ఒంటెద్దు బళ్లు చూశాం గాని, ఒంటిచక్రం బండేమిటి? ఇదేదో సర్కస్ వ్యవహారం కాబోలనుకుంటున్నారా? ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న వాహనం అచ్చంగా ఒంటిచక్రం బండి. ఇది మోనోవీల్ ఎలక్ట్రిక్ బైక్. హోండా కంపెనీకి చెందిన డిజైనర్ నాషో ఆల్ఫోన్సో గార్షియా దీనికి రూపకల్పన చేశాడు.
ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే నగరాల్లో ఇరుకిరుకు సందుల్లో కూడా తేలికగా ప్రయాణాలు సాగించడానికి ఈ వాహనం భేషుగ్గా ఉపయోగపడుతుందని గార్షియా చెబుతున్నాడు. దీనిని నడపడం పెద్దకష్టమేమీ కాదు. ఇందులో కాళ్లు మోపడానికి ఉండేచోటులో నిలుచుని, స్టార్ట్ చేస్తే చాలు. పడిపోతుందేమోననే భయం అక్కర్లేదు.
ఇది పూర్తిగా సెల్ఫ్‌బ్యాలెన్సింగ్ వాహనం. హోండా సంస్థ ప్రస్తుతానికి దీనిని నమూనాగా మాత్రమే తయారు చేసింది. దీనిపై మరిన్ని పరీక్షలు విజయవంతమైతే, పూర్తిస్థాయి ఉత్పాదన ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment