ముంబై: ట్రేడింగ్ నాలుగురోజులే జరిగే ఈ వారంలోనూ స్టాక్ సూచీల ఊగిసలాట కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నెలవారీ డెరివేటివ్స్ ఎక్స్‌పైరీ(బుధవారం) నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత వహించవచ్చు. అంతర్జాతీయ బ్యాంకింగ్ సంక్షోభ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చంటున్నారు. వీటితో డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చంటున్నారు.
‘‘అంతర్జాతీయ బ్యాంకింగ్ సంక్షోభం, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక బిల్లు సవరణ మార్కెట్లలో ఒడిదుడుకులకు ప్రధాన కారణమయ్యాయి. మార్కెట్ అధిక అమ్మకాల స్థాయిలో (ఓవర్ సోల్డ్) ఉండటం వాస్తవం. ఇదే సమయంలో అనూహ్యంగా ఆర్థికపరమైన సమస్యలు తెరపైకి రావడంతో సెంటిమెంట్ బలపడలేకపోతుంది. అమ్మకాలు కొ నసాగితే నిఫ్టీకి దిగువ స్థాయిలో 16,600–16,800 శ్రేణిలో తక్షణ మద్దతు లభిస్తుంది. సానుకూల పరిణామాలు నెలకొని కొనుగోళ్లు నెలకొంటే ఎగువ స్థాయిలో 17,200 వద్ద నిరోధం ఎదురుకావచ్చు.
ఐటీ, ఆటో, మెటల్, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనుకావడంతో గతవారంలో సెన్సెక్స్ 463 పాయింట్లు నిఫ్టీ 155 పాయింట్లు నష్టపోయాయి. ఇరుసూచీలకిది వరుసగా మూడోవారమూ నష్టాల ముగింపు.
బుధవారమే ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ
మార్చి 30న శ్రీరామ నవమి సందర్భంగా ఎక్సే్చంజీలకు సెలవుకావడంతో బుధవారమే నెలవారీ డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగియనుంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకునే స్క్యేయర్ ఆఫ్ లేదా రోలోవర్ అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చు. నిఫ్టీ స్వల్పకాలం పాటు 16,800–17,200 శ్రేణిలో ట్రేడవ్వొచ్చని ఆప్షన్ డేటా సూచిస్తోంది.
బ్యాంకింగ్ సంక్షోభం
గత వారాంతాన జర్మనీకి చెందిన డాయిష్ బ్యాంక్ సంక్షోభ ఉదంతం తెరపైకి వచ్చింది. బ్యాంక్ క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్స్ (సీడీఎస్) ప్రీమి యం ఒక్కసారిగా పెరగడంతో ఈ బ్యాంక్ సైతం దివాలా బాట పటొచ్చని ఊహాగానాలు నెలకొన్నాయి. అమెరికా, ఐరోపా బ్యాంకింగ్ వ్యవస్థలు వరుస వైఫల్యాలతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ఈ రంగంలో జరిగే ప్రతి పరిణామాన్ని మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.
ఎఫ్‌ఐఐల బేరీష్ వైఖరి
దేశీయ మార్కెట్ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు బేరీష్ వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఎఫ్‌ఐఐలు ఈ మార్చి 20–24 తేదీల మధ్య రూ.6,654 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇదే ఈ మార్చిలో సంస్థాగత ఇన్వెస్టర్లు మొతం్త రూ.9,430 కోట్ల షేర్లను కొనుగోలు చేసి దేశీయ ఈక్విటీ మార్కెట్ భారీ పతనాన్ని అడ్డుకుంటున్నారు.
ఊగిసలాట కొనసాగుతుంది
Published Mon, Mar 27 2023 12:30 AM | Last Updated on Mon, Mar 27 2023 12:30 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment