ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం కూడా లాభాలు ఆర్జించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల ముందు ర్యాలీకి అవకాశాలు అధికంగా ఉన్నందున మార్కెట్ సెంటిమెంట్ మరింత బలపడే వీలుందంటున్నారు. ఇక ఫెడరల్ రిజర్వ్, ఆర్‌బీఐ పాలసీ సమావేశ వివరాలు, దేశీయ మార్కెట్లో విదేశీ పెట్టుబడుల తీరుతెన్నులు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, కమోడిటీ, క్రూడాయిల్ ధరలు, బాండ్ల రాబడులపై ఇన్వెస్టర్లు దృష్టి సారించే వీలుందంటున్నారు.
‘‘దేశీయ కార్పొరేట్ క్యూ3 ఫలితాల ఘట్టం ముగిసిన నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సంకేతాలు స్టాక్ సూచీలకు దిశానిర్ధేశం చేయనున్నాయి. నిఫ్టీ కీలకమైన 22 వేల స్థాయిపై ముగిసింది. రానున్న రోజుల్లో ఈ స్థాయిని నిలుపుకోగలిగితే జీవితకాల రికార్డు స్థాయి(22126)ని చేధించే వీలుంది. లాభాల స్వీకరణ జరిగితే 21,750 వద్ద తక్షణ మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 21,350–21,450 పరిధిలో మరో తక్షణ మద్దతు స్థాయి ఉంది’’ అని మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ వైస్ ప్రెసిడెంట్ అరవింద్ సింగ్ నందా తెలిపారు.
జాతీయ అంతర్జాతీయ అంశాలు మెప్పించడంతో గత వారం సూచీలు ఒకటిన్నరశాతం లాభపడ్డాయి. బ్యాంకులు, ఆటో, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.
గురువారం ఆర్‌బీఐ, ఫెడ్ పాలసీ సమావేశ వివరాలు
ఈ ఫిబ్రవరి 8న జరిగిన ఆర్‌బీఐ ద్రవ్య పాలసీ కమిటీ సమావేశపు మినిట్స్(గురువారం), గత జనవరి చివర్లో జరిగిన ఫెడ్ మినిట్స్ గురువారం(ఫిబ్రవరి 22న) వెల్లడి కానున్నాయి. ఇరు కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్లు, ద్రవ్య విధాన వైఖరిలను మరింత లోతుగా విశ్లేíÙంచేందుకు మార్కెట్ వర్గాలు మినిట్స్ క్షుణ్ణంగా పరిశీలిస్తాయి.
నికర అమ్మకందారులుగా ఎఫ్‌ఐఐలు
అమెరికా బాండ్లపై రాబడులు పెరగడం, ఆర్‌బీఐ, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై నెలకొన్న సందిగ్ధత నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీలపై బేరిష్ వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఈ ఫిబ్రవరి ఇప్పటి వరకు (ఫిబ్రవరి 16 నాటికి) రూ.3,776 కోట్ల ఈక్విటీలను విక్రయించినట్లు డేటా తెలియజేసింది. ఇదే సమయంలో డెట్ మార్కెట్లో ఎఫ్‌ఐఐల రూ.16,560 కోట్ల పెట్టుబడులు పెట్టడం విశేషం. ‘‘వినియోగ ఆధారిత ద్రవ్యోల్బణం అంచనాలకు మించిన నమోదడంతో ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఇది అమెరికా బాండ్లపై రాబడుల పెరుగుదలకు దారీ తీసింది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత వంటి వర్ధమాన దేశాల్లో పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. అలాగే ఆర్‌బీఐ నుంచి వడ్డీరేట్ల తగ్గింపుపై స్పష్టమైన సంకేతాలు వెలువడకపోవడం ఎఫ్‌ఐఐలను నిరాశపరిచింది’’ అని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ శ్రీవాత్సవ తెలిపారు.
స్థూల ఆరి్థక గణాంకాలు
జపాన్ డిసెంబర్ యంత్ర ఆర్డర్ల డేటా సోమవారం, యూరోజోన్ డిసెంబర్ కరెంట్ ఖాతా డేటా మంగళవారం విడుదల కానున్నాయి. బుధవారం జపాన్ జనవరి వాణిజ్యలోటు, యూరోజోన్ వినియోగ విశ్వాస గణాంకాలు, ఈసీబీ నాన్ మానిటరీ పాలసీ మీటింగ్ వివరాలు వెల్లడి కానున్నాయి. గురువారం యూరోజోన్ డిసెంబర్ సరీ్వసులు, ద్రవ్యోల్బణ, ఈసీబీ పాలసీ మీటింగ్ వివరాలు, అమెరికా నిరుద్యోగ డేటా వివరాలు విడుదలవుతాయి. ఇక వారాంతాపు రోజున ఆర్‌బీఐ ఫిబ్రవరి తొమ్మిదో తేదీతో ముగిసిన వారానికి సంబంధించిన బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి డేటాతో పాటు ఫిబ్రవరి 16వ తేదీతో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలను ప్రకటించనుంది. ఆయా దేశాల ఆరి్థక వ్యవస్థను ప్రతిబింబిజేసే ఈ స్థూల ఆరి్థక గణాంకాల డేటాను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది.
Comments
Please login to add a commentAdd a comment