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఎత్తైన భవనాలను చూస్తూ.. ఇదంతా నాకు కొత్తగా ఉంది. అప్పట్లో ఇవన్నీ లేవు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కొత్త కొత్తగా మారిపోయిన వీధులను ఆసక్తిగా చూస్తున్నాడు. సరికొత్త పరిస్థితులను మెల్లగా అలవాటుపడుతున్నాడు. స్వెట్లర్లు, సాక్సులు, ఇతర ఆధునిక అవసర వస్తువులు కొనుక్కొని జీవితంలోని మరో అంకంలోకి అడుగుపెడుతున్నాడు. కాగా, అమెరికాలో జువనైల్ ఖైదీగా జైల్లోకి వెళ్లి అక్కడే ఎక్కువ కాలం ఉన్న రెండో వ్యక్తిగా లిగాన్ రికార్డుల్లోకి ఎక్కాడు. పాల్ గిడేల్ జూనియర్ లిగాన్ కంటే 213 రోజులు ఎక్కువగా జైల్లో ఉన్నాడు. 15 ఏళ్ల వయసులో.. అమెరికాలోని ఫిలడెల్ఫియాకు చెందిన లిగాన్ 15వ ఏట అంటే 1953లో జీవిత ఖైదీగా జువనైల్ జైలులో అడుగుపెట్టాడు. తన గ్యాంగుతో కలసి మందు కొడుతూ.. దోపిడీలు, దౌర్జన్యాలు చేస్తూ జల్సా చేసుకునేవాడు. అదే సమయంలో ఇద్దరిని హత్య చేసిన ఘటనలో అతను దోషిగా తేలాడు. దీంతో అతన్ని జైలుకు పంపారు. అయితే తాను వ్యక్తిగతంగా ఎవరినీ చంపలేదని చెపుతూ వచ్చాడు. అయినా అతన్ని వదల్లేదు. ఎట్టకేలకు అతని లాయర్ కృషితో దాదాపు 7 దశాబ్దాల జైలు జీవితం తర్వాత ఫిబ్రవరి 11న విడుదలయ్యాడు. నూనూగు మీసాల వయసులో జైల్లోకి వెళ్లిన లిగాన్.. 83వ ఏట నెరిసిన జుట్టు, బోసి నోరుతో బయటకు వచ్చాడు. తన బంధువులు, స్నేహితుల్లో చాలా మంది ఇప్పుడు లేరు. అతనికి ఓ స్వచ్ఛంద సంస్థ ఆసరాగా నిలిచి అన్ని అవసరాలు తీరుస్తోంది. -
మాజీ సీజేఐ మిశ్రాపై బయటి ఒత్తిళ్లు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై రిటైర్డ్ జస్టిస్ కురియన్ జోసెఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి సీజేఐ జస్టిస్ మిశ్రా బాహ్య శక్తుల ఒత్తిడికి లోబడి పనిచేశారని, దీని ప్రభావం న్యాయవ్యవస్థ పరిపాలనపై పడిందని పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అప్పటి సీజేఐ కొన్ని బాహ్య శక్తుల ప్రభావానికి లోబడి పనిచేశారు. ఆయన రిమోట్ కంట్రోల్ నియంత్రణలో ఉన్నారు’ అని పేర్కొన్నారు. అయితే, ఆ వెలుపలి శక్తి రాజకీయ పార్టీనా లేక ప్రభుత్వమా అనే విషయం వివరించేందుకు, ఏఏ కేసుల కేటాయింపులో సీజేఐ ఏకపక్షంగా వ్యవహరించారో తెలిపేందుకు ఆయన నిరాకరించారు. దీనిపై ఆధారాలున్నాయా అని ప్రశ్నించగా.. సుప్రీంకోర్టులోని అందరు జడ్జీలు ఇదే నమ్మకంతో ఉన్నారని జస్టిస్ కురియన్ బదులిచ్చారు. సీజేఐ జస్టిస్ మిశ్రా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారన్న విషయం స్పష్టమయ్యాకే తాము మీడియా సమావేశం ఏర్పాటు చేశామన్నారు. జడ్జి బీహెచ్ లోయా మృతి వంటి కీలక కేసు కేటాయింపు కూడా అసంతృప్తికి కారణమా అని ప్రశ్నించగా ఫలానా విషయమంటూ ప్రత్యేకంగా చెప్పలేనన్నారు. కేసుల కేటాయింపుతోపాటు సుప్రీంకోర్టు పరిపాలన సంబంధిత అంశాలు కారణమని వివరించారు. కీలకమైన సొహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసును విచారిస్తున్న జడ్జి బీహెచ్ లోయా 2014లో నాగపూర్‌లో గుండెపోటుతో చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా నిందితుడిగా ఉన్నారు. జడ్జి బీహెచ్ లోయా మృతిపై తిరిగి దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన పలు పిటిషన్లను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ఆయనది సహజ మరణమేనని స్పష్టం చేసింది. జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు పనితీరు మెరుగైందనీ, న్యాయవ్యవస్థ స్వతంత్రతపై నమ్మకం ఏర్పడిందని చెప్పారు. -
నేనిప్పుడు బేబి @ 60 : జస్టిస్ జోసెఫ్
న్యూఢిల్లీ: ‘60 ఏళ్ల వయసులో నేను మళ్లీ బేబీ అయ్యాను’ అని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ కేఎం జోసెఫ్ వ్యాఖ్యానించారు. జడ్జిగా ఇటీవల ప్రమాణం చేయడానికి ముందు ప్రభుత్వం ఆయన సీనియారిటీని కుదించడం తెల్సిందే. ఫలితంగా సుప్రీంకోర్టు జడ్జిల్లో సీనియారిటీ ప్రకారం ఆయన 25వ స్థానంలో నిలిచారు. కొత్తగా సుప్రీం జడ్జీలుగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ జోసెఫ్, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ శరణ్‌లకు మంగళవారం సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా జస్టిస్ జోసెఫ్ మాట్లాడారు.‘కోర్టులో 25వ సీనియర్ జడ్జీగా 60 ఏళ్ల వయసులో మళ్లీ బేబీ అయ్యాను’ అని అన్నారు. తాను జడ్జిగా పదోన్నతి పొందినపుడు టీ ఇచ్చి సరిపుచ్చారని, కానీ ఇప్పుడు ఘనంగా సత్కరిస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అన్నారు. -
సెక్షన్ 497.. విలువలకు రక్షణ
‘అడల్టరీ’ అనేది స్త్రీ ఆలోచనలో కూడా ఉండని విషయం. పురుషుడు మాత్రమే.. కష్టపడి స్త్రీ చుట్టూ తిరిగి, స్త్రీ కళ్లబడి, స్త్రీ కాళ్లావేళ్లా పడి, స్త్రీ ముందు కన్నీరు పెట్టుకుని, స్త్రీ చేత కన్నీరు పెట్టించి సాధించుకునే ‘విజయం’! ‘‘స్త్రీ, పురుషులిద్దరూ కలిసి చేసే తప్పుకు పురుషుడొక్కడిపైనే నేరం మోపి, అతడికి మాత్రమే శిక్ష విధించడం ఏ కాలం నాటి న్యాయం?’’ అని జోసెఫ్ షైనీ అనే వ్యక్తి భారత ప్రభుత్వంపై వేసిన కేసొకటి కొన్నాళ్లుగా సుప్రీంకోర్టులో నలుగుతోంది. ఇండియన్ పీనల్ కోడ్‌లోని 497వ సెక్షన్‌ను రద్దు చెయ్యాలని ఆయన అభ్యర్థన. ఆ సెక్షన్ ప్రకారం.. పెళ్లయిన స్త్రీతో శారీరక సంబంధం పెట్టుకున్న పురుషుడికి ఏడాది నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేక ఈ రెండూ గానీ ఉంటాయి. స్త్రీకి ఇవేమీ ఉండవు. ఆమె అసలు నేరస్తురాలే కాబోదు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం మతానికి, జాతికి, కులానికి, ప్రాంతానికి అతీతంగా స్త్రీ, పురుషులంతా చట్టం ముందు సమానమే అయినప్పుడు 497 సెక్షన్ ఆ ఆర్టికల్‌కు లోబడే ఉండాలి కదా అని జోసెఫ్ వాదన. అలాగని స్త్రీని కూడా నిందితురాలిని, ముద్దాయినీ చేసి శిక్ష విధించమని ఆయనేమీ అడగడం లేదు. ఈ సెక్షన్‌ని అసలుకే ఎత్తేయమని విజ్ఞప్తి చేస్తున్నారు. వివాహిత స్త్రీతో ఆమె భర్త అనుమతి గానీ, సమ్మతిగానీ లేకుండా ఎవరైనా శారీరక సంబంధం పెట్టుకుంటే అది అత్యాచార స్థాయి నేరం కాకపోవచ్చు గానీ, అడల్టరీ (వ్యభిచారం) కింద నేరమే అవుతుందని అంటోంది సెక్షన్ ఫోర్ నైంటీ సెవన్. దీని పైన కూడా జోసెఫ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. భర్త అనుమతి, సమ్మతి అన్నప్పుడు అందులో స్త్రీ అనే జీవి.. పురుషుడి ఆస్తి అన్న అర్థం ధ్వనిస్తోందని ఆయన తన వాదనల్లో వినిపించారు. అయితే ఈ కేసు విషయంలో భారత ప్రభుత్వం కాస్త గట్టిగానే ఉంది. జోసెఫ్ ఆశిస్తున్నట్లుగా సెక్షన్ ఫోర్ నైంటీ సెవన్‌ను రద్దు చేసినట్లయితే వివాహ వ్యవస్థ మొత్తం ధ్వంసం అయిపోతుందని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఈ మాత్రం భయమైనా లేకపోతే పురుషులను నియంత్రించలేమని, ఎంతో ఉదాత్తమైన భారతీయ వైవాహిక వ్యవస్థలోని విలువలు మంటగలిసి పోతాయని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఐదుగురు జడ్జిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసు మీద వచ్చే రెండు మూడు వాయిదాల్లో తీర్పు ఇవ్వబోతోంది. ఇంతగా ఆలోచించేందుకు ఇందులో ఏమీ లేదని అనుకుంటే కనుక ఈ ఒకట్రెండు రోజుల్లోనే తీర్పు వచ్చేయొచ్చు. ఐపీసీ లోని సెక్షన్ 497 నూటా యాభై ఏడేళ్ల నాటిది. అప్పటి సమాజానికీ, ఇప్పటి సమాజానికీ; అప్పటి స్త్రీల జీవన స్థితిగతులకు, ఇప్పటి స్త్రీల జీవన స్థితిగతులకు సుమారు ఒకటిన్నర శతాబ్దాల వ్యత్యాసం ఉంది కనుక, ఈ సెక్షన్‌ను రద్దు చేయడంలో తప్పు లేదని జోసెఫ్ షైనీ ఆలోచనను సమర్థించే వారు అంటున్నారు. ప్రముఖ ఆంగ్ల జాతీయ దిన పత్రిక కూడా తన ‘వ్యూ’ ఏమిటో ఒక్కమాటలో స్పష్టంగా చెప్పింది. విక్టోరియా కాలం నాటి ఈ సెక్షన్‌ను ఇంకా కొనసాగించడంలో అర్థం లేదంది! స్త్రీ, పురుషులిద్దరూ చేసిన తప్పులో పురుషుడిని మాత్రమే దోషిని చెయ్యడం అంటే.. స్త్రీ అమాయకురాలు, నిర్దోషి అని పరోక్షంగా తీర్మానించడమే కదా.. పురుషుడిని మాత్రమే దోషిని చెయ్యడం ఎంత అర్థరహితమో, స్త్రీని నిర్దోషిని చెయ్యడం అంత అర్థరహితం అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. చట్టాలు, సెక్షన్లు భారతీయ వివాహ వ్యవస్థను నిలబెట్టలేవు అంటూ.. భారత ప్రభుత్వ వాదనలో ఈ కాలపు ఆలోచన లేదు అని విమర్శించింది. అంటే.. సెక్షన్‌ను రద్దు చెయ్యాలని చెప్పడం! 157 ఏళ్ల క్రితం ఇంగ్లండ్‌ను క్వీన్ విక్టోరియా పాలిస్తున్న కాలంలో 1861లో భారతీయ శిక్షా స్మృతి ఆవిర్భవించి, అమల్లోకి వచ్చింది. విక్టోరియా మహారాణి పాలనలో విలువలతో కూడిన మానవ జీవితం ఉండేది. నీతి నియమాలు, భక్తి విశ్వాసాలతో పాటు స్వీయ నిగ్రహం, విధేయత, కష్టపడి పని చేసే తత్వం ఉండేది. తప్పు జరిగే ఇరుకు తోవల్లోకి ఎవరూ వెళ్లేవారు కాదు. విశాలమైన వెలుగు మైదానాల్లో ధర్మబద్ధంగా, ధైర్యంగా జీవించేవారు. ఆ విలువలు అంత బలమైనవి కనుకే.. ఇప్పటికీ ‘విక్టోరియన్ మోరల్స్..’ అనే మాట వినిపిస్తుంటుంది. జోసెఫ్ షైనీని సమర్థించేవారు మాత్రం ‘ఇంకా ఆ మోరల్స్‌ని పట్టుకుని వేళ్లాడ్డం ఎందుకు? ఇప్పటి మహిళలు అప్పటి మహిళల్లా ఉన్నారా?’ అంటున్నారు! జోసెఫ్ని సమర్థించేవారు ఆ మాట అంటున్నారే కానీ, జోసెఫ్ ఆ మాట అనడం లేదు. స్త్రీలు గానీ, పురుషులుగానీ; అప్పుడు గానీ, ఇప్పుడుగానీ కలిసి ఒక తప్పు చేసినప్పుడు, వారిలో ఒకరికే శిక్ష విధించడం కన్నా.. అసలు ఆ సెక్షన్నే రద్దు చేయడమే న్యాయం కదా అంటున్నారు. అంతకు మించి డీప్‌గా ఆయనేమీ వెళ్లడం లేదు. తప్పు చేసినవాడు పురుషుడైతే, తప్పుకు తోడైన స్త్రీ సైతం నేరస్తురాలే అని కూడా ఆయనేమీ అనడం లేదు. పైగా రెండు మంచి విషయాల్ని (ఆర్టికల్ 14, స్త్రీని పురుషుడి ఆస్తిగా చేయడం) పైకి తీశారు. కానీ ఆయన తీసిన మంచి విషయాల కంటే, సెక్షన్‌ను రద్దు చేస్తే వివాహ వ్యవస్థకు జరిగే కీడే ఎక్కువ అని భారత ప్రభుత్వం భావిస్తోంది. ‘పాతకాలంలో స్త్రీలు మితిమీరిన సామాజిక నిబంధనలు, నియంత్రణల మధ్య ఉండేవాళ్లు. అప్పుడు (వివాహేతర సంబంధాలలో) తప్పు చేసినా, తప్పు చేయించినా పురుషుడే బాధ్యుడు అయివుండటానికి అవకాశం ఉంది కాబట్టి ఆ కాలానికి ఆ సెక్షన్ రైటే గానీ.. ఇప్పటి స్త్రీలకు కూడా చట్టం ఆ కాలం నాటి స్టేటస్‌నే ఇవ్వడం ఏంటి?’ అనే సందేహం రావడం సహజమే. అయితే నిబంధనలు ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఒకలా ఉండే తత్వం ఎందుచేతో పురుషులలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ‘అడల్టరీ’లోనైతే మరీ ఎక్కువ. అడల్టరీ అనేది అసలు స్త్రీ ఆలోచనల్లో కూడా ఉండని విషయం. పురుషుడు మాత్రమే.. కష్టపడి ఆమె చుట్టూ తిరిగి, ఆమె కాళ్లావేళ్లా పడి, ఆమె ముందు కన్నీరు పెట్టుకుని, ఆమె చేత కన్నీరు పెట్టించి సాధించుకునే ‘విజయం’! ఈ మాత్రపు విక్టోరియన్ ఎరా సెక్షన్లయినా లేకుంటే భారత ప్రభుత్వం వాదిస్తున్నట్లు వివాహ వ్యవస్థ, వివాహ విలువల్ని పురుషుడు ధ్వంసం చేసేస్తాడు. ఇంకా ముఖ్యమైన సంగతి.. అసలు జోసెఫ్ షైనీ వాదన సమర్థనీయమే కాదు. ఎందుకంటే ‘వేరొకరి భార్యను పొందడం నేరం’ అని చెప్పే సెక్షన్ ఇది. ప్రత్యేకించి అందుకోసమే ఉన్న సెక్షన్. కావాలంటే ‘పరపురుషుడికి లోబడటం నేరం’ అనే ఒక కొత్త సెక్షన్ కోసం జోసెఫ్ డిమాండ్ చేయవచ్చు. - మాధవ్ శింగరాజు -
మాట పడడం గొప్ప పని
గిలు జోసెఫ్ కేరళలో పేరున్న రచయిత్రి. ఎంత పేరున్నా.. రచయితలు, రచయిత్రుల రచనలు మాత్రమే çపత్రిక లోపల కనిపిస్తాయి కానీ, వారి ఫొటోలు పత్రిక కవరు పేజీ మీద సాధారణంగా కనిపించవు. అయితే గత మార్చిలో ప్రముఖ మలయాళీ పక్షపత్రిక ‘గృహలక్ష్మి’ ముఖచిత్రంగా గిలు కనిపించారు. ఆ సంచిక స్టాండ్స్‌లోకి రాక ముందు వరకు రచయిత్రిగా ఉన్న గిలు.. తెల్లారేసరికి రచయిత్రి కాకుండా పోయారు. ఆమెకు బాగా చెడ్డపేరు వచ్చేసింది. ‘బజారు మనిషి’ అన్నారు. ఇది అభ్యంతరమైన మాటే గానీ, గిలు ఆ మాటను పడవలసి వచ్చింది. బిడ్డకు చనుబాలు ఇచ్చే తల్లిగా ఆ పత్రిక కవర్ పేజీకి మోడలింగ్ చేయడం వల్ల గిలు మూట కట్టుకున్న మాట అది. ఒక్కసారిగా గిలు లోకం తలకిందులయింది. తనను ఎంతో అభిమానించే పాఠకులే ఆమెను దూషించడం మొదలుపెట్టారు. ‘ఇందులో తప్పేమిటో నాకు అర్థం కావడం లేదు. సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వడానికే కదా నేను ఇలా మోడలింగ్ చేశాను’ అని గిలు వివరణ ఇచ్చినా.. దాన్నెవరూ స్వీకరించడానికి సిద్ధమైపోలేదు. పత్రిక మీద, మోడలింగ్ ఇచ్చిన గిలు మీద కేరళ హైకోర్టులో కేసు కూడా వేశారు. గతవారం తీర్పు వచ్చింది. ‘తప్పేం లేదు’ అంది కోర్టు. గిలు మనసు తేలికయింది. అంతరార్థాలను వెతుక్కుని అర్థం చేసుకునే సమయం లోకానికి ఎప్పుడూ ఉండదు. అపార్థాలను మాత్రం క్షణాల్లో చేసేసుకుంటుంది. మలయాళంలో ‘ముల’ అనే మాటకు పాలిండ్లు అని అర్థం. తన ఫొటో.. కవర్ పేజీపై వచ్చాక ఈ మాటను పలికేందుకు మునుపటిలా ఎవరూ బిడియపడడం లేదని గిలు సంతోషిస్తున్నారు. బాహాటంగా మాట్లాడేందుకు సంశయించే మంచి విషయాలు సహజమైనవిగా లోకానికి అనిపించాలంటే.. గిలులా ఎవరో ఒకరు మాట పడవలసిందే. అప్పుడు మాట పడడం కూడా గొప్ప పని అవుతుంది. -
కేఎం జోసెఫ్ వైపే కొలీజియం మొగ్గు..!!
-
కేఎం జోసెఫ్ వైపే కొలీజియం మొగ్గు..!!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని కొలీజియం శుక్రవారం తీవ్రంగా చర్చించింది. ఇతర న్యాయమూర్తులతో పాటు కేఎం జోసెఫ్‌ను పేరును మళ్లీ కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కొలీజియం నిర్ణయించినట్లు సమాచారం. అయితే, ఈ మేరకు ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. గంటపాటు తర్జనభర్జనల అనంతరం కొలీజియంలోని ఐదుగురు న్యాయమూర్తులు జోసెఫ్ నియామకంపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. కాగా, గత నెలలో జోసెఫ్‌ను న్యాయమూర్తిగా తీసుకోవాలనే కొలీజియం సిఫార్సును కేంద్రం తిప్పి పంపిన విషయం తెలిసిందే. -
విద్యార్థి అదృశ్యం
అనంతపురం సెంట్రల్ : నగరంలోని ఆదర్శనగర్‌కు చెందిన జోసఫ్ (9) అనే రెండో తరగతి విద్యార్థి అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై మంగâýæవారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎన్ని చోట్ల వెతికినా జాడ కనిపించకపోవడంతో బుధవారం తల్లిదండ్రులు టూటౌ¯ŒS పోలీస్‌స్టేçÙ¯ŒSలో ఫిర్యాదు చేశారు. -
జోసెఫ్ దంతవైద్య కళాశాల స్నాతకోత్సవం
దుగ్గిరాల(పెదవేగి రూరల్) : సెయింట్ జోసఫ్ దంత వైద్య కళాశాల పదో స్నాతకోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. దుగ్గిరాలలోని దంత కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(న్యూ ఢిల్లీ) మెంబర్ ప్రొఫెసర్ డాక్టర్ పి.రేవతి విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. కళాశాల చైర్మన్ రెవరెండ్ బిషప్ పొలిమేర జయరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 2011–16 విద్యా సంవత్సరం అండర్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు, 2013–16 విద్యా సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముఖ్యఅతిథిగా విచ్చేసిన రెవరెండ్ ఫాదర్ తోట గాబ్రియోల్, వ్యవస్థాపక కరస్పాండెంట్ సెక్రటరీ ఫాదర్ పి.బాల ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. ప్రిన్సిపాల్ ఎన్ స్లీవరాజ్, అన్ని విభాగాల హెచ్‌ఒడిలు, అడ్మినిస్టేటర్ ఫాదర్ కె.బల్తజర్, నర్సింగ్ కళాఇశాల కరస్పాండెంట్ ఫాదర్ కె.అమృతరాÐŒ , సిబ్బంది పాల్గొన్నారు. -
జోసెఫ్ శుభారంభం
తెలంగాణ-ఏపీ స్నూకర్ టోర్నీ సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ-ఏపీ స్నూకర్ ఓపెన్ చాంపియన్‌షిప్‌లో జోసెఫ్ శుభారంభం చేశాడు. సికింద్రాబాద్‌లోని డెక్కన్ క్లబ్లో గురువారం తొలిరౌండ్ పోటీలను బెస్టాఫ్ ఫైవ్ ఫ్రేమ్స్ పద్ధతిలో నిర్వహించారు. ఇందులో క్యూ క్లబ్‌కు చెందిన జోసెఫ్ 3-1 (59-11, 29-55, 41-32, 63-20) ఫ్రేమ్‌ల తేడాతో ఎస్డీ పార్లర్‌కు చెందిన సాయికిరణ్‌పై విజయం సాధించాడు. మిగతా మ్యాచ్‌ల్లో ఫైజల్ 3-0 (59-35, 43-11, 58-31) ఫ్రేమ్‌ల తేడాతో సమీర్‌ను ఓడించగా, నరేశ్ కుమార్ 3-1 (81-6, 34-57, 59-30, 68-20)తో శంకర్‌పై గెలిచాడు. అస్లామ్ 3-0 (49-38, 53-24, 54, 2)తో భరత్‌పై, శ్రవణ్ కుమార్ 3-0 (40-5, 44-23, 53-22)తో విక్రమ్‌పై నెగ్గారు. అఖిల్ 3-0 (50-26, 61-53, 52-45)తో ప్రదీప్‌ను కంగుతినిపించగా, సినాప్ర 3-1 (57-22, 45-22, 27-53, 56-55)తో కృష్ణపై, రాజీవ్ 3-1 (55-31, 25-59, 60-39, 59-24)తో ఫైజల్‌పై విజయం సాధించారు. సుదర్శన్ రెడ్డి 3-2 (50-28, 42-51, 19-66, 74-22, 53-44)తో ఉదయ్‌పై గెలుపొందగా, శ్రీధర్ 1-3 (43-21, 29-42, 40-59, 44-59)తో ధ్రువ్ సింగ్ చేతిలో, సుహాస్ రాజ్ 1-3 (64-54, 27-61, 38-45, 20-47)తో సన్నీ చేతిలో పరాజయం చవిచూశారు. -
దెయ్యాల రెస్టారెంట్
నిజాలు దేవుడికెరుక మిన్నెసొటా (అమెరికా)లోని ఫోర్పాస్ రెస్టారెంట్... ‘‘నువ్వేమైనా అనుకో. నేను మాత్రం ఇక్కడ భోం చేయను’’... చుట్టూ చూస్తూ అంది స్టెల్లా. ‘‘ఓహ్... కమాన్ డియర్. ప్రతిదానికీ బెట్టు చేస్తావ్. ఇక్కడ ఏం తక్కువయ్యింది చెప్పు?’’... కాస్త బతిమాలుతున్నట్టుగా, కాస్త విసుక్కుంటున్నట్టుగా అన్నాడు మార్క్. బుంగమూతి పెట్టింది స్టెల్లా. అతని వైపు చూడటమే ఇష్టం లేదన్నట్టుగా ఎటో చూస్తూ కూచుంది. కాస్త చల్లబడుతుందేమో నని కాసేపు చూశాడు మార్క్. కానీ అలాంటి సూచనలేవీ లేకపోవడంతో సర్ది చెప్పడానికి ఉపక్రమించాడు. ‘‘చూడు డియర్... మనం కళ్లతో చూస్తేగానీ దేన్నీ నమ్మకూడదు. వాళ్లూ వీళ్లూ చెప్పింది నమ్మేయడం పిచ్చితనం’’ అన్నాడు నచ్చజెప్పే ధోరణిలో. స్టెల్లా మెత్తబడలేదు సరికదా రయ్యిన లేచింది. ‘‘అవును. నేను పిచ్చిదాన్నే. ఎప్పుడూ నీ మాటే నెగ్గించుకోవాలని చూసే నువ్వు నా మాట వింటావేమో అనుకోవడం పిచ్చి తనమే కదా’’... దుఃఖం పొంగుకొచ్చి గొంతు బొంగురుపోయింది. ఏం చేయాలో తోచలేదు మార్క్‌కి. అనవసరంగా తనే విషయాన్ని పెద్దది చేస్తున్నాడేమో అని పించింది. తనకిష్టం లేని చోటికి తీసుకు రావడం తన తప్పేనని తోచింది. అందుకే ఆమె ఇష్టప్రకారమే అక్కడ్నుంచి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాడు. ‘‘సరేలే. ఫీలవకు. వెళ్లిపోదాం పద’’ అంటూ లేచి ఆమె చేయి పట్టుకున్నాడు. కదలబోతుండగా... ‘‘వెళ్లిపోతున్నారేంటి సర్’’ అన్న మాట వినిపించి ఇద్దరూ ఆగి పోయారు. చూస్తే వెయిట్రస్ నవ్వుతూ నిలబడి ఉంది. ఆమె చేతిలో ట్రే, ట్రేలో బౌల్స్, బౌల్స్‌లో వేడి వేడి ఆహారం... ‘‘సారీ... మేం వెళ్లాలి. మాకు పనుంది’’ అన్నాడు మార్క్ సంజాయిషీ ఇస్తున్నట్టుగా. ‘‘భలేవారు సర్. ఆర్డర్ ఇచ్చాక వెళ్లిపోతానంటారేంటి? మీరు తినక పోయినా బిల్లు కటాల్సి వస్తుంది మరి’’ అందామె నవ్వుతూ. ‘‘కడతానులెండి’’ అన్నాడు మార్క్. జేబులోంచి డబ్బులు తీసి ఇవ్వబోతుండగా స్టెల్లా అడ్డుపడింది. ‘‘వద్దు మార్క్. కాస్ట్లీ భోజనం ఆర్డర్ చేశావ్. దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు? నేనే కాసేపు ఓపిక పడతాలే. రా భోంచేద్దాం అంది’’ కూర్చుంటూ. నవ్వాడు మార్క్. క్షణంలో కోపం... క్షణంలో ప్రేమ... పిచ్చి పిల్ల అనుకున్నాడు మనసులో. వెయిట్రస్ వడ్డన ప్రారంభించింది. ప్లేట్లలో భోజనం పెట్టి, గ్లాసుల్లో ఆరెంజ్ జ్యూస్ వేసి వెళ్లిపోయింది. ఇద్దరూ తినడం ప్రారంభించారు. ‘‘నువ్వు అలిగినప్పుడు కాస్త కోపమొస్తుందన్నది నిజమే కానీ... అప్పుడు నీ ముఖం చూస్తే మాత్రం భలే ముద్దొ స్తోంది తెలుసా’’ అన్నాడు మార్క్, ప్రేయసి ముఖంలోకి చిలిపిగా చూస్తూ. ఆ చిలిపి చూపులు సోకి సిగ్గుల మొగ్గయ్యిందామె. ‘‘చాల్లే ఆపు. బతిమాలడం పోయి అరుస్తావ్. ఆనక ఇలా కబుర్లు చెబుతావ్. కంత్రీవి నువ్వు. ఈసారి నామీద అరిచావో, అయిపోతావ్’’ అంటూ చేతిలోని ఫోర్క్‌ని పొడుస్తా అన్నట్టు చూపించింది. ఆ ప్రయత్నంలో చేయి జారి ఫోర్క్ కింద పడిపోయింది. వంగి తీసుకోబోతుంటే వారించాడు. ‘‘ఆగు స్టెల్లా... నువ్వు తీస్తావెందుకు? వెయిట్రస్‌ను పిలుస్తానుండు’’ అని చెప్పి, ‘‘ఎక్స్‌క్యూజ్‌మీ’’ అంటూ గట్టిగా అరిచాడు మార్క్. క్షణంలో ఓ వ్యక్తి పరుగు పరుగున వచ్చాడు. ‘‘ఏం కావాలి సర్’’ అన్నాడు వినయంగా. ‘‘నువ్వొచ్చావేంటి? ఇందాక వచ్చిన వెయిట్రస్ ఏమైంది?’’ మార్క్ ప్రశ్నకి ముఖం చిట్లించాడతను. ‘‘వెయిట్రసా?’’ అన్నాడు అయోమయంగా. ‘‘అంత ఆశ్చర్యపోతావెందుకు? వెయిట్రసే. తన సంగతి నాకెందుకు గానీ, మేడమ్ ఫోర్క్ కిందపడిపోయింది. వెళ్లి మరోటి తీసుకురా’’ అన్నాడు కాస్త విసుగ్గా. వెయిటర్ మాట్లాడలేదు. అక్కడి నుంచి కదలలేదు. బిత్తర చూపులు చూస్తూ నిలబడ్డాడు. అతడి ధోరణి అర్థం కాలేదు మార్క్‌కి. ‘‘ఓయ్... ఏంటయ్యా నీ సమస్య? మ్యూజియంలో విగ్రహంలాగా అలా నిలబడ్డావేంటి? వెళ్లి తీసుకురా’’... అరిచినట్టే అన్నాడు. ‘‘తప్పకుండా తీసుకొస్తాను సర్. కానీ... మీకో విషయం చెప్పాలి. మా రెస్టా రెంట్లో ఆడవాళ్లెవరూ పని చేయడం లేదు.’’ ఉలిక్కిపడ్డారిద్దరూ. ‘‘పని చేయక పోవడం ఏంటి? ఆమేగా మాకీ ఫుడ్ సర్వ్ చేసింది?’’ అంది స్టెల్లా అయోమయంగా. ‘‘మీకు ఎవరు సర్వ్ చేశారో తెలియదు కానీ, మా రెస్టారెంటులో మాత్రం ఏ అమ్మాయీ పని చేయడం లేదు. కావాలంటే మేనేజర్ని అడగండి’’ అనేసి బుర్ర గోక్కుంటూ వెళ్లిపోయాడతను. కొయ్యబారిపోయారిద్దరూ. ఎలా రియాక్టవ్వాలో అర్థం కాక ముఖాలు చూసుకుంటూ ఉండిపోయారు. ‘‘చెప్పానా? ఈ రెస్టారెంటు వద్దని. భోజనం బాగుంటుందంటూ పట్టుబట్టి తీసుకొచ్చావ్. అందరూ ఊరికే అంటారా ఇక్కడ దెయ్యాలు ఉన్నాయని? తను... తను కచ్చితంగా దెయ్యమే. పద వెళ్దాం’’ అనేసి మార్క్ సమాధానం కోసం చూడకుండానే విసవిసా బయటకు వెళ్లిపోయింది స్టెల్లా. మార్క్ మాత్రం బిక్కచచ్చిపోయి అలానే కూర్చుండిపోయాడు చాలాసేపు. దెయ్యమా? అంత అందమైన అమ్మాయి... నవ్వుతూ పలకరించింది... చక్కటి ఆతిథ్యం అందించింది... ఆప్యాయంగా వడ్డించి వెళ్లింది... తను దెయ్యమా? ఇది నిజమా? బుర్ర తిరిగిపోయింది మార్క్‌కి. నిజానికి అతడికే కాదు, ఆ రెస్టా రెంట్లో చాలామందికి ఇలాంటి షాక్‌లు తగిలాయి. తమకి కనిపించి తమతో మాట్లాడిన అందమైన అమ్మాయి మనిషి కాదు దెయ్యమని తెలిసి అవాక్కయినవాళ్లు, జడుసు కుని హాస్పిటల్ పాలైనవాళ్లు చాలామందే ఉన్నారు. వాళ్లందరినీ అంతగా కలవరపెట్టిన ఆ అమ్మాయి ఎవరు? తను అమ్మాయా లేక నిజంగా దెయ్యమేనా?! అందరూ చెప్పేదాన్ని బట్టి ఆమె దెయ్యమే. కానీ అక్కడెందుకుంది? అసలామె దెయ్యమెందుకయ్యింది? 1840 - 1930 మధ్య కాలంలో చాలామంది ఐరిష్ అమ్మాయిలు పనులు వెతుక్కుంటూ అమెరికాకు వలస వచ్చేవారు. మోలీ కూడా అలానే వచ్చింది. పొట్ట చేత పట్టుకుని అమెరికాలో అడుగు పెట్టింది. తనని, తన కుటుంబాన్ని పోషించుకునే మార్గం కోసం వెతుకులాడింది. మిన్నెసొటాలోని ఓ వ్యాపారి ఇంట్లో పని చేయడానికి మనిషి కావాలని తెలిసి అక్కడికి వెళ్లింది. వాళ్ల మనసులను గెలుచుకుంది. ఆ ఇంట్లో పని మనిషిగా చేరింది. మోలీ చాలా అందమైనది. చురుకైనది. చలాకీగా తిరుగుతూ పనులన్నీ చక్క బెట్టేసేది. అతి తక్కువ సమయంలోనే యజమానురాలికి తలలో నాలుకలా మారిపోయింది. అది మాత్రమే అయితే ఏ గొడవా ఉండేది కాదు. కానీ యజమాని జోసెఫ్ ఫోర్‌పా మనసులో కూడా స్థానం సంపాదించింది. అదే ఆమె జీవితాన్ని ఘోరమైన మలుపు తిప్పింది. మోలీ కంటే జోసెఫ్ చాలా పెద్దవాడు. కానీ వయోభేదం వారిని ఆపలేకపోయింది. మోలీ మీద మనసు పడ్డాడు జోసెఫ్. అతడిని అమితంగా ఆరాధించింది మోలీ. మనసులు కలిశాయి. హద్దులు చెరిగాయి. ప్రేమికులైనా భార్యాభర్తల మాదిరిగా జీవించడం మొదలు పెట్టారు. నిష్కల్మషమైన మనసులతో, నిష్కపటమైన ప్రేమతో ఒకరికి ఒకరుగా జీవించసాగారు. అయితే వారి బంధం ఎంతోకాలం కొనసాగలేదు. వాళ్లిద్దరి అనుబంధం గురించి జోసెఫ్ భార్యకు తెలిసిపోయింది. మోలీని ఇంటి నుంచి వెళ్లగొట్టింది. భర్త చుట్టూ చెప్పలేనన్ని ఆంక్షలు విధించింది. ‘‘ఏమంటున్నారు మీరు? ఇది మీకు న్యాయమేనా’’... పొంగుకొస్తున్న దుఃఖాన్ని పెదవి మాటున అణచిపెడుతూ అంది మోలీ. జోసెఫ్ మాట్లాడలేకపోయాడు. ఆమె కళ్లలోకి చూసే ధైర్యం కూడా చేయలేక పోయాడు. ‘‘సారీ మోలీ. నీకు దూరమై నేను కూడా బతకలేను. కానీ తప్పదు. నా భార్య సంగతి తెలుసు కదా... తన మాట వినకపోతే రాద్ధాంతం చేస్తుంది. నా పరువు మర్యాదల్ని మంటగలిపేస్తుంది. నేను సర్దుకుపోగలిగినా నా పిల్లలు తట్టుకోలేరు. వాళ్లు నలుగురిలో తలెత్తుకుని తిరగలేరు. నావల్ల నా పిల్లలకు అలాంటి గతి పట్టకూడదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆ విషయం చెప్పడానికే నీ దగ్గరకు వచ్చాను.’’ ‘‘కానీ జోసెఫ్... నేను...’’ ‘‘ప్లీజ్ మోలీ. ఇంకేమీ మాట్లాడకు. ఇక్కడున్న ఒక్కో క్షణం నాకు నరకంలా ఉంటుంది. నీ మీద నాకున్న ప్రేమ నా మనసును మార్చే ప్రయత్నం చేస్తుంది. నన్ను క్షమించు. మనం కలుసుకోవడం ఇదే ఆఖరుసారి. వెళ్తాను’’... అనేసి జోసెఫ్ వెళ్లిపోతుంటే భోరుమంది మోలీ. ‘‘జోసెఫ్... నన్ను విడిచి వెళ్లకు, నన్ను ఒంటరిదాన్ని చేయకు’’ అంటూ పిచ్చి పట్టినట్టుగా అరిచింది. కానీ జోసెఫ్ వినిపించుకోలేదు. కనీసం వెనక్కి తిరిగి చూసే ప్రయత్నం కూడా చేయలేదు. వెళ్లిపోయాడు. ఆమెను శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్లిపోయాడు. తట్టుకోలేకపోయింది మోలీ. ఓ పక్క మనసును రంపపుకోత పెట్టే ప్రేమ... మరోపక్క తన కడుపులో అప్పుడప్పుడే రూపుదిద్దుకుంటోన్న జోసెఫ్ ప్రతిరూపం... ఏం చేయాలో తెలియలేదు. ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాలేదు. మనసంతా చీకటి కమ్ముకుంది. భవిష్యత్తు శూన్యంలా తోచింది. వంచన మిగిల్చిన బాధతో జీవించలేక ఓ కఠినమైన నిర్ణయం తీసుకుంది. భారంగా బతుకీడ్చలేక తన జీవితాన్నే అంతం చేసుకుంది. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని వదిలేసి కుటుంబంతో సహా వేరేచోటికి వెళ్లిపోయాడు జోసెఫ్ ఫోర్‌పా. అక్కడ కొన్నాళ్లు జీవించాడు. కానీ మనసు నిలవలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ తన పాత ఊరికి తిరిగొచ్చాడు. మోలీతో తాను గడిపిన ఇల్లు ఎప్పటికీ నిలిచిపోవాలనే ఉద్దేశంతో దాన్ని రెస్టారెంటుగా మార్చేశాడు. అయితే మోలీ జ్ఞాపకాలు అతడిని ప్రశాంతంగా బతకనివ్వలేదు. నాటి ఆ ప్రేమ మనసును మెలిపెట్టసాగింది. ఆమెకు ద్రోహం చేశానన్న అపరాధభావం భూతమై పీడించసాగింది. ఓరోజు మార్నింగ్ వాక్కు వెళ్తూ ఓ పొద దగ్గర ఆగాడు. తనతో తెచ్చుకున్న తుపాకీతో కణతల మీద కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జోసెఫ్, మోలీల ప్రేమకథ అలా దుఃఖాంతమైంది. వారి ప్రేమమందిరమైన ఫోర్‌పా రెస్టారెంటు మాత్రం నేటికీ అతి థులను అలరిస్తూ నిలిచే ఉంది. అయితే ఆ రెస్టారెంటులో దెయ్యాలు ఉన్నాయన్న విషయం మాత్రం చాలామందిని భయ పెడుతోంది. మోలీ ఆత్మ చాలామందికి కనిపించింది. కానీ ఎవరికీ ఏ కీడూ చేయ లేదు. జోసెఫ్ని కూడా కొందరు చూశామని చెప్పారు. బహుశా తమ ప్రేమ వికసించిన ఆ భవంతి మీద ప్రేమ చావకే వాళ్లు అక్కడ తిరుగుతున్నారేమో అన్నారు కొందరు. ఎంత గొప్ప ప్రేమికులు అయినా నేడు దెయ్యాలు కదా అంటూ వణికిపోయారు మరికొందరు. అసలిది నిజమే కాదు భ్రమన్నారు ఇంకొందరు. వీటిలో ఏది కరెక్టో ఎవరికీ తెలీదు. నిజాలు కేవలం... దేవుడికెరుక! - సమీర నేలపూడి -
వేరుశనగ పంట రైతులకు న్యాయం చేయండి: వైఎస్ అవినాష్
న్యూఢిల్లీ: వేరుశనగ పంట నష్ట పోయిన రైతులకు న్యాయం చేయాలని ఎండీ జోసఫ్ కు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వినతి చేశారు. రైతులు పడుతున్న ఇబ్బందులను కేంద్ర వ్యవసాయ బీమాకంపెనీ ఎండీ జోసఫ్‌తో అవినాష్ రెడ్డి చర్చించారు. వైఎస్ అవినాష్ రెడ్డి సూచనకు ఎండీ జోసఫ్ సానుకూలంగా స్పంధించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని బీమా కంపెనీ ఎండీ జోసఫ్ హామీ ఇచ్చారని వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. వేరుశనగ పంట కారణంగా జిల్లాలోని పలు రైతులు నష్టాలకు గురయ్యారు. -
21 ఏళ్ల తర్వాత...
ఇండోర్: రంజీ ట్రోఫీలో మహారాష్ట్ర అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. గ్రూప్ ‘సి’లో అగ్రస్థానంలో నిలవడంతో పాటు రంజీ దిగ్గజం ముంబైని క్వార్టర్స్‌లో ఓడించిన ఆ జట్టు.... తమ విజయాలు గాలివాటం కాదని నిరూపించింది. సోమవారం ఇక్కడ మూడు రోజుల్లోనే ముగిసిన సెమీ ఫైనల్లో మహారాష్ట్ర 10 వికెట్ల తేడాతో బెంగాల్‌ను చిత్తు చేసి ఫైనల్లోకి అడుగు పెట్టింది. 1992-93 సీజన్ తర్వాత ఆ జట్టు ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆ సీజన్ ఫైనల్లో పంజాబ్ చేతిలో ఓటమిపాలైంది. 1939-40, 1940-41లలో వరుసగా రెండేళ్లు మహారాష్ట్ర ఈ టోర్నీ విజేతగా నిలిచింది. సాహా సెంచరీ వృథా... ఓవర్‌నైట్ స్కోరు 16/1తో మూడో రోజు ఆట ప్రారంభించిన బెంగాల్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌటైంది. వృద్ధిమాన్ సాహా (146 బంతుల్లో 108 నాటౌట్; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించడం విశేషం. ఇతర ఆటగాళ్లలో ఛటర్జీ (49), సర్కార్ (35), అరిందమ్ దాస్ (34) కొద్ది సేపు పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. మహారాష్ట్ర బౌలర్లలో జోసెఫ్, సంక్లేచా, ఫలా తలా 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 8 పరుగుల విజయలక్ష్యాన్ని మహారాష్ట్ర వికెట్ నష్టపోకుండా అందుకుంది. కర్ణాటకకు ఆధిక్యం మొహాలీ: కరుణ్ నాయర్ (191 బంతుల్లో 107 బ్యాటింగ్; 9 ఫోర్లు) అజేయ శతకం సాధించడంతో పంజాబ్‌తో జరుగుతున్న మరో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటక భారీ స్కోరు దిశగా వెళుతోంది. మ్యాచ్ మూడో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. నాయర్, అమిత్ వర్మ (152 బంతుల్లో 65 బ్యాటింగ్; 11 ఫోర్లు) ఆరో వికెట్‌కు ఇప్పటికే అభేద్యంగా 110 పరుగులు జోడించారు. గౌతమ్ (48), ఉతప్ప (47) ఫర్వాలేదనిపించారు. పంజాబ్ బౌలర్లలో హర్భజన్‌కు 2 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం కర్ణాటక 81 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో ఉంది. పంజాబ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులకు ఆలౌటైంది.