గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఇప్పటికే అనేక సంస్థలు ఈవీలను లాంచ్ చేసి ఉత్తమ అమ్మకాలను పొందుతున్నాయి. ఇప్పటి వరకు హోండా మాత్రం ప్యూర్ ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయలేదు. అయితే ఈ సంస్థ 2030 నాటికి ఏడు 0 సిరీస్ మోడళ్లను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నద్ధమైంది.
హోండా కంపెనీ లాంచ్ చేయనున్న 7 మోడల్స్ 480 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందించేలా రూపొందిస్తోంది. జపనీస్ ఆటో మేకర్ లాంచ్ చేయనున్న 0 సిరీస్ మోడల్స్ సరికొత్త బెస్పోక్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా తయారవుతాయి. ఈ ఎలక్ట్రిక్ కార్ల బాడీ ఫ్రేమ్‌లు తేలికగా ఉంటాయని తెలుస్తోంది. అంతే కాకుండా డిజైన్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది.
హోండా లాంచ్ చేయనున్న 0 సిరీస్ కార్లు మంచి డిజైన్ కలిగి ఉండటమే కాకుండా.. లెవెల్ 3 ADAS టెక్నాలజీని కూడా పొందుతాయని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.
0 సిరీస్ కింద లాంచ్ కానున్న మొదటి ఎలక్ట్రిక్ కారు CES.. ఇప్పటికే ఈ కారు లాస్ వెగాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కనిపించింది. దీన్ని బట్టి చూస్తే.. హోండా లాంచ్ చేయనున్న కార్లు ఎలా ఉండబోతున్నాయనేది స్పష్టమైపోతోంది. కాగా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ రోజు రోజుకు ఊపందుకుంటున్న తరుణంలో హోండా భారీ పెట్టుబడులను పెట్టడానికి యోచిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment