Union Bank Of India Hikes Interest Rates On Fixed Deposits, Check New Rates - Sakshi
Sakshi News home page

Union Bank of India ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌ 

Published Tue, Oct 18 2022 11:33 AM | Last Updated on Tue, Oct 18 2022 12:55 PM

Union Bank of India hikes interest rates on Fixed Deposits - Sakshi

సాక్షి, ముంబై: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు గుడ్‌  న్యూస్‌ అందించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల 7 శాతం దాకా  వడ్డీని అందిస్తుంది. గత రెండు నెలల్లో, పలు బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ వస్తున్నాయి.  తాజాగా  ఈ కోవలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ జాబితాలో చేరింది.

రూ. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లన పెంచుతూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం, సవరించిన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు అక్టోబర్ 17 నుండి అమలులోకి వచ్చాయి. 7 - 14 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 3 శాతం, 599 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై  గరిష్టంగా ఏడు శాతం వడ్డీ లభిస్తుంది.

45 రోజులకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 3 శాతం వడ్డీ లభిస్తుండగా, 46 -90 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 4.05శాతం వడ్డీ లభిస్తుంది. 91-120 రోజుల డిపాజిట్ 4.3 శాతం, 121-180 రోజులకు 4.4శాతం వడ్డీని అందిస్తుంది. 181 రోజుల నుండి ఒక  ఏడాది  లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై, 5.25శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఒక సంవత్సరం మెచ్యూరిటీ కాలానికి, రాబడి రేటు 6.30 శాతం. సంవత్సరం - 443 రోజుల కంటే ఎక్కువ మెచ్యూరిటీ ఉన్న FDలకు వడ్డీ రేటు 6.6 శాతంగా ఉంది. అయితే 600 రోజుల నుండి 10 సంవత్సరాల మెచ్యూరిటీ డిపాజిట్లపై 6.6 - 6.7 శాతం మధ్య వడ్డీ లభిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement