జనవరి నుంచి బకాయిలు | West Indies Cricket Board in financial crisis | Sakshi
Sakshi News home page

జనవరి నుంచి బకాయిలు

Published Fri, Apr 24 2020 6:11 AM | Last Updated on Fri, Apr 24 2020 6:11 AM

West Indies Cricket Board in financial crisis  - Sakshi

న్యూఢిల్లీ: కరోనాతో అన్ని దేశాల క్రికెట్‌ బోర్డులు ఆర్థిక సంక్షోభంలోకి దిగజారాయి. మరీ ముఖ్యంగా క్రికెట్‌ వెస్టిండీస్‌ (సీడబ్ల్యూఐ) తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. తమ ఆటగాళ్లకు జీతాలు చెల్లించేందుకు నిధులు లేక విలవిల్లాడుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెటర్లతో పాటు, దేశవాళీ ఆటగాళ్లకు నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వలేకపోయామని వెస్టిండీస్‌ బోర్డు గురువారం అంగీకరించింది. దీని గురించి వెస్టిండీస్‌ ఆటగాళ్ల సంఘం కార్యదర్శి వేన్‌ లూయిస్‌ మాట్లాడుతూ ‘జనవరిలో స్వదేశంలో ఐర్లాండ్‌తో జరిగిన 3 వన్డేలు, 3 టి20ల సిరీస్‌లతో పాటు... ఫిబ్రవరి–మార్చిలో శ్రీలంకలో పర్యటించిన పురుషుల జట్టుకు మ్యాచ్‌ ఫీజులివ్వలేదు. ఆసీస్‌ వేదిక గా మహిళల టి20 వరల్డ్‌ కప్‌లో తలపడిన జట్టుకు కూడా 4 మ్యాచ్‌ల ఫీజు చెల్లించాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement