Top 10 firms List
-
ఈ వారం టాప్ 10 కంపెనీలు.. రూ. 1.03 లక్షల కోట్లు
ఈ వారం టాప్ 10 అత్యంత విలువైన కంపెనీలు కలిసి మార్కెట్ క్యాపిటలైజేషన్లో రూ. 1.03 లక్షల కోట్లను పొందాయి. ఐటీ మేజర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (టీసీఎస్), ఇన్ఫోసిస్ లిమిటెడ్ అత్యధిక లాభాన్ని పొందాయి.టీసీఎస్ మార్కెట్ విలువ ఈ వారం దాదాపు రూ.43,000 కోట్లు పుంజుకుని రూ.15.57 లక్షల కోట్లకు చేరుకుంది. దీంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఈ వారం 0.51% పెరిగింది. ఇన్ఫోసిస్ రూ.33,000 కోట్లు లాభపడింది. దాని మార్కెట్ విలువ రూ.7.44 లక్షల కోట్లకు చేరుకుంది.కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టాప్ 10 సంస్థలలో అత్యధికంగా రూ.57,000 కోట్లు క్షీణించింది. దీని మార్కెట్ క్యాప్ రూ.21.04 లక్షల కోట్లకు తగ్గిపోగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ రూ.12,000 కోట్లు తగ్గి 12.23 లక్షల కోట్లకు పడిపోయింది.అయితే క్షీణించినప్పటికీ ఆర్ఐఎల్ అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్ లిమిటెడ్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, ఐటీసీ, లార్సెన్ అండ్ టూబ్రో లిమిటెడ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
భారతీయ రైల్వే, ఆర్మీ ఘనత
ప్రపంచంలో అత్యధిక ఉద్యోగులున్న టాప్-10 సంస్థల జాబితాలో చోటు డబ్ల్యూఈఎఫ్ అధ్యయనంలో వెల్లడి * రైల్వేలలో 14 లక్షల మంది, ఆర్మీలో 13 లక్షల మంది ఉద్యోగులు న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యధిక ఉద్యోగులను కలిగివున్న టాప్-10 సంస్థల జాబితాలో రెండు భారతీయ సంస్థలు రైల్వే, ఆర్మీ చోటు సంపాదించాయి. మొత్తం 14 లక్షల మంది సిబ్బందిని కలిగిఉన్న భారతీయ రైల్వేలు ప్రపంచంలో అత్యధిక ఉద్యోగులను కలిగిఉన్న సంస్థల జాబితాలో ఎనిమిదవ స్థానంలో నిలిచింది. మరోవైపు 13 లక్షల ఉద్యోగులతో భారత ఆర్మీ ఆ తరువాతి స్థానం(9వ)లో నిలిచింది. ప్రపంచ ఆర్థిక ఫోరం(డబ్ల్యూఈఎఫ్) ప్రచురించిన ఓ అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ అధ్యయనాన్ని అనుసరించి.. ప్రపంచంలో అత్యధిక ఉద్యోగులున్న సంస్థగా అమెరికా రక్షణ శాఖ నిలుస్తోంది. ఇది 32 లక్షల మంది ఉద్యోగులను కలిగివుంది. 23 లక్షల మంది ఉద్యోగులతో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(చైనా ఆర్మీ) రెండో స్థానంలో నిలిచింది. 21 లక్షల మంది ఉద్యోగులతో అమెరికా సూపర్‌మార్కెట్ జెయంట్ వాల్‌మార్ట్ ఈ జాబితాలో మూడో స్థానం పొందింది. ప్రపంచంలో అత్యధిక ఉద్యోగులున్న టాప్-10 సంస్థల వివరాలివీ...