నాలుగు బ్యాంకులపై ఆర్‌బీఐ డేగకన్ను?
⇒ రుణ నాణ్యతపై ఆందోళనలతో ‘వాచ్‌లిస్ట్’లోకి!
⇒ జాబితాలో ఐడీబీఐ బ్యాంక్, ఐఓబీ, యుకో...!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులను ‘వాచ్‌లిస్ట్’లో పెట్టినట్లు తెలిసింది. రుణ నాణ్యత విషయంలో ఆందోళనలే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. జాబితాలో ఐడీబీఐ బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ (ఐఓబీ), యుకో బ్యాంక్‌లు ఉన్నాయి. నాల్గవ బ్యాంక్ ఏమిటన్నది తెలియరాలేదు. అయితే ఈ వార్తల్ని అటు ఆర్‌బీఐ గానీ, ఇటు నాలుగు బ్యాంకుల అధికారులు గానీ ధ్రువపరచలేదు.
అదనపు ద్రవ్య లభ్యత వినియోగానికి నేడు బ్యాంకుల సమావేశం
వ్యవస్థలో ఉన్న అధిక ద్రవ్య లభ్యత (లిక్విడిటీ)ని వినియోగించుకునే అంశంపై సమీక్షకు ఆర్థికమంత్రిత్వశాఖ శుక్రవారం బ్యాంకులతో కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. దిగ్గజ బ్యాంకుల చీఫ్‌లు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.