IDBI Bank
-
రూ.652 కోట్లతో మొండి బాకీల కొనుగోలు!
ద్రవ్యోల్బణం పెరుగుతోంది..ఖర్చులూ పెరుగుతున్నాయి..ఇలాంటి సందర్భంలో బ్యాంకులు రుణాలు ఇస్తాయంటే ఎందుకు తీసుకోకుండా ఉంటారు..అయితే వాటిని తిరిగి చెల్లించేపుడు మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. దాంతో బ్యాంకుల వద్ద మొండి బకాయిలు పోగవుతున్నాయి. అలా ఒక్క ఐడీబీఐ బ్యాంకు వద్దే ఏకంగా రూ.6,151 కోట్లు పేరుకుపోయాయి. ఆ లోన్లను రికవరీ చేసేందుకు బ్యాంకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దాంతో ఇటీవల ఆ బకాయిలను విక్రయానికి పెట్టింది. వాటిని కొనుగోలు చేసేందుకు ఓంకార అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్సీ) గరిష్ఠంగా రూ.652 కోట్లు ఆఫర్ చేసినట్లు వార్తాకథనాలు వెలువడ్డాయి.వార్తా నివేదికల ప్రకారం..ఐడీబీఐ బ్యాంకు తన వద్ద పోగైన రూ.6,151 కోట్ల మొండి బకాయిలను విక్రయించాలని గతంలోనే నిర్ణయించుకుంది. దాంతో ప్రభుత్వ అధీనంలోని నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్‌తోపాటు ఇతర కంపెనీలు బిడ్డింగ్ వేశాయి. తాజాగా ఓంకార అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్సీ) ఆ మొండి బకాయిలను దక్కించుకునేందుకు గరిష్ఠంగా రూ.652 కోట్లు(మొత్తంలో 10.5 శాతం) ఆఫర్ చేసింది.బ్యాంకుల్లో రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని వారి సంఖ్య పెరుగుతోంది. వాటిని వసూలు చేసేందుకు ప్రభుత్వం నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏఆర్సీఎల్)ను ప్రతిపాదించింది. ఇది బిడ్డింగ్‌లో తక్కువ ధరకు బ్యాంకుల నుంచి మొండి బకాయిలను దక్కించుకుంటుంది. అనంతరం రుణ గ్రహీతల నుంచి పూర్తి సొమ్మును వసూలు చేస్తోంది. తాజాగా ఎన్‌ఏఆర్‌సీఎల్‌తోపాటు బిడ్డింగ్‌లో పాల్గొన్న ఓంకార ఏఆర్సీ అధికమొత్తంలో చెల్లించేందుకు సిద్ధమైంది.ఇదీ చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన గౌతమ్ అదానీ!ఐడీబీఐ బ్యాంకులో గరిష్ఠంగా ఎల్ఐసీకు 49.24 శాతం వాటా ఉంది. వీటిని 26 శాతానికి తగ్గించేందుకు మే 2021లో క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 2022లో ఆసక్తిగల సంస్థలు, వ్యక్తుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు కోరింది. ఇటీవల వెలువడిన రాయిటర్స్ నివేదిక ప్రకారం..ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్, ఎమిరేట్స్ ఎన్బీడీ, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బిడ్డర్లుగా ఆమోదించింది. ఈ బ్యాంకులో ఎల్ఐసీ తర్వాత గరిష్ఠంగా ప్రభుత్వానికి 45 శాతం వాటా ఉంది. -
ఐడీబీఐపై ఫెయిర్‌ఫాక్స్ కన్ను
ముంబై: పీఎస్‌యూ.. ఐడీబీఐ బ్యాంక్ కొనుగోలుకి కెనడియన్ పీఈ దిగ్గజం ఫెయిర్‌ఫ్యాక్స్ ఇండియా హోల్డింగ్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం నగదు రూపేణా చెల్లించేందుకు డీల్ కుదుర్చుకోవడం ద్వారా బ్యాంకును సొంతం చేసుకునేందుకు ఫెయిర్‌ఫాక్స్ అధినేత బిలియనీర్ ప్రేమ్ వత్సా ఆసక్తి చూపుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ వివరాల ప్రకారం కొనుగోలు తదుపరి సైతం బ్యాంక్ గుర్తింపును కొనసాగించేందుకు అంగీకారాన్ని తెలపనుంది. రెండు వారాల క్రితమే ఆర్థిక శాఖకు ఫెయిర్‌ఫాక్స్ తాజా ప్రతిపాదనలు చేరాయి. నిజానికి షేర్ల మారి్పడి ద్వారా బ్యాంకు కొనుగోలు ఒప్పందానికి పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నప్పటికీ ప్రభుత్వం ఇందుకు సన్నద్ధంగా లేదు. దీంతో నగదు చెల్లింపును ఫెయిర్‌ఫాక్స్ తెరపైకి తీసుకువచి్చంది. కెనడా, భారత్‌ల మధ్య రాజకీయ విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఈ డీల్‌కు ప్రాధాన్యత ఏర్పడినట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎస్బీ విలీనం దేశీయంగా సీఎస్బీ బ్యాంక్‌కు ఫెయిర్‌ఫాక్స్ ప్రమోటర్‌గా వ్యవహరిస్తోంది. ఫలితంగా ఐడీబీఐను సొంతం చేసుకుంటే సీఎస్బీ ప్రమోటర్‌గా కొనసాగేందుకు వీలుండదు. బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం ఒక ఇన్వెస్టర్ రెండు బ్యాంకులకు ప్రమోటర్‌గా వ్యవహరించేందుకు అనుమతి లభించదు. వెరసి ఐడీబీఐలో సీఎస్బీ బ్యాంకును విలీనం చేయవలసి ఉంటుంది. ఐడీబీఐ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 90,440 కోట్లుకాగా.. సీఎస్బీ విలువ రూ. 6,000 కోట్లు మాత్రమే. కొంతకాలం ఐడీబీఐను విడిగా కొనసాగించాక తదుపరి దశలో సీఎస్బీ బ్యాంకులో విలీనం చేసేందుకు గతంలో ఫెయిర్‌ఫాక్స్ ప్రతిపాదించింది. అయితే విస్తారిత కార్యకలాపాలు కలిగిన ఐడీబీఐ బ్యాంక్ గుర్తింపు రద్దుకు ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో ప్రతిపాదనలను తాజాగా సవరించింది. ఐడీబీఐ బ్యాంకులో సీఎస్బీ విలీనానికి ప్రతిపాదించడం ద్వారా ప్రభుత్వం, ఆర్బీఐ నుంచి సమ్మతిని పొందే ప్రయత్నాల్లో ఉంది. వాటా విక్రయానికి ప్రభుత్వం తెరతీశాక ఐడీబీఐ బ్యాంక్ షేరు రూ. 60 నుంచి రూ. 84 వరకూ బలపడింది. ఈ నేపథ్యంలో ఐడీబీఐపై కన్నేసిన కొటక్ మహీంద్రా బ్యాంక్.. సవరించిన ఆఫర్ ద్వారా ఫెయిర్‌ఫాక్స్‌కు చెక్ పెడుతుందా లేదా అనేది వేచిచూడవలసి ఉన్నట్లు బ్యాంకింగ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
ప్రముఖ బ్యాంకును అమ్మనున్న కేంద్రం..!
కేంద్రం కొన్ని ప్రభుత్వసంస్థల నుంచి చాలా కాలంగా పెట్టుబడులను ఉపసంహరిస్తోంది. వ్యూహాత్మక విక్రయాల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటోందని పలుమార్లు చెప్పింది. తాజాగా ప్రముఖ బ్యాంకులోని ప్రభుత్వ వాటాను విక్రయించేందుకు సన్నద్ధం జరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం 2024-25లో ఐడీబీఐ బ్యాంక్‌లోని తమ వాటాను ఉపసంహరించుకుంటామని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే అన్నారు. పీటీఐ టీవీకి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పాండే మాట్లాడారు. ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఈ క్రమంలోనే రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఐడీబీఐ వ్యూహాత్మక విక్రయం పూర్తవుతుందన్న ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి భద్రతాపరమైన అనుమతి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి వ్యవస్థీకృత ఆమోదం లభిస్తే.. బ్యాంక్‌ను కొనేందుకు ఆసక్తి ఉన్నవారిని బిడ్ల ద్వారా ఆహ్వానిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్‌లో పరోక్షంగా, ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వానికి సుమారు 95 శాతం వాటా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి 45 శాతం వాటా ఉండగా, ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)కు 49.24 శాతం వాటా ఉంది. ఈ రెండు వాటాల్లో కలిపి మొత్తంగా దాదాపు 61 శాతం అమ్మేయాలని కేంద్రం యోచిస్తోంది. ఇక 2022 అక్టోబర్‌లోనే బిడ్లను ఆహ్వానించగా, 2023 జనవరిలో కొంటామని కొందరు ఆసక్తికనబరిచినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, వచ్చే నెలాఖర్లోగా ఖజానాకు రూ.17,500 కోట్ల నిధులు అవసరం కానున్నాయి. సవరించిన అంచనాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీఎస్ఈ)ల్లో పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల నగదీకరణతో రూ.30,000 కోట్లను ఖజానాకు తరలించాల్సి ఉంది. ఇదీ చదవండి: పన్నుస్లాబ్ సవరణలపై నిర్మలమ్మ కీలక వ్యాఖ్యలు ఇదిలా ఉండగా, ఐడీబీఐ బ్యాంకులో వాటా కొనుగోలు చేయాలనుకునే బిడ్డర్లకు కనీసం రూ.22,500 కోట్ల కనీస నికర సంపద, గత ఐదేళ్లలో కనీసం మూడేళ్లలో నికర లాభాలు ఉండాలనే నియమాలు ఉన్నాయి. ఒకవేళ బిడ్డర్లు కన్సార్టియంగా ఏర్పడితే.. గరిష్ఠంగా నలుగురు మాత్రమే ఉండాలని ‘దీపం’ షరతు విధించింది. డీల్ కుదిరితే బిడ్డర్లు కనీసం 40 శాతం వాటాలను ఐదేళ్ల వరకు తమ వద్దే అట్టిపెట్టుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. -
IDBI బ్యాంకులో రూ.46 లక్షలు చోరీ
-
గో ఫస్ట్ లిక్విడేషన్ ప్రణాళికలు!
ముంబై: ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న దేశీ విమానయాన కంపెనీ గో ఫస్ట్ లిక్విడేషన్ ప్రక్రియ ఊపందుకోనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ లిక్విడేషన్ ప్రతిపాదనకు ఈ వారంలో రుణదాతలు అనుకూలంగా ఓటింగ్ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రముఖ పారిశ్రామివేత్త నస్లీ వాడియా ప్రమోట్ చేసిన కంపెనీ రుణ సంక్షోభాన్ని పరిష్కరించుకోవడంలో పలుమార్లు విఫలమైంది. కంపెనీ రుణదాతలకు రూ. 6,521 కోట్లవరకూ చెల్లించవలసి ఉంది. రుణదాతలలో బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డాయిష్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ ఉన్నాయి. వీటిలో సెంట్రల్ బ్యాంక్‌కు అత్యధికంగా రూ. 1,987 కోట్లు బకాయిపడి ఉంది. ఈ బాటలో బీవోబీకి రూ. 1,430 కోట్లు, డాయిష్ బ్యాంక్‌కు రూ. 1,320 కోట్లు చొప్పున రుణాలు చెల్లించవలసి ఉన్నట్లు తెలుస్తోంది. రుణదాతల కమిటీ(సీవోసీ) కంపెనీ ఆస్తుల విలువను రూ. 3,000 కోట్లుగా మదింపు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దివాలా చట్టం(ఐబీసీ)లో భాగంగా 270 రోజులలోగా కేసులను పూర్తి చేయవలసి ఉంది. దీంతో త్వరలోనే కంపెనీ లిక్విడేషన్‌కు తెరలేవనున్నట్లు తెలుస్తోంది. అయితే కస్టమర్లు, ట్రావెల్ ఏజెంట్లు, బ్యాంకులు తదితర రుణదాతలకు నిధులను సర్దుబాటు చేయవలసి ఉంటుంది. రేసులో జిందాల్ గో ఫస్ట్ విమానాలను కొనుగోలు చేయకుండా సేల్, లీజ్‌బ్యాక్ పద్ధతిలో కార్యకలాపాల నిర్వహణ చేపట్టడంతో కంపెనీ కొనుగోలుకి ఆసక్తి వ్యక్తం కాకపోవచ్చని పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. కంపెనీ కీలక ఆస్తులలో థానేలోని 94 ఎకరాల భూమిని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఈ భూమిని వాడియా బ్యాంకులకు కొలేటరల్‌గా ఉంచారు. ఈ భూమి విలువను రూ. 3,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. దీనికితోడు ముంబైలోని ఎయిర్‌బస్ శిక్షణా కేంద్రం, ప్రధాన కార్యాలయాలను అదనపు ఆస్తులుగా పరిగణిస్తున్నాయి. గో ఫస్ట్ కొనుగోలుకి పలు కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేసినప్పటికీ(ఈవోఐ).. జిందాల్ పవర్ మాత్రమే రుణదాతల కమిటీ పరిశీలనలో నిలిచినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. బ్యాంకులకుకాకుండా విమాన సరఫరాదారులకు రూ. 2,000 కోట్లు, వెండార్లకు రూ. 1,000 కోట్లు, ట్రావెల్ ఏజెంట్లకు రూ. 600 కోట్లు, కస్టమర్లకు రూ. 500 కోట్లు చొప్పున బకాయి ఉన్నట్లు తెలియజేశాయి. కేంద్రం నుంచి ఎమర్జెన్సీ క్రెడిట్ పథకం కింద మరో రూ. 1,292 కోట్ల రుణం పొందినట్లు వెల్లడించాయి. వెరసి గో ఫస్ట్ మొత్తం రూ. 11,000 కోట్ల రుణ భారాన్ని మోస్తున్నట్లు చెబుతున్నాయి. 2023 మే 2న కార్యకలాపాలు నిలిపివేసిన కంపెనీ 8 రోజుల తదుపరి జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)కు స్వచ్చంద దివాలా పిటీషన్‌ను దాఖలు చేసింది. -
ఐడీబీఐ బ్యాంక్ నికర లాభం రూ.1,323 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను ఐడీబీఐ బ్యాంక్ రూ.1,323 కోట్ల నికర లాభాన్ని గడించింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడంతో లాభంలో 60 శాతం వృద్ధి నమోదైందని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.6,066 కోట్లుగా ఉన్న బ్యాంక్ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.6,924 కోట్లకు చేరుకున్నట్టు వెల్లడించింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 16.51 శాతం నుంచి 4.90 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏ 1.15 శాతం నుంచి 0.39 శాతానికి దిగొచ్చింది. రెండో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసిన సమయానికి బ్యాంక్ ప్రమోటర్లయిన ఎల్ఐసీ, భారత ప్రభుత్వం వద్ద 94.72శాతం వాటా ఉంది. ఎఫ్ఐఐల వద్ద 0.40శాతం, డీఐఐల వద్ద 0.24శాతం, రిటైల్ ముదుపర్ల వద్ద 4.62శాతం వాటా ఉంది. -
అదిరిపోయే ఫిక్స్డ్ డిపాజిట్ పథకం.. తక్కువ కాలపరిమితి.. ఎక్కువ వడ్డీ!
తక్కువ కాలపరిమితితో ఎక్కువ వడ్డీనిచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ల కోసం చూస్తున్నవారి కోసం ఐడీబీఐ బ్యాంక్ అదిరిపోయే ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని తీసుకొచ్చింది. 375 రోజుల కాలపరిమితితో కొత్త ఎఫ్డీ పథకాన్ని ప్రవేశపెట్టింది. జూలై 14వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన ఈ ఎఫ్డీ పథకంపై సాధారణ ప్రజలకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ రేటును ఐడీబీఐ అందిస్తోంది. ‘అమృత్ మహోత్సవ్ ఎఫ్డీ’ ప్రోగ్రాంలో భాగంగా ఈ కొత్త పథకాన్ని ఐడీబీఐ ప్రారంభించింది. కాగా ఇదే ప్రోగ్రాం కింద 444 రోజుల కాలపరిమితితో ఓ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని ఇదివరకే ప్రవేశపెట్టింది. ఈ రెండు ఎఫ్డీ పథకాలు ఆగస్టు 15 వరకు చెల్లుబాటులో ఉంటాయని ఐడీబీఐ తన వెబ్సైట్లో పేర్కొంది. ఇదీ చదవండి ➤ ‘ఎస్బీఐ యోనో’ను ఇక ఏ బ్యాంక్ కస్టమర్ అయినా వాడొచ్చు.. ఆ యూపీఐ యాప్‌లకు గట్టిపోటీ! ప్రస్తుతం ఉన్న 444 రోజుల వ్యవధి ఎఫ్డీ పథకానికి సంబంధించి కాలబుల్ (మెచ్యూరిటీ కంటే ముందే విరమించుకోవడం) ఆప్షన్‌పై గరిష్టంగా 7.65 శాతం, నాన్-కాల్ ఎంపిక కింద గరిష్టంగా 7.75 శాతం వడ్డీ లభిస్తుంది. -
IDBI: సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్, పూర్తి వివరాలు చూడండి!
సాక్షి,ముంబై: ప్రైవేట్ బ్యాంకు ఐడీబీఐ సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ చెప్పింది. "అమృత్ మహోత్సవ్ ఎఫ్డీ" ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఏడు రోజుల నుంచి ఐదేళ్ల కాల డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ఇందులో సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై గరిష్టంగా 7.65 శాతం వడ్డీని అందించ నుంది. దీంతోపాటు సాధారణ ప్రజలకు 7.15 శాతం వడ్డీని చెల్లిస్తుంది. (షాకింగ్ న్యూస్: యాపిల్ ఉద్యోగుల గుండెల్లో గుబులు) బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం,రెండుకోట్లరూపాయల లోపు డిపాజిట్లపై కొత్త రేట్లు ఏప్రిల్ 1, 2023 నుండి అమల్లో ఉన్నాయి. బ్యాంక్ ప్రస్తుతం సాధారణ ప్రజలకు 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు సీనియర్ సిటిజెన్లకు 3.5 శాతం నుండి 6.75 శాతం వరకు , మిగిలినవారికి 3-6.25 శాతం వడ్డీ రేటును వర్తింప చేస్తుంది. (స్టార్ బ్యాటర్ కోహ్లీ అరుదైన ఘనత: గిఫ్ట్‌గా అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్) ఆరు నెలలు, ఒక రోజు నుండి ఒక సంవత్సరం, ఒక సంవత్సరం నుండి రెండు సంవత్సరాల (444 రోజులు కాకుండా) మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై వరుసగా 5.5 శాతం, 6.75 శాతం వడ్డీని పొందవచ్చు.. ఐదేళ్ల పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్లకు సాధారణ ప్రజలకు 6.25 శాతం, సీనియర్లకు 6.75 శాతం వడ్డీ రేటును చెల్లించనుంది. (మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీం: 7.5 శాతం వడ్డీరేటు, ఎలా అప్లై చేయాలి?) -
విక్రయ బాటలోనే ఐడీబీఐ బ్యాంక్
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటైజేషన్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు బీమా రంగ పీఎస్ యూ దిగ్గజం ఎల్ఐసీతోపాటు ప్రమోటర్‌గా ఉన్న ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. బ్యాంకులో వ్యూహాత్మకంగా చేపట్టిన వాటా విక్రయం ప్రణాళికలకు అనుగుణంగా కొనసాగుతున్నట్లు తెలియజేసింది. వాటా విక్రయ ప్రక్రియ ప్రస్తుతం ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ)ను దాటి తదుపరి దశలోకి చేరినట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే ట్వీట్ చేశారు . తద్వారా ఐడీబీఐ బ్యాంకు డిజిన్వెస్ట్‌మెంట్ వాయిదా పడే వీలున్నట్లు మీడియాలో వస్తున్న వార్తల కు చెక్ పెట్టారు. ఇప్పటికే పలు సంస్థల నుంచి ఈవోఐ బిడ్స్ దాఖలు కావడంతో తదుపరి కార్యాచరణకు తెరతీసినట్లు వెల్లడించారు. బ్యాంకులో ఎల్ఐసీ, ప్రభుత్వం సంయుక్తంగా 94.72% వాటాను కలిగి ఉన్న విషయం విదితమే. వెరసి బ్యాంకు ప్రయివేటైజేషన్‌లో భాగంగా దాదాపు 61% వాటాను సంయుక్తంగా విక్రయానికి ఉంచాయి. ప్రభుత్వం 30.48 శాతం, ఎల్ఐసీ 30.24 శాతం వాటాను ఆఫర్ చేస్తున్నాయి. -
ఐడీబీఐ బ్యాంక్ లాభం జూమ్
ప్రభుత్వ రంగ సంస్థ ఐడీబీఐ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 927 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 578 కోట్లతో పోలిస్తే ఇది 60 శాతం అధికం. ప్రొవిజన్లు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించాయి. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) సైతం 23 శాతం ఎగసి రూ. 2,925 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 2,383 కోట్ల ఎన్ఐఐ నమోదైంది. ఈ కాలంలో స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 21.68 శాతం నుంచి 13.82 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు 1.81 శాతం నుంచి 1.07 శాతానికి తగ్గాయి. నికర వడ్డీ మార్జిన్లు 3.88 శాతం నుంచి 4.59 శాతానికి బలపడ్డాయి. ప్రొవిజన్లు రూ. 939 కోట్ల నుంచి భారీగా తగ్గి రూ. 233 కోట్లకు పరిమితమయ్యాయి. కనీస మూలధన నిష్పత్తి 20.14 శాతంగా నమోదైంది. బ్యాంకులో ప్రభుత్వం, ఎల్ఐసీకి సంయుక్తంగా 94.71 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే. దీనిలో 60.72 శాతం వాటాను విక్రయానికి ఉంచగా ఈ నెల మొదట్లో పలు సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్ దాఖలయ్యాయి. క్యూ3 ఫలితాల నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో యథాతథంగా రూ. 55 వద్దే ముగిసింది. చదవండి: అప్పట్లో రియల్ ఎస్టేట్ కింగ్.. ఇప్పుడేమో లక్షల కోట్ల ఆస్తిని కోల్పోయి -
ఐడీబీఐ బ్యాంక్ కొనుగోలుకి బిడ్స్
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకులో మెజారిటీ వాటా కొనుగోలుకి పలు సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ప్రాథమిక) బిడ్స్ దాఖలయ్యాయి. ప్రభుత్వం వ్యూహాత్మకంగా చేపట్టిన వాటా విక్రయానికి పలు కంపెనీలు ఆసక్తిని చూపినట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే ట్వీట్ ద్వారా వెల్లడించారు. బ్యాంకులో అటు ప్రభుత్వం, ఇటు ఎల్ఐసీ సంయుక్తంగా 60.72 శాతం వాటాను విక్రయించనున్నాయి. ఇందుకు అక్టోబర్‌లోనే ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్‌కు ఆహ్వానం పలికాయి. వీటికి ఈ నెల 7న గడువు ముగిసింది. తొలి దశ ముగియడంతో రెండో దశలో భాగంగా బిడ్డర్లు సాధ్యా సాధ్యాలను పరిశీలించాక ఫైనాన్షియల్ బిడ్స్‌ను దాఖలు చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వం, ఎల్ఐసీలకు సంయుక్తంగా 94.71 శాతం వాటా ఉంది. విజయ వంతమైన బిడ్డర్ సాధారణ వాటాదారుల నుంచి మరో 5.28 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించవలసి ఉంటుంది. కాగా.. కనీసం రూ. 22,500 కోట్ల నెట్‌వర్త్‌ను కలిగి ఉండటంతోపాటు.. ఐదేళ్లలో మూడేళ్లు లాభాలు ఆర్జించి ఉంటేనే బ్యాంకులో వాటా కొనుగోలుకి బిడ్ చేసేందుకు అర్హత ఉంటుందటూ గతంలోనే దీపమ్ తెలియజేసింది. చదవండి: మంచు కొండల్లో మహీంద్రా కారు రచ్చ.. రోడ్లపైకి రాకముందే అరుదైన రికార్డ్! -
ఐడీబీఐ బ్యాంక్ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకు ప్రయివేటైజేషన్‌లో భాగంగా బిడ్స్ దాఖలు గడువును ప్రభుత్వం తాజాగా పొడిగించింది. కొనుగోలుదారులు 2023 జనవరి 7వరకూ ప్రాథమిక బిడ్స్‌ను దాఖలు చేసేందుకు అనుమతిస్తున్నట్లు నోటీసు ద్వారా దీపమ్ పేర్కొంది. బ్యాంకులో 60.72 శాతం వాటాను ఎల్ఐసీ, కేంద్ర ప్రభుత్వం సంయ్తుంగా విక్రయించనున్నాయి. కొనుగోలుదారులు ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) లేదా ప్రాథమిక బిడ్స్‌ను దాఖలు చేసేందుకు తొలుత 2022 డిసెంబర్ 16వరకూ గడువును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లావాదేవీ నిర్వహిస్తున్న సలహాదారు సంస్థలకు గడువును పెంచవలసిందిగా అభ్యర్థనలు రావడంతో ప్రభుత్వం తాజా నిర్ణయాన్ని తీసుకుంది. కాగా.. ఈవోఐ ఫిజికల్ కాపీల దాఖలుకు గడువును సైతం 2022 డిసెంబర్ 23 నుంచి 2023 జనవరి 14వరకూ పొడిగిస్తున్నట్లు నోటీసులో దీపమ్ వెల్లడించింది. వాటాల వివరాలిలా.. ఐడీబీఐ బ్యాంకులో ఎల్ఐసీ(49.24 శాతం), ప్రభుత్వం(45.48 శాతం) సంయుక్తంగా 94.72 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఆఫర్లో భాగంగా ఎల్ఐసీ 30.24 శాతం, ప్రభుత్వం 30.48 శాతం చొప్పున వాటాలు విక్రయించనున్నాయి. దీంతో బ్యాంకును దక్కించుకున్న బిడ్డర్.. పబ్లిక్ నుంచి మరో 5.28 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను చేపట్టవలసి ఉంటుంది. కొనుగోలుదారు సంస్థ కనీసం రూ. 22,500 కోట్ల నెట్‌వర్త్‌ను కలిగి ఉండాలి. గత ఐదేళ్లలో మూడేళ్లపాటు నికర లాభాలు ఆర్జించి ఉండాలి. ఒక కన్సార్షియంలో భాగంగా నాలుగు సంస్థలను మాత్రమే అనుమతిస్తారు. బ్యాంకును సొంతం చేసుకున్నాక కనీసం 40 శాతం ఈక్విటీ పెట్టుబడులను ఐదేళ్లపాటు తప్పనిసరిగా లాకిన్ చేయవలసి ఉంటుంది. ఐడీబీఐ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 1.4% నీరసించి రూ. 57.3 వద్ద ముగిసింది. -
ప్రైవేటు బ్యాంకుగానే ఐడీబీఐ బ్యాంక్, స్పష్టం చేసిన కేంద్ర ఆర్ధిక శాఖ
న్యూఢిల్లీ: బీమా దిగ్గజం ఎల్ఐసీ, ప్రభుత్వ వాటాల విక్రయం తదుపరి ఐడీబీఐ బ్యాంకు దేశీ ప్రయివేట్ రంగ సంస్థగా కొనసాగనున్నట్లు ఆర్ధిక శాఖ తాజాగా స్పష్టతనిచ్చింది. వ్యూహాత్మక విక్ర యం తదుపరి మిగిలిన 15% ప్రభుత్వ వాటాను పబ్లిక్ షేర్ హోల్డింగ్‌గా పరిగణించనున్నట్లు తెలియజేసింది. పబ్లిక్కు కనీస వాటా(ఎంపీఎస్) విషయంలో బ్యాంకు కొత్త యాజమాన్యానికి అధిక గడువును అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా బ్యాంకును గెలుపొందిన బిడ్డర్ అనుబంధ సంస్థల పునర్వ్యవస్థీకరణను చేపట్టడంలో ఎలాంటి ఆంక్షలు ఉండబోవని స్పష్టం చేసింది. బ్యాంకు కొనుగోలులో భాగంగా ముందస్తు ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) సందేహాలకు సమాధానమిచ్చే ప్రక్రియకింద ఆర్థిక శాఖ నిర్వహణలోని దీపమ్ ఈ అంశాలపై వివరణ ఇచ్చింది. ఐడీబీఐ బ్యాంకు విక్రయానికి ప్రభుత్వం అక్టోబర్ 7న బిడ్స్‌కు ఆహ్వానం పలికింది. డిసెంబర్ 16కల్లా కొనుగోలుదారులు ఈవోఐలను దాఖలు చేయవలసి ఉంటుంది. సంయుక్తంగా విక్రయం ఐడీబీఐ బ్యాంకులో 60.72 శాతం వాటాను ప్రభుత్వం, ఎల్ఐసీ సంయుక్తంగా విక్రయించనున్నాయి. ప్రస్తుతం ఈ రెండింటికీ ఐడీబీఐ బ్యాంకులో 94.72 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఎల్ఐసీకి 49.24 శాతం, ప్రభుత్వానికి 45.48 శాతం చొప్పున వాటా ఉంది. పబ్లిక్ వాటా 5.2 శాతంగా నమోదైంది. దీంతో కొనుగోలుదారుడు 5.28 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించవలసి వస్తుంది. విక్ర యంలో భాగంగా ఎల్ఐసీ 30.24 శాతం, ప్రభు త్వం 30.48 శాతం చొప్పున వాటాలు ఆఫర్ చేయనున్నాయి. విక్రయానంతరం ప్రభుత్వం 15%, ఎల్ఐసీ 19% చొప్పున వాటాలను కలిగి ఉంటాయి. -
హోండా కార్లకు ఐడీబీఐ బ్యాంక్ రుణాలు
హైదరాబాద్: హోండా కార్స్ ఇండియా ఐడీబీఐ బ్యాంక్‌తో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా హోండా కార్స్ కస్టమర్లకు సులభ రుణ పథకాలను ఐడీబీఐ బ్యాంక్ ఆఫర్ చేయనుంది. అందుబాటు ధరలకే, వేగంగా, సులభంగా రుణాలను కస్టమర్లు పొందొచ్చని ఇరు సంస్థలు ప్రకటించాయి. ఆకర్షణీయమైన వడ్డీ రేటు, నామమాత్రపు ప్రాసెసింగ్ చార్జీలపై రుణాలు అందిస్తున్నట్టు తెలిపాయి. చదవండి: రెండో సారి నెం.1గా నిలిచిన ప్రముఖ కంపెనీ -
ఐడీబీఐ బ్యాంక్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఐడీబీఐ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 46 శాతం జంప్‌చేసి రూ. 828 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 567 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 5,130 కోట్ల నుంచి రూ. 6,066 కోట్లకు ఎగసింది. ఎల్ఐసీ నియంత్రణలోని బ్యాంక్ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 21.85 శాతం నుంచి 16.51 శాతానికి వెనకడుగు వేశాయి. నికర ఎన్పీఏలు 1.71 శాతం నుంచి 1.15 శాతానికి తగ్గాయి. మొండి రుణాలు, కంటింజెన్సీలకు కేటాయింపులు రూ. 571 కోట్ల నుంచి భారీగా తగ్గి రూ. 771 కోట్లకు పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐడీబీఐ బ్యాంక్ షేరు 1.4 శాతం నీరసించి రూ. 44 వద్ద ముగిసింది. చదవండి: భారీ షాక్.. దీపావళి తర్వాత ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్! -
ప్రైవేట్‌పరం కానున్న ఐడీబీఐ బ్యాంక్, ఎప్పటికంటే
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌లో కేంద్రం, ఎల్ఐసీ వాటాల విక్రయ ప్రక్రియ వచ్చే సెప్టెంబర్ నాటికి పూర్తి కావచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి మార్చి నాటికల్లా ఆర్థిక బిడ్లను ఆహ్వానించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఐడీబీఐ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం 30.48 శాతం, జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ 30.24 శాతం .. వెరసి 60.72 శాతం వాటాలు విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. గత వారమే ఇందుకోసం ప్రాథమిక బిడ్లను ఆహ్వానించారు. ఆసక్తి వ్యక్తీకరణ పత్రాల (ఈవోఐ) దాఖలుకు డిసెంబర్ 16 ఆఖరు తేదీ. రిజర్వ్ బ్యాంక్ అసెస్మెంటు పూర్తి చేసుకుని, హోమ్ శాఖ నుంచి భద్రతా క్లియరెన్సులు పొందిన బిడ్డర్లకు బ్యాంకు డేటా రూమ్ అందుబాటులోకి వస్తుంది. వివిధ అంశాలన్నింటిని మదింపు చేసుకున్న తర్వాత బిడ్డర్లు ఆర్థిక బిడ్లు దాఖలు చేస్తాయి. ఈ ప్రక్రియకు కనీసం ఆరు నెలలు పడుతుందని అధికారులు తెలిపారు. ఐడీబీఐ బ్యాంకును ప్రస్తుతం ప్రైవేట్ బ్యాంకుగా వర్గీకరిస్తున్నప్పటికీ అందులో కేంద్రం, ఎల్ఐసీకి ఏకంగా 95 శాతం వాటా ఉన్నందున ప్రభుత్వ రంగ సంస్థగానే పరిగణిస్తున్నారు. ప్రత్యేక కేసు కావడంతో వాటాల అమ్మకానికి సంబంధించి సాంకేతిక కారణాల వల్ల ప్రైవేటీకరణ పదం వాడకుండా వ్యూహాత్మక విక్రయం అని వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంకులో ఎల్ఐసీకి 49.24 శాతం, కేంద్రానికి 45.48 శాతం, సాధారణ షేర్హోల్డర్లకు 5.2 శాతం వాటాలు ఉన్నాయి. విక్రయం అనంతరం బ్యాంకులో కేంద్రం, ఎల్ఐసీల వాటా 94.72 శాతం నుంచి 34 శాతానికి తగ్గుతుంది. -
ఐడీబీఐ బ్యాంక్ విక్రయం షురూ
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటైజేషన్ ప్రక్రియకు ప్రభుత్వం తాజాగా తెరతీసింది. ఎల్ఐసీతో కలసి మొత్తం 60.72 శాతం వాటాను విక్రయించనుంది. ఇందుకు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్(ఈవోఐ)కు ఆహ్వానం పలికింది. ఆసక్తి గల సంస్థలు బిడ్స్ దాఖలు చేసేందుకు డిసెంబర్ 16 వరకూ గడువును ప్రకటించింది. ప్రస్తుతం బ్యాంకులో బీమా రంగ పీఎస్‌యూ ఎల్ఐసీకి 49.24 శాతం వాటా ఉంది. ప్రభుత్వం 45.48 శాతం వాటాను కలిగి ఉంది. వెరసి సంయుక్తంగా 94.72 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ప్రైవేటైజేషన్‌లో భాగంగా ప్రభుత్వం 30.48 శాతం, ఎల్ఐసీ 30.24 శాతం చొప్పున వాటాలు విక్రయించనున్నాయి. వాటాలతోపాటు బ్యాంకులో యాజమాన్య నియంత్రణను సైతం బదిలీ చేయనున్నట్లు బిడ్స్‌కు ఆహ్వానం పలికిన దీపమ్ వెల్లడించింది. ఇందుకు పలు నిబంధనలు వెల్లడించింది. డీల్ తదుపరి సంయుక్త వాటా 34 శాతానికి పరిమితంకానుంది. నిబంధనలివీ..: ఐడీబీఐ కొనుగోలుకి ఈవోఐ దాఖలు చేసే కంపెనీలు కనీసం రూ. 22,500 కోట్ల నెట్‌వర్త్‌ను కలిగి ఉండాలి. అంతేకాకుండా గత ఐదేళ్లలో మూడేళ్లపాటు లాభాలు ఆర్జించిన కంపెనీకి మాత్రమే బిడ్డింగ్‌కు అర్హత లభిస్తుంది. కన్సార్షియంగా ఏర్పాటైతే నాలుగు కంపెనీలను మించడానికి అనుమతించరు. విజయవంతమైన బిడ్డర్ కనీసం ఐదేళ్లపాటు బ్యాంకులో 40% వాటాను తప్పనిసరిగా లాకిన్ చేయాలి. భారీ పారిశ్రామిక, కార్పొరేట్ హౌస్‌లు, వ్యక్తులను బిడ్డింగ్‌కు అనుమతించరు. ఈ వార్తల నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్ షేరు 0.7 శాతం బలపడి రూ. 43 వద్ద ముగిసింది. ఈ ధరలో 60.72 శాతం వాటాకు రూ. 27,800 కోట్లు లభించే వీలుంది. -
మరీ ఇంత దారుణమా! ఈ బ్యాంకు అధికారులకు బుద్ది లేదా ?
విజయ్‌మాల్యా, మెహుల్ చోక్సీ, నీరవ్‌మోదీలను బ్యాంకులను మోసం చేశారు. దేశానికి ద్రోహం చేశారనే భావన ఇప్పటి వరకు చాలా మందిలో పేరుకు పోయింది. కానీ ఇప్పుడు చెప్పబోయే వివరాలు తెలిస్తే అవాక్కవడం ఖాయం. బ్యాంకులను డబ్బులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వాళ్లే ఎంతో నయం అనిపిస్తారు. ఎందుకంటే మన బ్యాంకులు అలా తయారయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ వార్తను మీరు చూడండి. కంపెనీ పేరు గ్రేట్ ఇండియన్ నోటంకి కంపెనీ దీన్ని ప్రమోట్ చేసిన వ్యక్తులు అనుమోద్ శర్మ, విరాఫ్ సర్కారీ, సంజయ్ చౌధరీలు. ఈ కంపెనీ చేసే వ్యాపారం విస్తరణ కోసం ఐడీబీఐ, హెచ్డీఎఫ్సీ, బ్యాంకు ఆఫ్ బరోడాల నుంచి భారీ ఎత్తున రుణం తీసుకుంది. గ్యారెంటీగా గ్రేట్ ఇండియన్ నోటంకి కంపెనీ పలు ఆస్తులను చూపించింది. ఇంతకీ ఈ ఆస్తులు కలిగి ఉన్న కంపెనీ పేరు గ్రేట్ ఇండియన్ తమాషా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్. రూ. 147 కోట్లు గ్రేట్ ఇండియన్ తమాషా కంపెనీ ఆస్తులను గ్యారెంటీగా ఉంచుకుని బ్యాంకు ఆఫ్ బరోడా 2015 ఫిబ్రవరి 13న ఏకంగా రూ.49.23 కోట్ల రుణం మంజూరు చేసింది. ఆ తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంకు అదే ఏడాది డిసెంబరు 11న రూ 6.26 కోట్ల రుణం ఇచ్చింది. ఈ రెండు బ్యాంకులకు అసలు, వడ్డీ చెల్లించలేదు ది గ్రేట్ ఇండియన్ నోటంకి కంపెనీ. దీంతో ఈసారి అప్పు కోసం ఐడీబీఐ బ్యాంకును సంప్రదించాయి. గ్రేట్ ఇండియన్ తమాషానే గ్యారెంటీగా చూపుతూ 2021 నవంబరు 25న ఏకంగా రూ.86.48 కోట్ల రుణం పొందింది. ఆస్తుల వేలం తమాషా కంపెనీ తమకు రుణం చెల్లించడం లేదంటూ హెచ్డీఎఫ్సీ, బ్యాంక్ ఆఫ్ బరోడాలు ఆలస్యంగా గుర్తించగా పెద్ద మొత్తంలో లోను ఇచ్చిన ఐడీబీఐ ఆలస్యంగా గమనించింది. చివరకు తమాషా కంపెనీకి కర్నాటకలో ఉన్న ఆస్తులు వేలం వేస్తామంటూ 2022 మేలో పేపర్ ప్రకటన ఇచ్చింది. కర్నాటకలో తమాషా కంపెనీకి వివిధ ప్రాంతాల్లో ఉన్న 107 ఎకరాలు, ఇతర స్థిర ఆస్తులను వేలం వేసి నష్టాలను పూడ్చుకుంటామంటూ ప్రకటన ఇచ్చాయి. ఈ మేరకు ఐడీబీఐ బ్యాంకు నుంచి ప్రకటన జారీ అయ్యింది. ఇదే ట్వీట్‌ను హర్షద్ మెహతా స్కామ్‌ను వెలికి తీసిన సుచేతా దలాల్ రీట్వీట్ చేయడంతో ఈ విషయం వైరల్ అవుతోంది. మోసగాళ్ల వల్లే కంపెనీ పేర్లు ‘ది గ్రేట్ ఇండియన్ నోటంకి’ అని గ్యారెంటీగా చూపించిన ఆస్తులు ‘ది గ్రేట్ తమాషా కంపెనీ’ అని నేరుగా కనిపించినా అధికారులు కనీసం బ్యాక్ గ్రౌండ్ చెక్ చేయకుండా ఇంత పెద్ద మొత్తంలో రుణాలు ఎలా మంజూరు చేశారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నోటంకి, తమాషా లాంటి పదాలు నేరుగా కనిపించినా కళ్లు మూసుకుని రుణాలు ఇచ్చారంటే వీళ్లకు అసలు బుద్ధి ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా బ్యాంకు అధికారులు, మోసగాళ్లతో కుమ్మక్కయిన కారణంగానే ఈ తరహా మోసాలు చోటు చేసుకుంటున్నాయంటున్నారు మరికొందరు. మాఫీ చేస్తారు మెహుల్ చోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కి రెండువేల కోట్ల రూపాయలు ఎగనామ పెట్టాడు. విజయ్‌మాల్యా ఎస్బీఐతో పాటు పలు బ్యాంకులకు పది వేల కోట్ల రూపాయలకు పైగా బాకీ పడ్డాడు.. ఈ జాబితాలో తమాషా లాంటి కంపెనీలు మరెన్నో ఉన్నాయి. ఇలా పేరుకుపోయిన అప్పులను అప్పుడప్పుడు బ్యాంకులు మాఫీ చేస్తుంటాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ తరహాలో మాఫీ చేసిన అప్పుల మొత్తం రెండు లక్షల కోట్ల రూపాయలకుపై మాటే. My god... this is not a joke!! https://t.co/uXtVTW4Cgr — Sucheta Dalal (@suchetadalal) June 20, 2022 చదవండి: రూ.3లకు కక్కుర్తి పడితే.. చివరకు ఏం జరిగిందంటే? -
ఐడీబీఐలో కొంత వాటాకు ఓకే..బ్యాంకెస్యూరెన్స్ కోసం ఎల్ఐసీ యోచన!
న్యూఢిల్లీ: బ్యాంకెస్యూరెన్స్ చానల్‌తో లబ్ది పొందేందుకు వీలుగా ఐడీబీఐ బ్యాంకులో బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ కొంతమేర వాటాను కొనసాగించే యోచనలో ఉంది. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా బ్యాంకులో ప్రభుత్వంసహా ఎల్ఐసీ వాటా విక్రయించే సన్నాహాల్లో ఉంది. ప్రస్తుతం ఎల్ఐసీ ఈ నెల 4న ప్రారంభంకానున్న సొంత పబ్లిక్ ఇష్యూకి సంబంధించిన రోడ్‌షోల నిర్వహణలో ఉంది. ఈ నేపథ్యంలో బ్యాంకులో పూర్తి వాటాను విక్రయించబోమని ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం బ్యాంకులోగల 45 శాతం వాటా విక్రయ ప్రణాళికల్లో ఉంది. ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటైజేషన్ ప్రక్రియ జరుగుతున్నదని, ఎంతమేర వాటాను విక్రయించేదీ ఎల్ఐసీ రోడ్‌షోల తదుపరి నిర్ణయించనున్నట్లు గత వారం దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే వెల్లడించారు. కాగా.. 2019 జనవరి 21నుంచి ఎల్ఐసీకి ఐడీబీఐ బ్యాంక్ అనుబంధ సంస్థగా మారిన విషయం విదితమే. ఎల్ఐసీకి 49.24 శాతం వాటా ఉంది. బ్యాంక్ బ్రాంచీల నెట్వర్క్, కస్టమర్ల ద్వారా ఇన్సూరెన్స్ ప్రొడక్టుల విక్రయానికి బ్యాంకెస్యూరెన్స్ దోహదపడుతుంది. దీంతో ఎల్ఐసీ బ్యాంకులో కొంతమేర వాటాను కొనసాగించే యోచనలో ఉన్నట్లు కుమార్ తెలియజేశారు. -
ఆ బ్యాంకు కూడా ప్రైవేటు పరం ఖాయం!
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ ప్రక్రియ యధాతథంగానే కొనసాగుతోందని ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే తెలిపారు. రోడ్‌షో పూర్తయిన తర్వాత వాటాల విక్రయ పరిమాణంపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన వివరించారు. అయితే, ప్రస్తుతం ఎల్ఐసీ చేతిలో ఉన్న మేనేజ్మెంట్ హక్కులను కచ్చితంగా కొత్త కొనుగోలుదారుకు బదలాయించే అవకాశం ఉందని పాండే వివరించారు. ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వం తనకున్న వాటాలను, ఇన్వెస్టర్ల స్పందనను బట్టి, ఏకమొత్తంగా విక్రయించాలా లేక విడతలవారీగా విక్రయించాలా అన్న దానిపై నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వానికి 45.48 శాతం, ఎల్ఐసీకి 49.24 శాతం వాటాలు ఉన్నాయి. బ్యాంకులో వ్యూహాత్మక డిజిన్వెస్ట్‌మెంట్, మేనేజ్మెంట్ హక్కుల బదలాయింపునకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ గతేడాది మేలో సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది. మరోవైపు, ఎల్ఐసీని లిస్ట్ చేయడమనేది కేంద్ర ప్రభుత్వ దీర్ఘకాలిక వ్యూహాల్లో భాగమని పాండే చెప్పారు. ముందుగా 5 శాతం వాటాలు విక్రయించాలని భావించినా, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 3.5 శాతానికి పరిమితం చేస్తున్నట్లు వివరించారు. చదవండి: మా 25వేల కోట్లను ఇన్వెస్టర్లకు ఇవ్వండి, లేదంటే తిరిగి మాకే ఇచ్చేయండి! -
పీఎన్బీ, ఐడీబీఐ బ్యాంకుల్లో కీలక పరిణామం.. !
న్యూఢిల్లీ: పీఎస్‌యూ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ), ప్రయివేట్ రంగ సంస్థ ఐడీబీఐ బ్యాంకులలో ప్రభుత్వం ఇద్దరు డైరెక్టర్లను నామినేట్ చేయనుంది. పంకజ్ శర్మను 2022 ఏప్రిల్ 11 నుంచి డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించినట్లు పీఎన్బీ పేర్కొంది. తదుపరి ఆదేశాలు జారీ అయ్యేటంతవరకూ బాధ్యతల్లో కొనసాగుతారని తెలియజేసింది. పంకజ్ జైన్ స్థానే శర్మ పదవిని చేపట్టినట్లు వెల్లడించింది. ప్రస్తుతం పంకజ్ శర్మ ఆర్థిక శాఖకు చెందిన ఫైనాన్షియల్ సర్వీసుల విభాగంలో సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వం ఈ నెల 11న విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా మనోజ్ సహాయ్, సుశీల్ కుమార్ సింగ్‌లను డైరెక్టర్లుగా నియమించినట్లు ఐడీబీఐ బ్యాంక్ వెల్లడించింది. మీరా శ్వాంప్, అన్షుమన్ శర్మ స్థానే వీరి నియామకం వెంటనే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. తదుపరి ఆదేశాలు జారీ అయ్యేవరకు వీరు బాధ్యతలు నిర్వహిస్తారని పేర్కొంది. ప్రత్యేక నియామకం ప్రస్తుతం ప్రయివేట్ రంగ సంస్థగా ఉన్న ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వానికి 45.48 శాతం, ఎల్ఐసీకి 49.24 శాతం చొప్పున వాటా ఉంది. దీంతో కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 161(3) ప్రకారం ప్రభుత్వ నామినీ డైరెక్టర్లకు బాధ్యతలు అప్పగించినట్లు బ్యాంక్ వివరించింది. కాగా.. ప్రభుత్వం వెనువెంటనే అమల్లోకి వచ్చే విధంగా ఎంజీ జయశ్రీని డైరెక్టర్‌గా నామినేట్ చేసినట్లు పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ పేర్కొంది. ఆర్థిక శాఖలోని ఫైనాన్షియల్ సర్వీసుల విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌గా జయశ్రీ విధులు నిర్వహిస్తున్నట్లు తెలియజేసింది. ప్రభుత్వ నామినీ డైరెక్టర్ల నియామక వార్తల నేపథ్యంలో పీఎన్బీ షేరు బీఎస్ఈలో 2 శాతం క్షీణించి రూ. 36.75 వద్ద, ఐడీబీఐ బ్యాంక్ 3 శాతం నష్టంతో రూ. 46 వద్ద ముగిశాయి. పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ 1.5 శాతం నీరసించి రూ. 17 వద్ద స్థిరపడింది. -
యాక్సిస్, ఐడీబీఐ బ్యాంకులకు ఆర్బీఐ భారీ షాక్!
ముంబై: నిబంధనల ఉల్లంఘనలపై ప్రయివేట్ రంగ సంస్థలు యాక్సిస్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్‌లకు ఆర్బీఐ జరిమానాలు విధించింది. కేవైసీ సంబంధ మార్గదర్శకాలతోపాటు వివిధ నిబంధనలు పాటించకపోవడంతో యాక్సిస్ బ్యాంకుకు రూ. 93 లక్షల పెనాల్టీ విధించింది. ఈ బాటలో ఐడీబీఐ బ్యాంకును సైతం రూ. 90 లక్షల ఫైన్ కట్టమంటూ ఆదేశించింది. యాక్సిస్ బ్యాంక్ పొదుపు ఖాతాలలో కనీస నిల్వ అంశంలో చార్జీల విధింపు, కేవైసీ మార్గదర్శకాలు తదితరాలలో ఉల్లంఘనలు జరిగినట్లు ఆర్బీఐ పేర్కొంది. ఇక, మోసాల విషయంలో వాణిజ్య బ్యాంకులు, ఎంపిక చేసిన ఫైనాన్షియల్ సంస్థలు పాటించాల్సిన వర్గీకరణ, రిపోర్టింగ్ నిబంధనలను పాటించనందుకు గాను ఐడీబీఐ బ్యాంక్‌కు పెనాల్టీ విధించినట్లు ఆర్బీఐ వెల్లడించింది. కార్పొరేట్ కస్టమర్లు, స్పాన్సర్ బ్యాంకుల మధ్య చెల్లింపుల వ్యవస్థ నియంత్రణను పటిష్టపరచడంలో మార్గదర్శకాల ఉల్లంఘన సైతం వీటిలో ఉన్నట్లు వివరించింది. -
ఐడీబీఐ బ్యాంక్‌లో కొనసాగుతాం
న్యూఢిల్లీ: బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ తాజాగా అనుబంధ సంస్థ ఐడీబీఐ బ్యాంకులో పూర్తి వాటాను విక్రయించబోమంటూ స్పష్టం చేసింది. బ్యాంక్‌ఎస్యూరెన్స్ చానల్ ద్వారా లబ్ది పొందేందుకు వీలుగా కొంతమేర వాటాతో కొనసాగనున్నట్లు తెలియజేసింది. అదనపు వాటాను కొనుగోలు చేయడంతో ఎల్ఐసీకి 2019 జనవరి 21 నుంచి ఐడీబీఐ బ్యాంకు అనుబంధ సంస్థగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. క్విప్ ద్వారా ఎల్ఐసీ 49.24 శాతం వాటాను సొంతం చేసుకోవడంతో 2020 డిసెంబర్ 19న బ్యాంకు సహచర సంస్థగా వ్యవహరిస్తోంది. కాగా.. బ్యాంక్‌ఎస్యూరెన్స్‌లో భాగంగా ఎల్ఐసీ బ్యాంకు కస్టమర్లకు సంస్థ బ్రాంచీల ద్వారా బీమా ప్రొడక్టులను విక్రయించగలుగుతోంది. ఇది కంపెనీకి దన్నునిస్తుండటంతో ఐపీవో తదుపరి కూడా బ్యాంకులో కొంతమేర వాటాను కొనసాగించే యోచనలో ఉన్నట్లు ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ వెల్లడించారు. నిజానికి వ్యూహాత్మకంగానే బ్యాంకులో వాటాను చేజిక్కించుకున్నట్లు పేర్కొన్నారు. ఇది రెండు సంస్థలకూ ప్రయోజనకరమేనని వ్యాఖ్యానించారు. బ్యాంక్‌ఎస్యూరెన్స్‌లో భాగంగా కంపెనీ విభిన్న బ్యాంకులకు చెందిన 58,000 బ్రాంచీలతో పంపిణీ ఒప్పందాన్ని కలిగి ఉన్నట్లు వెల్లడించారు. ఈ దారిలో మరింత భారీ వృద్ధికి అవకాశమున్నట్లు వివరించారు. ఎన్ఎస్ఈలో ఐడీబీఐ బ్యాంకు షేరు దాదాపు 3 శాతం క్షీణించి రూ. 46 వద్ద ముగిసింది. -
ఎల్ఐసీకి ఐడీబీఐ బ్యాంక్ షాక్!
న్యూఢిల్లీ: రెండేళ్ల క్రితం మెజారిటీ వాటా దక్కించుకున్న ఐడీబీఐ బ్యాంకులో అదనపు పెట్టుబడులు చేపట్టవలసివస్తే కంపెనీ ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం పడే వీలున్నట్లు బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ తాజాగా పేర్కొంది. పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు అనువుగా కంపెనీ ఇటీవల సెబీకి దాఖలు చేసిన ముసాయిదా పత్రాల(ప్రాస్పెక్టస్)లో ఇంకా పలు అంశాలను ప్రస్తావించింది. డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూని చేపట్టనున్న సంగతి తెలిసిందే. తద్వారా సుమారు రూ. 63,000 కోట్లు సమీరించే యోచనలో ఉంది. కాగా.. ప్రాస్పెక్టస్‌లో ఎల్ఐసీ దాఖలు చేసిన వివరాల ప్రకారం.. 2019లో.. అర్హతగల సంస్థలకు షేర్ల జారీ(క్విప్) ద్వారా ఐడీబీఐ బ్యాంకులో 2019 అక్టోబర్ 23న ఎల్ఐసీ రూ. 4,743 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. ఆపై 2020 డిసెంబర్ 19న క్విప్‌లో భాగంగా మరో రూ. 1,435 కోట్లు అందించింది. 2021 మార్చి10 నుంచి ఆర్బీఐ నిర్దేశించిన దిద్దుబాటు చర్యల(పీసీఏ) నుంచి బ్యాంకు బయటపడినట్లు ఎల్ఐసీ పేర్కొంది. బ్యాంకు ఆర్థిక పరిస్థితులు, నిర్వహణా ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం పెట్టుబడుల సమీకరణ ఆవశ్యకత కనిపించడం లేదని తెలియజేసింది. అయితే ఐదేళ్ల కాలపరిమితి ముగిశాక అదనపు మూలధనం అవసరపడితే.. బ్యాంకు నిధులను సమకూర్చుకోలేకపోతే మరిన్ని పెట్టుబడులు చేపట్టవలసి రావచ్చునని వివరించింది. దీంతో కంపెనీ ఆర్థిక పరిస్థితులతోపాటు.. నిర్వహణా ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడవచ్చని ఎల్ఐసీ అభిప్రాయపడింది. 2023 నవంబర్‌కల్లా ఐదేళ్ల గడువు ముగియనుంది. సహచర సంస్థగా.. ఐడీబీఐ బ్యాంకు 2019 జనవరి 21న ఎల్ఐసీకి అనుబంధ సంస్థగా మారింది. దాదాపు 83 కోట్ల ఈక్విటీ షేర్ల అదనపు కొనుగోలు ద్వారా ఎల్ఐసీ వాటా 51 శాతానికి చేరింది. తదుపరి 2020 డిసెంబర్ 19న బ్యాంకును సహచర సంస్థగా మార్పు(రీక్లాసిఫై) చేశారు. బ్యాంకు చేపట్టిన క్విప్ నేపథ్యంలో ఎల్ఐసీ వాటా 49.24 శాతానికి చేరడం ఇందుకు కారణమైంది. మరోపక్క ఆర్బీఐ అనుమతించిన గడువు నుంచి ఐదేళ్లలోగా సహచర సంస్థలు ఐడీబీఐ బ్యాంకు లేదా ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో ఒకటి గృహ రుణ కార్యకలాపాలకు చెక్ పెట్టవలసి ఉన్నట్లు ఆర్బీఐ నిర్దేశించిన విషయాన్ని ప్రస్తావించింది. దీంతో కంపెనీ ఆర్థిక పరిస్థితులు, ఫలితాలు, క్యాష్ ఫ్లోపై ప్రభావం పడే అవకాశమున్నట్లు తెలియజేసింది. చదవండి: ఎల్ఐసీ పాలసీదారులకు అలర్ట్..! అందులో పాల్గోనాలంటే కచ్చితంగా.. -
తక్కువ వడ్డీకే వ్యక్తిగత రుణాలు అందించే టాప్ 10 బ్యాంకులు ఇవే..!
వ్యక్తిగత రుణం అనేది బ్యాంకు లేదా ఇతర ఆర్థిక సంస్థలు అందించే అసురక్షిత రుణం. అందుకే, వ్యక్తిగత రుణాల మీద వడ్డీ రేట్లు అనేవి సాదారణంగా అధికంగా ఉంటాయి. చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే తక్కువ వడ్డీకి వ్యక్తిగత రుణాలను అందిస్తాయి. ప్రస్తుతం బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు రకరకాల ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఎక్కువ శాతం అధిక క్రెడిట్ స్కోర్లు ఉన్న రుణగ్రహీతలకు మాత్రమే బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకు వ్యక్తిగత రుణాలు ఇస్తాయి. ఈ వ్యక్తిగత రుణ వడ్డీ రేట్లు బ్యాంకును బట్టి మారతాయి. ఉదాహరణకు, ఐడీబీఐ బ్యాంక్ వ్యక్తిగత రుణ వడ్డీ రేట్లు 8.15% నుంచి ప్రారంభమై 14% వరకు ఉంటాయి. ఇవి 12-60 నెలల కాలపరిమితితో రూ.25,000 నుంచి రూ.5 లక్షల వరకు లోన్ ఇస్తాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వ్యక్తిగత రుణాల రేట్లు 9.6% నుంచి ప్రారంభమై 15.65% వరకు ఉంటాయి. ఇవి 6-72 నెలల కాలపరిమితితో రూ.25,000 నుంచి రూ.20 లక్షల మధ్య అప్పు ఇవ్వవచ్చు. కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీకే వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి. ఏయే బ్యాంకులు ఎంత వడ్డీతో రుణాలను ఇస్తున్నాయో చూద్దాం. తక్కువ వడ్డీకే వ్యక్తిగత రుణాలు అందించే టాప్ 10 బ్యాంకులు ఇవే..! వ్యక్తిగత రుణంపై గరిష్ట మరియు కనీస పరిమితి ఎంత? అప్పు తీసుకోగల కనీస, గరిష్ట పరిమితి మొత్తం అనేది ప్రతి బ్యాంకుకు మారుతుంది. ఉదాహరణకు, వేతన జీవులు గరిష్టంగా రూ.20 లక్షల వరకు వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చని ఎస్బీఐ తన వెబ్ సైట్లో పేర్కొంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.12 లక్షల వరకు వ్యక్తిగత రుణాలు అందుబాటులో ఉన్నాయని తన వెబ్ సైట్లో తెలిపింది. టాటా క్యాపిటల్ వెబ్ సైట్ ప్రకారం.. మీ క్రెడిట్ విలువను బట్టి మీరు రూ.75,000 మరియు రూ.25 లక్షల వరకు వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు. (చదవండి: జియో పెనుసంచలనం: కేవలం ఒక్క రూపాయికే..) వ్యక్తిగత రుణానికి ఎవరు అర్హులు? వ్యక్తిగత రుణ అర్హత ఆవశ్యకతలు ఒక బ్యాంకుతో పోలిస్తే మరో బ్యాంకుకు భిన్నంగా ఉంటాయి. ఎస్బీఐ వెబ్ సైట్ ప్రకారం.. వ్యక్తిగత రుణానికి అర్హత పొందడానికి కనీసం నెలవారీ ఆదాయం రూ.15,000 ఉండాలి. వ్యక్తిగత రుణం కొరకు మీ అర్హతను నిర్ణయించడంలో మీ క్రెడిట్ స్కోరు కూడా ముఖ్య భూమిక పోషిస్తుంది. వ్యక్తులు కనీసం 2 సంవత్సరాలు ఒక సంస్థలో పనిచేస్తూ.. 21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారికి త్వరగా లోన్ వచ్చే అవకాశం ఉంది. నెలవారీ నికర ఆదాయం కనీసం రూ.25,000 ఉంటే హెచ్డీఎఫ్సీ బ్యాంకులో దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యక్తిగత రుణాల కాలపరిమితి ఎంత? వ్యక్తిగత రుణాల కాలపరిమితి అనేది ప్రతి బ్యాంకును మారుతుంటాయి. బ్యాంకులు వంటి రుణ సంస్థలు తరచుగా గరిష్టంగా ఐదు సంవత్సరాలకు వ్యక్తిగత రుణాలను ఇస్తాయి. వ్యక్తిగత రుణంలో ఇమిడి ఉన్న ఛార్జీలు ఏమిటి? ఒక బ్యాంకు లేదా ఎన్బిఎఫ్సి సంస్థలు వ్యక్తిగత రుణంపై ప్రాసెసింగ్ ఫీజులు, స్టాంప్ డ్యూటీ, ఇతర రెగ్యులేటరీ ఫీజులను వసూలు చేస్తాయి. అదేవిధంగా, రుణదాతపై ఆధారపడి ప్రీ పేమెంట్ లేదా ప్రీ క్లోజర్ ఫీజు కూడా విధిస్తారు. (చదవండి: టెస్లాలో కీచక పర్వం! అసభ్యంగా తాకుతూ వేధింపులు) -
ఐడీబీఐ బ్యాంక్ అమ్మకం, ప్రక్రియకు గడువు కోరిన మర్చంట్ బ్యాంకర్లు
న్యూఢిల్లీ: బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ నియంత్రణలోని ఐడీబీఐ బ్యాంకు విక్రయ ప్రక్రియకు మర్చంట్ బ్యాంకర్లు 52 వారాల గడువును ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాంకు యాజమాన్య నియంత్రణతోపాటు.. డిజిన్వెస్ట్మెంట్కు మే నెలలోనే కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఆపై వాటా విక్రయ వ్యవహారాన్ని నిర్వహించేందుకు ఆసక్తిగల సంస్థల నుంచి జులై 13కల్లా బిడ్స్ దాఖలైనట్లు దీపమ్ పేర్కొంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఏడు మర్చంట్ బ్యాంకర్ సంస్థలు రేసులో నిలిచాయి. అయితే వీటిలో అధిక శాతం సంస్థలు విక్రయ ప్రాసెస్‌కు 52 వారాల గడువును కోరుతున్నట్లు తెలుస్తోంది. పలు దశలలో బ్యాంకు ప్రయివేటైజేషన్ ప్రక్రియను చేపట్టవలసి ఉన్నట్లు ఈ సంస్థలు పేర్కొంటున్నాయి. అయితే ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలోగా ఐడీబీఐ బ్యాంక్ డిజిన్వెస్ట్‌మెంట్‌ను పూర్తిచేయాలని భావిస్తోంది. వెరసి మర్చంట్ బ్యాంకర్లు 26 వారాలు లేదా ఆరు నెలల్లోగా కొనుగోలుదారుడిని వెదకవలసి ఉంటుంది. ఐడీబీఐ బ్యాంక్ విక్రయాన్ని చేపట్టేందుకు డెలాయిట్ టచ్ టోమత్సు ఇండియా, ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఎల్ఎల్పీ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, జేఎం ఫైనాన్షియల్, కేపీఎంజీ, ఎస్బీఐ క్యాపిటల్, ఆర్బీఎస్ఏ క్యాపిటల్ అడ్వయిజర్స్ బిడ్స్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఐడీబీఐ బ్యాంకు వాటా విక్రయాన్ని నిర్వహించేందుకు కేపీఎంజీ రూ. 1కే బిడ్ దాఖలు చేసినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. బ్యాంకులో ఎల్ఐసీకి 49.24 శాతం, ప్రభుత్వానికి 45.48 శాతం చొప్పున వాటా ఉంది. ఇతరులు 5.29 శాతం వాటాను కలిగి ఉన్నారు. 2021–22 బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాదిలోగా ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటైజేషన్‌ను పూర్తిచేయనున్నట్లు ప్రతిపాదించిన విషయం విదితమే. చదవండి: నాలుగు బ్యాంకుల ప్రైవేటీకరణ!! -
బ్యాంకు జాబ్ ట్రై చేస్తున్నారా.. మీకో గుడ్ న్యూస్
డిగ్రీ ఉత్తీర్ణులై బ్యాంకు ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపరేషన్ సాగిస్తున్న అభ్యర్థులకు శుభవార్త. భారత ప్రభుత్వ రంగ సంస్థ.. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ).. 650 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 4వ తేదీన ఆన్లైన్ పరీక్ష నిర్వహించనుంది. ఎంపికైన అభ్యర్థులకు పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్(పీజీడీబీఎఫ్) కోర్సు ద్వారా శిక్షణ ఇచ్చి.. నియామకం ఖరారు చేస్తారు. ఈ నేపథ్యంలో.. ఐడీబీఐలో అసిస్టెంట్ మేనేజర్ కొలువులు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, శిక్షణ విధానం గురించి తెలుసుకుందాం.. ఇండస్ట్రియల్ డెలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ).. మణిపాల్(బెంగళూరు), నిట్టే(గ్రేటర్ నోయిడా) విద్యా సంస్థలతో కలిసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్(పీజీడీబీఎఫ్) కోర్సు ద్వారా.. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది పాటు(9 నెలలు తరగతి బోధన, 3 నెలల ఇంటర్న్‌షిప్) శిక్షణను అందిస్తారు. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి పీజీడీబీఎఫ్ సర్టిఫికేట్‌తోపాటు ఐడీబీఐలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం ఖాయం అవుతుంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 650. ఇందులో జనరల్–265, ఎస్సీ–97, ఎస్టీ–48, ఈడబ్ల్యూఎస్–65, ఓబీసీలకు–175 పోస్టులు కేటాయించారు. ఎంపిక ఇలా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో పరీక్ష ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూను నిర్వహిస్తారు. వీటిల్లో ప్రతిభ ఆధారంగా కోర్సుకు ఎంపిక చేస్తారు. 200 మార్కులకు ఆన్లైన్ టెస్ట్ ► ఆన్లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహలో 200 ప్రశ్నలు–200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మొత్తం నాలుగు విభాగాలు ఉంటాయి. లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ 60 ప్రశ్నలు–60 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు–40 మార్కులు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 40 ప్రశ్నలు–40 మార్కులు, జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్నెస్ 60 ప్రశ్నలు–60 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు లభిస్తుంది. నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు చొప్పున తగ్గిస్తారు. ఆన్లైన్ టెస్ట్‌లో అర్హత సాధించిన వారిని మాత్రమే పర్సనల్ ఇంటర్వ్యూలకు పిలుస్తారు. లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ ఈ విభాగంలో నంబర్స్, కోడింగ్, డీ కోడింగ్, అనాలజీ, సిరీస్,డైరెక్షన్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, బ్లడ్ రిలేషన్స్, ర్యాంకింగ్, పజిల్స్, ఆల్ఫాబెట్టెస్ట్ తదితర అంశాల నుంచి ప్రశ్నలను అడుగుతారు. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ ఇందులో వివిధ గణంకాలకు సంబంధించి అభ్యర్థుల మ్యాథమెటికల్ నైపుణ్యాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఎదురవుతాయి. డేటా ఆధారంగా విశ్లేషణ చేసే సామర్థ్యం అభ్యర్థుల్లో ఉందో లేదో ఈ విభాగం ద్వారా పరీక్షిస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ అభ్యర్థులకు ఇంగ్లిష్ భాషపై ఉన్న పట్టును పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, సెంటెన్స్ అరేంజ్మెంట్స్, సెంటెన్స్ కరెక్షన్స్, జంబుల్డ్ సెంటెన్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. గ్రామర్, వొక్యాబులరీ, యాంటోనిమ్స్, సినానిమ్స్‌పై పట్టు సాధించడం ద్వారా మంచి మార్కులు స్కోర్ చేయొచ్చు. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అభ్యర్థుల తార్కిక విశ్లేషణ నైపుణ్యాలను పరీక్షించే విధంగా ఈ విభాగంలో ప్రశ్నలుంటాయి. ఇందులో సింప్లిఫికేషన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, నంబర్ సిరీస్, టైమ్ అండ్ వర్క్, డేటా సఫీషియన్సీ, మిక్చర్ అండ్ అలిగేషన్స్ వంటి వాటిపై అభ్యర్థులు దృష్టిపెట్టాలి. జనరల్ అవేర్నెస్ బ్యాంకింగ్, ఎకానమీ, ఆర్బీఐ–విధులు, జీడీపీ, జీఎన్‌పీ, ఎన్డీపీ/ఎన్‌ఎన్‌పీ, ఇతర ఆర్థిక, ఫైనాన్స్ విభాగాలకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. ఎక్కువగా జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ప్రశ్నలను అడిగే అవకాశం ఉంది. కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి గత 5 లేదా 6 నెలల కాలానికి సంబంధించిన పరిణామాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సంస్థలు తీసుకున్న నిర్ణయాలు, ప్రముఖ వ్యక్తులు, రచనలు, క్రీడలు, ఒలింపిక్స్ సహా ఇతర ప్రాధాన్యత అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. ► అభ్యర్థులు తాజా కరెంట్ అఫైర్స్‌తోపాటు 2021 కేంద్ర బడ్జెట్, 2020–21 ఆర్థిక సర్వేలను కూడా అధ్యయనం చేయాలి. ప్రిపరేషన్ ఇలా ► ఆన్లైన్ పరీక్షను సెప్టెంబర్ 4వ తేదీన నిర్వహించనున్నారు. అంటే.. పరీక్షకు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అభ్యర్థులు ఈ సమయంలో ఎక్కువగా ముఖ్యాంశాల రివిజన్‌పై దృష్టిపెట్టాలి. ► బ్యాంకింగ్ పరీక్షలకు సన్నద్దమయ్యే అభ్యర్థులు ఇప్పటికే సిలబస్ అంశాల పట్ల అవగాహన కలిగి ఉంటారు. ఇప్పుడు పరీక్ష తేదీకి అనుగుణంగా రివిజన్ కొనసాగిస్తే సరిపోతుంది. ► ఆందోళన, ఒత్తిడికి గురికాకుండా.. బ్యాంక్ పరీక్షల గత ప్రశ్న పత్రాలు, మోడల్ టెస్టులు, మాక్ టెస్ట్‌లను ప్రాక్టీస్ చేస్తుండాలి. ఎంపికైతే ► ఎంపికైన అభ్యర్థులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్(పీజీడీబీఎఫ్) ద్వారా శిక్షణ ఇస్తారు. ఈ కోర్సు ఫీజు మూడున్నర లక్షలు. అర్హత గల అభ్యర్థులు ఐడీబీఐ నుంచి రుణం కోసం ప్రయత్నించొచ్చు. కోర్సులో చేరేటప్పుడే అభ్యర్థులు మూడేళ్ల సర్వీస్ బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. ► ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలం(తొమ్మిది నెలలు)లో నెలకు రూ.2500 చెల్లిస్తారు. ఇంటర్న్‌షిప్ కాలం(మూడు నెలలు)లో నెలకు రూ.పది వేలు అందిస్తారు. ► పీజీడీబీఎఫ్ కోర్సును విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్–ఏ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. వీరికి వేతన శ్రేణి రూ.36000–రూ.63840 లభిస్తుంది. ఇతర అలవెన్సులు, సౌకర్యాలు ఉంటాయి. ► పూర్తి వివరాలకు వెబ్సైట్: www.idbibank.in -
ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను సవరించిన ఐడీబీఐ
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) ఫిక్స్డ్ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లను సవరించింది. కొత్త వడ్డీ రేట్లు 2021 ఆగస్టు 16 నుంచి అమలులోకి రానున్నాయి. రూ.2 కోట్ల కంటే తక్కువ మొత్తంపై 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు మెచ్యూరిటీ కాలానికి సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్లపై కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ఐడీబీఐ బ్యాంక్ ఫిక్సిడ్ డిపాజిట్ల కొత్త వడ్డీ రేట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.(చదవండి: మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. డిజైన్ అదుర్స్!) -
అవుతారా.. ఐడీబీఐ ఎగ్జిక్యూటివ్!
బ్యాంక్ కొలువుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల కోసం ఇండస్ట్రియల్ డెలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ).. ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ విద్యార్హతతో మొత్తం 920 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీచేయనుంది. ఆన్లైన్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి, అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈనెల 18వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఐడీబీఐ 920 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎంపికైన వారు కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్(సీఎస్ఈ) లేదా టెల్లర్ సర్వీస్ ఎగ్టిక్యూటివ్‌గా పనిచేస్తారు. అంతేకాకుండా బ్యాంక్ మేనేజర్‌కు అవసరమైన వృత్తిపరమైన సహాయ సహకారాలను కూడా అందించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశంలో ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఒప్పంద ప్రాతిపదికన ఐడీబీఐ ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తుంది. మొదట ఏడాది కాలానికి గాను కాంట్రాక్టు పద్ధతిన తీసుకుంటారు. అనంతరం మంచి పనితీరు, ఖాళీలకు అనుగుణంగా మరో రెండేళ్ల వరకు ఈ ఒప్పందాన్ని పొడిగిస్తారు. మూడేళ్ల కాంట్రాక్టును విజయవంతంగా పూర్తిచేసుకున్న వారు.. ఐడీబీఐ అంతర్గతంగా నిర్వహించే ఎంపిక ప్రక్రియ ద్వారా బ్యాంకులో శాశ్వత ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్–1) పోస్టుకు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. వేతనాలు ► ఈ పోస్టులకు ఎంపికైన వారికి ఫిక్స్డ్ సాలరీస్‌ను అందిస్తారు. మొదటి ఏడాది ప్రతి నెల రూ.29000 చెల్లిస్తారు. రెండో ఏడాది కాంట్రాక్టు పొడిగించినట్లయితే.. ప్రతి నెల రూ.31,000.. అలాగే మూడో ఏడాది కూడా సేవలను వినియోగించుకుంటే ప్రతి నెల రూ.34,000 వేలు వేతనంగా చెల్లిస్తారు. ► ఈ పోస్టులకు ఎంపికైన వారికి డీఏ, హెచ్ఆర్ఏ వంటి ఏ రకమైన అలవెన్సులు లభించవు. అలాగే ఎటువంటి గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ ప్రయోజనాలు కూడా ఉండవు. అర్హతలు ► ఐడీబీఏ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైతే సరిపోతుంది. ► వయసు: 01–07–2021నాటికి 20–25ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు–5ఏళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్–5ఏళ్లు, ఓబీసీ–3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ఎంపిక ప్రక్రియ ఇలా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ ఆధారిత పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్టుకు పిలుస్తారు. రాత పరీక్షతోపాటు ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్టులోనూ అర్హత సాధించిన అభ్యర్థులను తుది ఎంపిక జాబితాకు పరిగణనలోకి తీసుకుంటారు.. ఆన్లైన్ పరీక్ష (సీబీటీ) ఆన్లైన్ పరీక్షను మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. మూడు విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. టెస్ట్ ఆఫ్ రీజనింగ్–50 ప్రశ్నలు–50 మార్కులు, టెస్ట్ ఆఫ్ వర్కింగ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్–50 ప్రశ్నలు–50 మార్కులు, టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్æ 50 ప్రశ్నలు– 50 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి నాల్గో వంతు (0.25) మార్కు తగ్గిస్తారు. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు చివరి తేదీ:ఆగస్టు18, 2021 nఆన్లైన్ పరీక్ష తేదీ:సెప్టెంబర్ 5, 2021 ► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం. ► వెబ్సైట్: www.idbibank.in -
ఐడిబిఐ వ్యూహాత్మక విక్రయానికి అంతా సిద్ధం
-
ఐడీబీఐ బ్యాంక్ లాభం రూ. 603 కోట్లు
న్యూఢిల్లీ: ఎల్ఐసీ నిర్వహణలోని ప్రయివేట్ రంగ సంస్థ ఐడీబీఐ బ్యాంక్ ఈ ఏడాది(2021–22) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో స్టాండెలోన్ నికర లాభం నాలుగు రెట్లుపైగా దూసుకెళ్లి రూ. 603 కోట్లను అధిగమించింది. గత ఆర్థిక సంవత్సరం(2020–21) ఇదే కాలంలో రూ. 144 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 5,901 కోట్ల నుంచి రూ. 6,555 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 41 శాతం వృద్ధితో రూ. 2,506 కోట్లను తాకింది. స్థూల మొండి బకాయిలు(ఎన్పీఏలు) 26.81 శాతం నుంచి 22.71 శాతానికి బలహీనపడ్డాయి. నికర ఎన్పీఏలు సైతం 3.55 శాతం నుంచి 1.67 శాతానికి దిగివచ్చాయి. ప్రొవిజన్లు రెట్టింపై రూ. 1,752 కోట్లకు చేరాయి. నికర వడ్డీ మార్జిన్లు 1.25 శాతం మెరుగుపడి 4.06 శాతాన్ని తాకాయి. రూ. 863 కోట్లమేర కోవిడ్–19 సంబంధ ప్రొవిజన్లు చేపట్టింది. కాగా.. క్యూ1లో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 159 కోట్ల నుంచి రూ. 598 కోట్లకు జంప్‌చేసింది. ఫలితాల నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్ షేరు 1.2% క్షీణించి రూ. 37.6 వద్ద ముగిసింది. -
ఐడీబీఐ బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్!
ముంబై: ఐడీబీఐ బ్యాంక్ తన బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. బ్యాంకులో పెట్టుబడి పెట్టిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అమలులో ఉన్న ఎఫ్డీ వడ్డీ రేట్లలో కొన్ని మార్పులు చేసింది. రూ. 2 కోట్ల కన్నా తక్కువ రిటైల్ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈ కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయని ఐడీబీఐ పేర్కొంది. ఐడీబీఐ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు 7 రోజుల నుంచి 20 సంవత్సరాల మెచ్యూరిటీతో వస్తాయి. ఈ వ్యవధిలోని అన్ని ఫిక్స్డ్ డిపాజిట్లపై 2.7% నుంచి 4.8%% వరకు వడ్డీ రేట్లను అమలు చేస్తుంది. ఈ కొత్త వడ్డీ రేట్లు అనేవి జూలై 14 నుంచి అమల్లోకి వచ్చాయి. ఐడీబీఐ బ్యాంక్ సీనియర్ సిటిజన్ల కోసం ఎఫ్డీలపై ప్రత్యేక వడ్డీ రేట్లను అందిస్తుంది. సీనియర్ సిటిజన్ల కొరకు ప్రస్తుతం బ్యాంక్ 3.2% నుంచి 5.3% వరకు ఎఫ్డీ రేట్లను అందిస్తుంది. ఈ డిపాజిట్లను పన్ను ఆదా చేసే ఎఫ్డీలు అని కూడా అంటారు. ఐడీబీఐ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బీపీఎస్ వడ్డీరేట్లను అన్ని టెనర్లలో అందిస్తుంది. ఐడీబీఐ బ్యాంక్ అందిస్తున్న వడ్డీ రేట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి. సీనియర్ సిటిజన్ల అయితే ఈ వడ్డీ రేట్లకు 50 బీపీఎస్(0.50 శాతం) అదనం అని గుర్తు పెట్టుకోవాలి. ఎఫ్డీలపై తాజా వడ్డీ రేట్లు 7 రోజుల నుంచి 14 రోజులు వరకు అయితే 2.7% 15 రోజుల నుంచి 30 రోజులు వరకు అయితే 2.7% 31 రోజుల నుంచి 45 రోజులు వరకు అయితే 2.8% 46 రోజుల నుంచి 60 రోజులు వరకు అయితే 3.00% 61 రోజుల నుంచి 90 రోజులు వరకు అయితే 3.00% 3 నెలల నుంచి 6 నెలలు వరకు అయితే 3.5% 6 నెలలు 1 రోజు నుంచి 270 రోజులు వరకు అయితే 4.3% 271 రోజుల నుంచి 1 సంవత్సరం వరకు అయితే 4.3% 1 సంవత్సరం వరకు అయితే 5% 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే ఎక్కువ అయితే 5.1% 2 సంవత్సరాల కంటే ఎక్కువ నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ అయితే 5.1% 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ అయితే 5.3% 5 సంవత్సరాల వరకు అయితే 5.25% 5 సంవత్సరాల కంటే ఎక్కువ నుంచి 7 సంవత్సరాల వరకు అయితే 5.25% 7 సంవత్సరాలకంటే ఎక్కువ నుంచి 10 సంవత్సరాల వరకు అయితే 5.25% 10 సంవత్సరాలకంటే ఎక్కువ నుంచి 20 సంవత్సరాలు వరకు అయితే 4.8% -
ఐడీబీఐ వాటాల అమ్మకాల ప్రక్రియ షురూ
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకులో వ్యూహాత్మక వాటాల విక్రయ ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టింది. వాటాల విక్రయం విషయంలో సేవల కోసం లావాదేవీల సలహాదారులు, న్యాయ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ పెట్టుడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) ప్రకటన విడుదల చేసింది. బిడ్లను సమర్పించేందుకు జూలై 13 వరకు గడువు ఇచ్చింది. ఐడీబీఐ బ్యాంకులో ఎల్ఐసీ 49.24 శాతం వాటాతో ప్రమోటర్‌గా ఉండగా.. కేంద్ర ప్రభుత్వానికీ 45.48 శాతం వాటా ఉంది. చదవండి: బ్యాంకులకు ‘వీడియోకాన్’ లో 8 శాతం వాటాలు -
ఈ బ్యాంకుల్లో అపరిమిత ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్..!
ముంబై: ఎటీఎం లావాదేవీలపై బ్యాంకులు ఇంటర్‌ఛేంజ్ ఫీజు వసూలు చేసుకోవచ్చునని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా గత కొన్ని రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో బ్యాంకు ఖాతాదారులపై మరింత భారం పడనుంది. ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ ట్రాన్సాక్షన్ పరిమితి దాటితే ట్రాన్సాక్షన్ ఫీజును వసూలు చేయనున్నాయి. పరిమితికి మించి లావాదేవీలు జరిపితే ఒక్కో లావాదేవీకి రూ. 20 నుంచి రూ.21 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలు 2022 జనవరి 1, నుంచి అమలులోకి రానున్నాయి. బ్యాంకు ఖాతాదారులు తమ సొంత బ్యాంకు ఏటీఎం నుంచి 5 ఉచిత ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చును. ఇతర బ్యాంకు ఏటీఎంలో మెట్రో నగరాల్లో 3 సార్లు, గ్రామీణ ప్రాంతాల్లో 5 ఉచిత లావాదేవీలను నిర్వహించవచ్చును. కాగా కొన్ని బ్యాంకులు తమ ఖాతాదారుల కోసం అపరిమిత ఎటీఎం లావాదేవీలు జరుపుకోవచ్చునని ప్రకటించాయి. ఇండస్ఇండ్, ఐడీబీఐ వంటి ప్రైవేటు బ్యాంకులు ఈ ఆఫర్‌ను తమ కస్టమర్లకు అందిస్తున్నాయి. ఐడీబీఐ బ్యాంకు ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన వాటికి పూర్తిగా అపరిమిత ఉచిత ఎటీఎం లావాదేవీలను జరుపుకోవచ్చును. కాగా ఐడీబీఐ బ్యాంక్ ఆర్బీఐ నిర్దేశించిన కనీస ఉచిత పరిమితులకు అనుగుణంగా ఉచిత ఎటీఎం లావాదేవీలను అందిస్తుంది. బ్యాంక్ తన స్వంత ఎటిఎంలలో 5 ఉచిత లావాదేవీలను, ఇతర బ్యాంక్ ఎటిఎంలలో, ఆరు ప్రధాన మెట్రో నగరాల్లో మూడు ఉచిత లావాదేవీలను కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని ఐడిబిఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జోర్టీ చాకో పేర్కొన్నారు. ఇండస్ఇండ్ బ్యాంక్ తన బ్యాంకు ఖాతాదారులకు దేశవ్యాప్తంగా ఏ బ్యాంక్ ఏటీఎం నుంచైనా అపరిమిత ఉచిత ఏటీఎం లావాదేవీలను అందిస్తోందని ఇండస్ఇండ్ బ్యాంక్ తన వెబ్సైట్ పేర్కొంది. సేవింగ్స్ ఖాతాలో రూ.25వేల కంటే ఎక్కువ సగటు బ్యాలెన్స్ నిర్వహిస్తోన్న అకౌంట్ హోల్డర్లకు సిటీ బ్యాంకు కూడా అపరిమిత ఉచిత లావాదేవీలను అందిస్తోంది. ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ దిగ్గజం ఎస్బీఐ తన ఖాతాదారులకు రూ.1 లక్ష కంటే ఎక్కువ బ్యాలెన్స్ కలిగి ఉన్న వారికి ఏ ఏటీఎంలోనైనా అపరిమిత ఉచిత ట్రాన్సాక్షన్ ఇవ్వనుంది. చదవండి: గోల్డ్ లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్! -
20 చెక్కులే ఉచితం... ఆ తర్వాత ఛార్జీలే
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకు ఉచిత చెక్కుల విషయంలో పరిమితి విధించింది. సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులు ఏడాదికి 20 ఉచిత చెక్కుల సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత ప్రతీ చెక్కు వినియోగంపై రూ.5ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బ్యాంకు నూతన ఖాతాదారులకు తొలి ఏడాది 60, ఆ తర్వాత నుంచి ప్రతీ ఏడాది 50 చెక్కులను ఉచితంగా అందిస్తుండడం గమనార్హం. ఈ పరిమితి దాటిన తర్వాతే ప్రతీ చెక్కు వినియోగంపై రూ.5 చార్జీని వసూలు చేస్తుండగా.. ఇకపై ఈ పరిమితి ఏడాదికి 20 చెక్కులుగా అమల్లోకి రానుంది. మినహాయింపు సబ్కా సేవింగ్ అకౌంట్ ఖాతాదారులకు చెక్కుల విషయంలో ఎటువంటి పరిమితి ఉండదంటూ బ్యాంకు స్పష్టం చేసింది. ఇక బ్యాంకు మాతృశాఖ, ఇతర శాఖల్లో ప్రతీ నెలా నగదు జమ లావాదేవీల పరిమితిలోనూ మార్పు చేసింది. జూలై 1 నుంచి ఈ సవరణలు అమల్లోకి రానున్నట్టు ఐడీబీఐ బ్యాంకు ప్రకటించింది. -
ఐడీబీఐ బ్యాంక్ అమ్మకానికి కేంద్ర కేబినెట్ ఓకే
న్యూఢిల్లీ: ఎల్ఐసీ నియంత్రణలోని ఐడీబీఐ బ్యాంకులో వ్యూహాత్మక వాటా విక్రయానికి(డిజిన్వెస్ట్‌మెంట్) కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ అనుమతిని తెలియజేసింది. అంతేకాకుండా యాజమాన్య నియంత్రణను సైతం బదిలీ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది మొదట్లో ఆర్థిక శాఖ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలకు అనుగుణంగా కేంద్ర కేబినెట్ ముందస్తు అనుమతినిచ్చింది. ఐడీబీఐ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసీలకు సంయుక్తంగా 94 శాతం వాటా ఉంది. ఎల్ఐసీ విడిగా 49.21 శాతం వాటాను కలిగి ఉంది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి నిర్ణయించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్లో ఐడీబీఐ బ్యాంకుతోపాటు మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రయివేటైజ్ చేసేందుకు ప్రతి పాదించిన విషయం విదితమే. 2019లో..: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ 2019 జనవరిలో ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం వాటాను కొనుగోలు చేసింది. కాగా.. ప్రభుత్వంతోపాటు బ్యాంకులో వాటాను విక్రయించేందుకు ఎల్ఐసీ బోర్డు సైతం అనుమతించింది. అంతేకాకుండా యాజమాన్య నియంత్రణను సైతం వదులుకునేందుకు అంగీకరించింది. వీటితోపాటు నియంత్రణ సంబంధ నిబంధనలకు అనుగుణంగా బ్యాంకులో వాటాను తగ్గించుకునేందుకు నిర్ణయించింది. బ్యాంకులో మెజారిటీ వాటాను సొంతం చేసుకోనున్న వ్యూహాత్మక కొనుగోలుదారుడు బిజినెస్‌ను పెంపొందించేందుకు వీలుగా పెట్టుబడులతోపాటు.. కొత్త టెక్నాలజీ, ఉత్తమ నిర్వహణ తదితరాలకు తెరతీసే వీలుంది. తద్వారా ఐడీబీఐ బ్యాంక్ భవిష్యత్‌లో పెట్టుబడులు లేదా ఇతర సహాయాల కోసం ప్రభుత్వం, ఎల్ఐసీలపై ఆధారపడవలసిన అవసరముండదని సంబంధిత వర్గాలు వ్యాఖ్యానించాయి. కాగా.. బ్యాంక్ ఐదేళ్ల తదుపరి గతేడాది(2020–21) నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఇదే కాలంలో 2017 మేలో ఆర్బీఐ విధించిన దిద్దుబాటు చర్యల(పీసీఏ) నుంచి సైతం 2021 మార్చిలో బయటపడడం గమనార్హం! ఈ వార్తలతో ఐడీబీఐ బ్యాంకు షేరు ఎన్ఎస్ఈలో 4.5% జంప్‌చేసి రూ. 38 వద్ద ముగిసింది. చదవండి: (ఆర్థిక సంక్షోభంగా మారకూడదు!: నిర్మలా) -
ఐడీబీఐ బ్యాంక్ టర్న్అరౌండ్
ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ ఐడీబీఐ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. రూ. 1,359 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2019–20) రూ. 12,887 కోట్ల నికర నష్టం నమోదైంది. వెరసి ఐదేళ్ల తరువాత టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించింది. ఇక గతేడాది చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో నికర లాభం 4 రెట్లు ఎగసి రూ.512 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 135 కోట్లు మాత్రమే ఆర్జించింది. 2017 మేలో ఆర్బీఐ విధించిన దిద్దుబాటు చర్యల(పీసీఏ) నుంచి సైతం మార్చిలో బయటపడినట్లు ఎల్ఐసీ నియంత్రణ లోని ఐడీబీఐ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. బ్యాంక్ అనుసరించిన టర్న్అరౌండ్ వ్యూహాలు ట్రాన్స్‌ఫార్మేషన్‌కు బాటను ఏర్పరచినట్లు బ్యాంక్ తెలియజేసింది. కాగా.. క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 38 శాతం ఎగసి రూ. 3,240 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 1.34 శాతం బలపడి 5.14 శాతానికి చేరాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 166 కోట్ల నుంచి రూ. 548 కోట్లకు జంప్ చేసింది. ఈ మార్చి త్రైమాసికంతో కలిపి వరుసగా ఐదు క్వార్టర్లపాటు బ్యాంకు లాభాలు ఆర్జించినట్లు ఐడీబీఐ ఎండీ, సీఈవో రాకేష్ శర్మ వివరించారు. ఎన్పీఏలు తగ్గాయ్: మార్చికల్లా ఐడీబీఐ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 27.53% నుంచి 22.37%కి బలహీనపడ్డాయి. ఇదే విధంగా నికర ఎన్పీఏలు 4.19% నుంచి 1.97%కి భారీగా తగ్గాయి. అయితే మొండి ప్రొవిజన్లు రూ. 1,738 కోట్ల నుంచి రూ. 2,367 కోట్లకు పెరిగాయి. కోవిడ్ సెకండ్ వేవ్కుగాను రూ. 500 కోట్లమేర ప్రొవిజన్లు చేపట్టినట్లు బ్యాంకు తెలియజేసింది. టైర్–1 పెట్టుబడులు 13.06%కి, సీఆర్ఏఆర్ 15.59 శాతానికి మెరుగుపడినట్లు బ్యాంక్ పేర్కొంది. క్యూ4లో తాజా మొండిబాకీలు రూ. 2,281 కోట్లకు చేరగా.. రికవరీలు రూ. 1,233 కోట్లుగా నమోదయ్యాయి. ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ షేరు 3 శాతం జంప్‌చేసి రూ. 36.25 వద్ద ముగిసింది. -
ఐడీబీఐ బ్యాంక్‌కు భారీ ఊరట
సాక్షి, ముంబై: ఐడీబీఐ బ్యాంక్‌ను తన తీవ్ర నియంత్రణా పర్యవేక్షణా పరిధి (లేదా తగిన దిద్దుబాటు చర్యలు-పీసీఏ) నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం తొలగించింది. బ్యాంక్ ఫైనాన్షియల్ పరిస్థితులు మెరుగుపడ్డంతో ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు నాలుగేళ్ల క్రితం 2017 మేలో ఐడీబీఐ బ్యాంక్ పీసీఏ ఫ్రేమ్‌వర్క్ కిందకు వచ్చిన సంగతి తెలిసిందే. మూలధన సమస్యలతో పాటు 2017 నాటికి నికర మొండిబకాయిలు బ్యాంక్ రుణాల్లో 13 శాతానికి చేరడం వంటి అంశాలు దీనికి నేపథ్యం. ఐడీబీఐ బ్యాంకుతోపాటు మరో రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటీకరణ చేయడానికి తగిన చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత నెల ప్రారంభంలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా పరిణామం నేపథ్యంలోనే ఆర్బీఐ తాజా ప్రకటన వెలువడ్డం గమనార్హం. కొనసాగనున్న పర్యవేక్షణ! తాజాగా 2021 ఫిబ్రవరి 18వ తేదీన ఫైనాన్షియల్ సూపర్విజన్ (బీఎఫ్ఎస్) బోర్డ్ ఐడీబీఐ బ్యాంక్ ఫైనాన్షియల్ పరిస్థితులపై సమీక్ష జరిపింది. 2020 డిసెంబర్ 31వ తేదీతో ముగిసిన త్రైమాసికానికి బ్యాంక్ ప్రకటించిన ఫలితాల ప్రకారం మూలధనం, ఎన్పీఏలు, లీవరేజ్ నిష్పత్తి అంశాల్లో బ్యాంక్ పీసీఏ మార్గదర్శకాలకు లోబడి ఉంది. అలాగే ఇందుకు సంబంధించి నియమనిబంధనలకు కట్టుబడి ఉంటానని కూడా బ్యాంక్ లిఖితపూర్వక హామీ ఇచ్చింది. ‘‘ఈ అంశాలను అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్‌ను పీసీఏ చట్రం నుంచి తీసివేస్తున్నాం. అయితే మూలధనం, ఎన్పీఏలు, లీవరేజ్ నిష్పత్తి వంటి అంశాలన్నింటినీ మున్ముందూ జాగ్రత్తగా పర్యవేక్షించడం జరుగుతుంది’’ అని ఆర్బీఐ విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. క్యూ3లో మంచి పనితీరు నేపథ్యం... లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు చెందిన ఐడీబీఐ బ్యాంక్ 2020–21 డిసెంబర్ త్రైమాసికంలో రూ.378 కోట్ల(స్టాండెలోన్ ప్రాతిపదికన) నికర లాభాన్ని ఆర్జించింది. వడ్డీ ఆదాయాలు బాగుండడం ఇందుకు ప్రధాన కారణం. 2019–20 ఇదే త్రైమాసికంలో బ్యాంక్ రూ.5,763 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ఇదే కాలంలో నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) రూ.1,532 కోట్ల నుంచి 18 శాతం వృద్ధితో రూ.1,810 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ మార్జిన్(ఎన్ఐఎం) 60 బేసిస్ పాయింట్లు(100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరిగి 2.27 శాతం నుంచి 2.87 శాతానికి ఎగసింది. స్థూల ఎన్పీఏలు 28.72% నుంచి 23.52 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు 5.25 శాతం నుంచి 1.94 శాతానికి దిగివచ్చాయి. 2019–20 క్యూ3తో పోల్చితే బ్యాంక్ పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయి. -
కరోనాతో స్పైస్‌జెట్- క్విప్‌తో ఐడీబీఐ బోర్లా
ముంబై, సాక్షి: వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలదే పైచేయిగా కనిపిస్తోంది. దీంతో తొలుత 400 పాయింట్లవరకూ పతనమైన సెన్సెక్స్ ప్రస్తుతం 150 పాయింట్లు క్షీణించి 45,404 వద్ద కదులుతోంది. కాగా.. కొత్త రూపు సంతరించుకుని వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ కారణంగా యూకేకు అన్ని దేశాలూ విమాన సర్వీసులను రద్దు చేశాయి. దీంతో స్పైస్‌జెట్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇక మరోపక్క క్విప్‌లో భాగంగా జారీ చేసిన షేర్లు తాజాగా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కావడంతో ఐడీబీఐ బ్యాంక్ కౌంటర్లోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూకట్టారు. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ నష్టాలతో పతన బాట పట్టాయి. వివరాలు ఇలా.. (సీరమ్ నుంచి 5 కోట్ల డోసేజీలకు రెడీ) స్పైస్‌జెట్ వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో యూకేకు నడుపుతున్న అన్ని విమాన సర్వీసులనూ ఈ నెల 31వరకూ దేశీ ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటికే పలు ప్రపంచ దేశాలు ఈ బాటలో నడుస్తున్నాయి. వందే భారత్ మిషన్‌లో భాగంగా స్పైస్‌జెట్ సైతం యూరోపియన్ దేశాలకు 30 విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. లండన్, ఆమ్స్టర్డామ్, టొరంటో, రోమ్, మిలన్‌లకు విమానాలను నడుపుతోంది. అంతేకాకుండా యూరప్, ఆఫ్రికా, అమెరికా తదితర దేశాలతో కనెక్టవిటీకి వీలుగా ఇటీవలే ఎమిరేట్స్‌తో అవగాహనా ఒప్పందాన్ని సైతం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో స్పైస్‌జెట్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎన్ఎస్ఈలో తొలుత స్పైస్‌జెట్ షేరు దాదాపు 10 శాతం పతనమై రూ. 82.35ను తాకింది. ప్రస్తుతం 8.5 శాతం నష్టంతో రూ. 84 దిగువన ట్రేడవుతోంది. సోమవారం సైతం ఇదే స్థాయిలో నష్టపోవడం గమనార్హం! ఐడీబీఐ బ్యాంక్ క్విప్‌లో భాగంగా ఐడీబీఐ బ్యాంక్ సంస్థాగత కొనుగోలుదారులకు(క్విబ్) జారీ చేసిన 37.18 కోట్ల షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీలలో నేటి నుంచి లిస్టయ్యాయి. 44 సంస్థలకు షేరుకి రూ. 38.60 ధరలో బ్యాంక్ షేర్లను జారీ చేసింది. తద్వారా రూ. 1,435 కోట్లకుపైగా సమకూర్చుకుంది. ఫ్లోర్ ధర రూ. 40.63తో పోలిస్తే 5 శాతం డిస్కౌంట్లో షేర్లను కేటాయించింది. ఇక మరోపక్క బ్యాంకులో మెజారిటీ వాటా కలిగిన పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ నుంచి రూ. 1,500 కోట్ల ఈక్విటీ పెట్టుబడులను సమకూర్చుకోనున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 20 శాతం కుప్పకూలింది. రూ. 30.75ను తాకింది. ప్రస్తుతం 13.4 శాతం నష్టంతో రూ. 33 వద్ద ట్రేడవుతోంది. -
ఖుషీఖుషీగా.. ఫైజర్- ఐడీబీఐ బ్యాంక్
సానుకూల విదేశీ సంకేతాలతో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 329 పాయింట్లు జంప్‌చేసి 35,744ను తాకగా.. నిఫ్టీ 94 పాయింట్లు ఎగసి 10,524 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కోవిడ్-19 చికిత్సకు వీలుగా రూపొందిస్తున్న వ్యాక్సిన్ సత్ఫలితాలను ఇస్తున్నట్లు యూఎస్ మాతృ సంస్థ ఫైజర్ ఇంక్ ప్రకటించడంతో దేశీ అనుబంధ సంస్థకు డిమాండ్ పెరిగింది. వెరసి ఫైజర్ లిమిటెడ్ జోరందుకుంది. ఇక మరోపక్క ఐడీబీఐ బ్యాంక్ కౌంటర్లో ర్యాలీ కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతుండటంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఫైజర్ లిమిటెడ్ జర్మన్ కంపెనీ బయోఎన్‌టెక్‌తో భాగస్వామ్యంలో అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ కోవిడ్-19 రోగులపై నిర్వహించిన పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు ఫైజర్ ఇంక్ తాజాగా పేర్కొంది. దీంతో బుధవారం యూఎస్ మార్కెట్లో ఫైజర్ ఇంక్ షేరు 3 శాతం బలపడింది. ఈ బాటలో దేశీ అనుబంధ కంపెనీ ఫైజర్ లిమిటెడ్‌కూ డిమాండ్ పెరిగింది. మాతృ సంస్థ నుంచి వ్యాక్సిన్ వెలువడితే.. దేశీయంగానూ ఫైజర్ లిమిటెడ్ లబ్ది పొందే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఈ కౌంటర్ వెలుగులోకి వచ్చినట్లు తెలియజేశారు. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఫైజర్ లిమిటెడ్ షేరు 5 శాతం జంప్‌చేసి 4,170 వద్ద ట్రేడవుతోంది. తొలుత 8 శాతం ఎగసి రూ. 4275 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఐడీబీఐ బ్యాంక్ గత నెల రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న ఐడీబీఐ బ్యాంక్ కౌంటర్‌కు మరోసారి భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో బ్యాంక్ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. 48.60 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. బ్యాంక్ మార్కెట్ కేపిటలైజేషన్(విలువ) రూ. 50,000 కోట్లను తాకింది. తద్వారా పీఎన్బీ, ఇండస్ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంకులను మార్కెట్ విలువలో ఐడీబీఐ బ్యాంక్ అధిగమించింది. జూన్ 1 నుంచీ ఐడీబీఐ బ్యాంక్ కౌంటర్ ఏకంగా 137 శాతం ర్యాలీ చేసింది. రూ. 20.3 స్థాయి నుంచి బలపడుతూ వస్తోంది. 13 త్రైమాసికాల తదుపరి గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో బ్యాంక్ నికర లాభాలు ఆర్జించడంతో ఈ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీనికితోడు ఇటీవల బీమా అనుబంధ విభాగం ఐడీబీఐ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో 27 శాతం వాటా విక్రయించేందుకు బ్యాంక్ బోర్డు అనుమతించడం ఇందుకు జత కలిసినట్లు తెలియజేశారు. -
ఐటీసీ, ఐడీబీఐ బ్యాంక్.. లాభాల్లో
ప్రపంచ మార్కెట్లు డీలా పడటంతో దేశీ స్టాక్ మార్కెట్లు సైతం నీరసంగా ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రస్తుతం సెన్సెక్స్ 395 పాయింట్లు పతనమై 34,776కు చేరింది. నిఫ్టీ సైతం 122 పాయింట్లు కోల్పోయి 10,261 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్ నష్టాలలోనూ విభిన్న వార్తల కారణంగా డైవర్సిఫైడ్ బ్లూచిప్ ఐటీసీ లిమిటెడ్, ఐడీబీఐ బ్యాంక్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వివరాలు చూద్దాం.. ఐటీసీ లిమిటెడ్ గతేడాది(2019-20) చివరి త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ కౌంటర్‌కు డిమాండ్ కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు దాదాపు 2 శాతం పుంజుకుని రూ. 199వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 203 వరకూ బలపడింది. క్యూ4(జనవరి-మార్చి)లో నికర లాభం 9 శాతం పెరిగి రూ. 3927 కోట్లకు చేరింది. ఇందుకు పన్ను ఆదా దోహదపడగా.. మొత్తం ఆదాయం 5 శాతం క్షీణించి రూ. 12,561 కోట్లకు పరిమితమైంది. వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 10.15 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. ఐడీబీఐ బ్యాంక్ అనుబంధ సంస్థ ఐడీబీఐ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో 27 శాతం వాటాను విక్రయించేందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ఐడీబీఐ బ్యాంక్ తాజాగా పేర్కొంది. ఐడీబీఐ ఫెడరల్ లైఫ్‌లో బ్యాంక్‌కు 48 శాతం వాటా ఉంది. ప్రయివేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్, డచ్ కంపెనీ ఏజియస్ ఇన్సూరెన్స్ ఇంటర్నేషనల్ విడిగా 26 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నాయి. వాటా విక్రయ వార్తల నేపథ్యంలో తొలుత ఎన్ఎస్ఈలో ఐడీబీఐ బ్యాంక్ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 42కు చేరింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 3 శాతం లాభపడి రూ. 41 వద్ద ట్రేడవుతోంది. -
ఐడీబీఐ బ్యాంక్ షేరు జోరు
బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు పతనంకాగా.. ఐడీబీఐ బ్యాంక్ కౌంటర్‌కు మాత్రం డిమాండ్ పెరిగింది. బ్యాంకులో మిగిలిన వాటాను విక్రయించనున్నట్లు బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించడంతో ఈ షేరు 10 శాతం దూసుకెళ్లింది. బీఎస్ఈలో శనివారం ఐడీబీఐ బ్యాంకు షేరు రూ. 3.4 ఎగసి రూ. 37.30 వద్ద ముగిసింది. ప్రమోటర్‌గా ప్రభుత్వం ఐడీబీఐ బ్యాంకులో 46.5 శాతం వాటాను కలిగి ఉంది. ఎల్ఐసీకి 51 శాతం వాటా ఉంది. గత సెప్టెంబర్‌లో ఎల్ఐసీ, ప్రభుత్వం సంయుక్తంగా బ్యాంకులో రూ. 9300 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. బ్యాంకు పెట్టుబడి అవసరాలకు తదుపరి ఎల్ఐసీ మరో రూ. 4743 కోట్లను పంప్చేసింది. కాగా.. ప్రభుత్వం స్టాక్ ఎక్సే్ఛంజీల ద్వారా ఐడీబీఐ బ్యాంకులో వాటాను విక్రయించేందుకు నిర్ణయించుకున్నట్లు తాజాగా వెల్లడించింది. -
ఐడీబీఐ, ఎల్ఐసీలో వాటా అమ్మకం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్టుగానే ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయానికి సిద్ధమవుతోంది. ఆర్థిక బడ్జెట్ 2020లో ఈ మేరకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ప్రభుత్వ పెట్టుబడుల చొరవలో భాగంగా తన వాటాలను విక్రయించనుందని ఆర్థికమంత్రి ప్రకటించారు. ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసీప్రయివేటీకరణ క్రమంలో వాటాను అమ్మకానికి పెట్టింది. అటు ఐడీబీఐ వాటాల విక్రయానికి నిర్ణయం. త్వరలో ఎల్ఐసీ స్టాక్మార్కెట్లో లిస్టింగ్ చేయనుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి)లో తన హోల్డింగ్‌లో కొంత భాగాన్ని ప్రారంభ పబ్లిక్ ఆఫర్ ద్వారా విక్రయించాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని చెప్పారు. ప్రస్తుతం, ఎల్ఐసీలో ప్రభుత్వం 100 శాతం వాటాను కలిగి ఉంది. ఈ ప్రకటనతో ఐడీబీఐబ్యాంక్ షేర్లు బీఎస్ఈలో 17.4 శాతం పెరిగి 39.8 వద్ద ట్రేడ్ అవుతోంది. ( బడ్జెట్ 2020: ‘ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి భారీగా నిధులు’) -
ఐడీబీఐ బ్యాంక్‌తో లావాదేవీలపై భయం వద్దు!
ముంబై: ఐడీబీఐ బ్యాంక్ నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు డిపాజిట్లను ఉపసంహరిస్తుండటం... కొత్త డిపాజిట్లు చేయకపోవటం వంటి వ్యవహారాలపై ఆర్థికశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాంకుతో లావాదేవీల నిర్వహణ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం ఏదీ లేదని భరోసా ఇచ్చింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలకు ఒక లేఖ రాసింది. ఎప్పటిలాగే బ్యాంకింగ్ సేవలు అందించడానికి ఐడీబీఐ బ్యాంక్‌కు తగిన సామర్థ్యం ఉందని స్పష్టం చేసింది. ప్రస్తుత ప్రమోటర్ ఎల్ఐసీ పూర్తిగా ప్రభుత్వ సంస్థ అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఎల్ఐసీ, ప్రభుత్వం రెండింటికీ కలిపి బ్యాంకులో 97.46 శాతం వాటా ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్ఐసీ ఈ ఏడాది జనవరిలో 51 శాతం వాటా కొనుగోలు చేసింది. దీనితో బ్యాంకును ప్రైవేటు రంగ బ్యాం కుగా ఆర్బీఐ పునర్ వ్యవస్థీకరించింది. బ్యాంకు లో ప్రభుత్వ వాటా ప్రస్తుతం 46.46 శాతం. -
ఐడీబీఐ బ్యాంకునకు రూ. 9,300 కోట్ల నిధులు
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకును గాడిన పెట్టే దిశగా రూ. 9,300 కోట్ల మేర నిధులు సమకూర్చనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ వెల్లడించారు. బ్యాంకు మూలధన స్థాయిని పెంచేందుకు, లాభాల్లోకి మళ్లించేందుకు ఇది తోడ్పడగలదని పేర్కొన్నారు. ఇందులో సుమారు 51 శాతం నిధులను (రూ. 4,743 కోట్లు) ఎల్ఐసీ సమకూర్చనుండగా, మిగతా 49 శాతం (రూ. 4,557 కోట్లు) కేంద్రం వన్–టైమ్ ప్రాతిపదికన అందించనుంది. మొండిబాకీలతో కుదేలైన ఐడీబీఐ బ్యాంకులో ఎల్ఐసీ గత ఆగస్టులో తన వాటాలను 51 శాతానికి పెంచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అదనపు మూలధనం లభించడంతో ఐడీబీఐ బ్యాంకు సొంతంగా మరిన్ని నిధులను సేకరించుకునే సామర్థ్యం పెంచుకోగలదని, వచ్చే ఏడాదిలో రిజర్వ్ బ్యాంక్ ఆంక్షల పరిధి (పీసీఏ) నుంచి కూడా బైటికి రాగలదని భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు. కేంద్రం నుంచి మూలధనం అందిన రోజునే అదే మొత్తంలో ఐడీబీఐ బ్యాంకు రీక్యాపిటజైషన్ బాండ్లు కొనుగోలు చేయనుంది. ఈ ఏడాది చివరినాటికి అలహాబాద్ బ్యాంక్ విలీనం పూర్తి కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి అలహాబాద్ బ్యాంక్ విలీనం పూర్తికానుందని ఇండియన్ బ్యాంక్ అంచనావేస్తోంది. ఈ అంశంపై బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పద్మజ చుండూరు మాట్లాడుతూ.. ఇరు బ్యాంకుల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సమావేశమై విలీనానికి తగిన ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉందని, త్వరలోనే ఇందుకు సంబంధించిన తొలి సమావేశం జరగనుందని తెలిపారు. -
‘లోన్’లొటారం!
సాక్షి, తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి) : ఐడీబీఐ స్కాం వ్యవహారంలో బ్యాంకు అధికారుల పాత్రతోపాటు ప్రభుత్వ శాఖల సిబ్బందిపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కిసాన్ క్యాష్ క్రెడిట్ స్కీమ్(కేసీసీ)లో భాగంగా చేపల చెరువుల పేరిట 2009 నుంచి 2011 వరకు జిల్లాలోని మూడు ప్రాంతాలకు చెందిన ఐదుగురు వ్యక్తులు సుమారు రూ.1100 కోట్లను రుణంగా పొందిన వ్యవహారం ఇప్పుడు జిల్లాలో సంచలనంగా మారింది. అక్రమార్కుల గుండెల్లో వణుకుపుట్టిస్తోంది. బ్యాంకు అధికారుల ఆశీస్సులతో రుణగ్రహీతలు చేపల చెరువులను తవ్వకుండానే రుణాలను తీసుకున్నారు. అప్పట్లో ఈ వ్యవహారం అంతా గప్‌చుప్‌గా జరిగినా సీబీఐ రంగ ప్రవేశంతో స్కాంలో వాస్తవాలు బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి. బ్యాంకు ఉన్నతాధికారులు కూడా అంతర్గత క్రమ శిక్షణ చర్యల్లో భాగంగా కొంతమందిపై చర్యలు తీసుకోడానికి నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. పర్యవసానంగా వివరణలు నమోదు చేసి, క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేసినట్టు ఒక స్కెచ్ ప్రకారం వ్యవహారం నడుపుతున్నట్టుగా గత మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ శాఖల సిబ్బందిపైనా దర్యాప్తు! కేవలం బ్యాంకు అధికారులనే కాకుండా అసలు చేపల చెరువులు లేకుండానే చెరువులను సృష్టించడం, చెరువులలో చేపలు చనిపోకుండానే చనిపోయినట్టు, నష్టం జరిగినట్టుగా రికార్డులు సృష్టించడంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మత్స్యశాఖ అ«ధికారుల పాత్రపైనా సీబీఐ దర్యాప్తు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. రెండు రోజుల క్రితం జిల్లాకు చెందిన కొందరు ఐడీబీఐ కిసాన్ క్యాష్ క్రెడిట్ స్కీమ్‌లో స్కామ్‌కు సంబంధించి తమ దగ్గర ఉన్న సమాచారాన్ని విశాఖ పట్టణంలో సీబీఐ అధికారులకు అందించే ప్రయత్నం చేశారు. వి«ధి నిర్వహణలో , దాడుల్లో ఉన్న సీబీఐ అధికారులను కలవడానికి అవకాశం ఉండదని, నేరుగా ఉన్నతాధికారులకే సమాచారం అందించాలనే మార్గదర్శకాలు ఉన్న నేపథ్యంలో వారికే వాస్తవ విషయాలను అందించడానికి కొందరు సిద్ధపడుతున్నారు. మూడు శాఖల పాత్రపై అనుమానం ఐడీబీఐ కేసీసీ స్కీమ్ కింద అడ్డగోలుగా వ్యవహరించిన బ్యాంకు అధికారుల పాత్రతోపాటు, ఈ స్కీమ్ అమలు చేసిన సమయంలో జిల్లాలో చేపల చెరువుల అనుమతులు, రిజిస్ట్రేషన్లు, వంటి వ్యవహారాలను పరిశీలించి అనుమతులు మంజూరు చేసిన రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌శాఖ, మత్స్యశాఖ అధికారుల పాత్రపై కేంద్ర ఉన్నతస్థాయి దర్యాప్తు సంస్థ ఆధ్వర్యంలో లోతైన దర్యాప్తు జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. చేపల చెరువులకు హామీలుగా చూపించిన భూముల విలువను ఎక్కువగా చూపిస్తూ, సర్టిఫికెట్లు ఇవ్వడంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అవతవకలకు పాల్పడినట్టు సమాచారం. చేపల చెరువులు లేకున్నా, ఉన్నట్టుగా సర్టిఫికెట్లు ఇచ్చే విషయంలో మత్స్యశాఖ అధికారులు ఆ సమయంలో భారీస్థాయిలో ముడుపులు తీసుకున్నారనే అభియోగాలున్నాయి. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా చర్యలు బ్యాంకుల నుంచి చేపల చెరువుల కోసం రుణాలు పొందే సమయంలో హామీగా చూపించిన స్థలాలలో కొందరి సంతకాలు ఫోర్జరీ జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. తాడేపల్లిగూడెంలో ఈ స్కీం స్కాం వ్యవహారంలో ఫోర్జరీ సంతకాల ఎపిసోడ్ కూడా ఉంది. సంతకాలు అసలువా, ఫోర్జరీ చేశారా అనే విషయంపై ఫోరెన్సిక్ సైన్సు ల్యాబ్ ( ఎఫ్ఎస్ఎల్) నివేదికలను ఇక్కడి పోలీసులు తెప్పించుకున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్టుగా మొత్తం వ్యవహారం ఫోర్జరీతో పాటుగా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈడీ దృష్టికి విషయం స్కాం గురించి గతంలోనే ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాకూ వెళ్లాయి. అంతేకాకుండా విశాఖపట్నంలోని డెట్ రికవరీ ట్రిబ్యునల్(డీఆర్టీ)కి కూడా వెళ్లాయి. కొంతమందికి డీఆర్టీ నోటీసులు ఇచ్చింది. నోటీసులలో పేర్లు ఉన్నవారు ఆ నోటీసులను అందుకోకుండానే అందుకున్నట్టుగా, వీటి కోసం కొందరు న్యాయవాదులకు వకాల్తా ఇచ్చినట్టు తప్పుడు రిపోర్టులు డీఆర్టీకి పంపినట్టు సమాచారం. డీఆర్టీ విచారణలో ఈ వ్యవహారం బయటపడటంతో రాజీ మార్గాలు కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా ఐడీబీఐ స్కాం వ్యవహారంలో వాస్తవాలు బయటకు వస్తున్నాయి. సరిగ్గా ఇదేసమయంలో సీబీఐ కూడా తనిఖీల వాస్తవాలను బయటపెట్టే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో అప్పట్లో ఈ విషయంలో క్రియాశీలక భూమిక పోషించిన వివిధ శాఖల అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. -
రూ.311 కోట్లకు బురిడీ
భీమవరం: బ్యాంకులకు నకిలీపత్రాలు చూపించి రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు వేల కోట్లు స్వాహా చేసే సంఘటనలే మనం చూస్తున్నాం. ఈ జాడ్యం నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు కూడా పాకింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కేంద్రంగా ఐడీబీఐ బ్యాంకును ఎంచుకుని చేపలు, రొయ్యల చెరువుల సాగు పేరుతో రూ.311 కోట్లు నకిలీ పత్రాల ద్వారా కొట్టేశారు కొందరు మోసగాళ్లు. 2018 మార్చిలో 16 మందిపై కేసు నమోదైంది. రుణాలు చెల్లించకపోగా వారి చిరునామాలే దొరక్కపోవడంతో బురిడీ బాగోతం వెలుగుచూసింది. భీమవరం ఐడీబీఐ బ్యాంకు బ్రాంచి ద్వారా రాజమండ్రి ఐడీబీఐ కార్యాలయం కూడా ఈ రుణాల మంజూరులో కీలకపాత్ర పోషించినట్లు చెబుతున్నారు. రుణాలు పొందిన వారికి అప్పటి బ్యాంకు అధికారులు కొంతమంది సహకారం అందించినట్లు సమాచారం. సీబీఐ దర్యాప్తు సందర్భంలో విషయాలు వెల్లడించకపోయినా భీమవరం లోని ఒక ఫ్యాన్సీ షాపు యజమాని ఈ రుణాల మంజూరుకు అప్పట్లో చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో ఉన్నతాధికా రులు ఆరా తీయడం ప్రారంభించారు. దీనికి అన్ని అర్హతలున్నా రుణం లభించని స్థానికులు కొందరు అక్రమ రుణాల విషయం ఉన్నతాధికారులకు చేరవేసినట్లు చెబుతున్నారు. రుణాలు పొందిన వారిలో భీమవరం, కాకినాడ, హైదరాబాద్, ఆకివీడు, విజయవాడ తదితర ప్రాంతాలకు చెందినవారుండడం విశేషం. కేసు బిగుస్తుందని తెలిసిన కొంతమంది రాజకీయ ప్రముఖులతో బేరసారాలు చేయించి కొంత మొత్తం చెల్లించగా ఇంకా పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నాయి. దీంతో సీబీఐ ఉచ్చు బిగించి బాకీదారుల ఆస్తుల స్వాధీనానికి, అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. నకిలీ పత్రాలు చూపించిన భూముల వివరాలను సీబీఐ అధికారులు జీఐఎస్ ట్రాకింగ్ ద్వారా కూపీ లాగితే మొత్తం భూములు కొల్లేరు ప్రాంతానికి చెందినవిగా గుర్తించినట్లు తెలిసింది. -
ఐడీబీఐ బ్యాంక్
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్ నికర నష్టాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో మరింతగా పెరిగాయి. గత క్యూ1లో రూ.2,410 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ1లో రూ.3,801 కోట్లకు పెరిగాయని ఐడీబీఐ బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలు తగ్గినా, వాటికి కేటాయింపులు పెరగడంతో నికర నష్టాలు కూడా పెరిగాయని వివరించింది. మొత్తం ఆదాయం రూ.6,403 కోట్ల నుంచి రూ.5,924 కోట్లకు తగ్గిందని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం రూ.1,639 కోట్ల నుంచి రూ.1,458 కోట్లకు తగ్గిందని తెలిపింది. తగ్గిన మొండి బకాయిలు.... మొండి బకాయిలు తగ్గాయని బ్యాంక్ వెల్లడించింది. గత క్యూ1లో 30.78%గా ఉన్న మొండి బకీలు ఈ క్యూ1లో 29.12%కి తగ్గాయి. విలువ పరంగా, స్థూల మొండి బకాయిలు రూ.57,807 కోట్ల నుంచి రూ.51,658 కోట్లకు తగ్గాయని తెలిపింది. నికర మొండి బకాయిలు 18.76% నుంచి 8.02%కి చేరినట్లు పేర్కొంది. పెరిగిన కేటాయింపులు..... గత క్యూ1లో రూ.4,603 కోట్లుగా ఉన్న మొండి బకాయిలకు కేటాయింపులు ఈ క్యూ1లో రూ.7,009 కోట్లకు పెరిగాయని ఐడీబీఐ బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలు, ఇతరాలకు కూడా కలుపుకొని మొత్తం కేటాయింపులు రూ.5,236 కోట్ల నుంచి రూ.6,332 కోట్లకు చేరాయని పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో ఈ బ్యాంక్‌లో 51% వాటాను ఎల్ఐసీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఆర్తిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐడీబీఐ బ్యాంక్ షేర్ 1.3 శాతం లాభంతో రూ. 27.15 వద్ద ముగిసింది. -
ఐడీబీఐ బ్యాంకు పేరు మార్పునకు ఆర్బీఐ నో!!
న్యూఢిల్లీ: ఇటీవలే యాజమాన్యం చేతులు మారిన నేపథ్యంలో పేరు మార్పునకు అనుమతించాలన్న ఐడీబీఐ బ్యాంకు విజ్ఞప్తిని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) తోసిపుచ్చింది. దీంతో బ్యాంకు ఇకపైనా అదే పేరుతో కొనసాగనుంది. ఐడీబీఐ బ్యాంకు బుధవారం స్టాక్ ఎక్సే్చంజీలకు ఈ విషయాలు తెలియజేసింది. అయితే, పేరు మార్పును ఆర్బీఐ తిరస్కరించడానికి గల కారణాలను వివరించలేదు. ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మెజారిటీ వాటాలు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ డీల్‌తో బ్యాంకులో ప్రభుత్వ వాటా 46.46 శాతానికి తగ్గగా.. ఎల్ఐసీ వాటా 8% నుంచి 51 శాతానికి పెరిగింది. దీంతో ఐడీబీఐ బ్యాంకును ప్రైవేట్ బ్యాంకుగా వర్గీకరిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. యాజమాన్యం చేతులు మారిన నేపథ్యంలో ఎల్ఐసీ ఐడీబీఐ బ్యాంకు లేదా ఎల్ఐసీ బ్యాంకుగా పేరును మార్చుకునేందుకు అనుమతించాలంటూ ఐడీబీఐ బ్యాంకు బోర్డు గత నెలలో ఆర్బీఐని కోరింది. ఈ ప్రతిపాదననే రిజర్వ్ బ్యాంక్ తాజాగా తిరస్కరించింది. -
ఐడీబీఐ బ్యాంకు పేరు మార్పునకు ఆర్బీఐ నో?
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకు పేరు మార్చేందుకు ఆర్బీఐ సుముఖంగా లేదని సమాచారం. బ్యాంకు పేరును ఎల్ఐసీ ఐడీబీఐ బ్యాంకుగాను లేదంటే ఎల్ఐసీ బ్యాంకుగాను మార్చాలని, ప్రథమ ప్రాధాన్యం ఎల్ఐసీ ఐడీబీఐ బ్యాంకేనని గత నెలలో ప్రతిపాదనలు పంపిన విషయం గమనార్హం. అయితే, ఐడీబీఐ బ్యాంకు పేరు మార్పునకు ఆర్బీఐ అనుకూలంగా లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పేరు మార్పునకు ఆర్బీఐతోపాటు కార్పొరేట్ వ్యవహారాల శాఖ, వాటాదారులు, స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల అనుమతి కూడా అవసరం అవుతుంది. ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం వాటా కొనుగోలు ప్రక్రియను జనవరిలో ఎల్ఐసీ పూర్తి చేసిన విషయం తెలిసిందే. దీంతో 60 ఏళ్లకు పైగా బీమా రంగంలో ఉన్న ఎల్ఐసీ ఎట్టకేలకు బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టినట్టు అయింది. -
ఐడీబీఐ బ్యాంక్‌కు ఎల్ఐసీ నిధులు
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్ఐసీ మరో రూ.12,000 కోట్లు పెట్టుబడులు పెట్టే అవకాశాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో మొండి బకాయిలకు కేటాయింపుల కోసం ఈ స్థాయి పెట్టుబడులను ఎల్ఐసీ సమకూరుస్తుందని సమాచారం. ఈ విషయమై ఇటీవలనే ఇరు సంస్థల ఉన్నతాధికారులు ఆర్థిక సేవల విభాగం అధికారులతో సమావేశమయ్యారు. కాగా తాజా పెట్టుబడుల విషయమై ఎల్ఐసీ ఇప్పటి వరకూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎల్ఐసీ పెట్టుబడులు రూ.21,624 కోట్లు ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్ఐసీ 51 శాతం వాటాను పొందిన విషయం తెలిసిందే. ఈ వాటా కోసం ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్ఐసీ రూ.21,624 కోట్లు పెట్టుబడులు పెట్టింది. ఎల్ఐసీ పెట్టుబడులతో ఐడీబీఐ బ్యాంక్ కామన్ ఈక్విటీ టైర్–వన్(సెట్–1) మూలధనం గత ఏడాది డిసెంబర్ 31 నాటికి 9.32 శాతానికి పెరిగింది. అంతకు ముందటి ఏడాది ఇదే సమయానికి సెట్–1 మూలధనం 6.62 శాతంగానే ఉంది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో ఐడీబీఐ బ్యాంక్ నికర నష్టాలు మూడు రెట్లు పెరిగి రూ.4,185 కోట్లకు పెరిగాయి. గత క్యూ3లో రూ.7,125 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో రూ.6,191 కోట్లకు తగ్గింది. స్థూల మొండి బకాయిలు 24.72% నుంచి 29.67 శాతానికి పెరగ్గా, నికర మొండి బకాయిలు మాత్రం 16.02% నుంచి 14.01 శాతానికి తగ్గాయి. -
మూడింతలైన ఐడీబీఐ బ్యాంక్ నష్టాలు
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్ నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో మూడు రెట్లు పెరిగాయి. గత క్యూ3లో రూ.1,524 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ3లో రూ.4,185 కోట్లకు పెరిగాయని ఐడీబీఐ బ్యాంక్ తెలిపింది. కేటాయింపులు అధికంగా ఉండడం, నికర వడ్డీ ఆదాయం తక్కువగా ఉండటం, నిర్వహణ ఆదాయం కూడా తక్కువగా ఉండటంతో ఈ స్థాయిలో నికర నష్టాలు వచ్చాయని వెల్లడించింది. ఆదాయం రూ.7,125 కోట్ల నుంచి రూ.6,191 కోట్లకు తగ్గిందని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం 19% క్షీణించి రూ.1,357 కోట్లకు తగ్గింది మిశ్రమంగా రుణ నాణ్యత బ్యాంక్ రుణ నాణ్యత మిశ్రమంగా నమోదైంది. గత క్యూ3లో 24.72 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 29.67 శాతానికి పెరిగాయి. నికర మొండి బకాయిలు మాత్రం 16.02 శాతం నుంచి 14.01 శాతానికి తగ్గాయి. మొండి బకాయిలకు కేటాయింపులు పెంచామని, గత క్యూ3లో రూ.3,650 కోట్లుగా ఉన్న ఈ కేటాయింపులు ఈ క్యూ3లో రూ.5,075 కోట్లకు పెరిగాయని పేర్కొంది. తాజా మొండి బకాయిలు మాత్రం ఏడు క్వార్టర్ల కనిష్ట స్థాయికి, రూ.2,211 కోట్లకు తగ్గాయని తెలిపింది. గత క్యూ3లో రూ.537 కోట్లుగా ఉన్న రికవరీలు ఈ క్యూ3లో రూ.3,440 కోట్లకు పెరిగాయి. కాగా, బీఎస్ఈలో ఐడీబీఐ బ్యాంక్ షేర్ 4 శాతం నష్టపోయి రూ.50.65 వద్ద ముగిసింది. పేరు మార్పు ప్రతిపాదన ఐడీబీఐ బ్యాంక్ పేరును మార్చాలని ఐడీబీఐ డైరెక్టర్ల బోర్డ్ ప్రతిపాదించింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఈ బ్యాంక్‌ను టేకోవర్ చేసినందున (51% వాటా కొనుగోలు) బ్యాంక్ పేరును ఎల్ఐసీ ఐడీబీఐ బ్యాంక్‌గా గానీ, లేదా ఎల్ఐసీ బ్యాంక్‌గా గానీ మార్చాలని బోర్డ్ ప్రతిపాదించింది. -
బ్యాంక్ అధికారిపై గృహ హింస కేసు
గుంటూరు, తెనాలి: స్థానిక ఐడీబీఏ శాఖలో అసిస్టెంటు మేనేజరుగా పనిచేస్తున్న కరేటి శ్రీనివాస్, అతడి తలిదండ్రులు, సోదరిపై హైదరాబాద్‌లో గృహహింస కేసు (డీవీసీ నెం.56/2019) నమోదైంది. రాజేంద్రనగర్‌లోని 14వ మేజిస్ట్రేటు కోర్టులో శ్రీనివాస్, తల్లిదండ్రులు కరేటి ఉషారాణి, రామనాథ్, సోదరి అనితపై ఈనెల ఒకటో తేదీన కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబం ఆదివారం తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. పట్టణ పాండురంగపేటకు చెందిన కరేటి శ్రీనివాస్‌కు, హైదరాబాద్‌లోని శివమౌనిక యాదవ్‌కు 2012 డిసెంబరులో వివాహమైంది. తెనాలిలోనే జరిగిన ఈ పెళ్లికి ముందుగానే కట్నం కింద నగదు, చెక్కులు, ఇతర ఆస్తుల్ని తీసుకున్నారు. మరో ఆర్నె ల్లకు భార్య దగ్గర మరో రూ.8 లక్షల్ని శ్రీనివాస్ తీసుకున్నాడు. ఇంత కట్నం తీసుకున్నా, ఇంకా డబ్బులు తెమ్మంటూ వేధింపులు ఆరంభించారు. శ్రీనివాస్ తల్లిదండ్రులు ఉషారాణి, కరేటి రామనా«థ్, సోదరి అనిత కూడా ఇందుకు సహకరించినట్టుగా బాధిత శివమౌనిక యాదవ్ హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషనులో 2017లో ఫిర్యాదు చేశారు. దీనిపై అక్కడి పోలీసులు 498–ఎ ఐపీసీ 3,4 డీపీఏ కింద కేసు నమోదు చేశారు. నిందితుల్ని అరెస్టు చేశారు. గతేడాది పోలీసులు ఈ కేసులో చార్జిషీటును సమర్పించారు. శ్రీనివాస్, అతడి తండ్రి అధిక రేటుతో వడ్డీ వ్యాపారం చేస్తుంటారని, బాకీదారైన ఒక స్కూలు టీచరును ఇదే విషయమై దూషించగా, ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు చార్జిషీటులో పొందుపరిచారు. వరకట్న వేధింపుల కేసు విచారణ దశలో ఉండగా, తాజాగా హైదరాబాద్ కోర్టులో గృహహింస కేసు నమోదైంది. -
‘ఎయిర్‌సెల్’ శివశంకరన్ ఆస్తులు అటాచ్
సాక్షి, చెన్నై: ‘ఎయిర్‌సెల్’ సంస్థ వ్యవస్థాపకుడు శివశంకరన్‌కు చెందిన చెన్నైలోని రూ.224 కోట్ల ఆస్తులను ఈడీ శనివారం అటాచ్ చేసింది. శివశంకరన్ కొంతకాలం క్రితం ఐడీబీఐ బ్యాంక్ నుంచి వ్యాపార నిమిత్తం రూ.600 కోట్ల అప్పు తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని సొంత అప్పుల్ని తీర్చేందుకు వాడుకున్నాడు. వడ్డీ చెల్లించకపోవడంతో ఐడీబీఐ పలుమార్లు నోటీసులిచ్చింది. అసలు చెల్లించాలని ఒత్తిడి చేయగా శివశంకరన్ చేతులు ఎత్తేశాడు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన ఈడీ చెన్నైలో శివశంకరన్‌కు చెందిన రూ.224 కోట్ల విలువైన స్థిర, రూ.35 లక్షల చరాస్తులను అటాచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. -
నెరవేరిన ఎల్ఐసీ స్వప్నం
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించాలన్న ఎల్ఐసీ చిరకాల స్వప్నం నెరవేరింది. ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం నియంత్రిత వాటా కొనుగోలును ఎల్ఐసీ పూర్తి చేసినట్టు బ్యాంకు ప్రకటించింది. ‘‘ఐడీబీఐ బ్యాంకు, ఎల్ఐసీకి ఇది పరస్పర విజయం వంటిది. వాటాదారులు, కస్టమర్లు, ఉద్యోగులకు ఎంతో విలువను సమకూర్చిపెడుతుంది’’ అని ఐడీబీఐ బ్యాంకు పేర్కొంది. ప్రిఫరెన్షియల్ ఇష్యూ, ఓపెన్ ఆఫర్ ద్వారా ఐడీబీఐ బ్యాంకులో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు ఎల్ఐసీకి అనుమతినిస్తూ గతేడాది ఆగస్ట్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం గమనార్హం. ఐడీబీఐ బ్యాంకు 1800 శాఖలను ఎల్ఐసీ పాలసీల విక్రయానికి టచ్ పాయింట్లుగా వినియోగించుకోవచ్చని బ్యాంకు తెలిపింది. ఐడీబీఐ బ్యాంకుకు 1.5 కోట్ల రిటైల్ కస్టమర్లు ఉన్నారు. కస్టమర్ల గురించి తెలుసుకునేందుకు డేటా అనలిటిక్స్ సామర్థ్యాలను ఏర్పాటు చేసుకోవడంపై పెట్టుబడులను పెద్ద ఎత్తున పెంచుతామని బ్యాంకు వెల్లడించింది. దీనివల్ల తన ఉత్పత్తుల పంపిణీని పెంచుకోవడంతోపాటు డిస్ట్రిబ్యూషన్ వ్యయాలను తగ్గించుకోవచ్చని, పోర్ట్‌ఫోలియో రిస్క్‌ను తొలగించుకోవచ్చని పేర్కొంది. తమ రిటైల్ రుణాల పోర్ట్‌ఫోలియో 2019–20లో 50 శాతానికి చేరగలదని ఐడీబీఐ బ్యాంకు అంచనా వ్యక్తం చేసింది. ‘‘ఐడీబీఐ బ్యాంకు, ఎల్ఐసీ తమ పూర్తి స్థాయి సమష్టి చర్యలను వచ్చే 12 నెలల కాలంలో అమలు చేయనున్నాయి. మెరుగైన ఆర్థిక ఆరోగ్యం అన్నది కచ్చితమైన దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ) నుంచి నిర్ణీత కాలంలో బయటపడేందుకు వీలు కల్పిస్తుంది. అంతేకాదు భవిష్యత్తుకు అనుగుణమైన, టాప్ ర్యాంక్ బ్యాంకుగా అవతరిస్తాం. భాగస్వాములు అందరి ప్రయోజనాలు నెరవేర్చేందుకు ఎల్ఐసీ, ఐడీబీఐ బ్యాంకు కట్టుబడి ఉంటాయి’’ అని ఐడీబీఐ బ్యాంకు తన ప్రకటనలో వివరించింది. ఐడీబీఐ బ్యాంకు 2018–19 సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.3,602 కోట్ల నష్టాన్ని ప్రకటించగా, బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తులు 31.78%కి (రూ.60,875 కోట్లు) పెరిగాయి. ప్రస్తుత ఎండీ రాకేశ్ శర్మ కొనసాగింపు ఎల్ఐసీ అనుబంధ సంస్థగా ఐడీబీఐ బ్యాంకు మారినప్పటికీ... ప్రస్తుత ఎండీ రాకేశ్‌శర్మ ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి నిర్వహణ బృందాన్నే కొనసాగించాలని బ్యాంకు నిర్ణయించింది. రాకేశ్ కండ్వాల్ను అడిషినల్ డైరెక్టర్, ఎల్ఐసీ నామినీ డైరెక్టర్‌గా నియామకానికి బ్యాంకు బోర్డు అనుమతించింది. ఐడీబీఐ ఫెడరల్ లైఫ్‌లో తనకున్న వాటాలను విక్రయించే ప్రయత్నాలను తిరిగి మొదలు పెట్టడానికి కూడా బ్యాంకు బోర్డు అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న ఐడీబీఐ ప్రైవేటు సంస్థగా మారింది. దీంతో ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్య 21 నుంచి 20కి తగ్గినట్టయింది. -
30వేల కోట్ల రుణాలను రద్దు చేసిన బ్యాంకు
సాక్షి,ముంబై : మొండిబకాయిలతో సతమతమవుతున్న ప్రభుత్వరంగ ఐడీబీఐ బ్యాంక్ గత మూడున్నర సంవత్సరాల్లో రూ 30,000 కోట్ల రుణాలను రద్దు చేసినట్టు వెల్లడించింది. నిరర్ధక ఆస్తులు పెరగడంతో రుణాల జారీపై ఐడీబీఐ బ్యాంకును ఆర్బీఐ నియంత్రించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ప్రధమార్ధంలో రూ 9052 కోట్ల రుణాలను రద్దు చేసినట్టు ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి బ్యాంకు నివేదించింది. రద్దు చేసిన రుణాల్లో అత్యధికం మౌలిక, మెటల్స్ రంగాలకు చెందినవేనని బ్యాంకు వర్గాలు పేర్కొన్నాయి. నిరర్ధక ఆస్తులపై ఆర్బీఐ ప్రవేశపెట్టిన అసెట్ క్వాలిటీ రివ్యూ (ఏక్యూఆర్) అనంతరం ఆయా రుణాలను రద్దు చేసినట్టు పార్లమెంటరీ కమిటీకి ఐడీబీఐ బ్యాంక్ తెలిపింది. 2015-16లో బ్యాంకు నిరర్ధక ఆస్తులు 7.79 శాతం నుంచి ఈ ఏడాది మార్చి నాటికి 11,8 శాతానికి పెరిగాయని ఐడీబీఐ బ్యాంక్ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసంలో బ్యాంకు జారీ చేసిన మొత్తం రుణాల్లో 31 శాతం మేర రూ 60,875 కోట్లకు నిరర్ధక రుణ బకాయిలు పేరుకుపోయాయని వెల్లడించింది. -
బిల్ట్ భవితవ్యం ఎటువైపు?
సాక్షి, ములుగు: ఐడీబీఐ బ్యాంకు నోటీసులతో బిల్ట్ భవితవ్యం ఎటువైపు అనే ఆందోళన కార్మికుల్లో నెలకొంది. పున ప్రారంభమా... మూసివేతా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ పరిణామాలు కార్మికుల కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం పరిశ్రమ పునరుద్ధరణకు సబ్సిడీ ఇస్తామని హామీఇచ్చినా యాజమాన్యం ముందుకురాకపోవడం, తమకు బాకీపడ్డ రుణాన్ని చెల్లించని పక్షంలో ఆస్తులు జప్తు చేస్తామని ఐడీబీఐ బ్యాంకు నోటీసులు ఇవ్వడంతో కలవరం మొదలైంది. రెండో విడతలో భాగంగా చేపడుతున్న కార్మికుల సమ్మె శుక్రవారంతో 343 రోజులకు చేరుకుంది. ఉపాధి కరువై రోడ్డునపడ్డ కార్మికులు బిల్ట్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే పల్ప్ కంటే ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే పల్ఫ్ తక్కువ ధరకు లభిస్తుండటంతో గ్రాసిమ్ కంపెనీ అటువైపు దృష్టి సారించింది. బిల్ట్ పల్ప్‌ను కొనుగోలు చేయడం నిలిపేసింది. దీంతో బిల్ట్ పరిశ్రమ పరిస్థితి అయోమయంగా మారింది. బిల్ట్‌కు చెందిన పల్ఫ్కు మార్కెట్ లేకపోవడంతో నష్టాలతో ఫ్యాక్టరీని నడపలేమనే కారణంతో యాజమాన్యం 2014న ఏప్రిల్ ఐదో తేదీ రాత్రి 10 గంటలకు పీఎఫ్ కార్మికులను విధులకు రాకుండా అడ్డుకుంది. ఆరో తేదీన ఫ్యాక్టరీలో ఉత్పత్తి నిలిపేసింది. ఫ్యాక్టరీలో పనిచేసే 658 మంది పర్మినెంటు కార్మికులు, స్టాఫ్, క్లరికల్ స్టాఫ్ 200 మంది, 534 మంది పీఎఫ్, సుమారు 1200 మంది నాన్‌పీఎఫ్ కార్మికులు ఉపాధి కోల్పోయారు. పరోక్షంగా మరో 10 వేల మందికి ఉపాధి కరువైంది. దీంతో మూతపడ్డ బిల్ట్ కార్మాగారాన్ని పునప్రారంభించి ఫ్యాక్టరీపై ఆధారపడ్డ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బిల్ట్ కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి మార్చి తొమ్మిది 2015 నుంచి మార్చి ఆరు 2016 వరకు 362 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. స్పందించిన టీఆర్ఎస్ ప్రభుత్వం బిల్ట్ పునప్రారంభం కోసం సంవత్సరానికి రూ. 30 కోట్లు చొప్పున ఏడేళ్లకు గానూ రూ. 210 కోట్ల రాయితీని 22 ఏప్రిల్ 2015న ప్రకటించింది. దీనికి సంబంధించి మార్చి ఆరో తేదీ 2016న ప్రత్యేక జీఓ విడుదల చేసింది. అయినా బిల్ట్ యాజమాన్యం నుంచి నేటి వరకు స్పందన లేకపోగా రాయితీ ప్రకటించి జీఓ తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం సైతం సమస్యను పట్టించుకోలేదు. దీంతో కొందరు కార్మికులు ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇప్పటివరకు పలు కారణాలతో 18 మంది కార్మికులు చనిపోయారు. 2017 డిసెంబర్ తొమ్మిదో తేదీన బిల్ట్ సమస్య పరిష్కారంకోసం కార్మికులు, కార్మికుల కుటుంబాల సారథ్యంలో మలిదశ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. స్పందించిన ప్రభుత్వం, బిల్ట్ యజమాన్యం, కార్మికశాఖ, బిల్ట్ జేఏసీ నాయకుల సమక్షంలో పలు దఫాలుగా చర్చలు జరిపాయి. అయినా యజమాన్యం వాయిదాలతో కాలయాపన చేసింది. ఈ తరుణంలో జూలై 25న యజమాన్యంతో ప్రభుత్వం సుదీర్ఘ చర్చలు జరిపి ఫ్యాక్టరీ పునప్రారంభం కోసం రూ. 350 కోట్ల రాయితీ ఇచ్చేందుకు ఒప్పుకుంది. ఆగస్ట్ 30న మరో సమావేశం నిర్వహించి 10 రోజుల్లోగా పునరుద్ధరణ పనులు ప్రాంభించేందుకు వారం రోజుల్లో ఏర్పాట్లు చేసుకోవాలని బిల్ట్ యజమాన్యానికి పరిశ్రమల శాఖ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకోవాల్సిన యజమాన్యం కార్మిక జేఏసీ నాయకులతో సెప్టెంబర్ 10న సమావేశం నిర్వహించి కార్మికులు పొందుతున్న అలవెన్సులలో 75 శాతం తగ్గించుకోవాలని అలా ఒప్పుకుంటేనే ఫ్యాక్టరీని పునరుద్ధరించేందుకు ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకునేందుకు ముందుకొస్తామని యజమాన్యం స్పష్టంగా వెల్లడించింది. ఈ విషయంపై ఇంకా కార్మిక జేఏసీ, యజమాన్యం మధ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. మూతపడిన నాటి నుంచి 39 నెలల వేతనాలు కార్మికులకు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం ఫ్యాక్టరీలో 592 ఉండగా పర్మినెంటు కార్మికులు 566, క్లరికల్ స్టాఫ్ 22 మంది ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఆస్తుల జప్తునకు ఐడీబీఐ బ్యాంకు నోటీసు బిల్ట్ ఫ్యాక్టరీ యజమాన్యం తమకు రూ. 551 కోట్ల 17లక్షల అప్పు ఉందని ఐడీబీఐ బ్యాంక్ ఈ నెల మూడో తేదీన బిల్ట్ ప్రధాన గేటుకు నోటీసు అంటించింది. గతంలో కర్మాగారం రీకన్స్ట్రక్షన్ పేరుతో యజమాన్యం తమ బ్యాంకు ఉంచి అప్పు తీసుకుని నేటివరకు చెల్లించలేదని నోటీసులో పేర్కొంది. 60 రోజుల్లో యజమాన్యం తమకు సంజాయిషీ ఇవ్వాలని లేనిపక్షంలో బిల్ట్ యాజమాన్యానికి చెందిన ఆస్తులను జప్తుచేస్తామని నోటీసులో హెచ్చరించింది. కర్మాగారం పునప్రారంభం విషయంపై అటు ప్రభుత్వం నుంచి ఇటు యజమాన్యం నుంచి స్పష్టమైన వైఖరి వెల్లడి కాకపోవడంతో కార్మికుల్లో సర్వత్రా ఆందోళన నెలకొంది. సంవత్సరానికి 40 వేల టన్నుల పల్ప్ ఉత్పత్తి కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీలో 1981 నుంచి రేయాన్స్ గ్రేడ్ పల్ప్ ఉత్పత్తి ప్రారంభమైంది. 1986లో ఫ్యాక్టరీని ఆధునీకరించి సంవత్సరానికి 5400 టన్నుల ఉత్పత్తి చేశారు. 1995లో రెండోదఫా ఆధునీకరించి రోజుకు 270 టన్నుల ఉత్పత్తి అంచనాతో నెలకు 8500 నుంచి 9000 టన్నుల అంచనాతో ఉత్పత్తి చేశారు. తదనంతరం ఫ్యాక్టరీని నిబంధనల మేరకు ఆధునీకరించకపోవడంతో రోజుకు 270 టన్నుల మేర ఉన్న ఉత్పత్తి 240 నుంచి 230 టన్నులకు పడిపోయింది. ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే పల్ప్‌ను మహారాష్ట్రలోని నాగ్దాలోగల బిర్లా గ్రూపుకు చెందిన గ్రాసిమ్ కంపెనీ కొనుగోలు చేసేంది. వేతనాలు మొత్తం చెల్లించాల్సిందే ఫ్యాక్టరీ మూపడిన నాటి నుంచి ఇప్పటి వరకు చెల్లించాల్సిన మొత్తం 39 నెలల వేతనం చెల్లించాల్సిందే. వేతనాల్లో ఒక్క రూపాయి తక్కువ చెల్లించినా ఒప్పుకునేది లేదు. ఫ్యాక్టరీ పునప్రారంభిస్తామని యజమాన్యం హామీ ఇస్తే అవసరమైతే తాము ఒక గంట ఎక్కువగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కార్మికులకు వర్తించే అలవెన్సులలో యజమాన్యం అడిగిన విధంగా 75 శాతం తగ్గించుకోకుండా 20 నుంచి 25 శాతం తగ్గించుకునేందుకు సుముఖంగానే ఉన్నాం. విషయంపై కార్మిక శాఖ అధికారులు, యజమాన్యంతో చర్చించి ఫ్యాక్టరీని పునప్రారంభించేందుకు చొరవచూపాలి. –గుజ్జుల అచ్చిరెడి, కార్మికుడు యాజమాన్యం ముందుకు రాకపోవడం బాధాకరం ప్రభుత్వం రాయితీ ప్రకటించినా యజమాన్యం ముందుకు రాకపోవడం బాధాకరం. ఫ్యాక్టరీ పున ప్రారంభించాలంటే కార్మికులకు వర్తించే అలవెన్సుల్లో 75 శాతం తగ్గించుకుంటే ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంటామని యజమాన్యం చెపుతుంది. ఫ్యాక్టరీ పున ప్రారంబిస్తామంటే తాము 25 నుంచి 35 శాతం వరకు అలవెన్సులు తగ్గించుకుంటామని చెపుతున్నా యజమాన్యం అందుకు ఒప్పుకోవడం లేదు. ముందుగా బకాయి ఉన్న 39 నెలల వేతనాన్ని చెల్లించాలని తాము డిమాండ్ చేస్తున్నాం. విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వం బిల్ట్ యజమాన్యంతో కార్మికుల సమక్షంలో చర్చలు జరిపి త్వరిత గతిన సమస్యను పరిష్కరించాలి.–వడ్డెబోయిన శ్రీనువాసులు, జేఏసీ నాయకుడు -
ఐడీబీఐ బ్యాంక్ నష్టాలు రూ.3,602 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంక్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో భారీగా నష్టాలొచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.198 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ2లో రూ.3,602 కోట్లకు పెరిగాయి. మొండి బకాయిలు బాగా పెరగడం, వడ్డీ ఆదాయం తక్కువగా ఉండటంతో నికర నష్టాలు ఈ స్థాయికి చేరాయని ఐడీబీఐ బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.8,302 కోట్ల నుంచి రూ.6,162 కోట్లకు తగ్గిందని ఈ బ్యాంక్‌కు కొత్తగా సీఈఓ, ఎమ్‌డీగా నియమితులైన రాకేశ్ శర్మ చెప్పారు. నికర వడ్డీ ఆదాయం రూ.1,657 కోట్ల నుంచి 22 శాతం తగ్గి రూ.1,301 కోట్లకు పరిమితమయిందని పేర్కొన్నారు. నికర వడ్డీ మార్జిన్ 2.17 శాతం నుంచి 1.80 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. మరింత తీవ్రమైన ‘మొండి’ సమస్య గత క్యూ2లో రూ.51,368 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.60,875 కోట్లకు పెరిగాయి. నికర మొండి బకాయిలు రూ.29,489 కోట్ల నుంచి రూ.27,295 కోట్లకు తగ్గాయి. శాతం పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 24.98% నుంచి 31.78%కి, నికర మొండి బకాయిలు 16.06% నుంచి 17.30%కి పెరిగాయి. ఈ క్యూ1లో స్థూల మొండి బకాయిలు 30.78 శాతంగా, నికర మొండి బకాయిలు 18.76 శాతంగా ఉన్నాయి. గత క్యూ2లో రూ.3,261 కోట్లుగా ఉన్న మొత్తం కేటాయింపులు ఈ క్యూ2లో రూ.6,580 కోట్లకు చేరాయి. ఎల్ఐసీ నుంచి రూ.20,000 కోట్లు ఈ బ్యాంక్‌లో తన వాటాను బీమా దిగ్గజం ఎల్ఐసీ 51 శాతానికి పెంచుకోనున్నదని, దీంతో తమకు ఎల్ఐసీ నుంచి రూ.20,000 కోట్లు నిధులు లభిస్తాయని శర్మ చెప్పారు. -
ఐడీబీఐ వాటాకు ఎల్ఐసీ ఓపెన్ ఆఫర్ డిసెంబర్ 3 నుంచి
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్ షేర్ల కోసం ఎల్ఐసీ ఓపెన్ ఆఫర్ డిసెంబర్ 3 నుంచి ప్రారంభం కానున్నది. ఓపెన్ ఆఫర్లో భాగంగా ఒక్కొక్క ఐడీబీఐ బ్యాంక్ షేర్‌ను రూ.61.73 ధరకు ఎల్ఐసీ కొనుగోలు చేయనున్నదని ఐడీబీఐ బ్యాంక్ తెలిపింది. ఈ ఓపెన్ ఆఫర్ డిసెంబర్14న ముగుస్తుంది. ఓపెన్ ఆఫర్లో భాగంగా 26 శాతం వాటాకు సమానమైన 204, 15, 12, 929 షేర్లను ఎల్ఐసీ కొనుగోలు చేస్తుంది. ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటా కొనుగోలు ప్రక్రియలో భాగంగా ఎల్ఐసీ ఈ ఓపెన్ ఆఫర్‌ను ప్రకటిస్తోంది. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్ఐసీకి 14.90 శాతం వాటా ఉంది. -
ఎల్ఐసీ ఓపెన్ ఆఫర్
న్యూఢిల్లీ: బీమా దిగ్గజం ఎల్ఐసీ, ఐడీబీఐ బ్యాంక్‌లో 26 శాతం వాటా కొనుగోలు కోసం ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఓపెన్ ఆఫర్లో భాగంగా రూ.10 ముఖ విలువ గలఒక్కో ఐడీబీఐ బ్యాంక్ షేర్‌ను రూ.61.73 ధరకు 26 శాతం వాటాకు సమానమైన 204 కోట్లకు పైగా షేర్లను కొనుగోలు చేస్తామని ఎల్ఐసీ పేర్కొంది. ఈ మొత్తం ఓపెన్ ఆఫర్ రూ.12,602 కోట్లని పేర్కొంది. కాగా ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన ఎల్ఐసీకి షేర్లు జారీ చేస ప్రతిపాదనకు ఐడీబీఐ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. ఫలితంగా ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటా కొనుగోలుకు ఎల్ఐసీకి మార్గం సుగమం అవుతుంది. మరోవైపు బ్యాంక్ అధీకృత మూలధనాన్ని రూ.8,000 కోట్ల నుంచి రూ.15,000 కోట్లకు పెంచుకునే ప్రతిపాదనకు కూడా ఐడీబీఐ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. -
ఎల్ఐసీ వాటా కొనుగోలుకు ఆమోదం
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌లో అదనంగా ఏడు శాతం వాటాను కొనుగోలు చేయాలన్న ఎల్ఐసీ ప్రతిపాదనకు ఐడీబీఐ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. ఎల్ఐసీకి ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన ఈక్విటీ షేర్ల జారీకి వాటాదారుల ఆమోదాన్ని పోస్టల్ బ్యాలెట్ ద్వారా కోరతామని ఐడీబీఐ బ్యాంక్ తెలిపింది. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్ఐసీకి 7.98 శాతం వాటా ఉంది. తాజాగా ఈ వాటాను మరో 7 శాతానికి పెంచుకుంటోంది. ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటా కొనుగోలుకు ఇదొక మెట్టని నిపుణులు భావిస్తున్నారు. ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటాను ఎల్ఐసీ కొనుగోలు చేయనున్నది. ఈ ఏడాది రూ.60,000 కోట్ల ప్రీమియం ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ లక్ష్యం జోనల్ మేనేజర్ సుశీల్ కుమార్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.60,000 కోట్ల మొత్తం ప్రీమియం ఆదాయం సాధించాలని ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ లక్ష్యం విధించుకుంది. ఇందులో కొత్త పాలసీల ప్రీమియం రూ.6,300 కోట్లుగా నిర్దేశించుకుంది. 2017–18లో రూ.50,000 కోట్ల మొత్తం ప్రీమియం ఆదాయాన్ని నమోదు చేసినట్లు సౌత్ సెంట్రల్ జోన్ జోనల్ మేనేజర్ టి.సి.సుశీల్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కోటి పాలసీలను జారీ చేయాలని టార్గెట్ విధించుకున్నట్టు చెప్పారు. ‘గతేడాది 8 కొత్త ఉత్పత్తులను విడుదల చేశాం. కొత్తగా మూడు ఉత్పత్తులు ఐఆర్డీఏ అనుమతికి ఎదురు చూస్తున్నాయి. ఇక పాలసీలన్నీ డిజిటైజ్ చేశాం. కస్టమర్‌కు చెందిన పాలసీలను దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా పరిశీలించేందుకు సంస్థకు మార్గం సుగమం అయింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ‘మై ఎల్ఐసీ’ యాప్‌ను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చాం’ అని వివరించారు. -
ఐడీబీఐ బ్యాంక్‌లో 7% వాటా కొంటాం
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌ను చేజిక్కించుకునే ప్రక్రియలో ఎల్ఐసీ మరో అడుగు ముందుకు వేసింది. ఐడీబీఐ బ్యాంక్‌లో అదనంగా మరో 7 శాతం వాటాను ఎల్ఐసీ కొనుగోలు చేయనున్నది. ఈ మేరకు తమకు ఎల్ఐసీ నుంచి ఒక లేఖ అందిందని ఐడీబీఐ బ్యాంక్ తెలిపింది. తమ బ్యాంక్‌లో ఎల్ఐసీకి ఇప్పటికే 7.98 శాతం వాటా ఉందని, ఈ వాటాను 14.90 శాతానికి పెంచుకోనున్నామని తాజాగా ఎల్ఐసీ తమకు ఒక లేఖ రాసిందని ఐడీబీఐ బ్యాంక్ స్టాక్ ఎక్సే్చంజ్‌లకు నివేదించింది. ఈ మేరకు ఎల్ఐసీకి ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన ఈక్విటీ షేర్ల జారీ కోసం వాటాదారుల ఆమోదాన్ని పోస్టల్ బ్యాలెట్ రూపంలో కోరనున్నామని పేర్కొంది. ఈ విషయమై చర్చించడానికి ఈ నెల 31న డైరెక్టర్ల బోర్డ్ సమావేశమవుతోందని వివరించింది. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్ఐసీకి 7.98% వాటా ఉంది.ఈ వాటాను 51%కి పెంచుకోవడానికి ఎల్ఐసీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఐఆర్డీఏఐ ఆమోదం: కాగా ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటా కొనుగోలుకు ఎల్ఐసీకి బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ, ఐఆర్డీఏఐ ఈ ఏడాది జూన్‌లోనే ఆమోదం తెలిపింది. ప్రస్తుత నిబంధన ప్రకారమైతే, ఏ బీమా సంస్థ కూడా స్టాక్ మార్కెట్లో లిస్టైన ఆర్థిక సంస్థలో 15 శాతానికి మించిన వాటాను కొనుగోలు చేయకూడదు. కానీ ఈ నిబంధన నుంచి ఎల్ఐసీకి ఐఆర్డీఏఐ మినహాయింపునిచ్చింది. మరోవైపు చాలా కాలంగా బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించాలని ఎల్ఐసీ ప్రయత్నాలు చేస్తోంది. ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటా కొనుగోలు ద్వారా ఎల్ఐసీ చిరకాల స్వప్నం నెరవేరనున్నది. దేశవ్యాప్తంగా ఉన్న 2,000 ఐడీబీఐ బ్యాంక్ బ్రాంచీలు ఎల్ఐసీ పరమవుతాయి. మరోవైపు మొండి బకాయిలు అధికమై, భారీ నష్టాలతో కుదేలైన ఐడీబీఐ బ్యాంక్‌కు ఎల్ఐసీ వాటా కొనుగోలు ద్వారా భారీ స్థాయిలో నిధుల సమకూరుతాయి. 22 కోట్లకు పైగా ఎల్ఐసీ పాలసీ ఖాతాలు ఐడీబీఐ బ్యాంక్‌కు దక్కుతాయి. ఎల్ఐసీ 7 శాతం వాటాను కొనుగోలు చేయనున్నదన్న ప్రకటన వెలువడగానే ఐడీబీఐ బ్యాంక్ షేర్లు 5 శాతం తగ్గి రూ.57.85కు పడిపోయాయి. ఆ తర్వాత కోలుకున్నాయి. చివరకు 1 శాతం నష్టంతో రూ. 60.80 వద్ద ముగిశాయి. ఐడీబీఐ బ్యాంక్‌కు భారీ నిధులు ! ఈ వాటా విక్రయం కారణంగా ఐడీబీఐకి భారీ స్థాయిలో నిధులు లభించనున్నాయని నిపుణులంటున్నారు. దీంతో బ్యాంక్ మూలధన నిధుల నిబంధనలను అందుకోగలుగుతుందని వారంటున్నారు. ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వానికి 85.96 శాతం వాటా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో ఈ బ్యాంక్‌కు రూ.2,410 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ఈ బ్యాంక్ స్థూల మొండి బకాయిలు రూ.57,807 కోట్లుగా ఉన్నాయి. -
మూడు రెట్లు పెరిగిన ఐడీబీఐ బ్యాంకు నష్టాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఐడీబీఐ బ్యాంకు నష్టాలు జూన్ త్రైమాసికంలో మరింత పెరిగాయి. ఏకంగా రూ.2,410 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. మొండి బకాయిలకు అధిక కేటాయింపులే నష్టాలు పెరగడానికి ప్రధాన కారణమని బ్యాంకు తెలియజేసింది. మొత్తం ఆదాయం రూ.6,402 కోట్లకు పరిమితమయింది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ ఆదాయం రూ.6,730 కోట్లుగా ఉంటే, దానిపై రూ.853 కోట్ల నష్టం వచ్చింది. మొండి బకాయిలకు (ఎన్పీఏలు) జూన్ త్రైమాసికంలో రూ.4,602 కోట్లను కేటాయించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో కేటాయింపులు రూ.1,873 కోట్లు. తీవ్ర నష్టాల్లో ఉన్న బ్యాంకులో 51 శాతం వాటాను ఎల్ఐసీ కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. పెరిగిన ఎన్పీఏలు బ్యాంకు మొత్తం ఎన్పీఏలు రుణాల్లో 30.78 శాతానికి ఎగబాకి రూ.57,806 కోట్లకు చేరుకున్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 24.11%తో రూ.50,173 కోట్లుగా ఉండడం గమనార్హం. ఇక నికర ఎన్పీఏలు సైతం 15.8 శాతం నుంచి 18.76 శాతానికి చేరాయి. ఐడీబీఐ బ్యాంక్ వడ్డీరేటు పెంపు రుణ సమీకరణ వ్యయ ఆధారిత వడ్డీరేటును (ఎంసీఎల్ఆర్) వివిధ కాలపరిమితులకు సంబంధించి 0.10% వరకూ పెంచింది. ఆగస్టు 12 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని ఒక ప్రకటనలో తెలిపింది. -
ఎల్ఐసీతో విలీనానికి ఐడీబీఐకి అనుమతులు
ముంబై: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీతో డీల్‌కి సంబంధించి కేంద్రం నుంచి ఆమోదముద్ర లభించినట్లు ఐడీబీఐ బ్యాంక్ వెల్లడించింది. రుణ సంక్షోభంలో ఉన్న ఐడీబీఐ బ్యాంకులో ఎల్ఐసీ 51 శాతం వాటా కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎల్ఐసీ ప్రతిపాదనకు కేంద్రం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా తమ సంస్థలో ప్రభుత్వ వాటాను 50 శాతం లోపునకు తగ్గించుకునేందుకు, యాజమాన్య అధికారాలు వదులుకునేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసినట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఐడీబీఐ బ్యాంకు తెలిపింది. ఈ డీల్ ప్రిఫరెన్షియల్ ఇష్యూ/ఈక్విటీ ఓపెన్ ఆఫర్ రూపంలో ఉంటుందని పేర్కొంది. లావాదేవీ అనంతరం ఎల్ఐసీకి ఐడీబీఐ బ్యాంకు అనుబంధ సంస్థగా మారుతుంది. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంకులో ఎల్ఐసీకి 7.98% వాటా ఉంది. -
ఎల్ఐసీ చేతికి ఐడీబీఐ బ్యాంకు
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం నియంత్రిత వాటాను ఎల్ఐసీ సొంతం చేసుకునేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. హిందుస్తాన్ కాపర్ కంపెనీ తాజాగా 15 శాతం ఈక్విటీ జారీ ద్వారా రూ.900 కోట్ల సమీకరణకు కూడా అనుమతి తెలిపింది. బుధవారం ప్రధాని అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న ఐడీబీఐ బ్యాంకు ఎల్ఐసీకి ప్రిఫరెన్షియల్ షేర్లను జారీ చేయడం ద్వారా నిధులను సమీకరిస్తుంది. ఐడీబీఐ బ్యాంకులో ఎల్ఐసీకి ఇప్పటికే 7.5 శాతం వాటా ఉంది. మిగిలిన మేర మెజారిటీ వాటాను ప్రిఫరెన్షియల్ షేర్ల రూపంలో సొంతం చేసుకోనుంది. ఈ విధానంలో ఐడీబీఐ బ్యాంకుకు రూ.10,000–13,000 కోట్ల మేర తాజా నిధులు అందుబాటులోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వానికి నిధులు సమకూరవు. ఇప్పటి వరకు కేంద్రం తన వాటాను ఎల్ఐసీకి విక్రయించడం ద్వారా ఖజానా నింపుకుంటుందని భావించారు. హెచ్‌సీఎల్ నిధుల సమీకరణ హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) 15 శాతం తాజా ఈక్విటీ జారీ చేయడం ద్వారా రూ.900 కోట్లను సమీకరించేందుకు కేబినెట్ ఆమోదించింది. దీంతో హెచ్‌సీఎల్ 13.87 కోట్ల షేర్లను(15%) జారీ చేయనుంది. దీంతో కేంద్రం వాటా 66.13 శాతానికి తగ్గిపోతుంది. ప్రస్తుతం ప్రభుత్వానికి 76.05 శాతం వాటా ఉంది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం చూస్తే తాజా షేర్ల జారీ ద్వారా కంపెనీకి రూ.900.6 కోట్లు సమకూరతాయి. క్యూఐపీ ద్వారా ఈ ప్రక్రియను కంపెనీ పూర్తి చేయనుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ప్రాజెక్టుల విస్తరణకు ఈ నిధుల్ని వెచ్చించనుంది. తాజా షేర్లను జారీ చేస్తుండడంతో కంపెనీ చెల్లించిన మూలధనం రూ.462.61కోట్ల నుంచి రూ.532కోట్లకు పెరుగుతుంది. ఏకకాలంలో అన్ని రకాల ఇంధనాల ఉత్పత్తి సంప్రదాయేతర ఇంధనాలైన కోల్ బెడ్ మీథేన్ (సీబీఎం), షేల్ గ్యాస్‌తోపాటు సంపద్రాయ చమురు, సహజ వాయువులను ఏకకాలంలో వెలికితీసేందుకు కేంద్రం అనుమతించింది. లాభాల్లో 10% అదనపు చెల్లింపు ద్వారా అనుమతికి అవకాశం కల్పించింది. సంప్రదాయ ఇంధనాలైన చమురు, సహజ వాయువు ఉత్పత్తికి సంబంధించిన పర్మిట్‌తో ప్రస్తుతం షేల్ ఆయిల్, గ్యాస్, సీబీఎంల ఉత్పత్తికి అనుమతి లేదు. ఈ నిర్ణయంతో కొత్త పెట్టుబడులు, ఉత్పత్తి పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. -
మాల్యా అప్పగింత : నేడే కీలక పరిణామం
భారత బ్యాంక్‌లకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన లిక్కర్ టైకూన్ విజయ్ మాల్యా కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. అతన్ని భారత్‌కు అప్పగించే కేసులో యూకే కోర్టులో జరుగుతున్న విచారణలో నేడే తుది ఘట్టం. మంగళవారం జరుగబోయే ఫైనల్ విచారణలో ఈ కేసు ముగింపు అంకానికి రాబోతుందని తెలుస్తోంది. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ వద్ద చీఫ్ మెజిస్ట్రేట్ ముందు ప్రాసిక్యూషన్, డిఫెన్స్ రెండూ కూడా తమ తమ తుది వాదనలను వినిపించబోతున్నాయి. భారత్ తరఫున ది క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్(సీపీఎస్) ఈ కేసును వాదిస్తోంది. ఈ కేసుపై తుది తీర్పును యూకే కోర్టు సెప్టెంబర్‌లో వెల్లడించనుంది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఈ కేసు తుది విచారణ ప్రారంభం కానుందని తెలిసింది. గత డిసెంబర్లోనే మాల్యాను భారత్‌కు అప్పగించే కేసు తుది విచారణ చేపట్టాలని యూకే కోర్టు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు తుది విచారణలో కాస్త జాప్యం జరిగింది. ఈ కేసులో ఎక్కువగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, ఐడీబీఐ బ్యాంక్‌కు ఎగ్గొట్టిన రుణాలపై వాదన జరుగుతోంది. మొత్తం అన్ని భారత బ్యాంక్‌లకు కలిపి రూ.9900 కోట్ల రుణాలను మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బాకీ పడింది. ఈ రుణాలన్నింటిన్నీ ఎగ్గొట్టి మాల్యా విదేశాలకు పారిపోయారు. మాల్యా 2016 మార్చి నుంచి బ్రిటన్‌లో లగ్జరీ జీవితం గడుపుతున్నారు. అతనిని తమకు అప్పగించాలంటూ భారత్ చేసుకున్న అభ్యర్థనపై స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు మాల్యాను అరెస్ట్ చేశారు కూడా. ఆ అనంతరం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ కోర్టులో మాల్యాను భారత్‌కు అప్పగించే కేసుపై విచారణ ప్రారంభమైంది. మరోవైపు మాల్యా భారత్‌కు వచ్చేందుకు సముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. మాల్యాపై పరారీ ఆర్థిక నేరగాడుగా ముద్ర వేయడంతోపాటు అతనికి చెందిన రూ.12,500 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను స్వాధీనపర్చుకునేందుకు అనుమతివ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ముంబైలోని ప్రత్యేక కోర్టును కోరింది. ఈ పిటిషన్‌పై విచారణ కోసం వచ్చేనెల 27న ప్రత్యక్షంగా హాజరుకావాలని మాల్యాకు కోర్టు సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరుకాకుంటే కోర్టు మాల్యాను పరారీ ఆర్థిక నేరగాడుగా ప్రకటించడంతోపాటు ఆయన ఆస్తుల స్వాధీనానికి అనుమతిచ్చే అవకాశం ఉంది. అదే గనక జరిగితే మాల్యాకు దేశ, విదేశాల్లో ఉన్న ఆస్తులను దర్యాప్తు ఏజెన్సీ తక్షణమే స్వాధీనం చేసుకోనుంది. దాంతో దిగొచ్చిన మాల్యా.. విచారణకు ప్రత్యక్షంగా హాజరై తన గోడు వెళ్లబోసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. -
కేంద్రం ముందుకు ఎల్ఐసీ–ఐడీబీఐ డీల్
ముంబై: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీకి మెజారిటీ వాటాలను విక్రయించే ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని ఐడీబీఐ బ్యాంకు నిర్ణయించింది. మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వాటాలను 51 శాతం దాకా పెంచుకునేందుకు ఎల్ఐసీ చేసిన ప్రతిపాదనను బోర్డు సమావేశంలో చర్చించినట్లు ఐడీబీఐ బ్యాంకు స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. ‘దీనికి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరాలని బోర్డు నిర్ణయం తీసుకుంది‘ అని వివరించింది. దాదాపు రూ. 55,600 కోట్ల మేర మొండిబాకీలు, నష్టాలతో అస్తవ్యస్తంగా మారిన ఐడీబీఐ బ్యాంకులో ఎల్ఐసీకి ప్రస్తుతం 7.98 శాతం వాటా ఉంది. దీన్ని 51 శాతానికి పెంచుకునేందుకు ఉద్దేశించిన డీల్ గానీ ఓకే అయిన పక్షంలో ఐడీబీఐ బ్యాంక్‌కు సుమారు రూ. 10,000–13,000 కోట్ల మేర మూలధనం సమకూరే అవకాశం ఉంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఎల్ఐసీ సాధారణంగా ఏ లిస్టెడ్ ఫైనాన్షియల్ కంపెనీలోనూ 15 శాతానికి మించి వాటాను కొనుగోలు చేయడానికి లేదు. కానీ ఈ డీల్ విషయంలో మాత్రం కొంత వెసులుబాటు కల్పిస్తూ.. ఐడీబీఐ బ్యాంక్‌తో ఒప్పందానికి బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ అనుమతులిచ్చింది. ఐడీబీఐ బ్యాంక్ లిస్టెడ్ కంపెనీ అయినందున మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తీసుకోవాల్సి ఉంది. -
ఇక ఎల్ఐసీ చేతికి ఐడీబీఐ బ్యాంకు!
న్యూఢిల్లీ: మొండిబాకీల భారంతో కుంగుతున్న ఐడీబీఐ బ్యాంకులో మెజారిటీ వాటాను (51 శాతం) కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) అంగీకరించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు ఎల్ఐసీ బోర్డు ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి ఎస్సీ గర్గ్ వెల్లడించారు. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంకులో ఎల్ఐసీకి 7– 7.5 శాతం మేర వాటాలున్నాయని, మెజారిటీ హోల్డింగ్ కోసం మరిన్ని వాటాలను కొనుగోలు చేయనుందని ఆయన తెలియజేశారు. ఎల్ఐసీకి ప్రిఫరెన్షియల్ షేర్ల జారీ ద్వారా ఐడీబీఐ బ్యాంకు ఈ నిధులు సమకూర్చుకోవచ్చని గర్గ్ వివరించారు. ఎల్ఐసీ బోర్డులో ఆయన కూడా సభ్యుడిగా ఉన్నారు. ‘ప్రభుత్వం నుంచి నేరుగా వాటాలు కొనుగోలు చేయడం ఒక మార్గమైతే... ఎల్ఐసీకి ఐడీబీఐ బ్యాంకు ప్రిఫరెన్షియల్ షేర్లను కేటాయించడం మరో మార్గం. అయితే మొదటి దాని వల్ల ఐడీబీఐ బ్యాంకుకు నేరుగా మూలధనం లభించదు. ప్రస్తుతం బ్యాంకుకు మరింత మూలధనం కావాలి. కాబట్టి.. ఇందుకోసం ప్రిఫరెన్షియల్ షేర్ల అలాట్మెంట్ రూపంలోనే డీల్ ఉండే అవకాశం ఉంది‘ అని గర్గ్ వ్యాఖ్యానించారు. సెబీ అనుమతులు తీసుకోనున్న ఎల్ఐసీ.. ఐడీబీఐ బ్యాంకులో ఎల్ఐసీ వాటాలు పెంచుకునే ప్రతిపాదనకు బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ ఇప్పటికే అనుమతులిచ్చింది. అయితే, ఐడీబీఐ బ్యాంకు లిస్టెడ్ కంపెనీ కావడం వల్ల మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి కూడా ఎల్ఐసీ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అటు వాటాల విక్రయానికి ఐడీబీఐ బ్యాంకు కూడా తమ సంస్థ బోర్డు నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. బ్యాంకులో పబ్లిక్ వాటాలు తక్కువే ఉండటం వల్ల ఓపెన్ ఆఫర్ అవసరం ఉండకపోవచ్చని గర్గ్ పేర్కొన్నారు. అయితే, సందర్భాన్ని బట్టి దాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉందన్నారు. రూ. 13,000 కోట్ల డీల్? వాటాల విక్రయంతో ఐడీబీఐ బ్యాంకుకు ఎంత మేర నిధులు లభించవచ్చన్నది గర్గ్ వెల్లడించలేదు. అయితే ఈ డీల్ కుదిరితే సుమారు రూ. 10,000– 13,000 కోట్ల మేర లభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అప్పుడు ఐడీబీఐ బ్యాంక్ బోర్డులో కనీసం నలుగురు సభ్యులను నామినేట్ చేసేందుకు ఎల్ఐసీకి అవకాశం దక్కుతుంది. ఐడీబీఐ బ్యాంకులో మెజారిటీ వాటాల కొనుగోలు ద్వారా బ్యాంకింగ్ రంగంలోకి కూడా ప్రవేశించినట్లవుతుంది. బ్యాంకుకు చెందిన 2,000 పై చిలుకు శాఖల్లో ఎల్ఐసీ తమ పథకాలను విక్రయించుకోవడానికి సాధ్యపడుతుంది. అలాగే, ఎల్ఐసీ దగ్గర భారీగా ఉన్న నిధులు ఐడీబీఐ బ్యాంకుకు అందివస్తాయి. 22 కోట్ల పైచిలుకు పాలసీ హోల్డర్ల అకౌంట్లు కూడా ఈ బ్యాంకుకు దక్కవచ్చు. ప్రస్తుతం రూ.55,600 కోట్ల పైచిలుకు మొండిబాకీలతో సతమతమవుతున్న బ్యాంకుకు ఈ డీల్ బూస్ట్‌లా పనిచేస్తుంది. రెండు రోజుల్లో ఐడీబీఐ బ్యాంక్ బోర్డు భేటీ వాటాల విక్రయానికి సంబంధించి ఎల్ఐసీకి ప్రిఫరెన్షియల్ షేర్ల జారీపై చర్చించేందుకు ఒకటి, రెండు రోజుల్లో ఐడీబీఐ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వారాంతంలోగా అనుమతినివ్వొచ్చని పేర్కొన్నాయి. ఆ తర్వాత ఎల్ఐసీ, ఐడీబీఐ బ్యాంక్ సంస్థలు.. ఇటు సెబీ, అటు రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) అనుమతులు కోరనున్నాయి. -
ఐడీబీఐ బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు పిలుపు
న్యూఢిల్లీ : ఐడీబీఐ బ్యాంక్ అధికారులు కొందరు జులై 16 నుంచి ఆరు రోజుల పాటు సమ్మె చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు బ్యాంకు అధికారులు నోటీసులను ఐడీబీఐ బ్యాంక్‌కు అందించారు. తమకు నోటీసులు అందినట్లు రెగ్యులేటరీ సంస్థలకు ఐడీబీఐ బ్యాంకు సమాచారం అందించింది. జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ, ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం వాటాను కొనుగోలు, వేతనానికి సంబంధించిన సమస్యలపై నిరసనగా కొందరు ఐడీబీఐ అధికారులు సమ్మెచేస్తున్నట్టు తెలిసింది. 2018 జూలై 16 నుంచి 2018 జూలై 21 వరకు కొందరు అధికారులు సమ్మెకు దిగబోతున్న నోటీసులను తాము అందుకున్నామని ఐడీబీఐ బ్యాంక్, రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 2012 నవంబరు నుంచి ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగుల వేతనాలను సవరించలేదు. వేతన సవరణ విషయంలో గత ఏడాదే ఓ సారి సమ్మె నోటీసు ఇచ్చినా మేనేజ్మెంట్ ఇచ్చిన హామీతో విరమించుకున్నారు. ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటాను ఎల్ఐసీకి విక్రయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ‘ఆల్ ఇండియా ఐడీబీఐ ఆఫీసర్స్ అసోసియేషన్’ ఇప్పటికే కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి వినతిపత్రం అందించింది. ఐడీబీఐ అధికారులు, ఉద్యోగుల దగ్గర సమ్మెకు దిగడమే తప్ప మరో ఆప్షన్‌ను లేదని పేర్కొంది. -
ఐడీబీఐ బ్యాంక్ రుణాలపై వడ్డీ రేట్ల పెంపు
ముంబై: ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లను 5–10 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. జూలై 12 నుంచి కొత్త రేట్లు అమలవుతాయని బ్యాంకు ఒక ప్రకటనలో పేర్కొంది. దీని ప్రకారం.. ఏడాది వ్యవధి రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్) పది బేసిస్ పాయింట్లు పెరిగి 8.65% నుంచి 8.75 శాతానికి చేరింది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ అయిదు బేసిస్ పాయింట్లు పెరిగి 8.45% నుంచి 8.50 శాతంగా ఉంటుంది. మూడు నెలలు, మూడేళ్ల వ్యవధి రుణాలపై వడ్డీ రేట్లు యథాతథంగా 8.35 శాతం, 8.80 శాతంగానే ఉంటాయని బ్యాంకు తెలిపింది. బేస్ రేటును 9.5 శాతం -
ఎల్ఐసీ ఓపెన్ ఆఫర్!
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌లో 51% వాటా కొనుగోలు ద్వారా బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశిస్తున్న ఎల్ఐసీ... ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించే అవకాశాలున్నాయి. ఐడీబీఐ బ్యాంక్‌లో 51% వాటా కొనుగోలు కోసం బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ, ఐఆర్డీఏఐ ఇటీవలనే ఎల్ఐసీకి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఎల్ఐసీ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం కూడా పొందిన తర్వాత ఓపెన్ ఆఫర్‌కు అనుమతించాలంటూ మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీని ఎల్ఐసీ కోరవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. టేకోవర్ కోడ్ నిబంధన ప్రకారం, 25 శాతం, అంతకు మించిన వాటా కొనుగోలు చేస్తే, ఆ తర్వాత తప్పనిసరిగా ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి ఉంటుంది. ఐడీబీఐ బ్యాంకులో వాటా వద్దు.. ఎల్ఐసీ యూనియన్ల వ్యతిరేకత కాగా, ఆర్థిక సమస్యల్లో ఉన్న ప్రభుత్వరంగ ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం వాటా కొనుగోలుకు ఎల్ఐసీ తీసుకున్న నిర్ణయాన్ని ఆ సంస్థ ఉద్యోగులు వ్యతిరేకించారు. ఇది పాలసీదారుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ఎల్ఐసీ ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో గతంలో ఎల్ఐసీ పెట్టుబడుల పనితీరును ఉదహరిస్తూ... ఈ బ్యాంకుల విలువ చెప్పుకోతగ్గ స్థాయిలో తుడిచిపెట్టుకు పోయిందని, అది తమ లాభాలపైనా ప్రభావం చూపుతుందని ఎల్ఐసీ క్లాస్–1 అధికారుల సంఘం పేర్కొంది. ఈ మేరకు ఎల్ఐసీ చైర్మన్‌కు లేఖ రాసింది. -
ఎల్ఐసీ మెడకు ‘మొండి’బండ!
షేర్లు.. బంగారం.. డిపాజిట్లు... ఇలా ఎందులోనైనా ఎవరైనా లాభాలను ఆశించే పెట్టుబడి పెడతారు! అయితే, లాభాల మాట దేవుడెరుగు... నష్టాలొస్తున్నా పదేపదే వాటిలోనే పెట్టుబడి పెట్టేవారినేమంటారు? మన దేశంలోనైతే ‘ఎల్ఐసీ’ అంటారేమో!! ఈ ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఇప్పుడు సర్కారుకు ఆపద్బాంధవుడిగా మారింది. తీవ్రమైన మొండిబాకీలతో కుదేలైన ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లలో ఎల్ఐసీ పెట్టిన పెట్టుబడులన్నీ నష్టాలనే మిగులుస్తున్నాయి. అయినా, ఎక్కడా వెనక్కి తగ్గకుండా నష్టాల ప్రయాణంలో మరింత కూరుకుపోతుండటం ఒక్క ఎల్ఐసీకే చెల్లుతుందేమో. వేల కోట్ల రూపాయల మొండిబాకీలతో గుదిబండగా మారిన ఐడీబీఐ బ్యాంకులో రూ.13 వేల కోట్ల పెట్టుబడులకు ఎల్ఐసీ సిద్ధం కావడం ఇందుకు నిదర్శనం. ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండిబాకీలను భరించే ‘బ్యాడ్’ బ్యాంక్‌గా ఎల్ఐసీ మారుతోందన్నది కొంత మంది విశ్లేషకుల మాట!! సాక్షి, బిజినెస్ విభాగం : స్టాక్ మార్కెట్లో ఎల్ఐసీ జోరుగానే పెట్టుబడులు పెడుతూ ఉంటుంది. కొన్నింటిపై లాభాలు కూడా దండిగానే వస్తున్నాయి. అయితే, ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్బీ) షేర్లలో వెచ్చించిన ఇన్వెస్ట్మెంట్లు మాత్రం ఎల్ఐసీ జేబుకు చిల్లుపెడుతూనే ఉన్నాయి. గడిచిన రెండున్నరేళ్లలో మొత్తం 21 పీఎస్బీలకు గాను 18 పీఎస్బీల్లో చేసిన పెట్టుబడులపై ఎల్ఐసీ భారీస్థాయిలోనే నష్టాలను మూటగట్టుకోవడం గమనార్హం. ఈ 21 పీఎస్బీల్లో ఎల్ఐసీకి 1 శాతం కంటే ఎక్కువ వాటానే ఉంది. 2015 డిసెంబర్ నాటి షేర్ల ధరలతో పోలిస్తే... కేవలం 3 ప్రభుత్వ బ్యాంకుల్లో పెట్టుబడులు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి. వీటిలో ఇండియన్ బ్యాంక్(షేరు 168 శాతం పెరిగింది), విజయా బ్యాంక్(43 శాతం అప్), ఎస్బీఐ(4 శాతం అప్) ఉన్నాయి. ఆర్బీఐ మేలుకొలిపినా... 2015 డిసెంబర్ నుంచి చూస్తే... ఎల్ఐసీ ఇప్పటివరకూ పీఎస్బీ షేర్లలో చేసిన పెట్టుబడుల విలువ 8 శాతం పైగానే హరించుకుపోయింది. ఈ పీఎస్బీలన్నీ మొండిబకాయిల(ఎన్పీఏ) ఊబిలో కూరుకుపోయి తీవ్రమైన నష్టాలను మూటగట్టుకుంటుండంతో వాటి షేర్ల విలువలు రోజురోజుకూ కుదేలైపోతున్నాయి. అయినాసరే ఎల్ఐసీ మాత్రం కొత్తగా వాటి షేర్లను కొనుగోలు చేస్తూనే ఉంది. విచిత్రం ఏంటంటే... మొండి బకాయిలపై ఆర్బీఐ కొరడా ఝుళిపించడం మొదలెట్టిన తర్వాత(2015 ద్వితీయార్థం నుంచి) కూడా పీఎస్బీ షేర్లలో ఎల్ఐసీ కొత్తగా పెట్టుబడులు పెట్టడం!! అప్పటినుంచి చూస్తే దేనా బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర షేర్ల విలువలు 60 శాతంపైగా పడిపోయాయి. మొత్తం 9 ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్ల ధరలు 50 శాతంపైగా క్షీణించగా... ఆరు బ్యాంకుల షేర్ల విలువ 30–50 శాతం మేర పతనమైంది. ఎల్ఐసీ పెట్టుబడులపై ఆధారపడొద్దని, బ్యాంకింగ్ వ్యవస్థకు ఇది మంచిదికాదంటూ ఆర్బీఐ చాన్నాళ్ల క్రితమే హెచ్చరించడం గమనార్హం. కాగా, మొండిబకాయిలు తారస్థాయికి ఎగబాకిన 11 బ్యాంకులను ఆర్బీఐ దిద్దుబాటు చర్యల్లో భాగంగా(పీసీఏ) తన పర్యవేక్షణలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీటి ఎన్పీఏలు రూ.10,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్ల స్థాయిలో ఉన్నాయి. అంటే ఇవి కొత్తగా రుణాలివ్వడం ఇతరత్రా అంశాలపై ఆర్బీఐ ఆంక్షలు కొనసాగుతాయి. ఈ 11 బ్యాంకు షేర్లలో ఎల్ఐసీ భారీగానే పెట్టుబడులు పెట్టింది. ఎల్ఐసీకి 10 శాతంపైగా వాటా ఉన్న ఆరు ప్రభుత్వ బ్యాంకుల మొండిబకాయిలు... వ్యవస్థలోని మొత్తం ఎన్‌పీఏల్లో 8 శాతానికి సమానం. అంటే.. ఈ మొండిబకాయిలన్నీ ఒకరకంగా ఎల్ఐసీ మెడకు చుట్టుకున్నట్లే!! ఎస్బీఐలో అత్యధిక పెట్టుబడి... ఈ ఏడాది మార్చి నాటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)షేర్లలో ఎల్ఐసీకి రూ.22,770 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. అయితే, వాటా పరంగా చూస్తే పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) టాప్‌లో ఉంది. ఇందులో ఎల్ఐసీకి అత్యధికంగా 14.2 శాతం వాటా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో కార్పొరేషన్ బ్యాంక్(ఎల్ఐసీ వాటా 13 శాతం), అలహాబాద్ బ్యాంక్(12.4 శాతం వాటా) ఉన్నాయి. ఇక ఐడీబీఐ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల్లో కూడా 10 శాతం పైగానే వాటాలు ఎల్ఐసీకి ఉండటం గమనార్హం. 2015 డిసెంబర్ నాటికి మొత్తం బ్యాంకింగ్ షేర్లలో ఎల్ఐసీ పెట్టుబడుల విలువ రూ.78,000 కోట్లు. ఇందులో పీఎస్‌బీల వాటా రూ.42,480 కోట్లు కాగా, ప్రైవేటు బ్యాంకుల వాటా రూ.35,520 కోట్లు. ఈ ఏడాది మార్చి నాటికి బ్యాంకుల్లో ఎల్ఐసీ పెట్టుబడి విలువ రూ.92,730 కోట్లకు ఎగబాకింది. అయితే, పీఎస్బీల్లో వాటాలను పెంచుకున్నప్పటికీ.. వాటి విలువ రూ.38,830 కోట్లకు పడిపోగా, ప్రైవేటు బ్యాంకుల్లో పెట్టుబడుల విలువ మాత్రం రూ.53,900 కోట్లకు చేరడం గమనార్హం. వాస్తవానికి మొత్తం ఎల్ఐసీ పెట్టుబడుల్లో పీఎస్‌బీల వాటా చాలా తక్కువనే చెప్పాలి. 2017 డిసెంబర్ నాటికి ఎల్ఐసీ తనదగ్గరున్న పాలసీదారుల నిధుల్లో రూ.15.4 లక్షల కోట్లను ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడిగా పెట్టింది. ఇక షేర్లలో రూ.4.8 లక్షల కోట్లు, డిబెంచర్లు–బాండ్లలో రూ.76,100 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. ప్రైవేటు బ్యాంకులతో లాభాలు... ప్రభుత్వ బ్యాంకు షేర్లలో చేతులుకాల్చుకుంటున్న ఎల్ఐసీకి ప్రైవేటు బ్యాంకులు మాత్రం ఆదుకుంటుండటం విశేషం. ఎల్ఐసీకి ఒక శాతం కంటే అధికంగా వాటా ఉన్న 9 ప్రైవేటు బ్యాంకుల్లో పెట్టుబడులన్నీ ప్రస్తుతం లాభాల్లోనే ఉన్నాయి. 2015 డిసెంబర్ నుంచి చూస్తే... ప్రైవేటు బ్యాంకుల్లో ఇన్వెస్ట్మెంట్ విలువ 50 శాతం మేర ఎగబాకింది. ఇందులో హెచ్డీఎఫ్సీ బ్యాంక్(షేరు ధర 95 శాతం వృద్ధి), యస్ బ్యాంక్(134 శాతం అప్) ప్రధానంగా ఉన్నాయి. బ్యాడ్ బ్యాంకా.. ఎందుకు ఎల్ఐసీ ఉందిగా! పీఎస్‌బీల మొండిబకాయిల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఒక అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ(దీన్నే బ్యాడ్ బ్యాంక్‌గా పేర్కొంటున్నారు) ఏర్పాటు చేయాలంటూ తాజాగా ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇవ్వడం తెలిసిందే. అయితే, ఇలాంటి బ్యాంకులన్నింటిలో మెజారిటీ వాటాను ఎల్ఐసీ చేత కొనిపించి.. చేతులుదులుపుకుంటే సరిపోయేదానికి మళ్లీ బ్యాడ్ బ్యాంక్ పేరుతో కొత్తగా ఒక సంస్థను ఏర్పాటు చేయడమెందుకంటూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నవారు కూడా ఉన్నారు. ఎందుకంటే మొండిబాకీలతో చతికిలపడిన ఐడీబీఐ బ్యాంక్‌లో ఇప్పుడు 51% మెజారిటీ వాటాను ఎల్ఐసీకి కట్టబెట్టేందుకు(దాదాపు రూ.13,000 కోట్లు పెట్టుబడి పెట్టించేందుకు) చకచకా పావులు కదుపుతుండటమే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. ఎల్ఐసీ చేసే ఈ పెట్టుబడి కూడా నిరర్థకంగా మారుతుందని... ఉద్యోగ సంఘాలు లబోదిబోమంటున్నా ప్రభుత్వం ముందుకే వెళ్తోంది. ఎల్ఐసీ కోసం తాజాగా బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ ప్రత్యేకంగా పెట్టుబడి పరిమితి నిబంధనలను కూడా సవరించింది(15 శాతం నుంచి 51 శాతానికి). కాగా, 2015–16 నుంచి 2017–18 మధ్య ఐడీబీఐ బ్యాంక్ రూ.13,396 కోట్ల నికర నష్టాలను మూటగట్టుకుంది. రూ.55,000 కోట్ల ఎన్పీఏలతో కుదేలైంది. మరో రూ.60,000 కోట్ల రుణాలు ఎన్పీఏలుగా మారే ప్రమాదం ఉంది. ఇంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్న బ్యాంకు షేరు ఇప్పట్లో కోలుకోవడం కష్టమే. అయినా, కూడా ఎల్ఐసీకి మెజారిటీ వాటా కట్టబెట్టేందుకు ప్రభుత్వం పావులు కదుపుతుండటాన్ని నిపుణులు తప్పుబడుతున్నారు. ఐడీబీఐ డీల్‌కు పార్లమెంట్ ఆమోదం అక్కర్లేదు! ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్ఐసీ ప్రతిపాదిత 51 శాతం మెజారిటీ వాటా కొనుగోలు విషయంలో ఎల్ఐసీ చట్టంలో సవరణ, పార్లమెంట్ ఆమోదం అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇది ఫైనాన్షియల్ ఒప్పందం అయినందున చట్టంలో మార్పులు చేయనక్కర్లేదని, అయితే, దీనికి కేబినెట్ ఆమోదంతో పాటు ఇతర నియంత్రణ సంస్థల అనుమతి తీసుకోవా ల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఎల్ఐసీకి ఐడీబీఐ బ్యాంక్ తాజాగా ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన షేర్లను జారీ చేస్తుంది. ఎల్ఐసీ వెచ్చించే రూ.10,000–13,000 కోట్ల మూలధన నిధులతో ఆ సంస్థ వాటా 51 శాతానికి చేరుతుంది. ఈ నిధులు ప్రభుత్వ ఖజానాకు చేరవు. మరోపక్క, ప్రభుత్వ వాటా ఇప్పుడున్న 80.96% నుంచి 51% దిగువకు తగ్గుతుంది. ఈ డీల్‌తో ఐడీబీఐ బ్యాంక్ ప్రభుత్వ రంగ హోదాను కోల్పోయి ప్రైవేటు బ్యాంకు అవతారమెత్తుతుంది. ఎల్ఐసీకి అనుబంధ సంస్థగా మారుతుంది. కాగా, ఈ డీల్‌తో బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టాలన్న ఎల్ఐసీ చిరకాల కోరిక నెరవేరుతుందన్నది మరికొందరి వాదన. మరోపక్క, ఈ డీల్‌ను ఐడీబీఐ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రైవేటు బ్యాంకుగా మార్చేందుకే ఈ చర్యలని ధ్వజమెత్తాయి. బ్యాంకులో ప్రభుత్వ వాటాను 51% కంటే దిగువకు తగ్గించుకోబోమంటూ మోదీ సర్కారు పార్లమెంటులో ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కుతోందని ఐడీబీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ విఠల్ కోటేశ్వర రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి తమ డిమాండ్లను నివేదించినట్లు ఆయన వెల్లడించారు. -
ఐడీబీఐ బ్యాంకు కొత్త బాస్ ఈయనే
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా బి.శ్రీరామ్ ఎంపికయ్యారు. నేడు (శనివారం) బ్యాంకు సీఎండీ బాధ్యతలు స్వీకరించారని ఐడీబీఐ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ప్రస్తుత ఎండీ మహేష్ కుమార్ జైన్ ఆర్బీఐ (రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా) డిప్యూటీ గవర్నర్‌గా ఎంపికైన నేపథ్యంలో, ఆయన స్థానంలో శ్రీరామ్‌ను ఎంపిక చేసింది. జూన్ 29 న శ్రీరామ్ వాలంటరీ రిటైర్మెంట్కు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందని ఎస్బీఐ ప్రకటించింది. 2014 జూలై నుంచి ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు ఎస్బీఐలో ఎండీ (కార్పొరేట్ మరియు గ్లోబల్ బ్యాంకింగ్) గా శ్రీరామ్ పనిచేస్తున్నారు. మరోవైపు అప్పుల ఊబిలో చిక్కుకున్న ఐడీబీఐలో 51 శాతం వాటా కొనుగోలుకు ప్రభుత్వ రంగ బీమాసంస్థ ఎల్ఐసీ అన్నిమార్గాలను సుగమం చేసుకుంటోంది. ఈ డీల్‌కు తాజాగా భారతీయ బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డిఎఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
బ్యాంకింగ్ రంగంలోకి ఎల్ఐసీ!
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించాలన్న ఎల్ఐసీ చిరకాల స్వప్నం సాకారం కానున్నది. భారీ రుణ భారంతో కుదేలైన ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటాను బీమా దిగ్గజం ఎల్ఐసీ కొనుగోలు చేయనున్నది. ఐడీబీఐలో ప్రస్తుతం 10.82 శాతంగా ఉన్న వాటాను 51 శాతానికి పెంచుకోవడానికి ఎల్ఐసీకి బీమా నియంత్రణ సంస్థ, ఐఆర్డీఏఐ ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌లో జరిగిన ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ) బోర్డ్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదన మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ, బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ, ఆర్బీఐల ఆమోదం పొందాల్సి ఉంది. ఎల్ఐసీ వాటా కొనుగోలు కారణంగా ఐడీబీఐ బ్యాంక్‌కు రూ.10,000–13,000 కోట్ల రేంజ్లో పెట్టుబడులు లభిస్తాయని అంచనా. 7–10 ఏళ్లలో ఎల్ఐసీ తన వాటాను 15 శాతానికి తగ్గించుకుంటుందని ఆ వర్గాలు వెల్లడించాయి. పెట్టుబడుల వివరాలు, 51% వాటాను 15 శాతానికి ఎంత కాలంలో తగ్గించుకుంటుందో వంటి అంశాలతో పాటు ఇతర విధి, విధానాలతో కూడిన ప్రణాళికను త్వరలోనే ఎల్ఐసీ సమర్పించనున్నది. ఎల్ఐసీ పోటీ బీమా సంస్థలకు సొంత బ్యాంక్‌లు ఉన్నాయి. ఇప్పుడు సొంత బ్యాంక్‌తో ఎల్ఐసీ మరింత విస్తరిస్తుందని నిపుణులంటున్నారు. ఎల్ఐసీకి మినహాయింపు... స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ఆర్థిక సంస్థల్లో ఏ బీమా సంస్థ కూడా 15 శాతానికి మించి వాటా కొనుగోలు చేయకూడదని ప్రస్తుత నిబంధనలున్నాయి. ఐడీబీఐ బ్యాంక్‌లో వాటా కొనుగోలు కోసం ఈ నిబంధన నుంచి ఎల్ఐసీకి ఐఆర్డీఏఐ మినహాయింపునిచ్చింది. దీంతో ఐడీబీఐ బ్యాంక్‌లో మెజారిటీ వాటా కొనుగోలు ద్వారా బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించాలన్న ఎల్ఐసీ ప్రయత్నాలు ఫలించినట్లే. ఈ వాటా కొనుగోలు ద్వారా ఐడీబీఐ బ్యాంక్‌కు భారీగా మూలధన పెట్టుబడులు, 22 కోట్ల పాలసీదారుల ఖాతాలు లభిస్తాయి. ఇక ఎల్ఐసీ 2,000 బ్రాంచ్‌ల నెట్‌వర్క్‌తో తన పాలసీలను మరింత విస్తృతంగా విక్రయించుకునే అవకాశం దక్కుతుంది. ఎల్ఐసీ అనుబంధ సంస్థగా ఐడీబీఐ బ్యాంక్ కొనసాగే అవకాశాలున్నాయి. ఇప్పటికే హౌసింగ్ ఫైనాన్స్, మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఎల్ఐసీకి అనుబంధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వాటాదారులకు మంచి విలువ.. ఈ ఏడాది మార్చి నాటికి ఐడీబీఐ బ్యాంక్ మొండి బకాయిలు రూ.55,600 కోట్లకు చేరాయి. గత ఆర్థి క సంవత్సరం నాలుగో క్వార్టర్లో ఐడీబీఐ బ్యాంక్ నికర నష్టాలు రూ.5,663 కోట్లకు చేరాయి. ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్ఐసీ వాటా కొనుగోలు కారణంగా ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వం వాటా ప్రస్తుతమున్న 80.96 శాతం నుంచి 50 శాతం దిగువకు తగ్గుతుంది. ఈ వాటా విక్రయం వల్ల లభించే పెట్టుబడులు ప్రభుత్వ ఖజానాకు కాకుండా ఐడీబీఐ బ్యాంక్ పునరుజ్జీవనానికి వినియోగిస్తారు. ఎల్ఐసీ వాటా కొనుగోలు కారణంగా మొండి బకాయిల సమస్య తీరిపోయి ఐడీబీఐ బ్యాంక్ వాటాదారులకు మంచి విలువ చేకూరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐదు బ్యాంకుల్లో ఎల్ఐసీకి వాటాలు.. ఇప్పటికే ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎల్ఐసీకి 10 శాతం చొప్పున వాటాలున్నాయి. ఎల్ఐసీకి ఎస్బీఐలో 9.98%, అలహాబాద్ బ్యాంక్‌లో 12.37%, కార్పొరేషన్ బ్యాంక్‌లో 13.03 శాతం చొప్పున వాటాలున్నాయి. ఒక బ్యాంక్‌లో నియంత్రిత వాటా ఉన్న కంపెనీకి, ఇతర బ్యాంక్‌ల్లో 5 శాతానికి మించి వాటా ఉండకూడదనే నిబంధనలున్నాయని, ఫలితంగా ఈ బ్యాంకుల్లో తన వాటాను ఎల్ఐసీ తగ్గించుకోవలసి రావచ్చని నిపుణులంటున్నారు. కాగా గత వారమే ఐడీబీఐ బ్యాంక్ సీఈఓగా ఎస్బీఐ ఎమ్డీ. బి. శ్రీరామ్‌ను ప్రభుత్వం నియమించింది. మూడు నెలల కాలానికే ఈ నియామకం జరిగినప్పటికీ, దీర్ఘకాలం పాటే ఆయన సీఈఓగా కొనసాగే అవకాశాలున్నాయి. 10 శాతం పెరిగిన ఐడీబీఐ బ్యాంక్ షేర్ ఎల్ఐసీ వాటా కొనుగోళ్ల వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో ఐడీబీఐ బ్యాంక్ షేర్ జోరుగా పెరిగింది. 10 శాతం లాభంతో రూ.54.90 వద్ద ముగిసింది. బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.7,567 కోట్లు పెరిగి రూ.22,955 కోట్లకు చేరింది. ఎల్ఐసీకి వాటా విక్రయం వద్దు.... ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్ఐసీ వాటా కొనుగోలును ఆల్ ఇండియా బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు ఆర్థిక మంత్రి పీయూష్ గోయెల్‌కు ఏఐబీఈఏ కార్యదర్శి సీహెచ్. వెంకటాచలం శుక్రవారం ఒక లేఖ రాశారు. ఐడీబీఐ బ్యాంక్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వాటా 51 శాతం కంటే తగ్గకుండా చూస్తామని ఐడీబీఐను 2003లో ఐడీబీఐ బ్యాంక్‌గా మారుస్తున్న సందర్భంలో అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆ హామీ వల్లే ఆ బిల్లు ఆమోదం పొందిందని ఈ లేఖలో ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే ఎల్ఐసీ భారీ నిరర్థక ఆస్తులతో నిండిపోయిందని, నష్టాల్లో ఉన్న సంస్థలన్నింటినీ ఎల్ఐసీ నిధులతో గట్టెక్కించడం సరికాదని ఆయన విమర్శించారు. మొండి బకాయిల పరిష్కారానికి గట్టి చర్యలు తీసుకోవాలని, అంతే కానీ మరిన్ని నిధులు గుమ్మరించడం సరైన పరిష్కారం కాదని ఆయన ఆక్షేపించారు. -
ఎల్ఐసీ-ఐడీబీఐ డీల్‌కు ఐఆర్డీఐ గ్రీన్ సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: బిజినెస్వర్గాల్లో ఆసక్తిని రేపిన ఎల్ఐసీ- ఐబీడీఐ బ్యాంకు డీల్‌ను కీలకమైన ఆమోదం లభించింది. ఐడీబీఐ బ్యాంకులో వాటాల కొనుగోలుకు సంబంధించిన డీల్‌లో ఎల్ఐసీకి ఐడీబీఐ గ్రీన సిగ్నల్ ఇచ్చింది. డీల్‌లో భాగంగా బ్యాంక్‌లోకి ఎల్ఐసీ దాదాపు రూ. 13వేల కోట్లను పెట్టుబడులు పెట్టనుంది. బ్యాంకులో వాటాను 5-7 సంవత్సరాలలో 15 శాతానికి పరిమితం చేయనుంది. సెబీ నిబంధనల ప్రకారం వాల్యూయేషన్స్ నిర్ణయించబడతాయి. మరోవైపు ఐడీబీఐ బ్యాంకులో మెజారిటీ వాటాను ఎల్ఐసీ కొనుగోలు వార్తలతో ఇవాల్టి బుల్ మార్కెట్లో ఐడీబీఐ షేర్ భారీగా లాభపడింది. ఇన్వెసర్ల కొనుగోళ్లతో 10శాతానికిపైగా ఎగిసింది. దీంతో బ్యాంకు మార్కెట్ వాల్యూ 7వేలకోట్ల రూపాయలు పుంజుకుని రూ. 23వేల కోట్లకు చేరింది. -
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఎం.కె. జైన్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా ఐడీబీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.కె.జైన్‌ను ఎస్.ఎస్.ముంద్రా స్థానంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా నియమించింది. ముంద్రా మూడేళ్ల పదవీ కాలం గతేడాది జూలైలో ముగిసింది. ‘బ్యాంకింగ్‌లో మంచి అనుభవమున్న, ఐడీబీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో మహేశ్ కుమార్ జైన్‌ను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా కేంద్రం నియమించింది. ఈయన పదవీ కాలం మూడేళ్లు’ అని ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ ట్వీట్ చేశారు. జైన్‌కు బ్యాంకింగ్ రంగంలో 30 ఏళ్ల అనుభవముంది. ఈయన 2017 మార్చి నుంచి ఐడీబీఐ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీనికన్నా ముందు ఇండియన్ బ్యాంక్ ఎండీగా పనిచేశారు. పలు బ్యాంకింగ్ రంగ ప్యానెల్స్‌లో కూడా సభ్యుడిగా కూడా వ్యవహరించారు. ఆర్బీఐలో నలుగురు డిప్యూటీ గవర్నర్లున్నారు. విరాల్ వి ఆచార్య, ఎన్.ఎస్.విశ్వనాథన్, బి.పి.కనుంగోతో తాజాగా జైన్ జత కలిశారు. డిప్యూటీ గవర్నర్‌కు అలవెన్సులు కాకుండా నెలకు రూ.2.25 లక్షల వేతనం ఉంటుంది. -
మొండిబాకీల్లో.. పోటాపోటీ!
ఐడీబీఐ బ్యాంకు ఇస్తున్న రుణాల్లో ప్రతి వంద రూపాయలకూ రూ.28 వరకూ నిరర్థక ఆస్తిగా (ఎన్పీఏ) మారిపోతోంది. అంటే తిరిగి చేతికొస్తున్నది 72 రూపాయలే. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. ఇస్తున్న 100 రూపాయల అప్పులో దాదాపు రూ.12.26 వరకూ ఎన్పీఏగా మారి... రూ.77.74 మాత్రమే చేతికొస్తోంది. ఈ రెండు బ్యాంకుల మొత్తం ఎన్పీఏలెంతో తెలుసా..? అక్షరాలా లక్షా పన్నెండువేల కోట్లపైనే!!. ఐడీబీఐ నష్టాలు రూ.5,663 కోట్లు మొండిబాకీలకు భారీ కేటాయింపుల వల్ల ఐడీబీఐ బ్యాంక్ నష్టాలు మరింతగా పెరిగాయి. క్యూ4లో నికర నష్టాలు రూ.5,663 కోట్లుగా నమోదయ్యాయి. 2016–17 జనవరి–మార్చి మధ్య నష్టాలు రూ.3,120 కోట్లు. తాజా క్యూ4లో బ్యాంకు ఆదాయం స్వల్పంగా పెరిగి రూ.7,703 కోట్ల నుంచి రూ. 7,914 కోట్లకు చేరింది. మొత్తం రుణాల్లో స్థూల నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) వాటా 21.25 శాతం నుంచి ఏకంగా 27.95 శాతానికి ఎగిసింది. నికర ఎన్పీఏలు కూడా 13.21 శాతం నుంచి 16.69 శాతానికి పెరిగాయి. విలువ పరంగా ఎన్పీఏలు రూ.55,588 కోట్లు. నాలుగో త్రైమాసికంలో ఎన్పీఏల కోసం కేటాయింపులు రూ. 6,054 కోట్ల నుంచి రూ. 10,773 కోట్లకు పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంకు షేరు 3 శాతం క్షీణించి రూ. 65.10 వద్ద ముగిసింది. బీఓబీ నష్టం రూ.3,102 కోట్లు మొండి బాకీలకు కేటాయింపులు పెరగటంతో నాలుగో త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) రూ.3,102 కోట్ల నష్టం ప్రకటించింది. 2016–17 క్యూ4లో రూ.155 కోట్ల లాభం నమోదు చేయటం గమనార్హం. తాజా త్రైమాసికంలో మొండిబాకీల కేటాయింపు ఏకంగా రూ.2,425 కోట్ల నుంచి రూ.7,052 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం రూ. 12,852 కోట్ల నుంచి రూ. 12,735 కోట్లకు తగ్గింది. రుణాల్లో స్థూల నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) పరిమాణం 10.46% నుంచి 12.26 శాతానికి పెరిగింది. విలువపరంగా చూస్తే.. రూ. 42,719 కోట్ల నుంచి రూ. 56,480 కోట్లకు చేరింది. నికర ఎన్పీఏలు 4.72% నుంచి 5.49 శాతానికి పెరిగాయి. శుక్రవారం బీఎస్ఈలో బీవోబీ షేరు 1.80 శాతం పెరిగి రూ. 141.20 వద్ద క్లోజయ్యింది. -
రూ.600 కోట్ల స్కామ్‌లో బీఎస్ఈ చైర్మన్ పేరు
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకులో చోటుచేసుకున్న రూ.600 కోట్ల రుణ స్కామ్‌లో బ్యాంకు ప్రస్తుత, మాజీ అధికారుల నివాసాల్లో సీబీఐ శుక్రవారం సోదాలు నిర్వహించింది. ఈ కేసులో బీఎస్ఈ చైర్మన్ ఎస్.రవి పేరును తాజాగా చేర్చింది. ఈయన ఐడీబీఐ బ్యాంకు బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు. అంతేకాదు, ఐడీబీఐ బ్యాంకు ఆడిట్ కమిటీ చైర్మన్‌గానూ ఉన్నట్టు బీఎస్ఈ వెబ్సైట్లో వివరాలు ఉన్నాయి. ఇదే కేసులో ఇండియన్ బ్యాంకు ఎండీ, సీఈవో కిషోర్ కారత్, సిండికేట్ బ్యాంకు చీఫ్ మెల్విన్ రెగో, ఐడీబీఐ బ్యాంకు చైర్మన్, ఎండీ ఎస్ఎస్ రాఘవన్ సహా పలువురు ఐడీబీఐ బ్యాంకు అధికారులు, ఎయిర్‌సెల్ మాజీ ప్రమోటర్ శివశంకరన్, ఆయన కుమారుడు శరవణన్ పేర్లను ఇప్పటికే చేర్చిన విషయం విదితమే. క్రెడిట్ కమిటీ ఆఫ్ ద బ్యాంకు సీజీఎం అమిత్ నారాయణ్, బ్యాంకు క్రెడిట్ కమిటీ మాజీ సభ్యుడు ఆర్కే భన్సాల్, బ్యాంకు మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్కే శ్రీనివాసన్ తదితరుల నివాసాల్లో సీబీఐ అధికారులు తాజాగా దాడులు నిర్వహించారు. ఈ కేసులో ఎస్.రవితోపాటు ఇతరులను త్వరలోనే విచారించనున్నట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి. -
ఐడీబీఐ బ్యాంకులో 600 కోట్ల స్కామ్
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో మరో కుంభకోణం తెరపైకి వచ్చింది. ఎయిర్‌సెల్ మాజీ ప్రమోటర్ సి.శివశంకరన్‌కు గ్రూపుతో సంబంధం కలిగిన విదేశీ కంపెనీలకు ఐడీబీఐ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా రుణాలు మంజూరు చేయడం వల్ల రూ.600 కోట్ల నష్టం వాటిల్లిందంటూ సీబీఐ తాజాగా కేసు నమోదు చేసింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన సీబీఐ... ఎయిర్‌సెల్ మాజీ ప్రమోటర్ శివశంకరన్, అతని కుమారుడు శివశంకరన్ శరవణన్‌తోపాటు... 2010 నుంచి 2014 వరకు (రుణాలు మంజూరైన సమయంలో) ఐడీబీఐ బ్యాంకులో పనిచేసిన ఉన్నతాధికారులతోపాటు ప్రస్తుత ఉన్నతాధికారులు మొత్తం 15 మంది పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చింది. వీరిలో ఇండియన్ బ్యాంకు ఎండీ, సీఈవో కిషోర్ ఖారత్ (ఐడీబీఐ బ్యాంకు రుణం మంజూరు సమయంలో ఆ బ్యాంకు ఎండీ, సీఈవోగా ఉన్నారు), సిండికేట్ బ్యాంకు ఎండీ మెల్విన్ రెగో (ఈయన గతంలో ఐడీబీఐ బ్యాంకు డిప్యూటీ ఎండీగా పనిచేశారు), ఐడీబీఐ బ్యాంకు ప్రస్తుత చైర్మన్, ఎండీ (సీఎండీ) ఎంఎస్ రాఘవన్, విదేశీ కంపెనీల నాటి డైరెక్టర్ల పేర్లు సహా 24 మంది ప్రైవేటు వ్యక్తుల పేర్లను సైతం సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చింది. మార్గదర్శకాలు, నిబంధనలకు వ్యతిరేకంగా ఐడీబీఐ బ్యాంకు రుణాలను జారీ చేసిందని సీబీఐ అధికార ప్రతినిధి అభిషేక్ దయాళ్ తెలిపారు. దీనివల్ల బ్యాంకుకు, ప్రభుత్వ ఖజానాకు రూ.600 కోట్ల మేర నష్టం జరిగినట్టు పేర్కొన్నారు. ఇవీ కేసులు...: 2010లో ఫిన్లాండ్కు చెందిన విన్ వైండ్ ఓవైకి (డబ్ల్యూడబ్ల్యూవో) ఐడీబీఐ బ్యాంకు రూ.322 కోట్ల రుణం మంజూరు చేసింది. మూడేళ్ల తర్వాత అది ఎన్పీఏగా మారింది. అలాగే, 2014 ఫిబ్రవరిలో బ్రిటిషన్ వర్జిన్ ఐలాండ్స్కు చెందిన ఆక్సెల్ సన్‌షైన్ లిమిటెడ్‌కు ఐడీబీఐ మరో రూ.523 కోట్ల రుణాన్నిచ్చింది. ఈ రుణాన్ని డబ్ల్యూడబ్ల్యూవో బకాయిలతోపాటు ఇతర అనుబంధ కంపెనీల రుణ బకాయిలను తీర్చేందుకు వినియోగించారన్నది సీబీఐ ఆరోపణ. రెండోసారి జారీ చేసిన రుణం కూడా ఎన్పీఏగా మారినట్టు సీబీఐ తెలిపింది. ఈ రెండూ శివశంకర్ కంపెనీలతో భాగస్వామ్యం కలిగి ఉన్నాయని పేర్కొంది. కాగా, కేసు నమోదు తర్వాత నిందితుల నివాసాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఇవి జరిగాయి. -
ఐడీబీఐ బ్యాంకులోనూ మోసం
-
రెండు రోజుల లాభాలు స్వాహా!
ముంబై : వరుస రెండు సెషన్ల నుంచి ఆర్జించిన లాభాలను మార్కెట్లు కోల్పోయాయి. మార్చి నెల డెరివేటివ్ కాంట్రాక్ట్‌ల గడువు ముగియనున్న నేపథ్యంలో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 206 పాయింట్లు పడిపోయి 33వేల మార్కు దిగువన 32,969 వద్ద క్లోజైంది. నిఫ్టీ 63 పాయింట్ల నష్టంలో 10,121 వద్ద స్థిరపడింది. నేటి ట్రేడింగ్‌లో టాటా స్టీల్, వేదంతా, ఐసీఐసీఐ సెక్యురిటీస్, ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఇన్ఫోసిస్ 1 శాతం నుంచి 3 శాతం మధ్యలో నష్టాలు పాలవ్వగా.. విప్రో, టెక్ మహింద్రా 4 శాతం వరకు లాభపడ్డాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ కూడా ఒక శాతం మేర నష్టపోయింది. మరోవైపు ఐడీబీఐ బ్యాంకులో రూ.772 కోట్ల రుణాలు అక్రమంగా జారీ అయినట్టు వెల్లడి కాగానే ఆ బ్యాంకు షేర్లు కూడా 5.4 శాతం మేర క్షీణించాయి. ఐడీబీఐ బ్యాంకు దెబ్బకు అటు ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాలు పాలయ్యాయి. అటు ప్రపంచ మార్కెట్లు సైతం నేడు బలహీనంగానే ఉండటంతో, దేశీయంగానూ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యమిచ్చారు. -
వెలుగులోకి మరో బ్యాంకు కుంభకోణం
ముంబై : మరో ప్రభుత్వ రంగ బ్యాంకు కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ రంగానికి చెందిన ఐడీబీఐ బ్యాంకు లిమిటెడ్‌లో రూ.772 కోట్ల విలువైన మోసపూరిత రుణాలు జారీ అయినట్టు వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ఐదు బ్రాంచుల్లో ఈ కుంభకోణం చోటు చేసుకుందని రాయిటర్స్ రిపోర్టు చేసింది. రిపోర్టు ప్రకారం ఈ మోసపూరిత రుణాలు 2009 నుంచి 2013 వరకు కాలంలో ఫిష్ ఫామింగ్ బిజినెస్‌దారులకు జారీ అయినట్టు తెలిసింది. చేపల చెరువుల నకిలీ అద్దె పత్రాలతో వీరు మోసపూరిత రుణాలు పొందినట్టు బ్యాంకు గుర్తించింది. ఐడీబీఐ ఈ కుంభకోణ వివరాలను బయటికి వెల్లడించగానే, బ్యాంకు షేర్లు 3.5 శాతం కిందకి పడిపోయి రూ.73.6గా నమోదవుతున్నాయి. పబ్లిక్ రంగ బ్యాంకుల నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు ఇండెక్స్ కూడా 1.8 శాతం క్షీణించింది. తమ ఉద్యోగుల్లో ఇద్దరు ఈ రుణాల జారీ ప్రక్రియలో తప్పిదాలు చేసినట్టు ఐడీబీఐ తెలిపింది. వీరిలో ఒక అధికారిపై బ్యాంకు వేటు వేయగా.. మరో అధికారి ఇప్పటికే పదవీ విరమణ అయ్యారు. -
ఐడీబీఐ బ్యాంక్‌లో భారీ కుంభకోణం
-
ఐడీబీఐ బ్యాంక్‌లో భారీ కుంభకోణం
సాక్షి, హైదరాబాద్: చేపల పెంపకం.. వాటి సంబంధిత వ్యాపారం పేరిట వారంతా ఐడీబీఐ బ్యాంకు నుంచి కోట్ల రూపాయల్లో రుణం తీసుకున్నారు. ఆ తర్వాత సదరు రుణం చెల్లించకుండా కొందరు బ్యాంకు అధికారులతో కుమ్మక్కయ్యారు. దీంతో వీరి రుణాలను నిరర్థక ఆస్తుల జాబితాలో చేర్చేశారు. ఈ మొత్తం ఇప్పుడు సుమారు రూ. 445 కోట్లకు చేరింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ ఐడీబీఐ జీఎంతో పాటు 31 మందిపై కేసు నమోదు చేసింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని ఐడీబీఐ బషీర్‌బాగ్, హబ్సిగూడ, విశాఖలోని సిరిపురం బ్రాంచ్‌ల నుంచి 22 మంది చేపల పెంపకం, వాటి సంబంధిత వ్యాపారం పేరిట 2009 నుంచి 2012 వరకు రూ.192.98 కోట్ల రుణాలు తీసుకున్నారు. వీటిని చెల్లించకుండా బ్యాంకు అధికారులతో కుమ్మక్కు కావడంతో వీరి రుణాలను నిరర్థక ఆస్తులుగా ప్రకటించారు. దీని వల్ల 2017 సెప్టెంబర్ వరకు రూ.445.32 కోట్లు అప్పుగా ఉన్నట్టు ఐడీబీఐ నిర్ధారించింది. అయితే బ్యాంకులో రుణం పొందేందుకు చూపించిన ఆస్తి పత్రాలు, చేపల పెంపకం చేస్తున్నట్టు చూపించిన భూములు అన్నీ నకిలీవేనని ఐడీబీఐ సీనియర్ రీజినల్ హెడ్, జనరల్ మేనేజర్ మంజునాథ్ గుర్తించారు. రుణాలు పొందిన వారితో బ్యాంకు అధికారులు కుమ్మక్కై నష్టాలను తెచ్చిపెట్టారని ఆరోపిస్తూ హైదరాబాద్ రేంజ్ సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీనిని పరిశీలించిన సీబీఐ అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టారు. కంపెనీల పేరిట రుణాలు తీసుకున్న వారు వాటిని సొంత ఖాతాల్లోకి మళ్లించి.. ఇతర ఖాతాలకు తరలించినట్టు సీబీఐ గుర్తించింది. ఏపీలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వారు రుణాలు పొంది తిరిగి చెల్లించకుండా మోసం చేసినట్టు సీబీఐ గుర్తించింది. సీబీఐ కేసు వీరిపైనే.. ఐడీబీఐ జనరల్ మేనేజర్ బట్టు రామారావు(ప్రస్తుతం ఉద్యోగం నుంచి తొలగించారు), ఆర్.దామోదర్(సీజీఎం రిటైర్డ్), ఆదిలక్ష్మీ గ్రూపునకు చెందిన ముప్పిడి లక్ష్మణ్‌రావు, ఎస్ సుధాకర్ గ్రూపునకు చెందిన సుధాకర్, ఎన్వీ సుబ్బరాజు గ్రూపునకు చెందిన వెంకటసుబ్బరాజు, చంద్రకాంత్ గ్రూపునకు చెందిన తోరం చిన్న వెంకటేశ్వర్రావు, ఎన్ రామరాజు గ్రూపునకు చెందిన నడింపల్లి రామరాజు, కేఎస్వీ ప్రసాద్‌రాజు గ్రూపునకు చెందిన కేఎస్వీ ప్రసాద్‌రాజు, సునీల్ చౌదరి గ్రూపునకు చెందిన ఆంజనేయరాజు, పాతూరి సునీల్ చౌదరి, ఎయిర్టెల్ సోమరాజు గ్రూపునకు చెందిన పీవీ కృష్ణంరాజు, బెల్లాల గ్రూపునకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి, చైతన్యరాజు గ్రూపునకు చెందిన కేవీవీ సత్యనారాయణరాజు, వికేస్కుమార్ అగర్వాల్ గ్రూపునకు చెందిన వికేష్‌కుమార్ అగర్వాల్, సురేంద్రవర్మ గ్రూపునకు చెందిన సురేంద్రవర్మ, హరిప్రియా గ్రూపునకు చెందిన తోరం వెంకటేశ్వర్రావు, మింటే గ్రూపునకు చెందిన రమావత్ బాలు, గుట్టకోటయ్య గ్రూపునకు చెందిన కోటయ్య, ఓక్ట్రీ గ్రూప్‌నకు చెందిన కడాలి వెంకటరమణ, సూరం రవీందర్ గ్రూపునకు చెందిన రవీందర్, రంగరాజు గ్రూపునకు చెందిన కలిదిండి రామరాజు, సాయివర్మ గ్రూపునకు చెందిన అల్లూరి సాయిబాబా, సూరం వెంకటేశ్వర్‌రెడ్డి, సాయిబాబా గ్రూపునకు చెందిన ఏవీవీఎస్ సాయిబాబాతో పాటు ఏడుగురు బ్యాంకు ప్యానల్ వాల్యూయర్స్పై కేసు నమోదు చేసినట్టు సీబీఐ పేర్కొంది. పీసీయాక్ట్ 1988 సెక్షన్ 13(2), రెడ్‌విత్ 13(1), (సీ)(డీ), భారత శిక్షా స్మృతి (ఐపీసీ) 120–బి, రెడ్‌విత్ 420, 409, 468, 471 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని సీబీఐ ఎస్పీ వివేక్దత్ వెల్లడించారు. -
ఐడీబీఐ బ్యాంక్ నష్టాలు 1,524 కోట్లు
ముంబై: ఐడీబీఐ బ్యాంక్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.1,524 కోట్ల నష్టాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.2,255 కోట్ల నికర నష్టాలు వచ్చాయని, మొండి బకాయిలకు కేటాయింపులు పెరిగినా, ఈ క్యూ3లో నష్టాలు తగ్గాయని ఐడీబీఐ బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.7,104 కోట్ల నుంచి రూ.6,645 కోట్లకు తగ్గిందని పేర్కొంది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.3,135కోట్ల నుంచి రూ.3,649 కోట్లకు పెరిగాయని, దీంతో మొత్తం కేటాయింపులు రూ.3,205 కోట్ల నుంచి రూ.4,179 కోట్లకు చేరాయని వివరించింది. పెరిగిన మొండి బకాయిలు: గత క్యూ3లో రూ.35,245 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో రూ.50,621 కోట్లకు పెరిగాయని, అలాగే నికర మొండి బకాయిలు రూ.20,949 కోట్ల నుంచి రూ.29,352 కోట్లకు ఎగిశాయని వివరించింది. శాతం పరంగా చూస్తే స్థూల మొండి బకాయిలు 15.16 శాతం నుంచి 24.72 శాతానికి, నికర మొండి బకాయిలు 9.61 శాతం నుంచి 16.02 శాతానికి పెరిగాయని పేర్కొంది. మొండి బకాయిల రద్దు రూ.778 కోట్ల నుంచి ఐదు రెట్లు పెరిగి రూ.4,214 కోట్లకు చేరిందని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐడీబీఐ బ్యాంక్ షేర్ 1% నష్టంతో రూ.60 వద్ద ముగిసింది. -
బ్యాంకులకు బూస్ట్
ఈ ఆర్థిక సంవత్సరం రూ. 88 వేల కోట్ల అదనపు మూలధనం న్యూఢిల్లీ: మొండిబాకీలతో సతమతమవుతున్న 20 ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) ఊతమిచ్చే దిశగా కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 88,139 కోట్ల అదనపు మూలధనాన్ని అందించనుంది. ఇందులో అత్యధికంగా ఐడీబీఐ బ్యాంక్‌కి రూ. 10,610 కోట్లు, ఎస్బీఐకి రూ. 8,800 కోట్లు దక్కనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం ఈ విషయాలు తెలిపారు. పీఎస్‌బీలకి అందించే అదనపు మూలధనంపై విస్తృతంగా కసరత్తు చేసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. మొండిబాకీల సమస్యకు చెక్ చెప్పే దిశగా బ్యాంకింగ్ రంగంలో మరిన్ని సంస్కరణలు చేపడుతున్నట్లు తెలిపారు. భారీ రుణాల మంజూరుకు నిబంధనలు కఠినతరం చేస్తున్నట్లు, రూ. 250 కోట్ల పైబడిన రుణాలను బ్యాంకులు తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ బ్యాంకులకు ఏకంగా రూ.2.11 లక్షల కోట్లు అందించేలా కేంద్రం గతేడాది అక్టోబర్‌లో ప్రణాళిక ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో రూ.1.35 లక్షల కోట్లు బాండ్ల జారీ ద్వారా, మిగతా రూ. 76,000 కోట్లు బడ్జెట్ కేటాయింపులు, మార్కెట్ నుంచి నిధుల సమీకరణ రూపంలో ఉండనుంది. బ్యాంకులు అత్యున్నత ప్రమాణాలు పాటించేలా గవర్నెన్స్‌ని మెరుగుపర్చేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జైట్లీ తెలిపారు. వారసత్వంగా వచ్చిన తీవ్రమైన సమస్యను పరిష్కరించడమొక్కటే కాకుండా.. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా సంస్థాగతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ‘ప్రభుత్వ రంగ బ్యాంకులు అన్ని విధాలా మెరుగ్గా ఉండేలా చూడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత. తాజా చర్యల లక్ష్యం కూడా అదే‘ అని జైట్లీ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సుమారు రూ. 9.5 లక్షల కోట్ల మేర మొండిబాకీలు పేరుకుపోయిన నేపథ్యంలో అదనపు మూలధనం వాటికి కొంత ఊరటనివ్వనుంది. ద్రవ్య లోటుపై ప్రభావం ఉండదు.. ఆయా బ్యాంకుల పనితీరు, అవి అమలు చేసే సంస్కరణలను బట్టి రీక్యాపిటలైజేషన్ ఉంటుందని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. బ్యాంకులు వ్యాపార వ్యూహాలకు పదును పెట్టాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ప్రధానేతర విభాగాల నుంచి తప్పుకుని.. ప్రధాన వ్యాపారంపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు. బాండ్లతో పాటు.. బ్యాంకులు షేర్ల విక్రయం ద్వారా మార్కెట్ నుంచి సమీకరించే నిధులను కూడా కలిపితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం రీక్యాపిటలైజేషన్ పరిమాణం రూ. 1 లక్ష కోట్లు దాటుతుందని రాజీవ్ కుమార్ చెప్పారు. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులకు అదనంగా రూ. 5 లక్షల కోట్ల మేర రుణాలు ఇవ్వగలిగే సామర్ధ్యం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటిదాకా రూ. 10,312 కోట్లు మార్కెట్ల నుంచి సమీకరించిన బ్యాంకులు.. మిగతా వ్యవధిలో మరిన్ని నిధులు సమీకరించే అవకాశాలు ఉన్నాయి. రూ.250 కోట్లు దాటే రుణాలపై పర్యవేక్షణ .. ప్రభుత్వం నుంచి అదనపు మూలధనాన్ని అందుకునే బ్యాంకులు పలు సంస్కరణలు అమలు చేయాల్సి ఉంటుందని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఖాతాదారులతో వ్యవహరించే తీరు, బాధ్యతాయుతమైన బ్యాంకింగ్, రుణ మంజూరీ తీరుతెన్నులు, చిన్న.. మధ్యతరహా సంస్థలకు రుణాలు ఇవ్వడం, డిజిటలైజేషన్, అందరికీ ఆర్థిక సేవలు అందించే దిశగా చేస్తున్న ప్రయత్నాలు మొదలైన వాటన్నింటినీ బ్యాంకుల పనితీరు మదింపులో పరిశీలించడం జరుగుతుందని వివరించారు. అలాగే, బ్యాంకులు రుణాల మంజూరీ, రికవరీపై మరింత నిశితంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. రూ. 250 కోట్ల పైబడిన రుణాలను ప్రత్యేకంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. నిరర్ధక ఆస్తులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలి. అందరికీ ఆర్థిక సేవలు అందించే క్రమంలో దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్‌కి ఇంటి వద్దనే బ్యాంకింగ్ సర్వీసులు అందించేలా చర్యలు తీసుకోవాలి. బ్యాంకుల బోర్డులో ఒక స్వతంత్ర డైరెక్టరు ప్రతి మూడు నెలలకోసారి సంస్కరణల పురోగతిని సమీక్షించాల్సి ఉంటుంది. బ్యాంకుల ర్యాంకింగ్ కోసం సేవల లభ్యత, నాణ్యతకు సంబంధించి ఈఏఎస్‌ఈ సూచీ ఏర్పాటు చేస్తున్నట్లు కుమార్ తెలిపారు. దీని ఆధారంగా స్వతంత్ర ఏజెన్సీలు వాటి పనితీరును మదింపు చేసి, సంస్కరణల అమలు ప్రాతిపదికన వార్షికంగా రేటింగ్ ఇస్తాయి కనుక.. ఇది ప్రభుత్వ రంగ బ్యాంకుల జవాబుదారీతనాన్ని మరింతగా పెంచుతుందని ఆయన పేర్కొన్నారు. బ్యాంకులు తీసుకునే వ్యాపారపరమైన నిర్ణయాల్లో ప్రభుత్వం జోక్యం ఉండదని, అవి స్వతంత్రంగానే వ్యవహరిస్తాయని చెప్పారు. అయితే.. అవి కచ్చితంగా సంస్కరణలు అమలు చేయాలని, రుణాలివ్వడంలో వివేకవంతంగా, పారదర్శకంగా వ్యవహరించాల్సి ఉంటుందని కుమార్ తెలిపారు. రీక్యాపిటలైజేషన్ బాండ్ల జారీ ఇలా.. రీక్యాపిటలైజేషన్ ప్రణాళికలో భాగంగా బ్యాంకులకు బాండ్ల జారీ ద్వారా రూ. 80,000 కోట్లు సమకూర్చనున్నట్లు రాజీవ్ కుమార్ వివరించారు. మరో రూ. 8,139 కోట్లు బడ్జెట్ కేటాయింపుల ద్వారా ఉంటుందని పేర్కొన్నారు. బాండ్ల వ్యవధి 10–15 సంవత్సరాలు ఉంటుందని, ఇవి స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్ఎల్ఆర్) పరిధిలోకి రావని తెలిపారు. ఈ బాండ్లపై వడ్డీ రేటు సుమారు 8 శాతంగా ఉంటుందని అంచనా. రీక్యాపిటలైజేషన్ ప్రణాళిక కింద బాండ్ల జారీ ద్వారా బ్యాంకుల నుంచి వచ్చిన మొత్తాన్ని ప్రభుత్వం మళ్లీ వాటికే బదలాయించి.. ప్రతిగా కొంత వాటా తీసుకోవడం జరుగుతుంది. అదనపు మూలధన ప్రణాళిక కింద కేంద్రం జారీ చేసే రీక్యాపిటలైజేషన్ బాండ్లను ముందుగా బ్యాంకులు కొనుగోలు చేస్తాయి. వాటికి సంబంధించిన నిధులను ప్రభుత్వానికి బదలాయిస్తాయి. కేంద్రం ఈ నిధులనే మళ్లీ పెట్టుబడి కింద ఆయా బ్యాంకులకు అందించి ప్రతిగా ఈక్విటీ తీసుకుంటుంది. ఇదంతా ఖాతాల్లో మార్పులు, చేర్పులతోనే జరుగుతుంది. నికరంగా ప్రభుత్వం తన ఖజానా నుంచి బ్యాంకులకు నిధులు ఇవ్వడం ఉండదు. కాబట్టి బ్యాంకులకు అదనపు మూలధనం అందించడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రుణ సమీకరణ ఏమీ జరపదు కాబట్టి.. ద్రవ్య లోటుపై కూడా ప్రభావం ఉండదు. ఇక, బ్యాంకులపరంగా చూస్తే.. సాధారణంగా అవి తమకి వచ్చే డిపాజిట్లలో కొంత భాగాన్ని ఎస్ఎల్ఆర్ కింద కచ్చితంగా ప్రభుత్వ సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే, తాజాగా వచ్చే బాండ్ల స్వరూపం పెట్టుబడి రూపంలో ఉండనుంది కనుక .. వీటి కొనుగోలు ఎస్ఎల్ఆర్ కిందికి రాదు. -
కస్టమర్లకు బ్యాంకులు వార్నింగ్
ముంబై : బ్యాంకులు తమ కస్టమర్లకు హెచ్చరికలు జారీచేస్తున్నాయి. తమ మొబైల్ బ్యాంకింగ్ ఆధారాలు కొత్త మాల్వేర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందంటూ... జాగ్రత్తగా ఉండాలంటూ ఈ హెచ్చరికలు పంపుతున్నాయి. ఫ్లాష్ ప్లేయర్ ద్వారా బ్యాంకింగ్ యాప్స్‌పై మాల్వేర్ అటాక్ చేస్తుందని పేర్కొంటున్నాయి. పలు భారతీయ బ్యాంకింగ్ యాప్స్‌తో సహా 232 బ్యాంకింగ్ యాప్స్‌ను 'ఆండ్రాయిడ్.బ్యాంకర్.ఏ9480' అనే ట్రోజన్ మాల్వేర్ టార్గెట్ చేసిందని హీల్ సెక్యురిటీ ల్యాబ్స్ ఇటీవల రిపోర్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ రిపోర్టుల అనంతరం బ్యాంకులు వార్నింగ్‌లు జారీచేస్తున్నాయి. ప్రస్తుతం ఈ మాల్వేర్ను 'ఆండ్రాయిడ్.బ్యాంకర్.ఏ2ఎఫ్8ఏ' గా బ్యాంకులు పేర్కొంటున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ మాల్వేర్ పనిచేస్తుందని, ఫేక్ నోటిఫికేషన్లను పంపుతుందని, బ్యాంకింగ్ అప్లికేషన్లను ఇవి పోలి ఉంటాయని చెప్పాయి. ఒకవేళ వాటిని యూజర్లు ఓపెన్ చేస్తే, ఫేక్ లాగిన్ స్క్రీన్లలోకి మరలి, అటాకర్లు దాడి చేయడానికి, రహస్య సమాచారాన్ని దొంగలించడానికి సహకరిస్తాయని పేర్కొన్నాయి. బ్యాంకులు పంపిన మాదిరి ఎస్ఎంఎస్లు పంపడం, వన్-టైమ్ పాస్వర్డ్లు అడగడం వంటివి చేస్తున్నాయని తెలిపాయి. ఐడీబీఐ బ్యాంకు ఇప్పటికే తన కస్టమర్లందర్ని జాగ్రత్తగా ఉండాలంటూ సూచించింది. మొబైల్ బ్యాంకింగ్ వాడేటప్పుడు మంచి విధానాలను పాటించాలని పేర్కొంది. నమ్మకం లేని వర్గాల నుంచి ఏమైనా అప్లికేషన్ల వస్తే వాటిని ఇన్స్టాల్ చేయొద్దని కూడా సూచిస్తోంది. బ్యాంకింగ్ లావాదేవీల కోసం జైల్బ్రోకెన్, రూటెడ్ మొబైల్స్ వాడే వారిని కూడా ఈ బ్యాంకు హెచ్చరిస్తోంది. జైల్బ్రోకెన్ ఐఫోన్లు అధికారిక యాప్‌స్టోర్ ద్వారా కాకుండా.. ఈ యాప్స్ ఇన్స్టాల్ అవడానికి అనుమతి ఇస్తున్నాయని తెలిపింది. మరో ప్రైవేట్ బ్యాంకు కరూర్ వైశ్యా బ్యాంకు కూడా ఇదే మాదిరి సూచనను కస్టమర్లకు జారీచేస్తోంది. మాల్వేర్ టార్గెట్ చేసిన దేశీయ బ్యాంకింగ్ యాప్స్ జాబితాలో యాక్సిస్ మొబైల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు మొబైల్ బ్యాంకింగ్, ఎస్బీఐ ఎనీవేర్ పర్సనల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు మొబైల్‌బ్యాంకింగ్ లైఫ్, ఐసీఐసీఐ బ్యాంకు ఐమొబైల్, ఐడీబీఐ బ్యాంకు గో మొబైల్+, ఐడీబీఐ బ్యాంకు లిమిటెడ్‌కు చెందిన అభయ్, ఐడీబీఐ బ్యాంకు గో మొబైల్, ఐడీబీఐ బ్యాంకు ఎంపాస్‌బుక్, బరోడా ఎంపాస్‌బుక్, యూనియన్ బ్యాంకు మొబైల్ బ్యాంకింగ్, యూనియన్ బ్యాంకు కమర్షియల్ క్లయింట్స్ ఉన్నట్టు తెలిసింది. ఈ బ్యాంకింగ్ యాప్స్ వాడుతున్న కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచించారు. -
డిసెంబర్ 27న బ్యాంకింగ్ సమ్మె!
చెన్నై: ఐడీబీఐ బ్యాంక్‌లో వేతన సవరణ చేయాలన్న డిమాండ్‌కు మద్దతుగా డిసెంబర్ 27న భారత్ బ్యాంకింగ్ సమ్మె బాట పడుతోంది. బ్యాంకింగ్‌లో రెండు ప్రధాన యూనియన్లు– ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ) శుక్రవారం ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ‘‘ఐడీబీఐలో వేతన సవరణ అంశాన్ని ఆ బ్యాంక్ మేనేజ్మెంట్, అలాగే కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వం దృష్టికి పదేపదే తీసుకువెళుతున్నాం. అయితే తుది నిర్ణయం లేకుండా సమస్య పరిష్కారం కాలాతీతం అవుతోంది’’ అని సంయుక్త ప్రకటన తెలిపింది. డిసెంబర్ 27 సమ్మెకు మద్దతుఇవ్వాలని బ్యాంకింగ్ రంగంలో తొమ్మిది యూనియన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) కూడా నిర్ణయించినట్లు వివరించింది. ఐడీబీఐ బ్యాంక్ ఉద్యోగులకు వేతన సవరణ అంశం 2012 నవంబర్ నుంచీ పెండింగులో ఉంది. ఈ సమస్యపై అక్టోబర్‌లో ఆ బ్యాంక్ ఉద్యోగులు సమ్మె కూడా నిర్వహించారు. -
నాలుగో వంతు మొండి బాకీలే!!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంక్‌కు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.198 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత క్యూ2లో రూ.56 కోట్ల నికర లాభం ఆర్జించినట్లు ఐడీబీఐ బ్యాంక్ తెలియజేసింది. మొండి బకాయిలు, కేటాయింపులు కూడా దాదాపు రెట్టింపు కావడం వల్ల ఈ క్యూ2లో ఈ స్థాయిలో నికర నష్టాలు వచ్చాయని బ్యాంక్ డిప్యూటీ ఎండీ, జి.ఎమ్. యద్వాద్కర్ చెప్పారు. అయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన చూస్తే బ్యాంక్ నికర నష్టాలు తగ్గాయని బ్యాంక్ డిప్యూటీ ఎండీ, జి.ఎమ్. యద్వాద్కర్ చెప్పారు. ఈ క్యూ1లో రూ.853 కోట్ల మేర నికర నష్టాలు వచ్చాయని వివరించారు. గత క్యూ2లో రూ.8,387 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.8,298 కోట్లకు తగ్గిందని పేర్కొన్నారు. 25 శాతానికి మొండి బకాయిలు... స్థూల మొండి బకాయిలు 13.05 శాతం నుంచి 24.98 శాతానికి, నికర మొండి బకాయిలు 8.32 శాతం నుంచి 16.06 శాతానికి పెరిగాయి. ఫలితంగా కేటాయింపులు రూ.920 కోట్ల నుంచి రూ.1,276 కోట్లకు, మొత్తం కేటాయింపులు రూ.1,349 కోట్ల నుంచి దాదాపు రెట్టింపై రూ.3,257 కోట్లకు పెరిగాయని వివరించింది. ఫలితాల నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్ షేర్ 4% తగ్గి రూ.63కు పడిపోయింది. -
ఐడీబీఐకి బ్యాడ్లోన్ల బెడద: భారీ నికర నష్టం
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ సంస్థ ఐడీబీఐ బ్యాంక్ క్యూ2 ఫలితాల్లో నిరాశపర్చింది. బ్యాండ్ లోన్ల బెడదతో వరుసగ నాల్గవ క్వార్ట్‌లో కూడా నీరస పడింది. మంగళవారం ప్రకటించిన 2017-18 ఏడాది రెండో క్వార్టర్(జూలై-సెప్టెంబర్) ఫలితాల్లో రూ.198 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. గతేడాది(2016-17) క్యూ2లో రూ. 55.5 కోట్ల నికర లాభం ఆర్జించింది. తాజా సమీక్షలో ప్రధానంగా ప్రొవిజన్లు 141 శాతంపైగా ఎగసి రూ. 3256 కోట్లను తాకడం ప్రభావం చూపింది. అసెట్ క్వాలిటీకూడా మరింత దిగజారింది.స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్.పి.ఎ.) 24.98 శాతానికి పెరిగాయి. గత త్రైమాసికంలో 24.11 శాతంగా నిలిచింది. ఈ త్రైమాసికానికి అడ్వాన్సులు 16.05 శాతం తగ్గి ఒక సంవత్సరం క్రితం నుంచి రూ .1.84 లక్షల కోట్లకు చేరుకున్నాయి. డిపాజిట్లు 19.24 శాతం క్షీణించి రూ .2.42 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఫలితాలు నిరాశ పరచడంతో ఐడీబీఐ బ్యాంక్ కౌంటర్లో వెల్లువెత్తిన అమ్మకాలతో 5 శాతం క్షీణించి రూ. 62 వద్ద ముగిసింది. -
దివాలా ముంగిట ల్యాంకో!
దివాలా ప్రక్రియ ప్రారంభించాలంటూ ఐడీబీఐకి ఆర్బీఐ ఆదేశాలు బ్యాంకర్ల సమావేశం రేపు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారీ రుణాలు తీసుకుని, తీర్చలేక డిఫాల్ట్ అయిన మౌలిక రంగ సంస్థ ల్యాంకో ఇన్ఫ్రాటెక్ దివాలా ముంగిట నిలిచింది. భారీగా రుణాలు తీసుకుని తీర్చలేక ఎగవేతదారుల జాబితాలో చేరినవారిపై దివాలా ప్రక్రియ ఆరంభించాలంటూ ఇటీవలే బ్యాంకుల్ని ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీన్లో భాగంగానే ల్యాంకోకు రుణాలిచ్చిన ఐడీబీఐ బ్యాంకుకు... ఆర్బీఐ శనివారం ఆదేశాలు జారీ చేసింది. దివాలా, బ్యాంక్రప్సీ కోడ్ (ఐబీసీ) కింద ల్యాంకోపై చర్యలు ఆరంభించాలంటూ లీడ్ బ్యాంకరు ఐడీబీఐ బ్యాంక్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. ఈ విషయాన్ని ల్యాంకో ఇన్ఫ్రా ధ్రువీకరించిది కూడా. ల్యాంకో ఇన్ఫ్రాటెక్ ఫండ్ ఆధారిత బకాయీలకు సంబంధించి రూ.8,146 కోట్లు, నాన్ ఫండ్ బకాయీలు రూ. 3,221 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ రూ.11,367 కోట్ల రుణాలకు సంబంధించి కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ (సీఐఆర్‌పీ) ప్రారంభించాలని రిజర్వ్ బ్యాంక్ సూచించినట్లు పేర్కొంది. దీనిపై ఈ నెల 19న ఎల్ఐటీఎల్కి రుణాలిచ్చిన బ్యాంకర్లతో ఐడీబీఐ బ్యాంకు సమావేశం కానుంది. మొత్తం మొండి బకాయీల్లో సుమారు నాలుగో వంతు రుణాలు (రూ.2 లక్షల కోట్లు) తీసుకుని ఎగవేసిన 12 కంపెనీల్లో ల్యాంకో ఇన్ఫ్రా కూడా ఒకటి. ఆర్బీఐలోని అంతర్గత అడ్వైజరీ కమిటీ (ఐఏసీ) ఈ పన్నెండింటి జాబితాను బ్యాంకర్లకు పంపింది. వీటిలో ఆరు ఖాతాలు ఎస్బీఐలో ఉన్నాయి. మిగతావి పీఎన్బీ, ఐసీఐసీఐ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌ల్లో ఉన్నాయి. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో రూ. 8 లక్షల కోట్ల పైగా మొండిబకాయిలు పేరుకుపోయాయి. వీటిలో సుమారు రూ. 6 లక్షల కోట్ల బకాయిలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ఉన్నాయి. -
12 బ్యాంకులే మంచి కస్టమర్ సేవలు, మిగతావీ?
ముంబై : దేశంలో ఉన్న మొత్తం 54 బ్యాంకుల్లో కేవలం 12 బ్యాంకులే మంచి కస్టమర్ సర్వీసులు అందజేస్తున్నాయట. బ్యాంకింగ్ కోడ్స్, స్టాండర్డ్స్ బోర్డు ఆఫ్ ఇండియా(బీసీఎస్‌బీఐ) కోడ్స్ రేటింగ్ లో ఈ విషయం వెల్లడైంది. మంచి బ్యాంకింగ్ పద్ధతులను, కనీస ప్రమాణాలను సాధించుట, పారదర్శకతను పెంచడానికీ, అధిక ఆపరేటింగ్ లాభాలను పొందడానికి, బ్యాకింగ్-కస్టమర్ సేవలను ప్రోత్సహించడానికి బీసీఎస్బీఐను ఆర్బీఐ ఏర్పాటుచేసింది. ఇది ఒక స్వతంత్ర సంస్థ. ఈ కోడ్స్ రేటింగ్ లో 'అధిక' రేటింగ్ పొందిన బ్యాంకుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకు కేవలం ఒకటే ఉంది. అది ఐడీబీఐ బ్యాంకు. మిగతా బ్యాంకులన్నీ ప్రైవేట్ రంగ, విదేశీ బ్యాంకులే. అధిక రేటింగ్ పొందిన బ్యాంకుల్లో ఆర్బీఎల్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, డీసీబీ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, కొటక్ మహింద్రా బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యస్ బ్యాంకు, స్టాండర్డ్ చార్టడ్ బ్యాంకు, హెచ్ఎస్బీసీ, సిటీ బ్యాంకులు ఉన్నాయి. ఆర్బీఎల్ బ్యాంకు అత్యధికంగా 95 శాతం స్కోరును సాధించింది. మిగతా బ్యాంకులు సగటు కంటే ఎక్కువ, సగటు మధ్యలో స్కోర్లను పొందాయి. మొత్తంగా బ్యాంకుల సగటు స్కోర్ 2015 కంటే 2017లో స్వల్పంగా పడిపోయి 77గా ఉంది. మొత్తంగా సగటు స్కోర్ పడిపోవడమే కాకుండా, కొన్ని బ్యాంకులు డౌన్ గ్రేడ్ పొందాయని బీసీఎస్‌బీఐ చైర్మన్ ఏసీ మహంజన్ తెలిపారు. కస్టమర్లను కాపాడుకోవడానికి బ్యాంకింగ్ రంగంలో తీవ్ర పోటీ నెలకొందన్నారు. ఈ రేటింగ్ లో అన్ని ప్రైవేట్, పబ్లిక్, విదేశీ, షెడ్యూల్డ్ అర్బన్ కోపరేటివ్ బ్యాంకులను తీసుకుంటారు. సమాచారాన్ని అందించుట, పారదర్శకత, సమస్యల పరిష్కారం, కస్టమర్ సెంట్రిసిటీ, కస్టమర్ ఫీడ్ బ్యాక్ కు అనుగుణంగా ఈ రేటింగ్ ను ఇస్తారు. -
5,000 కోట్ల ఎన్పీఏల విక్రయం
2017–18 ఆర్థిక సంవత్సరంలో ఐడీబీఐ బ్యాంక్ లక్ష్యమిది ♦ 150 మందితో నిరర్ధక ఆస్తుల నిర్వహణ బృందం ♦ ఎన్‌పీఏల్లో తెలుగు రాష్ట్రాలే టాప్; వ్యవసాయ, కార్పొరేట్ రుణాలే అధికం ♦ ఏపీ, తెలంగాణల్లో ఎన్పీఏల రికవరీ కోసం 20 మంది నియామకం ♦ కొన్నాళ్లు కార్పొరేట్ రుణాలకు బ్రేక్; రిటైల్, ఎస్ఎంఈలపై ఫోకస్ ♦ వచ్చే త్రైమాసికంలో ఈక్విటీ, బాండ్ల అమ్మకంతో రూ.8–9 వేల కోట్ల సమీకరణ ♦ ఐడీబీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోతుకూచి సీతారాం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారీగా ఎన్‌పీఏల్లో కూరుకుపోయిన ఐడీబీఐ బ్యాంక్... నికర నిరర్ధక ఆస్తుల(ఎన్పీఏ)S రికవరీపై దృష్టి సారించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 కోట్ల ఎన్పీఏలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ప్రత్యేకంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో 150 మంది ఉద్యోగులతో కలిసి నిరర్ధక ఆస్తుల నిర్వహణ, పర్యవేక్షణ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. కార్పొరేట్, రిటైల్ విభాగాల్లో ప్రతి ఎన్‌పీఏను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం వీరి బాధ్యత అని ఐడీబీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోతుకూచి సీతారాం చెప్పారు. 2017 మార్చి నాటికి ఐడీబీఐ బ్యాంక్ స్థూల ఎన్పీఏలు రూ.44 వేల కోట్లు కాగా.. ఇందులో నికర ఎన్పీఏల విలువ రూ.28 వేల కోట్లు. ఐడీబీఐ బ్యాంక్ తెలంగాణ, ఏపీ సీజీఎం దాస్‌గుప్తాతో కలిసి గురువారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘‘78% ఎన్పీఏలు పెద్ద కార్పొరేట్ సంస్థలవే. ఈ రుణాల్లో అధికం ఇతర బ్యాంకుల కన్సార్షియం ద్వారా అందించాం. వాటి రికవరీ అంత సులభం కాదు. సాధారణ రికవరీ ప్రక్రియ ద్వారా దీన్ని పరిష్కరించలేం. ఈ వర్గం ఎన్పీఏ తగ్గింపు ప్రాథమికంగా ఖాతాల అప్‌గ్రేడ్ ద్వారానే అవుతుంది. ఇందుకు మరో ఏడాది సమయం పడుతుంది’’ అని ఆయన వివరించారు. త్వరలోనే ఫిన్‌టెక్ స్టార్టప్స్‌తో ఒప్పందం.. ‘‘ఇతర రంగాల మల్లే బ్యాంకింగ్ వ్యవస్థలోనూ ఉద్యోగుల ఎంపిక విధానం మారింది. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంకులో 16 వేల మంది ఉద్యోగులున్నారు. ఇందులో అధికులు 33–35 మధ్య వయస్సు వాళ్లే. ఈ మధ్య కాలంలో పదవీ విరమణలుండవు కాబట్టి కొత్త ఉద్యోగుల ఎంపిక కూడా లేనట్టే. కానీ, డిజిటల్ లావాదేవీలు, డిజిటల్ అనలిటిక్ట్స్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో నిపుణులైన ఉద్యోగుల అవసరముంది’’ అని సీతారాం తెలిపారు. డిజిటల్లో భాగంగా ఆర్థికS సేవల స్టార్టప్స్, ఎస్ఎంఈలతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నామని, ఒకటిరెండు సంస్థలతో ఒప్పందాలు చేసుకునే దిశగా చర్చలూ జరుగుతున్నాయని చెప్పారాయన. కార్పొరేట్ రుణాలకు బ్రేక్.. అధిక కార్పొరేట్ రుణాల్లో రిస్క్, ఒత్తిడి ఎక్కువగా ఉందని, అందుకే కొద్దికాలం ఈ విభాగంలో రుణాల మంజూరులో లిమిట్ పెట్టి, రిటైల్, ఎస్ఎంఈ విభాగాలపై దృష్టిపెట్టామని సీతారామ్ వివరించారు. ‘‘ఈ ఆర్థిక సంవత్సరం (2017–18)లో రూ.13,500 కోట్ల రిటైల్, రూ.6,500 కార్పొరేట్ రుణాలందించాం. మొత్తం రుణాల్లో రిటైల్ వాటా 43 శాతంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో దీన్ని 3–4 శాతం మేర పెంచాలనేది లక్ష్యం. ఏప్రిల్‌లో కేంద్రం నుంచి రూ.1,900 కోట్ల నిధులను సమీకరించాం. మరో 3 నెలల్లో ఈక్విటీ, బాండ్ల విక్రయం ద్వారా సుమారు రూ.8–9 వేల కోట్లు సమీకరిస్తాం. త్వరలో అమల్లోకిరానున్న జీఎస్టీలో ఉత్తరాదికి చెందిన కొన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులు మినహా మిగిలినవన్నీ నమోదు చేశాం. సాఫ్ట్వేర్ పునరుద్ధరణ కోసం పలువురు వెండర్లతో ఒప్పందం చేసుకున్నాం. జూలై 1 నాటికి జీఎస్టీకి సిద్ధంగా ఉంటాం. అయితే పన్ను విధానం, చెల్లింపుల్లో కాసింత గందరగోళంగా ఉంది’’ అని చెప్పారు. ఏపీ, తెలంగాణల్లోనే ఎన్పీఏలెక్కువ.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఎన్పీఏల వాటా కాసింత ఎక్కువవని ఇందులోనూ వ్యవసాయ, కార్పొరేట్ విభాగంలోనే ఎన్పీఏలు ఎక్కువగా ఉన్నాయని ఐడీబీఐ బ్యాంక్ తెలంగాణ, ఏపీ సీజీఎం బీ దాస్‌గుప్తా ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్పీఏల రికవరీ కోసం ప్రత్యేకంగా 20 మందిని నియమించుకున్నామని.. రోజూ కరెంట్, సేవింగ్ అకౌంట్స్ (సీఏఎస్ఏ) నివేదికలను సమర్పించడం వీరి బాధ్యతని ఆయన తెలిపారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో కాసింత ఎక్కువగా కనిపించిందని చెప్పారు. ‘‘ఆ సమయంలో పొరుగు రాష్ట్రాల నుంచి నగదును తెప్పించి పరిస్థితిని సర్దుమణిపించాం. వచ్చే 2 నెలల్లో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఐడీబీఐ ఏటీఎంలను తిరిగి ప్రారంభిస్తాం’’ అన్నారు. -
ఐడీబీఐ బ్యాంక్‌కు భారీ నష్టం
రెట్టింపైన మొండిబకాయిలు... ముంబై: మొండి బకాయిలకు భారీ కేటాయింపులు చేయాల్సిరావడంతో ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంక్ 2017 మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో భారీనష్టాన్ని చవిచూసింది. గతేడాది ఇదేకాలంలో బ్యాంకు రూ. 1,735 కోట్ల నికరనష్టాన్ని ప్రకటించగా, తాజా త్రైమాసికంలో ఈ నష్టం రూ. 3,199 కోట్లకు పెరిగిపోయింది.బ్యాంకు మొత్తం ఆదాయం 2.74 శాతం క్షీణతతో రూ. 8,274 కోట్ల నుంచి రూ. 8,048 కోట్లకు తగ్గింది. స్థూల, నికర మొండిబకాయిలు రెట్టింపయ్యాయి. స్థూల ఎన్పీఏలు 10.98 శాతం నుంచి 21.25 శాతానికి పెరగ్గా, నికర ఎన్పీఏలు 6.78 శాతం నుంచి 13.21 శాతానికి చేరాయి. మొండి బకాయిలకు కేటాయింపుల్ని బ్యాంకు రూ. 3,331 కోట్ల నుంచి రూ. 4,590 కోట్లకు పెంచింది. పూర్తి సంవత్సరంలో బ్యాంకు నికరనష్టం రూ. 3,668 కోట్ల నుంచి రూ. 5,158 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 31,453 కోట్ల నుంచి రూ. 31,758 కోట్లకు చేరింది. ఫలితాల కారణంగా ఈ షేరు గురువారం 8 శాతం పతనమై రూ. 69 వద్ద ముగిసింది. -
ఐడీబీఐకి బ్యాడ్ లోన్ల బెడద
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఐడీబీఐ బ్యాంక్ గత ఏడాది క్యూ4 ఫలితాల్లో ఢమాల్ అంది. గురువారం విడుదల చేసిన జనవరి-మార్చి క్వార్టర్ ఫలితాల్లో భారీగా నష్టపోయింది. ముఖ్యంగా తమ లోన్లలో అయిదుశాతం బాడ్ లోన్లుగా మారినట్టు కంపెనీ ప్రకటించింది. దీంతో క్యూ4లో బ్యాంకు నికర నష్టం 84శాతం ఎగిసి రూ. 3,200 కోట్లగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.1,736 కోట్లగా నమోదైంది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 14 శాతం పెరిగి రూ. 1633 కోట్లను తాకింది. స్థూల మొండిబకాయిలు(జీఎన్‌పీఏలు) 15.6 శాతం నుంచి 21.25 శాతానికి ఎగశాయి. ఐడిబిఐ బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తులు 27 శాతం పెరిగి రూ. 44,753 కోట్లుగా ఉన్నట్టు బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్ లో వెల్లడించింది. ఐడీబీఐ బ్యాంకు మొత్తం అభివృద్ధిలో నికర అసంతృప్త ఆస్తులు భారీగా పెరిగాయి. డిసెంబర్ త్రైమాసికంలో 9.61 శాతంతో పోలిస్తే 13.21 శాతం పెరిగాయి. నికర ప్రొవిజన్లు రూ. 4450 కోట్ల నుంచి రూ. 6209 కోట్లకు పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐడీబీఐ బ్యాంక్ షేరు 9శాతానికిపైగా పతనమైంది. గత మూడు నెలల్లో నిఫ్టి బ్యాంక్‌లో 12 శాతం లాభంతో పోలిస్తే ఐడిబిఐ బ్యాంకు షేర్లు 13 శాతం పడిపోయాయి. -
17 బ్యాంకులపై ఆర్బీఐ నియంత్రణలు!!
ఐడీబీఐ తరహాలో వీటిపైనా నియంత్రణలకు అవకాశం: ఇక్రా న్యూఢిల్లీ: ఒకటి రెండు కాదు ఏకంగా 17 ప్రభుత్వరంగ బ్యాంకులు ఐడీబీఐ బ్యాంకు తరహాలో ఆర్బీఐ నియంత్రణలను ఎదుర్కొనే అవకాశం ఉందని రేటింగ్ సంస్థ ఇక్రా పేర్కొంది. ఆస్తులపై ప్రతికూల రాబడులను ఎదుర్కొంటూ నికర ఎన్పీఏలు గరిష్ట స్థాయికి చేరిన నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంకు తాజాగా ఆర్బీఐ నియంత్రణల పరిధిలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజా మూలధనాన్ని సర్దుబాటు చేయడం, శాఖల విస్తరణ, రుణాల మంజూరు, డైరెక్టర్ల ఫీజులు, డివిడెండ్ పంపిణీ వంటి పలు అంశాలపై నియంత్రణా చర్యలు విధించే అధికారం ఆర్బీఐకి ఉంటుంది. ఐవోబీ, యూకో, పీఎన్బీ, ఓబీసీ, యూబీఐ, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర, దేనా బ్యాంకుల ఎన్పీఏలు ఆర్బీఐ నిర్దేశించిన గరిష్ట మార్కును దాటేశాయి. -
మొండిబాకీలపై ఆర్బీఐ వాచ్‌లిస్ట్‌లో ఐడీబీఐ బ్యాంక్
న్యూఢిల్లీ: మొండి బకాయిల (ఎన్పీఏ) సమస్య పరిష్కారం దిశగా రిజర్వ్ బ్యాంక్ చర్యలు మొదలుపెట్టింది. ఎన్పీఏలు భారీగా పేరుకుపోయిన నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంకు విషయంలో సత్వర దిద్దుబాటు చర్యలకు ఆర్బీఐ ఉపక్రమించింది. దీంతో కొత్త రుణాలు మంజూరు చేయడం, డివిడెండ్ పంపిణీ తదితర కార్యకలాపాలపై పరిమితులు అమల్లోకి రానున్నాయి. తమ సంస్థలో అధిక ఎన్పీఏలు, ఆస్తులపై రాబడులు ప్రతికూలంగా ఉండటం వంటి అంశాల కారణంగా ఆర్బీఐ మే 5న సత్వర దిద్దుబాటు చర్యలు ప్రారంభించినట్లు ఐడీబీఐ బ్యాంకు వెల్లడించింది. అయితే, వీటివల్ల బ్యాంకు పనితీరుపై ప్రతికూల ప్రభావమేమీ ఉండదని, సంస్థ కార్యకలాపాలను మెరుగుపర్చుకునేందుకు ఇవి దోహదపడగలవని తెలిపింది. డిసెంబర్ త్రైమాసికంలో ఐడీబీఐ బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) 80 శాతం ఎగసి రూ. 35,245 కోట్లకు ఎగియగా, నష్టాలు రూ. 2,255 కోట్ల మేర నమోదయ్యాయి. రుణ రేట్లు పావుశాతం కోత ఐడీబీఐ బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను మంగళవారం పావుశాతం వరకూ తగ్గించింది. 2016 ఏప్రిల్ నుంచీ తమ తాజా డిపాజిట్లు– రుణాలు– మార్జిన్లు ఆధారంగా దాదాపు నెలకోసారి బ్యాంకులు ఎంసీఎల్ఆర్ను సవరిస్తున్నాయి. -
ఐడీబీఐ బ్యాంక్ ఎండీగా మహేశ్ కుమార్
హైదరాబాద్: ఐడీబీఐ బ్యాంక్ ఎండీ, సీఈవోగా మహేశ్ కుమార్ జైన్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటిదాకా ఇండియన్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా వ్యవహరించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో జైన్ బ్యాంకింగ్ కెరియర్ ప్రారంభించారు. ఆతర్వాత సిండికేట్ బ్యాంక్‌లో జీఎంగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2013 సెప్టెంబర్‌లో ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేరిన జైన్.. కార్పొరేట్ అండ్ రిటైల్ క్రెడిట్, రిస్క్ మేనేజ్మెంట్ తదితర విభాగాలు పర్యవేక్షించారు. ప్రస్తుతం ఆయన ఎన్ఐబీఎం గవర్నింగ్ బోర్డు సభ్యులుగా ఉన్నారు. -
నాలుగు బ్యాంకులపై ఆర్బీఐ డేగకన్ను?
⇒ రుణ నాణ్యతపై ఆందోళనలతో ‘వాచ్‌లిస్ట్’లోకి! ⇒ జాబితాలో ఐడీబీఐ బ్యాంక్, ఐఓబీ, యుకో...! న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులను ‘వాచ్‌లిస్ట్’లో పెట్టినట్లు తెలిసింది. రుణ నాణ్యత విషయంలో ఆందోళనలే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. జాబితాలో ఐడీబీఐ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ), యుకో బ్యాంక్‌లు ఉన్నాయి. నాల్గవ బ్యాంక్ ఏమిటన్నది తెలియరాలేదు. అయితే ఈ వార్తల్ని అటు ఆర్బీఐ గానీ, ఇటు నాలుగు బ్యాంకుల అధికారులు గానీ ధ్రువపరచలేదు. అదనపు ద్రవ్య లభ్యత వినియోగానికి నేడు బ్యాంకుల సమావేశం వ్యవస్థలో ఉన్న అధిక ద్రవ్య లభ్యత (లిక్విడిటీ)ని వినియోగించుకునే అంశంపై సమీక్షకు ఆర్థికమంత్రిత్వశాఖ శుక్రవారం బ్యాంకులతో కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. దిగ్గజ బ్యాంకుల చీఫ్‌లు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. -
ప్రభుత్వ బ్యాంకులకు మారబోతున్న అధినేతలు
న్యూఢిల్లీ : కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు అధినేతలు మారబోతున్నారు. అధినేతలను పునర్వ్యస్థీకరించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్యాంకుల ప్రదర్శనను మెరుగుపర్చుకోవడం, మొండిబకాయిల సమస్యల పరిష్కారం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అధినేతలను మార్చుతున్నట్టు సమాచారం. పునర్ వ్యవస్థీకరించే బ్యాంకుల్లో ఐడీబీఐ కూడా ఉందట. చాలా నిశీతంగా పరిశీలించిన అనంతరం అధినేతలను మార్చే ప్రక్రియపై తుది నిర్ణయం తీసుకోనున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఐడీబీఐ బ్యాంకుకు సీఈవోగా, మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కిషోర్ ఖరాట్ ను వేరే బ్యాంకుకు బదిలీ చేయనున్నారని తెలుస్తోంది. ప్రధాని మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఫైనాన్సియల్ సెక్టార్లో ఎంతో మార్గదర్శకంగా నిలిచిన ఐడీబీఐ బ్యాంకు 2015-16లో రూ.3664 కోట్ల నష్టాలను నమోదుచేసింది. ఈ బ్యాంకుకు 2014-15లో రూ.873 కోట్ల నికర లాభాలున్నాయి. ఈ బ్యాంకుకు క్రమేపీ లాభాలు పడిపోతున్నాయని పార్లమెంటరీ కమిటీ రిపోర్టులో తెలిసింది. స్థూల నిరర్థక ఆస్తులు పెరిగిపోవడం, రుణాల రైటాఫ్స్, సరిగా లేని ఆర్థిక ఫలితాలు ఐడీబీఐ బ్యాంకును దెబ్బతీస్తున్నాయని కమిటీ రిపోర్టు పేర్కొంది. దీంతో ఐడీబీఐ బ్యాంకుల్లో ప్రధానంగా ఈ మార్పులు చోటుచేసుకోబోతున్నాయని సమాచారం. -
బాపట్లలో సీబీఐ ప్రకంపనలు
8 ఏళ్ల క్రితం ఘటనపై విచారణ బాపట్ల: 8 ఏళ్ల క్రితం కొందరు నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించి బాపట్ల ఐడీబీఐ బ్యాంకు నుంచి లోన్ల రూపేణా రూ.122 కోట్లు స్వాహా చేశారు. దీనిపై అంతర్గత విచార ణ జరిపిన బ్యాంకు అధికారులు ఎట్టకేలకు 181 మంది రూ.122 కోట్ల మేర బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టారని నిర్ధారించుకుని సీబీఐని ఆశ్రయించారు. కేసుకు సంబంధించి మరిన్ని అధారాలు సేకరించేందుకు సీబీఐ అధికారులు శుక్రవారం బాపట్లలో రహస్యంగా విచార ణ జరిపినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై ఈ ఏడాది జనవరి 28న 40 మందిపై ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. బాపట్ల కేంద్రంగా నడుస్తున్న కామాక్షి డెయిరీ ఫామ్ అధినేత గండూరి మల్లి కార్జునరావుతో పాటు మరికొంతమంది ముఠాగా ఏర్పడి, రిజిస్ట్రార్లు, తహసీల్దార్ల సహకా రంతో ప్రభుత్వ భూములకు నకిలీ పత్రాలు సృష్టించారు. గుంటూరులోని చంద్రమౌళి నగర్ ఐడీబీఐ బ్యాంకు ఏజీఎం చంద్రశేఖర్‌ను కలుపుకుని ఫైల్స్ కదిలించారు. 2010– 2012లో విడతల వారీగా బ్యాంకు నుంచి లోన్ల రూపేణా సొమ్ము దోచుకున్నారు. ఈ కేసులో చంద్రశేఖర్‌ను ఏ–1గా, మల్లికార్జునరావును ఏ–2గా చేర్చారు. మరో 38మందిపై కేసు నమోదైంది. సంబంధిత వ్యక్తుల ఇళ్లలో సోదాలు నిర్వహించి వారి వద్ద నుంచి విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. -
ఐడీబీఐ బ్యాంక్‌కు ‘ఎంఎస్ఎంఈ ఎక్సలెన్స్’ అవార్డు
హైదరాబాద్: ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంక్‌ను తాజాగా ‘ఎంఎస్ఎంఈ ఎక్సలెన్స్ అవార్డు 2017’ వరించింది. ఎంఎస్ఎంఈ రంగానికి ఇతోధికంగా నిధులు కేటాయించినందుకు గుర్తిం పుగా బ్యాంక్‌కు ఈ అవార్డు లభించింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీ ట్రేడ్ అండ్ సర్వీసెస్ ఈ అవార్డును అందించింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వాణిజ్య సంస్థల (ఎంఎస్ఎంఈ) మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి హరిబాయ్ పి చౌదరీ చేతుల మీదుగా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ లలిత శర్మ ఈ అవార్డును అందుకున్నారు. -
ఆర్బీఐ కంటే ముందే శుభవార్త చెప్పిన ఐడీబీఐ
ముంబై: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఐడిబిఐ వడ్డీరేట్లను తగ్గించింది. గృహ రుణాలపై 0.60శాతంకోత పెట్టి 8.55శాతం వద్ద నిలిపింది. ఇప్పటివరకు ఈ ఎంసీఎల్ఆర్ రేటు 8.7శాతంగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన రేట్ల కంటేముందుగానే తన తగ్గింపు నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ తగ్గింపు రేట్లు ఫిబ్రవరి 1నుంచి అమలు చేయనున్నట్టు బ్యాంక్ ప్రకటించింది. వర్గాల వారీగా రుణాలు వివిధ కాలపరిమితి రుణాలపై 0.30శాతం నుంచి 0.35శాతం వడ్డీతోచౌకగా రుణాలను అందించనున్నట్టు ఐడీబీఐ ఒకప్రకటనలో తెలిపింది. వార్షిక ఎంసీఎల్ఆర్ ను 8.60శాతం , రెండు సంవత్సరాల రేటు 8.85శాతంగా, వద్ద పెగ్గెడ్ ఉండగా, ఒక నెల రేటు 8.40శాతం, ఓవర్ నైట్ రేటును 8.20శాతంగా ఉండనున్నట్టు ప్రకటించింది. గృహరుణాలపైనే తాము ఎక్కువగా దృష్టిపెట్టినట్టు బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మైథిలీ బాలసుబ్రమణ్యన్ తెలిపారు. త్వరలో కారు లోన్లపై కూడా వడ్డీరేటునుత గ్గించే యోచనలో ఉన్నట్టు చెప్పారు. -
జీఎంఆర్ రాజమండ్రి ఎనర్జీలో అమ్మకానికి వాటా
న్యూఢిల్లీ: జీఎంఆర్ ఇన్ఫ్రాకు చెందిన జీఎంఆర్ రాజమండ్రి ఎనర్జీలో ఉన్న 55 శాతం వాటాను విక్రయించేందుకు ఐడీబీఐ బ్యాంకు నేతృత్వంలోని కంపెనీలు ముందుకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి వద్ద ఉన్న 768 మెగావాట్ల సహజ వాయువు ఆధారిత విద్యుత్ ప్లాంటుకై ఇచ్చిన అప్పులో కొంత మొత్తాన్ని రుణమిచ్చిన కంపెనీలు...ఆ రుణంలో కొంత భాగాన్ని గతేడాది ఈక్విటీగా మార్చుకున్నాయి. ఇప్పటికీ ఈ ప్రాజెక్టుపై రూ.2,366 కోట్ల అప్పు ఉంది. రుణ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ వాటాను విక్రయిస్తున్నాయి. స్తోమత కలిగిన కంపెనీలు బిడ్డింగ్‌లో పాల్గొని 55 శాతం వాటాను దక్కించుకోవచ్చని, మేనేజ్మెంట్ కంట్రోల్ చేపట్టవచ్చని ప్రీ–బిడ్ డాక్యుమెంట్లో ఐడీబీఐ క్యాపిటల్ తెలిపింది. విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం 2012లో పూర్తి అయినప్పటికీ గ్యాస్ కొరత కారణంగా 2015 అక్టోబరులో పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభమైంది. -
ఐడీబీఐ బ్యాంక్ బేస్ రేటు తగ్గింపు..
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంక్ తాజాగా బేస్ రేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో బేస్ రేటు 9.75 శాతం నుంచి 9.65 శాతానికి తగ్గింది. అలాగే బ్యాంక్ బీపీఎల్ఆర్కు కూడా కత్తెర వేసింది. దీంతో ఇది 14.25 శాతం నుంచి 14.15 శాతానికి పడింది. ఇక బ్యాంక్.. రిటైల్ డిపాజిట్ రేట్లను కూడా 10-25 బేసిస్ పాయింట్ల మధ్యలో తగ్గించింది. తాజా మార్పులు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్ పేర్కొంది. కాగా ఐడీబీఐ బ్యాంక్ ఇటీవలనే ఎంసీఎల్ఆర్ను కూడా తగ్గించింది. -
ఐడీబీఐ బ్యాంకులో అగ్నిప్రమాదం
నెల్లూరు : నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులోని ఐడీబీఐ బ్యాంక్ శాఖలో మంగళవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భద్రత సిబ్బంది అగ్రిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని.. మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ అగ్నిప్రమాదంలో కంప్యూటర్లు, ఫైళ్లు కాలిపోయాయి. ఈ అగ్నిప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఐడీబీఐ బ్యాంక్ వాటా రేసులో విదేశీ దిగ్గజాలు!
♦ ఏడీబీ, ఐఎఫ్‌సీ ఆసక్తి ♦ 26% వాటా సేల్కు త్వరలో క్విప్ ఇష్యూ ♦ రూ.3,771 కోట్లు సమీకరించే చాన్స్ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంక్‌ను ప్రైవేటీకరించేందుకు రంగం సిద్ధమైంది. బ్యాంకులో 26 శాతం మేర వాటాను విక్రయించడం ద్వారా ప్రభుత్వం రూ.3,771 కోట్లు సమీకరించేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందుకోసం పలు విదేశీ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ దిగ్గజాలు పోటీపడుతున్నాయి. అర్హులైన సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) రూపంలో వాటా విక్రయించనున్నట్లు ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ), ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఎఫ్‌సీ) వంటి దిగ్గజాలు క్విప్ ఇష్యూ ద్వారా వాటా కొనుగోలుపై సంప్రదింపులు జరిపినట్లు ఆయన తెలిపారు. మార్కెట్ పరిస్థితులను బట్టి ఈ ఆర్థిక సంవత్సరం(2016-17) ద్వితీయార్థంలో ఇష్యూ ఉండొచ్చని ఆ అధికారి పేర్కొన్నారు. డిసెంబర్లోనే ఆమోదం... ఐడీబీఐ బ్యాంక్‌లో క్విప్ రూట్ ద్వారా రూ.3,771 కోట్లు సమీకరించేందుకు డిసెంబర్లోనే కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం కేంద్రానికి బ్యాంక్‌లో 73.96 శాతం వాటా ఉంది. అయితే, క్విప్ పూర్తయితే ఇందులో 26 శాతం మేర వాటా తగ్గిపోయే అవకాశం ఉంది. -
మిగిలేవి నాలుగైదు ప్రభుత్వ బ్యాంకులే..!
♦ భారీ విలీనానికి కేంద్రం కసరత్తు ♦ ఎస్బీఐతో అనుబంధ బ్యాంకుల విలీనం ♦ అనంతరం కీలక ప్రక్రియ ప్రారంభం ♦ ఐడీబీఐ బ్యాంక్‌లో వాటాల తగ్గింపుపైనా దృష్టి న్యూఢిల్లీ: భారత్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27. అయితే ఈ సంఖ్య నాలుగైదుకు తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాంకుల్లో భారీ విలీన ప్రక్రియపై కేంద్రం దృష్టి సారించినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖలోని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో ఐదు అనుబంధ బ్యాంకులతో పాటు భారతీయ మహిళా బ్యాంక్ విలీనానికి కేంద్రం ప్రాధాన్యత ఇస్తుంది. అనంతరం మిగిలిన బ్యాంకుల్లో విలీన ప్రక్రియకు శ్రీకారం చుడుతుంది. ఈ దిశలో కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఐడీబీఐ బ్యాంక్ నుంచి ప్రస్తుత 80 శాతం నుంచి 60 శాతానికి వాటాల తగ్గింపుపైనా కేంద్రం కసరత్తు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఎస్బీఐతో అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియ పూర్తవుతుందని కేంద్రం విశ్వసిస్తోంది. గత వారం ఇందుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ముందు ట్రేడ్ యూనియన్లతో చర్చలు కాగా ఏకపక్షంగా కాకుండా.. ట్రేడ్ యూనియన్ల అభిప్రాయాలను, సూచనలను కూడా విలీన ప్రక్రియకు ముందు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. దేశంలో ప్రభుత్వ రంగ భారీ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలు ఉన్నాయి. -
మాల్యా ఆస్తులు అటాచ్
ఐడీబీఐ రుణం కేసులో రూ.1,411 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ ముంబై: ఐడీబీఐ బ్యాంకుకు రుణాన్ని ఎగవేసిన కేసులో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రమోటర్ విజయ్ మాల్యా, యూబీ సంస్థలకు చెందిన కొన్ని ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) శనివారం అటాచ్ చేసింది. వీటి మార్కెట్ విలువ సుమారు రూ. 1,411 కోట్లు ఉంటుందని ఈడీ అధికారులు తెలిపారు. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద అటాచ్ చేసిన ఆస్తుల జాబితాలో రూ.34 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, బెంగళూరు.. ముంబైలలో రెండు ఫ్లాట్లు, చెన్నైలో పారిశ్రామిక ప్లాటు, కూర్గ్‌లో 28.75 ఎకరాల కాఫీ ప్లాంటేషన్ స్థలం తదితరాలున్నాయి. ఐడీబీఐ బ్యాంకు నుంచి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పొందిన రూ. 900 కోట్ల పైచిలుకు రుణాల విషయంలో మనీ ల్యాండరింగ్ కోణంపై ఈడీ విచారణ జరుపుతోంది. గతేడాది సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రాతిపదికగా మాల్యాతో పాటు మరికొందరిపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. రుణాల ఎగవేత ఆరోపణలెదుర్కొంటున్న దరిమిలా మాల్యా .. దేశం విడిచి వెళ్లిన సంగతి తెలిసిందే. -
అమ్మకానికి ‘డీసీ’ ట్రేడ్‌మార్క్‌లు
♦ ఈ నెల 24న వేలం వేయనున్న ఐడీబీఐ బ్యాంకు ♦ లిస్టులో ఆంధ్రభూమి, ఏషియన్ ఏజ్, ఫైనాన్షియల్ క్రానికల్ ♦ ట్రేడ్‌మార్క్‌లు కూడా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ (డీసీహెచ్ఎల్) ట్రేడ్‌మార్కులను వేలం వేసేందుకు ఐడీబీఐ బ్యాంకు సిద్ధమైంది. దాదాపు రూ. 444 కోట్ల బకాయిలను రాబట్టుకునేందుకు ఈ నెల 24న డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి, ఏషియన్ ఏజ్, ఫైనాన్షియల్ క్రానికల్ ట్రేడ్‌మార్క్‌లను ఆన్లైన్లో వేలం వేయనున్నట్లు ప్రకటించింది. బిడ్ల దాఖలుకు ఈ నెల 23 ఆఖరుతేదీగా పేర్కొంది. డెక్కన్ క్రానికల్‌కు రూ. 120 కోట్లు, ఆంధ్రభూమికి రూ. 3.5 కోట్లు, ది ఏషియన్ ఏజ్‌కు రూ. 18 కోట్లు, ఫైనాన్షియల్ క్రానికల్‌కు రూ. 3 కోట్లు రిజర్వ్ ధరగా ఐడీబీఐ బ్యాంకు నిర్ణయించింది. ఐడీబీఐ బ్యాంకుతో పాటు ఆంధ్రాబ్యాంకు, ఎస్బీహెచ్ తదితర 18 బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు డీసీహెచ్ఎల్ దాదాపు రూ. 4,000 కోట్ల పైచిలుకు బకాయి పడింది. దీంతో కంపెనీని ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా పలు బ్యాంకులు ఇప్పటికే ప్రకటించాయి. ఒకే పూచీకత్తుపై పలు సంస్థల నుంచి రుణాలు తీసుకోవడంతో న్యాయవివాదాలు కూడా నెలకొన్నాయి. ఐడీబీఐ బ్యాంకు పలుమార్లు ట్రేడ్‌మార్క్‌లను వేలం వేసేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఇతరత్రా రుణదాతల నుంచి అడ్డంకులు ఎదురవడంతో వీలు కాలేదు. తాజాగా రుణదాతలంతా ఒక అంగీకారానికి రావడంతో వేలానికి మార్గం సుగమమైనట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
ఐడీబీఐ బ్యాంక్ నష్టం రూ.1,736 కోట్లు
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌కు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.1,736 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. మొండి బకాయిల కేటాయింపులు రెండు రెట్లు పెరగడంతో ఈ స్థాయి నికర నష్టాలు వచ్చాయని ఐడీబీఐ బ్యాంక్ పేర్కొంది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-14) ఇదే క్వార్టర్‌కు రూ.546 కోట్ల నికర లాభం వచ్చిందని ఐడీబీఐ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ కిశోర్ కారత్ చెప్పారు. 2014-15 క్యూ4లో రూ.9,382 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు రూ,8,275 కోట్లకు తగ్గిందని తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్ షేర్ 0.47 శాతం క్షీణించి రూ.64.1 వద్ద ముగిసింది. -
కింగ్ ఫిషర్ కేసులో ఐదు దేశాలకు సీబీఐ లేఖలు
న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త విజయ్ మాల్యకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్...ఐడీబీఐ బ్యాం క్ నుంచి తీసుకున్న రుణాల తరలింపు ఆరోపణలకు సంబంధించి సమాచారాన్ని కోరుతూ అమెరికా, బ్రిటన్లతో సహా ఐదు దేశాలకు సీబీఐ త్వరలో జ్యుడీషియల్ విజ్ఞప్తి లేఖలు పంపనుంది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లావాదేవీలపై ఫైనాన్షియల్ ఇంటిలిజెన్స్ యూనిట్ నుంచి తగిన వివరాలు అందడంతో ఆయా దేశాలను సంప్రదించాలని సీబీఐ నిర్ణయించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సీబీఐ ఇప్పటికే ఈ లేఖల్ని రూపొందించిందని, వాటిని బ్రిటన్, అమెరికా, హాంకాంగ్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాలకు పంపుతుందని ఆ వర్గాలు తెలిపాయి.ఐడీబీఐ బ్యాంక్ నుంచి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తీసుకున్న రూ. 930 కోట్ల రుణంలో అధికభాగం ఇతర దేశాలకు తరలివెళ్లినట్లు సీబీఐ భావిస్తోంది. -
ఐడీబీఐ ఉద్యోగుల సమ్మె విజయవంతం: యూనియన్లు
ముంబై: ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణకు నిరసనగా సోమవారం చేపట్టిన సమ్మె విజయవంతమయ్యిందని యునెటైడ్ ఫోరమ్ ఆఫ్ ఐడీబీఐ బ్యాంక్ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయిస్(యూఎఫ్ఐఓఈ), యునెటైడ్ ప్లాట్‌ఫామ్ ఆఫ్ ఐడీబీఐ బ్యాంక్ యూనియన్స్ (యూపీఐబీయూ) ప్రకటించాయి. 85% అధికారులు, 100% మంది సాధారణ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారని తెలిపాయి. బ్యాంక్‌కు చెందిన కార్యాలయాలు, శాఖలు పనిచేయలేదని పేర్కొన్నాయి. సమ్మెను మరో మూడు రోజులు కొనసాగిస్తామని యూపీఐబీయూ ప్రకటించింది. కాగా ఫ్రంట్ ఆఫీస్ సర్వీసులు, బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలు సహా చెక్ క్లియరింగ్, రెమిటెన్స్‌లు, ఆర్టీజీస్/నెఫ్ట్, ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ సర్వీసులు, ట్రెజరీ కార్యకలాపాలన్నీ యథావిథిగా కొనసాగాయని ఐడీబీఐ బ్యాంక్ మేనేజ్మెంట్ తెలిపింది. -
ఐడీబీఐపై జైట్లీతో ఏఐబీఈఏ చర్చలు
చెన్నై: ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రతినిధులు గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. బ్యాంకు ఇటీవలి ఆర్థిక సమస్యలకు మొండి బకాయిలే కారణమని, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని జైట్లీని కోరినట్లు ఏఐబీఈఏ జనరల్ సెక్రటరి సీహెచ్ వెంకటాచలం ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు ప్రభుత్వ రంగ స్టేట్ ఎస్బీఐ అనుబంధ బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా జైట్లీకి మెమోరాండం అందించినట్లు ఆయన వివరించారు. ఎస్బీఐ సర్వీసు నిబంధనలను అనుబంధ బ్యాంకు ఉద్యోగులపై ఏకపక్షంగా రుద్దడం జరుగుతోందని వివరించినట్లు వెంకటాచలం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎస్బీఐ పరిధిలో నుంచి అనుబంధ బ్యాంకులను తప్పించాలని కోరినట్లు ఆయన వివరించారు. ఏఐబీఈఏ లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జైట్లీ హామీ ఇచ్చారు. ఏఐబీఈఏ కార్యదర్శి బీఎస్ రాంబాబు, వైస్ ప్రెసిడెంట్లు జేపీ శర్మ, ఎన్ వేణుగోపాల్, జాయింట్ సెక్రటరి డీడీ రస్తోగి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
మాల్యాకు ఈడీ సమన్లు...
♦ ఐడీబీఐ కేసులో 18న విచారణకు హాజరు కావాలని ఆదేశం ♦ కేఎఫ్ఏ మాజీ సీఎఫ్‌వో విచారణ ముంబై: ఐడీబీఐ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఎగవేసిన కేసుకు సంబంధించి ఆ సంస్థ ప్రమోటరు విజయ్ మాల్యాకు ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసింది. ఈ నెల 18న హాజరు కావాలంటూ ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే తన వ్యక్తిగత ఆర్థిక వివరాల పత్రాలు సమర్పించాలని సమన్లలో సూచించినట్లు పేర్కొన్నాయి. మరోవైపు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ (కేఎఫ్ఏ) మాజీ సీఎఫ్‌వో ఎ. రఘునాథన్‌ను ఈడీ ప్రశ్నించింది. వివిధ ఆర్థిక లావాదేవీల గురించి తెలుసుకునేందుకు ఆయన్ను ప్రశ్నించడం కీలకమైనదని ఈడీ అధికారి ఒకరు తెలిపారు. ఐడీబీఐ బ్యాంకుకు దాదాపు రూ. 900 కోట్లు ఎగవేసిన అంశంలో మనీలాండరింగ్ కోణానికి సంబంధించి బ్యాంకు మాజీ సీఎండీ యోగేశ్ అగర్వాల్‌తో పాటు కింగ్‌ఫిషర్ సంస్థ అధికారులకు కూడా ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. కేఎఫ్ఏ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి మాల్యా వ్యవహార శైలే కారణమని, ఆయన ఆదేశాల ప్రకారమే తాను నడుచుకున్నానని గత నెలలో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(ఎస్ఎఫ్ఐవో)కి ఇచ్చిన స్టేట్మెంట్లో రఘునాథన్ తెలిపారు. సేవా పన్ను కేసుపై విచారణ వాయిదా.. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, దాని చీఫ్ విజయ్ మాల్యా నుంచి రూ. 32 కోట్లు రికవరీ చేసుకోవడానికి సేవా పన్ను విభాగం వేసిన రెండు పిటీషన్లపై విచారణను బాంబే హైకోర్టు మార్చి 28కి వాయిదా వేసింది. 2010-11లో కేఎఫ్ఏ ప్రయాణికుల నుంచి వసూలు చేసినా.. ఖజానాకు జమ చేయని సర్వీస్ ట్యాక్స్ రికవరీ కేసులో మాల్యాకు మేజిస్ట్రేట్ యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సేవా పన్ను విభాగం పిటీషన్ వేసింది. ఏప్రిల్ 6న తదుపరి విచారణ కోసం మాల్యా సహా ఇతర డెరైక్టర్లు ట్రయల్ కోర్టు ముందు, హైకోర్టు ముందు హాజరయ్యేలా ఆదేశించాలంటూ కోరింది. డీఆర్టీ ఆదేశాలను పరిశీలిస్తాం: డియాజియో మాల్యాకి ఇచ్చే 75 మిలియన్ డాలర్లను నిలిపివేయాలని డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) ఇచ్చిన ఆదేశాలను సమీక్షించనున్నట్లు బ్రిటన్ లిక్కర్ సంస్థ డియాజియో తెలిపింది. డీఆర్టీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే ప్రక్రియలో ఉన్నట్లు తమకు తెలిసిందని, పూర్తి వివరాలు అందుబాటులోకి వచ్చాక తాము సమీక్షిస్తామని సంస్థ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే, తాము ఇప్పటికే 40 మిలియన్ డాలర్లు మాల్యాకు చెల్లించేసినట్లు వివరించారు. బ్యాంకులకు దాదాపు రూ. 9,000 కోట్ల ఎగవేతకు సంబంధించి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, మాల్యాపై సీబీఐ మొదలుకుని ఈడీ దాకా పలు దర్యాప్తు సంస్థలు కేసులు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో మాల్యా దేశం విడిచి వెళ్లిపోవడంతో వివాదం తీవ్ర రూపు దాలుస్తోంది. -
ఐడీబీఐ బ్యాంక్ అధికారులకు ఈడీ సమన్లు
ముంబై: మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు చె ందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, ఐడీబీఐ బ్యాంకుకు చెందిన అధికారులకు ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. తమ తమ వ్యక్తిగత ఆర్థిక వివరాలు, గత ఐదేళ్ల ఐటీ రిటర్నులు మొదలైనవి విచారణ అధికారులకు సమర్పించాలని సూచించింది. మరికొద్ది రోజుల్లో విచారణకు హాజరై తమ వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ముందుగా బ్యాంకు, కంపెనీ కీలక అధికారులను ప్రశ్నించిన తర్వాత మాల్యాకు సమన్లు జారీ చేసే విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించాయి. సమన్లు జారీ అయిన వారిలో ఐడీబీఐ బ్యాంకు మాజీ సీఎండీ యోగేశ్ అగర్వాల్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సీఎఫ్‌వో ఎ. రఘునాథన్ తదితరులు ఉన్నారు. ఐడీబీఐ బ్యాంకు నుంచి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తీసుకున్న రూ. 900 కోట్ల రుణాల ఎగవేతకు సంబంధించి మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. లుక్అవుట్ నోటీసులు మార్చేసిన సీబీఐ.. మాల్యా దేశం విడిచి వెడితే ఆయన్ను నిర్బంధించాలంటూ జారీ చేసిన లుక్అవుట్ నోటీసుల్లో ఆదేశాలను నెలరోజుల వ్యవధిలో సీబీఐ మార్చేసింది. ఆయన రాకపోకల సమాచారం మాత్రమే తమకు అందిస్తే చాలని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్‌కు సూచించింది. తొలి లుక్అవుట్ నోటీసు గతేడాది అక్టోబర్ 16న జారీ అయింది. విచారణలో ఆయన పూర్తిగా సహకరిస్తున్నందునే ఆ తర్వాత దాన్ని మార్చినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. అందుకే తాజాగా ఆయన దేశం విడిచి వెడుతున్నా కూడా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన్ను అడ్డుకోలేదు. -
గతవారం బిజినెస్
బ్యాంకులకు రూ.25,000 కోట్ల మూలధనం బ్యాంకులకు వచ్చే ఆర్థిక సంవత్సరం కేంద్రం రూ.25,000 కోట్ల తాజా మూలధనాన్ని అందించనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల పటిష్టత, పోటీతత్వం మెరుగుదలకు ప్రభుత్వం తగిన పటిష్ట చర్యలు తీసుకోనున్నట్లు తన బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ పేర్కొన్నారు. దీనితోపాటు ప్రభుత్వ రంగంలోని ఐడీబీఐ బ్యాంక్‌లో తన వాటాను 50 శాతం దిగువకు తగ్గించుకునే విషయాన్ని సైతం ప్రభుత్వం పరిశీలిస్తోంది. కీలక పరిశ్రమ వృద్ధి 2.9 శాతం ఎనిమిది కీలక పరిశ్రమల గ్రూప్ ఉత్పత్తి జనవరిలో 2.9 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. గడచిన మూడు నెలల్లో ఇంత స్థాయిలో వృద్ధి నమోదుకాలేదు. బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజ వాయువులు, రిఫైనరీ ప్రొడక్ట్స్, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ విభాగాలు ఈ గ్రూప్‌లో ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో ఈ రంగాల వాటా 38 శాతం. డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ.56,500 కోట్లు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూ.56,500 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందులో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా ఒనగూరేది రూ.36,000 కోట్లు. మిగిలిన రూ.20,500 కోట్లు వ్యూహాత్మక వాటాల (మెజారిటీ వాటాలు) విక్రయం ద్వారా సమకూర్చుకోవాలన్నది బడ్జెట్ లక్ష్యం. కాగా పెట్టుబడుల ఉపసంహరణ శాఖ పేరును ఇకమీదట ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల శాఖ (డీఐపీఏఎం)గా వ్యవహరించనున్నారు. బీమాలో ఎఫ్‌డీఐ నిబంధనలు సడలింపు బీమా, పింఛను రంగాలు, స్టాక్ ఎక్స్చేంజీలు, అసెట్ రీకన్స్ట్రక్షన్ సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలు సడలిస్తున్నట్లు జైట్లీ తెలిపారు. దీంతో బీమా, పింఛను రంగాల్లో ఇకపై 49 శాతం దాకా ఎఫ్‌డీఐలను ఆటోమేటిక్ మార్గంలో అనుమతిస్తారు. అటు నిర్దిష్ట నిబంధనలకు లోబడి అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీల్లో (ఏఆర్సీ) ఆటోమేటిక్ పద్ధతిలో ఎఫ్‌డీఐల పరిమితిని 49 శాతం నుంచి 100 శాతానికి పెంచారు. దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో విదేశీ పెట్టుబడుల పరిమితిని 5 శాతం నుంచి 15 శాతానికి పెంచుతున్నట్లు జైట్లీ తెలిపారు. ‘రీట్స్’ పెట్టుబడులు వస్తున్నాయ్ సింగపూర్, హాంకాంగ్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సక్సెస్ అయిన రీట్ల (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్) విధానాన్ని మన దేశంలోనూ ఆరంభించాలని జైట్లీ బడ్జెట్లో ప్రతిపాదించారు. రీట్స్ పెట్టుబడులు పొందేందుకు ప్రధాన అడ్డంకిగా ఉన్న డివెడెండ్ పంపిణీ పన్ను (డీడీటీ)ను తొలగిస్తున్నామని, దీర్ఘకాలిక మూలధనంపై పన్ను విధానాన్ని కూడా హేతుబద్దీకరిస్తున్నామని, అలాగే ప్రస్తుతం ఆదాయం పన్ను మినహాయింపుల్లో భాగంగా ఇస్తున్న ఇంటి అద్దె మినహాయింపులను కూడా రూ.24,000 నుంచి రూ.60,000కు పెంచుతున్నట్లు జైట్లీ తన ప్రసంగంలో వివరించారు. ఐడీబీఐ బ్యాంక్‌లో వాటాలకు సీడీసీ ఆసక్తి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఐడీబీఐ బ్యాంక్‌లో వాటాలు కొనుగోలు చేసేందుకు ఇంగ్లాండ్‌కి చెందిన సీడీసీ, సింగపూర్‌కి చెందిన జీఐసీ తదితర సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి. 15 శాతం వాటాల కొనుగోలు కోసం ప్రపంచ బ్యాంకు గ్రూప్‌లో భాగమైన ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్‌తో కూడా కేంద్రం చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం ప్రభుత్వానికి ఐడీబీఐ బ్యాంకులో దాదాపు 80 శాతం వాటాలు ఉన్నాయి. వ్యూహాత్మక వాటాల విక్రయం ద్వారా వీటిని 50 శాతానికన్నా తక్కువకి తగ్గించుకోవాలని కేంద్రం భావిస్తోంది. విమాన ప్రయాణం మరింత భారం జెట్ ఇంధనం (ఏటీఎఫ్)పై ఎక్సైజ్ సుంకాన్ని 8 శాతం నుంచి 14 శాతానికి పెంచుతున్నట్లు జైట్లీ తన బడ్జెట్లో పేర్కొన్నారు. దీంతో విమాన ప్రయాణం మరింత ఖరీదు కానున్నది. సాధారణంగా విమాన సంస్థల ఖర్చుల్లో ఏటీఎఫ్‌దే అధిక వాటా (40 శాతం) ఉంటుంది. సామాన్య జనాలకు విమాన ప్రయాణాన్ని చేరువ చేస్తామని చెప్పే ప్రభుత్వం దానికి విరుద్ధమైన విధానాలను అవలంబిస్తోందని పరిశ్రమ నిపుణులు పేర్కొన్నారు. 3వ అత్యంత విలువైన కంపెనీగా ఐటీసీ ఐటీసీ కంపెనీ తాజాగా మార్కెట్ క్యాప్ ఆధారంగా మూడవ అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. ప్రస్తుతం ఐటీసీ మార్కెట్ క్యాప్ రూ.2,61,403 కోట్లుగా ఉంది. ఐటీసీ కన్నా ముందు వరుసలో టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వీటి మార్కెట్ క్యాప్ వరుసగా రూ.4,48,272 కోట్లుగా, రూ.3,18,260 కోట్లుగా ఉంది. ఇక ఐటీసీ తర్వాతి స్థానంలో ఇన్ఫోసిస్ (రూ.2,58,291 కోట్లు), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (రూ.2,48,947 కోట్లు) ఉన్నాయి. శాంసంగ్.. 2016 విశ్వసనీయమైన బ్రాండ్ దక్షిణ కొరియా మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ శాంసంగ్ మొబైల్స్ దేశంలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా అవతరించింది. టాప్-5లో కేవలం ఒకే ఒక దేశీ సంస్థ టాటా గ్రూప్ చోటు దక్కించుకుంది. ‘బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్-ఇండియా స్టడీ 2016’ పేరుతో ట్రస్ట్ రీసెర్చ్ అడ్వైజరీ (టీఆర్ఏ) ఒక సర్వే నిర్వహించింది. విశ్వసనీయమైన టాప్-5 బ్రాండ్స్‌లో శాంసంగ్ మొబైల్స్, సోనీ, ఎల్జీ, నోకియా, టాటా కంపెనీలు ఉన్నాయి. కాగా ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ‘అత్యంత విశ్వసనీయమైన ఆన్లైన్ షాపింగ్ బ్రాండ్’గా అవతరించింది. దీని తర్వాతి స్థానాల్లో స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు ఉన్నాయి. ఫోర్బ్స్ జాబితాలో ఐదుగురు భారతీయ మహిళలు ఫోర్బ్స్ ప్రపంచ సంపన్నుల జాబితాలో భారత్ నుంచి ఐదుగురు మహిళలు స్థానం దక్కించుకున్నారు. వారిలో జిందాల్ స్టీల్ అండ్ పవర్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ సావిత్రి జిందాల్ (3.5 బిలియన్ డాలర్ల సంపద-453వ స్థానం), బెనెట్-కోల్మన్ అండ్ కో సంస్థ చైర్పర్సన్ ఇందు జైన్ (3.1 బిలియన్ డాలర్ల సంపద-549వ స్థానం), స్మితా కృష్ణ గోద్రేజ్ (2.2 బిలియన్ డాలర్ల సంపద-810వ స్థానం), యూఎస్వీ ఫార్మా చైర్పర్సన్ లీనా తివారి (1.7 బిలియన్ డాలర్ల సంపద-1,067వ స్థానం), హావెల్స్ ఇండియా వ్యవస్థాపకుడు దివంగత కిమత్ రాయ్ గుప్తా భార్య వినోద్ గుప్తా (1.1 బిలియన్ డాలర్ల సంపద-1,577వ స్థానం) ఉన్నారు. 15 ఏళ్ల పాత కేసుల ఉపసంహరణ పన్ను వివాదాల సత్వర పరిష్కారం దిశలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్ల క్రితం నుంచీ అపరిష్కృతంగా ఉన్న రూ. 5 లక్షల లోపు సెంట్రల్ ఎకై ్సజ్ ఎగవేత కేసులను ఉపసంహరించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ కేసులను ప్రాసిక్యూషన్ నుంచి ఉపసంహరించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ తగిన స్థాయి అధికారి హైకోర్డులో పిటిషన్ దాఖలు చేయడానికి వీలు కల్పిస్తూ తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఎకై ్సజ్ అండ్ కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ (సీబీఈసీ) ఒక ప్రకటనలో తెలిపింది. 8 నుంచి మళ్లీ పసిడి బాండ్లు పసిడి బాండ్ల పథకం మూడవ విడతకు వచ్చే మంగళవారం నాడు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఆర్థిక మంత్రిత్వశాఖ శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యాంశాలు చూస్తే... బాండ్లకు దరఖాస్తులను మార్చి 8వ తేదీ నుంచీ 14వ తేదీవరకూ సమీకరిస్తారు. దరఖాస్తులకు అనుగుణంగా బాండ్లు మార్చి 29న జారీ అవుతాయి. వాహన ధరలకు రెక్కలు వాహన తయారీ కంపెనీలన్నీ వాటి కార్ల ధరలను వరుసపెట్టి పెంచేస్తున్నాయి. దీనికి బడ్జెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్సు వడ్డింపే ప్రధాన కారణం. హోండా మోటార్ ఇండియా తాజాగా కార్ల ధరలను రూ.79,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా వాహన ధరల్ని రూ.82,906 వరకు, మహీంద్రా ప్యాసెంజర్ వాహన ధరల్ని రూ.47,000 వరకు పెంచింది. మారుతీ సుజుకీ కూడా కార్ల ధరలను రూ.1,441-రూ.34,494 శ్రేణిలో పెంచింది. ఇక మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరలు కూడా మార్చి 15 నుంచి రూ.5 లక్షల వ రకు పెరగనున్నాయి. అలాగే టాటా మోటార్స్ కంపెనీ ప్యాసెంజర్ వాహన ధరలను రూ.2,000-రూ.35,000 శ్రేణిలో పెంచింది. డీల్స్.. ►పిరమాల్ ఎంటర్‌ప్రెజైస్ తాజాగా అమెరికాకు చెందిన అడాప్టివ్ సాఫ్ట్వేర్ సంస్థను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 24.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 165 కోట్లు). ►జపాన్ దిగ్గజం సుమిటొమొ మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ (ఎస్ఎంబీసీ) మంగళవారం కొటక్ మహీంద్రా బ్యాంకులో దాదాపు 1.78 శాతం మేర వాటాలను విక్రయించింది. వీటి విలువ దాదాపు రూ. 2,069 కోట్లు. -
ఐడీబీఐ బ్యాంకులో వాటాలకు సీడీసీ ఆసక్తి
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఐడీబీఐ బ్యాంక్‌లో వాటాలు కొనుగోలు చేసేందుకు ఇంగ్లాండ్‌కి చెందిన సీడీసీ, సింగపూర్‌కి చెందిన జీఐసీ తదితర సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి. 15 శాతం వాటాల కొనుగోలు కోసం ప్రపంచ బ్యాంకు గ్రూప్‌లో భాగమైన ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్‌తో కూడా కేంద్రం చర్చలు జరుపుతోంది. ఐడీబీఐ బ్యాంకు ఎండీ కిశోర్ ఖరాత్ ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వానికి ఐడీబీఐ బ్యాంకులో దాదాపు 80 శాతం వాటాలు ఉన్నాయి. వ్యూహాత్మక వాటాల విక్రయం ద్వారా వీటిని 50 శాతానికన్నా తక్కువకి తగ్గించుకోవాలని యోచిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు, వ్యాపారాన్ని పునర్వ్యవస్థీకరించుకునే దిశగా ఐడీబీఐ బ్యాంకు మూడేళ్ల ప్రణాళికను రూపొందించింది. దీని కోసం రూ. 20,000 కోట్లు సమీకరించనుంది. మూడేళ్లలో వ్యాపార పరిమాణాన్ని రెట్టింపు చేసుకోవాలని, ప్రస్తుతమున్న రూ. 5 లక్షల కోట్ల నుంచి రూ. 10 లక్షల కోట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఖరాత్ తెలిపారు. మరోవైపు మార్కెట్లో పరిస్థితులు సరిగ్గా లేనందున సంస్థాగత ఇన్వెస్టర్లకు రూ. 3,771 కోట్ల విలువ చేసే షేర్ల విక్రయ యోచనను ఐడీబీఐ బ్యాంకు తాత్కాలికంగా పక్కన పెట్టింది. మంగళవారం బ్యాంకు షేరు 1.8 శాతం పెరిగి రూ. 59.50వద్ద ముగిసింది. -
ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ?
ముంబై: ఐడీబీఐ బ్యాంకులో వాటాలు తగ్గించుకుని, ప్రైవేటీకరించాలని కేంద్రం యోచిస్తోంది. తద్వారా అది కూడా యాక్సిస్ బ్యాంకులాగా రూపాంతరం చెందేలా చూడాలని భావిస్తోంది. ప్రాజెక్టులకు ఇచ్చిన రుణాలు మొండి బకాయిలుగా మారి సతమతమవుతున్న ఐడీబీఐ బ్యాంకు పనితీరును మెరుగుపర్చుకునే వీలు కల్పించాలని యోచిస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి జయంత్ సిన్హా మంగళవారం ఈ విషయాలు తెలిపారు. డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాలను సాధించే దిశగా ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వం తన వాటాలను 49 శాతాని కన్నా తక్కువకి తగ్గించుకునే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంల సిన్హా వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వ రంగ ఫండ్ మేనేజరైన యూటీఐ 1990లో సంక్షోభంలో కూరుకుపోవడం, దాన్నుంచి యాక్సిస్ బ్యాంక్ ఏర్పాటు కావడం తెలిసిందే. ప్రస్తుతం ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో దిగ్గజంగా ఎదిగిన యాక్సిస్‌లో ప్రభుత్వానికి 13 శాతం వాటాలు ఉన్నాయి. మిగతా వాటాలు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ రంగ బీమా సంస్థలకు ఉన్నాయి. -
మాల్యా ఇంటిపై సీబీఐ దాడులు
ఐడీబీఐ రుణ మంజూరీ కేసులో.. న్యూఢిల్లీ/బెంగళూరు/పణజి: నిబంధనలకు విరుద్ధంగా ఐడీబీఐ బ్యాంకు నుంచి దాదాపు రూ. 900 కోట్ల రుణాలు పొందిన వ్యవహారంలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, దాని ప్రమోటర్ విజయ్ మాల్యా నివాసాలు, కార్యాలయాలపై సీబీఐ శనివారం దాడులు నిర్వహించింది. బెంగళూరు, ముంబై, పణజిలోని ఐదు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. మాల్యాను కొన్ని బ్యాంకులు ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించడంతో పాటు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉందని తెలిసినప్పటికీ.. ఐడీబీఐ బ్యాంకు నిబంధనలు ఉల్లంఘించి కంపెనీకి రూ. 900 కోట్ల రుణం ఇవ్వడంపై సీబీఐ గతంలో కేసు నమోదు చేసింది. మాల్యా, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ రఘునాథన్‌తో పాటు ఐడీబీఐకి చెందిన కొందరు అధికారులపై ఈ కేసు నమోదైంది. కంపెనీకి నెగటివ్ రేటిం గ్ ఉన్నప్పటికీ, తొలిసారిగా అడగ్గానే అంత భారీ రుణాన్ని బ్యాంకు మంజూరు చేయడం వెనుక స్కామ్ ఉండొచ్చన్న సందేహాలు రేకెత్తించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై 2014లోనే ప్రాథమిక విచారణ చేపట్టిన సీబీఐ.. కంపెనీకి మిగతా బ్యాంకులు ఇచ్చిన రుణాలు మొండి బకాయిలుగా మారిన తరుణంలో కన్సార్షియం పరిధిని దాటి ఐడీబీఐ బ్యాంకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రుణం ఇవ్వాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. 2012 నుంచి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు పూర్తిగా నిల్చిపోయాయి. కంపెనీకి పలు దేశీ బ్యాంకులు రూ. 7,000 కోట్ల పైగా రుణాలు ఇచ్చాయి. -
ఐడీబీఐలో దిగిరానున్న కేంద్రం వాటా!
విక్రయానికి మార్గాల అన్వేషణ రెండు వారాల్లో 32% పెరిగిన షేర్ న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌లో వాటా తగ్గించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ మార్గాలు అన్వేషిస్తోంది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)తో సహా పలు మార్గాల ద్వారా వాటా విక్రయంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, అయితే ఈ ప్రయత్నాలన్నీ ప్రాథమిక దశలోనే ఉన్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2003లో పార్లమెంట్ ఆమోదించిన ఐడీబీఐ రద్దు చట్టం ద్వారా ఐడీబీఐ బ్యాంక్ ఏర్పాటైంది. అప్పటినుంచి ఈ సంస్థ బ్యాంక్‌గా, ఆర్థిక సేవల సంస్థగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ బ్యాంక్‌లో కేంద్రానికి ప్రస్తుతం 76.5 శాతం వాటా ఉంది. యాక్సిస్ బ్యాంక్ తరహాలో ఐడీబీఐలో వాటాను తగ్గించుకోవాలనుకుంటున్నట్లు గత నెలలో(సెప్టెంబర్ 21 సోమవారం) ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచనప్రాయంగా వెల్లడించారు. యాక్సిస్ బ్యాంక్‌లో కేంద్రానికి పరోక్షంగా 29.19 శాతం వాటా ఉంది. స్పెసిఫైడ్ అండర్‌టేకింగ్ ఆఫ్ ద యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(ఎస్‌యూయూటీఐ), ఎల్ఐసీ, మరో నాలుగు ఇతర ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఈ వాటా ఉంది. అయితే ప్రభుత్వ వాటా తగ్గింపు విషయమై కేంద్రం నుంచి తమకెలాంటి సమాచారం అందలేదని ఐడీబీఐ బ్యాంక్ స్టాక్ ఎక్స్చేంజీలకు నివేదించింది. బ్యాంక్ యూనియన్లు ప్రభుత్వ వాటా విక్రయ యోచనను వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వ వాటాను 52 శాతానికి తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నామని ఈ వారం ప్రారంభంలో అరుణ్ జైట్లీ వెల్లడించారు. షేరు దూకుడు... కాగా ప్రభుత్వ వాటా విక్రయ వార్తలతో ఐడీబీఐ బ్యాంక్ షేరు పరుగులు పెడుతోంది. గత నెల 18న రూ.60 వద్ద ముగిసిన ఈ షేర్ 2 వారాల్లో 32 % వృద్ధితో గురువారం రూ.79.40 వద్ద ముగిసింది. -
పీఎఫ్సీ, ఎన్టీపీసీలకు డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ కార్పొరేట్ అవార్డు
ప్రముఖ ఆర్థిక విశ్లేషణా సంస్థ డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్(డీఅండ్‌బీ) ప్రతిష్టాత్మక కార్పొరేట్ అవార్డులను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ)లు అందుకున్నాయి. గురువారం రాత్రి న్యూఢిల్లీలో డీఅండ్‌బీ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఈ ‘ఇండియా టాప్ పీఎస్‌యూ అవార్డు-2015’ను పీఎఫ్సీ తరఫున ఫైనాన్స్ డెరైక్టర్ ఆర్ నాగరాజన్, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ డీ రవి సంయుక్తంగా అందుకున్నారు. ఐడీబీఐ బ్యాంక్ మాజీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ రాజేందర్ మోహన్ మల్లా అవార్డును ప్రదానం చేశారు. అలాగే ఎన్టీపీసీకి లభించిన ఇండియా టాప్ పీఎస్‌యూ-2015 అవార్డును ఐడీబీఐ ఆర్ఎం మల్లా, డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ ఇండియూ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్.గంగూలీ చేతుల మీదుగా ఎన్టీపీసీ డెరైక్టర్(ఆపరేషన్స్) కేకే.శర్మ అవార్డును అందుకున్నారు. -
పీఎన్బీ, ఐడీబీఐ బ్యాంక్.. బేస్‌రేట్ కోత
న్యూఢిల్లీ: కనీస రుణ రేటు (బేస్ రేటు) తగ్గింపు బాటలో బుధవారం రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు- పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), ఐడీబీఐ బ్యాంక్‌లూ నడిచాయి. ఈ రేటును పావుశాతం తగ్గించాయి. దీనితో రెండు బ్యాంకులకు సంబంధించీ ఈ రేటు 10 శాతానికి తగ్గింది. పీఎన్బీ రేటు కోత మే 7 నుంచీ అమల్లోకి వచ్చింది. ఐడీబీఐ బ్యాంక్ తాజా బేస్‌రేటు మే 11 నుంచీ అమల్లోకి వస్తుంది. బ్యాంకుల నిర్ణయం వల్ల బేస్ రేటుతో అనుసంధానమయ్యే గృహ, వాహన ఇతర రుణాలపై వడ్డీరేట్లు (ఈఎంఐ) తగ్గే అవకాశం ఉంది. కాగా ఐడీబీఐ బ్యాంక్ తన రిటైల్ టర్మ్ డిపాజిట్ రేట్లనుకూడా కొన్ని మెచ్యూరిటీలపై 0.10 నుంచి 0.25 శాతం శ్రేణిలో తగ్గించింది. ఈ తాజా రేట్లు కూడా మే 11 నుంచీ అమల్లోకి వస్తాయి. రుణ రేటు తగ్గింపు డిపాజిట్ రేటు తగ్గింపునకూ సంకేతం. రిజర్వ్ బ్యాంక్ కీలక రెపో రేటు(బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 7.5%) తగ్గించి రుణ రేటు తగ్గింపునకు సంకేతాలు ఇచ్చినా... బ్యాంకింగ్ ఈ మేరకు నిర్ణయం తీసుకోకపోవడం ‘నాన్సెస్’ అంటూ గవర్నర్ రఘురామ్ రాజన్ ఏప్రిల్ 7 పాలసీ సమావేశం సందర్భంగా ఆగ్రహించిన నేపథ్యంలో పలు బ్యాంకులు రుణ రేట్లను తగ్గించడం ప్రారంభించాయి. ఇప్పటికే బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ, ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌సహా పలు బ్యాంకులు రుణ రేటును 0.15% నుంచి 0.25% వరకూ తగ్గించాయి. జనవరి నుంచీ ఆర్బీఐ కీలక పాలసీ రేటును రెండు దఫాలుగా పావుశాతం చొప్పున మొత్తం అరశాతం తగ్గించింది. -
బ్యాంకుల చైర్మన్ నియామక ప్రక్రియ షురూ!
న్యూఢిల్లీ: పలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్లను ఎంపికచేసే ప్రక్రియను ఆర్థిక మంత్రిత్వశాఖ చేపట్టింది. ఇందుకోసం పదవీ విరమణ చేసిన బ్యూరోక్రాట్స్, బ్యాంకర్లను గుర్తించే ప్రయత్నం ప్రారంభమైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ పోస్ట్‌ను విభజించాలన్న ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సిండికేట్ బ్యాంక్‌సహా ఎనిమిది బ్యాంకులకు ఈ నియామకాల అవసరం ఏర్పడిందని అధికార వర్గాలు తెలిపాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్‌కు కూడా చైర్మన్ నియామకాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల బ్యాంకుల్లో మాజీ బ్యాంకర్లు లేదా, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ నియామకాల సందర్భాల్లో ఎటువంటి ఇంటర్వ్యూలూ నిర్వహించడం జరగదని సమాచారం. ఐదు ప్రభుత్వ రంగ సీఈఓ, మేనేజింగ్ డెరైక్టర్ల నియామకాలకు అర్హులైన అభ్యర్థుల కోసం మంత్రిత్వశాఖ ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించింది. మంగళవారంతో ఇందుకు సంబంధించి గడువు ముగుస్తుంది. -
ఐడీబీఐతో బజాజ్ అలయంజ్ ఒప్పందం
ఖాతాదారులకు ప్రమాద బీమా రక్షణ కల్పించే విధంగా బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఐడీబీఐ బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకుంది. ఏడాదికి రూ. 12 ప్రీమియం చెల్లిస్తే ఖాతాదారులకు రూ.2 లక్షల ప్రమాద బీమా రక్షణ కల్పిస్తుంది. అందిరికీ బీమా రక్షణ కల్పించాలన్న ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద ఈ ఒప్పందాన్ని కుదర్చుకున్నట్లు ఐడీబీఐ తెలిపింది. -
ఐడీబీఐ మొబైల్ బ్యాంకింగ్ యాప్
హైదరాబాద్: ఐడీబీఐ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్‌ను ప్రారంభించింది. దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ద్వారా నిధుల బదిలీ, బిల్లుల చెల్లింపులు, మొబైల్/డీటీహెచ్ రీచార్జ్, లోన్లు, డిమ్యాట్, కరెంట్,ఫిక్స్డ్ /రికరింగ్ డిపాజిట్లు వివరాలు తదితర సేవలును పొందవచ్చు. వినియోగదారులతో 24 గంటలూ అనుసంధానమై ఉండటానికి ఈ అప్లికేషన్ తమకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఐడీబీఐ బ్యాంక్ సీఎండీ ఎం.ఎస్.రాఘవన్ అన్నారు. దీని ద్వారా వినియోగదారులు బ్యాంకింగ్ సేవలను ఎక్కడి నుంచైనా పొంద వచ్చని చెప్పారు. -
పీఎస్‌యూ బ్యాంక్‌కు తెలుగు సీఎండీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎనిమిది ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌ల ఎంపిక కోసం జరిగిన షార్ట్‌లిస్ట్‌లో తెలుగు వ్యక్తి పి.శ్రీనివాస్ ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ ఎనిమిది ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకు చీఫ్‌ల భర్తీకి సంబంధించి 10 మంది ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ల పేర్లను షార్ట్‌లిస్ట్ చేయగా అందులో బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పి.శ్రీనివాస్ ఒక్కరే తెలుగు ప్రాంతానికి చెందినవారు. ఈయనతో పాటు ఇదే బ్యాంకు లకు చెందిన మరో ఈడీ బీబీ జోషితో పాటు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఈడీలు ఎంకే జైన్, కేకే శాన్సీ, ఐడీబీఐ బ్యాంక్ డిప్యూటీ ఎండీ బీకే బాత్రా తదితరులు ఈ జాబితాలో ఉన్నట్లు సం బంధిత వర్గాలు తెలిపాయి. 1978లో ఆంధ్రాబ్యాంక్‌లో వృత్తిని ప్రారంభించిన శ్రీనివాస్ ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా ఈడీగా వ్యవహరిస్తున్నారు. ఏదో ఒక బ్యాంక్ సీఎండీగా శ్రీనివాస్ తప్పక ఎంపికవుతారని ప్రభుత్వ బ్యాంకింగ్ అధికారులు గట్టిగా విశ్వసిస్తున్నారు. ఈ పేర్లను ఆర్థిక మంత్రిత్వశాఖకు పంపినట్లు సమాచారం. ఈ నెలాఖరుకల్లా సీఎండీల భర్తీకి కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) పేర్లను ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నెల 14వ తేదీన జరిగిన ఇంట ర్వ్యూలకు 19 మంది హాజరయ్యారు. సీఎండీ స్థానాలు భర్తీ కావాల్సిన బ్యాంకుల్లో పీఎన్బీ, బీఓబీ, కెనరా బ్యాంక్, ఐఓబీ, ఓబీసీ, యునెటైడ్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్‌లు ఉన్నాయి. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ సీఎండీగా పనిచేసిన నగేష్ పైడా, 2012లో పదవీ విరమణ చేసినప్పటి నుంచి బ్యాంకు సీఎండీలుగా తెలుగు వాళ్లు లేరు. -
నేడు 8బ్యాంకుల సీఎండీ పోస్టులకు ఇంటర్వ్యూలు
న్యూఢిల్లీ: ఎనిమిది ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకుల సీఎండీ పోస్టుల భర్తీకి శుక్రవారం (నేడు) ఇంటర్వ్యూలు జరగనున్నాయి. మొత్తం 19 మంది అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకానున్నారు. ఇంటర్వ్యూలకు కేంద్రం ఇటీవల మూడు సబ్ కమిటీలను ఏర్పాటు చేసింది. మూడు కమిటీల సగటు మార్కుల వెయిటేజ్ ప్రాతిపదికన, ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని నియామకాల బోర్డ్ అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. అభ్యర్థుల జాబితాలో దేనా బ్యాంక్ సీఎండీ అశ్వనీ కుమార్, ఐడీబీఐ బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్ బీకే బాత్రా, ఆంధ్రాబ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎస్కే కల్రాలూ ఉన్నారు. ఇప్పటికే ఒక ప్రభుత్వ రంగ బ్యాంకుకు (దేనా బ్యాంక్) సీఎండీగా ఉన్న ఒక అధికారి, ఈ తరహా ఇంటర్వ్యూకు హాజరుకావడం ఇదే తొలిసారి. పైన పేర్కొన్న ముగ్గురి పేర్లూ విజిలెన్స్ క్లియరెన్స్ తరువాత చివరి నిముషంలో ఖరారయ్యాయి. మిగిలిన 16 మంది పేర్లూ ముందుగానే షార్ట్‌లిస్ట్ అయ్యాయి. బ్యాంకులు ఇవీ..: పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ , యునెటైడ్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్‌ల సీఎండీ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వచ్చే నెలలో విజయాబ్యాంక్ సీఎండీ పోస్ట్ కూడా ఖాళీ అవుతుంది. -
ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్(ఏపీజీవీబీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు: ఆఫీసర్(స్కేల్-3) జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ ఐటీ ఆఫీసర్ చార్టెడ్ అకౌంటెంట్ మార్కెటింగ్ ఆఫీసర్ అగ్రికల్చరల్ ఆఫీసర్ అర్హతలు: సంబంధిత విభాగంలో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ/పీజీ ఉండాలి. ఐబీపీఎస్ నిర్వహించిన ఆర్ఆర్బీస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పరీక్షలో అర్హత సాధించాలి. ఆఫీసర్ (స్కేల్-1) అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. ఐబీపీఎస్ సెప్టెంబరు 2013లో నిర్వహించిన ఆర్ఆర్బీస్ కామన్ రిటెన్ టెస్ట్‌లో అర్హత సాధించాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 16 వెబ్సైట్: http://ibpsregistration.nic.in సిడ్బీలో అసిస్టెంట్ మేనేజర్లు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సిడ్బీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టు: అసిస్టెంట్ మేనేజర్ విభాగం: జనరల్ స్ట్రీమ్ ఖాళీల సంఖ్య : 80 అర్హతలు: 60 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ/పీజీ ఉండాలి. సీఏ/ఐసీడబ్ల్యూఏ/ఎంబీఏ/ఇంజనీరింగ్/బ్యాంకింగ్/ బ్యాంకింగ్ డిప్లొమా/సీఎస్ అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 20 వెబ్సైట్: http://ibps.sifyitest.com/ ఐడీబీఐ బ్యాంక్ ఐడీబీఐ బ్యాంక్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టు: అసిస్టెంట్ మేనేజర్ విభాగం: జనరల్ స్ట్రీమ్ ఖాళీల సంఖ్య: 500 అర్హతలు: 60 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. వయసు: 26 ఏళ్లకు మించకూడదు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 12 వెబ్సైట్: www.idbi.com -
స్వల్ప ఉద్రిక్తత మినహా..సామూహిక ప్రార్థనలు ప్రశాంతం
పోలీసులపై అల్లరిమూక రాళ్ల దాడి రెండు వాహనాల ధ్వంసం శాలిబండ, న్యూస్‌లైన్: స్వల్ప ఉద్రిక్తత మినహా మక్కా మసీదులోశుక్రవారం సామూహిక ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రార్థనల అనంతరం బయటికి వచ్చిన కొందరు యువకులు నారే తక్బీర్ అంటూ నినాదాలు చేస్తూ మక్కా మసీదు ముందు గుమిగూడారు. వారిని పో లీసులు అక్కడి నుంచి చెదరగొట్టారు. దీంతో వారు మొఘల్‌పురా ఫైర్ స్టేషన్ వైపు వెళ్లి.. నినాదాలు చేస్తూ పోలీసులపై రాళ్లు రువ్వారు. రెచ్చిపోయిన ఆ అల్లరిమూక రోడ్లపై ఉన్న రెండు వాహనాలను ధ్వంసం చేసింది. అక్కడి నుంచి గుంపులుగా బయలుదేరి ఆస్రా ఆసుపత్రి ముందున్న ఐడీబీఐ బ్యాంక్ అద్దాలను పగులగొట్టారు. దీంతో చార్మినార్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పోలీ సులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా, ఏం జరుగుతుందోనన్న భయంతో వ్యా పారులు తమ దుకాణాలను మూసివేశారు. ఎమ్మెల్యే అటుగా రావడంతో... సామూహిక ప్రార్థనల అనంతరం యువకులు బయటకు వచ్చారు. అదే సమయంలో మక్కా మసీదు వైపు చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వాహనం వచ్చింది. ఓవైపు ఎన్నికల కౌంటింగ్ జరుగుతుండటం, ఎంఐఎం హై దరాబాద్ ఎంపీ అభ్యర్థి మొదటి రౌండ్లో వె నుకబడటంతో నిరాశకు గురైన ఆ యువకులు నారే తక్బీర్ అంటూ నినాదాలు చేస్తూ గుమిగూడరు. దీంతో అక్బరుద్దీన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం యువకులు మొఘల్‌పురా వైపు వెళ్తూ రాళ ్ల దాడికి పాల్పడ్డారు. ప్రార్థనలకు గట్టి బందోబస్తు... కిషన్‌బాగ్‌లో ఘర్షణలు, ఎన్నికల కౌంటింగ్‌ను దృష్టిలో పెట్టుకొని శుక్రవారం మక్కా మసీదు లో జరిగిన సామూహిక ప్రార్థనలకు దక్షిణ మండలం పోలీసులు బీఎస్ఎఫ్, ఆర్ఏఎఫ్, టాస్క్‌ఫోర్స్, ఏపీఎస్పీ, స్థానిక పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు. నగర అదనపు కమిషనర్ అంజనీ కుమార్, దక్షిణ మం డలం డీసీపీ ఎస్ఎస్ త్రిపాఠీ బందోబస్తును పర్యవేక్షించారు. కాగా, ఐడీబీఐ బ్యాంక్ అద్దాల ను అల్లరి మూకలు ధ్వంసం చేసిన ఘటనపై హుస్సేనీ ఆలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఐడీబీఐ బ్యాంక్ డిపాజిట్ల రేట్ల సవరణ
ముంబై: ఐడీబీఐ బ్యాంక్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను మంగళవారం సవరించింది. సవరించిన రేట్లు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయి. దీర్ఘకాల టర్మ్ డిపాజిట్లపై రేట్లను అర శాతం పెంచామని, కొన్ని టర్మ్ డిపాజిట్లపై రేట్లను పావు శాతం తగ్గించామని బ్యాంకు తెలియజేసింది. దీని ప్రకారం 7 నుంచి 10 ఏళ్ల డిపాజిట్లపై వడ్డీ రేట్లను 9 శాతానికి పెంచుతున్నారు. 5-7 ఏళ్ల డిపాజిట్లపై వడ్డీరేట్లను 8.75 శాతం నుంచి 9 శాతానికి పెంచారు. 501 రోజుల నుంచి 5 ఏళ్ల లోపు అన్ని కాల పరిమితుల డిపాజిట్లపై ఒకే వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నామని, వీటిపై 9% వడ్డీనిస్తామని బ్యాంకు వివరించింది. గతంలో ఈ సెగ్మెంట్లో మూడు రకాల వడ్డీరేట్లు ఉండేవి. 500 రోజుల డిపాజిట్లపై చెల్లిస్తున్న వడ్డీరేటును 9.40% నుంచి 9.30 శాతానికి (0.10%)తగ్గించామని ఐడీబీఐ బ్యాంక్ వెల్లడించింది. -
క్విప్ ఇష్యూలకు బ్యాంకులు రెడీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలు స్టేట్‌బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ సహా పలు బ్యాంకులు అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్)ని చేపట్టనున్నాయి. తద్వారా రూ. 15,000 కోట్లకుపైగా పెట్టుబడులను సమీకరించాలని భావిస్తున్నాయి. క్విప్ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధపడుతున్న జాబితాలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ), దేనా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ సైతం ఉన్నాయి. ఈ బాటలో మరికొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు నిధుల సమీకరణకు వీలుగా ఆయా బోర్డుల అనుమతిని కోరనున్నాయి. రానున్న జనవరి-మార్చి క్వార్టర్లో క్విప్ ద్వారా స్టేట్‌బ్యాంక్ రూ. 9,576 కోట్లను సమీకరించాలని ప్రణాళికలు వేసింది. ఇందుకు ఇప్పటికే ప్రభుత్వ అనుమతిని కూడా పొందింది. ఇక ఐడీబీఐ బ్యాంక్ రూ. 1,200 కోట్లను, దేనా బ్యాంక్ రూ. 800 కోట్లను సమీకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇదే విధంగా షేర్ల అమ్మకం ద్వారా ఐవోబీ రూ. 350 కోట్లు, అలహాబాద్ బ్యాంక్ రూ. 320 కోట్లను అందుకోవాలని చూస్తున్నాయి. కాగా, 2013లో క్విప్‌ల ద్వారా దేశీయ కంపెనీలు రూ. 12,000 కోట్లను సమీకరించాయి. -
మొండి బకాయిల బండ
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో 40 లిస్టెడ్ బ్యాంకుల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) ఏకంగా 38 శాతం ఎగిసి రూ. 1,28,533 కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి ఈ మొత్తం రూ. 93,109 కోట్లు. కాగా, ప్రతి త్రైమాసికానికి పరిస్థితులు క్షీణిస్తుండటంతో ఈ ఆర్థిక సంవత్సరాంతానికి ఇది రూ. 1.5 లక్షల కోట్ల మార్కును దాటేయగలదని అంచనా. ఎన్పీఏసోర్స్డాట్కామ్ అనే పోర్టల్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 40 లిస్టెడ్ బ్యాంకు ల్లో 14 బ్యాంకుల నికర ఎన్పీఏలు 50% పైగా ఎగిశాయి. అయితే, మొత్తం ఎన్‌పీఏల్లో టాప్ 10 బ్యాంకుల వాటా 70% నుంచి 67.8 శాతానికి తగ్గింది. సెప్టెంబర్ త్రైమాసికం ఆఖరు నాటికి స్థూల ఎన్పీఏలు మార్చి క్వార్టర్‌తో పోలిస్తే 27% ఎగిసి రూ. 2,29,007 కోట్లకు పెరిగినట్లు పోర్టల్ సీఎండీ దేవేంద్ర జైన్ తెలిపారు. మార్చి త్రైమాసికంలో ఇది రూ.1,79,891 కోట్లు. 2011 సెప్టెంబర్ నుంచి చూస్తే లిస్టెడ్ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు రెట్టింపు కాగా నికర ఎన్పీఏలు మాత్రం 140% పెరిగాయి. -
ఎస్బీఐ పండుగ ధమాకా
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొన్ని రుణాలపై వడ్డీరేట్లను తగ్గించింది. కారు, వినియోగ వస్తువులపై వడ్డీరేట్లను తగ్గించడంతోపాటు, ప్రాసెసింగ్ ఫీజులను సైతం తగ్గించాలని నిర్ణయించింది. పండుగ సీజన్లో రుణ డిమాండ్‌ను ఆకర్షించడంలో భాగంగా బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఐఓబీ, దేనా బ్యాంకులు కూడా ఇదే బాటలో నడిచాయి. ఇప్పటికే పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ), ఐడీబీఐ బ్యాంక్‌లు ఆటోమొబైల్స్సహా టెలివిజన్లు, ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్ల వంటి వినియోగ వస్తువులపై ప్రత్యేక వడ్డీరేట్లను ఆఫర్ చేశాయి. తాజా నిర్ణయంతో ఎస్బీఐ కూడా ఈ జాబితాలో చేరింది. తగ్గింపు ఇలా...: బ్యాంకింగ్ దిగ్గజం రేట్ల తగ్గింపు విషయానికి వస్తే- కారు రుణాలపై వడ్డీరేటు 0.20 శాతం తగ్గింది. 10.55 శాతానికి చేరింది. ప్రాసెసింగ్ ఫీజు రుణ మొత్తంలో 0.51 శాతం తగ్గించింది. అంటే కనీస ప్రాసెసింగ్ ఫీజు రూ.1,020 నుంచి రూ.500 ఫ్లాట్ రేట్‌కు తగ్గుతుంది. వేతన జీవులకు ప్రత్యేకం తన బ్యాంకులో వేతన అకౌంట్లు ఉన్న ఖాతాదారులకు సంబంధించి వినియోగ వస్తువులు, కారు, ద్విచక్ర వాహనాల కొనుగోళ్ల విషయంలో కూడా ప్రత్యేక పండుగల రుణ పథకాలను బ్యాంక్ ఆవిష్కరించింది. ఈ ఆఫర్ కింద పలు డిస్కౌంట్లు లభించనున్నాయి. 12.05 శాతం నుంచి వడ్డీరేట్లపై రుణ లభ్యత అందుబాటులో ఉంటుంది. ఇందుకు సంబంధించి ‘ఉత్సవ్ కీ ఉమంగ్ ఎస్బీఐ కీ సంగ్’ ఆఫర్ అక్టోబర్ 7 నుంచి 31 జనవరి 2014 వరకూ అందుబాటులో ఉంటుంది. నేపథ్యం ఇదీ...: కొన్ని రంగాలలో డిమాండ్ పెంపు లక్ష్యంగా కొంత తక్కువ రేటుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు రుణాలను మంజూరు చేయాలని, ఇందుకు తగిన పెట్టుబడులను ప్రభుత్వం బ్యాంకులకు పంప్ చేయాలని కేంద్రం గతవారం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే పలు బ్యాంకులు ఈ దిశలో అడుగులు వేస్తున్నాయి. ఆర్థిక మంత్రి పీ చిదంబరం, ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అరవింద్ మాయారాం మధ్య ఇటీవల జరిగిన సమావేశం ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకుంది. ‘బడ్జెట్లో పేర్కొన్న రూ.14,000 కోట్ల కన్నా ఎక్కువగా, బ్యాంకులకు కావాల్సినంత మూలధన నిధులు సమకూర్చాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. ఈ చర్య మందగమనాన్ని ఎదుర్కొనేందుకు, ఉత్పత్తిని పెంచేందుకు కూడా దోహదపడగల దని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవలి పారిశ్రామికోత్పత్తి గణాంకాల ప్రకారం కన్సూమర్ డ్యూరబుల్స్ రంగం గతేడాది జూలైతో పోలిస్తే ఈసారి జూలైలో 9.3 శాతం మేర క్షీణించింది. గతేడాది ఏప్రిల్-జూలై మధ్యకాలంలో 6.1 శాతం వృద్ధి ఉండగా.. ఈసారి అదే వ్యవధిలో ఏకంగా 12 శాతం క్షీణించింది. కార్ల కొనుగోళ్లు సైతం గణనీయంగా పడిపోయాయి. కాగా ఈ ప్రణాళికలను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి వ్యతిరేకిస్తున్నారు. ఇవి బ్యాంకుల అసెట్ క్వాలిటీపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని ఆయన ఇప్పటికే వ్యక్తం చేశారు. ఐవోబీ కూడా... వినియోగ వస్తువులపై రుణ రేట్లను ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) కూడా 2% వరకూ తగ్గించింది. దీనితో ఈ రేటు 13.25%కి తగ్గింది. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. వేతన జీవులు వినిమయ వస్తువుల కొనుగోళ్లకు సంబంధించి ఒక కొత్త వ్యక్తిగత రుణ పథకాన్ని కూడా ఆవిష్కరించినట్లు బ్యాంక్ తెలిపింది. దేనాబ్యాంక్ కాంబో లోన్ ప్లాన్... దేనాబ్యాంక్ కూడా కొన్ని విభాగాలకు సంబంధించి వడ్డీరేట్లను తగ్గించింది. కోటి రూపాయల వరకూ గృహ రుణాలపై వడ్డీరేట్లను బేస్‌రేట్ 10.25%గా నిర్ణయించినట్లు తెలిపింది. ఆపైన ఈ రేటు 10.50%గా ఉంటుంది. హౌసింగ్ లోను తీసుకున్న వారికి కాంబో ప్లాన్‌గా కార్, కన్జూమర్ డ్యూరబుల్స్ రుణాన్ని కూడా అందచేస్తామని పేర్కొంది. కాంబోప్లాన్లోని కార్ రుణానికి బేస్ రేట్ వర్తిస్తుంది. వినియోగ వస్తువులపై రుణ రేటు 11.75%గా ఉంది. కాగా కాంబో ఆఫర్‌తో సంబంధం లేకుండా కార్రుణంపై రేటును 1% తగ్గించింది. దీనితో ఈ రేటు 11%కి చేరింది. -
రుణాలపై వడ్డీ రేట్ల ఊరట..
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ), ఐడీబీఐలు వినియోగ వస్తువులు, వాహన రుణాలపై వడ్డీరేట్లను 2.50% దాకా తగ్గించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరిన్ని రుణాలిస్తామన్న ప్రభుత్వ హామీతో ఈ బ్యాంకులు వడ్డీరేట్లలో కోత విధించాయని, త్వరలో ఎస్బీఐ కూడా ఇదే బాట పట్టనున్నదని నిపుణులంటున్నారు. పండుగ సీజన్లో రుణాలిచ్చి కొనుగోళ్ల ద్వారా ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు అందించడానికి ప్రభుత్వం ఈ నిధులను అందిస్తోంది. 100% పీఎన్బీ రుణం : కారు కొనుగోళ్లకు 10.65% వడ్డీరేట్లకే రుణాలందిస్తామని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) పేర్కొంది. టూ-వీలర్ల రుణాలపై వడ్డీరేట్లను 12.25%కి, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేట్లను 12.75 శాతానికి తగ్గించామని వివరించింది. మొత్తం మీద వడ్డీరేట్లను 1-2.50% మేర తగ్గించామని పేర్కొంది. కారు రుణాలపై ఎలాంటి డాక్యుమెంటేషన్ చార్జీలు వసూలు చేయబోమని, ఎక్స్‌షోరూమ్ ధరపై 100% రుణమందిస్తామని పేర్కొంది. ఈ ఆఫర్లు వచ్చే ఏడాది జనవరి 31 వరకూ అందుబాటులో ఉంటాయని పీఎన్బీ పేర్కొంది. అయితే గృహ రుణాల రేట్లలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. ఓబీసీ కూడా: వినియోగ వస్తువులు, వ్యక్తిగత, వాణిజ్య వాహన రుణాలపై వడ్డీరేట్లను 0.25 శాతం తగ్గిస్తున్నామని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) మంగళవారం తెలిపింది. ఈ వడ్డీరేట్ల తగ్గింపు రేపటి(గురువారం) నుంచి అమల్లోకి వస్తుందని వివరించింది. ఫోర్ వీలర్ల కొనుగోళ్లకు ఇచ్చే రుణాలపై వడ్డీరేట్లను 12.25% నుంచి 12 శాతానికి తగ్గిస్తున్నామని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే వ్యక్తిగత, వినియోగ వస్తువుల రుణాలపై వడ్డీరేట్లను 12.75% నుంచి 12.50 శాతానికి తగ్గించామని వివరించింది. కార్లు, టూ-వీలర్ల రుణాలకు సంబంధించి మూడేళ్లలో చెల్లించే రుణాలపై 10.75%, మూడేళ్లకు మించిన రుణాలపై 11% వడ్డీ రేట్లకే రుణాలను ఆఫర్ చేస్తున్నామని పేర్కొంది. బేస్రేట్కే ఐడీబీఐ రుణం కొత్తగా గృహ, వాహన రుణాలు తీసుకునే వారికి బేస్ రేట్‌కే(10.25 శాతం) రుణాలందిస్తామని ఐడీబీఐ పేర్కొంది. ఇది నేటి నుంచే వర్తిస్తుందని వివరించింది. ఈ రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేయబోమని వివరించింది. గృహ రుణాల రేట్లు అంతే..: ఎస్బీఐ కారు, కన్జూమర్ గూడ్స్ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది కానీ గృహ రుణాలపై మాత్రం తగ్గించే అవకాశాలే లేవని ఎస్బీఐ ఎండీ(ఇంచార్జ్) ఎ. కృష్ణకుమార్ స్పష్టం చేశారు. గృహ రుణాల వడ్డీ రేట్లు ఇప్పటికే చాలా కనిష్ట స్థాయిలోనే ఉన్నాయని ఆయన చెప్పారు. రిటైల్ రుణాల వడ్డీ రే ట్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి కొన్ని సూచనలు వచ్చాయని, రాబోయే నెలల్లో వీటి అమలుపై దృష్టి సారిస్తామన్నారు. ఇప్పటికే ఉన్న ఉత్పత్తులపైనే వడ్డీ రేట్ల తగ్గింపు ఉండగలదే తప్ప కొత్త వాటిని జాబితాలో చేర్చే యోచనేమీ లేదని కృష్ణకుమార్ చెప్పారు. -
6 బ్యాంకులపై జరిమానా
ముంబై: ఖాతాదారుల వివరాల సేకరణ (కేవైసీ), మనీలాండరింగ్ నిరోధక నిబంధనల ఉల్లంఘనకు గాను ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ రూ. 6.5 కోట్ల జరిమానా విధించింది. ఈ జాబితాలో ఐడీబీఐ బ్యాంక్, దేనా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కార్పొరేషన్ బ్యాంక్ ఉన్నాయి. ఇందులో దేనా బ్యాంక్‌పై అత్యధికంగా 2 కోట్ల జరిమానా విధించగా.. అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలకు చెరి రూ. 50 లక్షల పెనాల్టీ పడింది. ఖాతాలు, అంతర్గతంగా పాటించే విధానాలు మొదలైనవి పరిశీలించిన మీదట ఆయా బ్యాంకులు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు రుజువైనట్లు ఆర్బీఐ పేర్కొంది. ఇదే అంశంలో ఎస్బీఐ, ఐసీఐసీఐ సహా 25 బ్యాంకులపై ఆర్బీఐ ఇప్పటికే జరిమానా విధించింది. మరోవైపు, కొత్త చెక్ క్లియరెన్స్ విధానానికి (సీటీఎస్) సంబంధించి న్యూఢిల్లీ, చెన్నై, ముంబైలోని సెంటర్లు ఒకే విధమైన సెలవులను పాటించాలని ఆర్బీఐ ఆదేశించింది. వివిధ రాష్ట్రాల్లో సెలవు దినాలు వివిధ రకాలుగా ఉన్న నేపథ్యంలో .. ఈ విధానం వల్ల సీటీఎస్ సజావుగా అమలు కాగలదని తెలిపింది. -
వేలానికి డీసీ ట్రేడ్‌మార్క్‌లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తామిచ్చిన రుణాలను వసూలు చేసుకునేందుకు డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్‌కు(డీసీహెచ్ఎల్) చెందిన ఆస్తులను విక్రయించడంపై బ్యాంకులు దృష్టిసారించాయి. ఇందులో భాగంగా డీసీహెచ్ఎల్కు చెందిన డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి, ఏషియన్ ఏజ్, ఫైనాన్షియల్ క్రానికల్ ట్రేడ్ మార్క్‌లను విక్రయించాలని ఐడీబీఐ బ్యాంక్ నిర్ణయించింది. ఈ ట్రేడ్ మార్క్‌లను దక్కించుకోవడానికి ఆసక్తి ఉన్న సంస్థలు బిడ్డింగ్‌లో పాల్గొనవవచ్చని ఐడీబీఐ బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ నాలుగు ట్రేడ్ మార్క్‌లను తనఖా పెట్టుకొని 2011లో ఐడీబీఐ బ్యాంకు రూ.250 కోట్ల రుణాన్ని డీసీహెచ్ఎల్కు మంజూరు చేసింది. ఆ మొత్తం వడ్డీతో కలిసి రూ. 297 కోట్లకు చేరింది. ఈ రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో ఈ ట్రేడ్ మార్క్‌లను ఇతరులకు విక్రయించాలని ఐడీబీఐ బ్యాంకు నిర్ణయించింది. అధిక ధర ఆఫర్ చేసే వారికి వీటిని విక్రయించనున్నట్లు బ్యాంకు అధికారులు పేర్కొన్నారు. డీఆర్టీలో పిటిషన్ ఇదిలా ఉండగా, డీసీహెచ్ఎల్ తీసుకున్న రుణం మొత్తాన్ని వడ్డీతో సహా రాబట్టుకునేందుకు వీలుగా ఆ సంస్థకు చెందిన నాలుగు ట్రేడ్‌మార్క్‌లను వేలం వేసేందుకు అనుమతించాలని కోరుతూ ఐడీబీఐ బ్యాంకు ముంబై శాఖ రుణ వసూళ్ల ట్రిబ్యునల్ (డీఆర్టీ)ను ఆశ్రయించింది. ఈ మేరకు మంగళవారం డీఆర్టీలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ఒకటి రెండు రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది.