crisis
-
పోరాడితేనే కాపాడుకోగలం!
మన దేశం ప్రపంచ వాణిజ్య సంస్థలో భాగస్వామిగా చేరినప్పటి నుంచి రైతాంగం, వ్యవసాయ రంగం పరిస్థితి మరింత వేగంగా క్షీణించడం ప్రారంభమైంది. 2022 నాటికల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, స్వామినాథన్ సిఫారసుల ప్రకారం వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధర ఇస్తామని నమ్మబలికిన ఎన్డీయే పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గెలిచే వరకు మద్దతు ధర గురించి ఊదరగొట్టి, గెలిచిన తర్వాత సి2 + 50 సూత్రం (ఉత్పత్తికి అయ్యే ఖర్చుకు అదనంగా అందులో సగభాగం కలిపి ఆ మొత్తంపై లెక్కగట్టటం) ప్రకారం తాము కనీస మద్దతు ధర ఇవ్వలేమని సుప్రీంకోర్టుకు ఎన్డీఏ ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించడం ద్వారా తన రైతు వ్యతిరేక విధానాన్ని బయట పెట్టుకొన్నది.ఇప్పటికే దేశంలోని 52 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాయని, వారి నెత్తిపై సగ టున 74,121 రూపాయల అప్పు ఉందని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మార్కెట్లో పంటల ధరలు గిట్టుబాటు కాక, పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక అప్పుల సుడి గుండంలో చిక్కుకుంటున్న రైతు కుటుంబాల్లో ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నది. 2013 నుండి 2022 వరకు అధికారిక లెక్కల (ఎన్సీఆర్బీ) ప్రకారమే గత పదేళ్లలో లక్షా ఇరవై వేల మందికి పైగా రైతులు ఆత్మ హత్య చేసుకున్నారంటే రైతాంగం పరిస్థితి ఎంత దయ నీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయ పంటలపై కార్పొరేట్ శక్తులకు అధి కారాన్ని కట్టబెట్టే విధంగా మోదీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఉరితాళ్ల వంటి మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల పాటు ఢిల్లీ కేంద్రంగా రైతులు వీరోచితంగా పోరాడారు. ఫలితంగా ప్రభుత్వం కనీస మద్దతు ధర చట్టబద్ధత అవకాశాల పరిశీలన కోసం ఉద్యమ నాయ కత్వానికి రాతపూర్వక హామీ ఇచ్చింది. అయితే మూడు సంవత్సరాలు దాటినా దీనిపై ఎలాంటి పురోగతి లేకపోగా తిరిగి దొడ్డి దారిన ఆ మూడు నల్ల చట్టాలను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధం అవుతోంది. దానిలో భాగంగానే కొత్త వ్యవసాయ మార్కెట్ విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. అటవీ సంరక్షణ నియమాల పేరుతో 2006 అటవీ హక్కుల చట్టానికి పాతరేయటానికి పూనుకున్నది. అటవీ సంరక్షణ నియమాల బిల్లు ఆమోదం పొందితే అడవులకు, అడవుల్లో నివసించే జన సమూహాల హక్కులకు ముప్పు ఏర్పడుతుందని పార్లమెంట్ సభ్యులకు కాన్స్టిట్యూషనల్ కండక్ట్ గ్రూపు తరపున 155 మంది మాజీ ఐఏఎస్ అధికారులు తమ సంతకాలతో లేఖ రాశారు. అయినా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా ఆ బిల్లును ఆమోదింప చేసు కుంది. మరోవైపు విద్యుత్ బిల్లు–2020ని చట్టం చేయడా నికి మార్గం సుగమం చేసుకుంది. కచ్చితంగా ఇది వ్యవ సాయ రంగంపై పెను భారం మోపే బిల్లు అనొచ్చు.వ్యవసాయ రంగంలో పని చేసే వారంతా రైతులే. వీరిలో కౌలు రైతులు, మహిళా రైతులు, వ్యవసాయ కూలీల పరిస్థితి మరింత దారుణంగా వుంది. రైతును, వ్యవసాయ రంగాన్ని రక్షించుకోలేక పోతే దేశంలో ఆహార కొరత ఏర్పడే ప్రమాదం వుంది. ఇప్పటికైనా రైతులు, రైతు సంఘాలు మేల్కొనాలి. ప్రమాదంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాలి. ఉద్యమ శక్తుల ఐక్యత ద్వారానే రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్నీ కాపాడుకోగలుగుతాం. ‘అఖిలభారత రైతుకూలీ సంఘం’ అనే పేరుతో కొనసాగుతూ వస్తున్న రెండు వేర్వేరు నిర్మాణాలు ఈ నేపథ్యంలోనే ‘ఆలిండియా కిసాన్ మజ్దూర్ సభ’ (ఏఐకేఎంఎస్)గా ఒకటి అవుతున్నాయి. ఆదివారం మహబూబాబాద్‌లో విలీన సభ జరుపుకొంటున్నాయి.– గౌని ఐలయ్య,ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
సిరియా సంక్షోభం.. భారత్ కీలక ప్రకటన
న్యూఢిల్లీ:సిరియా సంక్షోభంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఈ మేరకు సోమవారం(డిసెంబర్ 9) ఒక ప్రకటన విడుదల చేసింది. శాంతియుత, అందరినీ కలుపుకుపోయే రాజకీయ ప్రక్రియ సిరియాలో స్థిరత్వం తీసుకువస్తుందని అభిప్రాయపడింది.సిరియాలో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని తెలిపింది.సిరియాలోని అన్ని పక్షాలు ఐక్యమత్యం,సార్వభౌమత్వం కోసం పనిచేయాలని సూచించింది. దేశంలోని అన్ని వర్గాల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకోవాలని కోరింది.సిరియా రాజధాని డెమాస్కస్‌లోని భారత ఎంబసీ కొనసాగుతుందని, భారతీయులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎంబసీని సంప్రదించాలని కోరింది. కాగా, సిరియాలో నియంత పాలనను కూలదోసి రెబల్స్ అధికారాన్ని హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే.ఇదీ చదవండి: పిల్ల చేష్టలనుకుంటే నియంత పాలన అంతానికి నాంది పలికింది -
కోటా జోరుకు కళ్లెం
కోటా: రాజస్తాన్‌లోని కోటా. పోటీ పరీక్షలకు శిక్షణ కేంద్రంగా దేశంలోనే అగ్రగామిగా పేరున్న నగరం. విద్యార్థులతో కళకళలాడుతూ కోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల నిర్వాహకులకు కాసులు కురిపించే ఈ నగరం కళ తప్పుతోందా? అంటే, అవుననే సమాధానం వస్తోంది. ఇటీవలి కాలంలో కోటాకు శిక్షణ కోసం వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఎందుకు? శిక్షణ కోసం వచ్చే విద్యార్థులు వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు, కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాలు, కోచింగ్ సెంటర్లను వేరే ప్రాంతాలకు విస్తరించడం వంటి కారణాలూ దీని వెనుక ఉన్నాయని చెబుతున్నారు. కోచింగ్ సెంటర్లు 16 ఏళ్ల లోపు వారిని చేర్చుకోరాదనే నిబంధన వల్ల ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉందని పేర్కొంటున్నారు.వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ కోసం కోటాకు ఏటా 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు విద్యార్థులు వస్తుంటారు. వీరి వల్ల నగరంలోని అన్ని రంగాలకు కలిపి ఏటా సుమారు రూ.7 వేల కోట్ల వరకు ఆదాయం ఉండేది. అయితే, ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య 85 వేల నుంచి లక్ష వరకు తగ్గిపోయింది. ఫలితంగా ఆదాయం కూడా ఈసారి ఒక్కసారిగా సగానికి సగం, రూ.3,500 కోట్లకు పడిపోయింది.నిర్వాహకుల ధీమాఅత్యుత్తమ శిక్షణకు కోటాకు ఉన్న విశ్వసనీయత ఏమాత్రం చెక్కుచెదరలేదని, విద్యార్థులకు ఇతర నగరాల్లో లేనటువంటి అనుకూల వాతావరణం ఇక్కడ ఉన్నందున ఈ తగ్గుదల ప్రభావం స్వల్పకాలమే ఉంటుందని, మున్ముందు తిరిగి పుంజుకుంటామని కోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల నిర్వాహకులు ధీమాతో ఉన్నారు. వచ్చే ఏడాదిలో తమ నష్టాలు పూడ్చుకుంటామని రాజస్తాన్ ఇండస్ట్రీస్ యునైటెడ్ కౌన్సిల్ జోనల్ చైర్ పర్సన్ గోవింద్రామ్ మిట్టల్ బల్లగుద్ది చెబుతున్నారు. బెంగళూరులో మాదిరిగా కోటాలోనూ ఐటీ హబ్‌లు ఏర్పాటు చేసేందుకు గల ప్రత్యామ్నాయ అవకాశాలనూ పారిశ్రామిక వేత్తలు పరిశీలిస్తున్నారని వివరించారు. ప్రైవేట్ కంపెనీల్లో మేనేజ్మెంట్ పోస్టుల్లో సగానికి సగం, నాన్ మేనేజ్మెంట్ పోస్టుల్లో 75 శాతం స్థానికులకే ఇవ్వాలంటూ కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే రాజస్తాన్ పారిశ్రామికవేత్తలు..ఐటీ హబ్‌లను కోటాకు మార్చాలంటూ బెంగళూరులోని ఐటీ కంపెనీల అధిప తులను కోరడం, కొందరు ఓకే అనడం జరిగిపోయాయని ఆయన అన్నారు. లోక్‌సభ స్పీకర్, కోటా–బుండి ఎంపీ ఓం బిర్లా ఆదేశాల మేరకు కోటాలో ఐటీ హబ్‌ల ఏర్పాటుకు అవసరమైన భూముల కేటాయింపుల ప్రక్రియ మొదలైందని ఆయన వివరించారు.వాయిదాలకు సైతం కష్టంగా ఉంది‘గతేడాది వరకు రోజులో 60 మంది వరకు విద్యార్థులు నా ఆటోలో ప్రయాణించే వారు. మంచి ఆదాయం ఉండటంతో కుటుంబ పోషణ ఏమాత్రం ఇబ్బందిలేకుండా ఉండేది. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 20కి తగ్గింది. ఆదాయం కూడా పడిపోయింది. రుణంపై కొనుగోలు చేసిన వాహనానికి కిస్తీలు చెల్లించేందుకు సైతం ఇబ్బందవుతోంది’అని స్థానిక ఆటో డ్రైవర్ ఒకరు చెప్పారు.ఇబ్బందుల్లో హాస్టళ్ల యజమానులుకోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల పరిశ్రమ సంక్షోభంలో పడిన మాట నిజమేనని కోటా హాస్టల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్ మిట్టల్ ఒప్పుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి కోటాకు వచ్చే విద్యార్థుల సంఖ్య ఒక్కసారిగా 30 శాతం నుంచి 40 శాతం మేర పడిపోవడం కొన్ని దశాబ్దాల్లో ఇదే మొదటిసారని ఆయన చెప్పారు. బ్యాంకుల్లో రుణాలు తెచ్చి పలు హాస్టళ్లను ఏర్పాటు చేసుకున్న కొందరు యజమానులు వాయిదాలు చెల్లించలేక ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు. నగరంలో ఉన్న 4,500 హోటళ్లలో చాలా చోట్ల విద్యార్థుల ఆక్యుపెన్సీ రేటు 40–50 శాతానికి మధ్య పడిపోయిందన్నారు. ‘నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం ఆత్మహత్యల పరంగా చూసే దేశంలోని 50 నగరాల తర్వాత దిగువన కోటా ఉంది. అయితే, ఆత్మహత్య ఘటనల ప్రచారంతో ప్రతికూల ప్రభావం పడింది’అని నవీన్ అన్నారు. హాస్టళ్లలో రూం అద్దెలు నెలకు రూ.15వేలుండగా ఇప్పుడది రూ.9 వేలకు తగ్గిందని, చాలా హాస్టళ్లు ఖాళీగానే ఉన్నాయని స్థానిక కోరల్‌పార్క్ ప్రాంతంలోని హాస్టల్ యజమాని ఒకరన్నారు. -
నిర్మానుషంగా ఉంది నిజమే కానీ.. ! కర్ఫ్యూ ఏం పెట్టలేద్సార్!
-
సంక్షోభంలో వజ్రాల పరిశ్రమ
న్యూఢిల్లీ: దేశ వజ్రాల పరిశ్రమ తీవ్ర సంక్షోభంతో కుదేలవుతోందని, పరిశ్రమలు మూత పడుతుండడంతో ఎంతో మంది ఉపాధి కల్పోతున్న పరిస్థితులు నెలకొన్నాయని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) అనే స్వతంత్ర సంస్థ వెల్లడించింది. ఆర్డర్లు తగ్గడంతో ముడి వజ్రాల నిల్వలు పెరుగుతున్నాయని, ల్యాబ్‌లో తయారైన వజ్రాల నుంచి పోటీ ఎక్కువగా ఉందని వివరించింది. ‘‘ఈ పరిస్థితులు రుణ ఎగవేతలు, పరిశ్రమల మూతకు, ఉపాధి నష్టానికి కారణమవుతోంది. గుజరాత్ వజ్రాల పరిశ్రమకు చెందిన 60 మంది ఇప్పటి వరకు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇది దేశ వజ్రాల పరిశ్రమ ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సమస్యలను తెలియజేస్తోంది’’అని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, అప్పుడే ఈ పరిశ్రమ భవిష్యత్‌కు రక్షణ కలి్పంచినట్టు అవుతుందన్నారు. ఎగుమతుల్లో క్షీణత.. జీటీఆర్ఐ నివేదిక ప్రకారం 2021–22లో ముడి వజ్రాల దిగుమతులు 18.5 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2023–24 నాటికి 25 శాతం మేర క్షీణించి 14 బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి. ఇక్కడి నుంచి చేసిన ముడి వజ్రాల ఎగుమతులను సర్దుబాటు చేసి చూస్తే, నికర దిగుమతులు 25 శాతం తగ్గి 17.5 బిలియన్ డాలర్ల నుంచి 13.1 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కట్, పాలి‹Ù్డ వజ్రాల ఎగుమతులు 35 శాతం మేర తగ్గాయి. 2021–22లో 24.4 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2023–24లో 13.1 బిలియన్ డాలర్లకు క్షీణించాయి. పైగా ఇదే కాలంలో విక్రయం కాని వజ్రాలను భారత్‌కు తిప్పిపండం అన్నది 35 శాతం నుంచి 45.6 శాతానికి పెరిగింది. నికర కట్, పాలి‹Ù్డ వజ్రాల ఎగుమతులు 45 శాతం మేర తగ్గి 15.9 బిలియన్ డాలర్ల నుంచి 8.7 బిలియన్ డాలర్లకు తగ్గిపోయినట్టు జీటీఆర్ఐ నివేదిక వివరించింది. నికర ముడి వజ్రాల దిగుమతులు, నికర కట్, పాలిష్ పట్టిన వజ్రాల ఎగమతుల మధ్య అంతరం 2021–22లో 1.6 బిలియన్ డాలర్లు ఉంటే, 2024 మార్చి నాటికి 4.4 బిలియన్ డాలర్లకు పెరిగిపోయినట్టు తెలిపింది. ముడి వజ్రాలను దిగుమతి చేసుకుని, ఇక్కడి పరిశ్రమలు కట్, పాలిష్డ్ రూపంలో, ఆభరణాల రూపంలో విదేశాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తుంటాయి. సవాళ్లకు ఎన్నో కారణాలు.. నియంత్రణపరమైన అంశాలకుతోడు, పరిశ్రమలో అంతర్గతంగా ఉన్న సామర్థ్యాల లేమి ప్రస్తుత సవాళ్లకు కారణమని జీటీఆర్ఐ వివరించింది. యూఎస్, చైనా, యూరప్‌లో ఆర్థిక అనిశి్చతులు, ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు లగ్జరీ ఉత్పత్తులపై వినియోగం తగ్గేందుకు దారితీసినట్టు తెలిపింది. ‘‘అంతర్జాతీయంగా వజ్రాల ధరల్లో అస్థిరతలు అనిశి్చతికి కారణమయ్యాయి. ధరలు మరింత తగ్గుతాయన్న అంచనాతో పరిశ్రమలు ముడి వజ్రాల కొనుగోలుకు దూరంగా ఉన్నాయి’’అని ఈ నివేదిక తెలిపింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం సైతం అంతర్జాతీయంగా వజ్రాల సరఫరా వ్యవస్థలో అవరోధాలకు దారితీసినట్టు శ్రీవాస్తవ తెలిపారు. తక్కువ ధరలకు వచ్చే ల్యాబ్ వజ్రాలవైపు కస్టమర్లు మొగ్గు చూపిస్తుండడం సహజ వజ్రాల డిమాండ్‌ను ప్రభావం చేస్తున్నట్టు చెప్పారు. పెరిగిపోతున్న కారి్మక, ఇంధన, మెటీరియల్స్ వ్యయాలతో చాలా యూనిట్లు మనుగడ సాగించలేని పరిస్థితులు నెలకొన్నట్టు వివరించారు. ఇదే పరిశ్రమల మూతకు దారితీస్తున్నట్టు పేర్కొన్నారు. ఎగుమతులకు సంబంధించి రుణ సాయం, విదేశీ ముడి వజ్రాల విక్రేతలకు కార్పొరేట్ పన్ను నుంచి మినహాయించడం, ల్యాబ్ వజ్రాల పరిశ్రమను నియంత్రించడం, దుబాయి నుంచి కట్, పాలి‹Ù్డ వజ్రాల దిగుమతులపై సున్నా టారిఫ్ వంటి చర్యలను పరిశీలించాలని ప్రభుత్వానికి జీటీఆర్ఐ సూచించింది.వజ్రాల పరిశ్రమకు గడ్డుకాలం దశాబ్ద కనిష్టానికి ఆదాయం: క్రిసిల్ దేశ వజ్రాల పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ రేటింగ్స్ సైతం తెలిపింది. వజ్రాల పాలిషింగ్ పరిశ్రమ ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24)లో 25–27 శాతం మేర క్షీణించి, దశాబ్ద కనిష్ట స్థాయి అయిన 12 బిలియన్ డాలర్లకు పరిమితం అవుతుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. కీలక ఎగుమతి మార్కెట్లు అయిన యూఎస్, చైనాలో డిమాండ్ తక్కువగా ఉండడం, వినియోగదారులు ల్యాబ్ తయారీ వజ్రాల వైపు మొగ్గు చూపడాన్ని కారణాలుగా ప్రస్తావించింది. దీంతో వజ్రాల సరఫరా పెరిగి ధరలు 10–15 శాతం వరకు తగి్టనట్టు తెలిపింది. ఈ మేరకు పరిశ్రమపై ఒక నివేదికను తాజాగా విడుదల చేసింది. సహజ వజ్రాలను సానబట్టే పరిశ్రమ ఆదాయం తగ్గడం వరుసగా ఇది మూడో ఆర్థిక సంవత్సరం అవుతుందని పేర్కొంది. 2023–24లోనూ 29 శాతం, 2022–23లో 9 శాతం చొప్పున ఆదాయం క్షీణించినట్టు తెలిపింది. తాజా పరిణామాల నేపథ్యంలో వజ్రాల పాలిషర్లు ముడి వజ్రాల కొనుగోళ్లను తగ్గించినట్టు, దీంతో వజ్రాల మైనింగ్ సంస్థలు ఉత్పత్తిని తగ్గించుకున్నట్టు వివరించింది. ఇది ధరల పతనాన్ని కొంత వరకు అడ్డుకున్నట్టు పేర్కొంది. పరిశ్రమ ఆపరేటింగ్ మార్జిన్లు 2024–25లో 4.5–4.7 శాతం మధ్య స్థిరపడొచ్చని తెలిపింది. మొత్తం మీద మూలధన అవసరాలు తగ్గడంతో రుణాలపై ఆధారపడడం తగ్గుతుందని, ఇది కంపెనీల రుణ పరపతికి మద్దతుగా నిలుస్తుందని అంచనా వేసింది. -
కంగనా రనౌత్ నోటి దురుసు వ్యాఖ్యలు.. సొంత ఎంపీపై బీజేపీ ఆగ్రహం
ధర్మశాల : రైతుల నిరసనలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హిమాచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగన రౌనత్‌పై సొంత పార్టీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేసింది.2020 మోదీ ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. రైతులు మాత్రం కేంద్రం తెచ్చిన చట్టాల్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో కేంద్రం రైతు చట్టాల్ని వెనక్కి తీసుకుంది. అయినప్పటికీ దేశంలో ఈ సాగు చట్టాలపై నిరసనలు కొనసాగేలా కుట్ర జరిగే అవకాశం ఉందని, రైతుల నిరసనలను మోదీ ప్రభుత్వం కట్టడి చేయాలని, లేదంటే భారత్ మరో బంగ్లాదేశ్ తరహా అశాంతి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందని కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పైగా అల్లర్లు సృష్టించే వారికి దేశం కుక్కలపాలైనా వారికేం పట్టదని విమర్శించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన పోరాటంలో మృతదేహాలు వేలాడుతూ కనిపించాయని, లైంగిక దాడులు చోటుచేసుకున్నాయని ఎక్స్ వేదికగా షేర్ చేసిన వీడియోలో ఆరోపించారు. బాలీవుడ్ క్వీన్ వ్యాఖ్యలు సొంత పార్టీలోనే దుమారం రేపాయి.కంగనా రౌనత్‌కు ఆ అధికారం లేదురైతుల నిరసన గురించి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ అధికారికంగా స్పందించింది. భవిష్యత్తులో అలాంటి ప్రకటనలు ఇవ్వకూడదని హెచ్చరించింది. రైతుల నిరసనపై కంగనా రౌనత్ వ్యాఖ్యల్ని మేం ఖండిస్తున్నాం.‘కంగనా రనౌత్‌కు పార్టీ తరపున విధానపరమైన విషయాలపై మాట్లాడే అధికారం లేదు. ఆమెకు అనుమతి కూడా ఇవ్వలేదు. భవిష్యత్తులో అలాంటి ప్రకటనలు చేయొద్దని బీజేపీ ట్వీట్ చేసింది. తప్పు.. ఇలా మాట్లాడకూడదుమరోవైపు కంగనా రనౌత్ వ్యాఖ్యలపై బీజేపీ పంజాబ్ యూనిట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి ఉద్రేకపూరిత ప్రకటనలు చేయడం మానుకోవాలని సూచించింది. ‘రైతులపై మాట్లాడటం కంగనా వ్యాఖ్యలకు పార్టీకి సంబంధం లేదు. ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం. ప్రధాని మోదీ, బీజేపీ రైతు పక్షపాతి. ఆమె సున్నిత, మతపరమైన వ్యాఖ్యలు చేయకూడదు’ అని పంజాబ్ బీజేపీ నేత నాయకుడు హర్జిత్ గరేవాల్ అన్నారు. BJP expressed disagreement with its MP Kangna Ranaut's comments on farmers agitation, says she is not authorised to speak on policy issues. pic.twitter.com/xJ878F5pWK— Press Trust of India (@PTI_News) August 26, 2024 -
బంగ్లా బాధితులు కన్నీరుమున్నీరు, అండగా సోనూసూద్, వీడియో వైరల్
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల ఉద్యమం తీవ్రరూపం దాల్చి హింసాత్మకం మారిపోయింది. దీంతో ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయేంత తీవ్రంగా తలెత్తాయి. ఈ నేపథ్యంలో అక్కడ తీవ్ర గందరగోళ, రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడింది. మరోవైపు పౌరులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లోని భారతీయుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. వారిపై దాడులు సంచలనంగా మారాయి. దీనికి సంబంధించి ఒక మహిళ ఆవేదన ఎక్స్‌లో వైరల్‌గా మారింది. దీంతో తన వంతు సాయానికి ఎపుడూ ముందుండే నటుడు సోనూ సూద్ స్పందించారు. బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న హిందువులను భారత్‌కు తీసుకువచ్చేందుకు సాయం చేస్తానంటూ ఆమెకు మద్దతు ప్రకటించారు. దీంతో మరోసారి రియల్ హీరో అంటూ సోనూసూద్ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.‘‘తమ ప్రాణాలు పోతాయని భయంగా ఉందని, ఎలాగైనా తమ ప్రాణాలను కాపాడుకోవడానికి భారతదేశానికి చేరాలా చూడాలని’ తాజాగా బంగ్లాదేశ్ కు చెందిన మహిళ ఆ వీడియోలో కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇది సోషల్ మీడియాలో వైరల్గామారడంతో సోనూ సూద్ స్పందించారు. ”బంగ్లాదేశ్ నుంచి భారతీయులందరినీ తిరిగి తీసుకురావడానికి మా వంతు ప్రయత్నాలు కచ్చితంగా చేస్తాం. ఇక మీరు ప్రశాంతమైన మంచి జీవితాన్ని పొందుతారు. అంతేకాదు ఇది కేవలం మన ప్రభుత్వ బాధ్యతే కాదు.. మనందరి బాధ్యత కూడా.. జై హింద్” అంటూ ఆయన ట్వీట్ చేశారు. బంగ్లాదేశ్‌లో చిక్కుకుపోయిన హిందూవులను కాపాడటానికి దేశంలో ప్రముఖలతో పాటు ప్రతిఒక్కరు స్పందించాలని నెటిజన్స్ కామెంట్స్ చేశారు. We should do our best to bring back all our fellow Indians from Bangladesh, so they get a good life here. This is not just the responsibility of our Government which is doing its best but also all of us.Jai Hind 🇮🇳 https://t.co/OuL550ui5H— sonu sood (@SonuSood) August 6, 2024 -
Bangladesh Crisis: అది స్వయం కృతాపరాధం: తస్లీమా నస్రీన్
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ వ్యతిరేక నిరసనల మధ్య ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయడం, తరువాత ఆమె ఆ దేశాన్ని విడిచిపెట్టడం సంచలనంగా మారింది. బంగ్లాదేశ్ సంక్షోభంపై ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ స్పందించారు. షేక్ హసీనా బంగ్లాదేశ్ విడిచి భారత్‌లో ఆశ్రయం పొందడం విడ్డూరంగా ఉందన్నారు. ఇస్లాంవాదులను ప్రసన్నం చేసుకునేందుకే హసీనా బంగ్లాదేశ్ నుంచి బయటపడ్డారని, ఆమె కూడా విద్యార్థి ఉద్యమంలో భాగమైనట్లు ఉన్నదని తస్లీమా ఆరోపించారు.తస్లీమా నస్రీన్ ఒక ఆన్లైన్ పోస్ట్‌లో ‘ఇస్లామిస్టులను ప్రసన్నం చేసుకునేందుకు, హసీనా నన్ను 1999లో నా దేశం నుంచి వెళ్లగొట్టారు. అప్పట్లో నేను మరణశయ్యపై ఉన్న మా అమ్మను చూసేందుకు బంగ్లాదేశ్‌కు వెళ్లాను. ఆ తరువాత నన్ను తిరిగి బంగ్లాదేశ్‌కు రానివ్వలేదు. ఒకవిధంగా చూస్తే ఆమె ఇస్లామిస్టు ఉద్యమంలో భాగమయ్యారు. అదే ఇప్పుడు ఆమెను దేశం విడిచివెళ్లేలా చేసింది’ అని అన్నారు. షేక్ హసీనా మిలటరీ విమానంలో భారతదేశానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆమె ఆశ్రయం పొందేందుకు లండన్‌కు వెళ్లే అవకాశాలున్నాయి. ఇస్లాంవాదులకు మద్దతుగా నిలిచేందుకు, అవినీతికి పాల్పడే వ్యక్తులకు ఆమె ప్రోత్సాహం అందించారని’ తస్లీమా ఆరోపించారు.తస్లీమా నస్రీన్ 1994లో ‘లజ్జ’ పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు. దీనిపై మత ఛాందసవాద సంస్థల నుండి వచ్చిన బెదిరింపుల కారణంగా ఆమె బంగ్లాదేశ్ విడిచి వెళ్ళవలసి వచ్చింది. ఈ పుస్తకాన్ని బంగ్లాదేశ్‌లో నిషేధించారు. అయితే చాలా ప్రాంతాల్లో ఈ బుక్ బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. తస్లీమా నస్రీన్ దేశం విడిచి వెళ్లిన సమయంలో హసీనా ప్రత్యర్థి ఖలీదా జియా ప్రధానమంత్రిగా ఉన్నారు. నాటి నుంచి రచయిత తస్లీమా నస్రీన్ బంగ్లాదేశ్‌కు దూరంగా ఉన్నారు. -
హృదయ విదారకం.. ఆ తల్లికి పురిటినొప్పి బాధల్లేవ్!
ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారి.. పురిటినొప్పులు పడని స్థితిలో ఉన్న తన తల్లి గర్భం చీల్చుకుని బయటకు వచ్చాడు. ఎందుకంటే.. అప్పటికే ఆమె ఊపిరి ఆగిపోయింది కాబట్టి. ఇదొక్క సంఘటనే కాదు.. 9 నెలలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఇలాంటి విషాదకర దృశ్యాలెన్నో. హమాస్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ తాజాగా గాజాలో ఓ ఆస్పత్రిపై దాడులు జరిపింది. అక్కడ ప్రసవానికి సిద్ధంగా ఉన్న నిండు గర్భిణీ అయిన ఒలా అద్నన్ హర్బ్ అల్ కుర్ద్ తీవ్రంగా గాయపడింది. ఆమెను వెంటనే సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలిస్తుండగా.. దారిలోనే ఆమె కన్నుమూసింది. అయితే.. https://t.co/LpqLJTuEpp #unido #hostages #ceasefire Gaza hospital says newborn saved from dead mother's wombHe was placed in an incubator and transferred to Al-Aqsa Hospital in Deir el-Balah.— chemTrailActivist (@chemTrailActivi) July 20, 2024వైద్యులకు ఆల్ట్రాసౌండ్లో కడుపులోని బిడ్డ గుండె చప్పుడు వినిపించింది. దీంతో.. అత్యవసరంగా ఆపరేషన్ చేసి ఆ బిడ్డను బయటకు తీశారు. ఆ బిడ్డ బతకదని వైద్యులు తొలుత భావించారట. ఇంక్యూబేటర్లో పెట్టి డీర్ ఎల్-బలాహ్లోని మరో ఆస్పత్రికి తరలించారట. కానీ, ఏదో అద్భుతం జరిగినట్లు కోలుకుంటున్నాడని వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా కోలుకున్నాక వలంటీర్లకు ఆ బిడ్డను అప్పజెప్తామని తెలిపారు వాళ్లు. యుద్ధం ఎంత వినాశకరమో, దాని పరిణామాలెంత భయంకరంగా ఉంటాయో చెప్పడానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ హృదయ విదారక సంఘటనే నిదర్శనం. -
అమెరికాకు ఐరన్ డోమ్ ఏర్పాటు చేస్తా: డొనాల్డ్ ట్రంప్
న్యూయార్క్: అమెరికా ఎన్నికల ప్రచారంలో ఇరుపార్టీల నేతలు, ప్రచార బృందాల విమర్శల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా శనివారం రాత్రి ఓ ప్రచార ర్యాలీలో పాల్గొన్న మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. అధ్యక్షుడు జో బైడెన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫిలడెల్ఫియాలోని టెంపుల్ యూనివర్సిటీలో క్యాంపస్ వద్ద ట్రంప్ మాట్లాడారు. ‘నాలుగు ఏళ్ల క్రితం ఆమెరికా ఒక గొప్పదేశంగా ఉండేది. అంతే స్థాయిలో మరికొన్ని రోజుల్లో అమెరికా గొప్ప దేశం నిల్చోబెడతా. యూఎస్- మెక్సికో సరిహద్దుల్లో వివాదం కొనసాగుతోంది. దీంతో కొంత కాలం నుంచి పెద్ద సంఖ్యలో అమెరికాలో వలసలు పెరిగాయి. బహిష్కరణ విధానాలతో వలసలపై కఠిన చర్యలు తీసుకుంటాను. మోసగాడైన జో బైడెన్.. సోదరభావంతో ఉండే ఫిలడెల్ఫియా సిటీని మొత్తం నేరాలు, రక్తపాతంతో నాశానం చేశారు. ఇక్కడ అక్రమ వలసలు భారీగా పెరిగిపోయాయి. ఇదంతా ‘బైడెన్ వలస నేరం’. .. మన దేశ చరిత్రలో సురకక్షితమైన సరిహద్దులు కలిగి ఉండేవాళ్లం. కానీ ఇప్పడు మనం ప్రపంచ చరిత్రలోనే రక్షణ లేని సరిహద్దులను కలిగి ఉన్నాం. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగకుండా, ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తాను. బైడెన్ ఆర్థిక విధానాలను మార్చివేస్తాను. రక్షణ వ్యవస్థలో కూడా మరిన్ని మార్పులు తీసుకువస్తా. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ మాదిరిగా అమెరికాకు సైతం ఐరన్ డోమ్ ఏర్పాటు చేస్తా’అని ట్రంప్ అన్నారు.ఇక.. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌లో జరుగనున్నాయి. జాతీయవాదిగా, వలసలను త్రీంగా వ్యతిరేకించే నేతగా పేరున్న ట్రంప్ ఇటీవల అమెరికాలోని కాలేజీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన విదేశీ విద్యార్థులకు అటోమేటిక్ గ్రీన్ కార్డులు అందించే విధానం తీసుకువస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. -
భారత్ సాయంతోనే సంక్షోభం నుంచి గట్టెక్కాం: శ్రీలంక
ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడిన శ్రీలంక తాజాగా భారత్‌ను ప్రశంసించింది. భారత్- శ్రీలంకల స్నేహపూర్వక సంబంధాలకు ఇది ఒక మంచి ఉదాహరణగా నిలిచింది. తమ దేశం రెండేళ్ల పాటు ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిందని, భారత్ అందించిన 3.5 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయంతోనే ఇది సాధ్యమైందని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే పేర్కొన్నారు.భారత్‌తో బలమైన భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు కట్టుబడి ఉంటామని ఆయన అన్నారు. కొలంబోలో జరిగిన 31వ అఖిల భారత భాగస్వామ్య సమావేశంలో విక్రమసింఘే మాట్లాడుతూ ఇరు దేశాలూ పర్యావరణ అనుకూల ఇంధనరంగంలో కలిసి పనిచేస్తాయని అన్నారు. ఇటీవల తాను ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు దీనికి సంబంధించిన ఉమ్మడి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిన అవసరాన్ని ప్రధాని మోదీతో చర్చించానన్నారు. దీనిలో భాగంగా ప్రధాని మోదీ ముందు పలు ప్రతిపాదనలు ఉంచినట్లు విక్రమసింఘే పేర్కొన్నారు. తమ దేశంలో సాంపూర్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఉందని, ఇది అంతర్-ప్రభుత్వ ప్రాజెక్ట్ అని, దీనిని జూలైలో ప్రారంభించాలనుకుంటున్నామనారు. అలాగే శ్రీలంక-భారత్‌ల మధ్య ల్యాండ్ కనెక్టివిటీని నెలకొల్పే ప్రాజెక్టుపై కూడా తాము దృష్టి సారించామని తెలిపారు. -
మంగోలియాలో చలి పులి పంజా
ప్రకృతి వైపరీత్యం ‘జడ్’మంగోలియాను ముంచెత్తుతోంది. అతి శీతల చలికాలంతో మంగోలియా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రకృతి ప్రకోపం వల్ల ఇక్కడ కనీసం పచ్చగడ్డి కూడా మొలవకపోవడంతో లక్షల సంఖ్యలో పశువులు మృత్యువాత పడుతున్నాయి. అయితే.. గతంలో దశాబ్దానికి ఒకసారి వచ్చిన జడ్.. ఇప్పుడు తరచూ వస్తుండటంతో మంగోలియా ప్రజల ఇబ్బందులు మరింత తీవ్రమయ్యాయి.తూర్పు ఆసియా దేశమైన మంగోలియాలో తీవ్ర అనావృష్టి తరవాత అతి శీతల చలికాలం వస్తే దాన్ని జడ్ అంటారు. ఈ వాతావరణ వైపరీత్యంలో పచ్చగడ్డి కూడా మొలవక పశువులు పెద్ద సంఖ్యలో చనిపోతాయి. ప్రస్తుతం మంగోలియాలో జరుగుతున్నది ఇదే. జడ్ వల్ల ఈ ఏడాది ఒక్క ఫిబ్రవరిలోనే 21 లక్షల పశువులు, గొర్రెలు, మేకలు చనిపోగా మే నెల కల్లా ఆ సంఖ్య 71 లక్షలకు చేరింది. వాటిలో 80 శాతాన్ని, అంటే 56 లక్షల జీవాలను పాతిపెట్టారు. లేదంటే అంటు వ్యాధులు ప్రబలుతాయని మంగోలియా ప్రభుత్వం పశువులను పాతిపెట్టింది. దేశంలో జడ్ వల్ల మున్ముందు మొత్తం కోటీ 49 లక్షల జీవాలు చనిపోవచ్చునని, ఇది మంగోలియా పశుసంపదలో 24 శాతానికి సమానమని ఉప ప్రధాని ఎస్.అమార్ సైఖాన్ చెప్పారు. మంగోలియా జనాభా 33 లక్షలైతే వారికి 6.5 కోట్ల పశువులు, యాక్‌లు, గొర్రెలు, మేకలు, గుర్రాలు ఉన్నాయి. వీటిని జాతీయ సంపదగా ఆ దేశ రాజ్యాంగం ప్రకటించింది. మంగోలియా ఎగుమతుల్లో గనుల నుంచి తవ్వి తీసిన ఖనిజాల తరవాత మాంసం, ఇతర జంతు ఉత్పత్తులదే రెండో స్థానం. వ్యవసాయంలో 80 శాతం వాటా పశుపాలన, మేకలు, గొర్రెల పెంపకానిదే. దీనివల్ల మంగోలియా జీడీపీలో 11 శాతం లభిస్తోంది.ప్రసుత్తం జడ్ వల్ల మంగోలియా ఆర్థికవ్యవస్థ అస్థిరతకు లోనవుతోంది. ప్రధాన వృత్తి అయిన పశుపాలన దెబ్బతినడంతో ప్రజలు దేశ రాజధాని ఉలాన్ బటోర్కు, ఇతర పట్టణాలకు వలస పోతున్నారు. కానీ, అక్కడ వారందరికీ సరిపడా పనులు లేవు. గతంలో దశాబ్దానికి ఒకసారి వచ్చిన జడ్ ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల మరింత తరచుగా వచ్చిపడుతోంది.ప్రస్తుత జడ్ గడచిన పదేళ్లలో ఆరోది, మహా తీవ్రమైనది. జనానికి తీవ్ర ఆహార కొరత ఎదురవుతోంది. మంగోలియాను ఆదుకోవడానికి 60 లక్షల డాలర్ల విరాళాలను సేకరించాలని అంతర్జాతీయ సంస్థలు తలపెట్టినా మార్చి మధ్యనాటికి అందులో 20 శాతాన్ని కూడా సేకరించలేకపోయాయి. ఉక్రెయిన్, గాజా యుద్ధాలపై ప్రపంచ దేశాల దృష్టి కేంద్రీకృతం కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. -
ఢిల్లీలో నీటి చౌర్యం.. ఎల్జీకి మంత్రి ఫిర్యాదు
దేశరాజధాని ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. దీనికితోడు తాజాగా విద్యుత్ సంక్షోభం కూడా తలెత్తింది. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో ఏర్పడిన నీటి ఎద్దడి ప్రభుత్వానికి పెను సవాల్‌గా మారింది. దీనిని అనువుగా మలచుకొన్న కొందరు నీటి చౌర్యానికి పాల్పడుతున్నారు.ఢిల్లీలోని మునక్ కెనాల్లో వాటర్ ట్యాంకర్ చోరీకి గురైన ఉదంతం సంచలంగా మారింది. నీటి చౌర్యాన్ని అరికట్టడంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపించింది. ఈ నీటి చౌర్యంపై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఆప్‌తో నీటి మాఫియా కుమ్మక్కైందని బీజేపీ తన ఫిర్యాదులో ఆరోపించింది. ఇదే సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనా కార్యాలయ అధికారులు కూడా వాటర్ మాఫియా పేరుతో ఆప్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.మరోవైపు హర్యానా కూడా సుప్రీం కోర్టు ఆదేశించిన రీతిలో ఢిల్లీకి నీటిని విడుదల చేయడం లేదని ఎల్జీకి ఆప్ లేఖ రాసింది. తాజాగా ఢిల్లీ-హర్యానా మునాక్ కెనాల్ నుండి ట్యాంకర్లలో అక్రమంగా నీటిని తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కాలువ నుంచి ఢిల్లీకి మాత్రమే నీటిని సరఫరా చేయాల్సి ఉండగా, ఆ నీరు వేరేవైపు మరలిపోతోంది. ఎల్జీకి ఆప్ రాసిన లేఖలో రాజధానిలో నీటి ట్యాంకర్ల సంఖ్య తగ్గుతున్న విషయాన్ని మంత్రి అతిషీ ప్రస్తావించారు.2023 జనవరిలో ఢిల్లీ జల్ బోర్డు 1179 ట్యాంకర్లను అందుబాటులో ఉంచింది. 2023 జూన్ నాటికి ఈ ట్యాంకర్ల సంఖ్య 1203. అయితే 2024 జనవరిలో వాటి సంఖ్య 888కి తగ్గిందని దీని వెనుకగల కారణాన్ని తెలుసుకోవాల్సి ఉన్నదని అతిషీ ఆ లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ జల్ బోర్డ్ ముఖ్య కార్యదర్శి, సీఈఓలు తన సూచనలను పాటించకుండా ట్యాంకర్ల సంఖ్యను తగ్గించారని ఆమె పేర్కొన్నారు. వారు ట్యాంకర్ మాఫియాతో కుమ్మక్కయ్యారని అతిషీ ఆరోపించారు. దీనిపై వెంటనే విచారణ జరిపించాలని ఆమె లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను ఆమె కోరారు. ట్యాంకర్ల సంఖ్యను పెంచాలని ఢిల్లీ జల్ బోర్డుకు పలుమార్లు లేఖలు రాసినా అధికారులు పట్టించుకోలేదని అతిషి పేర్కొన్నారు. -
ఢిల్లీలో విద్యుత్ సంక్షోభం.. పలు ప్రాంతాల్లో అంధకారం
దేశరాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలను దాటి బెంబేలెత్తిస్తున్నాయి. దీనికితోడు ఒక వైపు నీటి ఎద్దడి, మరోవైపు కొత్తగా తలెత్తిన విద్యుత్ సంక్షోభం ఢిల్లీవాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.ఢిల్లీలోని మండోలా, లోని ప్రాంతాల్లోని పవర్ గ్రిడ్ స్టేషన్లలో అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా మంటలు చెలరేగాయి. ఫలితంగా ఉత్తర ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం 2:11 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.ఢిల్లీలోని వజీరాబాద్, కాశ్మీరీ గేట్, గీతా కాలనీ, హర్ష్ విహార్, ప్రీత్ విహార్, ఐపీ పవర్, రాజ్‌ఘాట్, నరేలా, గోపాల్పూర్ ప్రాంతాల్లోని సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయి. విద్యుత్ అంతరాయాల కారణంగా పలు నీటి శుద్ధి ప్లాంట్లు పనిచేయడం లేదు. ఇది తాగునీటి సమస్యకు తీవ్రతరం చేసింది. ఈ నేపధ్యంలో సమస్య పరిష్కారం కోసం కేంద్ర ఇంధన శాఖ మంత్రితో ఢిల్లీ మంత్రి అతిషి భేటీ కానున్నారు. ఈ విషయాన్ని అతిషీ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఖాతాలో తెలిపారు.నీటి ఎద్దడి సమస్యను కూడా అతిషీ దానిలో ప్రస్తావించారు. గత కొన్ని వారాలుగా ఢిల్లీలో తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయని, దీని కారణంగా నీటి వినియోగం పెరిగిందని, హర్యానా నుంచి రావాల్సిన నీరు అంతకంతకూ తగ్గుతోందని, హర్యానాలోని వజీరాబాద్ బ్యారేజీ, మునక్ కెనాల్ నుంచి నీరు రావడం లేదని ఆమె పేర్కొన్నారు. దీనికితోడు ఢిల్లీలోని డబ్ల్యూటీపీలు పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదని కూడా తెలిపారు. -
‘‘ఢిల్లీలో నీటి సంక్షోభానికి బీజేపీ కుట్ర’’
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు మరో రెండు రోజుల గడువు ఉందనగా ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) బీజేపీపై మరో సంచలన ఆరోపణ చేసింది. ఢిల్లీలో నీటి సంక్షోభం సృష్టించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఢిల్లీ జలవనరుల మంత్రి ఆతిషి ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే పక్కన హర్యానాలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఢిల్లీకి నీటి సరఫరాను నిలిపివేసిందన్నారు.‘లోక్‌సభ ఎన్నికలు ప్రకటించగానే మా పార్టీ చీఫ్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. ఆయన ప్రచారం కోసం మధ్యంతర బెయిల్‌పై రాగానే వెంటనే స్వాతిమలివాల్‌పై దాడి అనే కుట్రకు తెర తీశారు. ఇది కూడా వర్కవుట్ కాకపోవడంతో విదేశీ నిధులు వచ్చాయన్న పాత ఆరోపణలను మళ్లీ తవ్వారు. ఇప్పుడు తాజాగా హర్యానాలో ఉన్న ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు ఢిల్లీకి యమునా నది నీళ్లు ఆపివేశారు’అని ఆతిషి ఫైర్ అయ్యారు. ఢిల్లీలో మే25న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. -
బీజేపీని కూలదోస్తాం: దుష్యంత్ చౌతాలా!
ఒకవైపు దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండగా, మరోవైపు హర్యానా అసెంబ్లీలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. హర్యానాలోని నయాబ్ సైనీ ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరిస్తూ, కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు.జననాయక్ జనతా పార్టీ అధినేత, హర్యానా మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా కూడా బీజేపీకి ఎదురు తిరిగి, కాంగ్రెస్‌కు తమ మద్దతు ప్రకటించారు. బలపరీక్ష జరిగితే రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తమ ఎమ్మెల్యేలు మద్దతిస్తారని దుష్యంత్ వెల్లడించారు.రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో ఉందని జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బయటి నుంచి మద్దతిస్తామన్నారు. అయితే కాంగ్రెస్ ఈ విషయంలో ఏమి ఆలోచిస్తున్నదో చూడాలన్నారు. విప్‌కు అధికారం ఉన్నంత వరకు ఆయన ఆదేశాల మేరకు అందరూ ఓటు వేయాల్సిందేనన్నారు. అయితే అటు కాంగ్రెస్‌తో గానీ, ఇటు బీజేపీతో గానీ వెళ్లాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. -
మంగళూరులో దాహం.. దాహం!
కర్నాటకలోని మంగళూరు ప్రజలు తాగునీటి ఎద్దడితో విలవిలలాడిపోతున్నారు. ఈ ప్రాంతానికి ప్రధాన నీటి వనరు అయిన నేత్రావతి నదిలో ఎక్కువ భాగం ఎండిపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురయ్యింది. దీంతో మంగళూరు మునిసిపల్ కార్పొరేషన్ సిటీలో రోజు విడిచి రోజు వారీగా నీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది.దక్షిణ కన్నడ జిల్లా డిప్యూటీ కమిషనర్ ముల్లై ముహిలన్ అధ్యక్షతన జరిగిన మంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఇతర అనుబంధ శాఖల అధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి తోడు పట్టణ ప్రజలు నీటిని దుర్వినియోగం చేయకూడదని, గృహ అవసరాల కోసం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం నీటిని వృథా చేయవద్దని అధికారులు కోరారు.గత ఐదేళ్లలో తొలిసారిగా మంగళూరు నగరం ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. నైరుతి రుతుపవనాలు సకాలంలో వస్తే నీటి ఎద్దడి సమస్య తీరుతుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. కర్నాటకలోని బెంగళూరు నగరం కూడా నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపధ్యంలో బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ఇటీవలే నగరంలోని స్విమ్మింగ్ పూల్స్‌లో తాగునీటి వినియోగాన్ని నిషేధించింది. దీనిని ఉల్లంఘిస్తే రూ. ఐదువేలు జరిమానా విధిస్తామని బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. -
ఏప్రిల్‌లోనే ఎండిపోయిన నది.. 25 వేల జనాభా విలవిల!
దేశంలోని పలు రాష్ట్రాల్లో వేసవి విజృంభిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని రామానుజ్‌గంజ్ ప్రాంతంలోని 25 వేల జనాభాకు నీటిని అందించే కన్హర్ నది ఏప్రిల్‌లోనే ఎండిపోయింది. దీంతో నదిలో ఒక పెద్ద గొయ్యి తవ్వి అక్కడి జనాభాకు నగర పంచాయతీ నీటిని అందిస్తోంది. రామానుజ్‌గంజ్ ప్రాంతానికి సరిపడా తాగునీటిని అందించేందుకు జలవనరుల శాఖ కోట్లాది రూపాయలతో నదిపై ఆనకట్టను నిర్మించేందుకు సన్నాహాలు చేసింది. అయితే అధికారుల అవినీతి కారణంగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి.ఎంతకాలం ఎదురు చూసినా ఆనకట్ట నిర్మాణానికి నోచుకోకపోవడంతో రామానుజ్‌గంజ్‌వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురాతన ఆనకట్టను తొలగించి, నూతన నిర్మాణం చేపడితేనే నగరానికి సరిపడా నీరు అందుతుందని స్థానికులు అంటున్నారు.ఈ నది ఎండిపోవడంతో స్థానికులతో పాటు ఈ నదిపై ఆధారపడిన జంతువులు, పక్షులు సైతం విలవిలలాడిపోతున్నాయి. దీనిని గుర్తించిన జిల్లా యంత్రాంగం, నగరపంచాయతీ స్థానికులకు తాగు నీటిని అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. -
హిమాచల్‌లో మళ్లీ కాంగ్రెస్ అలర్ట్.. సీన్లోకి విక్రమాదిత్య
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో అధికార కాంగ్రెస్‌లో ముసలం ఇంకా ముగియలేదనే సంకేతాలు అందుతున్నాయి. రెబల్ ఎమ్మెల్యేలకు మరికొందరు తోడవుతున్నట్లు సమాచారం. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ మరింత జాగ్రత్త పడింది. ప్రభుత్వం కుప్పకూలిపోయే అవకాశాలు పూర్తిగా పోయేంతవరకు అప్రమత్తత అవసరమని ఆ పార్టీ భావిస్తోంది. ఈ తరుణంలో మంత్రి విక్రమాదిత్య సింగ్‌ను రంగంలోకి దించింది. . రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ ఆరుగురు ఎమ్మెల్యేలపై హిమాచల్ ప్రదేశ్ స్పీకర్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాళ్లంతా హర్యానా(బీజేపీ పాలిత రాష్ట్రం) పంచకుల్లాలో మకాం వేశారు. స్పీకర్ నిర్ణయాన్ని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో సవాల్ చేశారు వాళ్లంతా. ఈ క్రమంలో.. ఆ రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ ఆ ఆరుగురిని కలవడం అక్కడి రాజకీయాలను ఆసక్తికరంగా మార్చేసింది. మాజీ ముఖ్యమంత్రి అయిన విదర్భ సింగ్(దివంగత) కుమారుడు విక్రమాదిత్య సింగ్.. హిమాచల్ కేబినెట్లో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లో విక్రమాదిత్య క్రాస్ ఓటింగ్‌కు పాల్పడకపోయినప్పటికీ.. అదేరోజు భావోద్వేగపూరితంగా మీడియా ముందుకు వచ్చారు. తన తండ్రిని కాంగ్రెస్ తీవ్రంగా అవమానిస్తోందని చెబుతూనే.. బీజేపీతో పోరాటే శక్తి కాంగ్రెస్‌కు లేదంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే పార్టీకి, పదవికి సైతం ఆయన రాజీనామా చేశారు. అయితే హైకమాండ్ జోక్యంతో సాయంత్రానికి ఆయన చల్లబడ్డారు. తన రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇలాంటి సంక్షోభ సమయంలో తాను పార్టీని వీడొద్దని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఇక.. ఈ ఉదయం రెండ్రోజుల ఢిల్లీ పర్యటనకు బయల్దేరిన విక్రమాదిత్య.. మార్గం మధ్యలో ఆ ఆరుగురు రెబల్ ఎమ్మెల్యేలను కలుసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఢిల్లీ పర్యటన ముగిశాక తిరుగు ప్రయాణంలోనూ ఆయన మరోసారి వాళ్లతో భేటీ అవుతారని సమాచారం. ఇదిలా ఉంటే.. ఆరుగురు రెబల్స్‌కు మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సంఖ్య మరింత పెరగకమునుపే.. విక్రమాదిత్యను సీన్లోకి దించి మంతనాలు జరిపిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. అవునా.. నాకు తెలియదు! ఇదిలా ఉంటే.. రెబల్స్‌ను విక్రమాదిత్యసింగ్ కలిసినట్లు వస్తున్న వార్తలపై ఆయన తల్లి, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ స్పందించారు. ఓ జాతీయ మీడియా సంస్థతో ఆమె మాట్లాడుతూ.. తన కుమారుడి పర్యటన షెడ్యూల్ వివరాలు తనకి తెలియవని అన్నారు. గత రాత్రి తను(విక్రమాదిత్య) ఇక్కడే ఉన్నాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాడో నాకు తెలియదు అని అంటున్నారామె. అయితే ఎప్పటికప్పుడు పరిణామాలను మాత్రం హైకమాండ్‌కు తాము నివేదిస్తామని చెప్పారామె. ఇక ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంతో మొదటి నుంచి అసంతృప్తిగా ఉంటోంది వీరభద్ర సింగ్ కుటుంబం. తాజా సంక్షోభం నేపథ్యంలో.. మరోసారి ఆ డిమాండ్‌నే అధిష్టానం వద్ద ఉంచినట్లు వినవస్తోంది. అయితే సుఖ్విందర్ సింగ్ సుఖు మాత్రం తాను ఫైటర్ని అని.. తానే ఐదేళ్ల పాటు సీఎంగా ఉంటానని ప్రకటించుకుంటున్నారు. ఆ ఆరుగురికి కాంగ్రెస్ ఆఫర్ అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలను తిరిగి సొంతగూటికి తెచ్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. సుధీర్ శర్మ, రవి ఠాకూర్, రాజిందర్ రాణా, ఇందర్ దత్, చేతన్య శర్మ, దేవిందర్ కుమార్‌తో చర్చలు జరిపే బాధ్యతను మంత్రి విక్రమాదిత్యకు అప్పగించింది. పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటే.. అనర్హత వేటు వెనక్కి తీసుకుంటామని హామీ ఇస్తున్నారని హిమాచల్ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. -
ఆరుగురు కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు
హిమాచల్ ప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల అనంతరం నెలకొన్న రాజకీయ గందరగోళం మరో మలుపు తిరిగింది. ఆరుగురు కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దయ్యింది. కాంగ్రెస్ పిటిషన్ నేపధ్యంలో స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా ఈ నిర్ణయం తీసుకున్నారు. ధర్మశాల ఎమ్మెల్యే సుధీర్ శర్మ, సుజన్పూర్ ఎమ్మెల్యే రాజేంద్ర రాణా, కుత్లహర్ ఎమ్మెల్యే దేవేంద్ర భుట్టో, గాగ్రెట్ ఎమ్మెల్యే చైతన్య శర్మ, లాహౌల్ స్పితి ఎమ్మెల్యే రవి ఠాకూర్, బాద్సర్ ఎమ్మెల్యే ఇంద్ర దత్ లఖన్‌పాల్ తదితరులు సభ్యత్వం రద్దయిన ఎమ్మెల్యేల జాబితాలో ఉన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్ ఈ నిర్ణయం తీసుకుని వీరందరినీ అనర్హులుగా ప్రకటించారు. ఈ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎన్నికల అభ్యర్థి హర్ష్ మహాజన్‌కు అనుకూలంగా ఓటు వేశారు. ఈ ఆరుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌ను రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో ఇతర సభ్యులు లేవనెత్తారు. బుధవారం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్‌ను ఆమోదించింది. మరోవైపు భోజన విరామానికి ముందు భారతీయ జనతా పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇది కాకుండా మిగిలిన ఎమ్మెల్యేలు తమ మాట విననందుకు నిరసనగా సభను బహిష్కరించారు. సభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లేకపోవడంతో అధికార పక్షానికి అనుకూలంగా మూజువాణి ఓటుతో బడ్జెట్ ఆమోదం పొందింది. అనంతరం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కార్యకలాపాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు తలెత్తకపోతే, తదుపరి సమావేశాలు జూలై, ఆగస్టులలో వర్షాకాల సమావేశాలుగా ప్రారంభమయ్యే అవకాశముంది. #WATCH | Himachal Pradesh Assembly Speaker Kuldeep Singh Pathania says, "Six MLAs, who contested on Congress symbol, attracted provisions of anti-defection law against themselves...I declare that the six people cease to be members of the Himachal Pradesh Assembly with immediate… pic.twitter.com/QQt92aM10v — ANI (@ANI) February 29, 2024 -
India exports: రెడ్ సీ సవాళ్లున్నా.. ఎగుమతులు రయ్!
న్యూఢిల్లీ: ఎర్ర సముద్రం ప్రాంతంలో అలాగే అంతర్జాతీయంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితులను జనవరిలో భారత్ వస్తు ఎగుమతులు అధిగమించాయి. 2023 జనవరిలో పోలి్చతే 2024 జనవరిలో భారత్ ఎగుమతులు 3.12 శాతం పెరిగాయి. విలువలో 36.92 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక రెండు నెలల క్షీణత అనంతరం జనవరిలో వస్తు దిగుమతులు 3 శాతం పెరిగి 54.41 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 17.49 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గడచిన తొమ్మిది నెలల్లో ఇంత తక్కువ స్థాయి వాణిజ్యలోటు ఇదే తొలిసారి. ఎర్ర సముద్రం సంక్షోభం ఎగుమతిదారులపై ప్రభావం చూపుతోంది. వారు తమ వస్తువులను యూరప్– ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలకు రవాణా చేయడానికి – ఆఫ్రికాను చుడుతూ కేప్ ఆఫ్ గాడ్ హోప్ మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తోంది. దీనితో రవాణా వ్యయం తడిసి మోపెడవుతోంది. సరకు రవాణాలో 14 రోజుల ఆలస్యంతోపాటు బీమా వ్యయాలు కూడా పెరిగాయి. యెమెన్‌కు చెందిన హౌతీ మిలిటెంట్ల దాడుల కారణంగా ఎర్ర సముద్రం– మధ్యధరా సముద్రాన్ని హిందూ మహాసముద్రానికి కలిపే కీలకమైన షిప్పింగ్ మార్గం బాబ్–ఎల్–మండేబ్ జలసంధి చుట్టూ పరిస్థితి తీవ్రరూపం దాలి్చంది. ముఖ్యాంశాలు... ► సమీక్షా నెల జనవరిలో క్రూడ్ ఆయిల్ దిగుమతులు 4.33 శాతం పెరిగి 16.56 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ► పసిడి దిగుమతులు ఏకంగా 174 శాతం పెరిగి 1.9 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 10 నెలల్లో క్షీణత కాగా, ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి వరకూ 10 నెలల కాలంలో ఎగుమతుల విలువ 4.89% క్షీణించి 353.92 బిలియన్ డాలర్లకు పడ్డాయి. దిగుమతులు కూడా 6.71% పడిపోయి 561.12 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి వాణిజ్యలోటు 207.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. మొత్తం దిగుమతుల విలువలో క్రూడ్ ఆయిల్ విలువ 15.91% పడిపోయి 146.75 బిలియన్ డాలర్లుగా నమోదైంది. పసిడి దిగుమతులు 301.7% పెరిగి 38 బిలియన్ డాలర్లకు చేరాయి. సేవలు..ఓకే ఇదిలాఉండగా, భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో మెజారిటీ వాటా కలిగిన సేవల రంగం జనవరిలో 32.8 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిపింది. 2023లో ఈ విలువ 28 బిలియన్ డాలర్లు. ఇక ఏప్రిల్ నుంచి జనవరి మధ్య ఈ విలువ 267.5 బిలియన్ డాలర్ల నుంచి 284.45 బిలియన్ డాలర్లకు ఎగసింది. -
తాగునీటి కష్టాలకు కారణం కేసీఆరే..
నల్లగొండ: ‘‘మాజీ సీఎం కేసీఆర్ కృష్ణా ప్రాజెక్టులను బీజేపీకి తాకట్టు పెట్టారు. పైగా రేవంత్‌రెడ్డే కేంద్రానికి అప్పగించారని ఉల్టా మాట్లాడుతున్నారు. దీనిపై నల్లగొండలో సభ పెడతామంటున్నారు. కేసీఆర్ నల్లగొండకు ఎలా వస్తారో చూస్తాం. కేసీఆర్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే ఆయన మిలటరీని పెట్టుకుని వచ్చినా నల్లగొండ ప్రజలు తరిమికొడతారు’’ అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. నల్లగొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ (శ్రీశైలం సొరంగమార్గం), డిండి లిఫ్ట్, లోలెవెల్ కెనాల్ ప్రాజెక్టులను పక్కనబెట్టి దక్షిణ తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేశారని వెంకట్‌రెడ్డి ఆరోపించారు. వైఎస్సార్ హయాంలో ఎస్ఎల్బీసీ మంజూరు చేస్తే.. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని.. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు సాగు, తాగునీటి ఎద్దడి ఏర్పడిందని మండిపడ్డారు. తన బిడ్డ కవిత లిక్కర్ కేసులో జైలుకు పోకుండా ఉండేందుకు కేసీఆర్ బీజేపీకి తలొగ్గి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించారని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో కుమ్మక్కై ఏపీ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు సహకరించి తెలంగాణకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. కేసీఆర్ పారిపోయేలా ఉన్నారు! కమీషన్ల కోసం చేసిన ప్రాజెక్టుల వల్లే జార్ఖండ్ ముఖ్యమంత్రి అరెస్టు అయ్యారని.. కేజ్రీవాల్‌ను కూడా అరెస్టు చేస్తారంటున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. తాను జైలుకు పోవాల్సి వస్తుందనే భయంతోనే కేంద్రం ఏం చెబితే కేసీఆర్ అది చేశారని ఆరోపించారు. ‘‘పులి వస్తోందని హరీశ్‌రావు అంటున్నారు. పులి లేదు, గిలి లేదు. మూటాముల్లె సర్దుకుని పోవాల్సిందే. కేసీఆర్ ఓడిపోయినా ప్రైవేటు స్పెషల్ ఫ్లైట్‌ను ఇంకా ఎందుకు రద్దు చేసుకోలేదు? కవిత లిక్కర్ కేసు సమయంలో అద్దెకు తీసుకుని, మాజీ సీఎం అయినా దాన్ని అలానే ఉంచారంటే ఏ రాత్రి అయినా అరెస్టు చేస్తామంటే.. ఠక్కున ఫ్యామిలీ అంతా పారిపోయేందుకు స్పెషల్ ఫ్లైట్‌ను సిద్ధంగా ఉంచుకున్నారు. దుబాయ్ వెళ్లిపోతే ఎవరూ అరెస్టు చేయరనేది వారి ఉద్దేశం..’’ అని వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. మేడిగడ్డ విషయంలో కేసు నమోదవడం, కేసీఆర్, హరీశ్‌రావు అరెస్టవడం ఖాయమని పేర్కొన్నారు. హంతకుడికి మంత్రి పదవి ఇచ్చారు నల్లగొండ జిల్లాకు చెందిన హంతకుడికి కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారని.. ఆ మంత్రి అవినీతికి పాల్పడ్డారే తప్ప ఏనాడూ ప్రాజెక్టులను సందర్శించలేదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని ఉద్దేశించి వెంకట్‌రెడ్డి ఆరోపణలు చేశారు. రెండు పూటలా తిండికి లేని వ్యక్తి మంత్రి అయ్యాక దోపిడీకి పాల్పడ్డాడని, యాదాద్రి పవర్ ప్లాంట్‌లో దోచుకున్నాడని వ్యాఖ్యానించారు. ఆ అవినీతిపై విచారణ చేయిస్తున్నామని, ఆయన జైలుకుపోక తప్పదని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అంతా అవినీతేనని, హెచ్ఎండీఏ కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి దగ్గరే వెయ్యి కోట్లు దొరికాయంటే పరిస్థితేమిటో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. -
ఆ వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై వస్తున్న సంక్షోభ వార్తలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే, కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు వెంటనే చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గత పది సంవత్సరాల్లో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎంతగానో అభివృద్ధి చెందింది. ఎంతో నైపుణ్యం కలిగిన పవర్లూమ్ నేతన్నలు, అభివృద్ధి చెందడమే కాకుండా తమ కార్యకలాపాలను విస్తరించారు. గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సహకారమే ఇందుకు ప్రధాన కారణమని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పవర్ లూమ్ వస్త్ర పరిశ్రమకు అండగా నిలవాలి. గత ప్రభుత్వం ప్రారంభించిన వివిధ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఈ పరిశ్రమ బలోపేతానికి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ సహకారం ఉంటే తమిళనాడులో ఉన్న తిరుపూర్ వస్త్ర పరిశ్రమతో సమానంగా పోటీ పడగలిగే అవకాశాలు ఈ రంగానికి ఉన్నాయి. అయితే ఈ రంగానికి సంబంధించి గత 15 రోజులుగా వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఈ పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: కవిత రానంది.. ఈడీ యాక్షన్ ఎలా ఉండనుందో? -
ఆధునిక మగ్గాలు ఆగాయి
సిరిసిల్ల: ఒకవైపు మార్కెట్లో బట్టకు సరైన ధర లేదు...మరోవైపు వ్రస్తోత్పత్తి నిల్వలు పేరుకుపోయాయి. దీంతో సిరిసిల్లలోని టెక్స్‌టైల్‌పార్క్ పరిశ్రమలను యజమానులు మంగళవారం మూసివేశారు. దీంతో నేత కార్మికులకు ఉపాధి కరువైంది. టెక్స్టైల్ పార్క్‌లో మాంద్యం(సంక్షోభం) కారణంగా వస్త్రోత్పత్తి గిట్టుబాటు కావడం లేదని వ్రస్తోత్పత్తిదారులు పేర్కొంటున్నారు. ఆధునిక మగ్గాలను నిరవధికంగా బంద్ పెట్టడంతో అక్కడ పనిచేసే వెయ్యి మంది నేత కార్మికులు రోడ్డునపడ్డారు. వేలాదిమంది నేతన్నలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో వరంగల్‌లో చేపట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పునాదుల్లో ఉండగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాముందే నిర్మించిన సిరిసిల్ల తొలి టెక్స్టైల్ పార్క్ ఇప్పుడు సంక్షోభంతో మూతపడింది. సిరిసిల్లలో కార్మికులు కూలి పెంచాలని సమ్మెకు దిగడం సహజం. కానీ పరిశ్రమల యజమానులే కార్ఖానాలను మూసి వేసి బట్ట గిట్టుబాటు కావడం లేదని వ్రస్తోత్పత్తిని నిలిపివేయడం టెక్స్టైల్ రంగంలో సంక్షోభానికి అద్దం పడుతోంది. ఉపాధి లక్ష్యంగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులో 65 ఎకరాల్లో 2003లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేశారు. 7,000 మంది కార్మికులకు ఉపాధి లక్ష్యంగా దీనిని నెలకొల్పారు. 20 ఏళ్లుగా కేవలం గరిష్టంగా 2వేల మందికి పని కల్పించింది. టెక్స్టైల్ పార్క్‌లో 113 యూనిట్లు ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 65కు పడిపోయింది. 800 ఆధునిక ర్యాపియర్ లూమ్స్‌పై వస్త్రోత్పత్తి జరుగుతోంది. సంక్షోభం కారణంగా 40 మంది యూనిట్ల యజమానులు ఆధునిక ర్యాపియర్స్ లూమ్స్‌ను అమ్మేసుకున్నారు. విద్యుత్ చార్జీలూ భారమే టెక్స్టైల్ పార్క్‌లోని యూనిట్లకు విద్యుత్ చార్జీలు భారంగా మారాయి. వ్రస్తోత్పత్తిదారులకు యూనిట్ కరెంట్ ధర రూ.7.50 ఉంది. అదే మహారాష్ట్రలో యూనిట్ విద్యుత్ చార్జీలు రూ.3 ఉంది. తమిళనాడులో 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తుండగా, అంతకు మించి వినియోగిస్తే ప్రతి యూనిట్‌కు రూ.2.50 ఉంది. పొరుగు రాష్ట్రాల్లో విద్యుత్ టారిఫ్ రేట్లు తక్కువగా ఉండగా, సిరిసిల్లలో ఎక్కువగా ఉండడంతో పొరుగు రాష్ట్రాలతో సిరిసిల్ల వ్యాపారులు పోటీ పడలేకపోతున్నారు. ఇటీవల నూలు రేట్లు బాగా పెరగడం, రవాణా చార్జీలు ఎక్కువ కావడంతో వ్రస్తోత్పత్తి వ్యయం కూడా పెరిగింది. ఒక్కో మీటరు బట్ట నాణ్యతను బట్టి రూ.18 నుంచి రూ.70 వరకు అమ్ముతుంటారు. అయితే ప్రస్తుతం బట్టకు మార్కెట్లో ధర లేక నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ప్రస్తుతం పార్క్‌లోని యూనిట్లలో కోటి మీటర్ల బట్టల నిల్వలు ఉన్నాయి. దీంతో టెక్స్టైల్ పార్క్‌లో పరిశ్రమలను నిరవధికంగా మూసివేశారు. నెలకు రూ.12వేలు వచ్చేవి పనిచేసిన రోజు రూ.400 నుంచి రూ.500 ఇచ్చేవారు. అంతా కలిపి నెలకు రూ.12వేలు వరకు ఉండేది. ఇప్పుడు పార్క్ మూసివేయడంతో మాకు పని లేకుండాపోయింది. మళ్లీ కార్ఖానాలు తెరిచే దాకా పని ఉండదు. పని చేయకుంటే ఇల్లు గడవదు. – గాజుల మల్లేశం, నేతకార్మికుడు టెక్స్టైల్ రంగం సంక్షోభంలో ఉంది మా కార్ఖానాల్లో బట్టల నిల్వలు పేరుకుపోయాయి. బట్ట ఉత్పత్తి వ్యయం కూడా ఎక్కువ అయ్యింది. ఆ మేరకు బట్టకు ధర లేక ఇబ్బందిగా ఉంది. ధర తగ్గించి అమ్మే పరిస్థితి ఏర్పడింది. నష్టాలను భరిస్తూ వ్రస్తోత్పత్తి చేయలేక యూనిట్లు మూసివే యాలని నిర్ణయం తీసుకున్నాం. –అన్నల్దాస్ అనిల్‌కుమార్, పార్క్ అసోసియేషన్ అధ్యక్షుడు -
కృత్రిమ మేధ దుర్వినియోగంతో పెను సంక్షోభం
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ(ఏఐ) దుర్వినియోగం అవుతుండడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. డీప్‌ఫేక్ వీడియోలు, చిత్రాలు సృష్టించడానికి కృత్రిమ మేధను వాడుకుంటున్నారని, ఇదొక పెను సంక్షోభానికి దారి తీస్తోందని హెచ్చరించారు. ఏఐ దుర్వినియోగం, దాని ప్రభావంపై ప్రజల్లో చైతన్యం పెంచాలని చేయాలని ప్రసార మాధ్యమాలకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ‘దివాళీ మిలన్’ సందర్భంగా ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. గార్బా వేడుకలో తాను పాట పాడుతున్నట్లు ఇటీవల ఓ ఫేక్ వీడియోను గుర్తు తెలియని వ్యక్తులు సృష్టించారని, ఓ అభిమాని తనకు ఆ వీడియోను పంపించాడని తెలిపారు. నిజానికి పాఠశాల రోజుల నుంచి తాను ఏనాడూ పాట పాడలేదని నవ్వుతూ చెప్పారు. వైవిధ్యంతో కూడిన మన సమాజంలో డీప్‌ఫేక్‌లు పెద్ద ప్రమాదానికి కారణమవుతాయని అన్నారు. ఏఐ పరిజ్ఞానంతో డీప్‌ఫేక్‌ల సృష్టి వల్ల కొత్త సంక్షోభం తెరపైకి వస్తోందని వెల్లడించారు. సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్న వీడియోలు నిజమో కాదో తేల్చుకునే వ్యవస్థ ప్రజలందరికీ అందుబాటులో లేదని పేర్కొన్నారు. ‘వోకల్ ఫర్ లోకల్’కు ప్రజల మద్దతు వివాదాస్పద దృశ్యాలు, సంభాషణలు ఉన్న చలనచిత్రాలు గతంలో వస్తే కొద్దిరోజుల్లోనే ఆ రగడ చల్లారేదని గుర్తుచేశారు. ఇప్పుడు మాత్రం అలాంటి చిత్రాలను సమాజంలోని కొన్ని వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని, పెద్ద వివాదంగా మారుస్తున్నాయని, భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఆ చిత్రాలు పరాజయం పాలవుతున్నాయని చెప్పారు. సిగరెట్ పెట్టెలపై ఆరోగ్యపరమైన హెచ్చరికలు ఉన్నట్లుగానే డీప్‌ఫేక్ వీడియోలపైనా అలాంటి హెచ్చరికలు ఉంటే బాగుంటుందని మోదీ అభిప్రాయపడ్డారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ తన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఇది కేవలం నోటిమాట కాదని, క్షేత్రస్థాయిలో జరగబోయే వాస్తవమని స్పష్టం చేశారు. ‘వోకల్ ఫర్ లోకల్’ ప్రచారానికి జనం సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని వ్యక్తం చేశారు. దీపావళి పండుగ సమయంలో దేశంలో రూ.4.5 లక్షల కోట్ల విలువైన వ్యాపారం జరిగిందని తెలిపారు. కోవిడ్–19 ముప్పు తొలగిపోవడంతో ప్రజలు ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకున్నారని చెప్పారు. సాధారణ ప్రజల మరణాలను ఖండిస్తున్నాం ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంపై మోదీ ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో సాధారణ ప్రజలు మరణించడాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పశి్చమాసియాలో చోటుచేసుకుంటున్న పరిణా మాలు ప్రపంచానికి కొత్త సవాళ్లను విసురుతున్నాయని తెలిపారు. ఇలాంటి తరుణంలో ప్రపంచ మానవాళి క్షేమం కోసం గ్లోబల్ సౌత్ దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం కేంద్రం వర్చువల్‌గా నిర్వహించిన ‘వాయిస్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్’ రెండో ఎడిషన్ శిఖరాగ్ర సదస్సులో మోదీ మాట్లాడారు. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో సాధారణ ప్రజలు చనిపోతుండడం బాధాకరమని చెప్పారు. చర్చలు, దౌత్య మార్గాల్లో వివాదాలను పరిష్కరించుకోవాలన్నారు. 21వ శతాబ్దంలో మార్పులకు లోనవుతున్న ప్రపంచాన్ని ‘వాయిస్ ఆఫ్ ద గ్లోబల్’ వేదిక ప్రతిబింబిస్తోందన్నారు. ఐదు ‘సీ’లు.. కన్సల్టేషన్, కమ్యూనికేషన్, కో–ఆపరేషన్, క్రియేటివిటీ, కెపాసిటీ బిల్డింగ్ అనే ఫ్రేమ్‌వర్క్ కింద గ్లోబల్ సౌత్ దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. -
Israel-Hamas War: అదే గాజా.. అదే దీన గాథ!
దెయిర్ అల్ బలాహా/ఖాన్ యూనిస్ (గాజా): అదే కల్లోలం. అవే దారుణ దృశ్యాలు. అందరి కంటా నిస్సహాయంగా నీటి ధారలు. ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల ధాటికి గాజాలో మానవీయ సంక్షోభం తీవ్రతరమవుతోంది. ముఖ్యంగా ఆస్పత్రుల్లో ఎటు చూసినా మరణమృదంగం ప్రతిధ్వనిస్తోంది. గాజాలోని దాదాపు అన్ని ఆస్పత్రులనూ ఇజ్రాయెల్ సైన్యం చుట్టుముట్టి రోజుల తరబడి దిగ్బంధించడం తెలిసిందే. దాంతో కరెంటుతో పాటు కనీస సౌకర్యాలన్నీ దూరమై అవి నరకం చవిచూస్తున్నాయి. ఐసీయూలు, ఇంక్యుబేటర్లకు కూడా కరెంటు, ఆక్సిజన్ రోజులు దాటింది. వాటిల్లోని రోగులు, నవజాత శిశువులు నిస్సహాయంగా మృత్యువు కోసం ఎదురు చూస్తున్నారు! ఇప్పటిదాకా అరచేతులు అడ్డుపెట్టి అతి కష్టమ్మీద వారి ప్రాణాలు నిలుపుతూ వచ్చిన వైద్యులు కూడా క్రమంగా చేతులెత్తేస్తున్నారు. గాజాలో అతి పెద్దదైన అల్ షిఫాతో పాటు అన్ని ఆస్పత్రుల్లోనూ ఇదే దుస్థితి! షిఫా ఇంకెంతమాత్రమూ ఆస్పత్రిగా మిగల్లేదంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదనోం గేబ్రెయేసస్ వాపోయారు. ‘‘ఈ దారుణంపై ప్రపంచం మౌనం వీడాల్సిన సమయమిది. కాల్పుల విరమణ తక్షణావసరం’’ అని పిలుపునిచ్చారు. చిన్నారులను కాపాడేందుకు... ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ నవజాత శిశువులను కాపాడుకునేందుకు అల్ షిఫా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది శాయశక్తులా ప్రయత్నిస్తున్న తీరు కంటతడి పెట్టిస్తున్నాయి. ఆక్సిజన్ సరఫరా తదితరాలన్నీ నిలిచిపోవడంతో చిన్నారులను ఇంక్యుబేటర్ల నుంచి తీసుకెళ్లి సిల్వర్ ఫాయిల్ తదితరాల్లో చుట్టబెట్టిన మంచాలపై ఒక్కచోటే పడుకోబెడుతున్నారు. పక్కన వేడినీటిని ఉంచి శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంధన రగడ ఇంక్యుబేటర్లను నడిపి చిన్నారులను కాపాడేందుకు అల్ షిఫా ఆస్పత్రికి 300 లీటర్ల ఇంధనం అందజేస్తే హమాస్ ఉగ్రవాదులు అడ్డుకున్నారని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపించింది. కానీ అరగంటకు కూడా చాలని ఆ సాయంతో ఏం ప్రయోజనమని పాలస్తీనా ఆరోగ్య శాఖ మండిపడింది. ఇది క్రూర పరిహాసమంటూ దుయ్యబట్టింది. అల్ రంటిసి, అల్ నస్ర్ ఉత్తర గాజాలోని ఈ ఆస్పత్రుల నుంచి రోగులు తదితరులను హుటాహుటిన ఖాళీ చేయిస్తున్నారు. శుక్రవారానికే కొద్దిమంది రోగులు, వైద్య సిబ్బంది మినహా ఇవి దాదాపుగా ఖాళీ అయిపోయాయి. అయితే వాటిలో సాధారణ పౌరులు వందలాదిగా తలదాచుకుంటున్నారు. ఇజ్రాయెల్ సైన్యం వీటిని పూర్తిగా తమ అదుపులోకి తీసుకుని వారందరినీ అక్కడినుంచి పంపించేస్తోంది. అల్ స్వెయిదీ లోపల కొద్ది మంది రోగులు, వైద్య సిబ్బంది ఉన్నారు. 500 మందికి పైగా శరణార్థులు తలదాచుకుంటున్నారు. శనివారం నాటి రాకెట్ దాడి ఆస్పత్రిని దాదాపుగా నేలమట్టం చేసింది. ఆదివారం రాత్రికల్లా ఇజ్రాయెల్ సైనికులు ఆస్పత్రిలోకి ప్రవేశించారు. ఇంకా మిగిలిన ఉన్న వారందరినీ ఖాళీ చేయించి బుల్డోజర్లతో ఆస్పత్రిని నేలమట్టం చేయించారు. అల్ షిఫా 700 పడకలతో గాజాలోనే అతి పెద్ద ఆస్పత్రి. కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ సైన్యం పూర్తిస్థాయిలో చుట్టుముట్టింది. దాంతో వైద్య సేవలన్నీ నిలిచిపోయాయి. కరెంటు లేదు. ఇంధనం, ఆహార సరఫరాలు తదితరాలన్నీ నిండుకున్నాయి. ఇక్కడ తలదాచుకున్న శరణార్థుల్లో అత్యధికులు పారిపోయారు. ఇంకో 2,500 మందికి పైగా ఆస్పత్రిలో ఉన్నట్టు సమాచారం. కానీ 20 వేలకు పైగా అక్కడ చిక్కుబడ్డట్టు పాలస్తీనా ఆరోగ్య శాఖ చెబుతోంది. 600 మందికి పైగా రోగులు, 500 మంది దాకా వైద్యులు, సిబ్బంది ఉన్నారు. వందలాది శవాలు ఆస్పత్రి ప్రాంగణంలో పడున్నట్టు చెబుతున్నారు! ఆది, సోమవారాల్లోనే 35 మంది రోగులు, ఐదుగురు చిన్నారులు చనిపోయినట్టు పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 36 మంది చిన్నారులు ఏ క్షణమైనా తుది శ్వాస విడిచేలా ఉన్నట్టు వైద్య వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది. అల్ ఖుద్స్ గాజాలో రెండో అతి పెద్ద ఆస్పత్రి. 500 మందికి పైగా రోగులు, 15 వేలకు పైగా శరణార్థులున్నారు. వీరిలో అత్యధికులు మహిళలే. ఆదివారానికే ఆస్పత్రిలో సేవలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. ఆహార నిల్వలన్నీ నిండుకున్నాయి. పరిసరాల్లోనే గాక ఆస్పత్రిపైకి కూడా భారీగా కాల్పులు జరుగుతున్నాయి. దాంతో ఇక్కడి ఐసీయూ వార్డు రోగులు ఒకట్రెండు రోజుల్లో నిస్సహాయంగా మృత్యువాత పడేలా ఉన్నారు! 6,000 మందికి పైగా శరణార్థులను ఇక్కణ్నుంచి దక్షిణాదికి పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అల్ అక్సా ఇక్కడ కూడా వందల సంఖ్యలో రోగులు, వైద్య సిబ్బంది, శరణార్థులున్నారు. రోగుల, ముఖ్యంగా 100 మందికి పైగా ఉన్న నవజాత శిశువుల సామూహిక మరణాలకు ఇంకెంతో సమయం పట్టదని సిబ్బంది చెబుతున్నారు. తూటాలు తరచూ ఆస్పత్రి లోనికి దూసుకొస్తున్నాయంటున్నారు. ఆస్పత్రిని సైన్యం చుట్టుముట్టింది. -
Israel-Hamas War: గాల్లో వేలాది ప్రాణాలు!
దెయిర్ అల్‌బలాహ్ (గాజా): గాజాలో మానవీయ సంక్షోభం క్రమంగా తీవ్ర రూపు దాలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు ఆస్పత్రుల ముంగిట్లోకి చేరడంతో పరిస్థితి దారుణంగా దిగజారుతోంది. ఇజ్రాయెల్ అష్టదిగ్బంధం దెబ్బకు కనీస సౌకర్యాలన్నీ నిలిచిపోవడంతో గాజాలో 20 ఆస్పత్రులు ఇప్పటికే పూర్తిగా స్తంభించిపోయాయి. మిగిలిన 15 ఆస్పత్రులూ అదే బాటన ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. కరెంటు సరఫరా లేక ప్రధాన ఆస్పత్రి అల్ షిఫాలో తశనివారం వైద్య పరికరాలన్నీ మూగవోయాయి. దాంతో వైద్య సేవలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. అల్ ఖుద్స్ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి. ఆ ఆస్పత్రికి ఏకంగా 20 మీటర్ల సమీపం దాకా సైన్యం చొచ్చుకొచి్చందని తెలుస్తోంది! దాంతో అందులోని 14 వేల మంది రోగులు, శరణార్థుల ప్రాణాల్లో గాల్లో దీపంగా మారాయి. విరామం లేకుండా దూసుకొస్తున్న తూటాలు, బాంబు వర్షం కారణంగా అల్ షిఫా ఆస్పత్రిలోని వేలాది మంది కూడా ప్రాణ భయంతో వణికిపోతున్నారు. అందులో 1,500 మందికి పైగా రోగులు, అంతే సంఖ్యలో వైద్య సిబ్బంది, 15 వేలకు పైగా శరణార్థులున్నట్టు చెబుతున్నారు. వైద్య సేవలతో పాటు కరెంటు, ఆక్సిజన్ సరఫరాలు పూర్తిగా నిలిచిపోవడంతో పలు ఆస్పత్రుల్లో ఐసీయూల్లోని రోగులు, ఇంక్యుబేటర్లలోని చిన్నారులు నిస్సహాయంగా మృత్యుముఖానికి చేరువవుతున్నారు. ఇలా ఇప్పటికే 200 మందికి పైగా మరణించారని, మరికొన్ని వందల మంది మృత్యువుతో పోరాడుతున్నారని హమాస్ ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది! ఈ పరిణామాలపై అంతర్జాతీయ సమాజం గగ్గోలు పెడుతున్నా ఇజ్రాయెల్ మాత్రం దాడులాపేందుకు ససేమిరా అంటోంది. కనీసం వాటికి విరామమిచ్చేందుకు కూడా ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మరోసారి నిరాకరించారు. షిఫా.. శిథిల చిత్రం అల్ షిఫా ఆస్పత్రిలో తాగునీటితో పాటు ఆహార పదార్థాలు కూడా పూర్తిగా నిండుకున్నాయి. దాంతో వైద్యంతో సహా ఏ సేవలూ అందక రోగులు నిస్సహాయంగా మృత్యువాత పడుతున్నారు. శనివారమే 100 మందికి దుర్మరణం పాలైనట్టు హమాస్ పేర్కొంది. వీటికి తోడు ఐసీయూ విభాగంపై బాంబు దాడి జరిగింది. ఆస్పత్రిని ఇజ్రాయెల్ సైన్యం అన్నివైపుల నుంచీ దిగ్బంధించింది. అక్కడ హమాస్ ఉగ్రవాదులతో భీకరంగా పోరాడుతున్నట్టు ప్రకటించింది. ఆస్పత్రి ప్రాంగణంతో పాటు పరిసరాలన్నీ బాంబు మోతలతో దద్దరిల్లుతున్నాయి. బాంబు దాడుల్లో రెండు అంబులెన్సులు తునాతునకలయ్యాయి. కనీసం రోగులు, క్షతగాత్రులను ఆస్పత్రి నుంచి మరో చోటికి తరలించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అడుగు కదిపినా స్నైపర్ల తూటాలు దూసుకొస్తున్నట్టు ఆస్పత్రి సిబ్బంది వాపోతున్నారు. ఈ ఆస్పత్రి కిందే ఉగ్రవాద సంస్థ హమాస్ ప్రధాన కార్యాలయముందని ఇజ్రాయెల్ మొదటినుంచీ ఆరోపిస్తుండటం తెలిసిందే. అయితే అంతర్జాతీయ ఖండనల నేపథ్యంలో శనివారం సాయంత్రానికల్లా ఇజ్రాయెల్ మాట మార్చింది. అల్ షిఫా ఆస్పత్రిపై దాడులు జరపడం లేదని, అక్కణ్నుంచి వెళ్లిపోవాలనుకున్న వారికోసం కారిడార్ తెరిచే ఉంచామని చెప్పుకొచ్చింది. దాడుల్లో గాయపడుతున్న రెండు రోజులుగా ప్రధానంగా అల్ అహిల్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. కానీ అక్కడ కూడా మౌలిక సదుపాయాలేవీ లేకపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. కారిడార్లతో పాటు ఎక్కడ పడితే అక్కడ రోగులను నిస్సహాయంగా వదిలేసిన దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి. పడకేసిన వైద్యం గాజా అంతటా వైద్య సేవలు పూర్తిగా పడకేసినట్టేనని అక్కడ సహాయక చర్యలు చేపడుతున్న ఐరాస సంస్థలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ‘‘గాజాలోని మొత్తం 35 ఆస్పత్రులూ చేతులెత్తేసినట్టే. పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది’’ అని అవి చెబుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర గాజాలోని అల్ నస్ర్, అల్ రంటిసి సహా చాలా ఆస్పత్రులు సైనిక దిగ్బంధంలో ఉన్నాయి. దీనికి తోడు గాజావ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యధికం ఎప్పుడో మూతబడ్డాయి. -
జేపీ అసోసియేట్స్ రూ. 4,258 కోట్ల డిఫాల్ట్
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న జేపీ గ్రూప్‌లో ప్రధాన కంపెనీ జైప్రకాష్ అసోసియేట్స్ (జేఏఎల్) రూ. 4,258 కోట్ల రుణాల (అసలు, వడ్డీ) చెల్లింపులో డిఫాల్ట్ అయ్యింది. అసలు కింద రూ. 1,733 కోట్లు, వడ్డీ కింద రూ. 2,525 కోట్ల మొత్తాన్ని అక్టోబర్ 31న చెల్లించాల్సి ఉండగా, చెల్లించలేకపోయినట్లు నియంత్రణ సంస్థకు తెలియజేసింది. నిర్వహణ మూలధనం, టర్మ్ లోన్లు, విదేశీ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్ రూపంలో ఈ మొత్తాన్ని కంపెనీ సేకరించింది. 2037 కల్లా రూ. 29,272 కోట్ల రుణాలు (వడ్డీ సహా) చెల్లించాల్సి ఉండగా, 2023 అక్టోబర్ 31 నాటికి రూ. 4,258 కోట్లను గడువులోగా చెల్లించలేకపోవడంతో బాకీ పడినట్లు సంస్థ వివరించింది. రుణ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా రూ. 18,682 కోట్ల మొత్తాన్ని ప్రతిపాదిత స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)కి బదలాయించనుండటంతో ఆ మేరకు భారం తగ్గనుంది. రుణ భారాన్ని తగ్గించుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జేఏఎల్ పేర్కొంది. -
జమ్ముకశ్మీర్‌పై గాజా ఉద్రిక్తతల ప్రభావం? ఉన్నతాధికారుల అత్యవసర సమావేశం
శ్రీనగర్: ఇజ్రాయెల్- పాలస్తీనా సంస్థ హమాస్ మధ్య యుద్ధం కారణంగా గాజా స్ట్రిప్‌లో సంక్షోభం చోటు చేసుకుంది. దీని ప్రభావం జమ్మూ కాశ్మీర్లో నిరసనలకు దారితీసే ముప్పును మరింతగా పెంచుతోంది. ఈ నేపధ్యంలో తాజాగా శ్రీనగర్‌లోని 15 కార్ప్స్ ప్రధాన కార్యాలయంలో జమ్మూ కాశ్మీర్ ఉన్నతాధికారులు, భద్రతా సంస్థల సమావేశం జరిగింది. భద్రతా ప్రణాళికల గురించి ఈ సమావేశంలో చర్చించామని, రాబోయే రోజుల్లో నిరసనలు తలెత్తితే, వాటిని ఎలా నిరోధించాలనే దానిపై దృష్టి పెట్టామని ఒక సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు. వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం దిశగా సమావేశం జరిగిందని పేర్కొన్నారు. ఈ అత్యున్నత సమావేశంలో విదేశీ ఉగ్రవాదుల పాత్రపై కూడా చర్చ జరిగింది. ఈ ఏడాది జమ్ముకశ్మీర్‌లో హతమైన 46 మంది ఉగ్రవాదుల్లో 37 మంది పాకిస్తానీలేనని అధికారిక సమాచారం. 9 మంది మాత్రమే స్థానికులు ఉన్నారు. జమ్మూకశ్మీర్‌లోని 33 ఏళ్ల ఉగ్రవాద చరిత్రలో స్థానిక ఉగ్రవాదుల కంటే విదేశీ ఉగ్రవాదుల సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువ కావడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. కశ్మీర్ లోయలో ప్రస్తుతం దాదాపు 130 మంది ఉగ్రవాదులు యాక్టివ్‌గా ఉన్నారని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా శ్రీనగర్‌లో జరిగిన ఈ సమావేశానికి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సలహాదారు, ఉత్తర కమాండ్ ఆర్మీ కమాండర్ ఉపేంద్ర ద్వివేది అధ్యక్షత వహించారు. జమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, చినార్ కార్ప్స్ కమాండర్,రాష్ట్ర పరిపాలన, భద్రతా సంస్థల ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: ఎన్నికల బరిలో ‘మిజోరం’ కోటీశ్వరులు -
5 రోజులు.. 15 లక్షల కోట్లు!
ముంబై: మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో దేశీయంగా కీలక సూచీల పతనం కొనసాగుతోంది. స్టాక్స్ అధిక వేల్యుయేషన్స్‌తో ట్రేడవుతుండటం కూడా దీనికి తోడు కావడంతో బుధవారం మార్కెట్లు మరింత క్షీణించి, ఇన్వెస్టర్ల సంపద ఇంకాస్త కరిగిపోయింది. మొత్తంమీద అయిదు రోజుల్లో రూ. 14.60 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది. బుధవారం సెన్సెక్స్ మరో 523 పాయింట్లు తగ్గి 64,049 పాయింట్ల వద్ద, నిఫ్టీ 160 పాయింట్లు క్షీణించి 19,122 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. గత అయిదు సెషన్లలో సెన్సెక్స్ 2,379 పాయింట్లు, నిఫ్టీ 690 పాయింట్లు పతనమయ్యాయి. బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 309,22,136 కోట్లకు తగ్గింది. ‘అంతర్జాతీయంగా సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో మార్కెట్లు వరుసగా అయిదో సెషన్లోనూ క్షీణించాయి. బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్ దీనికి సారథ్యం వహించాయి. దేశీ స్టాక్స్ అధిక వేల్యుయేషన్స్‌లో ట్రేడవుతుండటం, అంతర్జాతీయంగా సంక్షోభం నెలకొనడం తదితర పరిణామాల కారణంగా ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో తమ పెట్టుబడులను తగ్గించుకుంటున్నారు‘ అని కోటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ విభాగం (రిటైల్) హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. లాభాల స్వీకరణ కోసం ఎదురుచూస్తున్న ఇన్వెస్టర్లకు తగిన పరిస్థితులు ఏర్పడటంతో మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తుతున్నట్లు ఈక్విట్రీ సహ వ్యవస్థాపకుడు పవన్ భరాదియా వివరించారు. ఇన్ఫీ 3 శాతం డౌన్.. సెన్సెక్స్‌లో ఇన్ఫీ షేర్లు అత్యధికంగా 2.76 శాతం మేర క్షీణించాయి. భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ మొదలైనవి కూడా నష్టపోయాయి. టాటా స్టీల్, ఎస్బీఐ మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ తదితర స్టాక్స్ లాభపడ్డాయి. టెక్ సూచీ 1.39 శాతం, టెలికం 1.29 శాతం, యుటిలిటీస్ 1.25 శాతం మేర క్షీణించగా మెటల్స్ సూచీ మాత్రమే లాభపడింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) నికరంగా రూ. 4,237 కోట్లు విక్రయించగా, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ) రూ. 3,569 కోట్ల మేర కొనుగోళ్లు జరిపారు. అటు అంతర్జాతీయంగా చూస్తే ఆసియా మార్కెట్లలో టోక్యో, షాంఘై, హాంకాంగ్ లాభపడగా, సియోల్ సూచీలు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు నెగటివ్‌లో ట్రేడయ్యాయి. -
మొసలితో రైతుల వినూత్న నిరసన.. కేటీఆర్ రియాక్షన్ ఇది..!
బెంగళూరు: కర్ణాటకాలో రైతులు వినూత్నంగా నిరసన చేపట్టారు. కరెంటు కోతలు ఎక్కువవుతున్నాయని ఆరోపిస్తూ ఓ మొసలితో స్థానిక సబ్‌స్టేషన్‌కి వచ్చారు. కరెంటు ఇస్తారా..? మొసలిని వదలాలా..? అంటూ రోడ్లపైకి ఎక్కారు. కొల్హార తాలూకా రోణిహాల్ గ్రామానికి చెందిన రైతులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో క్లిప్‌ని బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ షేర్ చేశారు. ముందుంది ముసళ్ల పండగ అంటే ఇదేనేమో..? అంటూ రాసుకొచ్చారు. ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో 😄 https://t.co/oGp0pJhgZV — KTR (@KTRBRS) October 24, 2023 అర్ధరాత్రి దాటిన తర్వాత విద్యుత్ ఇవ్వడంతో పొలాలకు వెళ్లడం ఇబ్బందిగా మారిందని రైతులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి మొసలి పిల్లలు, వన్యప్రాణులు వస్తున్నాయని తెలిపారు. రాత్రి పొలానికి వెళ్లిన సమయంలో దొరికిన మొసలిని ట్రాక్టర్లో సబ్‌స్టేషన్‌కు తీసుకొచ్చి నిరసన వ్యక్తం చేశారు. కాసేపటి తర్వాత కార్యాలయం వద్దకు వచ్చిన అటవీశాఖ సిబ్బంది.. మొసలిని బంధించి సంరక్షణకేంద్రానికి తరలించారు. ఇదీ చదవండి: ఇండోనేషియా రాయబారిగా ఇండో-అమెరికన్.. బైడెన్ కీలక నిర్ణయం -
ఆపరేషన్ అజయ్: భారత్ చేరిన ఐదో విమానం
ఢిల్లీ: ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు చేపట్టిన ఆపరేషన్ అజయ్ నిర్విరామంగా కొనసాగుతోంది. తాజాగా 286 మందితో కూడిన మరో విమానం భారత్ చేరుకుంది. ఇందులో 18 మంది నేపాలీలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. భారత్ తిరిగి వచ్చిన వారు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్న దృశ్యాలను కూడా షేర్ చేశారు. ఇజ్రాయెల్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి A340 విమానం ఆదివారం టెల్ అవీవ్ నగరానికి చేరుకోగానే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని జోర్డాన్‌కు తీసుకెళ్లి సమస్యను పరిష్కరించారు. ఫలితంగా సోమవారం రావాల్సిన విమానం మంగళవారం 286 మందితో ఢిల్లీ చేరుకుంది. ఇందులో 22 మంది కేరళ వాసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వల్ల ఇటు ఇజ్రాయెల్, అటు పాలస్తీనాలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధంతో అంతర్జాతీయ విమాన రాకపోకలు కూడా బంద్ అయ్యాయి. దీంతో స్వదేశానికి భారతీయులను సురక్షితంగా తీసుకురావడానికి కేంద్రం ఆపరేషన్ అజయ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే నాలుగు విమానాల్లో సుమారు 900పైగా మందిని భారత్‌కు తరలించారు. తాజాగా ఐదో విమానం చేరుకుంది. ఇదీ చదవండి: గాజా ఆస్పత్రిపై దాడి.. హమాస్ పనే.. ఇజ్రాయెల్ ఆధారాలు వెల్లడి -
ఐటీ ఉద్యోగాల సంక్షోభం: టెకీలకు నిపుణుల సంచలన హెచ్చరికలు
భారతీయ దిగ్గజ ఐటి కంపెనీలు టీసీఎస్) ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్‌టెక్ ఈ వారం తమ క్యూ2 ఎఫ్వై24 ఫలితాలను ప్రకటించాయి. లాభాలు, ఆదాయాలు కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ ఈ కంపెనీలన్నింటిలో ప్రధాన ట్రెండ్‌లో హెడ్‌కౌంట్ సంఖ్య గణనీయంగా తగ్గడంచర్చకు దారి తీసింది. దీనికి తోడు దాదాపు కొత్త హైరింగ్‌పై ఆశాజనక అంచనాలను ప్రకటించలేదు. ఇదే ఐటీ ఉద్యోగార్థులను కలవరానికి గురిచేస్తోంది. ప్రస్తుత పరిస్థితిపై నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతున్న వారి ఉద్యోగాలపై అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. వీరంతా లేటెస్ట్ టెక్నాలజీ కోర్సులను నేర్చుకోవడంతోపాటు, కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడం మంచిదని సూచిస్తున్నారు. ఒకవైపు ఏఐ విధ్వంసంపై ఆందోళన కొనసాగుతోంది. మరోవైపు జాబ్ మార్కెట్లో అనిశ్చితి వేలాదిమంది లేఆఫ్స్ ఆందోళనలో పడేస్తోంది. ముఖ్యంగా సంక్లిష్ట సమయాల్లో ముందుగా కాంట్రాక్టు ఉద్యోగులపై వేటు పడుతుందని, అత్యధిక రిస్క్ గ్రూపులో వారే ఉంటారని ఇండస్ట్రీ నిపుణుల మాట. (IOC Session తిలకం దిద్ది మరీ స్వాగతం..సర్వం సిద్ధం: నీతా అంబానీ) టీసీఎస్ టీసీఎస్‌లో త్రైమాసిక ప్రాతిపదికన 6,333 మంది ఉద్యోగుల సంఖ్య నికరంగా క్షీణించింది. జూన్ త్రైమాసికంలో 615,318 గా ఉన్న ఉద్యోగుల సంఖ్య,సెప్టెంబర్ 30 నాటికి 608,985 వద్దకు చేరడం గమనార్హం. వార్షిక ప్రాతిపదికన చూస్తే గత ఏడాది 616,171 ఉద్యోగు 7,186 మంది తగ్గిపోయారు. తమ నియామక లక్ష్యాలను రీకాలిబ్రేషన్ చేయడం దీనికి కారణమని కంపెనీ చీఫ్ హెచ్ఆర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. తెలివైన ఫ్రెషర్లను ముందస్తుగా నియమించుకోవడం, సరైన నైపుణ్యాలతో వారికి శిక్షణ ఇవ్వడంలో పెట్టుబడి పెట్టడం అనే తమ వ్యూహం ఫలిస్తోంది. ఆ టాలెంట్ స్ట్రీమ్‌లోకి రావడంతోపాటు తగ్గిన అట్రిషన్‌ను తగ్గించి, స్థూల జోడింపులను రీకాలిబ్రేట్ చేయగలిగా మని ఆయన పేర్కొన్నారు. ఉత్పాదకతను పెంచడం, ప్రాజెక్ట్ ఫలితాలను పెంచడమే లక్ష్యమని లక్కాడ్ వివరించారు. ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ తన హెడ్‌కౌంట్‌లో వరుసగా 7,530 మంది ఉద్యోగులు తగ్గిపోయారు. ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాల ప్రకారం క్రితం త్రైమాసికంలో కంపెనీలో 3,36,294 మందితో పోలిస్తే సెప్టెంబర్ 2023 నాటికి 3,28,764 మంది ఉన్నారు. గత ఏడాది త్రైమాసికంతో పోల్చినా కూడా ఉద్యోగుల సంఖ్య తగ్గింది. క్యాంపస్‌లలో మాస్ రిక్రూటింగ్ డ్రైవ్‌లను నిర్వహించబోని కూడా సీఎఫ్‌వో నిలంజన్ రాయ్ ఫలితాల విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. కంపెనీ గణనీయ మైన బెంచ్ పరిమాణాన్ని కలిగి ఉందన్నారు. గత ఏడాది 50వేల మంది ఫ్రెషర్లను నియమించుకున్నాం, డిమాండ్ కంటే ముందుగానే నియమించుకున్నాం, ముఖ్యమైన ఫ్రెషర్ బెంచ్ ఇంకా ఉందని ఆయన చెప్పారు. (Infosys: షాకింగ్ న్యూస్ చెప్పిన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్!) హెచ్‌సీఎల్‌టెక్ కొత్త నియమాలను ప్రకటించినప్పటికీ హెచ్‌సిఎల్‌టెక్ నికర హెడ్‌కౌంట్ మాత్రం క్షీణించింది. క్యూ1లో కంపెనీ హెడ్‌కౌంట్ 2,506 తగ్గా, Q2 FY 24లో 2,299 తగ్గింది. మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,21,139గా ఉంది. ఈ క్షీణత ఇది వరుసగా రెండో త్రైమాసికం. బెంచ్ లేదా శిక్షణలో ఉన్న ఫ్రెషర్లు ప్రాజెక్ట్‌లలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నందున కంపెనీలో హెడ్‌కౌంట్ తగ్గిందని సీఎండీ విజయకుమార్ వివరించారు.గత 18 నెలల్లో నియమించుకున్న చాలా మంది ఫ్రెషర్లు సిద్ధంగా ఉన్నారు. అందుకే అట్రిషన్‌ను బ్యాక్‌ఫిల్ చేయలేదు. ఈ కారణంగానే సీక్వెన్షియల్ ప్రాతిపదికన 1 శాతం తగ్గిందని చెప్పారు. సెక్టార్ వ్యూ మూడు ప్రధాన ఐటీ కంపెనీలు తమ ఫలితాలను విడుదల చేశాయి.ఫైనాన్షియల్తో పాటు, నియామకాల విషయానికి వస్తే Q2 త్రైమాసికంలో స్వల్పంగా తగ్గాయి.సంవత్సరం క్రితం త్రైమాసికంలో టీసీఎస్ 9,840 మందిని నియమించుకుంది; ఇన్ఫోసిస్ 10,032 మందిని నియమించుకుంది. HCLTech 8,382 మందిని నియమించుకుంది. ఈ మూడు కంపెనీల సంయుక్త హెడ్‌కౌంట్ వృద్ధి 28,254గా ఉంది. అదే సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో, మొత్తం మూడు కంపెనీల నికర ఉద్యోగుల చేరిక 16,162 వద్ద ప్రతికూలంగా ఉంది. -
స్పీకర్నే దించేసుకున్నారు!
వాషింగ్టన్: అమెరికాలో విపక్ష రిపబ్లికన్ పార్టీ సంక్షోభంలో చిక్కుకుంది. ప్రతినిధుల సభ స్పీకర్ పదవి నుంచి రిపబ్లికన్ నేత కెవిన్ మెకార్తీని సొంత పారీ్టకి చెందిన సభ్యులే సాగనంపారు! అగ్రరాజ్య చరిత్రలో స్పీకర్ ఇలా ఉద్వాసనకు గురవడం ఇదే తొలిసారి. ఆయనపై రిపబ్లికన్ నేత మాట్ గేట్జ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఆ పారీ్టకి చెందిన మరో ఏడుగురు కాంగ్రెస్ సభ్యులు మద్దతివడం ద్వారా అధికార డెమొక్రటిక్ పారీ్టతో చేతులు కలిపారు. దాంతో మంగళవారం మధ్యాహ్నం (అమెరికా కాలమానం ప్రకారం) జరిగిన ఓటింగ్‌లో 216–210 ఓట్లతో మెకార్తీ ఓటమి చవిచూశారు. ఈ ఏడాది జనవరిలో ఏకంగా నాలుగు రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన 15 రౌండ్ల ఓటింగ్ అనంతరం మెకార్తీ స్పీకర్‌గా నెగ్గడం తెలిసిందే. పది నెలలు తిరక్కుండానే ఆయన ఇలా అవమానకరంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడిక తదుపరి స్పీకర్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. కొంప ముంచిన షట్‌డౌన్ కెవిన్ పారీ్టలో అందరి నమ్మకమూ కోల్పోయారని గేట్జ్ ఆరోపించారు. సైద్ధాంతికంగా తనతో అన్ని విషయాల్లోనూ విభేదించే తమ పార్టీ సభ్యులు కూడా ఆయన్ను దించేసే విషయంలో కలసి రావడమే ఇందుకు రుజువని చెప్పారు. ఆర్థిక షట్‌డౌన్‌ను తాత్కాలికంగా నివారించే సాకుతో అధికార పారీ్టతో కెవిన్ చేతులు కలిపారన్నది గేట్జ్ వర్గం ఆరోపణ. ఈ మేరకు అధ్యక్షుడు జో బైడెన్‌తో ఆయన చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించింది. స్పీకర్‌కు ఉద్వాసనను కనీవినీ ఎరగని ఘటనగా డెమొక్రటిక్ పార్టీ కాంగ్రెస్ సభ్యుడు, ఇండియన్ అమెరికన్ అమీ బెరా అభివరి్ణంచారు. రిపబ్లికన్ల మధ్య నెలకొన్న పరస్పర అపనమ్మకానికి ఇది తాజా నిదర్శనమన్నారు. రిపబ్లికన్ల ఇంటిపోరు వల్లే... గేట్జ్ సారథ్యంలోని రైట్ వింగ్ రిపబ్లికన్ సభ్యులకు నిజానికి కెవిన్ మీద ఆది నుంచీ వ్యతిరేకతే! జనవరిలో స్పీకర్‌గా ఆయన ఎన్నిక కావడాన్ని వారు చివరిదాకా వ్యతిరేకించారు. దాంతో తనను తొలగించాలని ఒక్క రిపబ్లికన్ సభ్యుడు కోరినా దానిపై ఓటింగ్‌కు అనుమతిస్తానని వారితో ఒప్పందం చేసుకుని మెకార్తీ స్పీకర్‌గా నెగ్గారు. చివరికి అదే ఒప్పందం కారణంగా పదవిని కోల్పోయారు! అయితే సొంత పారీ్టలోనే ఇప్పుడు కెవిన్ ఉద్వాసనను తీవ్రంగా తప్పుబడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. గేట్జ్ చర్య ద్రోహపూరితమని వారు ఆరోపిస్తున్నారు. వారిమీద కఠిన చర్యలకు డిమాండ్ చేస్తుండటంతో రిపబ్లికన్ పారీ్టలో సంక్షోభం కాస్తా రసకందాయంలో పడింది! ఇప్పుడేంటి? ► తదుపరి స్పీకర్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ► అమెరికా కాంగ్రెస్‌లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభకు జరిగిన మధ్యంతర ఎన్నికలలో రిపబ్లికన్లకే మెజారిటీ దక్కడం తెలిసిందే. ► గత జనవరిలో జరిగిన ఓటింగ్‌లో గెట్జ్ సారథ్యంలోని రైట్ వింగ్ వ్యతిరేకులను బుజ్జగించి మెకార్తీ కనాకష్టంగా స్పీకర్ అయ్యారు. ► అక్టోబర్ 11న కొత్త స్పీకర్ ఎన్నిక జరగాల్సి ఉంది. ► తాజా పరిస్థితుల నేపథ్యంలో మరోసారి పోటీకి మెకార్తీ ససేమిరా అంటున్నారు. ► రిపబ్లికన్లలో ఇంటి పోరు తీవ్రంగా సాగుతుండటంతో స్పీకర్ అభ్యరి్థపై ఏకాభిప్రాయం కష్టంగానే కనిపిస్తోంది. ► ప్రస్తుతానికి రిపబ్లికన్ నేతలు స్టీవ్ స్కలైస్ (లూసియానా), టామ్ ఎమ్మర్ (మిన్నెసోటా) పేర్లు వినిపిస్తున్నాయి. -
సంక్షోభాన్ని పెంచిన ఆ అంతర్యుద్ధం
జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావడంపై భారత్‌లో వెల్లువెత్తిన ఉత్సాహం... సంఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్‌ను వ్యూహాత్మకంగా విస్మరించడానికి దారితీసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీవ్ర నిష్క్రియాత్మకత వల్లే ఈశాన్య ప్రాంతంలో ఇంత పతనం సంభవించింది. మయన్మార్‌లో 28 నెలల నాటి అంతర్యుద్ధం పాక్షికంగా మణిపుర్ మంటలను పెంచి పోషించింది. ఫలితంగా 200 మందికి పైగా మరణించారు, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 4,000 ఆయుధాల చోరీ జరిగింది. మయన్మార్ నుండి వచ్చిన శరణార్థుల వెల్లువతో పాటు, కుకీలు లేని ఇంఫాల్ లోయ, మైతేయిలు లేని కుకీ–నివాస కొండ ప్రాంతాలు అనే జాతి ప్రక్షాళన మణిపుర్‌ను నిలువునా విభజించింది. కుకీలు, మైతేయిల జాతి ప్రక్షాళన ధోరణి మణిపుర్‌ను నిట్టనిలువున చీల్చింది. తీవ్రమైన ఈ విభజనే, విద్రోహం(ఇన్సర్జెన్సీ) మళ్లీ చెలరేగుతుందన్న భయా లను రేకెత్తించింది. రాష్ట్ర ఆయుధాగారాల నుండి కొల్లగొట్టిన ఆయు ధాలు అందుబాటులో ఉండటమే ఈ భయాలకు కారణం. గత నెలలో అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ పిసి నాయర్ ఇలా చెప్పారు: ‘‘పరిస్థితి అసాధారణంగా ఉంది. మేము ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు.’’ ఇంఫాల్‌లోని నాలుగు జిల్లాల్లో గల 39 పోలీస్ స్టేషన్లలోని 16 స్టేషన్లలో సాధారణ స్థితి ఏర్పడినట్లు చూపడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని మార్చి 25న ఉపసంహరించుకున్న తర్వాత పరి స్థితి ఇలా ఉంది. ఈ చర్యను మళ్లీ వెనక్కి తీసుకోలేదు. ‘‘విద్రోహాన్ని గణనీయంగా తగ్గించేశాం. దాదాపుగా లేదు’’ అని మాజీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే చెప్పారు. ఈ పరిస్థితి ఉత్తరం వైపు సైన్యాన్ని తిరిగి సమతుల్యం చేయడానికి, అలాగే ఈశాన్య ప్రాంతంలో సైనిక చర్యల బాధ్యతను అస్సాం రైఫిల్స్‌కు బదిలీ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది సాధారణ ఆచర ణకు భిన్నం. ఒక్క 1965, 1971 యుద్ధాల సమయంలో మాత్రమే ఇలా చేశారు. మయన్మార్‌లో మిలిటరీ జుంటాకూ, దానిని వ్యతిరేకిస్తున్న శక్తుల (నేషనల్ యూనిటీ గవర్నమెంట్–ఎన్‌యూజీ, ఇంకా ప్రతిఘటన)కూ మధ్య అంతర్యుద్ధం దాని మూడవ సంవత్సరంలోకి ప్రవేశించింది. నాగాలాండ్, మిజోరాం, మణిపుర్‌లకు సమీపంలోని సగాయింగ్ ప్రాంతం, చిన్ రాష్ట్రం ప్రధాన పోరాట వేదికలుగా ఉంటున్నాయి. సైనిక జుంటా ఈ ప్రాంతంలో అధికారం కోల్పోయినందున, అది నాపాం బాంబులను ప్రయోగించడం, గ్రామాలను దోచుకోవడం, తగలబెట్టడంతోపాటు వైమానిక బాంబులను ఆశ్రయిస్తోంది. పర్య వసానంగా, దాదాపు 60,000 మంది చిన్, కుకి, జోమి శరణార్థులు మిజోరం, మణిçపుర్లకు పారిపోయారు. వీరిలో కొందరు ఎన్యూ జీకి చెందిన శాసనసభ్యులు కూడా ఉన్నారు. మయన్మార్‌తో 1,600 కి.మీ. పొడవైన అంతగా గస్తీ ఉండని సరిహద్దుతోపాటు, ఇరువైపులా 16 కి.మీ. మేర స్వేచ్ఛా కదలికలకు అనుమతిస్తున్న పాలన కారణంగా ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, బంగారం, విలువైన రాళ్లు మణిపూర్ లోకి అక్రమంగా రవాణా అవుతున్నాయి. ‘గోల్డెన్ ట్రయాంగిల్’ గుర్తుందిగా? మాదకద్రవ్యాల అక్రమ రవాణా మణిపుర్‌కు కొత్తేమీ కాదు. భద్రతా సిబ్బందికి కూడా ఇందులో ప్రమేయం ఉన్నదన్న ఆరోపణలు ఉన్నాయి. 2013 ఫిబ్ర వరిలో రూ.6 కోట్ల విలువైన డ్రగ్స్‌తో దొరికిన సైనిక కల్నల్‌ను అరెస్టు చేశారు. సెప్టెంబర్ 15న ‘గోవా క్రానికల్’లో ప్రచురితమైన కథనంలో, మణిపుర్‌లోని జఠిలమైన మాదకద్రవ్యాల వ్యాపార నెట్వర్క్ వివరా లను ఇచ్చారు. 2021 నుంచి మణిపుర్లో గసగసాల సాగు 33 శాతం పెరిగిందని ఐరాస నివేదిక పేర్కొంది. ఇది కుకీలకు నగదు పండించే పంట అని మైతేయిలు ఆరోపిస్తున్నారు. కానీ గోవా క్రానికల్ కథనం ప్రకారం, ముస్లిం పంగల్లతో సహా ప్రతి సమాజానికీ ఈ పంటలో వాటా ఉంది. భారతదేశ ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ని మయన్మార్ వివాదం తీవ్రంగా దెబ్బతీసింది. ఇది ఆసియాన్ (ఆగ్నేయాసియా దేశాల సంఘం)తో వాణిజ్యం, పరస్పర చర్యలను ముందుకు తీసుకెళ్లేందుకు రూపొందించిన విధానం. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సెప్టెంబర్ ప్రారంభంలో మీడియాతో మాట్లాడుతూ, ‘‘భారతదేశ అత్యంత ప్రతిష్ఠాత్మక మైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆగ్నేయాసియాతో ఉన్నాయి. మయన్మార్ అంతర్గత భద్రతా వ్యవస్థ విచ్ఛిన్నమైపోయిన కారణంగా అవి పెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్నాయి,’’ అని చెప్పారు. మిజోరం మార్గంలో తిరుగుబాటు సోకిన రాఖైన్ రాష్ట్రం గుండా వెళుతున్న దాదాపు రెండు దశాబ్దాల నాటి మల్టీమోడల్ కలాదాన్ ప్రాజెక్టును అరాకాన్ సైన్యం (మయన్మార్) కాలానుగుణంగా నిరోధిస్తూ వచ్చింది. మణిపుర్‌లోని మోరేతో థాయ్‌లాండ్‌లోని మయీ సాట్‌తో కలిపే భారతదేశం, మయన్మార్, థాయ్‌లాండ్ త్రైపాక్షిక హైవే ప్రాజెక్టును సగాయింగ్(మయన్మార్) ప్రాంతంలో జరిగిన పోరాటాల కారణంగా నిలిపివేశారు. ఈ నెలలోనే జరిగిన ఆసియాన్ విదేశాంగ మంత్రుల సమావేశంలో జైశంకర్ మయన్మార్ విదేశాంగ మంత్రి థాన్ స్వేతో సమావేశమయ్యారు. భారతదేశం, మయన్మార్ సరిహద్దుకు సమీపంలో జరిగిన పోరాటాలు, వైమానిక దాడులు కలిగిస్తున్న ప్రమాదకరమైన ప్రభావాల గురించి థాన్ స్వేకి వివరించారు. ‘ఎన్‌యూజీ’కి చెందిన పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ (పీడీఎఫ్) సగాయింగ్ ప్రాంతంలో ఆధిపత్యం చలాయిస్తోంది. అంతర్యుద్ధ ప్రతి ష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ‘అన్ని ఫలాలను జుంటా బుట్టలో’ ఉంచే విధానాన్ని ఢిల్లీ సమీక్షించుకోవాలి. దేశ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణాన్ని సులభతరం చేయడానికి చిన్ నేషనల్ ఫ్రంట్, అరకాన్ సైన్యాన్ని భారత ఏజెన్సీలు సిద్ధం చేయాలి. ప్రజాస్వామ్య శక్తులతో సంబంధాలను పునరుద్ధరించడం, ఆయుధాల సరఫరాతో సహా ఎన్‌యూజీ/పీడీఎఫ్‌తో సమాచార మార్గాలను ఏర్పాటు చేయడం ఆచరణీయమైన ఎంపికలు. ఇది సమస్యను నిరోధించవలసిన చర్యను ఆలస్యంగా చేపట్టడం లాంటిదే అయినప్పటికీ, భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీకి కీలకంగా ఉన్న మణిపుర్ సమస్యకు తక్షణ చికిత్స అవసరం. వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మణిపుర్‌ను రక్తసిక్తం చేయడానికి అనుమతించాయి, కొత్త తిరుగుబాట్లకు బీజాలు నాటడానికి అనుమతించాయి. అంతకుమించి సైన్యం, అస్సాం రైఫిల్స్, ఇతర భద్రతా దళాల నిష్పా క్షికతకు సవాలు విసిరే అవాంఛనీయమైన దుఃస్థితిలో ఉంచాయి. ఒక సీఆర్పీఎఫ్ భద్రతా సలహాదారు మణిపుర్ సీఎం బీరెన్‌సింగ్‌కు మార్గనిర్దేశం చేస్తుండగా, భద్రతా దళాల ప్రత్యేక రక్షణ చట్టం పరిధిలోకి రాని ప్రాంతాల్లో పౌర అధికారులకు సైన్యం, కేంద్ర పారామిలటరీ బలగాలు సాయం చేస్తున్నాయి. కుకీల పట్ల పక్షపాతం చూపుతున్నాయని ఆరోపిస్తూ అస్సాం రైఫిల్స్‌పై మణిపుర్ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు దాఖలు చేయడం, అస్సాం రైఫిల్స్‌ను తొలగించాలని మైతేయిలు డిమాండ్ చేయడం, మరోవైపున నిషేధిత ఉగ్ర వాద గ్రూపులను సైన్యం, అస్సాం రైఫిల్స్ విడుదల చేయడంపై లేవ నెత్తుతున్న ప్రశ్నలు మణిపుర్ వాస్తవికతను ప్రతిబింబిస్తున్నాయి. ఇప్పుడు ఆర్మీ, అస్సాం రైఫిల్స్ ప్రధాన పని లూటీకి గురైన ఆయుధాలను తిరిగి పొందడమే. వివిధ ప్రదేశాలలో ఆయుధ డిపా జిట్ పెట్టెలను ఉంచినప్పటికీ, మెజారిటీ ప్రజలు వాటి పక్కన సెల్ఫీలు తీసుకుంటున్నారు. మణిçపుర్, ఈశాన్య ప్రాంతాలపై జరుగు తున్న సెమినార్లలో పరిస్థితిని వివరించడానికి వాడుతున్న మాటలు: ‘అరాచకం’, ‘మరో కంబోడియా’, ‘సమాజాల మధ్య పూర్తి అప నమ్మకం’. ఆశ్చర్యకరంగా, ప్రధానమంత్రి లాగే, ఆర్మీ చీఫ్ గానీ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గానీ మణిపుర్‌ను ఇంతవరకూ సందర్శించలేదు. జరుగుతున్న తిరుగుబాటును మొగ్గలోనే తుంచివేసే విషయంలో ప్రభుత్వం తన రాజకీయ సంకల్ప లేమిని ప్రస్ఫుటంగా చూపిందని అక్కడి నిపుణులు అంటున్నారు. ఈశాన్యం నుండి 25 మంది లోక్‌సభ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది బీజేపీ, దాని మిత్రపక్షాలకు చెందినవారే. మణిపుర్‌కు చెందిన ఇద్దరు ఉన్నారు. ఈ ప్రాంతంలో తిరుగుబాట్లు ఎప్పటినుంచో ఉన్నాయి. రాజకీయ పరిష్కారం సాధించాలంటే, ముందుగా చేయాల్సిన విధులు: హింసను అరికట్టడం, రాష్ట్రపతి పాలన విధించడం. -వ్యాసకర్త సైనిక వ్యవహారాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
చైనా నిండా దెయ్యాల కొంపలే!
న్యూఢిల్లీ: చైనా తీవ్ర రియల్టీ సంక్షోభంలో నానాటికీ పీకల్లోతున కూరుకుపోతోందా? దేశవ్యాప్తంగా ఇప్పటికే జనాభాకు మించి గృహలున్నాయా? అవి చాలవని ఇంకా ఎటు చూస్తే అటు భారీ సంఖ్యలో గృహ నిర్మాణ ప్రాజెక్టులే కనిపిస్తున్నాయా? అవుననే అంటున్నారు చైనా ప్రభుత్వ మాజీ ఉన్నతోద్యోగి ఒకరు! తన ఆర్థిక వ్యవస్థ కళకళలాడుతోందని చైనా ప్రభుత్వం బయటికి ఎన్ని మాటలు చెబుతున్నా, రియల్టీ సంక్షోభం నానాటికీ ఆందోళన కలిగించేంతగా విస్తరిస్తోందని చెబుతున్నారు! చైనాలో నివాస గృహాల సంఖ్య కనీసం 100 కోట్లు దాటి ఉంటుందని భావిస్తున్నారు. అవి కనీసం 300 కోట్ల మందికి సరిపోతాయట! దేశ స్టాటిస్టిక్స్ బ్యూరో మాజీ డెప్యూటీ హెడ్ హే కేంగ్ స్వయంగా చెప్పిన వివరాలివి. ‘చైనాలో ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్యపై ఒక్కో నిపుణుడు ఒక్కో మాట చెబుతున్నారు. కానీ, ఎవరి నమ్మినా, నమ్మకపోయినా ఒకటి మాత్రం నిజం. ఇప్పటికే దేశవ్యాప్తంగా నిర్మాణం పూర్తయి అందుబాటులో ఉన్న ఖాళీ ఇండ్లు కనీసం 300 కోట్ల మందికి సరిపోతాయి’ అని హేంగ్ను ఉటంకిస్తూ ‘రాయిటర్స్’ వార్తా సంస్థ పేర్కొంది. రియల్టీ సంస్థల దివాలా బాట చైనాలో 2021 నుంచీ రియల్టీ రంగం సంక్షోభ బాట పట్టింది. క్రమంగా ఒకటి తర్వాత ఒకటిగా దిగ్గజ సంస్థలన్నీ దివాలా బాట పడుతుండడం సమస్య తీవ్రతకు అద్దం పడుతుంది. చైనాలో నెలకొన్న ఈ రియల్టీ సంక్షోభానికి దేశమంతటా ఎక్కడ చూస్తే అక్కడ పుట్టగొడుగుల్లా పుట్టుకొచి్చన అపార్ట్ మెంట్లే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి... ► ఇవి చాలవన్నట్టు దేశం మొత్తంమీద ఇంకా అసంఖ్యాకమైన అపార్ట్ మెంట్లు నిర్మాణంలో ఉన్నాయి. ► అయితే కొనుగోలు చేసేవాళ్లు లేక నిర్మాణ సంస్థలు కొన్నాళ్లుగా అల్లాడుతున్నాయి. ► రుణ భారానికి తాళలేక 2021లో చైనా రియల్టీ దిగ్గజం ఎవర్ గ్రాండ్ గ్రూప్ నిలువునా దివాలా తీసింది. ► అంతకంటే పెద్ద నిర్మాణ సంస్థ కంట్రీ గార్డెన్ వంటివి దివాలా అంచులో కొట్టుమిట్టాడుతున్నాయి! ► గత ఆగస్టు నాటికే చైనాలో ఏకంగా 700 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణానికి సమానమైన ఇళ్లు అమ్ముడుకాకుండా ఖాళీగా మిగిలిపోయినట్టు ఆ దేశ జాతీయ గణాంక బ్యూరో తాజా అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. ► ఇది దాదాపు ఒక్కోటీ 90 చదరపు మీటర్ల పరిమాణంలో ఉండే 72 లక్షల ఇళ్లకు సమానమని రాయిటర్స్ అంచనా వేసింది. ► ఇవిగాక ఇప్పటికే అమ్ముడుపోయి నిర్మాణ సంస్థలు ఎదుర్కొంటున్న నగదు ప్రవాహ సమస్యల కారణంగా ఇంకా పూర్తికాని ఇండ్ల ప్రాజెక్టులు దేశమంతటా అసంఖ్యాకంగా ఉన్నాయి. అవి శ్మశాన నగరాలు! ► అత్యధిక ఇళ్లను ప్రధానంగా మార్కెట్ స్పెక్యులేటర్లు 2016 సమయంలో మార్కెట్లు కళకళలాడుతున్న సమయంలో ఎగబడి కొన్నారు. ఇప్పుడు వాళ్ళూ, రియల్టీ సంస్థల యజమానులూ ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారు! ► ఆర్థిక సంక్షోభం బారి నుంచి దేశాన్ని ఎలాగోలా బయట పడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న చైనా కమ్యునిస్టు ప్రభుత్వానికి ఈ రియల్టీ సంక్షోభం పెను సవాలుగా పరిణమించింది. ► చైనా జీడీపీలో దాదాపు 30 శాతం వాటా రియల్టీ రంగానిదే. ► ఒకప్పుడు దేశానికి వెన్నెముకగా ఉన్న రియల్టీ రంగమే ఇప్పుడు పెను భారంగా మారింది. ► 1970ల నుంచి గృహ, వాణిజ్య సముదాయాల నిర్మాణం ఊపందుకుంది. ► దాంతో ఒకప్పుడు 18 శాతమున్న పట్టణ జనాభా ఇప్పుడు ఏకంగా 60 శాతం దాటింది. ► ఆ సమయంలో సంపన్నులు విచ్చలవిడిగా ఇళ్లు, గృహ సముదాయాలనే కొని అట్టిపెట్టుకున్నారు. దాంతో ఇప్పుడు పట్టణాలకు పట్టణాలే ఖాళీగా ఉన్న పరిస్థితి! క్వింగ్ హుయి, జెంగ్ డాంగ్, చెన్ గాంగ్, బిన్ హయీ వంటివి శ్మశాన నగరాలుగా మారాయి!! – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా భూమికి పగుళ్లు!
అగ్రరాజ్యం అమెరికాకు పెను ప్రమాదం ముంచుకొస్తోంది. దేశవ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ నేలపై పుట్టుకొస్తున్న మైళ్ల కొద్దీ పొడవైన భారీ పగుళ్లు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. పొంచి ఉన్న పెను ఉత్పాతాలకు ఇది బహుశా ముందస్తు సంకేతం మాత్రమే కావొచ్చన్న సైంటిస్టుల హెచ్చరికలు మరింత భయం పుట్టిస్తున్నాయి. పర్యావరణంతో ఇష్టారాజ్యంగా చెలగాటం ఆడితే ఎలా ఉంటుందో ఆ దేశానికిప్పుడు బాగా తెలిసొస్తోంది! అమెరికా అతి పెద్ద పర్యావరణ విపత్తును ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా వాయవ్య రాష్ట్రాల్లో ఎక్కడ పడితే అక్కడ నేల నిట్టనిలువుగా చీలుతోంది. అది కూడా చిన్నాచితకా సైజులో కాదు! మైళ్ల పొడవునా, మీటర్ల వెడల్పులో పగుళ్లిస్తోంది. ఫిషర్స్గా పేర్కొనే ఈ చీలికలు దశాబ్దాలుగా భూగర్భ జలాలను విపరీతంగా తోడేస్తున్న తాలూకు దుష్పరిణామమేనని పర్యావరణవేత్తలు మాత్రమే గాక భూ¿ౌతిక శాస్త్రవేత్తలు కూడా నిర్ధారిస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమంటూ ఇప్పుడు తీరిగ్గా నెత్తీ నోరూ బాదుకుంటున్నారు! పగుళ్లు ఎక్కడెక్కడ? ► అరిజోనా, ఉతా, కాలిఫోరి్నయా రాష్ట్రాల్లో ఇవి మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ► ముఖ్యంగా అరిజోనాలో 2002 నుంచే ఈ తరహా పగుళ్లు వస్తున్నాయి. కానీ ఈ మధ్యకాలంలో కనిపిస్తున్న పగుళ్లు పరిమాణంలో గానీ, సంఖ్యలో గానీ ముందెన్నడూ చూడనివి కావడమే కలవరపరుస్తున్న అంశం. జాతీయ సంక్షోభమే: న్యూయార్క్ టైమ్స్ ఈ పగుళ్లు ఇప్పుడు జాతీయ సంక్షోభం స్థాయికి చేరాయని న్యూయార్క్ టైమ్స్ మీడియా గ్రూప్ పరిశోధక బృందం తేల్చడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. సర్వే ఏం చెప్పిందంటే... ► అమెరికాలో 90 శాతానికి పైగా జల వనరులకు ప్రధాన ఆధారమైన జల ధారలు శరవేగంగా ఎండిపోతున్నాయి. ► ఎంతగా అంటే, అవి కోలుకోవడం, బతికి బట్ట కట్టడం ఇక దాదాపుగా అసాధ్యమే! ► సర్వే బృందం పరిశీలించిన సగానికి సగం చోట్ల భూగర్భ జల ధారలు గత 40 ఏళ్లలో చెప్పలేనంతగా చిక్కిపోయాయి. ► 40 శాతం ధారలైతే కేవలం గత పదేళ్లలో ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయాయి. ► వాయవ్య అమెరికావ్యాప్తంగా అతి ప్రధాన మంచినీటి వనరుగా ఉంటూ వస్తున్న కొలరాడో నది కేవలం గత 20 ఏళ్లలో ఏకంగా 20 శాతానికి పైగా కుంచించుకుపోయింది. ► గ్లోబల్ వారి్మంగ్ తదితర పర్యావరణ సమస్యలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. భూగర్భ జలమే ముఖ్య ఆధారం మనిషుల నీటి అవసరాలను తీర్చడంలో భూగర్భ జలం కీలకంగా మారింది. ఎంతగా అంటే... ► ప్రపంచ తాగునీటి అవసరాలూ సగం భూగర్భ జలంతోనే తీరుతున్నాయి. ► ఇక 40% సాగునీటి అవసరాలకు ఇదే ఆధారం. ► అయితే, అసలు సమస్య భూగర్భ జలాలను తోడేయడం కాదు. వెనుకా ముందూ చూసుకోకుండా విచ్చలవిడిగా తోడేయడమే అసలు సమస్య. అంత వేగంగా భూమిలోకి నీరు తిరిగి చేరడం లేదు. ఏం జరుగుతోంది? ► భూగర్భం నుంచి నీటిని విచ్చలవిడిగా తోడేయడం నేల కుంగిపోవడానికి దారితీస్తోంది. ► అదే చివరికిలా పగుళ్లుగా బయట పడుతోంది. ► ఫిషర్లుగా పిలిచే ఈ పగుళ్లు సాధారణంగా పర్వతాల మధ్య ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. ► వీటితో ఇళ్లకు, రోడ్లకు, కాల్వలకు, డ్యాములకు తదితరాలకు నష్టం అంతా ఇంతా కాదు. ► చాలాసార్లు ఈ భారీ పగుళ్ల వల్ల ఊహించలేనంతగా ప్రాణ నష్టం కూడా సంభవించవచ్చు. పశు సంపదకు కూడా నష్టం కలగవచ్చు. ఇవి ప్రాకృతికంగా జరుగుతున్న పరిణామాలు కావు. నూటికి నూరు శాతం మనుషుల తప్పిదాలే ఇందుకు కారణం’’ – జోసెఫ్ కుక్, పరిశోధకుడు, అరిజోనా జియాలాజికల్ సర్వే – సాక్షి, నేషనల్ డెస్క్ -
కేంద్రం వైఖరిని సమర్థిస్తున్నాం
లండన్: రష్యా–ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరిని పూర్తిగా సమర్థిస్తున్నామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. విశాలమైన దేశం అయినందున ప్రపంచదేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం భారత్‌కు సహజంగానే ఉంటుందని చెప్పారు. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో జరిగిన మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడారు. ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న వైఖరికి రష్యా నుంచి చమురు సరఫరాయే కారణమా అన్న మీడియా ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. ‘రష్యాతో మాకు సంబంధాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విషయంలో ప్రభుత్వ, ప్రతిపక్షం వైఖరి భిన్నంగా ఉంటుందని నేను భావించడం లేదు’అని వివరించారు. రష్యా నుంచి దూరంగా తమవైపు భారత్‌ను లాక్కునేందుకు పశ్చిమ దేశాల నేతలు ప్రయత్నించారా అన్న ప్రశ్నకు రాహుల్ గాంధీ.. ‘‘వాస్తవానికి భారత్‌కు రష్యాతో సత్సంబంధాలున్నాయి. అదేవిధంగా అమెరికాతోనూ సంబంధాలు న్నాయి. భారత్ విశాల దేశం. పెద్ద దేశం కావడం వల్ల అనేక ఇతర దేశాలతో వివిధ స్థాయిల్లో సంబంధాలు కొనసాగుతున్నాయి. ఎవ్వరితోనైనా సంబంధాలు కొనసాగించే హక్కు భారత్‌కు ఉంది’అని రాహుల్ చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు విషయంలో ప్రతిపక్షం వైఖరిపై ఆయన..కశ్మీర్ అభివృద్ధిని కాంగ్రెస్ గట్టిగా కోరుతోంది. అక్కడ శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తోంది’అని రాహుల్ వివరించారు. కశ్మీర్ అంశం పరిష్కారానికి అంతర్జాతీయ దౌత్యం అవసరమని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు రాహుల్ సూటిగా సమాధానమిచ్చారు. వాస్తవానికి కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం. కశ్మీర్ మా సొంత విషయం. అందులో భారత్‌కు తప్ప మరెవ్వరి జోక్యం అవసరం లేదు’అని కుండబద్దలు కొట్టారు. -
G20 Summit: జిన్‌పింగ్ ఎందుకు రావట్లేదు ?
జీ20 సదస్సుకు కయ్యాలమారి చైనా అంతగా ప్రాధాన్యత ఇవ్వట్లేదా ?. అందుకే అధ్యక్షుడు జిన్‌పింగ్ తనకు బదులు ప్రధాని లీ కియాంగ్‌ను పంపించారా ?. ఇలాంటి ప్రశ్నలకు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు తలో విశ్లేషణ చెబుతున్నారు. జీ20 కూటమి ఆవిర్భావం తర్వాత చైనా అధ్యక్షులు ఒకరు శిఖరాగ్ర సదస్సులో పాల్గొనకపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇంతటి ప్రతిష్టాత్మకమైన సదస్సుకు హాజరుకాకుండా జిన్‌పింగ్ చైనాలోని ఉండి ఏం చేస్తున్నారు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 2020 మే నెల నుంచి భారత్‌తో సరిహద్దు వెంట ఇరుదేశాల సైనికులు బాహాబాహీకి దిగడం, భారీగా సైన్యం మొహరింపు వంటి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతుండటం వల్లే జిన్‌పింగ్ ఆగ్రహంతో సదస్సుకు రావట్లేదని చాలా మంది భావిస్తున్నారు. అసలు కారణం అది కాదని మరో వాదన బలంగా వినిపిస్తోంది. అదే అదుపు తప్పుతున్న చైనా ఆర్థిక పరిస్థితి. జిన్‌పింగ్ ధనవంతుల కుటుంబంలో పుట్టాడు. అప్పుడే వచ్చిన సాంస్కృతిక విప్లవం ధాటికి ఆయన తండ్రి పేదవాడిగా మిగిలిపోయాడు. దీంతో జిన్‌పింగ్ బాల్యంలో కష్టాలు చూశాడు. పొలంలో సాధారణ కూలీగా పనిచేశాడు. ఆరేళ్లు ఇబ్బందులు పడ్డాడు. అయితే బలీయమైన చైనాకు అధ్యక్షుడిగా ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలతో పోలిస్తే ఆనాటి కష్టాలు గడ్డిపరకతో సమానమే. ‘చైనా రాజ్య విస్తరణ వాదం, దక్షిణ చైనా సముద్రంపై గుత్తాధిపత్యం, ప్రపంచ వస్తూత్పత్తి మార్కెట్‌కు ఏకైక దిక్కుగా మారాలన్న వ్యూహాలతో చైనా చాలా ప్రపంచ దేశాలకు శత్రువుగా మారింది. ఇలాంటి తరుణంలో చైనాతో కలిసి జీ20 వేదికను కలిసి పంచుకునేందుకు తోటి దేశాలు విముఖత చూపుతున్నాయి’ అని మేథో సంస్థ కార్నీగ్ చైనా డైరెక్టర్ పాల్ హెనెల్ వ్యాఖ్యానించారు. ఆ అప్రతిష్ట పోగొట్టుకునేందుకే ‘ సదస్సు విజయవంతం అవడానికి అందరితో కలిసి పనిచేస్తాం’ అని బీజింగ్ తాజాగా ప్రకటించింది. ‘విదేశీ పర్యటనకు పక్కనబెట్టి స్వదేశ సమస్యలపై జిన్‌పింగ్ దృష్టిపెట్టారు. దేశ రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పొరుగు దేశాలతో కయ్యానికి దిగారు. ఆర్థిక వ్యవస్థ సమస్యల్లో చిక్కుకోవడంతో జిన్‌పింగ్‌కు తలనొప్పి పెరిగింది’ అని సింగపూర్‌లోని నేషనల్ యూనివ ర్సిటీ ప్రొఫెసర్ ఆల్ఫ్రెడ్ వూ వ్యాఖ్యానించారు. దెబ్బకొట్టిన హౌజింగ్ రంగం ఇటీవల దశాబ్దాల కాలంలో ఎన్నడూలేనంతగా పలు సమస్యలు చైనాలో తిష్టవేశాయి. కుటుంబాలు తమ ఖర్చులను తగ్గించుకున్నాయి. కర్మాగారాల్లో ఉత్పత్తి తగ్గిపోయింది. వ్యాపారవేత్తలు నూతన పెట్టుబడులకు ముందుకు రావట్లేదు. ఎగుమతులు దిగజారాయి. ఆగస్టులో ఎగుమతులు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8.8 శాతం తగ్గాయి. దిగుమతులు 7.3 శాతంపెరిగాయి. నిరుద్యోగిత భారీగా పెరగడంతో ప్రభుత్వం తాజా గణాంకాలు బహిర్గతంచేయడం మానేసింది. ఆస్తుల మార్కెట్ విలువ భారీగా పతనమైంది. ప్రధాన డెవలపర్లు చేతులెత్తేసి దివాలాను ప్రకటించారు. దీంతో రియల్ ఎసేŠట్ట్ రంగం సంక్షోభంలో చిక్కింది. 40 ఏళ్ల భవిష్యత్ అభివృద్ది మోడల్‌ను ఈ అంశాలు తలకిందులుచేసేలా ఉన్నాయి. ప్రాపర్టీ రంగంపై అతిగా ఆధారపడటం, అత్యంత కఠినమైన కోవిడ్ ఆంక్షల విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయని నిపుణులు భావిస్తున్నారు. రుణాల పునాదిపై నెలకొల్పిన అభివృద్ధి మోడల్ ఈ పరిస్థితికి మరో కారణం. దేశం అప్పులు పెరిగిపోయాయి. 2023 తొలి త్రైమాసికంలో అప్పులు–జీడీపీ నిష్పత్తి రికార్డు స్థాయిలో 279 శాతంగా నమోదైందని బ్లూమ్‌బర్గ్ విశ్లేషించింది. రుణాలు అతిగా తీసుకొచ్చి మౌలిక వసతులపై ఖర్చుచేసిన పాపం ఇప్పుడు పండిందని మరో వాదన. హౌజింగ్ బుడగ బద్ధలైంది. చైనా ఆర్థిక వ్యవస్థ 25 శాతం ప్రాపర్టీ మార్కెట్‌పైనే ఆధారపడింది. ఇన్నాళ్లూ కేవలం చైనాపై ఆధారపడిన విదేశీ బ్రాండ్లు ఇప్పుడు చైనాతోసహా ఇతర(చైనా ప్లస్ స్ట్రాటజీ) దేశాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. దీని వల్ల ప్రధానంగా లాభపడేది ఇండియానే. ఆపిల్, టెస్లా మొదలుకొని నైక్ వరకు అన్ని ప్రధాన సంస్థల తయారీకేంద్రాలు చైనాలోనే ఉన్నాయి. కార్మికులకు అధిక జీతభత్యాలు, అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో విదేశీ సంస్థలు చైనాకు బదులు వేరే దేశాల వైపు చూస్తున్నాయి. ఆర్మీలో అవిధేయత? చైనా ఆర్మీలో పెరిగిన అవినీతి, పాలక పార్టీ పట్ల తగ్గిన విధేయతపై జిన్‌పింగ్ భయపడుతున్నారని ఆసియా పాలసీ సొసైటీ ఇన్స్టిట్యూట్లో జాతీయ భద్రతా విశ్లేషకుడు లైల్ మోరిస్ చెప్పారు. చైనా సైన్యంలో అణ్వస్త్ర సామర్థ్య రాకెట్ విభాగంలోని జనరల్, డెప్యూటీ జనరల్‌లను తొలగించడాన్ని ఆయన ఉటంకించారు. తనకు నమ్మకస్తుడైన విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్‌ను జిన్‌పింగ్ తప్పించడంతో పార్టీ వర్గాల్లోనూ తీవ్ర అసంతృప్తి రేగింది. జిన్‌పింగ్ పాలనా సామర్థ్యానికి ఈ ఘటనలు మాయని మచ్చలని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇలాంటి సమస్యలు ఇంకొన్ని పెరిగితే డ్రాగన్ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పాలనకు తెరపడే ప్రమాదముందని కొందరు సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. ఇన్ని సమస్యలు ఇంట్లో పెట్టుకునే జిన్‌పింగ్ చైనాను వదలి బయటకు రావట్లేదనే విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సంక్షోభం వస్తే ఆయన సైలెంట్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. గురువారం ఢిల్లీ రాష్ట్ర శాసనసభ ఇందుకు వేదికైంది. ‘ కూతురు లాంటి మణిపూర్ తీవ్ర విద్వేషాగ్నిలో చిక్కుకున్నపుడు తండ్రి స్థానంలో ఉన్న ప్రధాని మోదీ.. ఆమెన కాపాడాల్సిదిపోయి, పట్టించుకోకుండా మరో వైపు తిరిగి నిల్చున్నారు. మోదీ మౌనంగా ఎందుకున్నారని దేశం యావత్తు ప్రశ్నిస్తోంది. ఆయన ఇలా మౌనముద్రలో ఉండటం ఇదే తొలిసారి కాదు. గత తొమ్మిదేళ్ల పాలనా కాలంలో దేశంలో ఎక్కడ సంక్షోభం ఎదురుపడ్డా ఆయన ఇలాగే సైలెంట్ అయిపోయారు’ అని కేజ్రీవాల్ విమర్శించారు. ‘ పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిల్చిన మహిళా మల్లయోధులు బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ యాదవ్‌పై లైంగిక ఆరోపణలు చేసినపుడూ మోదీ మౌనవ్రతం చేశారు. ఇదే మహిళా రెజ్లర్లు పతకాలు గెల్చినపుడు వారితో ఫొటోలు దిగేందుకు మొదట ముందుకొచ్చింది మోదీనే. ‘మీరు నా బిడ్డలు’ అని భరోసా ఇచ్చారు. కానీ తీరా వాళ్లు ధర్నాలు చేస్తుంటే మోదీ మౌనముద్రలోకి జారుకున్నారు. కనీసం ప్రధాని హోదాలో ‘నేనున్నాను. ఎంక్వైరీ చేయించి సంబంధిత వ్యక్తుల్ని శిక్షిస్తానని హామీ ఇవ్వలేకపోయారు. కనీసం ఎఫ్ఐఆర్ నమోదు కోసం మహిళలు ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇక మణిపూర్ అంశంలోనూ ఇంతే ’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. -
సినిమాలకు బ్రేక్: సమంతకు ఆర్థికంగా అన్ని కోట్లు నష్టమా?
టాలీవుడ్ టాప్ హీరోయిన్, పాన్-ఇండియా యాక్టర్ సమంత రూత్ ప్రభు ఇటీవల సినిమాలకు విరామం ప్రకటించింది. మైయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకోవడానికే సమంత రూత్ ప్రభు సినిమాలకు దాదాపు ఏడాది పాటు విరామానికి సిద్ధమైందని అంచనా. ఈ నేపథ్యంలో ఈ బ్రేక్ వల్ల ఆమె ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని చవిచూడనుందని సమాచారం. సమంత రూత్ ప్రభు సినిమాల నుండి విరామం కారణంగా 12 కోట్ల రూపాయల మేర భారీగా నష్టపోనుందని అంచనా. నిజానికి, సమంత ఈ బ్రేక్‌కి ముందే తన పెండింగ్ వర్క్ షెడ్యూల్‌లన్నింటినీ పూర్తి చేసింది. అలాగే కొత్త ప్రాజెక్ట్‌లను, సినిమాలు దేనికీ ఒకే చెప్పలేదు.అంతేకాడదు నిర్మాతల నుండి ఏదైనా పెండింగ్ అడ్వాన్స్ డబ్బును కూడా తిరిగి ఇచ్చింది. అయినప్పటికీ ఈ విరామంలో దాదాపు రూ. 12 కోట్లు లేదా అంతకంటే ఎక్కువనని మీడియా రిపోర్ట్‌ల ద్వారా తెలుస్తోంది. సమంత సాధారణంగా ఒక్కో చిత్రానికి రూ. 3.5 నుండి రూ. 4 కోట్ల వరకు వసూలు చేస్తుంది. దీనికితోడు ఎండారస్మెంట్ల ద్వారా కూడా ఆదాయం బాగానే వస్తుంది.ఈ లెక్కన దాదాపు రూ. 10 నుండి రూ. 12 కోట్ల వరకు ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి. (నీతా అంబానీ అద్భుత గిఫ్ట్: మురిసిపోతున్న కాబోయే కోడలు) పలు నివేదికల ప్రకారం, ఆగస్ట్ 2023 మొదటి వారంలో సమంత తన మైయోసైటిస్ చికిత్స కోసం యూఎస్ వెళ్లనుంది. అయితే బ్రేక్ ప్రకటించిన వెంటనే ముందుగా తనకెంతో ఇష్టమైన ఇషా ఫౌండేషన్ కు వెళ్ళిపోయి ధ్యానంలో మునిగిపోయింది. ప్రశాంతత,ధ్యానం కోసం కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్‌లో సేదతీరుతున్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ సరసన సమంత నటించిన ‘ఖుషి’ సినిమా సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్లో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ కూడా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. (కాగ్నిజెంట్ సీఈవో కీలక నిర్ణయం: ఉద్యోగుల్లో ఉత్సాహం) -
బైడెనామిక్స్ ఒక భ్రాంతేనా?
అమెరికా మలిదఫా ఆర్థిక సంక్షోభంలోకి వేగంగా జారిపోతోంది. ఒక పక్క ద్రవ్యోల్బణం, మరో పక్క వృద్ధిరేటును కాపాడుకునేందుకు ఉద్దీపనల అవసరం అడకత్తెరలో పోకచెక్క పరిస్థితికి దిగజార్చాయి. ద్రవ్యోల్బణాన్ని అరికట్టే పేరిట పెంచుతూ పోయిన బ్యాంకు వడ్డీ రేట్లు, ఆర్థిక మందగమనం దిశగా నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో జో బైడెన్ ప్రతిపాదిస్తోన్న ‘బైడెనామిక్స్’ నయా ఉదారవాద విధానాలకు ముగింపు కానున్నాయా? 1930లలో శారీరక శ్రమ ఆధారిత కాలంలో ఆనాటి అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ ‘ప్రజాహిత కార్యక్రమాలు’ పట్టాలు తప్పిన పెట్టుబడిదారీ వ్యవస్థలో తిరిగి ప్రజలకు ఉపాధిని కల్పించగలిగాయి. కానీ నేటి కృత్రిమ మేధ యుగంలో బైడెనామిక్స్ అటువంటి సానుకూల ఫలితాలను తిరిగి ఆవిష్కరించలేదు. అమెరికాలో 1980ల వరకూ ఉన్న సంక్షేమ రాజ్య స్థానంలో మొదలైన ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలు తెచ్చిపెట్టిన మోచేతినీళ్ల (ట్రికిల్ డౌన్) ఆర్థిక శాస్త్రం దారుణంగా విఫలమైందనేది స్పష్టం. దీనినే, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా అంగీకరిస్తున్నారు. ఆయన ‘సరికొత్త’గా బైడెనామిక్స్ పేరిట ప్రతిపాదిస్తోన్న ఆర్థిక విధానాలు పాత రోత ట్రికిల్ డౌన్కూ, అది ప్రతిపాదించే కార్పొరేట్ అనుకూల నయా ఉదారవాద విధానాలకూ ముగింపు కానున్నాయనేది అంచనా. అంటే 1930ల ఆర్థిక పెనుమాంద్య కాలంలో, నాటి అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డిలానో రూజ్వెల్ట్ నేతృత్వంలో ఆవిష్కరించిన సంక్షేమ రాజ్యం దిశగా తిరిగి అమెరికా ప్రయాణం కడుతోందని అనిపించక మానదు. బైడెన్ 2024లో మరోసారి అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కి, కార్మిక, ఉద్యోగ, సామాన్య జనాల అనుకూల ఆర్థిక విధానాలను విజయవంతంగా ‘కొనసాగించ’గలరా? ఒకవేళ బైడెన్ 2024లో మళ్లీ గెలవడం తథ్యం అనుకుంటే, ఆయన సరికొత్త కల అయిన పాత సంక్షేమ రాజ్యాన్ని తిరిగి పునరుద్ధరించగలరా? దీనికి జవాబు సులువు. 1930లలో రూజ్వెల్ట్ అమలు జరిపిన ‘ప్రజాహిత కార్యక్రమాలు’ లేదా పబ్లిక్ వర్క్స్ నాడు పట్టాలు తప్పిన పెట్టుబడిదారీ వ్యవస్థలో, మరలా తిరిగి ప్రజలకు ఉపాధిని కల్పించ గలిగాయి. నాటి మాంద్యంలో, నిరుద్యోగం విపరీతంగా పెరిగి పోయిన దశలో – ప్రైవేట్ పెట్టుబడిదారులు, ఇక ఎంతమాత్రమూ కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు లేదా మూతబడిన తమ పరిశ్ర మలను తిరిగి తెరిచేందుకు సిద్ధంకాని స్థితిలో, నాటి అమెరికా ప్రభుత్వమే స్వయంగా పూనుకుని తన పెట్టుబడుల ద్వారా ప్రజలకు తిరిగి ఉపాధి కల్పించింది. ఈ విధంగా ప్రభుత్వం కల్పించిన ఉపాధి ద్వారా కాస్తంత పుంజుకున్న ప్రజల కొనుగోలు శక్తి – మార్కెట్లో ప్రైవేట్ ఉత్పత్తిదారులకు తిరిగి తమ సరుకును అమ్ముకునే అవ కాశాన్ని కల్పించింది. తద్వారా వారు, తిరిగి తమ పరిశ్రమలను తెరవగలిగారు. ఫలితంగా, మాంద్యంతో పట్టాలు తప్పిన ప్రైవేటు కార్పొరేట్ వ్యవస్థ తిరిగి కోలుకోగలిగింది. ఈ క్రమంలోనే ప్రజలకు మరలా ఉద్యోగ అవకాశాలు తిరిగి వచ్చాయి. నేటి బైడెనామిక్స్ కూడా దరిదాపుగా ఇదే ఆర్థిక సూత్రీకరణ ప్రాతిపదికన అమెరికాలో మాంద్యం స్థితిని అధిగమించే ప్రయత్నం చేయజూస్తోంది. గతంలోని సంక్షేమరాజ్యాన్ని కూలదోసి 1980లలో వచ్చిన నయా ఉదారవాద ఆర్థిక విధానాలకు చరమగీతం పాడటం, దాని స్థానంలో సరికొత్త రూపంలో మరలా తిరిగి సంక్షేమ రాజ్యాన్ని ఆవిష్కరించడం ప్రస్తుతం బైడెన్ యత్నంగా ఉంది. 1930లు, 2023లలో ఒకే తరహా విధానాల అమలు సాధ్యమేనా? 1930లలోని సాంకేతిక పరిజ్ఞాన స్థాయి రూజ్వెల్ట్ అమలు జరిపిన పబ్లిక్ వర్క్స్ కార్యక్రమాలకు అనుకూలంగా ఉంది. ప్రభుత్వం పూనుకుని పెట్టుబడులు పెడితే, తద్వారా పెరిగిన ప్రజల కొనుగోలు శక్తి వల్ల... ప్రైవేటు రంగం కోలుకునేందుకు, ఉపాధి కల్పనకు నాడు అవకాశాలున్నాయి. ఎందుచేతనంటే, నాటి సాంకేతిక పరిజ్ఞానం యావత్తూ కేవలం శారీరక శ్రమను అనుకరించేది లేదా దానికి ప్రత్యా మ్నాయంగా ఉండేది మాత్రమే. నేటికిలా మేధోశ్రమను అనుకరించే లేదా దానికి ప్రత్యామ్నాయం కాగల సాఫ్ట్వేర్ రంగం, ఇంటర్నెట్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలు లేవు. కాబట్టే నాడు మానవ మేధస్సుకు, దాని నుంచి ఉద్భవించే నిపుణతలకు ప్రత్యామ్నాయం లేదు. కేవలం, మానవుడి శారీరక శ్రమను తగ్గించగల... ఉత్పత్తిని మరిన్ని రెట్లు పెంచగల తరహా సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే నాడు అందుబాటులో ఉంది. కాబట్టి, నాడు ఇంకా మనిషికి వ్యవస్థలో పని కల్పించే అవకాశం ఉంది. ఫలితంగానే, నాడు ప్రభుత్వ పెట్టుబడులు ప్రైవేటు రంగం కోలుకుని అది తిరిగి ఉపాధి కల్పనను చేయగలిగేటందుకు పనికొచ్చాయి. కానీ, నేడు ప్రభుత్వ ‘పెట్టుబడులు’ ఉపాధి కల్పించే విగా కాక, కేవలం ఆర్థిక వ్యవస్థకు ఉత్ప్రేరకాలుగా లేదా ఉద్దీపనలుగా మాత్రమే ఉంటున్నాయి. ఈ కారణం చేతనే, భారతదేశంలో కూడా గ్రామీణ పేద ప్రజానీకానికి ఉపాధి కల్పించే – జాతీయ ఉపాధి హామీ పథకంలో, యంత్రాల వినియోగంపై పరిమితులు పెడుతూ 2005 –06 కాలంలోనే నిబంధనలు ఏర్పరచవలసి వచ్చింది. కాబట్టి, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, రోబోలు, ఆటోమేషన్ల యుగంలో బైడెనామిక్స్... నాటి రూజ్వెల్ట్ విధానాల వంటి సానుకూల ఫలితాలను తిరిగి ఆవిష్కరించలేదు. అలా జరగాలంటే ప్రస్తుతం మేధో శ్రమకు కూడా ప్రత్యామ్నాయంగా వచ్చిన అధునాతన సాంకే తికతలు అన్నింటినీ స్వచ్ఛందంగా పరిత్యజించుకోగలగాలి. ఒక రకంగా పాత పలుగు, పార దశకో లేకుంటే మర యంత్రాల దిశకో తిరిగి మళ్లగలగాలి. ఇది సాధ్యమా? అసాధ్యమనేదే ఇంగితం మనకు ఇచ్చే జవాబు. కాబట్టి, నేటి బైడెనామిక్స్ ఆచరణలో కేవలం ఆదర్శ వాదంగానే మిగిలిపోగలదు. మరి ఏది దారి? మానవ జాతికి భవిష్యత్తు ఎలా? కోటానుకోట్ల మందికి ఉపాధి కల్పన నేటి సాంకేతికతల కాలంలో సాధ్యం కానట్టేనా? దీనికి జవాబు – సాధ్యమే! కానీ ఎలా? సాధారణంగా, విధానాల రూపకల్పన, మేనేజ్మెంట్ రంగాలలోని వారు వాడే పద జాలంలో ‘అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్’ అనే మాట ఉంది. మామూలు రోజువారీ అలవాటుపడి పోయిన మూసపోత ఆలోచనా విధానాన్ని దాటుకుని ఆలోచించగలగడం. ఇక్కడ ఈ వ్యవస్థలో రోజువారీ మనం అలవాటుపడిపోయిన ఆలోచనా విధానం – పెట్టుబడిదారులు ఉండడం, వారు సరుకు ఉత్పత్తి రంగంలోనో లేదా సేవా రంగంలోనో పరిశ్రమలు పెట్టడం, తద్వారా మెజారిటీ ప్రజలకు ఉపాధి అవకాశాలు లభించడం... అనేది. కానీ, నేడిది వర్కవుట్ కాని ఆలోచనా విధానం. ఎందుకంటే, ఏ పెట్టుబడిదారుడైనా, పెట్టు బడులు పెట్టేది లాభాల కోసమే. దాని ఫలితంగా అంటే, మరో రకంగా చెప్పాలంటే, ఈ క్రమంలో ఉపాధి కల్పన అనేది ద్వితీయ ప్రాధాన్యతా అంశం. మరి ఈ లాభాలను పెట్టుబడిదారుడు – మను షుల స్థానంలో యంత్రాలను వినియోగించడం ద్వారా పొంద గలిగితేనో? నేడు జరుగుతోంది అదే. నిజానికి, సాంకేతిక పురో గమన క్రమంలో జరుగుతూ వచ్చిందంతా అదే. కానీ, నేడు ఈ సాంకేతిక పరిజ్ఞాన ఎదుగుదల – ఉత్పత్తిలో మనిషికి ఏ ప్రాధాన్యతా లేదా అవ సరం లేని స్థితికి చేరుకుంటోంది. అదీ విషయం! ఈ క్రమంలో... వ్యవస్థాగత పరిమితులలో, బైడెన్ ముందుకు తెస్తోన్న బైడెనామిక్స్ ఆశిస్తోన్న సానుకూల ఫలితాలను తెచ్చి పెట్టలేదు. కాబట్టి నేడు ప్రపంచవ్యాప్తంగా మానవ కల్యాణం కోసం, ప్రజలందరి బాగుకోసం కావాల్సింది – మరో సరికొత్త వ్యవస్థాగత నిర్మాణం. ఎక్కడైతే కేవలం లాభాలే పరమావధి కావో... పెట్టుబడి అంతిమ లక్ష్యం ఆ లాభాల పెరుగుదల మాత్రమే కాదో అటువంటి సరికొత్త సామాజిక, ఆర్థిక నిర్మాణం మాత్రమే ప్రస్తుత నిరుద్యోగం, మాంద్యాలకు పరిష్కారం చూపగలదు. కాబట్టి, నేటి బైడెన్ యత్నం... కేవలం వ్యవస్థను కాపాడుకునే చిట్టచివరి దింపుడు కళ్లం ఆశగా మాత్రమే మిగిలిపోగలదు. కానీ అంతిమంగా అటు అమెరికా ప్రజానీకం, ఇటు మొత్తంగా ప్రపంచ ప్రజానీకం కూడా ఈ పరి ష్కారం దిశగా కదిలి తీరుతారు. వారలా కదిలే దిశగా కాలం, పరిస్థితులే వారిని ప్రేరేపిస్తాయి. మానవ జాతి ఇప్పటివరకూ తన పరిణామ క్రమంలో అధిగమించలేక పోయిన చిక్కుముడి అంటూ ఏదీ లేదు. నేడు కూడా అంతే. మనిషి జయించి తీరుతాడు. దారి ముందుకే, విజయానికే. డి. పాపారావు వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు ‘ 98661 79615 -
అంతటి హాలీవుడ్ కు సమ్మె ఎఫెక్ట్, నష్టం ఎంతంటే.?
అవును... హాలీవుడ్ సంక్షోభంలో చిక్కుకుంది. ఆరు దశాబ్దాల పైచిలుకు తర్వాత రచయితలు, నటీ నటులు మళ్ళీ ఏకకాలంలో సెట్స్‌కు దూరం జరిగారు. సినిమాలు, టీవీ షోల నిర్మాణం ఒక్కసారిగా ఆగింది. జీతభత్యాల పెంపు సహా పలు అంశాలపై నిర్మాతల కూటమి (అలయన్స్ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్)తో చర్చలు విఫలమై మే 2 నుంచి రచయితలు సమ్మె బాట పట్టారు. రెండు నెలల తర్వాత తాజాగా ఈ జూలై 13 నుంచి వేలాది నటులూ జత కలిశారు. సరైన జీతం, మెరుగైన పని పరిస్థితుల డిమాండ్లు తీరకపోవడంతో నటులూ పిడికిలి పైకెత్తారు. ఇక, రచన, నటనలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగాన్ని నటీనటుల సంఘం (ఎస్ఏజీ), రచయితల సంఘం (డబ్ల్యూజీఏ)... రెండూ వ్యతిరేకిస్తున్నాయి. సమ్మెకు అదీ ఒక ప్రధాన కారణమే. జంట సమ్మెల ప్రభావం చిత్రనిర్మాణంలోని ఇతర విభాగాల్లో, అనుబంధ పరిశ్రమల్లోని వేలమందిపైనా పడింది. కార్మికులంతా వీధిన పడ్డారు. అందుకే, ఇది వట్టి వినోదానికి మించిన విషయం. సీఈఓలకు లక్షల డాలర్లిస్తూ, రచయితలు, నటుల దగ్గరకొచ్చేసరికి నష్టాలొస్తున్నాయంటూ బీద అరుపులు అరవడం హాలీవుడ్‌లోనూ ఉన్నదే. 2000లో అన్నీ కలిపి హాలీవుడ్ వినోద పరిశ్రమకు 500 కోట్ల డాలర్ల లాభాలొస్తే, నెట్‌ఫ్లిక్స్ చేరికతో 2019కి అది 3 వేల డాలర్లకు దూసుకుపోయింది. రచయితల సంపాదన మాత్రం తగ్గిపోయింది. గత దశాబ్దకాలంలో రచయిత కమ్ నిర్మాత హోదా లోని వారి సగటు జీతం 4 శాతం మేర తగ్గింది. ద్రవ్యోల్బణంతో చూసుకుంటే, ఏకంగా 23 శాతం క్షీణించింది. తాజా స్ట్రీమింగ్ శకం ప్రకంపనలు రచనావృత్తిని తాకాయి. 2000లో టీవీ సీజన్ రైటర్లకు ఏటా 42 వారాల పని దొరికేది. స్ట్రీమింగ్‌తో సీజన్లు తగ్గి, 20 వారాలకు పడిపోయింది. 11,500 మంది సభ్యులున్న రచయితల సంఘంతో మూడేళ్ళకోసారి నిర్మాతల కూటమి కొత్త జీతభత్యాల ఒప్పందం కుదుర్చుకుంటుంది. వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ లాంటి భారీ స్టూడియోలు, నెట్‌ఫ్లిక్స్, పీకాక్ లాంటి పలు స్ట్రీమింగ్ వేదికలు ఆ నిర్మాతల్లో భాగమే. ఈసారి మే1తో కొత్త ఒప్పందం రావాలి. ఆరు వారాలు చర్చించినా ఫలితం లేకపోయింది. జీతం, పింఛన్, స్ట్రీమింగ్‌లో పదే పదే ప్రసారంతో రచయితలకు అదనంగా చేయాల్సిన అవశేష చెల్లింపులు (రాయల్టీలు) వగైరా ఎటూ తెగకపోవడంతో కలం కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. స్థూలంగా నటీనటులకూ ఇలాంటి సమస్యలే. చర్చలు ఫలించక నటీనటుల సంఘం సైతం తాజాగా షూటింగ్‌లకు దూరం జరిగింది. గత నవంబర్‌లో రంగప్రవేశం చేసిన ఛాట్‌జీపీటీ సైతం సృజనాత్మక రంగాలను కుదిపేస్తోంది. సమీప భవిష్యత్తులో ఏఐతో తమ పొట్ట కొట్టకుండా రక్షణ ఉండాలని రచయితల, నటుల డిమాండ్. ప్రస్తుతం స్ట్రీమింగ్ వేదికలు పెరిగాయి. కంటెంట్ దాహం తీరట్లేదు. దీన్ని అదనుగా చేసుకొని ఏఐ లాంటి వాటి శిక్షణకు తమ స్క్రిప్టులను వినియోగించరాదనీ, తమ రచనల నుంచి కొత్తవి సృష్టించడానికి ఏఐని వాడరాదనీ సృజనకారుల డిమాండ్. నటులు సైతం అనుమతి లేకుండా, పరిహారమి వ్వకుండా ఏఐతో తమ రూపాలనూ, స్వరాలనూ సృష్టించి నటింపజేయరాదంటున్నారు. అది సమంజసమే. నిర్మాతలు మాత్రం నేపథ్యంలోని నటీనటుల స్కాన్లను తీసుకొనే హక్కు తమకు ఉండాలంటున్నారు. తద్వారా వారి రూపాలను ఏఐతో సృష్టించి శాశ్వతంగా వాడుకోనివ్వాలని కోరుతున్నారు. అప్పుడిక పారితోషికమివ్వకుండానే పని జరిగిపోతుందనేది నిర్మాతల ఎత్తు. దీని పైనే తీవ్ర అభ్యంతరం. వెరసి, యావత్ సినీ చరిత్రలోనే రెండో పర్యాయం హాలీవుడ్ స్తంభించింది. 2007లో వంద రోజుల పాటు రచయితల సమ్మెతో ఒక్క క్యాలిఫోర్నియాకే 210 కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లింది. ఇప్పుడీ జంట సమ్మెలెంత నష్టం తెస్తాయో? రీషూట్లు, ప్రచారాలు, ప్రీమి యర్లకు నటులు దూరమయ్యేసరికి పూర్తయిన సినిమాలకూ ఇబ్బందే. టీవీ షోల కథ సరేసరి. ఎమ్మీ అవార్డుల ప్రదానం లాంటివీ వెనక్కిపోతాయి. వాటి కన్నా ముఖ్యం సాధారణ కార్మికుల పరిస్థితి. 1960లో నటులు, రచయితలు ఒకేసారి సమ్మె చేసినప్పుడు నటీనటుల సంఘానికి సారథి నటుడు, తర్వాత అమెరికా అధ్యక్షుడైన రొనాల్డ్ రీగన్. అయితే ఈసారి సమ్మె ప్రత్యేకమైనది. సాంకేతికతదే పైచేయి అయి, పని స్వభావం, సుస్థిరతపై ప్రభావం పడేవేళ యాజమాన్యానికీ, శ్రామికులకూ మధ్య బం«ధాల పునర్వ్యవస్థీకరణ అవసరమని గుర్తు చేస్తున్న సమ్మె ఇది. ఛాట్ జీపీటీతో పని చౌక గనక రచయితలు, ఎడిటర్లు, ఫోటోగ్రాఫర్ల లాంటి వైట్‌కాలర్ ఉద్యోగాలు పోతాయని భయం. అలాగని అంతర్జాల యుగంలో నియంత్రణలతో టెక్నాలజీని అడ్డగలమా అంటే అనుమానమే. ఎవరికీ దెబ్బ తగలకుండా మధ్యేమార్గంలో పోవడం విజ్ఞత. దర్శక దిగ్గజం క్రిస్టఫర్ నోలన్ అన్నట్టు తారల సంగతెలా ఉన్నా, ఏఐతో రచయితల, చిన్న నటీనటుల పొట్టకొట్టడం భావ్యం కాదు. నిజానికి, రచన, నటన లాంటి సృజనాత్మక కృషికి మేధ కన్నా మానసిక స్పందన ముఖ్యం. మనిషైతేనేం, మెషినైతేనేం అంతా ఒకటేనని కొందరు అనుకోవచ్చు. అననూవచ్చు. భవిష్యత్తులో అలాంటి ఏఐ ఆధారిత సినిమాలు రావచ్చు. కొత్త ఒక వింతగా ఆకట్టుకోనూవచ్చు. కానీ, ఏ సృజన ఎందుకు గొప్పదవుతుందో, ఎలా జనాదరణ పొందుతుందో యంత్రాలు, డేటాలు చెప్పగలవా? నకిలీ నటులు, కంప్యూటర్ రచయితలతో తయారైన ఏఐ చిత్రాలు నిజమైన సినిమాల అనుభూతిని అందించగలవా? కొద్దికాలానికి ఈ కృత్రిమ మేధాసృష్టి విసుగెత్తవచ్చు. అయితే, అప్పటికే అంతా ఆలస్యమైపోతుంది. హాలీవుడ్లో సమ్మె చేస్తున్నవారి ఆవేదన అదే! -
క్యూ1లో ఆటోమొబైల్ ఎగుమతులు డౌన్
ముంబై: భారత ఆటోమొబైల్ ఎగుమతులు ఏప్రిల్–జూన్ మధ్య కాలం(క్యూ1)లో 28 శాతం తగ్గిపోయాయి. ఆఫ్రికాతో పాటు ఇతర అభివృద్ధి చెందుతున్న (వర్థమాన)దేశాల్లో ద్రవ్య సంక్షోభ పరిస్థితులు ఇందుకు కారణమయ్యాయి. వాహన పరిశ్రమ సమాఖ్య సియామ్ తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించాయి. తొలి త్రైమాసికంలో మొత్తం 10.32 లక్షల యూనిట్లు ఎగుమతయ్యాయి. గతేడాది ఇదే క్వార్టర్ ఎగుమతులు 14.25 లక్షల యూనిట్లతో పోలిస్తే ఇది 28% తక్కువగా ఉంది. ► ఈ జూన్ త్రైమాసికంలో మొత్తం ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు అయిదు శాతం తగ్గి 1,52,156 యూనిట్లుగా నమోదయ్యాయి. కాగా 2022 ఏప్రిల్–జూన్ కాలంలో 1,60,116 యూనిట్లగా ఉన్నాయి. ► వార్షిక ప్రాతిపదిక ప్యాసింజర్ కార్ల ఎగుమతులు 1,04,400 యూనిట్ల నుంచి 94,793 యూనిట్లకు పడిపోయాయి. ► యుటిలిటీ వెహికల్స్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 55,419 యూనిట్లకు స్వల్పంగా తగ్గాయి. గత ఏడాది ఇదే కాలంలో 55,547 యూనిట్లు ఉన్నాయి. ► ద్విచక్ర వాహనాల ఎగుమతులు ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో 11,48,594 యూనిట్ల నుంచి 31 శాతం క్షీణించి 7,91,316 యూనిట్లకు చేరుకున్నాయి. ► వాణిజ్య వాహనాల ఎగుమతులు మొదటి త్రైమాసికంలో 14,625 యూనిట్లకు పడిపోయాయి. 2022–23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ కాలంలో 19,624 యూనిట్ల నుండి 25 శాతం తగ్గాయి. ► త్రీవీలర్ ఎగుమతులు కూడా గత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో 97,237 యూనిట్ల నుంచి సమీక్షా కాలంలో 25 శాతం క్షీణించి 73,360 యూనిట్లకు చేరుకున్నాయి. ► ‘‘ఆఫ్రికా, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో కరెన్సీల విలువ తగ్గింపు ప్రభావంతో తొలి త్రైమాసికంలో అన్ని వాహన విభాగ ఎగుమతులు తగ్గిపోయాయి. ఈ దేశాలు విదేశీ మారకద్రవ్య లభ్యత సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ అంశం వాహనాల అమ్మకాలను పరిమితం చేస్తోంది. అయినప్పటికీ ఈ మార్కెట్లలో కస్టమర్ల నుంచి వాహనాలకు డిమాండ్ ఉంది’’ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు. -
Kim Jong Un: ఓ వైపు ఆహార సంక్షోభం.. కిమ్ విందు, విలాసాలకు కోట్లు!
ఉత్తర కొరియా దేశం కరువుతో అల్లాడుతోంది. ఆహార కొరతతో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఓ వైపు దేశం ఆహార సంక్షోభంతో కొట్టుమిట్లాడుతుంటే ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మాత్రం తన లగ్జరీ జీవితాన్ని వదులుకోవడం లేదు. ఉత్తర కొరియా నియంత విందులు, విలాసాలకు కోట్లలో డబ్బులు వెచ్చిస్తున్నాడు. దేశ పరిస్థితిని పట్టించుకోకుండా ఖరీదైన మద్యం, సిగరెట్లు, ఇంపోర్టెడ్ మాంసం రుచిని ఆస్వాదిస్తున్నాడు. రూ. 5 లక్షల విలువ చేసే మద్యం ఈ మేరకు అమెరికా రక్షణ రంగ నిపుణుడు ఒకరు డైలీ స్టార్ పత్రికకు వెల్లడించారు. కిమ్ అత్యంత ఖరీధైన మద్యాన్ని తాగుతాడని ఆయన తెలిపారు. దాదాపు 7 వేల డాలర్లు(ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 5 లక్షలకు పైగా) విలువ చేసే హెన్నెస్సీ మద్యాన్ని సేవిస్తాడని పేర్కొన్నారు. అతడికి అవసరమైన విలాసవంతమైన మద్యం బ్రాండ్ల దిగుమతికే కిమ్ ప్రతి ఏడాది 30 మలియన్ డాలర్లు (రూ.247 కోట్లు) ఖర్చుపెడతారని వెల్లడించారు. ఈ విషయాన్ని కొన్నేళ్ల క్రితం చైనా జనరల్ అడ్మిన్‌స్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ బహిర్గతం చేసినట్లు తెలిపారు. బంగారపు రేకుతో చుట్టిన సిగరెట్లు కేవలం మద్యం మాత్రమే కాకుండా అత్యంత నాణ్యత, అరుదుగా దొరికే ప్రత్యేక ఆహారాన్ని కిమ్ తీసుకుంటారు. ఇటలీలోని పర్మా ప్రాంతంలో లభించే పర్మా హామ్(పోర్క్‌తో తయారు చేసేది), స్విస్ చీజ్‌ను దిగుమతి చేసుకుంటారు. ఆయన తాగే ఖరీదైన సిగరెట్లు ప్రత్యేకమైన బంగారపు రేకుతో చుట్టి ఉంటాయని చెబుతున్నారు. చదవండి: ఉత్తర కొరియా కిమ్ జోంగ్కు ఇన్సోమ్నియా డిజార్డర్!.. 140 కేజీల బరువు!! పిజ్జాల కోసం ఇటలీ నుంచి చెఫ్ కిమ్‌కు జంక్ ఫుడ్ అన్న అమిత ఇష్టం. 1997లో కిమ్ కేవలు పిజ్జాలు చేసేందుకు ఇటలీ నుండి ఖరీదైన చెఫ్‌ను రప్పించుకున్నాడు. తనకు ఇష్టమైన బ్రెజిలియన్ కాఫీ కోసం ప్రతి సంవత్సరం 9.6 లక్షల డాలర్లను(రూ.7 కోట్ల 96 లక్షలు) వెచ్చిస్తున్నారు. కిమ్, అతని తండ్రి కలిసి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గొడ్డు మాంసం కోబ్ స్టీక్స్, క్రిస్టల్ షాంపైన్‌తో భోజనం చేసేవారు. ఈ విషయాన్ని కిమ్ వద్ద గతంలో చెఫ్‌గా చేసిన ఒకరు పేర్కొన్నారు. స్నేక్ వైన్ యూకే మెట్రో రిపోర్ట్ ప్రకారం.. 2014లో కిమ్ లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఖరీదైన స్నేక్ వైన్ తాగేవాడట. అయితే ఉత్తర కొరియా నియంత విపరీతమైన మద్యపానం, ధూమపానం చేస్తున్నాడని, అతని బరువు 300 పౌండ్లు (136 కిలోలు) మించిపోయిందని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడించిన తర్వాత కిమ్ జోంగ్ ఉన్ విలాసవంతమైన ఫుడ్ డైట్ విషయం వెలుగులోకి వచ్చింది. నార్త్ కొరియా నియంత యూఎస్ఏ నుంచి మార్ల్బోరో సిగరెట్లతో సహా, నిద్రలేమికి చికిత్సకు ఉపయోగించే జోల్పిడెమ్ వంటి మందులను కూడా దిగుమతి చేసుకుంటున్నారని సదరు నివేదిక పేర్కొంది. మరోవైపు ప్రపంచ దేశాల ఆంక్షలతో ఒంటరిగా మారిన ఉత్తరకొరియాలో కరువు రాజ్యమేలుతోంది. దేశంలో పంటల సాగు తగ్గిపోవడంతో ప్రజలకు సరిపోను ఆహార పదార్థాలు లభ్యం కావడం లేదు. అదే విధంగా పొరుగు దేశమైన చైనా నుంచి ఎరువులు, ఆహారోత్పత్తికి అవసరమైన పరికరాలతోపాటు ధాన్యాల దిగుమతి కూడా నిలిపేసింది. దీంతో 2.6 కోట్ల జనాభా ఉన్న ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం నెలకొంది. చదవండి: సముద్రపు దొంగల ఒంటికన్ను సీక్రెట్ ఇదే..! -
NCP Crisis: అబ్బాయికి బాబాయ్ చురకలు
ముంబై: ఎన్సీపీని ఎట్టిపరిస్థితుల్లో చేజార్చుకోనని.. తిరుగుబాటుతో కుదేలు అయిన పార్టీని పునర్నిర్మించి తీరతానని తోటి నేతలతో శరద్ పవార్ మరోమారు స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో తన నివాసంలో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో పార్టీ చీలిక సంక్షోభం, భవిష్యత్ ప్రణాళిక గురించి పార్టీ నేతలతో చర్చించిన ఆయన.. తానే అధ్యక్షుడిగా కొనసాగుతానని, ఇకపైనా పార్టీని ముందుండి నడిపిస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో తిరుగుబాటు నేత అజిత్ పవార్ చేసిన రిటైర్మెంట్ వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు. వయసు 82 అయితే ఏంటి.. 92 అయితే ఏంటి.. ఈ వయసులోనూ నేను ఇప్పటికీ ఇంకా ఆరోగ్యంగానే ఉన్నా. పార్టీ కోసం పని చేస్తూనే ఉన్నా కదా అంటూ పవార్ సమావేశం అనంతరం మీడియా వద్ద ప్రస్తావించారు. పార్టీ అధ్యక్షుడిని నేనే. పార్టీలో చీలిక తదితర పరిణామాల గురించి నేరుగా ఈసీ వద్దే తేల్చుకుంటామని చెప్పారాయన. ‘‘ కొందరు తామే అసలైన ఎన్సీపీ నేతలమని.. పార్టీ అధినేత తానేనని చెప్పుకుంటున్నారు. ఎవరో ఏదో వాగుతున్నారని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇంకా ఆరోగ్యంగానే ఉండి.. పని చేస్తున్నా. ఇక మీదట అధ్యక్ష పదవిలోనూ నేను ఉంటా. వయసు ఎంత మీద పడినా సరే.. పార్టీ కోసం కష్టపడుతూనే ఉంటా. ఏం చెప్పాలనుకున్నా మనం ఎన్నికల సంఘం ముందే చెబుదాం. ఎవరికో ఏదో వివరణ ఇవ్వాల్సిన అవసరం మనకు లేదూ అంటూ తోటి నేతలతో సమావేశంలో చెప్పారాయన. Meeting of @NCPspeaks was held at the Delhi residence of National President Hon'ble Sharad Pawar Saheb. Party Working committee members, Mp's, leaders and office bearers attended this meeting to discuss important strategies and chart the course for future endeavors.@supriya_sule… pic.twitter.com/3mWpQEuIoO — Sharad Pawar (@PawarSpeaks) July 6, 2023 ఇదిలా ఉంటే.. శరద్ పవార్ నేతృత్వంలో ఆయన నివాసంలో జరిగిన కార్యవర్గ సమావేశం.. తిరుగుబాటు నేతలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో న్యాయపరంగా ఈ అంశాన్ని ఎలా ఎదుర్కోవాలనే సమాలోచనలు చేస్తోంది. ఒక ఎన్సీపీ కార్యవర్గ సమావేశం జరుగుతున్న సమయంలోనే అజిత్ పవార్ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం కీలక ప్రకటన చేసింది. శరద్ పవార్ నిర్వహించిన పార్టీ కార్యవర్గ సమావేశం చెల్లదని, అసలు అలాంటి భేటీ నిర్వహించేందుకు అధికారం.. అందులో నిర్ణయాలు తీసుకునేందుకు హక్కు లేదంటూ అజిత్‌పవార్ వర్గం ఒక ప్రకటన విడుదల చేసింది. పవార్‌తో రాహుల్ భేటీ ఇదిలా ఉంటే.. ఎన్సీపీ కార్యవర్గ సమావేశం తర్వాత జన్‌పథ్‌లోని తన అధికార నివాసానికి శరద్ పవార్ చేరుకున్నారు. ఆ వెంటనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. పవార్ నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. పార్టీ చీలిక సంక్షోభంపై వీళ్లు చర్చించినట్లు సమాచారం. #WATCH | Congress leader Rahul Gandhi meets NCP President Sharad Pawar in Delhi pic.twitter.com/vU2DUZZMqH — ANI (@ANI) July 6, 2023 ఇదీ చదవండి: బీజేపీతో పొత్తు కోసం యత్నించింది శరద్ పవారే! -
మొత్తం శరద్ పవారే చేశారు.. ఎన్సీపీ చీఫ్‌పై సంచలన వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమిలోని ఎన్సీపీ చీలికపై.. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి సంక్షోభాలకు శరద్ పవార్ ఆద్యుడని ఆరోపించిన రాజ్ థాక్రే.. తాజా పరిణామాలకు కూడా శరద్ పవారే కారణమంటూ పేర్కొన్నారు. మహారాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలపై మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(MNS) చీఫ్ రాజ్ థాక్రే బుధవారం మీడియాతో మాట్లాడారు. ఎన్సీపీ సంక్షోభం శరద్ పవార్ ఆశీస్సులతోనే జరిగిందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారాయన. ‘‘రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే జరిగిందో అది అసహ్యమైన రాజకీయం. ఇది ముమ్మాటికీ ఓటర్లను అవమానించడమే అని తీవ్రంగా స్పందించారాయన. అసలు మహారాష్ట్రలో ఇలాంటి రాజకీయాలు మొదలుపట్టిందే శరద్ పవార్. 1978లో పులోద్(పురోగామి లోక్‌షాహీ దళ్) పేరుతో చీలిక రాజకీయాలను ప్రదర్శించారు. అప్పటిదాకా మరాఠా రాజకీయం అలాంటి పరిణామాలను చూడలేదు. ఇలాంటివి పవార్‌తోనే మొదలై.. ఆయనతోనే ముగిసేలా కనిపిస్తున్నాయి. కర్మ ఫలితాన్ని ఆయన అనుభవించాల్సిందే కదా. ఇప్పుడు జరుగుతున్నదంతా ఆయన చేజేతులారా చేసుకున్నదే అని రాజ్ థాక్రే విమర్శించారు. అలాగే.. ప్రఫుల్ పటేల్, దిలీప్ వాల్సే పాటిల్, ఛాగన్ భుజ్‌బల్‌లు అజిత్ పవార్ వెంట వెళ్లే వ్యక్తులు ఏమాత్రం కాదని.. వాళ్లకు కచ్చితంగా శరద్ పవార్ అండదండలు ఉంటాయని ఆరోపించారాయన. ఆనాడు ఏం జరిగిందంటే.. 1977 సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం.. జనతా పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్‌లో చీలిక ఏర్పడింది. ఇందిరా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్(ఐ), యశ్వంత్‌రావు చవాన్ నేతృత్వంలో కాంగ్రెస్(యూ)గా ముందుకు వెళ్లాయి. మహారాష్ట్రలో మెజారిటీ సీట్లు ఓడిపోవడంతో నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి సీఎం శంకర్రావ్ చవాన్ రాజీనామా చేశారు. దీంతో వసంత్‌దాదా పాటిల్ సీఎం అయ్యారు. అయితే.. శరద్ పవార్ అప్పటి పాటిల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నుంచి తెగదెంపులు చేసుకుని బయటకు వచ్చారు. తన రాజకీయ గురువైన యశ్వంత్‌రావు చవాన్ పంచన చేరి కాంగ్రెస్(యూ)లో కొనసాగారు. అయితే.. అధికారం కోసం కాంగ్రెస్(యూ) నుంచి విడిపోయి.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(సోషలిస్ట్) పార్టీని సొంతంగా ఏర్పాటు చేశాడు శరద్ పవార్. ఆపై జనతా పార్టీ, పీడబ్ల్యూపీలతో కలిసి ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్(ప్రగతిశీల ప్రజాస్వామ్య కూటమి) లేదా పురోగామి లోక్‌షాహీ అగాఢి ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా 38 ఏళ్ల శరద్ పవార్ ప్రమాణ స్వీకారం చేయగా.. 1978 జులై 18 పీడీఎఫ్ ప్రభుత్వం కొలువుదీరింది. అయితే.. ఇందిరా గాంధీ తిరిగి అధికారంలోకి వచ్చాక 1980 ఫిబ్రవరి 18వ తేదీన ఆ ప్రభుత్వం రద్దు అయ్యింది. అదే ఏడాదిలో జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ తిరిగి అధికారం కైవసం చేసుకుంది. ఇదీ చదవండి: శరద్ పవార్‌కు షాక్ -
సంక్షోభంలో రష్యా
మాస్కో: ఉక్రెయిన్‌పై ఏడాదిన్నరగా యుద్ధం చేస్తున్న రష్యా అనూహ్య పరిణామాలతో అంతర్గత సంక్షోభంలోకి వెళ్లిపోయింది. ఇన్నాళ్లూ ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా తరఫున పోరాడిన ప్రైవేటు సైనిక సంస్థ వాగ్నర్ శుక్రవారం రాత్రికి రాత్రే ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. రష్యా మిలటరీ నాయకత్వాన్ని కూలి్చవేస్తామని వాగ్నర్ చీఫ్ యెవ్గెనీ ప్రిగోజిన్ గర్జించారు. తమ సంస్థకు చెందిన బలగాలను లక్ష్యంగా చేసుకొని రష్యా సైన్యం దాడులకు దిగుతోందని అందుకే ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. రష్యాలోని ప్రధాన నగరమైన రోస్తోవ్ దాన్ తమ అధీనంలోనే ఉందని ఆయన ప్రకటించారు. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగును లక్ష్యంగా చేసుకుంటూ పలు వీడియోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. తమ సంస్థపై సెర్గీ దాడులు చేయిస్తున్నారని ఆయనను విడిచిపెట్టబోమంటూ ఆగ్రహావేశాలతో వీడియోలో హెచ్చరికలు జారీ చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత అంతరంగికుడైన ప్రిగోజిన్ ఈ తిరుగుబాటుకు పాల్పడడాన్ని ప్రభుత్వంలో ఎవరూ జీరి్ణంచుకోలేకపోతున్నారు. ఈ పరిణామాలతో రష్యాలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రిగోజిన్‌ను నిలువరించడానికి తన సొంత దేశంలోనే రష్యన్ మిలటరీ దాడులకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కల్లోల పరిస్థితుల మధ్య ఏది వాస్తవమో , ఏది కాదో అన్న గందరగోళం కూడా ఏర్పడింది. ఒకానొక దశలో రష్యా అద్యక్షుడు పుతిన్ మాస్కో విడిచి పరారయ్యారన్న వార్తలు హల్చల్ చేశాయి. అయితే అందులో నిజం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ప్రిగోజిన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత రెండు దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా అధ్యక్షుడు పుతిన్ పదవీ గండాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ తిరుగుబాటుపై జాతినుద్దేశించిన ప్రసంగించిన పుతిన్ ప్రిగోజిన్ పేరు ప్రస్తావించకుండా దేశద్రోహానికి పాల్పడ్డారని, వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. తిరుగుబాటు చేసిన వారందరినీ కఠినంగా శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. దేశంలో బలగాలను, అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేశామని, ఎలా ముందుకు వెళ్లాలో ఆదేశాలిచ్చామని చెప్పారు. రష్యా ఎఫ్ఎస్బీ సెక్యూరిటీ సరీ్వస్ ప్రిగోజిన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసింది. పుతిన్ తప్పు చేశారు : ప్రిగోజిన్ పుతిన్ ప్రసంగం అనంతరం ప్రిగోజిన్ మరో ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. తమను దేశద్రోహులమని పేర్కొని పుతిన్ అతి పెద్ద తప్పు చేశారన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో పోరాటం చేసిన తామే అసలు సిసలు దేశభక్తులమని అన్నారు. తాము ప్రభుత్వానికి లొంగి పోయే స్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 25వేల మంది సైన్యంతో తిరుగుబాటు ఉక్రెయిన్ యుద్ధభూమిలో ఉన్న వాగ్నర్ సైనికుల్ని వెనక్కి రప్పించిన ప్రిగోజిన్ రోస్తోవ్ దాన్ నగరంలోసైనిక ప్రధాన కార్యాలయం, ఇతర సైనిక స్థావరాలను తమ అ«దీనంలోకి తెచ్చుకున్నట్టు చెబుతున్నారు. నగరంలో మిలటరీ వాహనాలు, ట్యాంకుల్ని మోహరించిన వీడియోలు కూడా విడుదల చేశారు. ఒక్క తుపాకీ తూటా పేలకుండానే తాము మిలటరీ కార్యాలయాన్ని స్వా«దీనం చేసుకున్నామని ప్రిగోజిన్ చెప్పారు. రక్షణ మంత్రి సెర్గీ షొయిగు, మిలటరీ జనరల్ గెరాసిమోవ్ రోస్తోవ్లోని మిలటరీ కార్యాలయంలో తనతో సమావేశం కావాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ నెరవేర్చకపోతే రాజధాని మాస్కోని ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. వాగ్నర్ సంస్థకు చెందిన దాదాపుగా 25 వేల మంది సైనికులు మాస్కోదిశగా కదులుతున్నట్టు తెలుస్తోంది. మాస్కోకి దక్షిణంఆ 360 కి.మీ. దూరంలోని లిపె్టక్ ప్రావిన్స్‌లో వాగ్నర్ బలగాలు, ఇతర ఆయుధాల్ని మోహరించినట్టుగా ప్రిగోజిన్ విడుదల చేసిన వీడియోల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని లిపె్టక్ ప్రావిన్స్ గవర్నర్ ఇగోర్ అర్టమోనోవ్ కూడా ధ్రువీకరించారు. వాగ్నర్ సైన్యాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వ సేనలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రజల భద్రతకు ఎలాంటి ప్రమాదమూ లేదని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున జనం గుమిగూడే కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు మాస్కో ప్రాంత గవర్నర్ తెలిపారు. విద్యా సంస్థలను జులై ఒకటి దాకా మూసివేసినట్లు తెలుస్తోంది. తాత్కాలిక విరమణ బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకశెంకో మధ్యవర్తిత్వంతో శనివారం రాత్రికల్లా ఇరువర్గాల మధ్య తాత్కాలిక ఒప్పందం కుదిరింది. మాస్కో దిశగా వెళుతున్న వాగ్నర్ గ్రూపు సైనికులను ఆగిపోవాల్సిందిగా యెవ్గెనీ ప్రిగోజిన్ ఆదేశాలు ఇచ్చారు. రష్యన్ల రక్తం చిందకూడదనే ఉద్దేశంతోనే మాస్కో దిశగా ముందంజ వేయడాన్ని నిలిపివేసినట్లు తెలిపారు. ఉక్రెయిన్‌లోని తమ స్థావరాలకు మళ్లాల్సిందిగా తమ బలగాలకు ఆదేశాలు జారీచేసినట్లు వెల్లడించారు. వాగ్నర్ గ్రూపు సైనికుల రక్షణకు పుతిన్ నుంచి హామీ లభించిందని మధ్యవర్తిత్వం వహించిన లుకశెంకో ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి బలహీనంగా రష్యా : జెలెన్స్కీ రష్యాలో అంతర్గత సంక్షోభంతో ఆ దేశం పూర్తి స్థాయిలో బలహీనపడిపోయిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. చెడు మార్గాన్ని అనుసరించే వారందరూ తమను తామే నాశనం చేసుకుంటారన్నారు. ‘‘చాలా కాలంగా రష్యా తన బలహీనతల్ని కప్పిపుచ్చుకుంటూ వస్తోంది. ప్రభుత్వంలో ఉన్న వారి మూర్ఖత్వాన్ని దాచిపెడుతూ వస్తోంది. ఇక ఏదీ దాచి ఉంచలేరు. అబద్ధాలు చెప్పలేరు. రష్యా తమ సైన్యాన్ని దళాలు, కిరాయి సైన్యం ఉక్రెయిన్‌లో ఎంత కాలం ఉంచుతుందో అంత ఎక్కువ బాధను ఆ దేశం కూడా ఎదుర్కొంటుంది’’ అని జెలెన్స్కీ ట్వీట్ చేశారు. -
మలేషియాలో పాకిస్తాన్ కు ఘోర అవమానం.. విమానం సీజ్
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్(PIA )కు చెందిన విమానాన్ని మలేషియాలోని కౌలాలంపూర్‌లో సీజ్ చేశారు. ఎయిర్ క్యాప్ అనే లీజింగ్ సంస్థకు చాలాకాలంగా బకాయిలు చెల్లించని కారణంగా పాకిస్తాన్ విమానం బోయింగ్ కో. 777 విమానాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు మలేషియా అధికారులు. బాకీ తీర్చమంటే... ఎయిర్ క్యాప్ సంస్థకు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్(PIA ) సుమారుగా 4 మిలియన్ల డాలర్లు(రూ. 33 కోట్లు) బకాయి పడింది. ఈ సంస్థ అనేకమార్లు బకాయిల గురించి వివరణ కోరుతూ సందేశాలు పంపినా కూడా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సంస్థ నుండి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో ఇదే విషయాన్ని మలేషియా కోర్టుకు విన్నవించగా బోయింగ్ కో. 777 విమానాన్ని వెంటనే సీజ్ చేయాల్సిందిగా ఆదేశాలను జారీ చేసింది. ఈ విమానం మంగళవారం కౌలాలంపూర్ విమానాశ్రయం చేరుకున్నట్లు సమాచారం అందుకోగానే అక్కడి కస్టమ్స్ అధికారులు నిర్దాక్షిణ్యంగా విమానంలో నిండుగా ప్రయాణికులు ఉండగానే విమానం సీజ్ ప్రక్రియను చేపట్టారు. ఇదే విమానం రెండోసారి... ఇదే తరహాలో 2021లో కూడా కౌలాలంపూర్ ఏవియేషన్ శాఖ ఇదే కారణంతో ఇదే విమానాన్ని మొదటిసారి సీజ్ చేయగా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సంస్థ బకాయిల చెల్లింపుపై హామీ ఇవ్వడంతో 173 ప్రయాణికులతో ఉన్న ఈ విమానాన్ని జనవరి 27న తిరిగి పంపించడానికి అంగీకరించారు కౌలాలంపూర్ ఏవియేషన్ అధికారులు. తాజాగా పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ నుండి జవాబు లేకపోవడంతో సదరు లీజింగ్ సంస్థ కోర్టును ఆశ్రయించి మరోసారి సీజ్ ఆర్డర్స్ తెచ్చుకుని విమానాన్ని సీజ్ చేయించింది. మొత్తం చెల్లించేసాం... మళ్ళీ అదే కథ పునరావృతం కావడంతో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన అధికారి అబ్దుల్లా హఫీజ్ ఖాన్ స్పందిస్తూ మా విమానం ఆగ్నేయ దేశాల్లో సీజ్ కావడం ఇది రెండోసారి. మేము చెల్లించాల్సిన బకాయిలను మేము గతంలోనే చెల్లించేసాం, అయినా కూడా వారు ఇలా చేయడం సరికాదని అన్నారు. దీనికి బదులుగా ఎయిర్ క్యాప్ సంస్థ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ బకాయిలు ఇంకా అలాగే ఉన్నాయని దానికి తోడు వివరణ కోరుతూ అనేక సందేశాలు పంపించినా కూడా వారినుంచి ఎటువంటి స్పందన రాలేదని అన్నారు. గతకొంత కాలంగా పాకిస్తాన్ దేశం ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితుల నుండి తేరుకుంటోన్న పాకిస్తాన్ పై మలేషియా కోర్టు కఠినంగా వ్యవహరించడంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టయ్యింది. -
దివాలా అంచున అమెరికా
దివాలా అంచున అమెరికా -
గోధుమల ఎగుమతుల బ్యాన్: ఫుడ్ ఎమర్జెన్సీ నుంచి ఇండియా ఎలా బైటపడిందో తెలుసా?
దేశంలో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లకుండా చూసేందుకు భారత ప్రభుత్వం కిందటేడాది గోధుమల ఎగుమతిపై నిషేధం విధించింది. ఇంకా, బియ్యం ఎగుమతులపై షరతులతో కూడిన ఆంక్షలు అమలుచేస్తోంది. 2022 సెప్టెంబరులో బియ్యం నూకల ఎగుమతి పూర్తి నిషేధంతో పాటు కేంద్ర సర్కారు ఇతర రకాల తెల్ల బియ్యంపై 20 శాతం ఎగుమతి పన్ను విధించింది. గత సంవత్సరం వరి పండించే రాష్ట్రాల్లో తగినంత వర్షపాతం లేకపోవడం, ఇతర సమస్యల కారణంగా దేశంలో బియ్యం ధరలు పెరగకుండా నిరోధించడానికి కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. ఈ ఏడాది బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని తొలగించే అవకాశం లేదని మొన్న ఫిబ్రవరిలో ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే 2023–2024 సంవత్సరంలో దేశంలో గోధుమల ఉత్పత్తి పెరుగుతుందనే అంచనాలు ఉన్నప్పటికీ ఈ ధాన్యం, గోధుమ ఉత్పత్తుల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఈ ఏడాది మార్కెటింగ్ సీజన్ గడిచే వరకూ ఇండియా తొలగించకపోవచ్చని కూడా అమెరికా వ్యవసాయ శాఖలోని విదేశీ వ్యవసాయ సేవల విభాగం అంచనా వేసింది. ప్రపంచంలో అతిపెద్ద బియ్యం ఎగుమతి దేశం అయిన ఇండియా దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ చర్యలు తీసుకుంటోంది. స్వాతంత్య్రం వచ్చేనాటికి ఆహారధాన్యాల తీవ్ర కొరత ఎదుర్కొన్న దేశం ఇండియా. అలాంటిది ఈ 75 ఏళ్లలో గోధుమలు, వరి బియ్యం తదితర ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెంచగలగడమేగాక వరి, గోధుమలను పెద్ద మొత్తాల్లో ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థితికి నేడు చేరుకోవడం దేశం సాధించిన గొప్ప విజయం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బెంగాల్ ప్రజలకు సరఫరా చేయాల్సిన ఆహారధాన్యాలను బ్రిటిష్ సేనల కోసం నాటి ఇంగ్లండ్ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ ఆదేశాల ప్రకారం తరలించడంతో 1943లో బెంగాల్ లో కరువు వచ్చి లక్షలాది జనం మరణించారు. దేశ విభజనతో ఇండియాలో ఆహారధాన్యాల కొరత తీవ్రం 1947 ఆగస్టులో జరిగిన దేశవిభజనతో భారతదేశంలో తిండిగింజల కొరత తీవ్రమైంది. వరి విపరీతంగా పండే తూర్పు బెంగాల్ (నేటి బంగ్లాదేశ్), గోధుమల సాగు విస్తారంగా జరుగుతూ, భారీ దిగుబడులకు పేరుగాంచిన పశ్చిమ పంజాబ్ ప్రాంతాలు పాకిస్తాన్ లో అంతర్భాగం కావడం వల్ల భారత్ లో ఆహారధాన్యాల కొరత కనీవినీ రీతిలో పెరిగింది. అంతకు ముందు 1937లో ఇండియా నుంచి బర్మాను విడదీసి బ్రిటిష్ వారు దానికి స్వాతంత్య్రం ఇవ్వడంతో దేశంలో పప్పుధాన్యాల కొరత వచ్చింది. ఈ సమస్య నెమ్మది మీద పరిష్కారమైంది. స్వతంత్ర భారతంలో తొలి ప్రధాని పండిత నెహ్రూ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాలు దేశంలో ఆహారధాన్యాల సాగును అభివృద్ధిచేసే కన్నా తిండి గింజలను దిగుమతి చేసుకోవడమే తక్కువ ఖర్చుతో కూడిన పని అని భావించాయి. మొదటి పదేళ్ల కాలంలో పరిశ్రమల స్థాపనకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. రెండో పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయానికి ప్రాముఖ్యం ఇవ్వాలని 1959లో ఢిల్లీ వచ్చిన అమెరికా వ్యవసాయ నిపుణుల బృందం నెహ్రూ సర్కారుకు సలహా ఇచ్చింది. ఆహారధాన్యాల సాగుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చినాగాని నెహ్రూ కాలం నుంచి 1970 వరకూ ఇండియాలో తిండి గింజల దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి కొనసాగింది. 1964-1969 మధ్యకాలంలో అంటే శాస్త్రి, ఇందిరాగాంధీ పాలనలో అమెరికా నుంచి ఇండియాకు పీఎల్-480 అనే పథకం కింద నాసిరకం గోధుమలు ఉచితంగా, రాయితీ ధరలపై సరఫరా అయ్యేవి. అయితే, తమిళనాడుకు చెందిన కేంద్రమంత్రి సి.సుబ్రమణ్యం చొరవతో రూపొందించి, ప్రవేశపెట్టిన వ్యవసాయ రంగ సంస్కరణలు–హరిత విప్లవం పేరుతో తక్కువ కాలంలోనే మంచి ఫలితాలు ఇచ్చాయి. అధిక దిగుబడినిచ్చే గోధుమ (మెక్సికో రకం), వరి వంగడాలు విస్తారంగా రైతులకు అందుబాటులోకి రావడం దేశంలో తిండిగింజల ఉత్పత్తి బాగా పెరిగింది. దాంతో అమెరికా నుంచి ఆహారధాన్యాల సాయానికి భారత్ స్వస్తి పలికింది. పంజాబ్, పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో గ్రీన్ రివల్యూషన్ పద్ధతులు సత్ఫలితాలనిచ్చాయి. దీంతో, 1968 రబీ సీజన్ లో దేశంలో అంతకు ముందు అత్యధికంగా పండిన పంట కన్నా 30 శాతం ఎక్కువ ఆహారధాన్యాల దిగుబడి సాధించాం. మధ్యలో అనావృష్టి పరిస్థితులు ఎదురైనా..ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో తిండి గింజలు ఎగుమతి చేసే దేశంగా ఇండియా ప్రపంచంలో పేరు సంపాదించుకుంది. -విజయసాయిరెడ్డి, రాజ్యసభ ఎంపీ, వైఎస్సార్ సీపీ -
సంక్షోభం నేర్పుతున్న సన్నద్ధ పాఠం
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం దీర్ఘకాలం కొనసాగడం భారత్‌కు సంకటంగా మారుతోంది. బ్రిక్స్, షాంఘై కో–ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) వంటి ఏర్పాట్ల ద్వారా చైనా, రష్యా రెండింటితో సంబంధం కలిగి ఉండటం ఒక కారణం. క్వాడ్, మలబార్ గ్రూపింగ్ ద్వారా ఇంకోపక్క భారత్ అమెరికా తోనూ జట్టుకట్టింది. భారత్ ఏకకాలంలో అటు ఎస్సీఓ, ఇటు జీ20లకు అధ్యక్ష స్థానాన్ని నిభాయిస్తూండటం చెప్పుకోవాల్సిన అంశం. వ్యూహాత్మకంగా స్వతంత్రంగా ఉంటూనే ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలంటే భారత్ చాలా దార్శనికతతో వ్యవహరించాలి. వాణిజ్యం, వ్యాపారం, దౌత్యం అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. ఈ సమన్వయం ద్వారా మిలిటరీ టెక్నాలజీలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నించాలి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ ప్రకంపనలు ప్రపంచం నలుమూలలా వినిపిస్తున్నాయి. యుద్ధం తాలూకూ దుష్ప్రభావం కేవలం రాజకీయాలకు, ఆర్థిక వ్యవస్థలకు మాత్రమే పరిమితం కాలేదు. అన్నిచోట్లా సామన్యుడిని సైతం ఇబ్బందిపెట్టే స్థాయికి ఈ యుద్ధం చేరుకుంది. గోధుమలు,వంటనూనెలు, ఎరువుల విషయంలో ఉక్రెయిన్ తిరుగులేని స్థానంలో ఉంది. ముడిచమురు, సహజవాయువుల్లో రష్యా పెత్తనం గురించి చెప్పనక్కర్లేదు. వీటన్నింటికీ ఏర్పడ్డ కొరత స్టాక్‌మార్కెట్లను కూల్చే స్తూంటే... పెరిగిపోతున్న ధరలు, ప్రజల్లోని అసంతృప్త రాజకీయ ఉద్యమాలను ప్రేరేపిస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ అణ్వాయుధ ప్రయోగం గురించి మాట్లాడటం ద్వారా ప్రపంచాన్ని మూడో ప్రపంచయుద్ధం ముంగిట్లో నిలబెట్టారు. తన నిర్లక్ష్య ధోరణితో విపరీతమైన ఆస్తి నష్టానికీ కారణమయ్యారు. రష్యాపై విధించిన ఆంక్షలు ప్రపంచీకరణ ప్రక్రియను నిలిపేశాయని అనలేము. కానీ ఆహారం, ఇంధనం, సరు కులు, ఆయుధాల కోసం దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం మొదలుపెట్టడంతో కూటముల పునరేకీకరణ, భిన్న ధ్రువాల ఏర్పాటు మొదలైందని చెప్పాలి. రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి దారితీసిన కారణాలపై చర్చలు అంతులేనంతగా సాగవచ్చు. దీనికి ముఖ్యంగా రెండు ముఖా లైతే కనిపిస్తున్నాయి. మొదటగా చెప్పుకొనే పుతిన్ వాదన గురించి చూద్దాం. ఉక్రెయిన్ అనే దేశం అసలు అస్తిత్వంలోనే లేదంటాడు పుతిన్ . ఎందుకయ్యా అంటే, ‘‘అది రష్యా చరిత్ర, సంస్కృతి, ఆధ్యా త్మికతల్లో అవిభాజ్యమైన భాగం’’ అన్న సమాధానం వినిపిస్తోంది. ఇలాంటి వాదనలు ఇతరులపై తమ పెత్తనమే చెల్లాలని కోరుకునే చోట్ల వినిపిస్తూంటాయి. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చైనా చెప్పు కొనే ‘నైన్ డాష్ లైన్ ’ మాదిరిగా! లేదా చైనా అక్సాయ్‌చిన్ ఆక్రమణ, అరుణాచల్‌ప్రదేశ్ తమదని నిస్సిగ్గుగా చెప్పుకోవడం ఉదాహరణ లుగా పేర్కొనవచ్చు. ఇంకో పక్క అమెరికా, యూరప్ విశ్వాసరహితంగా వ్యవహరి స్తున్నాయని పుతిన్ ఆరోపిస్తున్నారు. నాటో దళాలు ఒక్క అంగుళం కూడా ముందుకు కదలవని గతంలో యూఎస్ఎస్ఆర్ అధ్యక్షుడు గోర్బచేవ్‌కు ఇచ్చిన మాటను ఆయన గుర్తు చేస్తున్నారు. ఈ మాట ఇచ్చిన పదేళ్లలోనే నాటో వార్సా ఒప్పందంలో భాగమైన పది దేశాలకు సభ్యత్వం ఇచ్చి మాట తప్పిన ఆరోపణలున్నాయి. తాజాగా ఫిన్లాండ్కూ చోటు దక్కడంతో 31 దేశాలతో నాటో బలంగా తయారైనట్లు కనిపిస్తోంది. దీంతో తాను బలహీనమవుతున్న భావన రష్యాకు కలుగుతోంది. ఈ విషయాలెలా ఉన్నా, ఓ సార్వభౌమ దేశంపై ఏకపక్ష దాడిని రష్యా ఏ రకంగానూ సమర్థించుకోలేదు. అదే సమయంలో పాశ్చాత్య దేశాలూ ఉక్రెయిన్ కు నిత్యం ఆయుధాలు సరఫరా చేస్తూ యుద్ధం ఇంత సాగేలా చేయడం కూడా ఆక్షేపించదగ్గదే. భారత్‌కు సంకటం... ఉక్రెయిన్‌పై దాడి వ్యూహం బెడిసికొడుతున్న నేపథ్యంలో రష్యాకు ఇప్పుడు అత్యవసరంగా స్నేహితుల అవసరం ఏర్పడుతోంది. ఈ అవసరాన్ని కాస్తా చైనా తీర్చింది. షీ జిన్ పింగ్ ఇప్పుడు పక్కాగా రష్యా వైపు నిలబడ్డారని చెప్పవచ్చు. ఫలితంగా ఇకపై చైనాకు రష్యా నుంచి ఆటంకాలు ఎదురుకాకపోవచ్చు. అయితే ఈ క్రమంలో రష్యా కాస్తా చైనా గుప్పిట్లో చిక్కుకునే అవకాశం ఉందా! అదే జరిగితే రష్యా ఇప్పటివరకూ పలు దేశాలతో, మరీ ముఖ్యంగా భారత్‌తో స్వతంత్రంగా నడుపుతున్న సంబంధాలపై చైనా ప్రభావం పడుతుంది. మిలిటరీ అవసరాలను తీర్చే సామర్థ్యం తగ్గిపోయిన నేపథ్యంలో భారత విధాన రూపకర్తలు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఇది. ఇటీవల పూంఛ్‌లో మిలిటరీ దళాలపై జరిగిన దాడి... పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ ఇప్పటికీ ఉగ్రవాదానికి కలిసికట్టుగా ఊతమిస్తున్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. స్థిర నిర్ణయానికి సమయం ఇదే... రెండువైపుల నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు భారత్ ఒక స్థిర నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. విధానా లతోపాటు ప్రాథమ్యాల పునః సమీక్ష అవసరం. దౌత్య సంబంధాల అజెండాలో టెక్నాలజీ సముపార్జనను కూడా భాగం చేయడం తక్షణ కర్తవ్యం. జపాన్ , ఆస్ట్రేలియాలతో కూడిన ‘క్వాడ్ అండ్ మలబార్ గ్రూపింగ్’ అనేది అమెరికా, భారత్ వ్యూహాత్మక అవసరాలు కలి యడం ఫలితంగా పుట్టుకొచ్చింది. మిలిటరీ, దౌత్య అవసరాలను తీర్చేందుకు మాత్రమే ఇవి ఉపయోగపడుతున్నట్లు కనిపిస్తున్నా ప్రభావం చాలా ఎక్కువే. చైనా తరచూ క్వాడ్‌ను ఉద్దేశించి బెదిరింపులకు దిగడం ఈ గ్రూపింగ్‌ను తన ఆధిపత్య ప్రణాళికలకు గండి కొట్టేదిగా చూడటమే కారణం. అయితే చైనా బెదిరింపులకు కౌంటర్ ఇచ్చే విషయంలో అమెరికా మినహాయించి మిగిలిన దేశాలు తట పటాయించాయి. తమ గ్రూపింగ్ వల్ల భద్రతాపరమైన ప్రభావాలేవీ ఉండవనీ, తమది ‘ఆసియా నాటో’ కూటమి కాదనీ చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఈ పరిస్థితిని మార్చి, పదును పెరిగేలా భారత్ చొరవ తీసుకోవాలి. ఈ విషయంలో అమెరికా చేపట్టిన రెండు పనుల గురించి ప్రస్తావించాలి. 2021 సెప్టెంబరులో ఆస్ట్రేలియా, యూకే, అమెరికా కలిసి త్రైపాక్షిక భద్రత ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం అమెరికా, బ్రిటన్ రెండూ ఆస్ట్రేలియాతో అత్యాధునిక టెక్నాలజీలను పంచుకుంటాయి. అణ్వస్త్ర సామర్థ్యమున్న జలాంతర్గామిని పొందే విషయంలో కూడా సాయం అందిస్తాయి. యూకే, అమెరికా అణు జలాంతర్గాములను ఆస్ట్రేలియాలో మోహరించడంతోపాటు అణ్వా యుధాల విషయంలో ఆస్ట్రేలియా సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకూ ఏర్పాట్లు జరిగాయి. ఆశ్చర్యకరంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు బాగానే ఉన్నప్పటికీ అణు జలాంతర్గాముల విషయంలో భారత్‌కు అమెరికా ఇలాంటి సౌకర్యాలేవీ కల్పించడం లేదు. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం, చారిత్రాత్మక పౌర అణు ఒప్పందం వంటివేవీ అక్కరకు రాలేదు. అయితే అమెరికా 2022 మే నెలలో ‘క్రిటికల్ ఇంజినీరింగ్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్’ పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రకటించింది. ఇది మనకు అనుకూలమైన ఫలితా లేమైనా సాధిస్తుందా అన్నది వేచి చూడాలి. మనది అణ్వాయుధాలు కలిగిన దేశం. అంతరిక్ష రంగంలోనూ అగ్రస్థానంలో ఉంది. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద మిలటరీ వ్యవస్థను కలిగి ఉంది. అయినా... మిలిటరీ విషయంలో మన ప్రయత్నాలు పూర్తిస్థాయిలో లేవనే చెప్పాలి. దిగుమతులపై ఆధారపడే దేశంగానే మిగిలిపోయాం. ఆత్మ నిర్భరత సాధించడం అనేది చాలా ఉదాత్తమైన లక్ష్యమే కానీ, ఒక్క టెక్నాలజీని అభివృద్ధి చేయాలన్నా చాలా సమయం పడుతుంది. ఈ విషయంలో చైనా నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. 1960లు మొదలుకొని ఇప్పటివరకూ ఆ దేశం ఏకైక లక్ష్యంతో పనిచేస్తోంది. రివర్స్ ఇంజి నీరింగ్, బెదిరింపులు, కొన్నిసార్లు దొంగతనాలకూ వెనుకాడకుండా యూఎస్ఎస్ఆర్, పాశ్చాత్య దేశాల నుంచి టెక్నాలజీలను సము పార్జించుకునే ప్రయత్నాలు చేసింది. ఈ నేపథ్యంలో ఒక్క మాట సుస్పష్టం. ఇకనైనా భారత్ వాణిజ్యం, వ్యాపారం, దౌత్యం అన్నింటినీ పరిగణలోకి తీసుకుని సమీ కృత పద్ధతిలో ఇతర దేశాలతో వ్యవహరించడం అలవాటు చేసు కోవాలి. ఈ సమన్వయం ద్వారా మిలిటరీ టెక్నాలజీలను అందిపుచ్చు కునేందుకు ప్రయత్నించాలి. తద్వారా మాత్రమే భారత్ పూర్తిస్థాయిలో ఆత్మనిర్భరత సాధించగలదు. అరుణ్ ప్రకాశ్ వ్యాసకర్త భారత నావికాదళ విశ్రాంత ప్రధానాధికారి -
అమెరికా బ్యాంకింగ్ కుప్పకూలడానికి అక్కడ విధానాలే కారణం
-
బిడ్డ కోసం రక్తం అమ్ముకున్న ఓ తండ్రి కథ
జనాభాలో భారత్ చైనాను అధిగమించింది. మరి మానవాభివృద్ధిలో ఎక్కుడున్నాం?. ఎక్కడో చివర్లో ఉన్నాం. సాంకేతికత, సోషల్ మీడియా గురించి నిత్యం మాట్లాడుకునేం మనం.. ఆకలి, పేదరికం, నిరుద్యోగం మాటకొచ్చేసరికి చర్చల్లో వెనకబడిపోతాం. దేశంలో దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న కథలు కళ్లకు కట్టేలా కనిపిస్తున్నా.. ‘అయ్యో అనుకోవడం’ తప్పించి అంతకు మించి ఏం చేయని పరిస్థితి మనలో చాలామందిది. ఇప్పుడు చెప్పుకోబోయేది కథ కాదు.. కూతురి కోసం పోరాడుతూ జీవితంలో ఓడిన ఓ తండ్రికి సంబంధించిన విషాద గాథ. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఓ ఘోరం వెలుగు చూసింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితమైన కూతురి కోసం తాను చేయగలిగిందంతా చేశాడు ఓ వ్యక్తి. సాయం కోసం ఎదురు చూసి.. చూసి విసిగిపోయాడు. చివరకు కూతురిని కాపాడుకోలేనేమో అనే బెంగతో ఆర్థిక కష్టాల నడుమ నిస్సహాయ స్థితిలో ప్రాణం తీసుకున్నాడు. అనుష్కా గుప్తా.. ఐదేళ్ల కిందట ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వెన్నెముక విరిగి మంచానికే పరిమితమైంది. ఆమె చికిత్స కోసం తండ్రి ప్రమోద్ ఉన్న ఇంటిని, దుకాణాన్ని అమ్మేశాడు. అప్పులు చేసి మరీ మందులు, థెరపీలు చేయించాడు. అయినా ఆమెకు నయం కాలేదు. ఈలోపు ఆర్థిక సమస్యలు ఇంటిదాకా వచ్చాయి. దీంతో చిన్నాచితకా పనులకు వెళ్లడం ప్రారంభించాడు. ఆ వచ్చే డబ్బు ఏపాటికీ సరిపోలేదు. గత్యంతరం లేక రక్తం అమ్ముకుని.. ఈ లోపు అధికారులు సాయం అందిస్తామని మాటిచ్చారు. ఆ విషయాన్ని కొందరు నేతలు కూడా మైకుల్లో మీడియా ముందు అనౌన్స్ చేసుకున్నారు. అది పట్టుకుని గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ, స్థానిక నేతల ఇళ్ల చుట్టూ ఏడాదిపాటు తిరిగి తిరిగి అలిసిపోయాడా తండ్రి. ఇంట్లో తినడానికి ఏం లేని పరిస్థితుల్లో.. తరచూ రక్తం సైతం అమ్ముకున్నాడు ప్రమోద్. ఏడాది కాలంగా గుప్తా ఇంటి పరిస్థితులు మరింతగా దిగజారిపోయాయి. శక్తిహీనుడైన ఆ తండ్రి కూతురి కోసం తానేం చేయలేకపోతున్నాననే నిరాశ, ఆర్థికంగా కుంగిపోయి నిస్పృహలోకి కూరుకుపోయాడు. చివరకు ఇంటి నుంచి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడు. కూతురి ఆరోగ్యం విషయంలో అప్పటికే దిగులుగా ఉన్న ప్రమోద్ కనిపించపోయేసరికి కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మంగళవారం సాత్నా రైల్వే పట్టాలపై ప్రమోద్ శవాన్ని గుర్తించారు. కేసు దర్యాప్తు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. బంగారు తల్లీ.. ఏం చేయలేపోతున్నానమ్మా! అనుష్కా గుప్తా.. సరస్వతి పుత్రిక. ప్రమాదంలో గాయపడి మంచానికి పరిమితమైనా సరే పుస్తకాన్ని వదల్లేదు. కూతురిలోని ఆ ఆసక్తికి చంపడం ఇష్టం లేక.. ఇంటి నుంచే ఆమె చదువును కొనసాగించేలా ఏర్పాట్లు చేశాడు ప్రమోద్. ఓ మనిషి సాయంతో ఆమె బోర్డు పరీక్షలు రాసింది. బోర్డు ఎగ్జామ్స్‌లో ఆమె సాధించిన ప్రతిభకు విద్యాశాఖ సత్కారం కూడా చేసింది. పై చదువుల కోసం ప్రయత్నాలు సాగిస్తూనే ఆ తండ్రి.. కూతురి ట్రీట్మెంట్, ఇంటి అవసరాల ఆర్థిక భారాన్ని మోయలేకపోయాడు. బంగారు తల్లి కోసం ఏం చేయలేకపోయానే అనుకుంటూ నిత్యం కుమిలిపోయాడు. పాపం.. ప్రాణం తీసుకునే ధైర్యం ప్రదర్శించిన ఆ తండ్రి.. బదులు పోరాడి అధికారుల నుంచి రావాల్సిన సాయం రాబట్టుకుని ఉంటే బాగుండేదేమో!. -
అంతర్గత పోరుతో అట్టుడుకుతున్న సూడాన్.. 200 మంది మృతి
ఆఫ్రికా దేశమైన సూడాన్‌లో సైన్యం, పారామిలటరీ మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ ఘర్షణలు వరసగా మూడు రోజైన సోమవారం కూడా కొనసాగాయి. పేలుళ్లు, కాల్పులతో సూడాన్ అట్టుడుకిపోయింది. దేశ రాజధాని ఖార్టుమ్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 1800 మంది గాపడ్డారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. మూడు రోజులుగా సాగుతున్న ఈ హోరాహోరీ యుద్ధంలో ఆస్పత్రులు దెబ్బతిన్నాయి. దీంతో వైద్యసామాగ్రి, ఆహారం కొరత ఏర్పడింది. 2021లో తిరుగుబాటుతో అధికారాన్ని చేజిక్కించుకున్న ఇద్దరు జనరల్స్, సూడాన్ ఆర్మీచీఫ్ అబ్దెల్ ఫట్టా అల్ బుర్హాన్, పారామిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తున్న మొహమ్మద్ హమ్దాన్ డాగ్లో మధ్య వారాల పాటు అధికార పోరాటం జరిగింది. అది శనివారానికల్లా మరింత హింసాత్మకంగా మారింది. ఈ సంఘర్షణ వైమానిక దాడులు, ఫిరంగిదళాల భారీ కాల్పులను దారితీసింది. దీంతో నివాసితులు నిత్యావసారాలు, పెట్రోల్ కోసం బయటకు రావడం ఒక సాహసంగా మారింది. మరోవైపు విద్యుత్తు అంతరాయంతో నగరవాసులు ఇబ్బందులకు గురయ్యారు. ఐతే దేశ రాజధాని ఖార్టుమ్‌లో చోటు చేసుకున్న ఈ అంతర్గత పోరు సుదీర్ఘంగా ఉండవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే దౌత్యవేత్తలు సమీకరించి ప్రాంతీయంగా, అంతర్జాతీయ పరంగా కాల్పులు విరమణకు పిలుపునిచ్చారు. మరోవైపు ఐక్యరాజ్యసమితి మిషన్ హెడ్ వోల్కర్ పెర్థెస్ భద్రత మండలిలో సూడాన్ యుద్ధం చాలా పీక్ స్టేజ్‌కి చేరుకుందని, ఇది ఎంతటి విధ్వంసానికి దారితీస్తోందో కూడా చెప్పడం కష్టం అన్నారు. ఈమేరకు సోమవారం యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ సూడాన్‌లో మళ్లీ అంతర్గత పోరుకు తెరతీసిన ఇరు పార్టీలను తక్షణమే శత్రుత్వాలను నిలిపివేయాలని పిలుపునిచ్చారు. దీన్ని మరింతగా తీవ్రతరం చేయడం దేశానికి, ఆయా ప్రాంతాలకి మరింత ప్రమాదరకమని హెచ్చరించారు. కాగా, పారా మిలిటరీ ‘ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్’ను సైన్యంలో విలీనం చేసేందుకు రూపొందించిన ప్రతిపాదనే దేశంలో అగ్నికి ఆజ్యంపోసింది. ఇదే ఆర్మీ, పారామిలటరీ బలగాల మధ్య ఘర్షణకు కారణమైంది. ఘర్షణలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, ఇప్పటి వరకు దాదాపు 100 మంది పౌరులకు చికిత్స అందిచినట్లు వైద్యుల సంఘం ఒకటి పేర్కొంది. గాయపడినవారిలో చాలమంది ఆస్పత్రులకు చేరుకోలేకపోతున్నట్లు తెలిపింది. అంతేగాదు కొనసాగుతున్న ఈ ఘర్షణలో ఆస్పత్రులు దెబ్బతినడంతో పౌరులను జాయిన్ చేసుకునే పరిస్థితి కూడా లేదని వైద్యుల సంఘం పేర్కొంది. చాలా ఆస్పత్రులు సామాగ్రి కొరతతో వైద్యం అందించలేని స్థితిలో ఉన్నాయని తెలిపింది. మరోవైపు సైన్యం విమానాశ్రయాలు, ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌తో సహా కీలక ప్రాంతాలు తమ అధీనంలో ఉన్నాయని ప్రకటించడం గమనార్హం. స్వాతంత్యం వచ్చినప్పటి నుంచి సూడాన్ దశాబ్దాలుగా అనేక తీవ్రమైన అంతర్యుద్ధాలు, తిరుగుబాట్లతో మగ్గిపోయిందని సూడాన్ విశ్లేషకుడు ఖో లూద్ ఖై చెబుతున్నారు. (చదవండి: రెసిడెన్షియల్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం..16 మంది మృతి) -
ఐటీలో నియామకాలకు 6 నెలలు బ్రేక్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఐటీ కంపెనీలు నియామకాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఆరు నెలల పాటు హైరింగ్‌కు కాస్త విరామం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఆర్థిక ఫలితాలను చూస్తే ప్రతి త్రైమాసికంలోనూ నికర నియామకాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయని, రాబోయే రోజుల్లోనూ కొన్నాళ్ల పాటు ఇదే ధోరణి కొనసాగవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అంతక్రితం ఏడాది జోరుగా రిక్రూట్ చేసుకున్నప్పటికీ ప్రస్తుతం డిమాండ్ మాత్రమే కీలకాంశంగా మారిందని పేర్కొన్నాయి. మూడో త్రైమాసికంలోనే నియామకాలు తక్కువ స్థాయిలో ఉండగా.. నాలుగో త్రైమాసికంలోనూ దాదాపు అదే రకమైన ట్రెండ్ నెలకొందని టీమ్‌లీజ్ డిజిటల్ వర్గాలు వివరించాయి. చాలామటుకు కంపెనీలు వేచి చూసే ధోరణిలో ఉన్నాయని పేర్కొన్నాయి. ఎక్స్‌ఫెనో జాబ్ రిపోర్ట్ ప్రకారం మార్చి త్రైమాసికంలో ఉద్యోగావకాశాలు గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 56 శాతం క్షీణించాయి. మరికొద్ది రోజుల్లో కంపెనీలు నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించడం మొదలుపెట్టనున్న నేపథ్యంలో ఈ అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బ్యాంకింగ్ కష్టాలు. అంతర్జాతీయంగా బ్యాంకింగ్ రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు కూడా ఐటీ రంగంలో నియామకాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఎక్కువగా బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) సంస్థలకు సేవలు అందించే దేశీ ఐటీ కంపెనీల్లో హైరింగ్ మందగించింది. ఈ పరిస్థితి నెమ్మదిగా మారనున్నప్పటికీ, కొత్త ఆర్థిక సంవత్సరం తొలి నాళ్లలో మాత్రం ఆ ప్రభావాలు అలాగే కొనసాగవచ్చని ఎక్స్‌ఫెనో సహవ్యవస్థాపకుడు అనిల్ ఎథనూర్ పేర్కొన్నారు. గత రెండు త్రైమాసికాలుగా హైరింగ్‌పై కాస్త సానుకూలంగా ఉన్నా, ఇంటర్వ్యూ చేసిన అభ్యర్ధులను తీసుకునే విషయంలో మాత్రం కంపెనీలు ముందుకు వెళ్లడం లేదని టీమ్‌లీజ్ డిజిటల్ సీఈవో సునీల్ చెమ్మన్‌కొటిల్ తెలిపారు. ఆయా సంస్థలు వేచి, చూసే ధోరణి పాటిస్తున్నాయని, ఈ త్రైమాసికంలో నియామకాల పరిస్థితి ఆశావహంగా ఉండకపోవచ్చని పేర్కొన్నారు. తొలి ఆరు నెలల్లో నికరంగా నియామకాలు 40% తగ్గొచ్చని భావిస్తున్నట్లు వివరించారు. బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా క్యూ4లో కంపెనీల ప్రణాళికలు మారిపోయాయని, హైరింగ్‌పై దాని ప్రభావం పడిందని కెరియర్‌నెట్ సీఈవో అన్షుమన్ దాస్ చెప్పారు. వాస్తవానికి అంతక్రితం త్రైమాసికంలో ఐటీ కంపెనీలు హైరింగ్‌ను ప్రారంభించడంపై సానుకూల యోచనల్లోనే ఉన్నప్పటికీ .. బ్యాంకింగ్ సంక్షోభంతో పెద్దగా రిక్రూట్మెంట్ తలపెట్టలేదని వివరించారు. ఈ నేపథ్యంలో తొలి ఆరు నెలలు హైరింగ్ అంత ఆశావహంగా కనిపించడం లేదన్నారు. పరిస్థితులపై ఇంకా స్పష్టత రానందున కంపెనీలు వేచి చూసే ధోరణే కొనసాగించవచ్చని.. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం కాస్త మెరుగ్గా ఉండవచ్చని దాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2.5 లక్షలకు పరిమితం కావచ్చు.. దేశీ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా క్యూ1లో 59,704, క్యూ2లో 34,713 మందిని రిక్రూట్ చేసుకోగా క్యూ3లో ఇది ఏకంగా 4,904కి పడిపోయింది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఐటీ, బీపీవో సర్వీసుల విభాగంలో నికరంగా 4.80 లక్షల నియామకాలు జరగ్గా, 2023 ఆర్థిక సంవత్సరంలో ఇది 2.80 లక్షల స్థాయిలో ఉండొచ్చని హాన్ డిజిటల్ సీఈవో శరణ్ బాలసుందరమ్ తెలిపారు. ప్రస్తుత ధోరణులను బట్టి చూస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో నికర నియామకాలు సుమారు 2.5 లక్షల స్థాయిలో ఉండొచ్చని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొన్ని కంపెనీలు తాము ఇచ్చిన ఆఫర్లకు కట్టుబడి ఉండొచ్చని, మరికొన్ని వాటిని రద్దు చేసుకునే అవకాశం ఉందని బాలసుందరమ్ చెప్పారు. 2021 ఆర్థిక సంవత్సరంలో హైరింగ్ అంతగా జరగకపోవడం, కోవిడ్ పరిస్థితులపరమైన డిమాండు కారణంగా 2022 ఆర్థిక సంవత్సరంలో నియామకాలు భారీగా జరిగాయని ఆయన చెప్పారు. ఆ ఒక్క సంవత్సరాన్ని పక్కన పెడితే ఐటీలో ఏటా 2–3 లక్షల మంది హైరింగ్ సాధారణంగానే ఉంటుందని పేర్కొన్నారు. -
ఐటీ ఆదాయాలకు సవాళ్లు..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా స్థూలఆర్థిక పరిస్థితులు, ఫైనాన్షియల్ రంగంలో సవాళ్లు మొదలైనవి దేశీ ఐటీ కంపెనీల ఆదాయాలకు కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రతికూలంగా పరిణమించవచ్చని క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ వృద్ధి దాదాపు 20 శాతంగా ఉండనుండగా .. 2024 ఆర్థిక సంవత్సరంలో 10–12 శాతం స్థాయికి పడిపోవచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించింది. ‘అమెరికా, యూరప్ వంటి కీలక మార్కెట్లలో.. ముఖ్యంగా బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) విభాగంలో ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. ఇవి దేశీ ఐటీ సేవల కంపెనీల ఆదాయాల వృద్ధిపై ప్రభావం చూపనున్నాయి’ అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేఠి తెలిపారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభం తర్వాత బీఎఫ్ఎస్ఐ సెగ్మెంట్లో కొంత ఒత్తిడి నెలకొందని పేర్కొన్నారు. ఫలితంగా ఈ విభాగం ఆదాయ వృద్ధి సింగిల్ డిజిట్ మధ్య స్థాయికి పడిపోవచ్చని వివరించారు. అయితే, తయారీ రంగంలో 12–14 శాతం, ఇతర సెగ్మెంట్లలో 9–11 శాతం వృద్ధి నమోదు కావచ్చని.. తత్ఫలితంగా బీఎఫ్ఎస్ఐ విభాగంలో క్షీణత ప్రభావం కొంత తగ్గవచ్చని వివరించారు. దాదాపు రూ. 10.2 లక్షల కోట్ల భారతీయ ఐటీ రంగంలో 71 శాతం వాటా ఉన్న 17 కంపెనీల డేటాను విశ్లేషించి క్రిసిల్ ఈ నివేదిక రూపొందించింది. నివేదికలోని మరిన్ని అంశాలు.. ► క్లయింట్లు ఐటీపై ఇష్టారీతిగా ఖర్చు చేయకుండా, ప్రతి రూపాయికి గరిష్టమైన ప్రయోజనాలను పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అటువంటి డీల్స్నే కుదుర్చుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. దీనితో పాటు డిజిటల్ సొల్యూషన్స్, క్లౌడ్, ఆటోమేషన్ సామరŠాధ్యలు మొదలైనవి డిమాండ్‌కి దన్నుగా ఉండనున్నాయి. ► ఐటీ రంగం ఆదాయాల్లో బీఎఫ్ఎస్ఐ వాటా 30 శాతం వరకు ఉంటోంది. తలో 15 శాతం వాటాతో రిటైల్, కన్జూమర్ ప్యాకేజ్డ్ గూడ్స్ విభాగాలు ఉంటున్నాయి. మిగతా వాటా లైఫ్ సైన్సెస్ .. హెల్త్‌కేర్, తయారీ, టెక్నాలజీ.. సర్వీసెస్, కమ్యూనికేషన్.. మీడియా మొదలైన వాటిది ఉంటోంది. ► ఐటీ సంస్థలు కొత్తగా నియామకాలు .. ఉద్యోగులపై వ్యయాలను తగ్గించుకోనుండటంతో 2024 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభదాయకత స్వల్పంగా 0.50–0.60 శాతం మెరుగుపడి 23 శాతంగా ఉండొచ్చు. ► ఉద్యోగులపై వ్యయాలు పెరగడం వల్ల 2023 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభాల మార్జిన్లు 1.50–1.75 శాతం మందగించి దశాబ్ద కనిష్ట స్థాయి అయిన 22–22.5 శాతానికి తగ్గవచ్చు. ► అట్రిషన్‌లు (ఉద్యోగుల వలసలు) ఇటీవల కొద్ది త్రైమాసికాలుగా తగ్గుముఖం పడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి మరింత తగ్గవచ్చు. ఆన్‌షోర్, ఆఫ్‌షోర్ ఉద్యోగులను సమర్ధంగా ఉపయోగించుకోవడం, సిబ్బందికి శిక్షణనిస్తుండటం, రూపాయి క్షీణత ప్రయోజనాలు మొదలైన సానుకూల అంశాల కారణంగా 2024 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభాల మార్జిన్లు 0.50–60 శాతం మెరుగుపడి 23 శాతానికి చేరవచ్చు. అయినప్పటికీ కరోనా పూర్వం 2016–20 ఆర్థిక సంవత్సరాల మధ్య నమోదైన సగటు 24 శాతానికన్నా ఇంకా దిగువనే ఉండొచ్చు. ► దేశీ ఐటీ కంపెనీల రుణ నాణ్యత స్థిరంగానే ఉంది. రూపాయి మారకం విలువ గణనీయంగా పెరగడం, మాంద్యం ధోరణులు ఒక్కసారిగా ముంచుకురావడం వంటి రిస్కులపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. -
క్యూ1లో హైరింగ్ అప్
ముంబై: అంతర్జాతీయంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నప్పటికీ సర్వీసులు, తయారీ రంగాల కంపెనీలు మాత్రం నియామకాలపై ఆసక్తి చూపుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే 2023–24 క్యూ1లో ఇది 10 శాతం అధికంగా ఉండగలదని అంచనాలు నెలకొన్నాయి. అయితే, 2022–23 నాలుగో త్రైమాసికంతో పోలిస్తే మాత్రం 4 శాతం తక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. టీమ్‌లీజ్ సర్వీసెస్‌కి చెందిన ఉపాధి అంచనాల నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 14 రంగాలకు చెందిన 809 చిన్న, మధ్య తరహా, భారీ సంస్థలపై చేసిన సర్వే ఆధారంగా టీమ్‌లీజ్ దీన్ని రూపొందించింది. ఇందులో పాల్గొన్న 64 శాతం మంది యజమానులు తమ సిబ్బంది సంఖ్యను పెంచుకోవాలని ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. నివేదిక ప్రకారం సర్వీస్, తయారీ రంగాల్లో క్యూ1లో ప్రధానంగా ఎంట్రీ, జూనియర్ స్థాయి నియామకాలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సర్వీసుల్లో ఇవి వరుసగా 73 శాతం, 71 శాతంగా ఉండగా .. తయారీలో 49 శాతం, 55 శాతంగా ఉన్నాయి. మధ్య స్థాయి ఉద్యోగాలకు సంబంధించి సర్వీసుల్లో 54 శాతంగాను, తయారీలో 32 శాతంగాను ఉన్నాయి. అత్యధికంగా సర్వీస్ రంగంలో.. తయారీ విభాగంతో పోలిస్తే సర్వీసుల రంగంలో హైరింగ్‌కు ఎక్కువగా ఆస్కారం ఉంది. సేవా రంగం విషయానికొస్తే ఇది టెలికమ్యూనికేషన్స్‌లో 96%, ఆర్థిక సర్వీసులు (93%), ఈ–కామర్స్.. అనుబంధ స్టార్టప్‌లు (89%), రిటైల్ (87%), విద్యా సర్వీసుల్లో 83%గా ఉంది. తయారీ రంగంలో హెల్త్‌కేర్ .. ఫార్మాలో 91 శాతంగా, ఎఫ్ఎంసీజీలో 89 శాతంగా, ఎలక్ట్రిక్ వాహనాలు.. మౌలిక సదుపాయాల కల్పనలో 73 శాతంగా ఉంది. -
కొత్త ‘బంగారు’ లోకం
న్యూఢిల్లీ: బంగారం ధర నూతన గరిష్ట స్థాయిలకు రానున్న వారాల్లో చేరుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఔన్స్ ధర పూర్వపు గరిష్ట స్థాయి అయిన 2,075 డాలర్లను దాటిపోవచ్చని భావిస్తున్నారు. అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం తలెత్తడంతో, ఇది అంతర్జాతీయ ఫైనాన్షియల్ మార్కెట్లో అనిశ్చితికి దారితీయడం చూస్తున్నాం. దీంతో అనిశ్చితుల్లో సురక్షిత సాధనంగా భావించే బంగారంలోకి మరిన్ని పెట్టుబడులు వెళ్లొచ్చని, ఫలితంగా ధరలకు రెక్కలు వస్తాయన్న విశ్లేషణ వినిపిస్తోంది. నెలలో 7.5 శాతం రాబడి ఇటీవల బంగారం ధర ఔన్స్‌కి (28.35 గ్రాములు) 2,000 డాలర్లను తాకింది. 2022 మార్చి తర్వాత ఇది గరిష్ట స్థాయి. తాజాగా లండన్ మార్కెట్లో ఔన్స్‌కి 1,952 డాలర్లకు పరిమితం అయింది. అంతర్జాతీయంగా చూస్తే గడిచిన నెల రోజుల్లో బంగారం ధరలు 7.75 శాతం మేర లాభపడ్డాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో ఏప్రిల్ కాంట్రాక్టు గోల్డ్ 10 గ్రాములకు రూ.60,000ను తాకింది. ‘‘అంతర్జాతీయంగా పెరిగిపోతున్న ఆర్థిక అనిశ్చితులు బంగారం ధరని ఔన్స్‌కి 2,075 డాలర్ల గరిష్ట స్థాయికి మళ్లీ తీసుకెళతాయని భావిస్తున్నట్టు ఫిచ్ సొల్యూషన్స్ తెలిపింది. ఈ స్థాయిలో బలమైన నిరోధం ఉన్నట్టు పేర్కొంది. యూఎస్ డాలర్ బలంగా ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. సిగ్నేచర్ బ్యాంక్, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ వైఫల్యాలు ఇతర బ్యాంకులకు విస్తరించేది చాలా తక్కువేనని ఫిచ్ సొల్యూషన్స్ అంచనా వేసింది. ఫెడ్ పెంపు ప్రభావం.. ఇవే ఆర్ధిక అనిశ్చిత పరిస్థితులు కొనసాగితే బంగారం ర్యాలీకి మద్దతుగా నిలుస్తాయని.. అతి త్వరలోనే ఔన్స్‌కి 2,075 డాలర్లను చూస్తామని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే ఐజీ బ్యాంక్ పేర్కొంది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుకు విరామం ఇస్తే కనుక అది బంగారం ధరలకు బూస్ట్‌నిస్తుందని ఐఎంజీ థింక్ అంచనా వేస్తోంది. 2023 సంవత్సరానికి ఫిచ్ సొల్యూషన్స్ తన అంచనాలను సవరించింది. ఔన్స్‌కి గతంలో వేసిన 1,850 డాలర్లను రూ.1,950 డాలర్లకు పెంచింది. బ్యాంకింగ్ సంక్షోభం మాంద్యానికి దారితీయవచ్చనే అభద్రతా భావం ఇన్వెస్టర్లలో ఏర్పడినట్టు ఫిచ్ సొల్యూషన్స్ తెలిపింది. ‘‘ఫెడ్ వడ్డీ రేట్లు అంచనాలకు తగ్గట్టు 0.25 శాతం లేదా అంతకంటే తక్కువ పెంచితే, హాకిష్ ప్రసంగం లేకపోతే అది బంగారానికి చాలా సానుకూలం అవుతుంది. 2,040–2,050 డాలర్లను చూడొచ్చు. కామెక్స్‌లో అయితే 10 గ్రాముల ధర రూ.61,500కు చేరొచ్చు’’అని ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెచ్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది తెలిపారు. మార్కెట్లలో అనిశ్చితులు ఉన్నప్పుడు బంగారం ధర సహజంగానే పెరుగుతుందని ఏజెంల్ వన్ నాన్ అగ్రి కమోడిటీస్ ఏవీపీ ప్రథమేష్ మాల్యా అన్నారు. బ్యాంకింగ్ సంక్షోభం శాంతిస్తే, ఫెడ్ అధిక పెంపు చేపట్టొచ్చని, అది బంగారం ధరల క్షీణతకు దారితీయవచ్చన్నారు. యూఎస్ ఫెడ్ దూకుడుగా రేట్లను పెంచుతుందన్న అంచనాలు ఇప్పుడు లేవని.. తాము అయితే బంగారంపై తటస్థం నుంచి బుల్లిష్‌గా ఉన్నామని, 2022 క్యూ4 నుంచి ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నట్టు ఫిచ్ సొల్యూషన్స్ తెలిపింది. రానున్న వారాల్లో బంగారం ధరలో ఎన్నో ఆటుపోట్లు చూడొచ్చని.. రానున్న సంవత్సరాల్లోనూ బంగారం ధర గరిష్ట స్థాయిల్లోనే కదలాడవొచ్చని, కరోనా ముందు నాటి స్థాయిలకు చేరుకోకపోవచ్చన్న అంచనాను వ్యక్తం చేసింది. -
బ్యాంకింగ్ మ్యూచువల్ ఫండ్స్‌కు నష్టాలు
న్యూఢిల్లీ: అమెరికా బ్యాంకుల సంక్షోభం మన దేశంలో బ్యాంకింగ్ స్టాక్స్‌పై ప్రభావం చూపిస్తోంది. ఫలితంగా బ్యాంకింగ్ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టే పథకాల విలువ గత వారంలో సుమారు 6 శాతం క్షీణించింది. అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కుప్పకూలిపోవడం, ఆ తర్వాత సిగ్నేచర్ బ్యాంక్ కూడా సంక్షోభంలో పడిపోవడం.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవల రంగంపై ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా చేసింది. స్విట్జర్లాండ్‌కు చెందిన క్రెడిట్ సూసె సైతం నిధుల కటకటను ఎదుర్కోగా.. ఏకంగా ఆ దేశ కేంద్రబ్యాంక్ జోక్యం చేసుకుని నిధులు సమకూరుస్తామని హామీ ఇవ్వా ల్సి వచ్చింది. ఈ పరిణామాలతో మన దేశ బ్యాంక్ స్టాక్స్ 3–13 శాతం మధ్యలో నష్టపోయాయి. ప్రభావం పెద్దగా ఉండదు.. కానీ విదేశాల్లో బ్యాంకుల సంక్షోభాల ప్రభావం నేరుగా మన బ్యాంకులపై ఏమీ ఉండదని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకింగ్ రంగ మ్యూచువల్ ఫండ్స్‌లో 16 పథకాలు ఉంటే, ఇవన్నీ కూడా మార్చి 17తో ముగిసిన వారంలో 1.6–6 శాతం మధ్య నష్టాలను చూశాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే వీటిల్లో నికర నష్టం 8–10% మధ్య ఉంది. ఇలా నష్టపోయిన వాటిల్లో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, టాటా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, హెచ్డీఎఫ్సీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, నిప్పన్ ఇండియా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్ ఉన్నాయి. అయితే, ఏడాది కాలంలో ఈ పథకా లు నికరంగా 12 శాతం రాబడిని ఇవ్వడం గమనించొచ్చు. ‘‘స్టాక్ మార్కెట్లలో అస్థిరతలు, వడ్డీ రేట్ల పెరుగుదల ఈ థీమ్యాటిక్ ఫండ్స్ నష్టపోవడానికి కారణాలుగా ఫయర్స్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కావలిరెడ్డి తెలిపారు. వడ్డీ రేట్ల పెరుగుదల తర్వాత తక్కు వ వడ్డీ మార్జిన్లు, నిధుల వ్యయాలు పెరగడం, రుణాల వృద్ధిపై ప్రభావం పడినట్టు చెప్పారు. -
ఊగిసలాట కొనసాగుతుంది
ముంబై: ట్రేడింగ్ నాలుగురోజులే జరిగే ఈ వారంలోనూ స్టాక్ సూచీల ఊగిసలాట కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నెలవారీ డెరివేటివ్స్ ఎక్స్పైరీ(బుధవారం) నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత వహించవచ్చు. అంతర్జాతీయ బ్యాంకింగ్ సంక్షోభ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చంటున్నారు. వీటితో డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చంటున్నారు. ‘‘అంతర్జాతీయ బ్యాంకింగ్ సంక్షోభం, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక బిల్లు సవరణ మార్కెట్లలో ఒడిదుడుకులకు ప్రధాన కారణమయ్యాయి. మార్కెట్ అధిక అమ్మకాల స్థాయిలో (ఓవర్ సోల్డ్) ఉండటం వాస్తవం. ఇదే సమయంలో అనూహ్యంగా ఆర్థికపరమైన సమస్యలు తెరపైకి రావడంతో సెంటిమెంట్ బలపడలేకపోతుంది. అమ్మకాలు కొ నసాగితే నిఫ్టీకి దిగువ స్థాయిలో 16,600–16,800 శ్రేణిలో తక్షణ మద్దతు లభిస్తుంది. సానుకూల పరిణామాలు నెలకొని కొనుగోళ్లు నెలకొంటే ఎగువ స్థాయిలో 17,200 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఐటీ, ఆటో, మెటల్, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనుకావడంతో గతవారంలో సెన్సెక్స్ 463 పాయింట్లు నిఫ్టీ 155 పాయింట్లు నష్టపోయాయి. ఇరుసూచీలకిది వరుసగా మూడోవారమూ నష్టాల ముగింపు. బుధవారమే ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ మార్చి 30న శ్రీరామ నవమి సందర్భంగా ఎక్సే్చంజీలకు సెలవుకావడంతో బుధవారమే నెలవారీ డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగియనుంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకునే స్క్యేయర్ ఆఫ్ లేదా రోలోవర్ అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చు. నిఫ్టీ స్వల్పకాలం పాటు 16,800–17,200 శ్రేణిలో ట్రేడవ్వొచ్చని ఆప్షన్ డేటా సూచిస్తోంది. బ్యాంకింగ్ సంక్షోభం గత వారాంతాన జర్మనీకి చెందిన డాయిష్ బ్యాంక్ సంక్షోభ ఉదంతం తెరపైకి వచ్చింది. బ్యాంక్ క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్స్ (సీడీఎస్) ప్రీమి యం ఒక్కసారిగా పెరగడంతో ఈ బ్యాంక్ సైతం దివాలా బాట పటొచ్చని ఊహాగానాలు నెలకొన్నాయి. అమెరికా, ఐరోపా బ్యాంకింగ్ వ్యవస్థలు వరుస వైఫల్యాలతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ఈ రంగంలో జరిగే ప్రతి పరిణామాన్ని మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఎఫ్ఐఐల బేరీష్ వైఖరి దేశీయ మార్కెట్ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు బేరీష్ వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఎఫ్ఐఐలు ఈ మార్చి 20–24 తేదీల మధ్య రూ.6,654 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇదే ఈ మార్చిలో సంస్థాగత ఇన్వెస్టర్లు మొతం్త రూ.9,430 కోట్ల షేర్లను కొనుగోలు చేసి దేశీయ ఈక్విటీ మార్కెట్ భారీ పతనాన్ని అడ్డుకుంటున్నారు. -
డాయిష్ బ్యాంక్ 14% డౌన్
ఫ్రాంక్ఫర్ట్: అంతర్జాతీయంగా బ్యాంకింగ్ వ్యవస్థ సంక్షోభంపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో జర్మనీకి చెందిన డాయిష్ బ్యాంక్ షేర్లపైనా ప్రభావం పడింది. బ్యాంకు షేర్లు శుక్రవారం ఒక దశలో 14 శాతం క్షీణించాయి. ఆ తర్వాత కొంత కోలుకుని సుమారు 9 శాతం క్షీణతతో 8.52 యూరోల వద్ద ట్రేడయ్యాయి. బాండ్లను బీమా చేసేందుకయ్యే వ్యయాలు పెరిగిపోవడం డాయిష్ బ్యాంక్ పరిస్థితిపై ఆందోళనకు కారణమైనట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇటీవల స్విస్ బ్యాంక్ క్రెడిట్ సూసీ పతనానికి ముందు కూడా ఇలాంటి పరిణామమే చోటు చేసుకోవడం గమనార్హం. అయితే డాయిష్ బ్యాంక్ మరో క్రెడిట్ సూసీ కావచ్చన్న ఆందోళనలను జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్ తోసిపుచ్చారు. బ్యాంక్ పటిష్టంగానే ఉందని స్పష్టం చేశారు. -
పసికందుల ఆకలి కేకలు ఓవైపు.. విలాసాలు మరోవైపు!
పట్టెడన్నం దొరక్క బక్కచిక్కిపోయి.. డొక్కలు ఎండుకుపోయి ఆకలితో నకనకలాడుతూ పసికందుల దృశ్యాల నడుమ.. పాలబుగ్గలతో చిరునవ్వులు చిందిస్తూ సంతోషంగా తండ్రి చెయ్యిలో చెయ్యేసి నడయాడుతున్న కిమ్ తనయ దృశ్యాలు మరోవైపు.. ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌పై ఆ దేశంలో ప్రజాగ్రహం పెల్లుబికుతోంది. ఒకవైపు ప్రజలు దీనావస్థలో కొట్టుమిట్టాడుతుంటే.. మరోవైపు విలాసవంతమైన జీవనశైలితో నిత్యం వార్తల్లో నిలిచేందుకు కిమ్ కుటుంబం ప్రయత్నిస్తోంది. నానాటికీ దిగజారిపోతున్న అక్కడి ప్రజల జీవన ప్రమాణాలను, ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థ పతనం గురించి రేడియో ఫ్రీ ఏషియా.. రహస్యంగా అక్కడి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఇందులో చాలామంది కిమ్, ఆయన కుటుంబం అనుభవిస్తున్న రాజభోగాలపై మండిపడ్డారు. నా కుటుంబం పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. పూట తిండికి చాలా కష్టంగా గడుస్తోంది. నాకూ పదేళ్ల పాప ఉంది. ఆకలితో నా బిడ్డ అల్లలాడిపోతోంది. కానీ, ఈ దేశ అధ్యక్షుడి కూతురు రంగు రంగుల బట్టలతో నిత్యం టీవీల్లో కనిపిస్తోంది. ఆమె పాల బుగ్గలే చెబుతున్నాయి.. ఆమెకు ఎలాంటి తిండి అందుతుందో!. పైగా ఈగ కూడా వాలకుండా ఆమెకు భద్రత కల్పిస్తున్నారు. మరి.. మా పిల్లలు ఏం పాపం చేశారు? లక్షల మంది ఉసురు ఊరికే తగలకుండా ఉంటుందా? అంటూ ఆ వ్యక్తి కిమ్‌కు శాపనార్థాలు పెట్టాడు. ఇదిలా ఉంటే.. మరోవ్యక్తి సైతం కిమ్ కూతురి ప్రస్తావన తెచ్చి విమర్శలు గుప్పించాడు. దేశంలో ఎంతో మంది పిల్లలు తిండి దొరక్క అల్లలాడిపోతున్నారు. వేల మంది చనిపోతున్నారు. బక్కచిక్కిపోయిన మా బిడ్డల రూపాలు చాలవా? ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పడానికి. అయినా.. ఇవేం కిమ్‌కు పట్టవు అంటూ మరో వ్యక్తి విమర్శించాడు. మొత్తం వెయ్యికి పైగా ప్రజల అభిప్రాయాలను.. వాళ్ల గుర్తింపును బయటకు రానీయకుండా జాగ్రత్త పడింది. రాజధాని ప్యాంగ్యాంగ్తో సహా చాలా చోట్ల ఆకలి మరణాలు నమోదు అవుతున్నాయి. ఈ అంకెలను బయటకు పోకుండా కఠిన వైఖరి అవలంభిస్తోంది కిమ్ ప్రభుత్వం. ఇదిలా ఉండగా.. కిమ్ గారాల కూతురు కిమ్ జు ఏ గత కొంతకాలంగా మీడియాలో హైలెట్ అవుతూ వస్తోంది. క్షిపణి పరీక్షల దగ్గరి నుంచి రకరకాల ఈవెంట్స్‌కు ఆమెను వెంటేసుకుని వెళ్తున్నాడు ఆ దేశ అధ్యక్షుడు కిమ్. దీంతో.. తదుపరి కిమ్ తర్వాత ఆ చిన్నారేనంటూ చర్చ మొదలైంది. అయితే పాలనలో పురుషాధిపత్యం ప్రదర్శించే ఉత్తర కొరియాలో ఆ అవకాశం లేదంటూ కొట్టిపారేస్తున్నారు విశ్లేషకులు. ఉత్తర కొరియా అధికారిక మీడియా ఏనాడూ కిమ్ కుటుంబ సభ్యుల వివరాలను గురించి బయటి ప్రపంచానికి తెలియజేయలేదు. అయితే సియోల్ నిఘా ఏజెన్సీలు మాత్రం ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు(13, 10, 6 వయసు) ఉన్నారని మాత్రం చెబుతోంది. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన రాజకీయ పార్టీ బీజేపీనే! -
బంగారం డిమాండ్‌కు ధరల మంట
న్యూఢిల్లీ: బంగారానికి డిమాండ్ గడిచిన 10 రోజుల్లో పడిపోయింది. ఏకంగా 40 శాతం క్షీణించినట్టు ఉత్తరాది ఆభరణాల వర్తకులు చెబుతుంటే, దేశంలో బంగారం అత్యధికంగా అమ్ముడుపోయే దక్షిణాదిన గడిచిన రెండు వారాల్లో డిమాండ్ 60 శాతం తగ్గిపోయినట్టు ఈ ప్రాంత వర్తకులు వెల్లడించారు. 10 గ్రాముల బంగారం జీఎస్టీతో కలిపి రూ.60,000కు చేరుకోవడమే డిమాండ్ పడిపోవడానికి కారణంగా పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుంచి బంగారం కొనుగోళ్ల సీజన్ మొదలవుతుందని, ఇలాంటి తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక గత రెండు వారాల్లో బంగారం ధరలు 7 శాతం పెరిగాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంక్, క్రెడిట్ సూసే బ్యాంకు సంక్షోభాల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా మరిన్ని దేశాలకు విస్తరించొచ్చన్న భయాలు బంగారం ధరల పెరుగుదలకు దారితీసినట్టు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. బ్యాంకు సంక్షోభాలతో పాశ్చాత్య దేశాల వృద్ధిపై ప్రభావం పడుతుందని, ఆర్బీఐ రేట్ల పెంపును తగ్గించొచ్చని, లేదంటే విరామం ఇవ్వొచ్చని, ఇది మార్కెట్లో నగదు లభ్యతను పెంచుతుందన్న అంచనాలు బంగారం ధరలకు మద్దతునిచ్చినట్టు తెలిపారు. అస్థిరతలకు అవకాశం.. ‘‘బంగారం ధరల్లో సమీప కాలంలో అస్థిరతలు కొనసాగొచ్చు. అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకులు తమ ఆర్థిక వ్యవస్థలకు మద్దతుగా విధానాలను సర్దుబాటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ (28.34 గ్రాములు)కు 2,020 డాలర్లకు, దేశీయంగా రూ.60,500కు చేరుకోవచ్చు’’అని కామా జ్యుయలరీ ఎండీ కొలిన్‌షా తెలిపారు. ఇండియన్ బులియన్ అండ్ జ్యుయలర్స్ అసోసియేషన్ జాతీయ సెక్రటరీ సురేంద్ర మెహతా స్పందిస్తూ.. ‘‘బంగారానికి డిమాండ్ స్తబ్దుగా ఉంది. కొనుగోళ్లకు వచ్చే కస్టమర్ల సంఖ్య తగ్గింది. ధరలు మరింత తగ్గుతాయని మార్కెట్ వేచి చూస్తోంది’’అని చెప్పారు. గడిచిన వారంలో బంగారం ధరలు ఔన్స్‌కు 100 డాలర్ల వరకు పెరిగినట్టు ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ సియమ్ మెహ్రా తెలిపారు. ఇది దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసినట్టు చెప్పారు. ‘‘గత 10–15 రోజుల్లో డిమాండ్ 40 శాతం తగ్గింది. మరో 15 రోజుల్లో వివాహాల సీజన్ మొదలవుతున్నప్పటికీ, వేచి చూసే ధోరణితో ప్రజలు ఉన్నారు’’అని మెహ్రా వివరించారు. సీజ్ చేసిన స్మగుల్డ్ బంగారం @ 3,502 కేజీలు 2022లో 47 శాతం అప్ స్మగ్లింగ్‌లో పట్టుబడి, ప్రభుత్వ ఏజెన్సీలు సీజ్ చేసిన బంగారం పరిమాణం గతేడాది 3,502 కేజీలుగా నమోదైంది. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే ఇది 47 శాతం అధికం. కేరళలో అత్యధికంగా 755.81 కేజీల బంగారం పట్టుబడింది. ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర (535.65 కేజీలు), తమిళనాడు (519 కేజీలు) ఉన్నాయి. రాజ్యసభకు ఆర్థిక శాఖ ఇచ్చిన గణాంకాల ప్రకారం .. ప్రభుత్వంలోని వివిధ విభాగాలు 2021లో 2,383.38 కేజీలు, అంతక్రితం ఏడాది 2,154.58 కేజీల పసిడిని స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఏడాది (2023) తొలి మూడు నెలల్లో 916.37 కిలోల స్మగుల్డ్ బంగారాన్ని సీజ్ చేశాయి. 2021లో 2,445 పసిడి స్మగ్లింగ్ కేసులు, 2022లో 3,982 కేసులు నమోదయ్యాయి. బంగారం వినియోగంలో చైనా తర్వాత రెండో స్థానంలో ఉన్న భారత్.. దేశీయంగా ఉత్పత్తి లేకపోవడంతో పసిడి కోసం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. అయితే, కస్టమ్స్ సుంకం రేటు 12.5 శాతం, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్సు (ఏఐడీసీ) 2.5 శాతం, ఐజీఎస్టీ రేటు 3 శాతం మొదలైనవన్నీ కలిపితే దిగుమతులపై పన్నుల భారం అధికంగా ఉంటోంది. దీనితో అక్రమ మార్గాల్లో కూడా దేశంలోకి పసిడి వస్తోంది. దీన్ని అరికట్టడానికి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఇతరత్రా ఏజెన్సీలతో కలిసి నిరంతరం నిఘాను పటిష్టం చేస్తోంది. ఎప్పటికప్పుడు స్మగ్లర్లు అనుసరించే కొత్త విధానాలను పసిగట్టి ఏజెన్సీలను అప్రమత్తం చేస్తోందని ఆర్థిక శాఖ తెలిపింది. -
ప్రతికూలంగానే సెంటిమెంట్
ముంబై: ఈ వారం దేశీయ స్టాక్ సూచీలపై ప్రపంచ పరిణామాలు ప్రభావం ఉండొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికా బ్యాంక్ సంక్షోభం, ఫెడ్ రిజర్వ్ సమావేశ పరిణామాల నేపథ్యంలో సెంటిమెంట్ ప్రతికూలంగానే ఉండొచ్చంటున్నారు. వీటితో పాటు దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, క్రూడాయిల్ కదలికలను ఇన్వెస్టర్లు వర్గాలు నిశితంగా పరిశీలించే వీలుంది. డాలర్ మారకంలో రూపాయి విలువ, బాండ్ల రాబడులపై దృష్టి సారించవచ్చు. ‘‘స్టాక్ సూచీల ఒడిదుడుకులకు ట్రేడింగ్ కొనసాగే వీలుంది. కొన్ని వారాలుగా జరిగిన ఏకపక్ష అమ్మకాలతో మార్కెట్ సెంటిమెంట్ పూర్తిగా బేరిష్‌గా మారింది. సాంకేతికంగా నిఫ్టీ గత ఏడు వారాల కన్సాలిడేషన్ రేంజ్‌ను చేధించి 17100 స్థాయి వద్ద ముగిసింది. అమ్మకాలు నెలకొంటే దిగువ స్థాయిలో 16,600–16,800 శ్రేణిలో తక్షణ మద్దతు లభిస్తుంది. ఎగువ స్థాయిలో 17,250–17,400 రేంజ్‌ని చేధించాల్సి ఉంటుంది’’అని రిలిగేర్ బ్రోకింగ్ సాంకేతిక నిపుణుడు అజిత్ మిశ్రా తెలిపారు. గడిచిన వారంలో సెన్సెక్స్ 1,145 పాయింట్లు, నిఫ్టీ 313 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. విస్తృత మార్కెట్లోనూ అమ్మకాలు కొనసాగడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2 శాతం, 2.5 శాతం చొప్పున క్షీణించాయి. 1. బ్యాంకింగ్ వ్యవస్థలో సంక్షోభ ఘంటికలు ద్రవ్యోల్బణం ముదిరి ఆర్థిక మాంద్యం కమ్ముకొస్తున్న వేళ బ్యాంకింగ్ వ్యవస్థలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల్లోనే ఏకంగా ఐదు బ్యాంకులు భారీ కుదుపులకు లోనయ్యాయి. అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ దివాలా, సిగ్నేచర్ బ్యాంక్ మూసివేత పరిణామాల తర్వాత తాజాగా శాన్ఫ్రాన్సిస్కో ఆధారిత ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ ఉదంతం తెరపైకి వచ్చింది. అయితే ఈ బ్యాంకును కాపాడేందుకు 11 పెద్ద బ్యాంకులు కలిపి 30 బిలియన్ డాలర్ల సమకూర్చాయి. ఈ ప్రకంపనలు అమెరికాకే పరిమితం కాకుండా ప్రపంచంలో ఇతర దేశాల బ్యాంకులకు విస్తరించవచ్చని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతవారంలోనే క్రిడెట్ సూసీ ఆర్థిక ఐసీయూపైకి చేరడంతో స్విస్ నేషనల్ బ్యాంక్ 54 బిలియన్ డాలర్ల నగదు సాయం చేసింది. ‘‘ప్రభుత్వాలు జోక్యం చేసుకొని తక్షణ నిధులు సమకూర్చినంత మాత్రన బ్యాంకింగ్ సంక్షోభం ముగిసిందని చెప్పడం తొందరపాటే అవుతుంది. ప్రస్తుతానికి అదుపులో ఉందంతే. ఐరోపాలోని బ్యాంకుల పరిస్థితులను గమనిస్తే యూఎస్ పరిస్థితులు అక్కడి పాకినట్లు తెలుస్తుంది. ఈ సంకేతాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే కాకుండా ఈక్విటీ మార్కెట్లకు మంచిది కాదు’’ అని ఫస్ట్ వాటర్ క్యాపిటల్ ఫండ్ సహ వ్యవస్థాపకుడు అరుణ్ చులానీ తెలిపారు. మంగళవారం ఫెడరల్ రిజర్వ్ సమావేశం ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం మంగళవారం(మార్చి 21న) ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజు బుధవారం ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ద్రవ్య కమిటీ నిర్ణయాలను ప్రకటించనున్నారు. అమెరికా ద్రవ్యోల్బణం దిగివచ్చిన నేపథ్యంలో 50 బేసిస్ పాయింట్ల రేట్ల పెంపు ఉండకపోవచ్చని... అలాగే తదుపరి సమావేశాల నుంచి రేట్ల పెంపు ఉండకపోవచ్చనే ప్రకటన వెలువడుతుందని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి. ఇప్పుటికే యూరోపియన్ యూనియన్ బ్యాంక్ 50 బేసిస్ పాయింట్ల వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో ఇప్పుడు ఫెడ్ రిజర్వ్, బ్యాంక్ ఇంగ్లాండ్ (మార్చి 23న)లు ఏమేర రేట్ల పెంపు ఉంటుందోనని మార్కెట్ వర్గాలు ఆసక్తి ఎదురు చూస్తున్నాయి. వారం రోజుల్లో రూ. 8 వేల కోట్ల విక్రయాలు విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్లో వారం రోజుల్లో రూ. 8 వేల కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థలో సంక్షోభ పరిస్థితులు ఇందుకు కారణమైనట్లు నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.9,200 కోట్ల షేర్లను కొనుగోలు చేసి దేశీయ ఈక్విటీ మార్కెట్ భారీ పతనాన్ని అడ్డుకుంటున్నారు. ‘‘ ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్ని అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా ఎఫ్ఐఐలు బంగారం, డాలర్ వంటి రక్షణాత్మక సాధనాల వైపు తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు. ఇటీవల డాలర్ మారకంలో రూపాయి క్షీణత కొంత ప్రతికూలంగా మారింది’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ప్రపంచ పరిణామాలు... ఈక్విటీ మార్కెట్లతో పాటు క్రూడాయిల్ ధరలు సైతం బేర్ గుప్పిట్లోకి వెళ్లాయి. ప్రస్తుత సంవత్సరంలోనే వారం ప్రాతిపదికన అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. క్రూడ్ ధరల పతనం భారత్ మార్కెట్‌కు కలిసొచ్చే అంశమైనప్పట్టకీ.., క్షీణత స్థిరంగా ఉంటేనే స్వాగతించాలని నిపుణులు చెబుతున్నారు. నేడు అమెరికా జనవరి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, రేపు యూరోజోన్ కన్స్ట్రక్షన్ అవుట్ డేటా వెల్లడి అవుతాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ ద్రవ్య కమిటీ నిర్ణయాలుతో పాటు బ్రిటన్ ఫిబ్రవరి ద్రవ్యోల్బణ డేటా బుధవారం విడుదల అవుతుంది. గురువారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీరేట్లను ప్రకటిస్తుంది. వారాంతాపు రోజైన శుక్రవారం చైనా ఫిబ్రవరి రిటైల్ అమ్మకాలతో పాటు జపాన్ ఫిబ్రవరి ద్రవ్యోల్బణం, యూరోజోన్ మార్చి ప్రథమార్థపు తయారీ రంగ వివరాలు వెల్లడి అవుతాయి. -
తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు.. అందుకే చేయలేకపోయా: కంగనా
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ అభిమానులను అలరిస్తుంటారు. ఇటీవలే తనపై కొందరు నిఘా ఉంచారని సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే తాజాగా కంగనాకు సంబంధించిన ఓ వార్త వైరలవుతోంది. గతేడాది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురైనట్లు ఆమె తన ఇన్‌స్టాలో తెలిపింది. గతేడాది ఓ రెస్టారెంట్ ప్రారంభించాలకున్నట్లు కంగనా తెలిపింది. కానీ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో అది వీలు కాలేదని పేర్కొంది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ కోమల్ నహతాతో పాల్గొన్న ఇంటర్వ్యూను పంచుకుంది. ఈ వీడియోను మీతో షేర్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.. ఎందుకంటే ఈ విషయాన్ని నేను ఇప్పటికే మర్చిపోయానని కంగనా తెలిపింది. గతంలో ఎమర్జెన్సీ చిత్రం నిర్మించడానికి తన ఆస్తులన్నీ తనఖా పెట్టినట్లు కంగనా వెల్లడించారు. ఒకవేళ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైతే తన ఆస్తిని కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. నేను కేవలం రూ.500తో ముంబైకి వచ్చానని.. కాబట్టి పూర్తిగా ఫెయిలైనా మరోసారి నిలబడగలననే విశ్వాసముందని తెలిపారు. కాగా.. కంగనా ఇటీవలే ఎమర్జెన్సీ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, విశాక్ నాయర్ నటించారు. ప్రస్తుతం ఆమె తెలుగులో చంద్రముఖి -2 సినిమాలో నటిస్తోంది. -
ఎస్వీబీ సంక్షోభం: స్టార్టప్‌లకు రిస్కులు తొలగిపోయినట్లే!
న్యూఢిల్లీ: సిలికాన్ వ్యాలీ బ్యాంకు (ఎస్వీబీ) విషయంలో అమెరికా ప్రభుత్వం సత్వరం చర్య తీసుకున్న నేపథ్యంలో దేశీ స్టార్టప్‌లకు పొంచి ఉన్న రిస్కులు తొలగిపోయినట్లేనని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థను మరింతగా విశ్వసించాల్సిన అవసరం గురించి ఈ సంక్షోభం ఓ పాఠాన్ని నేర్పిందని ఒక ట్వీట్లో ఆయన పేర్కొన్నారు. ఎస్వీబీ ఖాతాదారులకు సోమవారం నుంచి వారి నగ దు అందుబాటులో ఉంటుందంటూ అమెరికా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో చంద్రశేఖర్ ఈ విషయాలు తెలిపారు. ఎస్వీబీ ప్రధానంగా స్టార్టప్ సంస్థలకు బ్యాంకింగ్ సేవలు అందిస్తోంది. అయితే, డిపాజిటర్లు విత్‌డ్రాయల్స్‌కు ఎగబడటంతో సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకున్న బ్యాంకును నియంత్రణ సంస్థలు మూసివేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఎస్వీబీ బ్రిటన్ విభాగాన్ని బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ నామమాత్రంగా 1 పౌండుకు కొనుగోలు చేసేలా తగు చర్యలు తీసుకున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది. తద్వారా 3,000 మంది ఖాతాదారులకు చెందిన 6.7 బిలియన్ పౌండ్ల డిపాజిట్లను భద్రత లభిస్తుందని పేర్కొంది. -
Credit Suisse: అంతర్జాతీయ బ్యాంకింగ్ సంక్షోభం!
సాక్షి, బిజినెస్ డెస్క్: దాదాపు పదిహేనేళ్ల క్రితం తరహాలో అంతర్జాతీయంగా మరో బ్యాంకింగ్ సంక్షోభం ముప్పు ముంచుకు రాబోతోందా? అమెరికా, యూరప్‌వ్యాప్తంగా బ్యాంకుల పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే వారం రోజుల వ్యవధిలో అమెరికాలో రెండు బ్యాంకులు మూతబడగా తాజాగా స్విట్జర్లాండ్‌కి చెందిన క్రెడిట్ సూసీ భవిష్యత్తుపై కూడా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. బ్యాంకులో మరింతగా ఇన్వెస్ట్ చేసేది లేదంటూ కీలక ఇన్వెస్టరు ప్రకటించడంతో క్రెడిట్ సూసీ షేర్లు బుధవారం 27 శాతం పతనమయ్యాయి. గత రెండేళ్లలో బ్యాంకు షేరు సుమారు 85 శాతం క్షీణించింది. డిఫాల్ట్ అయ్యే అవకాశాలు 40 శాతం మేర ఉన్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ కూడా అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగం పరిస్థితులపై ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. సమస్యలతో సతమతం.. వాస్తవానికి క్రెడిట్ సూసీ గత కొన్నాళ్లుగా సమస్యలతో సతమతమవుతూనే ఉంది. 2019లో సంస్థ సీవోవో పియరీ ఆలివర్ కొందరు ఉన్నత స్థాయి ఉద్యోగులపై నిఘా పెట్టేందుకు ప్రైవేట్ డిటెక్టివ్‌ను నియమించుకున్నారు. అయితే సదరు డిటెక్టివ్ అనుమానాస్పద రీతిలో మరణించిన తర్వాత ఆలివర్ను క్రెడిట్ సూసీ తొలగించింది. ఇదంతా బ్యాంకు వ్యవహారంపై సందేహాలు రేకెత్తించింది. అటుపైన 2021లో ఆర్చిగోస్ క్యాపిటల్ అనే అమెరికన్ హెడ్జ్ ఫండ్ సంస్థ మూతబడటంతో దాదాపు 5 బిలియన్ డాలర్ల భారీ నష్టం మూటకట్టుకుంది. ఆ కంపెనీకి క్రెడిట్ సూసీ బ్రోకరేజి సర్వీసులు అందించేది. అటు పైన గ్రీన్‌సిల్ క్యాపిటల్ అనే మరో సంస్థ మూతబడటంతో.. దాని ప్రభావాల కారణంగా ఇన్వెస్టర్లు 3 బిలియన్ డాలర్ల దాకా నష్టపోయారు. గతేడాది ఫిబ్రవరిలో దాదాపు 100 బిలియన్ డాలర్ల పైగా డిపాజిట్లు ఉన్న 30,000 మంది పైచిలుకు ఖాతాదారులపై మనీలాండరింగ్, అవినీతి తదితర ఆరోపణలు రావడంతో సంస్థ ప్రతిష్ట మరింత మసకబారింది. దీంతో క్రమంగా డిపాజిట్ల విత్‌డ్రాయల్స్ మొదలయ్యాయి. 2019 నుంచి టాప్ లీడర్షిప్ ఇప్పటికి అనేక సార్లు మారింది. గతేడాది క్రెడిట్ సూసీ పెట్టుబడుల కోసం అన్వేషిస్తుండగా.. సౌదీ నేషనల్ బ్యాంక్ 1.5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. సంస్థలో మరింతగా ఇన్వెస్ట్ చేసే యోచన లేదని సౌదీ నేషనల్ బ్యాంక్ చైర్మన్ అమ్మార్ అల్ ఖుదైరీ ప్రకటించడం తాజాగా క్రెడిట్ సూజీ షేర్ల పతనానికి దారి తీసింది. 2018లో 16 స్విస్ ఫ్రాంకులుగా ఉన్న షేరు ప్రస్తుతం 1.70 ఫ్రాంకులకు (ఒక స్విస్ ఫ్రాంక్ విలువ సుమారు రూ. 89). పడిపోయింది. మార్కెట్లలో ప్రకంపనలు.. ఇప్పటికే అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) మూతబడటం, తాజాగా క్రెడిట్ సూసీ పరిణామాలతో ఇతరత్రా బ్యాంకులపైనా ప్రభావం పడింది. బుధవారం పలు యూరోపియన్ బ్యాంకుల షేర్లు రెండంకెల స్థాయిలో క్షీణించాయి. ఫ్రాన్స్‌కు చెందిన సొసైటీ జనరల్ 12 శాతం, బీఎన్పీ పారిబా 10 శాతం, జర్మనీకి చెందిన డాయిష్ బ్యాంక్.. బ్రిటన్ సంస్థ బార్క్లేస్ బ్యాంక్ మొదలైనవి సుమారు 8 శాతం పడిపోయాయి. రెండు ఫ్రెంచ్ బ్యాంకుల్లోనూ కొంత సమయం పాటు ట్రేడింగ్‌ను నిలిపివేశారు. అటు అమెరికాలో బ్యాంకులూ అదే బాటలో పయనించాయి. ప్రధానంగా డిపాజిటర్లు ఎకాయెకిన డిపాజిట్లను వెనక్కి తీసుకునే రిస్కులు ఉన్న చిన్న, మధ్య రకం బ్యాంకుల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ 17 శాతం, ఫిఫ్త్ థర్డ్ బ్యాంకార్ప్ 6 శాతం, జేపీమోర్గాన్ చేజ్ 4 శాతం పతనమయ్యాయి. -
ఏడాదిలోగా రష్యా ఖజానా ఖాళీ.. పుతిన్‌కు షాకిచ్చిన వ్యాపారవేత్త!
మాస్కో: రష్యా ఖజానా ఏడాదిలోగా ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు ఆ దేశానికి చెందిన దిగ్గజ వ్యాపారవేత్త ఒలెగ్ డెరిపాక్స. సిబేరియాలో గురువారం జరిగిన ఆర్థిక సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ దేశాలు గతేడాది కఠిన ఆంక్షలు విధించినా రష్యా ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉందని అధ్యక్షుడు పుతిన్ ప్రశంసించిన తర్వాత ఒలెగ్ అందుకు పూర్తి విరుద్ధంగా మాట్లాడటం గమనార్హం. ఉక్రయిన్తో యుద్ధం చేస్తున్న కారణంగా రష్యాపై పశ్చిమ దేశాలు అనేక ఆంక్షలు విధించి ఉక్కిరిబిక్కిరి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యుద్ధం వల్ల రష్యా ప్రభుత్వ ఖజనా ఖాళీ అవుతోందని, ఏడాదిలోగా ఏమీ మిగలని పరిస్థితి వస్తుందని ఒలెగ్ పేర్కొన్నారు. విదెశీ పెట్టుబడిదారుల అవసరం ఇప్పుడు రష్యాకు అత్యంత ముఖ్యం అని చెప్పారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం మొదలుపెట్టిన తొలినాళ్లలోనే దీన్ని ఆపేయాలని ఒలెగ్ బహిరంగంగా ప్రకటించారు. పశ్చిమ దేశాల నుంచి ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యాకు ఇప్పుడు మిత్రదేశాలు ఆపన్నహస్తం అందించి కీలక పాత్ర పోషించాల్సి ఉందని ఒలెగ్ అభిప్రాయపడ్డారు.అయితే విదేశీ ఇన్వెస్టర్లకు రష్యా అనువైన పరిస్థితులు కల్పించి మార్కెట్లను ఆకర్షణీయంగా చేస్తేనే పెట్టుబడిదారులు ముందుక వస్తారని వివరించారు. ఉక్రెయిన్‌పై రష్యా గతేడాది ఫిబ్రవరిలో దండయాత్ర ప్రారంభించినప్పటి నుంచి పశ్చిమ దేశాలు ఆ దేశంపై 11,300కు పైగా ఆంక్షలు విధించాయి. 300 బిలియన్ డాలర్ల విదేశీ నిల్వలను ఫ్రీజ్ చేశాయి. యుద్ధాన్ని వెంటనే ఆపాలని హెచ్చరించాయి. కానీ రష్యా మాత్రం వెనక్కి తగ్గకుండా ఏడాదిగా దండయాత్ర కొనసాగిస్తోంది. ఒక్క చైనా మాత్రమే రష్యాకు బాసటగా నిలిచింది. ఇంధనాన్ని భారీగా కొనుగోలు చేసింది. మెషీనరీ, బేస్ మెటల్స్ వంటి ఉత్పత్తులు సరఫారా చేసి పశ్చాత్య దేశాల స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నించింది. కానీ అది ఏమాత్రము రష్యా కోలుకునేందుకు సాయపడలేదు. చదవండి: ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి భారత్‌తో కలిసి పని చేస్తాం -
శ్రీలంకలో కరెంట్ చార్జీల మోత.. ఐఎంఎఫ్ ఒత్తిడికి తలొగ్గి నిర్ణయం..
కొలంబో: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) నిబంధనలు శ్రీలంక ప్రజల పాలిట పెనుభారంగా మారుతున్నాయి. ఐఎంఎఫ్ విధించిన నిబంధనలకు తలొగ్గిన శ్రీలంక ప్రభుత్వం విద్యుత్ చార్జీలను 66 శాతం పెంచేస్తూ నిర్ణయం తీసుకుంది. కరెంటు చార్జీలు పెంచడం గత ఆరు నెలల్లో ఇది రెండోసారి. బిల్లుల పెంపు నేపథ్యంలో విద్యుత్ కోతలకు గురువారం నుంచే తెరపడింది. ఇకపై నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. శ్రీలంకలో గత ఏడాది కాలంగా కరెంటు కోతలు కొనసాగాయి. నిత్యం ఒక గంట నుంచి 14 గంటలదాకా కరెంటు సరఫరా నిలిపివేశారు. రుణం ఇవ్వాలంటే విద్యుత్ చార్జీలు పెంచాలని ఐఎంఎఫ్ స్పష్టం చేయడంతో శ్రీలంక ప్రభుత్వం ఒప్పుకోక తప్పలేదు. ఐఎంఎఫ్ నుంచి 2.9 బిలియన్ డాలర్ల రుణం తీసుకోనుంది. చదవండి: ఉక్రెయిన్‌పై మరోసారి క్షిపణలు వర్షం.. -
మార్కెట్లో అప్రమత్తతకు అవకాశం
ముంబై: అదానీ గ్రూప్ సంక్షోభం, ద్రవ్యోల్బణ డేటా, కీలక కార్పొరేట్ క్యూ3 ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఈ వారం ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే వీలుందని మార్కట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులపై దృష్టి సారింవచ్చు. వీటితో పాటు క్రూడాయిల్ ధరలు, డాలర్ ఇండెక్స్, రూపాయి విలువ, బాండ్లపై దిగుమతి అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. గతవారం మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనై మిశ్రమంగా ముగిసింది. సెన్సెక్స్ 159 పాయింట్లు నష్టపోగా.., నిఫ్టీ మూడు పాయింట్లు లాభపడింది. ఆటో, ఇంధన, ఎఫ్ఎంసీజీ, మెటల్, అయిల్‌అండ్‌గ్యాస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. టెక్నాలజీ, మౌలిక, ఫార్మా, కొన్ని బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు కొనుగోళ్లకు మద్దతు లభించింది. ‘‘ఇటీవల ప్రతికూలతలు ఎదుర్కొన్న మార్కెట్ ప్రస్తుతం కీలక స్థాయి వద్ద ట్రేడవుతుంది. ఈ గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు ఒక బలమైన సానుకూలాంశం కోసం ఎదురు చూస్తోంది. ఇన్వెస్టర్లు నాణ్యమైన షేర్ల కొనుగోలు వ్యూహాన్ని అనుసరించాలి. ధీర్ఘకాలిక పెట్టుబడులకు స్మాల్ క్యాప్ కంపెనీల షేర్లను ఎంచుకోవడం ఉత్తమం. అప్‌సైడ్‌లో నిఫ్టీ 18,000 వద్ద కీలక నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది. దిగువ స్థాయిలో 17600 వద్ద తక్షణ మద్దతు కలిగివుంది’’ అని శామ్కో సెక్యూరిటీస్ అడ్వైజరీ ఇన్వెస్టర్స్ రీసెర్చ్ హెడ్ అపూర్వ సేత్ తెలిపారు. అదానీ గ్రూప్ సంక్షోభం హిండెన్‌బర్గ్ ఆరోపణలపై అదానీ గ్రూప్ ఎప్పటికప్పుడు ఇచ్చుకుంటున్న వివరణలు ఇన్వెస్టర్లకు భరోసాను ఇవ్వలేకపోతున్నాయి. తాజాగా అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్ షేర్ల ట్రేడింగ్ మీద పెట్టిన అదనపు నిఘా ఎత్తివేస్తున్నట్లు ఎన్ఎస్ఈ శుక్రవారం ప్రకటించింది. అలాగే మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ నాలుగు అదానీ కంపెనీ షేర్లపై దాని రేటింగ్ ఔట్‌లుక్‌ను ‘స్టేబుల్’ నుండి ‘నెగటివ్’కి తగ్గించింది. అదానీ గ్రూప్ ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ మంగళవారం క్యూ3 ఆర్థిక ఫలితాలను వెల్లడించనుంది. ఈ సందర్భంగా యాజమాన్యం మరింత స్పష్టత వచ్చే వీలుంది. కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు దేశీయ కార్పొరేట్ కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన తుది అంకానికి చేరుకుంది. అదానీ ఎంటర్ప్రైజెస్, ఓఎన్జీసీ, గ్రాసీం, ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్, ఎన్ఎండీసీ, బయోకాన్‌తో సహా ఈ వారంలో మొత్తం 1300 పైగా కంపెనీలు తమ డిసెంబర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇందులో నిఫ్టీ–50 సూచీలోని ఎనిమిది కంపెనీలున్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. అయిదువేల కోట్ల అమ్మకాలు ఈ ఏడాది జనవరిలో భారీ ఉపసంహరణ తర్వాత ఫిబ్రవరిలో ఎఫ్ఐఐల విక్రయాలు కాస్త మందగించాయి. ఎన్ఎస్డీఎల్ డేటా ప్రకారం ఈ నెల పదో తేదీకి రూ.5,000 కోట్ల షేర్లను అమ్మేశారు. జనవరిలో రూ.53,887 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం భారత మార్కెట్లలో తమ పెట్టుబడులను వెనక్కి తీసుకొని చైనా, దక్షిణ కొరియా, హాంకాంగ్ వంటి మార్కెట్లలో దీర్ఘకాలం పెట్టుబడులు పెట్టి లాభాలను ఆర్జించాలని విదేశీ పెట్టుబడులు యోచిస్తున్నట్లు సమాచారం. స్థూల ఆర్థికాంశాల ప్రభావం మార్కెట్ నేడు గతేడాది డిసెంబర్ పారిశ్రామికోత్పత్తి డేటాకు స్పందించాల్సి ఉంటుంది. దేశీయ జనవరి సీపీఐ ద్రవ్యోల్బణం నేడు, డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం (మంగళవారం) రేపు విడుదల కానున్నాయి. అమెరికా సీపీఐ ద్రవ్యోల్బణం డేటాను మంగళవారం వెల్లడించనుంది. సీపీఐ ద్రవ్యోల్బణం గత నాలుగు నెలలుగా ఆర్బీఐ నిర్ధేశించుకున్న స్థాయిలోనే నమోదువుతోంది. జనవరిలోనూ స్థిరంగా ఉంటుందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. వాణిజ్య లోటు గణాంకాలు బుధవారం(ఫిబ్రవరి 15న) విడుదల అవుతాయి. వారాంతాపు రోజు శుక్రవారం ఆర్బీఐ ఫిబ్రవరి నాలుగో తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. -
అదే దైన్యం..! కోలుకోని తుర్కియే, సిరియా.. 33 వేలు దాటిన మృతుల సంఖ్య
అంటాక్యా (తుర్కియే): ఆరు రోజులు గడిచినా భూకంప ప్రకోపం ప్రభావం నుంచి తుర్కియే, సిరియా ఏమాత్రమూ తేరుకోలేదు. కుప్పకూలిన వేలాది భవనాల శిథిలాల నుంచి ఇంకా మృతదేహాలు బయట పడుతూనే ఉన్నాయి. మరోవైపు లక్షలాది మంది సర్వం పోగొట్టుకుని కట్టుబట్టలతో నిరాశ్రయులుగా మిగలడంతో ఈ విపత్తు క్రమంగా పెను మానవీయ సంక్షోభంగా మారుతోంది. వారికి కనీస వసతులు కల్పించడం కూడా ప్రభుత్వానికి సవాలుగా పరిణమిస్తోంది. దాంతో బాధితుల్లో ఆక్రోశం ఆగ్రహంగా మారి కట్టలు తెంచుకుంటోంది. మరోవైపు రెండు దేశాల్లో మృతుల సంఖ్య ఇప్పటికే 33 వేలు దాటేసింది. తుర్కియేలోనే కనీసం 80 వేల మందికి పైగా గాయపడ్డారు. మృతదేహాలను సామూహికంగా ఖననం చేస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. వెలికితీత, సహాయ కార్యక్రమాలు నత్తనడకన నడుస్తుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. భూకంపం రావచ్చని ముందే సమాచారమున్నా దాన్ని ఎదుర్కొనేందుకు సరైన చర్యలు తీసుకోలేదంటూ కూడా ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించి భారీ జన నష్టానికి కారకులయ్యారంటూ తుర్కియేలో వందలాది మంది కాంట్రాక్టర్లను అరెస్టు చేస్తున్నారు. తుర్కియేలో ఈ శతాబ్ది విపత్తుగా పరిగణిస్తున్న ఈ భూకంపం ధాటికి 500 కిలోమీటర్ల పరిధిలో 1.3 కోట్ల మంది తీవ్రంగా ప్రభావితులయ్యారు. సిరియాలోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాలు ప్రభుత్వ, వేర్పాటువాదుల అధీనంలోని ప్రాంతాల మధ్య విస్తరించడం సహాయ చర్యలకు అడ్డంకిగా మారింది. ఇప్పటిదాకా 4,000కు పైగా మరణించారని అంచనా. వీరంతా మృత్యుంజయులు తుర్కియేలో ఓ రెండు నెలల చిన్నారిని ఏకంగా 128 గంటల తర్వాత శిథిలాల నుంచి సజీవంగా రక్షించారు! అదియమాన్ నగరంలో ఓ ఆరేళ్ల బాలున్ని ఏకంగా 151 గంటల అనంతరం ఆదివారం కాపాడారు. ఈ కార్యక్రమాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయడం విశేషం! మరో చిన్నారి బాలికను కూడా 150 గంటల తర్వాత కాపాడారు. అంటాక్యాలో మరో 35 ఏళ్ల వ్యక్తిని 149 గంటల తర్వాత కాపాడారు. శిథిలాల కింద చిక్కిన వారిని గుర్తించేందుకు థర్మల్ కెమెరాలు తదితర మార్గాల్లో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భారత్‌తో పాటు పలు దేశాల నుంచి వచ్చిన సిబ్బంది అహోరాత్రాలు సహాయ, పునరావాస కార్యక్రమాల్లో చెమటోడుస్తున్నారు. -
పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ!
ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్న పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్న దాయాది దేశానికి జల రవాణా స్తంభించినట్లు తెలుస్తోంది. పాక్ దిగుమతి చేసుకోవాలనుకున్న 2వేల లగ్జరీ కార్లతో పాటు నిత్యవసర వస్తువులు సైతం సముద్రమార్గాన నిలిచిపోయినట్లు పాక్ మీడియా సంస్థ డాన్ తెలిపింది. పాకిస్తాన్లో ఆర్ధిక సంక్షోభం మరింత ముదురుతోంది. ఇప్పటికే అప్పులిచ్చేందుకు ఆర్ధిక సంస్థలు వెనకాడుతుండగాగా..విదేశీ మారక నిల్వలు అడుగంటిపోతున్నాయి. గతేడాది డిసెంబర్ 30తో గడిచిన వారానికి పాకిస్తాన్ కేంద్ర బ్యాంక్ వద్ద విదేశీ మారక నిల్వలు 5.5 డాలర్లకు పడిపోయాయి.ఇది ఎనిమిదేళ్ల కనిష్టస్థాయి అని డాన్ ప్రచురించింది. ఖజనా ఖాళీ తాజాగా పాక్ ఖజనాలో విదేశీ మారక ద్రవ్యం లోటుతో అప్పులు, అవసరాల్ని తీర్చుకోలేక ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతుల్ని నిలిపివేసింది. ఆ దిగుమతుల్లో గతేడాది జులై నుంచి డిసెంబర్ మధ్య కాలానికి చెందిన 164 లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. వినియోగించిన లగ్జరీ వాహనాల దిగుమతులు కూడా పెరిగాయని డాన్ వార్తాపత్రిక నివేదిక పేర్కొంది. తగ్గిన కొనుగోలు శక్తి నివేదిక ప్రకారం, గత ఆరు నెలల్లో పాకిస్థాన్ దాదాపు 1,990 వాహనాలను దిగుమతి చేసుకుంది. జూలై నుండి సెప్టెంబర్ వరకు చాలా వరకు దిగుమతులు జరిగాయని, అక్టోబరు నుండి డిసెంబరు వరకు చాలా తక్కువ సంఖ్యలో కార్ల దిగుమతి అవుతున్నాయని సీనియర్ కస్టమ్స్ అధికారులు చెప్పినట్లు డాన్ పత్రిక నివేదించింది. కొనుగోలు శక్తి లేకపోవడం వల్ల వాహనాల దిగుమతులు తగ్గినట్లు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 5వేల కంటైనర్ల నిండా మరోవైపు, ఓడరేవుల వద్ద ఫుడ్,బేవరేజెస్,క్లోతింగ్,షూస్,గ్యాస్ ఆయిల్‌తో పాటు ఇండస్ట్రియల్ గూడ్స్ ప్రొడక్ట్‌లైన ఎలక్ట్రిక్ వస్తువులతో ఉన్న 5 వేల కంటే ఎక్కువ కంటైనర్లను ఉంచినట్లు హైలెట్ చేసింది. పాక్ పర్యటనలో ఐఎంఎఫ్ బృందం ఇక డిసెంబర్ నెల నాటికి పాకిస్తాన్ వద్ద విదేశీ మారక నిల్వలు 5.5 బిలియన్లు ఉండగా ప్రస్తుతం అవికాస్త కనిష్ట స్థాయిలో 3.7 బిలియన్లకు పడిపోయాయి. అయితే ఈ అప్పుల నుంచి బయట పడేసేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రతినిధుల బృందం ఈ వారం పాక్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనల్లో అక్కడి పరిస్థితుల్ని అంచనా వేసి రుణాల్ని అందించనుంది. -
చేష్టలుడిగిన భద్రతా మండలి: కొరోసీ
ఐరాస: అత్యంత శక్తిమంతమైన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పూర్తిగా చేష్టలుడిగిందని ఐరాస సర్వప్రతినిధి సభ అధ్యక్షుడు సబా కొరోసీ వాపోయారు. వర్తమాన కాలపు వాస్తవాలను అది ఎంతమాత్రమూ ప్రతిబింబించడం లేదంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘యుద్ధాలను నివారించి అంతర్జాతీయ శాంతిభద్రతలను పరిరక్షించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన మండలి ఆ బాధ్యతల నిర్వహణలో విఫలమవుతోంది. దానికి కారణమూ సుస్పష్టం. దాని శాశ్వత సభ్య దేశాల్లోనే ఒకటి పొరుగు దేశంపై దురాక్రమణకు పాల్పడి ప్రపంచాన్ని తీవ్ర ప్రమాదంలోకి, సంక్షోభంలోకి నెట్టింది. ఈ దుందుడుకుతనానికి గాను రష్యాపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాల వీటో పవర్ కారణంగా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడింది. అందుకే మండలిని సంస్కరించాల్సిన అవసరం చాలా ఉంది. మండలి కూర్పు రెండో ప్రపంచ యుద్ధానంతరపు అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో జరిగింది. దాన్నిప్పుడు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలి’’ అని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ సంస్థల పనితీరు ఎలా ఉండాలనే విషయంలో రష్యా దురాక్రమణ పెద్ద గుణపాఠంగా నిలిచిందన్నారు. భారత పర్యటనకు వచ్చిన కొరోసీ పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. -
పాపం పాకిస్తానీలు.. గోధుమ పిండి కోసం ట్రక్కు వెనకాల పరుగులు...
ఇస్లామాబాద్: పొరుగు దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉంది. తనడానికి తిండి కూడా సరిగా లేక ప్రజలకు ఆకలితో అలమటిస్తున్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో ప్రజలు విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ దయనీయ పరిస్థితులకు అద్దం పట్టే ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో గోధుమ పిండి లోడుతో వెళ్తున్న ఓ టక్కు వెనకాల పరుగెత్తుతున్నారు పాకిస్తానీలు. బైక్‌లు వేసుకుని ర్యాలీగా దాన్ని ఫాలో అవుతున్నారు. తమకు ఓ పిండి బస్తా ఇవ్వమని చేతిలో డబ్బులు పట్టుకుని ప్రాధేయపడుతున్నారు. This isn’t a motorcycle rally, ppl in #Pakistan are desperately chasing a truck carrying wheat flour, hoping to buy just 1 bag. Ppl of #JammuAndKashmir should open their eyes. Lucky not to be #Pakistani & still free to take decision about our future. Do we have any future with🇵🇰? pic.twitter.com/xOywDwKoiP — Prof. Sajjad Raja (@NEP_JKGBL) January 14, 2023 ఈ వీడియోను నేషనల్ ఈక్వాలిటీ పార్టీ జమ్ముకశ్మీర్ గిల్గిత్ బాల్టిస్తాన్ అండ్ లద్దాఖ్ (జేకేజీబీఎల్) ఛైర్మన్ ప్రొఫెసర్ సజ్జాద్ రాజా ట్విట్టర్లో షేర్ చేశారు. ఒక్క పిండి బస్తా కోసం పాకిస్తాన్లో ప్రజలు ఎలా ట్రక్కు వెనకాల పరుగెత్తుతున్నారో చూడండి. దీన్ని చూసైనా జమ్ముకశ్మీర్ ప్రజలు కళ్లు తెరవాలి. వాళ్లు పాకిస్తాన్లో లేనందుకు అదృష్టవంతులు. మన భవిష్యత్‌పై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఇంకా ఉంది. పాకిస్తాన్లో అసలు మనకు భవిష్యత్ ఉందా? అని ప్రశ్నించారు. లాహోర్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ 15 కిలోల గోధుమ పండి బస్తా ధర రూ.2,050 ఉంది. జనవరి 6నే బస్తాపై రూ.150 పెంచారు. ఆర్థిక, ఆహార సంక్షోభంతో పాకిస్తాన్లో పెట్రోల్, డీజిల్ సహా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చదవండి: ప్రపంచాన్ని చుట్టివచ్చిన వీరుడు.. వేల కోట్లకు అధిపతి.. విమానంలో దిక్కులేని చావు.. -
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్
-
పాకిస్తాన్లో ఆహార సంక్షోభం
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం మరింత ముదురుతోంది. ఆహార సంక్షోభం సైతం మొదలయ్యింది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రధానంగా గోధుమ పిండి కొరత వేధిస్తోంది. రాయితీపై ప్రభుత్వం అందించే గోధుమ పిండి కోసం జనం ఎగబడుతున్నారు. ఖైబర్ పఖ్తూంక్వా, సింధ్, బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న తొక్కిసలాట, తోపులాట దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పిండి కోసం తరలివచి్చన జనంతో మార్కెట్లు నిండిపోయాయి. మార్కెట్లలో రాయితీ గోధుమ పిండి కోసం జనం గంటల తరబడి వరుసల్లో నిలబడాల్సి వస్తోంది. నిత్యం వేలాది మంది వస్తున్నారని స్థానిక మీడియా వెల్లడించింది. కిలో గోధుమ పిండి రూ.160 పాకిస్తాన్ ప్రధాన ఆహారమైన గోధుమలు, గోధుమ పిండి ధర విపరీతంగా పెరిగిపోయింది. కరాచీలో కిలో పిండి ధర రూ.160కు చేరింది. ఇస్లామాబాద్, పెషావర్‌లో 10 కిలోల గోధుమ పిండి బ్యాగ్‌ను రూ.1,500కు విక్రయిస్తున్నారు. 15 కిలోల బ్యాగ్ ధర రూ.2,050 పలుకుతోంది. గత రెండు వారాల వ్యవధిలోనే ధర రూ.300 పెరిగింది. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దిగజారడం ఖాయమన్న సంకేతాలను బలూచిస్తాన్ ఆహార మంత్రి జమారక్ అచాక్జాయ్ ఇచ్చారు. గోధుమ నిల్వలు పూర్తిగా ఖాళీ అయ్యానని చెప్పారు. ఆహార శాఖ, పిండి మిల్లుల నడుమ సమన్వయ లోపమే కొరతకు కారణమని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. కరిగిపోతున్న విదేశీ మారక నిల్వలు పాకిస్తాన్‌ను ద్రవ్యోల్బణం హడలెత్తిస్తోంది. గత ఏడాది సంభవించిన భీకర వరదల వల్ల కష్టాలు మరింత పెరిగాయి. కేవలం గోధుమలే కాదు ఉల్లిపాయలు, తృణధాన్యాలు, బియ్యం ధరలు సైతం పైకి ఎగబాకుతున్నాయి. కిలో ఉల్లిపాయల ధర 2022 జనవరి 6న రూ.36.7 కాగా, 2023 జనవరి 5 నాటికి ఏకంగా రూ.220.4కు చేరింది. అంటే ఏడాది వ్యవధిలోనే 501 శాతం పెరిగింది. అలాగే డీజిల్ ధర 61 శాతం, పెట్రోల్ ధర 48 శాతం పెరిగింది. బియ్యం, తృణధాన్యాలు, గోధుమల ధర 50 శాతం ఎగబాకింది. 2021 డిసెంబర్లో పాక్ ద్రవ్యోల్బణం 12.3 శాతం కాగా, 2022 డిసెంబర్లో 24.5 శాతం నమోదయ్యింది. ఆహార ద్రవ్యోల్బణం ఒక ఏడాదిలోనే 11.7 శాతం నుంచి 32.7 శాతానికి చేరింది. పాకిస్తాన్లో విదేశీ మారక నిల్వలు వేగంగా అడుగంటుతున్నాయి. 2021 డిసెంబర్లో 23.9 బిలియన్ డాలర్లు ఉండగా, 2022 డిసెంబర్లో కేవలం 11.4 బిలియన్ డాలర్లు ఉన్నాయి. రష్యా గోధుమల దిగుమతి రష్యా నుంచి గోధుమలు పాకిస్తాన్‌కు చేరుకోవడం కొంత ఊరట కలిగిస్తోంది. రెండు ఓడల్లో వేలాది టన్నుల గోధుమలు తాజాగా కరాచీ రేవుకు చేరుకున్నాయి. అదనంగా 4,50,000 టన్నులు రష్యా నుంచి గ్వాదర్ పోర్టు ద్వారా త్వరలో రానున్నాయని పాక్ అధికారులు వెల్లడించారు. గోధుమల కొరతను అధిగమించడానికి వివిధ దేశాల నుంచి 75 లక్షల టన్నులు దిగుమతి చేసుకోవాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం సరుకు ఈ ఏడాది మార్చి 30 నాటికి పాకిస్తాన్‌కు చేరుకుంటుందని అంచనా. -
పాకిస్థాన్ లో ఆర్థిక, ఆహార సంక్షోభం
-
TS: కాంగ్రెస్‌లో ఎవరిగోల వారిదే.. ఠాక్రే ముందున్న సవాళ్లేంటీ?
కాంగ్రెస్ అంటేనే ఓ విచిత్రమైన పార్టీ. అక్కడ ఎవరి గోల వారిదే. వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న పార్టీ స్వయంకృతాపరాధాలతోనే నానాటికి తీసికట్టుగా తయారవుతోంది. తెలంగాణలో కూడా అదే బాటలో నడుస్తోంది. రెండున్నరేళ్ళ క్రితం వచ్చిన రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్ స్థానంలో మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేత మాణిక్‌రావు ఠాక్రేకు తెలంగాణ బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్‌లో ఇన్‌చార్జ్‌లను అవసరమైతే మూడేళ్లకో సారి మార్చుతారు. గతంలో పలువురు సీనియర్ నేతలు రెండు మూడు దఫాలుగా కూడా కొనసాగారు. కాని ఠాగూర్‌ను రెండున్నరేళ్ళకు ఎందుకు సాగనంపారు? ఠాగూర్ రాష్ట్రంలోని సీనియర్లతో వ్యవహరించిన తీరే ఆయన్ను పక్కన పెట్టారని గాంధీభవన్‌లో బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. మాణిక్కం ఎక్కడ తిరగబడ్డారు? తెలంగాణ ఇన్చార్జ్గా వచ్చిన ఠాగూర్ మొదట్లో మంచి క్రేజ్ సంపాదించారు. చిన్న వయస్సులోనే కీలక రాష్ట్రానికి ఇంచార్జ్ గా బాధ్యతలు రావడంతో మొదట్లో ఉత్సాహంగా పని చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో శ్రేణులందరినీ మోహరింప చేసి గౌరవప్రదమైన ఓట్లు సాధించేలా చూశారు. ఆ తర్వాత పీసీసీ చీఫ్ మార్పు విషయంలో సీనియర్లతో మొదలైన గ్యాప్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని హైకమాండ్ నియమించింది. పీసీసీ సీటు కోసం సీనియర్లు చాలా మంది ప్రయత్నించారు. వారందరినీ కాదని తెలుగుదేశం నుంచి వచ్చిన రేవంత్‌కు గాంధీభవన్ అప్పగించడంతో ఠాగూర్ పెద్ద అపవాదును మూట కట్టుకున్నారు. సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఠాగూర్ పీసీసీ చీఫ్ పదవిని 40 కోట్లకు అమ్ముకున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత రేవంత్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలపై అనేకసార్లు మాణిక్కం ఠాగూర్ కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోగా..ఫిర్యాదు చేసినవారిని ఎగతాళి చేసేవారట. దీంతో సీనియర్లు క్రమంగా ఠాగూర్‌కు దూరమయ్యారు. ఆయన్ను తొలగించాలని ఎప్పటినుంచో హైకమాండ్‌ను డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ రేవంత్ రూటు ఏంటీ? సీనియర్లతో పని చేయించుకునే విషయంలో పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి విఫలం కావడం.. నిరంతరం గ్రూపు తగాదాలతో రెండేళ్ళుగా పార్టీ బాగా డ్యామేజ్ అయింది. ఈ పరిస్థితులలో పార్టీని గాడిన పెట్టాల్సిన ఇంచార్జ్ ఠాగూర్ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయనపై ఉన్న ప్రధానమైన ఫిర్యాదు. సీనియర్లను పట్టించుకోవడం మానేయడమే గాకుండా..కొత్త కమిటీల ఏర్పాటు సందర్భంగా కూడా సీనియర్ల ఆగ్రహానికి ఠాగూర్ గురి కావాల్సి వచ్చింది. పరిస్థితి తీవ్రతను గమనించిన తర్వాత పార్టీ హైకమాండ్ రంగంలోకి వచ్చి.. సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను హైదరాబాద్ పంపించింది. పీసీసీ చీఫ్తోను..సీనియర్లతోనూ చర్చించిన దిగ్విజయ్ సింగ్ ఢిల్లీ వెళ్ళి హైకమాండ్‌కు నివేదిక సమర్పించారు. డిగ్గీ రాజా ఇచ్చిన రిపోర్టు ఠాగూర్‌కు వ్యతిరేకంగానే ఉన్నట్లు సమాచారం. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఠాగూర్ సైతం తెలంగాణ బాధ్యతల నుంచి తనను తప్పించమని పార్టీ అధిష్టానాన్ని వేడుకున్నారట. డిగ్గీ రాజా నివేదికలో ఏముంది? దిగ్విజయ్ సింగ్ నివేదిక పరిశీలించిన తర్వాత ఢిల్లీ పెద్దలు ఠాగూర్‌ను తప్పించడానికి నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద తెలంగాణ సీనియర్ల దెబ్బకు ఠాగూర్ ఇక్కడి నుంచి సర్దుకోవాల్సి వచ్చింది. అయితే ఠాగూర్ నుంచి కొత్త గా వచ్చిన ఇంఛార్జ్ ఠాక్రే చాలా నేర్చుకోవాల్సిఉంది. సీనియర్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడంతో పాటు..అందరినీ ఏకతాటిపై నడిపించడం కూడా కొత్త ఇన్చార్జ్ ముందున్న సవాళ్ళు. కొత్త ఇన్చార్జ్ నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంతవరకు బాగుపడుతుందో చూడాలి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
సుప్రీంకోర్టులో త్వరలో... ఖాళీల సంక్షోభం!
న్యూఢిల్లీ: పెండింగ్ కేసుల భారానికి తోడు న్యాయమూర్తుల కొరత రూపంలో కొత్త సంవత్సరంలో సుప్రీంకోర్టు కొత్త సంక్షోభాన్ని ఎదుర్కొనేలా కన్పిస్తోంది. ఈ ఏడాది 9 మంది న్యాయమూర్తులు రిటైర్ కానున్నారు. జస్టిస్ అబ్దుల్ నజీర్ పదవీకాలం జనవరి 4న, జస్టిస్ ఎంఆర్ షా మేలో, జస్టిస్ కేఎం జోసెఫ్, అజయ్ రస్తోగీ, వి.రామసుబ్రమణియం జూన్‌లో, జస్టిస్ కృష్ణ మురారి జూలైలో, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్ అక్టోబర్‌లో, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ పదవీకాలం డిసెంబర్లో ముగియనుంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఆరు ఖాళీలున్నాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయ మూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థపై న్యాయ వ్యవస్థకు, కేంద్ర ప్రభుత్వానికి విభేదాలు ముదురుతున్న నేపథ్యంలో ఈ ఖాళీలన్నింటినీ సకాలంలో భర్తీ చేయడం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌కు సవాలు కానుంది. సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులుండాలి. ప్రస్తుతం 28 మంది ఉన్నారు. కొలీజియం గత భేటీలో ఐదుగురి పేర్లను సిఫార్సు చేసింది. వీటిలో కొన్నింటిని కేంద్ర న్యాయ శాఖ త్వరలో ఆమోదించవచ్చని సమాచారం.