రూ. 34,000 కోట్ల బ్యాంకు మోసం కేసులో దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్) మాజీ డైరెక్టర్ ధీరజ్ వాధవాన్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వాధవాన్‌ను సోమవారం సాయంత్రం ముంబైలో అదుపులోకి తీసుకున్నామని, మంగళవారం ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు సీబీఐ అధికారులు ధృవీకరించారు.
బ్యాంకులను రూ.34,615 కోట్ల మేర మోసం చేసిన కేసులో డీహెచ్‌ఎఫ్‌ఎల్ మాజీ ప‍్రమోటర్లపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని 17 బ్యాంకుల కన్సార్టియంలను మోసం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సీబీఐ అధికారులు డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు ధీరజ్ వాధవాన్, కపిల్ వాధవాన్‌లపై కేసులు నమోదు చేశారు.
ఎస్ బ్యాంక్ అవినీతి కేసులో అరెస్ట్
ఈ కేసుకు సంబంధించి 2022లో ధీరజ్‌ను సీబీఐ చార్జిషీట్‌లో చేర్చింది. ఎస్ బ్యాంక్ అవినీతి కేసులో వాధావాన్‌ను గతంలో సీబీఐ అరెస్ట్ చేస్తే బెయిల్‌పై విడుదలైనట్లు అధికారులు తెలిపారు.
దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ లోన్ కుంభకోణంగా
వాధావాన్ అరెస్ట్‌పై 17 బ్యాంకుల కన్సార్టియంను రూ.34,000 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై సీబీఐ డీహెచ్‌ఎఫ్‌ఎల్ కేసు నమోదు చేసిందని, ఇది దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ లోన్ కుంభకోణంగా నిలిచిందని సీబీఐ అధికారులు పేర్కొన్నారు
నేరపూరిత కుట్రకు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంను మోసం చేయడానికి డీహెచ్‌ఎఫ్‌ఎల్ డైరెక్టర్లు కపిల్ వాధావన్, ధీరజ్ వాధవన్ ఇతర నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు. ఈ కుట్రలో భాగంగా వాధవాన్‌లు రూ. 42,871.42 కోట్ల భారీ రుణాలను మంజూరు చేసేందుకు కన్సార్టియం బ్యాంకులను ప్రేరేపించారని ఏజెన్సీ తెలిపింది.
నిందితులు డీహెచ్‌ఎఫ్‌ఎల్ లెక్కల్ని తారుమారు చేసింది. ఆ నిధుల్ని వినియోగించడం, దుర్వినియోగం చేశారు. కన్సార్టియం బ్యాంకుల చట్టబద్ధంగా బకాయిలను తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారని సీబీఐ అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment