బ్రిడ్జ్‌టౌన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ విజయ భేరి మ్రోగించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో విండీస్ సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. విండీస్ స్టార్ పేసర్ అల్జారీ జోషఫ్ కెప్టెన్ షాయ్ హోప్‌తో విభేదాల కారణంగా మ్యాచ్ మధ్యలోనే మైదానం నుంచి డగౌట్‌కు వెళ్లిపోయాడు. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు.
అసలేం జరిగిందంటే?
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ హోప్ తొలుత ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్హనించాడు. బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు మంచి ఆరంభం దక్కలేదు. 3 ఓవర్‌లోనే విల్ జాక్స్ రూపంలో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. దీంతో ఫస్ట్‌డౌన్‌లో యువ ఆటగాడు జోర్డాన్ కాక్స్ క్రీజులోకి వచ్చాడు.
కాక్స్‌కు ఇద్దర్ స్లిప్ ఫీల్డర్లను విండీస్ కెప్టెన్ సెట్ చేశాడు. అయితే ఈ ఫీల్డ్ ప్లేస్‌మెంట్ నాలుగో ఓవర్ వేసేందుకు వచ్చిన జోషఫ్‌కు నచ్చలేదు. దీంతో హోప్‌తో జోషఫ్ వాగ్వాదానికి దిగాడు. అతడితో గొడవ పడుతూనే ఓవర్‌ను జోషఫ్ కొనసాగించాడు.
ఆ ఓవర్‌లో నాలుగో బంతికి కాక్స్‌ను జోషఫ్ ఔట్ చేశాడు. జోషఫ్ వికెట్ సాధించినప్పటకి కనీసం సెలబ్రేట్ కూడా చేసుకోలేదు. సహచర ఆటగాళ్లు తన దగ్గరకి వచ్చినప్పటకి జోషఫ్ మాత్రం సీరియస్‌గా హోప్‌తో తన వాగ్వాదాన్ని కొనసాగించాడు.
అంతటితో ఆగని జోషఫ్ తన ఓవర్ పూర్తి కాగానే మైదానం విడిచిపెట్టి డగౌట్‌కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత కోచ్ సామీతో సంప్రదింపులు జరిపిన తర్వాత జోషఫ్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
చదవండి: IND vs AUS: రాహుల్ నీవు మారవా? ఎక్కడకి వెళ్లినా అంతేనా?
Gets angry! 😡
Bowls a wicket maiden 👊
Leaves 🤯
An eventful start to the game for Alzarri Joseph! 😬#WIvENGonFanCode pic.twitter.com/2OXbk0VxWt— FanCode (@FanCode) November 6, 2024
Comments
Please login to add a commentAdd a comment