Streets
-
బంగ్లాలో హిందువులపై హింస.. మహారాష్ట్రలో నిరసన ర్యాలీ
గోండియా: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను నిరసిస్తూ మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో మెగా ర్యాలీ నిర్వహించారు. దాదాపు 20 వేల మంది ఈ ర్యాలీలో పాల్గొని, హిందువులకు మద్దతుగా పలు నినాదాలు చేశారు.బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు సంబంధించిన ఫొటోలు, వార్తలు వెలువడుతున్న దరిమిలా ప్రపంచవ్యాప్తంగా హిందువుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఈ నేపధ్యంలో గోండియాలో 70కి పైగా హిందూ గ్రూపులకు చెందిన 20 వేల మంది బంగ్లాదేశ్‌లోని హిందువులకు మద్దతుగా ర్యాలీని చేపట్టారు. జైస్తంభ్ చౌక్ నుండి కిలోమీటరు మేర పాదయాత్ర చేపట్టారు. బంగ్లాదేశ్‌లో హిందువులకు భద్రత కల్పించాలంటూ వారు ర్యాలీలో నినదించారు.ర్యాలీలో పాల్గొన్న కొందరు మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లో హిందూ, బౌద్ధ, క్రైస్తవ మైనారిటీలు ప్రమాదంలో ఉన్నారని అన్నారు. మత ఛాందసవాదులు మైనారిటీ హిందువుల దేవాలయాలపై దాడులు చేస్తున్నారని, హిందువుల ఇళ్లను ద్వంసం చేసి, వారిని నిరాశ్రయులుగా మారుస్తున్నారని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో అస్థిరత ఏర్పడినప్పుడల్లా మైనారిటీలు, ముఖ్యంగా హిందువులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది భారతదేశాన్ని కూడా ప్రభావితం చేస్తున్నదని అన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై కొనసాగుతున్న హింస, అరాచకాలు, అశాంతి అంతం కావాలని ర్యాలీలో పాల్గొన్నవారు నినదించారు. చివరిగా భారతదేశ జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమాన్ని ముగించారు. ఇది కూడా చదవండి: ప్రధాని మోదీతో నేపాల్ ప్రధాని ద్వైపాక్షిక చర్చలు -
భూకంపాన్ని పసిగట్టిన పక్షులు?.. వీడియో వైరల్!
జపాన్‌లోని క్యోటో నగరంలో ఆమధ్య వేల సంఖ్యలో కాకులు గుంపులుగా ఎగురుతున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అయ్యింది. జపాన్‌లోని హోన్షులో ఆకాశంలో వేలాది కాకులు ఎగురుతూ క్యోటో సమీపంలోని జపనీస్ ద్వీపానికి చేరుకున్నాయి. మనుషులకు మించి ప్రకృతిని అర్ధం చేసుకునే శక్తి పక్షులకే ఉందా? అని అంటే.. అవుననే సమాధానమే వస్తుంది. ప్రకృతి వైపరీత్యాలను కాకులు , కుక్కలు మొదలైనవి ముందుగానే గుర్తిస్తుంటాయి. సునామీ, భూకంపం లాంటి ప్రకృతి విపత్తులు సంభవించడానికి కొన్ని క్షణాల ముందు వేలాది కాకులు వింతగా ప్రవర్తించడానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. జపాన్‌లోని క్యోటో నగరంలో మాదిరిగానే కొన్నాళ్ల క్రితం క్రితం టర్కీలో సంభవించిన విధ్వంసకర భూకంపానికి కొద్ది క్షణాల ముందు కూడా పక్షులు అసాధారణంగా ప్రవర్తించాయి. భారీ సంఖ్యలో పక్షులు గుమిగూడి కిలకిలారావాలు చేస్తూ ఆకాశంలో అటుఇటూ సంచరిస్తూ కనిపించాయి. పక్షులు అలా ప్రవర్తించడానికి కారణం రానున్న భూకంపాన్ని పసిగట్టడమేనంటూ నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా ద్వీప దేశమైన జపాన్‌లో 2024 నూతన సంవత్సరం తొలిరోజే శక్తివంతమైన భూకంపం చోటు చేసుకుంది. వాయవ్య జపాన్ తీరంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పలుమార్లు భూప్రకంపనలు నమోదయ్యాయి. కనీసం 21 సార్లు భూమి కంపించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఈ భూకంపానికి కొన్ని నిముషాల ముందు వేలాది పక్షలు ఒకచోట చేరి విచిత్రంగా ప్రవర్తించాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కూడా చదవండి: జపాన్‌లో భారీ భూకంపం.. 155సార్లు కంపించిన భూమి The sudden increase in crow activity in #Japan is causing concern among residents, reminiscent of an ancient omen associated with natural disasters. On the first day of 2024, Japan is struck by a significant #earthquake#Tsunami pic.twitter.com/vNLoM1JRWu — Surajit (@surajit_ghosh2) January 1, 2024 -
తిరువీధుల్లో టీటీడీ ఛైర్మన్ తనిఖీలు
తిరుమల: తిరుమల తిరువీధుల్లో టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి తనిఖీలు నిర్వహించారు. వేచి ఉన్న భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలను పరిశీలించారు. ఆహారం, పాలు, కాఫీ, టీ, తాగునీరు అందుతున్నాయా లేదా..? అని గ్యాలరీల్లోని భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తులతో కాసేపు ముచ్చటించారు. గ్యాలరీలో వేచి ఉండే ప్రతి భక్తుడికి గరుడ వాహనంపై ఉన్న మలప్ప స్వామి వారి దర్శనం చేయిస్తామని ఈ సందర్భంగా ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి అన్నారు. గ్యాలరీల్లో లక్షలాదిమంది భక్తులు ఎదురుచూస్తున్నప్పటికీ వారికి అవసరమైన ఆహారం, తాగునీరు, పాలు లాంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. 'నేను చాలామందితో మాట్లాడాను. అందరు కూడా టీటీడీ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు భక్తులకు చిన్న ఇబ్బంది కూడా కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు' అని భూమన కరుణాకర్ రెడ్డి అన్నాారు. ఇదీ చదవండి: ‘చంద్రయాన్–3’ ఓ అద్భుతం -
తినడానికి తిండిలేక,చెన్నై రోడ్లపై భిక్షాటన..ఇన్‌స్టా వీడియోతో పాపులారిటీ
కూటికోసం కోటివిద్యలు అంటారు. ఈ విద్యే... ఎవరూ చూసేవారు లేక అనాథలా మారి, పదిమంది దగ్గర యాచిస్తూ కడుపు నింపుకొంటోన్న మెర్లిన్‌కు భోజన, వసతి సదుపాయాలు కల్పించి ఆదుకుంటోంది. ఎంతోమందికి మెర్లిన్ నేర్పిన విద్యాబుద్ధులే 81 ఏళ్ల వయసులో నిస్సహాయస్థితిలో ఉన్న ఆమెని ఆదుకుంటూ... అండగా నిలబడ్డాయి. బర్మాకు చెందిన మెర్లిన్ భారతీయ వ్యక్తిని పెళ్లిచేసుకుని చెన్నైలో స్థిరపడిపోయింది. ఇంగ్లీష్, లెక్కలు, తమిళం బోధిస్తూ, భర్తతో సంతోషంగా ఉండేది. సంవత్సరాలు గడిచే కొద్దీ తనవారిని ఒక్కొక్కరిగా పోగొట్టుకుంటూ ఒంటరిదైపోయింది. తినడానికి తిండిలేక, ఉండడానికి చోటులేక ఫుట్‌పాతే అన్నీ అయ్యి బతుకుతోంది. చెన్నై రోడ్లమీద తిరుగుతూ భిక్షమెత్తుకుని పొట్టనింపుకుంటోంది. దుస్తులు కొనివ్వండి బాబూ... ఒకరోజు ‘ఏబ్రోకాలేజ్కిడ్’అనే ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా సోషల్ సర్వీస్ చేస్తోన్న మొహమ్మద్ ఆషిక్ కంటపడింది మెర్లిన్. ఆమెను చూడగానే ఆమె మొదటినుంచి యాచకవృత్తిలో ఉన్న ఆమె కాదని గ్రహించాడు ఆషిక్. వెంటనే ‘‘ఎక్కడినుంచి వచ్చావు అమ్మా? నీకు ఎవరూ లేరా? వయసులో ఉన్నప్పుడు ఏం చేసేదానివి...’’ వంటి ప్రశ్నలు వేస్తూ మెర్లిన్ గురించిన వివరాలు తెలుసుకున్నాడు ఆషిక్. ‘‘భిక్షం అడిగి కడుపు నింపుకుంటున్నాను. కొన్ని రోజులు ఆహారం దొరుకుతుంది. మరికొన్ని రోజులు ఏమీ దొరకదు... నీళ్లు తాగి పడుకుంటాను. దేవుడు ఎంతవరకు ఇస్తే అంతే బాబు’’ అని మెర్లిన్ చెప్పింది. ‘‘నీకు ఏం కావాలమ్మా?’’ అని ఆషిక్ అడిగినప్పుడు...‘‘నా దుస్తులు చిరిగిపోయాయి. వీలయితే అవి కొనివ్వు బాబు... అది చాలు’’ అంది. యాచించ కూడదనీ... మెర్లిన్ పరిస్థితి చూసి చలించిపోయిన ఆషిక్ మెర్లిన్‌కు చీర కొనిచ్చాడు. తరువాత...‘‘అమ్మ నువ్వు ఇంగ్లీష్ క్లాసులు చెప్పు. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తాను. ఒక్కో వీడియోకు డబ్బులు ఇస్తాను అని చెప్పాడు’’. మెర్లిన్ ఇంగ్లీష్ క్లాసులు చెప్పడానికి ఒప్పుకోవడంతో ఆమె చెప్పే పాఠాలు వీడియోలు తీసి ‘ఇంగ్లీష్ విత్ మెర్లిన్’ పేరుమీద ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేసి పోస్టు చేస్తున్నాడు. ఒక్కో వీడియోకు డబ్బులు ఇస్తూ మెర్లిన్ ఎవరి దగ్గరా చేయి చాచకుండా... తన కష్టార్జితంతో బతికేలా ఏర్పాట్లుచేశాడు ఆషిక్. తన విద్యార్థులసాయంతో... ఆషిక్ పోస్టు చేసిన మెర్లిన్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. వాటిని చూసిన వారిలో కొంతమంది మెర్లిన్ దగ్గర చదువుకున్న విద్యార్థులు ఉన్నారు. తమ టీచర్ పరిస్థితి ఇంత దారుణంగా ఉందా అని బాధపడుతూ మెర్లిన్‌ను వెతుక్కుంటూ వచ్చారు. దగ్గర కూర్చుని, ఫలానా వాళ్లమని పరిచయం చేసుకుని, అప్పడు ఇలా చేశాం, అలా చేశాం, మీరు ఇలా ఉండేవారంటూ మాట్లాడి ఆమెలో ఉత్సాహం నింపారు. కొంతమంది ఆమెతో వీడియో కాల్ చేసి మాట్లాడారు. అంతా కలిసి మెర్లిన్‌కు కష్టం కలగకుండా ఉండేందుకు, నలుగురి మధ్యలో ఉండేలా వృద్ధాశ్రమంలో చేర్చారు. అక్కడ ఆమెకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మెర్లిన్ ఎనభై ఏళ్ల వయసులో ఇంగ్లీష్ క్లాసులు చెబుతూ ఐదు లక్షలకు పైగా ఫాలోవర్స్‌తో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. మనం చేసే మంచి ఎప్పటికైనా ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుందనడానికి మెర్లిన్ జీవితమే ఉదాహరణగా నిలుస్తోంది. View this post on Instagram A post shared by Merlin (@englishwithmerlin) View this post on Instagram A post shared by Merlin (@englishwithmerlin) -
అక్కడ వరదలా.. వీధుల గుండా "వైన్ ప్రవాహం"..షాక్‌లో ప్రజలు
మందుబాబులకు వైన్‌లాంటి బాటిల్ కనపడితే పండగే. ఎవ్వరైన ఫ్రీగా ఇచ్చినా వారి ఆనందానికి అంతుపొత్తు ఉండదు. అలా కాకుండా వైన్ ఓ నదిలా ఉప్పోంగి వరదాల విరుచుకుపడితే ఎలా ఉంటుంది. ఇళ్లన్నింటిని వైన్ వరద ముంచెత్తింది.ఈ హఠాత్పరిణమానికి ప్రజలంతా షాక్‌కి గురయ్యారు. అసలు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ఈ షాకింగ్ ఘటన పోర్చుగల్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోర్చుగల్‌లోని సావో లోరెంకో డిబైరోలో ఆదివారం ఈ ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. ఆ చిన్న పట్టణంలోని వీధులన్నీ వైన్‌తో నిండిపోయాయి. కొన్ని ఇళ్లు ఆ వైన్ప్రవాహానికి నేలమట్టమయ్యాయి. ఏంటి ప్రకృతి విపత్తు అన్నంతగా ఓ నది పొంగి వరదాల బీభత్సం సృష్టించినట్లు వైన్ వరదాల కొట్టుకొచ్చింది. ఈ రహస్యమైన వైన్ నది ఎక్కడది. ఇదెలా సాధ్యం అని సందేహాలు ప్రజల్లో తలెత్తాయి. ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాని గందరగోళానికి గురయ్యారు ప్రజలు. ఒలింపిక్‌లో ఉండే స్మిమ్మింగ్ పూల్‌ని నింపేంత వైన్ కొట్టుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ రహస్యమైన వైన నది టౌన్ డిస్టిలరీ నుంచి ఉద్భవించిందని పేర్కొన్నారు. ఇక్కడ రెండు మిలియన్ లీటర్లకు పైగా రెడ్ వైన్ బారెల్స్‌ను మోసుకెళ్లే ట్యాంకులు ఉన్నాయని, అవి అనుకోకుండా పగిలిపోవడంతో ఈ ఘటన జరిగిందని వెల్లడించారు అధికారులు. ఈ షాకింగ్ ఘటన గురించి తెలుసుకున్న అధికారులు అప్రమత్తమై అగ్నిమాపక విభాగాన్ని రంగంలోకి దింపారు. అగ్నిమాపక సిబ్బంది వైన్నదిలా ఉగ్రరూపం దాల్చిన ఈ స్టెరిమా నది ప్రవాహాన్ని దారిమళ్లించి సమీపంలోని పోలాల్లోకి వెళ్లేలా చేశారు. అధికారులు ఈ అనుహ్య ఘటనకు ప్రజలకు క్షమాపణలు తెలిపారు. వైన్ నీటితో బురదమయంగా మారిన భూమిని డ్రైగా చేసి యథాస్థితికి వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చింది. ఈ వైన్ వరద కారణంగా జరిగిన నష్టాన్ని, ఏర్పరిచిన బురదను క్లీన్ చేసి మరమత్తులు నిర్వహించడమే గాక ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తామని తెలిపింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. The citizens of Levira, Portugal were in for a shock when 2.2 million liters of red wine came roaring down their streets on Sunday. The liquid originated from the Levira Distillery, also located in the Anadia region, where it had been resting in wine tanks awaiting bottling. pic.twitter.com/lTUNUOPh9B — Boyz Bot (@Boyzbot1) September 12, 2023 (చదవండి: సాఫ్ట్వేర్ చిన్నారి! ఏకంగా వీడియో గేమ్‌లనే రూపొందిస్తోంది!) -
అమెరికా వీధుల్లో తిరుగుతూ.. ఆకలితో అలమటిస్తూ..
సాక్షి, హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన యువతి. రెండేళ్లుగా బాగానే ఉన్నా ఇటీవల తీవ్రంగా మానసిక ఒత్తిడికి లోనైంది. ఆస్పత్రిలో చేర్చినా భయాందోళనతో బయటికి వెళ్లిపోయింది. తన పేరేమిటో కూడా సరిగా చెప్పలేని స్థితికి చేరుకుంది. చివరికి ఆకలితో అలమటిస్తూ అక్కడి వీధుల్లో తిరుగుతోంది. హైదరాబాద్‌లోని మౌలాలి ప్రాంతానికి చెందిన సయ్యదా లులూ మిన్హాజ్ జైదీ దీన గాథ. ఆమెను గమనించిన ఓ హైదరాబాదీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆమె ఎవరన్నది తెలిసింది. ఆమెను హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆకలితో అలమటిస్తూ.. లులూ జైదీ 2021 ఆగస్టులో ఎంఎస్ ఇంజనీరింగ్ చేసేందుకు అమెరికాలోని డెట్రాయిట్కు వెళ్లింది. అక్కడి ట్రినీ యూనివర్సిటీలో చదువుతోంది. తరచూ తల్లితో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. కానీ కొన్ని నెలల కింద మానసిక ఒత్తిడికి లోనైంది. నాలుగు నెలల నుంచి తల్లికి ఫోన్ చేయడం కూడా మానేసింది. ఆమె ప్రవర్తనలో విపరీత మార్పును చూసిన తోటి విద్యార్థులు తల్లికి సమాచారం ఇచ్చారు. ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. లులూ జైదీ తీవ్ర మానసిక ఒత్తిడిలో కూరుకుపోయినట్టు గుర్తించిన వైద్యులు చికిత్స ప్రారంభించారు. కానీ ఆమె ఆస్పత్రిలోంచి వెళ్లిపోయింది. వీధుల్లో తిరుగుతూ, ఎవరేమైనా పెడితే తింటూ గడుపుతోంది. ఈ క్రమంలో షికాగో నగరానికి చేరుకుంది. అక్కడ ఓ వీధిలో ఆకలితో ఆలమటిస్తున్న లులూ జైదీని అక్కడే ఉంటున్న హైదరాబాదీ గమనించి మాట్లాడారు. ఆమె పేరు కూడా చెప్పలేని పరిస్థితి, ఆకలితో అలమటిస్తున్న తీరును వీడియో తీసి సోషల్ మీడియాలో హైదరాబాద్ గ్రూప్‌లలో షేర్ చేశారు. అమెరికాలోని హైదరాబాదీలు, తోటి విద్యార్థులు ఇది చూసి.. లులూ జైదీని షికాగోలోని సురక్షిత ప్రాంతానికి తరలించి, వైద్యం అందిస్తున్నారు. హైదరాబాద్‌కు తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు లులూ జైదీ దుస్థితి గురించి తెలిసిన ఆమె తల్లి.. తన కుమార్తెను కాపాడి, తిరిగి హైదరాబాద్‌కు తీసుకురావాలంటూ విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ వీడియో వైరల్‌గా మారింది. ఆమెను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలంటూ విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన జైశంకర్.. ఆమెను తిరిగి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో షికాగోలోని భారత కాన్సులేట్ జనరల్.. లులూ జైదీ ఎవరి వద్ద ఉందో తమతో టచ్‌లోకి రావాలని విజ్ఞప్తి చేశారు. -
దంచికొట్టిన వాన.. గంటల్లోనే 30 సెం.మీ వర్షం.. రిజర్వాయర్లకు హై అలర్ట్
అహ్మదాబాద్: హిమాచల్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాలను వణికించిన వర్షాలు ఇక గుజరాత్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. నేడు గుజరాత్‌లోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. కేవలం కొన్ని గంటల్లోనే 30 సెంటీమీటర్ల వర్షం సంభవించింది. దీంతో రాజ్‌కోట్, సూరత్, గిర్ సోమనాథ్ జిల్లాల్లో వరదలు సంభవించాయి. కాలనీల్లో నిలిచి ఉన్న కార్లు వర్షపు నీటిలో మునిగిపోయాయి. రానున్న మరికొన్ని గంటల్లో దక్షిణ గుజరాత్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు సంభవించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) వెల్లడించింది. వర్షాల ధాటికి గుజరాత్లో పలు ప్రాంతాల్లో జనజీవనం స్థంభించింది. రహదారులపై నీరు పేరుకుని రాకపోకలు దెబ్బతిన్నాయి. వ్యాపారులు దుకాణాలను మూసివేశారు. #WATCH | Gujarat | Severe waterlogging in Dhoraji city of Rajkot district due to incessant rainfall. (18.07) Around 300 mm of rainfall has been recorded in the last few hours. 70 people have been shifted to safer places. pic.twitter.com/oaf5Z03q5R — ANI (@ANI) July 18, 2023 గుజరాత్లో నేడు ఉదయం 6 గంటల నుంచి దాదాపు 14 గంటల్లోనే గిర్ సోమనాథ్ జిల్లాలోని సుత్రపడ తాలూకాలో అత్యధికంగా 345 మీమీ వర్షపాతం సంభవించింది. రాజ్‌కోట్‌లోని ధోరాజీ తాలూకాలో 250 మీమీ వర్షపాతం రాగా.. కేవలం రెండు గంటల్లోనే 145 మీమీ వర్షం సంభవించడం గమనార్హం. భారీ వర్షాల కారణంగా గుజరాత్లో 43 రిజర్వాయర్లకు హై అలర్ట్ జారీ చేశారు. 18 డ్యామ్‌లకు అలర్ట్ జారీ చేశారు. భారత విపత్తు నిర్వహణ శాఖా కూడా అలర్ట్ అయింది. ఇదీ చదవండి: ఉత్తరాఖండ్‌లో ఘోరం.. ట్రాన్స్ఫార్మర్ పేలి కరెంట్ షాక్‌తో 15 మంది దుర్మరణం -
ఇజ్రాయెల్‌లో మళ్లీ రాజుకున్న నిరసన జ్వాల!
ఇజ్రాయెల్‌లో మళ్లీ నిరసన జ్వాల రాజుకుంది. శనివారం వేలాదిమంది నిరసకారులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. మార్చి 27న ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు న్యాయవ్యవస్థలో తీసుకొచ్చిన కొత్త సంస్కరణలు దేశాన్ని చీల్చేలా ఉన్నాయంటూ నిరసనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. అయితే ఆ సంస్కరణలను నిలిపి చర్చకు అనుమతించినట్లు ప్రకటించిన 15వ వారంలోనే మరోసారి నిరసనలు చెలరేగాయి. ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతుందని, కాపాడుకోవాలంటూ ప్రజలు ఆందోళనలు చేపట్టారు. దాదాపు పదివేలమందికి పైగా ప్రజలు వీధుల్లోకి వచ్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది. వారంతా మేము ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నామని, మాకు వేరే దేశం లేదంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసనలు చేపట్టారు. ఈ సంస్కరణలు సుప్రీం కోర్టు అధికారాన్ని తగ్గించి న్యాయమూర్తుల ఎంపికపై రాజకీయ నాయకులకే ఫుల్‌గా అధికారాలుంటాయంటూ ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలోనే హైఫాలోని మోడిన్‌లోని న్యాయ శాఖ మంత్రి యారివ్ లెవిన్ ఇంటి వెలుపల కూడా నిరసనలు జరిగినట్లు సమాచారం. కాగా, యూఎస్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇజ్రాయెల్ దృక్పథానికి సానుకూలం నుంచి స్థిరీకరణకు తగ్గిస్తున్నట్లు ప్రకటించిన ఒక రోజు తర్వాత శనివారమే నిరసనలు వెల్లువెత్తడం గమనార్హం ఈ కొత్త సంస్కరణల పట్ల పెద్ద ఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో.. ఆ చట్టాన్ని అర్థాంతరంగా నిలిపి వేసి, ప్రతిపక్షాలతో చర్చలు జరిపేందుకు దారితీసింది. అయితే యూఎస్ మూడీస్ మాత్రం ప్రభుత్వం విస్తృత ఏకాభిప్రాయం కోరకుండా ఇలాంటి సంస్కరణలను అమలు చేయాలని యత్నించే తీరు సంస్థాగత బలం, విధాన అచనాల బలహీనతను సూచిస్తుందని పేర్కొంది. (చదవండి: కెనడాలో వైశాఖి పరేడ్..మూడేళ్ల అనంతరం వేడుకగా జరిగిన నగర కీర్తన!) -
అసభ్యంగా కామెంట్లు.. అపరకాళిలా మారి చెప్పుతో కొట్టింది
న్యూఢిల్లీ: రద్దీగా ఉండే నడిరోడ్డుపై ఓ మహిళ ఒక వ్యక్తిని కిందపడేసి చెప్పుతో చితకొట్టేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మొరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...రోడ్డుపై వెళ్తున్న ఆమె పట్ల సదరు వ్యక్తి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా అపరకాళిలా మారి అతని పై దాడి చేసింది. రహదారిపై ఉన్నవారంతా చూస్తుండగానే కిందపడేసి చెప్పుతో చితక బాదేసింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిద్దర్నీ అడ్డుకుని పోలీస్టేషన్‌కి తరలించారు. ఈ మేరకు పోలీస్ అధికారి అనూప్ సింగ్ సదరు వ్యక్తులను విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. मुरादाबाद ➡महिला ने शोहदे की बीच सड़क जमकर पिटाई की ➡महिला ने शोहदे को बीच सड़क पर चप्पलों से पीटा ➡पिटाई होते देख मौके पर लगी लोगों की काफी भीड़ ➡15 मिनट तक शोहदे की पिटाई का हाईवोल्टेज ड्रामा।#Moradabad pic.twitter.com/XxJII5IOS3 — भारत समाचार (@bstvlive) August 27, 2022 (చదవండి: బ్యాగ్‌లో 15 ఏళ్ల బాలిక మృతదేహం) -
‘కార్లలో తిరిగితే బాగానే కనిపిస్తుంది.. మోటార్ సైకిళ్లపై తిరగండి’
సాక్షి, హైదరాబాద్: ‘కార్లలో తిరిగితే బాగానే కనిపిస్తుంది. కార్లలో మెయిన్ రోడ్లమీదే తిరుగుతాం. గల్లీల్లో, బస్తీల్లో ప్రజల బాధలు తెలియాలంటే మోటార్‌సైకిళ్లపై వెళ్లండి. క్షేత్రస్థాయిలో వర్షాల వల్ల ఎన్ని ప్రాంతాలు దెబ్బతిన్నాయి.. ఎక్కడ ఎన్ని గుంతలు పడ్డాయి.. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అన్నది క్లియర్‌గా తెలుస్తుంది’ అని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులకు సూచించారు. తగిన చర్యలు తీసుకోవాలి: మేయర్ నగరంలో వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లు, తాగునీటి ఇబ్బందులు, తదితర సమస్యలు తెలుసుకునేందుకు జోనల్ అధికారులు, డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీర్లు క్షేతస్థ్రాయిలో మోటార్ సైకిళ్లపై పర్యటించాలని ఆమె ఆదేశించారు. రోడ్లపై గుంతలు తదితరమైన వాటికి తక్షణం మరమ్మతులు చేపట్టాలని, లోతట్టు ప్రాంతాల్లో నిల్వనీటిని తొలగించడంతోపాటు సదరు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా తక్షణచర్యలు చేపట్టాలన్నారు. వరద ప్రభావ ప్రాంతాల్లో అందుతున్న సహాయ చర్యలను పరిశీలించేందుకు బుధవారం మేయర్ అంబర్‌పేట, నారాయణగూడ, హిమాయత్‌నగర్, బషీర్‌బాగ్ తదితర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఆదేశాలు జారీచేశారు. పేరుకుపోయిన చెత్తకుప్పలను వెంటనే తొలగించాలని వైద్యాధికారులను ఆదేశించారు. విరిగిన చెట్లను, వీధిదీపాలకు ఆటంకంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలన్నారు. అనంతరం తన చాంబర్లో జోనల్ కమిషనర్లతో వర్షబాధితులకు పునరావాస కార్యక్రమాలతోపాటు వినాయకచివితి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. మండపాల వద్ద చెత్తకుండీలు వినాయక మండపాల వద్ద పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కమిటీ సభ్యులకు తగిన సహకారం అందజేయాలని, ప్రతి మండపం వద్ద ఒక చెత్తకుండీ ఏర్పాటు చేయాలని సూచించారు. మరో రెండు రోజులు వర్షాలు తీవ్రంగా కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. సమీక్ష సమావేశంలో అడిషనల్ కమిషనర్ (శానిటేషన్) బి.సంతోష్, జోనల్ కమిషనర్లు రవికిరణ్, అశోక్ సామ్రాట్, ఉపేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మమత, చీఫ్ ఇంజనీర్ శ్రీధర్, డిప్యూటి కమిషనర్లు పాల్గొన్నారు. చదవండి: మొదట తక్కువ ధరకు అమ్ముతారు.. బానిసగా మారిన తర్వాత.. -
ఎలక్ట్రిక్ బైక్ ఐడియా.. భలే ఉంది కదూ!
ఒంటెద్దు బళ్లు చూశాం గాని, ఒంటిచక్రం బండేమిటి? ఇదేదో సర్కస్ వ్యవహారం కాబోలనుకుంటున్నారా? ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న వాహనం అచ్చంగా ఒంటిచక్రం బండి. ఇది మోనోవీల్ ఎలక్ట్రిక్ బైక్. హోండా కంపెనీకి చెందిన డిజైనర్ నాషో ఆల్ఫోన్సో గార్షియా దీనికి రూపకల్పన చేశాడు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే నగరాల్లో ఇరుకిరుకు సందుల్లో కూడా తేలికగా ప్రయాణాలు సాగించడానికి ఈ వాహనం భేషుగ్గా ఉపయోగపడుతుందని గార్షియా చెబుతున్నాడు. దీనిని నడపడం పెద్దకష్టమేమీ కాదు. ఇందులో కాళ్లు మోపడానికి ఉండేచోటులో నిలుచుని, స్టార్ట్ చేస్తే చాలు. పడిపోతుందేమోననే భయం అక్కర్లేదు. ఇది పూర్తిగా సెల్ఫ్బ్యాలెన్సింగ్ వాహనం. హోండా సంస్థ ప్రస్తుతానికి దీనిని నమూనాగా మాత్రమే తయారు చేసింది. దీనిపై మరిన్ని పరీక్షలు విజయవంతమైతే, పూర్తిస్థాయి ఉత్పాదన ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. -
వీధి పోరాటం
భువనేశ్వర్ (కటక్): రజత నగరం కటక్‌లో గురువారం రెండు వీధుల ప్రజల మధ్య జరిగిన ఘర్షణ బీభత్సం సృష్టించింది. ఈ ఘర్షణలో పోలీసులు గాయపడ్డారు. దుర్గా దేవి నిమజ్జనాన్ని పురస్కరించుకుని రగిలిన స్పర్థలు చినికిచినికి గాలివానగా మారి ఘర్షణకు దారితీశాయి. బదాంబాడి, పూరీ ఘాట్ పోలీసు స్టేషన్ల ఇన్స్పెక్టర్ ఇన్చార్జిలు ఇరు వర్గాల ఘర్షణలో గాయపడ్డారు. బదాంబాడి, పూరీ ఘాట్ పోలీస్ స్టేషన్ల పరిధి సర్వోదయపూర్, స్వీపర్ కాలనీ వాసుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరువర్గాలు ఒకరిపై వేరొకరు తేలికపాటి మాటల్ని ప్రయోగించడంతో ఘర్షణ ప్రారంభమైనట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. వాస్తవానికి దుర్గా పూజా నిమజ్జనం నాటికి ఇటువంటి పరిస్థితి లేనట్లు నగర డీసీపీ అఖిలేశ్వర్ సింగ్ తెలిపారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తమైనట్లు అందిన సమాచారం ఆధారంగా పోలీసు దళాలు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరాయి. ఇరు వర్గాలు పగిలిన గాజు సీసాలు, రాళ్లు రువ్వుకోవడంతో అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసు వర్గాలు గాయపడ్డాయి. తొలి దశలో 12 మందికి అదుపులోకి తీసుకున్నామని మిగిలిన నిందితుల్ని గుర్తించి చర్యలు చేపడతామని సహాయ పోలీస్ కమిషనర్ అనిల్ మిశ్రా తెలిపారు. -
గుజరాత్లో నడివీధిలో గర్జించిన మృగరాజు
-
శ్రీశైలం పురవీధుల్లో... ఇక వాహనాలు తిరగరాదు !
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలోని ప్రధాన పురవీధులైన పాతాళగంగరోడ్డు, పోస్టాఫీస్ రోడ్ల ద్వారా ప్రధాన మాడా వీధికి ముందున్న గంగాధర మండపం కూడలి వరకు ఎలాంటి వాహనాలు తిరగరాదని దేవస్థానం అధికారులు ఆంక్షలు విధించారు. ఆదివారం నుంచి క్యాంటీన్ నెం 1 పై భాగం Vó ట్ ద్వారా వచ్చే టూ వీలర్స్‌ను కూడా ఈ రెండు ప్రధాన వీధుల్లోకి సెక్యూరిటీ సిబ్బంది అనుమతించ లేదు. దేవస్థానం ఈఓ నారాయణ భరత్ గుప్త ఆదేశాల మేరకు ఎలాంటి వాహనాలు అనుమతించబోమని, కేవలం వీఐపీ, వీవీఐపీలకు సంబంధించిన వాహనాలను మాత్రమే లోనికి పంపిస్తామని తెలిపారు. దీంతో ఆ పురవీధుల్లో ఉన్న స్థానిక వ్యాపారస్తులు తమకు వ్యాపార నిమిత్తమై వచ్చే సరుకులను లోనికి తీసుకురావడానికి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాటర్ క్యాన్ వాహనాలను కూడా అనుమతించకపోవడంతో మంచినీటి కోసం యాత్రికులు బాటిల్స్‌ను కొనాల్సి వచ్చింది. స్థానికులు, వ్యాపారస్తులు, ఈ రెండు పురవీధుల్లో, సత్రాల్లో నివాసితులు ఉంటున్న వారు టూ వీలర్ మీద వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై ఈఓతో చర్చించేందుదకు స్థానికులు, వ్యాపారాఉలు సిద్ధమవుతున్నారు. -
వణికిస్తున్న 'నింజా' సూపర్ హీరో..!
రోమన్లు ఇప్పుడా ఆకారాన్ని చూసి వణికిపోతున్నారు. సుమారు ఇరవై ఏళ్ళ వయసు.. నల్లని ముసుగులాంటి షినోబి వస్త్రధారణ.. చేతిలో 19 అంగుళాల కత్తితో జనాలకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఇంతకీ వార్సా వీధుల్లో తిరుగుతూ జనాలను భయకంపితుల్ని చేస్తున్న ఆ వ్యక్తి ఎవరు? హంతక ముఠాకు చెందిన వాడా? గూఢచారా? ఇలా రకరకాల ప్రశ్నలు? చివరికి పోలీసులను కూడా ఆశ్రయించారు.. అయితే వారి సమాధానాన్ని విని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు... మధ్యయుగం కాలంలో జపాన్ దేశానికి చెందిన కిరాయి హంతక ముఠాలను 'నింజాలు' అనేవారు. అప్పట్లో వీరు అత్యంత కఠినమైన శిక్షణ పొంది, హత్యలు, గూఢచర్యం, దొంగతనాలకు పాల్పడటంతో పాటు శత్రుస్థావరాల్లోకి ప్రవేశించడంలో నిష్ణాతులుగా ఉండేవారట. జపాన్ ఏకీకరణ తర్వాత వీరు అంతరించి పోయారు. అయితే నేటికీ వారి పాత్రలతో సృష్టించిన సినిమాలు, వీడియో గేమ్ ల కు పిల్లల్లో ఎంతో క్రేజ్ ఉంది. వారి వస్త్రధారణను అనుకరించడం, వారి ఫైట్లను ప్రాక్టీస్ చేయడం చిన్నతనంలో కొందరికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. ప్రస్తుతం వార్సా వీధుల్లో రోమన్లను హడలెత్తిస్తున్న ఆ యువకుడు సెజరీ.. అదే కోవకు చెందినవాడట. నల్లని వస్త్రాల్లో కళ్ళు మాత్రమే కనిపించేలా ముసుగుతో ఉన్న అతడు... 19 అంగుళాల నింజాటో పేరుగల నింజా కత్తిని వెనుక తగిలించుకొని వార్సా వీధుల్లో తిరుగుతున్నాడు. టీనేజ్ లో నింజా ఫైటర్ కావాలనుకుని కలలు కన్న అతడు.. ఇప్పుడు స్థానికుల్ని భయాందోళలకు గురి చేస్తున్నాడు. అతడి భయంతో కొందరు సీక్రెట్ నింజా ఆఫ్ గ్రోచో అంటూ భయంతో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే పోలీసులు అతడ్ని ఏమీ చేయలేమని, అతడివల్ల ఎవరికీ హాని జరగటం లేదంటూ చేతులెత్తేశారు. ''మేం అతడ్ని ఎన్నోసార్లు చూశాం. అతడు మాకు బాగా తెలిసిన వ్యక్తే. అంతేకాదు అతడితో ఎలాంటి ముప్పు లేదు. పోలీసులకు కూడా అతడి వల్ల ఎలాంటి సమస్యా లేదు. హింసాత్మకంగా కూడా ప్రవర్తించడం లేదు. అతడితో ప్రమాదం లేదు'' అంటున్నారు పోలీసులు. అయితే కొందరు ఈ 21 ఏళ్ళ ముసుగు వీరుడ్ని నింజా సూడో సూపర్ హీరోగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ మూడువేలమంది మద్దతుదారులను కూడా ఆకట్టుకుంది. అంతేకాదు ఎన్నో కామెంట్లు వచ్చాయి. గ్రోచో సూపర్ హీరోకి గ్రీటింగ్స్ కూడా పంపిస్తున్నారు. కొందరైతే మేం వార్సాలో లేకపోవడం మా దురదృష్టం.. అందుకే మేం మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే కొందరు సూపర్ హీరోను మేం చూశామని.. ఎంతో ఆనందంగా ఉందని అంటున్నారు. ''నేను టీనేజ్ లో ఉన్నప్పుడు నాపై దుండగులు దాడికి దిగారు. అప్పుడు నేను ముష్టి యుద్ధాన్ని చేయాల్సి వచ్చింది. అప్పట్లో నేననుకున్నాను. అటువంటి వస్త్రధారణ, చేతిలో కత్తి ఉంటే స్వీయ రక్షణకు ఉపయోగపడుతుందని.. ఆ తర్వాతే డ్రస్, నింజా కత్తిని కొన్నాను.'' అంటాడు నింజా సూపర్ హీరో సెజరీ. అంతేకాకుండా తాను చిన్నప్పుడు జపనీస్ సినిమాలు ఎక్కువగా చూసేవాడినని, అప్పట్నుంచే తనకు అటువంటి వేషధారణ అంటే ఇష్టమని చెప్తున్నాడు సెజరీ. అందుకే తాను ఓ చెక్క కత్తిని కొన్నానని, అది ధరించి వెడుతున్న సమయంలో ఎవరైనా తనను సమీపించేందుకు భయపడతారని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తన స్నేహితుడు తనకు లీఫ్ స్పింగ్ తో తయారు చేసిన కత్తిని మూడు యూరోలకు అమ్మాడని, ఆ తర్వాత ఓసారి వీధిలో వెడుతుండగా తనపై దాడి జరిగితే అడ్డుకోగలిగానని సెజరీ తన కత్తి కథను ఎంతో ఇష్టంగా తెలిపాడు. ప్రస్తుతం కత్తి లేకుండా సెజరీ ఇంటినుంచి బయటకు రానేరాడట. తనపై గ్రోచో డిస్ట్రిక్ట్ కౌన్సిల్ లో కొన్ని ఫిర్యాదులు ఉన్నట్లు కూడా తెలుసునని, అయితే కౌన్సిల్... వార్సా మేయర్ తో సమావేశం ఏర్పరచి తాను ఎవరికీ హాని చేయని వ్యక్తిగా చెప్పిందని పేర్కొన్నాడు. మనం ఎవ్వరికీ హాని చేయనప్పడు.. మనం ఎలా కావాలంటే అలా స్వతంత్రంగా బతికే హక్కుందని సెజరీ అంటున్నాడు. ఏదేమయినా 'నింజా' సూపర్ హీరో మాత్రం వార్సా వీధుల్లో చల్ హల్ చేస్తున్నాడనే చెప్పవచ్చు. -
షీ...
మెట్రో కథలు నగరం అంతటి మీదా హీ అని రాసి ఉందా అని అనిపించింది. రోడ్ల మీదా వీధుల మీదా ఎవరూ లేని మలుపుల్లో మొండి గోడల మీదా... దూరంగా ఎవడో కారు ఆపాడు. ఫుల్ హ్యాండ్స్ ఇన్ చేసుకుని షూ వేసుకొని ఉన్నాడు. డ్రైవింగ్ సీట్లో నుంచి దిగి కారును ఆసరా చేసుకొని ఆవతలి పక్కకు వెళ్లి టక్ సరి చేసుకుంటూ అక్కడే నిలబడి... ఓహ్... ఏమి విలాసం. పరిగెత్తుకుని వెళ్లి అడగాలనిపించింది. బాబ్బాబూ.. కాస్త కారును అలాగే అడ్డం పెట్రా... నేను కూడా కానిస్తాను... ఊహూ. ఎలా అడగడం? అలా అడుగుతారా ఎవరైనా? అడిగినా చేస్తారా? పొత్తికడుపు ఉబ్బిపోయి ఉంది. పెళ్లయిన మొదటిరాత్రి పాలు కాకుండా చెంబెడు నీళ్లూ గటగటా తాగేస్తే మనిషివా ఒంటెవా అన్నాడు నవ్వుతూ. ఆ తర్వాత ఎప్పుడు గమనించాడో ఏం పాడో నీ పొత్తికడుపు పెద్దది అన్నాడు. సిగ్గేసింది. అమ్మ ఎప్పుడూ గ్లాసుతో నీళ్లిచ్చేది కాదు. దానికి చాలవురా.... చెంబుతో ఇవ్వండి అని అన్నయ్యనో తమ్ముణ్ణో కేకేసేది. నీళ్లు ఇంత ఇష్టంగా తాగే పిల్లను చూడలేదమ్మా అని ఇరుగూ పొరుగూ అనేవారు. ఇంట్లో బావి ఉండేది. నీళ్లు తియ్యగా ఉండేవి. కొబ్బరి చెట్లు ఉండేవి. తాగేన్ని నీళ్లు ఇచ్చేవి. ఎవరింటికెళ్లినా చల్లకేం కొదవా? చూసుకొని చూసుకొని తాగింది లేదు. సిటీకొ చ్చాకే. కొత్తల్లో షాపింగ్‌కు బయల్దేరదీస్తూ బాత్రూమ్కు వెళ్లిరా అన్నాడు. ఎందుకు? బయట కుదర్దు. రెండు మూడు గంటలు తిరుగుతాం కదా. ఇదేం సమస్యో అర్థమయ్యేది కాదు. చిన్నప్పుడు వస్తే స్కూల్ నుంచి ఇల్లు ఎంత దూరమని? క్లాస్‌లో నుంచి లేచి పరిగెత్తుకుని వెళ్లి రావడానికి నిమిషం పట్టేది కాదు. కాలేజీ కొంచెం దూరమే. కాని మధ్యలో అర్జెంటైతే అమమ్మా... పెదమ్మా... పిన్నీ అని ఎవరింట్లోనైనా దూరడానికి ఏం భయం? అయ్యో.. మా తల్లే అని ఎవరైనా సరే దారి చూపించేవారు. ఇక్కడ ఎలా? దూరగలమా ఎవరి ఇంట్లో అయినా? అంత నమ్మగలమా? చేతిలో కేక్ ఉంది. బుద్ధి తక్కువయ్యి ఇంత దూరం వచ్చి ఆర్డర్ ఇచ్చింది. సాయంత్రం బుజ్జిగాడి పార్టీ. అపార్ట్మెంట్లో ఫ్రెండ్సందరినీ పిలుస్తానమ్మా అంటే దగ్గర్లో ఉన్న బేకరీ నుంచి ఏం చెబుతాంలే అని ఇక్కడి దాకా వచ్చింది. గంట నిలబెట్టాడు. ఏసి ఉందిగాని వాష్‌రూమ్ లేదట. నీళ్లు తాగి రావడం తప్పయ్యింది. ఈ ఏసికి ఉబ్బరం ఇంకా పెరిగిపోయింది. ఆటో... హారన్ మోగించాడు. నువ్వెళ్రా బాబూ... పంపించేసింది. ముప్పై నిమిషాలు పడుతుంది ట్రాఫిక్‌లో ఇల్లు చేరేసరికి. కుదుపులకు కాన్పులే అయిపోతాయి. అది ఆగుతుందా. రోడ్డుకు ఆ వైపు రెస్టారెంట్ కనిపిస్తూ ఉంది. కచ్చితంగా వాష్‌రూమ్ ఉంటుంది. వెళితే? చూసింది. దాటడానికి వీల్లేకుండా డివైడర్ పొడవునా ఫెన్సింగ్ ఉంది. ఎంతదూరం ఉందో. యూ టర్న్ దాకా వెళ్లి మళ్లీ అంతా నడుచుకుంటూ వచ్చి చేరుకోవాలి. అడుగు వేయడం కష్టంగా ఉందే. ఎలా? పెదాలు బిగపడుతూ నిలుచుంది. ముప్పై రెండేళ్లున్న ఒక స్త్రీ.. ఎనిమిదేళ్ల పిల్లాడి తల్లి.. చేతిలో కేక్ పట్టుకుని, దిక్కులు చూస్తూ, కళ్ల నీళ్ల పర్యంతం అయి నిలబడి ఉంటే ఎందుకు నిలబడి ఉంది అని అడగడానికి లేదు. ఎందుకు నిలబడి ఉందో చెప్పడానికీ లేదు. పోనీ ఎలాగోలా రెస్టారెంట్ చేరుకోగలిగితే? దానికీ భయం వేసింది. ఒకసారి ఇలాగే అర్జెంటయ్యి దూరి వాష్ రూమ్ నుంచి బయటకు వస్తుంటే మేనేజర్ తను మగాడినని ఎదురుగా ఉన్నది ఒకింటి ఆడకూతురని కూడా పట్టించుకోకుండా చెడామడా మాటలనేశాడు. రెస్టారెంట్‌కు వచ్చినవాళ్లే వాడాలట. దారిన పోయేవాళ్ల కోసం కాదట. వాటర్ స్కేర్సిటీ వల్ల టాయిలెట్ల నిర్వహణ చచ్చేచావుగా ఉందట. ఇంకెప్పుడూ ఈ పని చేయకండి అన్నాడు. దగ్గరలో ఏవైనా పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయా అని చూసింది. అవెక్కడుంటాయి? అంతలోనే నవ్వు వచ్చింది. ఉంటే మాత్రం వాడగలమా? ఒకసారిలాగే రెండ్రూపాయలిచ్చి లోపలికి దూరి అదురుతున్న గుండెలతో క్షణంలోనే బయటకు వచ్చేసింది. లోపలంతా బూతు బొమ్మలు. అంటే మగాళ్లు వచ్చి పోతున్నారా? ఎక్కణ్ణుంచి వస్తున్నారు? ఎప్పుడు వస్తున్నారు? ఇప్పుడుగాని చూస్తున్నారా? కాళ్లు వణికిపోయాయి. మా అంగాలు మాకే చూపించి ఇదేం పైశాచిక ఆనందంరా గాడిదల్లారా... పైకి చూసింది. ఎండ మండిపోతోంది. సూర్యుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది. అదే మబ్బు పట్టి చల్లగా ఉంటే తన పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా ఉండేది. ఏం చేయాలి? అడుగు కదపడం కష్టంగా ఉంది. ఒకసారి ఫ్రెండ్ చెప్పింది. తనసలు నీళ్లే తాగదట. తాగి బయటకెళితే ఈ సమస్య ఉంటుందని తాగడం తగ్గించి తగ్గించి అసలు నీళ్లు తాగడమే మర్చిపోయిందట. ఇప్పుడు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతోంది. ఇంకో ఫ్రెండ్ చెప్పింది. ఇలాంటి టైమ్‌లో మరీ అర్జెంట్ అయితే దాని నుంచి దృష్టి మళ్లించడానికి ఏవేవో ఊహించుకోవాలట. మొగుడితో మైమరపులో ఉన్నట్టు అనుకోవాలట. అప్పుడు తీవ్రత తగ్గుతుందట. ఈ ఎండలో ఈ ట్రాఫిక్‌లో ఈ రోడ్డు మీద మొగుడితో ఏం ఊహించుకోవాలి? లేదంటే మడమకు కాస్త పైన మాటిమాటికీ గీరుకోవాలట. అప్పుడైనా ధ్యాస మళ్లుతుందట. ఇంకా నయం. నడి బజారులో చీర పైకి జరిపి... ఏం ఖర్మ ఇది. ఉబ్బరం ఇంకా పెరిగిపోయింది. ఒక ఆలోచన వచ్చింది. ఒన్నాట్ ఎయిట్ నొక్కితే ఆంబులెన్స్ వస్తుంది. ఇంకేదో నొక్కితే మొబైల్ టాయిలెట్ వస్తే? అది అచ్చంగా ఆడవాళ్ల కోసమే అయితే? అందులో పని చేసేవాళ్లంతా ఆడవాళ్లే అయితే? అలాంటివి ఒక వంద కొని సిటీలో తిప్పుతూ ఉంటే? ఎవరికి చెప్పాలి ఇది... ఆలోచన ముందుకు సాగలేదు. అంచు తెగడానికి సిద్ధంగా ఉంది. ఒక నిమిషం... రెండు నిమిషాలు.. మూడు నిమిషాలు... అయిదూ. అంతకు మించి సాధ్యం కాదు. కణతలు నొప్పిగా అనిపిస్తున్నాయి. పళ్లు పెదాలను గట్టిగా కొరికేస్తున్నాయి. దేవుడా... శక్తినివ్వు... పరమాత్ముడా అదుపునివ్వు... కిందకు ఒంగి రెండు మూడు మట్టిబెడ్డలను వెతికి అందుకుంది. అరచేతిలో గట్టిగా అదిమి పట్టుకుంది. ఆ..టో... ఆటోని పిలిచింది. రెండు కిలోమీటర్ల దూరంలో షాపింగ్ మాల్ ఉంది. వాళ్లయితే పట్టించుకోరు. అంతవరకూ ఉగ్గబట్టుకోగలగాలి. కేక్ ఒళ్లో పెట్టుకుంటూ కాళ్లు రెండూ దగ్గరకు చేర్చుకుంటూ మనిషంతా బంతిలా మారుతూ కూచుంది. తొందరగా ప్లీజ్... చాలా తొందరగా... ఆటోవాడు మంచివాడిలా ఉన్నాడు. ఏదో కష్టంలో ఉన్నట్టు కనిపెట్టాడు. రివ్వున బయలుదేరాడు. చేతిలో మట్టిబెడ్డలు నలుగుతున్నాయి. పిండి పిండి అవుతున్నాయి. దేవుడా.... ఆటో ఆగింది. తూనిగలా దిగి, సెక్యూరిటీని దాటుకుని, రెస్ట్ రూమ్ ఎక్కడా అని అడిగితే థర్డ్ ఫ్లోర్లో లేడీస్ వింగ్‌లో అని చెబితే, ఎక్స్‌లేటర్ ఎక్కీ ఎక్కీ, మళ్లీ ఎక్స్‌లేటర్ ఎక్కీ ఎక్కీ, మళ్లీ ఎక్స్‌లేటర్ ఎక్కీ ఎక్కీ.... కనిపించింది. షీ.... దడేలున తలుపులాగి లోపలికి దూరి హైరానా హైరానాగా కమోడ్ మీద కూలబడ్డాక మొదట ఏడుపు వచ్చింది. మొదట ఏడుపే వచ్చింది. చాలాసేపటి వరకూ ఏడుపు వస్తూనే ఉంది. ఈ దేశంలో ఆడవాళ్లు చాలావాటికి ఏడుస్తూ ఉన్నారు. దీనికీ ఏడ్పిస్తూ ఉన్నారు. - మహమ్మద్ ఖదీర్‌బాబు -
జరిమానాలతో వీధులను శుభ్రంగా ఉంచగలమా?
- ఆకార్ పటేల్ దేశంలో చెత్తా చెదారాన్ని బహిరంగ స్థలాల్లో పడవేస్తే అక్కడికక్కడే జరిమానా విధించేలా ఒక కొత్త బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు ఈ వారం వార్తలు వచ్చాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ కథనం పతాక శీర్షికగా వచ్చింది. అంటే ప్రభుత్వంలో ఉండి దీన్ని లీక్ చేసినవారు, దాన్ని నివేదించిన వారు ఈ చట్టాన్ని ముఖ్యమైనదిగా భావించారన్నమాట. ‘బహిరంగ స్థలాల్లో చెత్త పడవే యటం, ఎలక్ట్రానిక్ వ్యర్థాన్ని డంప్ చేయడం, బహిరంగ స్థలాలను మురికి చేయ టం, నిషేధించిన ప్లాస్టిక్ సంచులను ఉపయోగించడం వంటివాటిని స్వల్ప నేరాల కింద పరిగణించి అక్కడికక్కడే జరిమానా విధించటానికి’ పర్యావరణ మంత్రిత్వ శాఖ సమాయత్తమవుతున్నట్లు ఆ పత్రికా వార్త తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అతి ప్రధాన ప్రాజెక్టుల్లో ఒకటైన ‘స్వచ్ఛ భారత్ అభియాన్‌కు చట్టపరమైన కోరలను’ ఈ బిల్లు కల్పించనున్నట్లు ఇది స్పష్టం చేస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ గత అక్టోబర్‌లో ప్రారంభించిన కీలకమైన ప్రాజెక్టు.. ‘స్వచ్ఛదనం ప్రాతిపదికన చెత్త పడేసే వారిపై జరిమానాలు, పరిహారా లను ప్రవేశపెట్టి సింగపూర్ తొలి ప్రధానమంత్రి లీ కాన్ యు ప్రారంభించిన ఆధునీకరణ తరహా ప్రాజెక్టును పోలి ఉన్నదని’ ఆ వార్తా కథనం తెలిపింది. అయితే అలాంటి వాటికి సింగపూర్ మంచి నమూనేయేనా, లీ చేపట్టిన పరి ష్కారం ఇక్కడ వర్తిస్తుందా? ఇక్కడ మనం మొదటగా గుర్తించవలసింది ఏమి టంటే, చైనా ప్రజలు (సింగపూర్‌లో చైనీయులే ప్రధానంగా ఉన్నారు) దక్షిణా సియా ప్రజల స్థాయిలో తమ వీధులను, ఇరుగు పొరుగు ప్రదేశాలను అంత చెత్తగా ఉంచుకోరు. మనం భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ (శ్రీలంక దీనికి మిన హాయింపు) దేశాల కేసి చూస్తే మనకీవిషయం స్పష్టంగా బోధపడుతుంది. చైనీ యులు ప్రపంచంలో ఎక్కడున్నా సరే.. అంటే తమ మాతృ భూమిలో కానీ, ప్రపం చమంతటా తాము నివసిస్తున్న ప్రాంతాల్లో కానీ (అమెరికాలో వీరు నివసించే ప్రాంతాలను చైనా టౌన్స్ అంటారు) పరిశుభ్రత పట్ల ఒక ప్రాథమిక అవగాహ నను, విజ్ఞతను, క్రమాన్నీ, గౌరవాన్ని కూడా కలిగి ఉంటారు. పైగా, తామున్న పరిసరాలకు అనుగుణంగా వ్యవహరిస్తుంటారు. అదే మన విషయంలో అలా కనిపించదు. చట్టాలు కొంతవరకు మాత్రమే సాయపడగలవని నేను చెప్పగలను. సింగ పూర్‌ను పరిశుభ్రంగా ఉంచింది లీ మేధోతనమే అనుకున్నట్లయితే హాంకాంగ్‌ను ఎవరు క్రమంలో పెట్టారు? ఇక్కడ కూడా చైనీయులే అధిక సంఖ్యలో ఉన్నారు. కాగా ఇక్కడ కూడా సింగపూర్ వంటి నియంతృత్వ పాలనే ఉంది. రెండో విషయం ఏమిటంటే, పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న ఈ కొత్త చట్టం వాస్తవంగా కొత్తదేనా? గత కొన్ని నెలలుగా పత్రికల్లో వస్తున్న పతాక శీర్షికలను గమనించినట్లయితే, ’వీధుల్లో చెత్త పారవేసినందుకు ఇప్పుడు ఫైన్ కట్టండి’ అంటూ అమృత్సర్ నుంచి వచ్చిన ఒక వార్త మనకు కనబడుతుంది. ఇలాంటి చర్యలకుగాను స్పాట్ ఫైన్ అనేది సరిపోదని అక్కడి మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయించిందట. చెత్త పడవేసిన చోటే ఫైన్ కట్టే నిబంధన ఇప్పటికే ఉన్నప్పటికీ, చట్టాన్ని ఉల్లంఘించినవారిని కోర్టులో హాజరు పర్చాలని, ఆ బాధను వారు అనుభవించాలని అమృత్సర్ మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయించినట్లు ట్రిబ్యూన్ పత్రిక పేర్కొంది. రైల్వేలలో వ్యక్తులు చెత్త పడేస్తున్నారని, (భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత చెత్తతో, మురికితో కూడి ఉంటాయని) అలాంటివారిపై రూ.5 వేల వరకు అపరాధం విధిస్తారని గత సంవత్సరం ఆ పత్రిక ప్రకటించింది. వీధుల్లో చెత్త పారవేస్తూ కనిపిస్తే చాలు ఆ వ్యక్తిపై అక్కడికక్కడే రూ.500 జరి మానా విధిస్తామంటూ గత సంవత్సరం ఆగస్టులో ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. వీధుల్లో ఉమ్మివేయడం, చెత్త పారవేయడం, మూత్ర విసర్జన వంటి చర్య లకు పాల్పడితే అక్కడికక్కడే రూ.500లు ఫైన్ విధించేలా కొత్త చెత్త వ్యతిరేక చట్టం రూపొందుతోందని 2010 సంవత్సరంలోనే హిందూస్తాన్ టైమ్స్ రాసింది. ఇప్పుడు మరొక చట్టం దానికి అపశవ్య దిశలో రూపొందుతున్నట్లు కనబడు తోంది. నిజానికి ప్రభుత్వం ఏం చేయాల్సి ఉంది? సమస్య అల్లా ఎక్కడుందంటే, ప్రభుత్వం ఒక చట్టం ద్వారా సామాజిక, సాంస్కృతిక మార్పును ప్రభావితం చేయాలనుకుంటోంది. అలా చేయవచ్చా? దీనికి సమాధానం అవుననే చెప్పాలి. ఎందుకంటే శిశు హత్యలు, వరకట్న హత్యలు కూడా సాంస్కృతిక నేరాలే. వీటి విషయంలో కూడా కఠిన చట్టాలను తీసుకురావాలి. ఎందుకంటే అవి కూడా హత్యలతో సమానమే. వాటితో ఆ మార్గంలోనే వ్యవహరించాలి. స్వచ్ఛ భారత్ అభియాన్ పేరిట జరుగుతున్న గందరగోళం ఇదే. ఇంతకూ ఈ పథకం దేనికి ఉద్దేశించిందన్నది కొన్ని సంకేతాలు పంపుతోంది. ప్రధాన మంత్రి తన చీపురు ద్వారా వ్యక్తిగత ఉదాహరణను నెలకొల్పారు. పలు ప్రదేశా లలో చీపురుతో చెత్తను శుభ్రం చేస్తూ కనిపించారు. ఇదంతా ఒక వారం లేకుంటే మరికొన్ని రోజులు మాత్రమే నడిచిందని పలు వార్తా కథనాలు సూచిస్తున్నాయి. ఒక రోజు మాత్రమే చీపురు పట్టుకుని వీధుల్లోకి వచ్చినందుకు ప్రముఖ వ్యక్తు లను అభినందించటానికి మాత్రమే ఆయన ట్వీట్లు పరిమితమయ్యాయి. మరోై వైపున ప్రభుత్వ ప్రకటనలు స్వచ్ఛభారత్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో మరుగు దొడ్లు నిర్మించడమని చెప్పాయి. అక్కడ లక్ష్యాలన్నీ గణాంకాల రూపంలోనే కనిపిస్తున్నాయి. స్వచ్ఛభారత్ అభియాన్‌తో గాంధేయ పని విధానాన్ని అలవర్చడానికి మోదీ ప్రయత్నిస్తున్నట్లు నేను భావిస్తున్నాను. మన సామాజిక, సాంస్కృతిక సమస్య లను పరిష్కరించడంలో ఆ మార్గం అత్యాశతో కూడుకున్నదే అయినప్పటికీ ఆ ఆలోచన ఉన్నతమైనదే. తన మరుగుదొడ్డిని తానే శుభ్రపర్చుకోవడం, తన బట్టలను తానే వడకటం వంటి చర్యల ద్వారా గాంధీ ఒక నిరుపమాన వ్యక్తిగత ఉదాహరణగా నిలిచారు. మోదీ ప్రభుత్వం ద్వారా ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా గాంధీ ఈ విషయంలో విఫలమయ్యారు. తన తరపున చేయడానికి మరొకరు సిద్ధంగా ఉన్నంతవరకు ఏ భారతీయుడు కూడా తన మరుగుదొడ్డిని తానే శుభ్రపర్చుకోవడం అనేది కల్లే. ఇక పోతే ఖాదీ మన జ్ఞాపకాల్లోంచే కనుమరుగైపోయింది. మరి మోదీ విజయం సాధిస్తారా? సాధించలేరు. ఎందుకంటే సాంస్కృతిక మార్పు అనేది కేవలం చట్టం రూపంలో జరగదు. పైగా ఒకే ఒక రాత్రిలో అది సాధ్యం కాదు కూడా. ఆ మార్పు అంతర్గతంగానే రావాలి. గాంధీ దాన్ని అర్థం చేసుకున్నారు. మోదీ పట్ల భారతీయులకు చాలా సానుకూల ముద్ర ఉంది. ఆయన వ్యక్తిగత ఉదాహరణ ప్రత్యేకమైనది. ఈ విషయంపై తాను నిజంగానే తీవ్రంగా ఆలోచిస్తున్నట్లయితే ఇక్కడే ఆయన కేంద్రీకరించాలి. గాంధీ జీవిత కాలంలో దీన్ని సాధించలేకపోయినట్లే, మోదీ జీవితకాలంలో ఈ మార్పు రాక పోవచ్చు. అయితే ఏదో ఒక కొత్త చట్టం కంటే ఆయన ప్రయత్నమే మరింత సమ ర్థవంతంగా ప్రభావం చూపగలదు. (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com) -
కుండపోత
నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు జలమయమైన రహదారులు త హశీల్దార్ను నిలదీసిన బాధితులు రాయచూరు రూరల్ : నగరంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి 12 గంటలకు ప్రారంభమైన వర్షం ఉదయం ఐదు గంటల వరకు కురిసింది. ఈ వర్షానికి రహదారులు, వీధులు, పొలాలు జలమయమయ్యాయి. నగరంలో జనతా కాలనీ, ఆజాద్ నగర్, హాజీ కాలనీలో మురికి కాలువలు బంద్ కావడంతో వర్షం నీరు ఇళ్లలో చేరాయి. రాయచూరు తాలూకా చిక్కస్గూరు-హేగ్గసనళ్లిలో కూడా వర్షం నీరు ఇళ్లలోకి చేరింది. ఆహారధాన్యాలు, బట్టలు పూర్తిగా తడిసాయి. సోమవారం ఉదయం రాయచూరు తహశీల్దార్ బాలరాజు చిక్కస్గూరు-హేగ్గసనళ్ళిని సందర్శించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తాము తీవ్రంగా నష్టపోయామని బాధితులు ఆయన్ను నిలదీశారు. నష్టాన్ని జిల్లాధికారితో చర్చించి సమస్య సరిష్కారిస్తామని హమీ ఇచ్చారు. దీంతో బాధితులు శాంతించారు. కాగా, రాయచూరులో 114 మీల్లీమీటర్లు, మాన్విలో 16, లింగస్గూరులో 14, సింధనూరులో 6, దేవదుర్గలో 29.4, గబ్బూరులో 49.4, మస్కి 32, వలకందిన్ని 32, కల్లూరు 52, కల్మాల 50, యరమరస్ 85, జేగరకల్ 80 మీల్లీమీటర్ల వర్షం కురిసిందని జిల్లాధికారి శశికాంత సింథల్ సోమవారం తెలిపారు. -
గుర్రప చెరువులో మునిగి తండ్రీకొడుకుల మృతి
=బంతి కోసం నీటిలో దిగి కుమారుడు.. =కొడుకు ఆచూకీ కోసం చెరువులో దిగి తండ్రి కన్నుమూత =ఇద్దరి మృతదేహాలూ లభ్యం అవనిగడ్డ, న్యూస్‌లైన్ : చెరువులో కొడుకు గల్లంతవగా, గాలింపు కోసం చెరువులోకి దిగిన తండ్రి కూడా మృతిచెందిన విషాద ఘటన అవనిగడ్డలో ఆదివారం జరిగింది. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన బిట్ర శ్రీను (42) అల్యూమినియం పాత్రల వ్యాపారం చేసేందుకు మూడేళ్ల క్రితం అవనిగడ్డకు వచ్చాడు. చెరువు సమీపంలో నివాసం ఉంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కొంతమంది పిల్లలతో కలిసి శ్రీను కుమారుడు వెంకటేష్ (6) బంతి ఆట ఆడుతుండగా అది చెరువులో పడింది. దానిని తీసుకువచ్చేందుకు కొంతమంది యత్నించగా, పెద్దలు వారించటంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. అరగంట తర్వాత వెంకటేష్ బంతి తీసేందుకు చెరువులోకి దిగాడు. ఎంతసేపటికీ ఒడ్డుకు రాకపోవడాన్ని గమనించిన కొందరు పిల్లలు కేకలు వేసి స్థానికులకు విషయం వివరించారు. స్థానికులు వచ్చి గాలించినా వెంకటేష్ ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న స్థానిక అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చెరువు వద్దకు వచ్చి గాలింపు చర్యలు చేపట్టేందుకు ప్రయత్నించారు. అప్పటికే చీకటి పడటంతో ఆ ప్రయత్నాలు విరమించుకున్నారు. కుమారుడి ఆచూకీ కోసం... ‘మా కుమారుడిని ఎవరూ కాపాడటం లేదు, నేనే రక్షించుకుంటా’ అంటూ తండ్రి శ్రీను చెరువులోకి దూకాడు. ఈ ప్రాంతానికి కొద్ది దూరంలో ఉన్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి చూడగా ఇద్దరి ఆచూకీ లభించలేదు. పులిగడ్డ నుంచి గజ ఈతగాళ్లను తీసుకువచ్చి వెదికించడంతో తండ్రి శ్రీను మృతదేహం, ఆ తర్వాత రాత్రి సమయంలో వెంకటేష్ మృతదేహం లభ్యమయ్యాయి. మృతుడు శ్రీనుకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తె యల్లమ్మ (11)కు గుండె సంబంధ వ్యాధి రావడంతో తల్లి వీరమ్మ వైద్య పరీక్షల కోసం ఐదు రోజుల కిందట విజయవాడ తీసుకువెళ్లింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సకాలంలో స్పందించి వెంకటేష్‌ను గాలించి ఉంటే తన తమ్ముడు నీట మునిగేవాడు కాదని శ్రీను అక్క నాంచారమ్మ భోరున విలపిస్తూ చెప్పింది. అవనిగడ్డ సీఐ రమణమూర్తి, ఎస్సై శ్రీనివాస్, తహశీల్దార్ వెన్నెల శ్రీను ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.