bank fraud
-
బ్యాంకులో రూ.558 కోట్ల దొంగతనం!
ఖాతాదారులకు చెందిన సేఫ్ డిపాజిట్ బాక్స్‌ల నుంచి ఒక బిలియన్ యెన్ (సుమారు 6.6 మిలియన్ డాలర్లు-రూ.558 కోట్లు) సొమ్మును బ్యాంకు ఉద్యోగి దొంగలించినట్లు జపాన్‌లోని ప్రముఖ బ్యాంకు మిత్సుబిషి యుఎఫ్‌జే ఫైనాన్షియల్ గ్రూప్ తెలిపింది. అందుకుగాను అధికారికంగా కస్టమర్లకు క్షమాపణలు చెప్పింది. 60 మంది క్లయింట్ల్లో సుమారు 20 మంది ఖాతాల్లో నుంచే 300 మిలియన్ యెన్ (దాదాపు 2 మిలియన్ డాలర్లు-రూ.169 కోట్లు) వరకు దొంగతనాలు జరిగినట్లు ధృవీకరించింది. కస్టమర్లు కోల్పోయిన నగదు పరిహారం కోసం కసరత్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: కొత్త సార్ ముందున్న సవాళ్లు!ఎంయూఎఫ్‌జీ ప్రెసిడెంట్, సీఈఓ జునిచి హంజావా విలేకరులతో మాట్లాడుతూ..‘టోక్యోలోని మిత్సుబిషి యుఎఫ్‌జే ఫైనాన్షియల్ గ్రూప్ బ్యాంకు శాఖల్లో ఈ దొంగతనాలు జరిగాయి. ఏప్రిల్ 2020 నుంచి ఈ సంవత్సరం అక్టోబర్ చివరి వరకు ఈమేరకు ఫ్రాడ్ జరిగినట్లు గుర్తించాం. సేఫ్ డిపాజిట్ బాక్స్‌లను ఓ మహిళా ఉద్యోగి నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన కీ తనవద్దే ఉంటుంది. ఆ ఉద్యోగి డబ్బు తీసుకున్నట్లు, ఇతర పెట్టుబడులు, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించినట్లు అంగీకరించింది. వెంటనే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించి విచారణ కోసం పోలీసులకు ఫిర్యాదు చేశాం. జరిగిన దొంగతనానికి క్షమాపణలు కోరుతున్నాం. నగదు నష్టపోయిన కస్టమర్లకు పరిహారం చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని చెప్పారు. -
బ్యాంకు మోసాల దర్యాప్తునకు చర్యలు
బ్యాంకు మోసాలకు సంబంధించిన కేసులను మరింత సమర్థంగా, వేగంగా దర్యాప్తు చేసేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మధ్య పరస్పరం సహకారాన్ని పెంపొందించేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేసులకు సంబంధించి ప్రత్యేకంగా ఈ సంస్థల మధ్య సాధారణ చర్చల కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయడానికి మంత్రిత్వశాఖ అంగీకరించింది.ప్రత్యేక వేదిక ఏర్పాటు..?బ్యాంకు మోసాలపై సీబీఐలో చాలా కేసులు నమోదవుతున్నాయి. వాటి దర్యాప్తులో అవసరమయ్యే కీలక సమాచారాన్ని బ్యాంకర్లు అందించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు పూర్తి సమాచారం అందించేందుకు నిబంధనలు అడ్డుగా ఉంటాయి. అయితే ఎలాంటి కేసుల్లో ఎలాంటి సమాచారం అందించాలనే విషయంపై స్పష్టత వచ్చేందుకు సీబీఐ, బ్యాంకర్లు పరస్పరం చర్చించాల్సి ఉంది. అందుకు ఒక వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.కేసులు త్వరగా పరిష్కారం అయ్యేలా..కేసులకు సంబంధించి సీబీఐ చేసిన అభ్యర్థనలను బ్యాంకర్లు పరిశీలించనున్నారు. బ్యాంకర్లు ఇచ్చిన సమాచారంపై భవిష్యత్తులో కస్టమర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సీబీఐ నుంచి బ్యాంకర్లకు రక్షణ ఉంటుందని కొందరు అధికారులు తెలిపారు. సీబీఐ, బ్యాంకర్ల మధ్య పరస్పరం సహకారం వల్ల ఫిర్యాదుల దాఖలుకు సంబంధించిన కార్యాచరణ అంశాలు, దర్యాప్తును క్రమం తప్పకుండా సమీక్షించడం, ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ సులువవడం వల్ల త్వరగా కేసులు పరిష్కారం అవుతాయని అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: 1,319 కిలోల బంగారం, 8,223 కిలోల డ్రగ్స్ స్వాధీనం!అనుమతుల్లేక కేసులు పెండింగ్2018లో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17Aలో చేసిన సవరణ ప్రకారం.. బ్యాంక్ మేనేజ్మెంట్ ఆమోదించిన తర్వాతే బ్యాంకు మోసాలపై దర్యాప్తు ఏజెన్సీ ఉద్యోగులను విచారించే అధికారం ఉంటుంది. పీఎస్‌యూ బ్యాంకులకు, ప్రైవేట్ బ్యాంకులకు ఈ నిబంధనలు వేర్వేరుగా ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంకుల్లోనూ దర్యాప్తు సంస్థలు నేరుగా ఇన్వెస్ట్‌గేషన్ చేయాలంటే చట్టం ప్రకారం వారి యాజమాన్యం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. తాజా సమావేశంలో ఈ అంశంపై చర్చించినట్లు కొందరు అధికారులు తెలిపారు. గత ఏడాది కాలంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), విజిలెన్స్ కమిషన్ వంటి ఏజెన్సీలకు బ్యాంకు యాజమాన్యాలు తమ ఉద్యోగులపై విచారణకు అనుమతి ఇవ్వనందున వందలాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఫిర్యాదు చేశాయి. -
సైబర్ మోసాలు.. రూ.177 కోట్ల నష్టం
టెక్నాలజీ పెరుగుతోంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడకం ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో సైబర్ మోసాలు అధిమవుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో డెబిట్/ క్రెడిట్‌కార్డు - ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో జరిగిన సైబర్ మోసాల వల్ల ప్రజలు రూ.177 కోట్లు నష్టపోయినట్లు ప్రభుత్వం తెలిపింది.2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టం రూ.69.68 కోట్లుగా ఉందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. 2021-22లో ఇది రూ.80.33 కోట్లు, 2020-21లో రూ.50.10 కోట్లు, 2019-20లో రూ.44.22 కోట్లుగా ఉందని చెప్పారు. అనధికార లావాదేవీలు జరిగినపుడు బ్యాంకులు స్పందించి చర్యలు తీసుకునేంత వరకు కస్లమర్లే దీనికి బాధ్యత వహించాలి. ఈ లావాదేవీల వల్ల కలిగే నష్టాన్ని పరిమితం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాలు జారీ చేసింది. ఏదైనా అనధికార లావాదేవీలు జరిగిన మూడు పనిదినాల్లోగా సంఘటనను రిపోర్ట్ చేయాలి. అలాంటి ట్రాన్సాక్షన్స్‌కు సాంకేతికలోపం కారణమని రుజువైతే దానికి బ్యాంకులే బాధ్యత వహిస్తాయి. ఏదేమైనా అనధికార లావాదేవీలు జరిగినట్లు గుర్తిస్తే వెంటనే బ్యాంకు దృష్టికి తేవాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: మూడు నెలల్లో రూ.60 లక్షల కోట్లు లావాదేవీలు -
26 ట్రంక్ పెట్టెల్లో 3.3 లక్షల పత్రాలు..736 మంది సాక్షులు!
బ్యాంకింగ్ రంగంలోనే అతిపెద్ద కుంభకోణంగా పరిగణించే దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్(డీహెచ్ఎఫ్ఎల్) కేసు పరిష్కారానికి ఢిల్లీ హైకోర్టు స్పెషల్ సీబీఐ కోర్టును నియమించింది. రూ.34,614 కోట్లు కుంభకోణానికి సంబంధించి సీబీఐ చేసిన దర్యాప్తులో 3,30,000 పేజీల రిపోర్ట్‌ను తయారు చేశారు. ఈ కేసులో 108 మంది నిందితులు, 736 మంది సాక్షులున్నారని తెలిపారు. దాంతో కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ఢిల్లీ హైకోర్టు స్పెషల్ సీబీఐ కోర్టుకు సిఫారసు చేసింది. ఈమేరకు ఆగస్టు 1న ప్రత్యేకంగా ఈ కేసు కోసమే సీబీఐ కోర్టును ఏర్పాటు చేసి, న్యాయమూర్తిని నియమించింది. దీనివల్ల కేసు త్వరగా పరిష్కారమవుతుందని పేర్కొంది.ఢిల్లీ హైకోర్టు తెలిపిన వివరాల ప్రకారం..‘డీహెచ్ఎఫ్ఎల్ కుంభకోణం కేసుకు సంబంధించి సీబీఐ కోర్టు జడ్జి అశ్వనీ కుమార్ సర్పాల్ ఏప్రిల్ 27న న్యాయపరమైన ఉత్తర్వులను జారీ చేశారు. అందులో ఈ కేసు విచారణకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. సీబీఐ 26 ట్రంక్పెట్టెల్లో 3,30,000 పేజీల పత్రాలను దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రధాన ఛార్జిషీట్, అనుబంధ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం మొత్తం 108 మంది నిందితులు ఉన్నారని తెలిపారు. ఈ కేసులో నిజాలు నిరూపించడానికి 736 మంది సాక్షులున్నట్లు పేర్కొన్నారు. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని త్వరగా పరిష్కారం అయ్యేలా స్పెషల్ కోర్టును ఏర్పాటు చేస్తున్నాం’ అని తెలిపింది.అసలేంటీ కేసు..2010-18 మధ్య యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో 17 బ్యాంకుల కన్సార్షియం డీహెచ్ఎఫ్ఎల్కు రూ.42,871 కోట్ల విలువైన రుణాలను ఇచ్చింది. వీటిని తిరిగి చెల్లించడంలో విఫలమైనందుకు యూనియన్ బ్యాంక్ సీబీఐను ఆశ్రయించింది. సంస్థ ప్రమోటర్లుగా ఉన్న కపిల్, ధీరజ్‌లు నిజాల్ని కప్పిపుచ్చుతూ.. విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని, 2019 మే నుంచి రుణ చెల్లింపులను ఎగవేస్తూ రూ.34,614 కోట్ల మేర ప్రజా ధనాన్ని మోసం చేశారని బ్యాంకు ఆరోపించింది. డీహెచ్ఎఫ్ఎల్ ఖాతా పుస్తకాల ఆడిట్‌లోనూ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, నిధులు మళ్లించారని చెప్పింది. ఫలితంగా కపిల్, ధీరజ్‌లు సొంత ఆస్తులు పెంచుకున్నారని.. ఇదంతా ప్రజా ధనంతో చేశారని పేర్కొంది.ఇదీ చదవండి: రూ.652 కోట్లతో మొండి బాకీల కొనుగోలు!డీహెచ్ఎఫ్ఎల్ మోసాలు 2019 జనవరి నుంచి వెలుగులోకి రావడం మొదలైంది. ఈ సంస్థ నిధులు మళ్లిస్తోందంటూ ప్రసార మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. డీహెచ్ఎఫ్ఎల్పై ‘ప్రత్యేక ఆడిట్’ నిర్వహించాలంటూ బ్యాంకులు కేపీఎమ్‌జీ ఆడిట్ సంస్థను నియమించాయి. కపిల్, ధీరజ్ వాధ్వాన్లు దేశం విడిచిపెట్టకుండా ఉండేందుకు 2019 అక్టోబరు 18న ‘లుక్అవుట్ సర్క్యులర్’లను జారీ చేశాయి. -
బ్యాంకును మోసగించిన కేసులో కాంగ్రెస్ నేత అరెస్టు
సాక్షి, హైదరాబాద్: బ్యాంక్ ఖాతాదారునికి తెలియకుండా రూ.40 కోట్లు కాజేసిన కేసులో ఇద్దరు బ్యాంక్ మేనేజర్లతో సహా కాంగ్రెస్ నాయకుడు షేక్ బషీద్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. బషీద్ ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ తరుఫున రాజంపేట ఎంపీ అభ్యరి్థగా పోటీ చేశాడని సైబరాబాద్ ఆరి్థక నేరాల నియంత్రణ విభాగం (ఈఓడబ్ల్యూ) డీసీపీ కె.ప్రసాద్ తెలిపారు. కేసు పూర్తి వివరాలివీ..ముంబైలోని నారిమన్ పాయింట్‌లోని ఇండస్ఇండ్ బ్యాంక్‌లో ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థకు ఖాతా ఉంది. బ్యాంక్ అంతర్గత ఆడిట్లో భాగంగా జులై 12న ఈ ఖాతా నుంచి శంషాబాద్‌లోని ఇండస్ఇండ్ బ్యాంకుకు రూ.15 కోట్లు, రూ.25 కోట్లు చొప్పున రెండు విడతల్లో రూ.40 కోట్ల నగదు బదిలీ అయినట్లు బ్యాంక్ అధికారులు గుర్తించారు. ముంబైలోని ప్రధాన కార్యాలయం అనుమతి లేకుండా అనధికారికంగా ఈ నగదు బదిలీ జరిగినట్లు తేలడంతో జోనల్ హెడ్‌ను అప్రమత్తం చేశారు. దీంతో ఇండస్ఇండ్ బ్యాంక్ జోనల్ హెడ్ (ఆపరేషన్స్) మణికందన్ రామనాథన్ జులై 19న సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బహుమతిగా ఫార్చ్యూనర్ కార్లు.. కొట్టేసిన సొమ్ముతో బషీద్ రెండు టయోటా ఫార చ్యనర్ కార్లను కొనుగోలు చేశాడు. వీటిలో ఒకటి బ్యాంక్ మేనేజర్ రామస్వామికి బహుమతిగా అందించాడు. ఆ తర్వాత మిగిలిన సొమ్ముతో బషీద్ ఢిల్లీకి పరారయ్యాడు. సాంకేతిక ఆధారాలను సేకరించిన పోలీసులు నిందితులు రామస్వామి, రాజే‹Ùలను హైదరాబాద్‌లో, బషీద్‌ను ఢిల్లీలో అరెస్టు చేశారు. వీరిని జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో అరెస్టయిన ఏ–3 బషీద్పై గతంలో హైదరాబాద్ కమిషనరేట్‌లోని సీసీఎస్‌లో, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్ట, బోయిన్పల్లి పీఎస్‌లతో పాటు సైబరాబాద్‌లోని నార్సింగి, వికారాబాద్ జిల్లాలోని మోమిన్‌పేట్ ఠాణాలలో పదికి పైగా చీటింగ్ కేసులున్నాయి. బషీద్ పలు సినిమాలను నిరి్మంచడంతో పాటు నటించాడు కూడా.బ్యాంక్ మేనేజర్ల పనే.. శంషాబాద్‌లోని ఇండస్ ఇండ్ బ్యాంక్ మేనేజర్ కనుగుల రామస్వామి, సర్వీస్ డెలివరీ మేనేజర్ సపాయి రాజేశ్ ఈ వ్యవహారంలో కీలక సూత్రధారులు. ఆదిత్యా బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ ఖాతాలో రూ.కోట్లలో జరుగుతున్న లావాదేవీలను గుర్తించిన ఇరువురు నిందితులు పక్కా పథకం వేశారు. జులై నెలలో జూబ్లీహిల్స్‌కు చెందిన వ్యాపారి షేక్ బషీద్ పేరుతో బ్యాంక్ అకౌంట్‌ను తెరిచారు. ఈ ఖాతాకు ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ చెక్, ఆరీ్టజీఎస్ లేకుండా అనధికారికంగా రూ.40 కోట్ల నగదును బదిలీ చేశారు. క్షణాల్లోనే ఈ అకౌంట్ నుంచి జాతీయ, ప్రైవేట్ బ్యాంక్‌ల్లోని 20 వేర్వేరు ఖాతాలకు బదిలీ చేశారు. ఈ సొమ్ములో కొంత మొత్తాన్ని వేర్వేరు ఏటీఎంల నుంచి విత్ డ్రా చేశారు. -
బ్యాంక్ ఖాతాదారులకు ఎస్బీఐ అలెర్ట్
ఎస్బీఐ, ఐసీఐసీఐ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులకు అలెర్ట్. రీడమ్ పాయింట్ల పేరుతో ఖాతాదారుల్ని మోసం చేసేందుకు సైబర్ నేరస్తులు ప్రయత్నిస్తున్నారని, వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని సదరు బ్యాంకులు ఖాతాదారుల్ని హెచ్చరిస్తున్నాయి. డిజిటల్ బ్యాంకింగ్ వినియోగం పెరిగే కొద్ది సైబర్ నేరుస్తులు తమ పంథాను మారుస్తున్నారు. వివిధ మార్గాల ద్వారా బ్యాంక్ ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్లలో ఉన్న సొమ్మును కాజేస్తున్నారు. ఈ తరుణంలో ఎస్బీఐతో పాటు పలు ప్రైవేట్ బ్యాంక్‌లు కస్టమర్లను అలెర్ట్ చేస్తున్నాయి. పెరిగిపోతున్న స్కామ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ తరుణంలో ఎస్బీఐ ఖాతాదారుల్ని సైబర్ నేరస్తులు మోసం చేసేందుకు రివార్డ్ పాయింట్లను అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారని ట్వీట్ చేసింది. Your safety is our top priority.Here is an important message for all our esteemed customers!#SBI #TheBankerToEveryIndian #StaySafe #StayVigilant #FraudAlert #ThinkBeforeYouClick pic.twitter.com/CXiMC5uAO8— State Bank of India (@TheOfficialSBI) May 18, 2024 ఎస్బీఐ రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేసే నెపంతో వినియోగదారులకు ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఫైల్‌ను( APK ) పంపిస్తున్నారు. అలాంటి వాటి పట్ల ఖాతాదారులు అప్రత్తంగా ఉండాలని కోరింది.రీడీమ్ చేసుకోవాలంటూ మోసగాళ్లు ఎస్ఎంఎస్, వాట్సప్ ద్వారా ఏపీఏకే ఫైల్స్, మెసేజెస్ పంపిస్తారు. వాటిని క్లిక్ చేయొద్దని కోరింది. ఇలాంటి ఏపీకే ఫైల్స్ పట్ల ఎస్బీఐతో పాటు ఏఐ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఖాతాదారులు మోసపోతున్నారని, వాటి జోలికి పోవద్దని తెలిపాయి. Don't get caught in the web of fake links! Stay sharp, stay safe!@CyberdostTo report Cyber Crime, visit https://t.co/qb66kKVmLw or Dial 1930 for assistance#FoolTheFraudster #Fraud #Awareness #PNB #Digital pic.twitter.com/LOYUBy0nYf— Punjab National Bank (@pnbindia) May 1, 2024Stay vigilant against investment or task-based fraud! Protect your financial and personal information by verifying sources, researching thoroughly, and never sharing sensitive details online. #StaySafe #FraudPrevention pic.twitter.com/87xrfSd2Sy— Axis Bank (@AxisBank) May 13, 2024Is that scan hiding a potential scam? Watch the video to uncover the hidden risks of QUISHING and learn how to stay one step ahead of the fraudsters.To report a fraud,📞National Cyber Crime Helpline on 1930 or🌐Visit https://t.co/5QHgCWZl7n#BeatTheCheats #SafeBanking pic.twitter.com/MSMs2jti1l— ICICI Bank (@ICICIBank) May 19, 2024 -
