Interest rates Hike
-
ఊగిసలాట కొనసాగుతుంది
ముంబై: ట్రేడింగ్ నాలుగురోజులే జరిగే ఈ వారంలోనూ స్టాక్ సూచీల ఊగిసలాట కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నెలవారీ డెరివేటివ్స్ ఎక్స్పైరీ(బుధవారం) నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత వహించవచ్చు. అంతర్జాతీయ బ్యాంకింగ్ సంక్షోభ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చంటున్నారు. వీటితో డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చంటున్నారు. ‘‘అంతర్జాతీయ బ్యాంకింగ్ సంక్షోభం, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక బిల్లు సవరణ మార్కెట్లలో ఒడిదుడుకులకు ప్రధాన కారణమయ్యాయి. మార్కెట్ అధిక అమ్మకాల స్థాయిలో (ఓవర్ సోల్డ్) ఉండటం వాస్తవం. ఇదే సమయంలో అనూహ్యంగా ఆర్థికపరమైన సమస్యలు తెరపైకి రావడంతో సెంటిమెంట్ బలపడలేకపోతుంది. అమ్మకాలు కొ నసాగితే నిఫ్టీకి దిగువ స్థాయిలో 16,600–16,800 శ్రేణిలో తక్షణ మద్దతు లభిస్తుంది. సానుకూల పరిణామాలు నెలకొని కొనుగోళ్లు నెలకొంటే ఎగువ స్థాయిలో 17,200 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఐటీ, ఆటో, మెటల్, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనుకావడంతో గతవారంలో సెన్సెక్స్ 463 పాయింట్లు నిఫ్టీ 155 పాయింట్లు నష్టపోయాయి. ఇరుసూచీలకిది వరుసగా మూడోవారమూ నష్టాల ముగింపు. బుధవారమే ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ మార్చి 30న శ్రీరామ నవమి సందర్భంగా ఎక్సే్చంజీలకు సెలవుకావడంతో బుధవారమే నెలవారీ డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగియనుంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకునే స్క్యేయర్ ఆఫ్ లేదా రోలోవర్ అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చు. నిఫ్టీ స్వల్పకాలం పాటు 16,800–17,200 శ్రేణిలో ట్రేడవ్వొచ్చని ఆప్షన్ డేటా సూచిస్తోంది. బ్యాంకింగ్ సంక్షోభం గత వారాంతాన జర్మనీకి చెందిన డాయిష్ బ్యాంక్ సంక్షోభ ఉదంతం తెరపైకి వచ్చింది. బ్యాంక్ క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్స్ (సీడీఎస్) ప్రీమి యం ఒక్కసారిగా పెరగడంతో ఈ బ్యాంక్ సైతం దివాలా బాట పటొచ్చని ఊహాగానాలు నెలకొన్నాయి. అమెరికా, ఐరోపా బ్యాంకింగ్ వ్యవస్థలు వరుస వైఫల్యాలతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ఈ రంగంలో జరిగే ప్రతి పరిణామాన్ని మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఎఫ్ఐఐల బేరీష్ వైఖరి దేశీయ మార్కెట్ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు బేరీష్ వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఎఫ్ఐఐలు ఈ మార్చి 20–24 తేదీల మధ్య రూ.6,654 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇదే ఈ మార్చిలో సంస్థాగత ఇన్వెస్టర్లు మొతం్త రూ.9,430 కోట్ల షేర్లను కొనుగోలు చేసి దేశీయ ఈక్విటీ మార్కెట్ భారీ పతనాన్ని అడ్డుకుంటున్నారు. -
ఫెడ్ 0.25 శాతం వడ్డీ పెంపు
న్యూయార్క్: అంచనాలకు అనుగుణంగా యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును 0.25 శాతం పెంచింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేటు 4.75–5 శాతానికి చేరింది. నిజానికి కొద్ది నెలలుగా ద్రవ్యోల్బణ అదుపునకే అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న ఫెడ్.. వడ్డీ రేట్లను వేగంగా పెంచుతూ వస్తోంది. దీంతో 2022 మార్చి నుంచి 2023 ఫిబ్రవరి1 వరకూ దశలవారీగా 4.5 శాతం వడ్డీ రేటును పెంచింది. వెరసి 2022 ఫిబ్రవరిలో 0–0.25 శాతంగా ఉన్న ఫండ్స్ రేటు తాజాగా 5 శాతానికి ఎగసింది. ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ అంచనాలను మించి వడ్డీ రేట్లు పెరిగే వీలున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. b v అయితే కొద్ది రోజులుగా అమెరికా, యూరప్ బ్యాంకింగ్ రంగాలలో సంక్షోభ పరిస్థితులు తలెత్తడంతో ఫెడ్ పాలసీ సమీక్షకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. యూఎస్‌లో సిల్వర్‌గేట్ క్యాపిటల్, సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ ఇప్పటికే విఫలంకాగా.. ప్రస్తుతం ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకు సంక్షోభంలో ఉంది. మరోవైపు క్రెడిట్ స్వీస్ దివాలా స్థితికి చేరడంతో యూరప్ బ్యాంకింగ్ రంగంలోనూ ప్రకంపనలు పుడుతున్నాయి. స్విస్ కేంద్ర బ్యాంకు కల్పించుకుని యూబీఎస్‌ను రంగంలోకి దించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు వేగానికి బ్రేక్ పడనున్నట్లు పలువురు విశ్లేషకులు భావిస్తూ వచ్చారు. -
బ్యాంక్ ఆఫ్ బరోడా డిపాజిట్ రేట్ల పెంపు
ముంబై: బ్యాంక్ ఆఫ్ బరోడా వివిధ కాల వ్యవధి కలిగిన రిటైల్ టర్మ్ డిపాజిట్లు, ఎన్ఆర్వో, ఎన్ఆర్ఈ టర్మ్ డిపాజిట్లపై పావు శాతం మేర వడ్డీ రేట్లను పెంచినట్టు ప్రకటించింది. ఈ రేట్లు మార్చి 17 నుంచి అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు 0.25–0.35 శాతం వరకు అధిక రేటును ఆఫర్ చేస్తోంది. మూడు నుంచి ఐదేళ్ల టర్మ్ డిపాజిట్లపై రేటు 6.25 శాతం నుంచి 6.50 శాతానికి పెరిగింది. 5––10 ఏళ్ల డిపాజిట్పైనా ఇదే రేటు ఆఫర్ చేస్తోంది. బరోడా అడ్వాంటేజ్ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు 3–5 ఏళ్ల కాలానికి, 5–10 ఏళ్ల కాలానికి 6.50 శాతం నుంచి 6.75 శాతానికి పెరిగాయి. -
హిందూ వృద్ధి రేటుకు దగ్గర్లో భారత్
న్యూఢిల్లీ: ప్రైవేట్ పెట్టుబడుల తగ్గుదల, వడ్డీ రేట్ల పెరుగుదల, అంతర్జాతీయంగా వృద్ధి మందగమన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ ‘‘హిందూ వృద్ధి రేటుకు ప్రమాదకర స్థాయిలో చాలా దగ్గరగా’’ ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. సీక్వెన్షియల్‌గా త్రైమాసికాలవారీ వృద్ధి నెమ్మదిస్తుండటం ఆందోళన కలిగించే అంశమని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 1950ల నుంచి 1980ల దాకా అత్యంత తక్కువ స్థాయిలో నమోదైన వృద్ధి రేటును హిందూ వృద్ధి రేటుగా వ్యవహరిస్తారు. ఇది సగటున 4 శాతంగా ఉండేది. 1978లో భారతీయ ఆర్థికవేత్త రాజ్ కృష్ణ ఉపయోగించిన ఈ పదం ఆ తర్వాత నుంచి అత్యంత నెమ్మదైన వృద్ధి రేటుకు పర్యాయపదంగా మారింది. జాతీయ గణాంకాల కార్యాలయం గత నెల విడుదల చేసిన గణాంకాల ప్రకారం..ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 13.2 శాతంగా ఉన్న స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు, రెండో క్వార్టర్లో 6.3 శాతానికి, తర్వాత మూడో త్రైమాసికంలో 4.4 శాతానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘గత జీడీపీ గణాంకాలను తిరిగి ఎగువముఖంగా సవరించే అవకాశం ఉందని ఆశావహులు ఆశిస్తుండవచ్చు. కానీ సీక్వెన్షియల్ మందగమనం ఆందోళనకరంగా ఉందని నేను భావిస్తున్నాను. ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టపడటం లేదు .. ఆర్బీఐ ఇప్పటికీ వడ్డీ రేట్లను పెంచుతూనే ఉంది .. ఈ ఏడాది ప్రపంచ వృద్ధి మందగించే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు వృద్ధికి అవసరమైన తోడ్పాటు ఎక్కణ్నుంచి లభిస్తుందన్నది తెలియడం లేదు’’ అని రాజన్ పేర్కొన్నారు. తన ఆందోళనకు బలమైన కారణాలే ఉన్నాయని ఆయన చెప్పారు. నాలుగో త్రైమాసికంలో వృద్ధి మరింత నెమ్మదించి 4.2 శాతానికే పరిమితం కావచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోందని తెలిపారు. ప్రస్తుతం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసిక వృద్ధి రేటు దాదాపు మూడేళ్ల క్రితం నాటి కరోనా పూర్వపు 3.7 శాతం స్థాయికి దగ్గర్లో నమోదైందని పేర్కొన్నారు. ‘‘హిందూ వృద్ధి రేటుకు ఇది చాలా ప్రమాదకరమైన స్థాయిలో, అత్యంత దగ్గరగా ఉంది!! మనం ఇంకా మెరుగ్గా వృద్ధి సాధించాలి’’ అని ఆయన చెప్పారు. ఆశావహంగా సర్వీసులు.. ప్రభుత్వం తన వంతుగా మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెడుతోందని రాజన్ చెప్పారు. తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలతో ఇంకా ఫలితాలు రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సర్వీసుల రంగం ఆశావహంగా కనిపిస్తోందని రాజన్ చెప్పారు. చాలా మటుకు సంపన్న దేశాలు సేవల ఆధారితమైనవే ఉంటున్నాయని.. భారీ ఎకానమీగా ఎదగాలంటే తయారీపైనే ఆధారపడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. సర్వీసులతో .. నిర్మాణ, రవాణా, టూరిజం, రిటైల్, ఆతిథ్యం తదితర రంగాల్లో ఒక మోస్తరు నైపుణ్యాలు సరిపోయే ఉద్యోగాలను భారీగా కల్పించేందుకు వీలవుతుందని రాజన్ తెలిపారు. అదానీ గ్రూప్–హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వివాదంపై స్పందిస్తూ ప్రైవేట్ కంపెనీలపై నిఘాను తీవ్రంగా పెంచాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తుందని తాను భావించడం లేదన్నారు. తమ పని తాము చేసేలా నియంత్రణ సంస్థలను ప్రోత్సహిస్తూనే అటు వ్యాపార సంస్థలు .. ప్రభుత్వాల మధ్య లోపాయికారీ సంబంధాలను తగ్గించుకుంటే ఇలాంటివి తలెత్తడం తగ్గుతుందని ఆయన చెప్పారు. ఖాతాల్లో అవకతవకలు ఉన్నాయంటూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలతో అదానీ గ్రూప్ సంస్థల షేర్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే. -
అయిదు నెలల్లో అతిపెద్ద పతనం
ముంబై: వడ్డీరేట్ల పెంపు, భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావంతో బుధవారం దలాల్ స్ట్రీట్ కుప్పకూలింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ బేర్ సంపూర్ణ ఆధిక్యతను ప్రదర్శించడంతో బెంచ్‌మార్క్ సూచీలు అయిదు నెలల్లో అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి. అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీ తలెత్తడంతో సెన్సెక్స్ 928 పాయింట్లు నష్టపోయి 59,745 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 272 పాయింట్లు క్షీణించి 17,554 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది వరుసగా నాలుగోరోజూ నష్టాల ముగింపు. సెన్సెక్స్ సూచీలో 30 షేర్లకు గానూ ఒక్క ఐటీసీ(0.41%) మాత్రమే లాభంతో ముగిసింది. నిఫ్టీ 50 ఇండెక్స్‌లో నాలుగు షేర్లు మాత్రమే నష్టాల నుంచి గట్టెక్కాయి. మార్కెట్లో అస్థిరతను సూచించే వీఐఎక్స్ ఇండెక్స్ ఏకంగా 11 శాతం పెరగడంతో మెటల్, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ ఇండెక్సులు ఒకశాతానికి పైగా క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.580 కోట్ల షేర్లను అమ్మేశారు. డీఐఐలు రూ.372 కోట్ల షేర్లను కొన్నారు. అమెరికా స్టాక్ మార్కెట్లు మంగళవారం ఈ ఏడాదిలోనే అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి. బుధవారం ఆసియా మార్కెట్లు రెండుశాతం, యూరప్ మార్కెట్లు అరశాతం నష్టపోయాయి. ఇంట్రాడే ట్రేడింగ్ ఇలా ఉదయం సెన్సెక్స్ 281 పాయింట్ల పతనంతో 60391 వద్ద, నిఫ్టీ 72 పాయింట్ల నష్టంతో 17,755 వద్ద మొదలయ్యాయి. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బలహీనతల ప్రభావంతో తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపారు. ఒకదశలో సెన్సెక్స్ 992 పాయింట్లు క్షీణించి 59,681 వద్ద, నిఫ్టీ 297 పాయింట్లు నష్టపోయి 17,529 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. నష్టాలు ఎందుకంటే... అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్‌లో పర్యటించిన కొన్ని గంటలకే అణు ఒప్పందం నుంచి రష్యా తప్పుకుంటుందని వ్లాదిమిర్ పుతిన్ ప్రకటనతో రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు చెలరేగాయి. ఫెడ్ మినిట్స్ వెల్లడికి ముందు అప్రమత్తత, వడ్డీ రేట్ల పెంపు భయాలు, బాండ్లపై రాబడులు పెరగడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. దేశీయంగా ఆర్బీఐ మినిట్స్ వెల్లడి (మార్కెట్ ముగింపు తర్వాత), ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ముగింపు(నేడు) నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు. అదానీ గ్రూప్ షేర్లలో అమ్మకాల పరంపర ఒత్తిడిని మరింత పెంచింది. విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా నాలుగోరోజూ అమ్మకాలు పాల్పడ్డారు. ఈ జాతీయ అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ‘‘గత మూడు ట్రేడింగ్ సెషన్లలో బేర్స్‌కు ఎదురొడ్డి నష్టాలను పరిమితం చేసిన బుల్స్ బుధవారం చేతులెత్తేశారు. కోవిడ్, అధిక ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు భయాల నుంచి మార్కెట్ రికవరీ అవుతున్న తరుణంలో అమెరికా, రష్యా, ఉక్రెయిన్ దేశాల ప్రచ్ఛన్న యుద్ధం సెంటిమెంట్‌ను పూర్తిగా దెబ్బతీసింది. ప్రస్తుతానికి నిఫ్టీకి 17,500 వద్ద మద్దతు ఉంది. ఈ కీలక స్థాయిని కోల్పోతే మరో దఫా లాభాల స్వీకరణ జరిగే వీలుంది. దిగువ స్థాయిలో 17,350 వద్ద మరో మద్దతు ఉంది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. 4 రోజుల్లో రూ. 7 లక్షల కోట్ల నష్టం గడచిన నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 1530 పాయింట్లు, నిఫ్టీ 462 పాయింట్ల చొప్పున క్షీణించాయి. సూచీలు మూడుశాతానికి పైగా కుదేలవడంతో స్టాక్ మార్కెట్లో దాదాపు రూ. 7 లక్షల కోట్లు నష్టం వాటిల్లింది. బుధవారం ఒక్కరోజే రూ.3.87 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. దీనితో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.261 లక్షల కోట్లకు దిగివచ్చింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► సెన్సెక్స్ కీలకమైన 60 వేల స్థాయిని కోల్పోయి మూడువారాల కనిష్టం వద్ద ముగిసింది. నిఫ్టీ 17,500 స్థాయికి చేరువలో నెల కనిష్టం వద్ద స్థిరపడింది. ► ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ గల రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ద్వయం, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ బ్యాంక్ షేర్లు 3 నుంచి 2శాతం నష్టపోయి సూచీల భారీ పతనానికి ప్రధాన కారణమయ్యాయి. ► వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక మాంద్య భయాలతో రియల్టీ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. గోద్రేజ్ ప్రాపర్టీస్, డీఎల్ఎఫ్, మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ షేర్లు మూడుశాతం నష్టపోయాయి. శోభ, ఓబెరాయ్ రియల్టీ, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ షేర్లు 1–2% చొప్పున పతనమయ్యాయి. మైండ్‌స్పేస్ రీట్, బ్రూక్‌ఫీల్డ్ రీట్ షేర్లు అరశాతం చొప్పున నష్టపోయాయి. -
కేంద్రం కీలక నిర్ణయం.. చిన్న మొత్తాల వడ్డీ రేట్లు పెంపు!
న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. వీటిపై వడ్డీ రేట్లను ఒక శాతం వరకు పెంచుతూ కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. 2023 జనవరి – మార్చి కాలానికి కొత్త రేట్లు అమలు కానున్నాయి. ఆర్బీఐ ఈ ఏడాది ఇప్పటి వరకు 2.25 శాతం మేర కీకలమైన రెపో రేటును పెంచడం తెలిసిందే. దీంతో చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లను సవరించినట్టు తెలుస్తోంది. వివిధ పథకాలపై పెంపు 0.20–1.1 శాతం మధ్య ఉంది. తాజా పెంపు తర్వాత కొన్ని పెట్టుబడి పథకాలు ఆకర్షణీయంగా మారాయి. ప్రధానంగా జీవిత లక్ష్యాలకు ఉపకరించే, దీర్ఘకాలంతో కూడిన పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాలపై రేట్లు పెరగలేదు. అలాగే, సేవింగ్స్ డిపాజిట్, ఐదేళ్ల టైమ్ డిపాజిట్ రేట్లలోనూ ఎలాంటి మార్పులు చేయలేదు. నాలుగేళ్ల విరామం తర్వాత ఈ పథకాల రేట్లను కేంద్ర సర్కారు 2022 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సవరించడం గమనార్హం. అప్పుడు 0.10–0.30 శాతం మేర మూడు పథకాల రేట్లను పెంచింది. తాజా సవరణ తర్వాత బ్యాంక్ ఎఫ్డీ రేట్లకు, ఈ పథకాల రేట్లకు పెద్దగా వ్యత్యాసం లేదు. -
బంగారంలో తగ్గిన ఆదాయాలు
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ 2022 లో బంగారం ఇన్వెస్టర్లకు రాబడులను ఇవ్వ లేకపోయింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, వడ్డీ రేట్ల పెరుగుదల, అధిక ద్రవ్యోల్బణం తదితర అనిశ్చితులు బంగారం ధరలకు కీలకంగా మారాయి. ఈ ఏడాది డిసెంబర్ 22 వరకు నికరంగా బంగారం ధరలు 2 శాతం క్షీణించాయి. డాలర్‌తో రూపాయి సుమారు 11.5 శాతం క్షీణించడం వల్ల ఎంసీఎక్స్ గోల్డ్ ధరలు 13 శాతం పెరిగాయి. ఒక సాధనంగా బంగారంపై ఎన్నో అంశాలు ప్రభావం చూపిస్తాయని బంగారం ధరల్లో అస్థిరతలు తెలియజేస్తున్నాయి. ఈ అస్థిరతలకు దారితీసిన వివిద అంశాలు ఏంటి? 2023లో బంగారంలో పెట్టుబుడులు పెట్టే ఇన్వెస్టర్లకు రాబడుల అంచనాలను పరిశీలిస్తే.. ద్రవ్య విధాన కఠినతరం ప్రతికూలం యూఎస్ ఫెడ్ 2022లో ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడం మరింత సంక్లిష్టంగా మారింది. డాలర్ పరంగా బంగారం పనితీరు తగ్గడానికి ప్రధాన కారణం సెంట్రల్ బ్యాంకు దవ్య్ర పరపతి విధానాన్ని కఠినతరం చేయమే. అలాగే, బంగారం డిమాండ్‌ను ఆభరణాల డిమాండ్, సెంట్రల్ బ్యాంకుల నుంచి కొనుగోలు డిమాండ్, గోల్డ్ ఈటీఎఫ్ లు, బంగారం బార్లు, నాణేలు నిర్ణయిస్తుంటాయి. నిల్వలు పెంచుకోవడం.. సెంట్రల్ బ్యాంకులు ఏటా తమ బంగారం నిల్వలను పెంచుకుంటూ పోతున్నాయి. 2022 కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. 2022 మూడో త్రైమాసికంలో సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోళ్లు 400 టన్నుల వరకు పెరిగాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా డేటా పేర్కొంది. వరుసగా ఎనిమిదో త్రైమాసికంలోనూ సెంట్రల్ బ్యాంకులు నికరంగా కొనుగోళ్లు చేశాయి. దీంతో ఈ ఏడాది నవంబర్ 1 నాటికి 673 టన్నుల కొనుగోలుకు దారితీసింది. 1967 తర్వాత మరే సంవత్సంతో పోల్చినా ఈ ఏడాదే అత్యధిక కొనుగోళ్లు జరిగాయి. ఇక గోల్డ్ ఈటీఎఫ్‌లు 2022 నవంబర్‌లో వరుసగా ఏడో నెల నికరంగా పెట్టుబడులను కోల్పోయాయి. ఈ ఏడాది నవంబర్ నాటికి నికరంగా గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి 83 టన్నులకు సమానమైన పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయి. కాయిన్లు, ఆభరణాల డిమాండ్ కరోనా సమయంలో నిలిచిపోయిన డిమాండ్ కూడా డోడు కావడంతో, మొదటి మూడు నెలల కాలంలో బంగారం బార్లు, కాయిన్లు, ఆభరణాల స్థిరమైన కొనుగోళ్లకు దారితీసింది. ఒకవైపు ఈ కొనుగోళ్లు, మరోవైపు సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, ఈటీఎఫ్‌ల పెట్టుబడుల ఉపసంహరణ ప్రభావాన్ని కొంత భర్తీ చేసింది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా నెలక్నొ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం ధరలకు సరైన ప్రోత్సాహం లేదు. 2023పై అంచనాలు అధిక వడ్డీ రేట్లు, అధిక ద్రవ్యోల్బణం, కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, రష్యా, చైనాల్లో తిరోగమన పరిస్థితుల వల్ల అంతర్జాతీయ ఉత్పత్తి తగ్గింది. ఐరోపాలో క్షీణిస్తున్న వృద్ధి నేపథ్యంలో మాంద్యంపై చర్చకు దారితీసింది. చైనా వృద్ధి రేటు 4.4 శాతంగా ఉంటుందన్న జూన్ అంచనాలను ప్రపంచబ్యాంకు 2.7 శాతానికి తగ్గించేసింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఈ స్థాయిలో తగ్గడం అన్నది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలోనూ క్షీణతకు కారణమవుతుంది. డాలర్‌కు, కమోడిటీల మధ్య విలోమ సహ సంబంధం ఉంటుంది. రెండేళ్ల పాటు వరుసగా పెరిగిన డాలర్ ఇండెక్స్ ఇటీవల కొంత వరకు తగ్గింది. 2023లోనూ డాలర్ క్షీణత కొనసాగితే.. సహ విలోమ సంబంధం వల్ల బంగారం, వెండి లాభపడనున్నాయి. మరోవైపు మాంద్యం సమయాల్లో సహజంగా బంగారం మంచి పనితీరు రూపంలో రక్షణనిస్తుంది. గత ఏడు మాంద్యం సమయాల్లో ఐదు సందర్భాల్లో బంగారం సానుకూల రాబడులను ఇచ్చింది. కనుక 2023లో బంగారం రెండంకెల రాబడులను ఇస్తుందని అంచనా వేస్తున్నాం. బంగారం ధరలు 10 గ్రాములు రూ.58,000 వరకు పెరగొచ్చు. రూ.48,000–50,000 మధ్య కొనుగోళ్లు చేసుకోవచ్చు. ప్రతి పతనంలోనూ బంగారాన్ని సమకూర్చుకోవచ్చన్నది మా సూచన. ప్రథమేష్ మాల్య, ఏవీపీ – రీసెర్చ్, ఏంజెల్ వన్ లిమిటెడ్ -
మీరు ఎస్బీఐ ఖాతాదారులా? అయితే మీకో గుడ్ న్యూస్
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎఫ్డీలపై వడ్డీ రేట్లను పెంచింది. రూ.2 కోట్ల కన్నా తక్కువ విలువ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటును పెంచింది. సవరించిన వడ్డీ రేట్లు నేటి (2022 డిసెంబర్ 13) నుంచి అమల్లో ఉంటాయని ఎస్బీఐ అధికారిక ప్రకటలో తెలిపింది. ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది. తాజా సవరణతో 7-45 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్డీపై 3 శాతం, 46-179 రోజుల మధ్య ఎఫ్డీపై 3.9 శాతం, 180-210 రోజుల మధ్య 5.25 శాతం వడ్డీ లభిస్తోంది. 211 రోజుల నుంచి 1 ఏడాది వరకు ఉండే ఎఫ్డీలపై 5.75శాతం వడ్డీ చెల్లింస్తుంది. 1-2 ఏళ్ల మధ్యలో మెచ్యూర్ అయ్యే ఎఫ్డీపై 6.75 శాతం, 2-3 మూడేళ్ల వరకు అయితే 6.75 శాతం, 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు.. 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు అయితే 6.25 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. (ఎట్టకేలకు..మూడు రంగుల్లో ట్విటర్ వెరిఫైడ్ మార్క్ షురూ) అలాగే సీనియర్ సిటిజన్ కస్టమర్లకు అన్ని కాల వ్యవధిలో అదనంగా 50 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటును అందిస్తుంది. తాజా సవరణతో, సీనియర్ సిటిజన్లకు ఏడు రోజుల నుంచి పదేళ్లలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై 3.5 శాతం నుంచి 7.25 శాతం వరకు ఆఫర్ చేస్తోంది. కాగా ద్రవ్యోల్బణం ఆందోళన నేపథ్యంలో కేంద్రబ్యాంకు ఆర్బీఐ వరుసగా ఐదోసారి కూడా వడ్డీరేటు పెంపునకే మొగ్గు చూపింది. తాజా పాలసీ రివ్యూలో రెపో రేటు 35 బేసిస్ పాయింట్లకు పెంచింది. (సామాన్యుడికి ఊరట:11 నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం) -
ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. బల్క్ ఎఫ్డీలపై వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 15 నెలల నుండి 3 సంవత్సరాల వరకు 6.80శాతం వడ్డీని అందించనుంది. కొత్త రేట్లు నవంబర్ 25, 2022 నుండి అమలులోకి వచ్చాయి. రూ. 2 కోట్ల కంటే ఎక్కువ, 5 కోట్ల రూపాయల లోపు ఉండే బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లను పెంచింది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం బ్యాంక్ ప్రస్తుతం 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేటు 3.75 - 6.50 శాతం మధ్య ఉంటుంది. 15 నెలల నుండి 3 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇప్పుడు గరిష్ట వడ్డీ రేటు 6.80శాతంగా ఉంటుంది. (WhatsApp డేటా బ్రీచ్ కలకలం: ఆ మెసేజెస్ కాల్స్‌కి,స్పందించకండి!) 30 రోజుల నుండి 45 రోజులలో మెచ్యూర్ అయ్యే వాటిపై 4.75శాతం, 46 - 60 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే 61- 90 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5.25 శాతం వడ్డీ లభిస్తుంది. 185 రోజుల నుండి 270 రోజులలో మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలపై 6 శాతం రేటును ఇస్తోంది. అయితే 2 కోట్ల లోపు డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులను బ్యాంకు ప్రకటించలేదు. (తగ్గేదెలే అంటున్న మస్క్, టెక్ దిగ్గజాలకే సవాల్!) సీనియర్ సిటిజన్లకు అదనంగా 10 శాతం అలాగే రెసిడెంట్ సీనియర్ సిటిజన్ కస్టమర్లకు స్పెషల్‌గా 10శాతం వడ్డీని తాత్కాలికంగా అందిస్తుంది. అయితే డిపాజిట్ మొత్తం తప్పనిసరిగా రూ. 2 కోట్ల కంటే తక్కువగా ఉండాలి. డిపాజిట్ సమయం అయిదేళ్లకుపైన, 10 సంవత్సరాల లోపు ఉండాలి. ఈ స్పెషల్ స్కీం ఏప్రిల్ 7, 2023 తో ముగుస్తుంది. -
కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఐఓబీ
చెన్నై: ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) డిపాజిట్ రేట్లను పెంచింది. రిటైల్ టర్మ్ డిపాజిట్ రేట్లు 60 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) వరకూ పెరిగినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. నవంబర్ 10 నుంచి తాజా రేట్లు అమల్లోకి వస్తాయని తెలపింది. ప్రకటన ప్రకారం, దేశీయ, నాన్-రెసిడెంట్ డిపాజిటర్లు 444 రోజులు, మూడేళ్లు, ఆపైన డిపాజిట్లపై 7.15 శాతం వరకూ వడ్డీరేటును పొందుతారు. 270 రోజుల నుంచి యేడాది, ఏడాది నుంచి మూడేళ్ల టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటు 60 బేసిస్ పాయింట్ల వరకూ పెరిగింది. -
ఆరోసారి ఫెడ్ వడ్డీ పెంపు
న్యూయార్క్: ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావం చూపగల యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్ల పెంపును చేపట్టింది. రెండు రోజులపాటు సమావేశమైన ఫెడరల్ రిజర్వ్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) ద్రవ్యోల్బణ కట్టడే ప్రధాన ఎజెండాగా వరుసగా ఆరోసారి ఫండ్స్ రేట్లను పెంచింది. తాజాగా 0.75 పెంపును ప్రకటించింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 3.75–4 శాతానికి చేరాయి. దీంతో వరుసగా నాలుగోసారి 0.75 శాతం చొప్పున రేట్లను పెంచినట్లయ్యింది. ఈ ఏడాది(2022) ఇప్పటివరకూ ఎఫ్‌వోఎంసీ వడ్డీ రేట్లను 3.75 శాతం హెచ్చించింది. ద్రవ్యోల్బణం గత 40 ఏళ్లలోలేని విధంగా 8 శాతాన్ని అధిగమించడంతో ఫెడ్ ధరల కట్టడికి అత్యంత కీలకమైన వడ్డీ రేట్ల పెంపు మార్గాన్ని ఎంచుకుంది. తాజాగా సెప్టెంబర్‌లోనూ వినియోగ ధరల ఇండెక్స్ 8.2 శాతాన్ని తాకింది. -
యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ బాదుడు, మామూలుగా లేదుగా!
ఫ్రాంక్ఫర్ట్: మాంద్యం భయాలకన్నా, ద్రవ్యోల్బణం కట్టడికే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రాధాన్యత ఇచ్చింది. వడ్డీరేటును 0.75శాతం పెంచుతూ 25 మంది సభ్యుల గవర్నింగ్ కౌన్సిల్ గురువారం ఇక్కడ కీలక నిర్ణయం తీసుకుంది. యూరో కరెన్సీ చరిత్రలోనే ఒకేసారి ఈ స్థాయి రేటు పెంపు ఇదే తొలిసారి. ఈ ఏడాది మూడవ రేటు పెంపు నిర్ణయమిది. 19 దేశాల యూరోజోన్ ఆర్థిక వ్యవస్థపై పొంచి ఉన్న మాంద్యం ముప్పు నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీబీ ప్రెసిడెంట్ క్రిస్టినా లగార్డ్ పేర్కొన్నారు. అమెరికాసహా పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణం స్పీడ్ కట్టడికి వడ్డీరేట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే. యూరోజోన్‌లో 2శాతం లక్ష్యానికి మించి, ప్రస్తుతం ద్రవ్యోల్బణం 9.9శాతానికి ఎగసింది. -
భారీ పెంపు: పీఎన్బీ ఖాతాదారులకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) ఫిక్స్డ్ డిపాజిట్లపై (ఎఫ్డీలు) వడ్డీ రేట్లను పెంచింది. పీఎన్బీ రూ.2 కోట్ల వరకు ఎఫ్డీలపై రేట్లను సవరించింది. వారం వ్యవధిలో రేట్లను సవరించడం రెండో సారి. ఈ రేట్లు ఈ నెల 26 నుంచి అమల్లోకి వచ్చాయి. గరిష్టంగా 0.75 శాతం వరకు రేట్లను పెంచింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు సైతం ఎఫ్డీలపై రేట్లను పెంచడం ఒక నెలలో ఇది రెండో పర్యాయం. వివిధ కాల పరిమితులపై రూ.2 కోట్ల వరకు చేసే ఎఫ్డీలపై 0.50 శాతం వరకు పెంచింది. రికరింగ్ డిపాజిట్ల రేట్లను కూడా పెంచింది. సవరించిన రేట్లు అక్టోబర్ 26 నుంచే అమల్లోకి వచ్చాయి. -
ఫిక్స్డ్ డిపాజిట్లపై ఖాతాదారులకు గుడ్‌న్యూస్
సాక్షి, ముంబై: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందించింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల 7 శాతం దాకా వడ్డీని అందిస్తుంది. గత రెండు నెలల్లో, పలు బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ వస్తున్నాయి. తాజాగా ఈ కోవలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ జాబితాలో చేరింది. రూ. 2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లన పెంచుతూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. కంపెనీ వెబ్సైట్ ప్రకారం, సవరించిన ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు అక్టోబర్ 17 నుండి అమలులోకి వచ్చాయి. 7 - 14 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 3 శాతం, 599 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్టంగా ఏడు శాతం వడ్డీ లభిస్తుంది. 45 రోజులకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 3 శాతం వడ్డీ లభిస్తుండగా, 46 -90 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 4.05శాతం వడ్డీ లభిస్తుంది. 91-120 రోజుల డిపాజిట్ 4.3 శాతం, 121-180 రోజులకు 4.4శాతం వడ్డీని అందిస్తుంది. 181 రోజుల నుండి ఒక ఏడాది లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై, 5.25శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఒక సంవత్సరం మెచ్యూరిటీ కాలానికి, రాబడి రేటు 6.30 శాతం. సంవత్సరం - 443 రోజుల కంటే ఎక్కువ మెచ్యూరిటీ ఉన్న FDలకు వడ్డీ రేటు 6.6 శాతంగా ఉంది. అయితే 600 రోజుల నుండి 10 సంవత్సరాల మెచ్యూరిటీ డిపాజిట్లపై 6.6 - 6.7 శాతం మధ్య వడ్డీ లభిస్తుంది. -
ద్రవ్యోల్బణంపై పోరు తప్పదు!
వాషింగ్టన్: ద్రవ్యోల్బణం పూర్తిగా అదుపు తప్పుతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలిన్ జార్జివా హెచ్చరించారు. అసాధారణమైన ఆర్థిక సంక్షోభ సమయంలో మరింత బాధను కలిగించే అవకాశం ఉన్నప్పటికీ, అంతర్జాతీయంగా విధాన నిర్ణేతలు ద్రవ్యోల్బణంపై పోరు సల్పాలని ఆమె పిలుపునిచ్చారు. ఇప్పటికే పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు నిర్ణయాలను తీసుకుంటున్న నేపథ్యంలో ఐఎంఎఫ్ చీఫ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ వార్షిక సమావేశం నేపథ్యంలో ఆమె ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ఇంకా ఆమె ఏమన్నారంటే... ► ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒకదాని తర్వాత మరొ కటి షాక్‌లు తగులుతున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా దాడి, ఇప్పుడు ద్రవ్యోల్బణం తీవ్రత అన్నీ సమస్యాత్మకమే. ► ఇప్పుడు ద్రవ్యోల్బణాన్ని ఎలా ఎదుర్కొనాలన్నదే ప్రధాన అంశం. మనం ధర స్థిరత్వాన్ని పునరుద్ధరించలేకపోతే, వృద్ధి అవకాశాలకూ విఘాతం కలుగుతుంది. ప్రత్యేకించి పేద ప్రజల జీవనం మరింత సంక్షోభంలోకి వెళుతుంది. ► మహమ్మారితో పోరాడిన నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు రుణ సమస్యల్లో ఉన్నాయి. ఆహార కొరత లేకుండా చేయడం, ఇంధన వ్యయాల కట్టడి, పేద వారికి సహాయం చేయడంపై తక్షణం దేశాలు దృష్టి పెట్టాలి. విస్తృత వ్యయ కార్యక్రమాలపై ఇప్పుడు ప్రణాళికలు సరికాదు. విధాన చర్యలు పటిష్టం లక్ష్యంతో సాగాలి. ► ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పోటీ రాజకీయ కూటములతో ‘విచ్ఛిన్నం’ చేయడం వల్ల ద్రవ్యోల్బణాన్ని అడ్డుకోవడంలో మరింత జాప్యం జరుగుతుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల సరఫరాల చెయిన్ పూర్తిగా దెబ్బతింటుంది. రేటు పెంపు వల్ల అనుకున్న లక్ష్యాలను సకాలంలో సాధించలేం. ► ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఐక్యతా ప్రయోజనాలను మనం కోల్పోతే, మనమందరం పేదలుగా ఉండే అవకాశం ఉంది. -
బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో అమ్మకాలు
ముంబై: రిటైల్ ద్రవ్యోల్బణం అయిదు నెలల గరిష్టానికి ఎగబాకడంతో వడ్డీరేట్ల పెంపు భయాలు మరోసారి మార్కెట్ వర్గాలను కలవరపెట్టాయి. పారిశ్రామికోత్పత్తి ఆగస్టులో తీవ్ర పతన స్థాయికి చేరుకోవడం సైతం నిరాశపరిచింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ అనూహ్య రికవరీ, రూపాయి బలహీనతలు సెంటిమెంట్‌పై మరింత ఒత్తిడిని పెంచాయి. అలాగే ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీని నిర్ణయించే అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల వెల్లడి(గురువారం)కి ముందు అప్రమత్తత వహించారు. ధరల కట్టడికి ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల మరో దఫా వడ్డీరేట్ల పెంపు అంచనాలు దేశీయ మార్కెట్లపైనా ప్రతికూల ప్రభావం చూపాయి. ఫలితంగా ఫైనాన్స్, ఆటో, రియల్టీ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో గురువారం సెన్సెక్స్ 391 పాయింట్లు పతనమై 57,235 వద్ద ముగిసింది. నిఫ్టీ 109 పాయింట్లు నష్టపోయి 17,014 వద్ద నిలిచింది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా షేర్ల అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు అరశాతానికి పైగా క్షీణించాయి. మెటల్, ఫార్మా, మీడియా షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,636 కోట్ల షేర్లను అమ్మేయగా.., సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.753 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ఆసియా, యూరప్ మార్కెట్లు గరిష్టంగా 3% వరకు క్షీణించాయి. యూఎస్ ద్రవ్యోల్బణ వెల్లడి తర్వాత అమెరికా స్టాక్ ఫ్యూచర్లు రెండుశాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ అరశాతానికి పైగా నష్టపోవడంతో బీఎస్ఈలో నమోదిత కంపెనీలకు 1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. దీంతో బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ.269.88 లక్షల కోట్ల దిగువకు చేరింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► సెప్టెంబర్ త్రైమాసికంలో నికరలాభం క్షీణించడంతో ఐటీ కంపెనీ విప్రో షేరు 7% నష్టపోయి రూ 379 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో ఏడుశాతానికి పైగా పతనమై రూ.381 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. ► ఇదే క్యూ2 క్వార్టర్లో మెరుగైన ఆర్థిక ఫలితాలను వెల్లడించిన హెచ్‌సీఎల్ షేరు మూడు శాతం బలపడి రూ.982 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో నాలుగు శాతం ర్యాలీ చేసి రూ.986 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. -
ఫెస్టివ్ బొనాంజా: కెనరా బ్యాంకు కస్టమర్లకు శుభవార్త!
హైదరాబాద్: ప్రభుత్వరంగ కెనరా బ్యాంకు ప్రత్యేక టర్మ్ డిపాజిట్ స్కీమ్‌ను తన కస్టమర్ల కోసం ప్రకటించింది. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 135 బేసిస్ పాయింట్ల వరకు పెంచి తన ఖాతాదారులకు ఈ ఫెస్టివ్ సీజన్లో గుడ్ న్యూస్ అందించింది. కెనరా బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం సవరించిన కొత్త వడ్డీ రేట్లు అక్టోబర్ 7 నుండి అమలులోకి వచ్చాయి. (మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్, ధర తక్కువ, ఇక జియో ఆఫర్ తెలిస్తే!) 666 రోజుల కాల వ్యవధికి డిపాజిట్ చేస్తే 7 శాతం వార్షిక రేటును ఆఫర్ చేస్తోంది. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు ఇదే డిపాజిట్‌పై అర శాతం అధికంగా 7.50 శాతం రేటును ఆఫర్ చేస్తోంది. రూ.2 కోట్లలోపు ఉండే డిపాజిట్లకు ఇది వర్తిస్తుందని కెనరా బ్యాంకు ప్రకటించింది. ప్రభుత్వరంగ బ్యాంకు నుంచి ఇది అత్యధిక రేటుగా పేర్కొంది. (సంచలనం: ఓలా, ఉబెర్, ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం) ఇదీ చదవండి : హీరో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. బుకింగ్.. ఫీచర్లు, ధర వివరాలు -
RBI Monetary Policy: రుణాలు మరింత భారం!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు) మరో 50 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. దీంతో ఈ రేటు 5.9 శాతానికి చేరింది. 2019 ఏప్రిల్ తర్వాత రెపో రేటు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. కేంద్రం నిర్దేశిస్తున్న 6% రిటైల్ ద్రవ్యోల్బణం హద్దు మీరి పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి వరుసగా 4 సార్లు ఆర్బీఐ రెపోరేటు పెంచింది. మేలో 4%గా ఉన్న రెపో 190 బేసిస్ పాయింట్లు పెరిగింది. మరింత పెరగవచ్చని సైతం తాజాగా ఆర్బీఐ సంకేతాలిచ్చింది. తాజా పెంపుతో రెపో రేటు కరోనా ముందస్తు స్థాయికన్నా ముప్పావుశాతం అధికం కావడం గమనార్హం. జీడీపీ అంచనాలు కట్... వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ని తగ్గించి తద్వారా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలన్నదే రెపోరేటు ఇన్స్ట్రుమెంట్ ఉద్దేశ్యం. ఆర్బీఐ తాజా నిర్ణయంతో గృహ, ఆటో, వ్యక్తిగత రుణాలు మరింత భారం కానున్నాయి. కాగా, పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2022–23లో 6.7 శాతంగా ఉంటుందన్న తన అంచనాలను యథాథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ పాలసీ పేర్కొంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు విషయంలో మాత్రం అంచనాను కిత్రం 7.2 శాతం నుంచి 7 శాతానికి ఆర్బీఐ కుదించింది. పాలసీ ముఖ్యాంశాలు... ► 2022–23లో ఆర్థిక వృద్ధి అంచనా 7% కాగా, సెప్టెంబర్ త్రైమాసికంలో 6.3 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్బీఐ భావిస్తోంది. డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో ఈ రేటు 4.6 శాతం చొప్పున ఉంటుందని అంచనావేసింది. జూన్ త్రైమాసికంలో 13.5 శాతం వృద్ధి నమోదయిన సంగతి తెలిసిందే. ► రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు అంచనా 6.7 శాతం కాగా, క్యూ2, క్యూ3, క్యూ4ల్లో వరుసగా 7.1%, 6.5%, 5.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ రేటు 5.1 శాతానికి దిగివస్తుందని అంచనావేసింది. ► డాలర్ మారకంలో రూపాయి విలువపై జాగ్రత్తగా పరిశీలన. సెప్టెంబర్ 28 వరకూ ఈ ఏడాది 7.4 శాతం పతనం. రూపాయిని నిర్దిష్ట మారకం ధర వద్ద ఉంచాలని ఆర్బీఐ భావించడం లేదు. తీవ్ర ఒడిదుడుకులను నిరోధించడానికి ఆర్బీఐ చర్యలు ఉంటాయి. వర్ధమాన దేశాల కరెన్సీలతో పోల్చితే రూపాయి విలువ బాగుంది. ► ఏప్రిల్‌లో 606.5 బిలియన్ డాలర్లు ఉన్న భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు, సెప్టెంబర్ 23 నాటికి 537.5 బిలియన్ డాలర్లకు తగ్గాయి. డాలర్ బలోపేతం అమెరికన్ బాండ్ ఈల్డ్ పెరగడం వంటి మార్పులే కావడం గమనార్హం. ► రూపాయిలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పరిష్కరించుకోవడానికి నాలుగైదు దేశాలు, అనేక బ్యాంకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ► 2022–23లో బ్యాంకింగ్ రుణ వృద్ధి 16.2 శాతంగా ఉంటుందని అంచనా. ► తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 5 నుంచి 7 వరకు జరుగుతుంది. నేటి నుంచి టోకెనైజేషన్ దాదాపు 35 కోట్ల కార్డుల వివరాలు, లావాదేవీల గోప్యత లక్ష్యానికి సంబంధించిన టోకెనైజేషన్ వ్యవస్థ అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టీ రవి శంకర్ తెలిపారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం, ఆగస్టు నాటికి వ్యవస్థలో 101 కోట్ల డెబిట్, క్రెడిట్ కార్డులు ఉన్నాయి. సెప్టెంబర్‌లో దాదాపు 40% లావాదేవీల టోకెనైజేషన్ జరిగింది. వీటి విలువ దాదాపు రూ.63 కోట్లు. టోకెనైజేషన్ వ్యవస్థలో చేరడాన్ని తప్పనిసరి చేయకపోవడం వల్ల ఈ వ్యవస్థ వేగంగా ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొందని డిప్యూటీ గవర్నర్ తెలిపారు. -
ఆర్బీఐ రెపో వడ్డింపు మరోసారి ఖాయమే!
ముంబై: ఆర్బీఐ ఎంపీసీ ద్వైమాసిక పరపతి సమీక్ష బుధవారం ప్రారంభం కానుంది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను ఈ శుక్రవారం (30న) ఉదయం ఎంపీసీ ప్రకటించనుంది. గరిష్టంగా 0.50 శాతం వరకు రెపో రేటును పెంచొచ్చని మెజారిటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గరిష్ట పరిమితి అయిన 6 శాతానికి పైనే ఏడు నెలలుగా ద్రవ్యోల్బణం కొనసాగుతోంది. ఆగస్ట్ నెలకు కూడా 7 శాతానికి పైనే నమోదైంది. దీంతో ద్రవ్యోల్బణం కట్టడికి రేట్ల పెంపు అనివార్యమే అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది మే నుంచి మూడు విడతల్లో ఆర్బీఐ రెపో రేటును 1.4 శాతం మేర పెంచడంతో అది 5.4 శాతానికి చేరింది. యూఎస్ ఫెడ్ కూడా ప్రతి పర్యాయం 0.75 శాతం మేర రేట్లను పెంచుతూ వస్తుండడం తెలిసిందే. అంతేకాదు రానున్న సమీక్షల్లోనూ రేట్ల పెంపు ఉంటుందని సంకేతాలు ఇచ్చింది. అటు యూకే, ఈయూ కూడా రేట్ల పెంపు బాటలోనే నడుస్తున్నాయి. ఇది రూపాయి మారకం విలువపై ప్రభావం చూపిస్తోంది. తాజా సమీక్షలో రూపాయి మారకం, ద్రవ్యోల్బణం, ఆర్ధిక వృద్ధిపై ఎంపీసీ కీలక చర్చ నిర్వహించనుంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని రేట్ల పెంపు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం (ప్లస్ 2, మైనస్ 2) పరిధిలో నియంత్రించాలన్నది ఆర్బీఐ లక్ష్యం. పెంపు తప్పదు.. 50 బేసిస్ పాయింట్ల (0.50 శాతం) పెంపు ఉంటుందని ఇక్రా ముఖ్య ఆర్థిక వేత్త అదితి నాయర్ అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన దేశాలు సైతం రేట్ల పెంపు నిర్ణయాలు తీసుకుంటున్నందున.. ఆర్బీఐ నుంచి మరిన్ని రేటు పెంపు చర్యలు కొనసాగుతాయని భావిస్తున్నట్టు మాజీ గవర్నర్ సి.రంగరాజన్ సైతం ఇటీవలే అభిప్రాయం వ్యక్తం చేశారు. రిటైల్, టోకు ధరల ద్రవ్యోల్బణం అధిక స్థాయిల్లోనే కొనసాగుతుండడాన్ని బార్క్లేస్ సెక్యూరిటీస్ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త రాహుల్ బజోరియా గుర్తు చేశారు ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఈ నెల చివర్లో జరిగే సమీక్షలో 0.50 శాతం మేర రేటు పెంపు ఉంటుందన్నారు. సెప్టెంబర్ 30న ఆర్బీఐ రెపో రేటును 0.35 శాతం మేర పెంచొచ్చని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. జపాన్ బ్రోకరేజీ సంస్థ అయిన నోమురా సైతం ఈ నెల చివర్లో 0.35 శాతం, డిసెంబర్ సమీక్షలో 0.25 శాతం చొప్పున రేట్ల పెంపు ఉంటుందని అంచనాతో ఉంది. -
ఫెడ్ భారీ ‘వడ్డిం‘పు
న్యూయార్క్: ధరల అదుపే లక్ష్యంగా యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేటును 0.75 శాతంమేర పెంచింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 3–3.25 శాతానికి ఎగశాయి. వెరసి వరుసగా మూడోసారి రేట్లను పెంచింది. గత నాలుగు దశాబ్దాల గరిష్టానికి చేరిన ద్రవ్యోల్బణ కట్టడికే ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) ప్రాధాన్యత ఇచ్చినట్లు ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ పేర్కొన్నారు. కాగా.. కరోనా మహమ్మారి కాలంలో 9 ట్రిలియన్ డాలర్లకు చేరిన బ్యాలెన్స్‌షీట్‌ను తగ్గించేందుకు ఫెడ్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు జూన్ నుంచి నెలకు 95 బిలియన్ డాలర్ల విలువైన బాండ్లను రోలాఫ్ చేయడం ద్వారా లిక్విడిటీలో కోత పెడుతోంది. ఈ నేపథ్యంలో డాలరు ఇండెక్స్ 110ను అధిగమించగా.. ట్రెజరీ ఈల్డ్స్ 3.56 శాతాన్ని తాకాయి. అయితే 2022 జనవరి–మార్చిలో 1.6 శాతం క్షీణించిన యూఎస్ జీడీపీ ఏప్రిల్–జూన్‌లోనూ 0.6 శాతం నీరసించింది. దీంతో ఆర్థిక మాంద్య భయాలు తలెత్తినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
యాక్సిస్ బ్యాంకు ఖాతాదారులా? అయితే మీకో గుడ్ న్యూస్
సాక్షి,ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజా రేట్లు నిన్న (మంగళవారం, సెప్టెంబర్ 20) నుంచి అమల్లోకి వచ్చాయి. రూ. 2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై సవరించిన రేట్లు వర్తిస్తాయి. వివిధ డిపాజిట్లపై సాధారణ పౌరులకు అందించే వడ్డీ 2.75 శాతం నుంచి 5.75 మధ్య ఉండనుంది. అలాగే సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై అందించే వడ్డీ 2.75 శాతం నుండి 6.50 శాతం వరకు ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం, యాక్సిస్ బ్యాంక్ ఇప్పుడు 11 రోజుల నుండి 1 సంవత్సరం, 25 రోజులు, 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు మెచ్యూరిటీలకు 5.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఇదే అత్యధిక వడ్డీ. 7 రోజులు నుంచి 29 రోజుల కాలవ్యవధికి, బ్యాంక్ 2.75 శాతం అందిస్తుంది; 7 రోజుల నుండి 14 రోజుల వరకు, సాధారణ ప్రజలకు 2.75 శాతంఅందిస్తుండగా, సీనియర్ సిటిజన్లకు 2.75 శాతం రేటు వర్తిస్తుంది. 30 నెలల నుండి 3 సంవత్సరాల డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 5.70 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.45 శాతం అందిస్తుంది. 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలకుగాను సాధారణ ప్రజలకు 5.70 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.45 శాతం. అలాగే 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం వడ్డీని అందిస్తుంది. -
ఆ ఖాతాదారులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ శుభవార్త!
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ రుణదాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) డిపాజిట్ మెచ్యూరిటీలపై సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లకు శుభవార్త అందించింది. ఫిక్స్డ్ డిపాజిట్లను సురక్షితమైన, ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలుగా చూసే వారికి ఇది అద్భుతమైన వార్త. ముఖ్యంగా సీనియర్,సూపర్ సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు మేర అదనంగా ఇవ్వనుంది. కొత్త రేట్లు సెప్టెంబర్ 13, 2022 నుండి అమలులోకి వచ్చాయని బ్యాంక్ ప్రకటించింది. పీఎన్బీ సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లకు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రూ. 2 కోట్ల లోపు దేశీయ డిపాజిట్లపై ఈ పెంపు వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్ల కోసం FDలపై వడ్డీ రేట్లు నిర్దిష్ట కాలవ్యవధిని సెట్ చేసినప్పటికీ, సూపర్ సీనియర్ సిటిజన్లకు మాత్రం అన్నిరకాల డిపాజిట్లపై ఒకే రేటు అందిస్తుంది. బ్యాంకు అధికారిక వెబ్సైట్ ప్రకారం రూ. 2 కోట్ల వరకు రేటు 30 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) గా ఉంది. 60-80 ఏళ్లలోపు సీనియర్ సిటిజన్లు 5 సంవత్సరాల పరిధి డిపాజాట్లపై 50 బీపీఎస్ అదనపు వడ్డీని పొందుతారు. 5 కంటే ఎక్కువ కాలానికి 80బీపీఎస్ పాయింట్ల ఎక్కువ పొందుతారు.మొత్తంగా సీనియర్ సిటిజన్లకు 6.60 శాతం, సూపర్ సీనియర్లకు 6.90 శాతం వడ్డీ రేటు పొందుతారు. రిటైర్డ్ సిబ్బంది, రిటైర్డ్ సూపర్ సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 180 బీపీఎస్ పాయింట్లు వడ్డీ రేటు వర్తిస్తుంది. అలాగే పీఎన్బీ ట్యాక్స్ సేవర్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ కింద ఉద్యోగులతో పాటు సీనియర్ సిటిజన్లు అయిన రిటైర్డ్ ఉద్యోగులకు వర్తించే అత్యధిక వడ్డీ రేటు 100 బీపీఎస్ పాయింట్లుగా ఉంటుందని బ్యాంక్ తెలిపింది. -
మెరుగ్గానే రిటైల్ రుణ వసూళ్లు
ముంబై:ఇటీవలి కాలంలో పెరిగిపోయిన వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం ప్రభావం సెక్యూరిటైజ్డ్ రిటైల్ రుణాల చెల్లింపులపై లేదని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. తాను రేటింగ్ ఇచ్చే సెక్యూరిటైజ్డ్ రుణాలకు సంబంధించి నెలవారీ వసూళ్ల రేషియో ఏ మాత్రం ప్రభావితం కాలేదని పేర్కొంది. రిటైల్ రుణ గ్రహీతలకు సంబంధించి చెల్లింపుల ట్రాక్ రికార్డు బలంగా ఉందని, ఆర్థిక కార్యకలాపాల్లో పురోగతి ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు వివరించింది. ఆర్బీఐ ఈ ఏడాది మే నుంచి మూడు విడతలుగా 1.4 శాతం మేర రెపో రేటను పెంచడం తెలిసిందే. దీంతో డిపాజిట్లు, రుణాలపై రేట్లు పెరిగేందుకు దారితీసింది. మార్ట్గేజ్ ఆధారిత సెక్యూరిటైజేషన్ రుణాల వసూళ్లు పుంజుకున్నట్టు వివరించింది. ఇక వాణిజ్య వాహన రుణాల వసూళ్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో 105 శాతంగా ఉంటే, అవి జూన్ చివరికి 98 శాతానికి తగ్గినట్టు క్రిసిల్ తెలిపింది. చమురుపై పన్ను, సుంకాలు మోస్తరు స్థాయికి రావడంతో అది అంతమంగా వినియోగదారుడికి ఊరటనిచ్చినట్టు పేర్కొంది. ‘‘ద్విచక్ర వాహన రుణాల వసూళ్లు స్థిరంగా ఉన్నాయి. నెలవారీ కలెక్షన్ల రేషియో గత కొన్ని నెలలుగా 98–99 శాతంగా కొనసాగుతోంది. ఎంఎస్ఎంఈ రుణాల వసూళ్లు 97 శాతం నుంచి 95 శాతానికి తగ్గాయి’’అని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక తెలిపింది. -
పండుగ సీజన్: డిపాజిటర్లకు బ్యాంకుల బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: పండుగల సీజన్లో రుణ డిమాండ్‌ను ఎదుర్కొనేందుకుగాను నిధుల సమీకరణ బాటలో బ్యాంకింగ్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రిటైల్ డిపాజిటర్లను (రూ.2 కోట్ల లోపు) ఆకర్షించడానికి పలు బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతున్నాయి. బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), కెనరా బ్యాంక్‌సహా పలు బ్యాంకులు నిర్దిష్ట కాలానికి వర్తించేలా తమ డిపాజిట్ రేట్లను ఆరు శాతం ఆపైకి పెంచుతూ నిర్ణయాలు తీసుకున్నాయి. భారతదేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కొన్ని బ్యాంకులు రేట్ల పెంపునకు సంబంధించి ఇటీవల తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తే... (చదవండి: వడ్డీల భారం, చేతులెత్తేసిన మరో స్టార్టప్) ►ఎస్బీఐ: 1000 రోజుల కాలపరిమతికి సంబంధించి డిపాజిట్ రేటును 6.10 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్లు 50 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రేటును పొందుతారు. ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 30 వరకూ ఈ ఆఫర్ అమల్లో ఉంటుందని తెలిపింది. ►కెనరా బ్యాంక్: 666 రోజుల కాలపరిమితికి రేటును 6 శాతానికి పెంచింది. ►బ్యాంక్ ఆఫ్ బరోడా: బరోడా తిరంగా డిపాజిట్ పథకం పేరుతో ప్రత్యేక రిటైల్ టర్మ్ ప్లాన్‌ను ఆఫర్ చేసింది. 2022 డిసెంబర్ 31 వరకూ అందుబాటులో ఉండే విధంగా 444 రోజులు, 555 రోజుల రెండు కాలపరిమితులతో ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. 444 రోజులకు 5.75 శాతం వడ్డీ, 555 రోజులకు 6 శాతం వడ్డీ లభిస్తుంది. రూ.2 కోట్లలోపు రిటైల్ డిపాజిట్లకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ స్కీమ్ కింద సీనియర్ సిటిజన్లు అదనపు వడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు. ►పంజాబ్ నేషనల్ బ్యాంక్: 1,111 రోజులు, మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకూ కాలపరిమితికి సంబంధించి 5.75 శాతం రేటుతో డిపాజిట్ పథకాన్ని అమలు చేస్తోంది. ►ఐసీఐసీఐ, హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు: ప్రైవేటు రంగంలోని ఈ దిగ్గజ బ్యాంకులు పదేళ్ల వరకూ కాలపరిమతితో 5.75 శాతం వడ్డీని ఆఫర్ చేస్తూ, డిపాజిట్ పథకాన్ని వెలువరించాయి. ►యాక్సిస్ బ్యాంక్: 18 నెలల వరకూ డిపాజిట్‌పై 6.05 శాతం వడ్డీ ఆఫర్‌తో డిపాజిట్ పథకాన్ని తీసుకువచ్చింది. (ఇదీ చదవండి: Electric Scooters: కేవలం వేలం వెర్రేనా? సర్వేలో షాకింగ్ విషయాలు) ఆర్బీఐ రేటు పెంపు నేపథ్యం... బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను అరశాతం పెంచుతూ (5.40 శాతానికి అప్) ఈ నెల 5వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌సహా పలు రుణసంస్థలు తమ డిపాజిట్ రేట్లను పెంచాయి. డిపాజిట్రేట్లతో పాలు పలు బ్యాంకులు రుణ రేట్ల పెంపును కూడా ప్రారంభించాయి. వడ్డీరేట్లకు సంబంధించి సవాళ్లను నిర్వహించే స్థితిలో ప్రస్తుతం బ్యాంకింగ్ ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకూ జరిగిన పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కీలక వ్యాఖ్యలు చేస్తూ, ‘‘రుణ వృద్ధికిగాను బ్యాంకులు సెంట్రల్ బ్యాంక్ డబ్బుపై శాశ్వతంగా ఆధారపడ జాలవు. రుణ వృద్ధికిగాను బ్యాంకింగ్ తన సొంత వనరులపై ఆధారపడాలి. మరిన్ని డిపాజిట్లను సమీకరించాలి. బ్యాంకులు ఇప్పటికే రెపో రేట్ల పెంపు ప్రయోజనాన్ని తమ డిపాజిటర్లకు అందించడం ప్రారంభించాయి. ఇదే ధోరణి కొనసాగుతుందని భావిస్తున్నాం. తద్వారా వ్యవస్థలో తగిన లిక్విడిటీ కూడా ఉంటుంది’’ అని బ్యాంకింగ్‌కు స్పష్టం చేయడం గమనార్హం. -
ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన పీఎన్బీ
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తనఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. అన్ని కాలాల ఫిక్స్డ్ డిపాజిట్లపై అందించే 10-20 బేసిస్ పాయింట్ల వడ్డీరేటును పెంచింది. కొత్త వడ్డీ రేట్లు ఆగస్టు 17, 2022 నుండి అమలులోకి వస్తాయని బ్యాంక్ అధికారిక వెబ్సైట్ పేర్కొంది. పెరిగిన వడ్డీ రేట్లు కొత్త డిపాజిట్లు, ఇప్పటికే ఉన్న డిపాజిట్ల పునరుద్ధరణ రెండింటికీ వర్తిస్తాయని పీఎన్బీ స్పష్టం చేసింది. సంవత్సరం నుండి 2 సంవత్సరాల వరకు, 3 సంవత్సరాల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 10 నుంచి 20 బేసిస్ పాయింట్లు పెంచింది. ఒక సంవత్సరంలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. రెండేళ్లలోపు మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేటు 15 బేసిస్ పాయింట్లు పెరిగి 5.50శాతంగా ఉంటుంది. రెండు నెంచి మూడు సంవత్సరాల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5.60 శాతం వడ్డీ చెల్లిస్తుంది. పీఎన్బీ ఉత్తమ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ బ్యాంక్ అందించే ప్రత్యేక డిపాజిట్ స్కీమ్ పీఎన్‌బీఉత్తమ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడిదారులు రూ. 15 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేయవచ్చు. ఈ డిపాజిట్ పథకం వ్యవధి 91 రోజుల నుండి 1111 రోజుల వరకు ఉంటుంది . ఈ డిపాజిట్లపై వడ్డీ రేటు వరుసగా 4.05శాతం 5.55 శాతం దాకా ఉంటుంది. -
కస్టమర్లకు ఎస్బీఐ స్వాతంత్య్ర దినోత్సవ కానుక: కొత్త స్కీం
సాక్షి,ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 75 సంవత్సరాల భారత స్వాతంత్ర్య దినోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఖాతాదారులకు ఒక కొత్త పథకాన్ని లాంచ్ చేసింది. "ఉత్సవ్ డిపాజిట్" అనే ప్రత్యేకమైన టర్మ్ డిపాజిట్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీంలో అధిక వడ్డీరేట్లను ఆఫర్ చేస్తోంది. అయితే ఇది పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఎస్బీఐ ఒక ట్వీట్లో వెల్లడించింది. చదవండి: ఖాతాదారులకు షాకిచ్చిన ఎస్బీఐ: మూడు నెలల్లో మూడోసారి ఉత్సవ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌లో, 1000 రోజుల కాలవ్యవధితో ఫిక్స్డ్ డిపాజిట్లపై సంవత్సరానికి 6.10శాతం వడ్డీ రేటును అందిస్తోంది. సీనియర్ సిటిజన్లు సాధారణ రేటు కంటే 0.50శాతం అదనపు వడ్డీ రేటును పొందేందుకు అర్హులు. ఈ రేట్లు 15 ఆగస్టు 2022 నుండి అమలులోకి వస్తాయి. ఇఇది 75 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. A delightful offer especially for our customers to celebrate 75 years or Azadi. With ‘Utsav’ Deposit, get higher interest rate on Fixed Deposits. #SBI #UtsavDeposit #FixedDeposits #AmritMahotsav pic.twitter.com/DhPQnis568 — State Bank of India (@TheOfficialSBI) August 15, 2022 -
ఖాతాదారులకు షాకిచ్చిన ఎస్బీఐ: మూడు నెలల్లో మూడోసారి
సాక్షి, ముంబై: ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారులకు షాకిచ్చింది. రుణాలపై వసూలు చేసే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటును మరోసారి పెంచింది. తాజాగా ఎంసీఎల్ఆర్ రేటును 20 బీపీఎస్ పాయింట్లు పెంచి రుణ గ్రహీతలపై మరింత భారం మోపింది. బాహ్య బెంచ్‌మార్క్ ఆధారిత రుణ రేటు (EBLR), రెపో-లింక్డ్ లెండింగ్ రేటును 50 బీపీఎస్ పాయింట్ల మేర పెంచింది. ఆగస్టు 15 నుండి సవరించిన వడ్డీరేట్లు అమలులోకి వచ్చినట్టు బ్యాంకు ప్రకటించింది. ఓవర్‌నైట్ నుండి మూడు నెలల వరకు ఎస్బీఐ MCLR రేటు 7.15 శాతం నుండి 7.35 శాతానికి పెరిగింది. ఆరు నెలల వ్యవధి రుణాల వడ్డీరేటు 7.45 శాతం నుండి 7.65 శాతానికి పెరిగింది. సంవత్సర పరిధి లోన్లపై 7.90 శాతం, రెండేళ్లు,మూడు సంవత్సరాల 8 శాతంగా ఉంచింది. మూడు నెలల్లో మూడో పెంపు ఇది. ఇటీవల ఆర్బీఐ రెపో రేటు పెంచిన నేపథ్యంలో ఎస్బీఐ ఈ నిర్ణయం ప్రకటించింది. -
అంతర్జాతీయంగా పసిడి పరుగు
వాషింగ్టన్: ఆర్థిక అనిశ్చితి ధోరణుల్లో అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్– నైమెక్స్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర గురువారం 35 డాలర్లకుపైగా పెరిగి 1,752 డాలర్లపైన ట్రేడవుతోంది (రాత్రి 11 గంటల సమయంలో). అమెరికాలో ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, మాంద్యం పరిస్థితుల్లో ఇకముందు ఫెడ్ ఫండ్ రేటు మరింత దూకుడుగా ఉండబోదన్న అంచనాలు, 20 సంవత్సరాల గరిష్టం 109 నుంచి వెనక్కు తగ్గిన డాలర్ ఇండెక్స్ (ఈ వార్త రాస్తున్న సమయంలో 106.4 వద్ద ట్రేడింగ్) వంటి కీలక అంశాలు దీనికి నేపథ్యం. ఇక అంతర్జాతీయ సంకేతాలకు అనుగుణంగా దేశీయంగా ముంబై ప్రధాన బులియన్ మార్కెట్లో ధర రూ.500 వరకూ లాభపడింది. -
Repo rate rise: రేట్లకు రెక్కలు.. ఏం చేద్దాం?
ఈ ఏడాది ఏప్రిల్ వరకు గృహ రుణాలపై వడ్డీ రేటు 6.5 శాతం. ఇళ్ల కొనుగోలుదారులను ఈ రేటు ఎంతో ఆకర్షించింది. కనిష్ట రేటును చూసి ఇళ్లను కొనుగోలు చేసిన వారు ఎందరో..? పాశ్చాత్య దేశాల మాదిరే మన ఆర్థిక వ్యవస్థ కూడా తక్కువ రేట్ల దిశగా అడుగులు వేస్తుందన్న విశ్లేషణలు అంతకుముందు వరకు వినిపించాయి. కానీ, కేవలం కొన్ని నెలల్లోనే పరిస్థితులు మారిపోయాయి. రుణ రేట్లు సుమారు ఒక శాతం మేర పెరిగాయి. ఆర్బీఐ రెపో రేటును 0.90 శాతం మేర పెంచింది. ఇది కచ్చితంగా రుణ గ్రహీతలపై భారం మోపేదే. రేట్ల పెంపు కథ ఇంతటితో ముగియలేదు. ఇప్పుడే మొదలైంది. మరిన్ని రేట్ల పెంపులు ఉంటాయన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. మరి ఈ తరుణంలో రేట్ల పెంపు ప్రభావం ఎవరిపై ఎక్కువగా ఉంటుంది..? గృహ రుణాలు తీసుకున్న వారి పరిస్థితి ఏంటి..? తీసుకోబోయే వారి ముందున్న మార్గాలు ఏంటన్న విషయాలను చర్చించే కథనమే ఇది. 80 శాతం రిటైల్ రుణాలు ఫ్లోటింగ్ రేటు ఆధారితంగానే ఉంటున్నాయి. కనుక ఆర్బీఐ రేట్ల సవరణ ప్రభావం దాదాపు అన్ని రకాల రిటైల్ రుణాలపైనా ప్రతిఫలిస్తుంది. ముఖ్యంగా ఈబీఎల్ఆర్ను గృహ రుణాలను లక్ష్యంగా చేసుకుని ప్రవేశపెట్టిందేనని గుర్తు పెట్టుకోవాలి. రిటైల్ రుణాల్లో సగానికి పైన గృహ రుణాలే ఉన్నాయి. కనుక బ్యాంకులు వేగంగా గృహ రుణ రేట్లను సవరించాయి. కారు, ద్విచక్ర వాహన రుణాలపైనా అదనపు భారం పడింది. అయితే ఈ విభాగంలోని మొత్తం రుణాల్లో ఈబీఎల్ఆర్కు అనుసంధానమై ఉన్నవి 40 శాతం కంటే తక్కువ. ఈ తరహా రుణాలకు ఈబీఎల్ఆర్ కంటే ముందు విధానమైన ఎంసీఎల్ఆర్నే బ్యాంకులు అనుసరిస్తున్నాయి. బ్యాంకులు రెపో మాదిరే గృహ రుణాలపై 0.90 శాతం పెంపును అమలు చేయగా.. ఇతర రుణ ఉత్పత్తులపై పెంపు వాటి విచక్షణకు అనుగుణంగా ఉండడాన్ని గమనించొచ్చు. ఉదాహరణకు యాక్సిస్ బ్యాంకు కారు రుణంపై రేటును 7.45 శాతం నుంచి 8.5 శాతానికి పెంచగా.. ఎస్బీఐ 7.2 శాతం నుంచి 7.7 శాతానికి సవరించింది. ఇంట్రెస్ట్ సేవర్ అకౌంట్ వడ్డీ రేట్ల పెరుగుదల క్రమంలో ఉన్నాం. కనుక గృహ రుణం తీసుకునే వారు డౌన్ పేమెంట్ (తన వంతు వాటా) ఎక్కువ సమకూర్చుకోవడం ఒక మార్గం. ఎక్కువ సమకూర్చుకునేందుకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోతే అప్పుడు ‘హోమ్‌లోన్ ఇంటరెస్ట్ సేవర్ అకౌంట్’ లేదా ‘స్మార్ట్లోన్’ను పరిశీలించొచ్చు. ఒక్కో బ్యాంకు ఒక్కో పేరుతో ఈ తరహా రుణాలను మార్కెట్ చేస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు ‘మనీ సేవర్ హోమ్ లోన్’, ఎస్బీఐ ‘మ్యాక్స్ గెయిన్ హోమ్‌లోన్’, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు ‘హోమ్ సేవర్’ అనేవి ఈ తరహా రుణ ఉత్పత్తులే. రెండు ప్రయోజనాలు.. ఈ రుణం కరెంటు ఖాతాకు అనుసంధానమై ఉంటుంది. మీ దగ్గర ఉన్న మిగులు బ్యాలన్స్ ఎంతైనా కానీయండి ఈ కరెంటు ఖాతాలో డిపాజిట్ చేసుకుంటే చాలు. ఆ మేరకు రుణంపై వడ్డీ భారం తగ్గిపోయినట్టే. ఉదాహరణకు మీరు రూ.50 లక్షల గృహ రుణాన్ని ఇంకా చెల్లించాల్సి ఉందనుకుంటే.. రూ.5 లక్షలు మిగులు మీ వద్ద ఉంటే దాన్ని కరెంటు ఖాతాలో డిపాజిట్ చేసుకోవాలి. అప్పుడు గృహ రుణం రూ.45 లక్షలపైనే వడ్డీ పడుతుంది. మరొక ప్రయోజనం ఏమిటంటే.. మిగులు రూ.5లక్షలను కరెంటు ఖాతా నుంచి ఎప్పుడైనా వెనక్కి తీసేసుకోవచ్చు. కనుక మిగులు నిల్వలను ఈ ఖాతాలో ఉంచుకోవడం ద్వారా గృహ రుణంపై వడ్డీ భారాన్ని కొంత దింపుకోవడం ఇందులో ఉన్న అనుకూలత. మంచి మార్గం అందరూ కాకపోయినా.. కొందరు అయినా అత్యవసర నిధి అంటూ కొంత మొత్తాన్ని నిర్వహిస్తుంటారు. కొందరు బ్యాంకు సేవింగ్స్ ఖాతాల్లో ఉంచేస్తుంటారు. లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టేవారు కూడా ఉన్నారు. ఇలా ఉంచేయడానికి బదులు ఆ మొత్తాన్ని తీసుకెళ్లి హోమ్‌లోన్ ఇంట్రెస్ట్ సేవర్ అకౌంట్లో ఉంచుకోవడం మంచి మార్గమని ఆర్థిక సలహాదారుల సూచన. మిగులు నిల్వలు ఏవైనా కానీ ఈ ఖాతాలో ఉంచుకోవడం వల్ల వడ్డీ భారాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవచ్చని లాడర్7వెల్త్ ప్లానర్స్ ప్రిన్సిపల్ ఆఫీసర్ సురేష్ సెడగోపన్ సూచించారు. వడ్డీ రేటు వేరు సాధారణ గృహ రుణాలతో పోలిస్తే,, ఇంట్రెస్ట్ సేవర్ అకౌంట్‌తో కూడిన రుణాలపై వడ్డీ రేటు 0.5–0.6 శాతం ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. మిగులు నిల్వలు లేని వారికి ఇదేమంత ప్రయోజనం కాదు. వేతన జీవులు, వ్యాపారులు సాధారణంగా తమ అవసరాల కోసం మిగులు నిల్వలు ఎంతో కొంత నిర్వహిస్తుంటారు. అటువంటి వారికి ఈ తరహా రుణం అనుకూలం. వడ్డీ ఆదా/ముందస్తు చెల్లింపు ఇంట్రెస్ట్ సేవర్ అకౌంట్‌కు బదులు రెగ్యులర్ హోమ్ లోన్ తీసుకుని.. మధ్య మధ్యలో తమకు బోనస్, ఇతర రూపాల్లో అందిన నిధులతో ముందస్తు గృహ రుణం చెల్లింపు మార్గాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఇలా కూడా అదనపు రుణ భారాన్ని తగ్గించుకోవచ్చు. కానీ, మిగులు నిల్వలు ఎప్పుడూ ఎంతో కొంత ఉండే వారికి.. వాటిని రాబడి మార్గంగా మలుచుకోవడం తెలియని వారికి ఇంట్రెస్ట్ సేవర్ హోమ్ లోన్ అకౌంట్ మెరుగైన మార్గం అవుతుంది. అయితే, కొన్ని బ్యాంకులే ఈ ఉత్పత్తిని ఆఫర్ చేస్తున్నాయి. ఆయా అంశాలపై ఈ విభాగంలోని నిపుణులు, బ్యాంకర్ల సలహాలను తీసుకోవాలి. ఈఎంఐ పెరుగుదల..? రూ.75 లక్షల గృహ రుణాన్ని 20 ఏళ్ల కాలవ్యవధిపై ఈ ఏడాది ఏప్రిల్‌లో 6.5 శాతం రేటు మీద తీసుకుని ఉన్నారనుకుంటే.. నెలవారీ ఈఎంఐ రూ.55,918 అవుతుంది. గృహ రుణ రేటు 7.3 శాతానికి పెరిగిందని అనుకుంటే ఈఎంఐ రూ.59,506 అవుతుంది. సుమారు రూ.4,500 పెరిగింది. అది కూడా క్రెడిట్ స్కోరు 791కి పైన ఉన్నవారికే ఇది. 681 నుంచి 790 మధ్య క్రెడిట్ స్కోరు ఉన్న వారికి వడ్డీ రేటు 7.65 శాతం నుంచి 7.9 శాతం వరకు చేరింది. ఈ రేటు ప్రకారం చూస్తే రూ.75 లక్షల గృహ రుణం ఈఎంఐ రూ.55,918 నుంచి రూ.61,109–62,267కు పెరిగినట్టు అవుతుంది. ఏడాదికి చూసుకుంటే వడ్డీ పెంపు వల్ల పడుతున్న అదనపు భారం రూ.46,000–73,000 మధ్య ఉంది. ప్రత్యామ్నాయాలు.. ఇప్పటికే గృహ రుణాలు తీసుకున్న వారు ఈఎంఐ పెరగడకుండా ఉండేందుకు రుణ కాలవ్యవధిని పెంచుకోవచ్చు. నిజానికి చాలా బ్యాంకులు ఈఎంఐ పెంపునకు బదులు వాటంతట అవే రుణ కాలవ్యవధిని పెంచుతుంటాయి. రుణ కాలవ్యవధి ఎంత మేర పెరుగుతుందన్న దానికి ఒక సూత్రం ఉంది. 20 ఏళ్ల కాలానికి గృహ రుణాన్ని తీసుకుని ఉంటే.. తీసుకునే నాటి రేటుపై ప్రతి పావు శాతం పెంపునకు 10 నెలల మేర కాలవ్యవధి పెరుగుతుంది. 6.5 శాతం రేటుపై గృహ రుణాన్ని 20 ఏళ్ల కాలానికి తీసుకుని ఉన్నారనుకుంటే.. 0.90 శాతం రేటు అధికం కావడం వల్ల రుణ కాలవ్యవధి సుమారు మూడేళ్లపాటు పెరుగుతుంది. మరో 0.75శాతం మేర ఈ ఆర్థిక సంవత్సరంలో రేటు పెరుగుతుందని అనుకుంటే.. ఈఎంఐ ఇప్పటి మాదిరే ఉండాలనుకుంటే రుణ కాలవ్యవధి 5.5 ఏళ్లు పెరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఈఎంఐ భారం కాకూడదు, రుణ కాలవ్యవధి పెరగొద్దు అనుకుంటే రుణ గ్రహీతల ముందున్న మరో మార్గం ఒకే విడత కొంత మొత్తం గృహ రుణాన్ని చెల్లించడమే. ఒకవేళ గృహ రుణం ముగియడానికి ఇంకా చాలా వ్యవధి ఉంటే, అప్పుడు పలు విడతలుగా కొంత మొత్తం చొప్పున ఈఎంఐకు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ గృహ రుణం కాల వ్యవధి చివర్లో ఉంటే.. పెరిగిన మేర ఈఎంఐను కడుతూ వెళ్లాలి. లేదంటే పొదుపు, పెట్టుబడులు ఉంటే వాటితో గృహ రుణాన్ని కొంత చెల్లించేయాలి. కానీ, ఇక్కడ చూడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. గృహ రుణాన్ని ముందుగా తీర్చివేయడం వల్ల పన్ను ప్రయోజనాన్ని కోల్పోవాల్సి రావచ్చు. కనుక పన్ను పరిధిలో ఉన్న వారు లెక్కలు వేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. మిగులు నిల్వలు ఉంటే వాటిని గృహ రుణంగా తీర్చివేయడం కంటే పెట్టుబడి ద్వారా ఎక్కువ రాబడి వచ్చే మార్గం ఉంటే దాన్ని కూడా కోల్పోవాల్సి రావచ్చు. కనుక ఈ కోణాల నుంచి పరిశీలించాకే ఈ నిర్ణయానికి రావాలి. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేటు రుణాన్ని పరిశీలించొచ్చు. ప్రభుత్వరంగ బ్యాంకులు ఫిక్స్డ్ రేటుపై గృహ రుణాలను 9.6 శాతం రేటుకు ఆఫర్ చేస్తున్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో అయితే ఇది 11.5 శాతం మేర ఉంది. కాకపోతే క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉన్న వారికి ఫ్లోటింగ్ రేటుపై రుణమే నయం. 2023 మార్చి నాటికి గృహ రుణ రేటు 8.15 శాతం! గతంలో ఆర్బీఐ కీలక రేట్లను తగ్గించినా, పెంచినా ఆ ప్రభావం రుణాలపై ప్రతిఫలించడానికి కొన్ని నెలలు పట్టేది. దీన్ని గమనించిన ఆర్బీఐ.. రేట్ల సవరణ సత్వరం అమలయ్యేందుకు వీలుగా.. 2019లో ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును (ఈబీఎల్ఆర్) ప్రవేశపెట్టింది. దీంతో ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న రోజుల వ్యవధిలోనే బ్యాంకులు కూడా సవరణ చేయక తప్పని పరిస్థితి. రెపో రేటు, ట్రెజరీ బిల్లు ఈల్డ్ ఇవన్నీ ఈబీఎల్ఆర్కు ప్రామాణికం. ఆర్బీఐ నూతన విధానం నేపథ్యంలో చాలా వరకు గృహ రుణాలకు రెపో రేటు ప్రామాణికంగా మారిపోయింది. ఈ విధానం కారణంగానే 2020లో రెపో రేటు 4% కనిష్టానికి తగ్గిపోవడం వల్ల రుణ గ్రహీతలు ప్రయోజనం పొందారు. ఇప్పుడు ద్రవ్యోల్బణం అదుపు తప్పిన క్రమంలో మళ్లీ రేట్ల పెంపు ప్రభావం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. తీవ్ర ద్రవ్యోల్బణం సవాళ్లు, అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటు పెంపు నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే మరో 0.75 శాతం మేర ఆర్బీఐ రేట్లను పెంచుతుందని విశ్లేషకులు, ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తక్కువలో తక్కువ గృహ రుణ రేటు 7.3 శాతంగా ఉంది. ఆర్బీఐ అంచనాలకు అనుగుణంగా రేట్లను పెంచితే 2023 మార్చి నాటికి గృహ రుణ రేటు ఎంత లేదన్నా 8.15 శాతానికి చేరుతుంది. 2019లోనూ 8 శాతం స్థాయిలోనే గృహ రుణ రేట్లు ఉన్నాయి. -
క్రిప్టో.. ఇంకా తప్పటడుగులే!
క్రిప్టో కరెన్సీలు ఈ స్థాయిలో పడిపోతాయని ఒక్క ఇన్వెస్టర్ కూడా ఊహించి ఉండడు. ప్రధాన క్రిప్టో కరెన్సీలు గరిష్టాల నుంచి మూడింట రెండొంతుల మేర విలువను కోల్పోయాయి. ఇక చిన్న క్రిప్టోలు, మీమ్ కాయిన్ల పరిస్థితి మరింత దారుణం. 2017లో క్రిప్టో కరెన్సీల మార్కెట్ విలువ 620 బిలియన్ డాలర్లు. అక్కడి నుంచి 2021 నవంబర్ నాటికి అమాంతం 3 లక్షల కోట్ల డాలర్లకు దూసుకెళ్లింది. ఆ బుడగ పేలడంతో 2022 జూన్ నాటికి లక్ష కోట్ల డాలర్లకు కుప్పకూలింది. 2021 ఆగస్ట్ 11న బిట్ కాయిన్ ధర 67,566 డాలర్లు. ఇప్పుడు 20,000 దరిదాపుల్లో ఉంది. రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథీరియం కూడా ఇదే రీతిలో ఇన్వెస్టర్లకు చేదు ఫలితాలను ఇచ్చింది. గడిచిన ఆరు నెలల్లో ఈక్విటీ మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా నష్టాలను చూస్తున్నాయి. కేంద్ర బ్యాంకులు ద్రవ్య లభ్యతను తగ్గించే చర్యల వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. పెరిగిపోయిన ద్రవ్యోల్బణం వాటికి మరో దారి లేకుండా చేసింది. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తెగనమ్మడం మొదలు పెట్టారు. దాంతో ఈక్విటీ మార్కెట్లు కూడా తీవ్ర నష్టాలను చవిచూశాయి. కానీ, క్రిప్టో కరెన్సీలు వేరు. ఇవి స్వేచ్ఛా మార్కెట్లు. కావాలంటే ఒకే రోజు నూరు శాతం పెరగగలవు. పడిపోగలవు. వీటిపై ఏ దేశ నియంత్రణ సంస్థకు నియంత్రణ లేదు. అసలు వీటికి ఫండమెంటల్స్ అంటూ ఏమీ లేవు. కొత్త తరహా సాధనాలు ఇవి. ప్రపంచవ్యాప్తంగా కరోనా విపత్తు నుంచి ఆర్థిక వ్యవస్థలను బయట పడేసేందుకు కేంద్ర బ్యాంకులు నిధుల లభ్యతను పెంచాయి. అవి ఈక్విటీలతోపాటు క్రిప్టోలను వెతుక్కుంటూ వెళ్లాయి. ఇప్పుడు లిక్విడిటీ వెనక్కి వెళుతుండడం వాటి ఉసురుతీస్తోంది. అందుకే పెట్టుబడులను ఎప్పుడూ జూదం కోణంలో చూడకూడదు. దీర్ఘకాల దృష్టిలో, తమ రిస్క్ సామర్థ్యం ఆధారంగా సరైన సాధనాల్లో పెట్టుబడులు పెట్టుకుంటేనే సంపద సాధ్యపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. భారీ ర్యాలీకి కారణం.. అంతర్జాతీయ ఫండ్స్ నిర్వహణ సంస్థలైన జేపీ మోర్గాన్ చేజ్, బ్లాక్‌రాక్ పెద్ద ఎత్తున బిట్కాయిన్లలో పెట్టుబడులు పెట్టాయి. స్వల్పకాలంలో ఎక్కువ రాబడులను ఇన్వెస్టర్లకు పంచిపెట్టాలన్న కాంక్ష, వైవిధ్య కోణం ఫండ్స్ మేనేజర్లతో అలా చేయించి ఉండొచ్చు. 2021 అక్టోబర్ 19న అమెరికాలో మొదటి బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లో ట్రేడింగ్ మొదలైంది. లిక్విడిటీకితోడు, పెద్ద సంస్థలు సైతం క్రిప్టో మార్కెట్లోకి అడుగు పెట్టడం భారీ ర్యాలీకి ఊతంగా నిలిచింది. ఇదే అదనుగా ఆల్ట్ కాయిన్లకు కూడా డిమాండ్ ఏర్పడింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ క్రిప్టోలకు సెలబ్రిటీగా మారిపోయారు. క్రిప్టోవేవ్ను అనుకూలంగా మలుచుకునేందుకు భారత్‌లో క్రిప్టో ఎక్సేంజ్‌లు దినపత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు, టీవీల్లో ప్రకటనలతో ఇన్వెస్టర్లను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇవన్నీ కలసి ఈ మార్కెట్లో ’ఫోమో’ (అవకాశాన్ని కోల్పోతామేమోనన్న ఆందోళన)కు దారితీసింది. ఎక్సే్ఛంజ్‌లకు గడ్డుకాలం... క్రిప్టో లావాదేవీలకు వీలు కల్పిస్తున్న దేశీ ఎక్సే్ఛంజ్‌లు తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ట్రేడింగ్ వ్యాల్యూమ్ 80 శాతానికి పైగా పడిపోవడం వాటికి దిక్కుతోచనీయడం లేదు. దీంతో ఆర్థికంగా బలంగా లేని ఎక్సే్ఛంజ్‌లు దినదిన గండం మాదిరి నెట్టుకొస్తున్నాయి. ప్రముఖ క్రిప్టో ఎక్సే్ఛంజ్ వజీర్‌ఎక్స్‌లో జనవరిలో ట్రేడింగ్ పరిమాణం 39 మిలియన్ డాలర్లు కాగా, క్రమంగా తగ్గుతూ జూన్‌లో 9.67 మిలియన్ డాలర్లకు పడిపోయింది. అన్ని ప్రధాన ఎక్సే్ఛంజీల్లో ఇదే పరిస్థితి ఉన్నట్టు ఈ టేబుల్లోని గణాంకాలను చూస్తే తెలుస్తుంది. పన్ను పిడుగు క్రిప్టో ఇన్వెస్టర్లు ఇప్పుడు అయోమయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. క్రిప్టో కరెన్సీలు భారీగా పడిపోవడం వల్ల లాభాల సంగతేమో కానీ, నష్టాలపాలైన వారే ఎక్కువగా ఉన్నారు. ఈక్విటీల మాదిరి మూలధన నష్టాలను, మూలధన లాభాలతో సర్దుబాటుకు క్రిప్టోల్లో అవకాశం లేదు. ఒక లావాదేవీలో లాభపడి, మరో లావాదేవీలో నష్టపోతే.. లాభం వచ్చిన మొత్తంపై 30 శాతం పన్ను కట్టాలని నూతన నిబంధనలు చెబుతున్నాయి. ఈక్విటీల్లో అయితే మూలధన నష్టాలను ఎనిమిది ఆర్థిక సంవత్సరాల పాటు క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మంజిత్ చాహర్ (42) క్రిప్టోల్లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేశాడు. తొలుత కొన్ని లావాదేవీల్లో అతడికి రూ. 25,000 లాభం వచ్చింది. కానీ, ఆ తర్వాత పెట్టుబడిపై రూ. 45,000 నష్టపోయాడు. అంటే అతడి రూ. లక్ష కాస్తా రూ. 80,000కు పడిపోయింది. అయినా కానీ, రూ. 25,000 లాభంపై అతడు 30 శాతం చొప్పున రూ. 7,500 పన్ను చెల్లించాల్సిందే. బిట్‌కాయిన్‌లో లాభం వచ్చి, బిట్ కాయిన్‌లోనే నష్టం వస్తే వాటి మధ్య సర్దుబాటుకు అవకాశం ఉంది. కానీ, బిట్‌కాయిన్‌లో లాభపడి, ఎథీరియంలో నష్టం వస్తే సర్దుబాటుకు అవకాశం లేదు. ‘‘క్రిప్టో లాభాలపై పన్ను 30 శాతం. కానీ, నష్టాలను లాభాల్లో సర్దుబాటు చేసుకునేందుకు అవకాశం లేదు కనుక, నికర పన్ను 50–60 శాతంగా ఉంటుంది’’అని చార్డర్డ్ క్లబ్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు కరణ్ బాత్రా తెలిపారు. క్రిప్టోల్లో లాభం వచ్చిన ప్రతి విడత ఒక శాతం టీడీఎస్ కట్ అవుతుంది. ఎక్కువ ట్రేడింగ్ చేసే వారికి టీడీఎస్ రూపంలో కొంత పెట్టుబడి బ్లాక్ అవుతుంది. పైగా స్టాక్ బ్రోకర్ల మాదిరి, మూలధన లాభాల స్టేట్ మెంట్లను అన్ని క్రిప్టో ఎక్సే్ఛంజ్‌లు జారీ చేయడం లేదు. విదేశాలకు మకాం క్రిప్టో పన్నుల విధానం పట్ల ఇన్వెస్టర్లు సంతోషంగా లేరని పరిశ్రమ చెబుతోంది. వజీర్ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజగోపాల్ మీనన్ దీని గురించి వివరిస్తూ.. ‘‘తరచూ, అధిక పరిమాణంలో క్రిప్టోల్లో ట్రేడింగ్ చేసే వారు ఇప్పుడు వారి వ్యాపారాన్ని సింగపూర్, దుబాయ్ వంటి మార్కెట్లకు తరలించారు. అక్కడ క్రిప్టోలకు సంబంధించి మెరుగైన పన్ను విధానాలు అమల్లో ఉన్నాయి. వారు ఇప్పుడు దేశీ ఎక్సే్ఛంజీల్లో ట్రేడింగ్ నిలిపివేశారు’’అని వివరించారు. తాజా ప్రతికూల పరిస్థితుల వల్ల 30–40 చిన్న ఎక్సే్ఛంజ్‌లు తీవ్ర సంక్షోభంలో పడినట్టు చెప్పారు. ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసేసుకోకుండా కొన్ని ఎక్సే్ఛంజ్‌లు నియంత్రిస్తున్న వార్తలను ప్రస్తావించారు. తమ ఇన్వెస్టర్లు కొందరు దుబాయి, ఐర్లాండ్‌కు కార్యకలాపాలను తరలించినట్టు ఓ చార్టర్డ్ అకౌంటెంట్ సైతం తెలిపారు. ‘‘సంస్థ లేదా వ్యక్తి రూ.50 కోట్ల లోపు టర్నోవర్ ఉంటే కేంద్ర ప్రభుత్వం పన్ను విధించడం లేదు. ఉదాహరణకు ఒక ఇన్వెస్టర్ విదేశాల్లో రూ.15 కోట్లను క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే.. అతడికి లాభాల రూపంలో రూ.10–15 లక్షలు ఆదా అవుతుంది’’అని వివరించారు. నియంత్రణలు.. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రముఖ ఆర్థిక వ్యవస్థ కూడా క్రిప్టోకరెన్సీలను అనుమతించడం లేదు. క్రిప్టోలు, నాన్ ఫంజిబుల్ టోకెన్లకు నేపథ్యంగా ఉన్న బ్లాక్‌చైన్ సాంకేతికతను భవిష్యత్తు టెక్నాలజీగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అయినా సరే క్రిప్టోలతో ఆర్థిక అనిశ్చితులకు అవకాశం ఇవ్వరాదన్నదే నియంత్రణ సంస్థల అభిప్రాయం. ‘‘ఫేస్బుక్ మొదలు పెట్టిన ‘లిబ్రా’ పట్ల చాలా మందిలో ఆసక్తి కనిపించింది. కానీ, దీనికి ఆదిలోనే నియంత్రణ సమస్యలు ఎదురయ్యాయి. టెలిగ్రామ్ మొదలు పెట్టిన బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఆధారిత ‘టాన్’ను నిలిపివేయాలని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశించింది’’అని వజీర్ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజగోపాల్ మీనన్ వివరించారు. 2018లో క్రిప్టో లావాదేవీలకు రూపీ చెల్లింపుల సేవలను అందించొద్దంటూ బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. దీనిపై ఇన్వెస్టర్లు సుప్రీం కోర్టుకు వెళ్లి అనుకూల ఆదేశాలు తెచ్చుకున్నారు. అయినా కానీ, క్రిప్టోలతో జాగ్రత్త అంటూ ఆర్బీఐ హెచ్చరిస్తూనే వస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం క్రిప్టో లాభాలపై 30 శాతం మూలధన లాభాల పన్నును అమల్లోకి తీసుకొచ్చింది. లాభం నుంచి ఒక శాతం టీడీఎస్‌ను ఎక్సే్ఛంజ్‌ల స్థాయిలోనే మినహాయించే నిబంధనలను ప్రవేశపెట్టింది. మొత్తం మీద ఇన్వెస్టర్లను క్రిప్టోల విషయంలో నిరుత్సాహ పరిచేందుకు తనవంతుగా కేంద్ర సర్కారు చర్యలు తీసుకుందని చెప్పుకోవాలి. ఈక్విటీలు, క్రిప్టోలకు పోలిక? క్రిప్టోలను సమర్థించే వారు ఈక్విటీ, బాండ్ మార్కెట్లలో అస్థిరతలు లేవా? అని ప్రశ్నిస్తున్నారు. 2017–2021 మధ్య ఈక్విటీలు–క్రిప్టోల మధ్య సామీప్యత పెరిగింది. ఈ కాలంలో ఎస్అండ్పీ 500 ఇండెక్స్ వోలటిలిటీ, బిట్‌కాయిన్ ధర వోలటిలిటీ నాలుగు రెట్లు పెరిగింది. దీంతో ఈక్విటీ మార్కెట్ల మాదిరే క్రిప్టో మార్కెట్లు కూడా పడుతూ, లేచేవేనని ఇన్వెస్టర్లు భావించడం మొదలు పెట్టారు. 2020, 2021 ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో పాటు, క్రిప్టో కరెన్సీలు ర్యాలీ చేయడాన్ని పోలుస్తున్నారు. కానీ, స్టాక్స్‌లో నష్టాలు, క్రిప్టోల్లో నష్టాలకు మధ్య పోలికలేదు. మన ఈక్విటీ మార్కెట్లు గరిష్టాల నుంచి 20%లోపే దిద్దుబాటుకు గురయ్యాయి. కొన్ని స్టాక్స్ విడిగా 30–40% నష్టపోయాయి. కానీ, క్రిప్టోలు మరిన్ని నష్టాలను చూస్తున్నాయి. భవిష్యత్తు.. క్రిప్టోల పతనం కచ్చితంగా ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీసినట్టు నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బనాన్ని నియంత్రిత స్థాయికి తీసుకొచ్చేందుకు సమీప కాలంలోనూ వడ్డీ రేట్లు ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి. దీంతో వ్యవస్థలో లిక్విడిటీ మరింత తగ్గుతుంది. దీనివల్ల ఇన్వెస్టర్లలో రక్షణాత్మక ధోరణి కనిపించొచ్చు. 2021లో క్రిప్టోలను కొనుగోలు చేసినట్టయితే ఇప్పటికే సగం మేర వారి పెట్టుబడి కరిగిపోయి ఉంటుంది. మరోవైపు నియంత్రణ సంస్థల కత్తి వేలాడుతూనే ఉంటుందని తెలుసుకోవాలి. ఈక్విటీ మార్కెట్లు మెరుగైన నియంత్రణల మధ్య ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలూగా వేళ్లూనుకుని ఉన్నవి. క్రిప్టోలు అనియంత్రిత సాధనాలు. వీటిపై ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాల చర్యల ప్రభావం ఉంటుంది. ఆ మధ్య చైనా సైతం క్రిప్టో మైనింగ్‌పై కఠిన ఆంక్షలు పెట్టడం గుర్తుండే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం విధించిన పన్ను కూడా ఇన్వెస్టర్లలో నిరుత్సాహానికి దారితీసినట్టు మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. క్రిప్టో మార్కెట్లలో ఈ విధమైన ధోరణి కొంత కాలం పాటు కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లు ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి ప్రధాన సాధనాలవైపు మళ్లీ వెళ్లిపోతారని కొందరు అంచనా వేస్తుంటే.. క్రిప్టోల మార్కెట్ క్రమంగా వికసిస్తుందని కొందరి అంచనా. ‘‘మరింత మంది ఇన్వెస్టర్లు క్రిప్టోల్లో ట్రేడింగ్, స్పెక్యులేషన్‌కు బదులు, వాటి మూలాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మార్కెట్ క్రమంగా పరిపక్వత వైపు అడుగులు వేస్తోంది’’అని క్రిప్టో మేనేజ్మెంట్ సంస్థ కాసియో సీటీవో అనుజ్ యాదవ్ చెప్పారు. బిట్‌కాయిన్, ఎథీరియం, సొలానా, కొన్ని మీమ్ కాయిన్లకు ఇనిస్టిట్యూషన్స్ మద్దతు అయితే ఉంది. మిగిలిన వాటిని ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఎవరికీ తెలియదు. -
చౌక ఇళ్ల రుణ విభాగంపై ప్రభావం
ముంబై: అందుబాటు ధరల్లోని (అఫర్డబుల్) ఇళ్లకు గృహ రుణాలను అందించే కంపెనీలపై పెరుగుతున్న వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణ ప్రభావం ఉంటుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. అధిక ద్రవ్యోల్బణం కారణంగా నిర్మాణ రంగ వ్యయాలు పెరిగిపోతాయని పేర్కొంది. ఇది అందుబాటు ధరల ఇళ్లకు రుణాలిచ్చే కంపెనీల వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిదానించేందుకు దారితీస్తుందని విశ్లేషణ వ్యక్తం చేసింది. రూ.25 లక్షలు, అంతకంటే దిగువ బడ్జెట్ ఇళ్లను అఫర్డబుల్‌గా చెబుతారు. ఆర్థిక అనిశ్చితుల ప్రభావం ఈ విభాగంపై ఎక్కువగా ఉండదని లోగడ నిరూపితమైందంటూ.. గడిచిన దశాబ్ద కాలంలో ఈ విభాగం వేగంగా పురోగతి సాధించిందని ఇండియా రేటింగ్స్ తెలిపింది. గత ఐదేళ్ల కాలంలో చూస్తే హౌసింగ్ ఫైనాన్స్ మార్కెట్లో వృద్ధిని.. అందుబాటు ధరల ఇళ్లకు రుణాలిచ్చే కంపెనీల వృద్ధి అధిగమించడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. ఈ విభాగంలో తొలుత కొంత జోరు కనిపించినప్పుటికీ అది ఇప్పుడు సాధారణ స్థాయికి దిగొచ్చిందని పేర్కొంది. ‘‘అధిక ద్రవ్యోల్బణం కారణంగా రుణ గ్రహీతల వద్ద నగదు ప్రవాహం తగ్గిపోతుంది. నిర్మాణ వ్యయాలు పెరగడం వల్ల ప్రాపర్టీ ధరలు పెరగడమే కాకుండా, కొత్తగా ప్రారంభించే ప్రాజెక్టులు తగ్గుతాయి. ప్రభుత్వం అత్యవసర రుణ హామీ పథకాన్ని నిలిపివేయడం అనే సవాలును ఈ విభాగం ఎదుర్కొంటోంది’’ అని ఇండియా రేటింగ్స్ నివేదిక వివరించింది. ఇటీవలి కాలంలో ఆర్బీఐ 0.90 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. ఈ చర్యతో బ్యాంకులు సైతం వెంటనే పలు రుణాల రేట్లను సవరించేశాయి. ప్రస్తుత రెపో రేటు కరోనా ముందున్న రేటు కంటే పావు శాతం తక్కువ. ప్రస్తుత ఆర్థిక సంత్సరంలో హౌసింగ్ ఫైనాన్స్ (గృహ రుణాలు) మార్కెట్ 13 శాతం వృద్ధిని చూపిస్తుందని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. పెరగనున్న భారం ‘‘ఒక శాతం మేర వడ్డీ రేట్లు పెరిగితే రుణాల ఈఎంఐ 6.1–6.4 శాతం మేర పెరుగుతుంది. అందుబాటు ధరల ఇళ్ల రుణ గ్రహీతలపై ఈ పెరుగుదల 5.3 శాతంగా ఉంటుంది’’అని ఈ నివేదిక వివరించింది. వడ్డీ రేట్ల సైకిల్ ఇలానే ముందుకు సాగితే 2 శాతం మేర రేటు పెరగడం వల్ల ఈఎంఐపై పడే భారం 10.8–13 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేసింది. ‘‘ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి కాల వ్యవధి పెంచడం ద్వారా (ఈఎంఐ పెంచకుండా) రుణ దాతలు ఆ ప్రభావాన్ని అధిగమించగలరు. కొత్త కస్టమర్లకు మాత్రం పెరిగిన రేట్ల మేర ఈఎంఐ అధికమవుతుంది. ఇది ఇల్లు కొనుగోలు సెంటిమెంట్‌ను మధ్య కాలానికి ప్రతికూలంగా మార్చేయవచ్చు’’అని ఈ నివేదిక వివరించింది. నిర్మాణంలో వాడే సిమెంట్, స్టీల్, కాంక్రీట్ సహా ఎన్నో ముడి సరుకుల ధరల గణనీయంగా పెరిగిన విషయాన్ని ప్రస్తావించింది. కార్మికులకు చెల్లింపులు కూడా పెరిగిన విషయాన్ని పేర్కొంది. నిర్మాణ వ్యయం 20–25 శాతం మేర పెరిగేందుకు ఈ అంశాలు దారితీశాయని తెలిపింది. పెరిగిన ధరల ప్రభావాన్ని నిర్మాణదారులు పూర్తిగా కొనుగోలుదారులకు బదిలీ చేయలేవని పేర్కొంటూ.. మధ్య కాలానికి ప్రాపర్టీ ధరలపై ఇవి ప్రతిఫలిస్తాయని అంచనా వేసింది. -
కెనరా బ్యాంక్ వడ్డీరేటు పెంపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ తన నిధుల సమీకరణ వ్యయ ఆధారిత వడ్డీరేటు (ఎంసీఎల్ఆర్)ను 10 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. గురువారం నుంచి తాజా రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఆటో, వ్యక్తిగత, గృహ రుణాలకు ప్రాతిపదిక అయిన ఏడాది ఎంసీఎల్ఆర్ 7.50 శాతానికి పెరిగింది. ఓవర్‌నైట్ నుంచి ఆరు నెలల కాలాలకు సంబంధించి కొత్త రేట్లు 6.75 శాతం నుంచి 7.45 శాతం శ్రేణిలో ఉన్నాయి. రెపో ఆధారిత రుణ రేటును 7.30 శాతం నుంచి 7.80 శాతానికి పెంచుతున్నట్లు కూడా బ్యాంక్ ప్రకటించింది. -
ద్రవ్యోల్బణ కట్టడికి ఇవే కీలకమట?
న్యూఢిల్లీ: తగిన వర్షపాతంతో భారీ పంట దిగుబడులు, వ్యవస్థలో అధిక ద్రవ్య లభ్యత (లిక్విడిటీ)ను అరికట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీరేట్ల పెంపు ద్వారానే తీవ్ర ద్రవ్యోల్బణం కట్టడి సాధ్యమని ఆర్థికవేత్తలు పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే పెట్రోలియం ఉత్పత్తులపై తదుపరి మరింత ఎక్సైజ్ సుంకం తగ్గింపునకు కేంద్రం కసరత్తు చేయాలని కూడా ఆయా వర్గాలు కేంద్రానికి సూచిస్తున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా 7.79 శాతం (95 నెలల గరిష్ట స్థాయి), 7.04 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. ఇక టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం మేలో రికార్డు స్థాయిలో 15.88 శాతంగా నమోదయ్యింది. మే, జూన్ నెలల్లో ఇప్పటికే ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటును రెండు దఫాలుగా (0.4 శాతం, 0.5 శాతం) చొప్పున పెంచింది. దీనితో ఈ రేటు 4.9 శాతానికి చేరింది. ఈ రేటు మరో 80 బేసిస్ పాయింట్ల మేర ఈ ఏడాది పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ ఎకనమిస్ట్ విశ్రుత్ రాణా అభిప్రాయపడ్డారు. సరఫరాల సమస్య తొలిగితే ద్రవ్యోల్బణం కట్టడిలోకి వస్తుందన్న అభిప్రాయాన్ని డెలాయిట్ ఇండియా ఎకనమిస్ట్ రుంకీ మజుందార్ వ్యక్తం చేశారు. యుద్ధం వల్ల ఎకానమీకి తీవ్ర సవాళ్లు పొంచిఉన్నాయని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ ప్రిన్సిపల్ ఎకనమిస్ట్ సునిల్ సిన్హా పేర్కొన్నారు. యుద్ధం ముగిస్తే, కమోడిటీ ధరల స్థిరత్వంపై కొంతమేర ఒక అభిప్రాయానికి రావచ్చని అన్నారు. చదవండి: మీకు తెలియకుండా.. మీ పేరు మీద ఇంకెవరైనా లోన్ తీసుకున్నారా! అయితే ఇలా చేయండి! -
SBI: ఇళ్లు కట్టాలంటే ఇబ్బందే.. హోంలోన్స్‌పై వడ్డీరేట్ల పెంపు
ముంబై: భారత్ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గృహ రుణాలపై కనీస వడ్డీ రేట్లను 7.55 శాతానికి పెంచింది. బుధవారం నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల ప్రారంభంలో ఆర్బీఐ రెపో రేటు 4.40% నుంచి 4.90%కి పెంచిన నేపథ్యంలో ఎస్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. మేలో ఈ రేటు 4% నుంచి 4.4%కి చేరిన సంగతి తెలిసిందే. వెబ్సైట్ అందిస్తున్న వివరాల ప్రకారం, రెపో ఆధారిత లెండింగ్ రేటును (ఆర్ఎల్ఎల్ఆర్)ను కూడా ఎస్బీఐ జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చేట్లు పెంపుదల చేసింది. ప్రస్తుతం ఈ రేటు 6.65 శాతం ప్లస్ క్రెడిట్ రిస్క్ ప్రీమియం (సీఆర్పీ)ను కలిగి ఉంది. తాజాగా ఈ రేటు 7.15 శాతానికి చేరింది. బీఓబీ డిపాజిట్ రేట్ల పెంపు ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) స్థిర డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతున్నట్లు 40 బేసిస్ పాయింట్ల వరకూ బుధవారం ప్రకటించింది. చదవండి: హైదరాబాద్‌లో ఏరియాల వారీగా ప్లాట్ల రేట్లు ఎలా ఉన్నాయంటే? -
ఫెడ్ వడ్డీ రేటు పెంపు షాక్
న్యూయార్క్: గత మూడు దశాబ్దాలలోలేని విధంగా యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ తాజాగా వడ్డీ రేట్లను 0.75 శాతంమేర పెంచింది. దీంతో ప్రస్తుతం ఫెడ్ ఫండ్స్ రేట్లు 1.5–1.75 శాతానికి చేరాయి. మంగళవారం ప్రారంభమైన ఫెడరల్ రిజర్వ్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) సమావేశాలు బుధవారం ముగిశాయి. ద్రవ్యోల్బణం ఇటీవల అదుపు తప్పడంతో ఫెడరల్ రిజర్వ్ కఠిన తర విధానాలవైపు మొగ్గు చూపుతోంది. గత నెల(మే)లో ద్రవ్యోల్బణం 8.6 శాతాన్ని తాకింది. ఇది 40ఏళ్లలోనే అత్యధికంకాగా.. మే నెలలో జరిగిన గత సమావేశం తదుపరి కూడా ఫెడ్ 0.5 శాతం ఫండ్స్ రేట్లను హెచ్చించిన సంగతి తెలిసిందే. 2000 సంవత్సరం తరువాత ఈ స్థాయిలో వడ్డీ రేట్లను పెంచడం గత నెలలోనే జరిగింది. కాగా.. ఆర్థిక మందగమనం, ద్రవ్యోల్బణ పరిస్థితులు(స్టాగ్ఫ్లేషన్) తలెత్తనున్నట్లు విశ్లేషకులు ఇటీవల అంచనా వేస్తున్నారు. దీంతో కొద్ది రోజులుగా యూఎస్ మార్కెట్లు పతన బాటలో సాగుతున్నాయి. -
రుణాలపై వడ్డీ రేట్ల బాదుడు షురూ.. ఈ బ్యాంకుల్లో ఎంతంటే?
న్యూఢిల్లీ: ఆర్బీఐ రెపో రేటు పెంపు మరుసటి రోజే రుణాలపై రేట్లను సవరిస్తూ హెచ్డీఎఫ్సీ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐవోబీ) నిర్ణయం తీసుకున్నాయి. గృహ రుణాల అతిపెద్ద సంస్థ హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ గృహ రుణాలకు సంబంధించి తన రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును అరశాతం పెంచింది. ఈ నిర్ణయం జూన్ 10 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. ఐవోబీ కూడి ఇదేవిధమైన నిర్ణయాన్ని ప్రకటించింది. ‘‘రెపో లింక్డ్ లెండింగ్ రేటును 7.75 శాతానికి పెంచామని, జూన్ 10 నుంచి పెంపు అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఆర్బీఐ రెపో 4.90 శాతానికి బ్యాంకు మార్జిన్ రేటు 2.85% కలసి ఉంది. ఇక ఆర్బీఐ పాలసీ ప్రకటన రోజే పీఎన్బీ, ఇండియన్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ ఇండియా రుణాల రేట్లను అరశాతం పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. డిపాజిట్ రేట్ల పెంపు కోటక్ మహీంద్రా బ్యాంకు సేవింగ్స్ ఖాతాదారులకు అనుకూలించే నిర్ణయాన్ని తీసుకుంది. రూ.50లక్షలకు పైన బ్యాలన్స్ ఉండే సేవింగ్స్ ఖాతాలకు వడ్డీ రేటును అరశాతం పెంచి 4 శాతం చేసినట్టు తెలిపింది. టర్మ్ డిపాజిట్ల రేట్లను పావు శాతం పెంచినట్టు పేర్కొంది. చదవండి: క్రెడిట్ కార్డ్ ద్వారా యూపీఐ చెల్లింపులు: లింకింగ్ ఎలా? -
కొనసాగుతున్న ఎఫ్‌పీఐ విక్రయాలు
న్యూఢిల్లీ: డాలర్ మారకం విలువ పెరుగుతుండటం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింతగా పెంచే అవకాశాల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ మార్కెట్లలో విక్రయాలు కొనసాగిస్తున్నారు. మే నెలలో ఇప్పటివరకూ రూ. 39,000 కోట్ల మేర అమ్మకాలు జరిపారు. క్రూడాయిల్ ధరలు భారీ స్థాయిలో కొనసాగుతుండటం, ద్రవ్యోల్బణం, కఠిన ద్రవ్యపరపతి విధానాలు అమలు కానుండటంతో భారత్‌లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు రావడంలో ఒడిదుడుకులు తప్పకపోవచ్చని కోటక్ సెక్యూరిటీస్ హెడ్ (ఈక్విటీ రీసెర్చ్–రిటైల్) శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. ‘ఇటీవలి కాలంలో ఎఫ్‌పీఐల విక్రయాలు ఒక స్థాయికి చేరినట్లుగా కనిపిస్తోంది. దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ), రిటైల్ ఇన్వెస్టర్లు దీటుగా కొనుగోళ్లు జరుపుతున్నారు. ఇకపైనా గరిష్ట స్థాయుల్లో ఎఫ్‌పీఐలు అమ్మకాలు కొనసాగించవచ్చు. అయితే, డీఐఐలు, రిటైల్ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో ఆ ప్రభావం కొంత తగ్గగలదు‘ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్ కుమార్ పేర్కొన్నారు. భారత్‌తో పాటు తైవాన్, దక్షిణ కొరియా, ఇండొనేషియా, ఫిలిప్పీన్స్ వంటి ఇతర వర్ధమాన దేశాల్లో కూడా ఎఫ్‌పీఐలు విక్రయాలు కొనసాగించారు. ఇప్పటివరకూ రూ. 1.66 లక్షల కోట్లు వెనక్కి.. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఈ ఏడాది (2022)లో ఇప్పటివరకు రూ. 1.66 లక్షల కోట్ల పెట్టుబడులను ఈక్విటీల నుంచి వెనక్కి తీసుకున్నారు. మార్కెట్ కరెక్షన్‌కి లోను కావడంతో ఏప్రిల్ తొలి వారంలో ఎఫ్‌పీఐలు కాస్త కొనుగోళ్లపై ఆసక్తి చూపారు. రూ. 7,707 కోట్లు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేశారు. కానీ మళ్లీ ఆ తర్వాత వారాల్లో భారీగా అమ్మకాలకు దిగారు. మే 2–27 మధ్య కాలంలో రూ. 39,137 కోట్ల మేర విక్రయించారు. ఇదే సమయంలో డెట్ మార్కెట్ నుంచి ఎఫ్‌పీఐలు రూ. 6,000 కోట్లు వెనక్కి తీసుకున్నారు. మే నెలలో మరో రెండు ట్రేడింగ్ సెషన్లు మిగిలి ఉన్నాయి. ‘భారత్‌లో వేల్యుయేషన్లు అధిక స్థాయిలో ఉండటం, అమెరికాలో బాండ్ ఈల్డ్‌లు .. డాలర్ మారకం విలువ పెరుగుతుండటం, అక్కడ మాంద్యం భయాలతో వడ్డీ రేట్లను పెంచుతుండటం వంటి అంశాలే ఎఫ్‌పీఐ అమ్మకాలకు కారణం‘ అని విజయ్ కుమార్ వివరించారు. అధిక ద్రవ్యోల్బణం వల్ల కార్పొరేట్ల లాభాలు తగ్గొచ్చని, వినియోగదారులు ఖర్చు పెట్టడం తగ్గించవచ్చన్న ఆందోళన కూడా ఇన్వెస్టర్లను అమ్మకాలకు పురిగొల్పుతోందని మార్నింగ్‌స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్ట్ర హిమాన్షు శ్రీవాస్తవ వివరించారు. వీటితో పాటు రష్యా–ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కొనసాగనుండటం కూడా ప్రపంచ దేశాల ఆర్థిక వృద్ధిని దెబ్బతీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దేశీయంగాను ద్రవ్యోల్బణం.. దాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచనుండటం, ఆర్థిక వృద్ధిపై దాని ప్రభావాలు మొదలైన వాటిపై కొంత ఆందోళన నెలకొందని తెలిపారు. -
రెండు నెలల్లో అతిపెద్ద పతనం
ముంబై: ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక మందగమన భయాలతో స్టాక్ మార్కెట్ గురువారం రెండు నెలల్లో అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. చైనా ఇంటర్నెట్ దిగ్గజం టెన్సెంట్తో సహా దేశీయ కార్పొరేట్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు నష్టాలకు ఆజ్యం పోశాయి. ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు భారత వృద్ధి రేటు అవుట్‌లుక్‌ను 7.3 శాతానికి కుదించింది. దేశీయ మార్కెట్లో్ల విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, కొనసాగుతున్న రూపాయి క్షీణత అంశాలు సెంటిమెంట్‌ను మరింత బలహీనపరిచాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 1,416 పాయింట్లు క్షీణించి 52,930 వద్ద ముగిసింది. నిఫ్టీ 431 పాయింట్లను కోల్పోయి 16 వేల దిగువున 15,809 వద్ద నిలిచింది. ఈ ఫిబ్రవరి 24వ తేదీ తర్వాత సూచీలకిదే అతిపెద్ద పతనం. విస్తృత అమ్మకాలతో బీఎస్ఈ స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్ ఇండెక్స్‌లు ఏకంగా రెండున్నర శాతానికి పైగా క్షీణించాయి. సెన్సెక్స్ 30 షేర్లలో, నిఫ్టీ 50 షేర్లలో ఐటీసీ(3.50%), డాక్టర్ రెడ్డీస్(అరశాతం), పవర్‌గ్రిడ్(0.30%) మాత్రమే లాభంతో గట్టెక్కాయి. ఐటీ, మెటల్స్ అన్నింటికంటే ఎక్కువగా నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 4,900 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.3,226 కోట్లను కొన్నారు. ట్రేడింగ్ ఆద్యంతం నష్టాలే.., ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో ఉదయం స్టాక్ మార్కెట్ భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 1,139 పాయింట్ల భారీ పతనంతో 53,070 వద్ద., నిఫ్టీ 323 పాయింట్లు క్షీణించి 15,917 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్ మొదలు.., మార్కెట్ ముగిసే దాకా ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపడంతో సూచీలు ఏ దశలో కోలుకోలేక పోయాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,539 పాయింట్లు క్షీణించి 52,670 వద్ద, నిఫ్టీ 465 పాయింట్లు నష్టపోయి 15,775 వద్ద కనిష్టాలను తాకాయి. భారీగా పతనమైన ప్రపంచ మార్కెట్లు యూఎస్ రిటైల్ దిగ్గజ సంస్థలు వాల్‌మార్ట్, అమెజాన్, క్రోగర్, కాస్ట్కోల రిటైల్ అమ్మకాలు బాగా తగ్గాయి. నీరసించిన గణాంకాలు మందగమన సంకేతాలు సూచిస్తున్నాయనే భయాలతో అక్కడి మార్కెట్లు బుధవారం.., 2020 జూన్ తర్వాత అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. వాల్‌మార్ట్ షేరు ఏకంగా 25 శాతం పడిపోయింది. ముప్పై ఏళ్లలో అతి పెద్ద క్షీణత ఇది. ట్రేడింగ్ ముగిసే సరికి దేశ ప్రధాన ఇండెక్సులు డోజోన్ 3.6%, నాక్‌డాక్ 4.7%, ఎస్అండ్పీ నాలుగుశాతం క్షీణించాయి. స్టాక్ ఫ్యూచర్లు సైతం గురువారం ఒకటిన్నర శాతం నష్టంతో కదలాడాయి. అమెరికా మార్కెట్ల పతనానికి తోడు చైనా ఇంటర్నెట్ దిగ్గజం టెన్సెంట్ క్యూ1 ఫలితాలు నిరాశపరచడంతో ఆసియా మార్కెట్లు రెండు శాతం నష్టపోయాయి. యూరప్ మార్కెట్లకు చెందిన బ్రిటన్, ఫాన్స్, జర్మనీ స్టాక్ సూచీలు 2.50% నష్టపోయాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో నష్టాల మార్కెట్లోనూ ఐటీసీ షేరు ఎదురీదింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో 4.50% దూసుకెళ్లి రూ.279 వద్ద స్థాయిని అందుకుంది. మార్కెట్ ముగిసేసరికి 3.5% లాభంతో రూ.276 వద్ద ముగిసింది. ► ప్రపంచ వ్యాప్తంగా ఐటీ షేర్లలో కొనసాగుతున్న అమ్మకాల సెగ దేశీయ ఐటీ షేర్లను తాకింది. విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్ కంపెనీ షేర్లు 6శాతం నుంచి ఐదు శాతం నష్టపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో టాప్ లూజర్లన్నీ ఐటీ షేర్లే కావడం గమనార్హం. ► మార్కెట్లో అస్థిరతను సూచించే నిఫ్టీ వొలిటాలిటీ ఇండెక్స్ పది శాతానికి ఎగసి 24.56 స్థాయి వద్ద స్థిరపడింది. రూ.6.71 లక్షల కోట్లు ఆవిరి సెన్సెక్స్ రెండున్నర శాతం నష్టంతో రెండు నెలల్లో అతిపెద్ద పతనాన్ని చవిచూడటంతో బీఎస్ఈలో రూ.6.71 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. తద్వారా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ రూ.249.06 లక్షల కోట్లకు దిగివచ్చింది. రూ‘పాయె’! 77.65కి రికార్డు పతనం ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ ట్రేడింగ్ ‘ముగింపు’లో కొత్త చరిత్రాత్మక కనిష్టాన్ని చూపింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో బుధవారం ముగింపుతో చూస్తే 3 పైసలు బలహీనపడి 77.65 వద్ద ముగిసింది. ఇప్పటి వరకూ రూపాయికి ఇంట్రాడే ‘కనిష్టం’ 77.79. మే 17వ తేదీన ఈ పతన స్థాయి నమోదయ్యింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, భౌగోళిక ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధర తీవ్రత, ద్రవ్యోల్బణం భయాలు, అమెరికా, భారత్‌సహా పలు దేశాలు వడ్డీరేట్ల పెంపు దశలోకి ప్రవేశించడం, డాలర్ బలోపేత ధోరణి, దేశంలో ఈక్విటీల బలహీన పరిస్థితి నేపథ్యంలో రూపాయి పతన బాట పట్టింది. రూపాయి బుధవారం ముగింపు 77.62. గురువారం ట్రేడింగ్‌లో 77.72 బలహీనతతో ప్రారంభమైంది. 77.63కు బలపడినా, ఆ స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది. రూపాయి కొద్ది సెషన్లలోనే 78కి తాకడం ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. -
ఎస్బీఐ మంత్లీ ఇన్స్టాల్మెంట్ల భారం.. నెల రోజుల్లో రెండవ‘సారి’
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్) పది బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) వరకూ పెరిగింది. అన్ని కాలపరిమితులకు తాజా పెంపు వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. దీనితో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన రుణాలకు సంబంధించి నెలవారీ రుణ వాయిదా చెల్లింపుల (ఈఎంఐ) భారం వినియోగదారులపై పెరగనుంది. నెలరోజుల వ్యవధిలో బ్యాంక్ ఎంసీఎల్ఆర్ పెరగడం ఇది రెండవసారి . ఇప్పటికే బ్యాంక్ 10 బేసిస్ పాయింట్ల ఎంసీఎల్ఆర్ను పెంచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను ఈ నెల ప్రారంభంలో అనూహ్యంగా 40 బేసిస్ పాయింట్లు (4 శాతం నుంచి 4.4%కి) పెంచిన నేపథ్యంలో పలు బ్యాంకులు తమ రుణ, స్థిర డిపాజిట్ రేట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే. ఎస్బీఐ తాజా రెండవ దఫా రేటు పెంపుతో ఇదే బాటలో పలు బ్యాంకులు రెండవ రౌండ్ రేట్ల పెంపు దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎస్బీఐ తాజా నిర్ణయం, ఇందుకు సంబంధించి ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► ఎస్బీఐ వెబ్సైట్ సమాచారం ప్రకారం, తాజా రేటు పెంపు మే 15 నుంచి అమల్లోకి వస్తుంది. ► దీని ప్రకారం, ఏడాది ఎంసీఎల్ఆర్ 7.10 శాతం నుంచి 7.20 శాతానికి పెరిగింది. పలు రుణాలు ఈ కాల పరిమితికి అనుసంధానమై ఉంటాయి. ► ఓవర్‌నైట్, నెల, 3 నెలల ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 6.85%కి చేరింది. ► రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 0.1 శాతం పెరిగి 7.4 శాతానికి చేరింది. ► మూడేళ్ల రేటు 7.50 శాతానికి ఎగసింది. ► కాగా, ఎస్బీఐ ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత రుణ రేటు (ఈబీఎల్ఆర్) ప్రస్తుతం 6.65 శాతంగా ఉంది. రెపో ఆధారిత రుణ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) 6.25 శాతంగా ఉంది. ► గృహ, ఆటో లోన్లతో సహా ఏ లోన్‌ను మంజూరు సమయంలోనైనా బ్యాంకులు ఈబీఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆర్కు క్రెడిట్ రిస్క్ ప్రీమియం (సీఆర్పీ)ను కలుపుతాయి. ఆగస్టు నాటికి రెపో 0.75 శాతం పెరగొచ్చు ఎస్బీఐ ఆర్థికవేత్తల అంచనా ఇదిలావుండగా, తీవ్ర ద్రవ్యోల్బణం సవాళ్ల నేపథ్యంలో ఆర్బీఐ రెపో రేటు ఆగస్టు నాటికి మరో 75 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉందని ఎస్బీఐ ఆర్థికవేత్తలు అంచనావేస్తున్నారు. వారి అధ్యయనం ప్రకారం తీవ్రంగా పెరిగిన ద్రవ్యోల్బణంలో కనీసం 59 శాతం ఉక్రెయిన్‌పై రష్యా దాడి వల్ల తలెత్తిన భౌగోళిక రాజకీయ సంఘర్షణే కారణం. కరోనా మహమ్మారికి ముందు రెపో రేటు 5.15 శాతంగా ఉండేది. ఆగస్టు నాటికి తిరిగి ఈ స్థాయికి కీలక రేటు చేరుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరిని బేస్ ఇయర్‌గా తీసుకుంటే అటు తర్వాత మొత్తం ద్రవ్యోల్బణంలో 52 శాతం యుద్ధమే కారణం. ఆహారం, పానీయాలు, ఇంధనం, విద్యుత్, రవాణా రంగాల్లో ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. ఇక ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీసీ) రంగానికి ఇన్పుట్ ధరల పెరుగుదల ప్రభావం మరో 7% ఉంది. ద్రవ్యోల్బణం సమీపకాలంలో తగ్గే అవకాశం లేదు. ధరల పెరుగుదల విషయంలో గ్రామీణ–పట్టణ ప్రాం తాల మధ్య వ్యత్యాసం ఉంది. అధిక ఆహార ధరల ఒత్తిడితో గ్రామీణ ప్రాంతాలు ఇబ్బంది పడుతుంటే, పట్టణ ప్రాంతాల విషయంలో ఇంధన ధరల పెంపుదల తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. జూన్, ఆగస్టు నెలల్లో జరిగే పాలసీ సమీక్షలో ఆర్బీఐ విధాన కమిటీ రేట్లు 0.75 బేసిస్ పాయింట్లు పెంచినా, యుద్ధ–సంబంధిత అంతరాయాలు త్వరగా తగ్గకపోతే ‘రేట్ల పెంపుదల కారణంగా ద్రవ్యోల్బణం అర్థవంతంగా తగ్గిపోతుందా లేదా’ అనేది సెంట్రల్ బ్యాంక్ ఆలోచించవలసిన అతిపెద్ద ప్రశ్న. ద్రవ్యోల్బణం తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, స్థిరమైన రేటు పెరుగుదల వల్ల వృద్ధిపై ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న విషయాన్ని ఆర్బీఐ జాగ్రత్తగా పరిశీలించాలి. -
వడ్డీరేట్లు పెంచడం దేశద్రోహం ఏమీ కాదంటున్న ఆర్థికవేత్త
దేశంలో రోజురోజుకి పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, బ్యాంకువడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడం అనేది సర్వ సాధారణంగా జరిగే నిర్ణయమే. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇలాగే చేస్తాయి. ఇవాళ కాకపోతే రేపయినా మనం చేయక తప్పదు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకుంటున్నాయి. బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడాన్ని ద్రేశద్రోహం (యాంటీ నేషనల్) అన్నట్టుగా ప్రచారం చేస్తున్నాయంటూ లింక్డ్ఇన్ పోస్టులో రఘురాం రాజన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదుపులకు లోనవుతోంది. ఈ సమయంలో ఉక్రెయిన్- రష్యా యుద్ధం రావడంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా తారాస్థాయికి చేరాయి. దీంతో మార్చిలో చిల్లర ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 6.95 శాతానికి చేరగా టోకు ద్రవ్యోల్బణం 14.55ని టచ్ చేసింది. అయితే ఆర్బీఐ వడ్డీరేట్ల పెంపుకు సుముఖంగా లేదు. దీంతో పలు బ్యాంకులు నేరుగా కాకపోయినా పరోక్ష పద్దతిలో వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దీంతో బ్యాంకుల వడ్డీ రేట్లపై వెల్లువెత్తుతున్న విమర్శలు, ఆరోపణలను ఉద్దేశించి రఘురాం రాజన్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. చదవండి: బిగ్ షాక్: సామాన్యుడి నెత్తిన మరో పిడుగు! -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాదారులకు గుడ్‌న్యూస్..!
గత నెలలో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతూ ప్రముఖ ప్రైవేట్ దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా మరోసారి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను హెచ్డీఎఫ్సీ బ్యాంకు పెంచింది. ఈ సవరించిన వడ్డీరేట్లు ఎంపిక చేయబడిన పీరియడ్‌పై మాత్రమే వర్తిస్తాయి. ఏప్రిల్ 6, 2022 నుంచి సవరించిన వడ్డీరేట్లు అమల్లోకి రానున్నాయి. రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లపై కొత్త వడ్డీరేట్లు వర్తించనున్నాయి. ఒక ఏడాది ఎఫ్డీలపై వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్లను హెచ్డీఎఫ్సీ పెంచింది. దీంతో వడ్డీరేట్లు 5 శాతం నుంచి 5.10 శాతానికి పెరిగింది. రెండు సంవత్సరాల ఎఫ్డీలపై 5 శాతం నుంచి 5.10 శాతానికి 10 బేసిస్ పాయింట్లను పెంచుతూ హెచ్డీఎఫ్సీ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా....రూ. 5 కోట్ల కంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటజన్లకు ఐదేళ్ల కాల వ్యవధిలో 25 బేసిస్ పాయింట్ల ప్రీమియంను బ్యాంక్ చెల్లిస్తూనే ఉంటుంది. ఈ ప్రత్యేకమైన ఆఫర్ సాధారణ 50 బేసిస్ పాయింట్ల ప్రీమియంతో అందిస్తోంది. హెచ్డీఎఫ్సీ సవరించిన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి..! చదవండి: ఒప్పో సంచలన నిర్ణయం..! -
ఫెడ్ వడ్డీ రేటు 0.25% పెంపు
వాషింగ్టన్: ముందస్తు సంకేతాలను నిజం చేస్తూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ తాజాగా వడ్డీ రేటును 0.25 శాతంమేర పెంచుతున్నట్లు ప్రకటించింది. వెరసి ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల ఫెడ్.. 2018 తదుపరి మళ్లీ రేట్ల పెంపు బాట పట్టింది. రెండు రోజులపాటు నిర్వహించిన సమావేశంలో చివరికి ఫెడ్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) కఠిన విధానాలకే మొగ్గు చూపింది. కోవిడ్–19 ప్రభావం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఫెడ్ పాలసీ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఫెడ్ తాజా నిర్ణయంతో ఫండ్స్ రేట్లు 0.25–0.5 శాతానికి చేరాయి. ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణ వార్షిక రేటు 40 ఏళ్ల గరిష్టం 7.9 శాతానికి చేరడం ప్రతికూల అంశంకాగా.. నిరుద్యోగిత భారీగా తగ్గి 3.8 శాతానికి పరిమితం కావడంతో రేట్ల పెంపునకు అనువైన పరిస్థితులు ఏర్పడినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో 2.18 శాతానికి చేరిన 10ఏళ్ల ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ మరింత బలపడనున్నట్లు తెలియజేశారు. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ప్రతీ నెలా బాండ్ల కొనుగోలు ద్వారా వ్యవస్థలోకి భారీగా విడుదల చేస్తున్న నిధులను మార్చి నుంచి ఫెడ్ పూర్తిగా నిలిపివేయనున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలపడనుండగా.. పసిడి, స్టాక్ మార్కెట్లు వెనకడుగు వేసే వీలున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. -
సవాళ్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధం
న్యూఢిల్లీ: అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు సహా అంతర్జాతీయ పరిణామాల వల్ల తలెత్తే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉందని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీతో సమావేశంలో మంత్రి చెప్పారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత భారత్ అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయిందని ఆమె తెలిపారు. ప్రస్తుతం మహమ్మారి అనంతరం ప్రపంచంలో పరిస్థితులు మారిపోయాయని, భారత్ ఈసారి అవకాశాలను జారవిడుచుకోకుండా పారిశ్రామిక రంగం చూడాలని ఆమె పేర్కొన్నారు. జీఎస్టీలోకి ఏటీఎఫ్‌పై చర్చ.. కాగా, విమాన ఇంధనాన్ని (ఏటీఎఫ్) వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) పరిధిలోకి చేర్చే అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశంలో చర్చించనున్నట్లు అసోచాం సమావేశంలో నిర్మలా సీతారామన్ చెప్పారు. మరోవైపు, బ్యాంకింగ్‌పరంగా సహకారం లభించేలా ఏవియేషన్‌కు పరిశ్రమ హోదా ఇవ్వాలన్న విజ్ఞప్తిపై బ్యాంకులతో మాట్లాడతామని ఆమె చెప్పారు. పెట్టుబడులకు ఆహ్వానం... వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లో చేసిన ప్రతిపాదనల ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలని సీతారామన్ సూచించారు. వృద్ధి వేగం పుంజుకునేలా సత్వరం పెట్టుబడులను పెంచడంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. పరిశ్రమ వర్గాల సమాఖ్య సీఐఐ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు. -
మార్కెట్‌కు ‘ఫెడ్’ పోటు
ముంబై: కీలక వడ్డీరేట్ల పెంపు మార్చిలో ఉంటుందనే అమెరికా ఫెడ్ రిజర్వ్ సంకేతాలతో గురువారం ఈక్విటీ మార్కెట్లు బేర్మన్నాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి క్షీణత, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగడం దేశీయ మార్కెట్‌పై మరింత ఒత్తిడిని పెంచాయి. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య భౌగోళిక ఉద్రిక్తతలతో సప్లై అవాంతరాలు నెలకొని ఎనిమిదేళ్ల తర్వాత బ్యారెల్ క్రూడాయిల్ ధర 90 డాలర్లను తాకింది. డాలర్ విలువ ఐదు వారాల గరిష్టానికి చేరింది. ఈ అంశాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్ 581 పాయింట్లు నష్టపోయి 57,277 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 168 పాయింట్లను కోల్పోయి 17,110 వద్ద నిలిచింది. ఐటీ, ఫార్మా షేర్లలో భారీ ఎత్తున లాభాల స్వీకరణ జరిగింది. ద్వితీయార్థంలో బ్యాంకింగ్ షేర్లు భారీగా రాణించాయి. ఆటో, మీడియా షేర్లలో చెప్పుకోదగిన కొనుగోళ్లు కనిపించాయి. సెన్సెక్స్ సూచీలో తొమ్మిది షేర్లు మాత్రమే లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒకశాతానికి పైగా నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.6,267 కోట్ల షేర్లను అమ్మేయగా.., డీఐఐలు రూ.2,881 కోట్ల షేర్లను కొన్నారు. సూచీలు ఒకశాతం నష్టపోవడంతో ఇన్వెస్టర్లు ఒకరోజులో రూ.2.81 లక్షల కోట్ల సంపదను కోల్పోయాయి. తద్వారా బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.2,59 లక్షల కోట్లకు దిగివచ్చింది. నష్టాలను పరిమితం చేసిన బ్యాంకింగ్ సూచీలు భారీ నష్టంతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 541 పాయింట్ల నష్టంతో 57,317 వద్ద, నిఫ్టీ 216 పాయింట్లు పతనమై 17,062 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఒక దశలో సెన్సెక్స్ 1419 పాయింట్లు కోల్పోయి 56,439 వద్ద, నిఫ్టీ 411 పాయింట్లు నష్టపోయి 16,867 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. అయితే మిడ్ సెషన్ నుంచి బ్యాంకింగ్ షేర్లకు అనూహ్య కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు కోలుకున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ నష్టాలు (–)1,419 పాయింట్ల నుంచి (–)581కు, నిఫ్టీ (–) నష్టాలు 411 పాయింట్ల నుంచి (–)167 పరిమితయ్యాయి. కాగా డాలర్ మారకంలో రూపాయి విలువ 31 పైసలు బలహీనపడి 75.09 వద్ద ముగిసింది. ఐపీవో బాటలో బోట్ కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ బోట్ మాతృ సంస్థ ఇమేజిన్ మార్కెటింగ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. తద్వారా రూ. 2,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. -
ఇక వడ్డీ రేట్లు పైపైకే..!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరెంతోకాలం సరళతర ద్రవ్య, పరపతి విధానాన్ని కొనసాగించలేదన్న సంకేతాలు అందుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వడ్డీరేట్ల పెంపు దిశగా తీసుకున్న నిర్ణయం ఇందుకు నిదర్శనం. మరికొన్ని బ్యాంకులూ దీనిని అనుసరించే అవకాశం ఉంది. ఎస్బీఐ విషయానికి వస్తే కొన్ని డిపాజిట్ రేట్లను– రుణరేట్లను పెంచుతూ బ్యాంకింగ్ దిగ్గజం కీలక నిర్ణయాలు తీసుకుంది. తాను ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటుకు సంబంధించిన బేస్ రేటునూ 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు 1%) పెంచింది. దీనితో బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు లేదా బేస్ రేటు 7.55 శాతానికి చేరింది. ఎస్బీఐ వెబ్సైట్ ఈ విషయాన్ని తెలిపింది. బేస్ రేటు అంటే ఒక బ్యాంక్ అనుసరించే కనీస వడ్డీరేటు. బేస్ రేటుకు అనుసంధానమైన వడ్డీరేట్లు ఇంతకన్నా (బేస్ రేటు) తక్కువ ఉండవు. కొత్త రేటు డిసెంబర్ 15వ తేదీ నుంచే అమల్లోకి వస్తుందని కూడా బ్యాంక్ వెబ్సైట్ వివరించింది. గడచిన రెండేళ్లలో ఎస్బీఐ బేస్ రేటును పెంచడం ఇదే తొలిసారి. అయితే ఎస్బీఐ మొత్తం రుణాల్లో బేస్ రేటుకు అనుసంధానమై ఉన్నవి కేవలం 2.5% మాత్రమే కావడం గమనార్హం. 2019 జనవరి ముందు రుణాలకు వర్తింపు కాగా తాజా నిర్ణయం జనవరి 2019 నుండి రుణం తీసుకున్న వారికి వర్తించదు. అంతకుముందు రుణం తీసుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. వడ్డీరేట్ల విధానంలో పారదర్శకతే లక్ష్యంగా 2019 జనవరి నుంచీ బేస్ రేటు విధానం నుంచి ఎస్బీఐ ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (ఈబీఎల్ఆర్) విధానానికి మారింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 4 శాతం)కు ఈబీఎల్ఆర్ అనుసంధానమై ఉంటుంది. రెపో రేటు మార్పులకు అనుగుణంగా ఈబీఎల్ఆర్ ఉంటుంది. ద్రవ్యోల్బణం కట్టడి, రుణ, డిమాండ్, ఎకానమీ వృద్ధి లక్ష్యంగా గడచిన తొమ్మిది ద్వైమాసిక సమావేశాల్లో సరళతర ద్రవ్య పరపతి విధానాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా కీలక రేటులో ఎటువంటి మార్పూ చేయలేదు. బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ కూడా... బేస్ రేటు విధానం ప్రారంభానికి (2010 జూలై 1) ముందు అమల్లో ఉన్న బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (బీపీఎల్ఆర్)నూ 10 బేసిస్ పా యింట్లు అంటే 12.2% నుంచి 12.3 %కి పెంచింది. డిపాజిట్ రేటు పెంపు తీరు.. మరోవైపు రూ.2 కోట్లు పైబడి విలువ కలిగిన డిపాజిట్లపై ఎస్బీఐ వడ్డీరేటు 10 బేసిస్ పాయింట్లు (0.1 శాతం) పెరిగింది. దీనితో ఈ రేటు 7.55 శాతానికి చేరింది. డిసెంబర్ 15వ తేదీ నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది. ఇప్పటికే కొన్ని బ్యాంకులు... రెండు పెద్ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ)– బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ ఐదు సంవత్సరాల వరకూ డిపాజిట్లపై ఈ నెలారంభంలో వడ్డీరేట్లను 30 బేసిస్ పాయింట్లు పెంచాయి. డిసెంబర్ 10 నుంచీ అమల్లోకి వచ్చే విధంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ గృహ రుణ వడ్డీరేటును స్వల్పంగా 0.05 శాతం పెంచింది. దీనితో బ్యాంక్ గృహ రుణ రేటు 6.50 శాతం నుంచి 6.55 శాతానికి పెరిగింది. కీలక సమయం ఆసన్నం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులు ప్రస్తుతం అన్ని సమస్యలకు ఒకేఒక్క ఔషధం కలిగి ఉన్నాయి. అది కరెన్సీ ముద్రణ. చౌక రుణ లభ్యత. వాతావరణ మార్పులాగా ఇది భవిష్యత్ తరానికి సంబంధించిన సమస్య. మనం దీనిని పరిష్కరించాలి. అయితే ఇక్కడ క్లిష్ట సమస్యలను ఎదుర్కొనవద్దని లేదా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం నుంచి వైదొలగాలని చెప్పడం ఉద్దేశ్యం కాదు. భవిష్యత్తు ప్రయోజనాలు ఇక్కడ ముడివడి ఉన్నాయి. ఇప్పుడు కీలక నిర్ణయాలకు సమయం ఆసన్నమైంది. ఉదయ్ కోటక్, కోటక్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఎండీ మరెంతో కాలం సాగదు... మహమ్మారి నేపథ్యంలో మనం అతి తక్కువ వడ్డీరేట్ల వ్యవస్థను చూశాం. అయితే ఇది ఎంతోకాలం సాగా పరిస్థితి లేదు. బ్యాంకులు తమ వద్ద ఉన్న అదనపు నిధులకు సంబంధించి ఆర్బీఐ రివర్స్ రెపో మార్గంలో పొందుతున్న వడ్డీరేట్లలో పెరుగుదలను ఇప్పటికే మనం చూస్తున్నాం. ఈ రేటు 3.35 శాతం నుంచి 3.5 శాతానికి పెరిగింది. ఈ స్థాయి నుంచి రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ జరిగే పాలసీ సమీక్ష నిర్ణయాలపై బ్యాంకింగ్ వేచి చూస్తోంది – అశిష్ పార్థసారథి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ట్రజరీ చీఫ్ ఒక శాతం పెరిగే అవకాశం భారత్ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2022–23) సరళతర విధానాల నుంచి వెనక్కు మళ్లే అవకాశం ఉంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం) ఒక శాతం పెరగవచ్చు. 2022ని భారతదేశం ‘సాధారణ పాలసీ సంవత్సరంగా’ పరిగణిస్తోంది. వినియోగం ద్వారా వృద్ధి రికవరీ పటిష్టం అవుతుందని భావిస్తున్నాం. 2–6 శాతం శ్రేణిలోనే ద్రవ్యోల్బణం ఉంటుంద్నది మా అభిప్రాయం. – బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదిక -
బ్యాంకు ఖాతా తెరవకుండానే ఫిక్స్డ్ డిపాజిట్ చేయవచ్చు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గూగుల్ పే యూజర్లు బ్యాంక్ ఖాతా తెరవకుండానే ఫిక్స్డ్ డిపాజిట్స్ చేయవచ్చు. ఈ విధమైన సేవలను పరిశ్రమలో తొలిసారిగా తాము ఆఫర్ చేస్తున్నట్టు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రకటించింది. ఒక ఏడాదిపాటు చేసే ఎఫ్డీలపై 6.35 శాతం వరకు వడ్డీ అందుకోవచ్చని వెల్లడించింది. రూ.5 లక్షల వరకు డిపాజిట్ గ్యారంటీ ఉంటుందని వివరించింది. వినియోగదార్లు గూగుల్ పే యాప్‌లో బిజినెస్ అండ్ బిల్స్ విభాగంలో ఈక్విటాస్ బ్యాంక్‌ను ఎంచుకోవాలి. డిపాజిట్ చేయదలచిన మొత్తం, కాల పరిమితి నిర్ధేశిస్తూ వ్యక్తిగత, కేవైసీ వివరాలను సమర్పించాలి. కాల పరిమితి ముగియక ముందే ఎఫ్డీని రద్దు చేసుకుంటే అదే రోజు వినియోగదారుకు చెందిన బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ అవుతుందని ఈక్విటాస్ వెల్లడిం చింది. చదవండి: పండుగ సెంటిమెంట్, కార్లను తెగకొనేస్తున్నారు -
వడ్డీ రేట్ల పెంపు దిశగా అమెరికా
వాషింగ్టన్: కరోనా వైరస్ మహమ్మారి పరిణామాలను ఎదుర్కొనేందుకు గతేడాది మార్చి నుంచి దాదాపు సున్నా స్థాయి వడ్డీ రేట్లను కొనసాగిస్తున్న అమెరికా క్రమంగా వాటిని పెంచే దిశగా అడుగులు వేస్తోంది. నియామకాలు పుంజుకునే కొద్దీ చౌక వడ్డీ రేట్ల విధానాలను క్రమంగా ఉపసంహరించడం మొదలుపెట్టే అవకాశం ఉందని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ సంకేతాలు ఇచ్చారు. బాండ్ల కొనుగోలు ప్రక్రియను ఈ ఏడాది ఆఖరు మూడు నెలల్లో క్రమంగా తగ్గించుకోనున్నట్లు బ్యాంకర్లు, ఆర్థికవేత్తల సమావేశంలో ఆయన తెలిపారు. ద్రవ్యోల్బణం తాము నిర్దేశించుకున్న 2 శాతం స్థాయికి చేరడంతో బాండ్ల కొనుగోలు ప్రక్రియ నిలిపివేతకు చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. దీర్ఘకాలిక వడ్డీ రేట్లను తక్కువ స్థాయిలో ఉంచడం ద్వారా వ్యవస్థలో రుణాలు, వ్యయాలకు డిమాండ్ కల్పించేందుకు ప్రస్తుతం ఫెడ్ నెలకు 120 బిలియన్ డాలర్ల విలువ చేసే ట్రెజరీ బాండ్లను తిరిగి కొనుగోలు చేస్తోంది. దీన్ని నిలిపివేస్తే తనఖా రుణాలు, క్రెడిట్ కార్డులు, వ్యాపార రుణాలపై వడ్డీ రేట్లు మళ్లీ పెరగడం ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అయితే, బాండ్ల కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయ్యే దాకా వడ్డీ రేట్ల పెంపు ఉండదని పావెల్ తెలిపారు. పావెల్ ప్రకటనపై అమెరికా మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. డోజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సూచీ ఒక దశలో 225 పాయింట్లు పెరిగింది. -
వడ్డీ రేట్లు పెరగడం రిస్కు కాదు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫిక్స్డ్ ఇన్‌కం సాధనాల్లో ఇన్వెస్ట్ చేసిన వారు వడ్డీ రేట్లు పెరిగే రిస్కుల గురించి ఆందోళన చెందకుండా, పరిస్థితికి తగ్గట్లుగా వ్యూహాలను మార్చుకుంటే సరిపోతుందని డీఎస్పీ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ఫండ్ మేనేజర్ సౌరభ్ భాటియా సూచిస్తున్నారు. కరోనా వైరస్ పరిణామాలతో పుష్కలంగా నిధులు వచ్చినప్పటికీ.. పరిస్థితులు చక్కబడి లిక్విడిటీ తగ్గిపోతే వర్ధమాన దేశాలకు నిధుల సమీకరణ వ్యయాలు పెరగవచ్చని సాక్షి బిజినెస్ బ్యూరోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మరిన్ని వివరాలు.. ► ప్రస్తుతం కనిష్ట స్థాయుల్లో ఉన్న వడ్డీ రేట్లు ఇక్కణ్నుంచి పెరిగే రిస్కులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు ఫండ్ మేనేజర్లు ఎలాంటి వ్యూహాలు పాటించే అవకాశం ఉంది? వడ్డీ రేట్లు పెరగడమనేది రిస్కుగా భావించడం లేదు. వడ్డీ రేట్లు తగ్గడం, పెరగడానికి సంబంధించిన వలయంలో ఇది కూడా ఒక భాగం. ఇక నుంచి పెరిగే అవకాశాలు ఉన్నందున ఇన్వెస్టర్లు తమ వ్యూహాలను అందుకు అనుగుణంగా మార్చుకుంటే సరిపోతుంది. రేట్లు తగ్గేటప్పుడు క్యాపిటల్ గెయిన్స్ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఫండ్ సంస్థలు అధిక మెచ్యూరిటీ వ్యవధి ఉన్న బాండ్లను, పెరిగే క్రమంలో మూలధన నష్టాలను తగ్గించుకునేందుకు తక్కువ మెచ్యూరిటీ వ్యవధి ఉండే బాండ్లను ఎంచుకుంటూ ఉంటాయి. మనీ మార్కెట్ సాధనాల్లో ఎక్కువ మొత్తాన్ని ఉంచడం తదితర మార్గాలు అనుసరిస్తుంటాయి. వీటితో పాటు ఇతరత్రా రిస్కులను తగ్గించుకునే సాధనాలను ఉపయోగించుకోవడం వల్ల రాబడులను కాపాడుకునే వీలుంటుంది. ► ఉద్దీపన ప్యాకేజీల ప్రభావం తగ్గే కొద్దీ రుణ సమీకరణ వ్యయాలు, ఎన్పీఏలు పెరిగే అవకాశముంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? సాధారణంగా కరోనా వైరస్ వంటి మహమ్మారులు దాడి చేసినప్పుడు ఎకానమీలోని వివిధ రంగాలపై వివిధ స్థాయిల్లో ప్రతికూల ప్రభావాలు పడుతూ ఉంటుంది. ఇవి కోలుకోవడమనేది నెమ్మదిగానే జరుగుతుంది. కరోనా వైరస్ దెబ్బకు ఎకానమీ పూర్తిగా కుదేలు కాకుండా చూడటంతో పాటు సజావుగా వృద్ధి బాట పట్టేందుకు కూడా ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు సరైన నిర్ణయాలే తీసుకున్నాయని చెప్పవచ్చు. ఆర్థిక వ్యవస్థను వృద్ధి బాట పట్టించే క్రమంలో భారీ ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ తగినంత స్థాయిలో నిధుల లభ్యత ఉండేలా చూడటంపై దృష్టి పెడుతున్నాయి. ► ఫిక్స్డ్ ఇన్‌కం సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఇన్వెస్టర్లు ఎంచుకోవాల్సిన వ్యూహాలేమిటి? వడ్డీ రేట్ల తీరు మారే కొద్దీ పోర్ట్‌ఫోలియోను రిస్కుల నుంచి సురక్షితంగా ఉంచేందుకు ఫండ్ మేనేజర్లు అమలు చేసే వ్యూహాలతో మధ్యమధ్యలో హెచ్చుతగ్గులు చోటు చేసుకోవడం, ఆశించిన స్థాయిలో పనితీరు కనపడకపోవడం వంటి పరిణామాలు కనిపించవచ్చు. ప్రస్తుత ఇన్వెస్టర్లు .. కొత్త పరిణామాల గురించి పూర్తిగా అవగాహన ఉన్న పక్షంలో తమ పెట్టుబడుల విషయంలో తగు మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. లేదా ఫండ్ మేనేజర్‌కే వదిలేయడం శ్రేయస్కరం. కొత్త ఇన్వెస్టర్లయితే తాము ఎంచుకునే ఫండ్‌కి రిస్కు పరిధులు ఏమిటి, వాటిని ఎదుర్కొనడంలో ఫండ్ ఎంత క్రమశిక్షణతో వ్యవహరిస్తోంది, పెట్టుబడుల్లో ఆటుపోట్లను ఎలా తట్టుకోగలుగుతోంది వంటి అంశాలను పరిశీలించాలి. రిస్కు పరిధులను ఫండ్ అతిక్రమించనంతవరకూ అంచనాలకు దరిదాపుల్లోనే రాబడులు ఉండగలవు. ► దేశీ ఫిక్స్డ్ ఇన్‌కం మార్కెట్లపై ప్రభావం చూపే అంతర్జాతీయ అంశాలేమిటి? వృద్ధి పుంజుకుంటుందన్న ఆశలను సజీవంగా ఉంచడానికి లిక్విడిటీ (నిధుల లభ్యత) అనేది చాలా ముఖ్యమైనది. ప్రపంచ దేశాల బ్యాంకులు నిధులను పుష్కలంగా అందుబాటులో ఉంచాయి. దేశీయంగాను ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు ఈ కష్టకాలంలో ఎకానమీని గట్టెక్కించడంలో తగిన చర్యలు తీసుకున్నాయి. దీనితో మన దేశానికి భారీగా నిధులు తరలివచ్చాయి. ఇక వృద్ధి నిలకడగా పుంజుకుని, అమెరికాతో పాటు ఇతర దేశాల సెంట్రల్ బ్యాంకుల చర్యల కారణంగా నిధుల లభ్యత తగ్గడం మొదలవుతుందో సంపన్న దేశాల మార్కెట్లలో బాండ్ ఈల్డ్‌లు పెరగడం ప్రారంభమవుతుంది. దీంతో వర్ధమాన దేశాల నుంచి నిధులు క్రమంగా సంపన్న మార్కెట్ల వైపు మళ్లే అవకాశం ఉంది. ఫలితంగా భారత్ వంటి వర్ధమాన దేశాల నిధుల సమీకరణ వ్యయాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. -
డిపాజిట్లపై హెచ్డీఎఫ్సీ శుభవార్త
సాక్షి, ముంబై: భారతదేశంలో ప్రముఖ గృహ రుణ సంస్థల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ వివిధ కాలపరిమితుల స్థిర డిపాజిట్ పథకాలపై 25 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) వరకూ వడ్డీరేటు పెంచింది. మార్చి 30వ తేదీ నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయని పేర్కొంది. పలు బ్యాంకులు తమ స్థిర డిపాజిట్లపై వడ్డీని తగ్గిస్తున్న నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. హెచ్డీఎఫ్సీ వెబ్సైట్ తెలుపుతున్న సమాచారం ప్రకారం, ప్రత్యేక స్థిర డిపాజిట్ విషయానికి వస్తే, రూ. 2 కోట్ల వరకూ 33 నెలల పాటు డిపాజిట్ చేస్తే 6.20 శాతం వార్షిక వడ్డీ అందుతుంది. 66 నెలల మెచ్యూరిటీ విషయంలో 6.60% వడ్డీ అమలవుతుంది. 99 నెలల స్థిర డిపాజిట్లపై 6.65 శాతం వడ్డీ అందుతుంది. -
సెన్సెక్స్ తక్షణ నిరోధశ్రేణి 39,120–39,270
వెల్లువలా వచ్చిపడుతున్న విదేశీ ఇన్వెస్టర్ల నిధుల కారణంగా వారం రోజుల క్రితమే సెన్సెక్స్ కొత్త రికార్డును నెలకొల్పగా, గతవారం నిఫ్టీ కూడా అదే ఫీట్‌ను సాధించింది. కేవలం నెలరోజుల్లో భారత్ సూచీలు 10 శాతం ర్యాలీ జరపడం విశేషం. ఈ ట్రెండ్ భారత్‌కే పరిమితం కాలేదు. దాదాపు ఇదేస్థాయిలో అమెరికా, జర్మనీ సూచీలు సైతం పెరిగాయి. ఆసియాలో హాంకాంగ్, చైనా ఇండెక్స్‌లు కూడా 5 శాతంపైగానే జంప్‌చేశాయి. అమెరికా కేంద్రబ్యాంక్ ఫెడరల్ రిజర్వ్...వడ్డీ రేట్లపెంపునకు, బాండ్ల కొనుగోళ్ల కార్యక్రమానికి స్వస్తిచెప్పడం... ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీల ర్యాలీకి కారణం కావొచ్చు. కానీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ త్వరలో ప్రారంభం కానుండడం, కార్పొరేట్ క్యూ4 ఫలితాలు వెల్లడి కానుండడం వంటి అంశాల నేపథ్యంలో భారత మార్కెట్ మరింత ముందుకు వెళ్లగలుగుతుందా లేదా అన్న సంశయం ప్రస్తుతం విశ్లేషకుల్లో నెలకొని ఉంది. ఇక మన సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే... సెన్సెక్స్ సాంకేతికాలు... ఏప్రిల్ 5తో ముగిసిన వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 39,270 పాయింట్ల వద్ద మరో కొత్త రికార్డుస్థాయిని నమోదుచేసిన అనంతరం చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 190 పాయింట్లు పెరిగి 38,862 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్ పెరిగితే తొలుత 39,120–39,270 పాయింట్ల శ్రేణి నిరోధించవచ్చు. అటుపైన ముగిస్తే వేగంగా 39,500 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని సైతం అధిగమిస్తే క్రమేపీ 39,850 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగే ఛాన్స్ వుంది. ఈ వారం తొలి నిరోధశ్రేణిని దాటలేకపోతే 38,700 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే వేగంగా 38,580 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే 38,150 పాయింట్ల వరకు తగ్గొచ్చు. నిఫ్టీ అవరోధశ్రేణి 11,730–11,760 ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,761 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పినప్పటికీ, ఆ స్థాయి వద్ద జరిగిన భారీ లాభాల స్వీకరణ కారణంగా 11,559 పాయింట్ల స్థాయికి తగ్గింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 43 పాయింట్ల లాభంతో 11,666 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్ అప్‌ట్రెండ్ కొనసాగితే తొలుత 11,730–760 పాయింట్ల శ్రేణి నిరోధించవచ్చు. డబుల్టాప్గా పరిణమించిన ఈ శ్రేణిని దాటితేనే తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది. ఆ సందర్బంలో వేగంగా 11,810 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని కూడా ఛేదిస్తే క్రమేపీ 11,890 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఈ వారం తొలి అవరోధశ్రేణిని దాటలేకపోతే 11,610 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 11,560 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ స్థాయిని ముగింపులో వదులుకుంటే 11,450 పాయింట్ల వరకు క్షీణించొచ్చు. -
37,700 మద్దతు కోల్పోతే డౌన్‌ట్రెండ్
ప్రపంచ మార్కెట్లను అనుసరిస్తూ భారత్ మార్కెట్‌సైతం కదంతొక్కుతున్న సమయంలోనే... వడ్డీ రేట్ల పెంపుదలను, బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి నిధుల ఉపసంహరణ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు అనూహ్యంగా అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ చేసిన పాలసీ ప్రకటన ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించింది. అలాగే అమెరికా వృద్ధి రేటు అంచనాల్ని కూడా ఫెడ్ తగ్గించింది. ఇప్పటికే యూరప్, చైనా, జపాన్ల వృద్ధి రేటు అంచనాల్లో కోతపడగా, అమెరికా కూడా ఈ బాటలోకి రావడంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ ట్రెండ్ కొద్దిరోజులపాటు కొనసాగవచ్చన్న అంచనాల్ని తాజాగా విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇక మన సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే, సెన్సెక్స్ సాంకేతికాలు... మార్చి 22తో ముగిసిన వారం చివరిరోజైన శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన రెండో నిరోధం సమీపస్థాయి అయిన 38,565 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన తర్వాత హఠాత్తుగా అమ్మకాలు వెల్లువెత్తడంతో వారం మొత్తంమీద ఆర్జించిన లాభాల్లో చాలావరకూ కోల్పోయింది. చివరకు అంతక్రితంవారంకంటే 141 పాయింట్ల స్వల్పలాభంతో 38,165 పాయింట్ల వద్ద ముగిసింది. శుక్రవారం అమెరికా సూచీలు భారీ పతనాన్ని చవిచూసిన నేపథ్యంలో ఈ సోమవారం గ్యాప్‌డౌన్‌తో మార్కెట్ ప్రారంభమైతే సెన్సెక్స్‌కు 37,700 పాయింట్ల సమీపంలో కీలక మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే డౌన్‌ట్రెండ్ వేగవంతమై 37,480 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ స్థాయిని సైతం కోల్పోతే 37,230 వద్దకు క్షీణించవచ్చు. ఈ వారం తొలి మద్దతును పరిరక్షించుకోగలిగితే తొలుత 38,320 వద్దకు పెరగవచ్చు. అటుపైన 38,730 పాయింట్ల వరకూ పరుగు కొనసాగవచ్చు. నిఫ్టీ తక్షణ మద్దతు 10,345 గత వారం ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,572 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగిన తర్వాత చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 30 పాయింట్ల స్వల్పలాభంతో 11,457 వద్ద ముగిసింది. ప్రపంచ ప్రతికూల సంకేతాల కారణంగా ఈ సోమవారం గ్యాప్‌డౌన్‌తో మొదలైతే నిఫ్టీకి 10,345 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. వారంరోజుల క్రితం ఇదేస్థాయిని అధిగమించి, నిఫ్టీ మరో 200 పాయింట్లకుపైగా పెరిగినందున, ఈ వారం ఇదేస్థాయి కీలక మద్దతుగా పరిణమించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే వేగంగా 11,275 వరకూ క్షీణత కొనసాగవచ్చు. ఈ స్థాయి దిగువన 11,225 వద్దకు తగ్గవచ్చు. ఈ వారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకుంటే తొలుత 11,505 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. అటుపై క్రమేపీ తిరిగి 11,570 స్థాయిని చేరవచ్చు. ఆపై క్రమేపీ 11,630 వరకూ పెరగవచ్చు. -
ఉద్యోగులకు తీపికబురు
సాక్షి, న్యూఢిల్లీ : వేతన జీవులకు ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్ఓ) తీపికబురు అందించింది. ఈపీఎఫ్ఓ సబ్‌స్ర్కైబర్ల పీఎఫ్ ఖాతాలపై గత ఏడాది 8.55 శాతంగా ఉన్న వడ్డీరేటును 2018-19లో 8.65 శాతంగా నిర్ణయించింది. ఈపీఎఫ్ఓ నిర్ణయంతో ఆరు కోట్ల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుందని కార్మిక మంత్రి సంతోష్ గంగ్వర్ తెలిపారు. పీఎఫ్‌పై వడ్డీరేటు పెంపును ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులందరూ ఆమోదించారని చెప్పారు.బోర్డు నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదం కొరకు పంపుతామని వెల్లడించారు. 2017-18లో పీఎఫ్‌పై వడ్డీ ఐదేళ్ల కనిష్టస్ధాయిలో 8.55 శాతం కాగా, 2016-17లో 8.65 శాతంగా ఉంది. 2015-16లో పీఎఫ్‌పై వడ్డీ రేటు 8.8 శాతం కావడం గమనార్హం. మరోవైపు 2013-14లో పీఎఫ్ వడ్డీరేటును ఈపీఎఫ్ఓ 8.75 శాతంగా నిర్ణయించింది. -
కీలక అవరోధశ్రేణి 36,285–36,560
ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చే ప్రకటన గత శుక్రవారం వెలువడింది. ఆర్థిక ఉద్దీపన ఉపసంహరణ, వడ్డీ రేట్ల పెంపు అంశాల్లో మార్కెట్ల భయాందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని, తమ పాలసీ ఫైనాన్షియల్ మార్కెట్లకు ఇబ్బందిగా పరిణమిస్తున్నదని భావిస్తే పాలసీని సమీక్షిస్తామంటూ అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పొవెల్ చేసిన ప్రకటనతో అమెరికా, యూరప్ మార్కెట్లు పెద్ద ర్యాలీ జరిపాయి. ఈ బాటలోనే ఆసియా ఇండెక్స్ ఫ్యూచర్లు భారీగా పెరిగాయి. సంవత్సరాంతపు సెలవుల తర్వాత సాధారణంగా జనవరి రెండోవారం నుంచి మన మార్కెట్లో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహించే విదేశీ ఇన్వెస్టర్లు, ఫెడ్ తాజా ప్రకటనతో భారత్ మార్కెట్లో పెట్టుబడుల్ని పునర్ప్రారంభిస్తారా, అమ్మకాలకు తెరతీస్తారా అనే అంశం సమీప భవిష్యత్తులో మన మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశించగలదు. ఇక సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే... సెన్సెక్స్ సాంకేతికాలు... జనవరి 4తో ముగిసిన నాలుగురోజుల ట్రేడింగ్వారం ప్రధమార్థంలో 36,285 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్ ద్వితీయార్థంలో వేగంగా 35,382 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 382 పాయింట్ల నష్టంతో 35,695 పాయింట్ల వద్ద ముగిసింది. గత శుక్రవారం అమెరికా మార్కెట్ భారీ ర్యాలీ ఫలితంగా ఈ వారం గ్యాప్‌అప్‌తో మార్కెట్ మొదలైతే సెన్సెక్స్‌కు 36,235 పాయింట్ల వద్ద తక్షణఅవరోధం కలగవచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తే 36,285–36,560 పాయింట్ల నిరోధశ్రేణిని అధిగమించడం సెన్సెక్స్ భవిష్యత్ ట్రెండ్‌కు కీలకం. ఈ స్థాయిపైన ముగిస్తే క్రమేపీ 36,800–37,050 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఈ వారం పైన ప్రస్తావించిన కీలక నిరోధశ్రేణిని దాటలేకపోయినా, సోమవారం మార్కెట్ నిస్తేజంగా ప్రారంభమైనా 35,380 పాయింట్ల వద్ద సెన్సెక్స్‌కు తొలి మద్దతు లభిస్తున్నది. ఈ లోపున ముగిస్తే తిరిగి 35000 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ స్థాయిని సైతం కోల్పోతే క్రమేపీ 34,400 పాయింట్ల వరకూ పతనం కొనసాగవచ్చు. నిఫ్టీ కీలక నిరోధశ్రేణి 10925–10,985 గతవారం 10,924 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి 10,629 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గిన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 133 పాయింట్ల నష్టంతో 10,727 వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ గ్యాప్‌అప్‌తో మొదలైతే 10,895 పాయింట్ల వద్ద తక్షణ అవరోధం కలగవచ్చు. అటుపైన కీలక నిరోధ శ్రేణి 10925–10,985 పాయింట్లు. గత మూడువారాలుగా పలుదఫాలు ఈ శ్రేణి అవరోధాన్ని కల్గించినందున, ఈ శ్రేణిని దాటితేనే తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది. ఈ స్థాయిపైన స్థిరపడితే క్రమేపీ 11,035–11,150 శ్రేణి వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఈ వారం పైన సూచించిన కీలక నిరోధశ్రేణిని దాటలేకపోయినా, ఈ సోమవారం నిఫ్టీ బలహీనంగా ప్రారంభమైనా 10,630 వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన ముగిస్తే 10,535 స్థాయిని తిరిగి పరీక్షించవచ్చు. అటుపై కొద్దిరోజుల్లో 10,330 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగే ప్రమాదం ఉంటుంది. -
ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : ఈపీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్. రానున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాల వడ్డీరేటును పెంపునకు కేంద్ర సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ వార్షిక అంతర్గత రివ్యూలో భాగంగా ఈ వడ్డీరేటు పెంచాలని భావిస్తున్నట్టు సమాచారం. 2018-19కు గాను వడ్డీమ రేటును 8.55 శాతంనుంచి పెంచేందుకు యోచిస్తోందట. దీంతో 6 కోట్ల మంది ఈపీఎఫ్ చందాదారులు లబ్ధిపొందనున్నారు. జనవరి మాసాంతంలో జరిగే సెంట్రల్ బోర్డ్ మీటింగ్‌లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 1న జారీ చేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడు ప్రభాకర్ బనసూర్ వడ్డీరేటు పెంపునకు ఎక్కువ అవకాశం ఉందంటూ ధృవీకరించారు. మరో సభ్యుడు వ్యాఖ్యానిస్తూమ వాస్తవానికి డిసెంబర్ నెలలో ఈపీఎఫ్ వడ్డీరేటును ప్రకటించాల్సి ఉన్నప్పటికీ అకౌంట్ల ఆడిటింగ్ ఇంకా కొనసాగుతున్న కారణంగా ఆలస్యమైందన్నారు. కాగా 2017-18 ఏడాదికి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ ఖాతాలపై వడ్డీరేటు 8.55శాతంగా ఉంది. ఇది అయిదేళ్ల కనిష్టం. -
వచ్చే ఏడాదీ వడ్డీరేట్లు పైపైకే!
న్యూఢిల్లీ: భారత్‌లో వచ్చే ఏడాదీ వడ్డీరేట్ల పెంపు కొనసాగుతుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ మంగళవారం పేర్కొంది. దేశం 2019లో వృద్ధి బాటనే పయనించినా, ఆర్థికంగా కొంత క్లిష్టపరిస్థితులను ఎదుర్కొనక తప్పదని విశ్లేషించింది. కఠిన ఆర్థిక ద్రవ్య విధానాల బాటన దేశం కొనసాగుతుందని పేర్కొన్న మూడీస్, రాజకీయ ఇబ్బదులు, ఆర్థిక, ద్రవ్య సంస్కరణలపై అనిశ్చితి నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న సార్వత్రిక ఎన్నికలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. ‘2018–19 ఆర్థిక సంవత్సరం– అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితి’పై విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ♦ భారత్, ఇండోనేషియా వంటి వర్ధమాన దేశాలకు దేశీయ, అంతర్జాతీయ సవాళ్లు ఉన్నాయి. అయితే సమీప భవిష్యత్తులో భారత్, ఇండోనేషియాలు వృద్ధి బాటనే కొనసాగుతాయి. ఇక భారత్, ఇండోనేషియా, టర్కీ, అర్జెంటీనా వంటి దేశాల్లో వడ్డీరేట్ల పెంపు విధానాలు కొనసాగుతాయి. ♦ క్రూడ్ ధరల పెరుగుదల వంటి అంతర్జాతీయ ఒత్తిళ్లను అధిగమిస్తూ, 2018, 2019ల్లో భారత ఆర్థిక వృద్ధి దాదాపు 7.5 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. జనవరి–మార్చి త్రైమాసికంలో 7.7 శాతం వృద్ధి సాధించిన భారత్ ఆర్థిక వ్యవస్థ, ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రెండేళ్ల గరిష్టస్థాయి 8.2 శాతం స్థాయిని చూసింది. ♦ 2019లో ‘గ్లోబల్ సావరిన్ క్రెడిట్వర్తీనెస్’ అవుట్‌లుక్ ‘స్థిరం’గా ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దేశీయ పరిస్థితులు బాగుండకపోవడం, బౌగోళిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, అంతర్జాతీయ వృద్ధి కొనసాగుతున్న ప్రయోజనం వల్ల ‘సమతౌల్యత’ పాటిస్తూ, ‘స్థిర’ అవుట్‌లుక్ ఇవ్వడం జరిగింది. ♦ దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై అనిశ్చితి ఉంది. అలాగే వృద్ధి మందగమనంలోనే కొనసాగే వీలుంది. ♦ జీ–20 దేశాల వృద్ధి 2018లో 3.3 శాతం ఉంటే, 2019లో 2.9 శాతంగానే నమోదవచ్చు. ఈ దేశాల్లో ప్రత్యేకించి అభివృద్ధి చెందిన దేశాల వృద్ధి ఇదే కాలంలో 5 శాతం నుంచి 4.6 శాతానికి తగ్గుతుంది. ♦ అధిక రుణం, వృద్ధి తగ్గడం, వడ్డీరేట్ల పెంపు వంటి అంశాలు అంతర్జాతీయ ద్రవ్య పరిస్థితులకు ఇబ్బందులు సృష్టిస్తాయి. అమెరికా వాణిజ్య రక్షణవాదం కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన అంశం. -
జీపీఎఫ్ వడ్డీరేటు 0.4 శాతం పెంపు
న్యూఢిల్లీ: జనరల్ ప్రావిడెండ్ ఫండ్ (జీపీఎఫ్), సంబంధిత ఇతర స్కీమ్‌ల వడ్డీరేటును అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి ప్రభుత్వం 40 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెంచింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) రేటుకు అనుగుణంగా ఈ రేట్లలో మార్పు చేసినట్లు ఆర్థిక వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పెంపు నిర్ణయంతో జీపీఎఫ్‌పై వడ్డీరేటు 7.6 శాతం (జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో) నుంచి 8 శాతానికి ఎగసింది. ప్రావిడెంట్ ఫండ్స్‌పై వడ్డీరేటు పెంపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రైల్వేలు, డిఫెన్స్ దళాలకు వర్తిస్తుంది. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి ఎన్ఎస్సీ, పీపీఎఫ్‌సహా పొదుపు పథకాలపై వడ్డీరేటును గత నెల్లో ప్రభుత్వం 0.4 శాతం పెంచిన సంగతి తెలిసిందే. బ్యాంకుల్లో పెరిగిన డిపాజిట్ రేట్లకు అనుగుణంగా ఈ రేట్లు పెరిగాయి. -
శుభవార్త చెప్పిన ఎస్బీఐ
న్యూఢిల్లీ : ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లపై ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై అందించే వడ్డీరేట్లను 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ కొత్త రేట్లు నేటి(జూన్ 30) నుంచి అమల్లోకి రానున్నట్టు పేర్కొంది. జనరల్, సీనియర్ సిటజన్ల కేటగిరీలు రెండింట్లోనూ వివిధ మొత్తాలు, డిపాజిట్ కాల వ్యవధులను బట్టి వడ్డీరేట్లను పెంచుతున్నట్టు తెలిపింది. కోటి కంటే తక్కువ ఉన్న రిటైల్ డిపాజిట్లు ఏడాది నుంచి పదేళ్ల కాల వ్యవధిలో ఉన్న వాటికి ఈ కొత్త రేట్లు అమలు కానున్నాయి. సమీక్షించిన రేటు విధానం ప్రకారం.. ఏడాది నుంచి రెండేళ్ల వరకు ఉన్న డిపాజిట్లపై వడ్డీరేట్లు 6.65 శాతం నుంచి 6.7 శాతానికి పెరిగాయి. సీనియర్ సిటిజన్లకు కొత్త రేటు 7.2 శాతంగా నిర్ణయించారు. రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు ఉన్న డిపాజిట్లకు వడ్డీరేట్లు 7.15 శాతం నుంచి 7.3 శాతం పెంచింది. ప్రతిపాదించిన ఈ వడ్డీరేట్లు కొత్త డిపాజిట్లకు, రెన్యువల్ చేసుకునే డిపాజిట్లకు వర్తించనున్నాయి. ఆర్బీఐ ద్వైపాక్షిక ద్రవ్య విధాన పరపతి సమీక్ష మరో మూడు రోజుల్లో ప్రకటించనున్న నేపథ్యంలో ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీరేట్లను సమీక్షించింది. మూడు రోజుల పాటు భేటీ కానున్న ద్రవ్య విధాన పరపతి కమిటీ సమావేశం నేటి నుంచి ప్రారంభమైంది. ఆగస్టు 1న ఈ పాలసీ ప్రకటన ఉండనుంది. గత జూన్ సమీక్షలో ఆర్బీఐ రేట్లను 0.25 శాతం పెంచిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణ భయాలతో వడ్డీరేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. అయితే ఈ సారి ఆర్బీఐ స్టేటస్ క్వోను పాటించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. -
వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులు
న్యూఢిల్లీ: గృహ, వాహన రుణాలను భారం చేస్తూ ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకులు.. రుణాలపై వడ్డీ రేట్లను (ఎంసీఎల్ఆర్) 0.1 శాతం దాకా పెంచాయి. రేట్లు పెంచిన వాటిల్లో ప్రభుత్వ రంగ దిగ్గజాలు ఎస్బీఐ, పీఎన్బీతో పాటు ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ ఉన్నాయి. కొత్త రేట్లు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. మూడేళ్ల దాకా కాలవ్యవధికి సంబంధించిన ఎంసీఎల్ఆర్ను ఎస్బీఐ 10 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ శ్రేణి 7.9 శాతం–8.45 శాతానికి చేరింది. మరోవైపు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మూడేళ్ల ఎంసీఎల్ఆర్ను 8.55 శాతానికి, అయిదేళ్ల దాన్ని 8.7 శాతానికి పెంచింది. బేస్ రేటును కూడా 9.15 శాతం నుంచి 9.25 శాతానికి మార్చింది. ఇక, ప్రైవేట్ రంగంలో రెండో అతి పెద్ద బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ కూడా అయిదేళ్ల కాలావధి ఎంసీఎల్ఆర్ను 10 బేసిస్ పాయింట్లు పెంచి 8.70 శాతానికి సవరించింది. ఏడాది, మూడేళ్ల వ్యవధి ఎంసీఎల్ఆర్ను కూడా 0.1 శాతం పెంచింది. అయితే, మూడు నెలల వ్యవధి రుణాలపై వడ్డీ రేటు మాత్రం యధాతథంగా ఉంటుంది. -
వడ్డీరేట్లు పెంచిన హెచ్డీఎఫ్సీ
ముంబై: హెచ్డీఎఫ్సీ వడ్డీరేట్లను 0.20 శాతం వరకూ పెంచింది. రుణ మొత్తాలను బట్టి రుణాలపై వడ్డీరేట్లను 0.05 శాతం నుంచి 0.20 శాతం వరకూ పెంచుతున్నట్లు హెచ్డీఎఫ్సీ తెలిపింది. ఈ రేట్ల పెంపు ఈ నెల 1 నుంచే అమల్లోకి వచ్చిందని పేర్కొంది. మహిళలు తీసుకున్న రూ.30 లక్షల లోపు రుణాలపై రేట్లు ఇక నుంచి 8.40 శాతంగా ఉంటాయని, ఇతరులకు 8.45 శాతమని తెలిపింది. రూ.30–75 లక్షల మధ్య రుణాలకు మహిళలకైతే 8.55 శాతమని, ఇతరులకైతే 8.60 శాతమని పేర్కొంది. రూ.75 లక్షలు మించిన రుణాలకు మహిళలకు 8.65 శాతమని, ఇతరులకు 8.70 శాతమని వివరించింది. -
డిపాజిట్లపై వడ్డీరేటు పెంపు
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది. రీటైల్ డిపాజిట్లపై 10 నుంచి 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీరేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం వెబ్సైట్లో ఒక ప్రకటన జారీ చేసింది. తాజా పెంపు ప్రకారం 7 నుంచి 45 రోజుల డిపాజిట్లపై వడ్డీరేటు 5.25 శాతం నుంచి 5.75 శాతానికి పెంచింది. వార్షిక వడ్డీ రేటు 6.40శాతంగా పేర్కొంది. ఇప్పటివరకు ఇది 6.25శాతం. 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 6.50శాతం వడ్డీని అందించనుంది. ఇప్పటివరకూ ఇది 6శాతం. అలాగే కోటి రూపాయలకు పైన డిపాజిట్లపై కూడా ఈ పెంపు వర్తింప చేయనుంది. సీనియర్ పౌరుల డిపాజిట్లపై 7శాతం వడ్డీ. అంతకు ముందు 6.50 శాతం. ఈ సవరించిన వడ్డీరేట్లు ఒత్త డిపాజిట్లకు , రెన్యూవల్ చేసుకునే డిపాజిట్లకు కూడా వర్తిస్తుందనిఎస్బీఐ తన నోటిఫికేషన్లో తెలిపింది. దీంతో రుణాలపై వడ్డీరేట్లను కూడా త్వరలోనే భారీగా పెంచనుందని నిపుణులు భావిస్తున్నారు. ఫిబ్రవరిలో రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ) తన పాలసీ రేట్లను వరుసగా మూడవ సారి కూడా యథాతథంగా ఉంచిన సంగతి తెలిసిందే. -
ఖాతాదారులకు పీఎన్బీ గుడ్‌న్యూస్
సాక్షి,న్యూఢిల్లీ: నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్న వేళ ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులకు తీపికబురు అందించింది. రూ 10 కోట్ల వరకూ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 1.25 శాతం మేర పెంచింది. పెరిగిన వడ్డీ రేట్లు 2018, జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. రూ కోటి వరకూ స్వల్పకాలిక డిపాజిట్లపై ప్రస్తుతం నాలుగు శాతంగా ఉన్న వడ్డీరేటును 5.25 శాతానికి పెంచింది. 91 నుంచి 179 రోజుల మెచ్యూరిటీ గల డిపాజిట్లపై వడ్డీ రేటును ప్రస్తుత 6 శాతం నుంచి 6.25 శాతానికి పెంచింది. ఏడాది వ్యవధి కలిగిన బల్క్ టర్మ్ డిపాజిట్లపై 5 శాతంగా ఉన్న వడ్డీని 5.7 శాతానికి పెంచింది. మూడునుంచి పదేళ్ల వ్యవధి గల డిపాజిట్లపై వడ్డీరేటును 5 నుంచి 5.25 శాతానికి పెంచింది. -
ఫెడ్ మళ్లీ వడ్డించింది
వాషింగ్టన్: అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజా పరపతి సమీక్షలో పావు శాతం (25బేసిస్పాయింట్లు) వడ్డీ రేటును పెంచింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 1.25-1.5 శాతానికి చేరాయి. దీంతో ఈ ఏడాది మూడోసారి ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) వడ్డీ రేట్లను పెంచింది. తక్కువ పన్నులతో వినియోగదారుల వ్యయం, వ్యాపార పెట్టుబడుల పెరుగుదలతో వచ్చే ఏడాదికి 2.5 శాతం వృద్ధిని అంచనా వేసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్ట వృద్ధిబాటన సాగుతోందనీ, ఈ క్రమంలో దేశ జీడీపీ 2.5 శాతం స్థాయిలో పురోగమించనుందని ఫెడ్ అభిప్రాయపడింది. ఇక ద్రవ్యోల్బణం మాత్రం 2 శాతం దిగువనే కదలనున్నట్లు అంచనా వేసింది. ఇప్పటికీ ఆర్థిక వ్యవస్థ మరో రేటు పెంపునకు తగినంత బలంగా ఉందన్న ఫెడ్ చైర్‌పర్శన్ జానెట్ యెలెన్ ఏడాది మరింత అధికంగా రేట్ల పెంపు ఫెడ్ సంకేతాలిచ్చారు. అలాగే ఫిబ్రవరి 3 న తన పదవీ విరమణ ముందు తదుపరి అధ్యక్షుడు జెరోమ్ పావెల్‌కు మృదువైన పరివర్తనను అందించేందుకు సాధ్యమైనంతవరకు కృషి చేశానని చెప్పారు. మరోవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన అమెరికా పటిష్ట వృద్ధిని సాధించనుందన్న ఫెడ్ తాజా అంచనాలు ప్రపంచ స్టాక్ మార్కెట్లకు జోష్ నివ్వనుందని మార్కెట్ పండితులు విశ్లేషించారు. -
పసిడి... ఫెడ్ వైపు చూపు...
* వరుసగా మూడవ వారమూ లాభాలే... * రూ.40,000 పైకి వెండి న్యూయార్క్/ముంబై: అంతర్జాతీయ ట్రెండ్, దేశీయంగా పెళ్ళిళ్ల డిమాండ్ కారణంగా కొద్దిరోజుల నుంచి పెరుగుతూ వస్తున్న పుత్తడి ధరపై సమీప భవిష్యత్తులో అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ నిర్ణయ ప్రభావం వుంటుందని బులియన్ ట్రేడర్లు అంచనావేస్తున్నారు. ఈ మంగళ, బుధవారాల్లో జరగబోయే ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో వడ్డీ రేట్ల పెంపు అంశంపై నిర్ణయం వెలువడుతుంది. ఫెడ్ నిర్ణయం లేదా వ్యాఖ్యానాలకు అనుగుణంగా పుత్తడి ధర బాగా పెరగడం లేదా లాభాల స్వీకరణకు గురై తగ్గడం జరగవచ్చని ట్రేడర్లు భావిస్తున్నారు. ప్రస్తుతం భారత్‌లో పెళ్లిళ్లు, పండుగల సీజన్‌ను ఈ సందర్భంగా స్టాకిస్టులు, ఆభరణ వర్తకుల నుంచి భారీ డిమాండ్ నెలకొంది. భారత్‌లో నెలకొన్న డిమాండ్ ఫలితంగా సమీప కాలంలో పసిడి ధరలో స్వల్ప ఒడుదుడుకులున్నా, అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ నెమైక్స్‌లో ఔన్స్ (31.1గ్రా)కు 1,200 డాలర్ల దిగువకు మాత్రం పడిపోయే పరిస్థితి లేదన్నది వారి వాదన. దేశీయంగా పసిడి వరుసగా మూడవ వారమూ లాభాల బాటన పయనించింది. ముంబై ప్రధాన బులియన్ మార్కెట్లో 99.9 ప్యూరిటీ 10 గ్రాముల ధర రూ.295 లాభపడి, రూ. 29,505 వద్ద ముగిసింది. ఇక 99.5 ప్యూరిటీ ధర సైతం ఇదే స్థాయిలో ఎగసి రూ. 29,355 వద్ద వద్ద ముగిసింది. ఇక వెండి విషయానికి వస్తే... కేజీకి భారీగా రూ. 2,425 లాభపడి (6శాతం పైగా) రూ.40,800 వద్దకు పెరిగింది. వరుసగా మూడు వారాల నుంచీ భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి, గడచిన వారం ఏకంగా ఏడాదిన్నర గరిష్ట స్థాయికి ఎగయడం గమనార్హం. నెమైక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న ఔన్స్ జూన్ డెలివరీ ధర వారంవారీగా దాదాపు నిశ్చలంగా 1,230 డాలర్ల వద్ద ముగిసింది. వెండి 15 డాలర్లు-16 డాలర్ల శ్రేణిలో తిరుగుతోంది. -
దేశంలో పసిడికి సీజనల్ డిమాండ్: నిపుణులు
ముంబై: దేశీయంగా ఉన్న డిమాండ్ సమీప కాలంలో పసిడి ధరలకు పటిష్టత చేకూర్చుతుందని నిపుణులు భావిస్తున్నారు. పెళ్లిళ్లు, పండుగల సీజన్‌ను ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు.. ఈ నేపథ్యంలో వడ్డీరేట్ల పెంపునకు సంబంధించి అమెరికా ఫెడ్ రిజర్వ్ ఇప్పట్లో నిర్ణయం తీసుకోబోదన్న అంచనా సైతం పసిడికి సమీప కాలం లో బలం చేకూర్చుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్వల్ప స్థాయిలో ఒడిదుడుకులు ఉన్నా... సమీప కాలంలో పసిడి అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ నెమైక్స్‌లో ఔన్స్ (31.1గ్రా)కు 1,150 డాలర్ల దిగువకు మాత్రం పడిపోయే పరిస్థితి లేదన్నది వారి వాదన. కాగా దేశీయంగా పసిడి వరుసగా రెండవ వారమూ లాభాల బాటన పయనించింది. ముంబై ప్రధాన బులియన్ మార్కెట్లో 99.5 ప్యూరిటీ 10 గ్రాముల ధర వారీ వారీగా రూ.325 లాభపడి రూ.29,060 వద్ద ముగిసింది. 99.9 ప్యూరి టీ ధర సైతం ఇదే స్థాయిలో ఎగసి రూ. 29,210 వద్ద ముగిసింది. ఇక వెండి విషయానికి వస్తే... కేజీకి భారీగా రూ. 1,755 లాభపడి రూ.38,375 వద్దకు పెరిగింది. ఇక నెమైక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న ఔన్స్ జూన్ డెలివరీ ధర వారంవారీగా 9 డాలర్లు తగ్గి 1,234 డాలర్ల వద్ద ముగిసింది. వెండి 15 డాలర్లు-16 డాలర్ల శ్రేణిలో తిరుగుతోంది. -
బిహార్ ఎఫెక్ట్.. నేడు గ్యాప్‌డౌన్!
న్యూఢిల్లీ: బిహార్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘోర పరాజయాన్ని చవిచూడటం... దేశీ స్టాక్ మార్కెట్లకు షాక్ ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాజా పరిణామంతో నేడు(సోమవారం) మార్కెట్ గ్యాప్‌డౌన్‌తో ఆరంభం కావచ్చని.. తదుపరి తీవ్ర ఒడిదుడుకులు ఉండొచ్చని వారు చెబుతున్నారు. రాజకీయంగా అత్యంత కీలకమైన రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు ఎన్డీఏకు ప్రతికూలంగా వెలువడటం పాటు కార్పొరేట్ ఫలితాలు చివరిదశకు చేరడం కూడా ఈ వారం మార్కెట్లపై ప్రభావం చూపనున్నట్లు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని మహా కూటమి బిహార్‌లో భారీ ఆధిక్యంతో అధికారాన్ని కైవసం చేసుకోవడంతో ఎన్డీఏ సంస్కరణల అంజెండాకు అడ్డంకులు తప్పకపోవచ్చని సెంట్రమ్ బ్రోకింగ్ సీఈఓ కె. సందీప్ నాయక్ పేర్కొన్నారు. ముఖ్యంగా రాజ్యసభలో మోదీ సర్కారుకు తగినంత మెజారిటీ లేకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. ‘బిహార్ ఫలితాల అనిశ్చితి తొలగిపోయింది గనుక ఇన్వెస్టర్లు ఇక దేశీ అంశాలపై దృష్టిసారిస్తారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వంటి పెండింగ్‌లో ఉన్న కీలక బిల్లులపై ఎలాంటి పురోగతి ఉంటుందనేది వేచిచూడాల్సి ఉంది. ఈ విషయంలో ప్రతిపక్షాలను మోదీ సర్కారు కొంత శాంతింపజేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. బిహార్ ఫలితాలు సోమవారం మార్కెట్లను కుదిపేసే అవకాశం ఉంది. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకొన్ని కొంత స్థిరీకరణ జరగవచ్చు’ అని నాయక్ వ్యాఖ్యానించారు. కాగా, దీపావళి, బాలిప్రతిపదలను పురస్కరించుకొని బుధ, గురు వారాల్లో మార్కెట్లకు సెలవు ప్రకటించారు. అయితే, బుధవారం సాయంత్రం గంటన్నరపాటు ముహూరత్ ట్రేడింగ్ మాత్రం జరుగుతుంది. అమెరికా వడ్డీరేట్ల పెంపు భయం... అమెరికాలో అక్టోబర్ నెల ఉద్యోగ గణాంకాలు అంచనాలను మించడంతో అక్కడ వడ్డీరేట్ల పెంపు ఇక తప్పకపోవచ్చన్న అంచనాలు బలపడుతున్నాయి. ఉద్యోగాలు భారీగా పుంజుకోవడం, ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడుతున్న సంకేతాల నేపథ్యంలో డిసెంబర్ సమీక్షలో దశాబ్దకాలం తర్వాత ఫెడ్ తొలిసారి రేట్లను పెంచుతుందన వాదనలు పెరిగాయి. ఈ వారం మన మార్కెట్లపై ఈ జాబ్స్ డేటా ప్రభావం కూడా ఉండొచ్చని నాయక్ అభిప్రాయపడ్డారు. బిహార్ ఎన్నికల ఫలితాలు, విదేశీ ఇన్వెస్టర్ల ధోరణి, డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు సమీప కాలానికి మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్ధేశించనున్నాయని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్‌కు చెంది వివేక్ గుప్తా పేర్కొన్నారు. ఈ వారం వెలువడనున్న స్థూల ఆర్థిక గణంకాలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేయనున్నట్లు ఆయన చెప్పారు. అక్టోబర్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం, సెప్టెంబర్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ నెల 12న వెలువడనున్నాయి. ఈ వారం టాటా పవర్, ఆర్ఈసీ, హెచ్‌పీసీఎల్, కోల్ ఇండియా. హిందాల్కో తదితర కంపెనీలు ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. గత వారం మార్కెట్... దేశీ మార్కెట్లు గత వారం కూడా నష్టాల్లోనే ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 392 పాయింట్లు దిగజారి 26,265 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 112 పాయింట్లు క్షీణతతో 7,954 వద్ద ముగిసింది. ఐదు రోజుల్లో రూ.4,300 కోట్లు వెనక్కి... న్యూఢిల్లీ: విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ)ను అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు భయాలు వెంటాడుతున్నాయి. ఈ నెలలో తొలి ఐదు ట్రేడింగ్ సెషన్లలోనే ఎఫ్‌పీఐలు ఏకంగా రూ.4,300 కోట్ల పెట్టుబడులను భారత్ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకోవడం దీనికి నిదర్శనం. డిసెంబర్లో ఫెడ్ వడ్డీరేట్లను పెంచుతుందన్న బలమైన అంచనాలకుతోడు, దేశీ కంపెనీల క్యూ2 ఫలితాలు కూడా అంతంతమాత్రంగానే ఉండటం ఎఫ్‌పీఐల తిరోగమనానికి కారణమని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. నవంబర్ 2-6 తేదీల మధ్య స్టాక్ మార్కెట్ల నుంచి నికరంగా రూ.2,667 కోట్లను, డెట్ మార్కెట్(బాండ్లు) నుంచి రూ.1,689 కోట్లను విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నట్లు సెబీ గణాంకాలు వెల్లడించాయి. కాగా, అక్టోబర్‌లో దేశీ మార్కెట్లో ఎఫ్‌పీఐల నికర పెట్టుబడులు ఏడు నెలల గరిష్టానికి (రూ. 22,350 కోట్లు) ఎగబాకిన సంగతి తెలిసిందే. ఇక చైనా ఆర్థిక మందగమనం ఆందోళనల కారణంగా ప్రపంచ మార్కెట్లు తీవ్ర కుదుపులకు గురవడంతో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్ నుంచి రూ.23,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటివరకూ చూస్తే దేశీ స్టాక్ మార్కెట్లో రూ.25,030 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.53,408 కోట్లను ఎఫ్‌పీఐలు నికరంగా ఇన్వెస్ట్ చేశారు. -
ఫెడ్ మినిట్స్‌తో లాభాలు
వడ్డీరేట్ల పెంపు విషయంలో తొందరపడకూడదని ఫెడ్ సమావేశ వివరాలు వెల్లడించడంతో ప్రపంచ మార్కెట్లతో పాటు మన స్టాక్ మార్కెట్ కూడా శుక్రవారం లాభాల్లో ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం 31 పైసలు పెరగడం కూడా సానుకూల ప్రభావం చూపింది. బీఎస్ఈ సెన్సెక్స్ 234 పాయింట్ల లాభంతో 27,080 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 8,190 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ వారంలో సెన్సెక్స్ 858 పాయింట్లు (3.3 శాతం), నిఫ్టీ 3% చొప్పున లాభపడ్డాయి. దూసుకుపోయిన వేదాంత.. కమోడిటీ కంపెనీ వేదాంత 11.6 శాతం ఎగసింది. సెన్సెక్స్ షేర్లలో అధికంగా లాభపడ్డ షేర్ ఇదే. అంతర్జాతీయ లోహ దిగ్గజం గ్లెన్‌కోర్ జింక్ ఉత్పత్తిని 5 శాతం వరకూ తగ్గించనున్నామని ప్రకటించడంతో ధరల పతనానికి అడ్డుకట్ట పడుతుందన్న అంచనాలతో లోహ షేర్లు పెరిగాయి. మార్కెట్ పరిస్థితులు ఒడిదుడుకులుగా ఉండటంతో జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌కు మూలధన, నిర్వహణ వ్యయాలు తగ్గించుకున్నామని వేదాంత రిసోర్సెస్ పేర్కొంది. ప్రభుత్వ రంగ సౌరశక్తి ప్రాజెక్టులకు బిడ్ చేయాలని నిర్ణయించడం కూడా ప్రభావం చూపింది. ఈ అంశాల కారణంగా వేదాంత షేర్ 11.6 శాతం వృద్ధి చెంది రూ. 104 వద్ద ముగిసింది. 30 సెన్సెక్స్ షేర్లలో 19 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఆర్థిక ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలతో(సోమవారం ఫలితాలు వెలువడతాయి) ఇన్ఫోసిస్ షేర్ 3 శాతం పెరిగింది. టాటా స్టీల్ 4 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 3 శాతం, ఓఎన్జీసీ, గెయిల్, హిందాల్కో, సిప్లా 2 శాతం చొప్పున, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, హీరో మోటొకార్ప్, హెచ్‌డీఎఫ్‌సీలు 1 శాతం చొప్పున పెరిగాయి. ఇక నష్టపోయిన షేర్ల విషయానికొస్తే, కోల్ ఇండియా 3 శాతం, మారుతీ సుజుకీ 2 శాతం, సన్ ఫార్మా 1 శాతం, భెల్ 1 శాతం చొప్పున తగ్గాయి. ముడి చమురు ధరలు పెరగడంతో పలు కంపెనీల ఆయిల్ షేర్లు 2.7 శాతం వరకూ నష్టపోయాయి. -
ఫెడ్.. లబ్‌డబ్!
- అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం, ద్రవ్యోల్బణం గణాంకాలతో ట్రెండ్ ముంబై: అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుపై తీసుకునే నిర్ణయం, కీలకమైన ద్రవ్యోల్బణం గణాంకాల ఆధారంగా ఈ వారం స్టాక్ మార్కెట్ ట్రెండ్ వుంటుందని విశ్లేషకులు చెప్పారు. అయితే మార్కెట్లో తుఫాను చెలరేగే ముందు, కాస్త ప్రశాంతత నెలకొంటుందని వారన్నారు. గత వారాంతంలో విడుదలైన పారిశ్రామికోత్పత్తి గణాంకాలు అంచనాలకంటే మించినందున, ఈ సోమవారం మార్కెట్ పాజిటివ్‌గా మొద లుకావొచ్చని వారు అంచనావేశారు. జూలై పారిశ్రామికోత్పత్తి 4.2 శాతం వృద్ధి చెందినట్లు (అంచనా వృద్ధి 3.6 శాతం) గత శుక్రవారం నాటి డేటా వెల్లడించిందని, దీంతో మార్కెట్ సోమవారం సానుకూలంగా వుండవచ్చని ఏంజిల్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ వైభవ్ అగర్వాల్ అన్నారు. అదే రోజున వెలువడే రిటైల్, టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు తదుపరి మార్కెట్ దిశను నిర్దేశించవచ్చన్నారు. సెప్టెంబర్ 29వ తేదీనాటి రిజర్వుబ్యాంక్ పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయానికి ఈ ద్రవ్యోల్బణం డేటాను పరిగణనలోకి తీసుకుంటారని జియోజిత్ బీఎన్పీ పారిబాస్ టెక్నికల్ కో-హెడ్ ఆనంద్ జేమ్స్ తెలిపారు. సెప్టెంబర్ 17 వైపు చూపు... దేశీయంగా వెలువడిన పారిశ్రామికోత్పత్తి డేటా, వెల్లడికాబోయే ద్రవ్యోల్బణం గణాంకాలు మార్కెట్‌ను ఉత్సాహపర్చినా, ఫెడరల్ రిజర్వ్ మార్కెట్ కమిటీ ఈ నెల 16-17 తేదీల్లో జరపబోయే సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీలను ఒడుదుడుకులకు లోనుచేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది మొత్తానికి ముఖ్యమైన తేదీ సెప్టెంబర్ 17 అని, అదే రోజున ఫెడ్ వడ్డీ రేట్లు పెంచేదీ, లేనిదీ తెలుస్తుందని కొటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ అనిద్య బెనర్జీ చెప్పారు. ప్రధానంగా ఆ రోజున ఫెడ్ చేసే ప్రకటన, ఆ ప్రకటనలో ఉపయోగించే పదజాలం కీలకమని, వడ్డీ రేట్లపై సుతిమెత్తని వ్యాఖ్యానాలుంటే మార్కెట్లు వేగంగా కోలుకుంటాయని, పదజాలం పరుషంగా వుంటే డిసెంబర్లో వడ్డీరేట్లు పెరగవచ్చని, తద్వారా మార్కెట్లలో అల్లకల్లోలం ఏర్పడుతుందని ఆయన వివరించారు. అధిక వడ్డీ రేట్ల కారణంగా భారత్‌తో సహా ఇతర వర్ధమాన మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తాత్కాలికంగా వైదొలుగుతారని తాము అంచనావేస్తున్నామన్నారు. ఫెడ్ నిర్ణయం వెలువడే సెప్టెంబర్ 17న వినాయక చతుర్థి అయినందున, ఆ రోజున భారత్‌లో మార్కెట్లకు సెలవు. గతవారం మార్కెట్... ప్రపంచ మార్కెట్లలో ట్రెండ్‌కు అనుగుణంగా గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ 408 పాయింట్లు లాభపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 134 పాయింట్లు ర్యాలీ జరిపింది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు రూ. 7000 కోట్లు ఈ నెలలో ఇప్పటివరకూ దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు రూ.7,000 కోట్లు వెనక్కు తీసుకున్నారు. గత నెలలో భారీఎత్తున రూ. 17,428 కోట్ల నికర విక్రయాలు జరిపిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు), ఈ నెలలోనే అదేతరహాలో అమ్మకాల జోరును కొనసాగిస్తున్నారు. సెప్టెంబర్ 1-11 తేదీల మధ్య రూ. 6,109 కోట్లు ఈక్విటీ మార్కెట్లోనూ, రూ. 773 కోట్లు డెట్ మార్కెట్లోనూ వారు నికరంగా విక్రయించినట్లు సెంట్రల్ డిపాజిటరీల డేటా వెల్లడిస్తున్నది.