Honda
-
హోండా, నిస్సాన్ విలీనం.. టయోటాకు గట్టిపోటీ తప్పదా?
ఆటోమొబైల్ పరిశ్రమలో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రెండు దిగ్గజ కంపెనీలు విలీనం దిశగా అడుగులు వేస్తున్నాయి. జపాన్‌లో రెండు, మూడో స్థానాల్లో ఉన్న హోండా మోటార్ , నిస్సాన్ మోటార్ సంస్థలు విలీనాన్ని అన్వేషిస్తున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇది వాస్తవ రూపం దాల్చితే జపనీస్ ఆటోమోటివ్ పరిశ్రమ పూర్తీగా మారిపోతుంది. టయోటా మోటార్ కార్పొరేషన్‌కు గట్టి పోటీ తప్పదని భావిస్తున్నారు.బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ ప్రకారం.. ఇరు కంపెనీల మధ్య చర్చలు ప్రాథమిక స్థాయిలో ఉన్నాయి. పూర్తీగా విలీనం చేయాలా లేదా మూలధనాన్ని పంచుకోవాలా లేదా హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేయాలా అని యోచిస్తున్నాయి. చర్చల నివేదికలు వెలువడిన తర్వాత హోండా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షింజీ అయోమా స్పందిస్తూ కంపెనీ పలు వ్యూహాత్మక అవకాశాలను పరిశీలిస్తోందని, అందులో ఈ విలీనం ప్రతిపాదన కూడా ఉందని ధ్రువీకరించారు.అంతర్గత వర్గాల సమాచారం మేరకు.. విలీనం తర్వాత రెండు సంస్థల సంయుక్త కార్యకలాపాలను నిర్వహించడానికి కొత్త హోల్డింగ్ కంపెనీని స్థాపించడం అనేది పరిశీలనలో ఉన్న ఒక ప్రతిపాదన. నిస్సాన్‌తో ఇప్పటికే మూలధన సంబంధాలను కలిగి ఉన్న మిత్సుబిషి మోటార్స్ కార్ప్ని కూడా ఈ డీల్‌లో చేర్చవచ్చు. అయితే దీనికి సంబంధించిన చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఇది పూర్తి స్థాయి ఒప్పందంగా మారుతుందా లేదా అన్నది అస్పష్టంగా ఉంది.ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే, అది జపాన్ ఆటో రంగాన్ని రెండు ఆధిపత్య సమూహాలుగా ఏకీకృతం చేస్తుంది. హోండా, నిస్సాన్, మిత్సుబిషి ఒక గ్రూప్‌గా, టయోటా, దాని అనుబంధ సంస్థలు మరో సమూహంగా ఉంటాయి. ఈ ఏకీకరణ విలీన సంస్థ ప్రపంచ పోటీతత్వాన్ని బలోపేతం చేయగలదు. బ్యాటరీలు, సాఫ్ట్‌వేర్‌పై హోండా, నిస్సాన్ మధ్య ఇది వరకే సహకారం కుదిరిన విషయం తెలిసిందే. విలీన చర్చల వార్తల తరువాత బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో నిస్సాన్ షేర్లు 24% వరకు పెరిగగా హోండా షేర్లు 3.4% తగ్గాయని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. -
భారత్‌లో అత్యంత ఖరీదైన బైకులు ఇవే! (ఫోటోలు)
-
హ్యాండిల్, సీటు లేని హోండా ఇంజిన్!
-
అర్థం కాని.. అత్యద్భుతమైన మోటార్‌సైకిల్స్ (ఫోటోలు)
-
90వేల కార్లు వెనక్కి: హోండా కీలక ప్రకటన
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా 90వేల కంటే ఎక్కువ యూనిట్ల వాహనాలకు రీకాల్ ప్రకటించింది. 'ఫ్యూయల్ పంప్లో సమస్య' కారణంగా కంపెనీ ఈ రీకాల్ ప్రకటించింది. ఈ సమస్య ఇంజిన్ ఆగిపోయేలా చేస్తుంది. ఈ రీకాల్ ద్వారా హోండా దీనిని పరిష్కరిస్తుంది.2024 నవంబర్ 5 నుంచి భారతదేశం అంతటా దశలవారీగా కంపెనీ సమస్య ఉన్న కారులోని భాగాలను గుర్తించి ఉచితంగా భర్తీ చేస్తుంది. ఇప్పటికే యజమానులు వ్యక్తిగతంగా సంప్రదిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. జూన్ 2017 - అక్టోబర్ 2023 మధ్య కాలంలో హోండా కార్స్ అధీకృత డీలర్‌షిప్‌ల నుండి ఓవర్-ది-కౌంటర్ సేల్స్ ద్వారా ఫ్యూయల్ పంప్ అసెంబ్లీని కొనుగోలు చేసిన కస్టమర్లు కూడా తమ వాహనాన్ని అధీకృత సర్వీస్ సెంటర్లో తనిఖీ చేసుకోవాలని కంపెనీ పేర్కొంది.రీకాల్ అనేది అమేజ్ (18,851 యూనిట్లు), బ్రియో (3,317 యూనిట్లు), బీఆర్-వీ (4,386 యూనిట్లు), సిటీ (32,872 యూనిట్లు), జాజ్ (16,744 యూనిట్లు), డబ్ల్యుఆర్-వీ (14,298 యూనిట్లు) కార్లను ప్రభావితం చేస్తుంది.హోండా కార్స్ ఇండియా వెబ్‌సైట్‌లోని సర్వీస్ ట్యాబ్ ద్వారా ప్రోడక్ట్ అప్డేట్/రీకాల్ పేజీని సందర్శించి, వారి కారు 'వీఐఎన్'ను ఫిల్ చేయడం ద్వారా కస్టమర్లు తమ వాహనం రీకాల్ వల్ల ప్రభావితమైందో లేదో తనిఖీ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. -
హోండా 0 సిరీస్ ఎలక్ట్రిక్ కార్లు.. 500 కిమీ టార్గెట్!
గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఇప్పటికే అనేక సంస్థలు ఈవీలను లాంచ్ చేసి ఉత్తమ అమ్మకాలను పొందుతున్నాయి. ఇప్పటి వరకు హోండా మాత్రం ప్యూర్ ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయలేదు. అయితే ఈ సంస్థ 2030 నాటికి ఏడు 0 సిరీస్ మోడళ్లను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నద్ధమైంది.హోండా కంపెనీ లాంచ్ చేయనున్న 7 మోడల్స్ 480 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందించేలా రూపొందిస్తోంది. జపనీస్ ఆటో మేకర్ లాంచ్ చేయనున్న 0 సిరీస్ మోడల్స్ సరికొత్త బెస్పోక్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా తయారవుతాయి. ఈ ఎలక్ట్రిక్ కార్ల బాడీ ఫ్రేమ్‌లు తేలికగా ఉంటాయని తెలుస్తోంది. అంతే కాకుండా డిజైన్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది.హోండా లాంచ్ చేయనున్న 0 సిరీస్ కార్లు మంచి డిజైన్ కలిగి ఉండటమే కాకుండా.. లెవెల్ 3 ADAS టెక్నాలజీని కూడా పొందుతాయని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.0 సిరీస్ కింద లాంచ్ కానున్న మొదటి ఎలక్ట్రిక్ కారు CES.. ఇప్పటికే ఈ కారు లాస్ వెగాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కనిపించింది. దీన్ని బట్టి చూస్తే.. హోండా లాంచ్ చేయనున్న కార్లు ఎలా ఉండబోతున్నాయనేది స్పష్టమైపోతోంది. కాగా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ రోజు రోజుకు ఊపందుకుంటున్న తరుణంలో హోండా భారీ పెట్టుబడులను పెట్టడానికి యోచిస్తున్నట్లు సమాచారం. -
సీఈఎస్ వేదికపై అట్రాక్ట్ చేస్తున్న 'అఫీలా' కారు - వివరాలు
అంతర్జాతీయ మార్కెట్లో రోజు రోజుకి కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఈ రోజు నుంచి లాస్ వెగాస్‌లో ప్రారంభమైన సీఈఎస్ 2024 వేదికగా మరిన్ని కొత్త వాహనాలు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. లాస్ వేగాస్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్లో 'సోనీ' (Sony) కంపెనీ ఓ సరికొత్త ఎలక్ట్రిక్ కారుని ప్రదర్శించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గత కొన్ని సంవత్సరాలుగా సోనీ, హోండా కలిసి 'అఫీలా' (Afeela) అనే కొత్త కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి. ఆ కారుని కంపెనీ ఎట్టకేలకు ఈ CES 2024 వేదికగా ప్రదర్శించింది. ఇక్కడ కనిపించే కారు కేవలం డెమో కోసం మాత్రమే అని, రానున్న రోజుల్లో టెస్టింగ్ వంటివి నిర్వహించి మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ 'ఇజుమి కవానిషి' ప్రకారం, ఈ కారు 2025 చివరి నాటికి లేదా 2026 ప్రారంభం నాటికి మార్కెట్లో లాంచ్ అవుతుంది, ఈ కారు లాంచ్ అయిన తరువాత మరిన్ని ఉత్పత్తులు పుట్టుకొస్తాయని వెల్లడించారు. ఇదీ చదవండి: వాచ్‌మెన్‌కు ఇప్పుడే సారీ చెప్పు.. ఆకాశ్‌ను ఆదేశించిన ముకేశ్ అంబానీ - ఎందుకంటే? అఫీలా (Afeela) కారు అద్భుతమైన డిజైన్ పొందనున్నట్లు తెలుస్తోంది. ఇది 3డీ గ్రాఫిక్స్, విజువల్స్ కలిగి మల్టిపుల్ కెమెరా సెటప్ వంటి వాటిని కలిగి ఉంటుంది. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా.. ఇందులో ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉంటాయని చెబుతున్నారు. కంపెనీ ఈ కారుకు సంబంధించిన చాలా విషయాలను రానున్న రోజుల్లో వెల్లడించనుంది. అయితే ఈ మోడల్ భారతీయ తీరానికి చేరుకుంటుందా? లేదా?.. ఒక వేళా ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయితే ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. -
కొత్త కారు కష్టమే..! పెరగనున్న ఆ బ్రాండ్ ధరలు
2023 ముగియడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. రానున్న కొత్త సంవత్సరంలో ఆటోమొబైల్ సెక్టార్‌లోని చాలా కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచడానికి చూస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2024 ప్రారంభం నుంచి 'హోండా కార్స్ ఇండియా' (Honda Cars India) కార్ల ధరలను పెంచనున్నట్లు తెలిపింది. ముడిసరుకుల ధరలు పెరగటం వల్ల ధరల పెరుగుదల తప్పడం లేదని కంపెనీ స్పష్టం చేసింది. ధరల పెరుగుదల ఎంత శాతం అనే వివరాలు ఈ నెల చివరి నాటికి వెల్లడించనున్నట్లు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ 'కునాల్ బెహ్ల్' వెల్లడించారు. భారతీయ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు వెళుతున్న హోండా.. తమ ఉత్పత్తుల ధరలను పెంచినట్లయితే అమ్మకాల మీద ప్రభావం ఏర్పడే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు, కానీ హోండా బాటలోనే మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా, ఆడి వంటి కంపెనీలు నడుస్తుండటంతో సేల్స్ మీద ప్రభావం పెద్దగా ఉండక పోవచ్చని తెలుస్తోంది. ఇదీ చదవండి: చైనా వద్దు భారత్ ముద్దు.. ఇండియాపై పడ్డ అమెరికన్ కంపెనీ చూపు.. దేశీయ దిగ్గజం టాటా మోటార్స్, జర్మన్ బేస్డ్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ కూడా తమ ఉత్పత్తుల ధరలను 2024 ప్రారంభం నుంచి పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదే నిజమైతే టాటా, బెంజ్ కార్లు కొత్త సంవత్సరంలో ఖరీదైనవిగా మారతాయి. -
కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. అదిరిపోయే ఆఫర్స్ వచ్చేశాయ్!
భారతదేశంలో పండుగ సీజన్ ప్రారంభమైపోయింది. ఇక రానున్నది విజయ దశమి. ఈ సందర్భంగా చాలామంది వాహన కొనుగోలుదారులు కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు వాహన తయారీ సంస్థలు అద్భుతమైన డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ అందిస్తున్నాయి. ప్రస్తుతం డిస్కౌంట్స్ అందిస్తున్న కార్ల కంపెనీల జాబితాలో మారుతి సుజుకి, హ్యుందాయ్, హోండా వంటివి ఉన్నాయి. హోండా కంపెనీకి చెందిన సిటీ, అమేజ్ వంటి కార్ల మీద డిస్కౌంట్స్ అందిస్తోంది. హోండా సిటీ కారు మీద రూ. 75,000 వరకు ప్రయోజనాలు, అమేజ్ మీద రూ. 57,000 బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ ఆఫర్ కేవలం ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. హ్యుందాయ్ కంపెనీ విషయానికి వస్తే, ఇప్పుడు సంస్థ ఐ10 ఎన్ లైన్ మీద రూ. 50000, గ్రాండ్ ఐ నియోస్ మీద రూ. 43000, ఆరా మీద రూ. 33000, వెర్నా అండ్ అల్కజార్ మీద వరుసగా రూ. 25000 & రూ. 20000 ప్రయోజనాలను అందిస్తోంది. ఇదీ చదవండి: మామకు తగ్గ మేనల్లుడు.. అర్జున్ కొఠారి ఆస్తులు ఇన్ని కోట్లా? మారుతి సుజుకి కూడా ప్రీ-నవరాత్రి బుకింగ్ స్కీమ్ కింద అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇందులో మారుతి ఇగ్నీస్, బాలెనొ అండ్ సియాజ్ ఉన్నాయి. వీటి మీద కంపెనీ వరుసగా రూ. 65000, రూ. 55000 & రూ. 53000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ బెనిఫిట్స్ కేవలం ఈ నెలలో మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. Note: హ్యుందాయ్, మారుతి సుజుకి, హోండా కంపెనీలు అందిస్తున్న ఈ ఆఫర్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. కావున ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి సమీపంలోని సంస్థ అధీకృత డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
పండుగ సీజన్లో కొత్త కారు కొనాలా? ఎంచుకో ఓ బెస్ట్ ఆప్షన్..
దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో రోజురోజుకి కొత్త కొత్త కార్లు విడుదలవుతూనే ఉన్నాయి. అయితే రానున్న పండుగ సీజన్‌ని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు మరిన్ని లేటెస్ట్ కార్లను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. కాగా ఈ వారం మార్కెట్లో విడుదలైన కార్లు ఏవి? వాటి వివరాలేంటి? అనే మరిన్ని విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హోండా ఎలివేట్ (Honda Elevate) హోండా కంపెనీ గత కొంత కాలంలో దేశీయ విఫణిలో విడుదల చేయాలనుకున్న ఎలివేట్ కారుని ఈ వారం ప్రారంభంలో అధికారికంగా విడుదల చేసింది. ఈ ఇది మొత్తం నాలుగు ట్రిమ్‌లలో మార్కెట్లో లభిస్తుంది. ప్రారంభ ధర రూ. 11 లక్షలు కాగా, టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 16 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. హోండా ఎలివేట్ 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 121 హార్స్ పవర్ అండ్ 145 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్టెప్ CVT ఆటోమేటిక్ పొందుతుంది. డిజైన్ అండ్ ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue ADAS) ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న హ్యుందాయ్ వెన్యూ ఇప్పుడు అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టం (ADAS)తో విడుదలైంది. దీని ధర రూ. 10.33 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారు ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, లేన్ కీపింగ్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్, హై బీమ్ అసిస్ట్ అండ్ లీడింగ్ వెహికల్ డిపార్చర్ అలర్ట్ వంటి వాటితో మరింత సురక్షితమైన వాహనంగా నిలుస్తోంది. వోల్వో సీ40 రీఛార్జ్ (Volvo C40 Recharge) స్వీడిష్ కార్ల తయారీ సంస్థ దేశీయ మార్కెట్లో 'వోల్వో' రూ. 61.25 లక్షల (ఎక్స్-షోరూమ్) ఖరీదైన 'సీ40 రీఛార్జ్' లాంచ్ చేసింది. డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉండే ఈ కారు ఒక సింగిల్ ఛార్జ్ మీద 530 కిమీ కంటే ఎక్కువ పరిధిని అందిస్తుంది. ఇది కేవలం 4.7 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగవంతమవుతుంది. బీఎండబ్ల్యూ 2 సిరీస్ ఎమ్ పర్ఫామెన్స్ ఎడిషన్ (BMW 2 Series M Performance Edition) జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియన్ మార్కెట్లో కొత్త 2 సిరీస్ ఎమ్ పర్ఫామెన్స్ ఎడిషన్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 46 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది పరిమిత సంఖ్యలో మాత్రమే పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంది. ఇందులోని 2.0 లీటర్, నాలుగు-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 179 హార్స్ పవర్, 280 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇదీ చదవండి: జీ20 సమ్మిట్ కోసం భారత్ ఇన్ని కోట్లు ఖర్చు చేసిందా? ఆసక్తికర విషయాలు! హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్ (Hyundai i20 facelift) దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్ ధరలు రూ. 6.99 లక్షల నుంచి రూ. 11.01 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్య ఉంటుంది. ఇది అప్డేటెడ్ ఫ్రంట్ అండ్ రియర్ డిజైన్ కలిగి, కొత్త ఇంటీరియర్ కలర్ స్కీమ్‌తో ఆధునిక హంగులు పొందుతుంది. ఈ ఫేస్‌లిఫ్ట్ ఇప్పుడు 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ మాత్రమే పొందుతుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా CVT ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. -
ఖర్చులు పెరిగిపోతున్నాయ్..కార్ల ధరల్ని పెంచనున్న హోండా
ప్రముఖ జపనీస్ కార్ల తయారీ సంస్థ భారతీయులకు షాకివ్వనుంది. త్వరలో దేశీయంగా హోండా సిటీ సెడాన్, అమేజ్ సబ్ కాంపాక్ట్ మోడల్స్ ధరల్ని పెంచనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. రూ.11.49లక్షల ప్రారంభ ధరతో హోండా ఐదో జనరల్ సిటీ సెడాన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను,హోండా సిటీ హైబ్రిడ్ వర్షన్ ధర రూ.20.39లక్షల వరకు, హోండా సిటీ ప్రస్తుత ప్రారంభ ధర రూ.11.57లక్షలు, హోండా అమేజ్ రూ.7.05లక్షల ధరలతో విడుదల చేసింది. అయితే, పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చుల కారణంగా కార్ల ధరల్ని పెంచేందుకు హోండా సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా సెప్టెంబర్ నుంచి సిటీ, అమేజ్ ధరల పెంపు ఉంటుందంటూ వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ఈ ధరల పెంపుపై హోండా అధికార ప్రకటన చేయాల్సి ఉంది. -
ఫెస్టివల్ సీజన్ వచ్చేస్తోంది...సూపర్ అప్‌కమింగ్ కార్లు
TopUpcomingCars: పండుగల సీజన్ సమీపిస్తున్నతరుణంలో భారత మార్కెట్లోకి కొత్త కార్లు హల్చల్ చేస్తున్నాయి. వినాయక చవితి దసరా, దీపావళి రోజుల్లో కొత్త వాహనాలను కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. పండుగల సీజన్ కార్ల డిమాండ్ నేపథ్యంలో అనేక కంపెనీలు అత్యాధునిక ఫీచర్లు, బడ్జెట్, ఈవీ కార్లు ఇలా రకరకాల సెగ్మెంట్లలో కార్లను లాంచ్ చేస్తుంటారు. ఒకవేళ మీరు కూడా ఈ పండుగ సీజన్లో కొత్త కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, రానున్న రాబోయే మోడళ్ల కార్లను ఓసారి చూద్దాం! Maruti suzuki invicto మారుతి సుజుకి ఇండియా తన లీడర్ మోడల్ - మారుతి సుజుకి ఇన్విక్టో ఎమ్‌పివిని జీటా ఆల్ఫా అనే రెండు వేరియేషన్లలో అందుబాటులో ఉంది. మారుతి ఇన్విక్టో ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో సరిపోలిన 2.0-లీటర్ పెట్రోల్ మోటారును పొందుతుంది. ఎలక్ట్రిక్ మోటార్ 11 బిహెచ్పి ,206 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఐసిఇ వెర్షన్ 172 బిహెచ్పి మరియు 188 ఎన్ఎమ్ టార్క్‌ను కలిగి ఉంది. ధర రూ. రూ. 24.79 లక్షలు 28.42 లక్షలు (ఎక్స్ షోరూం) Honda Elevate హోండా ఎలివేట్ వచ్చే నెల ( సెప్టెంబరు) లో దేశంలో సేల్ కు రానుంది.హోండా ఎలివేట్ 1.5L NA పెట్రోల్ ఇంజన్‌తో 6-స్పీడ్ MT , CVT అనే రెండు ట్రాన్స్మిషన్ ఆప్షన్స్‌లో లభ్యం. దీని ధర రూ. 10.50-17 లక్షలు ఉంటుందని అంచనా. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైడర్, వోక్స్వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్, MG ఆస్టర్ లాంటివాటికి గట్టి పోటీగా ఉండనుంది. Citroen C3 Aircross సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్: 7-సీటర్ SUVని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ బెస్ట్ ఆప్షన్. బోల్డ్ స్టైలింగ్‌తో, బెస్ట్ ఇంటీరియర్‌తో వస్తోంది. అయితే ఇది 1.2L టర్బో-పెట్రోల్ కేవలం ఒక ఇంజన్ ఎంపిక మాత్రమే లభ్యం. దీని ధర రూ. 9-13 లక్షలు ఉంటుందని అంచనా. Toyota Rumion మరో 7-సీటర్ కారు టయోటా రూమియన్. ఈమధ్యనే లాంచ్ అయినా ఈ కారు త్వరలోనే కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. విజువల్ ఫ్రంట్‌లో కొన్ని మార్పులను కలిగి ఉంది. అలాగే రేడియేటర్ గ్రిల్ సవరించిన బంపర్‌తో కొత్తగానూ, అల్లాయ్ వీల్స్ కూడా తాజా డిజైన్‌ను కలిగి ఉన్నాయి. టయోటా లోగో మినహా లోపలి భాగంలో అంతా సేమ్. Tata Punch EV SUV టాటా పంచ్ ఈవీ టియాగో ఈవీ తరహాలో ఇదే ఆర్కిటెక్చర్‌తో పంచ్ ఈవీని విడుదల చేయడానికి టాటా మోటార్స్ సన్నాహాలు చేస్తోంది. ఇది జిప్ట్రాన్ సాంకేతికతతో బానెట్ కింద ఉంచబడిన ఎలక్ట్రిక్ మోటారుతో వస్తోంది. 350 కిమీల పరిధితో లాంచ్ కానుంది. దీని ధర రూ. 9-12 లక్షలు ఉంటుందని అంచనా. Tata Nexon facelift ప్రమోషనల్ షూట్లో అందరి దృష్టినీ ఆకర్షించిన టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఇండియన్ మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఈ సంవత్సరం చివరి నాటికి ఇది మార్కెట్లోకి వస్తుందని తొలుత అనుకున్నప్పటికీ పండుగ సీజన్లోనే దాదాపు అక్టోబరులోనే దీన్ని లాంచ్ చేస్తుందని తాజా అంచనా.దీని ధర రూ. 8-15 లక్షలు ఉంటుందని అంచనా. Volvo C40 Recharge వోల్వో సీ40 రీఛార్జ్ (VolvoC40) XC40 రీఛార్జ్ SUV-కూపే వెర్షన్. మెరుగు పర్చిన 78kWh బ్యాటరీ ప్యాక్‌తో,530కిమీ పరిధిని అందిస్తుంది. 408PSతో డ్యూయల్-మోటార్ AWD కారణంగా 4.7 సెకన్లలో 100kmph వరకు దూసుకెళ్తుంది. అంచనా ధర రూ. 60 లక్షలు (ఎక్స్-షోరూమ్) సెప్టెంబరు 4న లాంచింగ్ -
విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తున్న ఎలివేట్ - బుకింగ్స్ ఎప్పుడంటే?
Honda Elevate Bookings: దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'హోండా ఇండియా' (Honda India) త్వరలోనే 'ఎలివేట్' (Elevate) ఎస్‌యువిని విడుదల చేయడానికి సిద్ధమైంది. కాగా ఇప్పుడు బుకింగ్స్ గురించి అధికారిక సమాచారం వెల్లడించింది. బుకింగ్స్ & లాంచ్ టైమ్ నివేదికల ప్రకారం, హోండా ఎలివేట్ బుకింగ్స్ 2023 జులై 03 నుంచి ప్రారంభమవుతాయి. రూ. 21,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ మిడ్ సైజ్ ఎస్యువి ధరలు ఆగస్ట్ చివరిలో లేదా సెప్టెంబర్ ప్రారంభంలో ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంటే అప్పటికి ఈ కారు భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదలవుతుంది. అంతే కాకుండా ఈ నెల చివరి నాటికి డిస్ప్లే, ఆగష్టు చివరి నాటికి టెస్ట్ డ్రైవ్‌లు ప్రారంభమవుతాయి. వేరియంట్స్ & ఇంజిన్ డీటైల్స్ హోండా ఎలివేట్ నాలుగు ట్రిమ్‌లలో విడుదలయ్యే అవకాశం ఉందని డీలర్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఖచ్చితమైన వివరాలు లాంచ్ నాటికి తెలుస్తాయి. ఎలివేట్ ఎస్యువి 1.5-లీటర్, ఫోర్ సిలిండర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలిగి 121 హార్స్ పవర్, 145 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా ఆప్షనల్ సివిటీ గేర్‌బాక్స్ పొందనుంది. పవర్‌ట్రెయిన్ మాత్రం హోండా సిస్టయి మాదిరిగా ఉంటుందని భావిస్తున్నారు. డిజైన్ & ఫీచర్స్ డిజైన్ అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే.. విశాలమైన ఫ్రంట్ గ్రిల్, మధ్యలో బ్రాండ్ లోగో, హెడ్ లైట్, ఫాగ్ లైట్స్, వంటివి ఇందులో గమనించవచ్చు. ఈ ఎస్యువి 4312 మిమీ పొడవు, 1790 మిమీ వెడల్పు, 1650 మిమీ ఎత్తు, 2650 మిమీ వీల్‌బేస్ కలిగి.. 220 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ పొందుతుంది. కావున పరిమాణం పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. (ఇదీ చదవండి: కనుమరుగవుతున్న 44 ఏళ్ల చరిత్ర.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో హెచ్డీఎఫ్సీ విలీనం!) హోండా ఎలివేట్ సాఫ్ట్ టచ్ ప్యానెల్స్, విశాలమైన సీటింగ్‌తో క్యాబిన్ చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్, 7 ఇంచెస్ సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, లేన్-వాచ్ కెమెరా, వైర్లెస్ ఛార్జింగ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్ప్లే, కొలిషన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్‌తో కూడిన ADAS వంటి ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి. ఇది సింగిల్-పేన్ సన్‌రూఫ్‌ను మాత్రమే పొందుతుంది. (ఇదీ చదవండి: ఈ నెలలో విడుదలైన బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ - వివో వై36 నుంచి వన్‌ప్లస్ నార్డ్ వరకు..) ప్రత్యర్థులు కొత్త హోండా ఎలివేట్ దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మొదలైన కార్లకు ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కారు ధరలు అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ ఇది రూ. 12 లక్షల ధర వద్ద విడుదలయ్యే వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
హోండా కస్టమర్లకు షాక్.. 13 లక్షల కార్లు వెనక్కి!
Honda Recall: ప్రపంచ మార్కెట్లో వాహన వినియోగం రోజురోజుకి పెరుగుతున్న తరుణంలో అనేక కొత్త వాహనాలు విడుదలవుతున్నాయి. అయితే ఈ సమయంలో ప్రముఖ జపనీస్ కార్ల తయారీ సంస్థ 'హోండా' (Honda) సుమారు 13 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. కంపెనీ రీకాల్ ఎక్కడ ప్రకటించింది? దాని వెనుక ఉన్న కారణం ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, హోండా అమెరికాలోనే 12 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. అంతే కాకుండా కెనడా నుంచి 88,000 & మెక్సికోలో 16,000 కార్ల మీద ఈ ప్రభావం పడినట్లు 'నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్' (NHTSA) తెలిపింది. ఇందులో 2018 నుంచి 2023 మధ్య నిర్మించిన 'ఒడిస్సి', 2019 నుంచి 2022 మధ్య తయారైన పైలట్, 2019 - 2023 మధ్య విడుదలైన హోండా పాస్‌పోర్ట్ మోడల్స్ ఉన్నాయి. (ఇదీ చదవండి: పాకిస్థాన్‌లో ఎక్కువ అమ్ముడయ్యే కార్లు - ఇక్కడ చూడండి!) రీకాల్ ప్రకటించడానికి ప్రధాన కారణం.. లోపభూయిష్టమైన కమ్యూనికేషన్ కోక్సియల్ కేబుల్ కనెక్టర్ కలిగి ఉండటం వల్ల 'రియర్ వ్యూ కెమెరా'లో సమస్య ఏర్పడే అవకాశం ఉండటమే. ఈ సమస్యను తొలగించడానికి కంపెనీ రీకాల్ ప్రకటించింది. సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం ఆ సంవత్సరాల్లో ఉత్పత్తయిన కార్లు కలిగిన వినియోగదారులు సమస్యను ఈ రీకాల్ ద్వారా పరిష్కరించుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించవలసిన ఏమిటంటే ఇప్పటి వరకు ఈ సమస్య మీద ఎవరు ఫిర్యాదు చేయలేదు. కానీ ముందుగానే కంపెనీ ఈ సమస్యను పరిష్కరించడం కోసం రీకాల్ ప్రకటించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా రీకాల్ భారతదేశంలో ప్రకటించలేదు. -
హోండా ఎలివేట్ వచ్చేసింది.. 2030కల్లా 5 ఎస్‌యూవీలు
న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ హోండా.. భారత మార్కెట్లో 2030 నాటికి అయిదు కొత్త ఎస్‌యూవీలను పరిచయం చేయనుంది. వీటిలో ఎలివేట్ ఎలక్ట్రిక్ మోడల్ సైతం ఉందని హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో టకుయా సుమురా తెలిపారు. మధ్యస్థాయి ఎస్యూవీ ఎలివేట్‌ను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ఎలివేట్ సాయంతో కంపెనీ తన స్థానాన్ని మరింత బలపర్చుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం సిటీ, అమేజ్ సెడాన్లను భారత్‌లో విక్రయిస్తున్నాం. మొత్తం ప్యాసింజర్ వాహన విభాగంలో సెడాన్ల వాటా 10 శాతమే. ఈ విభాగంలోనే కంపెనీ పోటీపడుతోంది. అలాగే ఈ మోడళ్లు మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నాయి. ఎలివేట్‌ను తొలిసారిగా భారత్‌లో ప్రవేశపెట్టాం. రానున్న రోజుల్లో ఈ మోడల్ ప్రధాన ఉత్పాదనగా ఉంటుంది. కొత్తగా వచ్చే మోడళ్లు ప్రీమియం సెగ్మెంట్లో పోటీ పడతాయి. ఎలివేట్ ఎగుమతి కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దుతాం. ఇక 2022–23లో 1.2 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేశాం. 2024–25లో దీనిని 1.7 లక్షల యూనిట్లకు చేరుస్తాం’ అని వివరించారు. 2040 నాటికి బ్యాటరీ ఎలక్ట్రిక్, ఫ్యూయల్ సెల్ వాహనాలను మాత్రమే విక్రయిస్తామని హోండా మోటార్ కో ఆసియా హెడ్ తోషియో కువహర తెలిపారు. -
‘ఎలివేట్’ పేరిట హోండా కొత్త కారు.. మూడేళ్ల నుంచి ఊరిస్తూ.. చివరికి ఇలా
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హోండా భారత్‌లో ఎస్యూవీ మార్కెట్ విభాగంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా మిడ్ రేంజ్ ఎస్యూవీ వాహనాలైన హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటార’ తరహాలో మిడ్ సైజ్ ఎస్యూవీ కార్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. వచ్చే నెల జూన్ 6న ‘ఎలివేట్’ పేరుతో ఎస్‌యూవీని విడుదల చేయనున్నట్లు హోండా అధికారికంగా ప్రకటించింది. హోండా ఎలివేట్ ఇంజన్ ఉందంటే ఎలివేట్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లో మార్కెట్‌కు పరిచయం కానుంది. ఇందులో ట్రాన్స్మిషన్ ఆప్షన్‌తో పాటు మ్యాన్యువల్ ఆప్షన్ కూడా ఉంది. సీవీటీ గేర్ బాక్స్‌లు ఉన్నాయి. కార్ సౌకర్యంగా ఉండేలా అప్రైట్ స్టాన్స్, డ్రైవింగ్ సమయంలో కాంతివంతంగా ఉండేలా స్లీక్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ప్రయాణ సమయంలో ఎదురయ్యే ప్రమాదాల నుంచి వాహనంలోని ప్రయాణికుల్ని సంరక్షించేలా మెటల్ బార్స్ గ్రిల్స్‌తో పాటు ఇతర ఫీచర్లు ఉన్నాయి. దేశీయ కంపెనీలతో పోటీపడలేక భారత్‌లో ఎస్‌యూవీలకు మంచి గిరాకీ నడుస్తోంది. ప్రస్తుతం దేశంలో ఎస్‌యూవీల వాటా 47 శాతం. కానీ 2020లో ఎస్యూవీ మార్కెట్ వ్యాల్యూ 28 శాతంగా ఉంది. కోవిడ్-19తో ఆటోమొబైల్ రంగం తీవ్ర ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది. హ్యుందయ్, దేశీయ వాహన తయారీ సంస్థలైన టాటా మోటార్స్, మారుతి సుజికిల నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఈ వరుస విపత్కర పరిణామాలతో హోండా కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ నోయిడాలో తయారీ ప్లాంటును రాజస్థాన్‌కు తరలించింది. దీంతో పాటు సివిక్ సెడాన్, సీఆర్- వీ ఎస్యూవీ తయారీని నిలిపింది. 3 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆ మరుసటి ఏడాది అంటే 2021లో భారత్‌లో కొత్త ఎస్యూవీ కారును విడుదల చేయాలని హోండా గట్టి ప్రయత్నాలే చేసింది. 7 సీట్ల ఎస్యూవీ కోసం ‘ఎలివేట్’ పేరుతో ట్రేడ్ మార్క్‌ను రిజిస్టర్ చేసింది. కానీ ఆ కార్ ఎలా ఉండబోతుంది. ఎప్పుడు విడుదల చేస్తుందనే అంశంపై స్పష్టం చేయలేదు. తిరిగి మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఎలివేట్ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు సిద్ధమైంది .కాగా, హోండా కార్స్ ఇండియా ప్రస్తుతం భారత్‌లో సిటీ , అమేజ్ అనే రెండు మోడళ్లను మాత్రమే విక్రయిస్తోంది. చదవండి👉 చాట్‌జీపీటీ వినియోగంపై పోటీపడుతున్న సీఈవోలు.. ఏం జరుగుతుందో.. ఏమో! -
Honda: ఏప్రిల్ నుంచి ఈ కార్ల ఉత్పత్తి బంద్
గతంలో బిఎస్6 ఉద్గార నిబంధనలు అమలులోకి వచ్చిన తరువాత చాలా కార్ల ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే 2023 ఏప్రిల్ 01నుంచి బిఎస్6 ఫేజ్-2 రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) నిబంధనలు అమలులోకి రానున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని చాలా కంపెనీలు తమ ఉత్పత్తులలో కొన్నింటిని నిలిపివేయాలని నిర్చయించాయి. ఇందులో హోండా కంపెనీ కూడా ఉంది. నివేదికల ప్రకారం.. హోండా కంపెనీ ఏప్రిల్ ప్రారంభం నుంచి జాజ్, డబ్ల్యుఆర్-వి, నాల్గవ తరం సిటీ వంటి మోడల్స్ ఉత్పత్తిని నిలిపివేయనుంది. రియల్ డ్రైవింగ్ ఎమిషన్ నిబంధనలు క్యాటలిటిక్ కన్వర్టర్, ఆక్సిజన్ సెన్సార్ల వంటి భాగాలను నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. బిఎస్6 ఫేస్-2 నిబంధనలు కొంత కఠినంగా ఉంటాయి, కావున కంపెనీ ఉత్పత్తులు మరింత పటిష్టంగా తయారవుతాయి, తద్వారా ధరలు కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కంపెనీ హోండా సిటీ ఐదవ తరం మోడల్, అమేజ్ వంటి వాటిని కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే కంపెనీ అందించిన సమాచారం ప్రకారం.. వచ్చే నెల ప్రారంభం నుంచే తమ ఉత్పత్తుల ధరలు రూ. 12,000 వరకు పెరిగే అవకాశం ఉందని తెలిసింది. ఇదే బాటలో మరిన్ని కంపెనీలు ముందుకు సాగనున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. అయితే ఈ ధరల పెరుగుదల వాహనాల అమ్మకాలపైన ప్రభావం చూపుతుందా? లేదా? అనేది త్వరలో తెలియాల్సి ఉంది. -
100 సీసీ హోండా షైన్ వచ్చేసింది! ధర దాని కంటే తక్కువే..
భారత బైక్ మార్కెట్లో హీరో తర్వాత హోండా కంపెనీ మోటార్‌సైకిళ్లు, స్కూటర్లకు అంతే స్థాయిలో పాపులారిటీ ఉంది. హోండా ఇండియా దేశంలో సరికొత్త షైన్ 100 సీసీ బైక్‌ను విడుదల చేసింది. ఇంతకు ముందు హోండా షైన్ 125 సీసీ బైక్‌లకు మంచి ఆదరణ వచ్చింది. ఈ నేపథ్యంలో అదే మోడల్ పేరుతో 100 సీసీ ఇంజన్‌తో హోండా కంపెనీ కొత్త బైక్‌ను విడుదల చేసింది. ఇదీ చదవండి: Realme C33 2023: తక్కువ ధరలో రియల్మీ ఫోన్లు... కిర్రాక్ ఫీచర్లు! హోండాకు సంబంధించి దేశంలో 125సీసీ ఆపైన మోడళ్లు అంటే.. యూనికాన్, హోండా షైన్ బైక్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అయితే 100సీసీ బైక్‌ల విషయంలో మాత్రం హోండా వెనుకబడి ఉంది. 100 సీసీ రేంజ్ బైక్‌ల అమ్మకాల్లో హీరో కంపెనీకి తిరుగులేదు. దానికి కారణం హీరో స్ల్పెండర్ బైక్‌లు. ఈ నేపథ్యంలో వాటికి గట్టి పోటీ ఇచ్చేందుకు హోండా బాగా పాపులరైన షైన్ పేరుతో 100 సీసీ మోటర్ సైకిల్ తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ.64,900 (ఎక్స్‌షోరూం). అంటే హీరో స్ల్పెండర్ ప్లస్ కంటే తక్కువే.. హోండా షైన్ 100 సీసీ ప్రత్యేకతలు హోండా షైన్ 100 సీసీ బైక్ 6 సంవత్సరాల వారంటీ ప్యాకేజీతో వస్తుందని, ఇందులో 3 సంవత్సరాలు సాధారణ వారంటీ కాగా సంవత్సరాల ఎక్స్టెండెట్ వారంటీ అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. పొడవాటి సీటు (677 మి.మీ), చిన్న లెగ్ ఓపెనింగ్ యాంగిల్‌తో కూడిన ట్యాంక్ ఉన్నాయి. ఇంజిన్ ఇన్హిబిటర్‌తో కూడిన సైడ్ స్టాండ్ ఉంటుంది. దీని వల్ల సైడ్ స్టాండ్ వేసి ఉన్నప్పుడు ఇంజిన్ స్టార్ట్ చేయడానికి వీలుండదు. హోండా పేటెంట్ అయిన ఈక్వలైజర్‌తో కూడిన కాంబి బ్రేక్ సిస్టమ్ (సీబీస్)ను ఈ 100సీసీ బైక్‌లోనూ చేర్చారు. ఇక డిజైన్ విషయానికొస్తే హోండా షైన్ 125 ఉన్నట్టుగానే ఉంటుంది. అయితే అలాయ్ వీల్స్ తదితర చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. హోండా షైన్ 100 సీసీ బైక్ ఐదు రంగుల్లో లభిస్తాయి. అవి బ్లాక్ విత్ రెడ్ స్ట్రిప్స్, బ్లాక్ విత్ గ్రే స్ట్రైప్స్, బ్లాక్ విత్ గోల్డ్ స్ట్రైప్స్, బ్లాక్ విత్ బ్లూ స్ట్రైప్స్, బ్లాక్ విత్ గ్రీన్ స్ట్రైప్స్. ఇదీ చదవండి: మూత పడనున్న మరో బ్యాంక్? భారీగా పతనమైన షేర్లు.. -
సంక్షోభంతో అల్లాడుతున్న పాక్‌కు షాక్: మరో ప్లాంట్ షట్‌డౌన్
న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్తాన్‌కు మరో షాక్ తగిలింది. సరఫరా గొలుసులో తీవ్ర అంతరాయం ఏర్పడిందని పేర్కొంటూ మరో కార్ల తయారీ సంస్థ హోండా తన ప్లాంట్‌ను మూసివేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇప్పటికే ప్రముఖ కంపెనీలు పాక్‌కు గుడ్‌బై చెబుతుండగా, ఈ జాబితాలో తాజాగా ఆటోమొబైల్ దిగ్గజం హోండా కూడా చేరింది. ప్రస్తుతం పాక్‌లోని హోండా అట్లాస్ కార్స్ పేరుతో కార్లను అసెంబుల్ చేస్తోంది. దేశంలోని ప్రస్తుత ఆర్థిక పరిస్థితులే మూసివేతకు కారణమని ప్రకటించింది. జియో న్యూస్ ప్రకారం మార్చి 9 నుంచి 31 వరకు హోండా తన ఫ్లాంట్‌ను మూసివేయనుంది. పాక్ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఉత్పత్తిని కొనసాగించలేని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి స్టాక్ఎక్స్ఛేంజ్‌కు అందించిన సమాచారంలో కంపెనీ తెలిపింది. ప్రభుత్వం పూర్తి నాక్-డౌన్ కిట్ల దిగుమతి కోసం లెటర్ ఆఫ్ క్రెడిట్ నిషేధం, ముడిసరుకు, విదేశీ చెల్లింపుల స్తంభన లాంటి చర్యలతో సరఫరా గొలుసు తీవ్రంగా దెబ్బతిందని కంపెనీ తెలిపింది. కాగా అధిక ద్రవ్యోల్బణం, పాక్ కరెన్సీ క్షీణత, దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన పాకిస్తాన్ ఆటో పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుందని జియో న్యూస్ నివేదించింది. వాణిజ్య లోటును నియంత్రించేందుకు సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిగుమతుల ఆంక్షలతో ఆటో పరిశ్రమ కూడా దెబ్బతిన్నదని వ్యాఖ్యానించింది. ఉత్పత్తి కార్యకలాపాలు దెబ్బతినడమే కాకుండా కంపెనీలు తమ సీకేడీ మోడళ్ల ధరలను కూడా పెంచాయి, ఇది ఇప్పటికే ప్రజల కొనుగోలు శక్తిని ప్రభావితం చేసిందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పాక్‌లోని టయోటా-బ్రాండ్ ఆటోమొబైల్స్‌కు చెందిన సుకుజీ మోటార్ కంపెనీ (PSMC) ఇండస్ మోటార్ కంపెనీ (IMC) అసెంబ్లర్లు కూడా తమ ఉత్పత్తి ప్లాంట్లను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. -
హాట్ సమ్మర్లో హోండా కార్లపై కూల్ ఆఫర్స్: ఈ నెల చివరి వరకే!
జపనీస్ కార్ల తయారీ సంస్థ హోండా దేశీయ మార్కెట్లో తమ వాహనాల కొనుగోలుమీద అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తున్నట్లు తెలిపింది. ఇందులో హోండా అమేజ్, జాజ్, డబ్ల్యూఆర్-వీ, సిటీ మోడల్స్ ఉన్నాయి. ఈ డిస్కౌంట్స్ ఈ నెల చివరిలోపు కొనుగోలు చేసే కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయి. హోండా అమేజ్: హోండా కంపెనీ తన అమేజ్ మోడల్ మీద రూ. 26,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 6.89 లక్షలు (ఎక్స్‌షోరూమ్). ఈ సెడాన్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 88.5 హెచ్‌పీ పవర్, 110 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. హోండా జాజ్: ఇక హోండా జాజ్ విషయానికి వస్తే, దీని ప్రారంభ ధర రూ. 8.01 లక్షలు (ఎక్స్‌షోరూమ్). ఈ మోడల్ మీద కంపెనీ రూ. 15,000 డిస్కౌంట్ అందిస్తుంది. ఇందులో రూ. 5,000 లాయల్టీ బోనస్ లభిస్తుంది. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 88.5 హెచ్‌పీ పవర్, 110 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. హోండా డబ్ల్యూఆర్-వీ: హోండా కంపెనీ తన డబ్ల్యూఆర్-వీ మోడల్ మీద రూ. 17,000 డిస్కౌంట్ అందిస్తుంది. ఇందులో రూ. 5,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఎస్యూవీ ప్రారంభ ధర రూ. 9.11 లక్షలు (ఎక్స్‌షోరూమ్). ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 88.5 హెచ్‌పీ పవర్, 110 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. హోండా సిటీ: కంపెనీ పాపులర్ మోడల్ అయిన హోండా సిటీ సెడాన్ కొనుగోలు చేసే కస్టమర్లు ఈ నెలలో రూ. 17,000 వరకు డిస్కౌంట్స్ పొందవచ్చు. ఇందులో రూ. 7,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. దీని ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్‌షోరూమ్). ఇందులోని 1.5 లీటర్ పెట్రోల్ హైబ్రీడ్ ఇంజిన్ 125 హెచ్‌పీ పవర్, 253 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది, ఇక 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 119.35 హెచ్‌పీ పవర్, 145 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ నెలలో పైన తెలిపిన కార్లు కొనుగోలు చేయాలనునే కస్టమర్లు మరింత ఖచ్చితమైన సమాచారం కోసం సమీపంలో ఉన్న కంపెనీ డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
కొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్' భారతీయ మార్కెట్లో విడుదలైంది. ఈ ఐదవ జనరేషన్ ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు, కాగా టాప్-స్పెక్ సిటీ హైబ్రిడ్ ధర రూ. 20.39 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ అప్డేటెడ్ ఫేస్‌లిఫ్ట్ ఆధునిక కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. కంపెనీ ఈ కొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. అయితే ఆన్లైన్లో బుక్ చేసుకునే కస్టమర్లు రూ. 5,000, డీలర్‌షిప్‌లో బుక్ చేసుకునే కస్టమర్లు రూ. 21,000 చెల్లించి బుక్ చేసుకోవాలి. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్స్ & ధరలు: ఎస్వి: రూ. 11.49 లక్షలు వి: రూ. 12.37 లక్షలు విఎక్స్: రూ. 13.49 లక్షలు జెడ్ఎక్స్: రూ. 14.72 లక్షలు కొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ బంపర్, గ్రిల్, క్రోమ్ బార్ వంటి వాటిని కలిగి ఎల్ఈడీ లైట్స్, స్వెప్ట్‌బ్యాక్ టెయిల్ ల్యాంప్ పొందుతుంది. వెనుక వైపు కొత్తగా డిజైన్ చేసిన బంపర్ చూడవచ్చు, అంతే కాకుండా ఈ అప్డేటెడ్ మోడల్ అబ్సిడియన్ బ్లూ పెర్ల్ పెయింట్ షేడ్‌లో చూడచక్కగా కనిపిస్తుంది. హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ బేస్ మోడల్ కేవలం మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే వస్తుంది. మిగిలిన మూడు వేరియంట్లు సివిటి గేర్‌బాక్స్ పొందుతాయి. ఈ కొత్త మోడల్ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ADAS ఫీచర్లను పొందుతుంది. కంపెనీ ఇప్పుడు హోండా సిటీ హైబ్రిడ్ వేరియంట్లోని ADAS టెక్నాలజీకి "లో-స్పీడ్ ఫాలో" ఫంక్షన్ అని పిలువబడే ఒక కొత్త ఫీచర్‌ను జోడించింది. ఇది ముందున్న వాహనానికి దూరంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఇందులోని లీడ్ కార్ డిపార్చర్ నోటిఫికేషన్ సిస్టమ్ వల్ల కారు ముందుకు కదిలినప్పుడు డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది. హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ యాంబియంట్ లైటింగ్, వైర్లెస్ ఛార్జర్ మరియు వైర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, టైర్-ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రెయిన్-సెన్సింగ్ వైపర్ వంటి ఫీచర్స్‌తో పాటు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను పొందుతుంది. కంపెనీ ఈ సెడాన్ పెట్రోల్, సిటీ హైబ్రిడ్ రెండింటిపైన మూడు సంవత్సరాలు/అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ అందిస్తుంది. దీనిని ఐదు సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు. హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. పెట్రోల్ ఇంజిన్ 121 బీహెచ్‌పి పవర్ అందిస్తుంది. హైబ్రిడ్ ఇంజిన్ eCVT ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. కంపెనీ ఈ రెండు ఇంజిన్లను రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) నిబంధనలకు అనుకూలంగా అప్డేట్ చేసింది. -
చైనా మార్కెట్ కోసం హోండా.. ముచ్చటగా మూడు
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'హోండా' చైనీస్ మార్కెట్ కోసం మూడు ఎలక్ట్రిక్ రెట్రో స్కూటర్లను పరిచయం చేసింది. ఈ మూడు స్కూటర్లు సింపుల్ డిజైన్ కలిగి మినిబైకుల మాదిరిగా ఉన్నాయి. ఇవి గతంలో పెట్రోల్ బేస్డ్ మోడల్స్‌గా అందుబాటులో ఉండేవి. చైనా కోసం రూపొందిన 'కబ్ ఈ (Cub e), డాక్స్ ఈ (Dax e) జూమర్ ఈ (Zoomer e)' ఎలక్ట్రిక్ స్కూటర్లు గతంలో ఎక్కువగా అమ్ముడైన పాపులర్ టూవీలర్స్. ఇవి 1958 నుంచి 2018 వరకు నిరంతరం సిరీస్‌లో భాగంగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. హోండా కబ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఛార్జ్‌తో 64 కిమీ రేంజ్, డాక్స్ ఈ 80 కిలోమీటర్లు, జూమర్ ఇ సుమారు 90కి.మీ రేంజ్ అందిస్తుంది. కబ్ ఇ అనేది హోండా కబ్ ఆధారంగా రూపొందించబడింది. ఆ తరువాత ఆధునిక అప్డేట్స్ పొందింది. డాక్స్ ఈ దాని దాని మునుపటి మోడల్స్ ఆధారంగా రూపుదిద్దుకుంది. జూమర్ ఇ ఎలక్ట్రిక్ స్కూటర్ రక్కస్ స్కూటర్ ప్రేరణ పొందింది. ఇది (రక్కస్) 49 సీసీ ఇంజన్‌తో అందుబాటులో ఉండేది. అయితే కంపెనీ ఇప్పుడు పరిచయం చేసిన మూడు మోడల్స్ పెట్రోల్ వెర్షన్స్ కాదు, ఇవి పూర్తిగా ఎలక్టిక్ మోపెడ్ స్కూటర్లు. ఇవి చైన్ ఫైనల్ డ్రైవ్ ద్వారా వెనుక చక్రానికి పవర్ డెలివరీ చేస్తాయి. కొత్త హోండా ఎలక్ట్రిక్ మోపెడ్ స్కూటర్లలో ఛార్జింగ్ అయిపోతే పెడల్ సహాయంతో సైకిల్ మాదిరిగా తొక్కుకుంటూ వెళ్ళవచ్చు. ఈ స్కూటర్ల యొక్క గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. ఇవి కేవలం చైనీస్ మార్కెట్లో మాత్రమే విక్రయానికి అందుబాటులో ఉంటాయి. ఇతర దేశాల్లో విక్రయించే అవకాశం లేదు. -
గుడ్ న్యూస్: భారీ డిస్కౌంట్, ఈ బైక్‌పై రూ.50వేలు తగ్గింపు!
హోండా మోటార్ సైకిల్ & స్కూటర్ ఇండియా తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. బైక్ లవర్స్‌ను ఆకట్టుకోవడంతో పాటు అమ్మకాలు పెంచుకునేందుకు తాజాగా లాంచ్ చేసిన కొత్త హోండా CB300F నేకెడ్ స్ట్రీట్‌ఫైటర్ బైక్‌పై భారీగా డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఏడాది ఆగస్ట్‌లో సరికొత్తగా హోండా CB300F బైక్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పుడు, ప్రారంభించిన కొన్ని నెలల్లోనే, కంపెనీ ఈ నేక్డ్ స్ట్రీట్‌ఫైటర్ ధరను రూ.50,000 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ పరిమితి కాలానికే వర్తించనుందని తెలిపింది. భారీ తగ్గింపు! కొత్త హోండా CB300F స్ట్రీట్‌ఫైటర్ బైక్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. అది డీలక్స్ అండ్ డీలక్స్ ప్రో. వాటి ప్రారంభ ధర రూ.2.26 లక్షలు, రూ.2.29 లక్షలు ఉండగా తాజాగా కంపెనీ వాటిపై రూ. 50,000 తగ్గించింది. దీంతో డీలక్స్ ధర రూ. 1.76 లక్షలుకాగా, డీలక్స్ ప్రో వేరియంట్ ధర రూ. 1.79 లక్షలుగా ఉంది. కొత్త ధర ప్రకారం KTM డ్యూక్ 125 అండ్ బజాజ్ డోమినార్ 250 కంటే హోండా సీబీ300F తక్కువ ధరకే లభిస్తుంది. 125 డ్యూక్ ధర రూ.1.78 లక్షలు ఉండగా, హోండా బైక్ ధర రూ. 1.76 లక్షలు ఉంది. హోండా CB300F పవర్లో 293.52cc, సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజన్‌తో వస్తోంది. ఈ మోటార్ 7,500 RPM వద్ద 24.1 bhp మరియు 5,500 RPM వద్ద 25.6 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇంజన్ అసిస్ట్ స్లిప్పర్ క్లచ్, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్‌తో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తోంది. -
కార్ల కొనుగోలు దారులకు భారీ షాక్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా కార్ల ధరలను జనవరి 23 నుంచి పెంచుతోంది. మోడల్‌నుబట్టి ధర రూ.30,000 వరకు అధికం కానుంది. ముడిసరుకు వ్యయాలు దూసుకెళ్లడం, నూతన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తయారీ చేపడుతుండడం ఇందుకు కారణమని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. కాలుష్యం ఏ మేరకు విడుదల అవుతుందో తెలుసుకునే పరికరాన్ని కార్లలో ఏర్పాటు చేయాలన్న నిబంధన 2023 ఏప్రిల్ నుంచి అమలులోకి వస్తోంది. ధరలను సవరిస్తున్నట్టు మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మెర్సిడెస్ బెంజ్, ఆడి, రెనో, కియా ఇండియా, ఎంజీ మోటార్ ఇప్పటికే ప్రకటించాయి. -
రోబోటిక్ వీల్‌చైర్..శరీరాన్ని వంచితే చాలు..దానంతట అదే వెళ్తుంది!
నడవలేని స్థితి ఎదురైనప్పుడు ఎవరైనా వీల్‌చైర్‌ను ఆశ్రయించక తప్పదు. వీల్‌చైర్‌లో కూర్చుంటే, వెనుక నుంచి ఎవరో ఒకరు ముందుకు నెడితే తప్ప కదలడం సాధ్యం కాదు. వీల్చైర్ల తయారీలోనూ ఇటీవల అధునాతన మార్పులు వస్తున్నాయి. తాజాగా, జపాన్‌కు చెందిన బహుళజాతి వాహనాల తయారీ సంస్థ ‘హోండా’ ఈ రోబోటిక్ వీల్‌చైర్‌ను రూపొందించింది. మోటార్‌తో రూపొందించిన కొన్ని వీల్చైర్లను చేతులతో కోరుకున్న దిశకు నడపాల్సి ఉంటుంది. హోండా తయారుచేసిన ఈ వీల్‌చైర్ మాత్రం చేతులకు శ్రమపెట్టదు. ఇది పూర్తిగా రోబోటిక్ సాంకేతికతతో పనిచేస్తుంది. ఇందులో కూర్చున్న వ్యక్తి ఎటువైపుగా వెళ్లాలనుకుంటే, అటువైపుగా కాస్త శరీరాన్ని వంచితే చాలు. ఇది దానంతట అదే ఆ దిశగా ముందుకు సాగుతుంది. దీనిని స్టార్ట్ చేయాలన్నా, స్థిరంగా నిలపాలన్నా కావలసిన బటన్లు చేతికి అందుబాటులో ఉంటాయి. ‘యూని–వన్’ పేరిట రూపొందించిన ఈ రోబోటిక్ వీల్‌చైర్ ఇంకా మార్కెట్లోకి విడుదల కావాల్సి ఉంది.