DHFL
-
26 ట్రంక్ పెట్టెల్లో 3.3 లక్షల పత్రాలు..736 మంది సాక్షులు!
బ్యాంకింగ్ రంగంలోనే అతిపెద్ద కుంభకోణంగా పరిగణించే దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్(డీహెచ్ఎఫ్ఎల్) కేసు పరిష్కారానికి ఢిల్లీ హైకోర్టు స్పెషల్ సీబీఐ కోర్టును నియమించింది. రూ.34,614 కోట్లు కుంభకోణానికి సంబంధించి సీబీఐ చేసిన దర్యాప్తులో 3,30,000 పేజీల రిపోర్ట్‌ను తయారు చేశారు. ఈ కేసులో 108 మంది నిందితులు, 736 మంది సాక్షులున్నారని తెలిపారు. దాంతో కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ఢిల్లీ హైకోర్టు స్పెషల్ సీబీఐ కోర్టుకు సిఫారసు చేసింది. ఈమేరకు ఆగస్టు 1న ప్రత్యేకంగా ఈ కేసు కోసమే సీబీఐ కోర్టును ఏర్పాటు చేసి, న్యాయమూర్తిని నియమించింది. దీనివల్ల కేసు త్వరగా పరిష్కారమవుతుందని పేర్కొంది.ఢిల్లీ హైకోర్టు తెలిపిన వివరాల ప్రకారం..‘డీహెచ్ఎఫ్ఎల్ కుంభకోణం కేసుకు సంబంధించి సీబీఐ కోర్టు జడ్జి అశ్వనీ కుమార్ సర్పాల్ ఏప్రిల్ 27న న్యాయపరమైన ఉత్తర్వులను జారీ చేశారు. అందులో ఈ కేసు విచారణకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. సీబీఐ 26 ట్రంక్పెట్టెల్లో 3,30,000 పేజీల పత్రాలను దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రధాన ఛార్జిషీట్, అనుబంధ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం మొత్తం 108 మంది నిందితులు ఉన్నారని తెలిపారు. ఈ కేసులో నిజాలు నిరూపించడానికి 736 మంది సాక్షులున్నట్లు పేర్కొన్నారు. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని త్వరగా పరిష్కారం అయ్యేలా స్పెషల్ కోర్టును ఏర్పాటు చేస్తున్నాం’ అని తెలిపింది.అసలేంటీ కేసు..2010-18 మధ్య యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో 17 బ్యాంకుల కన్సార్షియం డీహెచ్ఎఫ్ఎల్కు రూ.42,871 కోట్ల విలువైన రుణాలను ఇచ్చింది. వీటిని తిరిగి చెల్లించడంలో విఫలమైనందుకు యూనియన్ బ్యాంక్ సీబీఐను ఆశ్రయించింది. సంస్థ ప్రమోటర్లుగా ఉన్న కపిల్, ధీరజ్‌లు నిజాల్ని కప్పిపుచ్చుతూ.. విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని, 2019 మే నుంచి రుణ చెల్లింపులను ఎగవేస్తూ రూ.34,614 కోట్ల మేర ప్రజా ధనాన్ని మోసం చేశారని బ్యాంకు ఆరోపించింది. డీహెచ్ఎఫ్ఎల్ ఖాతా పుస్తకాల ఆడిట్‌లోనూ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, నిధులు మళ్లించారని చెప్పింది. ఫలితంగా కపిల్, ధీరజ్‌లు సొంత ఆస్తులు పెంచుకున్నారని.. ఇదంతా ప్రజా ధనంతో చేశారని పేర్కొంది.ఇదీ చదవండి: రూ.652 కోట్లతో మొండి బాకీల కొనుగోలు!డీహెచ్ఎఫ్ఎల్ మోసాలు 2019 జనవరి నుంచి వెలుగులోకి రావడం మొదలైంది. ఈ సంస్థ నిధులు మళ్లిస్తోందంటూ ప్రసార మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. డీహెచ్ఎఫ్ఎల్పై ‘ప్రత్యేక ఆడిట్’ నిర్వహించాలంటూ బ్యాంకులు కేపీఎమ్‌జీ ఆడిట్ సంస్థను నియమించాయి. కపిల్, ధీరజ్ వాధ్వాన్లు దేశం విడిచిపెట్టకుండా ఉండేందుకు 2019 అక్టోబరు 18న ‘లుక్అవుట్ సర్క్యులర్’లను జారీ చేశాయి. -
వేలకోట్ల బ్యాంక్ ఫ్రాడ్.. డీహెచ్ఎఫ్ఎల్ ధీరజ్ వాధావన్ అరెస్ట్
రూ. 34,000 కోట్ల బ్యాంకు మోసం కేసులో దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్) మాజీ డైరెక్టర్ ధీరజ్ వాధవాన్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వాధవాన్‌ను సోమవారం సాయంత్రం ముంబైలో అదుపులోకి తీసుకున్నామని, మంగళవారం ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు సీబీఐ అధికారులు ధృవీకరించారు. బ్యాంకులను రూ.34,615 కోట్ల మేర మోసం చేసిన కేసులో డీహెచ్ఎఫ్ఎల్ మాజీ ప్రమోటర్లపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని 17 బ్యాంకుల కన్సార్టియంలను మోసం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సీబీఐ అధికారులు డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు ధీరజ్ వాధవాన్, కపిల్ వాధవాన్‌లపై కేసులు నమోదు చేశారు. ఎస్ బ్యాంక్ అవినీతి కేసులో అరెస్ట్ ఈ కేసుకు సంబంధించి 2022లో ధీరజ్‌ను సీబీఐ చార్జిషీట్లో చేర్చింది. ఎస్ బ్యాంక్ అవినీతి కేసులో వాధావాన్‌ను గతంలో సీబీఐ అరెస్ట్ చేస్తే బెయిల్‌పై విడుదలైనట్లు అధికారులు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ లోన్ కుంభకోణంగా వాధావాన్ అరెస్ట్‌పై 17 బ్యాంకుల కన్సార్టియంను రూ.34,000 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై సీబీఐ డీహెచ్ఎఫ్ఎల్ కేసు నమోదు చేసిందని, ఇది దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ లోన్ కుంభకోణంగా నిలిచిందని సీబీఐ అధికారులు పేర్కొన్నారునేరపూరిత కుట్రకుయూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంను మోసం చేయడానికి డీహెచ్ఎఫ్ఎల్ డైరెక్టర్లు కపిల్ వాధావన్, ధీరజ్ వాధవన్ ఇతర నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు. ఈ కుట్రలో భాగంగా వాధవాన్లు రూ. 42,871.42 కోట్ల భారీ రుణాలను మంజూరు చేసేందుకు కన్సార్టియం బ్యాంకులను ప్రేరేపించారని ఏజెన్సీ తెలిపింది.నిందితులు డీహెచ్ఎఫ్ఎల్ లెక్కల్ని తారుమారు చేసింది. ఆ నిధుల్ని వినియోగించడం, దుర్వినియోగం చేశారు. కన్సార్టియం బ్యాంకుల చట్టబద్ధంగా బకాయిలను తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారని సీబీఐ అధికారులు వెల్లడించారు. -
డీహెచ్ఎఫ్ఎల్ స్కామ్.. నిందితులకు బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు
దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(డీహెచ్ఎఫ్ఎల్), దాని మాజీ ప్రమోటర్లు కపిల్ వాధ్వాన్, దీరజ్ వాధ్వాన్‌పై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. యూనియన్ బ్యాంక్ నేతృత్వంలోని కన్షార్షియాన్ని రూ.34,615 కోట్ల మేర డీహెచ్ఎఫ్ఎల్ మోసగించిందన్న అభియోగాలపై సీబీఐ గతంలో కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి కపిల్, ధీరజ్లకు దిల్లీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు బుధవారం రద్దు చేసింది. జస్టిస్ బేల ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. నిందితులకు బెయిల్ మంజూరు చేయడంలో హైకోర్టు, ట్రయల్ కోర్టు ఇంకాస్త మెరుగ్గా స్పందించాల్సిందని సుప్రీంకోర్టు తెలిపింది. డీహెచ్ఎఫ్ఎల్ లోన్ స్కామ్‌కు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరిపిన సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. సీఆర్పీసీ ప్రకారం 90 రోజుల దర్యాప్తు గడువులోపు క్రిమినల్ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయడంలో విఫలమైతే నిందితులకు బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంది. అయితే ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 88వ రోజు సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా, ట్రయల్ కోర్టు నిందితులకు కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. దాన్ని సవాలుచేస్తూ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈతీర్పు వెలువడినట్లు తెలిసింది. అసలేం జరిగిందంటే.. డీహెచ్ఎఫ్ఎల్ మోసాలు 2019 జనవరి నుంచి వెలుగులోకి రావడం మొదలైంది. ఈ సంస్థ నిధులు మళ్లిస్తోందంటూ ప్రసార మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. డీహెచ్ఎఫ్ఎల్పై ‘ప్రత్యేక ఆడిట్’ నిర్వహించాలంటూ కేపీఎమ్‌జీ సంస్థను 2019 ఫిబ్రవరి 1న బ్యాంకులు నియమించాయి. 2015 ఏప్రిల్ 1-2018 డిసెంబరు మధ్యకాలానికి, ఆ సంస్థ ఖాతా పుస్తకాలపై సమీక్ష నిర్వహించాలని కేపీఎమ్‌జీని అప్పట్లో కోరాయి. కపిల్, ధీరజ్ వాధ్వాన్లు దేశం విడిచిపెట్టకుండా ఉండేందుకు 2019 అక్టోబరు 18న ‘లుక్అవుట్ సర్క్యులర్’లను బ్యాంకులు జారీ చేశాయి. కేపీఎమ్‌జీ నిర్వహించిన ఆడిట్లో.. రుణాలు, అడ్వాన్సులు పొందిన తర్వాత డీహెచ్ఎఫ్ఎల్కు చెందిన సంస్థలు, వ్యక్తులు, డైరెక్టర్ల ఖాతాలకు నిధుల మళ్లింపు జరిగిందని తేలినట్లు యూనియన్ బ్యాంకు పేర్కొంది. డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లకు రూ.29,100 కోట్ల మేర పంపిణీ జరిగినట్లు తెలుస్తుంది. ఇందులో చాలా వరకు లావాదేవీలు భూములు, ఆస్తుల రూపంలో పెట్టుబడులు పెట్టినట్లు బ్యాంకు ఖాతా పుస్తకాల పరిశీలనలో తేలినట్లు వివరించింది. రుణాలిచ్చిన నెలరోజుల్లోనే ఆ నిధులు సుధాకర్ షెట్టికి చెందిన కంపెనీల్లోకి పెట్టుబడుల రూపంలో మళ్లినట్లు తేలింది. రూ.వందల కోట్ల చెల్లింపులకు సంబంధించిన వివరాలు బ్యాంకు స్టేట్మెంట్లలో కనిపించలేదు. రుణాల అసలు, వడ్డీలపై సహేతుకం కాని రీతిలో మారటోరియం కనిపించింది. పలు సందర్భాల్లో డీహెచ్ఎఫ్ఎల్, తన ప్రమోటర్లకు భారీ ఎత్తున నిధులను పంపిణీ చేసింది. వాటిని తమ ఖాతా పుస్తకాల్లో రిటైల్ రుణాలుగా పేర్కొన్నారు. రూ.14,000 కోట్ల గల్లంతు ప్రాజెక్ట్ ఫైనాన్స్ కింద రూ.14,000 కోట్లు ఇచ్చినట్లు చూపారు. ఇందు కోసం 1,81,664 మందికి రిటైల్ రుణాలు ఇచ్చినట్లు తప్పుగా సృష్టించారు. ఇవ్వని రుణాల విలువ రూ.14,095 కోట్లుగా తేలింది. తరుచుగా.. ‘బాంద్రా బుక్స్’ పేరిట రుణాలను పేర్కొంటూ, వాటికి విడిగా డేటాబేస్ నిర్వహించారు. ఆ తర్వాత వాటన్నింటినీ ‘అదర్ లార్జ్ ప్రాజెక్ట్ లోన్స్’(ఓఎల్‌పీఎల్)లో విలీనం చేశారు. కాగా, కంపెనీకి చెందిన గృహ రుణాలు, ప్రాజెక్టు రుణాల హామీలు, ప్రమోటర్ల వాటా అమ్మకం తదితరాల ద్వారా కంపెనీపై ఒత్తిడి తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఎప్పటికప్పుడు డీహెచ్ఎఫ్ఎల్, ఆ కంపెనీ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌లు చెబుతూ వచ్చారు. ఇదీ చదవండి: సేవింగ్స్ ఖాతాలపై 7.75 శాతం వడ్డీ కావాలా..! 2019 మే నుంచి రుణాల చెల్లింపులు, వడ్డీలను డీహెచ్ఎఫ్ఎల్ ఆలస్యం చేస్తూ వచ్చింది. ఆ తర్వాత నిరర్థక ఆస్తులుగా కంపెనీ ఖాతాలను ప్రకటించారు. దాంతో బ్యాంకులపై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా రూ.34,615 కోట్ల మోసానికి పాల్పడినట్లు తేలింది. ఎఫ్ఐఆర్లో మాజీ ప్రమోటర్లతోపాటు అమిలిస్ రియల్టర్స్‌కు చెందిన సుధాకర్ షెట్టి, మరో ఎనిమిది మంది బిల్డర్లు కూడా ఉన్నారు. -
డీహెచ్ఎఫ్ఎల్ కేసులో... 75 మందిపై చార్జిషీట్
న్యూఢిల్లీ: రూ.34 వేల కోట్ల బ్యాంకులను మోసగించిన కేసులో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(డీహెచ్ఎఫ్ఎల్) మాజీ సీఎండీ కపిల్ వాధవన్, మరో 74 మందిపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఢిల్లీలోని సీబీఐ కోర్టులో వేసిన చార్జిషీట్లో ఆ సంస్థ మాజీ డైరెక్టర్ ధీరజ్ వాధవన్, మాజీ సీఈవో హర్షిల్ మెహతా పేర్లు కూడా ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. 17 బ్యాంకుల కన్సార్టియంను రూ.34 వేల కోట్ల మేర మోసగించినట్లు డీహెచ్ఎఫ్ఎల్పై ఆరోపణలున్నాయి. 2010 నుంచి 2018 వరకు 17 బ్యాంకులతో కూడిన కన్సార్టియం నుంచి ఏకంగా రూ.42,871 కోట్లు రుణాలు సేకరించింది హెచ్డీఎఫ్ఐ. అయితే 2019 నుంచి రుణాలకు సంబంధించిన చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో కన్సార్టియంకు నేతృత్వం వహిస్తున్న యూనియన్ బ్యాంకు 2021లో సీబీఐకి లేఖ రాసింది. తాము తాజాగా నిర్వహించిన ఆడిట్లో ఈ మోసం వెలుగు చూసినట్టు పేర్కొంది. దీనిపై దర్యాప్తు చేయాలని సీబీఐని ఈ ఏడాది ఫిబ్రవరిలో యూనియన్ బ్యాంకు కోరింది. దీనిపై విచారణ చేపట్టిన అనంతరం సీబీఐ కేసులు నమోదు చేసింది. ఇదీ చదవండి: డీహెచ్ఎఫ్ఎల్ కుంభకోణం.. రూ.34,615 కోట్ల మోసం.. సీబీఐ కేసు నమోదు -
దేశంలో ఈడీ హీట్.. రూ.415 కోట్లు విలువైన బిల్డర్స్ ఆస్తులు సీజ్!
ముంబై: దేశంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హీట్ కొనసాగుతోంది. మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్రలోని ఓ బిల్డర్‌కు చెందిన అగస్టావెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్‌ను సీజ్ చేసిన మరుసటి రోజునే మరిన్ని ఆస్తులను అటాచ్ చేసింది. ఆ బిల్డర్‌తో పాటు మరో వ్యక్తికి చెందిన మొత్తం రూ.415 కోట్లు విలువైన ఆస్తులను సీజ్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఎస్ బ్యాంక్- డీహెచ్ఎఫ్ఎల్ బ్యాంకింగ్ కుంభకోణానికి సంబంధించి.. ఇప్పటికే రేడియస్ డెవెలపర్స్ అధినేత సంజయ్ ఛాబ్రియా, ఏబీఐఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ చీఫ్ అవినాశ్ భోంస్లేలను అరెస్ట్ చేసింది ఈడీ. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్టియంకు రూ.34వేల కోట్లు మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతవారం అవినాశ్ భోంస్లేకు చెందిన హెలికాప్టర్‌ను పుణెలో స్వాధీనం చేసుకుంది కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ. తాజాగా బుధవారం సీజ్ చేసిన ఆస్తుల్లో.. ముంబైలోని రూ.116.5 కోట్లు విలువైన ఆస్తి, ఛాబ్రియా సంస్థలో 25 శాతం ఈక్విటీ షేర్లు, రూ.3 కోట్లు విలువైన ఫ్లాట్, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని హోటల్లో లాభం రూ.13.67 కోట్లు, రూ.3.10 కోట్లు విలువైన విలాసవంతమైన కార్లు ఉన్నాయి. మరోవైపు.. అవినాశ్ భోంస్లే ఆస్తుల్లో ముంబైలోని రూ.102.8 కోట్లు విలువైన డూప్లెక్స్ ఫ్లాట్, పుణెలోని రూ.14.65 కోట్లు, రూ.29.24 కోట్లు విలువైన భూములు, నాగ్‌పూర్‌లోని రూ.15.62 కోట్లు విలువైన మరో ల్యాండ్ వంటివి సీజ్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఇదీ కేసు.. పీఎంఎల్ఏ చట్టం 2002 ప్రకారం ఇరువురికి అటాచ్మెంట్ ఆదేశాలు జారీ చేసింది ఈడీ. తాజాగా సీజ్ చేసిన ఆస్తులతో మొత్తం ఇద్దరికి సంబంధించి రూ.1,827 కోట్లకు చేరినట్లు పేర్కొంది. 1988లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం ఎస్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్, డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్స్ కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్‌లను విచారిస్తోంది ఈడీ. డీహెచ్ఎఫ్ఎల్కు ఎస్ బ్యాంక్ నుంచి నిధులు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. డిహెచ్ఎఫ్ఎల్లోని స్వల్ప కాలిక నాన్ కన్వెర్టబుల్ డిబెంచర్స్‌లో రూ.3,700 కోట్లు ఎస్ బ్యాంక్ పెట్టుబడి పెట్టినట్లు ఈడీ పేర్కొంది. అలాగే.. మసాలా బాండ్స్‌లో రూ.283 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు తెలిపింది. దానికి బధులుగా డీహెచ్ఎఫ్ఎల్ ద్వారా కపిల్ వాద్వాన్.. రాణా కపూర్ సంస్థలకు రూ.600 కోట్లు రుణాలు మంజూరు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టగా సంజయ్ ఛాబ్రియాన్ చెందిన రేడియస్ గ్రూప్‌నకు రూ.2,317 కోట్లు రుణాలు వచ్చాయని... వాటిని అవినాశ్ భోంస్లేతో కలిసి ఇతర మార్గాల్లోకి మళ్లించాడని పేర్కొంది. ఇదీ చదవండి: ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు 10,306.. బకాయిల రద్దు 10 లక్షల కోట్లు -
రూ.34,615 కోట్ల బ్యాంక్ స్కాం,ఎవరీ సుధాకర్ శెట్టి!
న్యూఢిల్లీ: దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీహెచ్ఎఫ్ఎల్) రూ.34,615 కోట్ల బడా బ్యాంకింగ్ మోసం కేసుపై జరుగుతున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణలో కీలక అంశాలు వెలుగుచూస్తున్నాయి. అత్యున్నత స్థాయి వర్గాల కథనం ప్రకారం, రూ. 14,683 కోట్ల డీహెచ్ఎఫ్ఎల్ నిధుల ’మళ్లింపు’లో తొమ్మిది రియల్టీ సంస్థల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కీలక విచారణ జరుగుతోంది. అప్పటి చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ కపిల్ వాధ్వాన్, డైరెక్టర్ ధీరజ్ వాధ్వాన్, వ్యాపారవేత్త సుధాకర్ శెట్టిల నియంత్రణలో ఉన్న ఈ తొమ్మిది రియల్ ఎస్టేట్ సంస్థలు తమ బాస్‌ల ఆర్థిక ప్రయోజనాల కోసం అక్రమ మార్గాలను అనుసరించాయని సీబీఐ పేర్కొంది. తొమ్మిదిలో ఐదు సుధాకర్ శెట్టివే... తొమ్మిది రియల్టీ సంస్థల్లో ఐదు వ్యాపారవేత్త సుధాకర్ శెట్టి నియంత్రణలోనివి కావడం గమనార్హం. కంపెనీలు తీసుకున్న రుణాలు కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్ల ఆదేశాల మేరకు దారిమళ్లినట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. 2010–2018 మధ్య కాలంలో రూ. 42,871 కోట్ల మేర రుణాలను మంజూరు చేసిన 17 బ్యాంకుల కన్సార్టియంకు నేతృత్వం వహిస్తున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) నుండి వచ్చిన ఫిర్యాదుపై జూన్ 20వ తేదీన కేసు నమోదయ్యింది. కేసు నమోదయిన తర్వాత సీబీఐకి చెందిన దాదాపు 50 మందికిపైగా అధికారుల బృందం బుధవారం ముంబైలోని 12 ప్రాంగణాల్లో విస్తృత సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. డీహెచ్ఎఫ్ఎల్ మొత్తం కుంభకోణం రూ.34,615 కోట్లుగా సీబీఐ అధికారులు తెలిపారు. దీనిప్రకారం, ఇంత స్థాయిలో బ్యాంకింగ్ మోసం కేసుపై సీబీఐ విచారణ జరగడం ఇదే తొలిసారి. వాధ్వాన్ ద్వయం ఇతరులతో కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడి, వాస్తవాలను తప్పుగా చూపించి దాచిపెట్టారని, నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు పాల్పడ్డారని బ్యాంక్ తన ఫిర్యాదులో పేర్కొంది. మే 2019 నుండి రుణం తిరిగి చెల్లించడంలో డిఫాల్ట్ కావడం ద్వారా కన్సార్టియంను రూ. 34,614 కోట్ల మేర మోసగించడానికి కుట్ర జరిగిందని వివరించింది. -
డీహెచ్ఎఫ్ఎల్ కుంభకోణం.. రూ.34,615 కోట్ల మోసం.. సీబీఐ కేసు నమోదు
యూనియన్ బ్యాంక్ నేతృత్వంల్యోని 17 బ్యాంకుల కన్సార్టియాన్ని రూ. 34,615 కోట్ల రూపాయలకు మోసం చేశారంటూ దివాస్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పోరేషన్ (డీహెచ్ఎఫ్ఎల్) ప్రమోటర్లు కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్‌లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసు నమోదు చేసింది. డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లతో పాటు అమరిల్లీస్ రియల్టర్స్‌కు చెందిన సుధాకర్ శెట్టి, మరో ఆరుగురు బిల్డర్లపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. 2010 నుంచి 2018 వరకు 17 బ్యాంకులతో కూడిన కన్సార్టియం నుంచి ఏకంగా రూ.42,871 కోట్లు రుణాలు సేకరించింది హెచ్డీఎఫ్ఐ. అయితే 2019 నుంచి రుణాలకు సంబంధించిన చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో కన్సార్టియంకు నేతృత్వం వహిస్తున్న యూనియన్ బ్యాంకు 2021లో సీబీఐకి లేఖ రాసింది. తాము తాజాగా నిర్వహించిన ఆడిట్లో ఈ మోసం వెలుగు చూసినట్టు పేర్కొంది. దీనిపై దర్యాప్తు చేయాలని సీబీఐని ఈ ఏడాది ఫిబ్రవరిలో యూనియన్ బ్యాంకు కోరింది. దీనిపై విచారణ చేపట్టిన అనంతరం సీబీఐ కేసులు నమోదు చేసింది. బ్యాంకుల మోసానికి సంబంధించి డీహెచ్ఎఫ్ఎల్ అతి పెద్దదిగా నిలిచింది. ఈ కుంభకోణంలో రూ. 34,615 కోట్ల వరకు మోసం జరిగింది. ఇంతకు ముందు ఏజీబీ షిప్‌యార్డ్ కంపెనీ బ్యాంకులను రూ.22,842 కోట్ల వరకు ముంచడమే అతి పెద్ద మోసంగా రికార్డయ్యింది. కాగా యెస్ బ్యాంకును చీట్ చేసిన కేసులో కూడా డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లకు ప్రమేయం ఉంది. చదవండి: దటీజ్ టాటా.. ఆ కంపెనీకంటూ కొన్ని విలువలు ఉన్నాయ్! -
పిరమల్ పునర్వ్యవస్థీకరణకు సై
న్యూఢిల్లీ: వ్యాపార పునర్వ్యవస్థీకరణకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చనట్లు డైవర్సిఫైడ్ కంపెనీ పిరమల్ ఎంటర్ప్రైజెస్ తాజాగా వెల్లడించింది. దీనిలో భాగంగా ఫార్మాస్యూటికల్, ఫైనాన్షియల్ సరీ్వసుల బిజినెస్‌లను రెండు ప్రత్యేక కంపెనీలుగా విడదీయనున్నట్లు తెలియజేసింది. కంపెనీ నిర్మాణాన్ని సరళతరం చేస్తూ వీటిని రెండు లిస్టెడ్ కంపెనీలుగా విభజించనున్నట్లు వివరించింది. ఫార్మాస్యూటికల్ బిజినెస్‌ను పూర్తిగా విడదీయడం ద్వారా కన్సాలిడేట్ చేయనున్నట్లు తెలియజేసింది. పిరమల్ ఫార్మా పేరుతో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. దీంతో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో లిస్టయిన అతిపెద్ద ఫార్మా కంపెనీలలో ఒకటిగా పిరమల్ ఫార్మా నిలవనున్నట్లు తెలియజేసింది. ఏర్పాటు ఇలా..: బిజినెస్ విడతీతలో భాగంగా వాటాదారులకు ప్రతి 1 పిరమల్ ఎంటర్ప్రైజెస్(పీఈఎల్) షేరుకిగాను 4 పిరమల్ ఫార్మా లిమిటెడ్(పీపీఎల్) షేర్లను కేటాయించనుంది. పీఈఎల్ షేరు ముఖవిలువ రూ. 2 కాగా.. పీపీఎల్ షేరు రూ. 10 ముఖ విలువతో జారీ కానుంది. మరోవైపు పిరమల్ ఫార్మా నిర్వహణలోగల రెండు పూర్తి అనుబంధ సంస్థలను పీపీఎల్లో విలీనం చేయనుంది. తద్వారా ఫార్మా బిజినెస్ నిర్మాణాన్ని సులభతరం చేయనుంది. గత కొన్నేళ్లుగా ఒకే లిస్టెడ్ హోల్డింగ్ కంపెనీ పిరమల్ ఎంటర్ప్రైజెస్ ద్వారా డైవర్సిఫైడ్ బిజినెస్‌లను గ్రూప్ నిర్వహిస్తున్నట్లు చైర్మన్ అజయ్ పిరమల్ పేర్కొన్నారు. తాజాగా కార్పొరేట్ నిర్మాణాన్ని సరళతరం చేస్తూ బిజినెస్‌లను రెండుగా విడదీసేందుకు బోర్డు నిర్ణయించినట్లు తెలియజేశారు. వెరసి ఫైనాన్షియల్ సరీ్వసులు, ఫార్మా విభాగాల్లో నాయకత్వ స్థాయిలో ఉన్న స్వతంత్ర కంపెనీలుగా ఆవిర్భవించనున్నట్లు వివరించారు. కంపెనీల తీరిలా..: కాంట్రాక్ట్ తయారీ, అభివృద్ధి(సీడీఎంవో), కాంప్లెక్స్ జనరిక్స్‌లో గ్లోబల్ పంపిణీ, కన్జూమర్ ప్రొడక్టులు తదితరాలతో పిరమల్ ఫార్మా అతిపెద్ద లిస్టెడ్ కంపెనీలలో ఒకటిగా ఆవిర్భవించనున్నట్లు అజయ్ పేర్కొన్నారు. సీడీఎంవో బిజినెస్‌లో మూడు అతి పెద్ద కంపెనీలలో ఒకటిగా నిలవనున్నట్లు తెలియజేశారు. ఇక ఫైనాన్షియల్ సర్వీసుల విభాగంలో పిరమల్ ఎంటర్ప్రైజెస్ అతిపెద్ద లిస్టెడ్ డైవర్సిఫైడ్ ఎన్బీఎఫ్సీలలో ఒకటిగా ఏర్పాటు కానున్నట్లు తెలియజేశారు. ఇందుకు అనుగుణంగా పీహెచ్ఎల్ ఫిన్వెస్ట్ ప్రయివేట్ లిమిటెడ్‌ను పీఈఎల్లో విలీనం చేయనున్నారు. మరోపక్క డీహెచ్ఎఫ్ఎల్లో 100 శాతం వాటాను సొంతం చేసుకోవడంతో పీఈఎల్కు పూర్తి అనుబంధ కంపెనీగా ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ కొనసాగనున్నట్లు అజయ్ వెల్లడించారు. పిరమల్ ఎంటర్ప్రైజెస్ షేరు ఎన్ఎస్ఈలో 2 శాతం లాభపడి రూ. 2,899 వద్ద ముగిసింది. -
దివాలా తీసిన డీహెచ్ఎఫ్ఎల్, ఇక పిరమల్ గ్రూపే దిక్కా?!
ముంబై: దివాలా తీసిన డీహెచ్ఎఫ్ఎల్ కొనుగోలుకు పిరమల్ గ్రూప్ వేసిన బిడ్డింగ్ సోమవారం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదం పొందింది. అయితే కొన్ని షరతులకు లోబడి ఈ ఆమోదం ఉంటుందని హెచ్‌పీ చతుర్వేది, రవికుమార్ దురైస్వామిలతో కూడిన ట్రిబ్యునల్ ముంబై బెంచ్ స్పష్టం చేసింది. ఈ అంశానికి సంబంధించి నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఇచ్చే తుది తీర్పునకు అలాగే డీహెచ్ఎఫ్ఎల్ ఒకప్పటి ప్రమోటర్ కపిల్ వాధ్వాన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం రూలింగ్‌కు లోబడి తమ రూలింగ్ ఉంటుందని ఎన్సీఎల్టీ డివిజినల్ బెంచ్ స్పష్టం చేసింది. డీహెచ్ఎఫ్ఎల్ కొనుగోలు ప్రతిపాదనలకు పిరమల్ గ్రూప్‌నకు ఈ ఫిబ్రవరిలో ఆర్బీఐ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా.. కాంపిటీషన్ కమిషన్ నుంచి ఏప్రిల్‌లో అనుమతి లభించింది. సీఓసీకి సూచన: కాగా ఆమోదిత పరిష్కార ప్రణాళిక (రిజల్యూషన్ ప్లాన్) కింద చిన్న స్థాయి స్థిర డిపాజిట్ హోల్డర్లకు మరింత డబ్బును ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని డీహెచ్ఎఫ్ఎల్ రుణదాతల కమిటీ (సీఓసీ)కి ఎన్సీఎల్టీ బెంచ్ తన ఉత్తర్వుల్లో సూచించింది. రిజల్యూషన్ ప్రణాళి కా ప్రతిని తనకు అందించాలన్న కపిల్ వాధ్వాన్ విజ్ఞప్తిని సైతం ఎన్సీఎల్టీ తిరస్కరించింది. పూర్వాపరాల్లోకి వెళితే... వాధ్వాన్ ఇచ్చిన ఆఫర్‌ను పరిశీలించాలని డీహెచ్ఎఫ్ఎల్ రుణ గ్రహీతలకు ఎన్సీఎల్టీ ఇచ్చిన ఆదేశాలపై మే 25న ఎన్సీఎల్ఏటీ స్టే ఇచ్చింది. రుణదాతల కమిటీ తరఫున యూనియన్ బ్యాంక్ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించిన అప్పీలేట్ ట్రిబ్యునల్ ఈ రూలింగ్ ఇచ్చింది. అయితే సీఓసీల పరిష్కార ప్రణాళికను ఆమోదించడంపై ఎన్సీఎల్టీ నిర్ణయానికి అడ్డురాబోమని స్పష్టం చేసింది. దీనిపై వాధ్వాన్ దాఖలు చేసిన అప్పీల్ సుప్రీంకోర్టులో ప్రస్తుతం పెండింగులో ఉంది. వాధ్వాన్ గతేడాది స్వయంగా రుణ దాతల కమిటీకి సెటిల్మెంట్ ఆఫర్ ఇచ్చారు. అయితే దీనికి విశ్వసనీయత లేదని సీఓసీ ఈ ఆఫర్‌ను తిరస్కరించింది. బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్‌సహా కంపెలో పలువురు స్థిర డిపాజిట్ హోల్డర్లకు డీహెచ్ఎఫ్ఎల్ దాదాపు రూ.90,000 కోట్లు చెల్లించాల్సి ఉన్న సంగతి తెలిసిందే. డీలిస్టింగ్‌కు అవకాశం! కాగా పిరమల్ గ్రూప్ కొనుగోళ్ల ప్రక్రియ అనంతరం డీహెచ్ఎఫ్ఎల్ మార్కెట్ల నుంచి డీలిస్టయ్యే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మార్గదర్శకాలు, ఐబీసీ నిబంధనల ప్రకారం పిరమల్ గ్రూప్ గూటికి చేరిన తర్వాత డీహెచ్ఎఫ్ఎల్ స్టాక్ ఎక్సే్ఛంజీల నుంచి డీలిస్టయ్యే వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వార్తలతో డీహెచ్ఎఫ్ఎల్ షేరు ఎన్ఎస్ఈలో 10% జంప్‌చేసి రూ. 20.80 వద్ద ముగిసింది. చదవండి : బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్ -
డీహెచ్ఎఫ్ఎల్ ఉత్తుత్తి గృహ రుణాలు..
న్యూఢిల్లీ: లబ్ధిదారులతో సంబంధం లేకుండా ఉత్తుత్తి (కల్పిత) గృహ రుణ ఖాతాలను సృష్టించి వాటిపై ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం (పీఎంఏవై) సబ్సిడీలను డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీ మింగేసినట్టు బయటపడింది. ఇందుకు సంబంధించి డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీ, డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు అయిన కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్, డైరెక్టర్లపై కేసు నమోదు చేసింది. డీహెచ్ఎఫ్ఎల్ ఖాతాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన గ్రాంట్ థార్న్టన్ సంస్థ ఈ మోసాలను వెలుగులోకి తీసుకొచ్చింది. డీహెచ్ఎఫ్ఎల్ ముంబైలోని బాంద్రాలో కల్పిత శాఖను ఏర్పాటు చేయడమే కాకుండా.. అప్పటికే గృహ రుణాలు తీసుకుని చెల్లించేసిన రుణ ఖాతాలను ఉత్తుత్తి శాఖలోని డేటాబేస్‌లో చేర్చింది. 2007–19 మధ్య ఇందుకు సంబంధించి 2.60 లక్షల నకిలీ ఖాతాలను సృష్టించి రూ.14,046 కోట్ల రుణాలను మంజూరు చేసినట్టు చూపింది. రూ.11,756 కోట్లను ఇలా దారిమళ్లించినట్టు బయటపడింది. -
డీహెచ్ఎఫ్ఎల్లో బయటపడ్డ మరో భారీ మోసం
న్యూఢిల్లీ: దివాలా తీసిన దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీహెచ్ఎఫ్ఎల్)లో తవ్విన కొద్దీ మోసాలు బైటపడుతూనే ఉన్నాయి. తాజాగా రూ. 6,182 కోట్ల మేర విలువ చేసే అక్రమ లావాదేవీలను ఆడిటింగ్ సంస్థ గ్రాంట్ థార్న్టన్(జీటీ) గుర్తించింది. ‘అసలు విలువ తగ్గించి చూపేలా, మోసపూరితంగా, పక్షపాత ధోరణితో వ్యవహరించిన విధంగా‘ కొన్ని లావాదేవీలు జరిగినట్లు కంపెనీ అడ్మినిస్ట్రేటరుకు ఆడిటర్ నుంచి ప్రాథమిక నివేదిక వచ్చినట్లు స్టాక్ ఎక్స్చేంజిలకు డీహెచ్ఎఫ్ఎల్ వెల్లడించింది. ‘సుమారు రూ. 5,382 కోట్ల అసలు రుణం, రూ. 589 కోట్ల వడ్డీ బకాయి, తక్కువ వడ్డీ రేటు విధించడం వల్ల రూ. 211 కోట్ల మేర నష్టం.. అంతా కలిపి దాదాపు రూ. 6,182 కోట్ల మేర ప్రభావం చూపే విధంగా మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు ట్రాన్సాక్షన్ ఆడిటర్ నివేదికలో పేర్కొంది‘ అని కంపెనీ పేర్కొంది. ఈ లావాదేవీలన్నీ కొన్నేళ్ల పాటు క్రమంగా జరిగాయని గ్రాంట్ థార్న్టన్ వివరించింది. జీటీ నివేదిక ఆధారంగా.. కంపెనీ ప్రమోటర్లు కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్‌లతో పాటు క్రియేటజ్ బిల్డర్స్, ఇక్షుదీప్ ఫిన్‌క్యాప్, రైట్ డెవలపర్స్ తదితర సంస్థలపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో అడ్మినిస్ట్రేటర్ పిటిషన్ దాఖలు చేశారు. పలు మోసాలు బైటపడిన నేపథ్యంలో డీహెచ్ఎఫ్ఎల్ దివాలా తీయడం, కంపెనీ నిర్వహణను ప్రస్తుతం అడ్మినిస్టేటర్‌కు అప్పగించడం తెలిసిందే. రూ.14,046 కోట్ల మేర నిధులు గోల్మాల్ చేసిందని డీహెచ్ఎఫ్ఎల్పై ఆరోపణలు ఉన్నాయి. 2020 డిసెంబర్లో రూ.1,058 కోట్ల మోసపూరిత లావాదేవీల వ్యవహారం బయటపడింది. చదవండి: ఫిబ్రవరిలో ఎఫ్‌పిఐ పెట్టుబడులు వెల్లువ ఇక నుంచి ఆన్లైన్లో స్ట్రీట్ ఫుడ్ -
మార్కెట్ల పతనం- దివాన్, ఏఆర్ఎస్ఎస్ జోరు
ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా రికార్డుల ర్యాలీ బాటలో సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు మిడ్‌సెషన్ నుంచీ బోర్లా పడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 648 పాయింట్లు పతనమై 43,875కు చేరింది. ఈ నేపథ్యంలోనూ సానుకూల వార్తల కారణంగా మౌలిక సదుపాయాల కంపెనీ ఏఆర్ఎస్ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎన్బీఎఫ్సీ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి పతన మార్కెట్లోనూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. ఏఆర్ఎస్ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నుంచి రూ. 210 కోట్ల విలువైన ఆర్డర్ లభించినట్లు ఏఆర్ఎస్ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తాజాగా వెల్లడించింది. దీనిలో భాగంగా మేఘాలయ ఎన్‌హెచ్-40లో రెండు లైన్ల రహదారిని అభివృద్ధి చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. జేఐసీఏ రుణ మద్దతుకింద ఈపీసీ పద్ధతిలో ఈ కాంట్రాక్టు దక్కినట్లు వివరించింది. ఈ నేపథ్యంలో ఏఆర్ఎస్ఎస్ ఇన్ఫ్రా షేరు ఎన్ఎస్ఈలో 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 15.45 వద్ద ఫ్రీజయ్యింది. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ ఆర్థిక సమస్యలతో ఎన్సీఎల్టీకి చేరిన దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ ఆస్తుల విక్రయానికి అధిక ధరలో బిడ్స్ దాఖలు చేయమని ఆహ్వానించవలసిందిగా రుణదాతలు కోరుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దివాళా చట్టానికి లోబడి ఎన్సీఎల్టీకి చేరిన తొలి ఎన్‌బీఎఫ్‌సీగా నిలిచిన డీహెచ్ఎఫ్ఎల్పై నేడు రుణదాతల కమిటీ(సీవోసీ) ఓటు వేయనున్నట్లు తెలుస్తో్ంది. కంపెనీలో వాటా కొనుగోలు లేదా కొన్ని ఆస్తుల కొనుగోలుకి అదానీ గ్రూప్, పిరమల్ ఎంటర్ప్రైజెస్, యూఎస్ కంపెనీ ఓక్ట్రీ, హాంకాంగ్ సంస్థ ఎస్సీ లోవీ తదితరాలు 10-70 శాతం అధిక ధరలలో బిడ్స్ దాఖలు చేసినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. ఈ అంశంపై నేడు సీవోసీ నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధితవర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో డీహెచ్ఎఫ్ఎల్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 24.60 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం! -
ఆస్తులమ్మి అప్పులు తీర్చేస్తాం
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న డీహెచ్ఎఫ్ఎల్ సంస్థ తమ చేయి జారకుండా ప్రమోటర్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా సుమారు రూ. 43,000 కోట్ల విలువ చేసే తమ వ్యక్తిగత, కుటుంబ ఆస్తులను విక్రయించైనా రుణదాతల బాకీలు తీర్చేస్తామని జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ప్రమోటర్ కపిల్ వాధ్వాన్ తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ నియమించిన అడ్మిని స్ట్రేటర్ ఆర్ సుబ్రమణియ కుమార్‌కు ఈ మేరకు లేఖ రాశారు. రుణ బాకీలు తీర్చేసే దిశగా.. తమ కుటుంబానికి వివిధ ప్రాజెక్టుల్లో ఉన్న వాటాలను, హక్కులను బదలాయిస్తామని వాధ్వాన్ ప్రతిపాదించారు. 2018 సెప్టెంబర్ నాటి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం కారణంగా డీహెచ్ఎఫ్ఎల్తో పాటు పలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు కుదేలయ్యాయని ఆయన తెలిపారు. కష్టకాలంలోనూ వివిధ అనుబంధ సంస్థలను విక్రయించడం ద్వారా డీహెచ్ఎఫ్ఎల్ దాదాపు రూ. 44,000 కోట్లు చెల్లించిందని వివరించారు. మనీలాండరింగ్, నిధుల గోల్మాల్ వంటి ఆరోపణలపై డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు కపిల్, ఆయన సోదరుడు ధీరజ్ వాధ్వాన్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. బాకీలను రాబట్టుకునే క్రమంలో రుణదాతలు .. డీహెచ్ఎఫ్ఎల్ని వేలానికి ఉంచగా ఓక్ట్రీ, ఎస్సీ లోవీ తదితర సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. -
జెట్- దివాన్- కాస్మో ఫిల్మ్స్.. దూకుడు
విభిన్న సానుకూల వార్తల నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో జెట్ ఎయిర్వేస్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్(డీహెచ్ఎఫ్ఎల్), కాస్మో ఫిల్మ్స్ కౌంటర్లు జోరు చూపుతున్నాయి. మార్కెట్లను మించి భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. జెట్ ఎయిర్వేస్ కల్రాక్ క్యాపిటల్- మురారీ లాల్ జలాన్ ప్రతిపాదిత రిజల్యూషన్ ప్రణాళికకు రుణదాతల కన్సార్షియం ఆమోదముద్ర వేయడంతో ప్రయివేట్ రంగ సంస్థ జెట్ ఎయిర్వేస్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 42.20 వద్ద ఫ్రీజయ్యింది. వెరసి గత 8 రోజుల్లో ఈ షేరు 47 శాతం ర్యాలీ చేసింది. రూ. 1,000 కోట్ల తొలి దశ పెట్టుబడి ద్వారా జెట్ ఎయిర్వేస్ను పూర్తిస్థాయి కార్యకలాపాలతో పునరుద్ధరించాలని కల్రాక్ క్యాపిటల్ ఆశిస్తోంది. ఇందుకు వీలుగా ఇప్పటికే రుణదాతలు, అంతర్జాతీయ విమానయాన సంస్థలు, భాగస్వాములతో చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. డీహెచ్ఎఫ్ఎల్ ఎన్బీఎఫ్సీ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కొనుగోలుకి నాలుగు కంపెనీలు బిడ్డింగ్ చేసినట్లు తెలుస్తోంది. బిడ్స్ దాఖలు చేసిన సంస్థలలో పిరమల్, అదానీ గ్రూప్‌లున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న డీహెచ్ఎఫ్ఎల్ కోసం నాలుగు కంపెనీలు రిజల్యూషన్ ప్రణాళికలు దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అదానీ, పిరమల్ గ్రూప్‌లతోపాటు యూఎస్ కంపెనీ ఓక్ట్రీ క్యాపిటల్, ఎస్సీ లోవీ సైతం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డీహెచ్ఎఫ్ఎల్ షేరు ఎన్ఎస్ఈలో 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 13.85 వద్ద ఫ్రీజయ్యింది. కాస్మో ఫిల్మ్స్ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు ప్రతిపాదించినట్లు ప్యాకేజింగ్ కంపెనీ కాస్మో ఫిల్మ్స్ తాజాగా పేర్కొంది. బైబ్యాక్ అంశంపై ఈ నెల 26న సమావేశంకానున్న బోర్డు చర్చించనున్నట్లు తెలియజేసింది. దీంతో ఎన్ఎస్ఈలో తొలుత కాస్మో ఫిల్మ్స్ షేరు దాదాపు 10 శాతం దూసుకెళ్లి రూ. 468కు చేరింది. ప్రస్తుతం 7 శాతం లాభంతో రూ. 456 వద్ద ట్రేడవుతోంది. -
యస్ బ్యాంకు స్కాం: వాధవాన్ సోదరులకు బెయిల్
సాక్షి, ముంబై: యస్ బ్యాంక్ కుంభకోణంలో వాధవాన్ సోదరులకు బెయిల్ లభించింది. కోట్ల రూపాయల మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రమోటర్లు కపిల్ వాధవన్, ధీరజ్ వాధవన్‌లకు బొంబాయి హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 60 రోజుల వ్యవధిలో చార్జిషీట్ దాఖలు చేయడంలో విఫలమైనందున బెయిల్ ఇవ్వాలన్న అభ్యర్థనపై జస్టిస్ భారతి డాంగ్రే సానుకూలంగా స్పందించారు. అయితే ఒక్కొక్కరూ లక్ష రూపాయలు సెక్యూరిటీగా జమ చేయడంతోపాటు పాస్‌పోర్టులను అప్పగించాలని వీరిద్దరిని కోర్టు ఆదేశించింది. మనీలాండరింగ్ ఆరోపణలపై వీరిని మే 14 న ఈడీ అరెస్టు చేసింది. అయితే జూలై 15 న వాధవన్స్, యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా కపూర్, అతని భార్య బిందు కపూర్, కుమార్తెలు రోష్ని, రేఖ, వారి చార్టర్డ్ అకౌంటెంట్ దులరేష్ కె జైన్‌తో పాటు సహచరులపై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. 'క్విడ్ ప్రో క్వో' కు సంబంధించి సీబీఐ 2020 మార్చి 7న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తరువాత ఈడీ ఈ కేసులో విచారణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. సీబీఐ కేసు నేపథ్యంలో వీరిద్దరూ జైలులో ఉండాల్సి ఉంటుంది. -
డీహెచ్ఎఫ్ఎల్ ఖాతాతో పీఎన్బీకి షాక్
గృహ రుణాల సంస్థ డీహెచ్ఎఫ్ఎల్కు ఇచ్చిన రుణాల విషయంలో మోసం(ఫ్రాడ్) జరిగినట్లు తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) పేర్కొంది. రూ. 3688 కోట్లమేర రుణాలను డీహెచ్ఎఫ్ఎల్ మోసపూరితంగా తీసుకున్నట్లు పీఎన్బీ తాజాగా రిజర్వ్ బ్యాంక్‌కు నివేదించింది. ఈ రుణాలకు సంబంధించి డీహెచ్ఎఫ్ఎల్ను మోసపూరిత ఖాతాగా ప్రకటించింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం మోసపూరిత ఖాతాలపై నాలుగు త్రైమాసికాలలో 100 శాతం ప్రొవిజనింగ్‌ను చేపట్టవలసి ఉంటుంది. దీంతో ఇప్పటికే డీహెచ్ఎఫ్ఎల్ ఖాతాపై రూ. 1246 కోట్ల ప్రొవిజనింగ్‌ను చేపట్టినట్లు పీఎన్బీ వెల్లడించింది. షేరు డౌన్ డీహెచ్ఎఫ్ఎల్ ఖాతా మోసపూరితమని వెల్లడించిన నేపథ్యంలో పీఎన్బీ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో పీఎన్బీ షేరు 5.5 శాతం పతనమై రూ. 35 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఇప్పటికే పీఎస్‌యూ దిగ్గజం ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్‌తోపాటు.. ప్రయివేట్ రంగ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్ సైతం డీహెచ్ఎఫ్ఎల్ మోసపూరిత ఖాతాలపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించాయి. రూ. 85,000 కోట్లకుపైగా రుణ భారాన్ని కలిగి.. దివాళా కోర్టులకు చేరిన తొలి ఫైనాన్షియల్ సేవల కంపెనీగా డీహెచ్ఎఫ్ఎల్ నిలిచినట్లు విశ్లేషకులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. -
లాక్డౌన్ : బిలియనీర్ల విందు, ఉన్నతాధికారిపై వేటు
సాక్షి, ముంబై: యస్ బ్యాంక్ కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు బిలియనీర్లు కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్ లను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరోనా -19 లాక్డౌన్ నిబంధలను ఉల్లంఘించి, మహారాష్ట్ర హిల్ రిసార్ట్‌లోని వారి ఫామ్‌హౌస్ లో విందు చేసుకుంటున్న వీరిని అరెస్ట్ చేశారు. అంతేకాదు వీరికి అక్కడికి వెళ్లేందుకు అనుమతిచ్చిన ఐఎఎస్ అధికారిపై వేటు వేశారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న వేళ, లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలందరూ భౌతికదూరాన్నిపాటిస్తోంటే, వీరు మాత్రం కుటుంబ సభ్యులతో మహాబలేశ్వర్‌లోని ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. ఆరు హై-ఎండ్ వాహనాలను గుర్తించిన స్థానికులు వెంటనే మునిసిపల్ అధికారులకు తహశీల్దార్ కు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఇద్దరు డిహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లతో సహా మొత్తం 23 మంది సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అత్యవసరం పరిస్థితి పేరుతో పాస్‌లు జారీ చేసిన మహారాష్ట్ర ప్రభుత్వ హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అమితాబ్ గుప్తాను బలవంతపు సెలవుపై పంపారు. వీరు తన కుటుంబ స్నేహితులనీ, కుటుంబ అత్యవసర పరిస్థితుల నిమిత్తం ఖండాలా నుండి మహాబలేశ్వర్ వరకు వెళ్లేందుకు అనుమతించాలంటూ అమితాబ్ గుప్తా పాసులు జారీ చేశారు. దీంతో వీరంతా బుధవారం రాత్రి ఐదు కార్లలో ముంబైకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నఫామ్‌హౌస్ తరలివెళ్లారు. వాధ్వాన్ల వంటవారు, సేవకులు ముఖ్యంగా కరోనా వైరస్ సంక్షోభంలో అత్యంత ప్రభావితమైన దేశం ఇటలీకి చెందిన వాధ్వాన్ బాడీగార్డ్ ఇందులో వుండటం గమనార్హం. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న అధికారులు వీరందరిపైనా కేసు నమోదు చేశారు. వీరిని క్వారంటైనకు తరలించామని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం) మరోవైపు పీఎంసీ బ్యాంకు కుంభకోణం సహా, పలు అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు, కపిల్, ధీరజ్ వాధ్వాన్ మీద సీబీఐ లుకౌట్ నోటీసులు కూడా ఉన్నాయి. గత నెలలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా, మూడుస్లారు నిందితులు తప్పించుకున్నారు. అయితే క్వారంటైన్ గడువు ముగిసిన తర్వాత వారిని అదుపులోకి తీసుకోవాలని సీబీఐ భావిస్తోంది. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తుందని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. -
యస్ బ్యాంక్ స్కామ్‌పై సీబీ‘ఐ’
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ కుంభకోణం కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. డీహెచ్ఎఫ్ఎల్ సంస్థ నుంచి యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్ కుటుంబానికి రూ. 600 కోట్లు ముడుపులు ముట్టాయన్న ఆరోపణలకు సంబంధించి సోమవారం 7 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ వ్యవహారంలో అయిదు కంపెనీలు, రాణా కపూర్‌తో పాటు ఆయన భార్య, ముగ్గురు కుమార్తెలు (రోష్ని, రాఖీ, రాధ) సహా ఏడుగురు వ్యక్తులపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీహెచ్ఎఫ్ఎల్) ప్రమోటరు కపిల్ వాధ్వాన్, ఆర్కేడబ్ల్యూ డెవలపర్స్ డైరెక్టర్ ధీరజ్ రాజేష్ కుమార్ వాధ్వాన్లు వీరిలో ఉన్నారు. ఇక, కంపెనీల విషయానికొస్తే.. డీహెచ్ఎఫ్ఎల్, ఆర్కేడబ్ల్యూ డెవలపర్స్, కపూర్ కుటుంబ సారథ్యంలోని డూఇట్ అర్బన్ వెంచర్స్, బిందు కపూర్ డైరెక్టరుగా ఉన్న ఆర్ఏబీ ఎంటర్ప్రైజెస్, రాణా కపూర్ కుమార్తెలు డైరెక్టర్లుగా ఉన్న మోర్గాన్ క్రెడిట్స్ సంస్థలు ఉన్నాయి. ముంబైలోని నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ బృందాలు సోదాలు నిర్వహించాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశం విడిచి వెళ్లిపోకుండా.. వారిపై లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ అయినట్లు పేర్కొన్నాయి. అటు యస్ బ్యాంక్ జారీ చేసిన భారీ రుణాలు మొండిబాకీలుగా మారడంపైనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి పెట్టింది. డీహెచ్ఎఫ్ఎల్కి మాత్రమే పరిమితం కాకుండా రుణాలు తీసుకున్న ఇతర కంపెనీల నుంచి కూడా కపూర్ కుటుంబానికి ముడుపులేమైనా వచ్చాయేమోనన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తోంది. అటు యస్ బ్యాంక్ సీఈవో రవ్నీత్ గిల్‌ను కూడా ఈడీ ప్రశ్నించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నిధులు మళ్లించారిలా .. డీహెచ్ఎఫ్ఎల్కు యస్ బ్యాంక్ ఇచ్చిన రుణాల్లో కొంత భాగాన్ని కపిల్ వాధ్వాన్‌తో కలిసి రాణా కపూర్ దారి మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి. 2018 ఏప్రిల్ – జూన్ మధ్యకాలంలో డీహెచ్ఎఫ్ఎల్కు చెందిన షార్ట్ టర్మ్ డిబెంచర్లలో యస్ బ్యాంక్ రూ. 3,700 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. దీంతో పాటు డీహెచ్ఎఫ్ఎల్ గ్రూప్ సంస్థ అయిన ఆర్కేడబ్ల్యూ డెవలపర్స్‌కు రూ. 750 కోట్లు రుణం ఇచ్చింది. అయితే, నిర్దేశిత ప్రాజెక్టులో పైసా కూడా పెట్టకుండా ఆర్కేడబ్ల్యూ డెవలపర్స్ మొత్తం రుణం నిధులను డీహెచ్ఎఫ్ఎల్కు బదలాయించింది. యస్ బ్యాంక్ నుంచి రుణం లభించినందుకు ప్రతిగా కపూర్ కుమార్తెలకు చెందిన డూఇట్ అర్బన్ వెంచర్స్‌లో వాధ్వాన్ దాదాపు రూ. 600 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇది ఓ రకంగా కపూర్‌కు ముడుపులివ్వడమేనన్నది సీబీఐ ఆరోపణ. సుమారు రూ. 97,000 కోట్లు బ్యాంకు రుణాలు తీసుకున్న డీహెచ్ఎఫ్ఎల్ సుమారు రూ.31,000 కోట్ల నిధులు దారి మళ్లించిందని ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకుల బాండ్లలో రూ. 93,000 కోట్ల పెట్టుబడులు.. దేశీ బ్యాంకులు జారీ చేసిన అదనపు టియర్ 1 బాండ్లలో ఇన్వెస్టర్లు దాదాపు రూ. 93,669 కోట్లు ఇన్వెస్ట్ చేశారని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. యస్ బ్యాంక్ గానీ దాదాపు రూ. 8,000 కోట్ల పైచిలుకు బాండ్లను పూర్తిగా రైటాఫ్ చేసిన పక్షంలో ఇన్వెస్టర్లు ఇకపై రిస్కులు తీసుకోవడానికి ముందుకు రాకపోవచ్చని పేర్కొంది. మరోవైపు, యస్ బ్యాంక్ సమస్యకు సత్వర పరిష్కారం అమలు చేయడంతో.. సంక్షోభం బ్యాంకింగ్ రంగం అంతటా విస్తరించకుండా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ పేర్కొంది. ముందే పసిగట్టారా!! యస్ బ్యాంక్ పరిస్థితి నానాటికీ దిగజారుతుండటాన్ని ముందుగానే పసిగట్టినట్లుగా పలువురు ఖాతాదారులు గతేడాది మార్చి–సెప్టెంబర్ మధ్య కాలంలో భారీగా విత్‌డ్రా చేసుకున్నారు. ఈ వ్యవధిలో ఏకంగా రూ. 18,100 కోట్ల మేర విత్‌డ్రాయల్ లావాదేవీలు నమోదయ్యాయి. మరోవైపు, డిపాజిట్లపై బీమా పరిమాణాన్ని పెంచిన నేపథ్యంలో తమ సొమ్ముకేమీ కాదని భావిస్తున్నట్లు కొందరు డిపాజిటర్లు తెలిపారు. అటు, మరో రెండు మ్యూచువల్ ఫండ్ సంస్థలు.. తమ స్కీమ్‌ల నుంచి యస్ బ్యాంక్ పెట్టుబడులను పక్కకు పెట్టాయి. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎంఎఫ్, బరోడా ఎంఎఫ్ వీటిలో ఉన్నాయి. యస్ బ్యాంక్ డెట్ సాధనాలను రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ‘డి’ స్థాయికి కుదించడం ఇందుకు కారణం. ఈ వారంలోనే మారటోరియం ఎత్తేయొచ్చు: అడ్మినిస్ట్రేటర్ కుమార్ పరిస్థితులు చక్కబడితే ఈ వారంలోనే మారటోరియం ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయని ఆర్బీఐ నియమించిన యస్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఎస్బీఐ పెట్టుబడుల ప్రణాళికకు రిజర్వ్ బ్యాంక్ ఆమోదముద్ర వేస్తే.. యస్ బ్యాంక్ మారటోరియంపరమైన ఆంక్షల నుంచి బైటికి రాగలదన్నారు. డిపాజిటర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంతో పాటు నిధుల సమీకరణ కూడా తమ ప్రధాన లక్ష్యాలుగా ఉంటాయని కుమార్ చెప్పారు. బ్యాంకింగ్ సేవలన్నీ సాధ్యమైనంత త్వరగా పునరుధ్ధరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తమ ఏటీఎంలతో పాటు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో కూడా విత్‌డ్రాయల్ సదుపాయం అందుబాటులోకి తేగలిగినట్లు చెప్పారు. డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను మార్చి 14న ప్రకటిస్తామని కుమార్ తెలిపారు. -
రాణాకపూర్ అక్రమాలు, బిగుస్తున్న ఉచ్చు
సాక్షి, ముంబై: యస్ బ్యాంక్ సంక్షోహంలో ఫౌండర్ రాణా కపూర్ చుట్టూ ఆర్థిక అవకతవకల ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఆయనను ఈడీ అదుపులోకి తీసుకోగా మనీలాండరింగ్ కేసులో రాణా కపూర్‌తో పాటు మరికొందరిపై నమోదైన కేసులపై ఈడీ చర్యలు చేపట్టింది. తాజాగా సీబీఐ కూడాసీరియస్‌గా స్పందిస్తోంది. ఆయన నిసావాసాల్లో పలుమార్లు సోదాలు నిర్వహిచిన సీబీఐ రాణాకపూర్ కుటుంబంతోపాటు, డీహెచ్ఎఫ్ఎల్ పై కూడా కేసు నమోదు చేసింది. డీహెచ్ఎఫ్ఎల్ రుణాల విషయంలో రాణాకపూర్ క్విడ్ ప్రోకు పాల్పడినట్టు ఆరోపించింది. రాణా కపూర్ కు రూ. 600కోట్ల లాభం చేకూరిందని సీబీఐ తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. తన స్థానాన్ని ఉపయోగించుకుని యస్ బ్యాంకులో భారీ స్కాం పాల్పడ్డాడని పేర్కొంది. ఈ కుంభకోణంలో రాణా కపూర్ కుమార్తెలు రాఖీ, రోషిణి, రాధాలు లబ్ది పొందినట్లు తెలిపింది. అలాగే ఇలాంటివి మరిన్ని ఉండవచ్చని కూడా అనుమానాలు వ్యక్తం చేసింది. రాణా కపూర్ కుటుబం (భార్య బిందు, ముగ్గురు కుమార్తెలు రోషిణి, రాఖీ, రాధా) మొత్తాన్ని సీబీఐ బుక్ చేసింది. అలాగే డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్ కపిల్ వాద్వాన్, ఆర్హెచ్డబ్ల్యు డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ధీరజ్ రాజేష్ కుమార్ వాద్వాన్‌తో పాటు అయిదు కంపెనీల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చింది. ఈ రెండు సంస్థలతో పాటు కపూర్ కుటుంబం నియంత్రణలో ఉన్న డాల్ట్ అర్బన్ వెంచర్స్, ఆర్ఏబీ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, డిహెచ్ఎఫ్ఎల్తో అనుసంధానమైన సంస్థలను కూడా నిందితులుగా పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఏడుగురు నిందితులు దేశం విడిచి పారిపోకుండా లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసింది. కాగా ఈ కంపెనీల్లో బిందు రానా కపూర్ డైరెక్టర్‌గా ఉన్నారు. మోర్గాన్ క్రెడిట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రాణా కపూర్ కుమార్తెలు డైరెక్టర్లుగా ఉన్నారని సమాచారం. సోమవారం కూడా అధికారిక నివాసంతో పాటు ఆయనకు సంబంధం ఉన్న ఏడు ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. సంస్థకు ఇచ్చిన రుణాలకు ప్రతిఫలంగా ముడుపులు అందాయన్న ఆరోపణలు రావడంతో ఈ సోదాలు నిర్వహించినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. -
యస్ బ్యాంక్ రాణా కపూర్ అరెస్ట్!!
ముంబై: సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ వ్యవహారం పలు మలుపులు తిరుగుతోంది. మనీ లాండరింగ్ ఆరోపణలపై వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను (62) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదివారం అరెస్ట్ చేసింది. మార్చి 11 దాకా ఆయన్ను ఈడీ కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెడితే .. యస్ బ్యాంక్‌లో ఆర్థిక అవకతవకలు, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్)కు రుణాలిచ్చినందుకు ప్రతిగా దాదాపు రూ. 600 కోట్ల ముడుపులు అందుకున్నారని కూడా రాణా కపూర్‌పై ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఆయన్ను ఈడీ సుదీర్ఘంగా ప్రశ్నించింది. అయితే, విచారణకు ఆయన సహకరించడం లేదనే కారణంతో ఆదివారం ఉదయం సుమారు 3 గం.ల ప్రాంతంలో కపూర్‌ను అదుపులోకి తీసుకుంది. న్యాయస్థానంలో హాజరుపర్చగా ఈడీ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. మరోవైపు, యస్ బ్యాంక్ వ్యవహారాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కూడా లాంఛనంగా దర్యాప్తు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. స్కామ్ సంబంధ పత్రాలను అధికారులు సేకరిస్తున్నట్లు వివరించాయి. క్రిమినల్ కుట్ర, మోసం, అవినీతి కోణాల్లో దర్యాప్తుపై సీబీఐ దృష్టి పెట్టినట్లు సమాచారం. మొండి బాకీలు, కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలతో కుదేలైన యస్ బ్యాంక్ బోర్డును రద్దు చేసి ఆర్బీఐ తన అధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే 30 రోజుల పాటు రూ. 50,000కు మించి విత్‌డ్రాయల్స్ జరపడానికి లేకుండా మారటోరియం కూడా విధించింది. దీనితో ఆ బ్యాంకు జారీ చేసిన ఫారెక్స్ కార్డులు పనిచేయక, వాటిని తీసుకున్న వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఖాతాదారుల సొమ్ము భద్రం: ఆర్బీఐ తప్పుడు విశ్లేషణలు చూసి కొన్ని బ్యాంకుల్లో డిపాజిట్ల గురించి ఖాతాదారులు ఆందోళన చెందవద్దంటూ రిజర్వ్ బ్యాంక్ మరోసారి భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. అన్ని బ్యాంకులను సునిశితంగా పరిశీలిస్తూనే ఉన్నామని, డిపాజిట్ల భద్రతకు ఢోకా ఉండదని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ఆర్బీఐ ట్వీట్ చేసింది. మార్కెట్ క్యాప్ ఆధారంగా బ్యాంకుల ఆర్థిక పరిస్థితి ఉండదని తెలిపింది. అటు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ కూడా డిపాజిటర్లు ఆందోళన చెందవద్దని సూచించారు. బ్యాంకుల్లో సొమ్ము భద్రతను అంచనా వేసేందుకు వాటి మార్కెట్ క్యాప్ సరైన కొలమానం కాదని స్పష్టం చేశారు. మాకు రూ. 662 కోట్లు రావాలి: ఇండియాబుల్స్ హౌసింగ్ యస్ బ్యాంక్ నుంచి తమకు రూ. 662 కోట్లు రావాల్సి ఉందని ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వెల్లడించింది. బ్యాంక్ బాండ్లలో ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేశామని, టర్మ్ లోన్ల రూపంలో బకాయిలేమీ లేవని పేర్కొంది. బ్యాంకు విలువ 10 బిలియన్ డాలర్ల పైగా ఉన్నప్పుడు.. 2017లో అదనపు టియర్ 1 (ఏటీ–1) బాండ్లలో ఇన్వెస్ట్ చేసినట్లు తెలిపింది. డొల్ల కంపెనీలతో ముడుపుల మళ్లింపు... రుణాల మంజూరుకు ప్రతిగా లభించిన ముడుపులను డజను పైగా డొల్ల కంపెనీల ద్వారా రాణా కపూర్ కుటుంబం దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సుమారు రూ. 2,000 కోట్ల పెట్టుబడులు, అత్యంత ఖరీదైన 44 పెయింటింగ్స్.. వాటి వెనుక ఆర్థిక లావాదేవీలపై ఈడీ కూపీ లాగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈడీ వర్గాల కథనం ప్రకారం .. డీహెచ్ఎఫ్ఎల్ డిబెంచర్లలో యస్ బ్యాంక్ రూ. 3,700 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఈ క్రమంలో కపూర్ కుటుంబానికి చెందిన డూఇట్ అర్బన్ వెంచర్స్ అనే సంస్థలోకి డీహెచ్ఎఫ్ఎల్ నుంచి దాదాపు రూ. 600 కోట్లు వచ్చాయి. డీహెచ్ఎఫ్ఎల్కు రుణాలిచ్చినందుకు గాను కపూర్ కుటుంబానికి ఇవి ముడుపుల రూపంలో లభించి ఉంటాయని అనుమానాలు ఉన్నాయి. వీటన్నింటినీ ధృవీకరించుకోవడానికి కపూర్ కుటుంబ సభ్యులను కూడా విచారణ చేయాల్సి ఉందంటూ న్యాయస్థానానికి ఈడీ తెలిపింది. డీహెచ్ఎఫ్ఎల్ డిఫాల్ట్ అయినప్పటికీ.. రుణాలను రాబట్టుకోవడానికి యస్ బ్యాంక్ చర్యలూ తీసుకోకపోవడం అనుమానాలకు ఊతమిస్తోందని పేర్కొంది. అయితే, తాము విచారణకు పూర్తిగా సహకరిస్తున్నామని.. కావాలనే కపూర్‌ను టార్గెట్ చేసుకున్నారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. డూఇట్ కంపెనీ తన ఇద్దరు కుమార్తెల పేరు మీద ఉందని కపూర్ తెలిపారు. డీహెచ్ఎఫ్ఎల్కు ట్రిపుల్ ఏ రేటింగ్ ఉన్నప్పుడు యస్ బ్యాంక్ రూ. 3,700 కోట్లు రుణమిచ్చిందని, ఆ తర్వాత దాన్నుంచి డూఇట్ కంపెనీ రూ. 600 కోట్లు రుణం రూపంలో తీసుకుందని వివరించారు. ఇప్పటికీ డూఇట్ సంస్థ రుణాలను చెల్లిస్తూనే ఉందని, డిఫాల్ట్ కాలేదని చెప్పారు. -
ప్రాథమిక స్థాయి నుంచే న్యాయ సాయం
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయం అర్థించే వారికి ప్రాథమిక స్థాయి నుంచే న్యాయ సహాయం అందాలని జాతీయ న్యాయ సేవల అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్ని రాష్ట్రాల న్యాయ సేవల సంస్థల ఎగ్జిక్యూటివ్ చైర్మన్లు, సభ్య కార్యదర్శులకు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘పోలీస్ స్టేషన్‌కు హాజరవ్వాల్సి వచ్చినప్పటి నుంచే న్యాయ సహాయార్థులకు న్యాయ సేవలు అందించాలి. సరైన సమయంలో అప్పీలు దాఖలు చేయడం, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీలు, సుప్రీం కోర్టు లీగల్ సర్వీస్ కమిటీలతో సమన్వయం చేసుకోవడం, బెయిల్ అప్లికేషన్ అవసరమైన వారిని గుర్తించడం, వారికి న్యాయ సేవలు అందించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలి’ అని పేర్కొన్నారు. శిక్ష పడిన వారికి న్యాయ సేవలు అందించే దిశగా ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో నల్సా ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రమంగా అన్ని రాష్ట్రాలకు దీనిని విస్తరించాలని నిర్ణయించారు. నేర బాధితులకు న్యాయ సహాయం అందించాలన్న మరో ముఖ్యమైన అంశంపైనా చర్చించారు. 2020లో ఐదు జాతీయ లోక్ అదాలత్‌లను నిర్వహించనున్నట్టు వివరించారు. ఫిబ్రవరి, ఏప్రిల్, జూలై, సెప్టెంబర్, డిసెంబర్ రెండో శనివారం ఈ అదాలత్‌లను నిర్వహిస్తారు. -
డీహెచ్ఎఫ్ఎల్ దివాలా దరఖాస్తుకు ఎన్సీఎల్టీ ఓకే
ముంబై: దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌పై (డీహెచ్ఎఫ్ఎల్) దివాలా పరిష్కార చర్యలు చేపట్టాలని కోరుతూ ఆర్బీఐ దాఖలు చేసిన దరఖాస్తును జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) సోమవారం అనుమతించింది. ఈ పిటిషన్ ప్రవేశానికి అర్హమైనదని ఎన్సీఎల్టీ బెంచ్ స్పష్టం చేసింది. గృహ, ప్రాపర్టీ తనఖా రుణాల్లో డీహెచ్ఎఫ్ఎల్ దేశంలోనే మూడో అతిపెద్ద సంస్థ కావడం గమనార్హం. ఈ సంస్థ రుణ చెల్లింపుల్లో విఫలం కావడంతో దివాలా అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) కింద ఆర్బీఐ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. ఈ పరిణామాల నేపథ్యంలో డీహెచ్ఎఫ్ఎల్ షేరు ధర బీఎస్ఈలో 5 శాతం క్షీణించింది. రూ.19.70 వద్ద లోయర్ సర్క్యూట్ (ఒక రోజులో స్టాక్ ధర క్షీణించేందుకు గరిష్టంగా అనుమతించిన మేర) వద్దే క్లోజయింది. అటు ఎన్ఎస్ఈలోనూ ఇంతే మొత్తం క్షీణించి రూ.19.75 వద్ద ముగిసింది. -
డీహెచ్ఎఫ్ఎల్పై ఎన్సీఎల్టీని ఆశ్రయించిన ఆర్బీఐ
ముంబై: సంక్షోభంలో చిక్కుకున్న డీహెచ్ఎఫ్ఎల్ విషయంలో కార్పొరేట్ దివాలా పరిష్కార చర్యలు ప్రారంభించాలని కోరుతూ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముంబై బెంచ్ ముందు ఆర్బీఐ శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది. దివాలా అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ)లోని సెక్షన్ 227 కింద చర్యలు చేపట్టాలని కోరింది. దివాలా పరిష్కార దరఖాస్తు అనుమతించడం లేదా తిరస్కరించేంత వరకు డీహెచ్ఎఫ్ఎల్ సంస్థ రుణ చెల్లింపులపై తాత్కాలిక విరామం (మారటోరియం) ఉంటుందని ఆర్బీఐ తన ప్రకటనలో తెలిపింది. గత నెల 20న డీహెచ్ఎఫ్ఎల్ బోర్డును ఆర్బీఐ రద్దు చేయడంతోపాటు, ఆర్ సుబ్రమణియన్‌ను అడ్మిని్రస్టేటర్‌గా నియమించడం తెలిసిందే. దీంతో పాటు, ముగ్గురు నిపుణులు.. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజీవ్‌లాల్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ ఎన్ఎస్ కన్నన్, యాంఫి సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్‌తో ఒక అడ్వైజరీ బోర్డును కూడా ఏర్పాటు చేసింది. ఈ బోర్డు సుబ్రమణియన్‌కు సహకారం అందించనుంది. ఐబీసీ కింద ఎన్సీఎల్టీ వద్ద దివాలా చర్యలు ఎదుర్కోనున్న తొలి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) డీహెచ్ఎఫ్ఎల్ కానుంది. -
డీహెచ్ఎఫ్ఎల్ సత్వర పరిష్కారంపై ఎస్బీఐ ఆశలు
న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియ కింద చర్యలు ఎదుర్కోబోతున్న డీహెచ్ఎఫ్ఎల్ కేసు.. నిర్దిష్ట గడువులోగా పరిష్కారం కాగలదని బ్యాంకు లు ఆశిస్తున్నట్లు ప్రభుత్వ రంగ ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. ‘ఇది ఇప్పుడే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కు చేరింది. ఎన్సీఎల్టీ అమలు చేసే ప్రక్రియే దీనికీ వర్తిస్తుంది. సాధారణంగా పొడిగింపును కూడా పరిగణనలోకి తీసుకుంటే 330 రోజుల గడువు ఉంటుంది. లేకపోతే 180 రోజుల్లోనే పరిష్కార ప్రక్రియ పూర్తి కావాలి. దివాలా కోడ్(ఐబీసీ) ప్రక్రియ ప్రధాన ఉద్దేశం కూడా ఇదే. నిర్దిష్ట కాలావధులకు లోబడే డీహెచ్ఎఫ్ఎల్ కేసు సత్వరం పరిష్కారం కాగలదని ఆశిస్తున్నాం’ అన్నారు. బ్యాంకులు మినహా ఇతరత్రా ఆర్థిక సంస్థల దివాలాకు సంబంధించి ఐబీసీలో సెక్షన్ 227ను చేరుస్తూ కేంద్రం గత శుక్రవారమే నిర్ణయం తీసుకుంది. దాని కింద ఎన్సీఎల్టీకి చేరిన తొలి కేసు డీహెచ్ఎఫ్ఎల్దే. గృహ రుణాల సంస్థ అయిన డీహెచ్ఎఫ్ఎల్.. 2019 జూలై ఆఖరు నాటికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్‌హోల్డర్లకు ఏకంగా రూ. 83,873 కోట్లు బాకీ పడింది. -
‛దివాన్’..దివాలా!
ముంబై: తీవ్రమైన రుణ సంక్షోభంలో చిక్కుకున్న దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్(డీహెచ్ఎఫ్ఎల్)పై ఆర్బీఐ కొరడా ఝళిపించింది. కంపెనీ డైరెక్టర్ల బోర్డును రద్దు చేస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు మాజీ ఎండీ ఆర్ సుబ్రమణియకుమార్‌ను పాలనాధికారిగా (అడ్మినిస్ట్రేటర్) నియమించింది. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో డీహెచ్ఎఫ్ఎల్ దివాలా పరిష్కార ప్రణాళిక త్వరలోనే ప్రారంభమవుతుందని ఆర్బీఐ ప్రకటించింది. రూ.500 కోట్లు, అంతకుమించి ఆస్తులు కలిగిన సమస్యాత్మక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలను (హెచ్ఎఫ్సీలు) దివాలా చట్టం (ఐబీసీ) కింద పరిష్కార చర్యల కోసం ఎన్సీఎల్టీకి ప్రతిపాదించే అధికారాన్ని ఆర్బీఐకి కట్టబెడుతూ కేంద్ర సర్కారు గత వారమే నిర్ణయం తీసుకుంది. వెనువెంటనే డీహెచ్ఎఫ్ఎల్ విషయంలో ఆర్బీఐ తన అధికారాల అమలును ఆరంభించింది. దీంతో దివాలా చర్యల పరిష్కారానికి వెళ్లనున్న తొలి ఎన్బీఎఫ్సీ/హెచ్ఎఫ్సీ డీహెచ్ఎఫ్ఎల్ కానుంది. ‘‘బ్యాంకు రుణాలు, మార్కెట్ రుణాలకు చెల్లింపుల్లో డీహెచ్ఎఫ్ఎల్ విఫలమైంది. కంపెనీ నిర్వహణ తీరుపై ఇది తీవ్ర ఆందోళనలను కలిగిస్తోంది. అందుకే డీహెచ్ఎఫ్ఎల్ బోర్డును రద్దు చేయడమైంది. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) కింద డీహెచ్‌ఎఫ్‌కు పరిష్కారం కోసం త్వరలోనే చర్యలను ప్రారంభిస్తాం’’ అని ఆర్బీఐ తన ప్రకటనలో పేర్కొంది. 2019 జూలై నాటికి బ్యాంకులు, నేషనల్ హౌసింగ్ బోర్డ్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్ హోల్డర్స్‌కు రూ.88,873 కోట్ల మేర డీహెచ్ఎఫ్ఎల్ చెల్లించాల్సి ఉంది. ఇందులో రూ.74,054 కోట్లు సెక్యూర్డ్ కాగా, రూ.9,818 కోట్లు అన్సెక్యూర్డ్ రుణాలు. వీటిలో బ్యాంకులకు చెల్లించాల్సినది రూ. 38,342 కోట్లుగా అంచనా. ఒక్క ఎస్బీఐకే రూ.10,000 కోట్ల మేర డీహెచ్ఎఫ్ఎల్ బకాయి పడింది. చాలా బ్యాంకులు డీహెచ్ఎఫ్ఎల్ రుణ ఆస్తులను నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు)గా గుర్తించడంతోపాటు కేటాయింపులు చేయాల్సి ఉంది. ఇప్పటికే కొన్ని ఈ పనిని మొదలు పెట్టాయి. ఆల్టికో సైతం.. ఆల్టికో క్యాపిటల్, రెలిగేర్ ఫిన్వెస్ట్లను సైతం దివాలా పరిష్కార చర్యలకు ప్రతిపాదించాలని ఆర్బీఐ నిర్ణయించుకున్నట్టు సమాచారం. కానీ, దీనిపై ప్రకటనేమీ వెలువడలేదు. ఆల్టికో రుణ భారం 2019 మార్చికి రూ.5,319 కోట్లు. మాష్‌రెక్ బ్యాం కుకు రూ.347 కోట్ల అసలు, రూ.19.97 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమైంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థలూ చేరొచ్చు: త్యాగి ఐబీసీ కింద పరిష్కారంలో మ్యూచువల్ ఫండ్స్ సంస్థలూ భాగం కావొచ్చని సెబీ చైర్మన్ అజయ్‌త్యాగి పేర్కొన్నారు. ‘‘ఐబీసీ కింద మ్యూచువల్ ఫండ్స్‌ను కూడా రుణదాతలుగా పరిగణించడం జరుగుతుంది. ఈ విషయంలో ఇంతకుమించి చెప్పేదేమీ లేదు’’ అని త్యాగి అన్నారు. అందలం నుంచి పాతాళానికి... హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ అయిన డీహెచ్ఎఫ్ఎల్ను రాజేష్ కుమార్ వాధ్వాన్ 1984లో ప్రారంభించారు. అల్పాదాయ, మధ్యతరగతి వర్గాలకు గృహ రుణాలిచ్చే ఉద్దేశంతో ఇది ఏర్పాటైంది. దివాన్ హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్‌గాను, ఆ తర్వాత దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌గాను పేర్లు మార్చుకుంది. దేశీయంగా 50 భారీ ఆర్థిక సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో ఏకంగా రూ. 31,000 కోట్లను డొల్ల కంపెనీ ద్వారా డీహెచ్ఎఫ్ఎల్ మళ్లించిందంటూ కోబ్రాపోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ ఆరోపణలను కంపెనీ ఖండించింది. అయితే, జూన్‌లో జరపాల్సిన రుణ చెల్లింపు విషయంలో డిఫాల్ట్ కావడంతో సంస్థపై సందేహాలు తలెత్తాయి. ఆ తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. కంపెనీలో అవకతవకలు ఒక్కొక్కటిగా బయటికొచ్చాయి. కేంద్రం ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తునకు కూడా ఆదేశించింది. ఇప్పుడు ఆర్బీఐ కంపెనీని తన గుప్పిట్లోకి తీసుకొని దివాలా ప్రక్రియను ప్రారంభించనుండటంతో డీహెచ్ఎఫ్ఎల్ కథ ముగిసినట్లేనన్నది పరిశీలకుల అభిపారయం. ఎప్పుడేం జరిగిందంటే... ► 2018 సెప్టెంబర్ 21: డీహెచ్ఎఫ్ఎల్ జారీ చేసిన డెట్ పేపర్లు రూ.300 కోట్ల విలువైన వాటిని సెకండరీ మార్కెట్లో డీఎస్పీ మ్యూచువల్ ఫండ్ విక్రయించింది. డీహెచ్ఎఫ్ఎల్ నిధుల సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్న ఆరోపణలు వచ్చాయి. ► 2019 జనవరి 29: డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు వారికి సంబంధించిన షెల్ కంపెనీలకు రుణాలు ఇవ్వగా, ఆ నిధులను దేశీయంగా, విదేశాల్లో ఆస్తుల కొనుగోలుకు ప్రమోటర్లు వినియోగించినట్టు ఆన్లైన్ పోర్టల్ ‘కోబ్రాపోస్ట్’ సంచలనాత్మ క కథనాన్ని ప్రచురించింది. యథావిధిగా దీన్ని సైతం కంపెనీ ఖండించింది. ► జనవరి 30: కోబ్రాపోస్ట్ ఆరోపణలు అవాస్తవం, హానికారకమని డీహెచ్ఎఫ్ఎల్ ప్రకటించింది. షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించారన్న ఆరోపణలను కొట్టిపడేసింది. ► జనవరి 31: డీహెచ్ఎఫ్ఎల్కు సంబంధించిన ఆరోపణలపై విచారణ మొదలు పెట్టిన కార్పొరేట్ శాఖ. ► ఫిబ్రవరి 4: కంపెనీకి చెందిన కొన్ని ఆస్తులను విక్రయించడం ద్వారా నిధుల లభ్యతను పెంచుకోనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ► ఫిబ్రవరి 11: కొన్ని ఖాతాలకు సంబంధించి వివరాలు ఇవ్వాలంటూ ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసు జారీ. ► ఫిబ్రవరి 13: కంపెనీ సీఈవో హర్షిల్ మెహతా రాజీనామా ► మార్చి 7: డీహెచ్ఎఫ్ఎల్కు చెందిన డెట్ ఇన్స్ట్రుమెంట్ల రేటింగ్ ను ఏజెన్సీలు డౌన్‌గ్రేడ్ చేయడంతో షేరు ధర మరింత క్షీణత. ► మే 21: ఫిక్స్డ్ డిపాజిట్ల స్వీకరణ, రెన్యువల్‌ను డీహెచ్ఎఫ్ఎల్ నిలిపివేసింది. అప్పటికే ఉన్న డిపాజిట్లను ముందస్తుగా ఉపసంహరించుకోవడాన్ని కూడా నిలిపివేసింది. ► జూన్ 4: రూ.960 కోట్ల మేర బాండ్లపై వడ్డీ చెల్లింపులు, బాండ్ల చెల్లింపుల్లో విఫలమైంది. ► జూన్ 5: ఇక్రా, క్రిసిల్, కేర్, బ్రిక్‌వర్క్ రేటింగ్స్ సంస్థలు డీహెచ్ఎఫ్ఎల్కు చెందిన కమర్షియల్ పేపర్ల రేటింగ్‌ను డీ (డిఫాల్ట్) రేటింగ్‌కు తగ్గించేశాయి. ► జూన్ 7: 750 కోట్ల కమర్షియల్ పేపర్లకు చెల్లింపుల్లో విఫలం. ► అక్టోబర్ 10: అన్సెక్యూర్డ్ క్రెడిటర్లు, డిపాజిట్ హోల్డర్లకు డీహెచ్ఎఫ్ఎల్ చెల్లింపులు చేయకుండా బాంబే హైకోర్టు ఆదేశాలు. ► నవంబర్ 1: నిధుల దారి మళ్లింపునకు ఆధారాలు ఉండడంతో తీవ్ర నేరాల దర్యాప్తు విభాగం (ఎస్ఎఫ్ఐవో) విచారణకు కార్పొరేట్ శాఖ ఆదేశం. అప్పుడు 692... ఇప్పుడు 20 కుప్పకూలిన షేరు ధర... డీహెచ్ఎఫ్ఎల్ సంక్షోభంతో కంపెనీ షేరు ధర కుప్పకూలింది. గతేడాది సెప్టెంబర్‌లో ఆల్‌టైం గరిష్ట స్థాయి రూ. 692ని తాకింది. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ 30న కనిష్ట స్థాయి రూ. 15కి పడిపోయింది. బీఎస్ఈలో బుధవారం సుమారు 4% క్షీణించి రూ. 20 వద్ద ముగిసింది. -
దివాలా ప్రక్రియకు డీహెచ్ఎఫ్ఎల్
బెంగళూర్ : హౌసింగ్ ఫైనాన్స్ దిగ్గజ సంస్థ డీహెచ్ఎఫ్ఎల్పై దివాలా ప్రక్రియను చేపడుతున్నట్టు ఆర్బీఐ బుధవారం వెల్లడించింది. డీహెచ్ఎఫ్ఎల్ బోర్డును తొలగించిన ఆర్బీఐ దివాలా ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు అడ్మినిస్ట్రేటర్‌ను నియమించింది. డీహెచ్ఎల్ఎఫ్ను ఆర్బీఐ తదుపరి చర్యల నిమిత్తం జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు తరలించనుంది. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన డీహెచ్ఎఫ్ఎల్ వివిధ బ్యాంకులు, మ్యూచ్‌వల్ ఫండ్లు సహా రుణదాతలకు రూ లక్ష కోట్ల వరకూ రుణాలను చెల్లించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్థలనూ దివాలా చట్టం కిందకు తీసుకువస్తూ ఈనెల 15న నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో డీహెచ్ఎఫ్ఎల్పై దివాలా ప్రక్రియ చేపట్టడం గమనార్హం. డీహెచ్ఎల్ఎఫ్తో పాటు అల్టికోపైనా దివాలా పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
రూ.1,571 కోట్ల చెల్లింపుల్లో డీహెచ్ఎఫ్ఎల్ డిఫాల్ట్
న్యూఢిల్లీ: బాండ్లు, కమర్షియల్ పేపర్‌కు సంబంధించి రూ.1,571 కోట్ల చెల్లింపుల్లో డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీ విఫలమైంది. ఎన్సీడీ, కమర్షియల్ పేపర్స్‌కు సంబంధించి వడ్డీ చెల్లింపుల్లో విఫలమయ్యామని డీహెచ్ఎఫ్ఎల్ తెలిపింది. ఇటీవల కాలంలో వివిధ చెల్లింపుల్లో విఫలమవుతూ వస్తున్న డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీకి దాదాపు రూ.90,000 కోట్ల రుణభారముంది. -
డీహెచ్ఎఫ్ఎల్ స్కామ్‌పై ప్రభుత్వ దర్యాప్తు
న్యూఢిల్లీ: డీహెచ్ఎఫ్ఎల్ సంస్థ, రూ.31,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కోబ్రాపోస్ట్ వెల్లడించిన ఉదంతంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. మరోవైపు ఈ విషయమై దర్యాప్తు చేయడానికి ఒక స్వతంత్ర చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థను డీహెచ్ఎఫ్ఎల్ సంస్థ నియమించింది. గురువారం జరిగిన కంపెనీ సమావేశంలో డీహెచ్ఎఫ్ఎల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అవసరమైతే తనిఖీలు చేస్తాం... డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల నుంచి రూ.97,000 కోట్లు సమీకరించిందని, కానీ వీటిల్లో 31,000 కోట్ల మేర నిధులను డొల్ల కంపెనీల ద్వారా దారి మళ్లించిందని ఆన్లైన్న్యూస్ పోర్టల్, కోబ్రాపోస్ట్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ విషయమై కంపెనీ వ్యవహారాల మంత్రి శాఖ దర్యాప్తును ప్రారంభించింది. ఈ దర్యాప్తులో భాగంగా కంపెనీల రిజిష్ట్రార్(ముంబై)...డొల్ల కంపెనీలుగా చెప్పబడుతున్న కొన్ని సంస్థలను గుర్తించడానికి ప్రయత్నించింది. రికార్డుల్లో ఉన్న చిరునామాల్లో సదరు కంపెనీలు లేవని సంబంధిత ఉన్నతాధికారొకరు చెప్పారు. అవసరమైతే డీహెచ్ఎఫ్ఎల్ నుంచి సమాచారం కోరతామని పేర్కొన్నారు. ఈ విషయమై దర్యాప్తు ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉందని, దర్యాప్తులో వెల్లడయ్యే విషయాలను పట్టి తనిఖీలు కూడా చేపడతామని వివరించారు. కాగా కంపెనీ వ్యవహారాల శాఖ నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని డీహెచ్ఎఫ్ఎల్ తెలిపింది. డీహెచ్ఎఫ్ఎల్.. నాలుగేళ్ల కనిష్టానికి ఈ వార్తల కారణంగా డీహెచ్ఎఫ్ఎల్ షేర్ 16% పతనమై రూ.136 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 20 % నష్టపోయి నాలుగేళ్ల కనిష్ట స్థాయి, రూ.130ను తాకింది. ఈ షేర్ వరుసగా 4 రోజూ నష్టపోయింది. ఈ షేర్ గత నాలుగు రోజుల్లో 35 శాతం, గత ఐదు నెలల్లో 80 శాతం చొప్పున పతనమైంది. -
డీహెచ్ఎఫ్ఎల్ స్కామ్‌పై విచారణ జరిపించాలి
న్యూఢిల్లీ: డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీ రూ.31,000 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా డిమాండ్ చేశారు. తక్షణం దీనిపై విచారణ జరపకపోతే ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సి ఉంటుందన్నారు. కోర్టు పర్యవేక్షణలో సిట్‌తో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. వేలాది డొల్ల కంపెనీలను రద్దు చేశామని ప్రభుత్వం చెప్పుకుంటోందని, డొల్ల కంపెనీలతోనే డీహెచ్ఎఫ్ఎల్ కుంభకోణానికి పాల్పడిందన్నారు. నియంత్రణ సంస్థలతో సహా ప్రభుత్వ విభాగాలన్నీ ఈ స్కామ్‌ను అరికట్టటంలో విఫలమయ్యాయని దుయ్యబట్టారు. భారత్‌లో భారీ కుంభకోణం..! డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీ రూ.31,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కోబ్రాపోస్ట్ వెల్లడించింది. డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీ బ్యాంక్‌ల ద్వారా రూ.97,000 కోట్ల రుణాలు సమీకరించిందని, డొల్ల కంపెనీల నెట్వర్క్ ద్వారా డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు రూ.31,000 కోట్లు దారి మళ్లించారని పేర్కొంది. భారత్‌లో ఇదే అతి పెద్ద ఆర్థిక కుంభకోణమని కోబ్రాపోస్ట్ వివరించింది. అవకతవకలకు పాల్పడలేదు... కాగా కోబ్రాపోస్ట్ కథనాన్ని డీహెచ్ఎఫ్ఎల్ ఖండించింది. తమ కంపెనీకి, వాటాదారులకు హాని చేసే దురుద్దేశపూరితంగానే తమపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించింది. ఒక బాధ్యతాయుత కంపెనీగా నియమ నిబంధనలకనుగుణంగానే రుణాలు ఇచ్చామని, ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని పేర్కొంది. ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలన్నీ తమ కంపెనీకి ట్రిపుల్ ఏ రేటింగ్‌ను ఇచ్చాయని, తమ ఖాతా పుస్తకాలను అంతర్జాతీయ ఆడిటర్లు ఆడిట్ చేస్తారని వివరించింది. కాగా బ్యాంక్‌లు కాస్త ఏమరుపాటుగా ఉన్నా, డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీ నిధులను దారిమళ్లించిందన్న విషయాన్ని పసిగట్టేవని సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. బీఎస్ఈలో డీహెచ్ఎఫ్ఎల్ షేర్ 8% పతనమై రూ.170 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో తాజా ఏడాది కనిష్ట స్థాయి, రూ.164ను తాకింది. రూ.1,375 కోట్ల రుణం విక్రయం... మరోవైపు దివాన్ హౌసింగ్ ఫైనాన్స్(డీహెచ్ఎఫ్ఎల్) కంపెనీ రూ.1,375 కోట్ల హోల్‌సేల్ లోన్‌ను అంతర్జాతీయ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఫండ్, ఓక్‌ట్రీకి విక్రయించింది. కాగా, నివాసిత రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో భారత్‌కు సంబంధించి ఇదే అతి పెద్ద లావాదేవీగా భావిస్తున్నారు. -
దేశంలో అతిపెద్ద ఆర్థిక కుంభకోణం - కోబ్రాపోస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మరో అతిపెద్ద ఫైనాన్షియల్ స్కాం అంటూ కోబ్రాపోస్ట్ బాంబు పేల్చింది. దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(డిహెచ్ఎఫ్ఎల్) రూ.31వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కోబ్రాపోస్ట్ వెబ్సైట్లో మంగళవారం ప్రకటించింది. ఈ స్కాంకు సంబంధించిన ఆధారాలను కూడా కోబ్రాపోస్ట్ ట్విటర్లో పోస్ట్ చేసింది. కోబ్రా పోస్ట్ అందించిన సమాచారం ప్రకారం షెల్ (డొల్ల) కంపెనీల నెట్వర్క్ ద్వారా కంపెనీ ప్రమోటర్లు మురికివాడల అభివృద్ధి పేరుతో అక్రమపద్ధతిలో వేల కోట్ల రూపాయలను దారి మళ్లించారు. తద్వారా భారతదేశంలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణానికి పాల్పడ్డారని ట్వీట్ చేసింది. ముఖ్యంగా డిహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లకు ఒకే అడ్రస్‌తో ఉన్న అనేక షెల్ కంపెనీలకు ఎలాంటి సెక్యూరిటీస్ లేకుండానే షెల్ కంపెనీలకు భారీగా రుణాలిచ్చింది. రూ.21,477 కోట్ల డిహెచ్ఎఫ్ఎల్ నిధులను వివిధ షెల్ కంపెనీలకు రుణాలుగా, పెట్టుబడులుగా అందించారని, డిహెచ్ఎఫ్ఎల్ ప్రోత్సాహక కంపెనీలకు రూ .31,000 కోట్లు చెల్లించారని ఆరోపించింది. మహారాష్ట్రలో మురికివాడల అభివృద్ధి పేరుతో ఈ షెల్ కంపెనీలకు వేలకోట్ల రూపాయలను సంస్థ కట్టబెట్టిందనీ ఆరోపించింది. ఇలా దాదాపు 45 కంపెనీలున్నాయని ఇందులో 34 సంస్థలకు వాద్వాన్ ఫ్యామిలీతో ప్రత్యక్ష సంబంధాలను కలిగి వున్నాయని కూడా కోబ్రా పోస్ట్ ఆరోపించింది. అంతేకాదు ఈ రుణాలకు సంబంధిందించిన వివరాలను కంపెనీ ఆర్థిక రిపోర్టుల్లో పొందుపర్చలేదని పేర్కొంది. ఇలా అక్రమంగా ఆర్జించిన సొమ్ముతో ప్రమోటర్లు విదేశాల్లో సొంత ఆస్తులు, పెద్ద పెద్ద కంపెనీల్లో షేర్లను కొన్నారని తెలిపింది. డిహెచ్ఎఫ్ఎల్ ముఖ్య ప్రమోటర్లు కపిల్ వాద్వాన్, అరుణా వాద్వాన్, ధీరజ్ వాద్వాన్ సహా పలువురికి ఇంగ్లండ్, దుబాయ్, శ్రీలంక, మారిషస్ దేశాల్లో వ్యక్తిగతంగా ఆస్తులు కూడ బెట్టుకున్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలో సెబీ, ఐటీ, నల్లధనం, మనీ లాండరింగ్ చట్టం, కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఈ కంపెనీపై తక్షణమే విచారణ చెపట్టాలని కోరింది. దీంతోపాటు బీజీపీకి కోట్ల రూపాయల చందాలిచ్చిందని కోబ్రా పోస్ట్ ఆరోపించడం గమనార్హం. ఈ వార్తలతో డిహెచ్ఎఫ్ఎల్ షేరు ఇవాల్టి మార్కెట్లో దాదాపు 10శాతానికి పైగా నష్టపోయింది. అయితే చివర్లో తేరుకుని 5శాతం నష్టాలకు పరిమితమైంది. మరోవైపు ఇప్పటికే వివాదాల్లో చిక్కుకున్న సంస్థకు తాజా ఆరోపణలు మరింత ప్రతికూలమని ఎనలిస్టులు చెబుతున్నారు. Dewan’s financial credentials: Rs 8,700 crore net worth, Rs 96,000 crore money raised through loans and public deposits. pic.twitter.com/UGH2gQzteV — Cobrapost (@cobrapost) January 29, 2019 Here is a single infograph that explains what Cobrapost has unearthed about #LooteraDewan. pic.twitter.com/0SQqEBSePe — Cobrapost (@cobrapost) January 29, 2019 -
ఫండ్ వ్యాపారానికి డీహెచ్ఎఫ్ఎల్ గుడ్‌బై
ముంబై: డీహెచ్ఎఫ్ఎల్ ప్రామెరికా అసెట్ మేనేజర్స్ మ్యూచువల్ ఫండ్ వ్యాపారం నుంచి వైదొలగుతున్నట్లు గృహ రుణాల సంస్థ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) వెల్లడించింది. జాయింట్ వెంచర్లో తమకున్న మొత్తం వాటాలను భాగస్వామి ప్రుడెన్షియల్ ఫైనాన్షియల్‌కు విక్రయిస్తున్నామని, డీహెచ్ఎఫ్ఎల్ ప్రామెరికా ట్రస్టీస్ నుంచి కూడా పూర్తిగా తప్పుకుంటున్నామని పేర్కొంది. 2015లో ఫండ్ వ్యాపారంలో 50 శాతం వాటాలను డీహెచ్ఎఫ్ఎల్ కొనుగోలు చేసింది. ఇందులో 17.12 శాతం వాటాలు నేరుగా, 32.88 శాతం అనుబంధ సంస్థ డీహెచ్ఎఫ్ఎల్ అడ్వైజరీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఉన్నాయి. మరోవైపు, డీహెచ్ఎఫ్ఎల్ ప్రామెరికా ట్రస్టీస్‌లో కూడా 50 శాతం వాటాలున్నాయి. వాటాల విక్రయానికి సంబంధించి ప్రుడెన్షియల్ ఫైనాన్షియల్‌లో భాగమైన పీజీఎల్హెచ్ ఆఫ్ డెలావేర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. డీహెచ్ఎఫ్ఎల్ అసెట్ మేనేజర్స్ సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో రూ.129.74 కోట్ల ఆదాయం, రూ.7.76 కోట్ల లాభం ఆర్జించింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఆదాయం రూ.109.67 కోట్లు కాగా.. లాభం రూ. 7.64 కోట్లు. డీహెచ్ఎఫ్ఎల్ సంస్థ.. ప్రుడెన్షియల్ ఫైనాన్షియల్తో కలిసి డీహెచ్ఎఫ్ఎల్ ప్రామెరికా లైఫ్ ఇన్సూరెన్స్ పేరిట జీవిత బీమా సంస్థను కూడా ఏర్పాటు చేసింది. 2016 అక్టోబర్‌లో ఈ జాయింట్ వెంచర్ సంస్థలో ప్రుడెన్షియల్ తన వాటాను 26 శాతం నుంచి 49 శాతానికి పెంచుకుంది. దేశీయంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు తీవ్రంగా నిధుల కొరత ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఫండ్ వ్యాపారం నుంచి డీహెచ్ఎఫ్ఎల్ తప్పుకోనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. సెప్టెంబర్‌లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్ఎఫ్ఎస్) డిఫాల్ట్‌తో మొదలైన ఈ నిధుల సంక్షోభం పలు ఎన్బీఎఫ్సీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అనేక సంస్థల షేర్ల ధరలు భారీగా పతనమయ్యాయి. సెప్టెంబర్ నుంచి చూస్తే డీహెచ్ఎఫ్ఎల్ షేర్లు ఏకంగా 68% క్షీణించాయి. మంగళవారం ఎన్ఎస్ఈలో రూ. 213.90 వద్ద క్లోజయ్యాయి. -
ఠారెత్తించిన డీహెచ్ఎఫ్ఎల్
న్యూఢిల్లీ: హౌసింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ షేర్లు శుక్రవారం తీవ్రమైన నష్టాలకు గురయ్యాయి. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్(డీహెచ్ఎఫ్ఎల్) షేర్ 42 శాతం కుదేలైంది. ఈ కంపెనీ లిక్విడిటీ సంక్షోభంలోకి కూరుకుపోతుందనే వదంతులు ప్రతికూల ప్రభావం చూపించాయి. మరోవైపు బాండ్ల రాబడులు పెరుగుతుండటంతో ఎన్బీఎఫ్సీ షేర్లు కూడా క్షీణించాయి. మరోపక్క, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌లో కూడా లిక్విడిటీ సమస్యలు ఉన్నట్లు వార్తలు రావడంతో ఈ రంగం షేర్లపై తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి దారితీసింది. అసలేం జరిగింది.. ? డీహెచ్ఎఫ్ఎల్ వాణిజ్య పత్రాలను డీఎస్పీ మ్యూచువల్ ఫండ్ ఇటీవల విక్రయించింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌కు రూ. 350 కోట్ల మేర రుణాలిచ్చిన డీఎస్పీ మ్యూచువల్ఫండ్.. లిక్విడిటీని మెరుగుపరచుకోవడం కోసం రూ.200–300 కోట్ల విలువైన డీహెచ్ఎఫ్ఎల్ వాణిజ్య పత్రాలను 11 శాతం డిస్కౌంట్‌కు విక్రయించింది. దీంతో డీహెచ్ఎఫ్ఎల్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్ భారీ కుదుపులకు గురైంది. బుధవారం రూ.610 వద్ద ముగిసిన ఈ షేర్ ఇంట్రాడేలో 60 శాతం నష్టంతో జీవిత కాల కనిష్ట స్థాయి, రూ.246కు పతనమైంది. చివరకు 42 శాతం నష్టంతో రూ.352 వద్ద ముగిసింది. కేవలం గంటల వ్యవధిలోనే ఈ షేర్ ధర సగమైంది. స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇంట్రాడేలో ఇంత అత్యధిక శాతం పతనమైన షేర్ ఇదే. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.8,120 కోట్లు ఆవిరై రూ.11,027 కోట్లకు పడిపోయింది. ఈ ప్రభావం ఇతర హౌసింగ్ ఫైనాన్స్ షేర్లపై తీవ్రంగానే పడింది. ఇంట్రాడేలో పలు షేర్లు బహుళ సంవత్సరాల కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 8 శాతం, కెన్ ఫిన్ హోమ్స్ 5.7 శాతం, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 5 శాతం, పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ 5 శాతం మేర క్షీణించాయి. హౌసింగ్ ఫైనాన్స్‌కంపెనీల మాదిరే బ్యాంకేతర కంపెనీల షేర్లు కూడా కుదేలయ్యాయి. బజాజ్ ఫైనాన్స్ 4.5 శాతం, ఎడిల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 3.1 శాతం, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ 2.4 శాతం చొప్పున నష్టపోయాయి. కంపెనీ వివరణ... డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీ ఎలాంటి రుణ చెల్లింపుల్లో విఫలం కాలేదని డీహెచ్ఎఫ్ఎల్ సీఎమ్‌డీ కపిల్ వాధ్వాన్ స్పష్టం చేశారు. బాండ్ల తిరిగి చెల్లింపుల్లో కానీ, ఇతర రుణాల చెల్లింపుల్లో కానీ ఎలాంటి జాప్యం లేదని వివరించారు. అంతే కాకుండా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కంపెనీకి తాము ఎలాంటి రుణాలివ్వలేదని, ఎలాంటి వాణిజ్య సంబంధాలు లేవని పేర్కొన్నారు. ఒక్క డీహెచ్ఎఫ్ఎల్ షేరే కాకుండా ఈ సెగ్మెంట్లోని ఇతర కంపెనీల షేర్లు కూడా పడిపోవడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమ కంపెనీ ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నాయని, ఆరు నెలల నగదు నిల్వలకు సమానమైన రూ.10,000 కోట్ల నిధులు ప్రస్తుతం తమ వద్ద ఉన్నాయని వివరించారు. కంపెనీ ప్రమోటర్లు ఎవరూ తమ షేర్లను తనఖా పెట్టలేదని, కంపెనీ షేర్లు పెట్టి ఎవరూ రుణాలు తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. నిపుణులేమంటున్నారు... నిధుల కటకట వదంతులతో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు భారీగా పతనమయ్యాయని శామ్కో సెక్యూరిటీస్ అండ్ స్టాక్ నోట్ సీఈఓ జిమీత్ మోదీ వ్యాఖ్యానించారు. ఫండమెంటల్స్ పరంగా ఈ కంపెనీలు పటిష్టంగా ఉన్నప్పటికీ, మూక మనస్తత్వంతో మూకుమ్మడి అమ్మకాలు జరిగాయని పేర్కొన్నారు. అయితే కనిష్ట స్థాయిల నుంచి ఈ షేర్లు కోలుకున్నాయని వివరించారు. -
డీహెచ్ఎఫ్ఎల్ లాభం 26 శాతం అప్
న్యూఢిల్లీ: దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్) నాలుగో త్రైమాసిక కాలంలో రూ. 312 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం(రూ.248 కోట్లు)తో పోల్చితే 26 శాతం వృద్ధి సాధించామని డీహెచ్ఎఫ్ఎల్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,377 కోట్ల నుంచి 18 శాతం పెరిగి రూ.2,808 కోట్లకు వృద్ధి చెందిందని కంపెనీ సీఎమ్‌డీ కపిల్ వాధ్వాన్ తెలిపారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.2.50 తుది డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. గతంలో ఇచ్చిన మధ్యంతర డివిడెండ్‌ను కూడా కలుపుకుంటే, గత ఆర్థిక సంవత్సరానికి మొత్తం డివిడెండ్ రూ.5.50గా ఉందని తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటే, 2016–17లో రూ.927 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 26 శాతం వృద్ధితో రూ.1,172 కోట్లకు పెరిగిందని వాధ్వాన్ వివరించారు. మొత్తం ఆదాయం రూ.8,857 కోట్ల నుంచి 18 శాతం వృద్ధితో రూ.10,465 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో డీహెచ్ఎఫ్ఎల్ షేర్ 1 శాతం లాభంతో రూ.641 వద్ద ముగిసింది. -
అందుబాటు గృహాలకే డిమాండ్
కానీ, సరఫరా మాత్రం ఆశించిన స్థాయిలో లేదు • మార్చికల్లా మంచిర్యాలలో బ్రాంచ్ ప్రారంభం • మా రుణాల్లో ఏపీ–తెలంగాణ వాటా 22 శాతం • వచ్చే ఏడాదికల్లా 30 శాతానికి చేరుస్తాం • డీహెచ్ఎఫ్ఎల్ సీఈఓ హర్షిల్ మెహతా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘దేశంలో రోజురోజుకూ అందుబాటు ధరల్లో ఉండే గృహాలకు డిమాండ్ పెరుగుతోంది. 87 శాతం ప్రజలు ఈ గృహాల కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు. కానీ, సరఫరా మాత్రం ఆశించినంత స్థాయిలో లేదు. అందుబాటు గృహాల డిమాండ్–సరఫరాల మధ్య వ్యత్యాసం 7 కోట్లుగా అంచనా వేస్తున్నాం’’ అని డీహెచ్ఎఫ్ఎల్ సీఈఓ హర్షిల్ మెహతా వివరించారు. సులభంగా బ్యాంకు రుణాలు మంజూరవుతుండటం, నగరాలకు ఎక్కువ మంది వస్తుండటం వంటి కారణాల వల్ల ఎగువ మధ్యతరగతి, లగ్జరీ గృహాల నిర్మాణాలే ఎక్కువగా నిర్మిస్తున్నారని, దీంతో అందుబాటు ఇళ్లకు కొరత ఏర్పడుతోందని ఆయన వివరించారు. బుధవారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు. దేశంలో మొత్తం గృహ రుణాల విపణి సుమారు రూ.1.20 లక్షల కోట్లుగా ఉంటే.. ఇందులో సంఘటిత పరిశ్రమ వాటా 20–30 శాతంగా ఉందని ఆయన తెలియజేశారు. ఏటా పరిశ్రమ 15–17 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తోందన్నారు. ‘‘గడిచిన రెండు నెలలుగా బ్యాంకుల్లో పేరుకుపోయిన డబ్బు క్రమంగా ఇప్పుడు మార్కెట్లోకి వస్తోంది. అందుకే ఆర్బీఐ కూడా విత్‌డ్రా పరిమితిని క్రమంగా పెంచుతోంది. ఇలాగే వచ్చే రెండు మూడు నెలల్లో గృహ రుణ వడ్డీ రేట్లను కూడా తగ్గించే అవకాశముంది’’ అని మెహతా అంచనా వేశారు. ఈ తగ్గింపు పావుశాతం ఉండవచ్చని చెప్పారాయన. గృహ రుణాల్లో నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) చాలా తక్కువగా ఉంటాయంటూ... డీహెచ్ఎఫ్ఎల్కు 0.95 శాతం ఎన్‌పీఏలున్నాయని, విలువ పరంగా చూస్తే గతేడాది డిసెంబర్ 31 నాటికి ఇవి రూ.65.6 కోట్లు అని తెలియజేశారు. 30 శాతం వృద్ధి లక్ష్యం.. దేశంలోని మొత్తం గృహ రుణాల విపణిలో డీహెచ్ఎఫ్ఎల్ వాటా 12–14 శాతం వరకూ ఉన్నట్లు మెహతా చెప్పారు. ‘‘గతేడాది డిసెంబర్ 31 నాటికి రూ.6,525 కోట్ల గృహ రుణాలను పంపిణీ చేశాం. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో రూ.1,296 కోట్లు, హైదరాబాద్‌లో రూ.221 కోట్ల రుణాలను పంపిణీ చేశాం. మొత్తం వ్యాపారంలో 22 శాతంగా ఉన్న ఏపీ, తెలంగాణ వాటాను వచ్చే 9 నెలల్లో 30 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డీహెచ్ఎఫ్ఎల్కు 350 బ్రాంచీలున్నాయి. తెలంగాణలో 30 ప్రాంతాల్లో 14 బ్రాంచీలు, ఏపీలో 70 ప్రాంతాల్లో 18 బ్రాంచీలున్నాయి. మార్చి నాటికి మంచిర్యాలలో బ్రాంచీని ప్రారంభించనున్నాం. రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు 50 వేల కుటుంబాలకు రుణాలందించాం’’ అని వివరించారాయన. -
డీహెచ్ఎఫ్ఎల్ లాభం 32% అప్
క్లిష్ట క్యూ3లోనూ నిలకడ వృద్ధి: సీఎండీ న్యూఢిల్లీ: దివాన్ హౌసింగ్ ఫైనాన్స్(డీహెచ్ఎఫ్ఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసిక కాలంలో రూ.245 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం నికర లాభం(రూ.186 కోట్లు)తో పోల్చితే 32 శాతం వృద్ధి సాధించామని డీహెచ్ఎఫ్ఎల్ తెలిపింది. గత క్యూ3లో రూ.1,885 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో రూ.2,367 కోట్లకు పెరిగిందని డీహెచ్ఎఫ్ఎల్ సీఎండీ కపిల్ వాధ్వాన్ చెప్పారు. నికర వడ్డీ మార్జిన్ 2.87 శాతం నుంచి 3.07 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, బ్యాంక్‌లు వడ్డీరేట్లు తగ్గించడం వంటి ప్రతికూల అంశాలున్నప్పటికీ ఈ క్వార్టర్లో నిలకడైన వృద్ధిని సాధించామని తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కంపెనీ షేర్ 6 శాతం లాభంతో రూ.288 వద్ద ముగిసింది. -
గృహ రుణాలు ఇక చౌక
ఐసీఐసీఐ యాక్సిస్ పాత, కొత్త కస్టమర్లందరికీ ఐసీఐసీఐ 0.25% వడ్డీరేటు తగ్గింపు యాక్సిస్ బ్యాంక్ కోత 0.2 శాతం... మంగళవారం నుంచే అమల్లోకి... ఇదే బాటలో డీహెచ్ఎఫ్ఎల్, ఇండియాబుల్స్ కూడా న్యూఢిల్లీ: రాజన్ ఘాటు వ్యాఖ్యల ప్రభావంతో బ్యాంకులు రుణాలపై రేట్ల కోత నిర్ణయాలను వరుసపెట్టి ప్రకటిస్తున్నాయి. ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీల బాటనేదేశీ ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులు కూడా అనుసరించాయి. గృహ రుణాలపై ఐసీఐసీఐ పావు శాతం, యాక్సిస్ 0.2 శాతం చొప్పున వడ్డీ రేటును తగ్గించాయి. ప్రస్తుత, కొత్త రుణ గ్రహీతలందరికీ... స్థిర(ఫిక్సిడ్), చర(ఫ్లోటింగ్) రేట్లు అన్నింటిపైనా ఈ తగ్గింపు మంగళవారం(ఏప్రిల్ 14) నుంచే వర్తిస్తుందని ఐసీఐసీఐ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. దీని ప్రకారం మహిళలు, ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన కస్టమర్లకు గృహ రుణ రేటు 9.85 శాతంగా ఉంటుంది. ఇతర కస్టమర్లందరికీ 9.9%గా ఉంటుందని వెల్లడించింది. ఇక యాక్సిస్ బ్యాంక్ గృహ రుణాలపై వడ్డీరేటు 9.95%కి చేరింది. ఈ మార్పు కూడా మంగళవారం నుంచే అమలవుతుందని బ్యాంక్ పేర్కొంది. అదేవిధంగా రుణ మొత్తంతో సంబంధం లేకుండా వేతనజీవులందరికీ ఒకే శ్లాబ్‌ను వర్తింపజేయనున్నట్లు వెల్లడించింది. కాగా, ఆర్బీఐ తాజా పాలసీ సమీక్ష అనంతరం ఐసీఐసీఐ తన బేస్ రేటును(కనీస రుణ రేటు) పావు శాతం తగ్గించి 9.75%కి చేర్చిన సంగతి తెలిసిందే. వెరసి గృహ రుణ గ్రహీతలకు నెలవారీ వాయిదా(ఈఎంఐ)ల్లో తగ్గింపు ఉపశమనం లభించనుంది. డిసెంబర్ 2014 నాటికి ఐసీఐసీఐ గృహ రుణాల పోర్ట్‌ఫోలియో రూ.84,425 కోట్లు. ఫలించిన రాజన్ మంత్రం... తాజా పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ కీలక పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఏడాది ఇప్పటిదాకా రెపో రేటును రెండు సార్లు(పాలసీలో కాకుండా) పావు శాతం చొప్పున తగ్గించడంతో ఇది 7.5 శాతానికి చేరింది. కాగా, నిధుల సమీకరణ వ్యయం ఇంకా అధికంగానే ఉండటంతో రుణాలపై రేట్ల తగ్గింపుపై ఆచితూచి వ్యవహరిస్తామన్న బ్యాంకర్ల వ్యాఖ్యలపై ‘నాన్సెన్స్’ అంటూ రాజన్ ఘాటుగా స్పందించిన విషయం విదితమే. దీంతో బ్యాంకర్లు తక్షణం బేస్ రేటును తగ్గింపు ప్రకటించి.. క్రమంగా గృహ రుణాలపై కూడా వడ్డీరేట్ల కోతను అమల్లోకి తీసుకొచ్చాయి. ఈ జాబితాలో ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ వంటివి ఇప్పటికే చేరాయి. పావు శాతం వరకూ తగ్గింపును ప్రకటించాయి. తాజాగా ఐసీఐసీఐ, యాక్సిస్‌లు కూడా ఇదే బాట పట్టాయి. దీంతో ఇతర బ్యాంకులు కూడా ఇదే రూట్‌ను అనుసరించొచ్చనేది పరిశ్రమ వర్గాల అభిప్రాయం. డీహెచ్ఎఫ్ఎల్, ఇండియాబుల్స్... హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ డీహెచ్ఎఫ్ఎల్ కూడా గృహ రుణాలపై పావు శాతం వడ్డీరేటు తగ్గింపును ప్రకటించింది. దీంతో ఈ రేటు ఇప్పుడున్న 10.15 శాతం నుంచి 9.9 శాతానికి చేరింది. కొత్త రేటు బుధవారం నుంచి అమల్లోకి వస్తుందని డీహెచ్ఎఫ్ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లో ప్రతిఒక్కరికీ సొంతింటి కలను సాకారం చేసే దిశగా తమ సంస్థ అంకితభావానికి ఈ రేట్ల తగ్గింపు నిదర్శనమని సంస్థ సీఎండీ కపిల్ వాధ్వాన్ వ్యాఖ్యానించారు. మరో ప్రైవేటు రంగ సంస్థ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా గృహ రుణ రేట్లను 0.2% తగ్గించింది.. దీంతో ఇది 10.10% నుంచి 9.9%కి చేరింది. మంగళవారం నుంచే ఈ రేట్లు అమల్లోకి వచ్చాయని సంస్థ తెలిపింది. ఐసీఐసీఐ తగ్గింపు ప్రభావం ఇదీ... కస్టమర్లు కొత్త వడ్డీ రేటు మహిళలు, బలహీన వర్గాలు(ఫ్లోటింగ్ రేటు) 9.85% ఇతర కస్టమర్లు(ఫ్లోటింగ్ రేటు) 9.90% రూ.30 లక్షల వరకూ ఫిక్సిడ్ రేటు గృహ రుణాలపై 9.90% (10 ఏళ్ల కాల వ్యవధి వరకూ) బేస్ రేటు 9.75% -
పెట్టుబడులు పెంచేలా బడ్జెట్ ఉండాలి: డీహెచ్ఎఫ్ఎల్
హైదరాబాద్: విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా భారత్‌ను కేంద్రం తీర్చిదిద్దుతోందని డీహెచ్ఎఫ్ఎల్ సీఎండీ కపిల్ వాధ్వాన్ పేర్కొన్నారు. ఈ దిశగానే అరుణ్ జైట్లీ నేడు సమర్పించే బడ్జెట్ ఉంటుందని ఆశిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బడ్జెట్లో పన్నులకు సంబంధించిన అస్పష్టతలను తొలగించాలని పేర్కొన్నారు. విదేశీ ఇన్వెస్టర్లు మరిన్ని పెట్టుబడులు పెట్టేలా చర్యలుండాలని వివరించారు. మౌలిక, విద్య, ఆరోగ్య, గృహ నిర్మాణ రంగాల్లో విదే శీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగాల్సిన అవసరముందని తెలిపారు. ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని చూరగొనేలా, పెట్టుబడుల జోరును పెంచేలా బడ్జెట్ ఉండాలని సూచించారు. -
సంప్రదాయ కోర్సులకూ రుణాలు!
విదేశీ వర్సిటీల్లో చదువులకూ మంజూరు - అవాన్స్, క్రెడీలా పేర్లతో విద్యారుణాలు - కొత్త రూట్లో డీహెచ్ఎఫ్ఎల్, హెచ్డీఎఫ్సీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకు రుణాలు అంత తేలికేమీ కాదు. అందులోనూ విద్యా రుణాలైతే మరీను. పేరున్న వర్సిటీల్లో పాపులర్ కోర్సులైన ఇంజనీరింగో, మెడిసిన్‌నో లేక మేనేజ్మెంట్ కోర్సో చదివే విద్యార్థులకు మాత్రమే రుణాలు లభిస్తుంటాయి. ఎందుకంటే బ్యాంకులు కూడా ఆ కోర్సు పూర్తి చేశాక సదరు అభ్యర్థికి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయనే అంశాన్ని ఆధారం చేసుకునే రుణాలిచ్చేది. అందుకే సంప్రదాయ కోర్సులైన సంగీతం, ఫొటోగ్రఫీ, నృత్యం వంటి కోర్సులు చదివే వారికి రుణాలు కావాలంటే కాస్తంత ఇబ్బంది తప్పదు. అయితే మన దేశంలో ఇలాంటి సంప్రదాయ కోర్సుల ఫీజులు తక్కువే. కాబట్టి మరీ ఇబ్బంది ఉండదు. కానీ విదేశీ వర్సిటీల్లో ఇలాంటి కోర్సులు చదవాలంటే మాత్రం కష్టం. అయితే ఇలాంటివన్నీ అర్థం చేసుకున్న బ్యాంకులు కొన్ని ఈ కోర్సులకూ రుణాలిచ్చేలా కొత్త పథకాలు ఆరంభిస్తున్నాయి. అలాంటి వారికీ రుణాలు లభిస్తున్నాయి. మార్కెట్ అంచనాల ప్రకారం మన దేశంలో ఏటా పిల్లల ఉన్నత చదువుల కోసం తల్లిదండ్రులు రూ.80 వేల కోట్ల వరకూ వెచ్చిస్తున్నారు. ఈ మార్కెట్ ఏటా 18 శాతం వృద్ధితో అంతకంతకూ దూసుకెళుతోంది. దీన్లో విద్యారుణం తీసుకొని ఉన్నత విద్యనభ్యసిస్తున్న వారి వాటా దాదాపు 15 శాతంగా ఉంది. నిజానికిపుడు పిల్లల ఉన్నత విద్యాభ్యాసం కోసం తల్లిదండ్రులు రుణాలు తీసుకోవటమనేది తగ్గింది. ఉన్నత విద్య రుణం కోసం నేరుగా విద్యార్థులే బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. ఈ డిమాండ్‌ను చూసిన ప్రయివేటు ఆర్థిక సంస్థలు విద్యారుణాల మంజూరులో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాయి. అవాన్స్, క్రెడీలా రుణాలు.. అగ్రశ్రేణి హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలైన దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్), హెచ్‌డీఎఫ్‌సీలు మేనేజ్మెంట్ కోర్సులతో పాటు సంప్రదాయ కోర్సులైన ఫొటోగ్రఫీ, సంగీతం, నృత్యం, డిజైనింగ్, ఫైన్ ఆర్ట్స్ వంటి కోర్సులకూ విద్యారుణాలను మంజూరు చేస్తున్నాయి. విద్యా రుణాల కోసం డీహెచ్ఎఫ్ఎల్ ‘అవాన్స్ ఎడ్యుకేషన్ లోన్స్’ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. హెచ్డీఎఫ్సీ కూడా ఈ రుణాల కోసం ‘క్రె డీలా’ అనే సంస్థను ఏర్పాటు చేసింది. అయితే ఆయా రుణాలను కేవలం కోర్సు ఫీజులకే పరిమితం చేయకుండా రుణానికి అర్హుడైన విద్యార్థి చదువు పూర్తయ్యేంత వరకు అవసరమయ్యే ఖర్చు, రవాణా చార్జీలను కూడా రుణంలో భాగంగానే మంజూరు చేస్తున్నాయి. వర్సిటీ, దేశాన్ని బట్టి వడ్డీ రేట్లు.. సంప్రదాయ కోర్సుల విద్యా రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లు... విద్యార్థులు ఎంచుకునే వర్సిటీ, దేశం ఆధారంగా మారుతూ ఉంటాయని హైదరాబాద్‌లోని ‘అవాన్స్’ ఫైనాన్షియల్ సర్వీసెస్ అధికారి ఒకరు ‘సాక్షి’ పర్సనల్ ఫైనాన్స్ ప్రతినిధితో చెప్పారు. ‘‘దేశీయంగా గుర్తింపు పొందిన వర్సిటీల్లోని విద్యాభ్యాసానికైతే 12.5 శాతం నుంచి 12.75 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాం. అదే విదేశాల్లోని వర్సిటీల్లో అయితే వడ్డీ రేటు 12.75 శాతం నుంచి ప్రారంభమై 14 శాతం వరకు ఉంటుంది. ఐఐఐటీ, ఐఎస్బీ, ఐఐటీ మద్రాస్ వంటి పేరొందిన వర్సిటీలు గుర్తించిన విద్యా సంస్థల్లో విద్యకైతే ఎలాంటి జామీను లేకుండా రుణాలను మంజూరు చేస్తున్నాం. అదే మన దేశంలోని ఇతర విద్యా సంస్థల్లో అయితే రూ.5 లక్షల విద్యారుణానికి తల్లిదండ్రుల వేతనాన్ని హామీగా పెట్టాల్సి ఉంటుంది. అదే విదేశాల్లోని వర్శిటీల్లో అయితే స్థిరాస్తులను జామీనుగా ఇవ్వాల్సి ఉంటుంది’’ అని వివరించారు. అలాగే జీమ్యాట్, టోఫెల్ పరీక్షల్లో స్కోరు ఆధారంగా రుణాలను మంజూరు చేస్తామని తెలియజేశారు. -
డీహెచ్ఎఫ్ఎల్ అంబాసిడర్ షారూక్
హైదరాబాద్: ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, డీహెచ్ఎఫ్ఎల్కు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ సినిమా నటుడు షారూక్ ఖాన్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు షారూక్ ఖాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని డీహెచ్ఎఫ్ఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ కపిల్ వాధ్వాని ఒక ప్రకటనలో తెలిపారు. తమ 30 ఏళ్ల ప్రస్థానంలో ఒక బ్రాండ్ అంబాసిడర్‌ను నియమించుకోవడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. భారత్‌లో రెండో అతి పెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా అవతరించామని వివరించారు. సొంత ఇల్లు సాధించడమనేది ప్రతి కుటుంబానికి భద్రమైన భవిష్యత్తుకు తొలి మెట్టు అని, దీని కోసం తోడ్పడే డీహెచ్ఎఫ్ఎల్కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం సంతోషంగా ఉందని షారూక్ ఖాన్ పేర్కొన్నారు. -
మహిళలకు డీహెచ్ఎఫ్ఎల్ చౌక గృహరుణాలు
వడ్డీరేటులో పావు శాతం, ప్రోసెసింగ్ ఫీజులు 25% తగ్గింపు 10-11% రేటుకు ఆశ్రయ్ డిపాజిట్ స్కీం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహిళలకు పావు శాతం తగ్గింపు రేటుకే గృహరుణాలను అందిస్తున్నట్లు దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్) ప్రకటించింది. పూర్తిగా మహిళ పేరు మీద లేదా భాగస్వామ్యంలో గృహరుణం తీసుకున్నపుడు మొదటి పేరు మహిళదైతే ఈ పావు శాతం తగ్గింపు వర్తిస్తుందని డీహెచ్ఎఫ్ఎల్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం జీతం ఆదాయంగా ఉన్న వారికి 11.25 శాతం వడ్డీరేటుపై గృహరుణాలను అందిస్తోంది. మార్చి 25 వరకు ఈ తగ్గింపు ధరలు ఉంటాయని, ఈ సమయంలో రుణం తీసుకున్న వారికి ప్రోసెసింగ్ ఫీజులో 25% రాయితీని అందిస్తామని డీహెచ్ఎఫ్ఎల్ ప్రెసిడెంట్ రాజేష్ మక్కర్ తెలిపారు. కొత్త డిపాజిట్ పథకాలు డీహెచ్ఎఫ్ఎల్ ‘ఆశ్రయ్’ డిపాజిట్ ప్లస్ పేరుతో కొత్త డిపాజిట్ పథకాలను ప్రవేశపెట్టింది. 80 నుంచి 86 నెలల కాలపరిమితి కలిగిన ఈ డిపాజిట్ పథకాలపై 10 నుంచి 11 శాతం వడ్డీరేటును ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం సగటున 93 నెలలకు డిపాజిట్ మొత్తం రెట్టింపు అవుతుంటే, ఆశ్రయ్‌లో 86 నెలలకే రెట్టింపు అవుతున్నట్లు రాకేష్ తెలిపారు. -
డీహెచ్ఎఫ్ఎల్ ఆశ్రయ్ డిపాజిట్ ప్లస్
ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, డీహెచ్ఎఫ్ఎల్ ప్రత్యేకమైన ఆశ్రయ్ డిపాజిట్ ప్లస్(14 నెలలు) ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌ను ఆఫర్ చేస్తోంది. రూ.25 లక్షల లోపు డిపాజిట్లపై ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్లు, ట్రస్ట్ ఇన్వెస్టర్లకు 10.76 శాతం వార్షిక రాబడి, ప్రాధాన్యత వినియోగదారులకు (రక్షణ సిబ్బంది, సీనియర్ సిటిజన్లు, డీహెచ్ఎఫ్ఎల్ వినియోగదారులు)11.26 శాతం వార్షిక రాబడి లభిస్తుంది. రూ.25 లక్షలకు మించిన డిపాజిట్లపై 11.01%, 11. 51 శాతం వార్షిక రాబడి ఇస్తారు. తమ ఫిక్స్డ్ డిపాజిట్లకు అధిక భద్రత, అత్యున్నత రుణ నాణ్యతను సూచించే కేర్ డబుల్‘ ఏ’ ప్లస్ రేటింగ్ ఉందని సంస్థ పేర్కొంది. కనీస మొత్తం రూ.10,000 (మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కింద అయితే రూ.20,000) అని వివరించింది.