వేలకోట్ల బ్యాంక్ ఫ్రాడ్.. డీహెచ్ఎఫ్ఎల్ ధీరజ్ వాధావన్ అరెస్ట్
రూ. 34,000 కోట్ల బ్యాంకు మోసం కేసులో దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్) మాజీ డైరెక్టర్ ధీరజ్ వాధవాన్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వాధవాన్‌ను సోమవారం సాయంత్రం ముంబైలో అదుపులోకి తీసుకున్నామని, మంగళవారం ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు సీబీఐ అధికారులు ధృవీకరించారు. బ్యాంకులను రూ.34,615 కోట్ల మేర మోసం చేసిన కేసులో డీహెచ్ఎఫ్ఎల్ మాజీ ప్రమోటర్లపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని 17 బ్యాంకుల కన్సార్టియంలను మోసం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సీబీఐ అధికారులు డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు ధీరజ్ వాధవాన్, కపిల్ వాధవాన్‌లపై కేసులు నమోదు చేశారు. ఎస్ బ్యాంక్ అవినీతి కేసులో అరెస్ట్ ఈ కేసుకు సంబంధించి 2022లో ధీరజ్‌ను సీబీఐ చార్జిషీట్లో చేర్చింది. ఎస్ బ్యాంక్ అవినీతి కేసులో వాధావాన్‌ను గతంలో సీబీఐ అరెస్ట్ చేస్తే బెయిల్‌పై విడుదలైనట్లు అధికారులు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ లోన్ కుంభకోణంగా వాధావాన్ అరెస్ట్‌పై 17 బ్యాంకుల కన్సార్టియంను రూ.34,000 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై సీబీఐ డీహెచ్ఎఫ్ఎల్ కేసు నమోదు చేసిందని, ఇది దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ లోన్ కుంభకోణంగా నిలిచిందని సీబీఐ అధికారులు పేర్కొన్నారునేరపూరిత కుట్రకుయూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంను మోసం చేయడానికి డీహెచ్ఎఫ్ఎల్ డైరెక్టర్లు కపిల్ వాధావన్, ధీరజ్ వాధవన్ ఇతర నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు. ఈ కుట్రలో భాగంగా వాధవాన్లు రూ. 42,871.42 కోట్ల భారీ రుణాలను మంజూరు చేసేందుకు కన్సార్టియం బ్యాంకులను ప్రేరేపించారని ఏజెన్సీ తెలిపింది.నిందితులు డీహెచ్ఎఫ్ఎల్ లెక్కల్ని తారుమారు చేసింది. ఆ నిధుల్ని వినియోగించడం, దుర్వినియోగం చేశారు. కన్సార్టియం బ్యాంకుల చట్టబద్ధంగా బకాయిలను తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారని సీబీఐ అధికారులు వెల్లడించారు. -
డీహెచ్ఎఫ్ఎల్ స్కామ్.. నిందితులకు బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు
దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(డీహెచ్ఎఫ్ఎల్), దాని మాజీ ప్రమోటర్లు కపిల్ వాధ్వాన్, దీరజ్ వాధ్వాన్‌పై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. యూనియన్ బ్యాంక్ నేతృత్వంలోని కన్షార్షియాన్ని రూ.34,615 కోట్ల మేర డీహెచ్ఎఫ్ఎల్ మోసగించిందన్న అభియోగాలపై సీబీఐ గతంలో కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి కపిల్, ధీరజ్లకు దిల్లీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు బుధవారం రద్దు చేసింది. జస్టిస్ బేల ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. నిందితులకు బెయిల్ మంజూరు చేయడంలో హైకోర్టు, ట్రయల్ కోర్టు ఇంకాస్త మెరుగ్గా స్పందించాల్సిందని సుప్రీంకోర్టు తెలిపింది. డీహెచ్ఎఫ్ఎల్ లోన్ స్కామ్‌కు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరిపిన సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. సీఆర్పీసీ ప్రకారం 90 రోజుల దర్యాప్తు గడువులోపు క్రిమినల్ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయడంలో విఫలమైతే నిందితులకు బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంది. అయితే ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 88వ రోజు సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా, ట్రయల్ కోర్టు నిందితులకు కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. దాన్ని సవాలుచేస్తూ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈతీర్పు వెలువడినట్లు తెలిసింది. అసలేం జరిగిందంటే.. డీహెచ్ఎఫ్ఎల్ మోసాలు 2019 జనవరి నుంచి వెలుగులోకి రావడం మొదలైంది. ఈ సంస్థ నిధులు మళ్లిస్తోందంటూ ప్రసార మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. డీహెచ్ఎఫ్ఎల్పై ‘ప్రత్యేక ఆడిట్’ నిర్వహించాలంటూ కేపీఎమ్‌జీ సంస్థను 2019 ఫిబ్రవరి 1న బ్యాంకులు నియమించాయి. 2015 ఏప్రిల్ 1-2018 డిసెంబరు మధ్యకాలానికి, ఆ సంస్థ ఖాతా పుస్తకాలపై సమీక్ష నిర్వహించాలని కేపీఎమ్‌జీని అప్పట్లో కోరాయి. కపిల్, ధీరజ్ వాధ్వాన్లు దేశం విడిచిపెట్టకుండా ఉండేందుకు 2019 అక్టోబరు 18న ‘లుక్అవుట్ సర్క్యులర్’లను బ్యాంకులు జారీ చేశాయి. కేపీఎమ్‌జీ నిర్వహించిన ఆడిట్లో.. రుణాలు, అడ్వాన్సులు పొందిన తర్వాత డీహెచ్ఎఫ్ఎల్కు చెందిన సంస్థలు, వ్యక్తులు, డైరెక్టర్ల ఖాతాలకు నిధుల మళ్లింపు జరిగిందని తేలినట్లు యూనియన్ బ్యాంకు పేర్కొంది. డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లకు రూ.29,100 కోట్ల మేర పంపిణీ జరిగినట్లు తెలుస్తుంది. ఇందులో చాలా వరకు లావాదేవీలు భూములు, ఆస్తుల రూపంలో పెట్టుబడులు పెట్టినట్లు బ్యాంకు ఖాతా పుస్తకాల పరిశీలనలో తేలినట్లు వివరించింది. రుణాలిచ్చిన నెలరోజుల్లోనే ఆ నిధులు సుధాకర్ షెట్టికి చెందిన కంపెనీల్లోకి పెట్టుబడుల రూపంలో మళ్లినట్లు తేలింది. రూ.వందల కోట్ల చెల్లింపులకు సంబంధించిన వివరాలు బ్యాంకు స్టేట్మెంట్లలో కనిపించలేదు. రుణాల అసలు, వడ్డీలపై సహేతుకం కాని రీతిలో మారటోరియం కనిపించింది. పలు సందర్భాల్లో డీహెచ్ఎఫ్ఎల్, తన ప్రమోటర్లకు భారీ ఎత్తున నిధులను పంపిణీ చేసింది. వాటిని తమ ఖాతా పుస్తకాల్లో రిటైల్ రుణాలుగా పేర్కొన్నారు. రూ.14,000 కోట్ల గల్లంతు ప్రాజెక్ట్ ఫైనాన్స్ కింద రూ.14,000 కోట్లు ఇచ్చినట్లు చూపారు. ఇందు కోసం 1,81,664 మందికి రిటైల్ రుణాలు ఇచ్చినట్లు తప్పుగా సృష్టించారు. ఇవ్వని రుణాల విలువ రూ.14,095 కోట్లుగా తేలింది. తరుచుగా.. ‘బాంద్రా బుక్స్’ పేరిట రుణాలను పేర్కొంటూ, వాటికి విడిగా డేటాబేస్ నిర్వహించారు. ఆ తర్వాత వాటన్నింటినీ ‘అదర్ లార్జ్ ప్రాజెక్ట్ లోన్స్’(ఓఎల్‌పీఎల్)లో విలీనం చేశారు. కాగా, కంపెనీకి చెందిన గృహ రుణాలు, ప్రాజెక్టు రుణాల హామీలు, ప్రమోటర్ల వాటా అమ్మకం తదితరాల ద్వారా కంపెనీపై ఒత్తిడి తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఎప్పటికప్పుడు డీహెచ్ఎఫ్ఎల్, ఆ కంపెనీ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌లు చెబుతూ వచ్చారు. ఇదీ చదవండి: సేవింగ్స్ ఖాతాలపై 7.75 శాతం వడ్డీ కావాలా..! 2019 మే నుంచి రుణాల చెల్లింపులు, వడ్డీలను డీహెచ్ఎఫ్ఎల్ ఆలస్యం చేస్తూ వచ్చింది. ఆ తర్వాత నిరర్థక ఆస్తులుగా కంపెనీ ఖాతాలను ప్రకటించారు. దాంతో బ్యాంకులపై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా రూ.34,615 కోట్ల మోసానికి పాల్పడినట్లు తేలింది. ఎఫ్ఐఆర్లో మాజీ ప్రమోటర్లతోపాటు అమిలిస్ రియల్టర్స్‌కు చెందిన సుధాకర్ షెట్టి, మరో ఎనిమిది మంది బిల్డర్లు కూడా ఉన్నారు. -
Naresh Goyal: జైల్లోనే చావాలనుంది!
ముంబై: ‘‘నాలో బతకాలన్న ఆశలన్నీ పూర్తిగా అడుగంటాయి. క్యాన్సర్ ముదిరి నా భార్య అనిత మంచాన పడింది. ఆమెను ఎంతగానో మిస్సవుతున్నా. నా ఒక్కగానొక్క కూతురుకూ ఒంట్లో బాగుండటం లేదు. నా ఆరోగ్యం కూడా పూర్తిగా దిగజారింది. మోకాళ్లు మొదలుకుని మూత్ర సంబంధిత వ్యాధుల దాకా తీవ్రంగా వేధిస్తున్నాయి. ఒళ్లంతా స్వాధీనం తప్పి వణుకుతోంది. నొప్పుల బాధను తట్టుకోలేకపోతున్నా. ఇలాంటి పరిస్థితుల్లో దైన్యంగా బతుకీడ్చడం కంటే జైల్లోనే చనిపోతే బాగుండనిపిస్తోంది’’ అంటూ జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ (74) భావోద్వేగానికి లోనయ్యారు. రూ.538 కోట్ల బ్యాంకు ఫ్రాడ్ కేసులో నిందితుడైన ఆయనను ఈడీ గత సెపె్టంబర్ 1న అరెస్టు చేసింది. నాటి నుంచీ జైల్లో ఉన్న ఆయన శనివారం ముంబై ప్రత్యేక కోర్టులో విచారణకు హాజరయ్యారు. కాసేపు వ్యక్తిగతంగా విచారించాలని కోరగా జడ్జి అనుమతించారు. ఈ సందర్భంగా చేతులు జోడించి తన దైన్యం గురించి చెప్పుకుంటూ కంటతడి పెట్టారు. మాట్లాడుతున్నంత సేపూ గోయల్ వణకుతూనే ఉన్నారని జడ్జి తెలిపారు. ఆయన గత డిసెంబర్లో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. -
మరో భారీ బ్యాంకు స్కాం: ఏకంగా రూ.3847 కోట్లకు ముంచేశారు
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంను వేల కోట్లకు ముంచేసిన స్కాం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ముంబైకి చెందిన డెవలపర్ యూనిటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కేసు నమోదు చేసింది. కంపెనీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) కిషోర్ కృష్ణ అవర్‌సేకర్, ప్రమోటర్లు అభిజీత్ కిషోర్ అవర్‌సేకర్, ఆశిష్ అవర్‌సేకర్ (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్) అభియోగాలు మోపింది. ముగ్గురు డైరెక్టర్లు, కొంతమంది గుర్తుతెలియని ప్రభుత్వోద్యోగులతోపాటు పలువురు అధికారులపై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. ఎస్బీఐతోపాటు ఇతర, 15 బ్యాంకుల కన్సార్టియంనురూ. 3,847.58 కోట్ల మేరకు మోసం చేశారన్న ఆరోపణలపై సీబీఐఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ముంబైలోని స్ట్రెస్డ్ అసెట్స్ మేనేజ్మెంట్ బ్రాంచ్, ఎస్బిఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా గురువారం ఎఫ్ఐఆర్ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) నమోదైంది. ముంబైలోని తమవాణిజ్య శాఖలో మోసం జరిగిందని, నిందితులు కల్పిత లావాదేవీలు చేయడం, బ్యాంకును మోసం చేయడం, చట్టవిరుద్ధంగా, మోస పూరితంగా ఖాతాల పుస్తకాలను తారుమారు చేసి బ్యాంకు నిధులను స్వాహా చేశారని ఈ కేసులో, ఆగస్ట్ 17, 2023న, ఎస్బీఐ డీజీఎం (ముంబయి) రజనీకాంత్ ఠాకూర్, యూనిటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, దాని డైరెక్టర్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. (మోదీజీ వచ్చే ఏడాదికి గొప్ప బర్త్‌డే గిఫ్ట్: ఫాక్స్‌కాన్ పోస్ట్ వైరల్) మొత్తం 23 బ్యాంకులు.. కానీ మొత్తం 23 బ్యాంకులున్నప్పటికీ, కేవలం 16 బ్యాంకులు మాత్రమే తమ అంచనా నష్టాలను నివేదించాయి. ఇందులో బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ , యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధానంగా ఉన్నాయి. కాగా 2012లో జరిగిన అగ్ని ప్రమాదం తర్వాత మంత్రాలయ భవనం పునరుద్ధరణ, కళానగర్‌లో థాకరే కుటుంబ బంగ్లా మాతోశ్రీ నిర్మాణం, దాదర్ టీటీ ఫ్లై ఓవర్, CSM సబ్వే లాంటి నిర్మాణాలకు యూనిటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ పాపులర్. (పండగ వేళ పసిడి పరుగు, వెండి ఎంత తగ్గిందంటే!) -
పదేళ్లలో 757 బ్యాంక్ మోసం కేసులు!
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గత 10 సంవత్సరాలలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులలో బ్యాంకు మోసాలకు సంబంధించిన 757 కేసులు నమోదుచేసినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకూ ఈడీ వద్ద నమోదయిన కేసులు 36 అని కూడా ఆయన వెల్లడించారు. అక్రమ ధనార్జనా నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల ప్రకారం ఈ కేసులు దాఖలయినట్లు పార్లమెంటుకు ఇచి్చన ఒక లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఈ ఏడాది జూలై 25వ తేదీ నాటికి రూ. 15,805.91 కోట్ల ఆస్తులు జప్తు జరిగిందని, రుణ బకాయిలకు సంబంధించి రూ. 15,113 కోట్లు బ్యాంకులకు సమకూర్చినట్లు పేర్కొన్నారు. రుణ మోసాలకు సంబంధించి అందుబాటులో ఉన్న వివిధ రికవరీ మార్గాలను అనుసరించినట్లు వెల్లడించారు. సివిల్ కోర్టులలో లేదా డెట్ రికవరీ ట్రిబ్యునల్స్‌లో దావా దాఖలు చేయడం, ఫైనాన్షియల్ ఆస్తుల సెక్యూరిటీ– రీకన్స్ట్రక్షన్ కింద చర్యలు, సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం అమలు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో దివాలా చర్యలు, చర్చల పరిష్కారం, రాజీ వంటి పలు మార్గాలు ఇందులో ఉన్నాయన్నారు. పది కేసుల్లో 14 మంది దేశం విడిచి పారిపోయినట్లు గుర్తించామన్నారు. వీరిలో ఆరుగురిని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లుగా, ఏడుగురిని ప్రకటిత నేరస్థులుగా ప్రకటించామని మంత్రి తెలిపారు. -
రూ.28 వేల కోట్లకు పైగా బ్యాంకులకు బురిడీ
ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి తప్పుడు మార్గాల్లో రూ.28వేల కోట్లకు పైగా రుణాలు పొంది బురిడీ కొట్టించారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్లు పైబడిన 79 మోసాల కేసుల్లో మొత్తం రూ.28,797.03 కోట్ల మేర మోసాలకు గురైనట్లు తెలిపింది. ఇందులో అత్యధికంగా పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.7,111.52 కోట్ల మోసం జరిగింది. నిధుల మళ్లింపు, ఖాతా పుస్తకాల్లో వివరాలు తప్పుగా సూచించడం, తారుమారు చేయడం, రుణగ్రహీతలు తప్పుడు ఆర్థిక నివేదికలు సమర్పించడం, నిర్దేశించిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని పాటించకపోవడమే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మోసాలకు ప్రధాన కారణంగా తేలిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. రుణగ్రహీతలు మూడో పార్టీ ఏజెన్సీలు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లు కుమ్మక్కు కావడం కూడా ప్రధాన కారణమని తెలిపింది. ఈ నేపథ్యంలో.. బ్యాంకు మోసాలను నివారించేందుకు ఆన్లైన్లో శోధించదగిన డేటాబేస్, సెంట్రల్ ఫ్రాడ్ రిజిస్ట్రీ రూపంలో గుర్తించనున్నట్లు పేర్కొంది. మోసాలను నియంత్రించడం క్రెడిట్ మంజూరు ప్రక్రియలో తగిన శ్రద్ధ వహించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసినట్లు వివరించింది. అలాగే, బ్యాంకుల్లో జరిగిన మోసాల కేసులను లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, పోలీసుస్టేషన్లు, సీబీఐ తదితరాల ద్వారా విచారణకు ఆదేశిస్తున్నట్లు ఆ శాఖ తెలిపింది. అంతేకాక.. ప్రత్యేక కమిటీ ద్వారా కేసులను పర్యవేక్షించడంతో పాటు బ్యాంకు బోర్డుల ఆడిట్ కమిటీల ముందు త్రైమాసిక సమాచారాన్ని ఉంచడం ద్వారా ఈ మోసాలపై వార్షిక సమీక్ష చేస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. 2021–22లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.100 కోట్లు అంతకంటే ఎక్కువ జరిగిన మోసాలు.. (రూ.కోట్లలో) –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– బ్యాంకు మోసాలు విలువ –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– బ్యాంక్ ఆఫ్ బరోడా 9 2,860.85 బ్యాంక్ ఆఫ్ ఇండియా 15 4,668.00 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 2 896.30 కెనరా బ్యాంక్ 6 2,774.26 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 388.24 ఇండియన్ బ్యాంక్ 7 1,628.36 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 3 874.76 పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్ 2 364.03 పంజాబ్ నేషనల్ బ్యాంక్ 13 7,111.52 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 12 4,856.71 యూకో బ్యాంక్ 1 374.96 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6 1,999.31 –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– -
సహకారం.. స్వాహాపర్వం
సాక్షి ప్రతినిధి,ఏలూరు: సహకార చట్టంలోని బ్యాంకుల నిబంధనలను పాటించలేదు.. రుణపరిమితిని అడ్డగోలుగా ఇష్టానుసారంగా పెంచేశారు.. సరైన షూరిటీలు లేకుండా కోట్లాది రూపాయల రుణాలు మంజూరు చేశారు. అర్హులైన రైతులకు ఇవ్వాల్సిన రుణాలను పక్కదారి పట్టించి మద్యం వ్యాపారులతో సహా పలువురికి కట్టబెట్టారు. ఇదంతా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పరిధిలోని బ్రాంచీల్లో జరిగిన అవినీతి పర్వం. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని డీసీసీబీ పరిధిలోని ఆరు శాఖల్లో జరిగిన భారీ అవకతవకలపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. సమగ్ర విచారణ నివేదిక ఆధారంగా గతంలో పనిచేసిన ఉన్నతాధికారులందరిపై శాఖాపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. గతంలో పనిచేసిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌తో పాటు మేనేజర్ కేడర్‌లోని 17 మందిపై చర్యలు తీసుకోనున్నారు. రుణాల మంజూరు విషయంలో.. జిల్లాలోని DCCB పరిధిలోని పలు బ్రాంచీల్లో ఏళ్ల తరబడి రుణాల మంజూరు విషయంలో భారీగా అవకతవకలు జరిగాయి. వివాదాల్లో ఉన్న భూము లను బ్యాంకుల్లో షూరిటీగా చూపించి కోట్ల రూపాయల రుణాలు పొంది తిరిగి రూపాయి కూడా చెల్లించని ఘటనలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలోని యలమంచిలి, కొవ్వూరు, తాడేపల్లిగూడెం, ఏలూరుతో పాటు మరికొన్ని బ్రాంచీల్లో జరిగిన అవకతవకలపై విచారణకు ప్రభుత్వం గుంటూరు కో–ఆపరేటివ్ రిజిస్ట్రార్‌ను ప్రత్యేకాధికారిగా నియమించింది. సుదీర్ఘంగా సాగిన విచారణ అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీనిపై కో–ఆపరేటివ్ శాఖ క మిషనర్ ఎ.బాబు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. అక్రమాల్లో కొన్ని.. ● యలమంచిలి బ్రాంచీలో వివాదాలతో ఉన్న ఆ స్తులను షూరిటీలుగా చూపించి రూ.33.22 కోట్ల రుణం మంజూరు చేశారు. దీనిలో రూ.13.86 కోట్లు ఇప్పటికీ రికవరీ కాలేదు. అలాగే 2015–16, 2017–18 నాబార్డు వార్షిక తనిఖీల్లో నిర్దేశించిన నిబంధనలను అతిక్రమించి రుణాలు మంజూరు చేసినట్లుగా నిర్ధారించారు. ఎలాంటి షూరిటీలు లేకుండా రుణాలు మంజూరు చేసి బ్యాంకుకు ఆర్థిక నష్టం చేకూర్చారు. ● తాడేపల్లిగూడెం బ్రాంచీలో 104 మంది సభ్యుల పేరుతో రూ.2.80 కోట్లను ఓ రియల్టర్‌కు రుణంగా ఇచ్చారు. తాడేపల్లిగూడెంలోని డీసీసీబీ బ్రాంచీలో మొత్తం బకాయిల విలువ రూ.11.69 కోట్లు కాగా 559 రుణాలు విలువ రూ.4.30 కోట్లు. వీటి గడువు దాటినా కొన్నింటి వసూళ్లకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ● 2012–13 నుంచి 2018–19 వరకు డీసీసీబీ పలు శాఖల ద్వారా రూ.867.19 కోట్ల విలువైన 2,445 బ్యాంకు గ్యారంటీలు జారీ చేసింది. దీనిలో రూ.295.35 కోట్ల విలువైన 23 బ్యాంకు గ్యారంటీలను మద్యం వ్యాపారులు, రైస్‌మిల్లులు, ఇతరులకు ఇచ్చినట్టు గుర్తించారు. ● వ్యవసాయ భూమి విలువ భారీగా పెంచి షూరిటీగా చూపి రుణాలు కూడా మంజూరు చేశారు. క్రిమినల్ కేసులు అక్రమాలు జరిగిన క్రమంలో ఆయా కాలంలో పనిచేసిన బ్యాంకు అధికారులపై క్రిమినల్ కేసులకు సిఫార్సు చేశారు. మేనేజర్లు మన్నె మోహనరావు, ఐవీ నాగేశ్వరరావు, డి.ఆంజనేయులు, టీవీ సుబ్బారావు, కేఏ అజయ్‌కుమార్, జి.పిచ్చయ్యచౌదరి, కె.సురేంద్రప్రసాద్, ఎం.శ్రీనివాసరావు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎస్.రాధాకృష్ణ, జేఎస్వీ సత్యనారాయణరావు, సీహెచ్ రత్నకుమారి, కె.కిరణ్మయి, వి.శ్రీదేవి, డి.రమణ, జనరల్ మేనేజర్లు ఎ.మాధవీమూర్తి, వైవీ రాఘవేంద్రరెడ్డి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీవీఎం ఫణి తదితరులపై క్రిమినల్ చర్యలతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ సిఫార్సు చేశారు. -
స్పీడ్‌గా స్పందించారా.. అయితే అలర్ట్ అవాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ రంగంతో పాటు బ్యాంకింగ్ సెక్టార్‌లోనూ కొన్ని అంశాల్లో తీవ్ర జాప్యం ఉంటుంది. ప్రధానంగా ఉత్తర ప్రత్యుత్తరాలకు రోజులు, వారాలే కాదు అవసరమైతే నెలలు కూడా వేచి చూడాలి. అయితే, ఓ బ్యాంక్ గ్యారెంటీ అంశానికి సంబంధించి బ్యాంక్‌కు ఈ–మెయిల్ పంపిన ఐదు నిమిషాల్లోనే జవాబు వచ్చేస్తే..? అలాంటి సత్వర స్పందనపై రాష్ట్ర ప్రభుత్వ అధికారికి వచి్చన సందేశంతోనే నకిలీ బ్యాంక్ గ్యారెంటీల స్కామ్ వెలుగులోకి వచి్చంది. ఈ కేసులో సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు ఇటీవల నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.45 కోట్ల విలువైన బోగస్ బ్యాంక్ గ్యారెంటీ లేఖలు స్వాధీనం చేసుకున్నారు. కోల్‌కతాలో ‘కుటీర పరిశ్రమగా’ఈ దందా... కోల్‌కతాలోని అనేక ప్రాంతాలు నకిలీ బ్యాంక్ గ్యారెంటీ పత్రాలు తయారు చేయడానికి అడ్డాలుగా ఉన్నాయి. చిన్న చిన్న కార్యాలయాలతో పాటు గదుల్లోనూ కుటీర పరిశ్రమగా, వ్యవస్థీకృతంగా ఈ దందా నడుస్తుంటుంది. వీరికి దేశ వ్యాప్తంగా ఏజెంట్లు ఉంటారు. వరంగల్‌కు చెందిన ఏజెంట్ నాగరాజు వారిలో ఒకడు. చెన్నైకి చెందిన హర్షిత ఇంజనీరింగ్ కంపెనీ రాష్ట్రంలో కొన్ని కాంట్రాక్టులు దక్కించుకుంది. వీటి కోసం హర్షిత సంస్థ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖకు బ్యాంకు గ్యారెంటీలు సమర్పించాల్సి వచ్చింది. వాటిని ఏర్పాటు చేస్తానంటూ ఈ కంపెనీ ఎండీని కలిసిన నాగరాజు కమీషన్ చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. కంపెనీ నుంచి దాదాపు రూ.47 లక్షలు కమీషన్‌గా తీసుకున్న ఇతగాడు నకిలీ బ్యాంక్ గ్యారెంటీ లెటర్లు అందించాడు. పక్కాగా తయారు చేసిన కోల్‌కతా గ్యాంగ్.. ఏజెంట్‌గా వ్యవహరించిన నాగరాజుకు కొన్నేళ్ళ క్రితం రాజస్థాన్‌కు చెందిన నరేష్ వర్మ ద్వారా కోల్‌కతా వాసులు నీలోట్పాల్ దాస్, సుబ్రజిత్ గోశాల్లతో పరిచయమైంది. ఈ నలుగురూ కలసి గతంలో అనేక బ్యాంకులకు సంబంధించిన బ్యాంక్ గ్యారెంటీ పత్రాలు వివిధ కంపెనీలకు అందించారు. కాగా, ఇండస్ఇండ్ బ్యాంక్ పేరుతో తమకు అందినవి నకిలీవని తెలియని హర్షిత సంస్థ వాటిని అర్బన్ డెవలప్మెంట్ శాఖకు దాఖలు చేసి పనులు కూడా పొందింది. నకిలీ బ్యాంకు గ్యారెంటీ పత్రాలు తయారు చేయడంలో నీలోట్, సుబ్రజిత్లు దిట్టలు కావడంతో వీటిపై ఎవరికీ అనుమానం రాలేదు. కాంట్రాక్టర్లు, కాంట్రాక్టులు పొందిన సంస్థల నుంచి ఈ బ్యాంకు గ్యారెంటీ పత్రాలు పొందే ప్రభుత్వ విభాగాలు సాధారణంగా క్రాస్ చెక్ చేయవు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఆ బ్యాంక్‌ను సంప్రదించి సందేహం నివృత్తి చేసుకుంటాయి. ఐదు నిమిషాల్లోనే సమాధానం రావడంతో.. ఈ ఉత్తరప్రత్యుత్తరాలు ఈ–మెయిల్ ద్వారా జరుగుతాయి. సదరు బ్యాంక్ గ్యారెంటీ లేఖలోనే ఈ మెయిల్ ఐడీ కూడా ఉంటుంది. ఈ విషయం తెలిసిన కోల్‌కతా ద్వయం దీనికోసం ప్రత్యేకంగా కొన్ని ఈ–మెయిల్ ఐడీలు కూడా రూపొందించింది. వీటిలో ఆయా బ్యాంకుల పేర్లు ఉండేలా, వాటిని చూసిన అధికారులు నిజమైనవిగానే భావించేలా జాగ్రత్తపడింది. హర్షిత సంస్థ ద్వారా అందుకున్న బ్యాంక్ గ్యారెంటీలను సరిచూడాలని భావించిన అర్బన్ డెవలప్మెంట్ విభాగాధినేత అందులో ఉన్న ఈ–మెయిల్‌కి మెసేజ్ పంపించారు. దీన్ని అందుకున్న సుబ్రజిత్ గోశాల్ బ్యాంకు అధికారి మాదిరిగానే కేవలం ఐదు నిమిషాల్లోనే సమాధానంగా మెయిల్ పంపిస్తూ... అవి నిజమైనవేనని స్పష్టం చేశాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఇంత త్వరగా సమాధానం రావడంతో షాక్‌కు గురైన అర్బన్ డెవలప్మెంట్ అధికారులు అనుమానించారు. రీజినల్ కార్యాలయాన్ని సంప్రదించడంతో.. కోల్‌కతాలోని బ్రాంచ్ నుంచి వచి్చన జవాబుతో పాటు బ్యాంకు గ్యారెంటీ పత్రాలను మరోసారి సరిచూడాలని భావించారు. దీంతో వీటిని ముంబైలోని ఇండస్ఇండ్ బ్యాంక్ రీజనల్ కార్యాలయానికి ఈ–మెయిల్ ద్వారా పంపించారు. వీటిని చూసిన అక్కడి అధికారుల షాక్‌కు గురయ్యారు. ఈ బ్యాంకు గ్యారెంటీ పత్రాల్లో పేర్కొన్న ప్రాంతంలో తమకు అసలు శాఖే లేదని స్పష్టం చేశారు. తమకు ఈ–మెయిల్ ఐడీలు కూడా ఉండవని పేర్కొన్నారు. ఈ విషయాన్ని మాసబ్‌ట్యాంక్‌లోని ఇండస్ఇండ్ బ్యాంక్ శాఖకు రీజనల్ కార్యాలయం తెలిపింది. వీరి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదై సీసీఎస్‌కు చేరింది. మరోపక్క హర్షిత సంస్థ కూడా నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నమోదైన కేసూ అక్కడికే వచి్చంది. వీటిని దర్యాప్తు చేసిన అధికారులు మొత్తం నలుగురు నిందితులనూ అరెస్టు చేశారు. -
‘చక్కిలం’ కేసులో నిందితులకు ఏడేళ్ల జైలు శిక్ష
హైదరాబాద్: చక్కిలం ట్రేడ్ హౌస్ లిమిటెడ్ కేసులో నిందితులకు జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. పదేళ్ల క్రితం నాటి కేసులో నిందితులకు తాజాగా ఏడేళ్ల జైలు శిక్ష ఖరారు చేస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. ఎస్బీఐలో రెండు కోట్ల రూపాయలు రుణాన్ని తీసుకుని దారి మళ్లించిన కేసులో ఎట్టకేలకు నిందితులకకు జైలు శిక్ష పడినట్లు ఈడీ తెలిపింది. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం నిందితులకు శిక్ష ఖరారు చేసింది నాంపల్లి కోర్టు. అప్పట్లో కంపెనీకి చెందిన ముగ్గురు డైరెక్టర్లతో పాటు బ్యాంకుకు చెందిన ముగ్గురిపై ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
గౌతమ్ థాపర్‌పై ఛార్జ్‌షీట్
న్యూఢిల్లీ: సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్, ఆ సంస్థ మాజీ ప్రమోటర్ గౌతమ్ థాపర్‌పై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. రూ. 2435 కోట్ల బ్యాంకు మోసం కేసులో ఈ ఛార్జ్‌షీట్ దాఖలైంది. 12 బ్యాంకులపై ఈ బ్యాంకింగ్ మోసం ప్రభావం చూపిందని అధికారులు తెలిపారు. కంపెనీ, థాపర్ ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లపై బ్యాంక్ నిధుల మళ్లింపు, ఖాతా పుస్తకాలను తారుమారు తదితర ఆరోపణలపై ఏజెన్సీ దాదాపు 19 నెలల పాటు విచారణ జరిపిన తర్వాత ఈ చార్జ్‌షీట్‌ను దాఖలు చేయడం జరిగింది. అవినీతి, మోసం ఆరోపణల కింద సీబీఐ కేసు నమోదు చేసిన యస్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌తో సంబంధాలపై థాపర్ ఇప్పటికే పలు విచారణలను ఎదుర్కొంటున్నారు. చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. జనరల్ టికెట్ కోసం క్యూలో నిలబడక్కర్లేదు! -
ఆర్బీఐ, సీబీఐకి సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్ర బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), దర్యాప్తు సంస్థ సీబీఐకు సోమవారం నోటీసులు జారీ చేసింది. బ్యాంకు రుణాల మోసం కేసుల్లో ఆర్బీఐ నామినీ డైరెక్టర్, ఇతర సిబ్బంది పాత్రపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం తాజా నోటీసు లిచ్చింది. వివిధ బ్యాంకింగ్ స్కామ్‌లలో ఆర్బీఐ అధికారుల పాత్రపై విచారణ జరపాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పీటీషన్ను సుప్రీం విచారణకు స్వీకరించింది. జస్టిస్ బీఆర్ గవాయి, బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం బీజేపీ నేత పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని ఆర్బీఐ, సీబీఐను కోరింది. కాగా కింగ్‌ఫిషర్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యెస్ బ్యాంక్ లాంటి వివిధ కుంభకోణాల్లో ఆర్బీఐ అధికారుల ప్రమేయంపై విచారణ జరగలేదని స్వామి ఆరోపించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంతో సహా, పలు చట్టాలను ప్రత్యక్షంగా ఉల్లంఘిస్తూ ఆర్బీఐ అధికారులు నిర్లక్క్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. Supreme Court issues notice to Reserve Bank of India (RBI) and Central Bureau of Investigation (CBI) on a plea filed by BJP member Subramanian Swamy seeking a CBI probe into the alleged role of RBI's nominee director in bank loan fraud cases. — ANI (@ANI) October 17, 2022 -
డీహెచ్ఎఫ్ఎల్ కేసులో... 75 మందిపై చార్జిషీట్
న్యూఢిల్లీ: రూ.34 వేల కోట్ల బ్యాంకులను మోసగించిన కేసులో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(డీహెచ్ఎఫ్ఎల్) మాజీ సీఎండీ కపిల్ వాధవన్, మరో 74 మందిపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఢిల్లీలోని సీబీఐ కోర్టులో వేసిన చార్జిషీట్లో ఆ సంస్థ మాజీ డైరెక్టర్ ధీరజ్ వాధవన్, మాజీ సీఈవో హర్షిల్ మెహతా పేర్లు కూడా ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. 17 బ్యాంకుల కన్సార్టియంను రూ.34 వేల కోట్ల మేర మోసగించినట్లు డీహెచ్ఎఫ్ఎల్పై ఆరోపణలున్నాయి. 2010 నుంచి 2018 వరకు 17 బ్యాంకులతో కూడిన కన్సార్టియం నుంచి ఏకంగా రూ.42,871 కోట్లు రుణాలు సేకరించింది హెచ్డీఎఫ్ఐ. అయితే 2019 నుంచి రుణాలకు సంబంధించిన చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో కన్సార్టియంకు నేతృత్వం వహిస్తున్న యూనియన్ బ్యాంకు 2021లో సీబీఐకి లేఖ రాసింది. తాము తాజాగా నిర్వహించిన ఆడిట్లో ఈ మోసం వెలుగు చూసినట్టు పేర్కొంది. దీనిపై దర్యాప్తు చేయాలని సీబీఐని ఈ ఏడాది ఫిబ్రవరిలో యూనియన్ బ్యాంకు కోరింది. దీనిపై విచారణ చేపట్టిన అనంతరం సీబీఐ కేసులు నమోదు చేసింది. ఇదీ చదవండి: డీహెచ్ఎఫ్ఎల్ కుంభకోణం.. రూ.34,615 కోట్ల మోసం.. సీబీఐ కేసు నమోదు -
జల్సాలు, విలాసాల కోసం బ్యాంక్‌కు బురిడీ.. ఎంతో తెలుసా?
సాక్షి, సిటీబ్యూరో: డమ్మీ కంపెనీలు.. నకిలీ ఉద్యోగులు... వారి పేర్లతో బ్యాంకు ఖాతాలు... ఇలా రంగంలోకి దిగిన ఓ ముఠా అందినకాడికి రుణాలు, క్రెడిట్ కార్డులు తీసుకుంది. ఆ డబ్బుతో జల్సాలు చేస్తూ వాయిదాలు చెల్లించకుండా బ్యాంకును నిండా ముంచింది. దీనిపై నాచారం ఠాణాలో కేసు నమోదు కాగా.. రంగంలోకి దిగిన మల్కాజ్గిరి స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి దాదాపు 60 క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అధికారులు రికవరీలపై దృష్టి పెట్టడంతో ఒకటి రెండు రోజుల్లో ముఠా అరెస్టు ప్రకటించనున్నారు. ఈ గ్యాంగ్ బ్యాంకును రూ.2.5 కోట్ల మేర బురిడీ కొట్టించినట్లు తెలుస్తోంది. బ్యాంకుల పని తీరు తెలియడంతో... వివిధ ప్రాంతాలకు చెందిన ఐదుగురు ఓ ముఠాగా ఏర్పడ్డారు. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు జారీలో బ్యాంకుల వద్ద ఉన్న లోటుపాట్లు తెలుసుకున్నారు. భారీ స్థాయిలో క్రెడిట్‌కార్డులు, రుణాలు తీసుకుని మోసం చేస్తే ‘లాభం’ ఉంటుందని భావించారు. నాచారం ప్రాంతంలో ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే ఓ డమ్మీ కంపెనీ ఏర్పాటు చేశారు. వరంగల్‌కు చెందిన పలువురికి మాయమాటలు చెప్పి ఫొటోలు, ఇతర పత్రాలు సేకరించారు. వారందరూ తన సంస్థలో ఉద్యోగులంటూ ప్రొఫైల్స్ క్రియేట్ చేశారు. ఈ ‘ఉద్యోగుల్లో’ కొందరు రైతులు, చిన్న చిన్న దుకాణాల యజమానులు కూడా ఉన్నారు. వీరంతా ఉన్నత విద్య అభ్యసించినట్లు నకిలీ వివరాలు సృష్టించిన ముఠా సభ్యులు వాళ్లను సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ ఇంజినీర్లుగా, హెచ్ఆర్ నిర్వాహకులుగా మార్చారు. వారి పేర్లతో రుణాలు, కార్డులు... వారి వివరాలతో గుర్తింపు కార్డులనూ తయారు చేశారు. ఆపై ఆయా పేర్లతో ఓ బ్యాంకులో శాలరీ అకౌంట్స్ తెరిచారు. ఇలా తెరిచిన శాలరీ అకౌంట్స్ ఖాతాలకు సంబంధించిన ఏటీఎం కార్డులు, చెక్ పుస్తకాలను తమ వద్దే ఉంచుకున్నారు. దాదాపు మూడు నెలల పాటు జీతాలు వేయడంతో పాటు ఆ మొత్తాలను వీరే డ్రా చేసుకుంటూ గడిపారు. ఇలా రూపొందించిన స్టేట్మెంట్స్, బోగస్ ధ్రువీకరణలను ఆధారంగా చేసుకుని బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు పొందారు. కొందరిని మేనేజ్ చేయడం ద్వారా ఈ క్రెడిట్‌కార్డ్స్, రుణాలు మంజూరయ్యేలా చేశారు. ఇలా మొత్తం దాదాపు రూ.2.5 కోట్ల మేర స్వాహా చేశారు. జల్సాలు, విలాసాలు... క్రెడిట్ కార్డుల్లో వాడిన మొత్తాలు, వ్యక్తిగత రుణానికి సంబం«ధించిన ఈఎంఐలు చెల్లింపులు జరగకపోవడంతో బ్యాంకు అధికారులు ఆరా తీశారు. దీంతో ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. దీంతో వారు నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడానికి మల్కాజ్గిరి ఎస్ఓటీ బృందం రంగంలోకి దిగింది. మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకుని వివిధ కోణాల్లో విచారించింది. ఇలా బ్యాంకు నుంచి కాజేసిన సొమ్ముతో ముఠా సభ్యులు జల్సాలు, విలాసాలు చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇది కూడా చదవండి: అప్పు కావాలి.. జూనియర్ ఆర్టిస్ట్‌ను నమ్మించి రూమ్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి.. -
దేశంలో భారీగా తగ్గిన బ్యాంక్ మోసాలు.. కారణాలివేనా?
న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021–22) బ్యాంకింగ్ రంగంలో భారీ మోసాలు తగ్గుముఖం పట్టాయి. రూ. 100 కోట్లకుపైబడిన మోసాల విలువ రూ. 41,000 కోట్లకు పరిమితమమైంది. అంతక్రితం ఏడాది(2020–21)లో ఇవి ఏకంగా రూ. 1.05 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అధికారిక గణాంకాల ప్రకారం అటు ప్రయివేట్, ఇటు పబ్లిక్ బ్యాంకులలో కుంభకోణాల కేసులు 118కు తగ్గాయి. 2020–21లో ఇవి 265గా నమోదయ్యాయి. ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్బీ)లను తీసుకుంటే రూ.100 కోట్లకుపైబడిన మోసాలకు సంబంధించిన కేసుల సంఖ్య 167 నుంచి 80కు క్షీణించింది. ప్రయివేట్ రంగంలోనూ ఇవి 98 నుంచి 38కు దిగివచ్చాయి. విలువరీత్యా చూస్తే గతేడాది పీఎస్బీలలో వంచన కేసుల విలువ రూ. 65,900 కోట్ల నుంచి రూ. 28,000 కోట్లకు తగ్గింది. ఇక ప్రయివేట్ బ్యాంకుల్లోనూ ఈ విలువ రూ. 39,900 కోట్ల నుంచి రూ. 13,000 కోట్లకు వెనకడుగు వేసింది. బ్యాంకింగ్ రంగ మోసాలకు చెక్ పెట్టే బాటలో రిజర్వ్ బ్యాంక్ పలు చర్యలు తీసుకుంటూ వస్తోంది. తొలినాళ్లలోనే హెచ్చరించే వ్యవస్థ(ఈడబ్ల్యూఎస్) మార్గదర్శకాలను మెరుగుపరచడం, ఫ్రాడ్ గవర్నెన్స్, స్పందన వ్యవస్థను పటిష్టపరచడం,లావాదేవీల పర్యవేక్షణ, గణాంకాల విశ్లేషణ, మోసాలను పసిగట్టేందుకు ప్రత్యేకించిన మార్కెట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏర్పాటు తదితరాలకు ఆర్బీఐ తెరతీసింది. మోసాల తీరిలా ఈ ఏడాది మొదట్లో స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) దేశంలోనే అతిపెద్ద మోసానికి నెలవైంది. ఏబీజీ షిప్‌యార్డ్, కంపెనీ ప్రమోటర్లకు సంబంధించి రూ. 22,842 కోట్ల కుంభకోణం నమోదైంది. ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)ను రూ. 14,000 కోట్ల మోసం చేసిన నీరవ్ మోడీ, మేహుల్ చోక్సీ కేసుకంటే పెద్దదికావడం గమనార్హం! ఇక గత నెలలో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్(డీహెచ్ఎఫ్ఎల్), కంపెనీ మాజీ సీఎండీ కపిల్ వాధ్వాన్, డైరెక్టర్ ధీరజ్ వాధ్వాన్ తదితరులపై రూ. 34,615 కోట్ల ఫ్రాడ్ కేసును సీబీఐ బుక్ చేసిన విషయం విదితమే. -
ఆర్బీఐ కొత్త టెక్నాలజీ, వేల కోట్ల బ్యాంక్ స్కాంలు జరగవట!
దేశంలో ఆర్ధిక నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టేందుకు కేంద్రం తీసుకోని నిర్ణయం లేదు. అయినా సరే ఎక్కడో ఓ చోటా రుణాల పేరిట జరుగుతున్న స్కాంలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఫిర్యాదుతో రూ.42,871 కోట్ల కుంభ కోణం బ్యాంకింగ్ రంగ వ్యవస్థని అతలా కుతులం చేసింది. చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆర్ధిక నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ చేస్తున్న ప్రయత్నాల్ని మరింత ముమ్మరం చేసింది. వ్యాపారాల నిర్వహణ పేరుతో బ్యాంకుల వద్ద వేలకోట్లు రుణాలు తీసుకొని.. వాటిని చెల్లించకుండా ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోతున్న ఆర్ధిక నేరగాళ్లపై ఆర్బీఐ ఉక్కుపాదం మోపనుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను వేలకోట్ల రూపాయలు (ఆర్టీఐలో తేలింది రూ.15,423.39 కోట్లు) మోసం చేసి దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ అతని మామ (బంధువు)మెహుల్ చోక్సీల తరహా మోసాలు మరోసారి జరగకుండా ఉండేందుకు ఆర్బీఐ బ్లాక్ చైన్ టెక్నాలజీపై పనిచేస్తుంది. ఇందులో పలు బ్యాంకుల్ని సైతం ఆర్బీఐ జత చేసింది. 12 బ్యాంక్‌లు హెచ్డీఎఫ్సీ,ఐసీఐసీఐ ,స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు 12కు పైగా బ్యాంకులు సమిష్టిగా బ్లాక్ చైన్ టెక్నాలజీ కేంద్రికృతమై జాతీయ, అంతర్జాతీయ ట్రాన్సాక్షన్స్ (ట్రేడ్ ఫైనాన్సింగ్) నిర్వహిస్తున్నాయి. ఆ ట్రాన్సాక్షన్ల నిర్వహణలో సత్ఫలితాలు రాబడితే నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీల్లాంటి ఆర్ధిక నేరగాళ్లకు బ్యాంకుల్ని మోసం చేయాలన్న ఆలోచనే రాదని ఆర్బీఐ భావిస్తున్నట్లు పలు వెలుగులోకి నివేదికలు చెబుతున్నాయి. బెంగళూరు కేంద్రంగా బెంగళూరు కేంద్రంగా ఈ పైలెట్ ప్రాజెక్ట్‌లో యూరప్ దేశమైన బెల్జియంకు చెందిన బ్లాక్ చైన్ డెవలప్మెంట్ ఫ్లాట్ ఫామ్ సెటిల్ మింట్, అమెరికాకు చెందిన క్రోడా టెక్నాలజీస్, ఐబీఎంలు టెక్నాలజీ సపోర్ట్‌ను అందిస్తుండగా..యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీపై పనిచేస్తున్నాయి. ఫ్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే? ఫ్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ పేరుతో ఆర్బీఐ నేతృత్వంలో డెవలప్ చేస్తున్న ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ..దాని పరిభాషలో చెప్పాలంటే.. ఉదాహారణకు నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలు బ్యాంకుల వద్ద రుణం తీసుకొని వాటిని అక్రమ మార్గంలో మళ్లించేందుకు జరిపే ట్రాన్సాక్షన్లపై ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ కన్నేస్తుంది. అనుమానం వచ్చిందా వెంటనే ఈ టెక్నాలజీ అనుసందానమైన సెంట్రల్ డేటాతో సంబంధం లేకుండా బ్లాక్ చేస్తుంది. ఇన్ పుట్ డివైజ్, ఔట్పుట్ డివైజ్, స్టోరేజ్ డివైజ్ ఇలా మూడు పద్దతుల్లో ట్రాన్సాక్షన్లను బ్లాక్ చేసి సంబంధిత బ్యాంకుల సంబంధించిన కంప్యూటర్లకు లేదా, సంబంధిత శాఖలకు అలెర్ట్ ఇస్తుంది. తద్వారా లోన్ ఫ్రాడ్‌లను గుర్తించవచ్చు. ప్రస్తుతం ఆర్బీఐ ఈ టెక్నాలజీ విధి విధానాల్ని పరిశీలిస్తుండగా.. ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాల్ని సరి చేయాలని చూస్తోంది. నిపుణులు ఏం అంటున్నారంటే! రుణాలు పొందే విషయంలో ఈ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఎటువంటి అడ్డకట్ట వేయలేదు. అయితే రుణాలు తీసుకున్న వ్యక్తులు ఆ నిధులను పక్క దారి పట్టిస్తుంటే మాత్రం ఇట్టే పసిగడుతుంది. వాళ్ల కుతంత్రాలకు చెక్ పెడుతుంది. తద్వారా భారీ స్థాయిలో జరిగే మోసాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయడానికి అవకాశం లభిస్తుందని నిపుణులు అంటున్నారు. కాగా, ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్న ఈ టెక్నాలజీ సాయంతో లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్సీ) పేరుతో జరిగే మోసాల్ని సైతం అరికట్టవచ్చు. చదవండి👉బ్యాంకులంటే విజయ్ మాల్యా గుండెల్లో దడే! కావాలంటే మీరే చూడండి! -
రూ.34,615 కోట్ల బ్యాంక్ స్కాం,ఎవరీ సుధాకర్ శెట్టి!
న్యూఢిల్లీ: దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీహెచ్ఎఫ్ఎల్) రూ.34,615 కోట్ల బడా బ్యాంకింగ్ మోసం కేసుపై జరుగుతున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణలో కీలక అంశాలు వెలుగుచూస్తున్నాయి. అత్యున్నత స్థాయి వర్గాల కథనం ప్రకారం, రూ. 14,683 కోట్ల డీహెచ్ఎఫ్ఎల్ నిధుల ’మళ్లింపు’లో తొమ్మిది రియల్టీ సంస్థల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కీలక విచారణ జరుగుతోంది. అప్పటి చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ కపిల్ వాధ్వాన్, డైరెక్టర్ ధీరజ్ వాధ్వాన్, వ్యాపారవేత్త సుధాకర్ శెట్టిల నియంత్రణలో ఉన్న ఈ తొమ్మిది రియల్ ఎస్టేట్ సంస్థలు తమ బాస్‌ల ఆర్థిక ప్రయోజనాల కోసం అక్రమ మార్గాలను అనుసరించాయని సీబీఐ పేర్కొంది. తొమ్మిదిలో ఐదు సుధాకర్ శెట్టివే... తొమ్మిది రియల్టీ సంస్థల్లో ఐదు వ్యాపారవేత్త సుధాకర్ శెట్టి నియంత్రణలోనివి కావడం గమనార్హం. కంపెనీలు తీసుకున్న రుణాలు కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్ల ఆదేశాల మేరకు దారిమళ్లినట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. 2010–2018 మధ్య కాలంలో రూ. 42,871 కోట్ల మేర రుణాలను మంజూరు చేసిన 17 బ్యాంకుల కన్సార్టియంకు నేతృత్వం వహిస్తున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) నుండి వచ్చిన ఫిర్యాదుపై జూన్ 20వ తేదీన కేసు నమోదయ్యింది. కేసు నమోదయిన తర్వాత సీబీఐకి చెందిన దాదాపు 50 మందికిపైగా అధికారుల బృందం బుధవారం ముంబైలోని 12 ప్రాంగణాల్లో విస్తృత సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. డీహెచ్ఎఫ్ఎల్ మొత్తం కుంభకోణం రూ.34,615 కోట్లుగా సీబీఐ అధికారులు తెలిపారు. దీనిప్రకారం, ఇంత స్థాయిలో బ్యాంకింగ్ మోసం కేసుపై సీబీఐ విచారణ జరగడం ఇదే తొలిసారి. వాధ్వాన్ ద్వయం ఇతరులతో కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడి, వాస్తవాలను తప్పుగా చూపించి దాచిపెట్టారని, నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు పాల్పడ్డారని బ్యాంక్ తన ఫిర్యాదులో పేర్కొంది. మే 2019 నుండి రుణం తిరిగి చెల్లించడంలో డిఫాల్ట్ కావడం ద్వారా కన్సార్టియంను రూ. 34,614 కోట్ల మేర మోసగించడానికి కుట్ర జరిగిందని వివరించింది. -
డీహెచ్ఎఫ్ఎల్ కుంభకోణం.. రూ.34,615 కోట్ల మోసం.. సీబీఐ కేసు నమోదు
యూనియన్ బ్యాంక్ నేతృత్వంల్యోని 17 బ్యాంకుల కన్సార్టియాన్ని రూ. 34,615 కోట్ల రూపాయలకు మోసం చేశారంటూ దివాస్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పోరేషన్ (డీహెచ్ఎఫ్ఎల్) ప్రమోటర్లు కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్‌లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసు నమోదు చేసింది. డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లతో పాటు అమరిల్లీస్ రియల్టర్స్‌కు చెందిన సుధాకర్ శెట్టి, మరో ఆరుగురు బిల్డర్లపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. 2010 నుంచి 2018 వరకు 17 బ్యాంకులతో కూడిన కన్సార్టియం నుంచి ఏకంగా రూ.42,871 కోట్లు రుణాలు సేకరించింది హెచ్డీఎఫ్ఐ. అయితే 2019 నుంచి రుణాలకు సంబంధించిన చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో కన్సార్టియంకు నేతృత్వం వహిస్తున్న యూనియన్ బ్యాంకు 2021లో సీబీఐకి లేఖ రాసింది. తాము తాజాగా నిర్వహించిన ఆడిట్లో ఈ మోసం వెలుగు చూసినట్టు పేర్కొంది. దీనిపై దర్యాప్తు చేయాలని సీబీఐని ఈ ఏడాది ఫిబ్రవరిలో యూనియన్ బ్యాంకు కోరింది. దీనిపై విచారణ చేపట్టిన అనంతరం సీబీఐ కేసులు నమోదు చేసింది. బ్యాంకుల మోసానికి సంబంధించి డీహెచ్ఎఫ్ఎల్ అతి పెద్దదిగా నిలిచింది. ఈ కుంభకోణంలో రూ. 34,615 కోట్ల వరకు మోసం జరిగింది. ఇంతకు ముందు ఏజీబీ షిప్‌యార్డ్ కంపెనీ బ్యాంకులను రూ.22,842 కోట్ల వరకు ముంచడమే అతి పెద్ద మోసంగా రికార్డయ్యింది. కాగా యెస్ బ్యాంకును చీట్ చేసిన కేసులో కూడా డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లకు ప్రమేయం ఉంది. చదవండి: దటీజ్ టాటా.. ఆ కంపెనీకంటూ కొన్ని విలువలు ఉన్నాయ్! -
బ్యాంకుల్లో కుంభకోణాలు,ఏ బ్యాంకులో ఎన్నివేల కోట్ల మోసం జరిగిందంటే!
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) మోసాల పరిమాణం 51 శాతం తగ్గిందని, రూ.40,295 కోట్లకు దిగి వచ్చిందని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. 2020–21లో 12 పీఎస్‌బీలు రూ. 81,922 కోట్ల మేర మోసాలను రిపోర్ట్ చేసినట్లు తెలిపింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌర్ చేసిన దరఖాస్తు విషయంలో ఆర్బీఐ ఈ మేరకు సమాధానమిచ్చింది. మరోవైపు, పరిమాణం తగ్గినప్పటికీ, సంఖ్యాపరంగా మాత్రం మోసాల ఉదంతాలు ఆ స్థాయిలో తగ్గలేదని పేర్కొంది. 2021 ఆర్థిక సంవత్సరంలో 9,933 ఉదంతాలు చోటు చేసుకోగా 2021–22లో ఈ సంఖ్య కేవలం 7,940కి మాత్రమే తగ్గింది. 2022 ఆర్థిక సంవత్సరంలో పంజాబ్ నేషనల్ బ్యాంకులో అత్యధికంగా రూ.9,528 కోట్ల మేర మోసాలకు సంబంధించి 431 ఉదంతాలు నమోదయ్యాయి. ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.6,932 కోట్లు (4,192 కేసులు), బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.3,989 కోట్లు (280 కేసులు), యూనియన్ బ్యాంక్‌లో రూ.3,939 కోట్ల (627 కేసులు) మేర మోసాలు నమోదయ్యాయి. బ్యాంకులు పంపే నివేదికలను బట్టి డేటాలో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరగవచ్చని ఆర్బీఐ తెలిపింది. చదవండి👉బ్యాంకులంటే విజయ్ మాల్యాకు గుండెల్లో దడే! కావాలంటే మీరే చూడండి! -
వన్‌టైం సెటిల్మెంట్ పేరుతో రూ. 25 లక్షలు టోకరా
పంజగుట్ట: వన్‌టైం సెటిల్మెంట్లో బ్యాంకు రుణాన్ని తక్కువ చేయిస్తానని నమ్మించి రూ. 25 లక్షలు తీసుకుని పరారైన వ్యక్తిపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కేపీహెచ్‌బీకి చెందిన వి.రవికుమార్, తన సోదరుడు రాఘవేందర్ డైరెక్టర్లుగా మరికొందరితో కలిసి పంజగుట్టలో రామకృష్ణా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను నిర్వహిస్తున్నారు. సంస్థ విస్తరణ నిమిత్తం అప్పటి ఆంధ్రాబ్యాంకు, ప్రస్తుత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2019లో రూ.81 కోట్లు రుణంగా తీసుకున్నారు. ఆ తర్వాత కరోనా, లాక్డౌన్ కారణంగా వ్యాపారం జరక్క కిస్తీలు కట్టలేకపోయారు. దీంతో బ్యాంకు వన్‌టైం సెటిల్మెంట్ చేసుకోవాలని సూచించడంతో రూ. 7 కోట్లు చెల్లించారు. 2021 సెప్టెంబర్‌లో నగరానికి చెందిన పి.విక్రమ్ అనే వ్యక్తి రవికుమార్ సోదరులను కలిశాడు. బ్యాంకు లైజనింగ్ ఆఫీసర్‌గా పరిచయం చేసుకున్న అతను మీరు తీసుకున్న రుణానికి వన్‌టైం సెటిల్మెంట్ కింద సగం తగ్గిస్తానని చెప్పాడు. వన్‌టైం సెటిల్మెంట్ రూ.47 కోట్లకు ఒప్పందం కుదిరిందని బ్యాంకు జనరల్ మేనేజర్ పేరుతో నకిలీ లెటర్ సృష్టించి వారికి ఇచ్చాడు. మొదట రూ.25 లక్షలు బ్యాంకుకు ముందస్తుగా చెల్లించాలని తీసుకున్నాడు. ఆ తర్వాత రవికుమార్ బ్యాంకు జీఎం పేరుతో ఉన్న లేఖను తీసుకుని బ్యాంకుకు వెళ్లగా అది నకిలీదిగా తేలింది. విక్రమ్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా అతను తప్పించుకు తిరుగుతుండటంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు బుధవారం పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విక్రమ్‌పై చీటింగ్ కేసు నమోదు చేసి అతనికోసం గాలింపు చేపట్టారు.