![DHFL gain up 26% - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/1/dhfl.jpg.webp?itok=UcqpzteP)
న్యూఢిల్లీ: దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్‌ఎఫ్‌ఎల్) నాలుగో త్రైమాసిక కాలంలో రూ. 312 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం(రూ.248 కోట్లు)తో పోల్చితే 26 శాతం వృద్ధి సాధించామని డీహెచ్‌ఎఫ్‌ఎల్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,377 కోట్ల నుంచి 18 శాతం పెరిగి రూ.2,808 కోట్లకు వృద్ధి చెందిందని కంపెనీ సీఎమ్‌డీ కపిల్ వాధ్వాన్ తెలిపారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.2.50 తుది డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు.
గతంలో ఇచ్చిన మధ్యంతర డివిడెండ్‌ను కూడా కలుపుకుంటే, గత ఆర్థిక సంవత్సరానికి మొత్తం డివిడెండ్ రూ.5.50గా ఉందని తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటే, 2016–17లో రూ.927 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 26 శాతం వృద్ధితో రూ.1,172 కోట్లకు పెరిగిందని వాధ్వాన్ వివరించారు. మొత్తం ఆదాయం రూ.8,857 కోట్ల నుంచి 18 శాతం వృద్ధితో రూ.10,465 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో డీహెచ్‌ఎఫ్‌ఎల్ షేర్ 1 శాతం లాభంతో రూ.641 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment