IOB
-
ఐవోబీకి ఆర్బీఐ షాక్! భారీ జరిమానా
ముంబై: ఆదాయ గుర్తింపు, అసెట్ వర్గీకరణ నిబంధనల అమల్లో లోపాల కారణంగా ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ)కి రిజర్వ్ బ్యాంక్ రూ. 2.20 కోట్ల జరిమానా విధించింది. 2021 మార్చి 31న నాటికి బ్యాంకు పరిస్థితి సమీక్షించిన మీదట ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇదీ చదవండి: 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో నెక్సన్ ఈవీ మ్యాక్స్: ధర ఎంతో తెలుసా? ఆర్బీఐ నిర్వహించిన తనిఖీల సందర్భంగా ఐవోబీ 2020–21 ఆర్థిక సంవత్సరంలో ప్రకటించిన లాభాల్లో 25 శాతం మొత్తాన్ని రిజర్వ్ ఫండ్‌కు బదిలీ చేయడంలో బ్యాంకు విఫలమైంది. అలాగే, మొండిబాకీలకు సంబంధించి బ్యాంకు రిపోర్టు చేసిన వాటికి, వాస్తవ ఎన్పీఏలకు మధ్య వ్య త్యాసం ఉండటం తదితర లోపాలు తనిఖీల్లో బైటపడ్డాయి. రెజ్లర్ల ఆందోళన: ఐకానిక్ క్రికెటర్స్ స్పందించకపోతే ఎలా? పారిశ్రామికవేత్త ట్వీట్ వైరల్ డోంట్ మిస్ టు క్లిక్: సాక్షిబిజినెస్ -
వడ్డీ రేట్ల పెంపు జాబితాలోకి మరో రెండు బ్యాంకులు
ముంబై: వడ్డీ రేటు పెంపు జాబితాలో తాజాగా ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్ (ఐఓబీ) చేరాయి. ఈ నెల మొదట్లో ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను పావుశాతం పెంచడం (6.5 శాతానికి) దీనికి నేపథ్యం. ఎస్బీఐ బుధవారం రేట్ల పెంపు నేపథ్యంలో తాజాగా ఈ జాబితాలో బీఓబీ, ఐఓబీలు చేరడం గమనార్హం. బీఓబీ: నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు– ఎంసీఎల్ఆర్ను అన్ని కాల వ్యవధులపై 5 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. ఫిబ్రవరి 12 నుంచీ తాజా రేటు అమల్లోకి వస్తుందని పేర్కొంది. తాజా పెంపు నేపథ్యంలో ఏడాది రేటు 8.55 శాతానికి, ఓవర్‌నైట్, నెల, మూడు నెలా రేట్లు వరుసగా 7.9 శాతం, 8.2 శాతం, 8.3 శాతానికి చేరాయి. ఐఓబీ: అన్ని కాలపరిమితులపై ఎంసీఎల్ఆర్ 15 బేసిస్ పాయింట్ల వరకూ పెరిగింది. ఏడాది ఎంసీఎల్ఆర్ 0.15 శాతం పెరిగి 8.45కు చేరింది. నెల, మూడు, ఆరు నెలల రేట్లుసైతం ఇదే స్థాయిలో పెరిగి వరుసగా 7.9 శాతం, 8.2 శాతం, 8.35 శాతాలకు చేరాయి. ఓవర్‌నైట్, రెండేళ్లు, మూడేళ్ల రేట్లు 10 బేసిస్ పాయింట్లు పెరిగాయి. ఎస్బీఐ డిపాజిటర్లకు తీపికబురు రుణ రేటును బుధవారం 10 బేసిస్ పాయింట్లు పెంచిన బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) డిపాజిట్ రేట్లను కూడా గురువారం 5 నుంచి 25 బేసిస్ పాయింట్ల శ్రేణిలో పెంచింది. తాజా పెంపు నేపథ్యంలో ఐదేళ్ల డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లు 8.5 శాతం వడ్డీరేటు పొందుతారు. ఏడాది నుంచి రెండేళ్లలోపు డిపాజిట్లపై 6.8 శాతం వడ్డీ లభిస్తుంది. రెండేళ్ల నుంచి మూడేళ్ల మధ్య రేటు పావుశాతం పెరిగి 7 శాతానికి చేరింది. మూడేళ్ల పైబడిన డిపాజిట్లపై రేటు కూడా పావుశాతం పెరిగి 6.5 శాతానికి చేరింది. (ఇదీ చదవండి: ఎఫ్డీ కస్టమర్లకు ఎస్బీఐ గుడ్ న్యూస్! వడ్డీ రేట్లు పెంపు..) -
ఐవోబీ లాభం ప్లస్.. క్యూ3లో రూ. 555 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 22 శాతం ఎగసి రూ. 555 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 454 కోట్లు ఆర్జించింది. వడ్డీ ఆదాయం, రుణాల నాణ్యత మెరుగుపడటం ఇందుకు సహకరించింది. మొత్తం ఆదాయం రూ. 5,317 కోట్ల నుంచి రూ. 6,006 కోట్లకు పుంజుకుంది. నికర వడ్డీ ఆదాయం 44 శాతం జంప్‌చేసి రూ. 2,272 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 0.71 శాతం బలపడి 3.27 శాతానికి చేరాయి. స్థూల మొండిబకాయిలు 10.4 శాతం నుంచి 8.19 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు సైతం 2.63 శాతం నుంచి 2.43 శాతానికి బలహీనపడ్డాయి. మొండి రుణాలకు కేటాయింపులు రూ. 937 కోట్ల నుంచి రూ. 711 కోట్లకు తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 15.16 శాతంగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో ఐవోబీ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 27.15 వద్ద ముగిసింది. -
కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఐఓబీ
చెన్నై: ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) డిపాజిట్ రేట్లను పెంచింది. రిటైల్ టర్మ్ డిపాజిట్ రేట్లు 60 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) వరకూ పెరిగినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. నవంబర్ 10 నుంచి తాజా రేట్లు అమల్లోకి వస్తాయని తెలపింది. ప్రకటన ప్రకారం, దేశీయ, నాన్-రెసిడెంట్ డిపాజిటర్లు 444 రోజులు, మూడేళ్లు, ఆపైన డిపాజిట్లపై 7.15 శాతం వరకూ వడ్డీరేటును పొందుతారు. 270 రోజుల నుంచి యేడాది, ఏడాది నుంచి మూడేళ్ల టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటు 60 బేసిస్ పాయింట్ల వరకూ పెరిగింది. -
లాభాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్ (క్యూ2)లో నికర లాభం 59 శాతం జంప్‌చేసి రూ. 3,313 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం రూ. 20,271 కోట్ల నుంచి రూ. 23,080 కోట్లకు బలపడింది. నికర వడ్డీ ఆదాయం మరింత అధికంగా 34 శాతం ఎగసి రూ. 10,714 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 0.48 శాతం మెరుగై 3.33 శాతాన్ని తాకాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 8.11 శాతం నుంచి 5.31 శాతానికి, నికర ఎన్పీఏలు 2.83 శాతం నుంచి 1.16 శాతానికి దిగివచ్చాయి. మొండి రుణాలకు ప్రొవిజన్లు రూ. 2,754 కోట్ల నుంచి భారీగా తగ్గి రూ. 1,628 కోట్లకు పరిమితమయ్యాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 15.25 శాతంగా నమోదైంది. ఐవోబీ లాభం జూమ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 33 శాతం జంప్‌చేసి రూ. 501 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 376 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 5,028 కోట్ల నుంచి రూ. 5,852 కోట్లకు ఎగసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 10.66 శాతం నుంచి 8.53 శాతానికి, నికర ఎన్పీఏలు 2.77 శాతం నుంచి 2.56 శాతానికి దిగివచ్చాయి. వడ్డీ ఆదాయం రూ. 4,255 కోట్ల నుంచి రూ. 4,718 కోట్లకు బలపడింది. -
రుణాలపై వడ్డీ రేట్ల బాదుడు షురూ.. ఈ బ్యాంకుల్లో ఎంతంటే?
న్యూఢిల్లీ: ఆర్బీఐ రెపో రేటు పెంపు మరుసటి రోజే రుణాలపై రేట్లను సవరిస్తూ హెచ్డీఎఫ్సీ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐవోబీ) నిర్ణయం తీసుకున్నాయి. గృహ రుణాల అతిపెద్ద సంస్థ హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ గృహ రుణాలకు సంబంధించి తన రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును అరశాతం పెంచింది. ఈ నిర్ణయం జూన్ 10 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. ఐవోబీ కూడి ఇదేవిధమైన నిర్ణయాన్ని ప్రకటించింది. ‘‘రెపో లింక్డ్ లెండింగ్ రేటును 7.75 శాతానికి పెంచామని, జూన్ 10 నుంచి పెంపు అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఆర్బీఐ రెపో 4.90 శాతానికి బ్యాంకు మార్జిన్ రేటు 2.85% కలసి ఉంది. ఇక ఆర్బీఐ పాలసీ ప్రకటన రోజే పీఎన్బీ, ఇండియన్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ ఇండియా రుణాల రేట్లను అరశాతం పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. డిపాజిట్ రేట్ల పెంపు కోటక్ మహీంద్రా బ్యాంకు సేవింగ్స్ ఖాతాదారులకు అనుకూలించే నిర్ణయాన్ని తీసుకుంది. రూ.50లక్షలకు పైన బ్యాలన్స్ ఉండే సేవింగ్స్ ఖాతాలకు వడ్డీ రేటును అరశాతం పెంచి 4 శాతం చేసినట్టు తెలిపింది. టర్మ్ డిపాజిట్ల రేట్లను పావు శాతం పెంచినట్టు పేర్కొంది. చదవండి: క్రెడిట్ కార్డ్ ద్వారా యూపీఐ చెల్లింపులు: లింకింగ్ ఎలా? -
దిద్దుబాటు చర్యల చట్రం నుంచి బైటపడ్డ ఐఓబీ
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దిద్దుబాటు చర్యల చట్రం (పీసీఏఎఫ్) నుంచి ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్ (ఐఓబీ) బయటపడింది. బ్యాంక్ లావాదేవీలు, వ్యవస్థాగత, పాలనాపరమైన అంశాలకు సంబంధించి ఐఓబీ మెరుగైన ఫలితాల నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్టు బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఒక ప్రకటనలో పేర్కొంది. కనీస మూలధన నియమావళిని అనుసరించాలని కూడా ఐఓబీకి ఆర్బీఐ సూచించింది. 2015 నుంచీ ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్ ఆర్బీఐ దిద్దుబాటు చర్యల చట్రంలో ఉంది. ఈ నెల ప్రారంభంలో యుకో బ్యాంక్‌ను ఈ పరిధి నుంచి ఆర్బీఐ తొలగించింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం ఇంకా పీసీఏ పరిధిలోనే కొనసాగుతుండడం గమనార్హం. కాగా ఐఓబీ 2021 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.831 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. షేర్ మార్కెట్ ముగిసిన తర్వాత ఐఓబీ దిద్దుబాటు చర్యల చట్రం పరిధి నుంచి బయటకు వచ్చిన ప్రకటన వెలువడింది. నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్‌లో బుధవారం ఐఓబీ షేర్ ధర 0.49 శాతం పెరిగి 20.45 వద్ద ముగిసింది. చదవండి: అక్టోబర్ నెలలో బ్యాంక్ సెలవులు ఇవే -
ఫాలో ఆన్ ఇష్యూకి ఐఓబీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐఓబీ) వచ్చే ఆర్థిక సంవత్సరం ఫాలో ఆన్ ఇష్యూకు (ఎఫ్‌పీవో) రానుంది. ఈ నిర్ణయం ఇంకా బోర్డ్ పరిధిలోనే ఉందని, అది పూర్తయ్యాక.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), సెబీ అనుమతుల కోసం వెళతామని.. కచ్చితంగా 2020–21 ఆర్థిక సంవత్సరం రెండు లేదా మూడో త్రైమాసికంలో ఎఫ్‌పీవోకి రావాలని నిర్ణయించామని బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు అజయ్ కుమార్ శ్రీవాస్తవ చెప్పారు. అయితే ఎఫ్‌పీఓ ద్వారా ఎంత వాటాను కేటాయించాలి? ఎన్ని నిధులు సమీకరించాలి? అనేది బోర్డ్ నిర్ణయం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. సోమవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 50 వేల కోట్లకు ఎంఎస్ఎంఈ రుణాలు.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లుగా ఐఓబీ ఆథరైజ్డ్ క్యాపిటల్‌ను రూ.25 వేల కోట్లకు పెంచిన విషయం తెలిసిందే. దీంతో పాటు బ్యాంక్‌లకు మూలధన పునరుద్ధరణలో భాగంగా ఐఓబీకి రూ.4,360 కోట్లు క్యాపిటల్‌ను కేటాయించింది కూడా. ప్రస్తుతం ఐఓబీ నికర వడ్డీ మార్జిన్స్‌ను (ఎన్ఐఎం) మెరుగుపర్చుకునే స్థితిలో ఉందని.. ప్రస్తుతం 1.94 శాతంగా ఉన్న ఎన్ఐఎం ఈ త్రైమాసికంలో 2 శాతానికి చేరుతుందని.. 3–4 త్రైమాసికాల్లో 3 శాతానికి చేరడం ఖాయమని శ్రీవాస్తవ ధీమా వ్యక్తం చేశారు. ఎంఎస్ఎంఈ రుణాల మీద ప్రత్యేక దృష్టి సారించామని.. ప్రస్తుతం రూ.31 వేల కోట్లుగా ఉన్న ఎంఎస్ఎంఈ రుణ వ్యాపారం.. వచ్చే 18–24 నెలల్లో రూ.50 వేల కోట్లకు చేరుతుందని తెలిపారు. -
తగ్గిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నష్టాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో మరింతగా తగ్గాయి. గత క్యూ1లో రూ.919 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ1లో రూ.342 కోట్లకు తగ్గాయని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) తెలిపింది. రుణాల రికవరీ బావుండటం, కేటాయింపులు తగ్గడంతో నష్టాలు కూడా తగ్గాయని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.5,327 కోట్ల నుంచి 6 శాతం తగ్గి రూ.5,006 కోట్లకు చేరిందని తెలిపింది. వడ్డీ ఆదాయం 2 శాతం వృద్ధితో రూ.4,336 కోట్లకు పెరగ్గా, ఇతర ఆదాయం మాత్రం 38 శాతం తగ్గి రూ.670 కోట్లకు పరిమితమైందని పేర్కొంది. తగ్గినా, అధికంగానే మొండి బకాయిలు.... మొండి బకాయిలు గణనీయంగానే తగ్గినా, అధిక స్థాయిల్లోనే ఉన్నాయి. గత క్యూ1లో 25.64 శాతం(రూ.38,146 కోట్లు)గా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 22.53 శాతాని(రూ.33,262 కోట్ల)కి తగ్గాయని ఐఓబీ తెలిపింది. నికర మొండి బకాయిలు 15.10 శాతం(రూ.19,642 కోట్లు)నుంచి 11.04 శాతాని(రూ.14,174 కోట్లు)కి తగ్గాయని పేర్కొంది. మొండి బకాయిలు తగ్గడంతో మొండి బకాయిలకు కేటాయింపులు రూ.2,051 కోట్ల నుంచి రూ.1,170 కోట్లకు తగ్గాయని వివరించింది. రుణ రికవరీలు రూ.3,389 కోట్ల నుంచి రూ.2,238 కోట్లకు తగ్గాయని తెలిపింది. ఇక తాజా మొండి బకాయిలు రూ.2,050 కోట్లకు పరిమితమయ్యాయని వివరించింది. తాజా మొండి బకాయిలు కన్నా రికవరీలు అధికంగా ఉన్నాయని తెలిపింది. ఈ ఏడాది జూన్ 30 నాటికి మొత్తం డిపాజిట్లు రూ.2.21 లక్షల కోట్లకు, రుణాలు రూ.1.47 లక్షల కోట్లకు, మొత్తం వ్యాపారం రూ.3.69 లక్షల కోట్లకు చేరాయని ఐఓబీ తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 0.7 శాతం లాభంతో రూ.11.80 వద్ద ముగిసింది. -
బ్యాంకులకు బెయిలవుట్ జోష్
న్యూఢిల్లీ: మొండిబాకీల(ఎన్పీఏ) దెబ్బకి మూలధన సమస్యలతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్బీ) ఆదుకునేందుకు ఉద్దేశించిన బెయిలవుట్ ప్యాకేజీ కింద కేంద్రం మరికొన్ని నిధులను సమకూర్చనుంది. ఇందులో భాగంగా అయిదు పీఎస్బీలకు రూ.11,336 కోట్లు అందించే ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదముద్ర వేసింది. ఆంధ్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), కార్పొరేషన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐఓబీ), అలహాబాద్ బ్యాంకులు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018–19)లో అదనపు మూలధనాన్ని సమకూర్చడానికి సంబంధించి ఇదే తొలి విడత కానుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే మరో రూ. 53,664 కోట్లు కూడా పీఎస్బీలకు కేంద్రం అందించనుంది. తాజా ప్రణాళిక ప్రకారం.. నీరవ్ మోదీ స్కామ్ బాధిత పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు అత్యధికంగా రూ. 2,816 కోట్లు లభించనున్నాయి. ఆంధ్రా బ్యాంక్‌కు రూ. 2,019 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు రూ. 2,157 కోట్లు, కార్పొరేషన్ బ్యాంక్‌కు రూ. 2,555 కోట్లు, అలహాబాద్ బ్యాంక్‌కు రూ. 1,790 కోట్లు లభించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. బాండ్లపై వడ్డీల చెల్లింపులకు తోడ్పాటు.. అదనపు టయర్ 1 (ఏటీ–1) బాండ్‌హోల్డర్లకు వడ్డీ చెల్లింపులు జరపాల్సి ఉండటంతో... ఈ జాబితాలోని కొన్ని బ్యాంకులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. తాజా పరిణామం వీటికి కొంత ఉపశమనం ఇవ్వనుంది. సాధారణంగా శాశ్వత ప్రాతిపదికన ఉండే ఏటీ1 బాండ్ల ద్వారా కూడా బ్యాంకులు తమకు కావాల్సిన మూలధనాన్ని సమీకరిస్తుంటాయి. అయితే, కొన్నాళ్లుగా మొండిబాకీలు పెరిగిపోతుండటంతో పాటు భారీ నష్టాలు చవిచూస్తున్న పీఎస్బీలకు.. తమ సొంత ఆదాయం నుంచి ఈ బాండ్లపై వడ్డీలు చెల్లించడం కష్టంగా మారింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ విషయమే తీసుకుంటే.. గతేడాది జూలైలో ఏటీ1 బాండ్ల విక్రయం ద్వారా సమీకరించిన రూ.1,500 కోట్ల మొత్తంపై వడ్డీ చెల్లించేందుకు తక్షణం రూ.135 కోట్లు అవసరముంది. 8.98 శాతం వార్షిక వడ్డీ రేటుతో ఈ నెల 25లోగా వడ్డీలు చెల్లించాల్సి ఉంది. అయితే, నీరవ్ మోదీ స్కామ్ దెబ్బకి లాభాలు తుడిచిపెట్టుకుపోగా భారీ నష్టాలు, మొండిబాకీలతో సతమతమవుతున్న పీఎన్బీకి ఈ చెల్లింపులు జరపడం కష్ట సాధ్యంగా మారింది. మార్చి 31 నాటి గణాంకాల ప్రకారం పీఎన్బీ టయర్ 1 మూలధనం 5.96 శాతం స్థాయిలో ఉంది. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన 7.375 శాతం కన్నా ఇది చాలా తక్కువ. జూలై 25 గడువులోగా నిర్దేశిత స్థాయికి మూలధనం పెంచుకుంటేనే పీఎన్బీ ఈ చెల్లింపులు చేయగలుగుతుంది. ఒకవేళ ప్రభుత్వ రంగ బ్యాంకులు బాండ్లకు సకాలంలో చెల్లింపులు జరపలేకపోతే.. దేశ ఆర్థిక వ్యవస్థపై, ఆర్థిక స్థిరత్వంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశాలున్నాయని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ ఇటీవలే ఒక నివేదికలో హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం అదనపు మూలధన నిధులు సమకూర్చనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. రెండేళ్లలో రూ. 2.11 లక్షల కోట్లు.. రెండు ఆర్థిక సంవత్సరాల్లో పీఎన్బీలకు రూ. 2.11 లక్షల కోట్ల మేర అదనపు మూలధనం సమకూర్చే ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం రూ.1.35 లక్షల కోట్లు రీక్యాపిటలైజేషన్ బాండ్ల రూపంలో పీఎస్బీలకు లభించనున్నాయి. మిగతా రూ. 58,000 కోట్లను బ్యాంకులు మార్కెట్ నుంచి సమీకరించుకోవచ్చు. రూ.1.35 లక్షల కోట్లలో కేంద్రం ఇప్పటికే రూ.71,000 కోట్లు అందించింది. మిగతా మొత్తాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో సమకూర్చనుంది. పీఎస్‌బీలు కూడా సొంతంగా రూ. 50,000 కోట్లను సమకూర్చుకునేందుకు కసరత్తు చేస్తున్నాయి. మొత్తం 21 పీఎస్బీల్లో ఇప్పటికే 13 బ్యాంకులు ఇందుకోసం బోర్డులు, షేర్‌హోల్డర్ల అనుమతులు కూడా పొందాయి. పీఎస్‌బీల షేర్లు రయ్.. కేంద్రం అదనపు మూలధనం సమకూర్చనున్న వార్తలతో మంగళవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు దూసుకుపోయాయి. 11 శాతం దాకా పెరిగాయి. కార్పొరేషన్ బ్యాంక్ షేరు సుమారు 10.88%, అలహాబాద్ బ్యాంక్ 7.23%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6.57%, బ్యాంక్ ఆఫ్ బరోడా 6.38%, బ్యాంక్ ఆఫ్ ఇండియా 5.87%, కెనరా బ్యాంక్ 5.71%, ఇండియన్ బ్యాంక్ 5.04% పెరిగాయి. అటు ఆంధ్రా బ్యాంక్ 4.91%, దేనా బ్యాంక్ 3.58%, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3.10%, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 2.27%, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 1.35% పెరిగాయి. కేంద్ర రీక్యాపిటలైజేషన్ ప్రతిపాదన వీటికి ఊతమిచ్చినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ‘కనీస బ్యాలెన్స్’ పెనాల్టీలతో పీఎన్బీకి రూ.152 కోట్లు న్యూఢిల్లీ: మినిమం బ్యాలెన్స్ పాటించని పొదుపు ఖాతాలపై జరిమానాల ద్వారా పీఎన్బీ గత ఆర్థిక సంవత్సరంలో ఖాతా దారుల నుంచి రూ.151.66 కోట్లు వసూలు చేసింది. 1.23 కోట్ల సేవింగ్స్ ఖాతాలపై పీఎన్బీ ఈ మేరకు పెనాల్టీలు విధించింది. మినిమం బ్యాలెన్స్ పెనాల్టీల ద్వారా వసూలు చేసిన మొత్తం గురించిన వివరాలు వెల్లడించాలంటూ దరఖాస్తు చేసిన సమాచార హక్కు చట్టం కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్‌కు పీఎన్బీ ఈ విషయాలు తెలియజేసింది. ‘2017–18లో మినిమం బ్యాలెన్స్ పాటించని 1,22,98,748 సేవింగ్స్ అకౌంట్స్ నుంచి రూ.151.66 కోట్ల మేర పెనాల్టీని వసూలు చేయడం జరిగింది’ అని పేర్కొంది. ప్రభుత్వం మరింత మందిని బ్యాంకింగ్ వ్యవస్థ పరిధిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంటే.. బ్యాంకులు ఇలా మినిమం బ్యాలెన్స్ నిబంధనల పేరుతో పెనాల్టీలు విధించడం సరికాదని, ఈ విషయంలో ఆర్బీఐ తక్షణం జోక్యం చేసుకోవాలని ఆర్థికవేత్త జయంతిలాల్ భండారీ వ్యాఖ్యానించారు. -
మాస్క్‌లతో వచ్చి రూ 45 లక్షలు మాయం..
సాక్షి, రూర్కెలా : పట్టపగలు దోపిడీ ముఠా రెచ్చిపోయింది. ఒడిషాలోని రూర్కెలా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ)లోకి మంగళవారం ఉదయం దూసుకొచ్చిన దుండగులు బ్యాంకు సిబ్బందిని తుపాకీలతో బెదిరించి రూ 45 లక్షలు లూటీ చేశారు. హెల్మెట్లు, మాస్క్‌లు ధరించిన ఏడెనిమిది మంది దుండగులు పట్టణంలోని ఐఓబీ బజార్ బ్రాంచ్‌లోకి వచ్చారని, ఉద్యోగులను తుపాకీతో బెదిరించి సొమ్ముతో ఉడాయించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దోపిడీ ఘటన సమాచారం అందుకున్న రూర్కెలా ఎస్పీ, డీఐజీలు హుటాహుటిన బ్యాంక్‌కు చేరుకున్నారు. బ్యాంకు లూటీపై దర్యాప్తునకు ఆదేశించారు. దోపిడీ ముఠాను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పట్టణంలోకి వచ్చే దారులన్నింటినీ మూసివేశారు. పొరుగు రాష్ట్రం జార్ఖండ్ నుంచి దోపిడీ ముఠా ఈ లూటీకి తెగబడిందని అనుమానిస్తున్నారు. -
బ్యాంకింగ్ దిగ్గజాలకు భారీ జరిమానా
సాక్షి,ముంబై: కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా రెండు దిగ్గజ బ్యాంకులకు భారీ షాక్ ఇచ్చింది. చట్టపరమైన నిబంధనలను పాటించని కారణంగా ప్రయివేటు బ్యాంకు దిగ్గజం యాక్సిస్ బ్యాంకుతోపాటు, ముఖ్య ప్రభుత్వ రంగు బ్యాంకులలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకునకు (ఐవోబీ) భారీ జరిమానా విధించింది. కెవైసీ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఐవోబీకి 2కోట్ల రూపాయలు పెనాల్టీ విధించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు అంతర్గత తనిఖీ నివేదిక సహా పత్రాల పరిశీలన అనంతరం ఆర్బీఐ జారీచేసిన ఉత్తర్వులను ఉల్లఘించినట్టు తేలిందని ఆర్బిఐ పేర్కొంది. అలాగే ఎన్పీఏల అంచనాలకు సంబంధించిన యాక్సిస్ బ్యాంకు ఆర్బీఐ నిబంధనలను ఉల్లఘించిందని ఆర్బీఐ ప్రకటించింది. ఇందుకు గాను యాక్సిస్ బ్యాంకునకు రూ. 3కోట్ల జరిమానా విధించినట్టు ఒక ప్రకటనలోతెలిపింది. -
తగ్గిన ఐఓబీ నష్టాలు
న్యూఢిల్లీ: మొండి బకాయిలకు కేటాయింపులు తగ్గడంతో ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) నికర నష్టం 2017 జూన్ త్రైమాసికంలో రూ. 499 కోట్లకు తగ్గింది. గతేడాది ఇదేకాలంలో బ్యాంకు రూ. 1,450 కోట్ల భారీ నష్టాన్ని చవిచూసింది. తాజాగా ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం కూడా రూ. 5,868 కోట్ల నుంచి రూ. 5,174 కోట్లకు తగ్గిందని, ఇందుకు వడ్డీ రేట్ల తగ్గుదల కారణమని స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఐఓబీ తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు తగ్గినా...స్థూల ఎన్పీఏలు 20.48 శాతం నుంచి 23.60 శాతానికి పెరిగాయి. జూన్ క్వార్టర్లో రుణ వితరణ తగ్గడంతో ఎన్పీఏల శాతం పెరగడానికి ప్రధాన కారణమని బ్యాంకు తెలిపింది. నికర ఎన్పీఏలు 13.97 శాతం నుంచి 14.97 శాతానికి పెరిగాయి. బ్యాంకు నికర వడ్డీ మార్జిన్ 1.87 శాతం నుంచి 1.65 శాతానికి తగ్గింది. ఫలితాల నేపథ్యంలో ఐఓబీ షేరు 3.35 శాతం క్షీణతతో రూ. 23.10 వద్ద ముగిసింది. -
ఐఓబీలో భారీ కుంభకోణం
నకిలీ పాస్ పుస్తకాలతో రూ.కోట్లు స్వాహా.. సత్తుపల్లి: నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి రూ.కోట్లల్లో అక్రమ రుణాలు మంజూరు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో రెవెన్యూ, పోలీస్ బృందం గురువారం తనిఖీలు చేపట్టారు. దమ్మపేట, వేంసూరు, పెనుబల్లి, సత్తుపల్లి మండలాలకు చెందిన రైతుల పేరిట నకిలీ పాస్ పుస్తకాలతో రూ. కోట్ల మేర కుంభకోణం జరిగినట్లు ప్రాథమికంగా తేలింది. ఆయా మండలాలకు చెందిన 200లకుపైగా పాస్ పుస్తకాలను తనిఖీ చేస్తే.. సగానికిపైగా నకిలీగా తేలినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈ బ్యాంక్ నుంచి 584 మందికి రుణాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కల్లూరు ఏసీపీ బల్లా రాజేశ్ మాట్లాడుతూ సత్తుపల్లి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో నకిలీ పాస్ పుస్తకాలతో లక్షల్లో రుణాలు ఇస్తున్నారనే ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామన్నారు. పోలీస్ కమిషనర్ ఆదేశాలతో స్పెషల్ టీమ్‌తో దర్యాప్తు చేపడుతున్నామన్నారు. అక్రమంగా రుణాలు పొందినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. -
మొండి కొండ @ 7.7 లక్షల కోట్లు
♦ 2016–17లో 35 శాతం పైకి ♦ ప్రైవేటు బ్యాంకుల్లోనూ పెరిగిపోతున్న ఎన్పీఏలు ♦ 70 శాతం పెరిగి రూ.85,063 కోట్లకు ♦ యాక్సిస్, యస్ బ్యాంకుల ఖాతాల్లో తేడాలు ♦ ఐవోబీ, ఐడీబీఐ బ్యాంకుల్లోనూ తార స్థాయికి ♦ సరైన స్థాయిలోలేని నిధుల కేటాయింపులు న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకులు 2016–17 ఆర్థిక సంవత్సరంలోనూ మొండి బకాయిల సమస్య నుంచి బయటపడలేకపోయాయి. సరికదా గత కాలపు రుణాల సమస్యలు వాటిని ఇంకా పట్టి పీడిస్తూనే ఉన్నాయి. బడా కార్పొరేట్ సంస్థల నుంచి ఛోటా మోటా కంపెనీల వరకు, ఔదార్యంతో భారీగా రుణాలను మంజూరు చేసేసిన బ్యాంకులు... ఇప్పుడు వాటిని వసూలు చేసుకోలేక, రద్దు చేసి అందుకు సరిపడా నిధులు కేటాయించలేక (ప్రొవిజన్స్) ‘మింగలేక కక్కలేక’ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇప్పటి వరకూ మొండి బకాయిలు (వసూలు కాకుండా మొండిగా మారినవి/ఎన్పీఏలు) ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ)కే ఎక్కువ శాతం పరిమితం అనుకుంటుంటే... ఇన్నాళ్లు వాటిని కప్పి పెట్టిన ప్రైవేటు రంగ బ్యాంకుల దాపరికాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఎన్పీఏలను వాస్తవ గణాంకాల కంటే తక్కువగా చూపిస్తున్నట్టు ఇటీవలి యెస్ బ్యాంకు ఉదంతం తెలియజేస్తోంది. మొత్తానికి దేశీయ స్టాక్ మార్కెట్లో నమోదిత బ్యాంకుల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి రూ.7.7 లక్షల కోట్లకు చేరి సవాల్‌గా మారాయి. ఏడాదిలోనే భారీగా పెరుగుదల మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను ఇప్పటి వరకు దాదాపు అన్ని బ్యాంకులు ప్రకటించాయి. సిటీ యూనియన్ బ్యాంకు వెల్లడించాల్సి ఉంది. ఇటీవలే ఐదు బ్యాంకులను తనలో కలిపేసుకున్న ఎస్బీఐ సైతం కన్సాలిడేటెడ్ ఫలితాలను వెల్లడించింది. ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడించిన అన్ని బ్యాంకుల ఖాతా పుస్తకాల ప్రకారం స్థూల ఎన్పీఏలు రూ.7.7 లక్షల కోట్లకు చేరినట్టు స్పష్టమవుతోంది. 2016 మార్చితో అంతమైన ఆర్థిక సంవత్సరంలో స్థూల ఎన్పీఏలు రూ.5.70 లక్షల కోట్లు. అంటే గడిచిన ఆర్థిక సంవత్సరంలో మొండి రుణాలు 35 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. నికర ఎన్పీఏలు 58 శాతం పెరిగిపోవడం గమనార్హం. కానీ, బ్యాంకులు మొండి బాకీల కోసం చేస్తున్న కేటాయింపులు అరకొరగానే ఉన్నట్టు అర్థమవుతోంది. ప్రైవేటు బ్యాంకుల ఎన్పీఏలు ప్రభుత్వరంగ బ్యాంకులు తమ ఖాతాల ప్రక్షాళన కార్యక్రమాన్ని 2015–16 ఆర్థిక సంవత్సరం చివరి రెండు త్రైమాసికాల నుంచే మొదలు పెట్టగా... ప్రైవేటు రంగ బ్యాంకులు మాత్రం ఈ ప్రక్రియను గత ఆర్థిక సంవత్సరం నుంచే ప్రారంభించాయి. దీంతో వాటి ఖాతాల్లోని మకిలి బయటకొస్తోంది. ఒక్క గత ఆర్థిక సంవత్సరంలోనే ప్రైవేటు రంగ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు ఏకంగా 70 శాతం పెరిగి రూ.85,063 కోట్లకు చేరడం దీన్నే సూచిస్తోంది. మరి అదే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (ఎస్బీఐలో కలిసిన బ్యాంకులను మినహాయించి చూస్తే) ఎన్పీఏల పెరుగుదల చాలా తక్కువగా 20 శాతంగానే ఉంది. ప్రభుత్వరంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో ఒక విధంగా తమ ఖాతాల ప్రక్షాళనను భారీగానే నిర్వహించాయి. ఆర్బీఐ సమీక్షతో వెలుగులోకి పీఎస్బీల్లో మొండి బకాయిల ప్రక్షాళన కార్యక్రమం 2015–16 ద్వితీయార్ధం నుంచి ఆరంభమైంది. బ్యాంకుల ఆస్తుల నాణ్యతను సమీక్షించిన (ఏక్యూఆర్) ఆర్బీఐ... వసూలు కాకుండా ఒత్తిడిలో ఉన్న రుణాలను ఎన్‌పీలుగా ప్రకటించి వాటికి నిధులు కేటాయించాలని ఆదేశించింది. ఈ ఆదేశాల ఫలితం 2015 డిసెంబర్ త్రైమాసికం నుంచి ఆర్థిక ఫలితాల్లో కనిపించడం ఆరంభమైంది. ఆర్బీఐ ఆస్తుల నాణ్యత సమీక్షకు ముందు 2015 సెప్టెంబర్ త్రైమాసికం నాటికి ఉన్న స్థూల ఎన్పీఏలను విశ్లేషించి చూస్తే ఆ తర్వాతి కాలంలో పీఎస్‌బీల కంటే ప్రైవేటు బ్యాంకుల ఎన్పీఏలు అనూహ్యంగా పెరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా యాక్సిస్ బ్యాంకు, యస్ బ్యాంకుల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఈ రెండు బ్యాంకుల్లో స్థూల ఎన్పీఏల పెరుగుదల 300% మించి ఉంది. ఆస్తుల నాణ్యత సమీక్షకు ముందు ఈ రెండు బ్యాంకులు ఎన్పీఏలను తక్కువ చేసి చూపించినట్టు స్పష్టమవుతోంది. 2016 ఆర్థిక సంవత్సరంలో ఎన్‌పీల విషయమై ఆర్బీఐ నిర్ధారణకు, తమ అంచనాలకు మధ్య తేడా ఉన్నట్టు ఈ రెండు బ్యాంకులు ఇటీవలే ప్రకటించాయి కూడా. ఈ తేడా రూ.9,478 కోట్లు అని యాక్సిస్ బ్యాంకు వెల్లడించగా... యాక్సిస్ ఖాతాల పరంగా వెలుగు చూడని ఎన్పీఏలు రూ.4,177 కోట్లు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో యునైటెడ్ బ్యాంక్, ఐడీబీఐ ఎన్పీఏలు భారీగా పెరిగాయి. పరిమితి దాటితే ఆంక్షలు.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎన్పీఏలు ప్రైవేటు రంగ బ్యాంకుల కంటే అధికంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఈ ఏడాది మార్చి నాటికి ఐఓబీ, ఐడీబీఐ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు అత్యధిక స్థాయిలో ఉన్నాయి. ఎన్పీఏల శాతం గరిష్ట స్థాయికి చేరిన నేపథ్యంలో ఈ బ్యాంకులు ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా సత్వర దిద్దుబాటు చర్యల్ని చేపట్టాల్సి ఉంటుంది. అంటే నియమకాలు నిలుపుచేయడం, శాఖల విస్తరణకు బ్రేక్‌వేయడం వం టివి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం చూస్తే... నికర ఎన్పీఏలు 6–9% ఉంటే ఆ బ్యాంకులు రిస్క్ కేటగిరీ–1 పరిధిలోకి వస్తాయి. ఎన్పీఏలు 9–12% ఉంటే రెండో రిస్క్ విభాగంలోకి, 12%పైన ఉన్న బ్యాంకులు మూడో కేటగిరీ కిందకు వస్తాయి. నికర విలువను దాటేసిన ఎన్పీఏలు: మెకిన్సే కన్సల్టింగ్ సంస్థ మెకిన్సే అండ్ కో దేశీ బ్యాంకుల మొండి బకాయిల సంక్షోభంపై తాజాగా నివేదిక విడుదల చేసింది. దేశీయ బ్యాంకులకు చెందిన ఒత్తిడిలో ఉన్న మొత్తం రుణాలు (పునరుద్ధరించిన రుణాలు సహా) ఈ రంగం మొత్తం నెట్‌వర్త్‌ను మించిపోయాయి. ఈ రంగం నికర విలువ రూ.9.24 లక్షల కోట్లు కాగా, ఒత్తిడిలో ఉన్న రుణాల విలువ రూ.9.6 లక్షల కోట్లుగా ఉన్నట్టు మెకిన్సే వివరించింది. ‘‘తక్కువ వడ్డీ రేట్ల వాతావరణంలోనూ రుణాల్లో వృద్ధి లేకపోవడం, ఒత్తిడితో కూడిన రుణాలు అధిక స్థాయికి చేరడం, టెక్నాలజీ, నియంత్రణల పరంగా వచ్చిన మార్పులు భారత బ్యాంకింగ్ రంగానికి తుఫాను మాదిరి వాతావరణాన్ని కల్పించాయి’’ అని మెకిన్సే పేర్కొంది. ఎన్పీఏ ఆర్డినెన్స్ పరిధిలో 15 రోజుల్లో ప్రణాళిక! న్యూఢిల్లీ: బ్యాంకింగ్ మొండిబకాయిల (ఎన్పీఏ)ల సమస్య పరిష్కారానికి కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో పక్షం రోజుల్లో ఒక కార్యాచరణ ప్రణాళిక విడుదల చేయనుంది. ఎన్పీఏలు రూ. 8 లక్షల కోట్లు దాటిన నేపథ్యంలో సమస్య పరిష్కారం దిశలో ఆర్బీఐకి మరిన్ని అధికారాలను కట్టబెడుతూ ఇటీవలే కేంద్రం ఒక ఆర్డినెన్స్‌ను జారీ చేయడం తెలిసిందే. ఎన్పీఏలకు సంబం ధించి సమస్యల గుర్తింపునకు ప్రత్యేక విభాగం ఏర్పాటు, సమ స్య పరిష్కార ప్రక్రియలో సమయ కేటాయింపు, నిర్ణయం వంటి అంశాలు ఉంటాయని సంబంధిత వర్గాలు వెల్ల డించాయి. ఈ సమస్య 60 నుంచి 90 రోజులు ఉంటుందని కూడా తెలుస్తోంది. బడా మొండిబకాయిలకు సంబంధించి ఇప్పటికే ఆర్బీఐ 50 కేసులను గుర్తించినట్లు సమాచారం. ఆర్డినెన్స్ అమలు పర్యవేక్షణకు కమిటీ ఎన్పీఏ ఆర్డినెన్స్‌ను ఆచరణలో పెట్టే దిశగా ఆర్బీఐ చర్యల్ని ఆరంభించింది. ఇందు కోసం తన అధికార పరిధిలో పర్యవేక్షణ కమిటీని తిరిగి ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఆర్బీఐ సోమవారం ప్రకటించింది. అలాగే, సమస్య తీవ్రత దృష్ట్యా కమిటీని విస్తరించి మరింత మంది సభ్యులకు చోటు కల్పించనున్నట్టు పేర్కొంది. -
నాలుగు బ్యాంకులపై ఆర్బీఐ డేగకన్ను?
⇒ రుణ నాణ్యతపై ఆందోళనలతో ‘వాచ్‌లిస్ట్’లోకి! ⇒ జాబితాలో ఐడీబీఐ బ్యాంక్, ఐఓబీ, యుకో...! న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులను ‘వాచ్‌లిస్ట్’లో పెట్టినట్లు తెలిసింది. రుణ నాణ్యత విషయంలో ఆందోళనలే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. జాబితాలో ఐడీబీఐ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ), యుకో బ్యాంక్‌లు ఉన్నాయి. నాల్గవ బ్యాంక్ ఏమిటన్నది తెలియరాలేదు. అయితే ఈ వార్తల్ని అటు ఆర్బీఐ గానీ, ఇటు నాలుగు బ్యాంకుల అధికారులు గానీ ధ్రువపరచలేదు. అదనపు ద్రవ్య లభ్యత వినియోగానికి నేడు బ్యాంకుల సమావేశం వ్యవస్థలో ఉన్న అధిక ద్రవ్య లభ్యత (లిక్విడిటీ)ని వినియోగించుకునే అంశంపై సమీక్షకు ఆర్థికమంత్రిత్వశాఖ శుక్రవారం బ్యాంకులతో కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. దిగ్గజ బ్యాంకుల చీఫ్‌లు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. -
సిండికేట్, సిటీ, ఐఓబీ..ఎంసీఎల్ఆర్ కోత
న్యూఢిల్లీ: మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) ఆధారిత రుణ రేటును తగ్గిస్తున్న బ్యాంకుల జాబితాలో శుక్రవారం సిండికేట్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ)తోపాటు సిటీ ఇండియా చేరింది. ఆయా బ్యాంకులు 1% వరకూ రేటు కోత నిర్ణయాన్ని తీసుకున్నాయి. వివరాలు... సిండికేట్ బ్యాంక్...: సిండికేట్ బ్యాంక్ ఏడాది కాలపరిమితి రుణరేటును 0.7% తగ్గించింది. దీనితో ఈ రేటు 8.75 శాతానికి చేరింది. గృహ రుణాలపై వడీరేటు తగ్గిస్తున్నట్లు కూడా బ్యాంక్ ప్రకటించింది. 0.7 శాతం తగ్గింపుతో 8.80 శాతం నుంచి 9.50 శాతానికి తగ్గిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది. ఐఓబీ...: ఏడాది రేటును శనివారం నుంచీ అమల్లోకి వచ్చే విధంగా 8.65 శాతానికి తగ్గించింది. సిటీబ్యాంక్...: గృహ రుణ రేటును 0.7 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 9.50 శాతం నుంచి 8.80 శాతానికి తగ్గుతుంది. తాజా రేట్లు 9వ తేదీ నుంచీ అమల్లోకి వస్తాయని పేర్కొంది. కోటక్ బ్యాంక్ బేస్ రేట్ తగ్గింపు: కోటక్ మహీంద్రా బ్యాంక్ బేస్ రేటును 0.10% తగ్గించింది. బేస్‌రేట్‌ను 9.40% నుంచి 9.30 శాతానికి(ఏడాదికి)తగ్గిస్తున్నామని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. -
శ్రీశైలం నుంచి సాగునీరు ఇవ్వకపోతే ముట్టడి: భూమా
కర్నూలు: శ్రీశైలం నుంచి సాగునీరు ఇవ్వకపోతే రైతులతో కలిసి ముట్టడిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హెచ్చరించారు. కృష్ణా జలాలకు సంబంధించిన బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే భూమా డిమాండ్ చేశారు. శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం 854 అడుగులు ఉండేటట్లుగా నిర్వహించాలని ఐఏబీలో తీర్మానం చేశారు. అలాగే ఐఏబీలో చేసిన తీర్మానాలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఆయన సూచించారు. వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు పట్టుబడటంతో తుంగభద్ర డ్యామ్ నుంచి 1000 క్యూసెక్కుల నీటి విడుదలకు అంగీకరించారు. కర్నూలు కలెక్టరేట్లో జరిగిన ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ కు కడప ఎమ్మెల్యే, ఎంపీలు, కర్నూలు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గైర్హాజరయ్యారు. -
చిక్కిన టక్కరులు
* అడ్డతీగల ఐఓబీ రుణకుంభకోణంలో 15 మంది అరెస్టు * రూ.2.5 కోట్ల గోల్‌మాల్‌లో అప్పటి బ్రాంచి మేనేజరూ పాత్రధారే * నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలతో బ్యాంకుకు టోపీ * అమాయక రైతులనూ వంచించిన టక్కరులు * బయట పడాల్సి ఉన్న మరెందరో మోసగాళ్లు అడ్డతీగల : రుణాల పేరుతో బ్యాంకుకు టోపీ పెట్టిన టక్కరుల్లో కొందరు ఎట్టకేలకు కటకటాల వెనక్కి వెళ్లారు. 2010-12 మధ్య ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐఓబీ) అడ్డతీగల శాఖ నుంచి రూ.2.5 కోట్లను దర్జాగా దండుకున్న వ్యవహారంలో ఆ బ్రాంచి అప్పటి మేనేజర్ కడర్ల భాస్కరాచారిని, మరో 14 మందిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. వారంతా నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలతో పాటు కొందరు రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలను తీసుకుని, వారి సంతకాలను ఫోర్జరీ చేసి, తప్పుడు డాక్యుమెంట్లతో రుణాలు పొందినట్టు దర్యాప్తులో తేలింది. ఐఓబీ అడ్డతీగల శాఖలో పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వడంపై అనుమానం వచ్చిన బ్యాంకు ఉన్నతాధికారులు తమ విజిలెన్స్ విభాగంతో దర్యాప్తు జరిపించి, రుణాల మంజూరులో అక్రమాలు వాస్తవమేనని గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో రుణకుంభకోణంలో మరిన్ని కోణాలు వెలుగు చూశాయి. ఎటువంటి భూమి లేకపోయినా భూమి ఉన్నట్టు నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు సృష్టించి, వాటిని బ్యాంకులో లక్షల్లో రుణాలు పొందినట్టు తేలింది. అంతేకాక.. అమాయకులైన పలువురు రైతుల నుంచి పాస్ పుస్తకాలు తీసుకుని, బ్యాంక్ నుంచి వారి పేరిట ఎక్కువ మొత్తంలో రుణం తీసుకుని, వారికి కొద్దిమొత్తమే ఇచ్చి, మిగిలినది మింగిన వైనమూ వెలుగు చూసింది. మరెందరో మోసగాళ్లు.. 2010-2012 మధ్య కాలంలో జరిగిన ఈ కుంభకోణంలో రూ.2.5 కోట్ల మేరకు అక్రమార్కులు స్వాహా చేసినట్టు రంపచోడవరం ఏఎస్పీ సీహెచ్ విజయారావు విలేకరులకు తెలిపారు. ఐఓబీ విజిలెన్స్ దర్యాప్తులో 19 మంది అక్రమాలకు పాల్పడినట్టు తేలిందని, బ్యాంక్ అధికారుల నుంచి తమకు వచ్చిన ఫిర్యాదుపై గత ఏప్రిల్ 24న కేసు నమోదు చేశామని చెప్పారు. అప్పటి బ్రాంచి మేనేజర్ కడర్ల భాస్కరాచారితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. ఈ వ్యవహారంలో అనేకమంది పాత్ర ఉన్నట్టు తేలిందన్నారు. గురువారం అప్పటి బ్రాంచి మేనేజర్ కడర్ల భాస్కరాచారితో పాటు గంగవరం మండలం సూరంపాలెంకు చెందిన తోటా వరలక్ష్మి, పాలోజి సీత, చవలం ప్రసాద్‌దొర, కుంజం గంగాదేవి, పాలోజి సత్తిబాబు, కొత్తాడకి చెందిన కారం వెంకన్నదొర, పడాల లక్ష్మి, తలారి బేబి(మొల్లేరు), గంగవరానికి చెందిన సారపు కృష్ణదొర, బరిజి కాటంస్వామి, మాగంటి నూతన్‌ప్రసాద్, కోటం ప్రసాద్బాబుదొర , అడ్డతీగలకు చెందిన వాకపల్లి గిరిబాబు, కింగు మహంతి శ్రీను అరెస్టు చేసినట్టు చెప్పారు. ఈ 15 మందీ నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలతో రూ.13.70 లక్షల మేరకు రుణాలు పొందినట్లు గుర్తించామన్నారు. తమ దర్యాప్తులో రుణాల కుంభకోణం రూ.2.5 కోట్ల మేరకు జరిగినట్టు తేలిందని, అడ్డతీగల, గంగవరం, వై.రామవరం మండలాల్లో మరెందరో రైతుల నుంచి పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకుని, రుణాల పొందారని చెప్పారు. అమాయకుల ఫొటోలతో తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేసి కూడా రుణాలు తీసుకున్నట్టు బయటపడిందన్నారు. వివిధ ప్రభుత్వశాఖల నుంచి తగిన సమాచారం వచ్చాక మరింతమందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేసు దర్యాప్తులో కీలకపాత్ర పోషించిన సీఐ ముక్తేశ్వర్రావు, ఎస్సైలు టి.రామకృష్ణ(అడ్డతీగల), లక్ష్మణరావు(వై.రామవరం), తిరుపతిరావు (దుశ్చర్తి), భీమశంకర్, కానిస్టేబుళ్లను అభినందించారు. -
గృహ రుణాలపై ఐఓబీ, ఇండియన్ బ్యాంక్ ప్రత్యేక వడ్డీ ఆఫర్లు
చెన్నై: గృహ రుణాల్లో భారీ వృద్ధి నమోదుపై ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఈ మేరకు శుక్రవారం పరిమిత కాలపు ప్రత్యేక వడ్డీరేట్ల ఆఫర్లను ప్రకటించాయి. తమ ఈ ప్రత్యేక ఆఫర్లు మార్చి 31వ తేదీ వరకూ అమల్లో ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపాయి. వివరాలివీ... ఇండియన్ బ్యాంక్: 10.20 శాతం వడ్దీరేటుకు గృహ రుణాన్ని ఆఫర్ చేస్తోంది. రుణ మొత్తం, కాలవ్యవధితో సంబంధం లేకుండా ఈ వడ్డీరేటు మార్చి వరకూ అమల్లో ఉంటుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్: ఇక ఐఓబీ విషయానికి వస్తే - మహిళలు లక్ష్యంగా బ్యాంక్ ప్రత్యేక పథకాన్ని ఆఫర్ చేస్తోంది. రుణ మొత్తం, కాలవ్యవధితో సంబంధం లేకుండా శుభ గృహ పథకం కింద 10.25 శాతం వడ్డీపై గృహ రుణాన్ని బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. ఇతర రుణ గ్రహీతలకు సంబంధించి రూ.75 లక్షల వరకూ రుణ రేటు 10.25 శాతం వరకూ ఉంటుంది. రూ.75 లక్షలు దాటితే ఈ రేటు 10.50 శాతం. ఐఓబీ ‘కనెక్ట్ కార్డ్’ కాగా యువత లక్ష్యంగా ఐఓబీ శుక్రవారం ‘కనెక్ట్ కార్డ్’ను ఆవిష్కరించింది. ఇది ఏటీఎం వినూత్న ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్. వీసా భాగస్వామ్యంతో బ్యాంక్ ఈ కార్డును ఆవిష్కరించింది. దాదాపు ఐదు లక్షల దుకాణాల్లో ఈ-కామర్స్‌కు అవకాశం కల్పించడం ఈ కార్డు ప్రత్యేకం. ఐఓబీ కస్టమర్లు అందరికీ ఈ కార్డును అందిస్తున్నప్పటికీ, 10 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్కులకు సేవలు అందజేయడం దీని ప్రధాన లక్ష్యమని బ్యాంక్ ప్రకటన తెలిపింది. ఈ-షాపింగ్, ఈ-పేమెంట్ విధానం ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు వరకూ (మార్చి వరకూ) ఐదుశాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ సౌలభ్యాన్ని సైతం బ్యాంక్ అందిస్తోంది. కాగా ప్రత్యేకించి సప్లై చైన్ భాగస్వాముల ఫైనాన్సింగ్‌కు వీలు కల్పించే ‘చానెల్ ఫైనాన్సింగ్’ వ్యవస్థను సైతం ఐఓబీ ఆవిష్కరించింది. కార్పొరేట్, వ్యవస్థాగత, చిన్న-మధ్యతరహా రుణ కస్టమర్ల ప్రయోజనాలకు దీన్ని ఉద్దేశించారు. -
ఐఓబీ నికర లాభం రూ.133 కోట్లు
చెన్నై: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐఓబీ) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 16% తగ్గింది. గత క్యూ2లో రూ.158 కోట్ల లాభం రాగా, ఈ క్యూ2లో రూ.133 కోట్ల లాభం ఆర్జించామని ఐఓబీ శుక్రవారం తెలిపింది. ఇక మొత్తం ఆదాయం రూ.5,515 కోట్ల నుంచి రూ.5,999.75 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30తో ముగిసిన 6 నెలల కాలానికి రూ.258 కోట్ల నికర లాభం సాధించామని, గతేడాది ఇదే కాలానికి రూ.392 కోట్ల లాభం ఆర్జించామని, 34% క్షీణత నమోదైందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.10,918 కోట్ల నుంచి రూ.12,187 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం రూ.2,574 కోట్ల నుంచి రూ.2,768 కోట్లకు పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో స్థూల మొండిబకాయిలు రూ.8,202 కోట్లుగా, నికర మొండి బకాయిలు రూ.4,875 కోట్లుగా ఉన్నాయని ఐఓబీ వివరించింది.