ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం కూడా లాభాలు ఆర్జించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, బడ్జెట్(2024–25)పై సమగ్ర విశ్లేషణ తర్వాత మార్కెట్ వర్గాల ప్రశంసనీయ వ్యాఖ్యలు, గతవారం వెలువడిన కొన్ని స్థూల ఆర్థిక గణాంకాలు మెప్పించడం తదితర అంశాలు సూచీలను లాభాల వైపు నడిపిస్తాయంటున్నారు.
ఇక మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఆర్‌బీఐ ద్రవ్య పాలసీ కమిటీ నిర్ణయాలు, దేశీయ మార్కెట్లో విదేశీ పెట్టుబడుల తీరుతెన్నులు, కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, కమోడిటీ, క్రూడాయిల్ ధరలు, బాండ్లపై రాబడులపై ఇన్వెస్టర్లు దృష్టి సారించే వీలుందంటున్నారు.
బడ్జెట్లో ద్రవ్యలోటు తగ్గింపు లక్ష్యం, మూలధన వ్యయ కేటాయింపు పెంపుతో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకోవడంతో గతవారంలో సూచీలు 2% ర్యాలీ చేశాయి. ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లతో పాటు అధిక వెయిటేజీ రిలయన్స్ షేరు రికార్డు ర్యాలీ నేపథ్యంలో వారం మొత్తంగా సెన్సెక్స్ 1,385 పాయింట్లు, నిఫ్టీ 502 పాయింట్లు చొప్పున ఆర్జించాయి.
‘‘నిఫ్టీ కొత్త రికార్డు(22,127) నమోదు, పాలసీ వెల్లడికి ముందు స్టాక్ మార్కెట్లో కొంత స్థిరీకరణ జరగొచ్చు. అయితే ప్రపంచ ఈక్విటీ మార్కెట్లోని సానుకూల సంకేతాలు బుల్స్‌కు అనుకూలంగా ఉన్నాయి. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 21,850 స్థాయిపై ముగిసింది. లాభాలు కొనసాగితే ఎగువున 22,350 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 21,640 పాయింట్ల వద్ద కీలక మద్దతు లభిస్తుంది’’ అనిమాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ వైస్ ప్రెసిడెంట్ అరవింద్ సింగ్ నందా తెలిపారు.
క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రభావం
దేశీయ కార్పొరేట్ కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన తుది అంకానికి చేరుకుంది. భారతీ ఎయిర్‌టెల్, బ్రిటానియా, నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్, గ్రాసీం ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్, దివీస్ ల్యాబ్స్, ఓఎన్‌జీసీతో సహా ఈ వారంలో 1,200 కంపెనీలు తమ డిసెంబర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. ఎల్‌ఐసీ, లుపిన్, నైనా, జొమాటో, టాటా పవర్, అలెంబిక్ ఫార్మా, అశోక్ లేలాండ్, వరణ్ బేవరేజెస్, గోద్రేజ్ ప్రాపరీ్టస్, అపోలో టైర్స్, మణిప్పురం ఫైనాన్స్, బయోకాన్, ఎస్కార్ట్స్, పతంజలీ ఫుడ్స్, ఎంసీఎక్స్ కంపెనీలు మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించే జాబితాలో ఉన్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమా న్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది.
స్థూల ఆర్థిక గణాంకాలు
చైనా, యూరోజోన్, జపాన్ దేశాలు జనవరి సేవారంగ పీఎంఐ డేటాను(సోమవారం) వెల్లడించనున్నాయి. భారత సేవారంగ డేటా ఫిబ్రవరి 5న విడుదల అవుతుంది. వారాంతాపు రోజైన శుక్రవారం జనవరి 26తో ముగిసి వారం బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి డేటాతో పాటు జనవరి 2తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలు ప్రకటించనుంది.
4 పబ్లిక్ ఇష్యూలు, ఒక లిస్టింగ్
ఈ వారంలో నాలుగు కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ.2,700 కోట్ల నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ఏపీజే సురేంద్ర పార్స్ హోటల్ ఐపీఓ జనవరి 5న, రాశి పెరిఫెరల్స్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పబ్లిక్ ఇష్యూలు జనవరి7న ప్రారంభం కానున్నాయి. ఇదే వారంలో ఇటీవల ఇష్యూలను పూర్తి చేసుకున్న బీఎల్‌ఎస్ ఈ–సరీ్వసెస్(ఫిబ్రవరి 7న) కంపెనీల షేర్లు ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి.
ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాలపై దృష్టి
ఫెడ్ ద్రవ్య పాలసీ, మధ్యంతర బడ్జెట్ ప్రకటన తర్వాత దలాల్ స్ట్రీట్‌కు ఆర్‌బీఐ ద్రవ్య సమావేశ నిర్ణయాలు కీలకం కానున్నాయి. సమీక్ష సమావేశం మంగళవారం(జనవరి 6న) ప్రారంభం అవుతుంది. కమిటీ నిర్ణయాలను బుధవారం గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడిస్తారు. రెపో రేటు (6.5%) యథాతథ కొనసాగింపునకే కమిటీ మొగ్గుచూపొచ్చు. అయితే వడ్డీ రేట్లు తగ్గింపు సైకిల్, ద్రవ్యోల్బణం, దేశ ఆర్థిక స్థితిగతులు, వృద్ధి అవుట్‌లుక్‌పై గవర్నర్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించవచ్చు.
డెట్ మార్కెట్లో ఆరేళ్ల గరిష్టానికి ఎఫ్‌ఐఐల పెట్టుబడులు
విదేశీ పెట్టుబడులు జనవరిలో దేశీయ డెట్ మార్కెట్లో రూ. 19,800 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. గడిచిన ఆరేళ్లలోనే అత్యధిక నెలవారీ పెట్టుబడులు కావడం విశేషం. భారత ప్రభుత్వ బాండ్లను జేపీ మోర్గాన్ ఇండెక్స్‌లో చేర్చడం ఇందుకు ప్రధాన కారణం. అమెరికాలో పెరుగుతున్న బాండ్ల రాబడితో గత నెల ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు రూ. 25,743 కోట్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.
డిపాజిటరీ గణాంకాల ప్రకారం, క్రితం నెల డెట్ మార్కెట్లలో ఎఫ్‌పీఐలు రూ.19,836 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, 2017, జూన్‌లో వచి్చన రూ. 25,685 కోట్ల తర్వాత ఇది రెండో అత్యధికం. బడ్జెట్ ప్రకటనలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రకటనలో ఆర్థిక లోటును వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5.1 శాతానికి తగ్గిస్తామని చెప్పడం, డెట్ మార్కెట్లో నిధుల పెరుగుదలకు దోహదపడుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment