సాక్షి, ముంబై: యస్ బ్యాంక్ సంక్షోహంలో ఫౌండర్ రాణా కపూర్ చుట్టూ ఆర్థిక అవకతవకల ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఆయనను ఈడీ అదుపులోకి తీసుకోగా మనీలాండరింగ్ కేసులో రాణా కపూర్‌తో పాటు మరికొందరిపై నమోదైన కేసులపై ఈడీ చర్యలు చేపట్టింది. తాజాగా సీబీఐ కూడాసీరియస్‌గా స్పందిస్తోంది. ఆయన నిసావాసాల్లో పలుమార్లు సోదాలు నిర్వహిచిన సీబీఐ రాణాకపూర్ కుటుంబంతోపాటు, డీహెచ్‌ఎఫ్‌ఎల్ పై కూడా కేసు నమోదు చేసింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్ రుణాల విషయంలో రాణాకపూర్ క్విడ్ ప్రోకు పాల్పడినట్టు ఆరోపించింది. రాణా కపూర్ కు రూ. 600కోట్ల లాభం చేకూరిందని సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. తన స్థానాన్ని ఉపయోగించుకుని యస్ బ్యాంకులో భారీ స్కాం పాల్పడ్డాడని పేర్కొంది. ఈ కుంభకోణంలో రాణా కపూర్ కుమార్తెలు రాఖీ, రోషిణి, రాధాలు లబ్ది పొందినట్లు తెలిపింది. అలాగే ఇలాంటివి మరిన్ని ఉండవచ్చని కూడా అనుమానాలు వ్యక్తం చేసింది.
రాణా కపూర్ కుటుబం (భార్య బిందు, ముగ్గురు కుమార్తెలు రోషిణి, రాఖీ, రాధా) మొత్తాన్ని సీబీఐ బుక్ చేసింది. అలాగే డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్ కపిల్ వాద్వాన్, ఆర్‌హెచ్‌డబ్ల్యు డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ధీరజ్ రాజేష్ కుమార్ వాద్వాన్‌తో పాటు అయిదు కంపెనీల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. ఈ రెండు సంస్థలతో పాటు కపూర్ కుటుంబం నియంత్రణలో ఉన్న డాల్ట్ అర్బన్ వెంచర్స్, ఆర్‌ఏబీ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, డిహెచ్‌ఎఫ్‌ఎల్‌తో అనుసంధానమైన సంస్థలను కూడా నిందితులుగా పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఏడుగురు నిందితులు దేశం విడిచి పారిపోకుండా లుక్‌అవుట్ నోటీసులు కూడా జారీ చేసింది. కాగా ఈ కంపెనీల్లో బిందు రానా కపూర్ డైరెక్టర్‌గా ఉన్నారు. మోర్గాన్ క్రెడిట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రాణా కపూర్ కుమార్తెలు డైరెక్టర్లుగా ఉన్నారని సమాచారం. సోమవారం కూడా అధికారిక నివాసంతో పాటు ఆయనకు సంబంధం ఉన్న ఏడు ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. సంస్థకు ఇచ్చిన రుణాలకు ప్రతిఫలంగా ముడుపులు అందాయన్న ఆరోపణలు రావడంతో ఈ సోదాలు నిర్వహించినట్టు సీబీఐ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment