westindies cricket
-
కెప్టెన్‌తో గొడవ.. జోసెఫ్‌నకు బిగ్ షాకిచ్చిన విండీస్ క్రికెట్
వెస్టిండీస్ స్టార్ పేసర్ అల్జారీ జోసెఫ్‌నకు ఆ దేశ క్రికెట్ బోర్డు బిగ్ షాకిచ్చింది. అతడిపై రెండు మ్యాచ్‌ల నిషేధం వెస్టిండీస్ క్రికెట్ విధించింది. దీంతో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు జోషఫ్ దూరం కానున్నాడు. బార్బోడస్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి వన్డేలో జోసెఫ్ బోర్డు విధానాలు, క్రమశిక్షణ ఉల్లఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విండీస్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది.అసలేం జరిగిందంటే?బుధవారం(నవంబర్ 6) ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి వన్డేలో జోసెఫ్ తమ కెప్టెన్ షాయ్ హోప్‌తో వాగ్వాదానికి దిగాడు. జోషఫ్ వేసిన నాలుగో ఓవర్లో ఇంగ్లండ్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్‌కు ఇద్దర్ స్లిప్ ఫీల్డర్లను హోప్ సెట్ చేశాడు. కానీ ఈ ఫీల్డింగ్ సెటప్ జోసెఫ్‌నకు నచ్చలేదు.దీంతో హోప్‌తో జోసెఫ్ గొడవ పడ్డాడు. అతడితో వాగ్వాదం చేస్తేనే ఓవర్‌ను కొనసాగించాడు. ఆ ఓవర్లో కాక్స్‌ను ఔట్ చేసిన జోసెఫ్‌నకు కనీసం సెలబ్రేషన్స్ కూడా చేసుకోలేదు. అయితే తన ఓవర్‌ను పూర్తి చేసిన అనంతరం తన ఓవర్ పూర్తి కాగానే మైదానం విడిచిపెట్టి డగౌట్‌కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత కోచ్ సామీతో సంప్రదింపులు జరిపిన తర్వాత జోసెఫ్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. ఈ క్రమంలోనే అతడిపై వెస్టిండీస్ క్రికెట్ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.సారీ చెప్పిన జోషఫ్ఇక ఈ మ్యాచ్ అనంతరం తన తప్పును తెలుసుకున్న జోసెఫ్ కెప్టెన్ హోప్‌తో పాటు జట్టు మేనెజ్మెంట్కు క్షమాపణలు తెలిపాడు. ‘‘ఏదేమైనప్పటికీ ఆఖరి వన్డేలో నేను కొంచెం మితిమీరి ప్రవర్తించాను. ఇప్పటికే కెప్టెన్ షాయ్ హోప్, నా సహచరులు ,మేనేజ్మెంట్కు నేను వ్యక్తిగతంగా సారీ చెప్పాను. వెస్టిండీస్ అభిమానులకు నా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాను’’ అని ఓ ప్రకటనలో జోసెఫ్ పేర్కొన్నాడు. ఇక ఇంగ్లండ్-విండీస్ మధ్య ఐదు టీ20ల సిరీస్ నవంబర్ 9న జరగనున్న తొలి మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. -
వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడికి బిగ్ షాక్..
విధ్వసంకర ఆటగాడు షిమ్రాన్ హెట్‌మైర్‌కు వెస్టిండీస్ సెలక్టర్లు బిగ్ షాకిచ్చారు. ఇంగ్లండ్ సిరీస్‌లో మిగిలిన రెండు టీ20లకు ప్రధాన జట్టు నుంచి హెట్మైర్ను సెలక్టర్లు తప్పించారు. ఇంగ్లండ్‌తో తొలి రెండు మ్యాచ్‌లు ఆడిన హెట్‌మైర్ కేవలం 3 పరుగులు మాత్రమే చేసింది. ఈ క్రమంలోనే ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్న హెట్‌మైర్‌పై సెలక్షన్ కమిటీ వేటు వేసింది. ఇక అతడి స్ధానాన్ని మరో డేంజరస్ ఆటగాడు జాన్సెన్ చార్లెస్‌తో విండీస్ క్రికెట్ భర్తీ చేసింది. అదేవిధంగా స్టార్ పేసర్ అల్జారీ జోషఫ్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఆస్ట్రేలియా పర్యటనను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన రెండు మ్యాచ్‌లకు జోషఫ్ స్ధానంలో ఓషానే థామస్ జట్టులోకి వచ్చాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో విండీస్ 2-1 అధిక్యంలో కొనసాగుతోంది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 ట్రినిడాడ్ వేదికగా డిసెంబర్ 20న జరగనుంది. మిగిలిన రెండు టీ20లకు విండీస్ జట్టు: రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), షాయ్ హోప్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, ఒషానే థామస్ -
జనవరి నుంచి బకాయిలు
న్యూఢిల్లీ: కరోనాతో అన్ని దేశాల క్రికెట్ బోర్డులు ఆర్థిక సంక్షోభంలోకి దిగజారాయి. మరీ ముఖ్యంగా క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. తమ ఆటగాళ్లకు జీతాలు చెల్లించేందుకు నిధులు లేక విలవిల్లాడుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెటర్లతో పాటు, దేశవాళీ ఆటగాళ్లకు నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వలేకపోయామని వెస్టిండీస్ బోర్డు గురువారం అంగీకరించింది. దీని గురించి వెస్టిండీస్ ఆటగాళ్ల సంఘం కార్యదర్శి వేన్ లూయిస్ మాట్లాడుతూ ‘జనవరిలో స్వదేశంలో ఐర్లాండ్‌తో జరిగిన 3 వన్డేలు, 3 టి20ల సిరీస్‌లతో పాటు... ఫిబ్రవరి–మార్చిలో శ్రీలంకలో పర్యటించిన పురుషుల జట్టుకు మ్యాచ్ ఫీజులివ్వలేదు. ఆసీస్ వేదిక గా మహిళల టి20 వరల్డ్ కప్‌లో తలపడిన జట్టుకు కూడా 4 మ్యాచ్‌ల ఫీజు చెల్లించాల్సి ఉంది. -
విండీస్ బౌలర్ సునీల్ నరైన్‌పై వేటు
దుబాయ్: వెస్టిండీస్ అనుమానాస్పద స్పిన్నర్ సునీల్ నరైన్‌పై వేటు పడింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నరైన్‌ను సస్పెండ్ చేశారు. అతని బౌలింగ్ శైలి నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేలడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ నిర్ణయం తీసుకుంది. గత నెల్లో శ్రీలంకతో మూడో వన్డే సందర్భంగా నరైన్ పై అంపైర్లు అనుమానం వ్యక్తం చేశారు. నరైన్ బౌలింగ్ చేసే క్రమంలో తన మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచుతున్నాడంటూ ఐసీసీకి ఫిర్యాదు చేశారు. నరైన్ బౌలింగ్ యాక్షన్‌ను పరిశీలించిన ఐసీసీ బృందం అతను నిబంధనలను ఉల్లంఘించినట్టు కనుగొని అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది.