ఈ వారం టాప్‌ 10 కంపెనీలు.. రూ. 1.03 లక్షల కోట్లు | Top 10 Firms Gain Rs 1.03 Lakh Crore Market Value This Week | Sakshi
Sakshi News home page

ఈ వారం టాప్‌ 10 కంపెనీలు.. రూ. 1.03 లక్షల కోట్లు

Published Sun, Jul 21 2024 8:32 AM | Last Updated on Sun, Jul 21 2024 12:04 PM

Top 10 Firms Gain Rs 1.03 Lakh Crore Market Value This Week

ఈ వారం టాప్ 10 అత్యంత విలువైన కంపెనీలు కలిసి మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రూ. 1.03 లక్షల కోట్లను పొందాయి. ఐటీ మేజర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (టీసీఎస్‌), ఇన్ఫోసిస్ లిమిటెడ్ అత్యధిక లాభాన్ని పొందాయి.

టీసీఎస్‌ మార్కెట్ విలువ ఈ వారం దాదాపు రూ.43,000 కోట్లు పుంజుకుని  రూ.15.57 లక్షల కోట్లకు చేరుకుంది. దీంతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 ఈ వారం 0.51% పెరిగింది. ఇన్ఫోసిస్ రూ.33,000 కోట్లు లాభపడింది. దాని మార్కెట్ విలువ రూ.7.44 లక్షల కోట్లకు చేరుకుంది.

కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టాప్ 10 సంస్థలలో అత్యధికంగా రూ.57,000 కోట్లు క్షీణించింది. దీని మార్కెట్ క్యాప్ రూ.21.04 లక్షల కోట్లకు తగ్గిపోగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ రూ.12,000 కోట్లు తగ్గి 12.23 లక్షల కోట్లకు పడిపోయింది.

అయితే క్షీణించినప్పటికీ ఆర్‌ఐఎల్‌ అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ లిమిటెడ్, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్ లిమిటెడ్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, ఐటీసీ, లార్సెన్ అండ్ టూబ్రో లిమిటెడ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement