
చెన్నై: ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ (ఐఓబీ) డిపాజిట్ రేట్లను పెంచింది. రిటైల్ టర్మ్ డిపాజిట్ రేట్లు 60 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) వరకూ పెరిగినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. నవంబర్ 10 నుంచి తాజా రేట్లు అమల్లోకి వస్తాయని తెలపింది.
ప్రకటన ప్రకారం, దేశీయ, నాన్-రెసిడెంట్ డిపాజిటర్లు 444 రోజులు, మూడేళ్లు, ఆపైన డిపాజిట్లపై 7.15 శాతం వరకూ వడ్డీరేటును పొందుతారు. 270 రోజుల నుంచి యేడాది, ఏడాది నుంచి మూడేళ్ల టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటు 60 బేసిస్ పాయింట్ల వరకూ పెరిగింది.