జపాన్‌లోని క్యోటో నగరంలో ఆమధ్య వేల సంఖ్యలో కాకులు గుంపులుగా ఎగురుతున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అయ్యింది. జపాన్‌లోని హోన్షులో ఆకాశంలో వేలాది కాకులు ఎగురుతూ క్యోటో సమీపంలోని జపనీస్ ద్వీపానికి చేరుకున్నాయి.
మనుషులకు మించి ప్రకృతిని అర్ధం చేసుకునే శక్తి పక్షులకే ఉందా? అని అంటే.. అవుననే సమాధానమే వస్తుంది. ప్రకృతి వైపరీత్యాలను కాకులు , కుక్కలు మొదలైనవి ముందుగానే గుర్తిస్తుంటాయి. సునామీ, భూకంపం లాంటి ప్రకృతి విపత్తులు సంభవించడానికి కొన్ని క్షణాల ముందు వేలాది కాకులు వింతగా ప్రవర్తించడానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
జపాన్‌లోని క్యోటో నగరంలో మాదిరిగానే కొన్నాళ్ల క్రితం క్రితం టర్కీలో సంభవించిన విధ్వంసకర భూకంపానికి కొద్ది క్షణాల ముందు కూడా పక్షులు అసాధారణంగా ప్రవర్తించాయి. భారీ సంఖ్యలో పక్షులు గుమిగూడి కిలకిలారావాలు చేస్తూ ఆకాశంలో అటుఇటూ సంచరిస్తూ కనిపించాయి. పక్షులు అలా ప్రవర్తించడానికి కారణం రానున్న భూకంపాన్ని పసిగట్టడమేనంటూ నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
తాజాగా ద్వీప దేశమైన జపాన్‌లో 2024 నూతన సంవత్సరం తొలిరోజే శక్తివంతమైన భూకంపం చోటు చేసుకుంది. వాయవ్య జపాన్ తీరంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పలుమార్లు భూప్రకంపనలు నమోదయ్యాయి. కనీసం 21 సార్లు భూమి కంపించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఈ భూకంపానికి కొన్ని నిముషాల ముందు వేలాది పక్షలు ఒకచోట చేరి విచిత్రంగా ప్రవర్తించాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి: జపాన్‌లో భారీ భూకంపం.. 155సార్లు కంపించిన భూమి
The sudden increase in crow activity in #Japan is causing concern among residents, reminiscent of an ancient omen associated with natural disasters. On the first day of 2024, Japan is struck by a significant #earthquake#Tsunami pic.twitter.com/vNLoM1JRWu
— Surajit (@surajit_ghosh2) January 1, 2024
Comments
Please login to add a commentAdd a comment