This week
-
ఈ వారం టాప్ 10 కంపెనీలు.. రూ. 1.03 లక్షల కోట్లు
ఈ వారం టాప్ 10 అత్యంత విలువైన కంపెనీలు కలిసి మార్కెట్ క్యాపిటలైజేషన్లో రూ. 1.03 లక్షల కోట్లను పొందాయి. ఐటీ మేజర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (టీసీఎస్), ఇన్ఫోసిస్ లిమిటెడ్ అత్యధిక లాభాన్ని పొందాయి.టీసీఎస్ మార్కెట్ విలువ ఈ వారం దాదాపు రూ.43,000 కోట్లు పుంజుకుని రూ.15.57 లక్షల కోట్లకు చేరుకుంది. దీంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఈ వారం 0.51% పెరిగింది. ఇన్ఫోసిస్ రూ.33,000 కోట్లు లాభపడింది. దాని మార్కెట్ విలువ రూ.7.44 లక్షల కోట్లకు చేరుకుంది.కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టాప్ 10 సంస్థలలో అత్యధికంగా రూ.57,000 కోట్లు క్షీణించింది. దీని మార్కెట్ క్యాప్ రూ.21.04 లక్షల కోట్లకు తగ్గిపోగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ రూ.12,000 కోట్లు తగ్గి 12.23 లక్షల కోట్లకు పడిపోయింది.అయితే క్షీణించినప్పటికీ ఆర్ఐఎల్ అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్ లిమిటెడ్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, ఐటీసీ, లార్సెన్ అండ్ టూబ్రో లిమిటెడ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
పరిమిత శ్రేణిలోనే కదలికలు
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలోనూ పరిమిత శ్రేణిలో కదలాడొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. డెరివేటివ్ కాంట్రాక్టుల నెలవారీ గడువు గురువారం(జూన్ 27)తో పూర్తి కానుండడం కూడా మార్కెట్లో ఊగిసలాట ఉండొచ్చంటున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు సూచీలకు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. వీటితో పాటు రుతు పవనాల కదలికల వార్తలు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. ‘‘స్టాక్ మార్కెట్లో బుల్లిష్ సెంటిమెంట్ ఉన్నప్పట్టకీ., కొనుగోళ్లు చేసేందుకు గానీ, అమ్మకాలు జరిపేందుకు గానీ ప్రేరేపించే అంశాలేవీ లేనందున సూచీలు పరిమిత శ్రేణిలో చలించవచ్చు. అలాగే బడ్జెట్ అంచనాల వార్తలకు అనుగుణంగా బడ్జెట్ ఆధారిత రంగ షేర్లలో మూమెంటమ్ అధికంగా ఉండొచ్చు. సాంకేతికంగా నిఫ్టీ 23,400 – 23,700 శ్రేణిలో దిద్దుబాటు ఉండొచ్చు. దిగువ స్థాయిలో 23,300–23,200 పరిధిలో తక్షణ మద్దతు నెలకొని ఉంది’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ సాంకేతిక నిపుణులు ప్రవేశ్ గౌర్ తెలిపారు. ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగే గతవారంలో సెన్సెక్స్ 217 పాయింట్లు, నిఫ్టీ 36 పాయింట్లు లాభపడ్డాయి. జీఎస్టీ కౌన్సిల్ సమావేశ నిర్ణయాల ప్రభావం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శనివారం జరిగిన 53వ జీఎస్టీ పాలక మండలి సమావేశ నిర్ణయాలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. ముఖ్యంగా ఎరువులపై జీఎస్టీ 18% నుంచి 5 శాతానికి తగ్గింపు ప్రతిపాదనను మంత్రుల బృందానికి (జీవోఎం) సిఫార్సు చేయడంతో ఫెర్టిలైజర్లలో కదలికలు ఉండొచ్చు. అలాగే, ఈ సమావేశంలో ఆన్లైన్ గేమింగ్‌పై జీఎస్టీకి సంబంధించి ఎటువంటి చర్చ జరగకపోవడంతో ఆన్లైన్ గేమింగ్ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనుకావచ్చు. విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయ్ విధాన సంస్కరణలు, ఆర్థిక వృద్ధి కొనసాగింపుపై అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్లో క్రమంగా పెట్టుబడులు పెంచుకుంటున్నారు. ఈ జూన్ ఇప్పటివరకు(జూన్ 21 నాటికి) నికరంగా రూ.12,170 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఫైనాన్సియల్ సరీ్వసెస్, టెలికం, రియల్టీ షేర్ల పట్ల ఆసక్తి కనబరిచారు. ఎఫ్ఎంసీజీ, ఐటీ, మెటల్, అయిల్‌అండ్‌గ్యాస్ షేర్లను విక్రయించారు. ఇక డెట్ మార్కెట్ లో రూ.10,575 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేశారు. ‘‘కేంద్రం వృద్ధికి మద్దతనిచ్చే బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చనే ఆశలు ఎఫ్ఐఐలను కొనుగోళ్లకు ప్రేరేపిస్తున్నాయి. అయినప్పట్టకీ దేశీయ ఈక్విటీ మార్కెట్ వాల్యుయేషన్లు భారీ పెరిగాయనే నెపంతో ఎఫ్ఐఐలు ఆచితూచి కొనుగోళ్లు చేస్తున్నారు’’ అని మార్నింగ్స్టాక్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవత్సవ తెలిపారు. ఇక మేలో ఎఫ్‌పీఐలు ఈక్విటీల నుండి రూ. 25,586 కోట్లను ఉపసంహరించుకున్నారు, ఏప్రిల్‌లో రూ. 8,700 కోట్లకు పైగా ఉపసంహరించుకున్నారు. అదే మార్చిలో రూ.35,098 కోట్లు, ఫిబ్రవరిలో రూ.1,539 కోట్లు నికర పెట్టుబడి పెట్టారు. రెండు ఐపీఓలు, 2 లిస్టింగులు రెండు కంపెనీలు ఈ వారంలో నిధుల సమీకరణకు రానున్నాయి. ఆఫీసర్స్ చాయిస్ విస్కీ తయారీ కంపెనీ అలైడ్ బ్లెండర్స్ పబ్లిక్ ఇష్యూ మంగళవారం( 25న) ప్రారంభమై, గురువారం (జూన్ 27న) ముగియనుంది. తద్వారా రూ.1,500 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. వ్రజ్ ఐరన్ అండ్ స్టీల్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 26న ప్రారంభంకానుంది. 28న ముగియనున్న ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 171 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇదే వారంలో డీఈఈ డెవలప్మెంట్ ఇంజినీర్స్ షేర్లు మంగళవారం, ఆక్మే ఫిన్‌ట్రేడ్ షేర్లు శుక్రవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం అమెరికా మార్చి త్రైమాసిక జీడీపీ వృద్ధి గణాంకాలు గురువారం, అదే రోజు యూరోజోన్ జూలై కన్జూమర్ కాని్ఫడెన్స్ డేటా, జపాన్ మే రిటైల్ అమ్మక గణాంకాలు విడుదల కానున్నాయి. మరుసటి రోజు(శుక్రవారం) చైనా మార్చి క్వార్టర్ కరెంట్ ఖాతా లోటు, జపాన్ మే నిరుద్యోగ గణాంకాలు, బ్రిటన్ క్యూ1 జీడీపీ వృద్ధి డేటా వెల్లడి కానున్నాయి. భారత మే నెల వాణిజ్య లోటు, మౌలిక రంగ వృద్ధి, మార్చి త్రైమాసిక కరెంటు ఖాతా లోటు (సీఏడీ), విదేశీ కరెన్సీ రుణ గణాంకాలు శుక్రవారం విడుదల కానున్నాయి. -
ఈ వారంలో 5 రోజులు బ్యాంకులు బంద్!
ఈ వారంలో బ్యాంక్ కార్యకలాపాలు నిర్వహించే వారికి ఇది ముఖ్యమైన సమాచారం. సెలవులు, వారాంతాలు సహా వివిధ కారణాలతో ఈ వారంలో ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో తరువాతి వారంలోనూ బ్యాంకులకు సెలవులు కొనసాగవచ్చు. దేశ వ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో సహా అన్ని జాతీయ బ్యాంకులు ఏప్రిల్ 9 మంగళవారం గుడి పడ్వా, ఉగాది, ఏప్రిల్ 10 బుధవారం బోహాగ్ బిహు, ఈద్, ఏప్రిల్ 11 గురువారం రంజాన్, ఏప్రిల్ 13 రెండవ శనివారం, ఏప్రిల్ 14 ఆదివారం ఇలా.. ఈ ఐదు రోజుల పాటు మూత పడనున్నాయి. మరోవైపు ఏప్రిల్ 15, 16 తేదీలలో వరుసగా బోహాగ్ బిహు, రామ నవమి సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు. మరింత స్పష్టత కోసం కస్టమర్లు సమీపంలోని బ్యాంక్ శాఖలను సంప్రదించవచ్చు. ఆయా రాష్ట్రాల్లో సెలవుల జాబితాను ఆర్బీఐ, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు ఖరారు చేస్తాయి. -
ఫలితాల సీజన్‌తో జోష్!
ముంబై: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు కార్పొరేట్ ఫలితాలు జోష్‌నివ్వనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ సేవలకు దేశంలోనే నంబర్‌వన్‌గా నిలుస్తున్న టాటా గ్రూప్ దిగ్గజం టీసీఎస్ గత ఆర్థిక సంవత్సరం(2023–24) చివరి త్రైమాసిక ఫలితాలతో సీజన్‌ను ప్రారంభించనుంది. శుక్రవారం(12న) టీసీఎస్ జనవరి–మార్చి(క్యూ4)తోపాటు పూర్తి ఏడాదికి సైతం ఆర్థిక ఫలితాలను వెల్లడించనుంది. ఇదే రోజు ఆర్థిక గణాంకాలు సైతం వెలువడనున్నాయి. ప్రభుత్వం(ఎన్ఎస్వో) మార్చి నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలను విడుదల చేయనుంది. అంతేకాకుండా ఫిబ్రవరి నెలకు పారిశ్రామికోత్పత్తి వివరాలు సైతం వెల్లడికానున్నాయి. ఫిబ్రవరిలో సీపీఐ నామమాత్ర వెనకడుగుతో 5.09 శాతానికి చేరింది. ఇక పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) జనవరిలో 3.4 శాతంగా నమోదైంది. కాగా.. గురువారం(11న) ఈద్(రంజాన్) సందర్భంగా స్టాక్ మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. గత వారం రికార్డు గత వారం ఆర్బీఐ పాలసీ సమీక్ష నేపథ్యంలో మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకాయి. చివరికి శుక్రవారంతో ముగిసిన గత వారం సెన్సెక్స్ 597 పాయింట్లు(0.8 శాతం) లాభపడి 74,248 వద్ద ముగిసింది. ఈ బాటలో ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ సైతం 187 పాయింట్లు(0.84 శాతం) ఎగసి 22,514 వద్ద స్థిరపడింది. అయితే చిన్న షేర్లకు డిమాండ్ కొనసాగడంతో బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 3.84 శాతం జంప్‌చేసి 40,831 వద్ద నిలిచింది. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ మరింత అధికంగా 6.64 శాతం దూసుకెళ్లి 46,033 వద్ద ముగిసింది. చమురు, రూపాయి ఎఫెక్ట్ ప్రపంచ స్టాక్ మార్కెట్లు దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయగలవని స్టాక్ నిపుణులు ప్రస్తావించారు. అంతేకాకుండా దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు లేదా అమ్మకాలు మార్కెట్లలో హెచ్చుతగ్గులకు కారణంకాగలవని పేర్కొన్నారు. మరోవైపు రష్యా తదితర అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. ఇక ఇటీవల యూఎస్ డాలరుతో బలహీనంగా కదులుతున్న దేశీ కరెన్సీ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. గత వారం డాలరుతో మారకంలో రూపాయి చరిత్రాత్మక కనిష్టానికి చేరువైన నేపథ్యంలో ఆరు ప్రపంచ కరెన్సీలతో డాలరు మారకపు విలువ కీలకంగా నిలవనున్నట్లు విశ్లేíÙంచారు. విదేశీ అంశాల విషయానికివస్తే గత వారాంతాన మార్చి నెలకు యూఎస్ వ్యవసాయేతర రంగాలలో ఉపాధి, నిరుద్యోగిత గణాంకాలు వెలువడ్డాయి. వీటితోపాటు ఈ నెల 10న(బుధవారం) యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్నాయి. ఇటీవల చేపట్టిన పాలసీ సమీక్షలో యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్.. ఫండ్స్ రేట్లను యథాతథంగా నిలిపి ఉంచిన సంగతి తెలిసిందే. ఈ బాటలో దేశీయంగా సైతం ఆర్బీఐ ద్వైమాసిక పరపతి సమీక్షలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును ఏడోసారీ యథాతథంగా 6.5 శాతంవద్దే కొనసాగించేందుకు నిర్ణయించింది. ఈ సందర్భంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2024–25) జీడీపీ వృద్ధి రేటును 7 శాతంగా అంచనా వేసింది. సీపీఐ లక్ష్యాన్ని 4.5 శాతంగా పేర్కొంది. -
రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు
ముంబై: స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ ఈ వారమూ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల పనితీరు, దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, జాతీయ, అంతర్జాతీయ స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం మార్కెట్ ట్రెండ్‌ను నిర్ణయిస్తాయని చెబుతున్నారు. వీటితో పాటు క్రూడాయిల్ ధరలు, బాండ్లపై రాబడులు, రూపాయి విలువ అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఎక్సే్చంజీలు పనిచేయవు. ఈ వారం ఈక్విటీ ట్రేడింగ్ నాలుగు రోజులే జరుగుతుంది. అయితే కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లలో సాయంత్రం సెషన్లో ట్రేడింగ్ జరుగుతుంది. ఆకర్షణీయమైన క్యూ3 జీడీపీ డేటా నమోదు, ఫిబ్రవరి తయారీ రంగ, ఆటో అమ్మకాలు మెప్పించడంతో గతవారం సూచీలు సరికొత్త గరిష్టాలను అధిరోహించాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 663 పాయింట్లు, నిఫ్టీ 166 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. బ్యాంకులు, ఆటో, మెటల్ షేర్లు రాణించాయి. ‘‘స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ పథకాల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల రక్షణ దృష్ట్యా తగిన విధివిధానాలను అమలు చేయలంటూ సెబీ ఏంసీఏలను ఆదేశించడంతో చిన్న, మధ్య తరహా షేర్లలో దిద్దుబాటు మెదలైంది. రానున్న రోజుల్లోనూ కొనసాగే వీలుంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలూ స్వల్పంగా పెరిగాయి. ఏవైనా ప్రతికూల సంకేతాలు నెలకొంటే మార్కెట్లో ప్రస్తుత సానుకూలతను దెబ్బతీయగలవు. అయితే ప్రతికూలతను మార్కెట్ విస్మరిస్తే బుల్లిష్ మూమెంటం కొనసాగొచ్చు. రెండు నెలల స్థిరీకరణ తర్వాత నిఫ్టీ బుల్లిష్ వైఖరి ప్రదర్శిస్తోంది. తాజాగా శనివారం జరిగిన ప్రత్యేక ట్రేడింగ్ నాడు కీలకమైన నిరోధం 22,400 స్థాయిని చేధించి 22,420 వద్ద ముగిసింది. లాభాల కొనసాగితే 22,500 స్థాయిని పరీక్షింవచ్చు. లాభాల స్వీకరణ జరిగితే 22,200 స్థాయి వద్ద కీలక మద్దతు ఉంది’’ అని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ అరవిందర్ సింఘ్ తెలిపారు. 3 ఐపీఓలు రూ.1,325 కోట్లు ప్రాథమిక మార్కెట్లో ఈ వారమూ ఐపీఓల సందడి కొనసాగనుంది. పబ్లిక్ ఆఫర్ ద్వారా గోపాల్ స్నాక్స్, జేజీ కెమికల్స్, ఆర్కే స్వామి కంపెనీలు రూ.1,325 కోట్ల నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ సరీ్వసెస్ సంస్థ ఆర్కె స్వామీ 4–6 తేదీల మధ్య పబ్లిక్ ఇష్యూకు రానుంది. కొత్త షేర్ల జారీ ద్వారా రూ. 173 కోట్లను, ఆఫర్ ఫర్ సేల్ నుంచి మరో రూ. 250.56 కోట్లను మొత్తం రూ.423.56 కోట్ల వరకు నిధుల సమీకరించనుంది. ఇందుకు ధరల శ్రేణి రూ. 270–288 మధ్య నిర్ణయించింది. జింక్ ఆక్సైడ్ తయారీ కంపెనీ జేజీ కెమికల్స్ 5–7 తేదీల మధ్య రూ. 251.2 కోట్ల నిధులను సమీకరించనుంది. రూ. 210–221 శ్రేణిలో ధరలను నిర్ణయించగా, కొత్త షేర్ల జారీ ద్వారా రూ. 165 కోట్లను, ఆఫర్ ఫర్ సేల్ రూ. 86.2 కోట్లను సేకరించనుంది. రాజ్‌కోట్ కేంద్రంగా కార్యకలాపాలను సాగించే గోపాల్ స్నాక్స్ కంపెనీ ఈ నెల 6–11 తేదీల మధ్య పబ్లిక్ ఇష్యూకు అందుబాటులో ఉండనుంది. రూ. 650 కోట్ల వరకు నిధుల కోసం సిద్ధమవుతున్న కంపెనీ రూ. 381–401 శ్రేణిలో షేర్ల ధరలను నిర్ణయించింది. ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు 16 కంపెనీలు ఐపీఓ ద్వారా రూ. 13 వేల కోట్ల వరకు సేకరించాయి. దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు దేశీయంగా మంగళవారం ఫిబ్రవరి సేవారంగం గణాంకాలు విడుదల అవుతాయి. వారాంతాపు రోజైన శుక్రవారం ఫిబ్రవరి 23 తేదీతో ముగిసిన బ్యాంకు రుణ, డిపాజిట్ వృద్ధి డేటా, మార్చి ఒకటో తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వలు వెల్లడి కానున్నాయి. -
ఆర్బీఐ, ఫెడ్ పాలసీ మినిట్స్‌పై దృష్టి
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం కూడా లాభాలు ఆర్జించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల ముందు ర్యాలీకి అవకాశాలు అధికంగా ఉన్నందున మార్కెట్ సెంటిమెంట్ మరింత బలపడే వీలుందంటున్నారు. ఇక ఫెడరల్ రిజర్వ్, ఆర్బీఐ పాలసీ సమావేశ వివరాలు, దేశీయ మార్కెట్లో విదేశీ పెట్టుబడుల తీరుతెన్నులు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, కమోడిటీ, క్రూడాయిల్ ధరలు, బాండ్ల రాబడులపై ఇన్వెస్టర్లు దృష్టి సారించే వీలుందంటున్నారు. ‘‘దేశీయ కార్పొరేట్ క్యూ3 ఫలితాల ఘట్టం ముగిసిన నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సంకేతాలు స్టాక్ సూచీలకు దిశానిర్ధేశం చేయనున్నాయి. నిఫ్టీ కీలకమైన 22 వేల స్థాయిపై ముగిసింది. రానున్న రోజుల్లో ఈ స్థాయిని నిలుపుకోగలిగితే జీవితకాల రికార్డు స్థాయి(22126)ని చేధించే వీలుంది. లాభాల స్వీకరణ జరిగితే 21,750 వద్ద తక్షణ మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 21,350–21,450 పరిధిలో మరో తక్షణ మద్దతు స్థాయి ఉంది’’ అని మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ వైస్ ప్రెసిడెంట్ అరవింద్ సింగ్ నందా తెలిపారు. జాతీయ అంతర్జాతీయ అంశాలు మెప్పించడంతో గత వారం సూచీలు ఒకటిన్నరశాతం లాభపడ్డాయి. బ్యాంకులు, ఆటో, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. గురువారం ఆర్బీఐ, ఫెడ్ పాలసీ సమావేశ వివరాలు ఈ ఫిబ్రవరి 8న జరిగిన ఆర్బీఐ ద్రవ్య పాలసీ కమిటీ సమావేశపు మినిట్స్(గురువారం), గత జనవరి చివర్లో జరిగిన ఫెడ్ మినిట్స్ గురువారం(ఫిబ్రవరి 22న) వెల్లడి కానున్నాయి. ఇరు కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్లు, ద్రవ్య విధాన వైఖరిలను మరింత లోతుగా విశ్లేíÙంచేందుకు మార్కెట్ వర్గాలు మినిట్స్ క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. నికర అమ్మకందారులుగా ఎఫ్ఐఐలు అమెరికా బాండ్లపై రాబడులు పెరగడం, ఆర్బీఐ, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై నెలకొన్న సందిగ్ధత నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీలపై బేరిష్ వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఈ ఫిబ్రవరి ఇప్పటి వరకు (ఫిబ్రవరి 16 నాటికి) రూ.3,776 కోట్ల ఈక్విటీలను విక్రయించినట్లు డేటా తెలియజేసింది. ఇదే సమయంలో డెట్ మార్కెట్లో ఎఫ్ఐఐల రూ.16,560 కోట్ల పెట్టుబడులు పెట్టడం విశేషం. ‘‘వినియోగ ఆధారిత ద్రవ్యోల్బణం అంచనాలకు మించిన నమోదడంతో ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఇది అమెరికా బాండ్లపై రాబడుల పెరుగుదలకు దారీ తీసింది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత వంటి వర్ధమాన దేశాల్లో పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. అలాగే ఆర్బీఐ నుంచి వడ్డీరేట్ల తగ్గింపుపై స్పష్టమైన సంకేతాలు వెలువడకపోవడం ఎఫ్ఐఐలను నిరాశపరిచింది’’ అని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ శ్రీవాత్సవ తెలిపారు. స్థూల ఆరి్థక గణాంకాలు జపాన్ డిసెంబర్ యంత్ర ఆర్డర్ల డేటా సోమవారం, యూరోజోన్ డిసెంబర్ కరెంట్ ఖాతా డేటా మంగళవారం విడుదల కానున్నాయి. బుధవారం జపాన్ జనవరి వాణిజ్యలోటు, యూరోజోన్ వినియోగ విశ్వాస గణాంకాలు, ఈసీబీ నాన్ మానిటరీ పాలసీ మీటింగ్ వివరాలు వెల్లడి కానున్నాయి. గురువారం యూరోజోన్ డిసెంబర్ సరీ్వసులు, ద్రవ్యోల్బణ, ఈసీబీ పాలసీ మీటింగ్ వివరాలు, అమెరికా నిరుద్యోగ డేటా వివరాలు విడుదలవుతాయి. ఇక వారాంతాపు రోజున ఆర్బీఐ ఫిబ్రవరి తొమ్మిదో తేదీతో ముగిసిన వారానికి సంబంధించిన బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి డేటాతో పాటు ఫిబ్రవరి 16వ తేదీతో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలను ప్రకటించనుంది. ఆయా దేశాల ఆరి్థక వ్యవస్థను ప్రతిబింబిజేసే ఈ స్థూల ఆరి్థక గణాంకాల డేటాను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. -
సెంటిమెంట్ సానుకూలం
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం కూడా లాభాలు ఆర్జించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, బడ్జెట్(2024–25)పై సమగ్ర విశ్లేషణ తర్వాత మార్కెట్ వర్గాల ప్రశంసనీయ వ్యాఖ్యలు, గతవారం వెలువడిన కొన్ని స్థూల ఆర్థిక గణాంకాలు మెప్పించడం తదితర అంశాలు సూచీలను లాభాల వైపు నడిపిస్తాయంటున్నారు. ఇక మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఆర్బీఐ ద్రవ్య పాలసీ కమిటీ నిర్ణయాలు, దేశీయ మార్కెట్లో విదేశీ పెట్టుబడుల తీరుతెన్నులు, కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, కమోడిటీ, క్రూడాయిల్ ధరలు, బాండ్లపై రాబడులపై ఇన్వెస్టర్లు దృష్టి సారించే వీలుందంటున్నారు. బడ్జెట్లో ద్రవ్యలోటు తగ్గింపు లక్ష్యం, మూలధన వ్యయ కేటాయింపు పెంపుతో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకోవడంతో గతవారంలో సూచీలు 2% ర్యాలీ చేశాయి. ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లతో పాటు అధిక వెయిటేజీ రిలయన్స్ షేరు రికార్డు ర్యాలీ నేపథ్యంలో వారం మొత్తంగా సెన్సెక్స్ 1,385 పాయింట్లు, నిఫ్టీ 502 పాయింట్లు చొప్పున ఆర్జించాయి. ‘‘నిఫ్టీ కొత్త రికార్డు(22,127) నమోదు, పాలసీ వెల్లడికి ముందు స్టాక్ మార్కెట్లో కొంత స్థిరీకరణ జరగొచ్చు. అయితే ప్రపంచ ఈక్విటీ మార్కెట్లోని సానుకూల సంకేతాలు బుల్స్‌కు అనుకూలంగా ఉన్నాయి. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 21,850 స్థాయిపై ముగిసింది. లాభాలు కొనసాగితే ఎగువున 22,350 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 21,640 పాయింట్ల వద్ద కీలక మద్దతు లభిస్తుంది’’ అనిమాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ వైస్ ప్రెసిడెంట్ అరవింద్ సింగ్ నందా తెలిపారు. క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రభావం దేశీయ కార్పొరేట్ కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన తుది అంకానికి చేరుకుంది. భారతీ ఎయిర్టెల్, బ్రిటానియా, నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్, గ్రాసీం ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్, దివీస్ ల్యాబ్స్, ఓఎన్జీసీతో సహా ఈ వారంలో 1,200 కంపెనీలు తమ డిసెంబర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. ఎల్ఐసీ, లుపిన్, నైనా, జొమాటో, టాటా పవర్, అలెంబిక్ ఫార్మా, అశోక్ లేలాండ్, వరణ్ బేవరేజెస్, గోద్రేజ్ ప్రాపరీ్టస్, అపోలో టైర్స్, మణిప్పురం ఫైనాన్స్, బయోకాన్, ఎస్కార్ట్స్, పతంజలీ ఫుడ్స్, ఎంసీఎక్స్ కంపెనీలు మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించే జాబితాలో ఉన్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమా న్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. స్థూల ఆర్థిక గణాంకాలు చైనా, యూరోజోన్, జపాన్ దేశాలు జనవరి సేవారంగ పీఎంఐ డేటాను(సోమవారం) వెల్లడించనున్నాయి. భారత సేవారంగ డేటా ఫిబ్రవరి 5న విడుదల అవుతుంది. వారాంతాపు రోజైన శుక్రవారం జనవరి 26తో ముగిసి వారం బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి డేటాతో పాటు జనవరి 2తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలు ప్రకటించనుంది. 4 పబ్లిక్ ఇష్యూలు, ఒక లిస్టింగ్ ఈ వారంలో నాలుగు కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ.2,700 కోట్ల నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ఏపీజే సురేంద్ర పార్స్ హోటల్ ఐపీఓ జనవరి 5న, రాశి పెరిఫెరల్స్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పబ్లిక్ ఇష్యూలు జనవరి7న ప్రారంభం కానున్నాయి. ఇదే వారంలో ఇటీవల ఇష్యూలను పూర్తి చేసుకున్న బీఎల్ఎస్ ఈ–సరీ్వసెస్(ఫిబ్రవరి 7న) కంపెనీల షేర్లు ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఆర్బీఐ పాలసీ నిర్ణయాలపై దృష్టి ఫెడ్ ద్రవ్య పాలసీ, మధ్యంతర బడ్జెట్ ప్రకటన తర్వాత దలాల్ స్ట్రీట్‌కు ఆర్బీఐ ద్రవ్య సమావేశ నిర్ణయాలు కీలకం కానున్నాయి. సమీక్ష సమావేశం మంగళవారం(జనవరి 6న) ప్రారంభం అవుతుంది. కమిటీ నిర్ణయాలను బుధవారం గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడిస్తారు. రెపో రేటు (6.5%) యథాతథ కొనసాగింపునకే కమిటీ మొగ్గుచూపొచ్చు. అయితే వడ్డీ రేట్లు తగ్గింపు సైకిల్, ద్రవ్యోల్బణం, దేశ ఆర్థిక స్థితిగతులు, వృద్ధి అవుట్‌లుక్‌పై గవర్నర్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించవచ్చు. డెట్ మార్కెట్లో ఆరేళ్ల గరిష్టానికి ఎఫ్ఐఐల పెట్టుబడులు విదేశీ పెట్టుబడులు జనవరిలో దేశీయ డెట్ మార్కెట్లో రూ. 19,800 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. గడిచిన ఆరేళ్లలోనే అత్యధిక నెలవారీ పెట్టుబడులు కావడం విశేషం. భారత ప్రభుత్వ బాండ్లను జేపీ మోర్గాన్ ఇండెక్స్‌లో చేర్చడం ఇందుకు ప్రధాన కారణం. అమెరికాలో పెరుగుతున్న బాండ్ల రాబడితో గత నెల ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు రూ. 25,743 కోట్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం, క్రితం నెల డెట్ మార్కెట్లలో ఎఫ్‌పీఐలు రూ.19,836 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, 2017, జూన్‌లో వచి్చన రూ. 25,685 కోట్ల తర్వాత ఇది రెండో అత్యధికం. బడ్జెట్ ప్రకటనలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రకటనలో ఆర్థిక లోటును వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5.1 శాతానికి తగ్గిస్తామని చెప్పడం, డెట్ మార్కెట్లో నిధుల పెరుగుదలకు దోహదపడుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. -
పరిమిత శ్రేణిలో కదలికలు
ముంబై: ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగే ఈ వారంలో స్టాక్ సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. నెలవారీ ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ట్రేడింగ్(గురవారం)కు సంబంధించి ఈ ఏడాదికిదే ఆఖరి వారం కావడంతో ట్రేడర్లు ఆచితూచి అడుగేసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కోవిడ్ కేసులు, ఎర్ర సముద్రంలో అలజడుల పరిణామాలను మార్కెట్ వర్గాలు పరిశీలించవచ్చు. ఈ వారంలోని ఆయా కంపెనీల ఐపీఓలు, లిస్టింగులపైనా దృష్టి సారించే వీలుంది. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల క్రయవిక్రయాలు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలూ ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే వీలుంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా నేడు(సోమవారం) మార్కెట్లకు సెలవు. ► ‘‘మార్కెట్లో ఇప్పటికీ సానుకూల వాతావరణం కలిగి ఉంది. అయితే కొత్త ఏడాది ప్రారంభం, క్రిస్మస్ పండుగ సెలవుల నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి పెద్దగా సంకేతాలు అందకపోవచ్చు. రంగాల వారీ, స్టాక్ ఆధారిత ట్రేడింగ్ దేశీయ ఈక్విటీ మార్కెట్‌కు దిశానిర్దేశం చేయొచ్చు. సాంకేతికంగా నిఫ్టీకి దిగువ స్థాయిలో 21,000 – 20,950 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే లాభాల స్వీకరణ చోటు చేసుకోవచ్చు. ఎగువన 21,400 – 21,450 స్థాయిల్లో నిరోధం ఉంది. స్థిరీకరణలో భాగంగా, పతనమైన నాణ్యత కలిగి షేర్లను కొనుగోలు చేయొచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ్ ఖేమా తెలిపారు. ► గరిష్ట స్థాయిల వద్ద స్థిరీకరణలో భాగంగా గతవారం సెన్సెక్స్ 377 పాయింట్లు, నిఫ్టీ 107 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. డిసెంబర్ 20(మంగళవారం) సెన్సెక్స్ 71,913, నిఫ్టీ 21,593 వద్ద కొత్త జీవితకాల గరిష్ట స్థాయిలు నమోదు చేశాయి. 4 ఐపీఓలు, 8 లిస్టింగులు... ట్రిడెంట్ టెక్లాబ్స్, సమీరా ఆగ్రో అండ్ ఇన్ఫ్రా, సుప్రీం పవర్ ఎక్విప్మెంట్, ఇండిఫ్రా కంపెనీలు ఈ వారంలో ప్రాథమిక మార్కెట్ నుంచి నిధులు సమీకరణ సిద్ధమయ్యాయి. ఇక ఈ ఏడాది చివరి వారంలో 8 ప్రధాన కంపెనీల షేర్లు ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. మోతీసన్స్ జ్యువెలరీస్, మూత్తూట్ మైక్రోఫిన్, సూరజ్ ఎస్టేట్ డెవెలపర్స్ షేర్లు మంగళవారం (డిసెంబర్ 26న), హ్యాపీ ఫోర్జిన్స్, ఆర్బీజెడ్ జ్యువెలరీస్, క్రెడో బ్రాండ్ ముఫ్టీ షేర్లు బుధవారం (డిసెంబర్ 27న), అజాద్ ఇంజనీరింగ్స్ (డిసెంబర్ 28న), ఇన్నోవా క్యాప్‌ట్యాబ్ కంపెనీల డిసెంబర్ 29 (గురువారం) లిస్ట్ కానున్నాయి. -
IPO: పబ్లిక్ ఇష్యూల జోరు! 5 కంపెనీలు.. రూ. 4,200 కోట్లు
న్యూఢిల్లీ: మార్కెట్లో సానుకూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూ బాట పట్టాయి. ఈ వారం ఏకంగా ఐదు కంపెనీలు ఇన్షీయల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు వస్తున్నాయి. ఈ జాబితాలో ఇండియా షెల్టర్ ఫైనాన్స్, డోమ్స్ ఇండస్ట్రీస్, ఐనాక్స్ ఇండియా, మోతిసన్స్ జ్యుయలర్స్, సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిసి సుమారు రూ. 4,200 కోట్ల పైచిలుకు సమీకరించనున్నాయి. గత నెల 10 కంపెనీల పబ్లిక్ ఇష్యూలు విజయవంతమైన నేపథ్యంలో తాజా ఐపీవోలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టాటా గ్రూప్ నుంచి 2004 తర్వాత (టీసీఎస్) దాదాపు ఇరవై ఏళ్లకు వచ్చిన టాటా టెక్నాలజీస్ ఇష్యూకు భారీ స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ ఆఖరు వరకు మొత్తం మీద 44 ఇష్యూల ద్వారా కంపెనీలు రూ. 35,000 కోట్లు సమీకరించాయి. స్థూల ఆర్థిక పరిస్థితులు, లిస్టింగ్ లాభాలు పటిష్టంగా ఉండటం వంటి అంశాల కారణంగా గత కొద్ది వారాలుగా ఐపీవో మార్కెట్ బాగా సందడిగా ఉందని ఆనంద్ రాఠీ అడ్వైజర్స్ డైరెక్టర్ వి. ప్రశాంత్ రావు చెప్పారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం కూడా పాలనపరమైన స్థిరత్వాన్ని కోరుకునే ఇన్వెస్టర్లకు, తద్వారా మార్కెట్‌కు ఉత్సాహాన్ని ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఐపీవోలు ఇవీ.. ఇండియా షెల్టర్ ఫైనాన్స్ (ఐఎస్ఎఫ్), డోమ్స్ ఇండస్ట్రీస్ ఇష్యూలు డిసెంబర్ 13–15 మధ్య ఉండనున్నాయి. ఇవి రెండూ చెరి రూ. 1,200 కోట్లు సమీకరించనున్నాయి. ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కొత్తగా రూ. 800 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా, ఇన్వెస్టర్ షేర్హోల్డర్లు రూ. 400 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనున్నారు. షేరు ధర శ్రేణి రూ. 469–493గా ఉండనుంది. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను భవిష్యత్తు వ్యాపార కార్యకలాపాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. మరోవైపు, పెన్సిళ్ల తయారీ సంస్థ డోమ్స్ ఇండస్ట్రీస్ రూ. 350 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, రూ. 850 కోట్ల విలువ చేసే షేర్లను ఓఎఫ్ఎస్ ద్వారా విక్రయించనుంది. ఐపీవో ధర శ్రేణి రూ. 750–790గా ఉంటుంది. క్రయోజెనిక్ స్టోరేజ్ ట్యాంకుల తయారీ సంస్థ ఐనాక్స్ సీవీఏ పూర్తిగా ఓఎఫ్ఎస్ కింద 2.21 కోట్ల షేర్లను విక్రయించి రూ. 1,459 కోట్లు సమీకరించనుంది. షేరు ధర శ్రేణి రూ. 627– 660గా ఉంటుంది. నిధులను కంపెనీతో పాటు అనుబంధ సంస్థలైన ఎకార్డ్ ఎస్టేట్స్, ఐకానిక్ ప్రాపర్టీ డెవలపర్స్, స్కైలైన్ రియల్టీ రుణాల చెల్లింపునకు, స్థల సమీకరణ మొదలైన అవసరాలకు వినియోగించుకోనుంది. ఐనాక్స్ ఇ ష్యూ డిసెంబర్ 14న ప్రారంభమై 18న ముగుస్తుంది. 17 ఏళ్ల క్రితం ఐనాక్స్ లీజర్ (మలీ్టప్లెక్స్ విభాగం) ఐపీవోకి వచ్చాక ఐనాక్స్ గ్రూ ప్ నుంచి మరో కంపెనీ పబ్లిక్ ఇష్యూకు రా వడం ఇదే ప్రథమం. ప్రస్తుతం ఐనాక్స్ లీజర్.. పీవీఆర్ గ్రూప్‌లో భాగంగా ఉంది. 1992లో ఏ ర్పాటైన కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలోరూ. 980 కోట్ల ఆదాయంపై రూ. 152 కోట్ల నికర మార్జిన్ నమోదు చేసింది. మూడు ప్లాంట్లు ఉండగా, నాలుగో ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. మోతీసన్స్ జ్యుయలర్స్ 2.74 కోట్ల షేర్లను కొత్తగా జారీ చేయనుంది. సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ రూ. 400 కోట్ల విలువ చేసే షేర్లను జారీ కొత్తగా జారీ చేయనుంది. ఈ రెండు ఇష్యూలు డిసెంబర్ 18న ప్రారంభమై 20న ముగుస్తాయి. ఐపీవోల ద్వారా సేకరించిన నిధులను వ్యాపార విస్తరణ, పెట్టుబడులు, రుణాల చెల్లింపు మొదలైన అవసరాల కోసం ఈ సంస్థలు వినియోగించుకోనున్నాయి. -
లాభాలు కొనసాగే అవకాశం
ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారమూ లాభాలు కొనసాగే వీలుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కార్పొరేట్ రెండో క్వార్టర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు ఈ వారం స్టాక్ సూచీలకు దిశానిర్ధేశం చేస్తాయంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులను గమనించవచ్చు. నవంబర్ 8న(బుధవారం), 10న(శుక్రవారం) ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగాలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చు. ‘‘ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం ఇటీవల మార్కెట్ల ట్రేడింగ్‌పై పరిమిత ప్రభావాన్ని చూపుతోంది. ఒకవేళ విదేశీ ఇన్వెస్టర్లు నికర కొనుగోలుదారులుగా మారితే మార్కెట్ మూమెంటం మరింత ఊపందుకుంటుంది. నిఫ్టీకి ఎగువన 19,330 – 19,440 శ్రేణిలో కీలక నిరోధం ఉంది. దిగువ స్థాయిలో 19,060 వద్ద కీలక మద్దతు లభించవచ్చు’’ అని మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ వైస్ ప్రెసిడెంట్ అరవిందర్ సింగ్ నందా తెలిపారు. రెండో క్వార్టర్ ఫలితాలపై కన్ను గత వారాంతంలో ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, డెల్హవరీ, వేదాంతలు వెల్లడించిన ఆర్థిక ఫలితాలకు స్టాక్ మార్కెట్ ముందుగా స్పందించాల్సి ఉంటుంది. నిఫ్టీ 50 సూచీలోని భాగమైన దివీస్ ల్యాక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, ఐషర్ మోటార్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఎంఅండ్ఎం, ఓఎన్‌జీసీలతో పాటు ఇరు ఎక్సే్చంజీల్లో దాదాపు 2400 కంపెనీలు వచ్చే వారం తమ క్యూ2 ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా యాజమాన్యం వెల్లడించే అవుట్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. స్థూల ఆర్థిక గణాంకాలు ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్‌తో పాటు మరికొన్ని దేశాల పీఎంఐ డేటా సోమవారం విడుదల అవుతుంది. చైనా అక్టోబర్ వాణిజ్య లోటు మంగళవారం, యూరోజోన్ సెపె్టంబర్ రిటైల్ విక్రయాలు బుధవారం వెల్లడి కానున్నాయి. అమెరికా వారంతాపు నిరుద్యోగ డేటా గురువారం ప్రకటించనుంది. బ్రిటన్ జీడీపీ వృద్ధి రేటు డేటా శుక్రవారం, అదేరోజున భారత సెపె్టంబర్ పారిశ్రామికోత్పత్తి, చైనా ద్రవ్యోల్బణం, వాహన విక్రయ గణాంకాలు విడుదల కానున్నాయి. రెండు లిస్టింగులు, 3 ఐపీఓలు సెల్లో వరల్డ్ షేర్లు సోమవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. అదే రోజున ఐటీ ఆధారిత సొల్యూషన్ కంపెనీ ప్రొటీయన్ ఈగవ్ టెక్నాలజీస్ ఐపీఓ ప్రారంభం కానుంది. హొనాసా కన్జూమర్ షేర్ల లిస్టింగ్ మంగళవారం(నవంబర్ 7న) ఉంది. ఈ రోజే అస్క్ ఆటోమోటివ్ ఐపీఓ, ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌ల ఐపీఓలు ప్రారంభం కానున్నాయి. కొనసాగుతున్న ఎఫ్‌పీఐల అమ్మకాలు నవంబర్‌లో 3 సెషన్లలో రూ. 3,400 కోట్లు ఉపసంహరణ వడ్డీ రేట్ల పెరుగుదల, మధ్యప్రాచ్యంలో రాజకీయ..¿ౌగోళిక పరిస్థితులపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో దేశీ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) అమ్మకాలు కొనసాగుతున్నాయి. నవంబర్‌లో తొలి మూడు ట్రేడింగ్ సెషన్లలోనే రూ. 3,412 కోట్ల మేర పెట్టుబడులను ఎఫ్‌పీఐలు ఉపసంహరించుకున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం అక్టోబర్‌లో రూ. 24,548 కోట్లు, అంతకు ముందు సెపె్టంబర్లో రూ. 14,767 కోట్ల మేర విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు జరిపారు. దానికన్నా ముందు మార్చ్ నుంచి ఆగస్టు వరకు వరుసగా ఆరు నెలల్లో ఎఫ్‌పీఐలు ఏకంగా రూ. 1.74 లక్షల కోట్ల మేర కొనుగోళ్లు చేయడం గమనార్హం. బాండ్ ఈల్డ్‌ల (రాబడులు) పెరుగుదలే అమ్మకాలకు ప్రధాన కారణమని, అయితే వడ్డీ రేట్ల పెంపు విషయంలో అమెరికా ఫెడ్ ఉదార వైఖరి తీసుకోవడంతో ఈల్డ్‌లు తిరుగుముఖం పట్టి, ఎఫ్‌పీఐల విక్రయాలకు కాస్త అడ్డుకట్ట పడొచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటెజిస్ట్ వీకే విజయకుమార్ తెలిపారు. మరోవైపు, డెట్ మార్కెట్లోకి అక్టోబర్‌లో రూ. 6,381 కోట్లు, నవంబర్ తొలి నాళ్లలో రూ. 1,984 కోట్లు వచ్చాయి. ఈక్విటీల్లో తిరిగి ఇన్వెస్ట్ చేసేందుకు సానుకూల పరిస్థితులు వచ్చే వరకు నిధులను స్వల్పకాలికంగా భారతీయ డెట్ సాధనాలకు మళ్లించాలని ఇన్వెస్టర్లు భావిస్తుండటం ఇందుకు కారణం కావచ్చని మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాంశు శ్రీవాస్తవ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఎఫ్‌పీఐల పెట్టుబడులు నికరంగా ఈక్విటీల్లోకి రూ. 92,560 కోట్లు, డెట్‌లోకి రూ. 37,485 కోట్ల మేర వచ్చాయి. బ్యాంకింగ్, ఆటోమొబైల్స్, క్యాపిటల్ గూడ్స్, ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాలు అత్యధికంగా పెట్టుబడులు దక్కించుకున్నాయి. -
స్టాక్ సూచీలు లాభాల్లో కొనసాగే అవకాశం - కారణం ఇదేనా?
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారమూ లాభాలను కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు, కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలపై ఆశావహ అంచనాలు ఇందుకు దోహదపడొచ్చని భావిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, పశ్చిమాసియా ఘర్షణలు, క్రూడాయిల్ ధరలు, ఎఫ్ఐఐల కొనుగోళ్లు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. డాలర్ మారకంలో రూపాయి కదలికలపై కన్నేయోచ్చంటున్నారు. సెప్టెంబర్ క్వార్టర్ ఆదాయాలపై సానుకూల అంచనాలు, దేశీయ ద్రవ్యోల్బణ దిగిరావడం, మెరుగైన పారిశ్రామికోత్పత్తి నమోదు తదితర పరిణామాలు కలిసిరావడంతో గతవారం సెన్సెక్స్ 287 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 100 పాయింట్లు ఆర్జించింది. మరోవైపు అమెరికాలో ద్రవ్యల్బోణం పెరగడం, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, దేశీయ ఐటీ కంపెనీల యాజమాన్య నిరాశజనక ఆదాయ అవుట్‌లుక్ వ్యాఖ్యలు సూచీల లాభాలను కట్టడి చేశాయి. కార్పొరేట్ ఫలితాలు కీలకం మార్కెట్ ముందుగా గత వారాంతాన విడుదలైన హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అవెన్యూ సూపర్ మార్ట్(డీ మార్ట్)లు ప్రకటించిన ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో నిఫ్టీ–50 ఇండెక్సు లో 40% వెయిటేజీ కలిగిన కంపెనీల షేర్లు తమ సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలు ప్రకటించేందుకు సిద్ధమయ్యాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనా న్స్, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, నెస్లే ఇండియా, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు మొ త్తం 540 కంపెనీలు తమ క్యూ2 ఫలితాలు వెల్లడించనున్నాయి. కార్పొరేట్ వార్తల నేపథ్యంలో షేరు ఆధారిత ట్రేడింగ్‌కు అధిక ప్రాధాన్యత ఉండొచ్చు. ప్రపంచ పరిణామాలు ఇజ్రాయెల్ - పాలస్తీనా యుద్ధ పరిమాణాలు భారత్‌తో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు అత్యంత కీలకం కానున్నాయి. యుద్ధ ప్రభావంతో ఇప్పటికే బ్రెంట్ క్రూడాయిల్ ధరలు 8% ర్యాలీ చేశాయి. ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ గురువారం ‘ది ఎకనామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్’ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. అమెరికా రిటైల్ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి డేటా(మంగళవారం), బ్రిటన్ నిరుద్యోగ, సీపీఐ ద్రవ్యోల్బణ డేటా పాటు యూరోజోన్ సెప్టెంబర్ సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాల నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. జపాన్ పారిశ్రామికోత్పత్తి, చైనా జీడీపీ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలపైనా కన్నేయోచ్చు. ప్రథమార్థంలో రూ. 9,800 కోట్లు ఉపసంహరణ విదేశీ ఇన్వెస్టర్లు అక్టోబర్ ప్రథమార్థంలో రూ.9,800 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అమెరికా బాండ్ల రాబడులు పెరగడం, ఇజ్రాయెల్– హమాస్ వంటి భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఇందుకు కారణమయ్యాయి. సెప్టెంబరులో రూ.14,767 కోట్లు వెనక్కి తీసుకోవడంతో ఈ ఏడాది ఈక్విటీలోకి ఎఫ్ఐఐల పెట్టుబడులు రూ. 1.1 లక్షల కోట్లుగా ఉన్నాయి. కాగా ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు వరకు భారత ఈక్విటీల్లో రూ.1.74 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఫిబ్రవరిలో 6 శాతంగా ఉన్న అమెరికా ద్రవ్యోల్బణం జులైలో 3.2 శాతానికి తగ్గడం, అమెరికా ఫెడరల్ రేట్ల పెంపులో తాత్కాలిక విరామం వంటి పరిణామాలు భారత్‌లోకి ఎఫ్‌పీఐల పెట్టుబడులకు దోహదం చేశాయి. ఫైనాన్షియల్స్, పవర్, ఐటీ రంగాల్లో ఎఫ్‌పీఐలు పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్నారు. క్యాపిటల్ గూడ్స్ ఆటోమొబైల్స్ రంగాల్లో కొనుగోళ్లను కొనసాగించారు. ఇదే నెలలో ఇప్పటి వరకు ఎఫ్‌పీఐలు దేశీయ డెట్ మార్కెట్లో రూ.4,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. -
లాభాలు కొనసాగే అవకాశం
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారమూ లాభాలను కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు, కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలపై ఆశావహ అంచనాలు ఇందుకు దోహదపడొచ్చని భావిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, పశి్చమాసియా ఘర్షణలు, క్రూడాయిల్ ధరలు, ఎఫ్ఐఐల కొనుగోళ్లు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. డాలర్ మారకంలో రూపాయి కదలికలపై కన్నేయోచ్చంటున్నారు. సెపె్టంబర్ క్వార్టర్ ఆదాయాలపై సానుకూల అంచనాలు, దేశీయ ద్రవ్యోల్బణ దిగిరావడం, మెరుగైన పారిశ్రామికోత్పత్తి నమోదు తదితర పరిణామాలు కలిసిరావడంతో గతవారం సెన్సెక్స్ 287 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 100 పాయింట్లు ఆర్జించింది. మరోవైపు అమెరికాలో ద్రవ్యల్బోణం పెరగడం, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, దేశీయ ఐటీ కంపెనీల యాజమాన్య నిరాశజనక ఆదాయ అవుట్‌లుక్ వ్యాఖ్యలు సూచీల లాభాలను కట్టడి చేశాయి. కార్పొరేట్ ఫలితాలు కీలకం మార్కెట్ ముందుగా గత వారాంతాన విడుదలైన హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అవెన్యూ సూపర్ మార్ట్(డీ మార్ట్)లు ప్రకటించిన ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో నిఫ్టీ–50 ఇండెక్సు లో 40% వెయిటేజీ కలిగిన కంపెనీల షేర్లు తమ సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలు ప్రకటించేందుకు సిద్ధమయ్యాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనా న్స్, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, నెస్లే ఇండియా, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు మొ త్తం 540 కంపెనీలు తమ క్యూ2 ఫలితాలు వెల్లడించనున్నాయి. కార్పొరేట్ వార్తల నేపథ్యంలో షేరు ఆధారిత ట్రేడింగ్‌కు అధిక ప్రాధాన్యత ఉండొచ్చు. ప్రపంచ పరిణామాలు ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధ పరిమాణాలు భారత్‌తో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు అత్యంత కీలకం కానున్నాయి. యుద్ధ ప్రభావంతో ఇప్పటికే బ్రెంట్ క్రూడాయిల్ ధరలు 8% ర్యాలీ చేశాయి. ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ గురువారం ‘ది ఎకనామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్’ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. అమెరికా రిటైల్ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి డేటా(మంగళవారం), బ్రిటన్ నిరుద్యోగ, సీపీఐ ద్రవ్యోల్బణ డేటా పాటు యూరోజోన్ సెపె్టంబర్ సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాల నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. జపాన్ పారిశ్రామికోత్పత్తి, చైనా జీడీపీ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలపైనా కన్నేయోచ్చు. ప్రథమార్థంలో రూ.9,800 కోట్ల ఉపసంహరణ విదేశీ ఇన్వెస్టర్లు అక్టోబర్ ప్రథమార్థంలో రూ.9,800 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అమెరికా బాండ్ల రాబడులు పెరగడం, ఇజ్రాయెల్– హమాస్ వంటి భౌగోళిక రాజకీయ అనిశి్చతులు ఇందుకు కారణమయ్యాయి. సెపె్టంబరులో రూ.14,767 కోట్లు వెనక్కి తీసుకోవడంతో ఈ ఏడాది ఈక్విటీలోకి ఎఫ్ఐఐల పెట్టుబడులు రూ. 1.1 లక్షల కోట్లుగా ఉన్నాయి. కాగా ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు వరకు భారత ఈక్విటీల్లో రూ.1.74 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఫిబ్రవరిలో 6 శాతంగా ఉన్న అమెరికా ద్రవ్యోల్బణం జులైలో 3.2 శాతానికి తగ్గడం, అమెరికా ఫెడరల్ రేట్ల పెంపులో తాత్కాలిక విరామం వంటి పరిణామాలు భారత్‌లోకి ఎఫ్‌పీఐల పెట్టుబడులకు దోహదం చేశాయి. ఫైనాన్షియల్స్, పవర్, ఐటీ రంగాల్లో ఎఫ్‌పీఐలు పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్నారు. క్యాపిటల్ గూడ్స్ ఆటోమొబైల్స్ రంగాల్లో కొనుగోళ్లను కొనసాగించారు. ఇదే నెలలో ఇప్పటి వరకు ఎఫ్‌పీఐలు దేశీయ డెట్ మార్కెట్లో రూ.4,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. -
దేశీయ స్టాక్ సూచీలు ఈ వారం ఇలా ఉండబోతున్నాయి..
ముంబై: దేశీయ స్టాక్ సూచీలు ఈ వారంలోనూ బలహీనంగా ట్రేడవుతూ.., పరిమిత శ్రేణిలో కదలాడొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దేశీయంగా ఆర్బీఐ ద్రవ్య విధాన వైఖరి, స్థూల ఆర్థిక గణాంకాలు వెల్లడి నేపథ్యంలో ఒడిదుడుకులు ఉండొచ్చంటున్నారు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్లు తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి కదలికలు, ప్రపంచ మార్కెట్ల పనితీరు, క్రూడాయిల్ ధరల కదిలికలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చంటున్నారు. గాంధీ జయంతి సందర్భంగా నేడు ఎక్స్చేంజీలకు సెలవు కావడంతో ట్రేడింగ్ నాలుగురోజులకే పరిమితం కానుంది. బాండ్లపై దిగుబడులు, క్రూడాయిల్ ధరల పెరుగుదల ఆందోళనలతో గతవారం మొత్తంగా సెన్సెక్స్ 181 పాయింట్లు, నిఫ్టీ 36 పాయింట్లు నష్టపోయాయి. ‘‘చారిత్రాత్మకంగా పరిశీలిస్తే అమెరికా, భారత మార్కెట్లు అక్టోబర్‌లో ర్యాలీ చేసాయి. ఈసారి అదే ట్రెండ్ పునరావృతమయ్యే అవకాశం ఉంది. అందుకు సంకేతంగా ఇటీవల ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్ దెబ్బతీస్తున్న బాండ్ల ఈల్డ్స్, డాలర్ ఇండెక్స్, క్రూడాయిల్ ధరల పెరుగుదల ఆందోళనలు క్రమంగా తగ్గుతున్నాయి. సాంకేతికంగా నిఫ్టీ ఎగువున 19,800 వద్ద కీలక నిరోధం ఉంది. దిగువ స్థాయిలో 19,600 – 19,500 పరిధిలో తక్షణ మద్దతు లభిస్తుంది’’ అని కోటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. ఆర్బీఐ ద్రవ్య పాలసీ నిర్ణయం కీలకం రిజర్వ్ బ్యాంక్ తన పరపతి ద్రవ్య సమీక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించనుంది. ఆర్బీఐ చైర్మన్ శక్తికాంత దాస్ శుక్రవారం పాలసీ కమిటి నిర్ణయాలు వెల్లడించనున్నారు. వరసగా నాలుగోసారి వడ్డీరేట్ల యథాతథ కొనసాగింపునకే ఆర్బీఐ మొగ్గుచూపొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణ గరిష్ట స్థాయిలో ఉండటం, ఫెడ్ రిజర్వ్ కఠిన ద్రవ్య పాలసీ వైఖరిని కొనసాగించడం ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు ఆటో కంపెనీలు విడుదల చేసిన సెప్టెంబర్ వాహన విక్రయ గణాంకాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇదే వారంలో అక్టోబర్ 3న తయారీ రంగ పీఎంఐ, సెప్టెంబర్ 5న సేవారంగ డేటా విడుదల కానుంది. అమెరికా యూఎస్ తయారీ, సేవా రంగ డేటాతో పాటు వాణిజ్య, ఉద్యోగ కల్పన డేటా ఇదే వారంలో వెల్లడి కానుంది. బ్రిటన్ తయారీ, సేవా రంగ సీఐపీఎస్ డేటా గణాంకాలు విడుదల కానున్నాయి. ఆయా దేశాలకు సంబంధించిన ఆర్థిక స్థితిగతులను తెలియజేసే ఈ కీలక స్థూల ఆర్థిక గణంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ప్రాథమిక మార్కెట్‌పై కన్ను మనోజ్ వైభవ్ జెమ్స్ ‘ఎన్’ జ్యువెలరీŠస్ స్టాక్ లిస్టింగ్ మంగళవారం ఉంది. అదే రోజున వాలియంట్ ల్యాబొరేటరీస్ ఐపీఓ ముగిస్తుంది. జేఎస్‌డబ్ల్యూ లిస్టింగ్ సెప్టెంబర్ 4న ఉంది. ఈ మరుసటి రోజు గురవారం ప్లాజా వైర్స్ పబ్లిక్ ఇష్యూ ముగుస్తుంది. ఆరు నెలల తర్వాత అమ్మకాలు ఆరు నెలల వరుస కొనుగోళ్ల తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు సెప్టెంబర్‌లో నికర అమ్మకందారులుగా నిలిచారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం.. ఈ సెప్టెంబర్‌లో ఎఫ్‌పీఐలు రూ. 14,767 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మేశారు. డెట్ మార్కెట్లో రూ. 938 కోట్ల పెట్టుబడులు పెట్టారు. కాగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు విదేశీ ఇన్వెస్టర్లు రూ. 1.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. ముఖ్యంగా క్యాపిటల్ గూడ్స్, ఫైనాన్స్ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. దేశ ఆర్థికవ్యవస్థ, ఆర్బీఐ అక్టోబర్ ఎంపీసీ సమావేశం, సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఎఫ్‌పీఐల ధోరణి అనిశ్చితిగా ఉండొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. -
నిఫ్టీ 20,000 స్థాయికి..?
ముంబై: నిఫ్టీ సూచీ ఈ వారంలో 20,000 స్థాయికి చేరొచ్చని స్టాక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ సూచీ జీవితకాల గరిష్టం (19,992) స్థాయికి 172 పాయింట్లు, 20వేల స్థాయికి 180 పాయింట్లు దూరంలో ఉంది. స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. వీటితో డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు కూడా స్వల్ప కాలానికి ట్రెండ్‌ను నిర్దేశిస్తాయన్నారు. అంచనాలకు మించి జీడీపీ, పీఎంఐ డేటా నమోదు, ఆర్థిక వ్యవస్థపై బలమైన అవుట్‌లుక్ నేపథ్యంతో గతవారం సూచీలు రెండుశాతం లాభపడ్డాయి. మెటల్, రియలీ్ట, మీడియా రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా వారం మొత్తంగా సెన్సెక్స్ 878 పాయింట్లు, నిఫ్టీ 385 పాయింట్లు ఆర్జించాయి. ‘‘అమెరికా బాండ్లపై రాబడులు 4.3 శాతానికి చేరుకున్నాయి. డాలర్ ఇండెక్స్ 105 స్థాయి వద్ద ట్రేడవుతున్నాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 90 డాలర్లకు చేరింది. ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశీయ మార్కెట్ స్థిరంగా ముందుకు కదలింది. గత వారాంతంలో ఆర్బీఐ అదనపు నగదు నిల్వల నిష్పత్తిని దశల వారీగా రద్దు చేస్తున్నట్లు చేసిన ప్రకటనతో బ్యాంకుల షేర్లు రాణించవచ్చు. ఈ పరిమాణాలు నిఫ్టీని 20,000 స్థాయికి తీసుకెళ్లవచ్చు. ఒకవేళ లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే దిగువున 19,500–19,650 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది’’ అని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. స్థూల ఆర్థిక గణాంకాల డేటా దేశీయంగా జూలై పారిశ్రామికోత్పత్తి డేటా, వడ్డీరేట్లను ప్రభావితం చేసే ఆగస్టు ద్రవ్యోల్బణ, వాణిజ్య లోటు గణాంకాలు ఈ వారంలో వెల్లడి కానుంది. అలాగే చైనా వాహన అమ్మకాలు, అమెరికా ద్రవ్యల్బోణ, యూరోజోన్ పారిశ్రామికోత్పత్తి డేటా, ఇదే వారంలోనే విడుదల అవుతాయి. వారాంతాపు రోజైన శుక్రవారం ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, డిపాజిట్ – బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. ఈ కీలక స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడికి ముందు అప్రమత్తత చోటు చేసుకొనే వీలుంది. నేడు రెండు లిస్టింగులు రత్నవీర్ ప్రెసిíÙన్ ఇంజరీంగ్, రిషిభ్ ఇన్‌్రసూ్టమెంట్ ఐపీఓలు సోమవారం ఎక్సే్చంజీల్లో లిస్టుకానున్నా యి. ఈఎంఎస్ ఐపీఓ మంగళవారం ముగిస్తుంది. ఆర్ఆర్ కేబుల్, షమీ హోటల్స్ పబ్లిక్ ఇష్యూలు బుధ, గురువారాల్లో ప్రారంభం కానున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు వరుస ఆరు నెలల్లో భారత ఈక్విటీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు సెప్టెంబర్‌లో అమ్మకాలను మొదలుపెట్టారు. ఈ నెలలో ఇప్పటివరకు రూ. 4,200 కోట్ల విలువైన నిధులను ఉపసంహరించుకున్నారు. అమెరికా 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ పెరగడం, డాలర్ విలువ పుంజుకోవడం, అంతర్జాతీయ ఆర్థికవృద్ధిపై ఆందోళనల నేపథ్యంలో ఎఫ్ఐఐలు నిధుల ఉపసంహరణకు మొగ్గు చూపారని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మరో వారం, రెండు వారాల పాటు ఎఫ్ఐల నిధుల ఉపసంహరణ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత నెలలో ఎఫ్ఐఐలు నాలుగు నెలల కనిష్టంతో రూ. 12,262 కోట్ల విలువైన నిధులను ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేశారు. ప్రస్తుత ఏడాదిలో ఇప్పటివరకు భారత మార్కెట్లలో రూ. 1.74 లక్షల కోట్ల నిధులను పెట్టుబడి పెట్టారు. -
గ్లోబల్ ట్రెండ్, ఎఫ్‌పీఐలే కీలకం.. ఈ వారం మార్కెట్ దిశపై నిపుణుల అంచనాలు
న్యూఢిల్లీ: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను పలు అంశాలు ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులు సెంటిమెంటును ప్రభావితం చేయగలవని తెలియజేశారు. ఇటీవల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌లో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో ఎఫ్‌పీఐ పెట్టుబడులకూ ప్రాధాన్యమున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసిక(ఏప్రిల్–జూన్) ఫలితాల సీజన్ ముగింపునకు చేరడంతో ఇకపై ఇన్వెస్టర్లు ఇతర అంశాలపై దృష్టి సారించనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ వివరించారు. జియో ఫైనాన్స్ లిస్టింగ్ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి ప్రత్యేక కంపెనీగా విడివడిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో నేడు(సోమవారం) లిస్ట్‌కానుంది. దేశీ ఎన్బీఎఫ్సీలలో రెండో పెద్ద కంపెనీగా ఆవిర్భవించిన సంస్థపై పలువురు కన్నేయనున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. వెరసి ఈ కౌంటర్లో భారీ ట్రేడింగ్ యాక్టివిటీకి వీలున్నట్లు అంచనా వేశారు. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ కదలికలపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టేందుకు కారణంకానున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్ధ్ ఖేమ్కా పేర్కొన్నారు. మార్కెట్ల ట్రెండ్‌లోని ఇన్వెస్టర్ల దృష్టి కొన్ని రంగాల నుంచి మరికొన్ని రంగాలవైపు మళ్లడం సహజమన్నారు. విదేశీ పరిస్థితులు: యూఎస్‌లో గృహ విక్రయాలు, ఉపాధి గణాంకాలకు మార్కెట్లు స్పందించనున్నట్లు మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అర్విందర్ సింగ్ నందా పేర్కొన్నారు. అంతేకాకుండా యూరోజోన్, ఎస్అండ్పీ గ్లోబల్ కాంపోజిట్ పీఎంఐ గణాంకాలూ ప్రభావం చూపనున్నట్లు విశ్లేషించారు. ఈ వారం గ్లోబల్ గణాంకాలకుతోడు యూఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ ప్రసంగానికి సైతం ప్రాధాన్యత ఉన్నట్లు ప్రస్తావించారు. ఇక దేశీయంగా రిజర్వ్ బ్యాంక్ గత పాలసీ వివరాలు(మినిట్స్) వెలువడనున్నట్లు ప్రస్తావించారు. ఇతర అంశాలపైనా కన్ను అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, రుతుపవన పురోగతి సైతం దేశీ మార్కెట్ల ట్రెండ్‌కు కీలకంగా నిలవనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇటీవల యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ దూ కుడు చూపుతుండటంతో ఇకపై విదేశీ పెట్టుబడులు పరిమితంకావచ్చని, ఇది మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపే వీలున్నదని జియోజిత్ ఫైనా న్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ అభిప్రాయపడ్డారు. గత వారం పారిశ్రామికోత్పత్తి, టో కు ధరల ద్రవ్యోల్బణం వెనకడుగు, ఇదే సమయంలో రిటైల్ ధరల వేడి వంటి అంశాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచినట్లు పేర్కొన్నారు. కాగా.. యూస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలకుతోడు పటిష్ట రిటైల్ అమ్మకాలు, చైనా కేంద్ర బ్యాంకు అనూహ్య రేట్ల కోత వంటి అంశాలతో గత వారం సెంటిమెంటు బలహీనపడింది. దీంతో మార్కెట్లు ఆటుపోట్ల మధ్య స్వల్ప నష్టాలతో ముగిశాయి. చైనా మందగమనం, అభివృద్ధి చెందిన దేశాల వడ్డీ రేట్ల పెంపు అంచనాలు ఇందుకు కారణమయ్యా యి. సెన్సెక్స్ నికరంగా 374 పాయింట్లు(0.6 %) క్షీణించి 64,949 వద్ద స్థిరపడింది. వెరసి 65,000 స్థాయి దిగువకు చేరగా.. నిఫ్టీ 118 పాయింట్లు(0.6 శాతం) నీరసించి 19,310 వద్ద నిలిచింది. -
ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్
సోమవారం వచ్చిందంటే చాలు ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోతారు. మూవీ లవర్స్ మాత్రం ఈ వారం కొత్త సినిమాలేం వస్తున్నాయి. వాటిని ఎప్పుడు చూసేయ్యాలా అని ప్లాన్ చేసుకుంటారు. వాళ్ల కోసమా అన్నట్లు ఈ వారం దాదాపు 17 మూవీస్ వరకు పలు ఓటీటీల్లో విడుదల అవుతున్నాయి. వాటిలో హిట్ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీసులు కూడా ఆసక్తి రేపుతున్నాయి. అయితే ఈ మొత్తం లిస్ట్‌లో జనాలు ఎక్కువగా ఎదురుచూస్తున్నవి అయితే మాత్రం 'సామజవరగమన', 'నాయకుడు' (మామన్నన్) కోసమే. థియేటర్లలో రచ్చ లేపిన ఈ చిత్రాలు ఓటీటీల్లో ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తాయో? (ఇదీ చదవండి: 'బేబీ' ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్) ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ నెట్‌ఫ్లిక్స్ డ్రీమ్ (కొరియన్ సినిమా) - జూలై 25 నాయకుడు (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జూలై 27 ప్యారడైజ్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 27 హ్యాపీనెస్ ఫర్ బిగినర్స్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 27 హిడ్డెన్ స్ట్రైక్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 28 హౌ టూ బికమ్ ఏ కల్ట్ లీడర్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 28 అమెజాన్ ప్రైమ్ రెజీనా (తెలుగు డబ్బింగ్ సినిమా) జూలై 25 ఆహా సామజవరగమన (తెలుగు సినిమా) - జూలై 28 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఆషిఖానా (హిందీ సిరీస్) - జూలై 24 జియో సినిమా కాల్‌కూట్ (హిందీ మూవీ) - జూలై 27 వన్ ఫ్రైడే నైట్ (హిందీ సినిమా) - జూలై 28 అప్పత (తమిళ చిత్రం) - జూలై 29 సోనీ లివ్ ట్విస్టెడ్ మెటల్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 28 ఈ-విన్ పోలీస్ స్టోరీ: కేస్ 1: నైట్ ఔల్స్ (తెలుగు సినిమా) - జూలై 28 బుక్ మై షో జస్టిస్ లీగ్: వార్ వరల్డ్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 25 ట్రాన్స్ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్ (ఇంగ్లీష్ చిత్రం) - జూలై 26 ద ఫ్లాష్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 27 మనోరమ మ్యాక్స్ కొళ్ల (మలయాళ సినిమా) - జూలై 27 (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' సీక్రెట్ బయటపెట్టిన నాగార్జున!) -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు
ఎప్పటిలానే మరో సోమవారం వచ్చేసింది. అందరూ ఆఫీసులు, స్కూల్-కాలేజీ హడావుడిలో పడిపోయారు. మూవీ లవర్స్ మాత్రం ఈ వారం ఎన్ని సినిమాలు రాబోతున్నాయి? వాటిని ఎప్పుడు ఎలా చూడాలా అనేది ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. థియేటర్లలోకి 10 చిత్రాలు రాబోతున్నాయి. వాటిలో 'రంగబలి' మాత్రం కాస్త చెప్పుకోదగ్గది. అయితే ఓటీటీల్లోకి మాత్రం ఈ వారం ఏకంగా 24 సినిమాలు-వెబ్ సిరీసులు రాబోతున్నాయి. వీటిలో తెలుగు మూవీస్-సిరీస్ లు బోలెడన్ని ఉన్నాయి. ఇంతకీ అవేంటి? ఎందులో స్ట్రీమింగ్ కానున్నాయో చూద్దాం. ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు అమెజాన్ ప్రైమ్ వీడియో బాబీలోన్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 05 స్వీట్ కారం కాఫీ (తెలుగు సిరీస్) - జూలై 06 అదురా (హిందీ సిరీస్) - జూలై 07 ద హారర్ ఆఫ్ డోలెరస్ రోచ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 07 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ గుడ్ నైట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 03 (ఆల్రెడీ స్ట్రీమింగ్) కిజాజీ మోటో: జనరేషన్ ఫైర్ (ఆఫ్రికన్ సిరీస్) - జూలై 05 IB 71 (హిందీ సినిమా) - జూలై 07 నెట్‌ఫ్లిక్స్ అన్నోన్: ద లాస్ట్ పిరమిడ్ (ఇంగ్లీష్ సినిమా)- జూలై 03 (స్ట్రీమింగ్ అవుతోంది) ద ఆర్ట్ ఆఫ్ ఇన్ కార్సేరేషన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - జూలై 03 (ఆల్రెడీ స్ట్రీమింగ్) హోమ్ రెకర్ (ఇంగ్లీష్ చిత్రం) - జూలై 03 (ఆల్రెడీ స్ట్రీమింగ్) ద లింకన్ లాయర్ సీజన్ 2: పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 06 ఫేటల్ సెడక్సన్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 07 ద ఔట్ లాస్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 07 ద పోప్స్ ఎక్సార్సిస్ట్ (ఇంగ్లీష్ చిత్రం) - జూలై 07 హాక్ మై హోమ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 07 డీప్ ఫేక్ లవ్ (ఇంగ్లీష్ రియాలిటీ షో) - జూలై 07 జీ5 అర్చిర్ గ్యాలరీ (బెంగాలీ సినిమా) - జూలై 07 తర్లా (హిందీ మూవీ) - జూలై 07 జియో సినిమా ఇష్క్ నెక్స్ట్ డోర్ (హిందీ చిత్రం) - జూలై 03 (స్ట్రీమింగ్ అవుతోంది) బ్లయిండ్ (హిందీ మూవీ) - జూలై 07 ఉనాద్ (మరాఠీ సినిమా) - జూలై 08 సోనీ లివ్ ఫర్హానా (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 07 హవా (బంగ్లాదేశీ మూవీ) - జూలై 07 ముబీ రిటర్న్ టూ సియోల్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 07 (ఇదీ చదవండి: కెమెరాల ముందు ముద్దులు, సారీ చెప్పిన సల్మాన్ ఖాన్) -
ట్రేడింగ్ ట్రెండ్: సరికొత్త జీవితకాల గరిష్టాలకు చేరే చాన్స్
ముంబై: దేశీయ స్టాక్ సూచీలు ఈ వారంలో జీవితకాల గరిష్ట స్థాయిలను నమోదు చేసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. రుతుపవనాల వార్తలు మినహా దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే ఇతర అంశాలేవీ లేనందున అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల ధోరణికి అనుగుణంగానే కదలాడతాయని చెబుతున్నారు. అలాగే విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల ట్రేడింగ్ కార్యకలాపాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికల అంశాలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు ఇప్పట్లో ఉండకపోవచ్చనే అంచనాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న సానుకూల పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లు కొనసాగడంతో గతవారం సూచీలు దాదాపు ఒక శాతానికి పైగా ర్యాలీ చేశాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 759 పాయింట్లు, నిఫ్టీ 263 పాయింట్లు పుంజుకున్నాయి. వారాంతం రోజైన శుక్రవారం మునుపెన్నడూ లేనివిధంగా సరికొత్త రికార్డు స్థాయిలో ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ జీవితకాల గరిష్ట స్థాయి (63,583)కి 198 పాయింట్లు, నిఫ్టీ ఆల్‌టైం హై (18,888)కి 62 పాయింట్లు చేరువులో ఉన్నాయి. సరికొత్త రికార్డు స్థాయిల నమోదు ఇప్పుడు నామమాత్రమే. సరికొత్త రికార్డులు సృష్టించిన తర్వాత ర్యాలీ కొనసాగుతుందా..? లేక గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరిగి వెనక్కి వస్తుందా అనేది వేచి చూడాల్సి అంశం. ఒకవేళ మొమెంటమ్ కొనసాగితే నిఫ్టీ 19,000 స్థాయికి చేరవచ్చు. అమ్మకాలు జరిగితే దిగువ స్థాయిలో 18,676 వద్ద తక్షణ మద్దతు స్థాయిని కలిగి ఉంది’’ అని ఏంజెల్ వన్ టెక్నికల్, డెరివేటివ్స్ రీసెర్చ్ హెడ్ సమీత్ చవన్ తెలిపారు. ప్రపంచ పరిణామాలు యూరోజోన్ నిర్మాణ ఉత్పాదక, కరెంట్ అకౌంట్ డేటా, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు మంగవారం వెలువడనున్నాయి. ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అమెరికా కాంగ్రెస్ ఎదుట బుధవారం (జూన్ 21న) అమెరికా దేశ ఆర్థిక స్థితిగతులపై వివరణ (టెస్టిమోనీ) ఇవ్వనున్నారు. పావెల్ వ్యాఖ్యలను ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ వర్గాలు నిశితంగా గమనించే వీలుంది. అదే రోజున జపాన్ కేంద్ర బ్యాంక్ పాలసీ సమావేశ నిర్ణయాలు, బ్రిటన్ మే ద్రవ్యోల్బణ డేటా విడుదల కానుంది. గురువారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీరేట్లు వెల్లడవుతాయి. వారాంతం రోజున యూఎస్ తయారీ, సర్వీసు రంగ గణాంకాలు, జపాన్ ద్రవ్యోల్బణ, బ్రిటన్ రిటైల్ అమ్మకాలు విడుదల కానున్నాయి. వర్షపాత వార్తలపై దృష్టి స్టాక్ మార్కెట్ కదలికపై నైరుతి రుతుపవనాల వార్తలూ ప్రభావం చూపే అవకాశం ఉంది. రుతుపవనాల విస్తరణలో మరికొంత జాప్యం జరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే నైరుతి రుతుపవనాల ఆలస్యం, ఎల్‌నినో ప్రభావం వర్షపాతంపై ఉండదని, దేశంలో సాధారణ వర్షపాతం నమోదవ్వొచ్చంటున్నారు. సాధారణ రుతుపవనాలు ద్రవ్యోల్బణాన్ని తగ్గించగలవని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఎఎంసీజీ, ఎరువులు, వ్యవసాయం, వినియోగ, ఆటో రంగాల షేర్లలో కదలికలు గమనించవచ్చు. రెండు వారాల్లో రూ.16,405 కోట్లు భారత మార్కెట్లోకి విదేశీ నిధుల వెల్లువ కొనసాగుతోంది. గత మూడు నెలలుగా భారత ఈక్విటీలపై ఆసక్తి కనబరుస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఈ జూన్‌లో భారీ ఎత్తున పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు. ఇప్పటి వరకు (116 తేదీల మధ్య) రూ.16,405 కోట్ల పెట్టుబడులు పెట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ, వృద్ధిపై పలు రేటింగ్ ఏజెన్సీల సానుకూల ప్రకటనల అంశాలు ఎఫ్‌పీఐల కొనుగోళ్లకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. -
గణాంకాలు, ఫలితాలే దిక్సూచి
ముంబై: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను క్యూ4 ఫలితాలు, ఆర్థిక గణాంకాలు నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటికే పలు దిగ్గజాలు గతేడాది(2022–23) క్యూ4(జనవరి–మార్చి) ఫలితాలు ప్రకటించాయి. వారాంతాన(13న) డీమార్ట్ స్టోర్ల దిగ్గజం ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ క్యూ4 పనితీరు వెల్లడించింది. ఈ బాటలో బెర్జర్ పెయింట్స్, ఫైజర్ ఈ నెల 15న, బ్యాంక్ ఆఫ్ బరోడా, భారతీ ఎయిర్టెల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 16న, స్టేట్‌బ్యాంక్, యునైటెడ్ స్పిరిట్స్, గెయిల్ ఇండియా, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్(ఇండిగో) 18న, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, 19న ఫలితాలు విడుదల చేయనున్నాయి. ఈ జాబితాలో ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ సైతం ఉన్నాయి. డీమార్ట్ ఫలితాల ప్రభావం నేటి(15న) ట్రేడింగ్‌లో ప్రతిఫలించనున్నట్లు స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఐఐపీ, ధరల ఎఫెక్ట్ శుక్రవారం(12న) మార్కెట్లు ముగిశాక మార్చి నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), తయారీ రంగ గణాంకాలు వెలువడ్డాయి. ఇక ఏప్రిల్ నెలకు రిటైల్ ధర ద్రవ్యోల్బణ(సీపీఐ) వివరాలూ వెల్లడయ్యాయి. నేడు ఏప్రిల్ టోకుధరల ద్రవ్యోల్బణ తీరు వెల్లడికానుంది. ఈ ప్రభావం సైతం మార్కెట్లలో నేడు కనిపించే వీలున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇవికాకుండా విదేశీ మార్కెట్లో నెలకొనే పరిస్థితులు ట్రెండ్‌ను ప్రభావితం చేయగలవని వివరించారు. ఏప్రిల్ నెలకు చైనా పారిశ్రామికోత్పత్తి, యూఎస్ రిటైల్ అమ్మకాల గణాంకాలు 16న వెలువడనున్నాయి. జపాన్ ఏప్రిల్ నెల ద్రవ్యోల్బణ గణాంకాలను 19న ప్రకటించనుంది. ఇతర అంశాలు కూరగాయలు, వంటనూనెల ధరలు తగ్గడంతో సీపీఐ 18 నెలల కనిష్టానికి చేరినప్పటికీ ఐఐపీ ఐదు నెలల కనిష్టాన్ని తాకడం బలహీన అంశమని స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. విద్యుత్, తయారీ రంగాలు ఇందుకు కారణమయ్యాయి. ఇవికాకుండా డాలరుతో రూపాయి మారకపు తీరు, బాండ్ల ఈల్డ్స్, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడి చమురు ధరలు తదితర అంశాలూ మార్కెట్ల కదలికలను నిర్దేశించగలవని వివరించారు. కర్ణాటక్ మ్యూజిక్ వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకంటే ముందుగా అత్యంత ఆసక్తిని రేపిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్ష స్థాయికి చేరగా.. దశాబ్ద కాలం తదుపరి కాంగ్రెస్ పటిష్ట మెజారిటీని సాధించింది. ఇది కొంతమేర మార్కెట్లలో సెంటిమెంటును ప్రభావితం చేయగలదని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా అభిప్రాయపడ్డారు. గత వారం జూమ్ గడిచిన వారం దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. సెన్సెక్స్ 974 పాయింట్లు జంప్‌చేసి 62,000 మార్క్‌ను మళ్లీ దాటింది. 62,027 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 246 పాయింట్లు ఎగసి 18,315 వద్ద ముగిసింది. మార్కెట్ల ప్రభావంతో చిన్న షేర్లకూ డిమాండ్ పెరిగింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ 1.4 శాతం, స్మాల్ క్యాప్ 1.2 శాతం చొప్పున బలపడ్డాయి. -
ప్రపంచ మార్కెట్లు, గణాంకాల ఎఫెక్ట్
న్యూఢిల్లీ: ప్రపంచ మార్కెట్లలో కనిపించే ట్రెండ్ ప్రధానంగా ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు దిక్సూచి కాగలదని విశ్లేషకులు పేర్కొన్నారు. విజయదశమి సందర్భంగా బుధవారం(5న) మార్కెట్లకు సెలవుకావడంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. ఆర్థిక గణాంకాలు, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ జోరు, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ తీరు వంటి అంశాలకు సైతం ప్రాధాన్యత ఉన్నట్లు స్టాక్ విశ్లేషకులు వివరించారు. యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను వేగంగా పెంచుతుండటంతో డాలరు ఇండెక్స్ రెండు దశాబ్దాల గరిష్టం 115ను దాటేసింది. మరోపక్క ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ 3.5 శాతాన్ని మించాయి. దీంతో దేశీ కరెన్సీ రూపాయి కొత్త చరిత్ర లిఖిస్తూ 82కు పతనమైంది. ఇది రిజర్వ్ బ్యాంక్ వద్ద గల విదేశీ మారక నిల్వలను సైతం దెబ్బతీస్తోంది. ఇందుకు కరెంట్ ఖాతా లోటు(సీఏడీ) జీడీపీలో 2.8 శాతానికి చేరడం సైతం ప్రభావం చూపుతున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. వెరసి ఈ వారం మార్కెట్లు మరోసారి ఆటుపోట్లను చవిచూడవచ్చని అత్యధిక శాతం మంది నిపుణులు అంచనా వేశారు. చమురు సెగ తగ్గినా.. ఇటీవల ముడిచమురు ధరలు దిగివస్తున్నాయి. బ్యారల్ 80–85 డాలర్ల వద్ద కదులుతున్నాయి. ఇది సానుకూల అంశమే అయినప్పటికీ డాలరు బలపడుతుండటంతో ఈ ప్రభావం ఆవిరౌతున్నట్లు నిపుణులు తెలియజేశారు. దీంతో సెంటిమెంటు బలహీనపడుతున్నట్లు తెలియజేశారు. దీనికితోడు మరోపక్క కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నికర అమ్మకందారులుగా నిలుస్తుండటం మార్కెట్లను దెబ్బతీస్తున్నట్లు ప్రస్తావించారు. దీంతో వరుసగా ఏడు రోజులపాటు క్షీణపథంలో సాగిన మార్కెట్లు గత వారం చివర్లో కోలుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 672, నిఫ్టీ 233 పాయింట్ల నష్టంతో సరిపెట్టుకున్నాయి. కాగా.. ఈ వారం సెప్టెంబర్ నెలకు యూఎస్, జపాన్ తయారీ రంగ(పీఎంఐ) గణాంకాలు వెలువడనున్నాయి. దేశీయంగా ఆటో విక్రయాలు జోరందుకున్నాయి. దీంతో ఆటో షేర్లు వెలుగులో నిలిచే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మార్కెట్ విలువకు చిల్లు గత వారం మార్కెట్ల పతనంతో టాప్–10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)లో రూ. 1.16 లక్షల కోట్లు ఆవిరైంది. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ రూ. 41,706 కోట్లు నీరసించి రూ. 16.08 లక్షల కోట్లకు పరిమితంకాగా.. పీఎస్‌యూ దిగ్గజం ఎస్బీఐ విలువ రూ. 17,314 కోట్ల నష్టంతో దాదాపు రూ. 4.74 లక్షల కోట్లకు చేరింది. ఈ బాటలో ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 13,806 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 13,424 కోట్లు, హెచ్డీఎఫ్సీ రూ. 10,831 కోట్లు చొప్పున విలువను కోల్పోయాయి. ఇదేవిధంగా మార్కెట్ విలువలో బజాజ్ ఫైనాన్స్‌కు రూ. 10,241 కోట్లు, భారతీ ఎయిర్‌టెల్‌కు రూ. 8,732 కోట్లు చొప్పున చిల్లు పడింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ మాత్రం రూ. 20,145 కోట్లమేర ఎగసి రూ. 5.94 లక్షల కోట్లను అధిగమించింది. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ను ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే సంగతి తెలిసిందే. ఎఫ్‌పీఐల యూటర్న్ దేశీ క్యాపిటల్ మార్కెట్లలో గత రెండు నెలలుగా నికర పెట్టుబడిదారులుగా నిలుస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు ఇటీవల అమ్మకాల యూటర్న్ తీసుకున్నారు. ఫలితంగా సెప్టెంబర్‌లో రూ. 7,624 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. వీటితో కలిపిచూస్తే 2022లో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు రూ. 1.68 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే ఆగస్ట్‌లో రూ. 51,200 కోట్లు, జులైలో దాదాపు రూ. 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. జులైకు ముందు అంటే 2021 అక్టోబర్ మొదలు ఎఫ్‌పీఐలు వరుసగా తొమ్మిది నెలలపాటు విక్రయాలకే కట్టుబడటం గమనార్హం! ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, రూపాయి పతనం, ట్రెజరీ ఈల్డ్స్, డాలరు జోరు వంటి అంశాల నేపథ్యంలో భవిష్యత్‌లోనూ ఎఫ్‌పీఐల పెట్టుబడుల్లో ఆటుపోట్లు కనిపించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, జర్మనీకి ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లు సెంటిమెంటును బలహీనపరుస్తున్నట్లు తెలియజేశారు. ఇటీవల పెరిగిన ఆర్థిక మాంద్య భయాలు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లకు షాకిస్తున్నట్లు వివరించారు. -
రుతు పవనాలు, విదేశీ ట్రెండ్స్ కీలకం
ముంబై: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్ల గమనాన్ని ప్రధానంగా అంతర్జాతీయ పరిస్థితులు నిర్దేశించనున్నట్లు పలువురు నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా మార్కెట్లను ప్రభావితం చేయగల అంశాలు కొరవడటం దీనికి కారణమని తెలియజేశారు. అయితే మరోపక్క రుతు పవనాల కదలికలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడిచమురు ధరలు వంటి అంశాలకు సైతం ప్రాధాన్యత ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా డాలరుతో మారకంలో రూపాయి విలువ సైతం సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశపు మినిట్స్‌ను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. వడ్డీ రేట్ల పెంపు ధరలు అదుపు చేసేందుకు పలు కేంద్ర బ్యాంకులు కఠిన ద్రవ్య విధానాల అమలుకు మొగ్గుచూపాయి. ఫలితంగా గత వారంలో సెన్సెక్స్ 2,943 పాయింట్లు, నిఫ్టీ 908 పాయింట్లు చొప్పున క్షీణించాయి. గడిచిన రెండేళ్లలో ఒకవారంలో సూచీలు ఈ స్థాయిలో పతనాన్ని చవిచూడటం ఇదే తొలిసారి. ‘‘గడిచిన వారంలో సూచీలు ఐదున్నర శాతానికి పైగా క్షీణించడంతో షార్ట్‌కవరింగ్‌కు వీలున్నప్పటికీ ట్రెండ్ బలహీనంగా ఉంది. ఆర్థిక మందగమన భయాలతో ఈక్విటీ మార్కెట్లు మరింత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ట్రేడర్లు లాంగ్ పొజిషన్లకు దూరంగా ఉండటం మంచిది. నిఫ్టీ 15,360 స్థాయిని నిలుపుకోగలిగితే తప్ప మార్కెట్ దిద్దుబా టు ఆగదు. అమ్మకాలు కొనసాగితే నిఫ్టీకి 15,183 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు, ఆ తర్వాత 14,900 వద్ద మద్దతు లభించొచ్చు’’ శామ్కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ యష్ షా తెలిపారు. విదేశీ గణాంకాలు 1–5 ఏళ్ల కాలానికి రుణాల ప్రామాణిక రేటును చైనా ఈ నెల 20న ప్రకటించనుంది. కోవిడ్–19 షాక్ తదుపరి ఆర్థిక వ్యవస్థ బలోపేతానికే అధిక ప్రాధాన్యమివ్వనున్నట్లు బ్యాంక్ ఆఫ్ జపాన్ పే ర్కొంది. దీంతో వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇటీవల ఆర్బీఐ, యూఎస్ ఫెడ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, స్విస్ నేషనల్ బ్యాంక్ తదితరాలు వడ్డీ రేట్ల పెంపుతోపాటు కఠిన పరపతి విధానాలకు మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. దీంతో బాండ్ల ఈల్డ్స్ బలపడుతుండటంతో పెట్టుబడులు స్టాక్స్ నుంచి రుణ సెక్యూరిటీలవైపుమళ్లుతున్నట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. రుతు పవనాలు ప్రభావం ఈ ఏడాది వర్షాలు సాధారణంగానే కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనా వేశారు. అయితే నైరుతి రుతు పవనాలు ప్రవేశించినా, వాటి విస్తరణ ఆశించిన విధంగా లేకపోవడం ప్రతికూల ప్రభావం చూపుతోంది. సకాలంలో వర్షాలు కురవకపోతే ద్రవ్యోల్బణ ధీర్ఘకాలం కొనసాగడంతో పాటు పెట్టుబడులు మందగించవచ్చని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతూనే ఉంది. ఈ జూన్‌లో ఇప్పటి వరకు రూ.31,430 కోట్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 2022 ఆరంభం నుంచి మొత్తంగా రూ.1.98 లక్షల కోట్లు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి తరలిపోయాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం పెరుగుదల, కేంద్ర బ్యాంకులు ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడం వంటి అంశాలే ఎఫ్‌పీఐల అమ్మకాలకు ప్రధాన కారణమని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. -
ఈ వారం థియేటర్లలో సందడి చేసే సినిమాలు..
Upcoming Movies Web Series Release Theatre OTT May 2nd Week: థియేటర్లలో పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు చేసిన రచ్చను 'సర్కారు వారి పాట' కొనసాగిస్తోంది. ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలు సందడి చేశాయి. ఈ క్రమంలో ఈ వారం ఏ సినిమాలు అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయా అని సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి మాత్రం పెద్ద సినిమాలు ఏవి థియేటర్లలో అడుగుపెట్టట్లేదు. చిన్న సినిమాలు మాత్రం ఈ వారం సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. అవేంటో లుక్కేద్దామా ! 1. శేఖర్ యాంగ్రీ ఎంగ్ మ్యాన్ రాజశేఖర్ చాలా గ్యాప్ తర్వాత నటించిన చిత్రం 'శేఖర్'. జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మే 20న థియేటర్లలో సందడి చేయనుంది. మలయాళంలో విజయం సాధించిన 'జోసేఫ్' సినిమాకు రీమేక్‌గా రానుంది. మనసున్న ప్రతి ఒక్కరికీ 'శేఖర్' నచ్చుతాడని, ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారని డైరెక్టర్ జీవిత ఆదివారం ప్రెస్ మీట్లో తెలిపారు. 2. ధగడ్ సాంబ నవ్వులు పంచేందుకు రెడీ అయ్యాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. సంపూ, సోనాక్షి జంటగా నటించిన చిత్రం ధగడ్ సాంబ. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు ఎన్ఆర్ రెడ్డి డైరెక్టర్. 'సంపూర్ణేష్ బాబును ఇప్పటివరకు చూడని కొత్త పాత్రలో చూస్తారు. అసభ్యత లేకుండా కుటుంబమంతా కలిసి చూసేలా మూవీ ఉంది.' అని చిత్ర యూనిట్ పేర్కొంది. 3. ధాకడ్ బాలీవుడ్ బ్యూటీ, కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ఏజెంట్ అగ్నిగా 'ధాకడ్' మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి రజనీష్ ఘయ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ అయితే యాక్షన్ సీన్స్‌తో అదరిపోయింది. మరీ ఏజెంట్ అగ్నిగా కంగనా రనౌత్ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలంటే మే 20 వరకు ఆగాల్సిందే. 4. భూల్ భులయా 2 హారర్, కామెడీ నేపథ్యంలో వస్తున్న హిందీ చిత్రం 'భూల్ భులయా 2'. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, బ్యూటీఫుల్ హీరోయిన్ కియరా అడ్వాణీ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి అనీస్ బాజ్మీ డైరెక్షన్ చేశారు. టబు కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా మే 20న ప్రేక్షకులను భయంతో నవ్వించనుంది. ఓటీటీలో.. మే 20న ఓటీటీలో ఆర్ఆర్ఆర్, ఆచార్య, భళా తందనాన, 12th మ్యాన్, ఎస్కేప్ లైవ్, జాంబీవ్లీ చిత్రాలు, పంచాయత్ సీజన్ 2, నైట్ స్కై సీజన్ 1 వెబ్ సిరీస్‌లు విడుదల కానున్నాయి. 1. ది ఇన్విజబుల్ మ్యాన్- మే 16 (నెట్‌ఫ్లిక్స్) 2. ది హంట్- మే 16 (నెట్‌ఫ్లిక్స్) 3. వూ కిల్డ్ సారా సీజన్ 3- మే 18 (నెట్‌ఫ్లిక్స్) 4. హనీమూన్- మే 20 (వూట్) చదవండి: 'ఆర్ఆర్ఆర్' ఫ్యాన్స్‌కు జీ5 షాక్.. సినిమాకు డబ్బులు చెల్లించాల్సిందే ! రెండో వివాహం చేసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. ఫొటోలు వైరల్ -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
జారా లార్సన్ : ఎయిన్ట్ మై ఫాల్ట్ ‘నా తప్పు కాదు’ అంటోంది స్వీడిష్ సింగర్ జారా లార్సన్! దేని గురించి మాట్లాడుతోంది ఈ 18 ఏళ్ల పాప్ సింగర్? ‘నీ ప్రియుడు నా వైపు చూస్తే అది నా తప్పు కాదు’ అని తనలాంటి ఇంకో అమ్మాయికి చెబుతోంది జారా. ‘పిల్లా... నేను చూడకూడదనుకున్న చోట నువ్వు చేతులు అడ్డుపెట్టుకో. అయినప్పటికీ ఆ చేతి వేళ్ల ఖాళీల్లోంచి అతడు గనుక నన్ను చూస్తుంటే అందుకు నన్ను తప్పు పట్టకు. చెబుతున్నా’ అంటూ పాడుతుంది జారా లార్సన్. ‘అసలు నాకేం బాధ్యత లేదు’ అని కూడా అంటుంది. పాపం, ఆ అమ్మాయి ఎవరో కానీ ఎలా తన ప్రియుణ్ణి జారా లార్సన్ నుంచి, మిగతా అమ్మాయిల నుంచి కాపాడుకోవడం?! ప్రేమలో పడితే అంతే మరి. ప్రేమను కాపాడుకోవడంతోనే సరిపోతుంది! జారా సెకండ్ స్టుడియో ఆల్బమ్‌లోని సింగిల్ లీడ్.. ఈ సాంగ్. జారా అంత తేలిగ్గా ఏమీ ఈ గీతాన్ని ఆలపించలేదు. ‘ఓవ్ ఓవ్ ఓవ్ ఐ కాంట్ సింగ్ దిస్’ అన్నారు. ‘అసలు నేను ఆ టైపే కాదు. నాలాంటి ఒక ఆడపిల్ల ప్రియుడిని దొంగిలించడం నా వల్ల కాదు’ అంటూ పాటలోని ఇన్సెన్సిబిలిటీని పలచబార్చుతూ కొన్ని మార్పులు చేయించారు. ఆ తర్వాత మాత్రమే పాడేందుకు అంగీకరించారు. ‘ఎవరి ప్రియుణ్ణి వాళ్లే చేజారకుండా చూసుకోవాలి’ అనే అర్థం వచ్చినట్లున్న మొదటి వెర్షన్ కాస్తా... ఇలా.. ‘నీ బాధను నేను అర్థం చేసుకోగలను’ అనే లైన్లోకి మారిపోయింది. రైట్. అమ్మాయి మనసు ఇంకో అమ్మాయికి మాత్రమే అర్థమౌతుంది. గ్రేట్ జారా! బిల్లీ ఆన్ ది స్ట్రీట్ : సీజన్ 5 ట్రైలర్ బిల్లీ ఈజ్ బ్యాక్! నవంబర్ 15 నుంచి అమెరికన్ టీవీ ఛానెల్ ‘ట్రూ టీవీ’లో! ఎవరీ బిల్లీ? బిల్లీ ఐక్నర్. అమెరికన్ కామెడీ గేమ్ షో హోస్ట్. న్యూయార్క్ వీధులలోకి వెళ్లి... దారినపోయే దానయ్యలను, దానమ్మలను ఆపి ప్రశ్నలు అడిగి ఫన్ని క్రియేట్ చేస్తుంటాడు బిల్లీ. ‘ఫర్ ఎ డాలర్’, ‘క్విజ్డ్ ఇన్ ది ఫేస్’, ‘అమెచ్యూర్ స్పీడ్ స్కెచ్’ అనేవి ఈయన మళ్లీ మళ్లీ ఆడుతుంటే ఆటలు! 2011లో ఈ కామెడీ షో మొదలైంది. శాంపిల్‌గా ఇందులో ‘ఫర్ ఎ డాలర్’ గేమ్‌ని చూపించారు. బిల్ ఒక ప్రశ్న అడుగుతాడు. కరెక్ట్ సమాధానం చెప్పినవాళ్లకు ఒక డాలర్ ఇస్తాడు. (ఈ వీడియోలో ఒక అమెరికన్ మహిళ విండో షాపింగ్ చేస్తూ ఉంటుంది. బిల్లీ వెళ్లి ‘మిస్.. మిస్.. ఒక లయర్ పేరు చెప్పండి’ అని అడుగుతాడు. ఆమె నవ్వుతూ, డొనాల్డ్ ట్రంప్ అంటుంది. బిల్లీ ‘వావ్’ అంటాడు. ఆమెకు గిఫ్ట్‌గా ఓ డాలర్ ఇస్తాడు). ఇక ‘క్విజ్డ్ ఇన్ ది ఫేస్’ మూడు రౌండ్ల గేమ్. మొదటి రెండు రౌండ్లలో పాప్ కల్చర్ గురించి మూడు ప్రశ్నలు ఉంటాయి. ఫైనల్ రౌండ్లో ఒక జనరల్ క్వొశ్చన్ ఉంటుంది. దాని ఆన్సర్ బిల్లీ దగ్గరున్న ఆన్సర్‌కి సరిపోవాలి. గెలిస్తే గిఫ్ట్. ‘అమెచ్యూర్ స్పీడ్ స్కెచింగ్’లో మళ్లీ మిస్టర్ దానయ్యలు, మిస్ దానమ్మలు అక్కడికక్కడ ఒక సెలబ్రిటీ బొమ్మ గీయాల్సి ఉంటుంది. దాన్ని బిల్లీ ఇంకో దానయ్య /దానమ్మకు చూపించి ఎవరో చెప్పమంటారు. వాళ్లు చెప్పింది, వీళ్లు గీసిందీ ఒకటే అయితే విన్ అయినట్టు. అప్పుడప్పుడు సెలబ్రిటీలను కూడా తనతో రోడ్ల మీద తిప్పుతూ గేమ్స్ ఆడుతుంటాడు బిల్లీ! హైదరాబాద్ ట్రాఫిక్ సీన్స్ : మహాతల్లి కొంతమంది కంత్రీ గైస్ కొలాబరేషన్ ఈ వీడియో. షార్ట్ ఫిల్మ్‌లా ఉంటుంది. తీరూతెన్నూ లేని హైదరాబాద్ ట్రాఫిక్‌ను కూడా తీరుగా చూపించిన ఆ మహాతల్లి జాహ్నవీ దాసెట్టి. ‘మహాతల్లి’ అనే టాగ్‌తో ఫన్నీ సీన్స్‌ని షూట్ చేసి అప్లోడ్ చేస్తున్న ఈ షార్ట్‌ఫిల్మ్ సూపర్ స్టార్... కర్నూలు అమ్మాయి. శేఖర్ కమ్ముల టీమ్మేట్లా అనిపిస్తాయి ఆ యాక్సెంట్, ఆ హావభావాలు. అమ్మాయిలు బండేసుకుని బయటికొస్తే ఎన్ని అనుభవాలు ఎదురౌతాయో, అబ్బాయిల్ని ఈ అమ్మాయిలు డ్రైవింగ్‌లో ఒకోసారి ఎలా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటారో ఈ వీడియోలో చూడొచ్చు. ఫన్నీగా ఉంది. ట్రాఫిక్ రూల్స్ పాటించనివారి చెవుల్ని ఇన్డెరైక్టుగా మెలేయడమూ ఉంది. ఫెన్సెస్ టీజర్ ట్రైలర్ : పారామౌంట్ పిక్చర్స్ ఈ క్రిస్మస్కి విడుదలౌతున్న అమెరికన్-కెనడియన్ డ్రామా మూవీ ‘ఫెన్సెన్’ టీజర్ ఇది. అగస్ట్ విల్సన్ నాటకం ఫెన్సెస్ ఆధారంగా డెంజిల్ వాషింగ్టన్ ఈ చిత్రాన్ని డెరైక్ట్ చేశారు. 1983లో పబ్లిష్ అయిన ఫెన్సిస్... ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ ప్రైజ్, టోనీ అవార్డ్‌లను గెలుచుకుంది. ఇప్పటికే రెండు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న డెంజిల్ వాషింగ్టన్ చేతిలో నాటకం పడింది కాబట్టి.. ఈ సినిమా వెండితెరపైన కూడా పండినట్టే. 1950ల నాటి పిట్స్‌బర్గ్‌లో కథ మొదలౌ తుంది. ఒకప్పుడు నీగ్రో లీగ్ బేస్‌బాల్ ఆటగాడైన ట్రాయ్ మాక్సన్ పరిస్థితుల ప్రాబల్యం వల్ల చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. తన కుటుంబాన్ని పోషించడానికి జీవితం విధించిన షరతులన్నిటికీ తలవొగ్గుతాడు. భార్యనీ కష్టపెడతాడు. డెంజిల్ వాషింగ్టన్, వయోలా డేవిస్ భార్యాభర్తలుగా నటించారు. వీళ్లిద్దరి ఎమోషన్స్ ఎంత హైట్స్‌లో ఉన్నాయో టీజర్లో కనిపిస్తుంది. -
ఈ వారం యూటూబ్ హిట్స్
ఇన్క్రెడిబుల్ టైమ్ లాప్స్ ఆఫ్ బర్డ్స్ నెస్ట్ టాన్ న్యూయన్ పేరుతో యూట్యూబ్‌లోకి మూడు రోజుల క్రితమే విడుదలైన ఈ వీడియోను సున్నిత మనస్కులు చూడకపోవడమే మంచిది. అయితే విధి చేసే వింతలు చూడాలన్న ఆసక్తి ఉన్నవారు దీనిని ఏమాత్రం మిస్ చేసుకోకూడదు. ఒక మహావృక్షం. అందులో చిన్న పక్షి గూడు. ఆ గూడులో నాలుగు గుడ్లు. వాటిని పొదిగేందుకు వచ్చి వెళుతున్న పక్షి. ఆ పక్షితో పాటు రోజూ ఆ గుడ్లు పొదిగాయా లేదా అని తన ‘గోప్రో’ కెమెరాతో మాటు వేసి ఉన్న టాన్ న్యూయన్ అనే నెటిజన్. ఇదీ సీన్. ఓ రోజు ఆ పక్షి అప్పటి వరకు గుడ్లు పొదిగి ఎక్కడికో వెళ్లింది. అది అలా వెళ్లగానే టాన్ ఇలా పక్షి గూడుకు గురిపెట్టి తన వీడియో కెమెరాను జూమ్ చేశాడు. అందులోంచి ఓ దృశ్యం చూసి అదిరిపోయాడు. ఏమిటా దృశ్యం? గుండె చిక్కబట్టుకుని చూడండి. మదారి : అఫీషియల్ ట్రయల్ జూన్ 10న విడుదలకు సిద్ధమైన ‘మదారి’ చిత్రం ట్రైలర్‌ను టీ సీరీస్ రిలీజ్ చేసింది. ఇర్ఫాన్ ఖాన్, జిమ్మీ షేర్గిల్, తుషార్ డాల్వి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నిషికాంత్ కామత్ డెరైక్షన్‌లో తయారైన ఈ సోషల్ థ్రిల్లర్... ‘బజరంగీ భాయ్‌జాన్’లా ప్రేక్షకాదరణ పొందే అవకాశాలున్నాయని ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. 2012లో నిర్మాణంలో ఉన్న ముంబై మెట్రో బ్రిడ్జి కూలిపోయిన ఘటన ఆధారంగా దర్శక, నిర్మాతలు కథను అల్లుకున్నారు. చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ని ఇర్ఫాన్ ఖాన్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. న్యూఢిల్లీ, రాజస్థాన్, డెహ్రాడూన్, షిమ్లా, ముంబైలలో చిత్ర నిర్మాణం జరిగింది. ఇర్ఫాన్ ఇందులో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే సామాన్యుడిలా కనిపిస్తాడని తప్ప అసలు కథ బయటికి రాలేదు. మెగాన్ ట్రైనర్ - మీ టూ ఈ వారం యూట్యూబ్ హిట్స్లోని పక్షిగుడ్ల వీడియోను వీక్షించి నిర్వేదంలోకి వెళ్లినవారు.. ఈ వీడియోను చూసి రిఫ్రెష్ అవొచ్చు. 22 ఏళ్ల అమెరికన్ గాయని మెగాన్ ఎలిజబెత్ ట్రైనర్ సొగసుగా అడుగులు వేస్తూ లయబద్ధంగా ఆలపించిన ‘మీ టూ’ సాంగ్ మిమ్మల్ని ఉల్లాసవంతమైన ఉషోదయం నుంచి ఆహ్లాదకరమైన సాయంత్రాల వరకు నడిపించుకుంటూ వెళుతుంది. ‘ఐ థాంక్ గాడ్ ఎవ్రీ డే.. దట్ ఐ వోకప్ ఫీలింగ్ దిస్ వే’ అంటూ మెగాన్ దంతధావనాన్ని ప్రారంభించి, ‘ఇఫ్ ఐ వాజ్ యు, ఐ వుడ్ వాన్నా బి మి టూ’ అనే చరణంతో నైట్ క్లబ్లో తేలుతుంది. మధ్యలో ఒకసారి మన ఉషా ఉతుప్లా నవ్వుతుంది. ఓపమ్ గంగ్నమ్ స్టెయిల్ను గుర్తుకు తెచ్చే స్టెప్పులూ వేస్తుంది. జేసన్ డిరులో - ‘ఇఫ్ ఇట్ ఎయిన్ట్ లవ్’ ‘ఇది ప్రేమ కాకపోతే, ఎందుకింత బాగుంది?’ స్ట్రెయిట్ క్వొశ్చన్! అమెరికన్ గాయకుడు, గేయ రచయిత జేసన్ డెరులో అడుగుతున్నాడు చెప్పండి. ప్రేమ ఎందుకంత బాగుంటుంది? డిస్కోగ్రఫీలో జగద్విఖ్యాతుడైన జేసన్ తాజా మ్యూజిక్ ఆల్బమ్ ‘ఇఫ్ ఇట్ ఎయిన్ట్ లవ్’. ఆఫీస్ వర్క్‌ప్లేస్‌లో ఈ పాట మొదలవుతుంది. కంప్యూటర్ ముందు కూర్చోని, అదే గదిలో ఇంకో టేబుల్ మీద సిస్టమ్‌తో పనిచేసుకుంటున్న అమ్మాయి ప్రేమలో పడతాడు జేసన్. పడి, ఆమెను కూడా పడేసేందుకు పాట మొదలు పెడతాడు. దాంతో పాటు డాన్స్. అ అమ్మాయి నవ్వుతుంది. ఆమె ఆఫీస్‌కి వచ్చేటప్పుడు, ఆమె ఆఫీస్ నుంచి వెళ్లేటప్పుడు తనకు ఎలాగుంటోందో చెబుతాడు. ‘ఆన్ ది టిప్ ఆఫ్ మై టంగ్.. ది ఫ్లేవర్ ఆఫ్ యువర్ స్కిన్ లింగర్స్ ఆన్ మై లిప్స్’ అంటూ.. తలకిందులైపోతాడు. యూత్‌కి నచ్చే వీడియో. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
పి.ఎస్.వై. డ్యాడీ : మ్యూజిక్ వీడియో దక్షిణ కొరియా పాప్ స్టార్, వైరల్ వీడియో సంచలనం పి.ఎస్.వై. (అసలు పేరు పార్క్ జేసాంగ్) మళ్లీ ఒళ్లు విరుచుకున్నాడు! ‘గంగ్నమ్ స్టైల్’ డాన్స్‌తో 2012లో లోకాన్ని షేక్ చేసిన పి.ఎస్.వై. ఇప్పుడు ‘డాడీ’తో ఊపేస్తున్నాడు. ‘ఐ గాట్ ఇట్ ఫ్రమ్ మై డాడీ’ అంటూ సాగే ఈ సాంగ్‌లో పి.ఎస్.వై. ఒక్క క్షణం కూడా తిన్నగా ఉండడు. వీక్షకులను ఉండనివ్వడు. వీడియోపై ఓపీనియన్స్ మిక్స్‌డ్‌గా ఉన్నా, రోజు రోజుకీ హిట్స్ పెరుగుతూనే ఉన్నాయి. ‘డాడీ’తో పాటే విడుదలైన పి.ఎస్.వై. దే ఇంకో వీడియో ‘నప్పల్ బాజీ’ కి పెద్దగా హిట్స్ లేకపోయినా చూడ్డానికి వెరైటీగా ఉంది. నిడివి : 4 ని. 5 సె. హిట్స్ : 2,63,44,794 ‘ది హోల్డ్’ : హౌ టు కామ్ ఎ క్రయింగ్ బేబీ రాబర్ట్ హామిల్టన్ యు.ఎస్.లో పేరున్న పిల్లల డాక్టర్. ముప్పై ఏళ్ల అనుభవంతో ఆయన పిల్లల బిహేవియర్‌కు సంబంధించిన ఎన్నో కొత్త విషయాలు కనిపెట్టారు. వాటిల్లో ఒకటి : ఏడుస్తున్న పసికందును ఊరుకోబెట్టడం! ఎంత గుక్కపట్టి ఏడుస్తున్న శిశువునైనా హామిల్టర్ ఒడుపుగా చేతుల్లోకి తీసుకుని క్షణాల్లో ఏడుపు మాన్పించేస్తాడు. ఇదెలా సాధ్యం? ఎలా సాధ్యమో ఈ వీడియోలో స్వయంగా చేసి చూపించారు ఆయన. తల్లిదండ్రులు కూడా ఇంట్లో ఈ టెక్నిక్‌ను ఫాలో కావచ్చు. అయితే శిశువు ప్రత్యేక పరిస్థితుల్లో ఏడుస్తుంటే మాత్రం ఈ టెక్నిక్‌ను ప్రయోగించకూడదు. నిడివి : 4 ని. 12 సె. హిట్స్ : 98,35,913 బ్యాట్‌మ్యాన్ వర్సెస్ సూపర్‌మ్యాన్ : డాన్ ఆఫ్ జస్టిస్ వచ్చే ఏడాది మార్చి 25న థియేట ర్స్లోకి వస్తున్న ‘బ్యాట్‌మ్యాన్ వర్సెన్ సూపర్‌మ్యాన్ : డాన్ ఆఫ్ జస్టిస్’ చిత్రం తాజా ట్రైలర్ ఇది. బ్యాట్ మ్యాన్‌గా బెన్ అఫ్లెక్, సూపర్మ్యా న్గా హెన్రీ క్యావిల్ నటిస్తున్నారు. సూపర్మ్యాన్పై అనుమానంతో అతడిపై పగతీర్చుకోడానికి బ్యాట్‌మాన్ బయల్దేరడంతో మానవాళికి కష్టాలు ప్రారంభం అవుతాయి. ఇద్దరి మధ్య ఉత్కంఠభరితమైన భీకర పోరాటాలు సాగుతుంటాయి. కామిక్ సూపర్ హీరో పాత్రలను అందమైన నటీనటుల రూపాల్లో చూడడం థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఎంత థ్రిల్లింగా ఉంటుందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. నిడివి : 3 ని. 1 సె. హిట్స్ : 42,07,161 గేమ్ ఆఫ్ థ్రాన్స్ సీజన్ 6 : టీజర్ ‘గేమ్ ఆఫ్ థ్రాన్స్’ ఫాంటసీ డ్రామా. హెచ్బీవోలో ఏడాదిగా ఈ సీరీస్ ప్రసారం అవుతున్నాయి. ఇప్పుడు ఐదో సీజన్ నడుస్తోంది. వచ్చే ఏప్రిల్‌లో సీజన్ 6 ప్రారంభం అవుతోంది. దాని టీజర్ రెండు రోజులు క్రితమే అఫీషియల్‌గా విడుదలైంది. టీజర్ అత్యద్భుతంగా, హాలీవుడ్ ట్రైలర్‌లా ఉంది. అమెరికన్ నవలా రచయిత జార్జి ఆర్.ఆర్.మార్టిన్ గొలుసు నవల ‘ఎ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్’ ఆధారంగా టీవీ సీరీస్ చిత్రీకరణ జరుగుతోంది. సింహాసనం కోసం రెండు రాజవంశాల మధ్య జరిగే కుట్రలు, కుయుక్తులు, వ్యూహాలు, ప్రతివ్యూహాల కథనమిది. నిడివి : 41 సె. హిట్స్ : 41,52,087 జనమ్ జనమ్ : ‘దిల్వాలే’ న్యూ సాంగ్ కొన్ని ప్రేమ కథలకు మొదలు తప్ప తుది ఉండదు. కాలాతీతంగా ప్రేమ పరిమళాలను అవి వెదజల్లుతూనే ఉంటాయి. అలాగే ప్రేమ పాటలు. గతవారం అప్లోడ్ అయిన ‘దిల్ వాలే’ లోని ‘గేరువా’ సాంగ్ యూట్యూబ్‌లో బ్లాక్ బస్టర్ అయింది. ఈవారం ‘జనమ్ జనమ్’ అనే పాటను విడుదల చేసింది సోనీ మ్యూజిక్. షారుక్‌ఖాన్, కాజోల్ నటించిన ఈ పాటకు ప్రీతమ్ సంగీతాన్ని సమకూర్చారు. అమిత్ భట్టాచార్య గీత రచన. పాడింది అరిజిత్ సింగ్, అంతర మిత్ర. వెస్ట్రన్, ఇండియన్ క్లాసిక్ మ్యూజిక్ కలగలిసిన ఈ పాట మనోరంజకంగా ఉంది. చిత్రం విడుదల డిసెంబర్ 18. నిడివి : 2 ని. 13. హిట్స్ : 17,52,832 ‘మల్హారీ’ సాంగ్ : బాజీరావ్ మస్తానీ ఇదొక హై-ఆక్టేన్ ట్రెడిషనల్ సాంగ్. స్వచ్ఛమైన సంప్రదాయ ఇంధనంతో జ్వలించే గీతం! బాజీరావ్ విజయోత్సాహ ఆత్మ రణవీర్ సింగ్‌ను ఆవహించినట్లే ఉంది. సంజయ్ లీలా భన్సాలీ ట్యూన్ ఇస్తే విశాల్ డడ్లానీ గీతాన్ని ఆలపించాడు. లిరిక్స్ ప్రశాంత్ ఇంగోల్. భన్సాలీ దర్శకత్వంలో డిసెంబర్ 18 విడుదల అవుతున్న ‘బాజీరావ్ మస్తానీ’ చిత్రంలోని మిగతా పాటల్లా ‘మల్హారీ’ కూడా రోమాంచితంగా ఉంది. ‘శత్రువును ఎంత ఘోరంగా ఓడించామో చూడండి. విజయ దుంధుబి మోగిస్తూ, ఆనందంతో ఆడిపాడదాం రండి’ అంటూ రణవీర్ సింగ్ పాడే గ్రూప్ సాంగ్ ఇది. నిడివి : 3 ని. 22 సె. హిట్స్ : 14,39,146