![CBI Chargesheets DHFL Kapil Wadhawan 74 Others Bank Fraud Case - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2022/10/16/955.jpg.webp?itok=I0GikJSn)
న్యూఢిల్లీ: రూ.34 వేల కోట్ల బ్యాంకులను మోసగించిన కేసులో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(డీహెచ్‌ఎఫ్‌ఎల్) మాజీ సీఎండీ కపిల్ వాధవన్, మరో 74 మందిపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఢిల్లీలోని సీబీఐ కోర్టులో వేసిన చార్జిషీట్‌లో ఆ సంస్థ మాజీ డైరెక్టర్ ధీరజ్ వాధవన్, మాజీ సీఈవో హర్షిల్ మెహతా పేర్లు కూడా ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. 17 బ్యాంకుల కన్సార్టియంను రూ.34 వేల కోట్ల మేర మోసగించినట్లు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌పై ఆరోపణలున్నాయి.
2010 నుంచి 2018 వరకు 17 బ్యాంకులతో కూడిన కన్సార్టియం నుంచి ఏకంగా రూ.42,871 కోట్లు రుణాలు సేకరించింది హెచ్‌డీఎఫ్‌ఐ. అయితే 2019 నుంచి రుణాలకు సంబంధించిన చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో కన్సార్టియంకు నేతృత్వం వహిస్తున్న యూనియన్ బ్యాంకు 2021లో సీబీఐకి లేఖ రాసింది. తాము తాజాగా నిర్వహించిన ఆడిట్‌లో ఈ మోసం వెలుగు చూసినట్టు పేర్కొంది. దీనిపై దర్యాప్తు చేయాలని సీబీఐని ఈ ఏడాది ఫిబ్రవరిలో యూనియన్ బ్యాంకు కోరింది. దీనిపై విచారణ చేపట్టిన అనంతరం సీబీఐ కేసులు నమోదు చేసింది.
ఇదీ చదవండి: డీహెచ్‌ఎఫ్‌ఎల్ కుంభకోణం.. రూ.34,615 కోట్ల మోసం.. సీబీఐ కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment