వెలుగులోకి మరో బ్యాంకు కుంభకోణం | IDBI Bank Discloses Rs 772 crore Loan Fraud, Sends Shares Falling | Sakshi
Sakshi News home page

వెలుగులోకి మరో బ్యాంకు కుంభకోణం

Published Wed, Mar 28 2018 2:56 PM | Last Updated on Mon, Aug 13 2018 8:03 PM

IDBI Bank Discloses Rs 772 crore Loan Fraud, Sends Shares Falling - Sakshi

ముంబై : మరో ప్రభుత్వ రంగ బ్యాంకు కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ రంగానికి చెందిన ఐడీబీఐ బ్యాంకు లిమిటెడ్‌లో రూ.772 కోట్ల విలువైన మోసపూరిత రుణాలు జారీ అయినట్టు వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన ఐదు బ్రాంచుల్లో ఈ కుంభకోణం చోటు చేసుకుందని రాయిటర్స్‌ రిపోర్టు చేసింది. రిపోర్టు ప్రకారం ఈ మోసపూరిత రుణాలు 2009 నుంచి 2013 వరకు కాలంలో ఫిష్‌ ఫామింగ్‌ బిజినెస్‌దారులకు జారీ అయినట్టు తెలిసింది. చేపల చెరువుల నకిలీ అద్దె పత్రాలతో వీరు మోసపూరిత రుణాలు పొందినట్టు బ్యాంకు గుర్తించింది.

ఐడీబీఐ ఈ కుంభకోణ వివరాలను బయటికి వెల్లడించగానే, బ్యాంకు షేర్లు 3.5 శాతం కిందకి పడిపోయి రూ.73.6గా నమోదవుతున్నాయి. పబ్లిక్‌ రంగ బ్యాంకుల నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు ఇండెక్స్‌ కూడా 1.8 శాతం క్షీణించింది. తమ ఉద్యోగుల్లో ఇద్దరు ఈ రుణాల జారీ ప్రక్రియలో తప్పిదాలు చేసినట్టు ఐడీబీఐ తెలిపింది. వీరిలో ఒక అధికారిపై బ్యాంకు వేటు వేయగా.. మరో అధికారి ఇప్పటికే పదవీ విరమణ అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement