Global Markets
-
ట్రంప్ చర్యలు.. ఆర్థిక ఫలితాలే కీలకం!
గతవారం స్టాక్ మార్కెట్లలో ఒడుదొడుకులు కొనసాగాయి. ప్రధాన సూచీలు దాదాపు 1 శాతం పడిపోయాయి. ఇందుకు వివిధ కారణాలు దోహదం చేశాయి. వాటిలో ప్రధానమైనది విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడం. వెంటాడుతున్న చమురు ధరల భయం, ఈరోజు అమెరికా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయబోయే డొనాల్డ్ ట్రంప్ విధానాలపై స్పష్టత కొరవడటం. ఈ మూడు అంశాలు ప్రధానంగా మార్కెట్లను పడగొట్టాయి. మరోపక్క రిలయన్స్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంకు ప్రకటించిన ఆర్థిక ఫలితాలూ మార్కెట్ల క్షీణతలో తమవంతు పాత్ర పోషించాయి. వాస్తవానికి ఫలితాలు ఫర్వాలేదు అనిపించినప్పటికీ మార్కెట్లను బలహీనత ఆవరించింది. ముఖ్యంగా ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంకు ఫలితాలు మదుపర్లను మెప్పించలేకపోయాయి. ఇన్ఫోసిస్ రూ.113, యాక్సిస్ బ్యాంకు రూ.45 దాకా క్షీణించాయి. దాదాపు రూ.35 దాకా పెరిగిన రిలయన్స్ మార్కెట్లని కాస్త ఆదుకోబట్టి సరిపోయింది కానీ, ఈ పతనం మరింత ఎక్కువగా ఉండేది. ఫార్మా, ప్రైవేట్ బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, వాహన, ఐటీ రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోగా.. ప్రభుత్వ రంగ బ్యాంకులు, చమురు రంగానికి చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. వారం మొత్తానికి సెన్సెక్స్ 760 పాయింట్లు కోల్పోయి 77619 వద్ద, నిఫ్టీ 228 పాయింట్లు నష్టపోయి 23203 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు సానుకూలంగా ట్రేడ్ అయినప్పటికీ... చివరకు ప్రతికూలంగానే ముగిశాయి. ఈవారం ఇలా..గత వారం మాదిరిగానే ఈవారం కూడా మార్కెట్లు కన్సాలిడేషన్ దిశగానే సాగే అవకాశం ఉంది. మార్కెట్లను ప్రభావితం చేసే ప్రధాన సంఘటనలు తక్కువగా ఉండటం ఇందుకు ఒక కారణం. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన ఆర్ధిక ఫలితాల ప్రభావం ఎటూ ఉండనే ఉంటుంది. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ట్రంప్ చేయబోయే ప్రకటనలపై కూడా మార్కెట్ ఓ కన్నేసి ఉంచుతుంది. ముఖ్యంగా టారిఫ్‌ల విషయంలో అమెరికా అధ్యక్షుడు చేయబోయే ప్రకటనలు రాబోయే రోజుల్లో మార్కెట్లకు దిశానిర్దేశం చేస్తాయి. గతంలో మాదిరి దేశీయ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ, అంతర్జాతీయ సంస్థలను ఏమైనా ఇరకాటంలో పెడతారా? లేదంటే విధానాలు మార్చుకుని కొంత సరళంగా వ్యవహరిస్తారా? అన్న విషయాన్ని మార్కెట్ సునిశితంగా గమనిస్తుంది. ఇక రూపాయి కదలికలు, చమురు ధరల్లో మార్పులపైనా దృష్టి పెట్టాలి. ఏది ఏమైనప్పటికీ ఆర్ధిక ఫలితాలు ప్రోత్సాహకరంగా లేకపోతే మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతినడం సహజం. అదే సమయంలో విదేశీ మదుపర్ల నిరంతర అమ్మకాలు అగ్గికి ఆజ్యం పోస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.ఆర్థిక ఫలితాలు కీలకంఈవారం హిందుస్థాన్ లీవర్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, అల్ట్రాటెక్ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్, హిందూస్థాన్ పెట్రోలియంలు ఫలితాలు ప్రకటించబోయే ప్రధాన కంపెనీలు. డీఎల్ఎఫ్, జొమాటో, ఎల్ & టీ ఫైనాన్స్, డిక్సాన్ టెక్నాలజీస్, పీఎన్బీ హౌసింగ్, ఇండియా మార్ట్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, జేకే సిమెంట్, టొరెంట్ ఫార్మా, జేఎస్ డబ్ల్యు స్టీల్, లారస్ లాబ్స్, గ్రాన్యూల్స్ ఇండియా, జిందాల్ సా, గోద్రెజ్ సీపీ, ఎంఫసిస్, సియెంట్, అదానీ గ్రీన్, పాలీక్యాబ్, హడ్కో, పెర్సిస్టెంట్, పెడిలైట్, హెరిటేజ్ ఫుడ్స్, కోఫర్జ్లు మరికొన్ని ప్రధాన కంపెనీలు.ఎఫ్ఐఐల సరళిఅమెరికాలో బాండ్ల రాబడి ప్రోత్సాహకారంగా ఉండటం రూపాయి సెంటిమెంటును దెబ్బతీస్తోంది. ఫలితంగా రూపాయి క్షీణిస్తూ డాలర్ బలపడుతూ వస్తోంది. ఇది విదేశీ సంస్థాగత మదుపర్ల (ఎఫ్ఐఐలు) పెట్టుబడులను ప్రభావితం చేస్తోంది. గత ఏడాది మొత్తం మీద భారీ స్థాయిలో విక్రయాలకు ప్రాధాన్యం ఇచ్చిన విదేశీ మదుపర్లు ఈ ఏడాది మొదటి నెలలోనూ అదే ధోరణిలో సాగుతున్నారు. గత వారం వీరు దాదాపు రూ.25,000 కోట్ల దాకా షేర్లను విక్రయించారు. నెల మొత్తానికి వీరి నికర అమ్మకాలు రూ.46,576 కోట్లకు చేరుకున్నాయి. అదే సమయంలో దేశీయ మదుపర్లు మార్కెట్ కు మద్దతుగా నిలిచారు. వీరు దాదాపు రూ.49367 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.సాంకేతిక స్థాయులుమార్కెట్లు ప్రస్తుతం బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ఆర్ధిక ఫలితాల నేపథ్యంలో స్టాక్ ప్రధాన కదలికలు చోటుచేసుకోవడం సహజమే అయినప్పటికీ ఇవి ఇండెక్స్‌లను ప్రభావితం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సెన్సెక్స్, నిఫ్టీల్లో ఒడుదొడుకులు కొంత మేర తగ్గే అవకాశం ఉన్నా ముఖ్యంగా బుల్స్ చేస్తున్న ప్రయత్నాలకు బేర్స్ అడ్డుగానే నిలుస్తున్నారు. మార్కెట్ కు కొనుగోళ్ల మద్దతు లభిస్తే మాత్రం మొదట దృష్టి పెట్టాల్సింది 23350 స్థాయి. దీన్ని అధిగమించనంతవరకు మార్కెట్ కొద్దిగా పెరిగినట్లు కనిపించినా మళ్లీ క్షీణత వైపే అడుగులేయవచ్చు. ఒకవేళ 23350 దాటితే తదుపరి నిరోధ స్థాయి 23500. దీన్ని కూడా దాటి ముందుకెళ్తే 23700, 23900 స్థాయిలను అందుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రముఖ కంపెనీల ఆర్ధిక ఫలితాల మెప్పించకపోయినా, ట్రంప్ నిర్ణయాలు ప్రతికూలంగా ఉన్నా సూచీలు పడిపోవడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రస్తుత స్థాయి నుంచి దిగజారితే మాత్రం మొదటి మద్దతు 23050 వద్ద లభిస్తుంది. దీన్ని కూడా బ్రేక్ చేసుకుని కిందకు పడిపోతే 22850 స్థాయిని టెస్ట్ చేయొచ్చు. ఆ తర్వాతి దశలు 22600, 22400 గా భావించాలి. ఫ్యూచర్స్ & ఆప్షన్స్ డేటాను పరిశీలిస్తే నిఫ్టీ 23000-24000 స్థాయిలోనే చలించవచ్చని తెలుస్తోంది. కాల్స్ డేటా ప్రకారం 24000 వద్ద అత్యధిక స్థాయిలో ఓపెన్ ఇంటరెస్ట్ ఉంది. పుట్స్ వైపు 22200 వద్ద అత్యధిక ఓపెన్ ఇంటరెస్ట్ కేంద్రీకృతమై ఉంది. మార్కెట్లో హెచ్చుతగ్గులకు దిక్సూచిగా నిలిచే ఇండియా విక్స్ గత వారం 5.58 శాతం పెరిగి 15.75 దగ్గర ఉంది.రంగాలవారీగా...బ్యాంకింగ్ షేర్లు తమ బలహీనతలను కొనసాగించే అవకాశం ఉంది. టెలికాం సంస్థలు ప్రోత్సాహక ఫలితాలు ప్రకటించవచ్చన్న అంచనాలతో ఈ రంగంలోని షేర్లు సానుకూలంగా కదలాడొచ్చు. వాహన రంగంలోని షేర్లు స్తబ్దుగానే చలించే అవకాశం ఉంది. క్షీణిస్తున్న రూపాయి ఫార్మా షేర్లకు మంచి బూస్ట్ అనే చెప్పాలి. మార్కెట్ ఒడుదొడుకుల్లో మదుపరులకు ఇది ఎప్పటికీ సురక్షిత రంగమే. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ ఫలితాలు నిరుత్సాహపరచడం ఐటీ రంగ షేర్లలో ఒత్తిడిని పెంచుతోంది. సిమెంట్ ధరలు పెరగవచ్చన్న వార్త నేపథ్యంలో ఈ రంగంలోని షేర్లకు మద్దతు లభించే అవకాశం ఉండగా, లోహ షేర్లు ఒత్తిళ్లు ఎదుర్కోవచ్చు. చమురు, ఎఫ్ఎంసీజీ షేర్లలో పెద్దగా దూకుడు ఉండకపోవచ్చు.-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
మార్కెట్‌కు మాంద్యం భయం
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ సూచీలు శుక్రవారం ఒకశాతం మేర నష్టపోయాయి. సెన్సెక్స్ 886 పాయింట్లు క్షీణించి 81 వేల దిగువన 80,981 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 293 పాయింట్లు పతనమై 25వేల స్థాయిని కోల్పోయి 24,718 వద్ద నిలిచింది. ఇటీవల వెల్లడైన దేశీయ కార్పొరేట్ క్యూ1 ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడం, దలాల్ స్ట్రీట్ వరుస రికార్డు ర్యాలీతో అధిక వాల్యుయేషన్ల ఆందోళన పరిణామాలు ఇన్వెస్టర్లను లాభాల స్వీకరణ వైపు పురిగొల్పాయి. ఒక దశలో సెన్సెక్స్ 999 పాయింట్లు క్షీణించి 80,869 వద్ద, నిఫ్టీ 324 పాయింట్లు కుప్పకూలి 24,686 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. రియలీ్ట, మెటల్, ఆటో, ఐటీ, కమోడిటీ, టెక్, క్యాపిటల్ గూడ్స్ షేర్ల భారీ పతనంతో బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు 0.58% 1.19 శాతం నష్టపోయాయి. సూచీల భారీ పతనంతో ఇన్వెస్టర్లకు ఒక్కరోజులో రూ.4.46 కోట్ల నష్టం వాటిల్లింది. బీఎస్ఈలోని మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.457 లక్షల కోట్లకు దిగివచి్చంది.ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల భారీ పతనం అమెరికాలో జూలై తయారీ రంగ పీఎంఐ, ఉద్యోగ ఉద్యోగ కల్పన గణాంకాలు నిరాశపరచడంతో ఆర్థిక మాంద్య భయాలు తలెత్తాయి. అలాగే ఫెడరల్ రిజర్వ్ సెపె్టంబర్లో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలను బలహీనపరిచింది. అమెరికా దిగ్గజ టెక్ కంపెనీలైన టెస్లా, ఆల్ఫాబెట్, ఎన్విడీయా, మైక్రోసాఫ్ట్ క్యూ2 ఆర్థిక ఫలితాలు అంచనాలకు అందుకోలేకపోవడం ఆగ్నికి ఆజ్యం పోశాయి. నాస్డాక్ 3% క్షీణించి 16,683 వద్ద ట్రేడవుతోంది. టెక్ కంపెనీల షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ సూచీ జూలై 10న జీవితకాల గరిష్టం (18,671) నుంచి ఏకంగా 10%పైగా కుప్పకూలింది. డోజోన్స్ ఇండెక్స్ 2.5% నష్టపోయి 39,430 వద్ద కదలాడుతోంది. అమెరికా మార్కెట్ల నష్టాల ప్రభావంతో ఆసియా, యూరప్ మార్కెట్లూ డీలా పడ్డాయి. బ్యాంక్ ఆఫ్ ఆఫ్ జపాన్ వడ్డీరేట్ల పెంపు అంచనాలతో జపాన్ సూచీ నికాయ్ 6% క్షీణించింది. తైవాన్ ఇండెక్స్ 5%, కోప్సీ సూచీ 4%, హాంగ్‌కాంగ్ సూచీ 2% కుప్పకూలాయి. ఆర్థిక వ్యవస్థ మందగమన భయాలతో చైనా షాంఘై సూచీ ఒకశాతం నష్టపోయింది. ఇక మధ్య ప్రాచ్యంలో విస్తరిస్తున్న యుద్ధ భయాలతో యూరప్ మార్కెట్లూ 2.50% నుంచి రెండుశాతం పైగా నష్టపోయాయి. -
Wedding Insurance: పెళ్లిళ్లకూ బీమా ధీమా..
మన దగ్గర వివాహ వేడుకనేది ఓ భారీ కార్యక్రమం. చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇలాంటి థీమ్‌తో బ్యాండ్ బాజా బారాత్, షాన్‌దార్, వీరే ది వెడ్డింగ్ లాంటి సినిమాలు, అనేక టీవీ షోలు కూడా వచ్చాయి. వివాహానికి సంబంధించి భావోద్వేగాల అంశాన్ని కాస్సేపు అలా ఉంచితే, ఈ వేడుకల్లో గణనీయంగా వ్యాపార అవకాశాలు కూడా ఇమిడి ఉంటాయి. అంతర్జాతీయంగా ఇదో పెద్ద పరిశ్రమ. 2020లో 160.5 బిలియన్ డాలర్లుగా ఉన్న గ్లోబల్ వెడ్డింగ్ సర్వీసుల మార్కెట్ 2030 నాటికి ఏకంగా 414.2 బిలియన్ డాలర్లకు చేరగలదన్న అంచనాలు ఉన్నాయి. అయితే, భారీ వ్యయంతో తలపెట్టే వివాహ వేడుకలకు ఏదైనా అనుకోని అవాంతరం వచి్చందంటే బోలెడంత నష్టం కూడా వాటిల్లే అవకాశాలు కూడా ఉన్నాయి. వేదిక, వాతావరణం మొదలైన వాటికి సంబంధించి ఏ సమస్య వచి్చనా కార్యక్రమం మొత్తం రసాభాస అవుతుంది. అందుకే, అలాంటి వాటికి కూడా బీమాపరమైన రక్షణ పొందేలా ప్రస్తుతం బీమా కంపెనీలు వెడ్డింగ్ ఇన్సూరెన్స్‌ను కూడా ఆఫర్ చేస్తున్నాయి. వేడుక స్థాయి, సరీ్వసులను బట్టి వీటికి ప్రీమియంలు ఉంటున్నాయి. భారీ కార్యక్రమం, విస్తృతమైన సరీ్వసులకు కవరేజీ కావాలంటే ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుందని కానీ ఇలాంటి ప్లాన్‌తో వచ్చే నిశి్చంత వెలకట్టలేనిది. వివిధ రకాలు.. సందర్భాన్ని బట్టి వెడ్డింగ్ ఇన్సూరెన్స్ కవరేజీ వివిధ రకాలుగా ఉంటుంది. లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేది .. పాలసీదార్ల వల్ల ఇతరులకు ఏదైనా హాని, ఆస్తి నష్టంలాంటివేమైనా జరిగితే కవరేజీనిస్తుంది. అలాంటి సందర్భాల్లో ఏవైనా లీగల్ ఖర్చులు, చెల్లింపులు చేయాల్సి వస్తే ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, ఉద్దేశపూర్వకంగా చేసినట్లు తేలితే మాత్రం కవరేజీ వర్తించదని గుర్తుంచుకోవాలి. ఈ తరహా కవరేజీ అనేది థర్డ్ పారీ్టకి చెల్లించాల్సిన నష్టపరిహారానికి మాత్రమే పరిమితమవుతుంది. దీనితో పాలసీదార్లకు ప్రత్యేకంగా పరిహారమేమీ లభించదు. మరోవైపు, ఏదైనా కారణాల వల్ల పెళ్లి వాయిదా పడిన సందర్భాల్లో ఆర్థికంగా నష్టపోకుండా చూసుకునేందుకు కూడా కవరేజీ ఉంటుంది. పేరొందిన బీమా కంపెనీలతో పాటు ప్రత్యేకంగా వెడ్డింగ్ ఇన్సూరెన్స్‌ను అందించే ఇన్సూరెన్స్ సంస్థలు కూడా ఉన్నాయి. కాబట్టి వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకునేటప్పుడు తమ నిర్దిష్ట అవసరాలపై ముందుగా ఒక అంచనాకు రావాలి. ఎంత వరకు కవరేజీ వస్తుంది, క్లెయిమ్‌ల ప్రక్రియ ఎలా ఉంటుంది మొదలైన వాటి గురించి బీమా సంస్థలను కనుక్కోవాలి. యాడ్ ఆన్లు, రైడర్లు .. సంప్రదాయాలు, అభిరుచులను బట్టి ప్రతి వివాహ వేడుకలు విభిన్నంగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి.. వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో యాడ్–ఆన్లు, రైడర్లు కూడా ఉంటున్నాయి. దుస్తులు మొదలుకుని హనీమూన్ వరకు ఇవి కవరేజీనిస్తాయి. ఉదాహరణకు పెళ్లి దుస్తులు దెబ్బతిన్నా లేక తీసుకొస్తుండగా దారిలో పోయినా .. అటైర్ కవరేజీ రైడర్లాంటిది ఆదుకుంటుంది. ఇక వ్యయాల విషయానికొస్తే.. వివాహ వేడుక స్థాయి, ప్రాంతం, తీసుకోబోయే కవరేజీ వంటి అంశాలన్నీ ప్రీమియంను ప్రభావితం చేస్తాయి. పాలసీదార్లు గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటుంది. ఈ పాలసీల్లోనూ కొన్ని మినహాయింపులు ఉంటాయి. సాధారణంగా బడ్జెట్ మించిపోయినా, ఇతరత్రా మనసు మార్చుకుని వేరే ప్రణాళికలు వేసుకున్నా కవరేజీపైనా ప్రభావం ఉంటుంది. కాబట్టి పాలసీపరంగా దేనికి కవరేజీ ఉంటుంది, దేనికి మినహాయింపు ఉంటుంది వంటి అంశాలను ముందుగా క్షుణ్నంగా తెలుసుకోవడం మంచిది. -
అమెరికా ఆంక్షలు.. చైనా కంపెనీ కొత్త ప్రణాళిక
గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం ఎక్కువవుతున్న తరుణంలో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నాయి, విక్రయిస్తున్నాయి. అయితే మొత్తం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో లేదా వినియోగంలో చైనా కార్ల సంఖ్య ఎక్కువగా ఉంది. దీనికి ప్రధాన కారణం.. చైనా కార్ల ధరలు ఇతర బ్రాండ్ కార్ల కంటే తక్కువగా ఉండటమే..!ఇప్పటికే కొన్ని దేశాలు చైనా వాహనాల దిగుమతి పూర్తిగా నిషేధించాయి, మరికొన్ని భారీ సుంకాలను విధించాయి. అయినప్పటికీ గ్లోబల్ మార్కెట్లో చైనా కంపెనీ సరసమైన కార్లను విక్రయించడానికి సర్వత్రా సిద్ధమైంది. ఇందులో బీవైడీ ప్రధానంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే భారతదేశంలో కూడా ఈ కంపెనీ ఉత్తమ అమ్మకాలను పొందుతూ.. ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూనే ఉంది.ప్రపంచ మార్కెట్లో తమ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడానికి.. దానికి అవసరమైనన్ని కార్లను ఉత్పత్తి చేయడానికి బీవైడీ కమకారీలోని పాత ఫోర్డ్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంది. ఇందులో భాగంగానే కంపెనీ బ్రెజిల్లో కూడా తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి సిద్ధమైంది.బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా గత సంవత్సరం చైనాను సందర్శించినప్పుడు, అతను బీవైడీ బిలియనీర్ వ్యవస్థాపకుడు, చైర్ వాంగ్ చువాన్ఫును కలిశారు. ఆ సమావేశం తరువాత, బీవైడీ ఆసియా వెలుపల మొదటి కార్ల తయారీ కేంద్రంగా దేశాన్ని ఎంచుకుంది.బీవైడీ ఈ సంవత్సరం బహియా రాష్ట్రంలోని సైట్లో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ ఆటోమొబైల్స్ ఉత్పత్తిని ప్రారంభించాలని భావిస్తోంది. ఇక్కడ బస్సులు, ట్రక్కులు మాత్రమే కాకుండా ప్రాసెస్ బ్యాటరీ పదార్థాలను కూడా తయారు చేస్తుంది. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో.. బీవైడీ ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా ఎదుగుతుందా? అనే సూచనలు కూడా కనిపిస్తున్నాయని పలువురు నిపుణులు భావిస్తున్నారు.గత నెలలో అమెరికా అధ్యక్షుడు.. జో బైడెన్ చైనా ఎలక్ట్రిక్ వాహనాలపై 100 శాతం సుంకం ప్రకటించారు. స్వదేశీ ఉత్పత్తుల అమ్మకాలను పెంచడానికి.. చైనా ఉత్పత్తుల సంఖ్యను తగ్గించడానికి అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అమెరికాలో చైనా ఉత్పత్తుల సంఖ్య తగ్గుతుందని స్పష్టంగా తెలుస్తోంది. -
హోండా 0 సిరీస్ ఎలక్ట్రిక్ కార్లు.. 500 కిమీ టార్గెట్!
గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఇప్పటికే అనేక సంస్థలు ఈవీలను లాంచ్ చేసి ఉత్తమ అమ్మకాలను పొందుతున్నాయి. ఇప్పటి వరకు హోండా మాత్రం ప్యూర్ ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయలేదు. అయితే ఈ సంస్థ 2030 నాటికి ఏడు 0 సిరీస్ మోడళ్లను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నద్ధమైంది.హోండా కంపెనీ లాంచ్ చేయనున్న 7 మోడల్స్ 480 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందించేలా రూపొందిస్తోంది. జపనీస్ ఆటో మేకర్ లాంచ్ చేయనున్న 0 సిరీస్ మోడల్స్ సరికొత్త బెస్పోక్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా తయారవుతాయి. ఈ ఎలక్ట్రిక్ కార్ల బాడీ ఫ్రేమ్‌లు తేలికగా ఉంటాయని తెలుస్తోంది. అంతే కాకుండా డిజైన్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది.హోండా లాంచ్ చేయనున్న 0 సిరీస్ కార్లు మంచి డిజైన్ కలిగి ఉండటమే కాకుండా.. లెవెల్ 3 ADAS టెక్నాలజీని కూడా పొందుతాయని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.0 సిరీస్ కింద లాంచ్ కానున్న మొదటి ఎలక్ట్రిక్ కారు CES.. ఇప్పటికే ఈ కారు లాస్ వెగాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కనిపించింది. దీన్ని బట్టి చూస్తే.. హోండా లాంచ్ చేయనున్న కార్లు ఎలా ఉండబోతున్నాయనేది స్పష్టమైపోతోంది. కాగా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ రోజు రోజుకు ఊపందుకుంటున్న తరుణంలో హోండా భారీ పెట్టుబడులను పెట్టడానికి యోచిస్తున్నట్లు సమాచారం. -
Iran-Israel Tensions: మార్కెట్లకు యుద్ధ భయం
ముంబై: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రికత్తలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన సంకేతాల ప్రభావంతో స్టాక్ సూచీలు సోమవారం ఒక శాతానికి పైగా నష్టపోయాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల అనిశ్చితి, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు, మార్చిలో టోకు ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్టానికి చేరుకోవడం తదితర అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయి. ఉదయం సెన్సెక్స్ 930 పాయింట్ల 73,315 వద్ద, నిఫ్టీ 180 పాయింట్లు క్షీణించి 22,339 వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో సూచీలు రోజంతా నష్టాల్లో కదలాడాయి. చివరికి సెన్సెక్స్ 845 పాయింట్లు పతనమై 2 వారాల కనిష్టం దిగువున 73,400 వద్ద నిలిచింది. నిఫ్టీ 247 పాయింట్లు క్షీణించి 22,272 వద్ద స్థిరపడింది. ఒక్క ఆయిల్‌అండ్‌గ్యాస్ మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫైనాన్సియల్ సరీ్వసెస్, సరీ్వసెస్, ఐటీ, బ్యాంకింగ్ ఇండెక్సులు మెటల్, ఆటో షేర్లు భారీ నష్టాలు చవిచూశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,288 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.4,763 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో ఒక్క చైనా(1%) మినహా అన్ని దేశాల సూచీలు దాదాపు ఒకశాతానికి పైగా నష్టపోయాయి. కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో యూరప్ మార్కెట్లు కోలుకున్నాయి. ► సెన్సెక్స్ 845 పాయింట్ల పతనంతో బీఎస్ఈలో రూ.5.18 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.394 లక్షల కోట్లకు దిగివచి్చంది. కాగా ఈ సూచీలో 30 షేర్లకు గానూ మారుతీ సుజుకీ (1%), నెస్లే (0.62%), సన్‌ఫార్మా(0.10%) మాత్రమే లాభపడ్డాయి. ► ఐటీ దిగ్గజం టీసీఎస్ షేరు ఒకటిన్నర శాతం నష్టపోయి రూ.3942 వద్ద నిలిచింది. క్యూ4 ఫలితాలు మెప్పించడంతో ట్రేడింగ్ ప్రారంభంలో 1.50% పెరిగి రూ.4063 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అయితే నష్టాల మార్కెట్ ట్రేడింగ్‌లో భాగంగా ఈ షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ► అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం దేశీయ ఆయిల్‌అండ్‌గ్యాస్ కంపెనీల షేర్లకు కలిసొచి్చంది. ఓఎన్జీసీ 6%, ఐజీఎల్ 2%, ఐఓఎల్, గెయిల్ 1.50% చొప్పున లాభపడ్డాయి. జీఎస్పీఎల్ 1% లాభపడ్డాయి. ► ప్రతి ఈక్విటీ షేరుకు రూ.118 ప్రత్యేక డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు ఆమోదించడంతో ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ షేరు 7% లాభపడి రూ.523 వద్ద నిలిచింది. ట్రేడింగ్‌లో 14% ఎగసి రూ.558 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. -
Stock market: మళ్లీ 72 వేలపైకి సెన్సెక్స్
ముంబై: అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, మహీంద్రాఅండ్‌మహీంద్రా షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు మూడో రోజూ లాభపడ్డాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లోని సానుకూల సంకేతాలు కలిసొచ్చాయి. సెన్సెక్స్ 228 పాయింట్లు పెరిగి 72వేల స్థాయిపైన 72,050 వద్ద నిలిచింది. నిఫ్టీ 71 పాయింట్లు బలపడి 21,911 వద్ద స్థిరపడింది. అమెరికా, ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ప్రథమార్థపు ట్రేడింగ్‌లో స్తబ్ధుగా కదలాడిన సూచీలు మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభంతో జోరు పెంచాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 71,644 వద్ద కనిష్టాన్ని, 72,165 వద్ద గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 21,795 – 21,954 శ్రేణిలో ట్రేడైంది. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆయిల్‌అండ్‌గ్యాస్, విద్యుత్, ఆటో, ఐటీ, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈలో స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 1.24%, 0.93 % చొప్పున రాణించాయి. రంగాల వారీగా బీఎస్ఈ ఆయిల్‌అండ్‌గ్యాస్ 2.61%, యుటిలిటీస్ 2.59%, పవర్ 2%, ఆటో 1.41%, టెలికం 1.26% చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 3,064 కోట్ల షేర్లను విక్రయించగా.., సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,277 కోట్ల షేర్లు కొన్నారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ► డిసెంబర్ క్వార్టర్ నికర లాభం 61% వృద్ధి నమోదుతో మహీంద్రాఅండ్‌మహీంద్రా షేరు దూసుకెళ్లింది. బీఎస్ఈలో ఆరున్నరశాతం పెరిగి రూ.1766 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 8% ర్యాలీ చేసి రూ.1784 ఆల్‌టైం హైని నమోదు చేసింది. సెన్సెక్స్, ► ఫెమా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి తన అనుబంధ సంస్థ పీపీబీఎల్ అధికారులపై ఈడీ విచారణ కొనసాగుతుండంతో పేటీఎం షేరు బీఎస్ఈలో 5% లోయర్ సర్క్యూట్‌తో రూ.325 వద్ద లాకైంది. ► ప్రభుత్వరంగ ఎన్ఎండీసీ షేరు 5% లాభపడి రూ.246 వద్ద ముగిసింది. క్యూ3లో నికర లాభం జోరుతో ట్రేడింగ్‌లో 7% ఎగసి రూ.253 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. ► బ్లాక్‌డీల్ ద్వారా రెండుశాతానికిపైగా వాటాకు సమానమైన రూ.2,600 కోట్ల విలువైన షేర్లు చేతులు మారినట్లు వార్తలు వెలుగులోకి రావడంతో వేదాంత షేరు 4% నష్టపోయి రూ.268 వద్ద ముగిసింది. -
ప్రైవేట్ బ్యాంకులు ఆకర్షణీయం!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా మందగమన ప్రభావాలు భారత ఎకానమీపై కూడా ప్రభావం చూపవచ్చంటున్నారు యూటీఐ ఏఎంసీ ఫండ్ మేనేజర్ వి. శ్రీవత్స. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేట్ రంగ బ్యాంకులు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని సాక్షి బిజినెస్ బ్యూరోకి ఇచి్చన ఇంటర్వు్యలో తెలిపారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. ఫండ్స్‌లోకి భారీగా పెట్టుబడులు .. సాంప్రదాయ పెట్టుబడి సాధనాలతో పోలిస్తే మ్యుచువల్ ఫండ్స్ ప్రయోజనాలు, అధిక రాబడులపై అవగాహన పెరుగుతున్న కొద్దీ గత పదేళ్లుగా ఫండ్స్‌లోకి పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లోనూ ఇదే తీరు కొనసాగవచ్చు. సిప్ల ధోరణి ఇదే సూచిస్తోంది. పొదుపు యోచన, దీర్ఘకాలికంగా సిప్ల ద్వారా సంపద సృష్టి మొదలైన అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. గరిష్ట స్థాయుల్లో మార్కెట్లకు రిస్క్‌లు.. అధిక ద్రవ్యోల్బణం, ఖర్చులు చేయడం తగ్గుతుండటం వంటి ధోరణుల కారణంగా చాలా మటుకు సంపన్న మార్కెట్లలో మాంద్యం అవకాశాలు ఎంతో కొంత ఉన్నాయి. ఇప్పటికీ పూర్తిగా కోలుకోని గ్లోబల్ మార్కెట్లకు పొంచి ఉన్న చెప్పుకోతగ్గ రిస్క్ల్లో ఇది కూడా ఒకటి. అలాగే అంతర్జాతీయంగా మందగమనం, ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండటమనేది మన దగ్గర కూడా అధిక ధరలు, ఎగుమతి ఆధారిత రంగాలు బలహీనపడటం రూపంలో భారత ఎకానమీపైనా ప్రభావం చూపవచ్చు. దేశీయంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యయాలు ఇంకా పుంజుకోవాల్సి ఉంది. వేల్యుయేషన్‌పరంగా దీర్ఘకాలిక సగటులతో పోలిస్తే మన మార్కెట్లు కొంత ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే నిర్దిష్ట విభాగాలు, రంగాలు చాలా ఎక్కువ ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. లార్జ్‌క్యాప్‌తో పోల్చి చూస్తే మిడ్, స్మాల్ క్యాప్స్ .. ప్రీమియం ధరలకు ట్రేడవుతున్నాయి. దీర్ఘకాలంలో ఈ ధోరణి నిలబడేది కాకపోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానంగా లార్జ్ క్యాప్ ఆధారిత ఫండ్స్, అలాగే డెట్, ఈక్విటీ కలయికతో ఉండే ఈక్విటీ ఆధారిత హైబ్రిడ్ ఫండ్స్‌పై దృష్టి పెడితే శ్రేయస్కరం. సిప్‌లు (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు) ఆకర్షణీయంగా ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ సిప్‌లను కొనసాగించవచ్చు. సిప్ లేదా ఎస్టీపీ (సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్) ద్వారా ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. పెట్టుబడులకు అనువైన రంగాలు.. పటిష్ట రుణ వృద్ధి, తక్కువ రుణ వ్యయాలతో ప్రైవేట్ రంగ బ్యాంకులు చాలా ఆకర్షణీయమైన వేల్యుయేషన్స్‌లో లభిస్తున్నాయి. కాబట్టి వాటిపై మేము సానుకూలంగా ఉన్నాం. అలాగే వృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉండటం, వేల్యుయేషన్లు సముచితంగా ఉండటం వల్ల ఆటోమొబైల్స్‌పై కూడా బులి‹Ùగా ఉన్నాం. ఇక దూరంగా ఉండతగిన రంగాల విషయానికొస్తే .. అధిక వేల్యుయేషన్లలో ట్రేడవుతున్న కన్జూమర్ డ్యూరబుల్స్, అలాగే వేల్యుయేషన్లకు తగ్గట్లుగా లేని కన్జూమర్ సరీ్వసెస్, ఎఫ్ఎంసీజీ రంగాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో లార్జ్ క్యాప్‌లపై సానుకూలంగా ఉన్నాం. అలాగే దీర్ఘకాలికంగా మెరుగైన చరిత్ర కలిగి, చౌకగా ట్రేడవుతున్న కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆశావహంగా ఉన్నాయి. మా యూటీఐ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్, యూటీఐ అగ్రెసివ్ హైబ్రీడ్ ఫండ్ల విషయానికొస్తే నాణ్యమైనవి స్టాక్స్, దీర్ఘకాలిక వేల్యుయేషన్ల కన్నా తక్కువ స్థాయిలో ట్రేడవుతున్న రంగాలవైపు మేము మొగ్గు చూపుతాం. మిడ్, స్మాల్ క్యాప్స్‌లోనూ సముచిత వేల్యుయేషన్లతో ట్రేడవుతూ వృద్ధి అవకాశాలు ఉన్నవి ఎంచుకుంటాం. -
సెంటిమెంట్ సానుకూలం
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం కూడా లాభాలు ఆర్జించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, బడ్జెట్(2024–25)పై సమగ్ర విశ్లేషణ తర్వాత మార్కెట్ వర్గాల ప్రశంసనీయ వ్యాఖ్యలు, గతవారం వెలువడిన కొన్ని స్థూల ఆర్థిక గణాంకాలు మెప్పించడం తదితర అంశాలు సూచీలను లాభాల వైపు నడిపిస్తాయంటున్నారు. ఇక మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఆర్బీఐ ద్రవ్య పాలసీ కమిటీ నిర్ణయాలు, దేశీయ మార్కెట్లో విదేశీ పెట్టుబడుల తీరుతెన్నులు, కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, కమోడిటీ, క్రూడాయిల్ ధరలు, బాండ్లపై రాబడులపై ఇన్వెస్టర్లు దృష్టి సారించే వీలుందంటున్నారు. బడ్జెట్లో ద్రవ్యలోటు తగ్గింపు లక్ష్యం, మూలధన వ్యయ కేటాయింపు పెంపుతో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకోవడంతో గతవారంలో సూచీలు 2% ర్యాలీ చేశాయి. ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లతో పాటు అధిక వెయిటేజీ రిలయన్స్ షేరు రికార్డు ర్యాలీ నేపథ్యంలో వారం మొత్తంగా సెన్సెక్స్ 1,385 పాయింట్లు, నిఫ్టీ 502 పాయింట్లు చొప్పున ఆర్జించాయి. ‘‘నిఫ్టీ కొత్త రికార్డు(22,127) నమోదు, పాలసీ వెల్లడికి ముందు స్టాక్ మార్కెట్లో కొంత స్థిరీకరణ జరగొచ్చు. అయితే ప్రపంచ ఈక్విటీ మార్కెట్లోని సానుకూల సంకేతాలు బుల్స్‌కు అనుకూలంగా ఉన్నాయి. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 21,850 స్థాయిపై ముగిసింది. లాభాలు కొనసాగితే ఎగువున 22,350 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 21,640 పాయింట్ల వద్ద కీలక మద్దతు లభిస్తుంది’’ అనిమాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ వైస్ ప్రెసిడెంట్ అరవింద్ సింగ్ నందా తెలిపారు. క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రభావం దేశీయ కార్పొరేట్ కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన తుది అంకానికి చేరుకుంది. భారతీ ఎయిర్టెల్, బ్రిటానియా, నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్, గ్రాసీం ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్, దివీస్ ల్యాబ్స్, ఓఎన్జీసీతో సహా ఈ వారంలో 1,200 కంపెనీలు తమ డిసెంబర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. ఎల్ఐసీ, లుపిన్, నైనా, జొమాటో, టాటా పవర్, అలెంబిక్ ఫార్మా, అశోక్ లేలాండ్, వరణ్ బేవరేజెస్, గోద్రేజ్ ప్రాపరీ్టస్, అపోలో టైర్స్, మణిప్పురం ఫైనాన్స్, బయోకాన్, ఎస్కార్ట్స్, పతంజలీ ఫుడ్స్, ఎంసీఎక్స్ కంపెనీలు మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించే జాబితాలో ఉన్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమా న్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. స్థూల ఆర్థిక గణాంకాలు చైనా, యూరోజోన్, జపాన్ దేశాలు జనవరి సేవారంగ పీఎంఐ డేటాను(సోమవారం) వెల్లడించనున్నాయి. భారత సేవారంగ డేటా ఫిబ్రవరి 5న విడుదల అవుతుంది. వారాంతాపు రోజైన శుక్రవారం జనవరి 26తో ముగిసి వారం బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి డేటాతో పాటు జనవరి 2తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలు ప్రకటించనుంది. 4 పబ్లిక్ ఇష్యూలు, ఒక లిస్టింగ్ ఈ వారంలో నాలుగు కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ.2,700 కోట్ల నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ఏపీజే సురేంద్ర పార్స్ హోటల్ ఐపీఓ జనవరి 5న, రాశి పెరిఫెరల్స్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పబ్లిక్ ఇష్యూలు జనవరి7న ప్రారంభం కానున్నాయి. ఇదే వారంలో ఇటీవల ఇష్యూలను పూర్తి చేసుకున్న బీఎల్ఎస్ ఈ–సరీ్వసెస్(ఫిబ్రవరి 7న) కంపెనీల షేర్లు ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఆర్బీఐ పాలసీ నిర్ణయాలపై దృష్టి ఫెడ్ ద్రవ్య పాలసీ, మధ్యంతర బడ్జెట్ ప్రకటన తర్వాత దలాల్ స్ట్రీట్‌కు ఆర్బీఐ ద్రవ్య సమావేశ నిర్ణయాలు కీలకం కానున్నాయి. సమీక్ష సమావేశం మంగళవారం(జనవరి 6న) ప్రారంభం అవుతుంది. కమిటీ నిర్ణయాలను బుధవారం గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడిస్తారు. రెపో రేటు (6.5%) యథాతథ కొనసాగింపునకే కమిటీ మొగ్గుచూపొచ్చు. అయితే వడ్డీ రేట్లు తగ్గింపు సైకిల్, ద్రవ్యోల్బణం, దేశ ఆర్థిక స్థితిగతులు, వృద్ధి అవుట్‌లుక్‌పై గవర్నర్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించవచ్చు. డెట్ మార్కెట్లో ఆరేళ్ల గరిష్టానికి ఎఫ్ఐఐల పెట్టుబడులు విదేశీ పెట్టుబడులు జనవరిలో దేశీయ డెట్ మార్కెట్లో రూ. 19,800 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. గడిచిన ఆరేళ్లలోనే అత్యధిక నెలవారీ పెట్టుబడులు కావడం విశేషం. భారత ప్రభుత్వ బాండ్లను జేపీ మోర్గాన్ ఇండెక్స్‌లో చేర్చడం ఇందుకు ప్రధాన కారణం. అమెరికాలో పెరుగుతున్న బాండ్ల రాబడితో గత నెల ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు రూ. 25,743 కోట్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం, క్రితం నెల డెట్ మార్కెట్లలో ఎఫ్‌పీఐలు రూ.19,836 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, 2017, జూన్‌లో వచి్చన రూ. 25,685 కోట్ల తర్వాత ఇది రెండో అత్యధికం. బడ్జెట్ ప్రకటనలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రకటనలో ఆర్థిక లోటును వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5.1 శాతానికి తగ్గిస్తామని చెప్పడం, డెట్ మార్కెట్లో నిధుల పెరుగుదలకు దోహదపడుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. -
నిఫ్టీ 20,000 స్థాయికి..?
ముంబై: నిఫ్టీ సూచీ ఈ వారంలో 20,000 స్థాయికి చేరొచ్చని స్టాక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ సూచీ జీవితకాల గరిష్టం (19,992) స్థాయికి 172 పాయింట్లు, 20వేల స్థాయికి 180 పాయింట్లు దూరంలో ఉంది. స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. వీటితో డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు కూడా స్వల్ప కాలానికి ట్రెండ్‌ను నిర్దేశిస్తాయన్నారు. అంచనాలకు మించి జీడీపీ, పీఎంఐ డేటా నమోదు, ఆర్థిక వ్యవస్థపై బలమైన అవుట్‌లుక్ నేపథ్యంతో గతవారం సూచీలు రెండుశాతం లాభపడ్డాయి. మెటల్, రియలీ్ట, మీడియా రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా వారం మొత్తంగా సెన్సెక్స్ 878 పాయింట్లు, నిఫ్టీ 385 పాయింట్లు ఆర్జించాయి. ‘‘అమెరికా బాండ్లపై రాబడులు 4.3 శాతానికి చేరుకున్నాయి. డాలర్ ఇండెక్స్ 105 స్థాయి వద్ద ట్రేడవుతున్నాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 90 డాలర్లకు చేరింది. ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశీయ మార్కెట్ స్థిరంగా ముందుకు కదలింది. గత వారాంతంలో ఆర్బీఐ అదనపు నగదు నిల్వల నిష్పత్తిని దశల వారీగా రద్దు చేస్తున్నట్లు చేసిన ప్రకటనతో బ్యాంకుల షేర్లు రాణించవచ్చు. ఈ పరిమాణాలు నిఫ్టీని 20,000 స్థాయికి తీసుకెళ్లవచ్చు. ఒకవేళ లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే దిగువున 19,500–19,650 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది’’ అని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. స్థూల ఆర్థిక గణాంకాల డేటా దేశీయంగా జూలై పారిశ్రామికోత్పత్తి డేటా, వడ్డీరేట్లను ప్రభావితం చేసే ఆగస్టు ద్రవ్యోల్బణ, వాణిజ్య లోటు గణాంకాలు ఈ వారంలో వెల్లడి కానుంది. అలాగే చైనా వాహన అమ్మకాలు, అమెరికా ద్రవ్యల్బోణ, యూరోజోన్ పారిశ్రామికోత్పత్తి డేటా, ఇదే వారంలోనే విడుదల అవుతాయి. వారాంతాపు రోజైన శుక్రవారం ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, డిపాజిట్ – బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. ఈ కీలక స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడికి ముందు అప్రమత్తత చోటు చేసుకొనే వీలుంది. నేడు రెండు లిస్టింగులు రత్నవీర్ ప్రెసిíÙన్ ఇంజరీంగ్, రిషిభ్ ఇన్‌్రసూ్టమెంట్ ఐపీఓలు సోమవారం ఎక్సే్చంజీల్లో లిస్టుకానున్నా యి. ఈఎంఎస్ ఐపీఓ మంగళవారం ముగిస్తుంది. ఆర్ఆర్ కేబుల్, షమీ హోటల్స్ పబ్లిక్ ఇష్యూలు బుధ, గురువారాల్లో ప్రారంభం కానున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు వరుస ఆరు నెలల్లో భారత ఈక్విటీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు సెప్టెంబర్‌లో అమ్మకాలను మొదలుపెట్టారు. ఈ నెలలో ఇప్పటివరకు రూ. 4,200 కోట్ల విలువైన నిధులను ఉపసంహరించుకున్నారు. అమెరికా 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ పెరగడం, డాలర్ విలువ పుంజుకోవడం, అంతర్జాతీయ ఆర్థికవృద్ధిపై ఆందోళనల నేపథ్యంలో ఎఫ్ఐఐలు నిధుల ఉపసంహరణకు మొగ్గు చూపారని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మరో వారం, రెండు వారాల పాటు ఎఫ్ఐల నిధుల ఉపసంహరణ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత నెలలో ఎఫ్ఐఐలు నాలుగు నెలల కనిష్టంతో రూ. 12,262 కోట్ల విలువైన నిధులను ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేశారు. ప్రస్తుత ఏడాదిలో ఇప్పటివరకు భారత మార్కెట్లలో రూ. 1.74 లక్షల కోట్ల నిధులను పెట్టుబడి పెట్టారు. -
స్పోర్టియస్ట్ డిజైన్‌తో హ్యుందాయ్ సొనాటా సరికొత్తగా
సాక్షి,ముంబై: ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ సరికొత్త హ్యుందాయ్ సొనాటాకారును ఆవిష్కరించింది. లాంచ్ చేసింది. మిడ్ సెగ్మెంట్లో 8వ జెనరేషన్ సొనాటాను కొత్త బ్యాడ్జ్, లాంగ్ హుడ్, ఫ్రంట్-ఎండ్ లేఅవుట్‌తో స్పోర్టియస్ట్ డిజైన్‌తో పరిచయం చేసింది. స్పోర్ట్, స్టాండర్డ్ , N లైన్ వేరియంట్లలో మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. హ్యుందాయ్ సొనాటా వెర్నా, కోనా ఎలక్ట్రిక్, స్టారియా పోలిన స్టయిల్‌తోపాటు, డ్రైవర్-సెంట్రిక్ ఇంటీరియర్ లేఅవుట్‌తో ఆల్ న్యూ హ్యుందాయ్సొనాటా రానుంది. ముఖ్యంగా హ్యుందాయ్ మోడల్లో తొలిసారిగా సొనాటా డ్రైవర్ ఇన్ఫర్మేషన్ క్లస్టర్లు, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో కర్వ్డ్ డిస్ప్లేను జోడించింది. సిగ్నేచర్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్ బార్, రియర్ ఎల్ఈడీ టెయిల్‌లైట్ స్ట్రిప్, బ్లాక్ బార్, మధ్యలో హ్యుందాయ్ లోగో, డిఫరెంట్ గ్రిల్‌తో దీన్ని అప్డేట్ చేసింది. అలాగే స్పోర్టియర్ ఎక్స్టీరియర్ ఇమేజ్‌తో ఆధునిక జీవనశైలికి మద్దతుగా భవిష్యత్ మొబిలిటీ సెన్సిబిలిటీతో దీన్ని తీర్చిదిద్దింది. 12.3 ఇంచ్ ట్విన్ టచ్ స్క్రీన్ డిస్ప్లే, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఫుల్లీ ఎక్స్టెండెడ్ ఎయిర్ వెంట్స్, న్యూ సెంట్రల్ క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్, న్యూ 3 స్పోక్ స్టీరింగ్ వీల్ మార్పులు కూడా చేసింది. ఇంజీన్ 1.6 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 2.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 2.5 లీటర్ టర్బో ఇంజిన్ ఆప్షన్స్ తో ఇది రానుంది. అలాగే ఎన్ లైన్లో మరొకటి వస్తోంది. ఈ ఇంజీన్ 285హెచ్‌పీ పవర్, 422 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. మార్చి 30నుంచి ఏప్రిల్ 9 వరకు జరగనున్న 2023 సియోల్ మొబిలిటీ షోలో దీన్ని ఆవిష్కరించనుంది. #Hyundai #SONATA inherits the identity of the 4-door coupe with Absolute Sportiness. And its futuristic and progressive interior is completed with our new technology, Panoramic Curved Display. On March 30th, #ThenewSONATA will be fully unveiled.#HyundaiDesign #SONATADesign pic.twitter.com/1r91CvNBIQ — Hyundai Motor Group (@HMGnewsroom) March 26, 2023 -
ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్: శాంసంగ్ మరో వినూత్న ఆవిష్కారం!
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ మరో కీలక ఆవిష్కారానికి సిద్ధమవుతోంది. మూడు ఫోల్డింగ్స్తో ఒక స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సన్నద్ధమవుతోందిట. టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ షేర్ చేసిన వివరాల ప్రకారం, శాంసంగ్ ట్రై-ఫోల్డ్ డిస్ప్లేతో ఒక స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. మరోవైపు ఈ ఏడాది చివర్లో లాంచ్ చేయనుందని భావిస్తున్న ఫ్లాగ్షిప్ గెలాక్సీ S23 సిరీస్ స్మార్ట్‌ఫోన్ 'ఫ్యాన్ ఎడిషన్’ శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ సంస్థ డెవలప్ మెంట్లో లేదని టిప్‌స్టర్ తెలిపింది. మూడు మడతలతో కాన్సెప్ట్ డిస్ప్లే పిక్స్‌ను షేర్ చేసింది. గతంలో CES 2022లో ట్రై-ఫోల్డ్ డిస్ప్లేలతో కాన్సెప్ట్ పరికరాలను ప్రదర్శించింది. జెడ్ సిరీస్ ఫోల్డబుల్ ఫోన్ల మెరుగైన వెర్షన్‌పై పని చేస్తోందనీ, ముఖ్యంగా జెడ్ ఫోల్డ్ 5 గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5గా తోపాటు మూడు మడతల ఫోన్ తీసుకు రానుందని తెలిపింది. ఫ్లెక్స్ ఎస్, ఫ్లెక్స్ జీ పేరుతో ఇవి రానున్నాయని అంచనా. కాగా జనవరిలో Samsung CES 2023లో 360-డిగ్రీల రొటేటింగ్ స్క్రీన్‌తో “ఫ్లెక్స్ ఇన్ అండ్ అవుట్” డిస్ప్లే కోసం ప్రోటోటైప్‌ను ప్రదర్శించింది. డిస్ప్లే లోపలికి బుక్ కవర్లా, లేదా వార్తాపత్రికలా బయటకి మడవగలదు. సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్తో ఫంక్షనల్ “ఫ్లెక్స్ ఇన్ అండ్ అవుట్” డిస్ప్లే జోడిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. There is no Galaxy S23 FE in the development chain unlike what the recent rumours have been pointing.. Samsung is instead working on the improved Z Fold 5 & Flip 5 along with a Tri-Fold that might finally ship this year FE fans should look elsewhere... — Yogesh Brar (@heyitsyogesh) March 24, 2023 -
March18th పసిడి ప్రియులకు షాక్: ఆల్‌టైం రికార్డు, ఇక కొన్నట్టే..?!
సాక్షి,ముంబై: పసిడి ధర రికార్డు స్థాయికి చేరుకుని వినియోగదారులకు షాకిస్తోంది. బులియన్ వర్గాల అంచనాలకు అనుగుణంగానే ఆల్ టైం రికార్డులను బ్రేక్ చేసింది. దేశీయంగా గతం వారం రోజుల వ్యవధిలో ధర రూ.3,520కు పైగా పెరిగింది. బంగారం ధర ఈ మధ్యకాలంలో ఇంత పెరుగుదల ఎప్పుడూ నమోదు కాలేదు. అమెరికా బ్యాంక్ సంక్షోభం పసిడి ధరలకు ఊతమిస్తోంది. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 55,300గా వద్ద ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,320 రూపాయలను దాటేసింది. శుక్రవారం నాటి ధరతో పోలిస్తే ఏకంగా 10 గ్రాములకు రూ. 1500 పెరిగింది. అటు వెండి ధరలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. హైదరాబాదులో 24 క్యారెట్ల బంగార ధర 10 గ్రాములు రూ. 60,320 వద్ద ఉంది. సుమారు రూ. 1,630 మేర పెరిగింది. కిలో వెండి ధర రూ. 1300 పెరిగి రూ. 74,400 వద్దకు చేరింది. గ్లోబల్‌గా కూడా అమెరికా మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభంలోనే శనివారం రికార్డు స్థాయిలో ధరలు పెరిగాయి. 1,988 వద్ద కొనసాగుతోంది. అంతకుముందు వారం ముగింపుతో పోలిస్తే ఔన్స్‌కు 6.48 శాతం పెరిగింది. రాబోయే కొద్ది రోజుల్లో ధర 2వేల డాలర్లను కూడా దాటేసి 2,500 డాలర్లకు చేరుకుంటుందని అంచనా. వెండి కూడా బంగారంతోసమానంగా వారానికి దాదాపు 9.22 శాతం భారీ లాభాలను ఆర్జించింది. ఇదే రేంజ్లో దేశీయంగా కూడా ధరలు ప్రభావితం కానున్నాయని మార్కెట్ నిపుణుల అంచనా. మార్చి 21న జరిగే ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో ఫెడరల్ రిజర్వ్ ముఖ్యంగా అమెరికా బ్యాంకింక్ సంక్షోభం నేపథ్యంలో బ్యాంకింగ్ రంగాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోకపోతే పసిడి ధరలు మరింత పెరుగుతాయనేది విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా అమెరికా చరిత్రలో రెండవ అతిపెద్ద బ్యాంక్ క్రాష్ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB) పతనంతో వడ్డీ రేట్ల పెంపు ఆందోళనకు దారి తీసింది. అటు క్రెడిట్ సూయిస్ షేర్లలో పతనం ప్రపంచ మార్కెట్ గందరగోళానికి దారితీసింది. దీంతో అంతర్జాతీయంగా శుక్రవారం బంగారం ధరలు 2 శాతానికి పైగా పెరిగిన సంగతి తెలిసిందే. -
ఈ వారం అమ్మకాల ఒత్తిడిలో మార్కెట్లు!
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశమున్నట్లు స్టాక్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇందుకు ప్రపంచ మార్కెట్ పరిస్థితులు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, సిలికాన్ వ్యాలీ బ్యాంక్(ఎస్వీబీ) మూసివేత తదితర అంశాలు కారణంకానున్నట్లు పేర్కొన్నారు. దేశీయంగా పలు గణాంకాలు విడుదల కానుండటంతో ఇన్వెస్టర్లు వీటన్నిటినిపైనా దృష్టి సారించనున్నట్లు తెలియజేశారు. ద్రవ్యోల్బణం, వాణిజ్యం.. సోమవారం(13న) దేశీయంగా ఫిబ్రవరి నెల రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు విడుదల కానున్నాయి. అంతకుముందు నెల అంటే జనవరిలో సీపీఐ మూడు నెలల గరిష్టం 6.52 శాతంగా నమోదైంది. ఇక మంగళవారం(14న) ఫిబ్రవరి టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. 2022 డిసెంబర్లో నమోదైన 4.95 శాతం నుంచి జనవరిలో 4.73 శాతానికి డబ్ల్యూపీఐ స్వల్పంగా తగ్గింది. ఈ బాటలో ఫిబ్రవరి వాణిజ్య గణాంకాలను సైతం ఇదే రోజు ప్రభుత్వం ప్రకటించనుంది. జనవరిలో వాణిజ్య లోటు 17.75 బిలియన్ డాలర్లకు చేరింది. విదేశీ అంశాలు గత వారాంతాన ఇన్సూర్డ్ డిపాజిట్ల రక్షణకు వీలుగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎస్వీబీని మూసివేసినట్లు కాలిఫోర్నియా ఆర్థిక పరిరక్షణ శాఖ పేర్కొంది. అంతేకాకుండా పరిస్థితులను చక్కదిద్దే బాటలో ఎస్వీబీని ఫైనాన్షియల్ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఐసీకి అప్పగించినట్లు వెల్లడించింది. ప్రధానంగా సిలికాన్ వ్యాలీ, టెక్ స్టార్టప్‌లకు పెట్టుబడులు అందించే ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ ఆర్థిక సంక్షోభంలో పడటంతో గత గురువారం కంపెనీ షేరు 60 శాతం కుప్పకూలింది. దీంతో బ్యాంక్ ఆఫ్ అమెరికా, జేపీ మోర్గాన్ చేజ్, వెల్స్‌ఫార్గో తదితర బ్యాంకింగ్ దిగ్గజ షేర్లు 5 శాతం స్థాయిలో పతనమయ్యాయి. దీంతో సోమవారం బ్యాంకింగ్ పరిశ్రమపై ఈ ప్రభావం ఏమేర ఉండబోయేదీ వేచిచూడవలసి ఉన్నట్లు నిపుణులు తెలియజేశారు. కాగా.. అంచనాలకంటే అధికంగా వడ్డీ రేట్లను పెంచే వీలున్నట్లు ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ గత వారం పేర్కొన్నారు. అయితే వారాంతాన యూఎస్ నిరుద్యోగ గణాంకాలు అంచనాలను మించి వెలువడ్డాయి. దీంతో వడ్డీ రేట్ల పెంపునకు కొంతమేర చెక్ పడేవీలున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు ఊహిస్తున్నాయి. ఈ నెల 22న ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయాలను వెల్లడించ నుంది. గ్లోబల్ గణాంకాలు ఫిబ్రవరి నెలకు యూఎస్ సీపీఐ గణాంకాలు 14న వెలువడనున్నాయి. చైనా పారిశ్రామికోత్పత్తి వివరాలు 15న వెల్లడికానున్నాయి. యూఎస్ ఉత్పాదక ధరల ద్రవ్యోల్బణం, రిటైల్ విక్రయ గణాంకాలు ఇదే రోజు వెలువడనున్నాయి. ఈ బాటలో 16న జపాన్ వాణిజ్య గణాంకాలు విడుదల చేయనుంది. ఇక దేశీయంగా ఇటీవల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు అమ్మకాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎఫ్‌పీఐల అమ్మకాలు, ఎస్వీబీ వైఫల్యంతో వారం చివర్లో దేశీయంగానూ అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి గత వారం సెన్సెక్స్ నికరంగా 674 పాయింట్లు కోల్పోయి 59,135కు చేరగా.. నిఫ్టీ 181 పాయింట్లు క్షీణించి 17,413 వద్ద ముగిసింది. -
Tecno Phantom V Fold అద్బుత ఫీచర్లతో టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ కమింగ్ సూన్
సాక్షి, ముంబై: స్మార్ట్‌ఫోన్ కంపెనీ టెక్నో తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే విడుదల చేసింది. ఫాంటమ్ వీ ఫోల్డ్ పేరుతో దీన్ని ఈ నెల ఫిబ్రవరి 27 నుండి స్పెయిన్‌లోని బార్సిలోనాలో ప్రారంభమయ్యే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023లో పరిచయం చేయనుంది. ఫిబ్రవరి 28న లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ధృవీకరించింది. టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ లాంచ్ పేజీ ఇప్పటికే MWC 2023 వెబ్సైట్లో లిస్ట్ అయి ఉంది. మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ఫాం టమ్ వీ ఫోల్డ్‌ను ఫిబ్రవరి 28న MWC 2023 సందర్భంగా ఆవిష్కరిస్తున్నట్లు అధికారికంగా టెక్నో ప్రకటించింది. అంతేకాదు ప్రపంచంలోని మొట్టమొదటి లెఫ్ట్-రైట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌గా కూడా ఉంటుందని తెలిపింది. MediaTek డైమెన్సిటీ 9000+ SoC ప్రాసెసర్ ప్రధాన ఆకర్షణ అనీ, చిప్సెట్ మొత్తం AnTuTu టెస్ట్ స్కోర్‌ను 1.08 మిలియన్లకు పైనే కంపెనీ తెలిపింది. దీనికి సంబంధించిన ఫోటోలను టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ లీక్ చేశారు. దీని ప్రకారం వీ ఫోల్డ్ డిస్ప్లేను సెంట్రల్-ప్లేస్డ్ హోల్-పంచ్ హౌసింగ్ సెల్ఫీ కెమెరాను, ట్రిపుల్ రియర్ కెమెరాను అమర్చినట్టు తెలుస్తోంది. ఫాంటమ్ వీ ఫోల్డ్ అంచనా ఫీచర్లు 7.1, 5.54 అంగుళాల అమెలెడ్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 56+16+8 ఎంపీ రియర్ కెమెరా 32+32 సెల్ఫీ కెమెరా 12 జీబీ ర్యామ్, 256/512 జీబీ స్టోరేజ్ 4500 బ్యాటరీ 67 వాట్స్ చార్జింగ్ సపోర్ట్ Tecno Phantom V Fold 🔥 pic.twitter.com/mEnzA7whn3 — Sudhanshu Ambhore (@Sudhanshu1414) February 2, 2023 -
బడ్జెట్‌పై అంచనాలు, క్యూ3 ఫలితాలు కీలకం
ముంబై: ట్రేడింగ్ నాలుగురోజులే ఈ వారంలో బడ్జెట్‌పై అంచనాలు, కార్పొరేట్ క్యూ3 ఫలితాలు, ప్రపంచ పరిణామాలు దేశీయ స్టాక్ సూచీలకు దిశానిర్ధేశం చేస్తాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. నెలవారీ డెరివేటివ్స్ ఎక్స్పైరీ(బుధవారం) నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తతో ఒడిదుడుకుల ట్రేడింగ్‌కు అవకాశం ఉండొచ్చంటున్నారు. వీటితో పాటు దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చంటున్నారు. ‘‘అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఈ ప్రతికూల ప్రభావం దేశీయ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. క్యూ3 ఆర్థిక ఫలితాల సీజన్ కొనసాగుతున్నందున స్టాక్, రంగాల ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. కొంత కాలం నిఫ్టీ 17,800–18,250 పరిధిలోనే ట్రేడవుతోంది. ఈ వారంలోనూ అదే శ్రేణిలో కదలాడొచ్చు. బడ్జెట్ వెల్లడి తర్వాత తదుపరి మూమెంటమ్ చూడొచ్చు’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. తీవ్ర ఒడిదుడులకులకు లోనవుతూ.., పరిమిత శ్రేణిలో కదలాడిన సూచీలు గతవారం స్వల్ప లాభాలను ఆర్జించగలిగాయి. సెన్సెక్స్ 361 పాయింట్లు, నిఫ్టీ 71 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. ఐటీ, మెటల్, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్, విద్యుత్ స్టాకులకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఎఫ్ఎంసీజీ, ఆటో, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎఫ్ఐఐల బేరీష్ వైఖరి ఈ కొత్త ఏడాదిలో దేశీయ మార్కెట్ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు బేరీష్ వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఈ జనవరి 20 నాటికి రూ.15,236 కోట్ల షేర్లను అమ్మేశారు. చైనా లాక్డౌన్ ఎత్తివేతతో ఎఫ్ఐఐల అక్కడి మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా అడుగులేస్తుంనే భయాలు ఇందుకు కారణమయ్యాయి. ఫైనాన్స్, ఐటీ, టెలికాం షేర్లను భారీగా విక్రయిస్తున్నారు. కేవలం మెటల్, మైనింగ్ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదే సమయంలో(జనవరి 21 నాటికి) సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.16,000 వేల షేర్లను కొనుగోలు చేసి మద్దతుగా నిలుస్తున్నారు. ‘‘బడ్జెట్‌పై ఆశలు నెలకొన్నప్పటికీ.., బలహీన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు కారణంగా రానున్న రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ పట్ల బేరీష్ వైఖరినే ప్రదర్శింవచ్చు’’ అని రిలిగేర్ బ్రోకింగ్ సాంకేతిక రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు రిలయన్స్ ఇండస్ట్రీస్ గత శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత క్యూ3 గణాంకాలను వెల్లడించింది. ఈ ఫలితాల ప్రభావం సోమవారం (23న) ట్రేడింగ్‌లో ప్రతిఫలించే అవకాశముంది. ఇదే వారంలోనే యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్‌సహా 300కి పైగా కంపెనీలు తమ మూడో క్వార్టర్ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత కంపెనీల షేర్లు ఒడిదుడుకులకు లోనవచ్చు. ట్రేడర్లు షేరు ఆధారిత ట్రేడింగ్‌కు ఆసక్తి చూపవచ్చు. బుధవారమే ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ఈ గురువారం జనవరి 26 గణతంత్ర దినోవత్సం సందర్భంగా ఎక్సే్చంజీలకు సెలవుకావడంతో బుధవారమే నెలవారీ డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగియనుంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకునే స్క్యేయర్ ఆఫ్ లేదా రోలోవర్ అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చు. నిఫ్టీకి ఎగువ స్థాయిలో 18,100–18,200 శ్రేణిలో నిరోధం, దిగువ స్థాయిలో 18,000–17,800 వద్ద తక్షణ మద్దతు ఉందని ఆప్షన్ డేటా సూచిస్తోంది. ప్రపంచ పరిణామాలు బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య విధాన సమావేశపు నిర్ణయాలు నేడు విడుదల కానున్నాయి. అమెరికాతో పాటు యూరోజోన్ జనవరి తయారీ, సేవా రంగ గణాంకాలు రేపు(మంగళవారం) వెల్లడి కానుంది. యూఎస్ గృహ విక్రయాలు, నిరుద్యోగ గణాంకాలు, క్యూ4 జీడీపీ అంచనా గణాంకాలు గురువారం(జనవరి 26న) విడుదల కానున్నాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే ఈ కీలక స్థూల ఆర్థిక గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. ప్రీ బడ్జెట్ అంచనాలు వచ్చే ఏడాది(2024)లో జరిగే సాధారణ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ ఇది. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించి మూలధన వ్యయానికి భారీగా నిధులు కేటాయించవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. గ్రామీణాభివృద్ధి, రైల్వేలు, రోడ్డు, రక్షణ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చంటున్నారు. బడ్జెట్ సంబంధిత ముఖ్యంగా మౌలిక వసతులు, క్యాపిటల్ గూడ్స్, సిమెంట్, ఎరువుల రంగాల షేర్లలో కదలికలు గమనించవచ్చు. -
నవంబర్‌లో సేవలకు పటిష్ట డిమాండ్
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం నవంబర్‌లో మూడు నెలల గరిష్ట స్థాయికి ఎగసింది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 56.4గా నమోదయ్యింది. అక్టోబర్‌లో ఇది 55.1 వద్ద ఉంది. పీఎంఐ 50 శాతంలోపు ఉంటే క్షీణతగా, ఆపైన ఉంటే వృద్ధి ధోరణిగా పరిగణించడం జరుగుతుంది. ఈ ప్రాతిపదికన దేశ ఎకానమీలో మెజారిటీ పాత్ర పోషిస్తున్న సేవల రంగం వరుసగా 20 నెలల నుంచి వృద్ధి ధోరణిలోనే కొనసాగుతోంది. ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్‌లో ఎకనామిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలియానా డీ లిమా తెలిపిన సమాచారం ప్రకారం, నవంబర్‌లో సేవల రంగానికి పటిష్ట డిమాండ్ నెలకొంది. మార్కెటింగ్, అమ్మకాలు బాగున్నాయి. సేవల రంగం నవంబర్‌లో చక్కటి ఉపాధి అవకాశాలనూ కల్పించింది. అయితే కంపెనీలు అత్యధిక నిర్వహణా వ్యయాలను ఎదుర్కొన్నాయి. సేవలు–తయారీ కలిపినా.. స్పీడే! ఇక తయారీ, సేవల రంగం కలిపిన ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ అక్టోబర్‌లో 55.5గా ఉంటే, నవంబర్‌లో 57.7కు ఎగసింది. ఈ రెండు విభాగాల్లో ప్రైవేటు రంగ క్రియాశీలత పెరిగినట్లు తమ సర్వేలో వెల్లడైనట్లు డీ లిమా తెలిపారు. ఒక్క తయారీ రంగానికి సంబంధించి ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) చూస్తే, నవంబర్‌లో 55.7గా నమోదయ్యింది. అక్టోబర్‌లో ఈ సూచీ 55.3 వద్ద ఉంది. గడచిన మూడు నెలల్లో సూచీ ఈ గరిష్ట స్థాయిల్లో నమోదుకావడం ఇదే తొలిసారి. సూచీ 50పైన ఉంటే వృద్ధిగా, ఆ లోపునకు పడిపోతే క్షీణతగా భావిస్తారు. ఈ ప్రాతిపదికన పీఐఎం వరుసగా 17 నెలల నుంచి వృద్ధి బాటనే పయనిస్తోంది. -
కస్టమర్లకు షాకిస్తున్న బంగారం, వెండి: ఆరు నెలల్లో తొలిసారి!
సాక్షి,ముంబై: బంగారం, వెండి ధరలు భారీ షాకిచ్చాయి. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పుత్తడి ధరలు దూసు కెడుతున్నాయి. ఇటీవల కాస్త స్తబ్దుగా ఉన్న పసిడి ధర భారీగా పెరిగింది. అటు వెండి ధర గణనీయంగా పుంజుకుంది. తాజాగా గ్రాము బంగారం రూ.54 వేల మార్క్‌ను దాటేసింది. దీంతో త్వరలో ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకునే సూచనలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. మరో విలువైన మెటల్ వెండి కూడా ఇదే బాటలో ఉంది. వెయ్యిరూపాయలకు పైగా జంప్ చేసింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో బంగారం ధర 350 రూపాయలకు పైగా పెరిగింది. ఎంసీఎక్స్ ఫిబ్రవరి కాంట్రాక్ట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.362 లేదా 0.67 శాతం పెరిగి రూ. 54212కి చేరుకుంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో కిలో వెండి ధర రూ.850-900 పెరిగింది. ఫిబ్రవరి డెలివరీ వెండి ధర ప్రస్తుతం రూ.851 లేదా 1.28 శాతం పెరిగి కిలో రూ.67300కి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక డిమాండ్ పెరగడం ఈ గణనీయమైన పెరుగుదలకు కారణమని మార్కెట్ వర్గాలు తెలిపాయి. గత ఆరు నెలల్లో ఎంసీఎక్స్ బంగారం ధర రూ.54,000కి చేరడం ఇదే తొలిసారి. (StockMarketUpdate: కోలుకున్న మార్కెట్లు, కుప్పకూలిన రూపాయి) దేశ రాజధానిలో 10 గ్రాముల బంగారం ధర రూ.227 పెరిగి రూ.54,386కి చేరుకుంది. వెండి కూడా కిలోకు రూ.1,166 పెరిగి రూ.67,270కి చేరుకుంది. గ్లోబల్ మార్కెట్లో సానుకూల సంకేతాల మధ్య డిసెంబర్ 5 సోమవారం ముంబై స్పాట్ మార్కెట్లోరం 999 స్వచ్ఛత బంగారం ప్రారంభ ధర 10 గ్రాములకు రూ.53,972గా ఉంది, శుక్రవారం ముగింపు ధర రూ.53,656 నుంచి రూ.316 పెరిగింది. అలాగే 999 స్వచ్ఛత వెండి కిలో రూ. 65,891గా ఉంది. (ఈ స్కీంలో నెలకు రూ. 12,500 పెట్టుబడి పెడితే.. కోటి రూపాయలు) ప్రపంచ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సుకు 11.15 డాలర్లు లేదా 0.62 శాతం పెరిగి 1,820.75 డాలర్ల వద్ద, వెండి ఔన్స్‌కు 0.245 డాలర్లు లేదా 1.01 శాతం బలంతో 23.485 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దీంతో ట్రెండ్ బుల్లిష్‌గా ఉందని బులియన్ వర్తకులు చెబుతున్నారు. డాలర్ బలహీనత కారణంగా, చమురు ధరల సెగ కారణంగా బంగారం ధరలు పెరిగాయని ఎనలిస్టుల అంచనా. (అందాల ఐశ్వర్యమా, కింగ్ లాంటి కుర్రాడా? ఎవరు కావాలి?) -
బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టం ఆర్బీఐ గవర్నర్
ముంబై: అంతర్జాతీయ ప్రతికూలతల వల్ల ఎదుదయ్యే ఎటువంటి సవాళ్లనైనా తట్టుకొనగలిగే శక్తి సామర్థ్యాలను భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ, ఫైనాన్షియల్ మార్కెట్లు కలిగి ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. ఫిక్స్డ్ ఇన్కమ్ మనీ మార్కెట్ అండ్ డెరివేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఫిమ్డా) వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తూ, అంతర్జాతీయ ఒత్తిడులను తట్టుకునేలా అధిక ఫారెక్స్ నిల్వల (26 ఆగస్టు నాటికి 561 బిలియన్ డాలర్లు) పరిస్థితిని పొందడానికి అలాగే భారత్ బ్యాంకింగ్ పటిష్టతకు కేంద్రం, సెంట్రల్ బ్యాంక్ తగిన అన్ని చర్యలూ తీసుకున్నట్లు తెలిపారు. ద్రవ్యోల్బణం దిగివస్తుంది... దేశంలో ద్రవ్యోల్బణం భయాలు క్రమంగా వచ్చే త్రైమాసికాల్లో తగ్గుతాయని అన్నారు. ఇక దేశీయ కరెన్సీ రూపాయి పతనంపై ప్రస్తుతం ఆందోళన చెందాల్సింది ఏమీ లేదని కూడా ఉద్ఘాటించారు. డాలర్ మారకంలో భారత్ కరెన్సీ పతనం విషయంలో పలు వర్థమాన దేశాల కరెన్సీలతో పోల్చితే భారత్ రూపాయి పరిస్థితి మెరుగ్గా ఉందని అన్నారు. అలాగే పలు దేశాల కరెన్సీలతో పోల్చితే రూపాయి విలువ బలపడిందనీ పేర్కొన్నారు. కరెన్సీ తీవ్ర ఒడిదుడుకుల నిరోధానికి తగిన అన్ని చర్యలూ సెంట్రల్ బ్యాంక్ తీసుకుంటుందని అన్నారు. ఇక దేశ పురోగతి, ద్రవ్యోల్బణం కట్టడికి తగిన ద్రవ్య పరపతి విధానాన్ని ఆర్బీఐ అనుసరిస్తుందని పేర్కొన్నారు. సావరిన్ గ్రీన్ బాండ్ల జారీపై ప్రభుత్వం– సెంట్రల్ బ్యాంక్ చర్చలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. రుణ మేళాలతో మొండి బాకీల భారం బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆందోళన ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్వహించే ’రుణ మేళా’లను వ్యతిరేకిస్తున్నట్లు మహారాష్ట్ర స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఎంఎస్బీ ఈఎఫ్) ప్రకటించింది. ఇలాంటి కార్యక్రమాల్లో సరైన మదింపు లేకుండా ఇచ్చే రుణాలు.. మొండిపద్దులుగా పేరుకుపోయే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. రుణగ్రహీతలు ఈ తరహా లోన్లను తిరిగి చెల్లించడాన్ని మానేస్తున్న ట్లు గత అనుభవాలు చెబుతున్నాయని పేర్కొంది. రుణాల రికవరీ ప్రక్రియలో ఏ రాజకీయ పార్టీ కూడా సహకరించదని, ఎన్నికల సమయంలో మాత్రం ఓటర్లను ఆకట్టుకునేందుకు రుణాల మాఫీ డిమాండ్‌ను తెరపైకి తెస్తుంటాయని ఎంఎస్‌బీఈఎఫ్ వ్యాఖ్యానించింది. మొండిబాకీల ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులను సంక్షోభంలోకి నెట్టి, దాన్ని సాకుగా చూపి ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది. -
ప్రపంచ పరిణామాలు, విదేశీ పెట్టుబడులు కీలకం
ముంబై: దేశీయంగా ట్రేడింగ్ ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో ఈ వారం ప్రపంచ పరిణా మాలు, విదేశీ పెట్టుబడుల సరళీ స్టాక్ సూచీలకు దిశానిర్ధేశం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. డాలర్ మారకంలో రూపాయి క్రూడాయిల్ ధరలు కదలికలపై మార్కెట్ వర్గాలు కన్నేయోచ్చంటున్నా రు. ‘‘దేశీయంగా పండుగ సీజన్ సందర్భంగా డిమాండ్, మార్జిన్లపై యాజమాన్యపు వ్యాఖ్యలు, ప్రభుత్వ మూల ధన వ్యయం, గ్రామీణ వృద్ధి తది తర అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించే వీలుంది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరల కదలికలు, ఆర్థిక వృద్ధి, సెంట్రల్ బ్యాంకుల ద్రవ్య విధాన నిర్ణయాలు ఈక్విటీ మార్కెట్ల ట్రేడింగ్‌పై ప్రభావం చేయవచ్చు. అమ్మకాలు కొనసాగితే నిఫ్టీకి 17,450 వద్ద తొలి మద్దతు, ఈ స్థాయిని కోల్పోయితే 17,250–17, 150 శ్రేణిలో మరో తక్షణ మద్దతు స్థాయి లభించొచ్చు. ఎగువ స్థాయిలో 17,700 వద్ద నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది’’ అని శామ్కో సెక్యూరిటీస్ మార్కెట్ హెడ్ అపూర్వ సేథ్ తెలిపారు. ఫెడ్ వడ్డీరేట్ల పెంపు భయాలు మరోసారి తెరపైకి రావడంతో పాటు దేశీయ జూన్ క్వార్టర్ జీడీపీ గణాంకాలు అంచనాలను అందుకోలేకపోవడంతో గతవారం సూచీలు స్వల్ప నష్టంతో ముగిశాయి. ట్రేడింగ్ నాలుగురోజులే జరిగిన గత వారంలో సెన్సెక్స్ 31 పాయింట్లు, నిఫ్టీ 19 పాయింట్లను కోల్పోయాయి. ప్రపంచ పరిణామాలు యూరోజోన్‌తో పాటు చైనా, జపాన్ దేశాల ఎస్అండ్పీ గ్లోబల్ సర్వీసెస్ కాంపోసైట్ పీఎంఐ డేటా నేడు(సోమవారం) విడుదల అవుతుంది. అమెరికా సర్వీసెస్ పీఎంఐ గణాంకాలను మంగళవారం వెల్లడించనుంది. యూరోజోన్ జూన్ క్వార్టర్ జీడీపీ, చైనా వాణిజ్య గణాంకాలు బుధవారం వెలువడుతాయి. అదేరోజున ఈసీబీ వడ్డీరేట్ల ప్రకటన, ఫ్రాన్స్ ట్రేడ్ డేటా, జపాన్ జీడీపీ గణాంకాలు, అమెరికా నిరుద్యోగ గణాంకాలు గురువారం విడుదల అవుతాయి. చైనా ద్రవ్యోల్బణ డేటాను శుక్రవారం ప్రకటించనుంది. కీలకమైన ఈ స్థూల ఆర్థిక గణాంకాల నుంచి ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేసే ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక స్థితిగతులు అంశాలపై ఒక అంచనాకు రావచ్చు. 20 నెలల గరిష్టానికి విదేశీ పెట్టుబడులు ఇన్వెస్టర్లలో రిస్క్ తీసుకునే సామర్థ్యం పెరగడం, క్రూడాయిల్ ధరల స్థిరీకరణల ప్రభావంతో ఆగస్టులో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు(ఎఫ్‌పీఐ) భారత ఈక్విటీల్లో రూ. 51,200 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇది 20 నెలల్లోనే అత్యధికమని డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. 2020, డిసెంబర్లో వచ్చిన రూ. 62,016 కోట్ల పెట్టుబడుల తర్వాత ఇదే అత్యధికం. అంతకుముందు జూలైలో ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 5,000 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. గతేడాది (2021) అక్టోబర్ నుంచి తొమ్మిది నెలల పాటు ఎఫ్‌పీఐలు మొత్తం రూ. 2.46 లక్షల కోట్లను ఉపసంహరించుకున్నారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో భారత మార్కెట్లపై విదేశీ పెట్టుబడిదారులు ఆసక్తిగా ఉన్నారు. ‘‘యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు కొనసాగుతుందనే స్పష్టత వచ్చింది. ఆగస్టుతో పోలిస్తే పెట్టుబడుల వేగం తగ్గినప్పటికీ ప్రస్తుత నెల(సెప్టెంబర్)లోనూ ఎఫ్‌పీఐ నిధుల రాక కొనసాగవచ్చు. అధిక ద్రవ్యోల్బణం, డాలర్ మారకం, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు ఎఫ్‌పీఐలను ప్రభావితం చేస్తాయి’’ అని ట్రేడ్‌స్మార్ట్ చైర్మన్ విజయ్ సింఘానియా తెలిపారు. నేటి నుంచి తమిళ్ మెర్కంటైల్ బ్యాంక్ ఐపీవో తమిళనాడు మెర్కంటైల్ బ్యాంక్ పబ్లిక్ ఇష్యూ నేడు ప్రారంభం కానుంది. మూడురోజుల పాటు జరిగే ఈ ఐపీఓ సెప్టెంబర్ 7న ముగుస్తుంది. ధరల శ్రేణి రూ. 500 – 525గా ఉంది. గతవారాంతాన యాంకర్ ఇన్వెస్టర్లకు రూ.363 కోట్ల విలువైన షేర్లను జారీ చేసింది. ఇష్యూలో భాగంగా 1.58 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 832 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. -
నష్టాల్లో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు
బ్యాంకాక్: ప్రపంచ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా జూలై పారిశ్రామికోత్పత్తి, రిటైల్ విక్రయ గణాంకాలు నిరాశపరచడంతో సోమవారం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. చైనా ఎక్సే్చంజీ షాంఘై సూచీ ఒక పాయింటు స్వల్ప నష్టపోయి 3,276 వద్ద ఫ్లాటుగా ముగిసింది. సింగపూర్, ఇండోనేషియా మార్కెట్లు సైతం 0.50–0.20% మధ్య నష్టపోయాయి. తైవాన్, దక్షిణ కొరియా, థాయిలాండ్ అతి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. కాగా జపాన్ స్టాక్ ఎక్సే్చంజీ సూచీ నికాయ్ ఒకశాతం లాభపడి ఏడు నెలల గరిష్టం 28,871 స్థాయి వద్ద స్థిరపడింది. కోవిడ్ ఆంక్షల సడలింపుతో రెండో క్వార్టర్ నుంచి తమ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని అక్కడి అధికార వర్గాల ప్రకటన మార్కెట్ ర్యాలీకి కారణమైంది. చైనా ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్నట్లు సంకేతాలు రావడంతో యూరప్ మార్కెట్లు సైతం బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ఫ్రాన్స్, జర్మన్ దేశాల స్టాక్ సూచీలు 0.14–0.16 % మధ్య నష్టపోయాయి. బ్రిటన్ ఇండెక్స్ ఎఫ్టీయస్సీ పావుశాతం పతమైంది. ఆర్థిక అగ్రరాజ్యం అమెరికా మార్కెట్లు ఈ వారం నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. క్రూడాయిల్ ధరల పతనం, ఆర్థిక మాంద్య భయాలతో పాటు నాలుగు వారాల వరుస ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు. -
పోకో సరికొత్త స్మార్ట్‌ఫోన్, స్పెషల్ ఫీచర్లతో
సాక్షి,ముంబై: పోకో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్‌గా లాంచ్ చేయనుంది. జూన్ 23 సాయంత్రం వర్చువల్ ఈవెంట్లో పోకో ‘ఎఫ్ 4 5జీ’ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. పోకో బ్రాండింగ్‌తో ఫ్లాట్ బాడీ రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఇది అందుబాటులోకి రానుంది. అంతేకాదు వ్లాగ్ మోడ్ కొత్త తరం ఫిల్మ్ మేకర్స్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేస్తున్నట్టు పోకో ట్వీట్ చేసింది. ఫీచర్లు, అంచనాలు ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్లు రెడ్మి కే40ఎస్కి దగ్గరగా ఉంటాయని భావిస్తున్నారు. దీంతో పాటు 7లేయర్ గ్రాఫైట్ షీట్ల లిక్విడ్ కూల్ 2.0, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో కూడిన స్టీరియో స్పీకర్లు , 67W ఫాస్ట్ ఛార్జింగ్ ఇతర ప్రధాన ఫీచర్లుగా ఉంటాయట. బ్లాక్ అండ్ గ్రీన్ రంగులలో ఇది లభ్యం కానుంది. ఆండ్రాయిడ్ 12 OS ఆధారిత ఎంఐయుఐ 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన అమెలెడ్ డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 SoC 12 జీబీ ర్యామ్, 126 జీబీ స్టోరేజ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో 64 ఎంపీ మెయిన్‌గా, ట్రిపుల్ కెమెరా, దీంతోపాటు పోకో ఎక్స్ 4జీటీ అనే మరో స్మార్ట్‌ఫోన్‌ను కూడా లాంచ్ చేయనున్నట్టు పోకో ట్విటర్ ద్వారా వెల్లడించింది. A new thinnest #POCOF4 that's sure to make some big waves. Watch our global launch event on June 23rd for more. See you in two days. #AllTheStrengths pic.twitter.com/6umW3TrZti — POCO (@POCOGlobal) June 21, 2022 పోకో ఎక్స్ 4 జీటీ ఫీచర్లు 6.6అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే మీడియా టెక్ డైమెన్సిటీ 8100 SOC 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 20 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 64ఎంపీ రియర్ కెమెరా 5080 ఎంఏహెచ్ బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ Every action will feel a lot more magical when you record moments using Clone Mode on the POCO F4 5G. Get ready to create even cooler videos starting 23-06-2022 - https://t.co/k1MjtkjFVq pic.twitter.com/XZw58DHRaT — POCO India (@IndiaPOCO) June 21, 2022 -
భారీగా క్షీణించిన వెండి, బంగారం ధరలు, కారణం ఏమిటంటే
సాక్షి,ముంబై: ఇటీవలి కాలంలో ఆకాశానికి చేరిన బంగారం ధరలు గ్లోబల్ మార్కెట్ల సంకేతాలతో దిగి వస్తున్నాయి. బంగారం ధరలతోపాటు వెండి ధర కూడా మంగళవారం క్షీణించింది. అంతర్జాతీయంగా ధరలు ఏడు రోజుల కనిష్టానికి చేరగా, దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర ఏకంగా వెయ్యి రూపాయలు పతనమైంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర 52,760 వద్ద ఉంది. వెండి ధర కిలోకి 1500 రూపాయలు క్షీణించి 61,500గా ఉంది. దేశీయ మార్కెట్లలో మే నెల అంతా వెండి బంగారం ధరలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. రెండు రోజుల క్రితం నెల రోజుల గరిష్టాన్ని తాకిన పసిడి ధర ఈ రెండు రోజుల్లో రూ.1300 మేర తగ్గడం విశేషం. అటు ఎంసీఎక్స్ గోల్డ్ ఆగస్ట్ ఫ్యూచర్స్ 0.4 శాతం క్షీణించి10 గ్రాముల ఇంట్రాడే కనిష్ట స్థాయి రూ.50,445కి చేరుకుంది. వెండి ధరలు కూడి ఇద్దే బాట పట్టాయి. జూలై ఫ్యూచర్స్ 0.7 శాతం తగ్గి కిలోకు రూ. 59,867 వద్దకు పడిపోయింది. యూఎస్ ఫెడ్ తన వడ్డీ రేటును దాదాపు 50 బీపీఎస్ పాయింట్లు పెంచననుందని ఇదిడాలర్కు మరింత బలమని పెట్టబడిదారులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణ నియంత్రణకోసమే వడ్డీ రేటును పెంచనుందని అంచనా. ఇది పసిడి ధరలకు నెగిటివ్‌గా ఉంటుందని, ఈ స్థాయిలలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. చైనాలో మాంద్యం భయాలు, రికార్డు స్థాయికి బలపడుతున్న డాలరు, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక వారం కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. మరోవైపు తాజా కోవిడ్ ఆంక్షలతో గ్లోబల్‌గా ఆయిల్ ధరలు లాభనష్టాల మధ్య ఊగిస లాడాయి. గత సెషన్లో 78.03 వద్ద స్థిరపడిన దేశీయ కరెన్సీ రూపాయి మంగళవారం అమెరికా డాలర్‌తో 78.02 వద్ద ప్రారంభమై 77.98 వద్ద ముగిసింది. ఇక డాలర్ 20 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది. అటు స్టాక్మార్కెట్లో సోమవారం నాటి బ్లడ్ బాత్ ఛాయలు మంగళవారం కూడా కనిపించాయి. రోజంతా లాభనష్టాల మధ్య ఊగిస లాడిన సూచీలు చివరకు కనీస మద్దతు స్థాయిలకు దిగువన ముగిసాయి. -
తగ్గిన బంగారం, భారీగా తగ్గిన వెండి ధర
సాక్షి,ముంబై: గ్లోబల్ మార్కెట్ల సంకేతాలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ పుంజుకున్న నేపథ్యంలో మంగళవారం దేశీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అటు మరో విలువైన మెటల్ వెండి ధర కూడా భారీగా తగ్గింది. ఈ వారం చివర్లో అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో వ్యాపారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. ఎంసీఎక్స్‌లో బంగారం10 గ్రాముల ధర రూ. 50,862గా ఉండగా, వెండి కిలో ధర 61,830కి చేరుకుంది. అటు హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్స్ పసిడి ధర 270 రూపాయలు తగ్గి 51,930గా ఉంది. వెండి కిలో ధర సుమారు 800 రూపాయలు తగ్గి రూ. 67770 పలుకుతోంది. గ్లోబల్ మార్కెట్లలో పసిడి ఔన్సు ధర 1842 డాలర్ల వద్ద వారం కనిష్టానికి చేరింది. వెండి 0.6 శాతం పడి 21.92 డాలర్లుగా ఉంది. గత నెలకు సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణం 5.5శాతంగా ఉండొచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ అంచనా వేస్తుండగా, 6శాతానికి పైనే నమోదు కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా అధిక చమురు ధరల రూపంలో రిస్క్ ఉంటుందని అంచనా. పెరుగుతున్న ఇంధన ధరలు, ఉక్రెయిన్ ధాన్యం ఎగుమతుల అనిశ్చితి, ఉత్తర కొరియా టెన్షన్‌లాంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు తోడు ప్రపంచవృద్ధి ఆందోళనల మధ్య పసిడి ధర 1850 డాలర్లు సమీపంలో కదలాడవచ్చని, అయితే అమెరికా డాలర్ బలం గోల్డ్ ధరలపై ఒత్తిడిని కొనసాగుతుందని కోటక్ సెక్యూరిటీస్‌లోని విపి- హెడ్ కమోడిటీ రీసెర్చ్ రవీంద్ర రావు అన్నారు. #Gold and #Silver Opening #Rates for 07/06/2022#IBJA pic.twitter.com/BYWCDRNpYu — IBJA (@IBJA1919) June 7, 2022 -
గ్లోబల్ మార్కెట్లపై గోధుమ ఎగుమతుల నిషేధ ప్రభావం నిల్: కేంద్ర మంత్రి
దావోస్: భారతదేశ గోధుమ ఎగుమతులు ప్రపంచ వాణిజ్యంలో ఒక శాతం కంటే తక్కువగా ఉన్నాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ కమోడిటీ ఎగుమతులను నియంత్రించాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రపంచ మార్కెట్లపై ఎంతమాత్రం ప్రభావం చూపదని ఆయన స్పష్టం చేశారు. బలహీన అలాగే పొరుగు దేశాలకు ఎగుమతులను భారతదేశం కొనసాగిస్తుందని కూడా ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అంతర్జాతీయ గోధుమల మార్కెట్లో భారతదేశం ఎప్పుడూ కీలకప్రాత్ర పోషించలేదని వివరించారు. ఇంకా చెప్పాలంటే రెండేళ్ల క్రితం వరకూ భారత్ గోధుమలను ఎగుమతే చేయలేదని తెలిపారు. దేశం 2 మిలియన్ టన్నులతో ఎగుమతులను ప్రారంభించిందని, గత సంవత్సరం ఈ పరిమాణం ఏడు మిలియన్ టన్నులుగా ఉందని గోయల్ చెప్పారు. ఉక్రెయిన్–రష్యాల మధ్య యుద్ధ పరిస్థితి ఏర్పడిన తర్వాత గత రెండు నెలల్లో దేశ గోధుమ ఎగుమతులు పెరిగినట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో జరిగిన సెషన్లో అన్నారు. మొదట్లో ఉత్పత్తి దాదాపు 7 లేదా 8 శాతం పెరుగుతుందని భారత్ అంచనా వేసిందన్నారు. కానీ, దురదృష్టవశాత్తు ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలలో చాలా తీవ్రమైన వేడి వాతావరణం వల్ల ఉత్పత్తిని కోల్పోయిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పెరుగుతున్న దేశీయ ధరలను నియంత్రించడానికి, అలాగే పొరుగు, బలహీన దేశాల ఆహార ధాన్యాల అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం గోధుమ ఎగుమతులను మే 13న నిషేధించింది. అయితే, ఇతర దేశాల (వారి ప్రభుత్వాల అభ్యర్థన ఆధారంగా) ఆహార భద్రత అవసరాలను తీర్చడానికి, ప్రభుత్వం అనుమతుల మేరకు ఎగుమతులకు వెసులుబాటు కల్పించింది. ఉత్పత్తి-గుమతి ఇలా... 2021–22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ గోధుమల ఎగుమతులు 7 మిలియన్ టన్నులు. దీని విలువ 2.05 బిలియన్ డాలర్లు. విదేశాల నుండి భారత్ గోధుమలకు మెరుగైన డిమాండ్ ఉంది. మొత్తం గోధుమ ఎగుమతుల్లో 50 శాతం సరుకులు గత ఆర్థిక సంవత్సరంలో బంగ్లాదేశ్‌కు ఎగుమతయ్యాయి. గోధుమ పంటపై మే 14న వ్యవసాయ కార్యదర్శి మనోజ్ అహుజా ప్రకటన ప్రకారం, 2021–22 పంట సంవత్సరంలో (జూలై–జూన్) దిగుబడి అంచనా పరిమాణం 111.32 మిలియన్ టన్నులు. అయితే 105–106 మిలియన్ టన్నులకు పరిమితం అయ్యే పరిస్థితి నెలకొంది. 2020–21 పంట కాలంలో ఉత్పత్తి 109 మిలియన్ టన్నులు. India wheat exports are less than 1% of world trade and our export regulation should not affect global markets. We continue to allow exports to vulnerable countries and neighbors. pic.twitter.com/N61929BNt5 — Piyush Goyal (@PiyushGoyal) May 25, 2022