
వెస్టిండీస్ స్టార్ పేసర్ అల్జారీ జోసెఫ్‌నకు ఆ దేశ క్రికెట్ బోర్డు బిగ్ షాకిచ్చింది. అతడిపై రెండు మ్యాచ్‌ల నిషేధం వెస్టిండీస్ క్రికెట్ విధించింది. దీంతో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు జోషఫ్ దూరం కానున్నాడు. బార్బోడస్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి వన్డేలో జోసెఫ్ బోర్డు విధానాలు, క్రమశిక్షణ ఉల్లఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విండీస్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది.
అసలేం జరిగిందంటే?
బుధవారం(నవంబర్ 6) ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి వన్డేలో జోసెఫ్ తమ కెప్టెన్ షాయ్ హోప్‌తో వాగ్వాదానికి దిగాడు. జోషఫ్ వేసిన నాలుగో ఓవర్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్‌కు ఇద్దర్ స్లిప్ ఫీల్డర్లను హోప్ సెట్ చేశాడు. కానీ ఈ ఫీల్డింగ్ సెటప్ జోసెఫ్‌నకు నచ్చలేదు.
దీంతో హోప్‌తో జోసెఫ్ గొడవ పడ్డాడు. అతడితో వాగ్వాదం చేస్తేనే ఓవర్‌ను కొనసాగించాడు. ఆ ఓవర్‌లో కాక్స్‌ను ఔట్ చేసిన జోసెఫ్‌నకు కనీసం సెలబ్రేషన్స్ కూడా చేసుకోలేదు. అయితే తన ఓవర్‌ను పూర్తి చేసిన అనంతరం తన ఓవర్ పూర్తి కాగానే మైదానం విడిచిపెట్టి డగౌట్‌కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత కోచ్ సామీతో సంప్రదింపులు జరిపిన తర్వాత జోసెఫ్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. ఈ క్రమంలోనే అతడిపై వెస్టిండీస్ క్రికెట్ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.
సారీ చెప్పిన జోషఫ్
ఇక ఈ మ్యాచ్ అనంతరం తన తప్పును తెలుసుకున్న జోసెఫ్ కెప్టెన్ హోప్‌తో పాటు జట్టు మేనెజ్‌మెంట్‌కు క్షమాపణలు తెలిపాడు. ‘‘ఏదేమైనప్పటికీ ఆఖరి వన్డేలో నేను కొంచెం మితిమీరి ప్రవర్తించాను. ఇప్పటికే కెప్టెన్ షాయ్ హోప్, నా సహచరులు ,మేనేజ్‌మెంట్‌కు నేను వ్యక్తిగతంగా సారీ చెప్పాను. వెస్టిండీస్ అభిమానులకు నా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాను’’ అని ఓ ప్రకటనలో జోసెఫ్ పేర్కొన్నాడు. ఇక ఇంగ్లండ్-విండీస్ మధ్య ఐదు టీ20ల సిరీస్ నవంబర్ 9న జరగనున్న తొలి మ్యాచ్‌తో ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment